23, జూన్ 2020, మంగళవారం

ఫ్యాటీ లివర్ సమస్య పరిష్కారం మార్గం అవగాహనా కోసం మాత్రమే



సారాంశం

కాలేయంలో ఎక్కువ కొవ్వు (fat) పేరుకుపోవడం వల్ల వచ్చే వ్యాధే కాలేయ వాపు (swelling of liver). కాలేయ వాపు (fatty liver) రెండు రకాలు. 1. మద్యపానపు కాలేయ వ్యాధి-ఇది అధిక మద్యపానం వల్ల వస్తుంది. 2. మద్యపానేతర కాలేయ వాపు (NAFLD)- కాలేయంలో క్రొవ్వు నిక్షేపాలు పేరుకునిపోవడం వల్ల ఏర్పడే “నాన్-ఆల్కహాలిక్ కొవ్వు కాలేయ వ్యాధి (non-alcoholic fatty liver disease-NAFLD).” ఈ రెండో రకం కాలేయ వ్యాధికి ఖచ్చితమైన కారణాలు తెలియవు, అయితే, ఇది ఇన్సులిన్ నిరోధకత మరియు జీవక్రియ లక్షణాలతో ముడిపడి ఉంటుంది. ఈ రెండో రకం కాలేయ వాపు వ్యాధికుండే కాలేయ పరిస్థితులు పాశ్చాత్య దేశాల్లో ఉండే ప్రజల్ని ఎక్కువగా ప్రభావితం చేసే సామాన్య (కాలేయ) లక్షణాల్లో ఒకటి. పరిమాణంలో కాలేయం పెరగడమనే ఒక్క లక్షణం తప్పితే ఏ లక్షణాలు లేకుండా “కాలేయ వాపు వ్యాధి” మనిషిలో నిగూఢంగా ఉండవచ్చు. లేదా పూర్తి కాలేయ వైఫల్యాన్ని సూచించే తీవ్రమైన లక్షణాలతో అకస్మాత్తుగా స్పష్టాతి స్పష్టంగా అగుపడనూవచ్చు. దీనికి వెంటనే వైద్య జోక్యం చాలా అవసరం. కాలేయ వ్యాధిని  నిర్ధారణ చేయడం, వెనువెంటనే తగిన వైద్యం చేయడమే ఈ వ్యాధి నివారణకు మరియు వ్యాధి యొక్క పురోగతిని నివారించడానికి లేదా అదుపు చేయడానికి కీలకం. స్థూలకాయం బరువు తగ్గించడం మరియు వ్యాయామాల ద్వారా కాలేయ ఆరోగ్య నిర్వహణ ప్రస్తుతం రూఢీలో ఉన్న చికిత్స లక్ష్యంగా ఉంది. కాలేయవ్యాధిని ఖచ్చితంగా నయం చేయగల మరియు ప్రభుత్వం అనుమతించిన మందులు లేవు కానీ రోగి పరిస్థితిని బాగు చేసేందుకు ఉపకరించే పలు ఆశావహ మందులు రానున్నాయి. మరింత తీవ్రమైన పరిస్థితులకు శస్త్రచికిత్స అవసరం.

కాలేయవాపు వ్యాధి నివారణ 

కాలేయ వాపు  వ్యాధికి ఒక నిర్దిష్టమైన వైద్య చికిత్స లేదా శస్త్రచికిత్స అంటూ లేదు. కానీ, ఈ కాలేయ వాపు వ్యాధికి గురైన వ్యక్తి తగిన నివారణా  చికిత్స తీసుకుంటే వ్యాధి తీవ్రతను తిరోగమనం పట్టించి కొంత వరకు వాపును బాగు చేసుకోవచ్చు. మద్యపానేతర కాలేయ వ్యాధికి చెందిన నాన్-ఆల్కహాలిక్ స్టీటోహెపటైటిస్-NASH (కామెర్లు) తో బాధపడుతున్నవారు ఈ నివారణా చికిత్స తీసుకుంటే చాలా ప్రభావవంతంగా ఉంటుంది.

కాలేయ వాపు వ్యాధిని ఆపడానికి, ఇంకనూ వ్యాధి తీవ్రతను తిరోగమనం పట్టించడానికి సహాయపడే చర్యలు కింది విధంగా ఉన్నాయి:

  • బరువు తగ్గడం
    సురక్షితంగా బరువు తగ్గడమనేది కాలేయ వాపు ను  నిర్వహించుకోవడంలో తోడ్పడుతుంది. సురక్షితంగా బరువును కోల్పోవడమంటే ఒక వారంలో అర్ద కిలోగ్రామ్ లేదా ఒక కిలోగ్రాము కంటే ఎక్కువ బరువును కోల్పోకుండా ఉండడం.  
  • మద్యపానానికి దూరంగా ఉండటం
    మద్యం సేవించడం కాలేయానికి హానికరం. మద్యం కాలేయంలో విరిగిపోయినప్పుడు కాలేయానికి హాని కలిగించే పదార్థాలను ఉత్పత్తి చేసి విడుదల చేస్తుంది. మాద్యపానాన్ని ఆపేయడం మూలంగా కాలేయం తనలో పేరుకుపోయిన శరీరజన్య విషాన్ని తొలగించడానికి మరియు స్వయంగా నయం చేసుకునే అవకాశాన్నీ కాలేయానికి కల్పించినట్లవుతుంది.  
  • మధుమేహం నియంత్రించటం
    మధుమేహం (చక్కెరవ్యాధి) వ్యాధిని సవ్యంగా నిర్వహించుకుంటూ వెళ్తే మద్యపానేతర కాలేయ వాపు వ్యాధి (NAFLD) ని మెరుగ్గా నయం చేసుకోవడానికి సహాయపడుతుంది.
  • ఆహారసేవనం లో మార్పులు
    మద్యపానేతర కాలేయ వాపు వ్యాధి (NAFLD) రోగుల విషయంలో-వారి వ్యాధి చికిత్స మరియు నిర్వహణలో ఆహారం కీలక పాత్ర పోషిస్తుంది. తాజా పండ్లు, కూరగాయలు మరియు తృణధాన్యాలు వారి ఆహారంలో చేర్చండి మరియు అధిక చక్కెర మరియు ఉప్పు తీసుకోవడం నివారించండి.
  • మీ శారీరక శ్రమపెంచేందుకు వ్యాయామం  
    మద్యపానేతర కాలేయ వ్యాధి రోగులు వారి శారీరక శ్రమ (వ్యాయామాలు మొదలైనవి)ను  కొద్దిపాటిగా పెంచినా అది వారికి చికిత్సాపరమైన మేలును కలుగజేసి ఉపయోగకరమైందిగా కనిపిస్తుంది.
  • మీ వైద్యుడితో నిరంతరంగా పరీక్షలు చేయించుకోవడం
    మీ కాలేయ ఆరోగ్యాన్ని అంచనా వేయడానికి లివర్ స్పెషలిస్ట్ ద్వారా రెగ్యులర్ గా పరీక్షలు చేయించుకుని చికిత్స పొందడం చాలా ముఖ్యమైంది  

కాలేయ వాపు వ్యాధి నిర్ధారణ 

కాలేయ వాపు వ్యాధి నిర్ధారణకు ఎలాంటి నిర్దిష్ట లక్షణాలు లేనందున వైద్యుడు మీ రక్తపరీక్ష పరిశీలనలో ఏదైనా  విలక్షణమైనదాన్ని గమనించినట్లయితే గాని లేక పరిమాణం పెరిగిన కాలేయమును గమనిస్తే గాని ఈ వ్యాధి రోగికున్నట్లు యాదృశ్చికంగానే బయట పడుతుంది. అటువంటి సందర్భాల్లో డాక్టర్ కాలేయ వాపు వ్యాధి యొక్క ఉనికిని పసిగట్టినపుడు కొన్ని రక్త పరీక్షలు, కాలేయ పనితీరు పరీక్షలు, అల్ట్రాసౌండ్, ఒక CT స్కాన్ లేదా ఒక MRI ను మీ కాలేయ స్థితిని నిర్ధారించడానికి గాను సూచించవచ్చు.

మీకు చేసిన అనేక పరీక్షలు మీకు ఎలాంటి ఇతర కాలేయ వ్యాధులు లేవని సూచిస్తూ ఉండగా మీరు మద్యపానేతర స్టీటోహెపటైటిస్ (NASH) లేక కామెర్లతో బాధపడుతున్నారని మరో పరీక్ష తేల్చవచ్చు. ఒక్క కాలేయ జీవాణుపరీక్ష మాత్రమే వ్యాధిని నిర్ధారించగలదు. కాలేయం జీవాణుపరీక్షలో, కాలేయ కణజాలం యొక్క ఒక చిన్న నమూనా తొలగించబడుతుంది మరియు దాన్ని సూక్ష్మదర్శిని క్రింద వైద్యుడు పరిశీలిస్తాడు. డాక్టర్ కాలేయ వాపు వ్యాధి అని  అనుమానిస్తే, మీనుండి ఒక వివరణాత్మక వైద్య చరిత్రను అడిగి తెలుసుకుంటాడు. మరియు మీకు మద్యంపానం అలవాటుంటే దాని గురించి మరియు ఏవైనా మందులసేవనం వల్ల సమస్యను కల్గించి ఉంటె దాన్ని గుర్తించడానికి మీరు తీసుకున్న మందులు గురించి డాక్టర్ మిమ్మల్ని ప్రశ్నలు అడుగుతారు.

కాలేయ వాపు వ్యాధి చికిత్స

రోగికి దాపురించిన కాలేయ వాపు వ్యాధి యొక్క రకాన్ని బట్టి ఆ వ్యాధి నిర్వహణ క్రింది విధంగా ఉంటుంది:

మద్యపానేతర కాలేయ వాపు వ్యాధి (Non-alcoholic Fatty Liver Disease ,NAFLD)

మద్యపానేతర కామెర్ల జబ్బు (NASH)కు గాని లేదా మద్యపానేతర కాలేయ వాపు వ్యాధి (NAFLD)కి గాని  ఎటువంటి స్థిరమైన మందులు లేవు.

  • ఈ కాలేయ వాపు వ్యాధి నిర్ధారణ చేయబడిన వారికి బరువు తగ్గమని వైద్యులు సిఫారసు చేస్తారు. బరువు తగ్గడం మూలంగా  కాలేయంలో పేరుకుపోయిన కొవ్వు, మంట మరియు కాలేయం పై ఏర్పడిన మచ్చలు ( ఫైబ్రోసిస్) తగ్గుతాయి.
  • శారీరక శ్రమ (వ్యాయామాలతో కూడినది కావచ్చు)ను  పెంచడమనేది మొత్తం శరీరంలోని కొవ్వును తగ్గించుకోవడానికే కాక కాలేయంలోని కొవ్వునూ తగ్గించుకోవడానికి సహాయపడుతుంది. శారీరక శ్రమ కార్యకలాపాలు సిఫార్సు చేసిన స్థాయి కంటే తక్కువ అయినప్పటికీ, కేవలం క్రియాశీలకంగా ఉండటం వల్ల మద్యపానేతర కాలేయ వాపు వ్యాధి NALFD లో ప్రయోజనకరమైన ప్రభావాన్ని చూపిస్తుంది.  
  • వైద్యులు మీరు తీసుకున్న మందులను మూల్యాంకనం చేయవచ్చు మరియు కొన్ని ఔషధాలను మార్చమని లేదా మరి కొన్ని మందుల్ని నిలిపివేయమని మిమ్మల్ని అడగొచ్చు. మీ వైద్యుని ఆమోదం లేకుండా మీరు చికిత్సలో భాగంగా తీసుకుంటున్న మందుల్ని   ఆపకండి , అలా చేస్తే అది ఇతర సమస్యలకు దారి తీస్తుంది మరియు మీ ఆరోగ్యానికి ప్రమాదకరమైనదిగా మారే ప్రమాదం ఉందని నిరూపించగలదు.
  • మద్యపానేతర కాలేయ వాపు వ్యాధి (NAFLD) చికిత్సకు ఎటువంటి ఆమోదిత ఔషధాలు లేవని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. కానీ మధుమేహం (చక్కెరవ్యాధి) జబ్బు చికిత్సకు వాడే కొన్ని మందులు మరియు విటమిన్లు కాలేయ వాపు వ్యాధి చికిత్సకు కూడా సహాయపడతాయని సూచించిన ఆధారాలు ఉన్నాయి. ఏదేమైనా ఈ విషయంలో ఎటువంటి నిర్ధారణకు రావడానికి ముందుగా పరిశోధన అవసరం.

మద్యపాన కాలేయ వాపు వ్యాధి

  • మద్యపాన కాలేయ వాపు వ్యాధితో బాధపడుతున్న వారికి చేసే చికిత్సలో అతి ముఖ్యమైన భాగాల్లో ఒకటేమిటంటే వారు మద్యపానాన్ని పూర్తిగా మానెయ్యాలి. మద్యపానాన్ని మానేయడానికి కష్టంగా ఉండేవారికి సహాయకారిగా ఉండే వేరే చికిత్స సిఫారసు చేయబడుతుంది, ఆ చికిత్స ద్వారా మద్యపానాన్ని మానుకోవచ్చు.  
  • మద్యం సేవించడాన్ని మానుకోవడానికి కొన్ని మందులు సహాయం చేస్తాయి. ఎలాగంటే ఈ మందులు తీసుకోవడం ద్వారా మద్యం పుచ్చుకోవాలన్న కోరిక తగ్గిపోతుంది. మద్యం త్రాగితే ఎదో జబ్బుపడినట్లుండే భావనను ఈ మండలి కల్గిస్తాయి.  

జీవనశైలి నిర్వహణ

మీరు కాలేయ వాపు వ్యాధితో బాధపడుతున్నట్లు పరీక్షల ద్వారా నిర్ధారణ అయితే, మీరు మీ దిననిత్యచర్యల్లో కొన్ని జీవనశైలి మార్పులను చేసుకోవాల్సి ఉంటుంది. దీనివల్ల మీ పరిస్థితి మెరుగై  మరింత ప్రభావవంతంగా జీవితాన్ని నిర్వహించడానికి వీలుంటుంది. అలాంటి జీవనశైలి మార్పులు కొన్ని ఏవంటే:

  • మీ ఆహారంలో 3-4 భాగాల తాజా పండ్లు మరియు కూరగాయలను చేర్చండి. అధిక చక్కెర మరియు ఉప్పు తీసుకోవడం మానుకోండి మరియు ప్రాసెస్ చేసిన ఆహారాలకు బదులుగా తృణధాన్యాలను మీ ఆహారంలోకి తీసుకోండి.
  • సంతృప్త కొవ్వులు మరియు క్రొవ్వు ఆమ్లాలు కలిగిన ఆహార పదార్ధాలను తగ్గించి వాటి స్థానంలో ఆలివ్ ఆయిల్ వంటి ఏక అసంతృప్త కొవ్వులు మరియు బహుళఅసంతృప్త కొవ్వులు, ముఖ్యంగా ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలను తీసుకోండి, దీనివల్ల కాలేయ వాపు వ్యాధితో సంబంధం ఉన్న గుండె వ్యాధులు తగ్గే  అవకాశాలు ఉన్నాయి.
  • మీ బరువును అదుపులో ఉంచడానికి మరియు కాలేయంలో పేరుకుపోయిన కొవ్వును తగ్గించడానికి క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి.
  • మీరు విటమిన్లు, లేదా ప్రత్యామ్నాయ మూలికా మందులు వంటివి ఆహార పదార్ధాలుగా తీసుకుంటుం టే, దాని గురించి మీ డాక్టర్తో మాట్లాడటం మరియు అతని/ఆమె సలహా తీసుకోవడం చాలా ముఖ్యం. కొన్ని మూలికా ఔషధాలు మీ కాలేయానికి హానిని కలిగిస్తాయి.
  • కాలేయం దెబ్బతిన్న వ్యక్తులు కొన్ని రకాల అంటువ్యాధులు మరియు “న్యుమోకోకల్” అనే ఒక విధమైన బాక్టీరియా వ్యాధులకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. కాలేయ వాపు వ్యాధి ఉన్న వ్యక్తులు కామెర్ల జబ్బు (హెపటైటిస్ A మరియు B), ఫ్లూ మరియు న్యుమోకోకల్ వ్యాధులకు నిర్దేశింపబడిన టీకామందులు వేసుకోవడం ముఖ్యం. కాలేయ వాపు వ్యాధి ఉన్న వ్యక్తులకు హెపటైటిస్ లేదా కామెర్ల వ్యాధి  చాలా ప్రమాదకరమైనది కావచ్చు మరియు ఇది కాలేయ వైఫల్యానికి కూడా దారితీయవచ్చు.

కాలేయ వాపు వ్యాధి ఉపద్రవాలు మరియు రోగ నిరూపణ 

కాలేయ వాపు వ్యాధి ఉపద్రవాలు మరియు రోగ నిరూపణ

రోగనిరూపణ

ఆరోగ్యకరమైన కాలేయానికి తనకు తానుగా (స్వయంగా) నయం చేసుకోగల గొప్ప సామర్ధ్యం ఉంటుంది, ఒకవేళ గాయపడినట్లయితే తిరిగి కోలుకుంటుంది, మరియు పునరుత్పత్తి కూడా చేసుకోగలదు. కాలేయ వాపు వ్యాధికి సకాలంలో రోగనిర్ధారణ జరిపి వెనువెంటనే చికిత్స చేసినట్లయితే కాలేయానికి అయిన హాని రూపుమాపబడి, రోగం మాయమైపోయి మళ్ళీ కనిపించకుండా పోతుంది. ఇది అనేకమంది రోగుల విషయంలో నిరూపితమైంది. మనిషిలో కాలేయం దెబ్బ తినిందనడానికి మంట మరియు తంతీకరణం (ఫైబ్రోసిస్) అనేవి తొలి లక్షణాలు. ఈ ప్రారంభ దశలోనే కాలేయ వాపు వ్యాధి రోగ నిర్ధారణ అయినట్లయితే, మీ కాలేయం కొంతకాలంలోనే తనకు తానుగా నయం చేసుకోగలదు. ఇలా మన కాలేయం తనకు తానుగా రోగనయం చేసుకోవాలంటే ఆరోగ్యకరమైన జీవనశైలి మరియు ఆహార మార్పులను చేసుకోవాల్సి  ఉంటుంది. కాలేయంలో ఆరోగ్యకరమైన కణజాలం తక్కువగా ఉన్నట్లైతే తంతీకరణం (Fibrosis) తీవ్రంగా పెరిగిపోయి ప్రాణాంతక కాలేయ వ్యాధి  (cirrhosis)గా   రూపాంతరం చెందుతుంది. కాలేయ వ్యాధి సిర్రోసిస్ దశలోకొచ్చినపుడు కాలేయంలో ఆరోగ్యకరమైన కణజాలం  చాలా తక్కువగా ఉంటుంది. ఈ దశలో వ్యాధికి చేపట్టే చికిత్స యొక్క లక్ష్యమంతా కొద్దిగా మిగిలున్న ఈ ఆరోగ్యకరమైన కాలేయకణజాలాన్ని రక్షించి వ్యాధి పురోగతిని నిలిపివేయడం పైన్నే ఉంటుంది.  

ఉపద్రవాలు

కాలేయ వాపు వ్యాధి యొక్క ముగింపు దశ కాలేయ వైఫల్యం (liver failure). కాలేయ వైఫల్యం ప్రాణాంతకమైన కాలేయ వ్యాధి లేదా సిర్రోసిస్ కారణంగా లేదా పోషకాహారలోపం కారణంగా సంభవిస్తుంది. కాలేయ వైఫల్యం సిర్రోసిస్ వల్ల సంభవించినట్లయితే, కాలేయ వైఫల్యం నెమ్మదిగా ఉంటుందని వైద్యులంటారు. ఈ దశలో కాలేయపు పనితీరు నెమ్మదిగా, అంటే సంవత్సరాల తరబడి, క్షీణిస్తుంది. పోషకాహార లోపము వలన సంభవించే కాలేయ వైఫల్యం అకస్మాత్తుగా ఉంటుంది, అంటే కేవలం 48 గంల్లోపలే సంభవించవచ్చు. ఇటువంటి దశలో రోగికి కాలేయ మార్పిడి ఒక్కటే చికిత్స.

కాలేయవాపు వ్యాధి (లేక Fatty Liver Disease) అంటే ఏమిటి?

మానవుడి శరీరంలో కాలేయం అనేది చాలా పెద్ద అంతర్గత అవయవాల్లోఒకటి. కాలేయం మనం తిన్న ఆహారాన్ని జీర్ణం చేసేందుకు, శరీరం నుండి శరీరజన్యవిషాన్ని మరియు ఇతర విషాల్ని తీసివేసి, మన శరీరంలో శక్తిని నిల్వ చేయడానికి మనకు సహాయపడుతుంది. కాలేయంలో కొవ్వు క్రమంగా నిర్మాణమవడమే “కాలేయ వాపుకు దారి తీస్తుంది. మన కాలేయంలో సాధారణంగానే  కొంత కొవ్వు ఉంటుంది అయితే ఇది ఎటువంటి వ్యాధి లక్షణాలను ఉద్భవించనీయదు. అయితే, కాలేయంలో ఉండే కొవ్వుకు తోడు అధికంగా కొవ్వు పేరుకుంటూ పోవడం కాలేయ వాపుకు దారితీస్తుంది. ఈ పరిస్థితినే “కాలేయ వాపు వ్యాధి” గాను, “ఫాటీ లివర్ వ్యాధి” అని పిలువ బడుతుంది.

ఫ్యాటీ లివర్‌ వ్యాధి రకాలు 

ఫ్యాటీ లివర్‌ వ్యాధి రెండు ప్రధాన రకాలు:

  • మద్యపానేతర (నాన్ ఆల్కహాలిక్) కాలేయ వ్యాధి (NAFLD)
    మద్యపానేతర కాలేయ వ్యాధి-NAFLD, కాలేయంలో కొవ్వు పెరిగిపోవడం వల్ల వస్తుంది గాని దీనికీ, మద్యం అధికంగా తీసుకోవడానికి సంబంధం లేని జబ్బు ఇది. మద్యపానేతర కాలేయవ్యాధి రెండు రకాలుగా ఉంటుంది:

    • సాధారణ కాలేయ వాపు
      ఈ సాధారణ కాలేయ వాపు రకంలో కాలేయంలో కొవ్వు పేరుకుపోయి ఉండే పరిస్థితి ఉంటుంది, కానీ, కాలేయ కణాలకు ఎలాంటి హాని ఉండదు. ఇలా కొవ్వు చేరడం వలన ఎటువంటి వాపు గాని, మంట గాని ఉండదు. ఈ పరిస్థితి సాధారణంగా కాలేయానికి ఎటువంటి హాని కలిగించదు మరియు ఎలాంటి సమస్యలను తెచ్చి పెట్టదు.  

    • నాన్-ఆల్కహాలిక్ స్టీటోహెపటైటిస్ (NASH)
      ఈ రకం కాలేయ వాపు స్థితిలో, కాలేయంలో కొవ్వు పేరుకుపోతుంది, ఇంకా వాపు, కాలేయ కణాలకు నష్టం వాటిల్లుతుంది. వాపు, నొప్పితో కూడిన మంట మరియు కాలేయ కణ నష్టం అనేక ఇతర సమస్యలను కలిగిస్తాయి. ఆ ఇతర ఆరోగ్య సమస్యలేవంటే కాలేయంలో వ్యాప్తి చెందే తంతీకరణం (fibrosis), మచ్చలు, ప్రాణాంతక కాలేయ వ్యాధి (cirrhosis) మరియు కాలేయ క్యాన్సర్ వంటివి. (మరింత సమాచారం: సీస్టిక్ ఫైబ్రోసిస్ చికిత్స)

  • మద్యపాన కాలేయ వాపు వ్యాధి
    మద్యపాన కాలేయ వాపు వ్యాధి (Alcoholic fatty liver disease) మద్యం అధికంగా తీసుకోవడం వల్ల సంభవిస్తుంది. మద్యం కాలేయంలో విచ్ఛిన్నం అవుతుంది మరియు కొన్ని హానికరమైన పదార్థాలను  విడుదల చేస్తుంది. ఇలా విడుదలైన హానికారక పదార్థాలు కాలేయ కణాలను దెబ్బ తీస్తాయి మరియు వాపును ఎక్కువ చేస్తాయి. ఫలితంగా, శరీరం యొక్క సహజ రక్షణ వ్యవస్థ నెమ్మదిగా బలహీనపడుతుంది. ఒక వ్యక్తి మితానికి మించి మరింత మద్యం సేవించడం కొనసాగినప్పుడు, కాలేయనష్టం పెరుగుతుంది.

కాలేయ వాపు వ్యాధికి కారణాలు మరియు ప్రమాద కారకాలు 

కారణాలు

మితం మించి మద్యపానం చేయడమే “మద్యపాన కాలేయ వాపు వ్యాధి” కి గల ప్రధాన కారణాలలో ఒకటి. మద్యం శరీరంలోనికి ప్రవేశించాక ‘శరీరజన్య విషం’గా మారి కాలేయం వాపుకు, మంటకు కారణమవుతుంది. కాని మద్యపానేతర కాలేయ వాపు వ్యాధి (NAFLD) మరియు మద్యపానేతర కామెర్ల జబ్బు (Non-alcoholic fatty liver disease-NAFLD)కు  ఖచ్చితమైన కారణం ఇంకా తెలియదు. కాలేయంలో కొవ్వు కణాలు పోగటానికి ఎన్నో కారణాలు. ఈ కారణాల్లో ఎదో ఒక కారణం వల్ల మద్యపానేతర కాలేయ వాపు వ్యాధి (NAFLD) మరియు మద్యపానేతర కామెర్ల జబ్బు-NASH దాపురించవచ్చు.

  • ఆహారం  
    అనారోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వల్ల కాలేయంలో కొవ్వు చేరడం జరుగుతుంది. కనుక, అనారోగ్య ఆహారం కాలేయ వాపు వ్యాధికి ప్రధాన కారణాలలో ఒకటి. అధికమైన కేలరీలు గల ఆహారం  తీసుకోవడం మూలంగా కాలేయం కొవ్వు కణాలపై చయాపచయ క్రియను నిర్వహించడంలో విఫలమై కాలేయంలో కొవ్వు పేరుకుపోవడానికి దారితీస్తుంది.
  • ముందుగానే ఉన్న వ్యాధులు
    రెండో రకం డయాబెటిస్ (Type 2 diabetes), ఊబకాయం లేదా అధిక బరువు వంటి కొన్ని వ్యాధులు, కాలేయ వాపు పరిస్థితికి ఒక వ్యక్తిని మరింత ప్రభావితం చేస్తుంది. ట్రైగ్లిజరైడ్స్ యొక్క అధిక స్థాయి, కొవ్వు కణాల్లోనే ఒక నిర్దిష్ట రకమైన కొవ్వు కణాలు ఎక్కువవడం కూడా కాలేయ వాపు వ్యాధికి గురి చేస్తాయి.  
  • మందులు
    టామోక్సిఫెన్, అమోడియోరోన్ మరియు మెతోట్రెక్సేట్ వంటి కొన్ని ఔషధాలు ఈ వ్యాధి పరిస్థితికి దారితీసే దుష్ప్రభావాలకు కారణమవుతాయి.
  • ఇన్సులిన్ నిరోధకత
    ఇన్సులిన్ నిరోధకత మద్యపానేతర కాలేయ వాపు వ్యాధి (NAFLD)కి అనుసంధానం కావచ్చనే  సూచనలు ఉన్నాయి. కాలేయంలో గ్లూకోజ్ను చయాపచయం (metabolise) చేయడంలో అందులోని కణాలు ఉత్పత్తి అయిన ఇన్సులిన్ను తగినంతగా ఉపయోగించుకోలేక పోవడం మూలంగా కూడా కాలేయంలో కొవ్వు పేరుకుపోతుంది.

ప్రమాద కారకాలు

మద్యపానేతర కాలేయ వ్యాధి (NAFLD)కి ఖచ్చితమైన కారణం తెలియదు. కొన్ని వైద్య పరిస్థితులు మరియు నిర్దిష్ట జాతి నేపథ్యాలతో ఉన్నవారు కాలేయ వాపుకు ఎక్కువగా గురయ్యే పరిస్థితి ఉంది, అంతే గాక ఈ వ్యాధి వారికి మరింత ఎక్కువగా దాపురించే ప్రమాదముంది.  రెండో రకం మధుమేహం (Type 2 diabetes) లేదా ప్రీ-డయాబెటీస్ స్థితి, ఊబకాయం, వయసు మళ్లినవారు, రక్తంలో ట్రైగ్లిజెరైడ్స్ మరియు కొలెస్ట్రాల్ వంటి అధిక స్థాయి కొవ్వు, అధిక రక్తపోటు, కొన్ని క్యాన్సర్ మందులు, హెపటైటిస్-సి వంటి అంటురోగాలు మరియు శరీరజన్య విషపదార్థాలకు గురికావడం వంటి పరిస్థితులు కాలేయవాపు వ్యాధికి దగ్గరయ్యే అవకాశాలను పెంచుతుంది.

కాలేయము సమస్యలుకు ఆయుర్వేదంలో నివారణ కోసం 

 కాలేయాన్ని శుభ్రపరచడానికి --- భ్రుంగరాజరసాయనం               
 
గుంటగలగర  ఆకును  కాటుక ఆకు అని కూడా అంటారు.
 
    పుష్యమి నక్షత్రం వచ్చిన రోజున (ఆదివారమైతే మరీమంచిదిమొక్కలను తెచ్చుకోవాలి
 రోజు మొక్కలలో ఔషధ శక్తి చాలా రెట్లు పెరుగుతుందిగుంటగలగరతెల్లగలిజేరు మొక్కలను తెచ్చి కడిగివేర్వేరుగా ఎండబెట్టాలివారంపది రోజులు ఎండ బెట్టాలి.
 
గుంటగలగర పొడి                 ------100 gr
తెల్ల గలిజేరు పొడి                 ----- 100 gr
వేయించిన నువ్వుల పొడి      ------ 100 gr
కలకండ పొడి                      ------ 100 gr 
 
     మధుమేహ వ్యాధి గ్రస్తులు తాటి బెల్లం వాడవచ్చుఅన్ని పొడులను కలిపి వస్త్రగాయం పట్టి 
గాజు  సీసాలో భద్రపరచుకోవాలి.
         రాత్రి ఆహారానికిఒక గంట ముందు మూడు చిటికెలపొడిని తీసుకోవాలి .తేనెతో కూడా 
తీసుకోవచ్చుఇది కాలేయాన్ని శుభ్రపరుస్తుందిమరియువెంట్రుకలు శాశ్వతంగా నల్లబడతాయి.

   కాలేయ సమస్యలకు ఆహార ఔషధం                      

తెల్ల గలిజేరు            --100 gr
నేల ఉసిరి                --100 gr
గుంటగలగర            --100 gr

       అన్నింటిని సమూలముగా తెచ్చి కడగి ఎండబెట్టివిడివిడిగా దంచి పొడి చెయ్యాలికలిపి 
సీసాలో భద్ర   పరచుకోవాలి.

 పొడిని భోజనానికి ఒక గంట ముందు పావు టీ స్పూనునుండి అర టీ స్పూనుకు పెంచుతూ ఒక కప్పుమంచినీళ్ళలో కలిపి సేవించాలిగంట ముందు గంట వెనుక ఏమితినకూడదు

ఉదయంసాయంత్రం రెండుపూటలా వాడాలి.

కాలేయ సమస్యలు రాకుండా  పొడిని ఆకుకూరలుపప్పుసామ్బారులలో మూడు చిటికెల పొడిని  వేసుకొనితినాలి.
                      లివర్ లేదా కాలేయ సమస్యలనివారణ                      
1. చంద్రభేదన ప్రాణాయామం

2. శీతలి ప్రాణాయామం:-- మోకాళ్ళ మీద కూర్చొనినాలుకను దొన్నె లాగా మడిచి గాలి పీల్చి
 నోరు మూసి ముక్కుతో గాలి వదలాలి.

3. మోకాళ్ళ మీద గానిలేదా పద్మాసనం  లో గాని కూర్చొనిపై దవడ పళ్ళనుకింది దవడ పళ్ళను కలిపినొక్కిఆరోగంగా కాలేయం పెదవులను తెరిచి పళ్ళమధ్యనుండి గాలిని పీల్చి నోరు మూసి ముక్కు నుండి గాలివదలాలి.

   50 గ్రాముల శనగలను గుగ్గిళ్ళ లాగా ఉడికించి వాటిమీద కొద్దిగా సైంధవ లవణం చల్లాలిమరో 50గ్రాముల శనగలను  కొద్దిగా నెయ్యి వేసి వేయించి సైంధవ లవణంచల్లాలి.

      ఉడికించిన శనగలను ఉదయం పరగడుపున తినాలి. 15 నిమిషాల తరువాత వేయించిన 
శనగలను తినాలి.  

పులుపుఎక్కువ కారంమద్యంసిగరెట్మాంసంచేపలుగుడ్లు వంటివి మానెయ్యాలి.

   కాలేయ సమస్యలు --- నివారణ                    

పచ్చి శనగలను నానబెట్టి ఉడికించాలి (గుగ్గిళ్ళు)

శనగ గుగ్గిళ్ళు ----- 50 gr

       శనగలను మెత్తగా ఉడికించి వాటి పై సైంధవలవణాన్ని చల్లాలివీటిని ఉదయం పరగడుపునతినాలి. విధంగా ఉదయం పరగడుపున రోజుకు 50 గ్రాముల గుగ్గిళ్ళ చొప్పున 15 రోజులు తినాలిఒక గంటవరకుఏమి  తినకూడదు.

      15 రోజుల తరువాత ఇంకొక 50 గ్రాముల శనగలనువేయించుకొని తినాలిఅనగా గుగ్గిళ్ళు మరియు   వేయించిన శనగలను 16  రోజు నుండి 30  రోజువరకు తినాలి.

 30 రోజులు పూర్తిగా కారాన్ని నిషేధించాలి.

        బహిష్టు సమయంలో వచ్చే కాలేయ సమస్యలు--- నివారణ          

             మురికి రక్తం నిల్వ వుంటే ఆకలి మందగించికాలేయ సమస్యలు వస్తాయి.

మట్టి పట్టి వెయ్యాలి.

పొట్ట మీద కుడి వైపు ప్రక్కటెముకల కింద పట్టి వేసి గాలితగలకుండా దుప్పటి కప్పి ఉంచాలి.

1. వెల్లకిలా పడుకొని మోకాలును గడ్డానికి ఆనించాలికాలును చాపాలి మరలా ఆనించాలిరెండవకాలుతోనుఅలాగే చేయాలి వ్యాయామాన్ని వేగంగాచెయ్యాలి.

2. నిటారుగా నిలబడి చేతులనుముందుకు చాపి కాళ్ళుకదిలించకుండా పక్కలకు తిరగాలి.

3. నిటారుగా నిలబడి చేతులను ముందుకు చాపి వంగిఎడమ చేతితో కుడికాలి బొటన వ్రేలునుకుడిచేతితోఎడమ కాలి బొటన వేలును తాకాలిదీనినివేగంగాచేయ్యాలి.

జటామాంసి   ---- 50 gr
తుంగ గడ్డలు ---- 50 gr

రెండింటిని విడివిడిగా దంచి వస్త్రగాయం పట్టి కలిపి సీసాలోభద్ర పరచుకోవాలి.
అర టీ స్పూను పొడిని అర కప్పు నీటిలో కలుపుకొనితాగాలి.
10 నుండి 20 రోజులు వాడితే చాలుదీని వలనకాలేయముపిత్తాశయము శుభ్రపడతాయివంటలలో
నల్లగా మాడిన ప్రతి పదార్ధము కాలేయానికి హానికలిగిస్తుంది.
తాజాగా వున్న ఆకు కూరలుకాయగూరలు వాడాలి.

   కాలేయముపై కొవ్వు చేరడం (Fatty Liver)                
ఇది రెండు రకాలు :--

1 Alcoholic Fatty Liver :-- మద్య పానము వలనకాలేయముపై కొవ్వు చేరడం వచ్చే వ్యాధి.
2. Non Alcoholic Fatty Liver :-- శరీరములోని ఇతరభాగాలనుండి కొవ్వు కాలేయానికి చేరడం వలన వచ్చేవ్యాధి

కటుకరోహిణి                    --- 50 gr
శొంటి                             --- 50 gr
పిప్పళ్ళు                        --- 50 gr
మిరియాలు                    --- 50 gr
ఉసిరిక పెచ్చులు             ----50 gr

కాలేయ వ్యాధులకు కటుకరోహిణి దివ్య ఔషధం "   పరిశోధన చేయబడినది.

     అన్నింటిని విడివిడిగా దంచిజల్లించిచూర్ణాలుచేయాలి అన్ని చూర్ణాలు సమానముగా 
తీసుకుని   కలిపి నిల్వ చేసుకోవాలి.

    అర టీ స్పూను నుండి ఒక టీ స్పూను వరకు ఉదయంమధ్యాహ్నంసాయంత్రం వేడి నీటితో ఆహారానికి   అరగంట ముందు తీసుకోవాలి.

 ఔషధము వ్యాధిని నియంత్రిస్తుంది( preventive) , నివారిస్తుంది ( curative)

     కాలేయ సమస్యలు-- నివారణ                  

      కాలేయం మన శరీరంలో  కాలేయము 500 రకాలపనులను నిర్వహిస్తుంది

జలోదర సమస్యకామెర్లు మొదలైనవి తీవ్రమైతే  చనిపోయే ప్రమాదం వున్నది.  
      ఈ సమస్య దురలవాట్ల వలన వచ్చే అవకాశం ఎక్కువ.

గుంటగలగర    పొడి             --- 100 gr
నేల ఉసిరి        పొడి             --- 100 gr
కటుక రోహిణి    పొడి             --- 100 gr
గలిజేరు వేర్ల    పొడి              --- 100 gr
త్రికటు         చూర్ణం             --- 100 gr
పిప్పళ్ళ       చూర్ణం             --- 100 gr

      అన్ని చూర్ణాలను  కల్వంలో వేసి తగినంత నీరు కలిపినూరి శనగ గింజలంత మాత్రలు చేసి ఆరబెట్టాలి.  బాగాఎండిన తరువాత నిల్వ చేసుకోవాలి.

       పూటకు ఒక మాత్ర చొప్పున ఉదయంసాయంత్రంతగినంత తేనెతో సేవించాలి.

   మధుమేహం వున్నవాళ్ళు నీటితో చూర్ణాన్ని ముద్దగా చేసుకుని మింగాలి.

 విధంగా సంవత్సరంలో రెండు నెలలు వాడితే ఎలాంటికాలేయ సమస్యలు రావు.
 
   కాలేయం  ఆరోగ్యంగా  ఉండాలంటే                 
 
   దవనాన్ని ఎండబెట్టి దంచి పొడి  చేసి  నిల్వ చేసుకొవాలి.
   ప్రతి రోజు అర టీ స్పూను పొడి ని నీటిలో కలిపి తాగుతూ వుంటే కాలేయం ఎంతో ఆరోగ్యంగా
   వుంటుంది .   

        దవనాన్ని ఎండబెట్టి చూర్ణం చేసి నిల్వ చేసుకోవాలి.

ప్రతి రోజు అర టీ స్పూను పొడిని నీటితో కలిపి తాగుతూవుంటే కాలేయం ఎంతో ఆరోగ్యంగా వుంటుంది.                                   కాలేయం ఆరోగ్యంగాఉండాలంటే               
 
కృష్ణ తులసి ఆకులను గోలీ అంత ముద్ద చేసి తగినంతతేనె కలిపి ప్రతి రోజు తీసుకుంటూ
వుంటే కాలేయం ఆరోగ్యం
మన శరీరంలో అత్యంత కీలకమైన అవయవం లివర్.. 
మనం తీసుకునే ఆహారం నుంచి శరీరానికి కావల్సిన పోషకాలను గ్రహించి మిగిలిన వ్యర్థ, విష పదార్థాలను బయటకు పంపుతుంది. రక్తాన్ని శుద్ధి చేస్తుంది. అదే లివర్ కు సిర్రోసిస్, హెపటైటిస్ A, B మరియు C తదితర అత్యంత ప్రమాదకరమైన వ్యాధులు సోకే ముప్పు ఉంది. ఇప్పటి మన మారిపోయిన ఆహారపు అలవాట్లు ఈ ప్రమాదాన్ని మరింతగా పెంచాయి. అంతేకాదు ఇప్పుడు చాలా మందికి ఫ్యాటీ లివర్ సర్వసాధారణం అయిపోయింది. ఈ పరిస్థితుల్లో దీర్ఘాయుష్సును పొందాలంటే లివర్ ను భద్రంగా ఉంచుకోవడం తప్పనిసరి. ఇప్పుడు మీరు తెలుసుకోబోయే రెసిపీతో కేవలం 2రోజుల్లో మీ లివర్ ను అన్ని విష వ్యర్థాల నుంచి క్లీన్ చేసుకోవచ్చు.
.
#కావల్సిన_పదార్థాలు:
* నాణ్యమైన ఎండు ద్రాక్షలు 1కప్పు
* 3కప్పుల నీళ్లు
* రెండింటినీ కలిపి 2నిముషాల పాటు ఉడికించాలి.
* 24 గంటలు వాటిని అలాగే నిల్వ ఉంచాలి.
* 2 రోజుల పాటు ఉదయం వేళ తాగితే లివర్ క్లీన్ అయిపోతుంది.
* ఈ డ్రింక్ ను వేడిగానైనా, చల్లగానైనా తీసుకోవచ్చు.
* ఇంకా సంపూర్ణమైన ఫలితాలు కావాలంటే మాత్రం 7రోజులు ఈ ట్రీట్మెంట్ కొనసాగించాలి.
లివర్ శుభ్రం అవ్వాలంటే.. ఈ ఆహారం తినాలి..!*

✍అతిగా ఆహారం తినడం, జంక్ ఫుడ్, వేపుళ్లు తీసుకోవడం, ఒత్తిడి, ఆందోళన, కాలుష్యం, పనిభారం, పొగతాగడం, మద్యం సేవించడం... వంటి అనేక రకాల కారణాల వల్ల మన లివర్ చెడిపోతుంటుంది. దీంతో ఆ భాగం శరీరంలో ఉన్న విష పదార్థాలను బయటికి పంపడంలో విఫలం చెందుతుంది. తద్వారా అనారోగ్యాల బారిన పడతాం.

 👉అయితే కింద సూచించిన ఆహారం తినడం ద్వారా లివర్‌ను ఎప్పటికప్పుడు సురక్షితంగా ఉంచుకోవచ్చు. దీంతో లివర్ క్లీన్ అవుతుంది. తద్వారా శరీరంలో ఎలాంటి వ్యర్థాలు పేరుకుపోవు. మరి ఆ ఆహార పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..! 

1. వెల్లుల్లి

రోజూ రెండు మూడు వెల్లుల్లి రెబ్బల్ని పచ్చిగా తినడం అలవాటు చేసుకుంటే చాలు. దాంతో లివర్ సురక్షితంగా ఉంటుంది. లివర్ ఎప్పటికప్పుడు శుభ్రం అవుతుంది. వ్యర్థాలు బయటికి వెళ్లిపోతాయి. 

2. నిమ్మ జాతి పండ్లు

నిమ్మ, నారింజ, ద్రాక్ష, గ్రేప్ ఫ్రూట్, కివీ లాంటి విటమిన్ సి ఉన్న పండ్లు తినాలి. వీటిల్లో ఉండే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు లివర్‌ను క్లీన్ చేస్తాయి. తరచూ ఈ పండ్లను తింటుంటే లివర్ సమస్యలు రావు. రోజూ ఒక గ్లాస్ వేడి నీటిలో నిమ్మరసం కలుపుకుని తాగినా చాలు. లివర్ క్లీన్ అవుతుంది. 

3. బీట్‌రూట్, క్యారెట్

బీట్‌రూట్, క్యారెట్‌లలో ఫ్లేవనాయిడ్లు, బీటా కెరోటిన్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి లివర్ ఆరోగ్యాన్ని పరిరక్షిస్తాయి. లివర్‌ను శుభ్రం చేస్తాయి. 

4. గ్రీన్ టీ

క్యాటెకిన్స్ అని పిలవబడే యాంటీ ఆక్సిడెంట్లు గ్రీన్ టీలో పుష్కలంగా ఉంటాయి. ఇవి లివర్‌ను శుభ్రం చేసి లివర్ పనితనాన్ని మెరుగు పరుస్తాయి. రోజూ గ్రీన్ టీ తాగితే లివర్ ఆరోగ్యం సురక్షితంగా ఉంటుంది. 

5. ఆకుపచ్చని కూరగాయలు

ఆకుపచ్చగా ఉండే ఆకు కూరలు, కూరగాయలను నిత్యం ఆహారంలో భాగం చేసుకోవాలి. వీటిలో ఉండే ఔషధ గుణాలు లివర్‌లో పేరుకుపోయిన విష పదార్థాలను బయటకు పంపి లివర్‌ను శుభ్రం చేస్తాయి. తద్వారా లివర్ పనితనం మెరుగు పడుతుంది. 

6. అవకాడోలు

శరీరంలో ఉన్న విష పదార్థాలను బయటకు పంపేందుకు లివర్‌కు గ్లూటాథియోన్ అనబడే సమ్మేళనం అవసరం అవుతుంది. అయితే ఆ సమ్మేళనం ఎక్కువ మోతాదులో కావాలంటే అవకాడోలను తినాలి. దీంతో గ్లూటాథియోన్‌ను లివర్ గ్రహించి తద్వారా శరీరంలో ఉన్న వ్యర్థాలను వెంట వెంటనే బయటకు పంపుతుంది. 

7. యాపిల్స్

యాపిల్ పండ్లలో ఉండే పెక్టిన్ లివర్‌కు సహాయ పడుతుంది. ఇది లివర్ మెరుగ్గా పనిచేసేందుకు దోహదం చేస్తుంది. దీంతో వ్యర్థాలు ఎప్పటికప్పుడు శరీరం నుంచి వెళ్లిపోతాయి. 

8. ఆలివ్ ఆయిల్

ఆలివ్ ఆయిల్‌ను తీసుకోవడం వల్ల శరీరం ప్రత్యేకమైన లిపిడ్ సమ్మేళనాలను తయార చేసుకుంటుంది. అవి వ్యర్థాలను గ్రహించి బయటకు పంపుతాయి. దీంతో లివర్‌పై భారం తగ్గుతుంది. తద్వారా లివర్ క్లీన్ కూడా అవుతుంది. 

9. రాగులు, సజ్జలు, జొన్నలు

రాగులు, సజ్జలు, జొన్నలు వంటి ఆహార పదార్థాలను తరచూ తినాలి. దీంతో లివర్ మెరుగ్గా పనిచేస్తుంది. ఎప్పటికప్పుడు శరీరంలో పేరుకుపోయే వ్యర్థాలను తొలగిస్తుంది. 

10. వాల్‌నట్స్

ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు వాల్‌నట్స్‌లో పుష్కలంగా ఉంటాయి. ఇవి లివర్‌కు సహాయం చేస్తాయి. దీంతో లివర్ శుభ్రం అవడమే కాదు, మరింత మెరుగ్గా వ్యర్థాలను బయటకు పంపుతాయి. 

11. పసుపు

లివర్ ఆరోగ్యాన్ని మెరుగు పరచడంలో పసుపు కూడా ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. నిత్యం ఒక గ్లాస్ వేడి పాలలో 1/4 టీస్పూన్ పసుపు కలుపుకుని తాగినా చాలు. లివర్ శుభ్రం అవుతుంది.

ఫ్యాటీ లివర్‌ కొరకు మందులు

Medicine NamePack Size
BiohepBIOHEP TABLET
NormatoneNormatone Syrup
HysinHysin Syrup
B LivB LIV TABLET 10S
ADEL 79 Ferrodona TonicADEL 79 Ferrodona Tonic
LetarteLETARTE SACHET 5GM
LoleptLolept Granules
PowerlactinPowerlactin Syrup
Bjain Manganum aceticum DilutionBjain Manganum aceticum Dilution 1000 CH
Schwabe Manganum aceticum CHSchwabe Manganum aceticum 1000 CH
YoponYopon Syrup
CyaptinCyaptin 2 mg/275 mg Syrup
CypizaCypiza Syrup
HepaeuroHEPAEURO GRANUELS 5GM
SBL Geranium robertianum DilutionSBL Geranium robertianum Dilution 1000 CH
CyprorichCYPORICH SYRUP 200ML
Omeo Alfa and Ginseng SyrupOmeo Alfa and Ginseng Syrup
SamlolSamlol Sachet
Analiv TabletsAnaliv 500 Mg Tablet
FilolaFilola Injecti

ధన్యవాదములు 

మీ నవీన్ నడిమింటి 

విశాఖపట్నం 

9703706660

అస్వీకార ప్రకటన: ఈ సైటుపై లభ్యమవుతున్న మొత్తం సమాచారము మరియు లేఖనము కేవలం అవగాహనా ఆవశ్యకతల కొరకు మాత్రమే. ఇక్కడ ఇవ్వబడిన సమాచారమును ఏదైనా ఆరోగ్య సంబంధిత సమస్య లేదా అస్వస్థత నుండి కోలుకోవడానికి లేదా స్వస్థత కొరకు నిపుణుల సలహా లేనిదే ఉపయోగించుకోకూడదు. చికిత్స పరీక్షలు మరియు సేవల కొరకు ఎల్లప్పుడూ ఒక అర్హత పొందిన వైద్యుల సలహా తీసుకోవాలి.

22, జూన్ 2020, సోమవారం

జుట్టు రాలుట,పెను కొరుకుడు, పేలు సమస్య నివారణ పరిష్కారం మార్గం

పోషక పదార్దాల యొక్క సరైన నిష్పత్తితో సహా సమతుల్య ఆహారం యొక్క ప్రాముఖ్యత అందరికీ తెలుసు. అయితే, కొన్ని విటమిన్లు, ఖనిజాలు మరియు ఇతర పదార్దాలు జుట్టు రాలడాన్ని నివారించడంలో ప్రత్యేక పాత్రను కలిగి ఉంటాయి మరియు వీటిని తగినంతగా తీసుకునేలా చూడాలి.

జుట్టు కోసం విటమిన్లు 

విటమిన్ ఇ


విటమిన్ ఇ జుట్టుకు అవసరమైన ముఖ్య పోషకాలలో ఒకటి, ఇది ఆక్సిడేటివ్ ఒత్తిడి వల్ల కలిగే అన్ని రకాల నష్టాల నుండి మన జుట్టును రక్షించడంలో సహాయపడుతుంది. ఆండ్రోజెనిక్ అలోపేసియా కారణంగా బట్టతల రావడానికి ఆక్సీకరణ ఒత్తిడి ఒక కారణమని గుర్తించబడింది, ఇది పురుషులలో ఎక్కువగా కనిపిస్తుంది.

బాదంఆక్రోటుకాయలు మరియు వేరుశెనగ పిక్కలు, పొద్దుతిరుగుడు పువ్వు విత్తనాలు వంటి నట్స్  మరియు పొద్దుతిరుగుడు పువ్వు నూనె, సోయాబీన్ నూనె వంటి కొన్ని కూరగాయల నూనెలు విటమిన్ ఇ యొక్క గొప్ప వనరులు మరియు వీటిని మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చాలి.

యాంటీఆక్సిడెంట్ ఆహారాలు

ఫ్రీ రాడికల్స్‌కు వ్యతిరేకంగా పనిచేసే ఆహార పదార్దాలను యాంటీఆక్సిడెంట్లు అని అంటారు. విటమిన్ ఇ యాంటీయాక్సిడెంట్లలో ఒకటి. అయితే, యాంటీఆక్సిడెంట్ల యొక్క ఇతర ఆహార వనరులలో కమలాపండునిమ్మకివి, సాల్మన్, సీఫుడ్, బ్రోకలీ, ఆకు కూరలు మరియు గ్రీన్ టీఉంటాయి.

బయోటిన్

జుట్టు పెరుగుదలలో ముఖ్య పాత్రను పోషించే ఉన్న మరొక విటమిన్ బయోటిన్ లేదా విటమిన్ బి7, దీని లోపం అలోపేసియా అరేటా (అతుకులాతుకులుగా జుట్టు రాలిపోవడం) తో సంబంధం కలిగి ఉంటుంది. దీనిని నివారించడానికి, మీ ఆహారంలో బయోటిన్ యొక్క ఆహార వనరుల పరిమాణాన్ని పెంచడం మంచిది, ఎందుకంటే అలోపేసియా నిర్వహణలో బయోటిన్ సప్లీమెంట్ల చర్య స్పష్టంగా గమనింపబడలేదు. గుడ్డు పచ్చసొన, నట్స్, విత్తనాలు మరియు అవోకాడోలు బయోటిన్ యొక్క గొప్ప వనరులు.

జుట్టు రాలడాన్ని నియంత్రిచే ఆహారాలు 

ప్రోటీన్లు 

సూక్ష్మపోషకాలు కాకుండా, తీవ్రమైన జుట్టు రాలడాన్ని నివారించడంలో ప్రోటీన్లు చాలా ముఖ్య పాత్రను కలిగి ఉంటాయి, కొత్త జుట్టు ఫోలికల్స్ యొక్క సింథసిస్ లో ఇవి  పాల్గొంటాయి, ఇది పాత వెంట్రుకలను భర్తీ చేస్తుంది. ప్రోటీన్ల ఆహార వనరులు లీన్ మీట్, లీన్ చికెన్, పాలు, గుడ్లు, పప్పుధాన్యాలు మరియు సోయా ఉత్పత్తులు.

ఫ్యాటీ యాసిడ్లు (కొవ్వు ఆమ్లాలు) 

ఫ్యాటీ యాసిడ్లు, ముఖ్యంగా ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు కూడా జుట్టు రాలడాన్ని నివారించడానికి అవసరం. ఫోలికల్ వ్యాప్తికి సహాయపడటం ద్వారా ఇవి జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. వీటి లోపం వలన స్కాల్ప్ జుట్టును కోల్పోతుంది.

కాబట్టి, ఆక్రోటుకాయలు, సోయాబీన్, సాల్మన్, అవిసె గింజలు మరియు గుడ్లు వంటి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవడమనేది ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది కాక, సాఫ్ ఫ్లవర్ (safflower) నూనె వంటి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు అధికంగా ఉండే నూనెల యొక్క సమయోచిత పూత (తలకు రాసుకోవడం) కూడా జుట్టు పెరుగుదలకు దారితీస్తుంది. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లను ఈ రెండు రూపాల్లోనూ ఉపయోగించవచ్చు.

జుట్టు రాలడానికి ప్రధాన కారణాలలో ఒత్తిడి ఒకటి. తీవ్రమైన ఒత్తిడి వలన నెత్తిమీద జుట్టు సగం నుండి మూడు వంతులు రాలిపోవచ్చు. సాధారణంగా, ఇది అధిక ఒత్తిడి ఉన్న సమయాలలో సంభవిస్తుంది మరియు దీనిని నియంత్రిచవచ్చు. ఏదేమైనా, దీర్ఘకాలిక ఒత్తిడి మరియు ఆందోళన జుట్టు పలుచబడడానికి దారితీస్తుంది, ఇది తల దువ్విన ప్రతిసారీ జుట్టు గుత్తులు గుత్తులుగా రాలిపోవడం ద్వారా గమనింపబడుతుంది.

ఒత్తిడి తగ్గించడం ద్వారా దీనిని నిర్వహించవచ్చు, దీనిని యోగా, ధ్యానం, విశ్రాంతి లేదా శ్వాస ప్రక్రియల ద్వారా సాధించవచ్చు. వ్యాయామం ఎండార్ఫిన్‌ల స్థాయిని పెంచుతుంది లేదా వీటిని ‘ఫీల్ గుడ్ ’ హార్మోన్లని కూడా అంటారు, ఇది ఒత్తిడిని ఎదుర్కోవడానికి సహాయపడుతుంది. మీకు  జిమ్ లో చేరాలని లేదా యోగా ని ఎంచుకోవాలని అనిపించకపొతే, నడక, సైక్లింగ్ లేదా జాగింగ్ వంటి సాధారణ చర్యలు కూడా ఒత్తిడిని తొలగించడంలో సహాయపడతాయి.

జుట్టుకు కొబ్బరి నూనె మసాజ్ 

కొన్ని నూనెలు, ముఖ్యంగా కొబ్బరి నూనె జుట్టుపై లోతైన ప్రయోజనాలను కలిగి ఉంటుంది మరియు జుట్టు రాలడాన్ని నివారించడంలో సహాయపడుతుంది. కొబ్బరి నూనె జుట్టు రాలడానికి కారణమయ్యే ప్రోటీన్ నష్టాన్ని గణనీయంగా తగ్గించిందని పరిశోధన ఫలితాలు రుజువు చేశాయి. తల స్నానానికి ముందు మరియు తరువాత కొబ్బరి నూనెను ఉపయోగించినప్పుడు, అది ఇతర నూనెలతో పోలిస్తే గణనీయమైన ప్రభావాన్ని చూపిందని తెలిసింది.

పరమాణు బరువు (మొలిక్యూలర్ వెయిట్) తక్కువగా ఉండడం వలన, కొబ్బరి నూనె వెంట్రుకల షాఫ్ట్ (కాండంలోకి) లోపలికి సులభంగా చొచ్చుకుపోతుంది, తద్వారా వెంట్రుకకు బలాన్ని ఇస్తుంది మరియు అది రాలిపోయే అవకాశాన్ని తగ్గిస్తుంది. కొబ్బరి నూనె దెబ్బతిన్న జుట్టు మరియు దెబ్బతినని జుట్టు రెండింటి మీద సమర్థవంతంగా పనిచేస్తుంది. కాబట్టి, దీనిని చికిత్సగా మరియు నివారణ చర్యగా కూడా ఉపయోగించవచ్చు. మీ జుట్టుకు కొబ్బరి నూనెను ఎలా ఉపయోగించవచ్చో ఇక్కడ ఉంది.

  • మీ జుట్టు పొడవును బట్టి 1 నుండి 2 టీస్పూన్ల కొబ్బరి నూనె తీసుకోండి
  • దానిని కొంచెం వేడి చేయండి 
  • మీ జుట్టు కుదుళ్ళలో రాయండి మరియు నెత్తిని సున్నితంగా మసాజ్ (మర్దన) చేయండి
  • అలా ఒక అరగంట లేదా ఒక రాత్రంతా వదిలివేయవచ్చు
  • నూనె రాసిన జుట్టుతో బయటకు వెళ్లడం సిఫారసు చేయబడదు ఎందుకంటే ఇది ధూళి మరియు దుమ్ము తలలో చిక్కుకుపోయెలా చేస్తుంది మరియు నష్టం కలిగిస్తుంది
  • మీరు బయటకు వెళ్ళవలసి వస్తే, నష్టాన్ని నివారించడానికి మీ తలను కప్పుకోవాలని  సిఫార్సు చేయబడుతుంది

ఉత్తమ ఫలితాల కోసం రోజు విడిచి రోజును ఉపయోగించవచ్చు.

జుట్టు పెరుగుదలకు పిప్పరమెంటు నూనె 

పిప్పరమింట్ నూనె మెంథా పైపరిటా అనే మొక్క నుండి వస్తుంది మరియు దీనికి జుట్టు రాలడాన్ని నిరోధించే లక్షణాలను ఉంటాయి. పిప్పరమింట్ నూనె శక్తివంతమైన హెయిర్ రిగ్రోత్ ఏజెంట్ (జుట్టు తిరిగి పెరిగేలా చేసే ఏజెంట్) అని 2014 లో ఒక అధ్యయనం నిరూపించింది. ఇది జుట్టు ఫోలికల్స్ సంఖ్యను మరియు నెత్తి మీద వాటి లోతును పెంచుతుంది, అదే సమయంలో వాటి మందాన్ని కూడా పెంచుతుంది. జుట్టుకు పిప్పరమెంటు నూనెను ఎలా ఉపయోగించాలో ఇక్కడ ఉంది.

  • కొన్ని చుక్కల పిప్పరమెంటు నూనె తీసుకొని కొంచెం సహజ నూనెతో కలపండి 
  • షాంపూతో శుభ్రం చేసే ముందు నెత్తిమీద బాగా మసాజ్ చేసి అరగంట పాటు అలానే ఉంచండి
  • ప్రత్యామ్నాయంగా, మీరు ఈ నూనె కొన్ని చుక్కలను షాంపూ మరియు కండీషనర్‌లో కలిపి  మాములుగా తలస్నానం చేయవచ్చు

జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడానికి లావెండర్ నూనె

జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడంలో లావెండర్ నూనె సామర్థ్యాన్ని ఒక తాజా అధ్యయనం ధ్రువీకరించింది. లావెండర్ నూనె యొక్క సమయోచిత పూత జుట్టు ఫాలికిల్స్ సంఖ్య మరియు దాని లోతు పెరగడానికి సహాయపడుతుంది. ఇది జుట్టు రాలడాన్ని నివారించడానికి కూడా పని చేస్తుంది. ఈ ప్రయోజనాల కోసం లావెండర్ నూనెను ఉపయోగించడానికి, మీరు ఇలా చేయవచ్చు:

  • ఒక టీస్పూన్ లావెండర్ నూనెను తీసుకొని రెండు టీస్పూన్ల కొబ్బరి నూనెతో కలపండి
  • మీ వేళ్లతో నెత్తి మీద బాగా మసాజ్ చేసి ఒక రాత్రంతా వదిలివేయండి
  • ఉదయం తలస్నానం చేయండి, ఉత్తమ ఫలితాల కోసం వారానికి రెండుసార్లు దీనిని చేయండి.

పురుషులలో జుట్టు పెరుగుదలకు గుమ్మడి విత్తనాల నూనె 

గుమ్మడి విత్తనాల నూనెకు జుట్టు పెరుగుదలను మెరుగుపర్చడంలో గణనీయమైన సామర్థ్యం ఉంటుంది, అలోపేసియా రోగులలో నిర్వహించిన ఇటీవలి అధ్యయనం ద్వారా ఇది నిర్ధారించబడింది. ప్లేసిబో (చికిత్సా సామర్థ్యం లేని ఏజెంట్లు) ఇచ్చిన వారితోతో పోల్చినప్పుడు, గుమ్మడి విత్తన నూనెతో చికిత్స ఇచ్చిన బృందంలో వారి మొత్తం జుట్టు పరిమాణం పెరిగిందని చికిత్స ముందు తీసిన ఛాయాచిత్రాల (ఫొటోల) ద్వారా తేలింది. దాని ప్రయోజనాలను పొందటానికి గుమ్మడి విత్తనాల నూనెను ఈ కింది విధంగా ఉపయోగించవచ్చు:

  • ఒక కప్పు గ్రీన్ టీ తయారు చేసి, దానికి ఒక అర టీస్పూన్ గుమ్మడికాయ సీడ్ ఆయిల్ జోడించండి
  • ఒకసారి జుట్టును శుభ్రం చేసి, వెంటనే ఈ ద్రావణాన్ని తలకు పట్టించండి
  • 5 నిమిషాలు అలాగే ఉంచి తరువాత నీటితో కడగాలి

జుట్టు నష్టం చికిత్స కోసం అరోమాథెరపీ 

అరోమాథెరపీలో థైమ్ (ఒక విధమైన వామకు మొక్క) , లావెండర్, రోజ్మేరీ మరియు దేవదారు చెక్క (సెడార్వుడ్) నూనెల వంటి అనేక అరోమాటిక్  నూనెలు ఉంటాయి, ఇవి మన ఆరోగ్యంతో సహా జుట్టు పై కూడా అనేక ప్రయోజనాలను కలిగి ఉంటాయి.

ఈ నూనెల పై పరిశోధనలు వాటి యొక్క యాంటీహెయిర్ ఫాల్ ప్రభావాలను ధ్రువీకరించాయి. ఇతర నూనెలతో పోల్చితే, జోజోబా మరియు గ్రేప్‌సీడ్ వంటి క్యారియర్ నూనెలతో కలిపి ఈ ఎస్సెంషియాల్ నూనెలను ఉపయోగించినప్పుడు అలోపేసియా అరేటా చికిత్సలో మరింత ప్రభావవంతంగా ఉన్నాయని తెలిసింది. ఈ నూనెల యొక్క ప్రయోజనాలను పొందటానికి, ఈ కింది దశలను అనుసరించండి:

  • ఒక సగం టీస్పూన్ లావెండర్ మరియు రోజ్మేరీ నూనెలను తీసుకోండి మరియు దీనికి రెండు చుక్కల థైమ్ మరియు దేవదారు చెక్క (సెడార్వుడ్) నూనెలతో కలపండి
  • వాటిని 6 చుక్కల గ్రేప్‌సీడ్, 4 చుక్కల జోజోబా నూనెలతో కలపండి
  • ఈ మిశ్రమాన్ని నెత్తికి పట్టించి ఒక 5 నుండి 10 నిమిషాలు మసాజ్ చేయండి
  • తరువాత, స్టీమ్ చేసిన టవల్ ను తలకు చుట్టి ఒక రాత్రంతా అలా ఉంచండి
  • మరుసటి రోజు ఉదయం తలస్నానం చేయండి

ఉత్తమ ప్రయోజనాల కోసం ఈ చికిత్స 6 నెలలు చేయవచ్చు.

జుట్టు రాలడాన్ని నియంత్రించడం కోసం నిమ్మకాయ 

నిమ్మకాయ అనేది సాధారణంగా ఉపయోగించే ఇంటి చిట్కాలలో ఒకటి. ఇది ఒక బలమైన యాంటీఆక్సిడెంట్ కావడం వల్ల స్కాల్ప్ (నెత్తి) మీద నుండి జుట్టు రాలడానికి కారణమయ్యే ఆక్సీకరణ నష్టాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. నిమ్మహెయిర్ వాష్ చేయడానికి మీరు ఈ కింది దశలను అనుసరించవచ్చు:

  • 1 టేబుల్ స్పూన్ నిమ్మరసంలో  3 టేబుల్ స్పూన్ల కలబంద రసాన్ని కలపండి
  • ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి ఒక 5 నిమిషాలు మసాజ్ చేసి అరగంట తరువాత కడగాలి

జుట్టు తిరిగి పెరగడానికి ఉల్లిపాయ 

ఉల్లిపాయ కూడా మరోక సాధారణ ఇంటి చిట్కా, జుట్టు తిరిగి పెరిగేలా చెయ్యడంలో ఉల్లిపాయ రసం యొక్క ప్రభావాలు క్లినికల్ అధ్యయనం ద్వారా నిరూపించబడ్డాయి.  ఈ అధ్యయనం సాధారణ నీటితో ఉల్లిపాయ రసాన్ని పోల్చి చేయబడింది. అలోపేసియాతో బాధపడుతున్న రోగులలో జుట్టు పెరుగుదలకు ఉల్లిపాయ ఉపయోగపడుతుందని ఫలితాలు వెల్లడించాయి. ఉల్లిపాయ రసం ఉపయోగించడానికి, మీరు వీటిని పాటించవచ్చు:

  • ఒక టేబుల్ స్పూన్ ఉల్లిపాయ రసం తీసుకొని ఒక కాటన్ బాల్ ను దానిలో ముంచండి 
  • ఈ కాటన్ బాల్ సహాయంతో మీ తల అంతా ఈ రసాన్ని రాయండి
  • వేళ్ళతో మసాజ్ చేయండి
  • సుమారు గంటసేపు అలా వదిలి వేసి, తరువాత కడగాలి

రోజు విడిచి రోజు ఈ చిట్కాని పాటించవచ్చు. 

జుట్టు రాలడాన్ని నియంత్రించడం కోసం ఆయుర్వేదం సలహాలు 

జుట్టు యొక్క కొమలత్వానికి ---హెయిర్ కండిషనర్                

కోడిగుడ్డు                      ---ఒకటి 
ఆముదం                      ---2 టేబుల్ స్పూన్లు 
వెనిగర్                        --- ఒక టీ స్పూను 
గ్లిజరిన్                        --- ఒక టీ స్పూను 
      
       ఒక గుడ్డును కొట్టి పోసి బాగా గిలక్కొట్టాలి. దీనిలో మూడు ద్రవాలను వేసి బాగా కలిసేట్లు 
గిలక్కొట్టాలి. 

      దీనిని జుట్టు యొక్క పాయలకు బాగా పట్టించాలి. తరువాత మర్దన చేయాలి. కొంత వాసన వుంటుంది. తరువాత గుడ్డను వేడి నీటిలో ముంచి, నీటిని పిండి గుడ్డను తలకు కట్టాలి.  అరగంట తరువాత జిడ్డు, వాసన వదిలే వరకు స్నానం చేయాలి. 

సూచనలు :-- జుట్టును ఆయిలీ గా ( తైల యుతంగా)  వుంచుకోవాలి. క్షార గుణం రానివ్వకూడదు.
స్నానానికి ఏ నీళ్ళంటే ఆ నీళ్ళు వాడకూడదు.  జుట్టుకు గిట్టే నీటిని మాత్రమె వాడాలి.

      జుట్టు రాలే సమస్య    --- నివారణ                             

1. ఉసిరిక పొడి                    ---- 20 gr 
       పాలు                         ---- పావు లీటరు

       ఉసిరిక పొడిని రాత్రంతా పాలలో నానబెట్టి ఉదయం ఆ పాలను తలకు పట్టించాలి . కొంతసేపు వుంచి తరువాత
తలస్నానం చేయాలి

2. ముళ్ళ తోటకూర           ---- 50 gr 
             నీళ్ళు                  ---- తగినన్ని

        నీళ్ళను స్టవ్ మీద పెట్టి తోటకూరను వేయాలి . బాగా మరగనిచ్చి దించాలి . గోరువెచ్చగా వున్నపుడు ఆ
నీటిని తలకు పట్టించాలి .   కొంతసేపు వుంచి తలస్నానం చేయాలి .
         ఈ విధంగా చేస్తూ వుంటే క్రమేపి జుట్టు  రాలే సమస్య నివారింపబడుతుంది

        మెదడును చల్లబరచే హిమ కేశ తైలం                              

జుట్టు రాలదానికి కారణాలు :--- తల ఎప్పుడు వేడిగా వుండడం , తలలో దురదగా వుండడం , చిన్న చీము పొక్కులు
వుండడం  మొదలైనవి .

బాదం నూనె                      ---- ఒక టీ స్పూను
సోయా చిక్కుడు నూనె        ---- పావు కప్పు
ఆముదము                       ---- రెండు టేబుల్ స్పూన్లు
కొబ్బరి నూనె                    ---- అర కప్పు
సొరకాయ రసం                  ---- అర కప్పు
ఉసిరి రసం                       ---- పావు కప్పు

      ఒక పాత్రను తీసుకొని అన్ని పదార్ధాలను దానిలో పోసి స్టవ్ మీద పెట్టాలి . పెద్ద మంట మీద ఒక పొంగు వచ్చే వరకు
కాచాలి . తరువాత  మంట తగ్గించి సన్న మంట మీద   తైలం మాత్రమె మిగిలే వరకు కాచాలి .  వడకట్టి చల్లారిన తరువాత సీసాలో భద్రపరచుకోవాలి .

       ఈ తైలంతో తలకు మర్దన చేయాలి .

ఉపయోగాలు:---   తలలోని వేడిని తగ్గించి తలను చల్లబరుస్తుంది .  దురద , చిన్న పొక్కులు నివారిన్చాబడతాయి . జుట్టు రాలడం తగ్గుతుంది . చిన్న వయసులో జుట్టు తెల్లబడడాన్ని నివారిస్తుంది . నిద్ర బాగా పడుతుంది .

       ఉద్యోగులకు ,  విద్యార్ధులకు ఇది ఎంతో ఉపయోగకరం .

           తెల్ల జుట్టుకు రంగు                                 

గోరింటాకు పేస్టు                    --- ఒక కప్పు
వాల్ నట్స్ పేస్టు                  --- ఒక కప్పు

     ఈ రెండింటిని ఒక గిన్నెలో వేసి బాగా కలిపి 3 గంటల సేపు గాని లేదా రాత్రంతా గాని నానబెట్టాలి .
      తరువాత  ఈ మిశ్రమాన్ని తలకు పట్టించాలి . కొంత ఎండడం ప్రారంభం అవుతుంది . తరువాత మామూలు నీటితో
స్నానం చేయాలి . రెండవ రోజు షాంపూతో స్నానం చేయాలి

           ఎర్ర జుట్టు కోసం

గోరింటాకు ముద్ద                 --- ఒక కప్పు
యూకలిప్టస్ నూనె               --- అర టీ స్పూను

     రెండింటిని బాగా కలిపి తలకు పట్టించాలి . 3 గంటల తరువాత స్నానం చేయాలి .
     తైలం కలపడం వలన  జుట్టు కు మంచి కాపర్ కలర్ వస్తుంది .

               Dark Brown Colour 

తుప్పు పట్టిన మేకులు            --- 5, 6
చిన్న ఇనుప బాణలి               --- ఒకటి
త్రిఫల పేస్టు                           --- రెండు టీ స్పూన్లు

     ఇనుప బాణలిలో కొద్దిగా నీళ్ళు తీసుకొని  మేకులను నానబెట్టాలి . 2 , 3 గంటల తరువాత వాటిని తీసి దానిలో త్రిఫల
చూర్ణాన్ని వేసి కలపాలి . గంటసేపు నానబెట్టి తరువాత  తలకు పట్టించాలి  2, 3 గంటల తరువాత స్నానం చేయాలి .

            జుట్టు రాలడం --- నివారణ

ఎండిన వేపాకుల చూర్ణం          --- 25 gr
బిర్యాని ఆకు చూర్ణం               --- 25 gr
తులసి ఆకుల చూర్ణం             --- 25 gr

      అన్నింటిని కలిపి ఒక సీసాలో నిల్వ చేసుకోవాలి .
      రెండు టీ స్పూన్ల పొడిని తీసుకొని నీటితో కలిపి తలకు పట్టించాలి .

ఎండిన నిమ్మ తొక్కల చూర్ణం      --- ఒక కప్పు
గులాబి రేకుల చూర్ణం                --- ఒక కప్పు
ఎండిన మందార పూల చూర్ణం     --- ఒక కప్పు
ఎండిన కరివేపాకు చూర్ణం            --- ఒక కప్పు
సీకాయ పొడి                             --- ఒక కప్పు

      అన్నింటిని బాగా కలిపి నిల్వ చేసుకోవాలి . అవసరమైనపుడు ఒక టేబుల్ స్పూను పొడిని తీసుకొని దానిలో కోడిగుడ్డు
తెల్ల సొనను కలిపి తలకు పట్టించాలి .  అరగంట తరువాత స్నానం చేయాలి                                      

మెంతుల పేస్టు                          --- రెండు టీ స్పూన్లు
గోరింటాకు పేస్టు                        --- ఒక కప్పు
పెరుగు                                    --- ఒక కప్పు

     ఒక గిన్నెలో అన్నింటిని బాగా  కలిపి  తరువాత తలకు పట్టించి అరగంట తరువాత స్నానం చేయాలి 
  జుట్టు సమస్యలు  --- నివారణ  ---PART   ----2 

    వెంట్రుకలు చిట్లకుండా ఉండడానికి    --- కండిషనర్             

సూచన :--- వెంట్రుకలను  కట్టిరించ కూడదు.

నిమ్మ రసం                ---- అర టీ స్పూను
 ద్రాక్ష రసం                 ---- ఒక టేబుల్ స్పూన్
కమలాపండ్ల రసం        ----   "     "         "
       తేనె                   ----   "     "         "
మందార పూల రసం     ----   "     "        "

          ఒక చిన్న గిన్నెలో అన్ని పదార్ధాలను వేసి బాగా కలపాలి .
          తల స్నానం చేసిన తరువాత  పై మిశ్రమాన్ని  జుట్టు యొక్క కుదుళ్ళ కు పట్టించాలి . 2, 3 గంటల సేపు వుంచి
తరువాత మంచి నీళ్ళతో కడగాలి .

          దీని వలన వెంట్రుకలు చిట్లకుండా ఉండడమే కాక జిడ్డు తొలగించ బదుథున్ది.

తీసుకోవలసిన జాగ్రత్తలు :--- హెయిర్ డ్రయ్యర్ , మెటల్ రబ్బర్ బ్యాండ్స్  వాడకూడదు .పవర్ ఫుల్ షాంపూలు
వాడకూడదు . స్నానానికి సాఫ్ట్ వాటర్ వాడాలి .

     జుట్టు చిట్లిపోవడం ,  పొడిరడం  ---- నివారణ                

కారణాలు :--- షాంపూ లను ఎక్కువగా వాడడం , డ్రయ్యర్ తో తలను ఆరబెట్టడం , ప్రతికూల వాతావరణం , క్లోరిన్ కలిసిన
నీటితో స్నానం చేయడం , రాగి ధాతు లోపం , బి --విటమిన్ లోపం , హైపెర్ థైరాయిడ్  మొదలైన కారణాల వలన జుట్టు
పొడిబారుతుంది .
              HAIR CONDITIONER                       

తొక్క తీసిన బాదం పప్పులు   ---- 4 
తాజా కొబ్బరి తురుము --- పావు కప్పు
నువ్వులు            ---- ఒక టేబుల్ స్పూను
నీళ్ళు                ---- అర కప్పు

        అన్ని పదార్ధాలను  మిక్సి లో వేసి తిప్పాలి . తరువాత నీళ్ళు కాలిపి తిప్పాలి .  దీనిని పేస్ట్ లాగా మెత్తగా రుబ్బాలి . తరువాత వడపోసి పిప్పి ని తీసేయ్యాలి . ఆ ద్రవ పదార్ధాన్ని జుట్టు కుదుళ్ళకు పట్టించాలి . ఐదు నిమిషాలు అలాగే వుంచి
మంచి నీటితో కడగాలి .
        జుట్టు చిట్లుతూ ఉంటే  ఈ ద్రవ పదార్ధాన్ని తల స్నానాకి ముందు  తలకు పట్టించి 3, 4  గంటలు వుంచి తరువాత
తల స్నానం చేయాలి . లేదా రాత్రి జుట్టుకు పట్టించి ఉదయం తల స్నానం చేయాలి .

సూచనలు :---  తక్కువ రకం షాంపూ లను వాడకూడదు . ద్రయ్యర్ తో తలను ఆరబెట్ట కూడదు . తలను ఎండలో ఆరబెట్టాలి .నీళ్ళు బాగా తాగాలి . ఎండలో తిరగాకూడదు ంఅంచి పోశాకాహాం ( పాలు , పండ్లు , ఎండు  ఫలాలు ) 
తీసుకుంటూ వుండాలి .    తడిగా వున్న జుట్టును దువ్వ కూడదు

         తెల్ల వెంట్రుకలు నల్లబడడానికి                        

తుంగ గడ్డల చూర్ణం                           ---- 100 gr
వట్టి వేర్ల చూర్ణం                                ---- 100 gr
ఉసిరిక  చూర్ణం                                 ---- 100 gr
కరక్కాయ చూర్ణం                             ---- 100 gr 
ఆవాల చూర్ణం                                 ---- 100 gr 

       అన్ని పదార్ధాలను బాగా కలిపి డబ్బాలో నిల్వ చేసుకోవాలి . 

        అవసరమైన రోజు ఒక పెద్ద గ్లాసు నిండుగా నీళ్ళు తీసుకొని దానిలో ఒక స్పూను పొడిని వేసి రాత్రంతా నానబెట్టాలి
ఉదయం ఆ గిన్నెను స్టవ్ మీద పెట్టి సన్న మంట మీద మరిగించి  ఎనిమిదో వంతుకు రానివ్వాలి . ఈ మిశ్రమం గోరువెచ్చగా ఉన్నపుడే జుట్టు కుదుళ్ళకు పట్టించాలి   వెంటనే తల స్నానం చేయవలసిన అవసరం లేదు . రాత్రి తలకు పట్టించి
ఉదయం స్నానం చేయవచ్చు లేదా ఉదయం పట్టించి  సాయంకాలం తల స్నానం చేయవచ్చు .

                           కేశపోషణ తైలం                               

ఆముదం                          ---- 4 టేబుల్ స్పూన్లు
కొబ్బరి నూనె                    ---- దాదాపు అర లీటరు
బ్రాహ్మి మొక్క చూర్ణం         ---- 4 టేబుల్ స్పూన్లు
ఉసిరి చూర్ణం                     ---- 4 టేబుల్ స్పూన్లు
       నీళ్ళు                       ---- అర లీటరు

       రెండు తైలాలను , రెండు చూర్ణాలను  ఒక గిన్నెలో వేసి  బాగా కలిపి స్టవ్ మీద సన్న మంట మీద వేడి చెయ్యాలి .
ఉదయం ఆ మిశ్రమానికి నీళ్ళు కలిపి స్టవ్ మీద పెట్టి మరిగించాలి .  ఒక పొంగు వచ్చే వరకు పెద్ద మంట తో  తరువాత
మంట తగ్గించి సన్న మంటతో కాచాలి.  నీరంతా ఇగిరిపోయి  నూనె మాత్రమె మిగిలే వరకు కాచాలి . బాగా చల్లార్చి
గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి .

       దీనిని ప్రతిరోజు జుట్టు కుదుళ్ళ కు పట్టించి ,  మసాజ్ చేసి అలాగే వదేలియాలి . కొంత సేపటి తరువాత తలస్నానం
చేయాలి . ఈ తైలాన్ని గోరువెచ్చగా వేడి చేసి కూడా జుట్టుకు పట్టించవచ్చు . ఈ విధంగా పట్టించిన తరువాత  తలకు
వేడి నీటిలో ముంచి , పిండిన టవల్ ను  చుట్టుకుంటే మంచిది .

            జుట్టు రాలకుండా ఉండాలంటే                             

       దేశీయ ఆవు పాలను రాగి పాత్రలో కాచి తోడు పెట్టాలి . ఈ పెరుగును జుట్టుకు పట్టించాలి . ఈ విధంగా    2, 3 
రోజులకొకసారి  చేయాలి .  7 సార్లు పట్టించే లోపల జుట్టు రాలడం ఆగిపోతుంది

            జుట్టు రాలకుండా ఉండాలంటే                            

ఉసిరిక ముక్కలు             ---- రెండు టీ స్పూన్లు
మెంతులు                      ---- ఒక టీ స్పూను
మినుములు                   ---- ఒక టీ స్పూను

      అన్నింటిని రాత్రి నానబెట్టి ఉదయం మెత్తగా రుబ్బాలి . దీనిని జుట్టు కుదుళ్ళ కు పట్టించాలి  . గంట సేపు వుంచి
స్నానం చేయాలి . ఈ విధంగా అప్పుడప్పుడు చేస్తూ వుంటే జుట్టు రాలడం ఆగిపోతుంది .

      జుట్టు సహజంగా నల్లగా మారడానికి                    
ఉసిరి పెచ్చులు                --- 10
సీకాయలు                       ---   3
కరక్కాయ పెచ్చులు          --- 25 gr 
తానికాయల పెచ్చులు       --- 25 gr 
గోరింటాకు పొడి                --- ఒక కప్పు

       ఒక గిన్నెలో నీళ్ళు పోసి మరిగే సమయంలో అన్ని కాయల పెచ్చులను నలగ గొట్టి వేయాలి బాగా కాచాలి . ఈ
కషాయాన్ని పెచ్చులతో సహా ఒక ఇనుప బాణలిలో వేసి రాత్రంతా అలాగే ఉంచాలి . ఉదయం ఆ కషాయాన్ని వడకట్టి
దానిలో గోరింటాకు పొడిని కలపాలి .  ఈ మిశ్రమాన్ని తలకు పట్టించాలి  తరువాత తల స్నానం చేయాలి .

టీ డికాషన్                       --- ఒక కప్పు
గోరింటాకు పొడి                --- ఒక కప్పు
కోడి గుడ్డు                       --- ఒకటి
ఆముదం                        --- ఒక టేబుల్ స్పూను
కాఫీ పొడి                         --- ఒక టీ స్పూను
ఉసిరిక పొడి                     --- ఒక టీ స్పూను

     టీ డికాషన్ ను ఒక ఇనుప బాణలిలో పోసి దానిలో గోరింటాకు పొడి , కోడిగుడ్డు , ఆముదం , కాఫీపొడి , ఉసిరిక పొడి
అన్నింటిని ఒక్కొక్కటిగా వేసి బాగా కలపాలి . దీనిని రాత్రంతా అలాగే ఉంచి ఉదయం జుట్టుకు పట్టించాలి . తరువాత
రెండు , మూడు గంటల సేపు వుంచి మామూలు నీళ్ళతో తలస్నానం చేయాలి . మరుసటి రోజు షాంపూ తో స్నానం చేయాలి .
      ఈ విధంగా వారానికి రెండు సార్ల చొప్పున చేస్తూ వుంటే కొద్ది రోజులకే జుట్టుకు సహజంగానే రంగు వేసినట్లు నల్లగా
మారుతుంది

     జుట్టుకు  బంగారు రంగునిచ్చే హేమ సుందర లేపనం                     

కారణాలు :--- హైపర్ థైరాయిడ్  సమస్య వలన జుట్టు తెల్లబడుతుంది . అకాల వార్ధక్యం తెల్ల జుట్టు ఏర్పడుతుంది  , విదాహక ఆహార పదార్ధాలు టీ , కాఫీ , ఆల్కహాల్ , ఘాటైన పదార్ధాలు , మసాలా పదార్ధాలు  మొదలైన వాటిని ఎక్కువగా వాడడం వలన జుట్టు తెల్లబడుతుంది

      దీనిని సగం నెరసిన జుట్టుకు , వూడుతున్న, పలచాబడుతున్న  కేశాలకు  దీనీ వాడుకోవచ్చు .

బీట్ రూట్  తురుము          --- ఒక కప్పు
కాచుపొడి  ( ఖదిర  సారం )    --- అర టీ స్పూను
మెంతి పిండి                 --- ఒక టీ స్పూను
గోరింటాకు పొడి          --- ఒక టేబుల్ స్పూను
కాఫీ పొడి                  --- ఒక టీ స్పూను
పెరుగు                     --- ఒక కప్పు
నీళ్ళు                       --- రెండు కప్పులు

      ఒక పాత్రలో నీళ్ళు పోసి స్టవ్ మీద పెట్టాలి . మరగడం ప్రారంభమైన తరువాత కాఫీపొడి , గోరింటాకు పొడి  పెరుగు తప్ప మిగిలిన పదార్ధాలను ఒక్కొక్కటిగా వేస్తూ ఉండలు కట్టకుండా బాగా కలపాలి . తరువాత ఈ మిశ్రమాన్ని ఇనుప బాణలి లోకి వంపుకోవాలి . తరువాత దీనికి కాఫీ పొడి , గోరింటాకు పొడి కలిపి చిక్కటి మిశ్రమాన్ని తయారు చేయాలి . దీనిని రాత్రంతా
అలాగే వుంచి ఉదయం దీనికి పెరుగు కలపాలి .

     ఉదయం జుట్టును పాయలుగా విడదీసి  ఈ మిశ్రమాన్ని పట్టించాలి. 3 గంటల సేపు అలాగే ఉంచాలి . షాంపూ క్యాప్
పెట్టుకోవచ్చు .తరువాత మామూలు నీటితో  తల స్నానం చేయాలి . మరుసటి రోజు షాంపూతో తల స్నానం చేయాలి
ఈ విధంగా వారానికి ఒకసారి చేయాలి   ఈ విధంగా 2, 3 నెలలు చేస్తే సహజమైన బంగారు వర్ణం ఏర్పడుతుంది .

     తరువాత నెలకు  1, 2 సార్లు  ఈ విధంగా చేయ వచ్చు .

బీట్ రూట్  సహజమైన రంగునిస్తుంది .  మరియు కాచు రంగును జుట్టుకు పట్టి ఉంచుతుంది .

       జుట్టు రాలడం  --- నివారణ                                
వేప ఆకు
రేగు ఆకు
     రెండింటిని కలిపి నూరి తలకు పట్టించాలి . అరగంట తరువాత కుంకుడు కాయల తో గాని , సీకాయతో గాని తల
స్నానం చేయాలి . ఈ విధంగా 4, 5 రోజుల కోక సారి చేస్తూ వుంటే జుట్టు రాలదు .

              కేశ వృద్ధి తైలం                                      

నీడలో ఆరబెట్టిన మర్రి వూడల చూర్ణం  --- 25 gr
   "         "        గుంటగలగర చూర్ణం    --- 25 gr 
                       నువ్వుల నూనె         --- 150 gr

      రెండు చూర్ణాలను నీళ్ళతో గుజ్జుగా కలపాలి . దీనిని నువ్వుల నూనెలో కలిపి స్టవ్ మీద పెట్టి కాచాలి .సన్న మంట మీద
తేమ ఇంకి పోయి నూనె మాత్రమె మిగిలేట్లు కాచాలి .  వడపోసి సీసాలో నిల్వ చేసుకోవాలి .

     దీనిని ప్రతిరోజు రాత్రి పూట తలకు  పట్టించాలి .

సూచన :--- ఈ విధంగా చేస్తూ ఆహారంలో  నువ్వులయొక్క , కొబ్బరి యొక్క , మినప లడ్డూలను  తీసుకుంటూ వుండాలి .

          జుట్టు రాలడం --- నివారణ                               

     ఇది చాలా పెద్ద సమస్య . ప్రధాన కారణం రక్త హీనత ,  ముఖ్య కారణం వాతావరణ కాలుష్యం

ఎండిన నిమ్మతోక్కల పొడి               --- ఒక టీ స్పూను
కమలా లేదా నారింజ తొక్కల పొడి    --- ఒక టీ స్పూను
దానిమ్మ పండు తొక్కల పొడి           --- ఒక టీ స్పూను
కొబ్బరి నూనె                                --- ఒక గిన్నెడు

          కొబ్బరినూనెలో పై పోడులన్నింటిని వేసి బాగా కలియబెట్టి రెండు రోజులు ఎండబెట్టాలి ( ఆదిత్య పక్వం ). తరువాత
వడకట్టి సీసాలో నిల్వ చేసుకోవాలి .

        ఈ నూనెను బాగా తలకు పట్టించాలి . దీనితో రక్త ప్రసరణ పెరిగి జుట్టు రాలడం తగ్గుతుంది .

ఉసిరిక పొడి                     ---- ఒక టీ స్పూను
వేపాకు పొడి                     ---- ఒక టీ స్పూను
కొబ్బరి పాలు                  ---- తగినన్ని

       ఒక గిన్నెలో ఆ పొడులను వేసి కొబ్బరి పాలను కొద్ది కొద్దిగా కలుపుతూ బాగా మిశ్రమం లాగా కలపాలి .
       దీనిని బాగా తలకు పట్టించి మసాజ్  చేయాలి . ఒక గంట తరువాత తలస్నానం చేయాలి .

సూచన :--- తగినంత నిద్ర , మంచి ఆహారం  అవసరం . కాలుష్యం లో తిరగాకూడదు .  ఘాటైన షాంపూ లను వాడకూడదు .
              పెను కొరుకుడు --- నివారణ                                 

       బొప్పాయి పాలను గాని  నూరిన ఆకును గాని  పేను కొరుకుడు మీద రుద్దుతూ ఉంటే కొద్దీ రోజులకు జుట్టు పెరగడం ప్రారంభమవుతుంది

          తలలో దురదల నివారణకు       కేశ రక్షణ తైలం                  
       SHAAMPOO లను  ఎక్కువగా  వాడడం వలన , శరీరంలో కఫము  ఎక్కువగా చేరడం వలన  తలలో దురదలు
ఏర్పడతాయి .

పసుపు  పొడి                 ---- 25 gr
మానిపసుపు పొడి           ---- 25 gr
నువ్వుల నూనె              ----100 gr

       రెండు పొడులను కొద్దిగా నీళ్లు కలిపి కొద్దిగా  నువ్వుల నూనెలో వేసి బాగా కలిపి స్టవ్ మీద పెట్టాలి . తైలం మాత్రం
మిగిలేవరకు సన్న మంట మీద కాచాలి . చల్లారిన తరువాత సీసాలో భద్రపరుచుకోవాలి

       ప్రతి రోజు దీనిని తలకు పట్టించాలి . దీనితో తలలో దురదలు , చుండ్రు నివారింపబడతాయి.



                  తలలో పేలు ---నివారణ                          

          సుగంధపాల వేళ్ళను పగులగొట్టి లోపలి భాగాన్ని తీసేసి బెరడును ఒక గిన్నెలో వేసి 
ఆవు మూత్రం పోసి   నానబెట్టాలి. బెరడు మెత్తగా నానిన తరువాత కల్వంలో వేసి మెత్తగా నూరాలి.దానిని జుట్టు యొక్క ప్రతి పాయకు  పట్టించాలి తరువాత తలకు గుడ్డ కట్టాలి. రెండు, మూడు గంటలు వుంచి తరువాత కుంకుడు రసంతో తల స్నానం చెయ్యాలి. ఈ విధంగా వారానికొకసారి చెయ్యాలి. ఎవరి దువ్వెన వాళ్ళే వాడుకోవాలి. ఈ విధంగావారానికి
ఒక సారి చెయ్యాలి.

              తలలో పేలు --నివారణ                           

వేప చెట్టు బెరడును ఎండ బెట్టి దంచిన పొడి       ------- 100 gr
సీతాఫలం ఆకులను నల్లగా మాడ్చి దంచిన పొడి   ------ 100 gr

      పై రెండింటిని ఒక గిన్నెలో వేసి బాగా కలిపి కళ్ళలో పడకుండా జుట్టు యొక్క పాయలకు పట్టించాలి.తరువాత  తలకు గుడ్డ కట్టి ఒక గంట సేపు వుంచి తల స్నానం చెయ్యాలి. దువ్వెన ను శుభ్రంగా కడిగి తల దువ్వాలి. తలస్నానం చేసేటపుడు నీళ్ళు కళ్ళలో పడకుండా జాగ్రత్త పడాలి.

                    దీని వలన తలలో పేలు మాత్రమే కాక పుండ్లు కూడా నివారింప బడతాయి.

 

    శీతా ఫలం గింజలను నీటితో నూరి జుట్టును పాయలుగా విడదీసి కుదుళ్ళకు రాత్రి వేళ పట్టించి ఉదయం స్నానం చేయాలి.
                                        

పేల వలన ఇన్ఫెక్షన్, పుండ్లు పడడం, మెడ గ్రంధులు వాయడం జరగుతాయి.

1. అర టీ స్పూను పటికను తీసుకొని అర బకెట్ నీళ్ళలో కలిపి కరిగించాలి. ఆ నీటిని జుట్టు కుదుళ్ళకు పట్టించి  అరగంట తరువాత తల స్నానం చేస్తే పేలు చచ్చి పోతాయి.

2. వెల్లుల్లి ని ముద్దగా నూరి తలకు పట్టించి తల స్నానం చేస్తే నశిస్తాయి.

3. వేప నూనెను గోరువెచ్చగా చేసి తలకు రాసుకుని, వేడి నీటిలో ముంచిన టవల్ ను చుట్టి అర గంట తరువాతస్నానం చేయాలి.

4. వాయు విడంగాలు             --- రెండు టీ స్పూన్లు
                ఆవ నూనె            --- ఎనిమిది టీ స్పూన్లు
                       నీళ్ళు            --- ఒక కప్పు

అన్నింటిని కలిపి నూనె మిగిలే వరకు మరిగించాలి.
ఈ నూనెను ( విడంగాది తైలం ) తలకు రాసుకుంటే పేలు పోతాయి. .


           కొబ్బరి నూనెలో హారతి కర్పూరం వేసి కాచి పెట్టుకుంటూ వుంటే పేలు రాలి పోతాయి. 
తరువాత తల స్నానానికి కుంకుళ్లు, శీకాయలతో వాడితే మంచిది.


       తలలో పేలు -- నివారణ 
వేపాకుల చూర్ణం                 --- 50 gr
శీతా ఫలం గింజల చూర్ణం     --- 50 gr ( కళ్ళకు తగల కూడదు )
బావంచాల గింజల పొడి       --- 50 gr 
తులసి ఆకుల చూర్ణం        ---- 50 gr ( క్రిమి సంహారకం )
కచ్చూరాలు                    ---- 50 gr 
పొత్తి దుంప                      ---- 50 gr 
ముల్తానీ మట్టి                 ---- 50 gr ( దీనిలో మినరల్స్ వుంటాయి) ఇది డ్రై షాంపూలాగ             పనిచేస్తుంది 
కలబంద గుజ్జు                ----100 gr ( తలకు చల్లదనాన్ని ఇస్తుంది). 

      అన్నింటిని విడివిడి గా దంచి జల్లించి  చేసి కలిపి డబ్బాలో నిల్వ చేసుకోవాలి. 

దీని నుండి మూడు టీ స్పూన్ల పొడిని తీసుకుని దానికి కలబంద గుజ్జు కలిపి నూరి తలకు పట్టించాలి.

ఈ విధంగా వారానికి రెండు సార్లు చేస్తే తలలో పేలు పూర్తిగా నివారింప బడతాయి. 


        పేలు --నివారణ -- సర్శపాది తైలం                         


       తలలో పెరిగే పెలను, వేరే జీవులను, ఫంగల్ ఇన్ఫెక్షన్ లాంటి వాణ్ణి కూడా దీనితో నివారింప బడతాయి.

ఆవనూనె                   --- 55 ml 
వేపనూనె                  ---- 40 ml 
దేవదారు నూనె           ---- 5 ml 
కర్పూరం                    --- చిటికెడు 

   అన్ని నూనెలను ఒక చిన్న పాత్రలో పోసి బాగా కలిపి తరువాత కర్పూరం కలిపి సీసాలో నిల్వ చేసుకోవాలి. 

       జుట్టును పాయలుగా విడదీసి ఒకటి రెండు స్పూన్ల తైలాన్ని కుదుళ్ళకు  పట్ట్టించాలి. రెండు 
గంటల పాటు అలాగే  ఉంచాలి. పేలు చనిపోతాయి. మొదట పేలు అపస్మారక స్థితిలో వుంటాయి చెక్క దువ్వెనతో దువ్వి తొలగించాలి. 

           పేల నివారణకు  -- కర్పూరాది తైలం                               

        ముద్దకర్పూరం                    --- ఒక గ్రాము
        వేప నూనె                           ---99 gr 

                  వేపనూనేలో కర్పూరం కలిపి  సీసాలో నిల్వ చేసుకోవాలి. 

                  ఈ నూనెను ముని వేళ్ళతో తీసుకుని తల మీద మర్దన చేస్తూ పట్టించాలి. ఈ విధంగా
    మునివేళ్ళతో ఐదు  మర్దన చేయాలి  తరువాత హెయిర్ వాష్ పౌడర్ తో గాని కుంకుళ్ళ పొడితో
    గాని తల స్నానం చేయాలి. 

            పేను కొరుకుడు--నివారణ                                
      ఈ వ్యాధి ముదిరితే కనుబొమలు, కంటి వెంట్రుకలు కూడా రాలిపోతాయి. 
      నేల ములక (నేల వంకాయ లేదా వాకుడు లేదా ముళ్ళ వంకాయ) యొక్క కాయలు, వ్రేళ్ళు తెచుకోవాలి. పచ్చి కాయలు దొరికితే తెచ్చి నూరి గుజ్జును  వెంట్రుకలు రాలిన చోటపూయాలి.  ఎండిన కాయలైతే  దంచి జల్లించి తేనె కలిపి పూయాలి.  ఈ విధంగా 8 రోజులు పూయాలి, ఎనిమిదవ రోజు తల స్నానం చెయ్యాలి. 

                          గురివింద గింజలు 
                          తేనె 

     గురివింద గింజలను నలగగొట్టి  దంచి పొడి చెయ్యాలి. సరిపడినంత పొడిని తీసుకొని దానికి తగినంత తేనె కలిపి పేస్టూ లాగ చెయ్యాలి. రెండు వేళ్ళకు నూలు గుడ్డను చుట్టుకొని ఈ లేపనాన్ని తీసుకొని తల మీద జుట్టు లేని చోట నెమ్మదిగా మర్దన చెయ్యాలి. దాని చుట్టుకూడా వెంట్రుకల మీద రుద్దాలి.    ;లేదా 

     గురివింద గింజలను నానబెట్టి మెత్తగా నూరి తేనె కలిపి పై విధంగా మర్దన చెయ్యాలి. 


కుంకుడు కాయలు 
కళ్ళు ఉప్పు 

             ఒక గిన్నెలో చాలా కొద్దిగా నీళ్ళు తీసుకొని దానిలో ఉప్పు వేసి కరిగించాలి. 

             సాన రాయి తీసుకొని దాని మీద ఉప్పునీటి చుక్కలు వేసి దాని మీద కుంకుడు కాయతో చాది గంధం తీయాలి. 

             గరుకుగా వున్న నూలు గుడ్డను తీసుకొని రెండు వేళ్ళకు చుట్టుకొని గందంలో ముంచి పెనుకోరుకుడు  మీద రుద్దాలి.  ఈ విధంగా ప్రతిరోజు రెండు పూటలా పది రోజులు రుద్దాలి. తరువాత వెంట్రుకలు మొలవడం  ప్రారంభమవుతుంది. 

          పుండుగా లేక మెత్తగా అయితే కొబ్బెరనూనే పూయాలి. వారం తరువాత  కుంకుడు కాయలతో తో తల  స్నానం చెయ్యాలి. 

. గుంటగలగర ఆకు పొడి                        ---20 gr 
 ఉసిరికాయల పొడి                                ---20 gr 
దోరగా వేయించిన నల్ల నువ్వుల పొడి        ---20 gr 
అతి మధురం పొడి                               --- 20 gr 
పటికబెల్లం పొడి                                   --- 80 gr 

      అన్నింటిని ఒక గిన్నెలో వేసి బాగా కలిపి సీసాలో భద్ర పరచుకోవాలి. 

   చిన్న పిల్లలకైతే        ---- మూడు చిటికెలు
   పెద్ద         "              ---- అర టీ స్పూను 

         ఒక కప్పు వేడి పాలలో కలుపుకొని తాగాలి. 

      దీని వలన రక్త వృద్ధి జరుగుతుంది. వాత, పిత్త, కఫ దోషాలు తొలగించవ్బడతాయి.జుట్టు యొక్క కుదుళ్ళు  గట్టి పడతాయి.

          ఆముదపు ఆకులను సముద్రపు  నురుగు  ( షాపు లో కూడా దొరుకుతుంది ) తో కలిపి నూరి వెంట్రుకలు  ఊడిన చోట రుద్దుతూ వుంటే మొలుస్తాయి. చేతి గుడ్డను వెలికి చుట్టుకొని ఆ రసాన్ని తలకు పూయాలి. మంటగా వుంటే రెండు రోజులు ఆపి కొబ్బరి నూనె పూయాలి. మళ్లీ Continue  చెయ్యాలి. 

           పేను  కొరుకుడు --నివారణ 
           పిప్పింటాకును  మెత్తగా దంచి జుట్టు లేని ప్రదేశంలో రసాన్ని పిండి ఆకుతో రుద్దాలి.  ఈ విధంగా ఉదయం, సాయంత్రం చెయ్యాలి. మూడు రోజులు చెయ్యాలి. తరువాత తల స్నానం చేసి మరలా 7 వ రోజు ప్రారంభించి మరలా మూడు రోజులు  ఉదయం, సాయంత్రం చెయ్యాలి.

 ఈ విధంగా 4, 5 సార్లు చేస్తే వెంట్రుకలు వస్తాయి. 
                              

          బూడిద గింజల తొక్కను నూరి పూస్తూ వుంటే  పెను కొరుకుడు వలన జుట్టు రాలిపోయిన చోట మరలా  వెంట్రుకలు పెరుగుతాయి.

                        బట్ట తల ---నివారణ                     
       ముక్కులో తైలం వేసుకొని ముద్రవేసుకొని గాలి పీలుస్తూ వదులుతూ " ఓం" అని ఐదు సార్లు పలకాలి.
       తలకు వేడి నీటిలో ముంచిన బట్టను  చుట్టాలి. దాని పై పొడి బట్టను చుట్టాలి, దాని మీద మందమైన గుడ్డను లేదా టవల్ ను చుట్టాలి. 
సర్వాంగాసనం, ఉష్ట్రాసనం, శుక్రవజ్రాసనం వెయ్యాలి. 
                 జుట్టు వస్తూ వున్న దశలో  తీసుకోవాల్సిన జాగ్రత్తలు:-- 
      వారానికి రెండు సార్లు తలకు నిండుగా నూనె పెట్టాలి. ఏదో ఒక తైలంగాని లేదా స్వచ్చమైన కొబ్బరినూనె  గాని వాడాలి. అర చేతులతో రుద్ద రాదు. వేళ్ళతో పాయలకు పట్టించాలి. 
      కుంకుడు కాయలతో గాని, సీకాయతో గాని తల స్నానం చెయ్యాలి. త్రిఫలాలు నానబెట్టిన నీళ్ళు తలకు పూయాలి. ఈ విధంగా చెయ్యడం వలన జుట్టు తప్పకుండా వస్తుంది. 
బూరుగు జిగురు
నేలతాడి దుంపల పొడి
తామర గింజల పొడి 
    అన్నింటిని సమ భాగాలుగా తీసుకొని దంచి పొడి చేసి  పొడిలో నీరు కలిపి నూరి జుట్టు కుదుళ్ళకు పట్టించాలి
  ఉల్లి పాయలను దంచి బట్టలో వేసి పిండి రసం తీయాలి. గుడ్డను వెలికి చుట్టి రసాన్ని వెంట్రుకలు ఊడిన చోట   లేపనం చేయాలి. 
   ఉల్లి గడ్డ గింజలను నూరి తలకు పట్టిస్తే జుట్టు అసలు వూడదు.
జటామాంసి                   ---100 gr
చెంగల్వ కోష్టు               --- 100 gr
నల్ల నువ్వులు              --- 100 gr
సుగంధ పాల వేర్ల బెరడు  -- 100 gr
తామర గింజలు            --- 100 gr
ఆవు నెయ్యి                 --- 500 gr 
  అన్ని పదార్ధాలను దంచి పొడులు చేసి మంచి నీటితో కలిపి గుజ్జుగా చెయ్యాలి. దానిలో అర కిలో ఆవు నెయ్యి పోసి  స్టవ్ మీద పెట్టి పదార్ధములోని తేమ ఇంకి పోయి నెయ్యి మాత్రం మిగిలేవరకు కాచాలి. వడకట్టి సీసాలో నిల్వ చేసుకోవాలి
       దీనిని వాడడం వలన జుట్టు పీకినా రాదు. తలనొప్పి కూడా తగ్గుతుంది. 
       గుప్పెడు శీతా ఫలం గింజలను కల్వంలో వేసి మేక పాలు పోసి మెత్తగా నూరాలి, దీనిని తలకు పూయాలి. 
ఈ విధంగా చేయడం వలన నిద్రాణంగా వున్నజుట్టు స్టిమ్యులేట్ (ఉత్తేజితం ) అవుతాయి. నూరిన ముద్దను
తలను  గీరుతూ తల మీద పూయాలి.  క్రమేపి వెంట్రుకలు మొలుస్తాయి. 

 1. దవనం                  --- పిడికెడు
     గోరింటాకు             ---     "
     కొత్తిమీర                ---     " 
     మెంతులు              ---     "
     పెరుగు                  --- ఒక టేబుల్ స్పూను

           అన్ని పదార్ధాలను మెత్తగా పెరుగుతో కలిపి నూరాలి . దీనిని తలకు పట్టించాలి . అరగంట తరువాత తల
స్నానం చేయాలి .

2. మందార ఆకులు       --- 50 gr 
    మందార  పూలు        --- 50 gr 
    కొబ్బరి నూనె            --- 400 ml 

          మందార ఆకులను ,  పూలను  మెత్తగా నూరి కొబ్బెరనూనేలో కలిపి స్టవ్ మీద పెట్టి సన్న మంట మీద నూనె
మాత్రమె మిగేలే విధంగా కాచాలి . చల్లారిన తరువాత వడపోసి సీసాలో నిల్వ చేసుకోవాలి .
          ఈ తైలాన్ని ప్రతి రోజు రాత్రి  వెంట్రుకలు లేని చోట పోసి బాగా రుద్దాలి . వెంట్రుకలున్న చోట కూడా పూయాలి
     
                    హెర్బల్ షాంపూ   

కుంకుడు పెచ్చులు                --- 10 gr
సీకాయ       "                       --- 10 gr
ఉసిరిక ముక్కలు                  ----10 gr
మెంతులు                           ----10 gr

   అన్నింటిని రాత్రి నీళ్ళలో నానబెట్టి ఉదయం పిసికి రసం తీస్తే షాంపూ లాగా తయారవుతుంది. దీనితో  తల స్నానం చేస్తే జుట్టు ఎంతో మృదువుగా వుంటుంది.

     ఆయుర్వేద షాంపూ                                  

కుంకుళ్ళ పొడి            ---- 60 gr 
బ్రాహ్మి పొడి               ---- 10 gr 
సీకాయ పొడి              ---- 10 gr 
గోరింటాకు పొడి          ---- 10 gr 

   ఒక గిన్నెలో అర లీటరు నీళ్ళు పోసి స్టవ్ మీద పెట్టి నీళ్ళు మరిగేటపుడు ఒక్కొక్క పొడిని దానిలో వేసి బాగా  కలియబెట్టాలి. 100 ml కషాయం మిగిలే వరకు కాచి వదపోసుకోవాలి. 

ఉపయోగాలు :-- 

చుండ్రు :-- దీని నివారణకు వారానికి రెండు మూడు సార్ల చొప్పున రెండు, మూడు నెలలు వాడాలి

తెల్ల జుట్టు :-- దీనిని వాడుతూ తలకు నీలి భ్రున్గాడి తైలం వాడుకోవాలి. 

 దీనిని వాడడం వలన చర్మ వ్యాధులు కూడా నివారింప బడతాయి. వెంట్రుకలు చిట్లవు. వెంట్రుకలు ఎండి  పోయినట్లుగా వుంటే దీనిని వాడడం వలన జుట్టుకు జీవం వచ్చి నిగనిగ లాడుతుంది. 

   కేశాల సమస్య నివారణకు --ఆయుర్వేద షాంపూ               

   వెంట్రుకలు, గోళ్ళు కెరోటిన్ అనే పదార్ధంతో తయారవుతాయి. కెరోటిన్ బలహీనపడినపుడు అవి రెండు దెబ్బ తింటాయి. కృత్రిమ పదార్ధాలను ఉపయోగించడం వలన కూడా దెబ్బ తింటాయి. 

గుంటగలగర సమూల చూర్ణం               ---- ఒక టీ స్పూను
వేపాకుల చూర్ణం                                 ---- ఒక టీ స్పూను
బ్రాహ్మి చూర్ణం                                   ---- అర టీ స్పూను
ఉసిరి పొడి                                        ---- అర టీ స్పూను
సీకాయ పొడి                                     ---- పావు టీ స్పూను 
తెల్ల వాము (అజామోదం) పొడి             ---- పావు టీ స్పూను
షాంపూ బేస్       ---- తగినంత 

  ఒక గిన్నెలో 200 మిల్లి లీటర్ల నీళ్ళు తీసుకుని స్టవ్ మీద పెట్టి వేడి చెయ్యాలి. దీనిలో అన్ని చూర్ణాలను  ఒక్కొక్కటిగా అన్నింటిని వేసి బాగా కలపాలి. తరువాత అది 100 ml నీళ్ళు 
అయ్యే వరకు కాచాలి. తరువాత వదపోసుకోవాలి. తరువాత దీనికి షాంపూ ను కలపాలి. దీనితో
తల స్నానం చెయ్యాలి. 

      ఈ విధంగా వారానికి రెండు సార్లు చేస్తే చుండ్రు తగ్గుతుంది. 
తెల్ల జుట్టు,   జుట్టు చిట్లడం,   వెంట్రుకల జీవ రహితంగా కనిపించడం వంటివి కూడా నివారింప బడతాయి.

దీనిని ఏ రోజుకారోజు తయారు చేసుకోవాలి. 

 మందార 

మందార సాధారణంగా అందుబాటులో ఉండే మొక్క మరియు ఇది జుట్టు రాలడాన్ని నివారించడానికి మరియు నియంత్రించడానికి ఒక అద్భుతమైన చిట్కా. జుట్టు కోసం మందారను రెండు విధాలుగా ఉపయోగించవచ్చు, అవి:

మందార నూనె

  • 8 నుండి 10 మందార ఆకులను తీసుకోండి 
  • ఈ ఆకులను నూరి 1 కప్పు వేడిచేసిన కొబ్బరి నూనెలో కలపండి
  • అది చల్లారిన తరువాత, ఈ నూనెను మీ తలకు పట్టించి ఒక రాత్రంతా అలా వదిలివేయండి
  • మరుసటి రోజు యథావిధిగా తలస్నానం చేయండి

మందార హెయిర్ మాస్క్

  • కొన్ని మందార ఆకులను పేస్ట్‌ చేయండి 
  • దీనికి 4 టేబుల్ స్పూన్ల పెరుగు కలపండి
  • దీనిని మీ తలకు పట్టించి 
  • ఒక గంట ఉంచండి 
  • తేలికపాటి గాఢత కలిగిన షాంపూతో తలస్నానం చేయండి 

మీరు ఈ సుదీర్ఘ ప్రక్రియను పాటించలేకపోతే మందార నూనె కూడా వాణిజ్యపరంగా లభిస్తుంది మరియు అది ఉపయోగించడానికి 

ధన్యవాదములు 

మీ నవీన్ నడిమింటి 

విశాఖపట్నం 

9703706660

అస్వీకార ప్రకటన: ఈ సైటుపై లభ్యమవుతున్న మొత్తం సమాచారము మరియు లేఖనము కేవలం అవగాహనా ఆవశ్యకతల కొరకు మాత్రమే. ఇక్కడ ఇవ్వబడిన సమాచారమును ఏదైనా ఆరోగ్య సంబంధిత సమస్య లేదా అస్వస్థత నుండి కోలుకోవడానికి లేదా స్వస్థత కొరకు నిపుణుల సలహా లేనిదే ఉపయోగించుకోకూడదు. చికిత్స పరీక్షలు మరియు సేవల కొరకు ఎల్లప్పుడూ ఒక అర్హత పొందిన వైద్యుల సలహా తీసుకోవాలి.