14, నవంబర్ 2022, సోమవారం

పగిలిన పాదాలు మరియు మంట నివారణకు వైద్య నిలయం సలహాలు లింక్స్ లో chud🖕

పగిలిన మడమలా? ఇలా చేసి కాళ్ల పగుళ్లు సులభంగా తగ్గించుకోవచ్చు..!అవగాహనా కోసం నవీన్ నడిమింటి సలహాలు 
 (Home Remedies For Cracked Heels 
పగిలిన మడమలా? ఇలా చేసి కాళ్ల పగుళ్లు సులభంగా తగ్గించుకోవచ్చు..! (Home Remedies For Cracked Heels In Telugu)

అందం విషయంలో మిగతా శరీర భాగాలకు ఎంత ప్రాధాన్యం ఉంటుందో.. కాళ్లకు కూడా అంతే ప్రాధాన్యం ఉంటుంది. అలాంటిది అవే కాళ్లు పగుళ్ల బారిన పడితే చాలా అంద విహీనంగా కనిపిస్తాయి. అవే పగుళ్లు  (cracked heels) గనుక తగ్గితే పాదాలు మృదువుగా.. అందంగా మెరసిపోయే వీలుంటుంది. ఈ క్రమంలో మనం కూడా కాళ్ల పగుళ్ల సమస్యను తగ్గించుకోవడానికి.. ఇంట్లోనే కొన్ని నవీన్ రోయ్ (Home remedies) పాటిస్తే సరిపోతుంది.


  1. క ళ్ల పగుళ్లకు కారణాలివే.. (Causes Of Cracked Heels)

కాళ్ల పగుళ్ల సమస్యను తగ్గించుకోవాలంటే.. ముందు దానికి గల కారణాలను తెలుసుకోవాలి. కాళ్ల పగుళ్లు చాలా కారణాల వల్ల ఏర్పడతాయి. అందులో ముఖ్యమైనవి – శరీరంలో తేమ శాతం తక్కువగా ఉండడం, అలాగే విటమిన్లు, మినరల్స్ తగ్గుముఖం పట్టడం, ఎక్కువ సేపు నిలబడి పనిచేయడం, వయసు పైబడడం.. స్థూలకాయం, సొరియాసిస్, ఎగ్జిమా, థైరాయిడ్, డయాబెటిస్ వంటి సమస్యల బారిన పడడం కూడా ప్రధానమైన కారణాలే. అలాగే కాళ్లు నీళ్లలో ఎక్కువగా తడవడం, కాళ్ల భద్రతను పట్టించుకోకపోవడం, షూ లేదా చెప్పులు వేసుకోకుండా నడవడం కూడా  ఈ సమస్యకు కారణాలే. 

ఆరోగ్యం బాగుండేలా చూసుకుంటే.. చాలా వరకూ కాళ్ల పగుళ్లు కూడా తగ్గుముఖం పడతాయి. ముఖ్యంగా కాళ్లకు తరచూ మసాజ్, పెడిక్యూర్ లాంటివి చేయించుకోవడం మొదలుపెడితే పగుళ్లు రాకుండా ఉంటాయి. మరి, ఈ పాటికే వచ్చిన పగుళ్లు తగ్గించుకోవడం ఎలా? అని ఆలోచిస్తున్నారా..?  అందుకు కొన్ని ముఖ్యమైన చిట్కాలు పాటించి వాటిని దూరం చేసుకోవచ్చు. అవేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.

 

Home Remedies For Cracked Heels In Telugu9

 

పగుళ్లను (Cracked Heels) తగ్గించే ప్యాక్స్ ఇవే.. (Home Remedies For Cracked Heels In Telugu)

ళ్ల పగుళ్లు తగ్గించేందుకు ఇంట్లో లభించే కొన్ని వస్తువులతోనే.. ప్యాక్స్ తయారుచేసుకొని వాటిని అప్లై చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు కనిపిస్తాయి. అందుకే ఆ ప్యాక్స్ ఓసారి ప్రయత్నించండి.

Home Remedies For Cracked Heels In Telugu lemon

నిమ్మరసం, ఉప్పుతో.. (Lemon And Salt)

నిమ్మరసంలోని ఆమ్ల గుణాలు రఫ్‌గా, పొడిగా ఉన్న చర్మాన్ని మృదువుగా మారుస్తాయి. అదే నిమ్మరసంలో కాస్త గ్లిజరిన్, రోజ్ వాటర్ కలిపి పగుళ్లకు అప్లై చేయండి. మీ సమస్య కొంతవరకు తీరుతుంది. దీనికోసం చేయాల్సిందల్లా..  టేబుల్ స్పూన్ ఉప్పు, అర కప్పు నిమ్మరసం , రెండు టేబుల్ స్పూన్ల గ్లిజరిన్ , రెండు టీస్పూన్ల రోజ్ వాటర్, గోరు వెచ్చని నీళ్లు, ఫుట్ స్క్రబ్బర్.. వీటిని రెడీ చేసుకోవడమే. ఆ తర్వాత ఒక బేసిన్‌లో నీళ్లు నింపి.. అందులో ఉప్పు, నిమ్మరసం, గ్లిజరిన్, టీ స్పూన్ రోజ్ వాటర్‌ను కలిసి.. అందులో కాళ్లను నానబెట్టాలి.

ఆ తర్వాత ఫుట్ స్క్రబ్బర్ సాయంతో పాదాలను స్క్రబ్ చేసుకోవాలి. ఇప్పుడు టీస్పూన్ గ్లిజరిన్, టీస్పూన్ రోజ్ వాటర్, టీ స్పూన్ నిమ్మరసం కలుపుకొని పగిలిన పాదాలకు అప్లై చేసుకోవాలి. కావాలంటే దీన్ని అప్లై చేసుకొని రాత్రంతా అలాగే ఉంచుకోవచ్చు. ఆ తర్వాత.. ఉదయాన్నే గోరువెచ్చని నీటితో కాళ్లను రుద్దుకొని కడుక్కోవాలి. ఇలా తరచూ చేస్తుంటే పగుళ్లు మాయమవుతాయి.

అరటిపండు, అవకాడో మాస్క్ (Banana And Avacado Mask)

అవకాడోలో మన శరీరానికి ఎంతో అవసరమైన ఎస్సెన్సియల్ ఆయిల్స్ ఉంటాయి. విటమిన్లు, ఆవశ్యకమైన కొవ్వులు పొడిబారిన చర్మాన్ని తిరిగి మామూలుగా మారుస్తాయి. అలాగే అరటి పండు మంచి మాయిశ్చరైజర్‌లా పనిచేస్తుంది. దీనికోసం ఈ మాస్క్‌ని రోజూ కాళ్లకు అప్లై చేసుకోవచ్చు. ఈ మాస్క్ తయారీ కోసం ఒక అరటిపండు, సగం అవకాడో తీసుకొని మిక్సీలో వేసి ఈ మిశ్రమాన్ని కాళ్లకు అప్లై చేసుకోవాలి. ఆ తర్వాత పావు గంట పాటు ఉంచుకొని గోరు వెచ్చని నీటితో కడిగేసుకోవాలి.

Home Remedies For Cracked Heels In Teluguhoney

తేనెతో (Honey)

తేనె మన చర్మానికి పోషకాలు అందించడంతో పాటు తేమను పెంచడంలో ముఖ్యమైన పాత్రను పోషిస్తోంది. దీన్ని పగుళ్లను తగ్గించేందుకు కూడా ఉపయోగించవచ్చు. అందుకోసం ముందుగా ఒక కప్పు తేనె, సగం బకెట్ గోరువెచ్చని నీళ్లు తీసుకోవాలి. తర్వాత కప్పు తేనెను ఆ నీళ్లలో బాగా కలిపాక.. అందులో కాళ్లు ముంచి పావుగంట పాటు అలాగే ఉండాలి. కాళ్లు బాగా నానిన తర్వాత స్క్రబ్ చేయాలి. ఇలా రెగ్యులర్‌గా చేస్తుంటే పగుళ్లు చాలా త్వరగా తగ్గిపోతాయి.

నిమ్మరసం, వ్యాసెలిన్‌తో.. (Lemon Juice And Vaseline)

నిమ్మరసంలో ఆమ్ల గుణాలు ఎక్కువగా ఉంటాయి. వ్యాసెలిన్ చర్మాన్ని మాయిశ్చరైజ్ చేస్తుంది. ఈ రెండింటిని కలిపి అప్లై చేస్తే పొడిగా, పగుళ్లు ఎక్కువగా ఉండే పాదాలు తిరిగి మృదువుగా తయారవుతాయి. దీన్ని రోజూ నిద్రపోయే ముందు అప్లై చేసుకోవాలి. అందుకోసం టీస్పూన్ వ్యాసెలిన్, నాలుగైదు చుక్కల నిమ్మరసం కలిపి మిశ్రమంగా చేసుకోవాలి. ఆ తర్వాత, గోరువెచ్చని నీళ్లలో పావుగంట సేపు కాళ్లను నానబెట్టి.. ఆ తర్వాత బయటకు తీసి ఈ మిశ్రమాన్ని కాళ్లకు రాయాలి. ఆ తర్వాత సాక్సులు వేసుకొని రాత్రంతా వాటితోనే పడుకోవాలి. సాక్సులు మన శరీరంలోని వేడిని పీల్చేస్తాయి. కాబట్టి పగుళ్లు త్వరగా తగ్గిపోతాయి.

Home Remedies For Cracked Heels In Telugu soda

బేకింగ్ సోడా (Baking Soda)

బేకింగ్ సోడా సాధారణంగా మంచి ఎక్స్ ఫోలియేటర్‌గా పనిచేస్తుంది. కానీ దీన్ని ప్యాక్‌లా ఉపయోగిస్తే కూడా చర్మంపై ఉన్న మృత కణాలు తొలగిపోతాయి. అలాగే యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలున్న ఈ ప్యాక్‌ని వారానికి రెండు సార్లు ఉపయోగించడం వల్ల పగుళ్లు తగ్గుతాయి. దీనికోసం ఒక బకెట్‌లో సగం నీళ్లు తీసుకొని.. అందులో మూడు టేబుల్ స్పూన్ల బేకింగ్ సోడా వేయాలి. అందులో పావుగంట పాటు కాళ్లు ముంచి తీసి స్క్రబ్బర్‌తో రుద్దాలి. ఆ తర్వాత కాళ్లు కడుక్కుంటే సరిపోతుంది.

పారాఫిన్ వ్యాక్స్ (Paraffin Wax)

పారాఫిన్ వ్యాక్స్ శరీరాన్ని మృదువుగా మార్చడంలో ఎంతగానో తోడ్పడుతుంది. అందుకే పగుళ్ల బారిన పడిన కాళ్లను తిరిగి మామూలుగా మార్చేందుకు దీనిని వాడవచ్చు.  అందుకోసం తొలుత ఒక టేబుల్ స్పూన్ ప్యారాఫిన్ వ్యాక్స్‌ను తీసుకొని.. దానితో రెండు మూడు చుక్కల కొబ్బరి లేదా ఆవ నూనెను మిక్స్ చేయాలి. ఆ తర్వాత.. ఈ మిశ్రమాన్ని కాస్త వేడి చేయాలి. గది ఉష్ణోగ్రతకు చేరుకున్న తర్వాత రాత్రి పడుకునే ముందు.. దీన్ని కాళ్లకు అప్లై చేసుకోవాలి. ఆ తర్వాత ఉదయాన్నే లేచి కడిగేసుకోవాలి. 

 

Home Remedies For Cracked Heels In Telugu foot

విటమిన్ ఇ నూనె (Vitamin E Oil)

విటమిన్ ఇ నూనె చర్మానికి తేమను అందిస్తుంది. కాళ్ల పగుళ్లను తగ్గించి చర్మాన్ని మ్రదువుగా మార్చేందుకు ఇది పనిచేస్తుంది. దీనికోసం మనం చేయాల్సిందల్లా రోజుకోసారి మూడు విటమిన్ ఇ క్యాప్సూల్స్ తీసుకొని.. అందులోని నూనెను మిక్స్ చేసి కాళ్లకు అప్లై చేసుకోవాలి. ఆ తర్వాత కాళ్లలో బాగా ఇంకేవరకూ రుద్ది.. ఆ తర్వాత కాసేపటివరకూ కాళ్లు కిందపెట్టకుండా చూసుకోవాలి. ఇలా రోజూ చేస్తే కొన్ని రోజుల్లోనే పగుళ్లు తగ్గిపోతాయి.

లిస్టరిన్‌తో.. (Listerine)

లిస్టరిన్ మంచి మౌత్ వాష్‌గా మాత్రమే కాదు.. కాళ్లకు కూడా ఎంతో బాగా ఉపయోగపడుతుంది. కాళ్ల పగుళ్లను తగ్గించేందుకు తోడ్పడుతుంది. దీనికోసం కప్పు లిస్టరిన్, కప్పు వైట్ వెనిగర్, రెండు కప్పులు నీళ్లు, ఫుట్ స్క్రబ్బర్ తీసుకోవాలి. వీటన్నింటినీ కలిపి.. ఆ మిశ్రమాన్ని బకెట్లో పోయాలి. తర్వాత అదే బకెట్‌లో మీ పాదాలను నానబెట్టుకోవాలి. ఇలా పావుగంట సేపు మీ పాదాలను బకెట్‌లో నానబెట్టాక..  స్క్రబ్ చేసుకోవాలి. తర్వాత మంచి నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. ఇలా నాలుగైదు రోజుల పాటు వరుసగా చేస్తే.. మృత చర్మం మొత్తం పోయి పగుళ్లు తగ్గి కాళ్లు మృదువుగా కనిపిస్తాయి.

foot %288%29

యాపిల్ సైడర్ వెనిగర్ (Apple Coder Vinegar)

యాపిల్ సైడర్ వెనిగర్ పొడిబారిన చర్మాన్ని మృదువుగా మారుస్తుంది. చర్మాన్ని ఎక్స్ ఫోలియేట్ కూడా చేస్తుంది. దీనికోసం పావు బకెట్ నీళ్లలో కప్పు యాపిల్ సైడర్ వెనిగర్‌ను కలపాలి. అందులో కాళ్లను పావు గంట పాటు నానబెట్టాలి. ఆ తర్వాత స్క్రబ్ చేయాలి. ఇలా తరచూ చేయడం వల్ల కాళ్లు మృదువుగా కనిపిస్తాయి.

ఈ నూనెలు కూడా.. (Oils)

కాళ్ల పగుళ్లకు ముఖ్య కారణం.. ఆయా శరీర భాగమున్న ప్రాంతంలో తేమ లేకపోవడమే. అందుకే కాళ్ల పగుళ్లను నివారించడానికి పాదాలకు తేమను అందించాలి. దీనికోసం బాదం నూనె, కొబ్బరి నూనె, ఆలివ్ ఆయిల్ మొదలైనవాటితో.. ప్రతీ రాత్రి కాళ్లకు మసాజ్ చేయాలి. ఇలా రోజూ చేయడం వల్ల కాళ్లు మృదువుగా మారతాయి.

స్క్రబ్స్‌తోనూ పగుళ్లు (cracked heels) మాయం.. (Homemade Scrubs For Cracked heels)

కేవలం కాళ్లను నీళ్లలో నానబెట్టడం, దానికి మాస్క్‌లు వేయడం వల్ల మాత్రమే కాదు.. కొన్ని రకాల స్క్రబ్స్ ఉపయోగించడం వల్ల కూడా పగుళ్లు మాయమైపోతాయి. దీనికోసం ఎలాంటి స్క్రబ్స్ ఉపయోగించవచ్చంటే..

Home Remedies For Cracked Heels In Telugu lips

నిమ్మరసం, ఆలివ్ నూనె (Lemon Juice And Olive Oil)

నిమ్మరసం, ఆలివ్ నూనె రెండూ చర్మానికి ఉపయోగపడతాయి. దీనికోసం కప్పు రాతి ఉప్పు, నిమ్మరసం, ఆలివ్ నూనె, ఎస్సెన్షియల్ ఆయిల్ అన్నింటినీ కలిపి కాళ్లకు పట్టించి బాగా రుద్దాలి. అలా పావు గంట పాటు ఉంచుకొని.. తర్వాత కడిగేసుకోవాలి. ఇలా తరచూ చేస్తే పగుళ్లు త్వరగా తగ్గిపోతాయి.

కొబ్బరినూనె, చక్కెర, పసుపు (Coconut Oil, Sugar And Turmeric)

చక్కెర చర్మానికి మంచి స్క్రబ్‌లా ఉపయోగపడుతుంది. ఇది కాళ్లకు కూడా ఎక్స్‌ఫోలియేటర్‌గా పనిచేస్తుంది. దీనికోసం కప్పు కొబ్బరి నూనె, పావు కప్పు చక్కెర, టేబుల్ స్పూన్ పసుపు, రెండు టేబుల్ స్పూన్ల కలబంద గుజ్జు తీసుకొని అన్నింటినీ బాగా కలపాలి. దీన్ని కాళ్లకు బాగా అప్లై చేసుకొని గట్టిగా రుద్దాలి.  కనీసం రోజుకోసారి ఇలా కాళ్లకు అప్లై చేయడం వల్ల.. కాళ్ల పగుళ్లు తగ్గి మృదువుగా మారతాయి.

Home Remedies For Cracked Heels In Telugu29

ఓట్ మీల్‌తో (Oatmeal)

ఓట్ మీల్ చర్మానికే కాదు.. కాళ్లకు కూడా మంచి స్క్రబ్‌గా పనిచేస్తుంది. ఇందులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలతో పాటు మాయిశ్చరైజింగ్ గుణాలు కూడా ఉంటాయి. ఇవి మృత కణాలను తొలిగించి చర్మాన్ని మృదువుగా మారుస్తాయి. దీనికోసం పావుగంట పాటు కాళ్లను నీళ్లలో నానబెట్టాలి. ఆ తర్వాత టేబుల్ స్పూన్ ఓట్ మీల్ పౌడర్‌లో తగినంత ఆలివ్ ఆయిల్ కలిపి బరకగా తయారుచేసి దీన్ని పాదాలకు అప్లై చేసి స్క్రబ్ చేయాలి. ఆపై అరగంట పాటు అలాగే ఉంచుకోవాలి. ఆ తర్వాత కాళ్లు కడుక్కోవాలి. ఇలా రోజు విడిచి రోజు చేయడం వల్ల కాళ్ల పగుళ్లు తగ్గుముఖం పడతాయి.

బియ్యపు పిండి, తేనెతో.. (Rice Flour And Honey)

బియ్యపు పిండి చర్మాన్ని ఎక్స్ ఫోలియేట్ చేయడంతో పాటు సాఫ్ట్‌గా మారుస్తుంది. తేనె చర్మంలో తేమను పెంచడంతో పాటు పోషకాలను కూడా తిరిగి అందిస్తుంది. వీటితో తయారుచేసే ఫుట్ స్క్రబ్‌ని.. వారానికి రెండు సార్లు అప్లై చేయడం వల్ల కాళ్ల పగుళ్లు తగ్గుతాయి. దీనికోసం మూడు టేబుల్ స్పూన్ల బియ్యపు పిండి, టీస్పూన్ తేనె, నాలుగైదు చుక్కలు యాపిల్ సైడర్ వెనిగర్ తీసుకొని ఈ మూడింటినీ కలపాలి. కాళ్లను గోరువెచ్చని నీటిలో నానబెట్టి తీసిన తర్వాత.. ఈ స్క్రబ్‌ని పాదాలకు పట్టించాలి. కావాలంటే టీ స్పూన్ ఆలివ్ లేదా బాదం నూనెను కూడా కలపవచ్చు. ఈ స్క్రబ్‌తో పాదాలను బాగా రుద్దడం వల్ల.. మృత కణాలు తొలగిపోయి చర్మం మృదువుగా మారుతుంది.

Home Remedies For Cracked Heels In Telugu-1

పాలు, చక్కెరతో.. (Milk And Sugar)

పాలు చర్మంలో తేమను పెంచుతాయి. చక్కెర చర్మాన్ని ఎక్స్ ఫోలియేట్ చేస్తుంది. అందుకే ఈ రెండింటితో తయారుచేసే స్క్రబ్ కాళ్ల పగుళ్లను పూర్తిగా తగ్గిస్తుంది. దీనికోసం కప్పు పాలను.. ఐదు కప్పుల గోరు వెచ్చని నీటితో కలిసి.. తర్వాత ఈ మిశ్రమాన్ని టబ్‌లో పోసి.. అందులో కాళ్లను పావుగంట పాటు నాననివ్వాలి. ఆ తర్వాత ఓ బౌల్‌లో బేబీ ఆయిల్, చక్కెర, కొన్ని పాలు కలిపి మిశ్రమాన్ని తయారుచేయాలి. తర్వాత దాన్ని కాళ్లకు అప్లై చేసి స్క్రబ్ చేయాలి. ఆ తర్వాత కాళ్లు కడుక్కొని మాయిశ్చరైజర్ రాసుకుంటే సరి.

పగుళ్ల గురించి మీ సందేహాలకు సమాధానాలివే.. (FAQ’s)

1. కాళ్ల పగుళ్లను త్వరగా తగ్గించే ట్రీట్ మెంట్ ఏది?

కాళ్ల పగుళ్లకు ఇంట్లో లేదా పార్లర్‌లో పెడిక్యూర్ చేయించుకోవడం మంచి పద్ధతి. దీంతో పాటు రోజూ లూఫా, ఫుట్ స్క్రబ్బర్, ప్యూమిస్ స్టోన్‌ల సాయంతో గట్టిబడిపోయి, పొడిబారిపోయిన చర్మాన్ని, మృత కణాలను తొలిగించే ప్రయత్నం చేయాలి. రోజూ కాళ్లకు కూడా ఫుట్ క్రీం లేదా మాయిశ్చరైజర్ రాసుకోవాలి. లేదంటే కనీసం పెట్రోలియం జెల్లీ అప్లై చేసినా సరిపోతుంది.

Home Remedies For Cracked Heels In Telugu-2

2. కాళ్ల పగుళ్లు రాకుండా చేయాలంటే ఏం చేయాలి.?

ముఖ్యంగా ఎక్కువ సేపు నిలబడి చేసే పనులకు స్వస్తి పలకాలి. అలాగే బరువు తగ్గడానికి ప్రయత్నించాలి. సాధారణంగా శరీరంలో, చర్మంలో తేమ తక్కువగా ఉండడం, నీళ్లలో ఎక్కువ సేపు తడవడం వల్ల కాళ్ల పగుళ్లు ఎక్కువగా వస్తుంటాయి. వీటిని నివారించడం వల్ల కాళ్ల పగళ్లు రాకుండా చేసుకోవచ్చు.

వీటన్నింటితో పాటు ఫ్లిప్ ఫ్లాప్స్, శాండల్స్, ఓపెన్ బ్యాక్ షూలు, హీల్స్, టైట్‌గా ఉండే చెప్పులు వేసుకోవడం వల్ల కాళ్ల పగుళ్లు ఎక్కువవుతాయి. కాబట్టి వాటిని ధరించకుండా కాళ్లకు పూర్తి రక్షణను అందించే చెప్పులు ధరించాలి.

అలాగే ఎక్కువ సేపు ఒకే పొజిషన్‌లో నిల్చోవడం, కాలు మీద కాలేసి కూర్చోవడం వంటివి చేయడం సరికాదు.

రోజూ రాత్రి కాళ్లకు తేమను అందించేందుకు ఫుట్ క్రీంని అప్లై చేసుకోవాలి. అంతేకాదు.. రోజంతా నీళ్లు, పండ్ల రసాలు, ఇతర లిక్విడ్స్‌ను ఎక్కువగా తీసుకోవాలి. వీటి వల్ల కాళ్ల పగుళ్లు తగ్గుముఖం పడతాయి.

3. కాళ్ల పగుళ్లు ఆరోగ్యానికి హానికరమా?

కాళ్ల పగుళ్లు సాధారణంగా పెద్ద హానికరమైనవేమీ కాదు. కానీ డయాబెటిస్, కొన్ని రకాల ఇమ్యూన్ సమస్యలున్నవారికి మాత్రం అవి హానికారకంగా పరిణమించవచ్చు. అలాగే పగుళ్ల మధ్యలో ఇన్ఫెక్షన్ ప్రారంభమై.. అది సమస్యగా మారే ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి పగుళ్లను అంత తేలికగా వదిలేయకుండా తగ్గించుకోవడానికి ప్రయత్నించడం మంచిది.

Home Remedies For Cracked Heels In Telugu-3

4. ఇంట్లోనే పెడిక్యూర్ ఎలా చేసుకోవాలి? దీన్ని ఎన్ని రోజులకోసారి చేసుకుంటే కాళ్ల పగుళ్లు రాకుండా ఉంటాయి.

కాళ్ల పగుళ్లను తగ్గించేందుకు కనీసం వారానికి రెండుసార్లు కాళ్లను స్క్రబ్ చేసుకోవాలి. అలాగే వారానికోసారైనా సరే పెడిక్యూర్ చేసుకోవడం మంచిది. దీనికోసం టబ్‌లో కొన్ని నీళ్లు తీసుకొని.. అందులో లిక్విడ్ సోప్ లేదా ఎప్సమ్ సాల్ట్ వేసుకొని పావు గంట పాటు అందులో కాళ్లు ముంచి తీయాలి. తర్వాత ప్యూమిస్ స్టోన్ లేదా స్క్రబ్బర్ సాయంతో కాళ్ల పగుళ్లన్నీ తొలగించాలి. తర్వాత కాళ్లను టవల్ సాయంతో తుడుచుకొని కాళ్లకు మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవాలి. 


1, నవంబర్ 2022, మంగళవారం

మంగు (ఫిగ్మెంటేషన్ )మచ్చలు నివారణకు ఆయుర్వేదం సలహాలు

మచ్చ లేని చర్మం అనేది ఒక సుదూరమైన కలలాగా అనిపిస్తుంది మీ శరీరం మీద నల్లని మచ్చలు గమనించినప్పుడు ప్రత్యేకంగా మీ ముఖం మరియు చేతుల పైన. మీ శరీరంలో ఒకటి లేదా అన్ని భాగాలపై ఎక్కువగా నల్ల మచ్చలు ఉండటాన్ని పిగ్మెంటేషన్ లేదా హైపెర్పిగ్మెంటేషన్ అని పిలుస్తారు. ఇది వయస్సు మరియు లింగంతో సంబంధం లేకుండా ఎవరికైనా సంభవించవచ్చు.

పిగ్మెంటేషన్ యొక్క అత్యంత సాధారణ కారణం దీర్ఘకాలంగా సూర్యరశ్మికి  బహిర్గతమవ్వడంఅయితే, హార్మోన్ల మార్పులు, గర్భం, యాంటీబయోటిక్స్ (టెట్రాసైక్లిన్స్), వెంట్రుకల తొలగింపు, అలెర్జీ, గర్భ నిరోధక మాత్రలు, జన్యు లోపాలు, విటమిన్ లోపం (విటమిన్ B12 మరియు ఫోలిక్ ఆమ్లం), చర్మశోథ, రసాయనాలు లేదా భౌతిక గాయం మొదలైనటువంటివి మీ శరీరంలోని పిగ్మెంటేషన్ ను కలిగించే అనేక ఇతర కారణాలు ఉన్నాయి. .

పిగ్మెంటేషన్ కోసం మీరు ఇంట్లో ప్రయత్నించగల చాలా నివారణలు ఉన్నాయి, అయినప్పటికీ, మీ చర్మ పరిస్థితి తీవ్రంగా ఉన్నప్పుడు మీ చర్మంతో ఏ ప్రయోగాన్నైనా నివారించాలి. తీవ్రమైన అంతర్గత వైద్య పరిస్థితులను నివారించడానికి మీరు వైద్యున్ని సంప్రదించడం ఎల్లప్పుడూ సిఫారసు చేయబడినప్పటికీ, పిగ్మెంటేషన్ ను వదిలించుకోవడానికి ఇంటి వద్ద నుండి ప్రయత్నించే కొన్ని విషయాలు ఇక్కడ ఉన్నాయి. అయితే, క్రింద పేర్కొన్న అన్ని పదార్ధాలు సహజమైనవి మరియు మీ సాధారణ చర్మ సంరక్షణలో భాగంగా ఉపయోగించవచ్చు, మీ చర్మతత్వానికి సరిపోతుందో లేదో చూడటానికి ఎల్లప్పుడూ మీ ముంజేయిపై ఒక ప్యాచ్ పరీక్ష చేసుకోవడం ఉత్తమం. ప్యాచ్ పరీక్ష చేసిన తరువాత ఎరుపుదనం, దురద లేదా మంటను కలిగించే ఏ నివారణను ఉపయోగించవద్దని మేము సూచిస్తాము ఎందుకంటే నివారణలో ఉపయోగించిన పదార్ధాలకు మీ చర్మం సున్నితంగా ఉందని ఇది తెలియజేస్తుంది.

  • పచ్చి బంగాళాదుంపలు

పచ్చి బంగాళాదుంపలలో మీ చర్మంలో మెలనిన్ ఉత్పత్తిని తగ్గించే కేట్కోలెస్ అనే ఎంజైమ్ ఉంటుంది. మంచి యాంటీఆక్సిడాంట్ గుణాలను కలిగి ఉన్న విటమిన్ సి కూడా కలిగి ఉంటుంది.

ఎలా ఉపయోగించాలి?

మీరు ఒక బంగాళాదుంప ముక్కను కోసి, దానిపై కొంత నీటిని జల్లి, వృత్తాకార కదలికలలో ప్రభావిత చర్మాన్ని దానితో రుద్దండి నాలుగు వారాల పాటు రోజుకి 2-3 సార్లు ఇలా చేయడం వల్ల మీ చర్మం మెరుపును సంతరించుకుంటుంది

  • ఆపిల్ సిడార్ వినీగర్

సేంద్రీయ ఆమ్లాలు జీవసంబంధ జీవుల నుండి ప్రత్యేకంగా మొక్కల నుండి సేకరించబడే ఆమ్లాలు. చర్మ సమస్యలకు సేంద్రీయ ఆమ్లం యొక్క ఉపయోగంపై ఒక సమీక్ష ప్రకారం మాలిక్ ఆమ్లం, సిట్రిక్ యాసిడ్, ఒలీక్ యాసిడ్ మొదలైనవ సేంద్రీయ ఆమ్లాలు చర్మం యొక్క పిగ్మెంటేషన్ తగ్గించడంలో ఉపయోగపడతాయి. ఆపిల్ సిడార్ వినీగర్ అనేది చర్మం యొక్క డీపిగ్మెంటేషన్ లో ఉపగోగపడే అటువంటి వాటిలో ఒక ఉత్పత్తి

ఎలా ఉపయోగించాలి?

ఒక కప్పు ఆపిల్ సిడార్ వెనీగర్ ను సమానమైన నీటితో చేర్చండి మరియు దానితో పిగ్మెంటేడ్ చర్మాన్ని శుభ్రం చేయండి. 10-15 నిమిషాల పాటు వదిలివేయండి మరియు గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోండి. ఇలా రోజుకు రెండుసార్లు నాలుగు వారాలు పాటు చేయండి.

  • ఎర్ర ఉల్లిపాయ

ఎర్ర ఉల్లిపాయలో ఉన్న చర్మాన్ని తెలుపుగా చేసే పదార్ధాలపై చేసిన ఒక అధ్యయనం ప్రకారం, ఇది టైరోసినాస్ ఎంజైమ్ ను నిరోధించగల మరియు మెలనిన్ ఉత్పత్తిని నిరోధించే సామర్థ్యం కలిగి ఉందని నిర్ధారించింది. అందువల్ల అది పిగ్మెంటేషన్ ను తగ్గించడంలో సహాయపడుతుంది.

ఎలా ఉపయోగించాలి?

మీరు ఒక ఉల్లిపాయ ముక్కను కోసి, పిగ్మెంటేషన్ గల ప్రాంతంపై రుద్దుకోవచ్చు లేదా ఉల్లిపాయను మెదిపి, దాని రసంను తీసుకోవచ్చు. ప్రతిరోజూ ఒకసారి ఈ రసంను పిగ్మెంటేడ్ చర్మంపై రాసి10 నిమిషాల పాటు వదిలేయండి. గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోండి. ప్రభావిత చర్మంలో మార్పులను చూసేవరకు ఇలా చేయండి. ఉల్లిపాయను ఉపయోగించిన తర్వాత మీరు మీ చేతులను కడగండి, ఎందుకంటే మీరు మీ కళ్ళను అనుకోకుండా గాయపరచవచ్చు.

  • బాదం

మన చర్మంపై మేజిక్ లాగా పనిచేసే విటమిన్ ఈ మరియు యాంటీఆక్సిడెంట్ల యొక్క పుష్కలమైన వనరుగా బాదంలు ప్రసిద్ది చెందాయి. ఇవి చర్మ సమస్యల చికిత్సలో ఉపయోగించే పురాతన పద్ధతుల్లో ఒకటి. ఆరోగ్యంపై బాదం యొక్క ప్రభావాలపై ఆధారపడిన ఒక వియుక్త, వాటిలో ఎర్రబడిన చర్మాన్ని మరియు మచ్చలను కూడా చల్లబరిచే మరియు చర్మాన్ని తిరిగి ఆరోగ్యంగా చేసే గుణాలు ఉన్నాయని చెప్తుంది .

ఎలా ఉపయోగించాలి?

మీరు రాత్రిపూట 5-6 బాదంపప్పులను నానబెట్టి మరియు ఉదయాన్నే దాని పై తొక్కను తీయండి. ఒక పిస్టల్ మరియు మోర్టార్ సహాయంతో, వాటిని చక్కగా పొడి చేసి మరియు ముద్ద లాంటి అనుగుణ్యత వచ్చేవరకు చిన్నమోతాదుల్లో పాలు జోడించండి. పరిశుభ్రమైన చేతుల్లో ఈ పేస్ట్ ను తీసుకోండి మరియు ప్రభావిత చర్మం మీద రాసుకోండి మరియు దానిని 15 నిమిషాల పాటు వదిలేయండి. గోరువెచ్చని నీటితో కడిగేయండి. తదుపరి 3-4 వారాల పాటు ఇలా చేయండి.

  • కందిపప్పు

కందిపప్పుకి కూడా బ్లీచింగ్ గుణం ఉంటుంది మరియు అవి మీ పిగ్మెంటేడ్ చర్మాన్ని మెరుగుపరచడంలో ప్రభావవంతంగా ఉంటాయి.

ఎలా ఉపయోగించాలి?

రాత్రిపూట పూర్తి గిన్నెడు కందిపప్పును నానబెట్టాలి. ఉదయం, మీరు వాటిని మెదిపి ఒక పేస్ట్ తయారు చేసి మరియు రెండు స్పూన్లు పాలు, సగం టీస్పూను తేనె, చిటికెడు పసుపు చేర్చి కలపాలి. ఈ పేస్ట్ ను మీ ముఖం మీద ఉంచి దానిని కడగటానికి ముందు అరగంట సేపు ఉంచండి. ఫలితాలు కనిపించే వరకు ఒక నెల పాటు ఈ పద్ధతిని ఉపయోగించండి.

  • పెరుగు

2014 లో నిర్వహించిన "చర్మం మీద పులియబెట్టిన పాల ఉత్పత్తుల ప్రభావాలు" పై అధ్యయనం ప్రకారం, ఆహారంపై పెరుగు యొక్క ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి మరియు చర్మంపై రాసుకున్న కూడా ఉపయోగకరం. అందువల్ల, ఈ ముసుగు మీ చర్మానికి వివిధ రకాలుగా ఉపయోగపడుతుంది. పెరుగు చర్మాన్ని తేమగా ఉంచుతుంది మరియు కాంతివంతం చేస్తుంది మరియు నిమ్మరసం బ్లీచింగ్ మరియు యాంటీఆక్సిడెంట్ గుణాలను కలిగి ఉంటుంది, ఇది నల్ల మచ్చలను తగ్గించడానికి సహాయపడుతుంది.

ఎలా ఉపయోగించాలి?

మీరు రెండు టీస్పూన్లు సెనగపిండి, ఒక టీస్పూన్ పెరుగు లేదా మీగడ, సగం టీస్పూన్ నిమ్మరసం మరియు చిటికెడు పసుపు  తీసుకోవచ్చు. ఈ పేస్టును బాగా కలిపి, మీ ముఖం మీద 20 నిమిషాల పాటు ఉంచండి. గోరువెచ్చని నీటితో మీ ముఖాన్ని కడగండి. నాలుగు వారాల పాటు ఈ మాస్కును ఉపయోగించండి.

  • గ్రీన్ టీ

"చర్మం పై గ్రీన్ టీ పాలీఫెనోల్స్ యొక్క రక్షణ మెకానిజమ్స్" మీద ఆక్సిడెటివ్ స్టడీ అండ్ సెల్యులార్ లాంగివిటీలో ఒక పత్రిక ప్రకారం గ్రీన్ టీలో ఫ్లేవోనాయిడ్స్ ఉనికి కారణంగా యాంటీఇన్ఫ్లమేటరీ మరియు యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంది. ఈ కేటీచైన్లు టైరోసిన్ ఎంజైమును నిరోధిస్తాయి మరియు మెలనిన్ ఏర్పడకుండా నిరోధిస్తాయి

ఎలా ఉపయోగించాలి?
ఒక కప్పు నీరు వేడిచేసి, దానిలో  ఒక గ్రీన్ టీ బ్యాగ్ వేయండి. మీరు దీనికి  గ్రీన్ టీ ఆకులు కూడా ఉపయోగించవచ్చు. 1-2 నిముషాలు టీని కాచిన తరువాత, టీ బ్యాగ్ తొలగించండి లేదా ఆకులను వడగట్టండి. ప్రతిరోజు గ్రీన్ టీని తాగండి మరియు ఒక నెల పాటు మీ ప్రభావిత చర్మ ప్రాంతంలో వాడిన గ్రీన్ టీ బ్యాగ్ ను అద్దండి. నీటితో శుభ్రం చేసుకోండి.

  • సోయాబీన్స్

సోయాపాలు మరియు సోయాబీన్ సారం యొక్క ప్రభావంపై అధ్యయనం ప్రకారం ఈ ఉత్పత్తులను వినియోగించడం లేదా సోయాబీన్ సారాన్ని ప్రభావిత ప్రాంతంపై రాయడం అనేది పిగ్మెంటేషన్ కు ఒక ప్రత్యామ్నాయ సహజ నివారణ.

ఎలా ఉపయోగించాలి?

ప్రతిరోజూ ఒక గ్లాసు సోయాపాలు తాగండి లేదా ప్రతిరోజు సోయాబీన్ సారాన్ని పిగ్మెంటేషన్ ఉన్న చర్మం మీద రాయండి. సోయాబీన్ సారం సాధారణంగా మార్కెట్లలో, ఔషధ దుకాణాలు, కాస్మెటిక్ దుకాణాలు మరియు ఆన్లైన్ షాపింగ్ వెబ్సైట్లలో అందుబాటులో ఉంటుంది. తయారీదారుచే సూచించబడిన విధంగా ఉత్పత్తిని ఉపయోగించండి. ఉపయోగం కోసం సూచనలు, వాడాల్సిన పద్ధతి మరియు ఇది ఉపయోగించవలసిన వ్యవధిపై సమాచారం సాధారణంగా ఉత్పత్తితో అందించబడుతుంది.

  • నిమ్మకాయ

తేనె మరియు నిమ్మలపై కొన్ని సమీక్ష కథనాలు ఉదాహరణకు "మానవ వ్యాధులలో సహజ తేనె యొక్క సాంప్రదాయ మరియు ఆధునిక ఉపయోగాలు" మరియు మానవ ఆరోగ్యానికి ప్రయోజనాలు అందించే క్రియాశీలమైన సహజ మెటాబోలైట్స్ వంటి విలువైనవాటికి నిధి అయిన సిట్రస్ పండ్లు" వారి చర్మ ప్రయోజనాల గురించి క్లూ ను అందిస్తాయి. నిమ్మ మరియు తేనె రెండూ యాంటియోక్సిడెంట్, మృతకణాలను తొలగించే, మెలనోజెనిసిస్ (మెలనిన్ తయారీ నివారించడం) మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కలిగి ఉన్నాయని ఈ సమీక్షలు చూపాయి అవి పిగ్మెంటేషన్ ను వదిలించుకోవటానికి, వాపు తగ్గించడానికి మరియు మీ చర్మాన్ని ఆరోగ్యకరంగా, ప్రకాశవంతంగా మరియు మెరిసేలా చేసేందుకు సహాయపడతాయి.

ఎలా ఉపయోగించాలి?

మీరు తేనె మరియు నిమ్మ రసం చెరి ఒక టీస్పూన్ ఉపయోగించవచ్చు, వాటిని బాగా కలపండి,  మరియు దాన్ని దూదితో అద్దండి. దీని తరువాత, ప్రభావితమైన ప్రదేశంను ఈ దూదితో వృత్తాకార కదలికలను ఉపయోగించి మర్దన చేసుకొని 15-20 నిమిషాలు పాటు ఉండనివ్వండి. మీరు 3-4 వారాల వ్యవధిలో ఇది రోజుకు రెండు సార్లు చేయవచ్చు. దాని పదార్థాలు సహజంగా ఉన్నందున మీరు దీనిని ప్రతిరోజూ ఉపయోగించవచ్చు.

  • కీరదోస

విటమిన్ ఎ మరియు సి, మరియు కెరోటేన్లు ఉండటం వలన కీరదోసలో యాంటీఆక్సిడెంట్ లక్షణాలు ఉన్నాయి. కీరదోసలో ఉండే జియాగ్జాంథిన్ మరియు లుటీన్ చర్మపు రంధ్రాలను తగ్గించడానికి, చర్మాన్ని తెల్లగా చేయడానికి మరియు చర్మ మృతకణాలను తొలగించడానికి ఉపయోగపడతాయి

ఎలా ఉపయోగించాలి?

తాజా కీరదోస రసం తీసుకోండి మరియు ప్రభావిత చర్మంపై దాన్ని రాయండి. అరగంట సేపు అలా వదిలేయండి, కడిగి మరియు చర్మాన్ని పొడిగా ఉంచండి. ప్రభావిత చర్మంపైన మార్పులు కనబడేవరకు రోజూ ఒకసారి చేయండి.

  • టమోటా

లైకోపీన్ ఉనికి కారణంగా టమాటాలు వాటి యాంటీఆక్సిడెంట్ లక్షణాలకు ప్రసిద్ధి. లైకోపీన్ సూర్యకాంతి ద్వారా దెబ్బతిన్న మీ చర్మంపై పిగ్మెంటేషన్ను తగ్గించడంలో సహాయపడుతుంది

ఎలా ఉపయోగించాలి?

మీరు టమాటాలను మిశ్రమం చెయ్యవచ్చు లేదా టమాటా గుజ్జు తీసుకొని ఆలివ్ ఆయిల్ యొక్క కొన్ని చుక్కలతో కలపవచ్చు. ఈ పేస్ట్ ను మచ్చలున్న చర్మం పైన రాయండి. మీరు దానిని 15-20 నిమిషాలు పాటు ఉంచి, కొద్దిగా గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. మీరు 2-3 వారాలలో మార్పులను చూడడాన్ని ప్రారంభిస్తారు.

  • అవోకాడో

యు. వి. వి కిరణాల నుంచి మూలికల ద్వారా చర్మం యొక్క రక్షణపై ఒక పత్రిక పేర్కొంది, విటమిన్ సి, ఈ మరియు ఒలేక్ ఆమ్లాలు అవోకాడోలలో అధికంగా ఉంటాయి, ఇవి యువి కిరణాల నుండి చర్మాన్ని రక్షించడంలో మరియు చర్మంపై పిగ్మెంటేషన్ ను తగ్గించడంలో సమర్ధవంతమైనవి

ఎలా ఉపయోగించాలి?

ఒక ముక్క అవోకాడోను కోసి ఒక మృదువైన ముద్దలా తయారు చేసుకోండి మరియు ఒక నెల పాటు రోజుకి రెండుసార్లు నల్ల మచ్చల పైన రాయండి. మీరు ఈ ముద్దకు కొంచెం తేనె మరియు పాలు కలపవచ్చు మరియు ఆరే వరకు చర్మంపైన ఉంచండి  గోరువెచ్చని నీటితో కడిగేయండి. ఒక నెల పాటు రోజుకి ఒకసారి ఇలా చేయండి.

  • బొప్పాయి

2014 లో నిర్వహించిన ఒక అధ్యయనం బొప్పాయి మరియు దాని విత్తనాల యాంటిఆక్సిడెంట్ ప్రభావాలపై ఆధారపడి ఉంది. పచ్చి బొప్పాయిలో మృతకణాలను తొలగించే మరియు యాంటీఆక్సిడెంట్ లక్షణాలు ఉంటాయి, ఇది చర్మ నష్టం జరగకుండా మృత చర్మ కణాలను తీసివేయడంలో సహాయం చేస్తుంది. కాబట్టి, మీ చర్మంపై పిగ్మెంటేషన్ని తగ్గించడంలో ఇది సహాయపడుతుంది.

ఎలా ఉపయోగించాలి?

మీరు ఒక మూడు అంగుళాల బొప్పాయి ముక్క తీసుకొని, సగం టీస్పూన్ తేనె, ఒక చిటికెడు పసుపు , కొన్ని చుక్కల నిమ్మరసం మరియు పాలు జోడించవచ్చు. మీరు వీటన్నిటిని కలిపి ఒక ముద్దలా తయారు చేసి మరియు మచ్చలున్న ప్రాంతంలో ప్రతిరోజూ రోజుకు రెండుసార్లు రాయండి. ఈ పేస్ట్ ను 20 నిముషాల పాటు చర్మం పైన ఉంచి తరువాత, గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. కనీసం ఒక నెల పాటు ఇలా చేయండి

  • అరటిపండు

ఒక అధ్యయనం, "ముసా సేపియంటాం పై తొక్క నుండి తీయబడిన యాంటీఇన్ఫ్లమేటరీ అండ్ యాంటీఆక్సిడెంట్ యాక్టివిటీస్", లో అరటిపండు చాలా మంచి సహజమైన ఎక్సఫోలియేటెర్ మరియు యాంటీఆక్సిడెంట్ అని కనుగొనబడింది. ఇది మృత చర్మ కణాలను తీసివేయడంలో సహాయపడుతుంది. అలా ఇది మృదువుగా పిగ్మెంటెడ్ కణాలను తొలగించడంలో సహాయపడుతుంది.

ఎలా ఉపయోగించాలి?

మీరు సగం అరటిపండు (పండని), ఒక టీస్పూన్ తేనె, మరియు మీ చర్మం కోసం ఒక క్రీం లాంటి పేస్ట్ చేయడానికి ఒక టీస్పూన్ పాలు ఉపయోగించవచ్చు. అన్నిటిని కలపండి లేదా గుజ్జులా చేయండి అప్పుడది గడ్డలు గడ్డలుగా ఉండకుండా ఉంటుంది. ప్రభావిత చర్మంపై రాసుకోవడానికి ముందు మీ చేతులను కడుక్కోండి. ఈ పేస్ట్ ను ఒక సమాంతరమైన పొరలా రాసుకోండి మరియు దానిని 30 నిమిషాలు పాటు ఉంచండి. ఫలితాలను చూడడానికి ఒక నెలపాటు ఈ మాస్కును ఉపయోగించండి. నెమ్మదిగా గోరువెచ్చని నీటితో కాఫేగండి మరియు మీ చర్మాన్ని పొడిగా ఉంచండి

  • మల్బరీ

హైపర్పిగ్మెంటేషన్ మీద సహజ పదార్ధాల ప్రభావం గురించి క్లినికల్ మరియు ఈస్తటిక్ డెర్మటాలజీ యొక్క పత్రిక పేర్కొంది, మల్బెర్రీలో, టైరోసిన్ యొక్క చర్యను నిరోధించడమే కాకుండా చర్మం దెబ్బతినడానికి కారణమైన ఫ్రీ ఆక్సిజన్ రాడికల్లను తొలగించడంలో సహాయపడే క్రియాశీలక భాగం ఉంది

ఎలా ఉపయోగించాలి?

మల్బరీ సారం ఇతర సుగంధ నూనెలతో ఒక చర్మపు సిరంగా లభిస్తుంది. మీరు ఉత్పత్తిని ఉపయోగించే సరైన మార్గాన్ని తెలుసుకోవటానికి ప్యాకేజీని చూడవచ్చు

  • స్ట్రాబెర్రీలు

డెర్మటాలజీ ఇండియన్ జర్నల్ చే ఒక పత్రిక, స్ట్రాబెర్రీలో మెలనిన్ సంశ్లేషణను సమర్ధవంతంగా నిరోధించే ఫ్లావనాయిడ్స్ ఉన్నాయి అని చెప్తుంది. అందువల్ల, అవి చర్మం పై పిగ్మెంటేషన్ కు చికిత్స చేయడానికి స్ట్రాబెర్రీని ప్రత్యామ్నాయ పద్ధతిగా చేస్తాయి

ఎలా ఉపయోగించాలి?

మీరు 2-3 తాజా స్ట్రాబెర్రీలు తీసుకుని మెదిపి ముద్దలా చేయండి . దీనికి సగం టీస్పూన్ తేనె జోడించి బాగా కలపాలి. శుభ్రమైన చేతుల్లో ఈ పేస్ట్ తీసుకోండి మరియు ప్రభావిత చర్మంపై రాయండి. మీరు సుమారు 2-3 నిమిషాలు వృత్తాకార కదలికలతో మృదువుగా చర్మంపై మర్దన చేయాల్సి ఉంటుంది. దీని తరువాత, మీ చర్మంపై 15 నిమిషాలు ఉంచండి మరియు గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోండి. తరువాత, చర్మపు రంధ్రాలను మూసివేయడానికి చల్లని నీటితో మీ ముఖాన్ని కడగాలి. ఫలితాలను చూడడానికి కనీసం ఒక నెల పాటు ఈ పద్ధతిని ఉపయోగించండి.

  • పసుపు

పసుపు అనేది చర్మాన్ని నయం చేయడానికి మరియు తెలుపుగా చేయడానికి సహాయపడే సామర్థ్యం ఉన్నందున అనేక చర్మ వ్యాధులకు ఒక పూర్వకాలపు ఔషధం. . చర్మ ఆరోగ్యంపై పసుపు యొక్క ప్రభావాల ఆధారంగా చేసిన ఒక సమీక్ష ప్రకారం పసుపు యాంటీఇన్ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్, యాంటీమైక్రోబియల్ మరియు క్యాన్సర్-నివారించే లక్షణాలను కలిగి ఉంది, ఇది చాలా చర్మ వ్యాధులకు సహాయపడుతుంది.

ఎలా ఉపయోగించాలి?

పసుపును అనేక మార్గాల్లో ఉపయోగిస్తారు. మీరు ఒక పెరుగు మాస్కుకు, నిమ్మ రసం, తేనె, పాలుముల్తానీ మట్టి మాస్కు మొదలైన వాటికి పసుపును చేర్చవచ్చు. మీరు మీ పిగ్మెంటేడ్ చర్మంలో మార్పులను చూసేవరకు ప్రతిరోజూ ఒక చిటికెడు పసుపుతో ఈ మాస్కులలో దేన్నైనా ప్రతిరోజూ ఉపయోగించవచ్చు

  • కలబంద

పిగ్మెంటేషన్ చికిత్సలో కలబంద యొక్క సామర్ధ్యానికి సంబంధించిన ఒక 2012 అధ్యయనం పిగ్మెంటేషన్ ను తగ్గించడానికి కలబంద సహాయపడుతుంది అని సూచిస్తుంది. ఇందులో అలోయిన్ అని పిలువబడే చురుకైన పదార్ధం ఉంది, ఇది సంకలనం చేయడంలో సహాయపడుతుంది మరియు అందువల్ల ఇది రాయబడిన ప్రాంతంలో పిగ్మెంటేషన్ను తగ్గిస్తుంది.

ఎలా ఉపయోగించాలి?

మీరు మార్కెట్లో లభించే కలబంద సారం కొనవచ్చు లేదా మీ తోట నుండి ఒక కలబంద ఆకుని తెంపవచ్చు. దాని పై తొక్కను తీసి కలబంద గుజ్జుని సేకరించి మరియు రెండు టీస్పూన్లను ఒక టీస్పూన్ తేనెతో కలపాలి. 10 నిముషాల పాటు దానిని ఉంచండి. ఈ మిశ్రమాన్ని రోజుకు రెండుసార్లు ప్రభావిత చర్మం మీద రాయండి మరియు 20 నిముషాల పాటు వదిలివేయండి. గోరు వెచ్చని నీటితో దీనిని కడగండి మరియు కనీసం నాలుగు వారాల పాటు ఈ పద్ధతిని అనుసరించండి.

  • గంధం

గంధపు నూనెపై జరిపిన ఒక అధ్యయనం టైరోసినాస్ అనే ఎంజైమ్ (టైరోసిన్ ను మెలనిన్ గా మార్చే ఎంజైమ్. మెలనిన్ అనేది మన చర్మం ద్వారా ఉత్పత్తయ్యే ఒక వర్ణద్రవ్యం. ) ను నిరోధించగల సామర్ధ్యం దీనికి ఉందని మరియు నల్ల మచ్చలను తగ్గించడంలో తోడ్పడుతుందని తెలిపింది

ఎలా ఉపయోగించాలి?

మీ పిగ్మెంటేషన్ చికిత్స కోసం మీరు గంధపు పొడి లేదా గంధపు నూనెను ఉపయోగించవచ్చు.

రెండు టీస్పూన్లు గంధపు పొడిని తీసుకోండి, ఒక చిటికెడు పసుపు, కొన్ని చుక్కల ఆలివ్ నూనె మరియు గులాబీ నీరు / పాలు జోడించండి. ఒక ముద్దలా తయారు చేసి ప్రభావిత చర్మం మీద ఉంచండి. 10-15 నిమిషాల పాటు వదిలివేయండి. గోరువెచ్చని నీటితో దీనిని కడిగేయండి. మీ పిగ్మెంటేడ్ చర్మంలో ఏవైనా మార్పులను చూసేంత వరకు ఇలా రోజుకు ఒకసారి చేయండి.

  • అతిమధురం

పిగ్మెంటేషన్ పై అతిమధుర సారం యొక్క ప్రభావాలను ప్రదర్శించేందుకు ఒక అధ్యయనం సూచించింది, గ్లాబ్రిడీన్ అని పిలిచే ఒక క్రియాశీలక భాగం అతిమధుర సారంలో ఉంటుందని, ఇది టైరోసిన్ నిరోధకతలో మరియు పిగ్మెంటేషన్ ను నివారించడంలో సమర్థవంతమైనదిగా గుర్తించబడింది. దాని యొక్క డీపిగ్మెంటేషన్ చర్యే కాకుండా, చర్మ కణాలలో మంట (వాపు) తగ్గించడంలో కూడా ఉపయోగకరంగా ఉంటుంది.

ఎలా ఉపయోగించాలి?

అతిమధురం మార్కెట్లో క్రీములు, జెల్ లు మరియు సీరంలుగా లభిస్తుంది. ప్యాకేజీ పైన పేర్కొన్న విధంగా వాటిని వాడండి. మీరు ఎండిన అతిమధురం వేరులను పొడి చేసి, గుజ్జుగా తాయారు చేసుకోవడానికి గులాబీ నీటితో వాడవచ్చు. పరిశుభ్రమైన చేతులతో, ఈ పేస్ట్ ను ప్రభావిత ప్రాంతం అంతటా రాసుకోండి మరియు 15 నిముషాలు పాటు ఉండనివ్వండి. దీని తరువాత, గోరువెచ్చని నీటితో కడిగేసుకోండి. కనీసం ఒక నెల పాటు ఈ పద్ధతిని అనుసరించండి.

  • కుంకుమపువ్వు

కుంకుమపువ్వు అనేది చర్మాన్ని తెల్లగా చేయడానికి ఉపయోగించబడే ఒక పాతకాలపు పదార్ధం. ఒక వ్యాసం, "ఆయుర్వేద వర్ణ్య మూలికలు మరియు వాటి టైరోసినాస్ నిరోధికత సామర్ధ్యం యొక్క ముఖ్య సమీక్ష", కుంకుమపువ్వు మెలనిన్ ఉత్పత్తిని తగ్గించడంలో మరియు పిగ్మెంటేషన్ ను తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది అని చెప్తుంది

ఎలా ఉపయోగించాలి?

మీరు పైన పేర్కొన్న మాస్కులలో వేటికైనా 3-4 రేకలు కుంకుమపువ్వుని జోడించవచ్చు మరియు గతంలో వివరించిన విధంగా ప్రభావిత ప్రాంతంలో ఉంచండి.

మన చర్మం మనం తినేదాన్ని ప్రతిబింబిస్తుంది. 2012 లో నిర్వహించిన, "మీరు తినేదే మీరు: విషయంలోపండ్లు మరియు కూరగాయల వినియోగం లాభదాయకమైన చర్మ రెంగు మార్పులను ఇస్తుంది" అనే ఒక అధ్యయనం పండ్లు మరియు కూరగాయలతో కూడిన ఒక ఆరోగ్యవంతమైన ఆహారం తీసుకోవటం వలన మన మేనిఛాయ పైన నేరయిన ప్రభావం ఉంటుందని సూచిస్తుంది. క్రింద ఉంది హైపర్పిగ్మెంటేషన్ ను తగ్గించడానికి మీరు మీ ఆహారంలో చేర్చగల పదార్ధాల జాబితా:

  • పండ్లు
    విటమిన్ సి మరియు యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండే కొన్ని పండ్లు నిమ్మ, నారింజ, స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ, అవోకాడో, బొప్పాయి, నిమ్మకాయ, అరటి, ద్రాక్ష, చెర్రీస్, మామిడి, టమోటాలు మొదలైనవి చర్మానికి మంచివి. మీకు  మీరే వివిధ రకాల ఈ పండ్లతో సలాడ్ చేసుకుని ప్రతిరోజు తినండి.
     
  • కూరగాయలు
    కెరోటినాయిడ్లు మరియు ఫ్లేవనాయిడ్స్లలో పుష్కలంగా ఉండే కూరగాయలు చర్మ పిగ్మెంటేషన్ ను తగ్గించడానికి ఉపయోగపడతాయి. వీటిలో కీరదోస, క్యారెట్లు, పాలకూర, ఎరుపు మరియు పసుపు క్యాప్సికం, బ్రోకలీ మొదలైనవి ఉన్నాయి. మీ చర్మాన్ని లోపలి నుండి మెరుగుపరుచుకోవడానికి వీటిని మీ సూప్లు లేదా ఆహారంలో చేర్చుకోండి
     
  • కలబంద రసం
    కలబంద రసం చర్మానికి ఉపయోగపడే దాని యొక్క ఔషధ గుణాల వల్ల చాలా కాలంగా వాడుతున్నారు. విడిగా కలబంద రసం తాగండి, లేదా ప్రతిరోజు మంచి రుచి కోసం ఇతర రసాలతో కలుపుకోండి. రోజుకు రెండుసార్లు 10-15 మి. లీ కలబంద రసం తీసుకోవాలని మేము సూచిస్తాము, దానికంటే ఎక్కువ వద్దు 
  • గ్రీన్ టీ
    గ్రీన్ టీ అనేది మెలనిన్ ఉత్పత్తిని తగ్గించే కేట్చిన్ వంటి ఫ్లేవనాయిడ్లలో పుష్కలంగా ఉంటుంది. హైపర్పిగ్మెంటేషన్ చికిత్సకు కనీసం రెండుసార్లు గ్రీన్ టీ తాగడం మంచిది.
     
  • కొబ్బరి నీరు
    కొబ్బరి నీరు అవసరమైన ఖనిజాలను జోడించడంతో పాటు మీ శరీరాన్ని తిరిగి హైడ్రేట్ చేయడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మీ శరీరం తిరిగి హైడ్రేట్ అయితే, చర్మ కణాలు ఉత్తేజితమై మరియు కొత్త కణాలు కూడా ఏర్పడతాయి. ఇది మృత చర్మ కణాలను సకాలంలో తొలగించడానికి సహాయపడుతుంది
     
  • మంచినీరు
    ప్రతిరోజూ పుష్కలంగా నీళ్లు తాగడం మీ శరీరం నుండి విష పదార్ధాలను తొలగిస్తుంది మరియు మీ చర్మానికి మంచి మెరుపును ఇస్తుంది. ఇది చెమట ద్వారా చర్మం యొక్క సహజ ప్రక్షాళనను పెంచుతుంది మరియు కొవ్వు ఉత్పత్తి తగ్గిస్తుంది.
  • సుగంధ నూనెలు

సుగంధ నూనెలు వాటి యొక్క ఆరోగ్య ప్రయోజనాలు కోసం అధ్యయనం చేయబడ్డాయి. ఇటీవల, "యాంటీఇన్ఫ్లమేటరీ మరియు చర్మ అవరోధాల మీద కొన్ని మొక్కల యొక్క నూనెల పై పూత వల్ల ఉండే మరమ్మతు ప్రభావాలు", అనే దానిపై ఒక పత్రిక కొన్ని సుగంధ నూనెలను పిగ్మెంటేషన్ చికిత్సకు ఉపయోగించవచ్చని తెలుపుతుంది. వీటిలో ఆర్గాన్ నూనె, ఆలివ్ నూనెకొబ్బరి నూనె, లావెండర్ నూనె, గులాబీ నూనె, నిమ్మ సుగంధ నూనె మొదలైనవి ఉంటాయి. ఈ నూనెలు విడిగా లేదా కలిపి ప్రభావిత చర్మంపై రాసుకోవచ్చు. అవి వాపును తగ్గిస్తాయి, నయం అవడాన్ని మెరుగుపరుస్తాయి మరియు మీ చర్మానికి నష్టం కలిగించే ఫ్రీ రాడికల్స్ ని తొలగిస్తాయి.

ఎలా ఉపయోగించాలి?

పైన పేర్కొన్న సుగంధ నూనెలలో ఏదైనా ఒకదానిని ఉపయోగించండి మరియు రెండింటినీ సమాన పరిమాణంలో కలిపి కొబ్బరి లేదా ఆలివ్ నూనెతో కలపాలి. మీరు సుగంధ నూనెను మీ రోజువారీ మాయిశ్చరైజింగ్ లోషన్ లేదా క్రీముకు కూడా జోడించవచ్చు. ఈ నూనెలు రాత్రిపూట నిద్రిస్తున్న సమయంలో చర్మంపై రాసి రాత్రంతా వదిలేయాల్సి ఉంటుంది. ఈ నూనె మీ చర్మంపై ఉంచుకుని ఎండలోకి వెళ్లవద్దని సూచించబడింది. ఇది సాధారణంగా ఆరోగ్యకరమైన మరియు మెరిసే చర్మం కోసం చాలామంది ప్రజలచే రాత్రిపూట చర్మ సంరక్షణకై ఉపయోగించేది

  • సూర్యుని నుండి మీ చర్మాన్ని రక్షించుకోండి

సన్ స్క్రీన్లు సూర్యరశ్మిలో UV కిరణాల హానికరమైన ప్రభావాల నుండి చర్మాన్ని రక్షించే క్రీమ్లు లేదా లోషన్లుఅధిక SPF తో ఉన్న ఒక సన్స్క్రీన్నుఉపయోగిస్తే UV కిరణాల వల్ల ఏర్పడే ట్యానింగ్ మరియు పిగ్మెంటేషన్లను నిరోధిస్తుంది. SPF 30 తో ఉన్న సన్స్క్రీన్ సాధారణంగా దీనికి సిఫార్సు చేయబడింది. ఎండలో బయటకి వెళ్లే 30 నిమిషాలు ముందు  సన్స్క్రీన్ ను ఉపయోగించాలి.

  • మంచి పరిశుభ్రత పద్ధతులను పాటించండి

ప్రతిరోజూ చర్మ సంరక్షణ పద్ధతులను పాటించడం ఎప్పుడు మంచిది, మీ చర్మం శుభ్రం చేసుకోవాలి, కడుక్కోవాలి మరియు తేమగా ఉంచుకోవాలి. స్నానం చేయడానికి వేడి నీటిని ఉపయోగించవద్దు. ఎల్లప్పుడూ గోరువెచ్చని నీటిని వాడండి మరియు మీ చర్మం తేమను పట్టి ఉంచడానికి స్నానం చేసిన తర్వాత మీ చర్మాన్ని తేమ పరుచుకోండి. మీరు మీ చర్మ సంరక్షణలో చేర్చవలసిన ఇతర పద్ధతుల్లో శుభ్రపరుచుకోవడం, టోనింగ్ మరియు ఎక్సఫోలియేటింగ్ ఉన్నాయి. వారానికి ఒకసారి ఎక్సఫోలియేటింగ్చేయాలి. మోటిమలు ఉన్న వ్యక్తులు వారి చర్మ రకానికి అనుగుణంగా ఉండే చర్మ సంరక్షణ పద్ధతుల కోసం వైద్యున్ని సంప్రదించాలి.

ధన్యవాదములు 🙏

మీ నవీన్ నడిమింటి
విశాఖపట్నం
ఫోన్ -9703706660