9, డిసెంబర్ 2020, బుధవారం

మగవాళ్ళు సుఖ రోగాలు కు ఇన్ఫెక్షన్ కు తీసుకోవాలిన జాగ్రత్త లు ఈ లింక్స్ లో చూడాలి


పురుషాంగ ఈస్ట్ సంక్రమణం సంక్రమణం అంటే ఏమిటి?

ఈస్ట్ అనేది ఒక బూజు (ఫంగస్) రకం లేక మధుశిలీంధ్రం, ఇది జీర్ణ వాహిక, నోరు, చర్మంపై, మరియు జననేంద్రియాల వంటి శరీర అవయవాలలో నివసిస్తుంది. పురుషాంగంపై సాధారణ ఆవశ్యకత కంటే  ఎక్కువగా మధుశిలీంధ్రం (ఈస్ట్) యొక్క పెరుగుదల కల్గినప్పుడు పురుషాంగ ఈస్ట్ సంక్రమణలు సంభవిస్తాయి. ఈ వ్యాధిని 'కాండిడియాసిస్' అని కూడా పిలుస్తారు, ఎందుకంటే 'కాండిడా అల్బికాన్స్' అనే సూక్ష్మజీవి దీనికి కారణమవుతుంది. కాండిడా సంక్రమణలు సున్నతి చేసిన శిశ్నము కల్గిన పురుషుల్లో కంటే సున్నతి చేయని శిశ్నము కల్గిన పురుషులకే ఎక్కువగా సంభవిస్తాయి. ఎందుకంటే సున్నతి చేయని శిశ్నము కల్గిన  శిశ్నాగ్రచర్మము (foreskin) కింద తేమ మరియు వెచ్చదనం ఉండడంవల్ల ఈ మధుశిలీంధ్రం (ఈస్ట్) యొక్క పెరుగుదలను సులభతరం చేస్తాయి. 40 ఏళ్లు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు గల పురుషులలో కాండిడా సూక్ష్మజీవి ఎక్కువగా స్థానమేరచుకుని ఉంటుంది.

దీని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

పురుషాంగ ఈస్ట్ సంక్రమణం పురుషాంగం యొక్క కింద పక్కన (foreskin-side)  క్రింది లక్షణాలను కలుగజేస్తుంది:

  • బాధాకరమైన దద్దుర్లు.
  • చర్మం పొలుసులుదేలడం (స్కేలింగ్).
  • ఎర్రగా మారుతుంది.

పురుషాంగం యొక్క తలపై (అంటే శిశ్నఅగ్రం) దురద పుట్టడమనేది పురుషులు అనుభవించే అత్యంత సాధారణ లక్షణం.

దీని ప్రధాన కారణాలు ఏమిటి?

పురుషాంగ ఈస్ట్ సంక్రమణాలకు దారితీసే శిలీంధ్రాలు పెచ్చుపెరిగి పోవడానికి కింది కారణాలను పేర్కొనవచ్చు:

  • తేమ లేదా వెచ్చని పరిస్థితులు.
  • బలహీన రోగనిరోధక వ్యవస్థ.
  • యాంటీబయాటిక్స్ (ఈ యాంటిబయోటిక్స్ ఆరోగ్యకరమైన బ్యాక్టీరియాను చంపినప్పుడు, మధుశిలీంధ్రాల యొక్క పెరుగుదల అవుతుంది).
  • హెచ్ఐవి (HIV) సంక్రమణ మరియు మధుమేహం వంటి కొన్ని వ్యాధులతో ఉన్న వ్యక్తులు ఈస్ట్ ఇన్ఫెక్షన్ అభివృద్ధికి మరింతగా లోనవుతారు.
  • సువాసనాభరిత (scented) సబ్బులు మరియు స్నానానికి ఉపయోగించే షవర్ జెల్స్ తో పురుషాంగాన్ని శుభ్రం చేయడంవల్ల శిశ్నము చర్మం మంట కలగడం మరియు కాండిడా సూక్ష్మజీవులు పెరిగిపోయే ప్రమాదాన్ని పెంచుతుంది.
  • యోని ఈస్ట్ సంక్రమణ కలిగిన స్త్రీతో అసురక్షితమైన (unprotected)  లైంగిక సంబంధం పెట్టుకోవడంవల్ల.

దీనిని ఎలా నిర్ధారణ చేసేది మరియు దీనికి చికిత్స ఏమిటి?

మీ డాక్టర్ కింది చర్యల ద్వారా  పురుషాంగ ఈస్ట్ సంక్రమణం వ్యాధిని నిర్ధారణ చేస్తారు:

  • మీ వైద్య చరిత్ర మరియు వ్యాధి లక్షణాలు గమనించడం.
  • భౌతిక పరీక్షను నిర్వహిస్తారు .
  • పురుషాంగం యొక్క ద్రవం లేదా కణజాలం నమూనా పరిశీలన.

పురుషాంగ ఈస్ట్  సంక్రమణలకు అందుబాటులో ఉన్న చికిత్సలు క్రిందివిధంగా ఉన్నాయి:

  • యాంటీ ఫంగల్ క్రీములు లేదా లోషన్లు  .
  • ఔషధ ఫలవర్తులు (medicated suppositories)
  • బలహీన రోగనిరోధక శక్తి కారణంగా ఈ సంక్రమణకు గురైన వ్యక్తులకు మౌఖికంగా తీసుకునే ‘ఓరల్ యాంటీ ఫంగల్ మందులు’.

చాలామటుకు ఈ ఔషధాలు మందుల షాపుల్లో” ఓవర్-ది-కౌంటర్” ప్రాతిపదికన అందుబాటులో ఉన్నాయి, అంటే వీటికి వైద్యుడి ప్రిస్క్రిప్షన్ లేకుండానే మందుల షాపులో లభిస్తాయి. ఈ ఔషధాలను ఉపయోగించిన తర్వాత కూడా అంటువ్యాధి కొనసాగితే, మీ వైద్యుడు యాంటీ ఫంగల్ మందుల యొక్క దీర్ఘకాల కోర్సును తరుణోపాయంగా సూచించవచ్చు

పురుషాంగ ఈస్ట్ సంక్రమణ కొరకు అలౌపతి మందులు

Medicine NamePack Size
SyscanSYSCAN 0.3% EYE DROP
DermizoleDermizole Cream
Clenol LBClenol LB 100 Mg/100 Mg Tablet
Candid GoldCandid Gold Cream
Propyderm NfPropyderm NF Cream
PlitePlite Cream
FungitopFungitop Cream
PropyzolePropyzole Cream
Q CanQ Can 150 Capsule
MicogelMicogel Cream
Imidil CImidil C Vaginal Suppository
Propyzole EPropyzole E Cream
ReocanReocan Tablet
MiconelMiconel Gel
Tinilact ClTinilact CL Softgels
Canflo BNCanflo BN Cream
Toprap CToprap C Cream
Saf FSaf F Tablet
Relin GuardRelin Guard Cream
VulvoclinVulvoclin Vaginal Capsule
Crota NCrota N Cream
Clop MGClop MG Cream
FubacFubac Cream
Canflo BCanflo B Cream


సుఖ రోగాలు ఆయుర్వేదం లో నవీన్ సలహాలు 

                   సుఖ రోగాలు (సవాయి రోగాలు) --- నివారణ                           
 
       ఈ రోగాలు చెడు వ్యసనాల వలననే కాక ఆ రోగులు మూత్ర విసర్జన చేసిన చోట ఆరోగ్యవంతులు మూత్ర విసర్జన  చేయడం వలన, వారి దుస్తులను ధరించడం వలన కూడా వస్తాయి.
 
       వీటిలో తెల్ల సెగ, పచ్చ సెగ, అడ్డగర్రలు (గజ్జల్లో గడ్డలు ) మొదలైన రకాలుంటాయి.
మూలబంధనం:-- పద్మాసనం   వేసుకొని ఆసనాన్ని గట్టిగా బంధించాలి.
 
ఉడ్యానబంధనం, ఉదరచాలనం , కపాలభాతి ప్రాణాయామం  చెయ్యాలి.
 
        ఈ వ్యాధి వున్న వాళ్లకు జననాంగము నుండి పసుపు పచ్చని ద్రవం లేక, తెల్లని ద్రవం,లేక  ఎర్రని ద్రవం కారుతూ వుంటుంది.
 
                             అడ్డగర్రలు ---నివారణ
 
        గజ్జల్లో పెద్ద పెద్ద గడ్డలు వాచి ఉండడాన్ని అడ్డగర్రలు అంటారు.
 
తులసి ఆకుల చూర్ణము
నల్ల ఉమ్మెత్త ఆకుల చూర్ణము
గాడిదగడపాకు చూర్ణము
 
        అన్నింటిని సమాన భాగాలుగా తీసుకొని నిల్వ చేసుకోవాలి.
 
        అవసరమైనంత పొడిని నీటితో కలిపి మెత్తగా నూరి గడ్డలపై పట్టు వేస్తే కరిగి పోతాయి.
 
                      సెగ రోగము (గనేరియా) ---నివారణ
 
లక్షణాలు:--  మూత్రవిసర్జనలో మంట, శరీరమంతా విపరీతమైన మంటలుగా వుండడం, జననాంగము నుండి   పసుపు పచ్చని ద్రవం కారడం, మగవాళ్ళకు జననాంగము చివర ద్రవము అతుక్కొని మూత్ర విసర్జన సమయంలో చాలా బాధగా వుంటుంది.
 
లక్ష్మితులసి సమూలం ఎండబెట్టి దంచిన పొడి      ---  మూడు వేళ్ళకు వచ్చినంత
                             కలకండ            ----తగినంత
 
     రెండింటిని కలిపి నాలుకతో అద్దుకొని చప్పరించాలి.

                           ముదిరిన పచ్చ సెగరోగము--నివారణ

తులసి గింజల పొడి
సబ్జా గింజల పొడి
మంచి గంధం
మిరియాల పొడి
రేవల చిన్ని పొడి
ఉసిరిక పొడి

     అన్నింటిని సమాన భాగాలుగా తీసుకొని కలిపి నిల్వ చేసుకోవాలి .

     అర టీ స్పూను పొడిని నీళ్ళలో కలుపుకొని తాగాలి. దీనితో ఎంతో కాలంగా వున్న రోగామైనా నివారింప  బడుతుంది.

        ఎర్రని, తెల్లని సెగరోగం -- నివారణ

తులసి ఆకులు                            -----  50 gr
పమిడి (పైడి) పత్తి ఆకులు             -----  50 gr
బియ్యం కడిగిన నీళ్ళు                  -----  50 gr
మేడి చెట్టు ఆకులు                      -----  50 gr
పిప్పళ్ళు                                   -----  50 gr
మిరియాలు                                ----- 50 gr
లవంగాలు                                  ----- 50 gr
జాజికాయ                                  ----- 50 gr
జాపత్రి                                       ----- 50 gr

         అన్నింటిని రోట్లో వేసి దంచి ముద్దగా అయ్యేంత వరకు నూరాలి.  రేగిపండు గింజంత మాత్రలు చేసి నీడలో ఆరబెట్టి , బాగా ఎండిన తరువాత సీసాలో భద్రపరచాలి.

         ఉదయం, సాయంత్రం ఒక్కొక్క మాత్ర చొప్పున వేసుకోవాలి.

పద్యం చాలా ముఖ్యం:--   కందిపప్పు, నెయ్యి, అన్నం కలుపుకొని తినాలి. పప్పులో ఉప్పు వేసుకోకూడదు.

15 రోజుల తరువాత వేయించిన ఉప్పు వేసుకోవచ్చు.

                     గనేరియా తీవ్రత నివారణకు చిట్కా                   

         పటికను పెనం మీద పొంగించి  పొడి చెయ్యాలి.  ఈ పొడిని ముల్లంగి ముక్కల మీద చల్లి  పది రోజులు తింటే   వ్యాధి తీవ్రత తగ్గుతుంది.

                                గనేరియా --నివారణ                                       12-1-11.

  ఇది ఎక్కువగా పురుషులలో వస్తుంది. పురుష మర్మాంగానికి వస్తుంది. ఇది  అంటువ్యాధి   ఇది బ్యాక్టీరియా  ద్వారా వ్యాపిస్తుంది. లైంగిక,  మరియు  ఇతర లోపాల వలన వ్యాపిస్తుంది.
 మంటలు,  దురదలతో ప్రారంభమై   ఐదారు  వారాల తరువాత బయట పడుతుంది.  చివరి భాగం పెద్దదయి,  వాఛి  బుడ్డ లాగా  తయారై మంట  గా  వుంటుందికూడా ,  నడవలేక పోతారు.  ఈ సమస్య తీవ్రమైతే  కీళ్ళ నొప్పులు వస్తాయి,  మోకాళ్ళలో చీము పట్టి పుండ్లు  రావడం జరుగుతుంది.

ఉసిరిక పొడి                --- 100 gr
కరక్కాయ పొడి           --- 100 gr
తాని కాయ పొడి          --- 100 gr
 
       కలిపి నిల్వ చేసుకోవాలి.
 
       రెండు టీ స్పూన్ల పొడిని రెండు కప్పుల నీటిలో వేసి కాచి ఆ కషాయం తో  మర్మాంగాన్ని రోజుకు రెండు సార్లు  కడగాలి.

త్రిఫల చూర్ణం                --- 100 gr
తుంగ ముస్తల చూర్ణం   ---    50 gr
నీళ్ళు                          ---  రెండు గ్లాసులు
 
        రెండు చూర్నాలను కలిపి నిల్వ చేసుకోవాలి.
 
        రెండు టీ స్పూన్ల పొడిని  రెండు గ్లాసుల నీటిలో వేసి కషాయం కాచాలి.  బొటన వేలంత సైజులో వున్నా తిప్ప  తీగ ముక్కను నీటిలో వేసి కాచాలి. దించి బాగా పిసకాలి. ఆ విధంగా చేయడం వలన నీళ్ళ అడుగున తిప్పసత్తు  మిగులుతుంది.  నీటిని వంచేసి మిగిలిన తిప్ప సత్తును   అంతకు ముందు కాచిన త్రిఫల,  తుంగ గడ్డ ల కషాయానికి   కలిపి  తీసుకోవాలి.
 
తీసుకోవలసిన జాగ్రత్తలు :-- అంగ శుద్ధి,  వస్త్ర శుద్ధి,  స్నానం,  ఆహారం  విషయాలలో జాగ్రత్తలు తీసుకోవాలి. గిట్టని పదార్ధాలు వాడకూడదు. పచ్చి మిరిచి,  వంకాయ, గోంగూర, శనగ పిండి, మైదా వాడకూడదు.

పురుషాంగ బలహీనతకు - వాకుడు


వాకుడుకాయలలోని గింజలు తీసి రోజూ అరచెంచా గింజల ను మంచినీటితో మెత్తగా గుజ్జులాగా నూరి నిద్రించేముందు ఈ గుజ్జును పురుషాంగానికి ముందు బుడెప భాగాన్ని వదిలి వెనుకభాగానికి లేపనం చేసి ఆముదపు ఆకును దాని పైన వేసి కట్టుకట్టి ఉదయంపూట తీసివేయాలి. ఇలా చేస్తుంటే హస్త ప్రయోగంవల్ల, చెడుతిరుగుళ్ళవల్ల బలహీనపడిన పురుషాంగంతిరిగి శక్తివంతమౌతుంది.


❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️


మగవారికి జననేంద్రియంలో సాధారణమైన నొప్పి వచ్చినా లేనిపోనివి ఊహించుకుని హడలిపోతుంటారు . దీనికి కారణాలు అనేకం, నొప్పి ఉండే స్థానం మర్మావలయం కావటం, పురుషాంగంలో నొప్పికి శృంగార జీవితానికి సంబంధం ఉండటం, విషయాన్ని ఎవరితోనూ మనసు విప్పి మాట్లాడుకోలేకపోడవం వంటివన్నీ సమస్యను మరింత జటిలం చేస్తాయి. అయితే దీని మీద సరైన అవగాహన ఉంటే అనవసరమైన భయాందోళనలకు తావుండదు.

1. సంభోగంలో దురుసుతనం వల్ల నొప్పి:

పురుషాంగంలో అనేక రకాలైన నిర్మాణాలుంటాయి. లైంగిక చర్యలో ఇవి ఒకోసారి ఒరిపిడికి లోనై నొప్పిని కలిగించే అవకాశం ఉంది. ఉదాహరణకు పురుషాంగపు ముందు చర్మం బిగుతుగా ఉన్నప్పుడుగాని, పురుషాంగం శిశ్నమణి క్రింద భాగంలో చర్మాన్ని శిష్నానికి కలుపుతూ వుండే స్నాయువు కురచగా ఉన్నప్పుడుగాని సంభోగ సమయంలో కదిలికలకు ఇబ్బంది ఏర్పడి నొప్పి వస్తుంది. పురుషాంగంలో ఇటువంటి నిర్మాణపరమైన సమస్యలు ఉన్నప్పుడు సాధారణస్థాయికి మించి కొంచెం ఎక్కువ ఉద్రేకంతోనూ, ఎక్కువ సార్లు సమాగమంలో పాల్గొంటే, సరైన లూబ్రికేషన్ (జారుడుగుణం) లేని కారణంగా పురుషాంగం ముందు చర్మం చిట్లడంగాని, చర్మాన్ని శిశ్నానికి కలిపి ఉంచే ఫ్ఫ్రెన్యులం తెగటం గాని జరిగి నొప్పి వస్తుంది.

సూచనలు: ఇలా జరిగినప్పుడు ఉప్పు కలిసిన వేడినీళ్లతో కాపడం పెట్టుకుంటే రెండు మూడు రోజుల్లోనే పరిస్థితి చక్కబడుతుంది. అవసరమైతే జాత్యాది ఘృతం అనే మందును పై పూతగా వాడవచ్చు.

2. విసర్పం (జనైటల్ హెర్పిస్):

జననాంగంపైన వచ్చే హెర్పిస్ వ్యాధి - ముఖ్యంగా సింప్లెక్స్ వ్యాధి సరైన రక్షణ పాటించని లైంగిక కలయికతో ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. ఈ వ్యాధిలో చమట కాయల మాదిరి నీటి పొక్కులు గుంపులుగా ఏర్పడి, పగిలి, ఒకే వ్రణంగా తయారై, చెక్కుకట్టి పూర్తిగా మానిపోతాయి చాలామందిలో హెర్పిస్ వైరస్ వెన్నుపూసలో దాగివుండి మానసికంగా ఒత్తిడికి గురైనప్పుడుగాని, జలుబుం ఫ్లూ వంటి ఇన్ఫెక్షన్లకు గురైనప్పుడుగాని తిరగబెడుతూ మానసిక వేదనకు, నిస్పృహకు గురిచేస్తుంటుంది. పొక్కులు కనిపించే ముందు జననాంగం పైన కొద్దిగా దురదగా, లేదా మంటగా అనిపిస్తుంది. ఒకోసారి గజ్జల్లో కూడా కడతాయి. గుడూచి, శారిబా, హరిద్రా, భూమ్యామ్లకి అనే మూలికలు హెర్పిస్ వైరస్ ను సమర్ధవంతంగా అదుపు చేయగలుగుతాయి. వీటిని వ్యక్తిగత ప్రకృతిని బట్టీ, వ్యాధి ఉధృతిని బట్టీ వివిధ సంయోగాలుగా ఇవ్వాల్సి ఉంటుంది.

ఔషధాలు: గుడూచి సత్వం, కర్పూర శిలాజిత్తు భస్మం, కామదుఘ రసం, మంజిష్టాది క్వాథం చూర్ణం, నింబాది క్వాథ చూర్ణం. పిండ తైలం, షడంగ క్వాథ చూర్ణం.

బాహ్యప్రయోగాలు - మహాతిక్తక ఘృతం, నాల్పామారాది తైలం.

3. లైంగిక వ్యాధులు (సెక్యువల్లీ ట్రాన్సిమిటెడ్ డిసీజెస్):

గానోరియాలోను, ఇతర మూత్రనాళానికి చెందినా ఇన్ఫెక్షన్లలోను, మూత్రంలో మంటతోపాటు పురుషాంగంలో నొప్పి కూడా ఉంటుంది. సరైన రక్షణ పాటించని అనైతిక లైంగిక సంబంధాలలో సాధారణంగా ఇటువంటి లక్షణం కనిపిస్తుంది. గజ్జల్లో బిళ్ళలు కూడా కడతాయి.

ఔషధాలు: చందనాదివటి, చందనాసవం, చంద్రప్రభావటి, గోక్షురాదిగుగ్గులు, తామ్రభస్మం, వంగభస్మం, వంగేశ్వరరసం, యవక్షారం.

4. ప్రోస్టేట్ గ్రంథి వాపు (ప్రోస్టటైటిస్):

ప్రోస్టేట్ గ్రంథికి ఇన్ఫెక్షన్ సోకినప్పుడు (ప్రోస్టటైటిస్) పురుషాంగంలో నొప్పి వస్తుంది. ఈ వ్యాధి చాలా మందిలో దీర్ఘ వ్యాధిగా కొనసాగుతుంది. లైంగిక వ్యాధుల నుంచి సాధారణ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ల వరకు అనేక రకాలు ప్రోస్టటైటిస్ ను కలిగించే అవకాశం ఉంది.

ఔషధాలు: అభ్రక భస్మం, చందనాదివటి, చందనాసవం, చంద్రప్రభావటి, గోక్షురాది చూర్ణం, గుడూచి సత్వం, గోక్షురాది గుగ్గులు, కర్పూర శిలాజిత్తు భస్మం, కాంచనార గుగ్గులు, స్వర్ణవంగం, త్రిఫలాది క్వాథ చూర్ణం.

5. పురుషాంగం ముందు చర్మం బిగుసుకుపోవడం (బెలనైటిస్):

కొంతమందికి బ్యాక్టీరియా వల్లగాని, ఫంగస్ వల్లగాని పురుషాంగం ముందు భాగం ఇన్ఫెక్షన్ కు లోనై, ఎర్రగా వాచిపోయి నొప్పిని కలిగిస్తుంది. మధుమేహవ్యాధి గ్రస్తుల్లోను, వ్యాధి క్షమత్వ శక్తి తగ్గిన వారిలోనూ ఈ లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి.

ఔషధాలు: కైశోరగుగ్గులు, మంజిష్టాదిక్వాథ చూర్ణం.

బాహ్యప్రయోగం: పంచవల్కల కషాయం.

6. పెరోనీజ్ వ్యాధి:

కొంతమందికి పురుషాంగంలోని కణజాలం గట్టిగా, స్కార్ టిష్యూగా మారి సంకోచ గుణాలను కోల్పోతుంది. ఇలాంటి స్థితి ఏర్పడినప్పుడు ఒకవేళ అంగ స్తంభన జరిగితే అసౌకర్యం, నొప్పి కలుగుతాయి. పురుషాంగం స్తంభించినప్పుడు ఒక పక్కకు వంగిపోతుంది. ఈ స్థితిని వైద్య పరిభాషలో 'పెరోనీజ్ వ్యాధి' అంటారు.

సూచనలు: దీనిలో ఆయుర్వేద ప్రత్యేక చికిత్సలైన స్నేహస్వేదాలను చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది. పిండతైలం, శ్రీగోపాల తైలం అనే ఔషధాలను ఈ చికిత్సలో భాగంగా ఉపయోగించాల్సి ఉంటుంది.

7. శాశ్వత అంగ స్తంభన (ప్రియాపిజం):

ఒకోసారి పురుషాంగం నుంచి రక్తాన్ని తీసుకువెళ్లే సిరలలో రక్తం గడ్డ కట్టడం వల్ల అంగస్తంభన శాశ్వతంగా ఉండిపోతుంది. ఫలితంగా పురుషాంగంలో నొప్పిగా, అసౌకర్యంగా అనిపిస్తుంది. ఇలా సాధారణంగా పురుషాంగానికి దెబ్బ తగిలినప్పుడుగాని, వాపు ఏర్పడినప్పుడుగాని జరుగుతుంది. ఒకోసారి లుకీమియా వంటి వ్యాధులున్నప్పుడు కూడా ఇలాంటి స్థితి ఏర్పడుతుంది.

సూచనలు: రక్త సరఫరాను మెరుగుపరిచే నాగార్జునాభ్రరస వంటి మందులు ఈ స్థితిలో ఉపకరిస్తారు.

8. కణితులు (ట్యూమర్స్):

చాలా అరుదుగా కొంతమందికి పురుషాంగంలో కంతులూ, గడ్డలూ ఏర్పడతాయి. కారణానుగుణంగా, 'అర్భుదహర' ద్రవ్యాలతో వీటిని చికిత్సించాల్సి ఉంటుంది.

ఔషధాలు: కాంచనారగుగ్గులు, వజ్రభస్మం, నిత్యానందరసం.


ధన్యవాదములు
మీ నవీన్ నడిమింటి
విశాఖపట్నం
9703706660


8, డిసెంబర్ 2020, మంగళవారం

పేను కొరుకుడు నివారణకు పరిష్కారం మార్గం ఈ లింక్స్ లో చూడాలి అవగాహన కోసం


పేను కొరుకుడు అంటే ఏమిటి?

ప్రతి వ్యక్తికి, పురుష మరియు స్త్రీల ఇద్దరిలో ఇది సాధారణమైనది - ప్రతిరోజూ జుట్టు రాలడాన్ని కొంతవరకు అనుభవిస్తారు, సాధారణంగా రోజులకు100 వెంట్రుకుల వరకు రాలుతాయి. జుట్టు రాలడం కొన్ని సందర్భాల్లో చాలా తీవ్రంగా ఉంటుంది. పేను కొరుకుడు అనేది సాధారణం కంటే ఎక్కువగా జుట్టు రాలడంతో కలిగే ఒక పరిస్థితి.పేనుకొరుకుడు/అలోపేసియా అనేది ఈ క్రింది రకాలుగా గమనించవచ్చు:

  • అలోపేసియా అరెటా (Alopecia areata), నెత్తి మీద జుట్టు సాధారణంగా చిన్న చిన్న ఖాళీలతో ఊడిపోతుంది,ఆ ఖాళీ సాధారణంగా గుండ్రంగా.
  • అలోపేసియా టోటాలిస్ (Alopecia totalis), దీనిలో నెత్తి మీద నుండి పూర్తిగా జుట్టు రాలిపోతుంది.
  • అలోప్సియా యూనివెర్సలిస్ (Alopecia universalis), దీనిలో శరీరం మీద నుండి కూడా జుట్టు రాలిపోతుంది.

జుట్టు తిరిగి పెరుగుతున్నా, అది మళ్లీ రాలిపోయే వైఖరిని కలిగి ఉంటుంది.

దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

పేనుకొరుకుడు, దాని విభిన్న రూపాల్లో, వివిధ లక్షణాలను చూపుతుంది:

  • అలోపీసియా అరెటాలో గుండ్రంగా లేదా నాణెం-పరిమాణం ఖాళీలతో జుట్టు రాలిపోవడం జరుగుతుంది. ఉదయం మేల్కొన్నప్పుడు జుట్టు గుత్తులుగా దిండుపై కనపడుతుంది. ఖాళీల /మచ్చల పరిమాణం మారుతూ ఉండగా, కొన్ని ప్రాంతాల్లో జుట్టు సాంద్రతలో తగ్గుదల కనిపిస్తుంది. నెత్తి మీద జుట్టు నష్టం చాలా సాధారణం; అయితే, ఈ రకం పేనుకొరుకుడులో /అలోపేసియాలో కనురెప్పల వెంట్రుకలు, కనుబొమ్మలు లేదా గడ్డం మీద జుట్టు రాలడాన్ని చూడవచ్చు. మరో అరుదైన లక్షణం నెత్తి వెనుక నుండి జుట్టు నష్టం.
  • అలోప్సియా టోటాలిస్ లో, ప్రజలు నెత్తి మీద పూర్తిస్థాయిలో జుట్టును నష్టపోవచ్చు.
  • అలోప్సియా యూనివెర్సలిస్ విషయంలో, మొత్తం శరీరం నుండి జుట్టు నష్టం బాగా కనిపిస్తుంది.
  • కొన్నిసార్లు పేనుకొరుకుడు గోర్లను కూడా ప్రభావితం చేయవచ్చు మరియు వాటిని నిస్తేజంగా, పెళుసుగా, గరుకుగా లేదా విరిగిపోయేలా చేయవచ్చు. గోళ్ళ సమస్యలు కొన్నిసార్లు పేనుకొరుకుడు మొదటి సంకేతం కావచ్చు.

ప్రధాన కారణాలు ఏమిటి?

పేనుకొరుకుడు ఒక జన్యుపరమైన సమస్యగా గుర్తించబడింది మరియు స్వయం ప్రతిరక్షక (autoimmune)వ్యాధిగా వర్గీకరించబడింది. అంటే శరీరం యొక్క రోగనిరోధక వ్యవస్థ జుట్టు పై దాడి చెయ్యడం ప్రారంభిస్తుంది అని అర్థం. ఫలితంగా, విస్తృతమైన జుట్టు నష్టంకలుగుతుంది.

ఎలా నిర్ధారించాలి మరియు చికిత్సఏమిటి?

పేనుకొరుకుడు సాధారణంగా ఒక చర్మవ్యాధి నిపుణులు నిర్ధారిస్తారు. ఈ పరిస్థితికి పరీక్షించడానికి వివిధ మార్గాలు ఉన్నాయి, అవి:

  • ఇతర స్వయం ప్రతిరక్షక (autoimmune) వ్యాధుల ఉనికిని తనిఖీ చేయడానికి రక్త పరీక్షలను నిర్వహించవచ్చు.
  • కొన్నిజుట్టు వెంట్రుకలను వెంట్రుకలను తొలగించి పరిశీలించవచ్చు.
  • పేనుకొరుకుడును నిర్ధారించడానికి చర్మ జీవాణుపరీక్షలు (biopsy) తీసుకోవచ్చు.

పేనుకొరుకుడుకి ఎటువంటి నివారణ నిర్వచించబడలేదు. జుట్టు పెరుగుదల సాధారణంగా దాని స్వంత విధికి తిరిగి చేరుకుంటుంది, మరియు జుట్టు మళ్ళి పెరగడం ప్రారంభిస్తుంది. కొన్నిసార్లు పెరుగుదల వేగవంతమవుతుంది. జుట్టు పెరుగుదల వేగవంతం చేయడానికి క్రింది చికిత్సలలో కొన్ని వాటిని చర్మవ్యాధి నిపుణులు సూచిస్తారు:

  • రోగనిరోధక వ్యవస్థను అణచివేయడానికి కార్టికోస్టెరాయిడ్స్ (corticosteroids). వీటిని ఉపయోగించటానికి క్రీములు లేదా లోషన్ల రూపంలో ఇవ్వవచ్చు లేదా ప్రభావిత ప్రాంతాల్లోకి ఇంజెక్షన్ల ప్రవేశపెట్టవచ్చు. మాత్రలు కూడా లభ్యమవుతున్నాయి, కానీ దుష్ప్రభావాల కారణంగా ఇవి సాధారణంగా నివారించబడతాయి.
  • అంత్రాలిన్ (Anthralin) రోగనిరోధక పనితీరు మీద లక్ష్యంగా పనిచేసే ఒక ఔషధం. ఇది శక్తివంతమైనది మరియు పూసిన ఒక గంట వరకు అలా వదిలి తర్వాత కడిగివేయ్యాలి.
  • మినాక్సిడిల్ (Minoxidil) జుట్టు పెరుగుదల కోసంనెత్తి మీద, గడ్డం లేదా కనుబొమ్మల మీద కూడా పూయవచ్చు. ఇది పురుషులు మరియు స్త్రీలు మరియు పిల్లలకు సురక్షితంగానే ఉంటుంది మరియు దీనిని రోజుకు రెండుసార్లు ఉపయోగించవచ్చు.
  • డిఫిన్సీప్రోన్ (Diphencyprone) అనేది ఔషధం, ఇది బట్టతల ఖాళీల లక్ష్యంగా పని చేస్తుంది. దీనిని పూసిన తర్వాత, ప్రతిచర్య జరుగుతుంది మరియు రోగనిరోధక వ్యవస్థ దానితో పోరాడటానికి తెల్ల రక్త కణాలను పంపుతుంది. ఈ ప్రక్రియలో, వెంట్రుకల కుదుళ్ళు ఉత్తేజపర్చబడతాయి, తద్వారా జుట్టు నస్టాన్ని నిరోధిస్తుంద


Medicine NamePack Size
Urimax DUrimax DX Tablet
Kera FM SolutionKera FM Solution
BiomaxBiomax 20 Mg Tablet
Silotrif D8Silotrif D 8 Combipack
StayHappi Tamsulosin + Finasteride TabletStayHappi Tamsulosin 0.4 Mg + Finasteride 5 Mg Tablet
StayHappi Tamsulosin Hydrochloride Extended Release + Dutasteride TabletStayHappi Tamsulosin Hydrochloride 0.4 Mg Extended Release + Dutasteride 0.5 Mg Tablet
GrohairGrohair 1mg Tablet
Schwabe Rosmarinus officinalis CHSchwabe Rosmarinus officinalis 1000 CH
Silotime DSilotime D Capsule
Reflow DREFLOE D TABLET 10S
Contiflo DCONTIFLO-D TABLET (KIT)
Dutas TDutas T Plus Capsule PR
Flodart PlusFlodart Plus Capsule PR
Geriflo DGeriflo D Capsul
CurlzpepCurlzpep Gel
TamduraTAMDURA TABLET 10S
Premeth TabletPremeth 4 mgTablet
Uritin DUritin D Tablet MR
Consistam DConsistam D Tablet
Nixdil ForteNIXDIL FORTE 5% SOLUTION 60ML
DutalosinDutalosin Tablet MR
NormproNormpro Tablet
Bjain Rosmarinus officinalis Mother Tincture QBjain Rosmarinus officinalis Mother Tincture Q
Tamcontin DTamcontin D Tablet
हमारी ऐप डाउनलोड करें
*పేను కొరుకుడు రావడానికి కారణం నివారణ ఎలా తెలుసుకొందాము*

         పేను కొరుకుడు అంటే ఉన్నట్లుండి తలమీద వెంట్రుకలు కొద్దిపాటి ప్రాంతంలో రాలిపోయి చర్మం కనిపిస్తూ ఉంటుంది. ఇది అలర్జీ వల్ల వస్తుందని వైద్యుల అభిప్రాయం. ఈ అలర్జీ తగ్గగానే మళ్ళీ తిరిగి వెంట్రుకలు వస్తాయి. దీనినే పేనుకొరుకుడు అంటారు. అయితే చాలా మంది పేనుకొరుకుడు కారణంగా బట్టతల మాదిరిగా అవుతుందేమో అని అపోహ పడుతుంటారు. 
 
గుండ్రని నిర్ణీత స్థలంలో వెంట్రుకలు పూర్తిగా పోయి నున్నపడటాన్ని పేనుకొరుకుడు అని పిలుస్తారు. నిజానికి ఇది పేను వచ్చి కొరకటం కాదు. అలా నానుడిగా సాధారణ జనానికి అర్థం అయ్యే విధంగా అంటుంటారు. దీన్ని వైద్య పరిభాషలో ‘అలోపేషియం ఏరిమేటా’ అని పిలుస్తారు. ఈ పేనుకొరుకుడు జనాభాలోని రెండుశాతం మందిలో కనపడుతుంది.
 
కారణాలు: 

+ ఇది ఒక ఆటో ఇమ్యూన్‌ డిజార్డర్‌. అనగా వెంట్రుకలకి వ్యతిరేకంగా వాటిలోనే ఆంటీబాడీస్‌ తయారయ్యి అక్కడక్కడ వెంట్రుకలు లేకుండా చేస్తుంది.
 
+ మానసిక ఆందోళన
 
+ థైరాయిడ్‌, డయాబెటిస్‌, బి.పి లాంటి సమస్యలు ఉన్నవాళ్లలో ఎక్కువగా చూస్తుంటాం.
 
+ ఆడా, మగ అనే తేడాలేకుండా, వయసుతో నిమిత్తం లేకుండా పేనుకొరుకుడు వస్తుంది. చిన్న పిల్లల్లో కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా 20 సంవత్సరాల వారిలో ఎక్కువగా కనిపిస్తుంది.
 
+ వంశపారంపర్యంగా కూడా వస్తుంది. ఇది అంటువ్యాధి మాత్రం కాదు.
 
60 + సంవత్సరాలు దాటిన వారిలో ఈ వ్యాధి దాదాపుగా కనిపించదు.
 
 పేనుకొరుకుడు తలలో, గడ్డం, మీసాలలో కాని రావచ్చు. దీన్నే అలోపేషియా మూసివర్యాలిస్‌ అంటారు.
 
*ఆయుర్వేద చికిత్సా 
     కేవలం మూడు నుండి వారం రోజులలోనే ఊడిపోయిన వెంట్రుకలు మొలవడం సాధ్యమవుతుంది.

ఏ విధమైన సైడెఫెక్ట్స్ మరియు రియాక్షన్స్ లేకుండా, ఏ విధమైన పత్యం లేకుండా కేవలం మందులతోనే.....

*జుట్టు ఆరోగ్యానికి గురివింద గింజల*

గురివింద గింజలను అరగ దీసి తలకు పట్టిస్తే పేలు మాయమయిపోతాయి. పేను కొరుకుడు నివారిస్తుంది.  రోజూ రెండుసార్లు ఇలాచేస్తుంటే త్వరలోనే మంచి ఫలితం కనపడుతుంది.
2- *మందార ఆకులు పూలు  తో* 
         నెల రోజుల పాటు రోజూ మూడు పూటలా మందార పూలను తలపై రుద్దుతూ ఉంటే పేను కొరుకుడు సమస్య తొలగిపోతుంది.

మందార చెట్టు వేరును నూరి, నువ్వుల నూనె కలిపి సేవిస్తే, స్త్రీలలోని అధిక రక్తస్రావ సమస్య తొలగిపోతుంది. లేదా మూడు పూలను కొద్దిగా నేతిలో వేయించి తీసుకున్నా రకస్రావం తగ్గుతుంది.

పూల రసానికి సమానంగా చక్కెర కలిపి పానకంలా వండి, మూడు స్పూన్‌ల చొప్పున రోజుకు మూడు సార్లు తాగితే మూత్ర విసర్జనలో ఇబ్బంది తొలగిపోతుంది. , మంట, చురుకు తగ్గిపోతాయి.

పరగడుపున, రోజూ నాలుగు పూల చొప్పున 2 ఏళ్ల పాటు నమిలి మింగుతూ ఉంటే తెల్ల మచ్చలు తగ్గుతాయి.

మందార ఆకులకు సమానంగా నువ్వుల నూనె కలిపి తైలం తయారు చేసుకుని తలకు రాస్తూ ఉంటే చుండ్రు సమస్య ఉండదు.

ఒక స్పూను ఎండించిన పూలచూర్ణాన్ని పాలల్లో కలిపి రెండు పూటలా తీసుకుంటే బలహీనత తొలగి రక్తపుష్టి కలుగుతుంది.

ఆకుల కషాయంతో సిఫిలిస్‌ పుండ్లను కడుగుతూ ఉంటే క్రమంగా అవి మానిపోతాయి.

3- ఇది ఓ వ్యాది ..ఆయినా చాలా ఓపిక తో    ఇటు వంటి వ్యాదినీ నయం చేస్కోగలం ఎలా అంటే జిల్లేడు పాలు ఊడిపోయిన చోట రాసినా ఫలితం ఉంటుంద

క్రింద  చెపిన మెడిసన్ లో ఏదో ఒక్కటి మాత్రమే వాడాలి 

ధన్యవాదములు 🙏

మీ నవీన్ నడిమింటి

విశాఖపట్నం

9703706660

అస్వీకార ప్రకటన: ఈ సైటుపై లభ్యమవుతున్న మొత్తం సమాచారము మరియు లేఖనము కేవలం అవగాహనా ఆవశ్యకతల కొరకు మాత్రమే. ఇక్కడ ఇవ్వబడిన సమాచారమును ఏదైనా ఆరోగ్య సంబంధిత సమస్య లేదా అస్వస్థత నుండి కోలుకోవడానికి లేదా స్వస్థత కొరకు నిపుణుల సలహా లేనిదే ఉపయోగించుకోకూడదు. చికిత్స పరీక్షలు మరియు సేవల కొరకు ఎల్లప్పుడూ ఒక అర్హత పొందిన వైద్యుల సలహా తీసుకోవాలి.


7, డిసెంబర్ 2020, సోమవారం

చిన్న పిల్లలు లో మలబద్ధకం సమస్య నివారణకు తీసుకోవాలిసిన జాగ్రత్త లు అవగాహన కోసం ఈ లింక్స్ లో చూడాలి

పిల్లల్లో మలబద్ధకం అంటే ఏమిటి?

పిల్లలలో మలబద్దకం చాలా సాధారణం. ఇది అరుదుగా భేదులుతో కూడి ఉంటుంది లేదా గట్టిగా ఉండే మలాన్ని కలిగి ఉంటుంది. ఈ వ్యాధి తీవ్రమైనదేమీ కాదు, అయితే ఈ రుగ్మత ఎక్కువ కాలం కొనసాగే ధోరణిని కల్గి ఉంటుంది, ఎందుకంటే పిల్లలు మలవిసర్జనలో ఉన్నకొద్దిపాటి నొప్పిని తప్పించుకునేందుకు మలవిసర్జనను ఉద్దేశ్యపూర్వకంగా నియంత్రించటం అలవాటు చేసుకుంటూ ఉంటారు. దీర్ఘకాలిక మలబద్ధకం తీవ్రమైన వైద్య పరిస్థితిని సూచిస్తుంది, కావున వైద్యపరమైన శ్రద్ధ దీనికి అవసరం.

మలబద్దకం ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

పిల్లల్లో మలబద్ధకం కింది లక్షణాలను కలిగి ఉండవచ్చు:

  • ఒక వారంలో మూడు కంటే తక్కువసార్లు మలవిసర్జనలు
  • గట్టిగాను మరియు పొడిగా ఉండే మలవిసర్జన సులభంగా అవదు.
  • అధిక ప్రమాణపు మలవిసర్జన తేలికగా అవకపోవడం.
  • నొప్పులు ఉన్నప్పుడు మైదానం
  • కడుపు నొప్పి లేదా తిమ్మిరి
  • మలంలో లో రక్తం
  • పిల్లల లోదుస్తుల మీద పొడి మలం యొక్క జాడలు

దీని ప్రధాన కారణాలు ఏమిటి?

అనేక కారణాలు మలబద్ధ్యానికి దోహదపడతాయి, వీటిలో కొన్నింటిని సులభంగా నివారించవచ్చు లేదా పరిష్కరించబడతాయి:

  • మలబద్ధకం యొక్క కుటుంబ చరిత్ర
  • జీర్ణ వ్యవస్థకు సంబంధించిన వైద్య పరిస్థితులు లేదా పుట్టుకతో కూడిన లోపాలు
  • కొన్ని ఆహారాల సేవనతో దుష్ప్రభావాలు లేదా అలెర్జీ
  • కొన్ని మందులు వికటించడం (సైడ్ ఎఫెక్ట్స్)
  • తీసుకునే ఆహారంలో, లేదా సామాన్యదినచర్యలో మార్పులు
  • టాయిలెట్ శిక్షణ సమయంలో తొందర్లు  
  • కావాలనే మలవిసర్జనను ఆపుకోవడం.

పిల్లల్లో మలబద్దకాన్ని ఎలా నిర్ధారణ చేస్తారు మరియు దీనికి చికిత్స ఏమిటి?

పిల్లల్లో మలబద్దక నిర్ధారణకు శారీరక పరీక్షతో పాటుగా  వైద్య చరిత్ర చాలా తరచుగా సరిపోతుంది. అసాధారణమైన వైకల్యాల్ని తనిఖీ చేయడానికి వైద్యులు శిశువు పాయువులోకి తొడుగు (glove) వేసుకున్న వేలును దూర్చి పరీక్షించొచ్చు. మల పరీక్షలు కూడా నిర్వహించవచ్చు. తీవ్రమైన సందర్భాల్లో, ఉదరం యొక్క X- రే, మల బయాప్సీ, మార్కర్ పరీక్ష లేదా రక్త పరీక్షలు కూడా చేయవచ్చు.

ఆహారంసేవనం మరియు జీవనశైలికి మార్పులు చికిత్సలో మొదటి దశ. తగినంతగా నీటిని తాగడంతోను, పీచుపదార్థాలున్న ఆహారం తినడంద్వారా మలవిసర్జన సాఫీగా అవుతుంది . వైద్యులు కొన్నిసార్లు మలవిసర్జనను మరింత సులభతరం చేయటానికి మలాన్ని మెత్తబరిచే మందుల్ని (stool softens) సూచించి సహాయం చేస్తారు. చాలా తీవ్రమైన మలబద్దకంతో బాధపడే పిల్లలకు ఆసనముద్వారా లోపలికి ఇచ్చు మందుల్ని “ఎనిమా” ను ఉపయోగించి లేదా భేదిమందు ఉపయోగించి ఆసుపత్రిలో చికిత్స చేస్తారు. కలుగుతుంది


Medicine NamePack Si
Gelusil MPSGelusil MPS Liquid Sachet
DigeneDigene Pudina Pearls
CremaffinCremaffin (Mint Flav) Plain Syrup
Litacid OralLITACID GEL 170 ml
K Mac B6K Mac B6 New Solution
Pantop MPSPantop MPS Syrup Mint Sugar Free
Belief GelBelief Oral Gel
Deys Milk Of MagnesiaDeys Milk OF Magnesia Liquid Ice Cream
Duo cytraDuo Cytra Oral Solution
LaxiconLAXICON SG CAPSULE 10S
Ranizac MpsRanizac Mps Syrup
CatchnilCatchnil Tablet
ConstifinConstifin Liquid
Constifin PlusConstifin Plus Liquid
CellubrilCELLUBRIL 100MG CAPSULE 6S
DisogelDisogel Suspension
Duracid ODuracid O Syrup
Lactihep PlusLactihep Plus Emulsion
 పిల్లలకు కడుపు నొప్పి... నివారణకు నవీన్ సలహాలు 

శిశువుల విషయంలో అధికంగా ఆహారం తీసుకోవడం, వేయించిన ఆహారాన్ని అతిగా తినడం, కొన్ని ఆహారాలకు అలెర్జీలు లేదా లాక్టోస్ అసహనం వంటి వైవిధ్య కారణాల వల్ల, మీ పిల్లవాడు కడుపు నొప్పితో ఫిర్యాదు చేయవచ్చు. అలాగే, సంవత్సరంలో ఈ సమయాన్ని ఆయుర్వేదంలో పొట్టనొప్పి అని పిలుస్తారు, అంటే కాలానుగుణ మార్పులు మరియు అసమతుల్య పొట్టనొప్పి లేదా కడుపులో మంట కారణంగా ఈ కాలంలో పిల్లలు జీర్ణ అనారోగ్యానికి గురవుతారు. మీ కిచెన్ క్యాబినెట్‌లో జీలకర్ర, పసుపు, ఉప్పు లేదా ఆసాఫోటిడా వంటి సులువుగా లభించే పదార్థాలు టాక్సిన్స్ పేరుకుపోయినప్పుడు కడుపు నొప్పి లక్షణాలను నివారించడానికి తీవ్రంగా నిర్వహించడానికి సహాయపడతాయి, రోగనిరోధక శక్తిని పెంచుతాయి మరియు జీర్ణక్రియను కూడా బలోపేతం చేస్తాయి.క్రమరహిత ఆహారపు అలవాట్లు (కారం లేదా ఆయిల్ ఫుడ్స్) లేదా ఒత్తిడి కారణంగా గ్యాస్ట్రిక్ సమస్యలు శరీరంలో ఉన్నాయి, ఇది నేటి పిల్లల జీవితంలో సర్వవ్యాప్తి చెందుతుంది.

భారతదేశంలో 24 శాతం మంది పిల్లలు అధిక బరువు కలిగి ఉండవచ్చని నివేదికలు సూచిస్తున్నాయి. ఉప్పు, చక్కెర మరియు కొవ్వు అధికంగా ఉన్న ఆహార వినియోగం పెరగడం దీనికి ప్రధాన కారణం, ఇది పిల్లలకు సులభంగా లభిస్తుంది. ఇది తార్కికంగా కడుపు నొప్పి, విరేచనాలు, గ్యాస్, మలబద్ధకం, తిమ్మిరి, యాసిడ్ రిఫ్లక్స్ మరియు ఇతర గ్యాస్ట్రిక్ సమస్యలకు దారితీసింది. జ్ఞాన వ్యవస్థగా ఆయుర్వేదం గ్యాస్ట్రిక్ డిజార్డర్స్ కోసం, ఇంటి నివారణలను అందిస్తుంది.

గ్యాస్ట్రిక్ సమస్యలకు కారణం:

అతిగా తినడం

అధిక ఆహారం (తల్లులు అధికంగా ఆహారం తీసుకుంటే)శిశువుకు కడుపునొప్పి

వేయించిన మరియు జంక్ ఫుడ్

కొన్ని ఆహారాలకు సున్నితత్వం లేదా అలెర్జీ (పాలు, ఊరగాయ)

లాక్టోస్ అసహనం (పాల ఉత్పత్తులకు)

గ్యాస్ కూరగాయలు (కాలీఫ్లవర్, ముల్లంగి, క్యాబేజీ, బీన్స్, బ్రోకలీ, మొదలైనవి గ్యాస్‌కు దారితీస్తాయి)

రసాయనిక ఎరువులతో పండించిన కూరగాయలు తినడం(పిల్లలలో కడుపునొప్పికి చాలా సాధారణం)

ప్రకోప ప్రేగు వ్యాధి

రక్త విరేచనాలు

కలుషితమైన నీటి వినియోగం, రోడ్డు పక్కన ఉన్న ఆహారం తినడం

పొట్ట అసమతుల్యత

కడుపులో మంట


ఆయుర్వేదం ప్రకారం

ఆయుర్వేదం ప్రకారం, దోషాల మూడు బయోఎనర్జీలలో అసమతుల్యత-వాత, పిత మరియు కఫా-గ్యాస్ట్రిక్ సమస్యలను తీవ్రతరం చేస్తుంది. మూడు దోషాలు ఒక వ్యక్తి యొక్క ఆరోగ్య స్థితి గతులను తెలియజేస్తుంది. విభిన్న నిష్పత్తిలో మిళితం చేస్తాయి. ఇది వ్యక్తి యొక్క ప్రత్యేకతను వ్యక్తపరిచే శారీరక, మానసిక మరియు భావోద్వేగ-అన్ని అంశాలను కలిగి ఉంటుంది. పిత దోషంలోని అసమతుల్యత గ్యాస్ట్రిక్ సమస్యలకు ప్రధాన కారణమని చెప్పబడింది మరియు జంక్, వేయించిన, ప్రాసెస్ చేసిన మరియు చల్లటి ఆహారాన్ని తినడం ద్వారా ఇది మరింత తీవ్రతరం అవుతుంది. పిత లేదా కడుపులో మంట మూలకం, మనస్సు మరియు శరీరంలో పరివర్తనతో పాటు అన్ని వేడి, జీవక్రియ మరియు మన ఇంద్రియ అవగాహనలను నియంత్రిస్తుందని అంటారు. ఇది మనము తిన్న ఆహారాన్ని ఎలా జీర్ణం చేస్తుందో నియంత్రిస్తుంది మరియు పిత దోషంలో అసమతుల్యత వ్యవస్థలో చాలా విషాన్ని లేదా అమాను సృష్టిస్తుంది. అమా ఒకరికి ఎక్కువ అలసట, కడుపు నొప్పి, ఉబ్బరం మరియు వికారం కలిగిస్తుంది.


గ్యాస్ట్రిక్ సమస్యల చికిత్స కోసం ఆయుర్వేద గృహ నివారణలు

1. కడుపునొప్పికి ​​హింగ్ (అసఫోటిడా) మరియు నెయ్యి

1 స్పూన్ హింగ్ (ఆసాఫోటిడా) తీసుకొని 1 స్పూన్ నెయ్యితో కలపాలి. గోరువెచ్చని వరకు వేడి చేయండి. పూర్తి ఉపశమనం పొందే వరకు ఈ సూత్రీకరణ పిల్లల కడుపుపై రోజుకు నాలుగైదు సార్లు వర్తించవచ్చు. కడుపు నొప్పికి ఇది ప్రత్యేకంగా సహాయపడుతుంది.


2. కాస్టర్ ఆయిల్ మరియు తమలపాకు

కాస్టర్ ఆయిల్ అర టీస్పూన్ తీసుకోండి. గోరువెచ్చని నీరు వేడి చేయండి. కడుపు ప్రాంతంలో వర్తించండి. దరఖాస్తు చేసిన తర్వాత భాగాన్ని తమలపాకుతో కప్పండి. కాస్టర్ ఆయిల్ జీర్ణవ్యవస్థను ఉత్తేజపరుస్తుంది మరియు మలబద్దకాన్ని పరిష్కరించడంలో ఉపయోగపడే పెరిస్టాల్టిక్ ను మెరుగుపరుస్తుంది కాబట్టి కడుపు నొప్పి చికిత్సకు సహాయపడుతుంది. కాస్టర్ ఆయిల్ వాయువును విడుదల చేస్తుంది మరియు ప్రేగు కదలికను క్లియర్ చేస్తుంది.

3. జీరా (జీలకర్ర) మరియు నీటి కషాయాలను

1 లీటరు నీరు తీసుకొని దానికి రెండు టీస్పూన్ల జీలకర్ర కలపండి. దానిని వేడి చేసి, ఒక సీసాలో పోయాలి. రోజంతా దానిపై సిప్ చేయమని పిల్లవాడిని అడగండి. పాఠశాలకు వెళ్ళేటప్పుడు పిల్లవాడితో పాటు బాటిల్ కూడా ఇచ్చిపంపవచ్చు. ఇది మంచి జీర్ణక్రియకు సహాయపడుతుంది.


4. అల్లం మరియు హింగ్ కషాయాలను

తాజా అల్లం, ఇంగువ మరియు ఉప్పు తీసుకోండి. నీటిలో కలపండి. దీన్ని ఉడకబెట్టి, ఒక సీసాలో నింపాలి. ఈ కషాయంను కొద్దికొద్దిగే తాగండి.

5. మలబద్ధకం కోసం రెసిపీ

1 స్పూన్ తాజా నెయ్యి మరియు ½ స్పూన్ ఉప్పును 1 మరియు పావు కప్పు వేడి నీటిలో కలపండి. బాగా కలిపి నెమ్మదిగా తాగండి. రాత్రి భోజనం తర్వాత ఒక గంట తర్వాత తినాలి.


6. ఉబ్బరం కోసం రెసిపీ

1 స్పూన్ సోపు గింజలను వేయించి 1 కప్పు వేడి నీటిలో కలపాలి. ఉడికించిన నీటిలో కొన్ని తాజా అల్లం ముక్కలు, ఒక చిటికెడు ఇంగువ మరియు రాళ్ళ ఉప్పు కొద్దిగా జోడించండి. మీ భోజనం తర్వాత నెమ్మదిగా సిప్ చేయండి.

7. యాసిడ్ రిఫ్లక్స్ కోసం రెసిపీ

1/4 కప్పు సాదా పెరుగును 3/4 కప్పు నీటితో కలపండి (లేదా రెట్టింపు, అదే నిష్పత్తిని ఉంచండి). బాగా కలపాలి. 1 స్పూన్ ఉప్పు, చిటికెడు వేయించిన జీరా (జీలకర్ర) పొడి, కొంచెం తురిమిన అల్లం, తాజా కొత్తిమీర వేసి కలపండి.


8. అతిసారం కోసం ఇంటి వంటకాలు

1 అంగుళం అల్లం తురుము మరియు 1 1/4 కప్పు నీటిలో కలపండి. కొద్దిగా సోంపుతో ఉడకబెట్టండి. అది ఉడకబెట్టిన తరువాత, ఒక చిటికెడు పసుపు పొడి జోడించండి. వడకట్టి త్రాగాలి.

9. పెరుగు

పెరుగు చాలా మంచి ప్రో-బయోటిక్ గా పరిగణించబడుతుంది. లాక్టో-బాసిల్లిలో సమృద్ధిగా ఉన్న పెరుగు పిల్లలను చిరాకు ప్రేగు వ్యాధితో పాటు తాపజనక ప్రేగు వ్యాధి నుండి రక్షిస్తుంది. అయితే, రాత్రి కంటే పగటిపూట పెరుగు తినడం మంచిది.


10. పసుపు, జీలకర్ర మరియు సోపు గింజలు

పసుపు, జీలకర్ర, సోపు గింజలు, కొత్తిమీర మరియు సాధారణంగా ఆహారంలో చేర్చడం మొత్తం జీర్ణక్రియ పనితీరును మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

11. శిశువుల బర్పింగ్

పడుకున్నప్పుడు పసిపిల్లలను వెనుకభాగంలో వేయడం వంటివి కడుపునొప్పికి చికిత్స చేయడానికి మరియు వాయువును విడుదల చేయడానికి కూడా ఉపయోగపడతాయి.

12. ఆయుర్వేద మందులు సహాయపడతాయి:

ఇంగువ పొడిని అన్నంతో 1 టీస్పూన్ నెయ్యితో కలపవచ్చు. మెరుగైన జీర్ణక్రియకు సహాయపడుతుంది మరియు కడుపు ఉబ్బరంను పరిష్కరిస్తుంది.


గుర్తుంచుకోవలసిన ఇతర జాగ్రత్తలు:

ఆహారం తిన్న వెంటనే లేదా అరగంట ముందు నీరు తాగవద్దు.

గ్యాస్ట్రిక్ సమస్యకు దారితీసేందున పిల్లలను వారి మూత్రం ఎక్కువసేపు ఆపుకోమని చెప్పవద్దు.

పిల్లలకు చాలా మెత్తగా ఉడికించిన ఆహారాలు, సూప్ మరియు తాజాగా వండిన కూరగాయలు ఎక్కువ ఇవ్వండి.

జంక్ మరియు వేయించిన ఆహారాన్ని మానుకోండి. బయట తినేటప్పుడు, ఆ ప్రదేశంలో సరైన పరిశుభ్రత ఉందని మరియు నీరు శుద్ధి చేయబడిందని నిర్ధారించుకోండి.

బహిరంగ ఆటలను ఎక్కువగా ఆడటానికి పిల్లలను ప్రోత్సహించండి. ఇది వారి జీవక్రియను మెరుగుపరుస్తుంది, పిల్లవాడిని ఆకలితో చేస్తుంది మరియు ఆకలిని మెరుగుపరుస్తుంది.


13. యోగా

కొన్ని యోగా వ్యాయామాలు కడుపు సమస్యలను పరిష్కరించడంలో కూడా ఉపయోగపడతాయి.

పవన్ముక్త ఆసనం

ఇది చాలా శక్తివంతమైన భంగిమ, ఇది మొత్తం జీర్ణవ్యవస్థకు సహాయపడుతుంది మరియు ఆసన సాధనను సులభతరం చేస్తుంది. కడుపు నొప్పిని పరిష్కరించడంలో ఇది ప్రత్యేకంగా సహాయపడుతుంది.

ఈ స్థితిల

ధన్యవాదములు 🙏

మీ నవీన్ నడిమింటి

విశాఖపట్నం

9703706660

అస్వీకార ప్రకటన: ఈ సైటుపై లభ్యమవుతున్న మొత్తం సమాచారము మరియు లేఖనము కేవలం అవగాహనా ఆవశ్యకతల కొరకు మాత్రమే. ఇక్కడ ఇవ్వబడిన సమాచారమును ఏదైనా ఆరోగ్య సంబంధిత సమస్య లేదా అస్వస్థత నుండి కోలుకోవడానికి లేదా స్వస్థత కొరకు నిపుణుల సలహా లేనిదే ఉపయోగించుకోకూడదు. చికిత్స పరీక్షలు మరియు సేవల కొరకు ఎల్లప్పుడూ ఒక అర్హత పొందిన వైద్యుల సలహా తీసుకోవాలి.