18, జులై 2021, ఆదివారం

ఇర్రిటేబుల్ బవెల్ సిండ్రోమ్ (లేవగానే మోషన్స్ వచ్చినట్టు అనిపించడం రాకపోతే & రోజులు ఎక్కువ టైమ్స్ మోషన్స్ వెళ్లడం సమస్య అవగాహనా కోసం తీసుకోవాలిసిన జాగ్రత్తలు అవగాహనా కోసం లింక్స్ చూడాలి

ఒక సిండ్రోమ్ అనునది వైధ్యశాస్త్ర చిహ్నాలు మరియు లక్షణాల సమూహము, ఇవి ఒకదానితో ఒకటి సంబంధము కలిగియుంటాయి మరియు, ఈ సిండ్రోమ్ తరచుగా ఒక నిర్ధిష్టమైన వ్యాధి లేక రుగ్మతతో సంబంధము కలిగియుంటుంది.  ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ (ప్రకోప ప్రేగు సిండ్రోమ్)  (IBS) అనునది పెద్ద ప్రేగు యొక్క రుగ్మత, ఇది సాధారణ ప్రేగు ఫంక్షన్ లో మార్పులను కలిగిస్తుంది.  ఖచ్చితమైన కారణము తెలియకపోవచ్చు, అయితే కొంతమంది నిపుణుల యొక్క నమ్మకమేమిటంటే భౌతికముగా కంటే ఇది ప్రధానముగా మానసికమైనది.  రక్తము లేక ఊహాత్మక పరీక్షల గుండా ఏ విధమైన గుర్తించదగిన కారణము ఉండదు, వీటి యొక్క లక్షణాలు  పొత్తికడుపు లో నొప్పితో పాటు మలబధ్ధకం నుండి వదులుగా ఉండే విరేచనాలుగా మారుతూ ఉంటాయి.  లక్షణాలు పైన ఆధారపడి చికిత్స యొక్క ఎంపికలు మారుతాయి మరియు ప్రతీ రోగి విభిన్న లక్షణాలను ప్రదర్శించడం మరియు చికిత్సకు ప్రతిస్పందించడం వంటి వాటి వలన కూడా ఫలితాలలో  తేడాలు ఉంటాయి.

ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ అంటే ఏమిటి? 

ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ (ప్రకోప ప్రేగు సిండ్రోమ్)  (IBS) అనునది ఎక్కువకాల (దీర్ఘ-కాలిక) రుగ్మత, ఇది జీర్ణకోశ ప్రాంతమును (ఆహార నాళము లేక జీర్ణ నాళము) ప్రభావితం చేస్తుంది, ప్రత్యేకముగా పెద్ద ప్రేగు (పెద్ద ప్రేగు భాగం) ను ప్రభావితం చేస్తుంది.  గ్యాస్ట్రోఇంటెస్టినల్ ట్రాక్ట్ (ఆహార నాళము లేక జీర్ణ నాళము) అను పదము ఆహారము ప్రయాణించే మొత్తం మార్గము (నోరు, ఆహార నాళము, ఉదరము, చిన్న ప్రేగు, మరియు పెద్ద ప్రేగు) ను సూచించడానికి ఉపయోగిస్తారు, మరియు వాటికి సంబంధించిన అవయవాలు అనగా కాలేయం, పిత్తాశయం, మరియు క్లోమమ,  ఇవి జీర్ణ సంబంధ ఎంజైములను స్రవిస్తాయి.  ఐబిఎస్ అనునది పెద్ద ప్రేగు యొక్క మల ఫంక్షన్ (విరేచనం) తో  వచ్చే సమస్యలకు సంబంధించినది. ఇక్కడ అతిసారం (వదులు మోషన్స్) లేక మలబధ్ధకము (మలమును విసర్జించడములో ఇబ్బంది) లేక రెండిటినీ కలిగి ఉంటాయి. ఇది ఉబ్బరం (గ్యాస్ తో పూర్తిగా నిండినట్లు ఉండే భావన) మరియు పొత్తికడుపులో నొప్పికి సంబంధించినది.

ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ యొక్క లక్షణాలు 

ఐబిఎస్ యొక్క అధిక సాధారణ లక్షణము పొత్తి కడుపులో నొప్పిని కలిగి ఉండడం.  పొత్తి కడుపు క్రింది భాగమున, కడుపులో తిమ్మిరి రూపములో నొప్పి ఉంటుంది.  ఈ నొప్పి నుండి ఉపశమనము సాధారణముగా మలమును బయటకు పంపించడము ద్వారా పొందవచ్చు.  కడుపు ఉబ్బరం (అధికముగా గ్యాస్ ఉత్పత్తి వలన కడుపు నిండినట్లుగా ఉంటుంది) రోజంతా ప్రమాదకరముగా ఉంటుంది, అయితే కారణము తెలియకపోవచ్చు.  (ఎక్కువగా చదవండి 
ఐబిఎస్-సి కలిగిన ప్రజలు (చిన్న గులకరాళ్ల-ఆకారములో మలము- ఇవి తరచుగా గట్టిగా ఉంటాయి) పొత్తికడుపులో నొప్పితో పాటు, గట్టి గుళికల రూపములో మలమును కలిగిఉంటారు మల విసర్జన సమయములో ఎక్కువ ప్రయాస కలుగుతుంది.  ఐబిఎస్-డి కలిగిన ప్రజలు, పలుచని నీళ్లవంటి మరియు తక్కువ పరిమాణములో మల విసర్జన చేస్తారు.  అసంపూర్తిగా ప్రేగు ఖాళీ అయిందనే ఒక నిరంతర భావనను కలిగి ఉంటారు.  శ్లేష్మం ఉత్సర్గం కూడా సాధారణముగా ఉంటుంది అయితే ఇది రక్త స్రావముతో కలిపి బయటకు రాదు.  ఏ విధమైన బరువు కోల్పోవడం (నష్టము) అనునది రిపోర్ట్ చేయబడదు.  పోస్ట్ అల్పకోశ ఐబిఎస్ అనునది జ్వరముతో పాటు ప్రధానముగా ఎడమ వైపున పొత్తి కడుపులో నొప్పిని కలిగిస్తుంది.  ఐబిఎస్-ఎమ్ కలిగిన రోగులు ఐబిఎస్-సి మరియు ఐబిఎస్-డి యొక్క రెండింటి ప్రత్యామ్నాయ లక్షణాలను ప్రదర్శిస్తారు.    (ఎక్కువగా చదవండి -

ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ యొక్క చికిత్స 

రోగికి ఓదార్పునివ్వాలి మరియు లక్షణాల యొక్క వివరణ వారికి తెలిసేటట్లుగా చేయాలి.  ఐబిఎస్ యొక్క చికిత్స అనునది ఐబిఎస్ యొక్క రకము మరియు వ్యక్తి కలిగి ఉన్న ఐబిఎస్ యొక్క వర్గీకరణ పైన ఆధారపడి ఉంటుంది.  

  • నొప్పి
    నొప్పి తనంతట తానుగా ఉపశమనము పొందకుంటే, యాంటికొయాంటికొలినేర్జిక్ ఏజెంట్ యొక్క ఒక కోర్స్ (డైసైక్లోమైన్ 10మిగ్రా) లేక ఒక యాంటిస్పాస్మాయాంటిస్పాస్మాడిక్ (మెబెవెరిన్ 135 మిగ్రా) లను రోజుకు మూడు సార్లు ఇవ్వవచ్చు.
  • ఐబిఎస్-డి
    ఆహారములో ఫైబర్ పధార్థము యొక్క పరిమాణము పెంచుట మరియు సమూహ విరేచనకారులు అనగా చర్మముతో పండ్లు, కూరగాయలు, మిథైల్ సెల్యులోజ్ లేక ఇసాబ్గోల్ పొట్టు అనునవి కలుపబడతాయి. మందులు అనగా లోపెర్అమైడ్ (2-4 మిగ్రా ఒక రోజుకు 4 సార్లు) లేక కొలెస్టైరామిన్ (రోజువారీ 1 సాచెట్) లేక కొడీన్ ఫాస్ఫేట్ (ప్రతీరోజు 30-90 మిగ్రా) ఒకవేళ లక్షణాలు ఉంటే సూచించబడతాయి.  విపరీత సందర్బాలలో ప్రతీ రాత్రి ఒకసారి ఒక సైకోట్రోపిక్ (మనస్తత్వ) మందు అనగా అమిట్రిఫ్టైలిన్ (10-25 మిగ్రా) కూడా సిఫార్సు చేయవచ్చు.
  • ఐబిఎస్-సి
    మలం మృదువుగా రావడానికి నీరు ఎక్కువగా త్రాగడం, మరియు ఓట్స్, పప్పులు (కాయధాన్యాలు), క్యారెట్స్, ఒలిచిన బంగాళాదుంపలు వంటి కరిగే ఫైబర్ ను ఎక్కువగా తీసుకోవడం పెంచాలి.  ఒకవేళ ఫైబర్ మందులు లక్షణాల నుండి ఉపశమనమును ఇవ్వడములో విఫలమయితే, మెగ్నీషియా పాలను చికిత్సా ప్రణాళికలో కలపాలి.
  • పోస్ట్-ఇన్ఫెక్సియస్ ఐబిఎస్
    పోస్ట్-ఇన్ఫెక్సియస్ ఐబిఎస్ లో, ఖచ్చితమైన యాంటిబయాటిక్ రెజిమ్ అను దానిని ఇన్ఫెక్షన్ ను నయం చేయడానికి అనుసరించాలి మరియు తరువాత లక్షణాలు నిర్మూలించబడతాయి.
  • ఐబిఎస్ లో యాంటిడిప్రెస్సంట్స్
    ట్రైసైక్లిక్ యాంటిడిప్రెస్సంట్ థెరపీ అనునది ప్రకోప ప్రేగు రోగుల యొక్క పరిస్థితిని మెరుగుపరుస్తుంది.  ప్రధాన లక్షణాలు కలిగిన రోగులు అనగా, నొప్పి, అతిసారం, మరియు మలబధ్ధకం అనునవి ప్రధానమైన లక్షణముగా అధికముగా మేలు చేస్తుంది.

జీవనశైలి నిర్వహణ

ఐబిఎస్ ను పూర్తిగా నయం చేయడానికి ఏ విధమైన కాంక్రీట్ దశలు లేక మందులు లేవు.  అయితే, రోజువారీ ఆహారం మరియు జీవనశైలిలో సరైన మార్పులను చేయడము ద్వారా లక్షణాలను తొలగించవచ్చు.

  • మంచి నాణ్యత కలిగిన పదార్థాలను ఉపయోగించి వండిన ఇంటి ఆహారమును ఎంచుకోవడం మరియు లక్షణాలను మార్పు చేసుకోవడముతో పాటు లక్షణాలను చెక్ చేసుకోవడానికి సహాయంచేసే విధముగా, వినియోగించే ఆహార వస్తువుల రికార్డుతో ఒక డైరీని తయారుచేసుకోవాలి.
  • ప్రతీరోజూ ఒక వ్యాయామ నియమాన్ని చేపట్టడం కూడా మొత్తం లక్షణాలను మెరుగుపరచడానికి సహాయం చేస్తుంది.  మలబధ్ధకం విషయములో తగినంత నీరు తీసుకోవడం, అతిసారం విషయములో ఆహారమునకు ఫైబర్ ను జతచేయడం, మరియు కొన్ని ఆరోగ్యకరమైన ప్రొబయాటిక్ పానీయాలను ప్రయత్నించడం, ఇవి ఆంత్రములో మంచి బ్యాక్టీరియాను పెంచుతాయి, ఇవి జీర్ణక్రియ బాగుగా జరగడానికి సహాయం చేస్తాయి.
  • ఐబిఎస్ కలిగిన ప్రజలు భోజనమును మానుకోవడమును దూరముగా పెట్టాలని సూచించబడింది, తక్కువగా ఆహారమును తీసుకోవడం, క్రొవ్వు మరియు ప్యాకేజ్ చేయబడిన ఆహారము అనగా చిప్స్ మరియు బిస్కెట్లను తొలగించాలి, ధూమపానము, మద్యము, మరియు కేఫిన్ (టీ మరియు కాఫీలలో) మొదలగు వాటిని దూరముగా ఉంచాలి.
  • ఉల్లాసభరితమైన కార్యక్రమాల ద్వారా ఒత్తిడిని నిర్వహించడం మరియు ఒత్తిడి అనునది లక్షణాలను పెంచుతుంది కాబట్టి రిలాక్సేషన్ చర్యలు అనగా ధ్యా

ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ కొరకు అలోపతి మందులు

Medicine NamePack Size
CyclopamCyclopam Suspension 30ml
Trigan DTrigan D Tablet
IbscimIbscim Tablet
RifagutRifagut 200 Tablet
WysoloneWysolone 20 Tablet DT
Meftal SpasMeftal Spas 30 ml Injection
Pantocar LPantocar L Capsule SR
CataspaCataspa 50 Mg/20 Mg Tablet
Nexpro LNexpro L Capsule
MebalfaMebalfa 10 Tab
మలవిసర్జన చేస్తున్నప్పుడు రక్తం కూడా పడుతుందా మరియు  మలద్వారపు చర్మం వద్ద కోసుకుపోయినట్లుగా నొప్పి ఆయుర్వేదం లో నవీన్ నడిమింటి సలహాలు 

 

మలద్వారంలో నొప్పి ఉన్నప్పుడు కలిగే అసౌకర్యం అంతా ఇంతా కాదు. ఈ ప్రాంతంలో అత్యధిక సంఖ్యలో నరాలు వ్యాపించి ఉండటం, మనం రోజు మొత్తం మీద ఎక్కువ సేపు కూర్చొనే ఉండటం వంటి కారణాల చేత ఈ ప్రాంతంలో ఏ మాత్రం అసౌకర్యం కలిగినా అది తీవ్రమైన చిరాకుకు, అసహనానికి, ఇబ్బందికి దారి తీస్తుంది. తేలికపాటి కారణాల నుంచి గంభీరమైన హేతువుల వరకూ ఎన్నో రకాల అంశాలు మలద్వారంలో నొప్పిని కలిగిస్తాయి కనుక వీటన్నిటి గురించి ఆలోచించడం అవసరం.

1. మలబద్దకం (కాన్ స్టిపేషన్):

మలబద్దకం అనేది మలద్వారంలో నొప్పికి ఒక ప్రధానమైన కారణం. పురీషనాళాన్ని (రెక్టమ్) చేరిన మలం ఒకవేళ ఎక్కువసేపు నిలువ ఉంటే దాన్నుంచి నీరంతా శోషింపబడి మలం మరింత గట్టిగా తయారవుతుంది. ఫలితంగా మలద్వారం పైన ఒత్తిడి ఏర్పడి నొప్పి మొదలవుతుంది. ఆహారంలో పీచు పదార్థాలను ఎక్కువగా తినడం, సమృద్ధిగా నీళ్ళు తాగటం, రాత్రి పడుకునే ముందు గ్లాసు పాలలో చెంచాడు నెయ్యి కలుపుకుని తాగటం, ప్రతిరోజూ ఉదయం పూట మూడు నాలుగు గ్లాసుల గోరు వెచ్చని నీళ్లు తాగటం, పొట్టమీద ఒత్తిడి పడేలా మసాజ్ చేసుకోవడం వంటి చిన్న చిన్న ఉపాయాలతో మలబద్దకాన్నీ, తద్వారా మలద్వారంలో నొప్పినీ తగ్గించుకోవచ్చు.

గృహచికిత్సలు: 1. కరక్కాయ పెచ్చుల చూర్ణాన్ని చెంచాడు మోతాదుగా అంతే భాగం ఉప్పు కలిపి రాత్రి పడుకునేముందు తీసుకోవాలి. 2. రేలపండు గుజ్జును చెంచాడు మోతాదుగా రెండు చెంచాలు చక్కెర కలిపి గోరువెచ్చని నీళ్లతో తీసుకోవాలి. 3. రోజూ కనీసం పావుకిలో నల్ల ద్రాక్షపండ్లను తినాలి, తాజా పండ్లు దొరకని పక్షంలో ఎందు ద్రాక్షలను 24 గంటలు నీళ్లలో నానేసి నీళ్ళతో సహా తీసుకోవాలి. 4. వస కొమ్ము, కరక్కాయ పెచ్చులు, చిత్రమూలం వేరు, పిప్పళ్ళు, అతివస, చెంగల్వ కోష్ఠు, యావక్షారం వీటిని సమభాగాలు తీసుకొని అన్నిటిని పొడిచేసుకొని నిలవచేసుకోవాలి. ఈ పొడిని అరచెంచాడు మోతాదుగా రాత్రిపూట పడుకునేముందు తీసుకోవాలి. 5. అతసీతైలం (లిన్సీడ్ ఆయిల్) భోజనానికి ముందు చెంచాడు పరిమాణంలో నీళ్లతో కలిపి తీసుకుంటే మలం హెచ్చుమొత్తాల్లో మృదువుగా విసర్జితమౌతుంది.

ఔషధాలు: త్రిఫలా చూర్ణం, లశునాదివటి, అభయారిష్టం, వైశ్వానర చూర్ణం, మాణిభద్రలేహ్యం, పంచనకారచూర్ణం, ఏరండపాకం.

2. అర్శమొలలు (ఫైల్స్ / హెమరాయిడ్స్):

మలంతో పాటు రక్తం కూడా కనిపిస్తుంటే అది అర్శమొలలకు సూచన. అర్శమొలలనేవి రక్తనాళాలు - ముఖ్యంగా సిరలు - మలద్వారం ప్రాంతంలో గట్టిపడి మెలికలు తిరగటం వలన ఏర్పడుతాయి. మలబద్దకం వంటి కారణాల చేత మలద్వారం వద్ద ఒత్తిడి ఏర్పడితే, అది సిరలపైన ప్రతిఫలించి, సిరల గోడలు చిట్లి రక్తస్రావానికి ఆస్కారం ఏర్పడుతుంది. దీని ఫలితంగా మలద్వారం వద్ద నొప్పి, అసౌకర్యం, దురద వంటి లక్షణాలు కలుగుతాయి. అలాగే, చేతికి బొడిపె వంటి ఆకారం తగిలే అవకాశం వుంది. పోతే, ఎక్కువ సంఖ్యలో విరేచనాలవుతున్నప్పుడు కూడా ఈ అర్శమొలల మీద ఒత్తిడి పడి, చీరుకుపోయి, నొప్పి, రక్తస్రావాలూ కలిపించే అవకాశం వుంది. అర్శమొలల నుంచి రక్తస్రావం అవుతున్నప్పుడు రక్తం ఎర్రటి ఎరుపుతో తాజాగా కనిపిస్తుంది. అలాగే మలంతో కలిసి కాకుండా మలం చుట్టూ చారికలా కనిపిస్తుంది. ఇలా కాకుండా ఒకవేళ రక్తం మలంతో కలగాపులగంగా కలిసిపోయి ఒకింత నలుపు రంగులో కనిపిస్తుంటే దానిని పేగుల నుంచి ఏర్పడిన రక్తంగా అనుమానించాలి. శత్రువులా బాధిస్తుంది కనుక మొలలకు అర్శస్సు అనే పేరు వచ్చింది. ('అరి' అంటే సంస్కృతంలో శత్రువు అని అర్థం.)

గృహ చికిత్సలు: 1. వాము, శొంఠి సమతూకంగా తీసుకొని పొడిచేయాలి. దీనిని అరచెందాడు మోతాదుగా గ్లాసు మజ్జిగతో కలిపి తీసుకోవాలి. 2. కరక్కాయల నుంచి గింజలను తొలగించి కేవలం పెచ్చులు మాత్రమే గ్రహించి పొడిచేయాలి. దీనిని పూటకు అరచెందాడు చొప్పున రెట్టింపు భాగం బెల్లంతో కలిపి మూడు పూటలా తీసుకోవాలి.... 3. ఉత్తరేణి గింజలను రెండు చెంచాలు పొడి చేసి బియ్యపు కడుగు నీళ్ళతో తీసుకుంటే రక్తం ఆగిపోతుంది. 4. నాగకేశర చూర్ణం (చెంచాడు), పంచదార (2 చెంచాలు), వెన్న (5 చెంచాలు) అన్నీ కలిపి తీసుకుంటే అర్శమొలల్లో స్రవించే రక్తం ఆగుతుంది.

ఔషధాలు: అర్శకుఠార రసం, కాంకాయణగుటిక, సూరణ వటకములు, అభాయారిష్టం. బాహ్యప్రయోగం - కాసీసాదితైలం.

 

3. గుదవిదారం (ఫిషర్):

మలద్వారపు చర్మం చీరుకుపోయినప్పుడు దానిని గుదవిదారం (ఫిషర్) అంటారు. ఇది మలబద్దకం వల్లగాని, ఇన్ఫెక్షన్ల వల్లగాని ఏర్పడుతుంది. మామూలుగా పెదవులు, చేతివేళ్లు, మోచేతులు తదితర భాగాల పైనుండే చర్మం దళసరిగా, గట్టిగా, పొడిగా తయారైనప్పుడు ఎలా అయితే చీరుకుపోతుందో అలాగే, మలద్వారపు చర్మం కూడా చీరుకుపోయే అవకాశం ఉంది. మలబద్దకాన్ని తగ్గించడం ఈ స్థితిలో మొదటి చికిత్సా సూత్రం. వ్రణరోపన ఔషధాలను ప్రయోగించడం రెండవ సూత్రం.

ఔషధాలు: అభయారిష్టం, అవిపత్తికర చూర్ణం, ద్రాక్షాది రసాయనం, ద్రాక్షారిష్టం, సుకుమార రసాయనం, వైశ్వానర చూర్ణం, మాణిభద్ర లేహ్యం.

బాహ్యప్రయోగాలు - వ్రణరోపణ తైలం, శతధౌతఘృతం.

4. విస్పోట (పెరియానిల్ యాబ్సిస్):

కొంతమందికి మలద్వారం వద్ద నొప్పితో కూడిన గడ్డలు తరచుగా తయారవుతుంటాయి. వైద్య పరిభాషలో 'పెరియానల్ యాబ్సిస్'గా పిలువబడే ఈ గడ్డలు ఎక్కువగా వెంట్రుకల కుదుళ్లు ఇన్ ఫెక్ట్ అవ్వడం చేతనూ, వాటి మొదళ్లు అడ్డగించబడటం చేతనూ వస్తుంటాయి.

గృహచికిత్సలు:1. రేగు ఆకులను ముద్దగా నూరి ఉడకబెట్టి పైకి వట్టు వేయాలి. 2. రణపాల ఆకును వేడిచేసి పైకి కట్టాలి.

ఔషధాలు: శారిబాద్యారిష్టం, గంధక రసాయనం, కర్పూర శిలాజిత్తు.

5. అతిసారం (డయేరియా):

తరచుగా విరేచనాలయ్యేవారిలో మలద్వారం ఒరుసుకుపోయి నొప్పి ఏర్పడే అవకాశం ఉంది. విరేచనాలు సాధారణంగా ఆహారం కలుషితం కావడం చేతకాని, పెద్ద పేగులు వ్యాధిగ్రస్తమవడం వల్లగాని, మోతాదుకు మించి విరేచ నౌషధాలను తీసుకోవడం వల్లగాని ఏర్పడతాయి. ఇలా జరుగుతున్నప్పుడు కారణాలను కనిపెట్టి దానికి అనుగుణమైన చికిత్స తీసుకుంటే సరిపోతుంది.

6. పెద్దపేగుల్లో సంచులవంటి నిర్మాణాలు తయారవడం ( డైవర్టిక్యులైటిస్):

మలద్వారంలో నొప్పి దానంతట అదే వస్తూ తిరిగి తగ్గిపోతూ ఉంటే పెద్ద పేగుకు సంబంధించిన 'డైవర్టిక్యులైటిస్' అనే స్థితి గురించి ఆలోచించాలి. వయసు మీద పడుతున్న కొద్ది పెద్ద పేగు కండరాలు శక్తి తగ్గిపోయి చిన్న చిన్న సంచుల మాదిరి నిర్మాణాలు తయారవుతాయి. వీటిల్లో మలం చేరి గట్టిపడి ఇన్ఫెక్షన్ కు గురై మలద్వారం వద్ద నొప్పిని కలిగిస్తుంది. ఈ వ్యాధిలో పేగుల కండర శక్తిని పెంచి, మలనివారణను సజావుగా జరిపించే మందులను వాడాలి.

ఔషధాలు: అగస్త్యహరీతకీలేహ్యం, పంచామృతపర్పటి, మహాగంధక రసం, రసపర్పటి, స్వర్ణపర్పటి.

7. పేగుల్లో తిత్తివంటి నిర్మాణాలు తయారవడం (పాలిప్స్):

అర్శమొలలు లేకపోయినప్పటికీ ఒకవేళ మలద్వారం నుంచి రక్తం కారుతున్నట్లయితే 'పాలిప్స్' గురించి ఆలోచించాలి. పాలిప్స్ అనేవి శరీరపు ఖాళీ ప్రదేశాల్లో తయారవుతుంటాయి. ఇవి కాండం కలిగి, రక్తంతో నిండి ఉండే తిత్తి వంటి నిర్మాణాలు. ఇవి ఇన్ఫెక్ట్ అవ్వడం వల్లగాని లేదా ఒత్తిడికి గురై గీరుకు పోవడం వల్లగాని రక్తస్రావమై మలద్వారం నుంచి బహిర్గతమవుతుంది.

 

కుటజఘనవటి, సంజీవనీవటి, బాహ్యప్రయోగం - కాసీసాదితైలం.

7. స్త్రీ సంబంధ వ్యాధులు (గైనకలాజికల్ డిసీజెస్):

మహిళల్లో మలద్వారం వద్ద నొప్పికి స్థానిక కారణాలే కాకుండా ఇతర అంశాలు కూడా కారణమవుతాయి. అండాశయానికి చెందిన 'ఓవేరియస్ సిస్టులు' గాని కటివలయానికి చెందినా 'పెల్విక్ ఇన్ ఫ్లమేటరీ వ్యాధులు'గాని మలద్వారంలో నొప్పి రూపంలో వ్యక్తమవుతుంటాయి. దీనిని వైద్యశాస్త్ర పరిభాషలో 'రిఫర్డ్ పెయిన్' అంటారు. ఈ సమస్యలకు, ఆయా కారణాల మీద దృష్టి సారించడం అవసరం.

గృహచికిత్సలు: 1. వస చూర్ణాన్ని పూటకు ఒక గ్రాము మోతాదుగా మూడుపూటలా తేనెతో తీసుకోవాలి. 2. అత్తిచెట్టు పట్టను కాని, దానిమ్మ చెట్టు వేరు బెరడునుగాని, కషాయం కాచో యోనిని శుభ్రం చేసుకోవాలి. దీనిని 'డూష్' అంటారు. 3. తులసి ఆకులను, వేపాకులను వెడల్పాటి గంగాళంలో మరిగించాలి. ఈ నీళ్ళతో కాళ్ళు బైటపెట్టి బొడ్డుమునిగేలా ఇరవై నిమిషాలు కూర్చోవాలి, ఇలా రోజుకు మూడు సార్లు వారం రోజుల పాటు చేయాలి. 4. త్రిఫలాచూర్ణం (ఒక చెంచా), గుడూచిసత్వం (అరచెంచా) రెండుకలిపి తగినంత నెయ్యిని, తేనెను కలిపి ఆహారానికి ముందు రోజుకు మూడుసార్లు చూప్పున కనీసం రెండు నెలల పాటు పుచ్చుకోవాలి.

ఔషధాలు: ఆరోగ్యవర్ధినీవటి, కైశోరగుగ్గులు, రసమాణిక్యం.

బాహ్యప్రయోగాలు - జాత్యాదితైలం, మహామరీచ్యాదితైలం, మహానారాయణతైలం.

8. ఇరవై నాలుగు గంటల కడుపునొప్పి (ఎపెండిసైటిస్):

జ్వరంతో పాటు ఆకలి తగ్గిపోవడం, వాంతి వచ్చినట్లు ఉండటం అనేవి 'ఎపెండిసైటిస్'ను సూచిస్తాయి. 'ఎపెండిక్స్' అనేది ఉదర ప్రాంతంలో కుడివైపున క్రిందిభాగంలో అమరివున్నఒక ఆంత్రావశేషం. ఇది కొంతమందిలో పెద్దపేగు వెనుకగా అమరి వుంటుంది. అలాంటి వారికి ఒకవేళ ఎపెండిసైటిస్ వస్తే అది మలద్వారంలోకి నొప్పి రూపంలో ప్రసరిస్తుంది.

ఔషధాలు: ఆరోగ్యవర్ధినీవటి, పునర్నవారిష్టం, దశామూలారిష్టం, లవణభాస్కర చూర్ణం, శంఖభస్మం, కపర్థికాభస్మం, స్వర్జికాక్షారం, అగ్నితుంటివటి, ఆహిఫేనాదివటి, కర్పూరాదివటి, బృహత్ వాత చింతామణి రసం, పునర్నవాదిమండూరం., శంఖవటి, శూలహరణ యోగం.

9. మానసిక ఆందోళన (ప్రాక్టాల్జియా ఫ్యూగాక్స్):

కొంతమందికి మానసికంగా ఒత్తిడికి లోనయినప్పుడు మలద్వారంలో నొప్పి వస్తుంటుంది. ఈ నొప్పి నిద్రనుంచి మేలుకొలుపగలిగేటంత ఎక్కువస్థాయిలో కూడా ఉండవచ్చు. వైద్య పరిభాషలో ఇటువంటి నొప్పిని 'ప్రాక్టాల్ జియా' ఫ్యూగాక్స్' అంటారు. ఒత్తిడికి లోనయినప్పుడు కండరాలు అనూహ్యంగా ముడుచుకుపోవటం వలన ఈ తరహా నొప్పి వస్తుంది. ధ్యానం, ఇతర రిలాక్సేషన్ విధానాలతో పాటు అశ్వగంధా, బ్రాహ్మీ వంటి మూలికలు ఇందులో చక్కగా పని చేస్తాయి.

ఔషధాలు: నారసింహ ఘృతం, బ్రాహ్మీ ఘృతం, గోరోచనాది గుటిక, కళ్యాణక ఘృతం, క్షీరబలా తైలం, అశ్వగందారిష్టం, సర్పగంధా చూర్ణం, స్వర్ణముక్తాది గుటిక.

బాహ్యప్రయోగం - బ్రాహ్మీతైలం.

10. ప్రోస్టేట్ గ్రంథి వాపు (ప్రోస్టటైటిస్):

మగవారిలో, ముఖ్యంగా 50 సంవత్సరాలు దాటిన తరువాత, ప్రోస్టేట్ గ్రంథి వ్యాధి గ్రస్తమయ్యే అవకాశం ఉంది. ప్రోస్టేట్ గ్రంథి వాచినప్పుడు మలద్వారం లోపల ఒక గోల్ఫ్ బంతిని ఉంచిన అనుభూతి కలుగుతుంది, మూత్రవిసర్జన కష్టంతో జరుగుతుంది. పలుమార్లు విసర్జించాల్సి వస్తుంది. అలాగే పురుషాంగం నుంచి జిగురు వంటి స్రావం కూడా వెడలే అవకాశం ఉంది. వీటన్నిటితో పాటు కొద్దిగా జ్వరం కూడా రావచ్చు. అలాగే ఈ వ్యాధి ఉన్నప్పుడు మలద్వారంలో నొప్పి కూడా ఉండే అవకాశం ఉంది. ఔషధాలు: అభ్రకభస్మం, చందనాది వటి, చందనాసవం, చంద్రప్రభావటి, గోక్షురాది చూర్ణం, గుడూచి సత్వం, గోక్షురాది గుగ్గులు, కర్పూర శిలాజిత్తు భస్మం, కాంచనార గుగ్గులు, స్వర్ణవంగం, త్రిఫలాది క్వాథ చూర్ణం.

11. పేగులో క్యాన్సర్:

ఒకోసారి రక్తమొలలు, పాలిప్స్ వంటి వాటి వల్లనే కాకుండా ప్రమాదకరమైన క్యాన్సర్ పెరుగుదలలవల్ల కూడా నొప్పితోపాటు రక్తం అపరిమితంగాస్రవిస్తుంది. అనియతంగా రక్తం స్రవిస్తున్నప్పుడు ఏ మాత్రం అశ్రద్ధ చెయ్యకుండా వైద్య సలహా తీసుకోవాలి. దీనిలో సమస్య తీవ్ర రూపం దాల్చెంత వరకూ మలద్వారంలో నొప్పి తెలియకపోవచ్చు. కనుక ముందే జాగ్రత్తపడాలి. ఔషధాలు: భల్లాతకవటి, చిత్రకాదివటి. బోలబద్ధ రసం, బోలపర్పట

ధన్యవాదములు 🙏

మీ నవీన్ నడిమింటి

ఫోన్ - 9703706660

అస్వీకార ప్రకటన: ఈ సైటుపై లభ్యమవుతున్న మొత్తం సమాచారము మరియు లేఖనము కేవలం అవగాహనా ఆవశ్యకతల కొరకు మాత్రమే. ఇక్కడ ఇవ్వబడిన సమాచారమును ఏదైనా ఆరోగ్య సంబంధిత సమస్య లేదా అస్వస్థత నుండి కోలుకోవడానికి లేదా స్వస్థత కొరకు నిపుణుల సలహా లేనిదే ఉపయోగించుకోకూడదు. చికిత్స పరీక్షలు మరియు సేవల కొరకు ఎల్లప్పుడూ ఒక అర్హత పొందిన వైద్యుల సలహా తీసుకోవాలి.



కామెంట్‌లు లేవు: