మాస్కు ధరించిన యువతి

కరోనావైరస్ ఎవరికైనా వ్యాపించవచ్చు. కానీ, ఇప్పటికే కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్న వారికి లేదా వయసు పైబడిన వారికి ఇది చాలా ప్రాణాంతకం.

‘ద లాన్సెట్ జర్నల్‌’లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం వృద్ధులు.. అధిక రక్తపోటు, డయాబెటిస్ ఉన్నవారికి కరోనా వైరస్ వల్ల ప్రమాదం ఎక్కువ

డయాబెటీస్ ఉన్న వారికి ఇది ఎంత ప్రమాదం

కరోనావైరస్‌తో చనిపోయినవారిలో వృద్ధులున్నారు. ఆస్పత్రుల్లో చేర్చేటప్పటికే వారిలో సెప్సిస్(ఇన్ఫెక్షన్ వల్ల అవయవాలు పనిచేయడం మానేయడం) లక్షణాలు కనిపించాయి. వారికి హైబీపీ, డయాబెటీస్ లాంటి వ్యాధులు ఉన్నాయి.

అయితే, శాంపిల్ సైజ్ చిన్నది కావడం వల్ల పరిశోధన ఫలితాల వివరణ పరిమితం అయ్యుండొచ్చని పరిశోధకులకు అనిపిస్తోంది.

మీకు ఇప్పటికే ఏదైనా వ్యాధి ఉండి, కరోనావైరస్ వస్తుందని భయంగా ఉంటే, అలాంటప్పుడు మీరు ఏం చేయాలో నిపుణులు చెబుతున్నార

కరోనావైరస్

ఎక్కువ ప్రమాదం ఎవరికి?

మీకు ఇప్పటికే ఏదైనా వ్యాధి ఉంటే, కరోనా వైరస్ ఇతరులతో పోలిస్తే త్వరగా వస్తుందని ఏం లేదు. కానీ ఒకసారి ఇన్ఫెక్షన్‌కు గురైతే, ఆ తర్వాత మీ పరిస్థితి మిగతా రోగుల కంటే సీరియస్‌గా ఉండచ్చు.

కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల వృద్ధులు, ఇప్పటికే శ్వాస సంబంధిత వ్యాధుల(ఆస్తమా)తో ఇబ్బంది పడుతున్నవారు, రోగనిరోధక శక్తి లేకపోవడం, మధుమేహం, గుండె సంబంధిత వ్యాధులు లాంటివి ఉన్నవారు తీవ్ర అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

చాలామంది రోగులు కొన్ని రోజులు విశ్రాంతి తర్వాత కరోనా ఇన్పెక్షన్ నుంచి కోలుకుంటారు. చాలా మందిలో ఇది తీవ్రం కావచ్చు. అరుదుగా దీనివల్ల ప్రాణాపాయం కూడా ఉండచ్చు. దీని లక్షణాలు మిగతా వ్యాధుల్లాగే అనిపిస్తుంటాయి. అంటే దగ్గు-జలుబు, జ్వరం, శ్వాస ఇబ్బందులు లాంటివి ఉంటాయి.

కరోనావైరస్ ఆస్తమా

ఆస్తమా ఉంటే ఏం చేయాలి?

ఆస్తమా ఉన్నవారు డాక్టర్ సూచించిన ఇన్‌హేలర్ వాడుతూ ఉండాలి. అలా చేయడం వల్ల ఏదైనా వైరస్ నుంచి వచ్చే ప్రమాదం తగ్గుతుంది.

మీ ఇన్‌హేలర్ ప్రతిరోజూ మీతోనే ఉంచుకోవాలి. మీకు ఆస్తమా పెరుగుతున్నట్టు అనిపిస్తే, మీకు కరోనావైరస్ వచ్చే ప్రమాదం ఉంది. అలాంటప్పుడు హెల్ప్ లైన్ నంబర్‌ను సంప్రదించాలి.

డయాబెటిస్ ఉంటే ఏం చేయాలి?

టైప్ వన్, టైప్ టూ డయాబెటిస్ ఉన్నవారిలో కరోనావైరస్ లక్షణాలు తీవ్రంగా ఉండవచ్చు.

"కరోనావైరస్ లేదా కోవిడ్-19 డయాబెటిస్ రోగుల్లో కాంప్లికేషన్స్ సృష్టించవచ్చు. మీకు డయాబెటీస్ ఉంటే, దగ్గు, జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వస్తుంటే, మీ బ్లడ్ షుగర్ చెక్ చేసుకుంటూ ఉండాలి. డాక్టర్ సాయం తీసుకోవాలి" అన్నారు డయాబెటీస్ యూకే హెడ్ ఆఫ్ కేర్ డాన్ హావర్త్.


కరోనావైరస్

"పెద్ద వయసు వారి ఆరోగ్యాన్ని వారి కుటుంబాలు, స్నేహితులు జాగ్రత్తగా చూసుకోవడం చాలా అవసరం. వారి ఆరోగ్యం గురించి మీకు ఏదైనా సందేహం లేదా గందరగోళం ఉంటే దాని గురించి మరింత సమాచారం తెలుసుకోండి" అని ఏజ్ యూకే చారిటీ డైరెక్టర్ కెరోలైన్ అబ్రహాం చెప్పారు.

ఇప్పటికే ఏదైనా వ్యాధి ఉంటే?

హై బ్లడ్ ప్రెజర్, శ్వాస సంబంధిత సమస్యలు, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు వైరస్ రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

కరోనావైరస్ వల్ల కూడా శ్వాస సంబంధిత సమస్యలు రావచ్చు. ఈ వైరస్ గొంతు, శ్వాసనాళం, ఊపిరితిత్తులపై ప్రభావం చూపిస్తుంది. దాంతో, ఇప్పటికే ఏవైనా సమస్యలు ఉంటే, వాటికి చికిత్స తీసుకోవడం సవాలుగా మారుతుంది. ఒకవేళ ఫ్లూ లక్షణాలు కనిపిస్తే, వెంటనే డాక్టర్ సలహాలు తీసుకోవాలి.


మధుమేహానికి ఆయుర్వేద వైద్యం


ఆయుర్వేదం గుర్తించిన అనారోగ్య కారకాలలో మొదటిది వంశపారంపర్యంగా వచ్చే మధుమేహం, గుండెజబ్బులు వంటి తదితర వ్యాధులు. వంశపారంపర్యంగా కాకుండా ఆరోగ్యపుటలవాట్లలో తేడావల్ల తలెత్తే వ్యాధులు ఉన్నాయి. నేటి ఆధునిక జీవితంలో చాలామందిని ఇబ్బంది పెడుతున్న సమస్య మధుమేహం.

ఆయుర్వేదం ప్రకారం కఫంలో తేడావల్ల మధుమేహం వస్తుంది. ఈ సమస్య నుంచి బయటపడేందుకు ఆయుర్వేదంలో ఒకటికన్నా ఎక్కువ పద్ధతులున్నాయి. మొదటగా ఆహారపుటలవాట్లు మార్చాలంటుందీ శాస్త్రం.

చక్కెర, పిండి పదార్థాలను ఆపి, ముడి బియ్యం, గోధుమ, ఓట్‌ల వంటి పదార్థాలను తినమంటుంది. మధుమేహం వచ్చిందని తెలియగానే చక్కెరలు, బియ్యం, బంగాళాదుంపలు, బెల్లం, చెరకు, తియ్యని పండ్లు వంటివన్నీ తీసుకోవడం తగ్గించాలి.

బార్లీ గింజలను త్రిఫల కషాయంలో రాత్రంతా నానవేసి ఉంచి, మరుసటి రోజు తేనెతో కలిపి రెండు మూడు దఫాలుగా తినాలి. జామ, జామ విత్తన పొడి తీసుకోవచ్చు. తాజా ఆకు కూరలు, పెసలు, సోయాను ఆహారంలో తీసుకోవచ్చు.

మెంతిపొడి రెండు స్పూన్లను పాలలో వేసుకుని తాగాలి. 15 నుంచి 20 తాజా మామిడాకులు ఒక గ్లాసు నీటిలో మరిగించి, ఆ రాత్రంతా ఉంచాలి. మరుసటి రోజు ఉదయాన్నే ఆ నీటిని పరగడుపున తాగాలి. శరీరానికి పొటాషియం, విటమిన్ సి, ఇ, బి కాంప్లెక్సులు ఎక్కువగా చేరేలా ఆహారపదార్థాలు తీసుకోవాలి.

అదేవిధంగా ప్రతి రోజూ ముదిరిన కరివేపాకు ఆకులు పదింటిని తినాలి. ఇలా మూడు నెలలపాటు పాటిస్తే... వంశపారంపర్యంగా వచ్చే మధుమేహం వంటి వ్యాధులు దరిచేరకుండా చేసుకోవచ్చు. మధుమేహం ప్రారంభ దశలో ఉన్నప్పుడు పసుపు, కలబంద జిగురులను కలిపి తీసుకుంటే క్లోమం, కాలేయ గ్రంథుల క్రియలు నియంత్రించబడతాయి. కాకర రసం లేదా నిమ్మ రసం తాగినా





కరోనావైరస్

మీరు పొగతాగుతున్నారా?

"పొగతాగేవారికి శ్వాసనాళ సంబంధిత ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పొగతాగనివారితో పోలిస్తే వీరికి న్యూమోనియా వచ్చే ప్రమాదం రెట్టింపు ఉంటుంది. పొగతాగడం మానేయడం వల్ల మీకు చాలా రకాల ప్రయోజనాలు ఉంటాయి. కరోనావైరస్ ఈ సమస్య నుంచి ప్రేరేపితమై, పరిస్థితి తీవ్రం కాకముందే వారు పొగతాగడం వదిలేయడం మంచిది" అని అన్నారు.

శ్వాస తీసుకోగలిగేలా రోగికి సాయం చేయడం, శరీరం వైరస్‌తో సమర్థంగా పోరాడగలిగేలా వారి రోగనిరోధక శక్తిని పెంచడం అనే వాటిపై కరోనావైరస్‌కు చికిత్స ఆధారపడి ఉంటుంది.

భారత్‌లో ఇప్పటివరకూ 147 కరోనావైరస్ కేసులు బయటపడ్డాయి. వీరిలో ముగ్గురు చనిపోయారు.

ఈ వైరస్ వల్ల ఇప్పటివరకూ 146 దేశాలు ప్రభావితం అయ్యాయి. 1,53,648 ఇన్ఫెక్షన్ కేసులు నమోదైనట్లు ధ్రువీకరించారు.



కరోనావైరస్ నుంచి మిమ్మల్ని మీరు ఇలా రక్షించుకోండి

ధన్యవాదములు 
మీ నవీన్ నడిమింటి 
విశాఖపట్నం 
9703706660
*సభ్యులకు విజ్ఞప్తి*
******************
ఈ గ్రూపులో పెడుతున్న మెసేజ్ లన్నీ సభ్యులలో ఆరోగ్యం పట్ల ప్రాధమిక అవగాహన కోసమే అని గమనించాలి. వివిధ జబ్బులగురించి నివారణలు సూచనలు కూడా సభ్యులలో అవగాహన పెంచడానికి మాత్రమే ..మీ డాక్టరు కి ఇది ప్రత్యామ్నాయము కాదు. సభ్యులు గమనించాలి.