లైంగికవాంఛ (లిబిడో) అంటే ఒక వ్యక్తి యొక్క సెక్స్ డ్రైవ్ లేదా శృంగారం చెయ్యాలనే కోరిక కలగడాన్ని సూచిస్తుంది. ఇది మెదడులోని సెక్స్ హార్మోన్లు మరియు వాటి సంబంధిత కేంద్రాల ద్వారా ప్రభావితమవుతుంది. ఇది సాధారణమైనదిగా అనిపించవచ్చు కానీ, లైంగికవాంఛ మీ ఆహారం మరియు భాగస్వామి పట్ల మీ ప్రేమతో సహా అనేక ఇతర అంశాల వలన కూడా ప్రభావితమవుతుంది. మీ భాగస్వామితో కలతలు కూడా సెక్స్ డ్రైవ్ను ప్రభావితం చేయవచ్చు.
స్త్రీలలో యోని పొడిబారడం లేదా బాధాకరమైన లైంగిక చర్య వంటి కొన్ని వైద్య పరిస్థితుల వలన కూడా లిబిడో ప్రభావితమవుతుంది. కుంగుబాటు, ఆత్మ విశ్వాసం లేకపోవడం, నిద్రలో కలతలు మరియు కొన్ని రకాల మందులు కూడా ప్రభావితం చేస్తాయి. చాలావరకు ఈ సమస్యలు సరైన చర్యలు తీసుకోవడం మరియు మంచి పద్ధతిలో లైంగిక చర్యలను/శృంగారాన్ని చెయ్యడం ద్వారా నిర్వహించబడతాయి.
అయితే, లైంగికవాంఛ తగ్గిపోవడం అనేది సాధారణం కాదని మీరు తెలుసుకోవాలి. కొందరు వ్యక్తులకు సహజంగానే ఇతరుల కన్నా ఎక్కువగా లైంగికవాంఛ ఉంటుంది. అయితే, ఈ వ్యాసంలో చర్చించిన విషయాల పై చర్యలను తీసుకోవడం ద్వారా మీరు ఖచ్చితంగా ప్రభావితమవుతారు. ఈ వ్యాసం మగవారు మరియు ఆడవారు ఇద్దరిలో లైంగిక వాంఛ పెరిగేందుకు కొన్ని గృహ చిట్కాలను వివరిస్తుంది, కామోద్దీపన (aphrodisiacs) గురించి కూడా వివరిస్తుంది.
కాబట్టి, కామోద్దీపన అంటే ఏమిటి? తెలుసుకోవడానికి ఈ వ్యాసం చదవం
మగవారిలో మరియు స్త్రీలలో లైంగిక కోరికలను మెరుగుపర్చడానికి మరియు లైంగిక పనితీరును మెరుగుపరచే సామర్థ్యాన్ని కలిగి ఉండే కొన్ని ఆహారాలు మరియు ఔషధాలు కామోద్దీపన లేదా సెక్స్ డ్రైవ్ ను సూచిస్తాయి. కామోద్దీపన ఆహారాలు ఒక వ్యక్తి యొక్క లైంగిక స్వభావాన్ని ప్రేరేపించడం మరియు ప్రోత్సహించడం ద్వారా అలా చేస్తాయి. ఇది వినడానికి కొంచెం సంక్లిష్టముగా ఉన్నపటికీ, ప్రతిరోజూ తినే ఆహార పదార్ధాలలో ఈ 'ఔషదాలు (డ్రగ్స్)' సహజంగానే ఉంటాయి, దానిమ్మ మరియు కాఫీతో సహా. ఇతర ఆహార పదార్దాలను, లైంగిక పనితీరు పెంచడానికి సులభంగా ఆహారంలో చేర్చవచ్చు. ఈ ఆహారాల జాబితాను ఒకసారి పరిశీలించి, మహిళలు మరియు పురుషలకు ఉత్తమమైనవి ఏవని ఎంపిక చేసుకోవచ్చు.
- చాక్లెట్లు
- నత్త గుల్లలు
- మాంసం
- చికెన్
- సాల్మోన్ మరియు ట్యూనా వంటి చేపలు
- పాలు
- చీజ్
- రెడ్ వైన్
- అవోకాడో
- ఎండుద్రాక్ష
- ఖర్జురం
- జల్దారు (ఆప్రికాట్లు)
- ఆక్రోటు కాయలు
- బచ్చలి కూర మరియు ఇతర ఆకుకూరలు
- అరటిపళ్ళు
- పీనట్ బట్టర్
- కాలే
- బీన్స్
- కాఫీ
ఈ ఆహారాల యొక్క కామోద్దీపన ప్రభావాలను తెలియజేసే అధరాలు
- చాక్లెట్లు ఒక బాగా తెలిసిన కామోద్దీపనకరమైన తిండ్లు/తిళ్ళు మరియు మహిళల్లో లైంగిక కోరికను పెంచి మరియు లైంగిక ఆనందాన్ని మెరుగుపరుస్తాయి. స్త్రీలపై జరిపిన అధ్యయనంలో చాక్లెట్లు తినని మహిళలతో పోలిస్తే తినే మహిళలలో అధిక ఫిమేల్ సెక్సువల్ ఫంక్షన్ ఇండెక్స్ (FSFI) ఉన్నట్లు తెలిసింది.
- నత్త గుల్లలు, మాంసం, చికెన్ మరియు చేపలు జింక్ అధికంగా ఉండే ఆహారాలు, వీటిలో లోపం మగవారిలో లైంగిక పరిపక్వత (sexual maturatio) ఆలస్యం కావడం మరియు నపుంసకత్వంతో ముడిపడివుంది. కాబట్టి, పురుషుల లైంగిక పనితీరును మెరుగుపరచడం ద్వారా లిబిడోను పెంచడంలో అవి పరోక్ష ప్రభావాన్ని కలిగి ఉంటాయి.
- మాంసం, పాలు మరియు చీజ్ లో కార్నిటైన్ అధికంగా ఉంటుంది, ఇది పురుషుల యొక్క సంతాన సామర్థ్యం మరియు లైంగిక కోరికలతో చాలా దగ్గరి సంబంధం కలిగి ఉంటుంది. కార్నిటైన్ అనేది వీర్య సంబంధమైన ద్రవం (సెమినల్ ఫ్లూయిడ్) యొక్క ఒక భాగం, ఇది ఎక్కువ ఉండడం వలన వీర్యకణాల సంఖ్య (స్పెర్మ్ కౌంట్) మరియు వాటి చలనంతో ముడి పడి ఉంటుంది. కాబట్టి, అది ముఖ్యంగా పురుషుల లైంగికవాంఛ మరియు సెక్స్ డ్రైవ్ను మెరుగుపరడంలో సహాయపడవచ్చు.
- రెడ్ వైన్ ఒక ముఖ్యమైన కామోద్దీపనకారి, అనేక అధ్యయనాలు మహిళల్లో దాని సమర్థతను సూచించాయి. ఈ అధ్యయనాలలో రెడ్ వైన్ ఒక మోస్తరు పరిమాణంలో తీసుకోవడం అనేది అధిక FSFI స్కోర్తో సంబంధం కలిగి ఉందని కనుగొన్నారు, ఇది మహిళల్లో లైంగిక కోరిక మరియు మెరుగైన లైంగిక పనితీరును సూచిస్తుంది. రెడ్ వైన్ వినియోగం మెరుగైన లైంగిక సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని పరిశోధనా ఆధారాలు సూచించాయి.
- అవోకాడో, ఎండుద్రాక్ష,ఖర్జురం మరియు ఆప్రికాట్లు వంటి డ్రై ఫ్రూట్స్ బోరాన్ యొక్క గొప్ప వనరులు. బోరాన్ యొక్క సప్లిమెంట్లు పురుషులు మరియు మహిళలు ఇద్దరిలో సెక్స్ స్టెరాయిడ్ల స్థాయిలను పెంచే అవకాశం ఉందని పరిశోధన అధరాలు సూచించాయి. పురుషులు, ముఖ్యంగా పెద్దవయసు వారిలో, బోరాన్ సప్లిమెంటేషన్ ద్వారా గణనీయమైన ప్రయాజనాలు పొందే అవకాశం ఉంది.
- ఆకుకూరలు మరియు అరటిపండ్లు మెగ్నీషియంలో అధికంగా ఉంటాయి, అది లైంగిక చర్యలలో ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. మెగ్నీషియం యొక్క లోపం అంగస్తంభన లోపం మరియు లిబిడో తగ్గిపోవడంతో సంబంధం కలిగి ఉంటుంది, కాబట్టి శరీరంలో మెగ్నీషియం స్థాయిలను పెంచుకోవడం అనేది సానుకూల ప్రభావాన్ని కలిగి ఉంటుంది.
పురుషులు మరియు మహిళలు లైంగికవాంఛ తగ్గిపోవడంతో సంబంధం ఉండే నిర్వహించగలిగిన కారకాలు - Managing factors associated with low libido in men and women
లైంగికవాంఛ తగ్గిపోవడానికి అనేక కారణాలు ఉంటాయి, అవి పురుషులు మరియు స్త్రీలలో వివిధ రకాలుగా ఉంటాయి. ఈ కారకాలలో కొన్ని ఇప్పటికే పైన ఇవ్వబడ్డాయి, ఇప్పుడు మనం వీటిని ఒక్కొక్కటిగా ఎలా నిర్వహించవ
పురుషులలో టెస్టోస్టెరోన్ స్థాయిలు పెంచడం - Increasing testosterone levels in men
పురుషులలో, సెక్స్ డ్రైవ్ ఎక్కువగా మేల్ సెక్స్ హార్మోన్ లేదా టెస్టోస్టెరోన్ ద్వారా ప్రభావితమవుతుంది, అంటే ఈ హార్మోన్ స్థాయిల పెరుగుదల వారి సెక్స్ డ్రైవ్ తో ప్రత్యక్ష ప్రభావాన్ని కలిగి ఉంటుంది. పురాతన కాలం నుండి లైంగిక సామర్ధ్యాన్ని పెంచుకోవడం కోసం, లైంగిక పనితీరును మెరుగుపరచుకోవడం, సెక్స్ వ్యవధిని పెంచుకోవడం లేదా సున్నితత్వాన్ని మెరుగుపరచుకోవడం కోసం పురుషులు సహజ ఆహార పదార్ధాలను తీసుకుంటున్నారు.
(మరింత సమాచారం: టెస్టోస్టెరాన్ స్థాయిలు పెంచడానికి గృహచిట్కాలు)
ఈ ఆహారాలలో ఎక్కువ భాగం సాధారణంగా రోజువారీ తినే ఆహారం పదార్దాలలోనే ఉంటాయి మరియు మిగిలినవి ప్రత్యేక ఆయుర్వేద పదార్థాలు, అవి తర్వాత చర్చించబడతాయి. పురుషుల్లో టెస్టోస్టెరోన్ స్థాయిలు మెరుగుపర్చడంలో అధిక సమర్థత కలిగిన అటువంటి ఒక ఆహార పదార్థం అల్లం. దాని యొక్క ప్రత్యేకమైన రుచి మరియు వాసన రసాయన సమ్మేళనాలతో ముడిపడి ఉన్న కారణంగా, మగవారిలో లిబిడోను మెరుగుపరిచే సామర్థ్యం అల్లానికి ఉంటుంది.
ఇది మంచి సెక్స్ డ్రైవ్ కు దారితీసే లైంగిక శక్తిని మరియు పురుషుల టెస్టోస్టెరోన్ స్థాయిలను పెంచుతుందని అధరాలు ఉన్నాయి. ఇది వీర్య పరిమాణం మరియు ఎజెక్షన్లను పెంచుతుంది, మరియు వీర్య కణాల సంఖ్య మరియు వీర్య కణాల చలనాన్ని కూడా పెంచుతుంది. కాబట్టి,లైంగిక శక్తిని పెంచుకోవడానికి ఆహారంలో అల్లం చేర్చవచ్చు.
దానిని అల్లం టీ, అల్లం నీరు రూపంలో తీసుకోవచ్చు లేదా ఆహారంలో ఉపయోగించవచ్చు.
మహిళల్లో యోని భాగపు నొప్పిని తగ్గించడం - Reducing vulvar pain in women
కొంతమంది మహిళలు లైంగిక సంభోగ సమయంలో డిస్స్పారెనియా లేదా సంభోగ సమయ నొప్పిని ఎదుర్కొంటారు, ఇది సాధారణంగా వారి సెక్స్ డ్రైవ్ను తగ్గిస్తుంది, శృంగారాన్ని ఒక బాధాకరమైన అనుభవంగా చేస్తుంది. దీనికి చికిత్స చేసే ముందు సమస్యను గుర్తించడం, అంటే అది మానసికపరమైనదా లేదా ఏదైనా రుగ్మత సంబంధితమైనదా అని అసలు కారణాన్ని తెలుసుకోవడం అవసరం.
సాధారణంగా, సెక్స్ తర్వాత వేడి నీటి స్నానం చేయడం మరియు సెక్స్ సమయంలో లూబ్రికెంట్ను వినియోగించడం వంటివి నొప్పిని తగ్గించగలవు. ఒక మూలికా పరిష్కారం వాలె అల్లం సారాన్ని కూడా ఇవ్వవచ్చు, ఇది నొప్పిని తగ్గిస్తుంది. అదనంగా, అల్లం ఒక సహజ కామోద్దీపనకారి మరియు దీర్ఘకాలిక ఉపయోగం వలన ఎటువంటి దుష్ప్రభావాలు కూడా ఉండవు.
మహిళల్లో యోని యొక్క పొడిదనాన్ని తగ్గించడం - Reducing vaginal dryness in women
యోని యొక్క పొడిదనం మహిళల్లో ఒక సాధారణ సమస్య, ఇది బాధాకరమైన శృంగారానికి కారణం కావచ్చు, మరియు వారి లిబిడోను కూడా తగ్గించవచ్చు. ఈ పొడిదనం అంతర్లీన ఇన్ఫెక్షన్ లేదా హార్మోన్ల వలన కావచ్చు. పొడిదనానికి గల కారణాన్ని గుర్తించడం మరియు చికిత్స చేయడానికి అవసరం, సెక్స్ సమయంలో యోని లూబ్రికెంట్లను మరియు వజైనల్ మాయిశ్చరైజర్లను ఉపయోగించడం దీనికి సహాయపడవచ్చు.
బిడ్డ జననం మహిళల్లో లిబిడోను తగ్గిస్తుంది - Childbirth causes reduced libido in women
ప్రసవం తర్వాత మహిళలు, ప్రత్యేకించి చనుబాలు ఇచ్చే సమయంలో, అదనపు బాధ్యతలతో, అలసట కలగడం వలన లైంగికవాంఛ తగ్గిపోయే సమస్యను ఎదుర్కొంటారు. ఇది కాకుండా, ఈ దశలో తరచుగా మహిళలు సెక్స్ కు వెనుకాడుతారు మరియు లైంగిక ప్రేరణల వలన రొమ్ములలో నొప్పి కూడా అనుభవించవచ్చు. కాబట్టి, ఈ సమయంలో భాగస్వామి పట్ల అత్యంత సున్నితముగా మరియు జాగ్రత్తగా ఉండడం ముఖ్యం. సెక్స్ సమయంలో, ముఖ్యంగా ఛాతీ తాకినప్పుడు సున్నితముగా వ్యవహరించాలని సూచించబడుతుంది.
లైంగికవాంఛను పెంచడానికి గృహ చిట్కాలు - Home remedies to increase libido
ముందుగా చర్చించినట్లుగా, అనేక కారణాల వలన పురుషులు మరియు మహిళలు ఇద్దరూ తక్కువ లైంగికవాంఛను అనుభవిస్తుంటారు. ఇది మీ శృంగార జీవితం మరియు మీ భాగస్వామి పై కూడా గణనీయమైన ప్రభావం చూపుతుంది. పైన పేర్కొన్న సహజ కామోద్దీపనలు మరియు ఆహారాలు లైంగికవాంఛను పెంచడంలో పాత్రను కలిగి ఉన్నప్పటికీ, సెక్స్ డ్రైవ్లో కావలసిన ప్రభావాలను త్వరగా సాధించడానికి కేవలం వాటి వినియోగం మాత్రమే సరిపోదు. అందువల్ల, మేము కొన్ని లైంగికవాంఛను పెంచే మరియు ఆయుర్వేదం మరియు మూలికా శాస్త్రంలో పరీక్షించబడిన కొన్ని చిట్కాల మరియు మూలికల జాబితాను తయారు చేశాము. లైంగికవాంఛను పెంచే చర్యలో ఇవి నిర్దిష్టంగా ఉండడం వలన, ఈ చిట్కాల ఉపయోగం సెక్స్ డ్రైవ్ కోసం మంచి ఫలితాలను అందిస్తుంది.
లైంగికవాంఛ కోసం మెంతులు - Fenugreek for libido
మెంతులు అనేవి భారతీయ ఆహార విధానంలో ఒక సాధారణ పదార్ధంగా చెప్పవచ్చు, దాని మెంతివిత్తనాలు/మెంతులను మరియు మెంతికూర/ఆకులను వంట కోసం ఉపయోగిస్తారు. ఇది ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. ఇటీవలి అధ్యయనం ప్రకారం, ఈ మూలికను ఇవ్వడం వలన మగవారిలో లిబిడో 28% మేర పెరిగిందని తెలిసింది. మెంతులలో ఉండే 'సెపోని న్స్' దానికి కారణం అని చెప్పవచ్చు, ఎందుకంటే అవి లైంగిక హార్మోన్ల ఉత్పత్తిని, ముఖ్యంగా టెస్టోస్టెరాన్ ఉత్పత్తిని మెరుగుపరుస్తాయి.
మీకు దాని రుచి ఇబ్బంది కలిగిస్తే, ఆహారంలో దానిని నేరుగా చేర్చడం బదులుగా, మెంతులను సప్లిమెంట్ల రూపం తీసుకోవచ్చు. టెస్టోఫెన్ (Testofen) సప్లిమెంట్ యొక్క ప్రభావాన్ని అంచనా వేయడానికి నిర్వహించిన అధ్యయనంలో, అది మగవారి సెక్స్ డ్రైవ్ మీద సానుకూల ప్రభావాన్ని చూపిందని తెలిసింది. ఇది టెస్టోస్టెరాన్ యొక్క సాధారణ స్థాయిలను నిర్వహించడానికి సహాయపడుతుంది, తద్వారా లిబిడోను నిర్వహిస్తుంది.
మెంతులుస్త్రీలకు కూడా సమానంగా ఉపయోగపడతాయి. ఇవి రొమ్ము పరిమాణాన్ని పెంచుతాయి మరియు రొమ్ము కణజాలం యొక్క ఆరోగ్యాన్ని నిర్వహిస్తాయి, ఇది స్త్రీ యొక్క లైంగిక ప్రేరేపణలో పాత్ర కలిగి ఉండవచ్చు.
మాకా లైంగికవాంఛ పెంచుతుంది - Maca increases libido
పెరూ లో స్థానికంగా ఉండే, మాకా సప్లీమెంట్లుగా మరియు పౌడర్ గా అందుబాటులో ఉంటుంది దానిని మిల్క్ షేక్లు మరియు స్మూతీలలో సులభంగా కలుపుకుని తినవచ్చు. ఇది పరంపరంగా లైంగిక శక్తిని పెంచే మూలిక వలె ఉపయోగించబడుతుంది మరియు సంతానోత్పత్తి రుగ్మతల చికిత్సకు సప్లీమెంట్గా ఉపయోగించబడుతుంది. ఒక సంతానోత్పత్తి కారకంగా మరియు లైంగిక కోరికను పెంచే ముందుగా ఉండటంతో పాటు, మకా పురుషులలో వీర్యకణాల ఉత్పత్తిని పెంచుతుందని కూడా ప్రసిద్ది చెందింది.
అశ్వఘాంధ లైంగిక కోరికను మెరుగుపరుస్తుంది - Ashwagandha improves libido
అశ్వఘాంధ అనేది భారతదేశంలో సాధారణంగా దాని యొక్క ప్రయోజనాలకు ఉపయోగించే ఒక ప్రధాన మూలిక, దాని ప్రయోజనాలలో ప్రధానమైనది లైంగిక జీవితాన్ని మెరుగుపరచడం. అశ్వఘాంధ మగవారు, ఆడవారు ఇద్దరిలో హార్మోన్లను సమతుల్యం చేయగల సామర్ధ్యం కలిగి ఉంటుంది. ఇది లైంగిక కోరిక, లిబిడో, లైంగిక పనితీరు మరియు ఆనందం పొందడం వంటి వాటిని కూడా నిర్వహిస్తుంది. అశ్వఘాంధరక్తంలో లైంగిక హార్మోన్ల స్థాయిలను పెంచడం మరియు వాటిని సమతుల్యం చేయడం ద్వారా లైంగిక ప్రయోజనాలను కలిగిస్తుంది.
పురుషులలో, లైంగిక శక్తిని పెంచుటకు ఇది ఉపయోగించబడుతుంది, ఇది వారికి దీర్ఘకాలం పాటు సహాయపడుతుంది. వీర్యం యొక్క నాణ్యత మరియు పరిమాణాన్ని నిర్వహించడంలో కూడా అశ్వఘాంధ మంచి పాత్రను కలిగి ఉంటుంది మరియు దీనిని పురుషుల్లో నపుంసకత్వానికి చికిత్స చేయడానికి ఉపయోగిస్తారు.
అశ్వగంధ సారం తీసుకోవడం వలన ఆడవారిలో లైంగిక పనితీరు మెరుగుపడుతుంది, ఇది వారి లైంగిక వాంఛను మెరుగుపరచడంలో సహాయపడవచ్చు.
అశ్వగంధ పొడి రూపంలో లభ్యమవుతుంది, అలాగే ఆయుర్వేద వైద్యుడి పర్యవేక్షణలో దాని యొక్క తాజా వేర్లను కూడా ఉపయోగించవచ్చు.
మెరుగైన లైంగికవాంఛ కోసం కాటువాబా బెరడు
భారతీయ పురుషులలో లైంగిక వాంఛను మెరుగుపర్చడానికి మరియు లైంగిక ప్రేరేపణను పెంచడానికి కాటువాబా బాగా ప్రసిద్ధి చెందినది. ఇది ఒక ప్రేరణ ప్రభావాన్ని కలిగి ఉంటుంది, అది లైంగిక కోరికలను మెరుగుపర్చడానికి సహాయపడుతుంది. ఇది జననేంద్రియ అవయవాలకు రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది, తద్వారా అంగస్తంభన యొక్క వ్యవధిని పెంచుతుంది మరియు పురుషులలో మెరుగైన లైంగిక ఉత్సాహాన్ని మరియు భావప్రాప్తిని కలిగిస్తుంది. కాటువాబాను నేరుగా చెట్టు బెరడు నుంచి సేకరించవచ్చు, వైద్యుడిని ఒకసారి సంప్రదించిన తరువాత దానిని సప్లిమెంట్ గా ఉపయోగించవచ్చు.
పెద్ద వయసువారిలో యార్సా గుంబా లైంగికవాంఛను మెరుగుపరుస్తుంది
పురుషుల లైంగిక ప్రేరేపణలో దీనికి కొనియాడదగ్గ ప్రయోజనాలు ఉండడం వల్ల యార్సా గుంబా (Cordyceps) ను 'హిమాలయన్ వయాగ్రా' గా కూడా పిలుస్తారు. ఇది పర్వత ప్రాంతాలలో పెరిగే ఒక ఫంగస్ జాతి. పెద్దవయసు వారిలో లైంగిక ఆసక్తిని మరియు పనితీరును మెరుగుపర్చడానికి ఇది సహాయపడుతుంది, అలాగే వయసుతో పాటు వారి సంతానోత్పత్తి తగ్గుతుంది దీనిని సరిచేయడంలో కూడా యార్సా గుంబా ఉపయోగపడుతుంది.
టెస్టోస్టెరోన్ ఉత్పత్తిని పెంచడం ద్వారా, ఇది వీర్యకణాల నాణ్యతను మరియు వాటి చలనము మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుంది. అందువల్ల ఇది లైంగిక ఆసక్తి-సంబంధిత సమస్యలకు భారతదేశంలో ఒక ప్రసిద్ధ గృహ చిట్కాగా ఉపయోగించబడుతుంది.
యార్సా గుంబాను జానపద ఔషధంలో ఉపయోగిస్తారు మరియు లైంగిక కోరికలు కోసం భారతదేశంలో ప్రాచీన కాలం వారు కూడా దీనినిఉపయోగించారు.
మెరుగైన ఫలితాల కోసం స్త్రీ పురుషులిద్దరూ ఒక గ్లాసు పాలులో యార్సా గుంబా సారాన్ని తీసుకోవచ్చని సిఫారసు చేయబడింది. ఇది లైంగిక శక్తి మరియు కోరికలను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
పురుషులు మరియు మహిళలలో లైంగిక వాంఛను పెంచడానికి చిట్కాలు
ఆధునిక జీవితాలలో ఒత్తిడి కారణంగా కుంగుబాటు మరియు ఆందోళన సాధారణ రుగ్మతులుగా మారాయి. ఇవి లైంగిక కోరిక పై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి మరియు లిబిడోను తగ్గించడానికి దారితీయవచ్చు, ఇది పురుషులు మరియు స్త్రీలు ఇద్దరిలోను సంభవించవచ్చు. కుంగుబాటు కారణంగా ఒత్తిడితో ముడిపడి ఉండే డిహెచ్ఇఏ (DHEA, లైంగిక కోరికను ప్రభావితం చేసే హార్మోన్) స్థాయిలు తగ్గిపోతాయి అది లిబిడో తగ్గిపోవడానికి కారణమవుతుంది.
డిహెచ్ఇఏ స్థాయిలు వయసు పెరగడంతో పాటు కూడా తగ్గిపోతాయి, సాధారణంగా ఇదే పెద్ద వయసు వారిలో సెక్స్ డ్రైవ్కు తగ్గిపోవడానికి బాధ్యత వహిస్తుంది. తమని తాము తక్కువగా అంచనా వేసుకోవడం మరియు ఆత్మ విశ్వాసం తక్కువగా ఉండడం కూడా లిబిడోను ప్రభావితం చేసే సాధారణ సమస్యలు. ఈ విభాగం వాటిని నిర్వహించడానికి కొన్ని చిట్కాలను అందిస్తుంది.
లైంగికవాంఛను మెరుగుపర్చడానికి ధ్యానం
ధ్యానం ఒత్తిడిని తగ్గించడానికి మరియు మనస్సును శాంతపరచడానికి సహాయం చేస్తుంది. ముఖ్యంగా మహిళల్లో, తక్కువ లైంగికవాంఛను నిర్వహించడంలో మైండ్ ఫుల్ నెస్ - ఏంహాన్సమెంట్ టెక్నిక్స్ (mindfulness-enhancement techniques) సహాయపడతాయని పరిశోధకులు గుర్తించారు.
ధ్యానం కొంతమంది మహిళలలో శృంగారానికి సంబంధించిన మానసిక బాధను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది, ఇది వారి లిబిడోను మెరుగుపర్చడంలో సహాయపడవచ్చు. ఇది కాకుండా, ధ్యానం మంచి ఆత్మ విశ్వాసాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది, ఇది వ్యక్తి యొక్క సెక్స్ డ్రైవ్ పై లాభదాయకమైన ప్రభావాలను కలిగి ఉంటుంది.
ధ్యానం ద్వారా విడుదలయ్యే ఎండోర్ఫిన్స్ విడుదల లేదా 'హ్యాపీ హార్మోన్లు' కూడా సహాయపడతాయి.
మెరుగైన సెక్స్ డ్రైవ్ గురించి యోగా సాధన చేస్తున్నప్పుడు, రిలాక్సేషన్ (ఉపశమనం) కోసం శ్వాస వ్యాయామాలు మరియు ఇమాజినేటివ్ వ్యాయామాలు అంటే సంచలనాలను మరియు స్పర్శలను ఊహించడం వంటివి సిఫారసు చేయబడతాయి.
లైంగికవాంఛను మెరుగుపర్చడానికి మానసిక చికిత్స - Psychotherapy to improve libido
భావోద్వేగ మరియు ప్రవర్తనా క్రమరాహిత్యాలను చికిత్స చేయడానికి ఉపయోగించే ఔషధరహిత పద్ధతి అయిన మానసిక చికిత్సనే, తరచూగా లైంగిక వాంఛ రుగ్మతలకు కూడా చికిత్సగా ఉపయోగిస్తారు. మానసిక చికిత్స (సైకోథెరపీ) వ్యక్తికి తక్కువ లైంగిక వాంఛ యొక్క ఖచ్చితమైన కారణాన్ని గుర్తించడంలో సహాయం చేస్తుంది, తద్వారా దానికి చికిత్స చేయవచ్చు.
లైంగిక వాంఛను మెరుగుపర్చడానికి బరువు తగ్గుదల
బరువు మరియు బిఎంఐ (BMI)లో పెరుగుదల శరీరం యొక్క హార్మోన్ల సమతుల్యతకు ఆటంకం కలిగిస్తుంది, ఇది సెక్స్ హార్మోన్లు ప్రభావితం చేయవచ్చు. దీనిని నిరోధించడానికి, ఆరోగ్యకరమైన ఆహార విధానం మరియు జీవనశైలిని అనుసరించవచ్చు. ఇది లైంగిక హార్మోన్ల సాధారణ స్థాయిలకు సహాయపడుతుంది మరియు లిబిడోపై ప్రభావం చూపుతుంది.
ఇంకోరకంగా ఇది మీ ఆత్మ విశ్వాసాన్ని పెంపొందించడం ద్వారా మీ భాగస్వామితో మెరుగైన లైంగిక జీవితానికి సహాయపడే మరో మార్గం.
వీర్యకణాలని పెంపొందించుకోవడం ఎలా
మగవారిలో వీర్యకణాల లెక్క బాగా తక్కువగా ఉంటే, సంతానం కలగటం కష్టం అవ్వవచ్చు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (World Health Organization) ప్రకారం వీర్యకణాల లెక్క (sperm count) ఒక మిల్లి లీటర్ కి 15 మిలియన్లు (15 million per milliliter) ఉంటే, మంచి ఆరోగ్యాంగా ఉన్నట్టే. అంతకంటే తక్కువగా వుంటే, సమస్యలు తలెత్తవచ్ఛు (1).
వీర్యం ఎక్కువగా ఉన్నా, పనికివచ్చే కణాలు, చురుకైన కణాలు లేకపోతే కూడా సంతానోత్పత్తి లో సమస్యలు కలుగవచ్చు. మీరు వీర్యకణాల పరీక్ష చేయించుకుని, అందులో కౌంట్ కానీ నాణ్యత కానీ తక్కువ అని వస్తే గనుక, మీ వైద్యులు మీకు చికిత్స మొదలు పెడతారు. ఆ చికిత్సతో పాటుగా మీరు తీసుకునే ఆహరం మీద కూడా ధ్యాస పెడితే ఫలితం త్వరగా వచ్చే అవకాశం ఉంటుంది.
మగవారి వీర్యకణవృద్ధి కోసం సహజమైన ఆహార చిట్కాలని ఇక్కడ మామ్ జంక్షన్ వివరిస్తోంది.
మగవారి విషయంలో వీర్యకణాలు పెంచే మంచి పుష్టికరమైన, ఆరోగ్యకరమైన ఆహారం గురించి తెలుసుకుందాం.
1. టోమాటోలు
2. వాల్నట్స్ (అక్రోటు కాయ)
ఒమేగా 3, కొవ్వుతో కూడిన యాసిడ్స్ ఆక్రోట్ లో వున్నాయి. ఈ విషయంపై స్టడీ చేసిన వైజ్ఞానికులు ప్రతిరోజూ 70 గ్రాములు ఆక్రోట్ ఆహారంలో వుంటే వీర్యాన్ని బలంగా తయారుచెయ్యటంలో సహకరిస్తుంది అని కనుక్కున్నారు. 21 – 35 మధ్య వయసువాళ్ళు సలాడ్స్ లో పైన టాపింగ్ గా వీటిని వాడుకోవచ్చు. లేదా చిరుతిండి గా ఆక్రోట్ ని తినవచ్చు.
స్పెర్ం కౌంట్ కి కావాల్సిన అమినో ఆసిడ్, ఫైటో స్టిరాల్స్ (phytosterols) గుమ్మడి గింజల్లో బాగా ఉన్నాయి. వీర్యం మోతాదు పెంచడానికి, వీర్య కణం నాణ్యతని పెంచడానికి ఇవి బాగా సహకరిస్తాయి (3). రోజూ వీటిని సలాడ్స్ మీద కానీ, ఉట్టిగా కానీ, పప్పుధాన్యాలతోనో తింటే మంచిది.
పప్పు దినుసుల్లో, బఠానీల్లో ఫోలిక్ ఆసిడ్ ఉంటుంది. అది వీర్య ఉత్పత్తికి, వీర్య వృద్ధికి, నాణ్యతకి ఉపయోగకరం (4). కాబట్టి వీటిని ప్రతిరోజు ఆహారంలో చేర్చుకోవాలి. అప్పుడు స్పెర్మ కౌంట్ ఆరోగ్యాంగా ఉండే అవకాశం ఉంటుంది.
5. బెర్రీస్
బ్ల్యూ బెర్రీస్, స్ట్రా బెర్రీస్, బ్లాక్ బెర్రీస్, ఇలా ఎన్ని రకాల రేగిపళ్ళు దొరుకుతాయో, అవన్నీమంచివే. శక్తివంతమైన యాంటీ-ఆక్సిడెంట్స్, ఆంటీ-ఇంప్లమాటరీ (anti-inflammatory) లక్షణాలు స్పెర్ము కౌంట్ని పెంచవచ్చు (5) (6). రోజుకో గుప్పెడు బెర్రీలు పెరుగులోనో, ఉట్టిగానో తింటే, రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.
6. దానిమ్మ పళ్ళు
దానిమ్మలో యాంటీ- ఆక్సిడెంట్స్ సంవృద్ధిగా ఉన్నాయి. టెస్టోస్టెరోన్ (మొగవారి సెక్స్ హార్మోన్) లెవెల్ పెంచి, స్పెర్మ్ ఆరోగ్యకరంగా తయారవడానికి, పురుషుల్లో సెక్స్ వాంఛని కలుగ చెయ్యడానికి దోహద పడుతుంది. ప్రయోగంగా ఎలుకలకి రోజూ ఇవి తినిపించి, 8 వారాలు పైగా పరీక్షించగా, దానిలోని వీర్య కణాల వృద్ధి స్పష్టంగా కనపడింది (7) (8).
7. డార్క్ చాక్లెట్
డార్క్ చాక్లెట్ లో అధికంగా ఎమినో ఆసిడ్ ల-ఆర్జినిన్ (amino acid L-arginine) ఉండటం వల్లన వీర్య కణాలు బాగా పెరుగుతాయి అని అంటారు. రోజుకో చిన్న ముక్క తింటేమంచిది (9).
8. వెల్లుల్లి
వెల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదని అంటారు పెద్దలు. వెల్లుల్లి లో ఎల్లిసిన్ (allicin) అనే పదార్ధంలో రక్త ప్రసరణని చురుకుగా చేయగల సత్తా ఉంది. రక్త ప్రసరణ బాగా ఉండటం వలన సంతానోత్పత్తి అంగాలలో ప్రక్రియలు బాగా జరిగి, వీర్యం ఎంతో ఆరోగ్యంగా తయారౌతుంది. వెల్లుల్లి లో సెలీనియం (selenium) ఉండటం, వలన వీర్య కణాల కదలికలు కూడా చురుకుగా ఉండే అవకాశం ఉంది (10).
9. కోడి గుడ్లు
గుడ్ల లో సంవృద్ధిగా ప్రోటీన్, విటమిన్ E ఉంటాయి. వీర్యకణాల నిర్మాణం, వాటి పెరుగుదల, నాణ్యతలని రక్షించడానికి అవి చాలా అవసరం (11).
10. క్యారెట్లు
క్యారెట్లలో బీటా-కారొటిన్ (beta-carotene) ఉంటుంది. అది బలమైన యాంటీ-ఆక్సిడెంట్, అరోగ్యకరమైన స్పెర్మ్ తయారవటానికి ఉపయోగ పడుతుంది. వీర్యకణాల కదలికలు, రూపం,మోతాదు పరిరక్షిస్తుంది. దానివల్ల వీర్యకణాలు అండం వద్దకు వెళ్లే వేగము కూడా పెరుగుతుంది (12).
11. అశ్వగంధ
అశ్వగంధ వేరు పురాతనంగా ఆయుర్వేద వైద్యంలో వాడేవారు. ఒక వైజ్ఞానిక ప్రయోగంలో, 6ju6 మంది మగవారిలో టెస్టోస్టెరోన్ (testosterone) లెవెల్ పెరిగి, దానితో స్పెర్మ్ కౌంట్ కూడా బాగా పెరిగింది. అంగస్తంభన సమస్యలకి కూడా సమాధానం దొరికింది. అశ్వగంధ వేరుతో టీ చేసుకుని తాగావచ్చు (13).
12. ఆస్పరాగస్ (కాకపాలాకు) కూర
విటమిన్ బాగా ఎక్కువ శాతం వున్న ఈ ఆకుకూర వీర్య వృద్ధికి పని చేస్తుంది (14). వీర్య కణాలు పెరిగాయంటే, అండాన్ని చేరడానికి పరుగుతీసే వీర్యకణాలు ఎక్కువౌతాయి. తద్వారా గర్భధారణ ఛాన్సులు పెరుగుతాయి.
13. అరటిపళ్ళు
అరటిపళ్ళల్లో బ్రోమిలీన్ అనే ఎంజెయిమ్ సెక్స్ హార్మోన్లని పెంచుతుంది. అంతే కాక, విటమిన్ A, B1, C మగవారిలో వీర్య వృద్ధికి, వీర్య శక్తి కి బలం చేకూరుస్తాయి.
14. పచ్చని ఆకు కూరలు
పచ్చని ఆకు కూరలలో ఫోలిక్ ఏసిడ్ బాగా ఉంటుంది. ఫోలిక్ యాసిడ్ మగవారి శరీరం లో ఆరోగ్యకరమైన వీర్యం తయారవడానికి దోహద పడుతుంది. ఒక స్టడీ ద్వారా తెలిసిన విషయం ఏమిటంటే, పాలకూర, బ్రోకలీ, పచ్చి బఠాణి, ముదురు పచ్చని ఆకుకూరలు రోజు తింటుంటే, మగవారిలో వీర్యకణాల సంఖ్య బాగా పెరుగుతుంది అని (15).
15. జింకు సంవృద్ధిగా ఉన్న పదార్ధాలు
జింకు ధాతువు స్పెర్మ్ కణాలను నాశనం కాకుండా రక్షించగలదు. జింక్ గల ఆహారం ప్రతి రోజు తీసుకోవటం మంచిది (16).
16. మెంతులు
అనాదిగా మగవారి వీర్య వృద్ధికి, అంగస్తంభనకు మెంతులు వాడేవారు. మెంతుల నుంచి తీసిన గాఢమైన పదార్ధాన్ని 12 వారాలు వాడితే, వీర్యం, వీర్యకణాల సంఖ్య బాగా పెరుగుతాయని ఒక స్టడీ తెలిపింది (17).
17. ఆలీవ్ నూనె
ప్రతిరోజు ఆలివ్ నూనె తాగితే, మగవారిలో వీర్యకణాలు, వీర్యానికి సంభందించిన రుగ్మతలు తగ్గుతాయి. చెడు కొలస్ట్రాల్ ని తగ్గిస్తుంది. ఆక్సిజెన్ రక్తంలో బాగా ప్రవహించేలా చేస్తుంది. రక్తప్రసరణ చక్కగా ఉన్నప్పుడు మగవారిలో వీర్య కణ నిర్మాణం, వీర్యం బాగా పెరుగుతాయి (18).
ఆహారంలో మార్పులే కాక, మరికొన్ని చిట్కాలు, సూచనలు పాటిస్తే, మగవారిలోని వీర్య సమస్య పరిష్కరించుకోవడంలో సహాయ పడుతుంది.
వీర్య కణాలను పెంచడంలో సహాయపడే జీవనశైలిలో మార్పులు
కింద సూచించిన మార్పులు మీ వీర్యకణాలకే కాదు శరీర ఆరోగ్యానికి కి కూడా మంచిది.
1. మంచి నిద్ర, వ్యాయామం
అతి బరువు, ఊబకాయం మగవారు తగ్గించుకుంటే, ఆరోగ్యకరమైన వీర్యం పెంపొందించుకోవచ్చు. వ్యాయామం చేసి ఒళ్ళు అలిస్తే, కంటినిండా నిద్ర పోతే, ఆరోగ్యానికి ఎంతో మంచిది.
2. ఒత్తిడిని తగ్గించుకోవాలి
ఒత్తిడి శరీరంలోని శక్తిని హరింపచేస్తుంది. మానసిక ఆందోళనలో ఉన్నప్పుడు సంతానోత్పత్తి విషయంపై, శరీరంపై ధ్యాస ఉండదు. వత్తిడి ఎందువల్ల కలుగుతుందో, ఆ విషయం ముందు పరిష్కరించుకోవాలి. మగవారిలో వత్తిడి కోసం కొన్నిసార్లు యాంటి డిప్రెస్సంట్ మందులు వాడమని డాక్టర్లు సలహా ఇస్తారు. కానీ ఎక్కువ రోజులు మందులు వాడటం స్పెర్మ్ కౌంట్ కి అంత మంచిది కాదు.
౩. పొగ త్రాగటం మానివేయాలి
పొగ తాగడం అలవాటున్న వారిలో క్రమంగా వీర్య కణాలు తగ్గుతాయి. వీర్య కణాల నాణ్యత కూడా తగ్గుతుంది.అందుకని పొగ తాగడానికి దూరంగా ఉండటం ఉత్తమం (21).
4. మత్తు పదార్ధాలు, తాగుడుకి దూరంగా ఉండాలి
మద్యం మరియు మత్తు పదార్థాలు వంటివి వాడటం వలన వీర్యకణాలు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది.
5. మందుల వాడకం వలన ఇబ్బంది
కొన్ని మందుల వాడకం వల్ల స్పెర్మ్ కౌంట్ తాత్కాలికంగా తగ్గుతుంది. ఈ మందుల్ని ఎక్కువ రోజులు వాడటం వల్ల మగవారిలో స్పెర్మ్ ఆకారము, ఉత్పత్తి పై చెడు ప్రభావం ఉంటుంది.
6. రోజువారీ ఆహారంలో విటమిన్ D, కాల్షియం
విటమిన్ D, కాల్షియం స్పెర్మ్ నాణ్యతను పెంచుతాయి. ఏ పదార్ధాలలో ఇవి బాగా ఉన్నాయో తెలుసుకుని రోజు అవి తినాలి లేదా విటమిన్, కాల్షియమ్ టాబ్లెట్స్ రూపం లో నైనా తీసుకుంటే మంచిది.
7. కాలుష్య వాతావరణం
రాను రాను మన చుట్టూ వాతావరణం కాలుష్య మయం అవుతోంది. గాలి, నీరు, అన్నీ కాలుష్య భరితమవుతున్నాయి. వీలైనంత వరకూ స్వచ్ఛమైన వాతావరణంలో ఉండే ప్రయత్నం చేస్తే మంచిది.
మీ వీర్య కణాలలో ఏ సమస్య లేనప్పుడు, ఆరోగ్య కరమైన ఆహారం మరియు జీవనశైలి తో మీ సంతానోత్పత్తి అవకాశాలని పెంచుకోగలరు. కానీ మెడికల్ పరీక్షలలో కనుక మీ కణాలు తక్కువగా ఉన్నాయి అని తేలితే, వైద్యులు చెప్పిన ప్రకారం చికిత్స పొందుతూ, పైన చెప్పిన ఆహారం తీసుకుంటే ఉపకరిస్తుంది.
ఒక గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటి అంటే, పైన చెప్పిన సలహాలు ఏవి వైద్యుల సలహాలను భర్తీ చెయ్యవు. ఇవి కేవలం మీ సమాచారం కొరకే.
మీ సలహాలు, అనుభవాలు కింద కామెంట్స్ సెక్షన్ లో తెలుపగలరు
1 కామెంట్:
Excellent information Nadiminti Naveen Garu....Best Wishes
కామెంట్‌ను పోస్ట్ చేయండి