పైల్స్ ను మొలలు, హేమరాయిడ్స్ అంటారు.
పైల్స్ కు ప్రధాన కారణం మల బద్ధకం.
సుఖ విరేచనo అయ్యేలా చూసుకోవాలి.
ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి.
మల బద్ధకానికి కారణం తక్కువ నీరు త్రాగడం, మసాలా ఆహారాలు, మాంసాహారం, నిల్వ పచ్చళ్ళు, fast food ఎక్కువగా తినడం, ఆహారంలో తక్కువగా పీచు పదార్థాలు తీసుకోవడం, మైదాతో చేసిన పదార్థాలు, bakery 🧁 🥯 పదార్థాలు ఎక్కువగా తినడం. స్తబ్ద జీవనం. మల విసర్జన వాయిదా వేయడం, కొన్ని మందుల side effects, pregnancy, స్థూల కాయం etc.
మల విసర్జన సమయంలో నొప్పి లేకుండా రక్తం పడటానికి అనేక అనారోగ్య పరిస్థితులు కారణం కావచ్చు. మొలలు కావచ్చు.
మొలలు అనేవి పాయువు యొక్క లోపలి లేదా బయటి పొరలపై ఉబ్బిన రక్త నాళాలు. అవి సాధారణంగా నొప్పి లేకుండా ఉంటాయి, కానీ అవి పగిలితే, రక్తస్రావం సంభవించవచ్చు. మల విసర్జన సమయంలో రక్తస్రావం సంభవించినప్పుడు, మొలలు ఒక సాధ్యమైన కారణం.
ఫిషర్: ఇది పాయువు యొక్క లోపలి పొరలో చిన్న చిరిగిపోవడం. ఇది నొప్పి మరియు రక్తస్రావం కలిగిస్తుంది.
అల్సరేటివ్ కోలైటిస్: ఇది పెద్దప్రేగు యొక్క శ్లేష్మ పొరను ప్రభావితం చేసే దీర్ఘకాలిక అల్సర్లు. ఇది నొప్పి, రక్తస్రావం మరియు మలం మార్పులను కలిగిస్తుంది.
క్రోన్స్ వ్యాధి: ఇది పెద్దప్రేగు మరియు చిన్న ప్రేగులను ప్రభావితం చేసే దీర్ఘకాలిక అల్సరేటివ్ వ్యాధి. ఇది నొప్పి, రక్తస్రావం మరియు మలం మార్పులను కలిగిస్తుంది.
క్యాన్సర్: పాయువు లేదా పెద్దప్రేగు క్యాన్సర్ మల విసర్జన సమయంలో రక్తస్రావానికి కారణం కావచ్చు.
మీకు మల విసర్జన సమయంలో నొప్పి లేకుండా రక్తస్రావం ఉంటే, వెంటనే వైద్యుడిని సంప్రదించడం చాలా ముఖ్యం.
Piles తీవ్రత, వాటి స్థాయిని బట్టి 4 రకాల దశలు వుంటాయి. 3వ,4వ దశలో మల విసర్జన సమయంలో బయటకు వచ్చిన piles లోనికి మరల లోనికి పోవు.మల ద్వారం బయటనే ఉండిపోతాయి.తరచుగా ఇన్ఫెక్షన్ కు గురవుతాయి.ఆపరేషన్ అవసరం.
ఆయుర్వేదంలో క్షార సూత్ర పద్ధతి లో చికిత్స వుంటుంది.
Piles కు హిమాలయ వారి pilex ఆయుర్వేదిక్ టాబ్లెట్స్ మంచిగా పనిచేస్తాయి.
అలాగే బైద్యనాథ్ వారి sid piles, అభయారిష్ట కషాయం, pirrhoid బిళ్ళలు,
ఇరిమేదాది తైలము పనిచేస్తాయి.
అల్లోపతిలో constac మాత్రలు, doxycycline మాత్రలు, daflon 500mg tablets, recticare ointment ఉపశమనం కలిగిస్తాయి.
ఆయుర్వేదంలోనూ, హోమియోపతీ లోనూ పైల్స్ సమస్యకు మంచి మందులు ఉన్నాయి. ఈ క్రింది చెప్పిన ఒక్కొక్కటీ కూడా 50 నుండి 70 రూపాయల మధ్యలో బజారులో తేలికగా దొరికేవే.
దానిమ్మ తొక్కల పొడి (Powdered pomegranate peel). ఆయుర్వేద మందుల దుకాణాల్లోనూ, ఆన్లైన్ లోనూ దొరుకుతుంది. చాలా కంపనీలవారు తయారు చేసి అమ్ముతున్నారు. ఉదయం సాయంత్రం ఒకో చెంచాడు చూర్ణం నీటితో కలిపి త్రాగండిి. ఇది రక్తం పోకుండా ఆపుతుంది. ఈ పనిలో ఇంతకు మించిన మందు నాకు కనిపించలేదు అని అంటే అతిశయోక్తి అవుతుందో లేదో వాడిన తరువాత మీరే చెప్పండి.
మీకు బాధను కలిగిస్తున్న ప్రాంతంలో పై పూతగా వ్రాయడానికి ఈ Hamamelis ointment వాడండి. ఇది హోమియో మందుల దుకాణంలో, ఆన్లైన్ లో దొరుకుతుంది. విరేచానానికి వెళ్ళే ముందు, వెళ్ళిన తరువాత వ్రాయడం వలన నొప్పిని, మంటను ప్రభావవంతంగా తగ్గిస్తుంది. నొప్పి, మంట ఎప్పుడు వున్నా దీనిని వ్రాయవచ్చు.
ఇక మూలాన్ని సమూలంగా తగ్గించడానికి మరో హోమియోపతీ మందు Hamamelis Q (మదర్ టింక్చర్). ఇది కూడా పైన చెప్పిన మందే, కాని ఇది త్రాగడానికి వాడే ద్రవరూపంలో వుంటుంది. ఒక 30 ml నీటిలో నాలుగైదుు చుక్కల ఈ మందును కలిపి తీవ్రతను బట్టి రోజూ రెండు మూడు పర్యాయాలు త్రాగండి.
నాలుగవ మందు: పై మూడూ వాడిన తరువాత మీకు నాలుగవది వాడే అవసరం రాదు లెండి! ఈ మూడింటికీ లొంగలేదంటే ఇక మీ సమస్యకు శస్త్రచికిత్సే శరణ్యం.
ఈ సమాచారం ప్రాథమిక అవగాహన కోసం మాత్రమే.
నొప్పి ఎక్కువ ఉంటే మీ ఫ్యామిలీ డాక్టర్సం ప్రదించి తగిన చికిత్స తీసుకోగలరు.
ధన్యవాదములు 🙏
మీ నవీన్ నడిమింటి
ఫోన్ -97037066660