వీడీఅర్ఎల్ పరీక్ష అంటే ఏమిటి?, VDRL Test - about
గర్భస్థ శిశువుకు వ్యాధి సోకితే గర్భస్రావం జరిగే అవకాశం ఉంది. బిడ్డ జన్మించిన తర్వాత కొద్దికాలానికే చనిపోవచ్చు. శిశువు సిఫిలిస్ తో బాధపడుతున్నప్పటికీ ఆ లక్షణాలు పుట్టిన వెంటనే కొందరిలో కనపడవు. క్రమంగా కొద్దికాలానికి సిఫిలిస్ లక్షణాలు బయతపడతాయి.
శిశువు జన్మించిన కొద్దివారాలకి ఈ లక్షణాలు బయటపడవచ్చు. లింఫ్ గ్రంథులు వాయడం, పాలు త్రాగాకపోవడం, నీరసంగా ఉండడం, ఎర్రటి దద్దుర్లు కనపడడం, జననేంద్రియాల వద్ద పుండ్లు రావడం వంటివి జరగవచ్చు. ఇంకా అనేక లక్షణాలు కనపడతాయి. ఇటువంటప్పుడు వైద్యులను సంప్రదించి, సిఫిలిస్ అని అనుమానం ఉంటే ఆ విషయమూ చెప్పడం మంచిది. సిఫిలిస్ లక్షణాలు మొదటిసారి శిశువులో కనిపించినప్పుడే జాగ్రత్త పడాలి. కొంతమందికి మొదటిసారి ఎటువంటి మందులు వాడకపోయినా తగ్గిపోతుంది. అది పూర్తిగా తగ్గిపోవాడం మాత్రం కాదు. కొద్దికాలానికి వ్యాధి రెండవ దశలోకి అడుగుపెట్టి మరల వ్యాధి లక్షణాలు కనబడతాయి.
తల్లి నుంచి సిఫిలిస్ వ్యాధికారాక క్రిములు సంక్రమించిన శిశువులో అరుదుగా కొందరికి చాలాకాలం వరకు అసలు సిఫిలిస్ లక్షణాలనేవే కనిపించకపోవచ్చు. ఇదేమీ వ్యాధి లేదనడానికి చిహ్నం కాదు. వయసు పెరుగుతున్నప్పుడు ఎప్పుడో మెల్లగా ఆ లక్షణాలు బయటపడతాయి. ఇలాంటి పరిణామాలన్నీ దృష్టిలో ఉంచుకుంటే ముందే చికిత్స చేయించుకోవడం అన్ని విధాలా ఉత్తమం.
- ==============================