13, ఫిబ్రవరి 2023, సోమవారం

సిరి ధాన్యాలను ఆహారంగా ఎందుకు తినాలి మరియు మధుమేహం ఉన్న వాళ్ళ ఆహారం నియమాలు | Food Details of Millets

 


.

సిరి ధాన్యాలను ఆహారంగా ఎందుకు తినాలి అన్న విషయాన్ని శాస్త్రీయంగా క్లుప్తంగా తెలుసుకుందాం.





        ఈనాడు వరి, గోధుమ ఆహార పదార్థాలలోని పీచు పదార్థం +0.25% నుంచి -0.5% చేరి పోయింది. అందుకే ఇవి తిన్న 15 నుండి 35 నిమిషాల్లో గ్లూకోజ్ గా మారిపోయి, 100 గ్రాములు ఆహారం తింటే 75 గ్రాముల ఆహారం గ్లూకోజ్ గా ఒక్కసారిగా రక్తం లోకి వచ్చి చేరుతోంది.


ఇలా రోజుకి మూడు నాలుగు సార్లు జరిగితే, వీటికి తోడుగా స్వీట్లు , బిస్కట్ లు, బర్గర్ లు, పిజ్జా  లు,అలాగే మైదాతో చేసిన నాన్  రోటి  కూడా తోడైతే అధిక మొత్తాలలో గ్లూకోజు ఒకేసారిగా రక్తం లోకి చేరుకొని చేటు చేస్తుంది. చక్కెర వ్యాధి ఉన్న వాళ్ళని కష్టపెడుతుంది,  క్రొవ్వు పెంచుతుంది, అనేక రోగాలకు దారి తీస్తుంది.


మైదాతో చేసిన పదార్ధాలు మరీ ఘోరంగా 10 నిమిషాలలో గ్లూకోజుగా మారి రక్తంలో కలుస్తాయి.          మైదా తయారీలో వాడే రసాయనాలు కూడా  మన క్లోమగ్రంధి కి  ఎంతో హానికరం.


సాధారణంగా మన దేహంలోని రక్తం(మొత్తం 4 నుండి 5 లీటర్లు)లో ఉండే గ్లూకోజ్ ఆరు నుండి ఏడు గ్రాములే. ఆహారం తిన్న తర్వాత అది అరిగి, చివరిగా గ్లూకోజుగా మారి,రక్తంలోకి  గ్లూకోజ్ రావడం, దేహమంతా సరఫరా అవటం మామూలే. కానీ ఒక్కసారిగా పదినిమిషాల్లో లేదా 30-40 నిమిషాల్లో అధిక మొత్తంలో రావడం ఎవరి ఆరోగ్యానికి మంచిది కాదు. పెద్దలకు, మధుమేహం ఉన్న వారికి, ఇతర రోగగ్రస్తులకు ( మలబద్ధకం, పైల్స్, మొలలు, మూలశంక, ట్రైగ్లిజరైడ్స్, అధిక రక్త పీడనం అంటే బి.పి., మూత్రపిండాల రోగులు, హృద్రోగులు వగైరా అందరికీ) మరింత చేటు.వివరాలు కు లింక్స్ లో చూడాలి


https://m.facebook.com/story.php?story_fbid=2713528328912035&id=1536735689924644


అందుకే వాటినన్నింటినీ దూరంగా ఉంచాలి. చిరుధాన్యాలు అలవాటు చేసుకోవాలి. ఇవి 5 నుండి 7 గంటల పాటు కొద్దికొద్దిగా చిన్న మొత్తాలలో గ్లూకోజ్ ని      రక్తంలోకి విడుదల చేస్తాయి. కొర్ర బియ్యం, అరికెలు బియ్యం,  సామె బియ్యం, ఊదల బియ్యం, అండుకొర్రల బియ్యం రకాలు 8 నుండి 15 శాతం పీచు పదార్థం/ Fibre కలిగినవి. పూర్తిగా సేంద్రి


#డయాబిటిక్_ఉన్నవారు_తీసుకోవలసిన_ఆహారం…


#టమాటోలు :  డయాబెటిక్ వారికి టమాటోలు మంచి ఆహారం. పచ్చివి గాని, కూరలుగా గాని, సూప్ గా కానీ తీసుకొనవచ్చు. టమాటోలు విటమిన్ సి, ఐరన్, విటమిన్ ఇ లు కలిగి ఉంటాయి. రోజువారీ తినవచ్చు


వంటలు అతిగా (మొత్తగా) ఉడికించరాదు. (మెత్తగా ఉండటం వలన త్వరగా జీర్ణమై గ్లూకోజ్ శాతం త్వరగా పెరుగుతుంది) అతిగా వేపుడు చేసిన పదార్ధాల్ింగ్ చేసినవి (నూనెలేకుండా) మంచివి. మొలకెత్తిన గింజలు.

 

#తినకూడనివి: క్రీమ్ లేని తండూరి పదార్థాలు మంచివి క్రీమ్స్ తినరాదు. నెయ్యి, డాల్డాలు వాడరాదు త్వరగా జీర్ణం అయ్యే పదార్థాలు తినరాదు. (పాలిష్ బియ్యం, జల్లించిన గోధుమ పిండి, మైదా మొదలగునవి) నెమ్మదిగా జీర్ణమయ్యే పదార్థాలు మంచివి ముడిబియ్యం, చిరుధాన్యాలు, గోధుమ పిండి జల్లెడ పట్టరాదు.


#బెర్రిజాతి_పండ్లు :

     అన్ని రకాల బెర్రిజాతి పండ్లు స్ట్రాబెర్రీస్ మొదలగునవి యాంటాక్సిడెంట్లు, విటమిన్లు మరియు పీచు కలిగి ఉంటాయి. దబ్బకాయ, ఆరెంజ్, నిమ్మ జాతి పండ్లలో కరిగే పీచు మరియు విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. కనుక వీటిని రోజువారీ ఆహారంలో తీసుకొనటం మంచిది.


#ఆకుపచ్చని_ఆకుకూరలు  :

             బచ్చలికూర,మెంతికూర, తోటకూర మొదలగునవి తక్కువ కేలోరీలు, కార్బోహైడ్రేట్స్ కలిగి ఉంటాయి. వీటిని ఎక్కువగా కూడా తినవచ్చు.


#చిలగడదుంపలు :

           విటమిన్ ఎ మరియు పీచు గల ఆహారం. రక్తంలో తక్కువగా సుగర్ శాతం పెరుగుతుంది


#చిక్కుళ్ళు :

అన్నిరకాల చిక్కుళ్ళు, బీన్స్ లో పీచు, మెగ్నీషియం, పొటాషియం ఎక్కువగా ఉండి డయాబెటిక్ వారికి సమతులాహారంగా పనిచేస్తాయి. మాంసాహారం కంటే బలవర్థకమైన ఆహారం చిక్కుళ్ళు.

 

#మాంసాహారం :

చేపలలో ఒమేగా 3 పుష్కలంగా ఉంటుంది. వారంలో 2-3 సార్లు మితంగా తినవచ్చు. మాంసాహారం : స్కిన్ లెస్ చికెన్ తినవచ్చు. సాల్మన్ ఫిష్ మంచిది.

 

#తినకూడనివి :  వేపుడు మాత్రం తినరాదు.  అన్ని రకాల మటన్ తినరాదు.


#చిరుధాన్యాలు :

అన్నిరకాల చిరుధాన్యాలు (జొన్నలు, సజ్జలు, రాగులు, వరిగలు, సామా రైస్ మొదలగునవి) డయాబెటిక్ వారికి మేలు చేస్తాయి. తెల్లని బ్రెడ్ కంటే(మైదాతో చేసిన)గోధుమతో చేసి బ్రెడ్ (బ్రౌన్ బ్రెడ్) తినటం మంచిది. పెరల్డ్ బార్లీ, ఓట్ మీల్ లలో పీచు, మరియు పొటాషియం ఉంటాయి.


#చిరుధాన్యాలు : చిరుధాన్యాలతో చేసిన వంటకాలు (జొన్నలు, రాగులు,వరిగలు, సజ్జలు మొ.నవి) గోధుమలు, ఓట్స్ తో చేసిన వంటకాలు తినవచ్చు.


#తినకూడనివి:  బొంబాయి రవ్వతో చేసిన ఉప్మా, కేసరి, హల్వా, మైదాతో చేసి పదార్ధాలు బిస్కట్లు తినరాదు. పూర్తిగా పాలిష్ చేసిన ధాన్యాలుతో చేసిన పదార్థాలు త్వరగా అరిగిపోయి రక్తంలో గ్లూకోజ్ శాతం ఒక్కసారిగా పెరుగుతుంది.


#విత్తనాలు_మరియు_పప్ఫు_ధాన్యాలు :

          శనగలు, పెసలు, అలసందులు, రాజ్మాలు తినవచ్చు. తినకూడనివి:  మసూర్ దాల్ (వేయించినవి తినరాదు)

 

#గింజలు :

అక్రోట్స్, అవిశె గింజలు ఒమేగా 3 కలిగి ఉండి డయాబెటిక్ వారు తినదగినవి.


#పాలు_పాల_పదార్ధాలు :

          పాలు, పాలపదార్ధాలు ఎముకలు, పళ్ళ పుష్టికి దోహదం చేస్తాయి. కాల్షియం, విటమిన్ డి కలిగి వుంటాయి.   తినకూడనివి: డయాబెటిక్ వారు మాత్రం వెన్న తీసిన పాలు, మజ్జిగ మాత్రమే వాడాలి


#పండ్లు :

పుచ్ఛ, నారింజ, నిమ్మ, దబ్బ కాయలు, దోర జామకాయలు, స్టార్ ఫ్రూట్స్, నేరేడు పండ్లు, బొప్పాయి, యాపిల్ కాయలు కూడా మితంగా మాత్రమే తినాలి. చిన్న రేగిపండ్లు, ఉసరికాయలు, తినవచ్చు.


#బియ్యం :

పారాబాయిల్డ్ బియ్యం, పొడుగు బియ్యం, బాస్మతీ బియ్యం, ముడిబియ్యం, జల్లించని గోధుమ పిండి, చిరుధాన్యాలు నిదానంగా జీర్ణం అవుతాయి. అందువలన రక్తంలో గ్లూకోజ్ శాతం నెమ్మదిగా పెరుగుతుంది. తినకూడనివి:  పూర్తిగా పాలిష్ చేసిన బియ్యం తినరాదు.


జామ్స్, బట్టర్ లు తినరాదు వీటిలో పంచదార ఎక్కువగాను మరియు నిల్వ ఉండటానికి రసాయనాలు కలుపుతారు.


#కూరగాయలు :

ఆకుపచ్చని ఆకుకూరలు అన్నీ తినవచ్చు. బీన్స్, చిక్కుళ్ళు, బీర, బెండ, దోస, కాకర, మునగ, టమాటో వంటివి తినవచ్చు.


తినకూడనివి: దుంపలు తినరాదు


#చట్నీలు :  పుదీనా, కొతిమీర టమాటో చట్నీలు ఆరోగ్యకరం.


#తినకూడనివి:   వేయించిన పదార్థాలు బిస్కట్లు, పేస్త్రీలు, చిప్ప్, జామ్స్, పిజ్జాలు తినరాదు. పకోడీలు, చక్రాలు కూడా నిషిద్ధం.నూనెలో వేయించిన పదార్ధాలు కూడా తినరాదు.


#నూనెలు : ఆలివ్ ఆయిల్, సన్ ఫ్లవర్ ఆయిల్ సోయా నూనె వాడవచ్చు.


తినకూడనివి వనస్పతి నెయ్యి, వెన్న (డాల్డా) పూర్తిగా నిషిద్ధం.


#ఓట్_మీల్:

         అన్ని ధాన్యాలతో చేసిన వంటకాలు పీచు పదార్దాలు ఎక్కువగా కలిగి ఉండి డయాబెటిస్ ప్రమాదాన్ని 35-42 శాతం వరకు తగ్గిస్తాయని పరిశోధనలు తెలుపుచున్నాయి.


వాటిలో ఓట్ మీల్ కూడా ఒకటి. ఇవి కరిగిపోయే పీచుతో ఉండి నిదానంగా జీర్ణమవటం వలన రక్తంలో షుగర్ శాతం త్వరగా పెరగదు. నాణ్యమైన ఓటమీల్ మరియు ఒకటి రెండు స్పూన్ల పీకాన్స్, బాదం పప్పులు లేక వాల్ నట్స్ మంచి ప్రొటీన్స్ కలిగి ఉండి షుగర్ పెరగకుండా సమతుల్యం చేస్తాయి.


#బాదం_పప్పులు :

ఉప్పు వేయని బాదం పప్పులు, మెగ్నీషియం మరియు మోనో శాచురేటెడ్ కొవ్వులు కలిగియుంటాయి. హార్వార్డ్ యూనివర్శిటి వారి పరిశోధన ప్రకారం మెగ్నీషియం వలన 33శాతం దాకా డయాబెటిస్ వచ్చే అవకాశాలు తగ్గుతాయి. ఆహరంలో బాదం పప్పులు, గుమ్మడి విత్తనాలు, స్పించ్ లను తీసుకోవటం మంచిదని నిపుణులు చెబుతారు.


#కోడి_గుడ్డులోని_తెల్లసొన :

        గుడ్డులోని తెల్లసొన ప్రొటీన్స్ కలిగి ఉండి తక్కువ కార్బోహైడ్రేట్ కలిగి టైప్-2 డయాబెటిస్ ను కంట్రోల్లో ఉంచటానికి సహకరిస్తుంది. ఒక పెద్ద గుడ్డులోని తెల్లసొన 4 గ్రాముల ప్రొటీన్ మరియు16 కేలరీస్ కలిగి ఉండి రక్తంలోని షుగర్ను తగ్గించటంలో సహాయపడతాయి. బరువు తగ్గాలనుకునే వారికి కూడా ఇది మమంచిది


ధన్యవాదములు 🙏

మీ Naveen Nadimint

  ఫోన్ -9703706660

        

కామెంట్‌లు లేవు: