2, డిసెంబర్ 2020, బుధవారం

క్యాన్సర్ పై అవగాహన కార్యక్రమం ఈ లింక్స్ లో చూడాలి



క్యాన్సర్ ఒక విస్తారమైన వ్యాధులు సమూహం, దీనిలో కణాల యొక్క అసాధారణ పెరుగుదల వలన కణితులు (కణాజాలం యొక్క ముద్దలు లేదా గడ్డలు) ఏర్పడతాయి. క్యాన్సర్ శరీరంలో ఏవిధమైన అవయవం లేదా కణజాలాల కణాలనైనా (cells) ప్రభావితం చేస్తుంది మరియు చాలా వేగంగా వృద్ధి చెందుతుంది, శరీరంలో వివిధ భాగాలకు వ్యాపించవచ్చు లేదా ఒకే చోట పెరుగుతూనే ఉండవచ్చు. ఈ స్వభావం ఆధారంగా, కణితులు నిరపాయమైనవి (benign) గా ఉంటాయి (వ్యాప్తి చెందనివి) లేదా ప్రాణాంతకమైనవి (వ్యాప్తి చెందేవి) గా ఉండవచ్చు.

వివిధ రకాలైన క్యాన్సర్ల యొక్క కారణాలు వేరువేరుగా ఉంటాయి, అయితే కొన్ని సాధారణ క్యాన్సర్లకు కారణాలు జీన్ మ్యుటేషన్లు (జన్యు ఉత్పరివర్తనలు), ఒత్తిడి, ధూమపానం, మద్యపానం, ఫైబర్ తక్కువగా ఉండే ఆహార విధానం, రసాయనాలు లేదా రేడియోధార్మికతకు గురికావడం మరియు మొదలైనవిగా ఉన్నాయి. భౌతిక పరీక్ష,ఎక్స్-రేలు, సిటి (CT) స్కాన్, ఎంఆర్ఐ (MRI) మరియు పెట్ (PET) స్కాన్ల ద్వారా క్యాన్సర్ రోగ నిర్ధారణ చేయవచ్చు.

క్యాన్సర్ కారణాలు మరియు ప్రమాద కారకాలను నివారించడం ద్వారా క్యాన్సర్లను చాలా వరకు అరికట్టడం సాధ్యపడుతుంది. చికిత్సలో కీమోథెరపీ, రేడియేషన్ థెరపీ, మరియు శస్త్రచికిత్స వంటి ఒకేరకమైన లేదా వివిధ రకాలైన విధానాలు ఉంటాయి. నిర్దిష్టమైన క్యాన్సర్లను ప్రారంభ దశల్లో గుర్తించినట్లయితే తక్షణమే చికిత్స అందించవచ్చు మరియు పూర్తిగా నయం చేయవచ్చు. అయితే, ఇది ఎల్లప్పుడూ సాధ్యపడనప్పటికీ, క్యాన్సర్ వ్యాప్తిని పరిమితం చేయడానికి, రోగి యొక్క జీవితాన్ని సౌకర్యవంతం చేయడానికి మరియు సమస్యలను తగ్గించటానికి అనేక రకాల చికిత్సా విధానాలు అందుబాటులో ఉన్నాయ

క్యాన్సర్ రకాలు 

కణజాలం (టిష్యూ) యొక్క మూలం పై ఆధారపడి, క్యాన్సర్లు ఈ క్రింది విధంగా వర్గీకరించబడ్డాయి:

  • కార్సినోమాలు (Carcinomas): కార్సినోమాలు ఎపిథెలియల్ కణజాల యొక్క క్యాన్సర్లను సూచిస్తాయి. ఎపిథెలియల్ కణజాలం అనేది ప్రతి అవయవం యొక్క పై పొర/కప్పు (covering) ను కలిగి ఉంటుంది అంటే చర్మం, కడుపు లోపలి పొరలు/గోడలు, నోటి లోపలి పొరలు/గోడలు లేదా ముక్కు యొక్క పొర వంటివి. ఇవి సాధారణంగా నివేదించబడిన రకాలు. కార్సినోమాల యొక్క కొన్ని ఉదాహరణలు ప్రోస్టేట్ క్యాన్సర్రొమ్ము క్యాన్సర్ మరియు చర్మపు స్క్వేమస్ సెల్ కార్సినోమా (squamous cell carcinoma)  గా ఉన్నాయి.
  • సార్కోమాలు (Sarcomas):  ఈ రకమైన క్యాన్సర్లు కన్నెక్టీవ్ టిష్యూల (కణజాలాల) యొక్క మూలం కలిగినవి . కన్నెక్టీవ్ కణజాలం శరీరంలో  వివిధ భాగాలను కలుపుతుంది మరియు బలాన్ని ఇస్తుంది. ఉదాహరణకు, అడిపోస్ టిష్యూ (కొవ్వు కణజాలం), అరియోలార్ టిష్యూ (areolar tissue), టెండాన్లు, లిగమెంట్లు మరియు ఎముకలు మొదలైనవి.
  • ల్యుకేమియా (Leukaemia)లుకేమియా తెల్ల రక్త కణాలు యొక్క అనియంత్రిత పెరుగుదల ఫలితంగా సంభవించే రక్త (బ్లడ్) క్యాన్సర్. ల్యుకేమియా యొక్క నాలుగు ప్రధాన రకాలు లింఫోసైటిక్ (తీవ్రమైన మరియు దీర్ఘకాలికమైనవి) మరియు మైలోయిడ్ (తీవ్రమైన మరియు దీర్ఘకాలికమైనవి). ఎముక మజ్జలలో తెల్ల రక్త కణాలు ఏర్పడే మరియు పరిపక్వత (maturation) చెందే వివిధ దశలలో ఉన్న కణాల క్యాన్సర్ను లింఫోసైటిక్ మరియు మైలోయిడ్ లుకేమియా అనే పదాలు సూచిస్తాయి.
  • లింఫోమాలు (Lymphomas): అవి శోషరస కణుపులు (లింఫ్ నోడ్ల) మరియు శోషరస అవయవాల యొక్క క్యాన్సర్లు. మధ్యంతర స్థలలో(interstitial spaces) ఏర్పడే ద్రవాన్ని లింఫ్ (శోషరసం) సూచిస్తుంది. శరీరంలో పలు ప్రాంతాల్లో శోషరస కణుపుల వాహికల (vessels) మరియు శోషరస కణుపుల గుంపుల (clusters) ఒక ప్రత్యేకమైన యంత్రాంగం ఉంటుంది. లింఫ్ (శోషరసం) లింఫోసైట్లును కలిగి ఉంటుంది ఇవి అంటువ్యాధులతో పోరాడతాయి. ఈ ప్రాంతాలు లేదా లింఫోమాల క్యాన్సర్ రెండు రకాలు - హోడ్కిన్స్ (Hodgkin’s) మరియు నాన్- హోడ్కిన్స్ (non-Hodgkin’s) లింఫోమాలు.

అంతేకాకుండా, అవయవం లేదా శరీరంలోని భాగంపై ఆధారపడి, క్యాన్సర్నుఈ క్రింది విధాలుగా వర్గీకరించవచ్చు:

క్యాన్సర్ దశలు 

కాన్సర్ కణజాలం యొక్క అంచనా ద్వారా క్యాన్సర్ దశలు నిర్దారించబడతాయి. ప్రాణాంతక కణితి గుర్తించిన తర్వాత, కణితి స్వభావాన్ని తెలుసుకోవడానికి మరియు చికిత్సా ప్రణాళికను అంచనా వేయడానికి 'గ్రేడింగ్' మరియు 'స్టేజింగ్' అనే రెండు పద్ధతులు ఉపయోగిస్తారు. గ్రేడింగ్ అనేది హిస్టోలాజిక్, అంటే దీనిలో కణజాలం (టిష్యూ) మైక్రోస్కోప్ ద్వారా అధ్యయనం చేయబడుతుంది, అయితే స్టేజింగ్  అనేది వైద్యసంబంధమైనది మరియు సాధారణ పరీక్ష ద్వారా గుర్తించబడుతుంది.

గ్రేడింగ్

మైక్రోస్కోప్ క్రింద కణజాలాన్ని పరిశీలించిన తరువాత, క్యాన్సర్ గ్రేడ్లుగా వర్గీకరించబడుతుంది. క్యాన్సర్ కణజాలం యొక్క మైక్రోస్కోప్ పరీక్ష రెండు విషయాల గురించి సమాచారాన్ని ఇస్తుంది: క్యాన్సర్ పెరుగుదల రేటు మరియు ఆరోగ్యకరమైన కణాలతో పోలిస్తే తేడాగా ఉండే క్యాన్సర్ కణాల ఆకృతి (అనాప్లాసియా యొక్క డిగ్రీ). ఒక నిర్దిష్ట ప్రాంతంలో మాత్రమే కణాల పెరుగుదల అధిక స్థాయిలో ఉన్నప్పుడు ఆ క్యాన్సర్ను నిరపాయంగా (benign) పేర్కొంటారు. క్యాన్సర్ కణాలు ఒక నిర్దిష్ట ప్రాంతంలో లేకుండా శరీరమంతా వ్యాపిస్తే, దీనిని మెటాస్టాటిక్ (metastatic) పిలుస్తారు. బ్రాడెర్స్ గ్రేడింగ్ సిస్టమ్స్ (Broder’s grading system) క్యాన్సర్ కణాల యొక్క విభన పై ఆధారపడి ఉంటుంది, కొద్దిగా మాములుగా/సాధారణంగా ఉన్న కణాలు నెమ్మదిగా వ్యాపిస్తాయి మరియు బాగా విభజించబడిన కణాలు వేగంగా వ్యాపిస్తాయి. బాగా విభజించబడిన కణాలు సాధారణ కణాల కంటే చాలా వేరుగా కనిపిస్తాయి. ఆ గ్రేడ్లు ఈ విధంగా ఉంటాయి

  • గ్రేడ్ I: బాగా విభజించబడినవి
  • గ్రేడ్ II: మధ్యస్తంగా విభజించబడినవి
  • గ్రేడ్ III: స్వల్పంగా విభజించబడినవి
  • గ్రేడ్ IV: సరిగ్గా విభజించబడనివి

కణితి వ్యాప్తిని నిర్ణయించడానికి క్యాన్సర్ కణజాలపు నమూనాకు పాథోలాజికల్ పరీక్ష, ప్రయోగశాల పరీక్షలు మరియు క్లినికల్ పరీక్షలు నిర్వహిస్తారు.

క్యాన్సర్ దశ మరియు గ్రేడ్ నిర్ణయించడానికి, టిఎన్ఎం స్టేజింగ్ (TNM staging) మరియు అమెరికన్ జాయింట్ కమిటీ (American Joint Committee) స్టేజింగ్ అనే రెండు అత్యంత ముఖ్యమైన మరియు ప్రస్తుతం ఉపయోగించే స్టేజింగ్ పద్ధతులు.

స్టేజింగ్

టిఎన్ఎం స్టేజింగ్ (TNM staging): టిఎన్ఎం (TNM) లో 3 అంశాలు ఉంటాయి, టి (T) అనేది ప్రాధమిక కణితిని (tumour) సూచిస్తుంది, ఎన్ (N) నిర్దిష్ట భాగంలో ఉన్న లింప్ నోడ్ (lymph node) ప్రమేయం కోసం మరియు ఎం (M) మెటాస్టాసీస్ (metastases) ను సూచిస్తుంది. తీవ్రతను సూచించడానికి ఈ మూడు అంశాలను సంఖ్యల ద్వారా సూచిస్తారు:

T0 - కణితి కనుగొనబడలేదు

T1-3 - 1 నుండి 3 సంఖ్యలు కణితి యొక్క పరిమాణం పెరుగుతూ ఉన్నట్లు సూచిస్తాయి, అంటే సంఖ్య పెరిగితే, కణితి పరిమాణం పెద్దదని మరియు అది సమీపం భాగాలకు వ్యాప్తి చెందిందని అర్ధం.

N0 - శోషరస కణుపులు పాల్గొనలేదు.

N1 నుండి N3 వరకు - ఇవి కణితి పరిమాణం, స్థానం, మరియు క్యాన్సర్ వ్యాపించిన శోషరస కణుపుల సంఖ్య పరంగా  శోషరస కణుపు యొక్క క్యాన్సర్ పరిధిని సూచిస్తాయి. అలాగే అధిక సంఖ్య, పెరిగిన శోషరస కణుపుల సంఖ్యను తెలుపుతుంది.

M0 - ఇతర భాగాలకు/ప్రాంతాలకు మెటాస్టాసిస్ వ్యాపించకపోవడం.

M1- ఇతర భాగాలకు/ప్రాంతాలకు కణితి వ్యాపించడం.

క్యాన్సర్ లక్షణాలు 

ప్రభావితమైన శరీర భాగంపై ఆధారపడి, క్యాన్సర్ యొక్క లక్షణాలు చాలా వైవిధ్యంగా ఉంటాయి. క్యాన్సర్ రకం మరియు స్థానంతో సంబంధం లేకుండా కనిపించే కొన్ని సాధారణ సంకేతాలు మరియు లక్షణాలు ఈ కింది విధంగా ఉంటాయి:

  • అసాధారణ బరువు తగ్గుదల లేదా పెరుగుదల
  • బలహీనత మరియు అలసట
  • చర్మం మీద తరచూ కమిలిన గాయాలు ఏర్పడడం
  • చర్మం కింద ఒక గడ్డలు ఉన్న భావన కలుగడం
  • శ్వాస సమస్యలు మరియు దగ్గు ఒక నెల కన్నా ఎక్కువ రోజుల పాటు ఉండడం
  • చర్మపు మార్పులు, ప్రస్తుతం ఉన్న పుట్టుమచ్చల యొక్క పరిమాణం మరియు ఆకృతిలో మార్పులు లేదా గాయాలు ఏర్పడడం
  • చర్మం మీద సులువుగా కమిలిన గాయాలు ఏర్పడడం
  • అతిసారం లేదా మలబద్ధకం వంటి జీర్ణ సమస్యలు
  • మ్రింగడంలో కఠినత
  • ఆకలిలేమి
  • గొంతు (మాటల) నాణ్యతలో మార్పులు
  • నిరంతరంగా జ్వరం లేదా రాత్రి సమయంలో చెమటలు పట్టడం
  • కండరాల లేదా ఉమ్మడి (జాయింట్) నొప్పులు మరియు గాయాలు ఆలస్యంగా మానడం
  • తరచూ పునరావృత్తమయ్యే సంక్రమణలు

క్యాన్సర్లను వెంటనే నిర్వహించడం ఉత్తమం కాబట్టి, వ్యక్తి ఏవైనా ఇటువంటి లక్షణాలను గమనించినట్లయితే, వెంటనే వైద్యులని సంప్రదించడం అత్యవసరం. చాలా సందర్భాలలో ఈ లక్షణాలు ఏమి గుర్తించబడవు  మరియు చాలా మంది తరువాతి (చివరి) దశలోనే వాటిని తీవ్రంగా అనుభవిస్తారు. నిజానికి, కొందరిలో ఎటువంటి లక్షణాలు కనిపించకపోవచ్చు, వారిలో క్యాన్సర్ ఒక సాధారణ పరీక్షలో భాగంగా గుర్తించబడుతుంది.కాబట్టి, స్వల్ప లక్షణాలు కూడా పట్టించుకోకుండా వదిలివేయకూడదు.

క్యాన్సర్ కారణాలు

కారణాలు

కణాల డిఎన్ఏ (DNA) లో కొన్ని మార్పులు లేదా మ్యూటేషన్ల ఫలితంగా క్యాన్సర్ ఏర్పడుతుంది. కణాల యొక్క మెదడుగా పరిగణించబడే డిఎన్ఏ, కణాల పెరుగుదల మరియు వృద్ధి గురించి సూచనలు ఇస్తుంది. ఈ సూచనలులో లోపాలు క్యాన్సర్ కలిగించే అనియంత్రిత కణాల పెరుగుదల మరియు వృద్ధి దారితీస్తుంది.

క్యాన్సర్ అభివృద్ధికి కారణమయ్యే పదార్థాలను కార్సినోజెన్ (కాన్సర్ కారకాలు) అని పిలుస్తారు, అలాగే ఇవి ఇతర హాని కారకాలతో కలిపి క్యాన్సర్ యొక్క ప్రధాన కారణాలుగా ఉన్నాయి. అవి రసాయనాలు కావచ్చు ఉదాహరణకు, పొగాకు పొగలో ఉండే పదార్ధాలు; భౌతికమైనవి కావచ్చు అంటే అల్ట్రావయొలెట్ రేడియేషన్ వంటివి; లేదా హ్యూమన్ పాపిల్లోమావైరస్ వంటి బయోలాజికల్ (జీవసంబంధమైనది) వి కావచ్చు. ఒకే ఒక్క కార్సినోజెన్ క్యాన్సర్ యొక్క బాధ్యతను కలిగి ఉండదు. దానితో పాటుగా అనేక కార్సినోజెన్లు, ఆరోగ్యం మరియు ఆహార విధానం వంటి ఇతర కారకాలు ఒక వ్యక్తిలో క్యాన్సర్ యొక్క అభివ్యక్తికి దారి తీస్తాయి.

ప్రమాద కారకాలు

క్యాన్సర్ యొక్క అతి సాధారణ ప్రమాద కారకాలు:

  • పొగాకు మరియు పొగాకు-సంబంధిత ఉత్పత్తుల పై ఆధారపడటం అంటే ధూమపానం లేదా పొగాకు నమలడం వంటి ఊపిరితిత్తుల మరియు నోరు క్యాన్సర్లకు కారణమవుతాయి.
  • మద్యపానం అధికమవ్వడం కూడా కాలేయ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది.
  • అనారోగ్యకరమైన ఆహార విధానం మరియు ఫైబర్ తక్కువగా ఉన్న బాగా శుద్ధి చేసిన ఆహారాలు తినడం అనేది పెద్దప్రేగు క్యాన్సర్కు కారణం కావచ్చు.
  • టెస్టోస్టెరోన్ మరియు ఈస్ట్రోజెన్ వంటి హార్మోన్ల యొక్క అధిక స్థాయిలు వరుసగా ప్రోస్టేట్ క్యాన్సర్ మరియు రొమ్ము క్యాన్సర్ అభివృద్ధికి ప్రమాద కారకాలు.
  • వయసు పెరగడం కూడా పెద్దప్రేగు కాన్సర్, రొమ్ము క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్ మరియు అటువంటి కొన్ని రకాల క్యాన్సర్ల  అభివృద్ధి యొక్క సంభావ్యతను పెంచుతుంది.
  • జన్యుపరమైన లోపాలు లేదా మ్యుటేషన్లు క్యాన్సర్ సంభావ్యతను పెంచుతున్నాయి, ఉదా., BRCA1 మరియు BRCA2 జన్యువుల్లోని మ్యుటేషన్లు (ఉత్పరివర్తనలు) ఉన్న మహిళలకు రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది.
  • క్యాన్సర్ ఉన్న కుటుంబం చరిత్ర రొమ్ము వంటి కొన్ని రకాల క్యాన్సర్ల ప్రమాదాన్ని పెంచుతుంది.
  • అనిలిన్ వంటి రసాయనాలు, రంగులు (డైలు), తారు వంటి వృత్తిపరమైన అపాయలకు గురికావడం వంటివి మూత్రాశయ క్యాన్సర్ వంటి కొన్ని క్యాన్సర్ల ప్రమాదాన్ని పెంచుతాయి.
  • కొన్ని రకాల బాక్టీరియల్ మరియు వైరల్ ఇన్ఫెక్షన్లు సిస్టమిక్ రుగ్మతలు కలిగిస్తాయి, ఇవి క్యాన్సర్ కలుగుడానికి కారణమవుతాయి, ఉదాహరణకు,హెచ్. పైలోరి (H.pylori) సంక్రమణ కడుపు క్యాన్సర్ అభివృద్ధికి దారితీస్తుంది; హెపటైటిస్ బి (B) మరియు సి (C) ఇన్ఫెక్షన్లు కాలేయ క్యాన్సర్ అలాగే హ్యూమన్ పాపిల్లోమావైరస్ సంక్రమణ గర్భాశయ క్యాన్సర్కు దారితీస్తుంది.
  • హానికరమైన రేడియేషన్ కలిగిన ఎక్స్-రేలకు లేదా సూర్యకాంతి యొక్క అల్ట్రావయొలెట్ కిరణాలకు తరచుగా బహిర్గతం కావడం కూడా క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది.
  • ఊబకాయం, కొవ్వు ఎక్కువగా తీసుకోవడం మరియు శారీరక శ్రమ లేకపోవడం పురుషులు మరియు మహిళలు ఇద్దరిలోను అనేక రకాలైన క్యాన్సర్ల ప్రమాదానికి కారణమవుతాయి.
  • దాని దీర్ఘకాలిక ప్రభావాల కారణంగా ఒత్తిడి క్యాన్సర్కు ఒక ప్రధాన ప్రమాద కారకంగా ఉన్నట్లు నిర్ధారించబడింది. అదనంగా, గత లేదా ప్రస్తుత ఆరోగ్య సమస్యల కారణంగా రోగనిరోధక శక్తి బలహీనపడడం కూడా ఒక వ్యక్తికి క్యాన్సర్ సంభవించే ప్రమాదాన్ని పెంచుతుంది.

గమనించినట్లయితే, జన్యుపరమైనవి మరియు వయస్సు ఆధారమైనవి కాకుండా, మిగిలిన ప్రమాద కారకాలను ఆరోగ్యకరమైన జీవనశైలి మార్పులతో మరియు అంటువ్యాధులు మరియు కాలుష్యం నుండి తగిన రక్షణ తీసుకోవడంతో నివారించవచ్చు. ఒకవేళ వ్యక్తికీ క్యాన్సర్ యొక్క కుటుంబ చరిత్ర ఉంటే లేదా ఏదైనా క్యాన్సర్ యొక్క ప్రమాదం ఎక్కువగా ఉంటే, అటువంటి వారు ప్రమాదాన్ని తగ్గించడానికి ముందుగానే జీవనశైలి మార్పులను చేసుకోవడం అవసరం.

క్యాన్సర్ నివారణ 

ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అనుసరించడం మరియు ప్రమాద కారకాలను నిర్వహించడం ద్వారా అనేక రకాలైన క్యాన్సర్లను నివారించడం సాధ్యపడుతుంది. క్యాన్సర్ను నివారించడానికి ఈ కింద ఉన్నవి పాటించవచ్చు

  • ధూమపానం మానివేయాలి.
  • మద్యపానం పరిమితం చెయ్యాలి.
  • సూర్యరశ్మికి అధికంగా గురికావడాన్ని నివారించాలి.
  • ఫైబర్లు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. ఆహారంలో కొవ్వుల అధికంగా తీసుకోవడాన్ని నివారించాలి మరియు పంది మరియు గొడ్డు మాంసం వంటి ఎర్ర మాంసానికి దూరంగా ఉండాలి. అంతేకాకుండా, ఆహారంలో ప్రాసెస్ చేయబడిన ఆహార పదార్ధాలను తీసుకోవడం తగ్గించాలి.
  • రేడియేషన్కు వృత్తిపరమైన ఎక్స్పోజర్ ఉన్న సందర్భంలో రక్షిత దుస్తులను ధరించడం ద్వారా దానిని పరిమితం చెయ్యాలి.
  • క్రమం తప్పకుండా వ్యాయామం చేయ్యాలి మరియు ఆరోగ్యకరమైన బరువు మరియు బిఎంఐ (BMI)ను నిర్వహించాలి.
  • ఆరోగ్యకర, సమతుల్య ఆహారం తీసుకోవాలి.
  • క్రమముగా ఆరోగ్య తనిఖీలు చేయించుకోవడం మరియు ఏదైనా అసాధారణతలు ఉంటే వెంటనే అశ్రద్ధ చెయ్యకుండా చికిత్స చేయించుకోవడం అవసరం.
  • దీర్ఘకాలిక ఆరోగ్య సమస్య లేదా దీర్ఘకాలం పాటు నయంకానీ గాయం లేదా చర్మం పై అధికంగా కమిలిన గాయాలు ఏర్పడిన సందర్భంలో వెంటనే వైద్యులని సంప్రదించాలి.
  • క్రమముగా ఇమ్యునైజెషన్స్/వాక్సినేషన్ (టీకాలు) చేయించుకోవాలి. హ్యూమన్ పపిల్లోమావైరస్ (హెచ్ పి వి) టీకా గర్భాశయ క్యాన్సర్ను నివారించడానికి సహాయపడుతుంది మరియు తప్పనిసరిగా చేయించుకోవాలి. హెపటైటిస్ బి టీకా కూడా పరిగణలోకి తీసుకునే మరొక టీకా, ఇది హెపటైటిస్ బి వైరస్ సంక్రమణను నిరోధిస్తుంది, ఇది (హెపటైటిస్ బి వైరస్ సంక్రమణ) కాలేయ క్యాన్సర్కు ఒక తెలిసిన హాని కారకం.
  • ఒత్తిడిని అధిగమించే మార్గాలను కనుగొనాలి. కుటుంబం మరియు స్నేహితులతో సమయము గడపవచ్చు, ఏదైనా ఒక అభిరుచిని అనుసరించవచ్చు, యోగా లేదా ధ్యానం చేయటం, క్రీడలు ఆడడం, లేదా మనస్సును ప్రశాంతపరచే పనులు చేయవచ్చు.

క్యాన్సర్ నిర్ధారణ 

రోగనిర్ధారణ పరీక్షను ఎంపిక చేసే ముందు, వైద్యులు రోగి వయస్సు, వైద్య చరిత్ర, లింగం, కుటుంబ చరిత్ర, అనుమానిత క్యాన్సర్ రకం, లక్షణాలు తీవ్రత మరియు ఏదైనా మునుపటి పరీక్ష ఫలితాలను పరిశీలిస్తారు. క్యాన్సర్ యొక్క సంభావ్యతను గుర్తించడానికి ఉపయోగించే అత్యంత సాధారణ నిర్ధారణ విధానాలు:

  • ఏదైనా అసాధారణత తనిఖీ కోసం శారీరక పరీక్ష.
  • ప్రయోగశాల పరీక్షల ద్వారా వ్యక్తికి రక్త పరీక్షలు నిర్వహించడం (పూర్తి రక్త గణన, ఎరిథ్రోసైట్ సెడిమెంటేషన్ రేట్, సి-రియాక్టివ్ ప్రోటీన్, కాలేయం మరియు మూత్రపిండపు పనితీరు పరీక్షలు మరియు మొదలైనవి).
  • ఒక నిర్దిష్టమైన క్యాన్సర్ను అనుమానించినప్పుడు వైద్యులు క్యాన్సర్ యాంటిజెన్ (CA) 19.9 వంటి నిర్దిష్ట పరీక్షలు, కార్సినోఎంబ్రియోనిక్ యాంటిజెన్ (CEA [carcinoembryonic antigen]) లేదా ప్రోస్టేట్-స్పెసిఫిక్ యాంటిజెన్ (PSA [prostate-specific antigen]) వంటి పరీక్షలు సూచించవచ్చు.
  • ఎక్స్- రే, సిటి (CT) స్కాన్లు, ఎంఆర్ఐ (MRI), బేరియం మీల్ స్టడీ (barium meal study), ఎముక స్కాన్, పెట్ (PET) స్కాన్, స్పెక్ట్ (SPECT) స్కాన్, యూ.యస్.జి (USG) మొదలైనవి కూడా సూచించబడవచ్చు. కణితి యొక్క అనుమానం ఉన్నకణజాలాన్ని జీవాణుపరీక్ష (బయాప్సీ) కోసం సేకరించి కణితి యొక్క దశ, తీవ్రత మరియు దాని వృద్ధిని గుర్తించడం కోసం మైక్రోస్కోప్ ద్వారా పరిశీలిస్తారు.

క్యాన్సర్ చికిత్స 

క్యాన్సర్ యొక్క చికిత్సా ఎంపికలు ప్రాథమికంగా రెండు రకాలు:

శస్త్రచికిత్స (సర్జికల్) విధానాలు

దీనిలో అసాధారణ పెరుగుదలల లేదా కణాల యొక్క గడ్డను తొలగించడం జరుగుతుంది, తర్వాత తొలగించిన భాగం యొక్క జీవాణుపరీక్ష ఉంటుంది. ఇది ప్రత్యేకంగా కణితి స్థానికంగా మరియు తొలగించడానికి అనుకూలంగా ఉన్నప్పుడు ఉపయోగపడుతుంది.

శస్త్రచికిత్స కాని విధానాలు

ఇది కీమోథెరపీని  కలిగి ఉంటుంది, దీనిలో ప్రాథమికంగా అసాధారణంగా పెరుగుతున్న కణాలను నాశనం చేయడానికి మందులు ఉంటాయి. మరియు రేడియోథెరపీ, దీనిలో పెరుగుతున్న కణితి మీదకు గామా కిరణాలు వంటి రేడియేషన్లను ప్రసరిపచేస్తారు.

కొన్నిసార్లు, శస్త్రచికిత్స మరియు శస్త్రచికిత్సకాని (non-surgical) రెండు పద్దతులను ఉపయోగించబడతాయి. మొదట, కణితి యొక్క పరిమాణాన్ని తగ్గించడానికి రేడియోథెరపీ లేదా కీమోథెరపీ సూచించబడుతుంది, తరువాత క్యాన్సర్ కణితిని తొలగించడం జరుగుతుంది. శస్త్రచికిత్స తరువాత, ఇతర భాగాలకు క్యాన్సర్ కణాల వ్యాప్తిని నివారించడానికి కీమోథెరపీ లేదా రేడియోథెరపీ మళ్లీ ప్రాంతంలో నిర్వహిస్తారు.

ఇతర చికిత్సా ఎంపికలు హార్మోన్ల చికిత్స, రోగనిరోధక శక్తి (immunological) చికిత్సలు, బిస్ఫాస్ఫోనేట్లు మొదలైనవి. వీటిని ప్రత్యేక క్యాన్సర్ల కోసం ఉపయోగిస్తారు. ఉదాహరణకు రొమ్ము మరియు ప్రోస్టేట్ క్యాన్సర్లు హార్మోన్ల చికిత్సకు అనుకూలంగా ఉంటాయి.

క్యాన్సర్ సంబంధిత లక్షణాలను నిర్వహించడానికి మందులు కూడా సూచించబడతాయి. వీటిలో నొప్పి నివారిణులు, యాంటాసిడ్లు, యాంటీపైరేటిక్లు ఉంటాయి.

తరచుగా, ఉపశమనం కలిగించే చికిత్స మాత్రమే సాధ్యమయ్యే చికిత్సా ఎంపిక, దీనిలో క్యాన్సర్ కారణంగా ఏర్పడిన నిరంతర నొప్పి మరియు అసౌకర్యం తగ్గించడానికి మత్తుమందులు లేదా ఇతర నొప్పి నివారణల ఉపయోగించబడతాయి, ఎందుకంటే క్యాన్సర్ బాగా  విస్తరించినప్పుడు దానిని నియంత్రించలేము.

జీవనశైలి ప్రమాణాలు

ప్రభావిత వ్యక్తుల జీవన నాణ్యతను మెరుగుపరిచేందుకు మరియు లక్షణాలను నిర్వహించడానికి సులువైన జీవనశైలి మార్పులను సహాయం చేయవచ్చు. వాటిలో ఇవి ఉంటాయి:

  • పోషక పదార్ధాలు అధికంగా ఉండే ఆరోగ్యకరమైన ఇంటిలో వండిన ఆహారం తినాలి.
  • క్రమం తప్పకుండా వ్యాయామం చెయ్యాలి. వారానికి 5 రోజులు 30 నిమిషాల పాటు మధ్యస్తమైన శ్రమతో కూడిన వ్యాయామం చెయ్యడం అనేది సహాయం చేయవచ్చు. తీవ్రమైన భౌతిక శ్రమతో కూడిన వ్యాయామం చేయలేక పోతే, 30 నిమిషాల చురుకైన నడక సహాయపడవచ్చు.
  • పొగాకు మరియు మద్యపానాన్ని నివారించాలి.
  • ఆరోగ్యాన్ని అంచనా వేయడానికి క్రమముగా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి.
  • యోగా చేయడం, ధ్యానం చేయడం లేదా ఏదైనా మంచి అభిరుచిని అనుసరించడం ద్వారా ఒత్తిడిని నిర్వహించాలి.
  • ఎల్లప్పుడూ ఆనందంగా సంతోషంగా మరియు సానుకూలంగా ఉండాలి. అన్ని క్యాన్సర్లు ప్రాణాంతకమైనవి కావు.

క్యాన్సర్ యొక్క రోగసూచన మరియు సమస్యలు 

రోగసూచన

క్యాన్సర్ పర్యవసానాలు (లక్షణాలు) దాని రకంపై ఆధారపడి ఉంటాయి. చిన్న పరిమాణపు క్యాన్సర్ లేదా ప్రాధమిక దశల్లో ఉన్నవాటికి చికిత్స చేయడం సులభం.మరోవైపు, మెటాస్టాటిక్ క్యాన్సర్ల  పర్యవసానాలు చాలా తక్కువగా ఉంటాయి. దీనిలో క్యాన్సర్ వ్యాప్తిని పూర్తిగా అడ్డుకోలేము మరియు అనేక శరీర వ్యవస్థల వైఫల్యాలు లేదా ఇతర సమస్యలకు దారితీయవచ్చు. ఇంతే కాకుండా, రోగనిర్ధారణ కణితి రకాన్ని బట్టి మరియు ప్రభావితమైన శరీర భాగాన్ని బట్టి కూడా ఉంటుంది.

సమస్యలు

సమస్యల యొక్క తీవ్రత ప్రభావితమైన శరీర భాగాన్ని బట్టి ఉంటుంది. వ్యాపించని కణితుల కంటే మెటాస్టాటిక్ కణితులు చాలా అధిక ప్రమాదకరమైనవి. ప్రభావితమైన శరీర అవయవ వ్యవస్థలపై ఆధారపడి కలిగే సమస్యలు:

  • గుండె ఆగిపోవుట
  • పల్మోనరీ ఎడెమా (ఊపిరితిత్తులలో ద్రవం చేరిపోవడం/నిలిచిపోవడం)
  • కాలేయ వైఫల్యం
  • మూత్రపిండ వైఫల్యం
  • బలహీనమైన రోగనిరోధకత కారణంగా పునరావృతమయ్యే అంటువ్యాధులు

క్యాన్సర్ అంటే ఏమిటి? 

క్యాన్సర్ అనియంత్రమైన కణాల వృద్ధిని సూచిస్తుంది.  అవి (క్యాన్సర్ కణాలు) వాటికవే స్వతంత్రంగా మరియు ఏ విధమైన చర్య (పనితీరు) లేకుండా క్రమరహితంగా పెరుగుతాయి. క్యాన్సర్ కణాలు ప్రాణాంతక (malignant) స్వభావం కలిగినవి అయితే శరీరమంతా వ్యాపిస్తాయి మరియు ఏ భాగంలోనైనా వృద్ధి చెందుతాయి. ఒక వేళా అవి నిరపాయమైనవి (benign) అయితే వ్యాప్తి చెందకుండా ఒకే భాగంలో అభివృద్ధి చెందుతాయి.

క్యాన్సర్, ప్రధానంగా, ఇతర కణజాలాలపై ఆక్రమించడం మరియు వాటిని నాశనం చేసే కణాల అసాధారణ మరియు అనియంత్రిత అభివృద్ధి

క్యాన్సర్ కొరకు అలౌపతి  మందులు

క్యాన్సర్ కు ఈ అలౌపతి మందు లు అన్ని క్యాన్సర్ కలిపి చెప్పడం జరిగింది కావున మీ సమస్య బట్టి మీ ఫ్యామిలీ డాక్టర్ సలహాలు మేరకు మందులు వాడాలి లేకపోతే సైడ్ ఎఫెక్ట్ ఎక్కువ అవుతాది 

Medicine NamePack Size
Dexoren SDexoren S Eye/Ear Drops
BetnesolBetnesol 4 Tablet
DefwaveDefwave Tablet
PropyzolePropyzole Cream
DelzyDelzy 6 Mg Tablet
FlazacotFlazacot 6 Tablet
Propyzole EPropyzole E Cream
Dephen TabletDephen Tablet
Canflo BNCanflo BN Cream
Toprap CToprap C Cream
D FlazD Flaz Tablet
Crota NCrota N Cream
Canflo BCanflo B Cream
DzspinDzspin Tabletaa
Sigmaderm NSigmaderm N 0.025%/1%/0.5% Cream
FucibetFucibet Cream
Rusidid BRusidid B 1%/0.025% Cream
Emsolone DEmsolone D 6 Mg Tablet
Tolnacomb RFTolnacomb RF Cream
Fusigen BFusigen B Ointment
Low DexLow Dex Eye/Ear Drop
FlazaFlaza Tablet
Xeva NcXeva NC Cream
Futop BFutop B Creama
Dr. Reckeweg Phytolacca Berry 3x TabletDr. Reckeweg Phytolacca Berry 3x Tablet

క్యాన్సర్ చికిత్స కోసం రేడియేషన్ థెరపీ గురించి అపోహలు

క్యాన్సర్ చికిత్స కోసం రేడియేషన్ థెరపీ గురించి అపోహలు

       రేడియేషన్ థెరపీ గురించి ప్రజలకు చాలా తప్పుడు ఆలోచనలు ఉన్నాయి. వాస్తవానికి, ఇలాంటి అపోహల వల్ల చాలా మంది రేడియేషన్ తీసుకోవడానికి వెనుకాడతారు. గత రెండు దశాబ్దాలుగా రేడియేషన్ థెరపీ రంగంలో పురోగతి అంతకుముందు ఉన్న అనేక ప్రతికూలతలను తొలగించింది.

రేడియేషన్ ఆంకాలజిస్ట్ మరియు ఆర్‌ఎస్‌టి రీజినల్ క్యాన్సర్ హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ పంకజ్ చౌదరి విలేకరులతో మాట్లాడుతూ ఈ అపోహలను ప్రస్తావించారు. క్యాన్సర్ గురించి అపోహలను తొలగించడానికి ఆంకాలజిస్టులు మరియు ప్రజల మధ్య వరుస చర్చలు ప్రారంభించాలని ఆసుపత్రి నిర్ణయించింది. ఈ సిరీస్‌లో మొదటిది బుధవారం జరిగింది.

"ఈ రోజు కూడా, రోగులకు రేడియేషన్ అవసరమని చెప్పినప్పుడు, చికిత్స యొక్క దుష్ప్రభావాలు ఉన్నాయా అని వారు అడుగుతారు. చికిత్స చాలా దుష్ప్రభావాలు లేనందున సాంకేతికత చాలా మెరుగుపడిందని వారికి చాలా మందికి తెలియదు. కొన్ని రకాల క్యాన్సర్లకు, రేడియోథెరపీ చికిత్స యొక్క మొదటి ఎంపిక అని ప్రజలు గ్రహించరు "అని డాక్టర్ చౌదరి అన్నారు. వాస్తవానికి, కొన్ని క్యాన్సర్లు రేడియేషన్ ద్వారా మాత్రమే నయమవుతాయని ఆయన అన్నారు.

రేడియేషన్ ఉపయోగకరంగా ఉందని చికిత్స కోసం మాత్రమే కాదు, డాక్టర్ చౌదరికి సమాచారం ఇచ్చారు, కానీ "అనేక సందర్భాల్లో, ఈ వ్యాధి ఇప్పటికే రోగిని రక్షించే అవకాశం లేని దశకు చేరుకుంది. ఇటువంటి సందర్భాల్లో, రేడియోథెరపీని పాలియేటివ్ థెరపీగా ఉపయోగించవచ్చు. ఇది రోగి యొక్క జీవితాన్ని తక్కువ బాధాకరంగా లేదా జీవిత నాణ్యతను మెరుగుపర్చడానికి సహాయపడుతుంది. అయినప్పటికీ, రోగులు సాధారణంగా రేడియోథెరపీని పూర్తి స్థాయి చికిత్సా ఎంపికకు బదులుగా చివరి ప్రయత్నంగా భావిస్తారు. "

"3-డి ప్లానింగ్ సిస్టమ్‌తో చికిత్స చాలా ఖచ్చితమైనది. ఇది క్యాన్సర్ బారిన పడిన శరీరం యొక్క ఖచ్చితమైన భాగానికి రేడియేషన్‌ను నిర్దేశించడానికి సహాయపడుతుంది. క్యాట్ స్కాన్ మరియు ఎంఆర్‌ఐ వంటి యంత్రాలు చికిత్స యొక్క ఖచ్చితత్వాన్ని మిల్లీమీటర్ల వరకు చేయడానికి సహాయపడతాయి. ఇది సమీపంలోని క్యాన్సర్ కాని కణజాలాలను చాలా తక్కువగా ప్రభావితం చేయడంలో మరియు సాధారణ కణజాలంలో ఎక్కువ భాగాన్ని ఆదా చేయడంలో కూడా సహాయపడుతుంది "అని డాక్టర్ చౌదరి చెప్పారు. ఈ పురోగతిని పరిశీలిస్తే, రేడియోథెరపీ ఇవ్వడానికి నిరాకరించిన రోగులు ఉండటం విచారకరమని ఆయన అన్నారు.

అపోహలు మరియు వాస్తవాలు

అపోహ 1 (ఎం 1): ఇది బాధాకరమైనది

వాస్తవం 1 (ఎఫ్ 1): రేడియేషన్ నుండి ఎటువంటి సంచలనం లేదు

M2: ఇది చర్మంపై కాలిన గాయాలకు దారితీస్తుంది

F2: ఇది తాత్కాలిక వర్ణద్రవ్యం కలిగిస్తుంది

M3: ఇది రక్తాన్ని బలహీనపరుస్తుంది

ఎఫ్ 3: రేడియోథెరపీకి ముందు రక్త పరీక్షలు రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలు రేడియేషన్ ఇచ్చేంత ఎక్కువగా ఉన్నాయని నిర్ధారించడానికి చేస్తారు

M4: మింగడం లేదా తినడం కష్టతరం చేస్తుంది

M5: జుట్టు రాలడానికి కారణమవుతుంది

M6: మొత్తం శరీరాన్ని ప్రభావితం చేస్తుంది

F4,5,6: ఆధునిక రేడియోథెరపీ స్థానికీకరించబడింది మరియు చికిత్స పొందుతున్న భాగాన్ని మాత్రమే ప్రభావితం చేస్తుంది

M7: రోగిని నిర్బంధించాల్సిన అవసరం ఉంది

F7: రేడియేషన్ థెరపీ రోగిని రేడియోధార్మికతను కలిగించదు, కొంతమంది నమ్ముతారు

M8: వేసవికాలంలో చేయకూడదు

ఎఫ్ 8: అంటువ్యాధులు ఎక్కువగా ఉన్నందున వేసవిలో శస్త్రచికిత్సలు నివారించబడతాయి. రేడియేషన్ అంటువ్యాధులకు కారణం కాదు

M9: ఇది చివరి రిసార్ట్

F9: ఇది చాలా క్యాన్సర్లకు చికిత్స యొక్క మొదటి వరుస

M10: పిల్లలు మరియు వృద్ధులు దాని కోసం వెళ్ళకూడదు

ఎఫ్ 10: అనేక బాల్య క్యాన్సర్లలో, ఇది వృద్ధులకు సాధారణ చికిత్స మరియు ఉపశమన చికిత

ధన్యవాదములు 🙏

మీ నవీన్ నడిమింటి

విశాఖపట్నం

9703706660

అస్వీకార ప్రకటన: ఈ సైటుపై లభ్యమవుతున్న మొత్తం సమాచారము మరియు లేఖనము కేవలం అవగాహనా ఆవశ్యకతల కొరకు మాత్రమే. ఇక్కడ ఇవ్వబడిన సమాచారమును ఏదైనా ఆరోగ్య సంబంధిత సమస్య లేదా అస్వస్థత నుండి కోలుకోవడానికి లేదా స్వస్థత కొరకు నిపుణుల సలహా లేనిదే ఉపయోగించుకోకూడదు. చికిత్స పరీక్షలు మరియు సేవల కొరకు ఎల్లప్పుడూ ఒక అర్హత పొందిన వైద్యుల సలహా తీసుకోవాలి.


1, డిసెంబర్ 2020, మంగళవారం

యోగ వాళ్ళు నడుము నొప్పులు నివారణకు ఎలా ఈ లింక్స్ లో చూడాలి


 యోగ జీవనశైలి - యోగ సంజీవని & యోగ - బాక్ పెయిన్


మనలోని మనోద్వేగాలు, అసంతృప్తి స్పందనలపై నిగ్రహం సాధించడానికి, రాగద్వేషాలకి కారణమైన భావోద్వేగాలపై సమ్యమనం సాధించడానికి, హైందవసంస్కృతి యోగశిక్షణలో వివిధ సహజసిద్ద మార్గాలను అన్వేషించి ‘అష్టాంగయోగ’ని మానవాళికి అందచేసింది.  
అవి యమ, నియమ, ఆసన, ప్రాణయామ, ప్రత్యాహరం, ధారణ, ధ్యానం, సమాధి.,

ఇవి సమతుల్యమైన మానసికస్థితి పెంపొందించుకోవడానికి ఏకాగ్రత, ఙాపకశక్తులను మెరగుపరచుకోవడానికి దోహదమవుతాయి. అష్టాంగయోగలోని మెళుకువలను అనుభవఙ్ఞులైన యోగాచార్యుల సమక్షంలో నేర్చుకోవాలి తరువాత రెగ్యులరుగా సాధనచేయాలి.
యోగసాధనకి అనువైన సమయం బ్రాహ్మీకాలం అది వేకువజామున నాలుగు నుండి ఉషోదయవేళ వరకు.
ఈ సమయంలో ఆరుబయట ప్రశాంత వాతావరణంలో స్వచ్చమైన గాలిని మనసార అస్వాదిస్తూ యోగ సాధనని ప్రారంభించాలి, అందుకు అవకాశం లేకుంటే యోగ గదిలోనికి ధారాళంగా వెలుతురు, గాలి ప్రసరించెట్లుగా ఉండాలి.
బిగువైన వస్త్రాలను ధరించకండి, సాధరణ దుస్తులు దరించండి లేదా యోగ ఫ్యాంట్ ని దరించండి సౌలభ్యంగా ఉంటుంది.అవకాశం ఉంటే యొగ మ్యాట్ని వాడండి.
నిద్రనుండి లేవగానే 1 నుంచి 1.5 లీటర్లు పరిశుభ్రమైన నీరు త్రాగండి. నేచర్ కాల్సుని ముగించండి.
మానశిక, ఆధ్యాత్మిక, శారీరక భావనలని సమన్వయపరచి ఆత్మ స్థైర్యాన్ని దానిద్వార మానశిక స్థైర్యాన్ని పెంపొదించే లక్ష్యసిద్దిగా యోగాభ్యాసం కొనసాగాలి.
యోగాసనాలు, యోగక్రియలు, మెడిటేషన్, ద్యానం, యోగనిద్ర, ప్రాణయామాలను అనుభవఙ్ఞులైన యోగాచార్యుల సమక్షంలో నేర్చుకోవాలి, ఆ తరువాత రెగ్యులరుగా సాధనచేయాలి.


వజ్రాసనం:
శరీరాన్ని, మిమ్మలని ఎల్లప్పుడు కండీషన్ లో వుంచే ఆసనం వజ్రాసనం. దీనిని మిగతా ఆసనాలమాదిరి గాకుండ ఎప్పుడైన అంటే రీడింగ్ సమయంలో, టివి ప్రోగ్రాంలని చూస్తూకూడ ప్రాక్టీస్ చేసుకోవడానికి చాల అనువైనది. రెగ్యులర్గా సాధన చేయడంద్వారా పేరుకి తగినట్లుగా అది శరీరాన్ని వజ్రంలా తయారుచేస్తుంది…
మెద‌ట‌గా మోకాళ్ల మీద కూర్చోవాలి. ఎడ‌మ‌కాలి బ్రొట‌న‌వేలిపై కుడికాలి బ్రోట‌న వేలు వుంచి పాదాల పైభాగం నేల‌ను తాకేట‌ట్టు వెడ‌ల్పు చేయాలి. రెండు పాదాల లోప‌లి భాగం అర్ధచంద్రాకృతిలో వుంటుంది. దాని మ‌ధ్య భాగంతో కూర్చొవాలి. శ‌రీర పీఠ భాగం పూర్తిగా పాదాల మ‌ధ్య ఇమిడేట‌ట్లు చూసుకోవాలి. మెడ, వీపు, త‌ల నిటారుగా భూమికి అభిముఖంలో వుండాలి. వెన్నెముక కూడా ఏ మాత్రం వంచ‌కుండా దృష్ఠిని మ‌ర‌ల్చ‌కుండా నిశ్చలంగా వుండాలి. మ‌న‌స్సు పూర్తిగా శ‌రీరం పైనే ల‌గ్నం చేయాలి. శ్వాస దీర్ఘంగా తీసుకుంటూ నిదానంగా వ‌దులుతూ వీలైనంత ఎక్కువ స‌మ‌యం ఈ ఆస‌నంలో కుర్చొవ‌డం వ‌ల్ల ఎక్కువ మేలు జ‌రుగుతంది.

ఈ ఆసనసాధనద్వార మెరుగైన రక్త ప్రసరణ కటి నుంచి శిరస్సుకి చేకూరుతుంది. అది మస్తిష్కంకి చక్కటి ప్రశాంతతని చేకూరుస్తుందిరక్తపోటుని తగిస్తుంది. శృంగారఉద్దీపనని కలుగ చేస్తుందిజుట్టు రాలడంని తగ్గిస్తుందిమానసిక ఉద్రీక్తలని నియంత్రిస్తూ మానసిక స్థైర్యానికి ఉద్దీపనకారి ఔతుంది. 


పద్మాసనం:

నేల మీద కూర్చుని రెండు కాళ్లను బార్లా ముందుకు చాపుకోవాలి. తర్వాత రెండు చేతులతో కుడికాలి పాదాన్ని పట్టుకుని మోకాలివరకు మడిచి ఎడమతొడపై ఉంచాలి. వీలైనంత వరకు కుడి మడమ భాగం నాభిని తాకేలా దగ్గరకు తీసుకోవాలి. ఆ తర్వాత ఎడమకాలి పాదాన్ని కూడా రెండు చేతులతో పట్టుకుని కుడికాలి తొడపై ఉంచాలి. దీన్ని కూడా వీలైనంత వరకు ఎడమమడమ భాగం నాభిని తాకేలా దగ్గరకు తీసుకోవాలి. ఈ స్థితిలో రెండు కాళ్లకు సంబంధించిన మోకాళ్లు తప్పని సరిగా నేలను తాకుతూ ఉండేలా చూసుకోవాలి. మరింత ఒత్తిడికి గురిచేయకుండా వెన్నెముకను నిటారుగా వుంచి చూపుడు వేలు, బొటన వేలి చివరలని కలిపి వుంచి, తక్కినవేళ్లను నిటారుగా వుంచి   కండ్లు మూసుకొని కేవలం శ్వాసపై ధ్యాస వుంచి కొంత సమయం పాటు అంటే సౌకర్యవంతంగా ఉండే వరకు అదే స్థితిలో కొనసాగాలి. ఈ జ్ఞాన ముద్రని రోజు ఓ ఐదునిముషాలు సాధన చెయడంద్వార మూలధార చక్రం చైతన్యవంతం అవుతుంది.  ఇలా ఓ మూడు నెలలు సాధన చేస్తే మీలోని నిరాశని, ఆందోళనలను, అభద్రతా భావనలను తగ్గిస్తుంది. ఏకాగ్రత, జ్ఞాపక శక్తిని పెంచుతుంది, చక్కటి మానసిక ప్రశాంతతని పొందడానికి దోహదకారి ఔతుంది

పర్వతాసనం:
ముందుగా పద్మాసనంలో కుర్చొని రెండు చేతులను పైకితీసుకొని నమస్కార ముద్రలో పర్వతాసన కొనసాగించాలి. కండ్లు మూసుకొని కేవలం శ్వాసపై ధ్యాస వుంచి కొంత సమయం పాటు అంటే సౌకర్యవంతంగా ఉండే వరకు అదే స్థితిలో కొనసాగాలి. ఈ ముద్రని రోజు ఓ ఐదునిముషాలు సాధన చేయండి.

ఈ ఆసనసాధనద్వార వెన్నుపూస సాగుతుంది. కుర్రాల్లలొ ఎత్తు పెరగడానికి దోహదపడుతుంది. కొవ్వుని నియంత్రిస్తుంది. ప్రేవువ్యవస్థ ఆరొగ్యవంతంగా ఉండదానికి సహయకారి. శ్వాసక్రియ రుగ్మతలను నిలువరిస్తుంది. వెన్నునొప్పినుంచి ఉపశమనం తెస్తుంది. ఎకాగ్రతని సాధించడానికి ఆభ్యసించండి. 


తోళాసనం: ముందుగా పద్మాసనంలో కుర్చొని రెండు చేతులపై మీ కటిభారాన్ని తీసుకుంటూ ధీర్ఘశ్వాసని తీసుకొని, శ్వాసని బందించి మొత్తం శరీరాన్ని గాలిలోనికి లేపి కొన్ని క్షణాలు అలావుండే ప్రయత్నం కొనసాగించాలి.

ఈ ఆసనసాధనద్వార మణికట్ట్లు, చేతులు బలాన్ని సంతరించుకుంటాయి. పొత్తికడుపు కండరాలు గట్టిపడుతాయి. పొత్తికడుపు ఆరొగ్యవంతంగ తీర్చబడుతుంది. మానశిక ప్రశాంతతకి ఆలంబన అవుతుంది, శారీరక సమతుల్యతలని సాధించుకొవచ్చు. దీర్ఘ శ్వాస తీసుకొని రెండు, మూడు పర్యాయలు సాధన చేయండి.
సేతుభంధ సర్వాంగాసన:

ముందుగా శవాసనం వేయాలి, తరువాయి దీర్ఘశ్వాసని తీసుకుంటు ఈ ఆసనస్థితికి చేరాలి. కంటీన్యూగా కంప్యూటర్, స్మార్టుఫోన్ల వాడకం భుజాల, మెడ కండరాల అసమతౌల్యంకి కారణం అవుతూన్నాయి. ఇది మెడని ముందుకు వంచి చూడడంవల్ల భుజాల, మెడకండరాల తమసహజస్థితి నుండి స్థానభ్రంశాన్ని పొందడంవల్ల మైగ్రేన్ నొప్పికి కారణం అవుతున్నాయి. మూడునెలల ఈ యోగాసన సాధనలో సరి అయిన శారీరక భంగిమల ద్వార భుజాల, మెడ కండరాల సమతౌల్యం మెరుగవడం ద్వార మైగ్రేన్ నొప్పి నుండి రీలీఫ్ వస్తుంది అని పరిశోధనలలో* తేలీంది. మేడ, చెస్టు, వీపు, భుజాలు, వెన్నుపూస, కటి వ్యవస్థలకి బలం చేకూరుతుంది.



బద్దకోణాసన / గుప్తాసన / సిద్దాసనం:
మొదటిగా పద్మాసనస్థితికి రావాలి. ధీర్ఘ శ్వాసని తీసుకుంటూ మీ అరిపాదాలు రెండింటిని దగ్గరికి తీసుకోండి. వాటిని మీ చేతులతో బంధించి  జననాంగాల దగ్గరికి తీసుకోని వెన్నుపూసని నిటారుగా వుండేలా కూర్చోవాలి. పూరకక్రియలో శ్వాసని కొనసాగిస్తూ రెండు మోకాళ్లన్ని ఒకేమారు నేలకి తగిలించాలి. 10 నుంచి 20 మార్లు ఇలాచేయాలి.  

పనుల ఒత్తిడితో నేడు ప్రతి ఐదుగురిలో ఒకరు శృంగారంలో అనాసక్తి, పార్శిక వ్యంధ్యత్వంతో అసంతృప్తిపరులే అని గణాంకాలు చెబుతున్నాయి. ఇది దంపతుల అనుబందాన్ని కుడా బలహీన పరుస్తుంది. స్త్రీలలో జడత్వానికి కారణం అవుతుంది. దంపతులలో ఈ ఆసనసాధన ద్వార పన్నెండువారాలలో మూలబంధం బలోపేతం అవుతుంది. మెరుగైన రక్తప్రసరణతో కటి కండర వ్యవస్థ ఉత్తేజమవుతుంది, అది స్త్రీ, పురుషులలో శృంగార సామర్ధ్యాన్ని, భావప్రాప్తికి, శృంగార భావనల ఉద్దీపనకి ప్రేరణ అవుతుంది అని పరిశొధనలలో* నిరుపించబడింది. బిపీ ని సమర్థవంతంగా నియంత్రించడానికి సహయకారి.




వక్రాసనం:
ముందుగా దండాసనకి రావాలి. కుడికాలుమడమని ఎడమమొకాలుదగ్గరికి తీసుకోవాలి. దీర్ఘశ్వాసతీసుకొని ఎడమచెతితో కుడికాలు గిరకలని పట్టుకోని వెనుకకి తిరిగి 5 నుంచి 10 సెకండ్లు ఉండాలి, ఆదేవిదంగా ఎడమకాలితోనూ చేయండి. దీర్ఘ శ్వాస తీసుకొని 10 నుంచి 15 పర్యాయలు సాధన చేయండి.

ఈ ఆసనసాధనద్వార డయబిటిసుని సమర్థవంతంగా నియత్రించవచ్చు. లివరు, కిడ్నీలు శక్తివంతం అవుతాయి. బిపిని నియంత్రించడానికి సహయకారి. మలబద్దకాన్ని దూరం చేస్తుంది. మెటబాలిజక్రియ మెరుగవుతుంది. పొట్టలోని కొవ్వునిల్వలని తగ్గించుకోవచ్చు.
 
అర్ధ మత్స్యేంద్రాసనం:
ముందుగా దండాసనకి రావాలి. తరువాయి ఎడమకాలుని మడచి కుడికాలుమడమని ఎడమకాలుదగ్గరికి తీసుకోవాలి. దీర్ఘశ్వాసతీసుకొని ఎడమచేతితో కుడికాలు గిరకలని పట్టుకోని వెనుకకి తిరిగి 5 నుంచి 10 సెకండ్లు ఉండాలి, ఆదేవిదంగా ఎడమకాలితోనూ చేయండి. దీర్ఘ శ్వాస తీసుకొని రెండు, మూడు పర్యాయలు సాధన చేయండి షుగరు భాధితులకు అనువైన ఆసనాలలో ఇది ఒకటి.

ఈ ఆసనం నాడి వ్యవస్థలో ప్రధానమైన మణిపురచక్రాన్ని ఉత్తేజితం చేయడం ద్వారా లివర్, అడ్రినాల్ గ్లాండ్, కిడ్నిల సమర్థతను మెరుగుపరుస్తుంది. రక్తంలొ సుగర్ లెవల్సును కంట్రోలు చేయడానికి ప్రాక్టీసు చేయండి. మెరుగైన జీర్ణప్రక్రియకి దోహదకారి. మలబద్దకాన్ని తొలగిస్తుంది. ఈ ఆసనంలోవెన్నముకని త్రిప్పడం ద్వార వెన్నుపూసలకి మెరుగైన సంరక్షణ వస్తుంది.

గరుడాసనం: ముందుగా తాడాసనస్థితికి రావాలి. నెమ్మదిగా శ్వాసతీసుకుంటూ రెండుచేతులను భుజాలదగ్గరికి తీసుక రావాలి.కుడిచేతిని ఎడమచెతీపైకి తీసుకొని మోచేతులు ఎదురుగా వచ్చేట్లుగా రెండూ అరచేతులని పైకి చూసేట్లుగా మెలి వేసివుంచాలి. ఈ స్థితిలో ఎడమమోకాలుని కుడిమోకాలుపైకి తీసుకొని బాలెన్సింగ్ చేసుకూంటూ కుడికాలిపిక్కలతో బందించి 5 నుంచి 8 సెకండ్లు వుంచాలి.  నెమ్మదిగా నిశ్వాసని కొనసాగిస్తూ తాడాసనస్థితికి రావాలి. ఈ మారు చేతులని, కాళ్లని  మారుస్తూ శ్వాసతీసుకొని తిరిగి గరుడసానస్థితికి చేరాలి. ఈ ఆసనసాధన బ్రాంకైటీస్, రొంప, జలుబులను, శ్వాసకోస రుగ్మతలను కంట్రొల్ చెస్తుంది.నడుము, కటిభాగం, తొడలకి చక్కటి రూపంని తీసుక వస్తుంది. శృంగార ఉద్దీపనని కలుగ చేస్తుంది.




భుజంగాసనం:
ముండుగా బోర్లా పడుకోవాలి. ఆరచేతులను భుజాలపక్కకి తీసుకోవాలి. నెమ్మదిగా దీర్ఘ శ్వాసని తీసుకొని పట్టివుంచి అరచేతులను నేలకి ఆనించి భుజాల ఆధారంతో నడుమువరకి పైకి లేవాలి. కటిబాగము నుంచి పాదాలవరకి నేలని తాకి పట్టి వుంచాలి. ఈ స్తితిలో ఓ 20 సెకండ్లు వుండాలి.  మకరాసనంలో విశ్రాంతి తీసుకోవాలి.
ఈ ఆసనం 2 నుంచి 3 మార్లుచేయడంద్వారా డిప్రేషన్, నైరశ్యాలని మనస్సు నుంచి దూరంగా వుంచడానికి, ఉత్సాహవంతంగా ఉండడానికి సహయకారి. థైరాయిడ్ గ్లాండ్ ని ఉత్తేజపరుస్తుంది. భుజాల కదలికలు, కీళ్లవ్యవస్థలు మెరుగౌతయి.  వీపు కండరవ్యవస్థ బలోపెతం అవుతుంది..



ఉష్త్రాసనం:
కాలి అరిపాదాలు నేలనుంచి పైకి ఉండేట్లుగా మోకాళ్లని నేలకి ఆనించి నిటారుగా నిలుచోవాలి. నెమ్మదిగా దీర్ఘశ్వాసని తీసుకుంటూ కుడి అరచేతిని కుడికాలు అరిపాదంపై ఉంచాలి. తరువాయి ఎడమ అరిచేయిని ఎడమకాలి అరిపాదంపైకి తీసుకరావాలి. ఈ భంగిమలో నడుముని పైకితీసుకుంటూ 10 నుంచి 15 సెకండ్లు ఉండండి.
ఈ ఆసనం 2 నుంచి 3 మార్లుచేయడంద్వార ఋతుసమస్యలకి చక్కటి పరిష్కారం అవుతుంది.బలిష్టమైన భుజాలు, నడుము, జబ్బలు మీ సొంతం. తొడకండరాలకి, కటి వ్యవస్థకి చక్కటి రూపుని తెస్తుంది. వెన్నుపూస వ్యవస్థ మృదుత్వాన్ని సంతరించుకుంతుంది.  నడుమునొప్పి నివారిణి. ఎండొక్రైన్ గ్రంధులు తేజోవంతం అవుతాయి. పునరుత్పత్తి వ్యవస్థకి బలం చేకూరుతుంది. మలబద్దకాన్ని నియంత్రిస్తుంది. శారీరక వ్యవస్థ ఉత్తేజితమౌతుంది





వృక్షాసనం:
ముందుగా తాడాసనం వేయండి, ఈ ఆసనస్థితిలో కుడికాలుని పైకితీసుకొని మోకాలుదగ్గర మడవాలి. మడచినపాదాన్ని నెమ్మదిగా పైకి తీసుంటూ ఎడమ తొడఆధారంతో బాలెన్సింగ్ చేసుకూంటూ ఎడమపాదం ఆసరాతో నిలుచుండి దీర్ఘశ్వాసని తీసుకొని రేండుచేతులను ఊర్ధ్వముఖంగా పైకి నమస్కారముద్రలో తీసుకోవాలి. శ్వాసని పట్టివుంచి ఓ 15 సెకండ్లు ఆసనస్థితిలో కొనసాగాలి, మరల తాడసనంకి రావాలి. ఈ మారు ఎడమకాలిని మార్చి సాధన చేయండి. ఈ విధంగా 6 నుంచి 10 మార్లు చేయండి.

శరీరంలోని అదనపు కాలరీలను దహించడానికి, ఒబెసిటి నుంచి నార్మల్ స్థాయిని పొందడానికి రెగ్యులర్గా వీలు ఐనంత ఎక్కువ సమయం ప్రాక్టీస్ చేయండి. పాదాలు. గిరికలు, పిక్కలు, తొడలు, మోకాళ్ల కండరాలు కటి భాగాలు మృదుత్వాన్ని పొండుతాయి. వెన్ను బలోపేతం అవుతుంది. చదువుకొనే పిల్లలలో ఏకాగ్రతని పెంపొందిస్తూ బుద్దిమాంద్యాన్ని నిలువరిస్తుంది.  

కటి చక్రాసనం:
ముందుగా నిటారుగా నిల్చోవాలి.  నెమ్మదిగా శ్వాసతీసుకుంటూ రెండు అరచేతులు ఎదురెదురుగా భూజాలలెవల్లో వుండేట్లుగా ముందుకు సాచాలి. శ్వాసని బందించి రెండుచేతులు సమాంతరంగా వుంచి కటిభాగాన్ని కూడిపక్కకి తిప్పాలి, నిశ్వాసతో ఎడమవైపుకి కటిని తిప్పాలి. ఈ సాధన ఓ మూడునిముషాలు చేయండి. ఉధ్యోగస్తులకి, శారీరకశ్రమ తక్కువగా వుండే వ్యక్తులకు ఇది అనువైన ఆసనం.
కటి, వెన్నుపూస, భుజాలాకి, మెడ కండారాలను ఉత్తేజపరిచే చక్కటివ్యాయాయం. శ్వాసపై ద్యాసతో ఈ ఆసనం ప్రాక్తీస్ చేయాలి. మోకాలు, గిరికలు, పాదాలు, అదేవిదంగా భుజాలు, చేతులు, మణికట్ట్లు, అరచేతివ్రేళ్లు నిటారుగా వుంచి ఆభ్యాసం చేయడం ద్వారా కండరవ్యవస్థ బలోపేతం అవుతుంది, అది శారీరకదృడత్వాన్ని తీసుకవస్తూంది



త్రికోణాసనం:
ముందుగా కాళ్ళను విస్తృతపరచాలి. చేతులను భూమికి సమాంతరముగా చాపి వుంచాలి. శ్వాసను జోడిస్తూ కుడి చేతిని ఎడమ పాదానికి తాకించాలి, అదేవిధంగా చేతులను మారుస్తూ మరొకవైపు చేయాలి.

ఈ ఆసనసాధన ద్వార నడుము, వెన్నుపూస, ఉదరకోశాలు మృదుత్వాన్ని సంతరించుకుంటాయి. తుంటి, భుజాలు, మోకాళ్ల నొప్పులు తగ్గిపోతాయి. కిడ్నీలు సమర్థవంతంగా పనిచేయడానికి సహకరిస్తుంది. ఏసిడిటి, గ్యాస్ట్రిక్ సమస్యలు, అజీర్ణాలను తొలగించ్ఘడానికి ఉపయొగకారి. మెడ, భుజాల కండరాల వాపులు తగ్గుతాయి. పొత్తికడుపు కండరాలు శక్తివంతం అవుతాయి. జీర్ణక్రియ వేగవంతం అవుతుంది.





పవన ముక్తాసనం: 
ముందుగా శవాసనం వేసి దీర్ఘశ్వాసతీసుకుంటూ కుడికాలుని మోకాలువద్దమడచి చెస్టుపై ఒత్తిడిని తీసుకుంటూ మీ గడ్డందగ్గరికి తీసుకోవాలి. శ్వాసని నెమ్మదిగా వదులుతూ సాధారణస్థితికి రావాలి. ఈ మారు ఎడమకాలుతో చేయండి. తరువాత ఈ రెండుకాళ్లతో ఈ ఆసనస్థితిని కొనసాగించాలి.

ఈఆసనసాధనద్వార జీర్ణాశయంలోని గ్యాస్’లు, టాక్సిన్లు తొలగించబడి జీర్ణక్రియ క్రమబద్దీకరింపబడుతుంది. ప్రేవు వ్యవస్థలోని వాయువులు తొలగింపబడి విసర్జణవ్యవస్థ అరోగ్యవంతం అవుతుంది, మలబద్దకం నివారణకి సుగమం అవుతుంది. వెన్నుపూస వ్యవస్థకి, పొత్తికడుపు కండరాలకు బలం చేకూరుతుంది. మెరుగైన మెటబాలిజం ద్వార జీవక్రియ తేజోవంతమవుతుంది. బీపి, హార్టు. మెడ, స్లిప్ డిస్కు, హెర్నియ సంభందిత సమస్యలు ఉన్నవారు, ప్రెగ్నెన్సిలో ఉన్నవారు డాక్టరు సలహలని తీసుకొని మాత్రమే సాధన చేయాలి. 



మత్యాసనం:
ముందుగా దండాసనకి రావాలి. తరువాయి పద్మాసనం వేయండి. దీర్ఘశ్వాసని తీసుకొంటూ మోచేతుల ఆసరాతో నెమ్మదిగా తలభాగం నేలని ఆనేవిదంగా వెనుకకి వెల్లాలి.  దీర్ఘ శ్వాస తీసుకొని రెండు, మూడు పర్యాయలు సాధన చేయండి.

ఈ ఆసనసాధనద్వార వెన్నుపూస కండరాలు బలోపేతం అవుతాయి. మెరుగైన శ్వాసక్రియ ద్వార అస్తమాన్ని నియంత్రిసుంది. దీర్ఘశ్వాసక్రియద్వార శ్వాసకోశ వ్యవస్థ శుద్ది అవుతుంది. నడుము, తొడల దగ్గరి కొవ్వు కరగదానికి సహయకారి అవుతుంది.  మెడకండరాలు మృదుత్వాన్ని పొందడం ద్వార తలనొప్పులని నియంత్రిస్తుంది. తక్కువ శారీరకశ్రమ కలిగిన ఉద్యోగస్తులు ఈ ఆసనాన్ని రెగ్యులరుగా సాధన చేయడం అభిలషణియం.







సుప్తవజ్రాసనం: ముందుగా దండాసనకి రావాలి. తరువాయి వజ్రాసనం వేయండి. దీర్ఘశ్వాసని తీసుకొంటూ మోచేతుల ఆధారంగా నెమ్మదిగా తలభాగం నేలని ఆనేవిదంగా వెనుకకి వెల్లాలి. దీర్ఘ శ్వాస తీసుకొని రెండు, మూడు పర్యాయలు సాధన చేయండి ఈ ఆసనసాధనద్వార జీర్ణవ్యవస్థ తేజోవంతం అవుతుంది. శృంగార ఉద్దీపనకారి అవుతుంది. వెన్నుపూస వ్యవస్థ సానుకూలం అవుతుంది.  వెన్నునొప్పిని, స్లిప్ డిస్కు నివారించడంలో కీలకం అవుతుంది. సయాటిక నడుం నొప్పిని నివారించుకోవచ్చు. మోకాలు, చీలమండల వాపులను, కీళ్ల నొప్పులను సమర్థవంతంగా నియంత్రించుకోవచ్చు.  మెరుగైన కండర వ్యవస్థ, విసర్జన వ్యవస్థలకి మూలాధారం అవుతుంది.
 



హలాసనం:
మిమ్మలని యవ్వనవంతులుగా వుంచే ఆసనం. వెల్లకిలా శవాసనంలో పడుకోవాలి. దీర్ఘశ్వాసని తీసుకుంటూ పాదములు పైకి తీసుకొనివెళ్లి నిటారుగా ఉంచాలి, పిరుదుల వరకు పైకి తీసుకువెళ్ళాలి. మోకాళ్లని వంచకుండా నెమ్మదిగా కాలిబొటనవేళ్లు నేలని తగిలెట్లుగా కటిభాగాన్ని వెనుకకి తీసుకోవాలి.
ఈ ఆసనసాధనద్వార వెన్నుపూస, భుజాలకు బలం చేకురుతుంది. జీర్ణక్రియ ఉత్తేజితం అవుతుంది. కాళ్లు, తొడలు, పిక్కలు, కటి వ్యవస్థలు బలోపేతం అవుతాయి. థైరాయిడ్, పైరాథైరాయిడ్ గ్రందులు, మెడకండరాలు, సమర్థవంతంగా క్రియాభరితం అవుతాయి.  కండరవ్యవస్థ సహజత్వాన్ని పొందుతూ సమర్థవంతం అవుతుంది.   మానసికప్రశాంతతని పొందడానికి చక్కటివేదిక అవుతుంది..


సర్వాంగాసనం:
ముందుగా శవాసనం వేసి దీర్ఘశ్వాసతీసుకుంటూ మెల్లగా ఒక్కసారిగా కాళ్ళను పైకి తీసుకెళ్ళాలి. చేతులు నడుము భాగమున సహాయంగా ఉంచాలి.  ఉండగలిగినంత సేపు ఉండి పూర్వపుస్థితికి రావలయును.

ఈ ఆసనసాధన ద్వార థైరాయిద్ గ్రంధి ఉత్తేజితం అవుతుంది. మానసి కస్వస్థకి ఆలంబన అవుతుంది. నాడీమందల వ్యవస్థ జాగృతం అవుతుంది. మానసికఆందోళనలు, నైరాశ్యాలను, టెన్సన్’లను, భావోద్వేగాలను దూరంగావుంచడానికి నమ్మకమైన ప్రక్రియ. నిద్రలేమిని నివారించడానికి ఆచరించదగ్గ ఆసనసాధన. అంతర్గత శక్తులను ప్రభావితం చేస్తుంది. మానసిక వికాసాన్ని పెంపొందిస్తుంది. మెటభాలిజాన్ని మెరుగుపరుస్తూ జఠరాగ్నిని ప్రేరేపిస్తూ శరీరంలోని అదనపు కొవ్వుని కరగించడానికి సహయకారి అవుతుంది.





శలభాసనం:  
ముందుగా మకరాసనకి రావాలి. శ్వాసని తీసుకొని చేతులను సాఫీగా నేలను తాకేట్లుగా నడుముపక్కకి తీసుకవస్తూ కుడి పాదాన్ని పైకి లేపి శ్వాసనిబందించి ఓ ఐదు సెకండ్లు వుంచాలి. నిశ్వాసతో కుడిపాదాన్ని నేలకి తీసుకరావాలి. ఈ మారు ఎడమకాలుతో సాధన చేయండి. ఓ నిముషం ఈ సాధనకొనసాగించిన తరువాయి ధీర్గశ్వాసనితీసుకుంటూ రెండుకాళ్లని ఒకేమారుగా పైకిలేపి 3 నుంచి 5 సెకండ్లు వుంచుతూ ఈ రెండు నిముషాలు సాధనకొనసాగించండి.

ఈ ఆసనసాధనద్వార వెన్నుపూస దిగువభాగం, మణికట్లు, తుంటి, పిరుదుల కండర వ్యవస్థలకి బలం చేకురుతుంది. సయాటిక నొప్పులనుంచి ఊరట వస్తుంది. కండరల వాపులని తగ్గిస్తుంది.  కొవ్వు నడుము, తొడలు, పొత్తికడుపు భాగాలనుంచి కరిగి మృదుత్వాన్ని సంతరించుకోవడానికి సహయకారి అవుతుంది.
 


ధనురాసనం:
ముందుగా నుదురు నేలకి అభిముఖంగా వుండేలా బొర్లపడుకోవాలి. కుడి పాదాన్ని కుడిచేతివేళ్లతో, అదేవిదంగా ఎడమ పాదాన్ని ఎడమచేతివేళ్లతో పట్టుకోని మీ బాడిని పైకితీసుకోవాలి. అప్పుడు శరీరభంగిమ నాభి ఆధారంగా   ధనుస్సువలే వుంటుంది.  ఈ ఆసనస్థితిని ఒకటి నుంచి రెండు నిముషాలు కొనసాగించాలి. ఇలా కనీసం 2 నుంచి 3 సార్లు చేయాలి. 

ఈ ఆసనసాధనద్వార వీపు, పొట్టకండరాలు ఆరోగ్యవంతం అవుతాయి. పునరుత్పత్తివ్యవస్తని హెల్తీగా వుంచడానికి తోడ్పడుతుంది. చాతీ, మెడ, భుజాల కండరాలు అరోగ్యవంతంగా పనిచేస్తాయి. కండర వ్యవస్థ మృదుత్వాన్ని పొందుతూ అలసటలనుండి రక్షణగా నిలుస్తుంది. మానసిక అశాంతులను దూరం చేస్తుంది.

చక్రాసనం:
ముందుగా శవాసనం వేయాలి. నెమ్మదిగా శ్వాసని తీసుకుంటూ పాదములు పిరుదుల వద్దకు తీసుకువచ్చి నేలకు త్ర్రాకించాలి. చేతులను పైనుండి తీసుకువెళ్ళి తలకు ఇరువైపులా నేలకు త్రాకించాలి. సుధీర్ఘ శ్వాస తీసుకుంటూ చేతుల సాయంతో శరీరాన్ని పైకి తీసుకురావలి. వుండగలిగినంతసేపు వుండి పూర్వపు స్థితికి రావాలి. ఇలా కనీసం 2  సార్లు చేయాలి.

ఈ ఆసనసాధనద్వార జీర్ణకోశం, ఉదరకోశం, శ్వాసకోశం, హృదయకోశాలు ఉత్తేజితం అవుతాయి. వీపు, వెన్నుపూస కండరాలు బలోపేతం అవుతాయి. తొడకండరాలు, కటి వ్యవస్థ బలపడుతాయి. భుజాలు, కీళ్ల వ్యవస్థలు మృదుత్వాన్ని సంతరించుకుంటాయి.  మెరుగైన మెటబాలిజానికి తోడ్పడుతుంది.  అడ్రినాల్, థైరాయిడ్  గ్రంధి వ్యవస్థలని మెరుగుపరుస్తుంది. అఫీసుల్లో పనిచేసే ఉద్యోగస్తులు జీవనశైలిలో ఆరోగ్యకరమార్పుగా మార్పుగా దీనీని అభ్యసించాలి.  ఈ ఆసన నిరంతర సాధనద్వార టెన్సన్, స్ట్రెస్ లని సమర్థవంతంగా నియంత్రించుకోవచ్చు.  

పూర్వోత్తాసనం:
ముందుగా ధండాసన స్థితికి రావాలి. రెండు చేతులను వెనక్కి తీసుకొని వాటి ఆధారంగా మొత్తం శరీరాన్ని అరిపాదాల ఆధారంతో పైకి లేపి వుండగలిగినంతసేపు వుండాలి, తిరిగి ధండాసన స్థితికి రావాలి. శ్వాసని లోనికి తీసుకొని ఆసనస్థితిలో కొనసాగాలి. ఇలా కనీసం 2 నుంచి 3 సార్లు చేయాలి.

ఈ ఆసనసాధనద్వార కాలిపిక్కలు, భుజాలు, మోచేయి, ముంజేయి, మణికట్లు, గుండె, వెన్నుపూస, వీపు కండరాలు బలోపేతం అవుతాయి. మనస్సుకి ఆహ్లదాన్ని చేకూరుస్తుంది. స్త్రీలలో ఋతుసమస్యలకి ఉపకరిస్తుంది. 


పశ్చిమొత్తాసనం;
ముందుగా ధండాసన స్థితికి రావాలి. అరచేతులను నేలకు ఆనిస్తూ వెన్నుపూస నిటారుగా ఉండేలా చూసుకోవాలి. ఆ తర్వాత   నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ రెండు చేతులను 90 డిగ్రీల కోణంలో నిట్టనిలువుగా లేపి, దీర్ఘ శ్వాస తీసుకోవాలి. ఇప్పుడు నెమ్మదిగా శ్వాసను వదులుతూ వెన్ను, మెడ వంచకుండా ముందుకు వంగి నుదిటిని మోకాళ్ళకు తాకిస్తూ చేతులతో కాలిబొటన వేళ్లను పట్టుకోవాలి. ఈ స్థితిలో మోకాళ్లు పైకి లేపకూడదు. ఈ భంగిమలో శ్వాస తీసుకుని వదులుతూ ఉండగలిగినంత సేపు ఉండి తర్వాత మెల్లగా శ్వాస తీసుకుంటూ యథాస్థితికి రావాలి. ఇలా కనీసం 4 నుంచి 5 సార్లు చేయాలి. తొలిసారి ఈ ఆసనం సాధన చేసేవారికి, పెద్ద పొట్ట ఉన్నవారికి తల మోకాళ్ల మీదికి రాకపోవటం, ఆసనం మధ్యలో మోకాళ్ళు పైకిలేపటం వంటి ఇబ్బందులు ఎదురుకావడం సహజమే. అయితే సాధన చేసేకొద్దీ ఈ లోపాలను సవరించుకోవచ్చు.  

ఈ ఆసనసాధనద్వార కిడ్నీలు, లివరు, పాంక్రియాస్, ప్రేవువ్యవష, పునరుత్పత్తి వ్యవస్థలకి సానుకులత వస్తుంది. స్త్రీలలో ఋతుసమస్యలకి ఉపకరిస్తుంది. మానశికఆందోళనలకి, మైగ్రైన్లకి చెక్ పెడుతుంది. జీర్ణక్రియ మెరుగౌతుంది. ఒబెసిటి నియంత్రణకారి. వెన్నుపూసని తెజోవంతపరుస్తుంది.


నటరాజాసనం:
ఈ ఆసనం ఓ నాట్యభంగిమని పోలి వుంటుంది. నిటారుగా నిలబడి కుడికాలు వెనుకకు తీసుకుని చేతితో పాదం పట్టుకుని లాగాలి. సుధీర్ఘ శ్వాస తీసుకుంటూ ఎడమచేయి ముందుకు చాపాలి. తరువాత కాళ్ళను మార్చి చేయాలి. ఇలా కనీసం 5 నుంచి 6 సార్లు చేయాలి.

ఈ ఆసనసాధనద్వార పాదాలు, గిరికల సానుకూలతలకి. తొడలు, పొత్తికడుపు కండరాలు తెజోవంతం కావడానికి సాధన చేయండి. లోబిపి ఉన్నవారు ఈ సాధన చేయకండి. ఆరంభంలో తొడలు క్రాంప్సుకి లోనుకావచ్చు. సరీయిన ఆసనస్థితిద్వార దీనిని అధిగమించవచ్చు. పూరక స్థితిలో ఆసనసాధన కొనసాగించాలి.


ఊత్కతాసనం:
ముందుగా కాళ్ళను విస్తృత పరచి నిటారుగా నిలుచోవాలి. శ్వాసని తీసుకుంటూ రెండు చేతులను భూమికి సమంతరంఘ ముందుకు సాచి వుంచాలి. నెమ్మదిగా శ్వాసక్రియని కొనసాగిస్తూ మోకాళ్లను వెనుకకి వంచుతూ తొడలని భూమికి సమంతరంగా వుండేట్లుగా కటిభాగాన్ని కిందికి తీసుకోవాలి. ఈ భంగిమలో శ్వాస తీసుకుని వదులుతూ ఉండగలిగినంత సేపు ఉండి తర్వాత మెల్లగా శ్వాస తీసుకుంటూ యథాస్థితికి రావాలి. ఇలా కనీసం 5 నుంచి 10 సార్లు చేయాలి. ఆహరం తీసుకొనివుంటే ఈ ఆసనసాధనకి కనీసం మూడు నుంచి నాలుగు గంటల వ్యవదిని తప్పక పాటించాలి.

ఈ ఆసనసాధనద్వార బలమైన కాళ్లు, చేతుల వ్యవస్థ మీ సొంతం. గుండె మరియు డయాప్రంల ఆరోగ్యాన్ని పరిరక్షిస్తుంది. యవ్వనవంతులుగా తీర్చుతుంది. ఉదరకోశ వ్యవస్థ తెజోవంతంకావడానికి సహయకారి అవుతుంది. ఆరంభంలో ఓ ఆరనిముషం సాధన చేయండి నెమ్మదిగా మీ ఆసక్తి మేరకు వ్యవధిని పెంచుకోండి.


ప్రతి యోగాఆసనం సరిఅయిన శారీరకభంగిమలలో పదిమార్లు దీర్ఘశ్వాసలని కేవలం ముక్కుద్వారానే కొనసాగించాలి, ఇది సుమారు 40 సెకండ్ల ఆసనస్థితి. ప్రతి ఆసనాన్ని కనీసం మూడునిమిషాలు కొనసాగించాలి.
  •  మీకు బిపి, సుగర్, నిద్రలేమి, బ్రాకైంటీస్, సైనస్, ఒబెసిటి లాంటివి ఇప్పటికే ఉంటే వాటిని సరియైన యోగాసన సాధనతో నివారించుకోవచ్చు.
  • సరైన యోగశిక్షణలో మనలోని అధిక కేలరీలు ఖర్చు అవుతాయి. బరవు తగ్గాలనుకొనేవారికి యోగసాధన చాల ఉపకరిస్తుంది. 
  • యోగాభ్యాసంతో రోజులోవచ్చే ఒత్తిడి, మానసికవేదనల వంటివి తగ్గించుకోవచ్చు. పని ఒత్తిడితో మీకు తరచుగా కోపం వస్తూవుంటే అటువంటప్పుడు ఇది బాగాపని చేస్తుంది

ఆరంభంలో కొందరికి కొన్నిఆసనాలు వేయదం కష్టం అనిపిస్తుంది. యోగసాధనతో శారీరక సానుకులత మెరుగౌతుందిఆరంభంలో కాలివేళ్లని చేతివేళ్లతో నడుమునిమోకాళ్లని వంచకుండా అందుకోవడానికి ఇబ్బందిపడుతారుకాని కొన్నిరోజుల్లొ తక్కువ ప్రయాసతో చేయగలుగుతారుఅదేవిదంగా ఆరంభంలో మీ భుజాలుకటితొడలుకాలిపిక్కల కండరాలనొప్పులు మిమ్మ్మల్ని ఆందోళనకి గురిచేయవచ్చు కాని కొన్నిరోజుల్లొ  కండరాలు తమ సహజ మృదుత్వాన్ని సంతరించుకుంటాయినొప్పులు మాయం అవుతాయి.

గర్భిణిస్త్రీలుకూడా నిరభ్యంతరంగా యోగాసన సాధనని కొనసాగించవచ్చుఆసన స్థితులను వారి శారీరక   అనుకూలరీతీలో మాత్రమే కొనసాగించాలియోగ సాధన తల్లికిబిడ్డకి మరింత సన్నిహితాన్ని పెంచుతుందికుండలిని**యోగసాధన ఆచార్యుల సమక్షంలో మెళుకువలను గ్రహించి మాత్రమే సాధన చేయాలిఇది ఒత్తిడినైరాశ్యాంఅలజడులని నియంత్రించి ప్రశాంతతనిఅనురాగా భావాలని పెంపొదిస్తుందిశారీరక సమతుల్యతల సాధనద్వార నాడీమండలంకండరాలు సమతుల్యతలని పొందుతాయికండరాల వాపులు, నొప్పులని, నడుము నొప్పులను నివారిస్తుందిసుఖప్రసవానికి సహయాకారి అవుతుందిఇంట్లో యోగసాధన మీ జీవిత భాగస్వామితో కలసి/సమక్షంలో కొనసాగించండి
కేవలంశ్వాసపై ద్యాసతో ప్రాణయామని లయబద్దంగా రోజుకి మూడుమార్లుగా ఏడు నుంచి ఎనిమిది వారాలు   కొనసాగించడం ద్వార థైరాయిడు సమస్యలని సమర్థవంతంగా నియంత్రించుకోవచ్చు

ఆరంభంలో మీరు నేర్చుకున్న అన్ని ఆసనాలను ప్రాక్టీస్ చేయండిబరువు తగ్గడం, బ్లడ్ గ్లూకోజు లెవల్సుతగ్గడం లాంటి అవసరాలను ధృష్టిలో ఉంచుకొని ప్రత్యేకించి కొన్ని యోగాసనాలను సాధనచేయాలి.

*National Center for Biotechnology Information
మీకు జీవితకాలం  గ్యారంటీ తో  ఎటువంటి షరతులు లేకుండా ఓ అముల్య అభరణం!


           
యోగ - బాక్ పెయిన్
సాధరణంగా చాలమందిని వేదించే అనారోగ్య సమస్యలలో వెన్నునొప్పి అనబడే బాక్ పెయిన్, నడుమునొప్పి, మెడనొప్పి అనేది ఒకటి. కారణం ఎదైన అది రాకుండ జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో మంచిది. ప్రస్తుత జీవ నవిధానంలో నడుమునొప్పి లేని వారు చాల తక్కువ.     
నడుమునొప్పి ఎందుకు వస్తుంది?
·       సాధారణంగా వచ్చే నడుమునొప్పి ముఖ్యంగా ఇటివల జీవనవిధానంలో వచ్చిన మార్పులే ప్రధానకారణం. నేటిఉద్యోగాలు గంటల తరబడి నిశ్చలస్థితిలో పనిచేసే కోవకి చెందినవే.  ఆ నిశ్చలస్థితిలో వెన్నముకని వంచి కూర్చొనేవిధానమే నడుంనొప్పికి, అదేవిధంగా ఆ సమయంలో మెడవంచి చదివేతీరు, మెడఎత్తి చూసేవిధానం మెడనొప్పికి కారణం అవుతున్నాయి.
·       కొందరిలో పడక వెన్నుకి సపోర్టుగా లేక వెన్నునొప్పికి కారణమవుతుంది.  అవసరమైన మార్పులతో పడుకొనే విధానాన్ని వారు మార్చుకోవాలి.
·       కొందరిలో పని టెన్సన్ వల్ల నడుం కండరాలు సంకోచిస్తాయి, రక్త సరఫరా కటిభాగానికి తగ్గవచ్చు. దీనివల్ల నడుం నొప్పి వస్తుంది.
·       ఫ్యాషన్ పేరిట వాడే ఎగుడు దిగుడు చెప్పులు, ఎత్తుమడమల చెప్పులు రక్తప్రసరణకి అడ్డంకిగామారవచ్చు, కండరాలు బలహీనపడవచ్చు, నడుమునొప్పికి కారాణం కావచ్చు.
సరిలేని శరీరభంగిమలు వెన్నుపూసలని అధిక ఒత్తిడికి గురిచేస్తున్నాయి. దీనికి సరి అయిన జాగ్రత్తలు సకాలంలో తీసుకోకపొతే ముందు ముందు అనేక సమస్యలకి ఇవి కేరాఫ్అడ్రస్ గా మారే ప్రమాదం వుంది. కూర్చునే విషయాల్లో, చూసే పద్దతుల్లో, పడుకొనే పద్దతుల్లో, నడిచే విధానాల్లో కొద్దిపాటి మార్పులని పాటించడంద్వారా ఈ సమస్యలకి చెక్ పెట్టవచ్చు.
ఇందుకుగాను రోజు ఓ ఇరవైనిముషాలు వజ్రాసనం ప్రాక్టీసు చేయడంవల్ల మెరుగైన శరీరభంగిమలని సాధించడంద్వార వెన్నుపూస సాధరణస్థితికి చేరడానికి దోహదం అవుతుంది, ఆవిధంగా ఈ సమస్యని దూరంచేసుకోవచ్చు.
ఆహరశైలిలోని మార్పులు ముఖ్యంగా అధిక కెలరీలువున్నా ఆహరాలని డైలీ అదేపనిగా తీసుకోవడం మనలని ఒబెసిటికి దగ్గరచేస్తున్నాయి. ఒబెసిటి వెన్నుపాముని అధిక ఒత్తిడికి, భారానికి గురిచేస్తుంది. బరువు నడుము నొప్పికి కారణం అయితే 5 నుంచి 6 కిలోల బరువు తగ్గడంద్వారా నడుమునొప్పిని అదుపులోనికి తెచ్చుకోవచ్చు. ఇందుకుగాను లో కేలరిలు కలిగివున్న పోషకాహరాలని ప్రత్యామ్నాయంగా తీసుకోవాలి.

వెన్నుపాము ఏ పనులని చేస్తుంది?
శరీరంలోని నాడీమండల వ్యవస్థకి వెన్నెముక ఓ రక్షణకవచంలా వుంటూ అన్ని ప్రధాన అవయాలను అనుసంధానిస్తూ శరీరాకృతిని పరిరక్షించడంలో కీలకపాత్రని పోషిస్తూవుంటుంది. వెన్నెముకకు తోడుగా కండరాలు, లిగ్మెంట్లు, డిస్కులుంటాయి.  వెన్నెముక సులభంగా వంగడానికి డిస్కులు , లిగ్మెంట్లు తోడుగావుంటాయి. వెన్నుపూసల అమరికనే వెన్నుపాము అనివ్యవహరించే వెన్నెముక. ఈ వెన్నుపూసల మధ్య రబ్బరు కుదురులాంటి మృదు  పదార్ధం సాగే గుణాన్ని కలిగివుంటుంది. దీనిని డిస్కు అంటారు. డిస్కులు వెన్నముక కదలికలకి షాక్ అబ్జార్బర్సు  లా పనిచేస్తాయి
వెన్నుపాము పొడవున ఎన్నో నరాలు వెలుతుంటాయి. మెడభాగం నుంచి వెళ్లే నరాలు చేతుల్లోకి, నడుమునుంచి వెళ్లేనరాలు కాళ్లలోకి వెళ్తూ వెళతాయి. వీటిలో కొన్ని నరాలు మూత్రకోశం, మలవిసర్జన భాగంతోపాటు లైంగిక బాగాల్లోకి వెళతాయి. డిస్కుసమస్యలు కలిగివున్న కొందరిలో అంగస్తంభన, శ్రీఘ్రస్కలనం వంటి లైంగిక సమస్యలు కూడా అగుపిస్తాయి.

డిస్కు సమస్యలు ఎందుకు వస్తాయి?
ఆధికబరువులను ఎత్తడం, ఎక్కువదూరం అదే పనిగా రన్నింగ్  చేయడం, రోజంతా వంగి పని పనిచేయడం, వెన్నేముకకి ప్రమదవశాత్తు దెబ్బలుతగలడం, గతుకులరోడ్లలో వాహనప్రయాణాలు, వయసుపెరిగేకొద్ది వచ్చేమార్పులు ,సరైయిన శారిరక భంగిమలని పాటించకపోవడం డిస్కులపై ఒత్తిడి పెరగడానికి డిస్కులలో అరుగుదల, తరుగదలలికి కారణమవుతున్నాయి. సంవృద్దిగా నీళ్లుతాగడం డిస్కుల అరుగుదలలకి, తరుగుదలలకి చెక్ పెట్టడానికి ఓ మంచి టెక్నిక్ అవుతుంది.

బలమైన వెన్నువ్యవస్థకి అభ్యసించదగిన యోగాసనాలు.
కటిచలనాసన; మార్జాలసన; శలభాసన; పశ్చిమోత్తాసన; భుజంగాసన; మత్స్యేంద్రాసన; ధనురాసన; సేతుభందాసన; త్రికోణాసన; ధండాసన; ఉష్ట్రాసన; శశాంకాసన
ధన్యవాదములు 🙏
మీ నవీన్ నడిమింటి
విశాఖపట్నం
9703706660