24, ఆగస్టు 2022, బుధవారం

ముఖం పై నల్లగా తనం పోవడం ఆయుర్వేదం పరిష్కారం మార్గం



Dark Circles: ముఖం మీద నల్ల మచ్చలు వేధిస్తున్నాయా...? ఈ నవీన్తొ నడిమింటి సలహాలు తీసుకోని పరిష్కారం తెలుసు కోవాలి లగించుకోండి..

నల్లమచ్చలు లేదా నల్లబొంగు లేదా మంగుమచ్చలు.. చర్మం మీద చూడటానికి అసహ్యంగా కనిపిస్తాయి. మీరు ఎంత అందంగా ఉన్నా... కళ్ల కింది భాగంలోనో.. నుదురు భాగంలోనో అయే నల్ల మచ్చలు చూడటానికి వికారంగా కనిపిస్తాయి.


మొటిమలు
============
టీనేజర్స్ ని భయపెట్టే వాటిల్లో మొటిమలకే పెద్దపీట. నూటికి 99శాతం మందికి మొటిమలు వస్తాయి. మొటిమలు రావడానికి వయస్సు ఒక్కటే కారణం కాదు. జిడ్డుచర్మం, ఆయిల్ స్కిన్ కలవారే దీని బారిన ఎక్కువ పడుతుండగా మిగతా వారు కూడా కొన్ని పరిస్థితులలో ఈ సమస్యతో బాధపడుతున్నారు. దీనికి వైద్యం లేని సమస్య ఏమాత్రం కాదు. కొన్ని జాగ్రత్తలు..దానికి తగిన మందులు వాడితే సకాలంలో మొటిమలను ఎదుక్కోవచ్చు. అసలు మొటిమలు ఎలాంటి పరిస్థితుల్లో వస్తాయి.
1. మొటిమలు సాధారణంగా ఒత్తిడి, అలసట, నీరసం వంటివి మొటిమలు రావడానికి దోహదం చేస్తాయి. 
2. చర్మానికి పడని సౌందర్యసాధనాలు ఉపయోగించినప్పుడు కూడా మొటిమలు వచ్చే అవకాశం వుంది. కొన్ని రకాల సాధనాలు అందరికీ పడవు. వాటి గురించి తెలుసుకోకుండా వాడడం కూడా ప్రమాదమే. 
3. హార్యోన్లలో సమతుల్యం లోపించినప్పుడు మొటిమల బాధ ఎక్కువగా వుంటుంది. మెనోపాజ్ దశకు చేరుకున్న స్త్రీలు కూడా కొన్ని సార్లు వీటిని బారీన పడుతుంటారు. అండ్రోజెన్ ఉప్పత్తి ఆగిపోయనప్పుడు తప్పనిసరిగా మొటిమలు వస్తాయని నిపుణులు అంటున్నారు. 
4. విటమిన్ బి12 లోపంతో బాధపడే వారిలో ఎక్కువగా కనిపిస్తాయి. ముఖ్యంగా స్త్రీ లలో ఈ లోపం అధికంగా కనపడుతుంది. 
5. ఎక్కువ వేడి, చెమట మొటిమలు రావడానికి కారణం కావచ్చు. 
6. ముఖ్యంగా స్త్రీలు వంటింట్లో ఎక్కువ సేపు పొగ, నూనె మధ్య గడిపే వారికి మొటిమలు వచ్చే అవకాశముందని సర్వేలు తేలుస్తున్నాయి.
మొటిమలు నివారణ ఇలా...
మందులు, స్కిన్ ట్రీట్ మెంట్ తీసుకోవడం ద్వారా వీటి నుంచి తప్పించుకోవచ్చు. వీటితో పాటు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. అవేంటంటే...మొదటగా మొటిమలను గిల్లడం, గిచ్చడం చేయకూడదు. గోరువెచ్చని నీటితో రోజుకు 4 నుండి 6 సార్లు శుభ్రపరుచుకోవాలి. డాక్టర్‌ సలహా లేకుండా రకరకాల క్రీములను, లోషన్‌లను వాడకూడదు. సున్నిపిండితో ముఖాన్ని శుభ్రం చేసుకోవడం చాలా మంచిది. రోజుకు సరిపోయేంతగా నిద్రపోవాలి. కనీసం ఆరు గంటలు నిద్రపోవాలి. ఫాస్ట్‌ఫుడ్స్‌, ఆయిల్‌ఫుడ్స్‌, స్వీట్లు, నిల్వ ఉన్న ఆహారపదార్థాలు తినకూడదు. ప్రకృతి సిద్ధమైన పౌష్టికాహారాన్ని తీసుకోవాలి. మొలకెత్తిన విత్తనాలు, ఆకుకూరలు, పండ్లు, కాయగూరలు ఎక్కువగా తీసుకోవాలి. మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలి. ప్రతీరోజూ విధిగా కొంత సమయం యోగా, వ్యాయామం చేయడం వల్ల అధిక ప్రయోజనం పొందవచ్చు.
1. నూనె సంబంధిత క్రీములు, ఆయింట్మెంట్లు వాడడం పూర్తిగా మానుకోవాలి. 
2. ముఖం మీద చిన్న పొక్కులు కనిపించిన వెంటనే దానిని చిదమడంకానీ, గిల్లడం కానీ చేయకూడదు. 
3. చర్మాన్ని తరచూ గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటూ ఉండాలి. 
4. ఒత్తిడిని తగ్గించుకొనే కార్యక్రమాన్ని యజ్ఞంలా చేపట్టండి.
5. తీసుకొనే ఆహారంలో విటమిన్ బి12తప్పనిసరిగా తీసుకొనేటట్లు చూసుకోవాలి. 
6. నూనెతో చేసిన పదార్థాలను మితంగా తీసుకోవాలి. లేదా పూర్తిగా మానేయడమే మంచిది. 
7. జాగ్రత్తలు తీసుకున్నా మొటిమలు తగ్గకపోతే వెంటనే సంబంధిత వైద్యుడిని సంప్రదించాలి.
8. కాలిబ్రోమేటం : మొటిమలకు ఇది ముఖ్యమైన మందు. టీనేజ్‌లో వచ్చే అన్ని రకాల మొటిమలను ఈ మందు తగ్గిస్తుంది. మొటిమలు ముఖంపై, ఛాతీపై వచ్చి చీము ఉండటం, దురదగా అనిపించడం ఈ మందులో గమనించదగిన లక్షణం.
1/ 9

హర్మోన్ల సమస్య కారణంగా కళ్ల కింది భాగంలో నల్ల మచ్చలు ఏర్పడుతాయి. అంతేగాక ఎక్కువగా ఎండలో తిరిగేవాళ్లలోనూ ఈ సమస్య ఉంటుంది. సూర్యుని నుంచి వచ్చే అతినీలలోహిత కిరణాలు.. సూటిగా వచ్చి చర్మాన్ని తాకడం వల్ల ఈ సమస్య ఇంకా ఎక్కువవుతుంది.

2/ 9

ఏ వయసు వారికైనా ఈ సమస్య ఉంటుంది. వయసు పెరిగేకొద్దీ ఈ సమస్య ఎక్కువవుతుంటుంది. వీటి వల్ల శారీరక నొప్పి లాంటిది ఏమీ లేకున్నా.. బయటకు వెళ్లాలంటే ఇబ్బందిగా ఫీల్ అవుతారు ఈ సమస్య ఉన్నవాళ్లు. ఇక తెల్లగా.. ఫేయిర్ స్కిన్ ఉన్నవారి బాధ వర్ణణాతీతం. ఇది ఎక్కువైతే హైపర్ పిగ్మెంటేషన్ కు దారి తీసే ప్రమాదం కూడా ఉంది.


3/ 9

డార్క్ సర్కిల్స్ ను తగ్గించుకోవడానికి చాలా మంది ఆసుపత్రిలలో వేలకు వేలు ఖర్చు చేస్తారు. కొద్దికాలం పాటు అవి తగ్గినట్టు అనిపించినా.. మళ్లీ వస్తాయి. ఈ సమస్యకు ఇంట్లో ఉండే ఐటెమ్స్ తోనే తొలగించుకోవచ్చు.

4/ 9

ఐస్ బ్యాగ్స్.. నల్ల మచ్చల మీద ఐస్ బ్యాగులను ఉంచే ట్రీట్మెంట్ ఎంతో ఉపయోగకరం. ఐస్ బ్యాగులను తరుచూ నల్లమచ్చల మీద ఉంచి మర్దనా చేస్తే ఉపయోగముంటుందని నిపుణులు సూచిస్తున్నారు. దీంతోపాటు.. కీరదోస, టీ బ్యాగులను ఉంచినా ఫలితం భాగుంటుందట..


5/ 9

టమోటా.. టమోటా రసంలో ఉండే పోషకాలు ముఖం మీద నల్ల మచ్చలను పోగోట్టడంలో ఎంతో తోడ్పడుతాయి. టమోటాలను ముక్కలుగా కోసి.. నల్లమచ్చల మీద 20 నుంచి 30 నిమిషాల వరకు ఉంచాలి. అలా కాకున్నా.. ఆ గుజ్జును మచ్చల మీద రాసి ఆరబెట్టాలి. ఇలా చేసిన తర్వాత చల్లటి నీళ్లతో ముఖాన్ని కడుక్కోవాలి. అంతేగాక టమోటా గుజ్జులో కొంత గంధపు పొడి వేసినా ఫలితం కనిపిస్తుంది.

6/ 9

బంగాళదుంపలు.. బంగాళ దుంపలపై ఉండే తొక్కలను తొలగించి సన్నగా తురుముకుని వాటిని రసం వచ్చేలా పిండండి. ఒక దూది తీసుకుని.. ఆ రసంలో ముంచి.. దానిని మచ్చలు ఉన్నచోటు పూయండి. అలా 15 నుంచి 20 నిమిషాల పాటు ఉంచిన తర్వాత.. చల్లటి నీటితో ముఖం శుభ్రం చేసుకోండి. ఇలా రెండ్రోజులకొకసారి చేసుకుంటే మచ్చలు తొలిగిపోతాయట.


7/ 9

పసుపు.. ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్న పసుపు ద్వారా నల్ల మచ్చలు తొలగడమే కాదు.. చర్మం కాంతివంతంగా కూడా తయారవుతుంది. తాజా పసుపును పేస్ట్ లాగా చేసుకుని పెట్టుకుని.. కొంతసేపటి తర్వాత ముఖాన్ని కడుక్కోండి. ఇలా తరుచూ చేస్తే నల్లమచ్చలే కాదు.. చాలా చర్మ సమస్యలకు చెక్ పెట్టొచ్చు.

8/ 9

విటమిన్ ఇ ఉన్న నూనెలు, కొబ్బరి నూనెలతో నల్ల మచ్చలు ఉన్న చోట మసాజ్ చేస్తే కూడా అవి తొలిగించుకోవచ్చట. నూనెతో తరుచూ మచ్చలు ఉన్న చోట మసాజ్ చేసుకుంటే మంచి ఫలితాలు చూడొచ్చు.


9/ 9

కలబంద జెల్... కలబంద కూడా ఔషధాలు నిండుగా ఉన్న మొక్కే. స్నానం చేసే ముందో.. లేదా రోజులో మీకు వీలున్నప్పుడో కలబంద గుజ్జును డైరెక్టుగా గానీ.. రసాన్ని తీసి గానీ ముఖంపై అప్లై చేస్తే నల్ల మచ్చలు తొలగిపోతాయి.

Published by:Naveen Nadiminti.
ఫోన్ -9703706660
విశాఖపట్నం 

కామెంట్‌లు లేవు: