16, జూన్ 2022, గురువారం

పీరియడ్స్ నొప్పి & మోనోపాజ్ సమస్య లు నివారణకు ఆయుర్వేదం లో నవీన్ నడిమింటి సలహాలు మన వైద్య నిలయం లో

Healthy period: పీరియడ్స్ టైంలో వీటిని తింటే నొప్పి వెంటనే తగ్గుతుంది..ఆయుర్వేదం లో నవీన్ నడిమింటి సలహాలు 

 పీరియడ్స్ సమయంలో తీవ్రమైన కడుపు నొప్పి, తలనొప్పి, వాంతులు, వికారం, అలసట, చికాకు వంటి ఎన్నో సమస్యలు ఎదురవుతుంటాయి. ఇలాంటి సమయంలో కొన్ని రకాల ఆహార  పదార్థాలను తినడం వల్ల ఈ సమస్యకు చెక్ పెట్టొచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. 
Healthy period: Eating these foods during periods will reduce the pain immediately

రుతుస్రావం (Menstruation) అనేది స్త్రీ శరీరంలో ఒక సహజ ప్రక్రియ. ఇక ఈ సమయంలో ఆడవారికి ఎన్నో సమస్యలు ఎదురవుతుంటాయి. ముఖ్యంగా పొత్తికడుపు నొప్పి, వాంతులు, మైకముతో బాధపడేవారు చాలా మంది ఉన్నారు.
 

Healthy period: Eating these foods during periods will reduce the pain immediately

ఈ నొప్పులు, ఇతర సమస్యలు బహిష్టు (Menstruation) అయిన వెంటనే లేదా రుతుస్రావం అయిన మొదటి రోజునే వస్తాయి.  అయితే కొన్ని రకాల ఆహారాలు ఈ సమస్యలను తగ్గించడానికి సహాయపడతాయని PCOs and Gut Health Nutritionist అవంతి దేశ్ పాండే చెబుతున్నారు. అవేంటే ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

Healthy period: Eating these foods during periods will reduce the pain immediately

కాల్షియం, మెగ్నీషియం, ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు మరియు ఇనుము అధికంగా ఉండే ఆహారాలు ఆరోగ్యకరమైన రుతుస్రావానికి సహాయపడతాయి. ఈ ఆహారాలు మానసిక స్థితి మెరుగుపరుస్తాయి. అలాగే నొప్పిని కూడా తగ్గిస్తాయి. హార్మోన్లు సమతుల్యతకు  కూడా సహాయపడతాయి. 

Healthy period: Eating these foods during periods will reduce the pain immediately

కాల్షియం అధికంగా ఉండే ఆహారాలు మానసిక స్థితిని, రుతుస్రావం నొప్పిని, పిఎంఎస్ లక్షణాలను తగ్గిస్తాయని నిపుణులు చెబుతున్నారు. కాల్షియం అధికంగా ఉండే ఆహారాలలో పాలు, పాల ఉత్పత్తులు (Dairy products) ముఖ్యంగా పెరుగు, చియా విత్తనాలు, ఆకుకూరలు, కాయధాన్యాలు ఎంతో ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయని నిపుణులు చెబుతున్నారు. బియ్యం, గోధుమలు, కాయధాన్యాలు వంటి తృణధాన్యాలు మరియు ఆకుకూరలు మాంగనీస్ ను ఎక్కువగా కలిగి ఉంటాయి.

Healthy period: Eating these foods during periods will reduce the pain immediately

మెగ్నీషియం అధికంగా ఉండే ఆహారాలు ప్రొజెస్టెరాన్ స్థాయిలను మెరుగుపరుస్తాయి. రుతువిరతి దశలో ఇది ఎంతో సహాయపడుతుంది. ఓట్స్, గోధుమలు, విత్తనాలు, బాదం, పెరుగు, చేపలు, బ్రోకలీ, క్యారెట్లు, అరటిపండ్లు, కివి, బొప్పాయి, జామ, ఎండిన అత్తి పండ్లు మరియు బెర్రీలు వంటి పండ్లలో మెగ్నీషియం అధికంగా ఉంటుంది. 

Healthy period: Eating these foods during periods will reduce the pain immediately

ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు పీరియడ్స్ నొప్పిని తగ్గించడానికి ఎంతో సహాయపడతాయి. సార్డినెస్, సాల్మన్ వంటి కొవ్వు చేపల్లో ఇది సమృద్ధిగా ఉంటుంది, అలాగే అవిసె గింజలు, గుమ్మడికాయ విత్తనాలు, పొద్దుతిరుగుడు విత్తనాలు, బాదం వంటి గింజల్లో  ఇది ఎక్కువగా ఉంటుంది. 

రాగి, వేరుశెనగ, బాదం, వాల్ నట్స్ వంటి వాటిలో ఇనుము అధికంగా ఉంటుంది. ఇవి కూడా నొప్పిని తగ్గిస్తాయి. పీరియడ్స్ సమయంలో స్వీట్స్ ను తినాలనకుకుంటే  ఐస్ క్రీములు లేదా ఇతర బేకరీ స్నాక్స్ మానేసి నువ్వులు, బెల్లం, డార్క్ చాక్లెట్ వంటివి తినొచ్చని నవీన్ రోయ్

Menopause: స్త్రీలలో మెనోపాజ్ దశలో కలిగే లక్షణాలు.. నివారణకు సహజమార్గాలు

    

Menopause: ప్రతి మహిళ జీవితచక్రంలో మెనోపాజ్ అనేది ఒక భాగం. ఈ దశలో స్త్రీలో అనేక ప్రతిచర్యలు చోటు చేసుకుంటాయి. అనేక మార్పులకు లోనవుతుంది..

Menopause: ప్రతి మహిళ జీవితచక్రంలో మెనోపాజ్ అనేది ఒక భాగం. ఈ దశలో స్త్రీలో అనేక ప్రతిచర్యలు చోటు చేసుకుంటాయి. అనేక మార్పులకు లోనవుతుంది. మోనోపాజ్ 40 సంవత్సరం చివరిలో లేదా 50 సంవత్సరాల ప్రారంభంలో మొదలవుతుంది. ఈ దశ కొంతమందిలో చాల ఏళ్ళు ఉంటుంది. రుతుక్రమం ఆగిన మహిళల్లో చాలామందికి ఊబకాయం, గుండె జబ్బులు , మధుమేహం వంటి అనేక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. అయితే మహిళల్లో మెనోపాజ్ సంకేతాల నుండి ఉపశమనం కలిగించే కొన్ని సహజ పద్ధతులను పాటిస్తే,.. చాలా వరకూ వ్యాధుల బారిన పడకుండా ఉండవచ్చు.

* ఎక్కువగా నీరు త్రాగాలి
రుతుక్రమం ఆగిన మహిళల్లో డ్రై నెస్ అనేది ఒక సాధారణ సమస్య. తగినంత నీరు త్రాగటం ద్వారా ఈ సమస్యను తగ్గించుకోవచ్చు. నీరు హార్మోన్ల మార్పుల వల్ల వచ్చే ఉబ్బరాన్ని తగ్గిస్తుంది. తరచుగా నీరు తాగడం వలన బరువు తగ్గుతుంది. జీవక్రియను వేగవంతం చేస్తుంది. అందుకని మోనోపాజ్ దశలో ఉన్న మహిళలు తప్పని సారిగా రోజుకు 8–12 గ్లాసుల నీరు తాగాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. భోజనానికి 30 నిమిషాల ముందు 500 మి.లీ నీరు త్రాగాలని సిఫారసు చేస్తున్నారు.


* ఆరోగ్యకరమైన ఆహారం

మెనోపాజ్ సమయంలో హార్మోన్ల మార్పులు అనేక రుగ్మతలను ప్రేరేపిస్తాయి. వీటిని మంది ఆహారం తీసుకోవడంతో నియంత్రించవచ్చు. ముఖ్యంగా ఈ సమయం లో ఎముకలను బలోపేతం చేయడానికి సహాయపడే విటమిన్-డి మరియు కాల్షియం అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోమని ఇస్తున్నారు.

*క్రమం తప్పకుండా వ్యాయామం

రుతుక్రమం ఆగిపోయిన మహిళలు వారానికి మూడు గంటలు వ్యాయామం చేయడం వల్ల శారీరక మరియు మానసిక ఆరోగ్యం మరియు మొత్తం జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని ఒక అధ్యయనంలో తెలిసింది. శరీర బరువు నియంత్రించడానికి, ఒత్తిడిని తగ్గించడానికి, జీవక్రియను మెరుగుపరచడానికి వ్యాయామం మోనోపాజ్ దశలోని మహిళలకు సహాయపడుతుంది. అదనంగా, యోగా మనోభావాలను నియంత్రించడంలో, శాంతిని పునరుద్ధరించడంలో సహాయపడుతుంది.

* ప్రాసెస్ చేసిన ఆహారం మరియు రిఫైన్డ్ చక్కెరను తగ్గించండి
ఋతుక్రమం ఆగిపోయిన మహిళల్లో డిప్రెషన్ ప్రమాదాన్ని పెంచుతుందని ఒక అధ్యయనం తేల్చింది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలో హెచ్చుతగ్గులకు కారణం కావచ్చు. అప్పుడు వారిలో వికారం, చికాకు కలుగుతాయి.

* భోజనం వదిలివేయవద్దు

మెనోపాజ్ యొక్క లక్షణాలను తగ్గించడానికి ఎవరైనా క్యూరేటెడ్ డైట్ ను అనుసరిస్తున్నప్పుడు మధ్యలో మానకూడదు. అయితే ఎక్కువగా డైట్ లో కాల్షియం , ప్రోటీన్ అధికంగా ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి.
ఈ సహజమైన పద్దతులను పాటిస్తూ.. ఇంకా ఏమైనా ఇబ్బందులు ఏర్పడితే.. వైద్యుడిని సంప్రదించి తద్వారా మోనోపాజ్ సమయంలో ఉత్పన్నమయ్యే ఇతర సమస్యలను తగ్గించుకోవచ్చు .