3, జనవరి 2024, బుధవారం

నీటి కాలుష్యం తో వచ్చినసాధారణ ఆరోగ్య సమస్య పై వైద్య నిలయం సలహాలు


నీటి కాలుష్యం వలన వచ్చే వ్యాధులు అవగాహనా కోసం నవీన్ నడిమింటి వైద్య నిలయం సలహాలు 


కాలుష్య పదార్ధాలు

కాలుష్య కారకం

దుష్ప్ర భావాలు

మానవ మరియు జంతు సంబంధ వ్యర్ధాలు

అంటురోగాన్ని కలిగించే సూక్ష్మజీవులు,కీటకాలు

కలరా, హెపటైటిస్, గ్యాస్ట్రో ఎంటెరైటిస్ లాంటి వ్యాధులు వస్తాయి

మురికినీరు,పశువుల దాణా మొదలైనవి

సేంద్రీయ వ్యర్ధాలు

నీటిని విచ్చిన్నం చేసే బాక్టీరియా నీటిలోని ఆమ్లజనిని తగ్గించడం వలన, నీటిలో కరిగి ఉన్న ఆమ్లజనిపై ఆధారపడి జీవిస్తున్న జలచరాలు మరణిస్తాయి

పారిశ్రామిక మరియు గృహవ్యర్ధాలు, రసాయనాలు

అకర్బన రసాయనాలు

నీరు త్రాగడానికి,వ్యవసాయానికి అయోగ్యమౌతుంది

చర్మకాన్సర్,కీళ్ళనొప్పులు వంటి వ్యాధులను కలుగజేయటమే కాకుండా నాడీ వ్యవస్థ, కాలేయం,మూత్రపిండాలకు కూడా హాని కలిగిస్తుంది.

జలచరాలకు హాని కలిగిస్తుంది. పంట దిగుబడి తగ్గిపోతుంది. ఈ నీటిని నిలువ ఉంచిన లోహ పాత్రలు తొందరగా తుప్పు పడతాయి.

పారిశ్రామిక మరియు గృహాల శుద్ధికి ఉపయోగించే పదార్ధాలు

కర్బన రసాయనాలు

నాడీ వ్యవస్థకు,పునరుత్పత్తి వ్యవస్థలకు నష్టం కలిగిస్తుంది.

కొన్ని రకాల కాన్సర్లకు కూడా కారణం

మురికినీరు,పంట పొలాల నుండి వచ్చిన నీరు,ఎరువులు

ఎరువులు

ఎక్కువ పరిమాణంలో నత్రజని ఉన్న నీటిని త్రాగడం వలన రక్తం ఆక్సీజన్ తీసుకొని పోయే సామార్ధ్యాన్ని తగ్గిపోతుంది. కొన్ని సమయాల్లో శిశువులు, మరణించడానికి కూడా కారణమౌతుంది

నేల క్షారం

అవశేషాలు

నీరు మడ్డిగా అవుతుంది కిరణజన్యసంయోగక్రియ వేగాన్ని తగ్గిస్తుంది

చేపలకు ఆహారం మరియు గుడ్లు పెట్టె స్థలాన్ని తగ్గించి వేస్తుంది

అణు ఉత్పత్తి కేంద్రాల పదార్ధాలు

రేడియో ధార్మిక పదార్ధాలు

పుట్టుకతోనే శిశువులు కొన్ని లోపాలతో పుడతారు.కొన్ని రకాలైన కాన్సర్లను జన్యు ఉత్పరివర్తన,కలుగజేస్తుంది

పరిశ్రమలలోని శీతలీకరణ గిడ్డంగుల నుండి వచ్చే నీరు

ధర్మల్ కాలుష్యం

నీటిలోని ఆక్సీజన్ స్థాయిని తగ్గిస్తుంది.ఇది జలచరాల వ్యాధి నిరోధకతను తగ్గిస్తుంది.

కలుషిత నీటి వలన వచ్చే వ్యాధులు-చికిత్స

కలరా

కలుషిత నీరు, ఆహారం ద్వారా విబ్రియో కలరా బాక్టీరియా చిన్న ప్రేగుకు సోకడం వలన వచ్చే తీవ్రమైన అతిసార వ్యాధినే కలరా అని అంటారు.

  • నీళ్ళ విరోచనాలు అధికంగా కావడం
  • వాంతులు అవడం
  • కాళ్ళ కండరాలు/తిమ్మిరెక్కడం

ఈ వ్యాధి సోకిన వ్యక్తి యొక్క మల విసర్జితంతో నీరు,ఆహార పదార్ధాలు కలుషితం కావడం వలన ఒకే చోట నివసించే వారందరికీ సామాన్యంగా కలరా వస్తుంది

అతిసారం వలన కోల్పోయిన ద్రవాలను,లవణాలను తిరిగి రోగి శరీరానికి అందించటం ద్వారా ఈ వ్యాధి తీవ్రతను తగ్గించవచ్చు.నీటిలో చక్కర మరియు ఉప్పును చేర్చి మిశ్రమాన్ని తయారు చేసి రోగికి త్రాగించాలి.

తీసుకోవలసిన జాగ్రత్తలు

  • శారీరకంగా లేదా మానసికంగా అలసట చెందకుండా చూసుకోవాలి.
  • మంచి నీటి సీసా,పాత్ర లేదా నీరు త్రాగే గ్లాసులను వేడి నీటిలో వేసి శుభ్రం చేయాలి.
  • పండ్లను తీసుకొనేటప్పుడు వాటిని బాగా కడగాలి.పండ్లపై తొక్కలను తీసివేయాలి.
  • వేడిగా ఉన్నప్పుడు ఆహారం భుజించడం సరైన పద్ధతి
  • గిన్నెలు, గ్లాసులు ,తినడానికి ఉపయోగించే ముందు వేడి నీటితో కడగాలి.
  • భోజనానికి ముందు చేతులను కాచిన నీటితో శుభ్రం చేసుకోవాలి .
  • వీలైతే ప్రతీసారి శుభ్రంగా ఉతికిన తువ్వాలనే వాడాలి.
  • కడగడానికి వినియోగించే నీటిని మరిగే ఉష్ణోగ్రత వద్దకు వచ్చేటంత వరకు ఉంచి తర్వాత చల్లబరచాలి .
  • బట్టలను మరిగే నీటిలో వేయాలి.మరల వాడ వలసినప్పుడు బాగా ఉతికి డెట్టాల్ లో జాడించి, బాగా ఎండిన తరవాతే వాడాలి .
  • వాడిన ప్రతీసారి తినే పళ్లాలను శుభ్రపరచాలి .
  • కలరా రోగస్థులను ఉంచిన గదులను వ్యాధి తగ్గేవరకు వేరుగా వుంచడం వలన ఈ వ్యాధి ఇతరులకు సంక్ర మించకుండా నిరోధించవచ్చు

డయేరియా

ఒకటి -రెండు గంటల వ్యవధిలోనే పలుసార్లు నీళ్ళవిరేచనాలు కావటాన్నే డయేరియా అంటారు. మలంలో రక్తం పడటం, తరుచు వాంతులు చేయటం. తీవ్రమైన దాహం కలగటం, త్రాగబుద్ధి కాకపోవటం, తినడానికి మనస్కరింకపోవటం, కళ్ళు పిక్కుపోవటం నీరసంగా లేదా బద్దకంగా ఉండటం, ఒక వారం కన్నా ఎక్కువ రోజులు డయేరియా ఉండటం మొదలైన వాటిలో ఏ ఒక్క లక్షణం కనిపించిన సత్వరమే వైద్యుణ్ణి సంప్రదించాలి.
ఈ లోపు ఓ.ఆర్.ఎస్ ద్రవాన్ని గాని లేదా ఇతర పానీయాలను గాని ఇవ్వాలి.


కలరా లేదా డయేరియా వ్యాధి విరణకు అడ్డుకట్టు వేయటానికి

  • బహిరంగ ప్రాంతాలలో మలవిసర్జన చేయకుండా మరుగు దొడ్లు వాడాలి.
  • మలవిసర్జన తర్వాత మరియు మలాన్ని తాకిన తర్వాత ప్రతి సారి చేతులను సబ్బు నీటితో బాగా కడగాలి.
  • శిశువుకు తల్లి పాలు మాత్రమే ఇస్తున్నట్లైతే డయేరియా తీవ్రతను తగ్గించవచ్చు. పదే పదే రాకుండా కూడా చూడొచ్చు. డయేరియాకు గురైన శిశువుకు తల్లి పాలు అతి చక్కని ఆహారం
  • ఎ విటమిన్ కలిగిన ఆహారపదార్ధాలు పిల్లలు నుంచి కోలుకోవటానికి సహాయపడతాయి. తల్లి పాలు, చేపలు, పాల ఉత్పత్తులు, పసుపురంగు పండ్లు, కూరగాయలు మరియు ఆకుకూరలలో ఎ విటమిన్ ఉంటుంది.
  • ఆరోగ్య కార్యకర్త సూచన ప్రకారం యాంటి బయోటిక్స్ ఇతర మందులు గాని పిల్లలకి ఇవ్వాలి.
  • ఒకవేళ ఓ. ఆర్.ఎస్ పాకెట్లు అందుబాటులో లేకపోతే, స్పూన్ల చక్కర, సగం టీ స్పూను ఉప్పును ఒక లీటరు పరిశుభ్రమైన నీటిలో కలిపి డిహైడ్రేషన్ కు చికిత్సగా ఇవ్వవచ్చు.
  • ఈ పాకెట్లు ఆరోగ్య కేంద్రాలలో, షాపులలో లభిస్తాయి. రెండేళ్ళ లోపు వయస్సు పిల్లలు పెద్ద సైజు గ్లాసుల్లో పావు నుంచి అర గ్లాసు ఓ. ఆర్.ఎస్ ద్రవాన్ని ప్రతి నీళ్ళ విరేచనం తర్వాత తాగాలి.
  • రెండేళ్ళ పైన వయస్సు ఉన్న పిల్లలు నీళ్ళ విరేచనం చేసిన ప్రతిసారి అర గ్లాసు నుంచి పూర్తి గ్లాసు నిండా ఓ.ఆర్.ఎస్ ద్రవాన్ని త్రాగాలి.

పచ్చ కామెర్లు

నీరు, ఆహారం కలుషితం అవటం వలన వచ్చే మరొక ప్రాణాంతక వ్యాధి పచ్చ కామెర్లు, దీనిని జాండిస్ అని కూడా వ్యవహరిస్తారు. నిరంతరం రక్తంలోని ఎర్ర కణాల విచ్చితి జరుగుతూ బిలురుబిన్ అనీ రంగు పదార్ధం తయారవుతుంది. రక్తంలో ఈ బిలురుబిన్ పరిమాణం రెట్టింపు అయితే కామెర్లని నిర్ధారిస్తారు. వీరి చర్మం, కళ్ళు పసుపు పచ్చ రంగులో కనిపిస్తాయి.
చికిత్స
  • తాగే నీటిని కాచి ,వడపోసి,చల్లార్చి వాడటం మంచిది.లేదా ఫిల్టర్ చేసిన నీటిని మరగబెట్టయినా వాడవచ్చు.
  • ఆహారం నియమాలు తప్పక పాటించాలి. పచ్చ కామెర్ల వ్యాధి సోకితే క్రొవ్వు, మాంసకృత్తుల మరియు పిండి పదార్ధాల అధికంగా ఉన్న ఆహరం తీసుకోరాదు.
  • ద్రవ పదార్ధాలైన మజ్జిగ,లేత కొబ్బరి నీళ్ళువంటి పానీయాలు అధికంగా తీసుకోవాలి.
  • మాంసాహారులు మాంసానికి ,చేపలకు దూరంగా ఉండాలి.
  • వేపుడులు,పచ్చడులు వంటి వాటిని విధిగా నివారించాలి.
  • కారం పులుపు,ఉప్పు తగ్గంచక తప్పదు.
  • పరిశుభ్రమైన ఆహారం, కాచి చల్లార్చిన నీరు త్రాగటం వల్ల పచ్చ కామెర్లను బాగా నిరోధించవచ్చు.

శిశువుకు వచ్చే పచ్చ కామెర్లు

పుట్టిన శిశువులో 60% మందికి పచ్చ కామెర్లు వస్తుంటాయి.ఇది అత్యంత సాధారణం. పెద్దలకు వచ్చే కామెర్ల లాంటివే అనుకోని ఆందోళన చెందాల్సిన అవసరం ఎంత మాత్రమూ లేదు.
చికిత్స
  • తల్లి పాలు తరుచుగా ఇస్తూ ఉండాలి.
  • తీవ్ర పరిస్థితిలో రక్తాన్ని మార్పిడి చేయాల్సి రావచ్చు.
  • ప్రత్యేక మందుల వాడకం వల్ల కాలేయం పనితీరును మెరుగుపరిచి, పసుపు వర్ణం తగ్గేలా చేయవచ్చు.
  • శిశువు విసర్జించిన మలం కూడా పరిశీలించవలసి ఉంటుంది.
  • సూర్య కిరణాలు బిడ్డకు సోకించడం ద్వారా చికిత్స చేయవచ్చు.

హెపటైటిస్ జాగ్రత్తలు

హెపటైటిస్ వచ్చిన వారిలో ఎక్కువ మంది వాంతులు, వికారంతో బాధ పడుతుంటారు. వీరికి గ్లూకోజ్ ఎక్కువగా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. గ్లూకోజ్ తో పాటు పళ్ళ రసాలు, కొబ్బరి నీళ్ళు తాగించాలి. ఆసుపత్రులలో వాడే సిరంజిలు, సూదులను బాగా స్తేరిలైజ్ చేయాలి. వీటి బదులు డిస్పోజబుల్ సిరంజులు వాడటం ఉత్తమం.
నివారణ
  • ఇంటిని, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి.
  • ఆరోగ్య సూత్రాలను పాటించాలి. అంటే త్రాగే నీరు, తినే ఆహారం శుభ్రంగా ఉండాలి.
  • నీటిని మరగ కాచి, చల్లార్చి త్రాగడం మంచిది.
  • నీరు బాగా త్రాగాలి. మజ్జిగ అన్నం తినాలి.
  • ఉప్పు,కారం,నూనె తగ్గించిన ఆహారం తీసుకోవాలి.
  • గ్లూకోజ్ కలిపిననీరు ఎక్కువగా త్రాగాలి.
  • కొబ్బరి నీళ్ళు, చెరకు రసం వంటి ద్రవ పదార్థాలను అధికంగా తీసుకోవాలి.
  • సి విటమిన్ ఎక్కువగా ఉండే పళ్ళను తీసుకోవాలి.

హెపటైటిస్ సోకిన వ్యాధి గ్రస్తులలో బి విటమిన్ తక్కువగా ఉండడం వల్ల తీవ్ర నీరసానికి గురవుతారు. దీని నుండి కాపాడుకునేందుకు బి విటమిన్ శరీరానికి అందించాలి.

ఇలా కలుషితమైన నీటిని తీసుకోవడం వలన కలరా, అతిసారా వ్యాధి, టైఫాయిడ్ మరియు పచ్చ కామెర్లు వంటి వ్యాధులు కలగటమే కాకుండా, కలుషిత నీరు జనావాస ప్రాంతాలలో నిల్వ ఉండటం వలన నీరు, దోమలు మరియు ఈగలు వంటి కీటకాలకు నివాస స్థలాలుగా మారుతాయి. ఈ విషయాలను దృష్టిలో ఉంచుకొని భూ గర్భ జలాలు మరియు మంచి నీటి వనరులను కలుషితం కాకుండా చూసుకొని, నీటిని పరిశుభ్రంగా ఉంచే భాద్యత మనందరి పైన ఉంది.

ధన్యవాదములు 🙏

మీ నవీన్ నడిమింటి

ఫోన్ -9703706660


మీ సూచనను పోస్ట్ చేయండి

(పై కంటెంట్‌పై మీకు ఏమైనా వ్యాఖ్యలు / సూచనలు ఉంటే, దయచేసి వాటిని ఇక్కడ పోస్ట్ చేయండి)