సారాంశం
కాలేయవాపు వ్యాధి నివారణ
కాలేయ వాపు వ్యాధికి ఒక నిర్దిష్టమైన వైద్య చికిత్స లేదా శస్త్రచికిత్స అంటూ లేదు. కానీ, ఈ కాలేయ వాపు వ్యాధికి గురైన వ్యక్తి తగిన నివారణా చికిత్స తీసుకుంటే వ్యాధి తీవ్రతను తిరోగమనం పట్టించి కొంత వరకు వాపును బాగు చేసుకోవచ్చు. మద్యపానేతర కాలేయ వ్యాధికి చెందిన నాన్-ఆల్కహాలిక్ స్టీటోహెపటైటిస్-NASH (కామెర్లు) తో బాధపడుతున్నవారు ఈ నివారణా చికిత్స తీసుకుంటే చాలా ప్రభావవంతంగా ఉంటుంది.
కాలేయ వాపు వ్యాధిని ఆపడానికి, ఇంకనూ వ్యాధి తీవ్రతను తిరోగమనం పట్టించడానికి సహాయపడే చర్యలు కింది విధంగా ఉన్నాయి:
- బరువు తగ్గడం
సురక్షితంగా బరువు తగ్గడమనేది కాలేయ వాపు ను నిర్వహించుకోవడంలో తోడ్పడుతుంది. సురక్షితంగా బరువును కోల్పోవడమంటే ఒక వారంలో అర్ద కిలోగ్రామ్ లేదా ఒక కిలోగ్రాము కంటే ఎక్కువ బరువును కోల్పోకుండా ఉండడం. - మద్యపానానికి దూరంగా ఉండటం
మద్యం సేవించడం కాలేయానికి హానికరం. మద్యం కాలేయంలో విరిగిపోయినప్పుడు కాలేయానికి హాని కలిగించే పదార్థాలను ఉత్పత్తి చేసి విడుదల చేస్తుంది. మాద్యపానాన్ని ఆపేయడం మూలంగా కాలేయం తనలో పేరుకుపోయిన శరీరజన్య విషాన్ని తొలగించడానికి మరియు స్వయంగా నయం చేసుకునే అవకాశాన్నీ కాలేయానికి కల్పించినట్లవుతుంది. - మధుమేహం నియంత్రించటం
మధుమేహం (చక్కెరవ్యాధి) వ్యాధిని సవ్యంగా నిర్వహించుకుంటూ వెళ్తే మద్యపానేతర కాలేయ వాపు వ్యాధి (NAFLD) ని మెరుగ్గా నయం చేసుకోవడానికి సహాయపడుతుంది. - ఆహారసేవనం లో మార్పులు
మద్యపానేతర కాలేయ వాపు వ్యాధి (NAFLD) రోగుల విషయంలో-వారి వ్యాధి చికిత్స మరియు నిర్వహణలో ఆహారం కీలక పాత్ర పోషిస్తుంది. తాజా పండ్లు, కూరగాయలు మరియు తృణధాన్యాలు వారి ఆహారంలో చేర్చండి మరియు అధిక చక్కెర మరియు ఉప్పు తీసుకోవడం నివారించండి. - మీ శారీరక శ్రమపెంచేందుకు వ్యాయామం
మద్యపానేతర కాలేయ వ్యాధి రోగులు వారి శారీరక శ్రమ (వ్యాయామాలు మొదలైనవి)ను కొద్దిపాటిగా పెంచినా అది వారికి చికిత్సాపరమైన మేలును కలుగజేసి ఉపయోగకరమైందిగా కనిపిస్తుంది. - మీ వైద్యుడితో నిరంతరంగా పరీక్షలు చేయించుకోవడం
మీ కాలేయ ఆరోగ్యాన్ని అంచనా వేయడానికి లివర్ స్పెషలిస్ట్ ద్వారా రెగ్యులర్ గా పరీక్షలు చేయించుకుని చికిత్స పొందడం చాలా ముఖ్యమైంది
కాలేయ వాపు వ్యాధి నిర్ధారణ
కాలేయ వాపు వ్యాధి నిర్ధారణకు ఎలాంటి నిర్దిష్ట లక్షణాలు లేనందున వైద్యుడు మీ రక్తపరీక్ష పరిశీలనలో ఏదైనా విలక్షణమైనదాన్ని గమనించినట్లయితే గాని లేక పరిమాణం పెరిగిన కాలేయమును గమనిస్తే గాని ఈ వ్యాధి రోగికున్నట్లు యాదృశ్చికంగానే బయట పడుతుంది. అటువంటి సందర్భాల్లో డాక్టర్ కాలేయ వాపు వ్యాధి యొక్క ఉనికిని పసిగట్టినపుడు కొన్ని రక్త పరీక్షలు, కాలేయ పనితీరు పరీక్షలు, అల్ట్రాసౌండ్, ఒక CT స్కాన్ లేదా ఒక MRI ను మీ కాలేయ స్థితిని నిర్ధారించడానికి గాను సూచించవచ్చు.
మీకు చేసిన అనేక పరీక్షలు మీకు ఎలాంటి ఇతర కాలేయ వ్యాధులు లేవని సూచిస్తూ ఉండగా మీరు మద్యపానేతర స్టీటోహెపటైటిస్ (NASH) లేక కామెర్లతో బాధపడుతున్నారని మరో పరీక్ష తేల్చవచ్చు. ఒక్క కాలేయ జీవాణుపరీక్ష మాత్రమే వ్యాధిని నిర్ధారించగలదు. కాలేయం జీవాణుపరీక్షలో, కాలేయ కణజాలం యొక్క ఒక చిన్న నమూనా తొలగించబడుతుంది మరియు దాన్ని సూక్ష్మదర్శిని క్రింద వైద్యుడు పరిశీలిస్తాడు. డాక్టర్ కాలేయ వాపు వ్యాధి అని అనుమానిస్తే, మీనుండి ఒక వివరణాత్మక వైద్య చరిత్రను అడిగి తెలుసుకుంటాడు. మరియు మీకు మద్యంపానం అలవాటుంటే దాని గురించి మరియు ఏవైనా మందులసేవనం వల్ల సమస్యను కల్గించి ఉంటె దాన్ని గుర్తించడానికి మీరు తీసుకున్న మందులు గురించి డాక్టర్ మిమ్మల్ని ప్రశ్నలు అడుగుతారు.
కాలేయ వాపు వ్యాధి చికిత్స
రోగికి దాపురించిన కాలేయ వాపు వ్యాధి యొక్క రకాన్ని బట్టి ఆ వ్యాధి నిర్వహణ క్రింది విధంగా ఉంటుంది:
మద్యపానేతర కాలేయ వాపు వ్యాధి (Non-alcoholic Fatty Liver Disease ,NAFLD)
మద్యపానేతర కామెర్ల జబ్బు (NASH)కు గాని లేదా మద్యపానేతర కాలేయ వాపు వ్యాధి (NAFLD)కి గాని ఎటువంటి స్థిరమైన మందులు లేవు.
- ఈ కాలేయ వాపు వ్యాధి నిర్ధారణ చేయబడిన వారికి బరువు తగ్గమని వైద్యులు సిఫారసు చేస్తారు. బరువు తగ్గడం మూలంగా కాలేయంలో పేరుకుపోయిన కొవ్వు, మంట మరియు కాలేయం పై ఏర్పడిన మచ్చలు ( ఫైబ్రోసిస్) తగ్గుతాయి.
- శారీరక శ్రమ (వ్యాయామాలతో కూడినది కావచ్చు)ను పెంచడమనేది మొత్తం శరీరంలోని కొవ్వును తగ్గించుకోవడానికే కాక కాలేయంలోని కొవ్వునూ తగ్గించుకోవడానికి సహాయపడుతుంది. శారీరక శ్రమ కార్యకలాపాలు సిఫార్సు చేసిన స్థాయి కంటే తక్కువ అయినప్పటికీ, కేవలం క్రియాశీలకంగా ఉండటం వల్ల మద్యపానేతర కాలేయ వాపు వ్యాధి NALFD లో ప్రయోజనకరమైన ప్రభావాన్ని చూపిస్తుంది.
- వైద్యులు మీరు తీసుకున్న మందులను మూల్యాంకనం చేయవచ్చు మరియు కొన్ని ఔషధాలను మార్చమని లేదా మరి కొన్ని మందుల్ని నిలిపివేయమని మిమ్మల్ని అడగొచ్చు. మీ వైద్యుని ఆమోదం లేకుండా మీరు చికిత్సలో భాగంగా తీసుకుంటున్న మందుల్ని ఆపకండి , అలా చేస్తే అది ఇతర సమస్యలకు దారి తీస్తుంది మరియు మీ ఆరోగ్యానికి ప్రమాదకరమైనదిగా మారే ప్రమాదం ఉందని నిరూపించగలదు.
- మద్యపానేతర కాలేయ వాపు వ్యాధి (NAFLD) చికిత్సకు ఎటువంటి ఆమోదిత ఔషధాలు లేవని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. కానీ మధుమేహం (చక్కెరవ్యాధి) జబ్బు చికిత్సకు వాడే కొన్ని మందులు మరియు విటమిన్లు కాలేయ వాపు వ్యాధి చికిత్సకు కూడా సహాయపడతాయని సూచించిన ఆధారాలు ఉన్నాయి. ఏదేమైనా ఈ విషయంలో ఎటువంటి నిర్ధారణకు రావడానికి ముందుగా పరిశోధన అవసరం.
మద్యపాన కాలేయ వాపు వ్యాధి
- మద్యపాన కాలేయ వాపు వ్యాధితో బాధపడుతున్న వారికి చేసే చికిత్సలో అతి ముఖ్యమైన భాగాల్లో ఒకటేమిటంటే వారు మద్యపానాన్ని పూర్తిగా మానెయ్యాలి. మద్యపానాన్ని మానేయడానికి కష్టంగా ఉండేవారికి సహాయకారిగా ఉండే వేరే చికిత్స సిఫారసు చేయబడుతుంది, ఆ చికిత్స ద్వారా మద్యపానాన్ని మానుకోవచ్చు.
- మద్యం సేవించడాన్ని మానుకోవడానికి కొన్ని మందులు సహాయం చేస్తాయి. ఎలాగంటే ఈ మందులు తీసుకోవడం ద్వారా మద్యం పుచ్చుకోవాలన్న కోరిక తగ్గిపోతుంది. మద్యం త్రాగితే ఎదో జబ్బుపడినట్లుండే భావనను ఈ మండలి కల్గిస్తాయి.
జీవనశైలి నిర్వహణ
మీరు కాలేయ వాపు వ్యాధితో బాధపడుతున్నట్లు పరీక్షల ద్వారా నిర్ధారణ అయితే, మీరు మీ దిననిత్యచర్యల్లో కొన్ని జీవనశైలి మార్పులను చేసుకోవాల్సి ఉంటుంది. దీనివల్ల మీ పరిస్థితి మెరుగై మరింత ప్రభావవంతంగా జీవితాన్ని నిర్వహించడానికి వీలుంటుంది. అలాంటి జీవనశైలి మార్పులు కొన్ని ఏవంటే:
- మీ ఆహారంలో 3-4 భాగాల తాజా పండ్లు మరియు కూరగాయలను చేర్చండి. అధిక చక్కెర మరియు ఉప్పు తీసుకోవడం మానుకోండి మరియు ప్రాసెస్ చేసిన ఆహారాలకు బదులుగా తృణధాన్యాలను మీ ఆహారంలోకి తీసుకోండి.
- సంతృప్త కొవ్వులు మరియు క్రొవ్వు ఆమ్లాలు కలిగిన ఆహార పదార్ధాలను తగ్గించి వాటి స్థానంలో ఆలివ్ ఆయిల్ వంటి ఏక అసంతృప్త కొవ్వులు మరియు బహుళఅసంతృప్త కొవ్వులు, ముఖ్యంగా ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలను తీసుకోండి, దీనివల్ల కాలేయ వాపు వ్యాధితో సంబంధం ఉన్న గుండె వ్యాధులు తగ్గే అవకాశాలు ఉన్నాయి.
- మీ బరువును అదుపులో ఉంచడానికి మరియు కాలేయంలో పేరుకుపోయిన కొవ్వును తగ్గించడానికి క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి.
- మీరు విటమిన్లు, లేదా ప్రత్యామ్నాయ మూలికా మందులు వంటివి ఆహార పదార్ధాలుగా తీసుకుంటుం టే, దాని గురించి మీ డాక్టర్తో మాట్లాడటం మరియు అతని/ఆమె సలహా తీసుకోవడం చాలా ముఖ్యం. కొన్ని మూలికా ఔషధాలు మీ కాలేయానికి హానిని కలిగిస్తాయి.
- కాలేయం దెబ్బతిన్న వ్యక్తులు కొన్ని రకాల అంటువ్యాధులు మరియు “న్యుమోకోకల్” అనే ఒక విధమైన బాక్టీరియా వ్యాధులకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. కాలేయ వాపు వ్యాధి ఉన్న వ్యక్తులు కామెర్ల జబ్బు (హెపటైటిస్ A మరియు B), ఫ్లూ మరియు న్యుమోకోకల్ వ్యాధులకు నిర్దేశింపబడిన టీకామందులు వేసుకోవడం ముఖ్యం. కాలేయ వాపు వ్యాధి ఉన్న వ్యక్తులకు హెపటైటిస్ లేదా కామెర్ల వ్యాధి చాలా ప్రమాదకరమైనది కావచ్చు మరియు ఇది కాలేయ వైఫల్యానికి కూడా దారితీయవచ్చు.
కాలేయ వాపు వ్యాధి ఉపద్రవాలు మరియు రోగ నిరూపణ
కాలేయ వాపు వ్యాధి ఉపద్రవాలు మరియు రోగ నిరూపణ
రోగనిరూపణ
ఆరోగ్యకరమైన కాలేయానికి తనకు తానుగా (స్వయంగా) నయం చేసుకోగల గొప్ప సామర్ధ్యం ఉంటుంది, ఒకవేళ గాయపడినట్లయితే తిరిగి కోలుకుంటుంది, మరియు పునరుత్పత్తి కూడా చేసుకోగలదు. కాలేయ వాపు వ్యాధికి సకాలంలో రోగనిర్ధారణ జరిపి వెనువెంటనే చికిత్స చేసినట్లయితే కాలేయానికి అయిన హాని రూపుమాపబడి, రోగం మాయమైపోయి మళ్ళీ కనిపించకుండా పోతుంది. ఇది అనేకమంది రోగుల విషయంలో నిరూపితమైంది. మనిషిలో కాలేయం దెబ్బ తినిందనడానికి మంట మరియు తంతీకరణం (ఫైబ్రోసిస్) అనేవి తొలి లక్షణాలు. ఈ ప్రారంభ దశలోనే కాలేయ వాపు వ్యాధి రోగ నిర్ధారణ అయినట్లయితే, మీ కాలేయం కొంతకాలంలోనే తనకు తానుగా నయం చేసుకోగలదు. ఇలా మన కాలేయం తనకు తానుగా రోగనయం చేసుకోవాలంటే ఆరోగ్యకరమైన జీవనశైలి మరియు ఆహార మార్పులను చేసుకోవాల్సి ఉంటుంది. కాలేయంలో ఆరోగ్యకరమైన కణజాలం తక్కువగా ఉన్నట్లైతే తంతీకరణం (Fibrosis) తీవ్రంగా పెరిగిపోయి ప్రాణాంతక కాలేయ వ్యాధి (cirrhosis)గా రూపాంతరం చెందుతుంది. కాలేయ వ్యాధి సిర్రోసిస్ దశలోకొచ్చినపుడు కాలేయంలో ఆరోగ్యకరమైన కణజాలం చాలా తక్కువగా ఉంటుంది. ఈ దశలో వ్యాధికి చేపట్టే చికిత్స యొక్క లక్ష్యమంతా కొద్దిగా మిగిలున్న ఈ ఆరోగ్యకరమైన కాలేయకణజాలాన్ని రక్షించి వ్యాధి పురోగతిని నిలిపివేయడం పైన్నే ఉంటుంది.
ఉపద్రవాలు
కాలేయ వాపు వ్యాధి యొక్క ముగింపు దశ కాలేయ వైఫల్యం (liver failure). కాలేయ వైఫల్యం ప్రాణాంతకమైన కాలేయ వ్యాధి లేదా సిర్రోసిస్ కారణంగా లేదా పోషకాహారలోపం కారణంగా సంభవిస్తుంది. కాలేయ వైఫల్యం సిర్రోసిస్ వల్ల సంభవించినట్లయితే, కాలేయ వైఫల్యం నెమ్మదిగా ఉంటుందని వైద్యులంటారు. ఈ దశలో కాలేయపు పనితీరు నెమ్మదిగా, అంటే సంవత్సరాల తరబడి, క్షీణిస్తుంది. పోషకాహార లోపము వలన సంభవించే కాలేయ వైఫల్యం అకస్మాత్తుగా ఉంటుంది, అంటే కేవలం 48 గంల్లోపలే సంభవించవచ్చు. ఇటువంటి దశలో రోగికి కాలేయ మార్పిడి ఒక్కటే చికిత్స.
కాలేయవాపు వ్యాధి (లేక Fatty Liver Disease) అంటే ఏమిటి?
మానవుడి శరీరంలో కాలేయం అనేది చాలా పెద్ద అంతర్గత అవయవాల్లోఒకటి. కాలేయం మనం తిన్న ఆహారాన్ని జీర్ణం చేసేందుకు, శరీరం నుండి శరీరజన్యవిషాన్ని మరియు ఇతర విషాల్ని తీసివేసి, మన శరీరంలో శక్తిని నిల్వ చేయడానికి మనకు సహాయపడుతుంది. కాలేయంలో కొవ్వు క్రమంగా నిర్మాణమవడమే “కాలేయ వాపుకు దారి తీస్తుంది. మన కాలేయంలో సాధారణంగానే కొంత కొవ్వు ఉంటుంది అయితే ఇది ఎటువంటి వ్యాధి లక్షణాలను ఉద్భవించనీయదు. అయితే, కాలేయంలో ఉండే కొవ్వుకు తోడు అధికంగా కొవ్వు పేరుకుంటూ పోవడం కాలేయ వాపుకు దారితీస్తుంది. ఈ పరిస్థితినే “కాలేయ వాపు వ్యాధి” గాను, “ఫాటీ లివర్ వ్యాధి” అని పిలువ బడుతుంది.
ఫ్యాటీ లివర్ వ్యాధి రకాలు
ఫ్యాటీ లివర్ వ్యాధి రెండు ప్రధాన రకాలు:
మద్యపానేతర (నాన్ ఆల్కహాలిక్) కాలేయ వ్యాధి (NAFLD)
మద్యపానేతర కాలేయ వ్యాధి-NAFLD, కాలేయంలో కొవ్వు పెరిగిపోవడం వల్ల వస్తుంది గాని దీనికీ, మద్యం అధికంగా తీసుకోవడానికి సంబంధం లేని జబ్బు ఇది. మద్యపానేతర కాలేయవ్యాధి రెండు రకాలుగా ఉంటుంది:సాధారణ కాలేయ వాపు
ఈ సాధారణ కాలేయ వాపు రకంలో కాలేయంలో కొవ్వు పేరుకుపోయి ఉండే పరిస్థితి ఉంటుంది, కానీ, కాలేయ కణాలకు ఎలాంటి హాని ఉండదు. ఇలా కొవ్వు చేరడం వలన ఎటువంటి వాపు గాని, మంట గాని ఉండదు. ఈ పరిస్థితి సాధారణంగా కాలేయానికి ఎటువంటి హాని కలిగించదు మరియు ఎలాంటి సమస్యలను తెచ్చి పెట్టదు.నాన్-ఆల్కహాలిక్ స్టీటోహెపటైటిస్ (NASH)
ఈ రకం కాలేయ వాపు స్థితిలో, కాలేయంలో కొవ్వు పేరుకుపోతుంది, ఇంకా వాపు, కాలేయ కణాలకు నష్టం వాటిల్లుతుంది. వాపు, నొప్పితో కూడిన మంట మరియు కాలేయ కణ నష్టం అనేక ఇతర సమస్యలను కలిగిస్తాయి. ఆ ఇతర ఆరోగ్య సమస్యలేవంటే కాలేయంలో వ్యాప్తి చెందే తంతీకరణం (fibrosis), మచ్చలు, ప్రాణాంతక కాలేయ వ్యాధి (cirrhosis) మరియు కాలేయ క్యాన్సర్ వంటివి. (మరింత సమాచారం: సీస్టిక్ ఫైబ్రోసిస్ చికిత్స)
మద్యపాన కాలేయ వాపు వ్యాధి
మద్యపాన కాలేయ వాపు వ్యాధి (Alcoholic fatty liver disease) మద్యం అధికంగా తీసుకోవడం వల్ల సంభవిస్తుంది. మద్యం కాలేయంలో విచ్ఛిన్నం అవుతుంది మరియు కొన్ని హానికరమైన పదార్థాలను విడుదల చేస్తుంది. ఇలా విడుదలైన హానికారక పదార్థాలు కాలేయ కణాలను దెబ్బ తీస్తాయి మరియు వాపును ఎక్కువ చేస్తాయి. ఫలితంగా, శరీరం యొక్క సహజ రక్షణ వ్యవస్థ నెమ్మదిగా బలహీనపడుతుంది. ఒక వ్యక్తి మితానికి మించి మరింత మద్యం సేవించడం కొనసాగినప్పుడు, కాలేయనష్టం పెరుగుతుంది.
కాలేయ వాపు వ్యాధికి కారణాలు మరియు ప్రమాద కారకాలు
కారణాలు
మితం మించి మద్యపానం చేయడమే “మద్యపాన కాలేయ వాపు వ్యాధి” కి గల ప్రధాన కారణాలలో ఒకటి. మద్యం శరీరంలోనికి ప్రవేశించాక ‘శరీరజన్య విషం’గా మారి కాలేయం వాపుకు, మంటకు కారణమవుతుంది. కాని మద్యపానేతర కాలేయ వాపు వ్యాధి (NAFLD) మరియు మద్యపానేతర కామెర్ల జబ్బు (Non-alcoholic fatty liver disease-NAFLD)కు ఖచ్చితమైన కారణం ఇంకా తెలియదు. కాలేయంలో కొవ్వు కణాలు పోగటానికి ఎన్నో కారణాలు. ఈ కారణాల్లో ఎదో ఒక కారణం వల్ల మద్యపానేతర కాలేయ వాపు వ్యాధి (NAFLD) మరియు మద్యపానేతర కామెర్ల జబ్బు-NASH దాపురించవచ్చు.
- ఆహారం
అనారోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వల్ల కాలేయంలో కొవ్వు చేరడం జరుగుతుంది. కనుక, అనారోగ్య ఆహారం కాలేయ వాపు వ్యాధికి ప్రధాన కారణాలలో ఒకటి. అధికమైన కేలరీలు గల ఆహారం తీసుకోవడం మూలంగా కాలేయం కొవ్వు కణాలపై చయాపచయ క్రియను నిర్వహించడంలో విఫలమై కాలేయంలో కొవ్వు పేరుకుపోవడానికి దారితీస్తుంది. - ముందుగానే ఉన్న వ్యాధులు
రెండో రకం డయాబెటిస్ (Type 2 diabetes), ఊబకాయం లేదా అధిక బరువు వంటి కొన్ని వ్యాధులు, కాలేయ వాపు పరిస్థితికి ఒక వ్యక్తిని మరింత ప్రభావితం చేస్తుంది. ట్రైగ్లిజరైడ్స్ యొక్క అధిక స్థాయి, కొవ్వు కణాల్లోనే ఒక నిర్దిష్ట రకమైన కొవ్వు కణాలు ఎక్కువవడం కూడా కాలేయ వాపు వ్యాధికి గురి చేస్తాయి. - మందులు
టామోక్సిఫెన్, అమోడియోరోన్ మరియు మెతోట్రెక్సేట్ వంటి కొన్ని ఔషధాలు ఈ వ్యాధి పరిస్థితికి దారితీసే దుష్ప్రభావాలకు కారణమవుతాయి. - ఇన్సులిన్ నిరోధకత
ఇన్సులిన్ నిరోధకత మద్యపానేతర కాలేయ వాపు వ్యాధి (NAFLD)కి అనుసంధానం కావచ్చనే సూచనలు ఉన్నాయి. కాలేయంలో గ్లూకోజ్ను చయాపచయం (metabolise) చేయడంలో అందులోని కణాలు ఉత్పత్తి అయిన ఇన్సులిన్ను తగినంతగా ఉపయోగించుకోలేక పోవడం మూలంగా కూడా కాలేయంలో కొవ్వు పేరుకుపోతుంది.
ప్రమాద కారకాలు
మద్యపానేతర కాలేయ వ్యాధి (NAFLD)కి ఖచ్చితమైన కారణం తెలియదు. కొన్ని వైద్య పరిస్థితులు మరియు నిర్దిష్ట జాతి నేపథ్యాలతో ఉన్నవారు కాలేయ వాపుకు ఎక్కువగా గురయ్యే పరిస్థితి ఉంది, అంతే గాక ఈ వ్యాధి వారికి మరింత ఎక్కువగా దాపురించే ప్రమాదముంది. రెండో రకం మధుమేహం (Type 2 diabetes) లేదా ప్రీ-డయాబెటీస్ స్థితి, ఊబకాయం, వయసు మళ్లినవారు, రక్తంలో ట్రైగ్లిజెరైడ్స్ మరియు కొలెస్ట్రాల్ వంటి అధిక స్థాయి కొవ్వు, అధిక రక్తపోటు, కొన్ని క్యాన్సర్ మందులు, హెపటైటిస్-సి వంటి అంటురోగాలు మరియు శరీరజన్య విషపదార్థాలకు గురికావడం వంటి పరిస్థితులు కాలేయవాపు వ్యాధికి దగ్గరయ్యే అవకాశాలను పెంచుతుంది.
ఫ్యాటీ లివర్ కొరకు మందులు
Medicine Name | Pack Size | |
---|---|---|
Biohep | BIOHEP TABLET | |
Normatone | Normatone Syrup | |
Hysin | Hysin Syrup | |
B Liv | B LIV TABLET 10S | |
ADEL 79 Ferrodona Tonic | ADEL 79 Ferrodona Tonic | |
Letarte | LETARTE SACHET 5GM | |
Lolept | Lolept Granules | |
Powerlactin | Powerlactin Syrup | |
Bjain Manganum aceticum Dilution | Bjain Manganum aceticum Dilution 1000 CH | |
Schwabe Manganum aceticum CH | Schwabe Manganum aceticum 1000 CH | |
Yopon | Yopon Syrup | |
Cyaptin | Cyaptin 2 mg/275 mg Syrup | |
Cypiza | Cypiza Syrup | |
Hepaeuro | HEPAEURO GRANUELS 5GM | |
SBL Geranium robertianum Dilution | SBL Geranium robertianum Dilution 1000 CH | |
Cyprorich | CYPORICH SYRUP 200ML | |
Omeo Alfa and Ginseng Syrup | Omeo Alfa and Ginseng Syrup | |
Samlol | Samlol Sachet | |
Analiv Tablets | Analiv 500 Mg Tablet | |
Filola | Filola Injecti |
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి