22, డిసెంబర్ 2020, మంగళవారం

గురక సమస్య నుండి తీసుకోవాలిసిన జాగ్రత్తలు అవగాహన కోసం నవీన్ సలహాలు

                నిద్రిస్తున్న సమయంలో గాలి (ఊపిరి) యొక్క అనుకూల కదలికలకు అడ్డంకి ఏర్పడినప్పుడు గురక సంభవిస్తుంది. తరచుగా గురక పెట్టేవారికి వారి యొక్క గొంతు/కంఠం మరియు నాసికా కణజాలం పెద్దగా/అధికంగా ఉంటుంది, అది కంపించి (vibrate) ప్రత్యేకమైన గురక శబ్దానికి దారితీస్తుంది.

దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

గురక వలన నిద్ర లేమి లేదా తగ్గడం, పగటి వేళా మత్తుగా అనిపించడం, ఏకాగ్రత లేకపోవడం మరియు లైంగిక కోరిక తగ్గిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇది మానసిక సమస్యల మరియు గుండెపోటు ప్రమాదాన్ని కూడా పెంచుతుంది.

దీని ప్రధాన కారణాలు ఏమిటి?

గురక అనేది చాలా సాధారణం మరియు సాధారణంగా అది ఏవిధమైన ఆందోళనకరమైన పరిస్థితులను కలిగించదు. మనం నిద్రిస్తున్నపుడు, మన నాలుక, గొంతు, నోరు, శ్వాస మార్గాలు మరియు ఊపిరితిత్తులు సేదతీరుతాయి మరియు కొంచెం సన్నగా/ఇరుకుగా మారుతాయి. శ్వాసించేటప్పుడు ఈ భాగాలు వైబ్రేట్ (కంపిస్తే) ఐతే, అది గురకకు దారితీస్తుంది. గురక యొక్క కొన్ని సాధారణ కారణాలు:

  • అలెర్జీ లేదా సైనస్ ఇన్ఫెక్షన్.
  • ముక్కు దూలం (nasal septum) పక్కకు ఒరిగిపోవడం లేదా నేసల్ పోలీప్ కారణంగా అవరోధం/అడ్డంకి ఏర్పడడం వంటి ముక్కు వైకల్యాలు.
  • ఊబకాయం.
  • మందమైన నాలుక.
  • గర్భం.
  • జన్యు కారకాలు.
  • మద్యపానం మరియు ధూమపానం.
  • టాన్సిల్స్ మరియు అడినాయిడ్లు విస్తరించడం .
  • కొన్ని రకాల మందులు.

దీనిని ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?

ఏవైనా గురక యొక్క కారణాలను తనిఖీ చెయ్యడానికి వైద్యులు ముక్కు మరియు నోటిని పరిశీలిస్తారు. వ్యక్తి యొక్క గురక విధానాన్ని గురించి వైద్యులకు తెలియజేయడానికి వ్యక్తి భాగస్వామి ఉత్తమమైన వారు. కారణం స్పష్టంగా తెలియనట్లయితే వైద్యులు నిపుణుడిని సూచించవచ్చు. వైద్యులు ఇంటిలో నిద్ర పరీక్షను (in-home sleep test) లేదా తీవ్ర కేసులలో లాబ్ లో నిద్ర పరీక్ష (in-lab sleep test) ను ఆదేశించవచ్చు.

నిద్ర అధ్యయనం (sleep study) లో, సెన్సార్లు శరీరంలోని వివిధ భాగాలలో పెడతారు అవి మెదడు, హృదయ స్పందన మరియు వ్యక్తి యొక్క శ్వాస నమూనా నుండి సంకేతాలను రికార్డు చేస్తాయి. సాధారణంగా పాలీసోమ్నోగ్రఫీ (polysomnography) అని పిలువబడే ఇంటిలో నిద్ర పరీక్ష సహాయంతో అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా గుర్తించబడుతుంది. అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా కాకుండా ఇతర నిద్ర రుగ్మతలు (స్లీప్ డిజార్డర్స్) స్టడీ సెంటర్లో (అధ్యయన కేంద్రంలో) ఇన్-లాబ్ నిద్ర అధ్యయనం ద్వారా నిర్దారించబడతాయి.

నిద్ర అధ్యయనాలు కారణాన్ని నిర్దారించలేకపొతే, గురక యొక్క ఖచ్చితమైన కారణాన్ని గుర్తించడానికి చెస్ట్ ఎక్స్-రే, సిటి (CT) మరియు ఎంఆర్ఐ (MRI) స్కాన్ వంటి ఇతర పరీక్షలు నిర్వహించవచ్చు.

ఒకే నిర్దిష్టమైన చికిత్స ద్వారా గురకను పూర్తిగా తాగించలేరు కాని కొన్ని చికిత్సలు అడ్డంకులని తొలగించటం ద్వారా శ్వాసలోని అసౌకర్యాన్ని తగ్గిస్తాయి.

నిద్రపోయే ముందు సెడేటివ్ మందుల ఉపయోగాన్ని నివారించడం, ధూమపానం మరియు మద్యపానం విడిచిపెట్టడం వంటి జీవనశైలి మార్పులు. నేసల్ స్ప్రేలు, స్ట్రిప్లు (strips)  లేదా క్లిప్లు (clips), ఓరల్ ఉపకరణాలు (oral appliances), యాంటీ- స్నోర్ (anti-snore) దిండ్లు మరియు వస్త్రాల వంటి వాటి వినియోగం అనేది గురకని తగ్గిస్తుంది.

వైద్యులు ఈ కింది సవరణలను సలహా ఇస్తారు:

  • కొంటిన్యూస్ పాజిటివ్ ఎయిర్వే ప్రెషర్ (CPAP) [నిరంతర సానుకూల వాయు పీడనం]
  • లేజర్-అసిస్టెడ్ యువలోపలటోప్లాస్టీ (LAUP, Laser-assisted uvulopalatoplasty)
  • పలెటల్ ఇంప్లాంట్లు (Palatal implants)
  • సోమ్నోప్లాస్టీ (Somnoplasty) - అధిక కణజాలాలను తీసివేసేందుకు రేడియో తరంగాలను (radiofrequency) తక్కువ స్థాయిలో ఉపయోగిస్తారు
  • కస్టమ్-ఫిట్టేడ్ డెంటల్ పరికరాలు (Custom-fitted dental devices) లేదా కింది దవడ-పొజిషనర్లు (lower jaw-positioners)
  • యువాలోపలటోఫారింగోప్లాస్టీ (UPPP, uvulopalatopharyngoplasty), థర్మల్ అబ్లేషన్ పాలటోప్లాస్టీ (TAP, thermal ablation palatoplasty), టాన్సిలెక్టోమీ (tonsillectomy) మరియు అడెనోయిడైక్టోమీ (adenoidectomy) వంటి శస్త్రచికిత్సా విధానాలు

వెల్లకిలా పడుకోవడం కాకుండా ఒక పక్కకి పడుకోవడం వలన గురకకు తగ్గించవచ్చు మరియు ఒక యాంటీ స్నోరింగ్ నోటి వస్తువును (anti-snoring mouth appliance) ఉపయోగించవచ్చు

గురక కొరకు అలౌపతి  మందులు


Medicine NamePack Size
ArmodArmod 150 Tablet
WaklertWaklert 100 Mg Tablet
WakactiveWAKACTIVE 100MG TABLET
ModafilModafil 100 Tablet MD
ModalertModalert 100 Tablet
ModatecModatec 100 Tablet
ProvakeProvake 100 Mg Tablet
WellmodWellmod Tablet

గురక(Snoring) సమస్యతో..బాధ పడుతున్నారా ఆయుర్వేదం లో 

నిద్రలో గురక రావడానికి ప్రధాన కారణం మానసికపరమైన ఒత్తిడి, కంగారు, విపరీతమైన ఆలోచనాధోరణి అని పలువురు పరిశోధకులు చెబుతున్నారు.

దీనికితోడు సమయానికి తగినట్టుగా ఆహారం తీసుకోకపోవడం కూడా మరో ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు.

👉ముఖ్యంగా కార్పొరేట్‌ ఉద్యోగుల్లో ఎక్కువమంది ఇలా గురక(Snoring) సమస్యతో బాధపడుతున్నారని ఒక సర్వేలో తేలింది. దాని వల్ల వారు గుండెపోటు, పక్షవాతం వంటి వాటికి కారణమయ్యేది.. గురయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది కొన్ని జబ్బులు రోగిని కాక ఇతరులను తీవ్రంగా వేధిస్తాయి. అలాంటి వాటిలో ముఖ్యమైనది గురక సమస్య. గురక పెట్టేవారి పక్కన పడుకున్న వారు అనుభవించే వేదన అలాంటిదిలాంటిది కాదు. చూడడానికి చిన్న సమస్యలా అనిపించే ‘గురక’ ప్రాణాంతకమైంది. అంతటి ప్రమాదకరమైన గురకకు పరిష్కారమార్గాలు ఎన్నో ఉన్నాయి.

🔴గురక(Snoring) నివారణ కు ఆయుర్వేదంలో కొన్ని నవీన్ సలహాలు  :


గురక సమస్య నుండి తప్పించుకోవడానికి ఆయుర్వేదంలో కొన్ని చిట్కాలు ఉన్నాయి. ఇలాంటి సమస్యతో సతమతమయ్యేవారు రోజూ పడుకునేముందు గుప్పెడు పచ్చి అటుకులను తింటే గురక రాకుండా ఉంటుందట.. రాత్రి నిద్రపోయే ముందు అర టీ స్పూన్‌ యాలకుల చూర్ణం ఒక గ్లాసు వేడి నీటిలో కలిపి త్రాగితే మంచి ఫలితం ఉంటుంది. రెండు టీస్పూన్ల పసుపు పొడిని గ్లాసు వేడి పాలలో కలిపి త్రాగినా గురక తగ్గుతుంది. అలాగే అర టీ స్పూన్‌ ఆలివ్‌ ఆయిల్‌, అర టీ స్పూన్‌ తేనె కలిపి రాత్రి నిద్రపోయే ముందు తాగితే గురక తగ్గుతుంది. మరిగే నీటిలో నాలుగైదు చుక్కలు యూకలిప్టస్‌ ఆయిల్‌ వేసి తలకు ముసుగు పెట్టి రాత్రి నిద్రపోయే ముందు పది నిమిషాల పాటు పీల్చితే గురక(Snoring) తగ్గిపోతుంది. ఆవు నెయ్యిని కరిగేలా కొద్దిగా వేడి చేసి రోజూ రెండు చుక్కల చొప్పున రెండు ముక్కు రంధ్రాలలో వేసి పీల్చితే గురక(Snoring)నుండి ఉపశమనం పొందవచ్చు.



సల                                                                   గురక గురక నివారణకు  చిట్కా            

బ్రాహ్మి
వస
ధనియాలు
దాల్చిన చెక్క

        అన్నింటిని కలిపి డికాషన్ తయారు చేసుకొని రాత్రి పూట పడుకునే ముందు తాగితే మంచి
ఫలితం వుంటుంది.

👉ఆరోగ్యపరంగా ఇది సమస్య అయితే కుటుంబంలో కలతలకూ గురక కారణమవుతోంది. భర్త/భార్యకు గురక సమస్య ఉందన్న కారణంగా ఎన్నో జంటలు విడాకులు తీసుకున్న సందర్బాలున్నాయ

ధన్యవాదములు 🙏

మీ నవీన్ నడిమింటి

విశాఖపట్నం

9703706660

అస్వీకార ప్రకటన: ఈ సైటుపై లభ్యమవుతున్న మొత్తం సమాచారము మరియు లేఖనము కేవలం అవగాహనా ఆవశ్యకతల కొరకు మాత్రమే. ఇక్కడ ఇవ్వబడిన సమాచారమును ఏదైనా ఆరోగ్య సంబంధిత సమస్య లేదా అస్వస్థత నుండి కోలుకోవడానికి లేదా స్వస్థత కొరకు నిపుణుల సలహా లేనిదే ఉపయోగించుకోకూడదు. చికిత్స పరీక్షలు మరియు సేవల కొరకు ఎల్లప్పుడూ ఒక అర్హత పొందిన వైద్యుల సలహా తీసుకోవాలి


హెపటైటిస్ బి పాజిటివ్ నివారణకు తీసుకోవాలిసిన జాగ్రత్త లు అవగాహన కోసం ఈ లింక్స్ లో చూడాలి

సారాంశం

హెపటైటెస్ – బి  కాలేయానికి సంబంధించిన ఇన్ఫెక్షన్. ఇది హెపటైటెస్ – బి  వైరస్ ( హెచ్ బి వి) కారణంగా వస్తుంది. ఈ జబ్బు రెండు రకాలుగా ఉంటుంది. అవి అక్యూట్ ( తీవ్రమైన సంక్రమణం) ఇన్ఫెక్షన్ . ఇది అకస్మాత్తుగా ఎదురవుతుంది. చికిత్స జరిపితే తక్కువ వ్యవధిలో నయమవుతుంది) మరొకటి దీర్ఘకాలిక ఇన్ఫెక్షన్ . ఒకసారి ఇన్ఫెక్షన్ చేరితే అది శరీరంలో ద్రవాలలో మరియు స్రావములలో నిలిచిపోతుంది. అభివృద్ధి చెందుతున్న దేశాలలో  హెచ్ బి వి ప్రధానంగా అరక్షిత లైంగిక చర్యల ద్వారా మరియు ఇంట్రావెనస్ మందుల ద్వారా సోకుతుంటుంది. అక్యూట్ ఇన్ఫెక్షన్ వల్ల తలనొప్పులు, పొత్తికడుపులో అసౌకర్యం, శరీరం నొప్పులు, కీళ్ల నొప్పులు, వికారాలు, తర్వాత చర్మం మరియు కళ్లు కామెర్ల కారణంగా పసుపుపచ్చ రంగుకు మారుతాయి. కామెర్లు హెచ్చయితే వమనాలు మరియు డయారియా ప్రబలుతాయి.

దీర్ఘకాలిక హెపటైటెస్ బి ఇన్ఫెక్షన్  కాలేయమును పాడుచేస్తుంది. పైగా లీవర్ కేన్సర్ కు దారి తీస్తుంది. తీవ్రమైన హెపటైటెస్ బి  ఇన్ఫెక్షన్ కు సాధారనంగా హెచ్చు మోతాదులో విశ్రాంతి,  హెచ్చు స్థాయిలో ద్రవ రూపంలోని ఆహారం  సేవించడం, ఆరోగ్యకరమైన ఆహారం సేవించడం మంచిది.  దీర్ఘకాలిక హెపటైటెస్ బి కు కాలేయం జబ్బు లక్షణాలకు  క్రమంగా సరిచూసుకోవడం అవసరం. అవసరమైతే మౌఖికంగా తీసుకొనే అంటివైరల్  ఔషధాలను సేవించాలి. ఒక మారు ఆంటి వైరల్ మందులు ప్రారంభిస్తే  జబ్బుమనిషి జీవిత పర్యంతం మందులను వాడుతూ ఉండాలి.  చికిత్స కొనసాగించకపోతే హెచ్ బి వి ఇన్ఫెక్షన్  లీవరు ను చేరుకొని  లీవర్ కేన్సరుకు దారితీస్తుంద

హెపటైటిస్ బి యొక్క లక్షణాలు 

జబ్బు తీవ్రమైనదా లేదా దీర్ఘకాలికమైనదా అనే అంశాన్ని బట్టి జబ్బు లక్షణాలు వైవిధ్యం కలిగి ఉంటాయి.

తీవ్రమైన హెపటైటెస్ బి

తీవ్రమైన హెపటైటెస్ బి  లక్షణాలు కనబడితే అవి ఇలా ఉంటాయి :

దీర్ఘకాలిక హెపటైటెస్ బి 

దీర్ఘకాలిక హెపటైటెస్ బి  జబ్బుతో బాధ పడేవారు ఏలాంటి ప్రత్యేకమైన చిహ్నాలు లేదా లక్షణాలను కలిగి ఉండరు. ఏళ్ల తరబడి జబ్బు లక్షణాలు లేకుండా కొనసాగుతారు. లక్షణాలు కనిపించినప్పుడు అవి తీవ్రమైన ఇన్ఫెక్షన్ జబ్బుగా వెల్లడవుతుంది. ఈ లక్షణాలలో తరచు ఆహారానికి  సిగరెట్లకు విముఖత, కొద్దిపాటి నుండి తేలిక అయిన కుడివైపు పొత్తికడుపులో నొప్పి,. ఈదశలో లీవర్ విధులకు సంబంధించిన కొన్ని పరీక్షలు  హెచ్చు విలువలను సూచిస్తాయి.

హెపటైటిస్ బి యొక్క చికిత్స 

చికిత్స :  తీవ్రమైన హెపటైటెస్ బి.

తీవ్రమైన ఇన్ఫెక్షన్ దశలో జబ్బుకి చికిత్స  నిర్వహణ మద్దతు ప్రక్రియతో కూడి ఉంటుంది. చికిత్స లక్ష్యం  వ్యక్తికి సంపూర్ణ ఆరోగ్యం కల్పించడం. సాధారణంగా ఔషధాలు సూచింప బడవు.  డాక్టర్లు అవసరమైన మోతాదులో పోషకాహార సమతౌల్యత, హెచ్చుగా నీరు త్రాగడం మరియు విశ్రాంతి సూచిస్తారు.

దీర్ఘకాలిక హెపటైటెస్ బి
దీర్ఘకాలిక ఇన్ఫెక్షన్ కు సాధారణంగా మౌఖికంగా ఉపయోగించే  ఆంటివైరల్ ఔషధాలు ( టెనోఫోవిర్ లేదా ఎంటేకావిర్ వంటివి) సూచింపబడతాయి. చికిత్స సిరోసిస్ పెరగడాన్ని  అదుపుచేయడం లేదా నిదానంగా ప్రభావం చూపేలా చేయడం లక్ష్యంగా ఉంటుంది. తద్వారా లివర్ కేన్సర్ హెచ్చయ్యే అవకాశాన్ని అదుపు చేస్తారు. చికిత్స  వైరస్  ప్రతికృతిని దాచిపెడుతుంది. ఇది జబ్బును నయం చేయదు. దీనితో ఎక్కువ మంది రోగులు యావజ్జీవం చికిత్స పొందుతుంటారు.

జీవన సరళి/ విధానం నిర్వహణ

జీవన విధానంలో జరిపే పెక్కు మార్పులు  రోగులలో హెపటైటెస్ బి ని మరింత  సమర్థవంతంగా నిర్వహించడానికి దోహదం చేస్తాయి. క్రింద కొన్ని సూచనలు ఇవ్వబడినాయి:

  • మద్యపానం మరియు ధూమపానం రెండూను  కాలేయాన్ని పాడుచేస్తాయి. ఈ కారణంగా వాటిని వదలివేయండి.  వీటివల్ల వచ్చిన హెచ్ బి వి ఇన్ఫెక్షన్ కారణంగా వచ్చిన హెపటైటెస్ బి తో లీవర్ ఇప్పటికే దెబ్బతిని ఉన్నది
  • మీరు మూలికల ఆధారంగా తయరయిన ఔషధాలను తీసుకొనే పక్షంలో మీ డాకతరును సమ్ప్రతించదం అవసరమ్ ఎందుకంటే ఈ ప్రత్యామ్నాయ మందులు లీవర్ ను పాడుచేస్తాయి లేదా మీరు తీసుకొనే డాక్తర్లు సూచించిన ఇతర ఔషధాలపై వాటి ప్రభావం చూపుతాయి.
  • మందుల దుకాణంలో లభించే ఓవర్ ది కౌంటర్ మందులను  మీ దాక్తరు సలహా లేకుండా తీసుకొనకండి.  ( ఉదా: పారాసెటమోల్). ఎందుకంటే ఇట్టి మందులలో పెక్కు మందులు లీవర్ పై దెబ్బతీస్తాయి.
  • స్కాలోప్స్, మసెల్స్ లేదా క్లామ్స్ వంటి  షెల్ ఫిష్  చేపల రకాలను తినడ మానండి అవి లీవరుకు విషపూరితమయ్యే విబ్రియో వల్నిఫిలస్ జీవులతో కూడిన బాక్టీరియాతో కూడి ఉంటాయి.
  • పెయిట్ థిన్నర్స్, ఇంటిలో శుభ్రపరచే వస్తువులు, నెయిల్ పాలిష్ రిమూవర్ల వంటి వాటిని పీల్చకండి. ఎందుకంటే అవి విషపూరితమైనవి
  • హెచ్చు స్థాయిలో కూరగాయలు, పళ్లు, తృణధాన్యాలు, క్యాబేజి, బ్రోకలీ, కాలీ ఫ్లవర్ లతో కూడినట్టి  ఆరోగ్యకరమైన ఆహారాన్ని సేవించండి. ఇవి కాలేయంపై రక్షణ చర్య కల్పిస్తుంది
  • కార్న్, వేరుసెనగ, జొన్న, తృణధాన్యాలు తీసుకొనేటప్పుడు వాటిపై  బూజును పరిశీలించండి. బూజు ఉన్నట్లయితే అది లీవర్ కు చెడు కలిగిస్తుంది.
  • క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి.
  • జబ్బు తీవ్రతను బట్టి ప్రోటీన్లు, ద్రవం ,ఉప్పు మోతాదును అదుపులో ఉంచవలసి ఉంటుంది. ఇవి లీవర్ లో మంటను కల్పించని స్థాయిలో వీటిని సేవించాలి.

హెపటైటిస్ బి అంటే ఏమిటి?

హెపటైటెస్ జబ్బు అనగా కాలేయము (లీవర్ ) లో వాపు లేదా మంట కలిగి ఉండటం, లీవరులో మంట ప్రారంభమయితే దాని పెక్కు పనులు నిలిచిపోతాయి. ఎందుకంటే కాలేయము చేసే పనులు ఒకటితో మరొకటి ముడిపడి ఉంటాయి.  హెపటైటెస్ బి లీవరు పై ఇన్ఫెక్షన్ దెబ్బతీస్తే  ఈ దుస్థితిని .  హెపటైటెస్ బి ఇన్ఫెక్షన్ అంటారు.

ప్రపంచవ్యాప్తంగా హెపటైటెస్ బి వైరస్ (హెచ్ బి వి)  ఇన్ఫెక్షన్  చెప్పుకోదగ్గ ఆరోగ్య సమస్య. ప్రపంచ ఆరోగ్య సంస్థ ( డబ్ల్యు హెచ్ ఓ )  పొందుపరచిన పరిశీలనలో  కోట్లాది మంది  హెపటైటెస్ బి కి గురవుతున్నారని వెల్లడవుతున్నది. వీరిలో సుమారు 24 కోట్లమంది  దీర్ఘకాలిక హెపటైటెస్ తో బాధ పడుతున్నారు. ప్రతి ఏటా తీవ్రమైన లేదా దీర్ఘకాలిక హెపటైటెస్ బి జబ్బుతో 7,70,000 మంది మరణిస్తున్నారు.

ప్రపంచ జనాభాలో ఐదోభాగం మంది ఇండియాలో ఉన్నారు. దీనితో ఇండియాలోని జనాభాలో హెచ్చుమంది ప్రపంచ బాధితులలో ఉన్నారు. ప్రపంచంలోని హెచ్ బి వి బాధితులలో 10- -15 శాతం మంది ఇండియాలో ఉన్నారు. ఇండియాలో 4 కోటమంది హెచ్ బి వి రొగులు ఉన్నట్లు పరిశీలనలు అంచనా వేస్తున్నాయి.

హెపటైటిస్ బి కొరకు అలౌపతి  మందులు

Medicine NamePack Size
Combe Five PFSCombefive Injection
Pentavac PFSPENTAVAC PFS INJECTION
HexaximHexaxim Vaccine
SII Q VacSII Q-VAC Vaccine
Pentavac SDPENTAVAC SD VACCINE 0.5ML
Genevac BGeneVac B 10mcg Injection
HepbHepb Injection
TenocruzTenocruz Tablet
BiohepBiohep Tablet
TenofTENOF 300MG TABLET 30S
TenohepTenohep Tablet
TentideTentide Tablet
TenvirTenvir Tablet
Valten 300 Mg TabletValten 300 Mg Tablet
VireadViread Tablet
HeptavirHeptavir Syrup
LamimatLamimat Tablet
LamivirLAMIVIR 100MG TABLET 10S
HistoglobHistoglob Injection
EpivirEpivir Oral Solution
NevilastNevilast 30 Tablet
HistaglobulinHistaglobulin Injection
HepitecHepitec Tablet
हमारी ऐप डाउनलोड करें

హెపటైటిస్‌-బి కు గొప్ప పరిష్కారం (100%)
హెపటైటిస్‌ -బి అనేది కాలేయానికి సంబంధించిన వ్యాధి. హెపటైటిస్‌ -బి వైరస్‌ ద్వారా ఈ వ్యాధి వస్తుంది. ఈ వ్యాధి ఆసియా మరియు ఆఫ్రికా ఖండాలలో చాలా చోట్ల ప్రబలంగా ఉంది. ఒంట్లో హెపటైటిస్‌ వైరస్‌ ఉన్నవాళ్ళు మన దేశంలో, మన ప్రాంతంలో చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారు. మొత్తం జనాభాలో వీరు 3 - 5 శాతం వరకూ ఉన్నట్టు అంచనాలు చెబుతున్నాయి. కాలేయానికి వాపు రావటం, వాంతులు, పచ్చ కామెర్లు ఈ వ్యాధి లక్షణాలు. ఈ వ్యాధి ముదిరితే కాలేయం గట్టిబడిపోయి లివర్‌ కాన్సర్‌ వచ్చే ప్రమాదం ఉంది.
ఒకసారి హెపటైటిస్‌ -బి వైరస్‌ ఒంట్లో ప్రవేశించిందంటే ఒంట్లో దాని సంఖ్య విపరీతంగా లక్షల్లో పెరిగిపోతూ అది లివర్‌ను దెబ్బతియ్యటం ఆరంభిస్తుంది. ఇక వాళ్ళ రక్తంలోనూ, వీర్యంలోనూ, లాలాజలంలోనూ, ఇతరత్రా శారీరకా స్రావాలన్నింటిలోనూ ఈ వైరస్‌ ఉండొచ్చు. ఈ వైరస్‌ ఎక్కువగా శరీర ద్రవాల ద్వారా వ్యాపిస్తుంది. సెక్స్‌, రక్తమార్పిడి, సూదులు, సిరింజిలు తల్లి నుండి బిడ్డకు సంక్రమించవచ్చును.

తొలి దశ
హెపటైటిస్‌-బి వైరప్‌ శరీరంలో ప్రవేశించిన తర్వాత సాధారణంగా చాలామందికి కొద్దిరోజుల్లో కామెర్లు వస్తాయి. దీన్ని ‘అక్యూట్‌’ దశ అంటారు. కామెర్లతో పాటు వికారం, అన్నం సయించకపోవటం, కొద్దిపాటి జ్వరం వంటి లక్షణాలూ ఉండొచ్చు. ఈ దశలో మనం Elisa పరీక్ష చేస్తే ‘పాజిటివ్‌’ వస్తుంది. అంటే ఏదో మార్గంలో హెపటైటిస్‌ -బి వైరస్‌ వీరి శరీరంలో ప్రవేశించిందని, దాని కారణంగా కామెర్లు వచ్చాయని అర్థం. వీరికి ‘లివర్‌ ఫంక్షన్‌ టెస్లు’ల్లో కూడా కాస్త తేడాలుంటాయి.
1. ఇలా కామెర్లు వచ్చి, హెపటైటిస్‌ -బి ‘పాజిటివ్‌’ ఉన్న వారిలో నూటికి 99.5 మందికి ప్రాణాపాయం ఉండదు. ఈ దశలో మనం వీరికి మంచి ఆహారం, పూర్తి విశ్రాంతి ఇస్తే చాలు. ముఖ్యంగా లివర్‌ను దెబ్బతీసే మందులు వాడకూడదు.
2. క్రమంగా కామెర్లు వాటంతట అవే తగ్గిపోతాయి. 95 శాతం మందికి ఆర్నెల్ల తర్వాత వీరికి మళ్ళీ Elisa పరీక్ష చేస్తే ‘నెగిటివ్‌’ వచ్చేస్తుంది.
3. పెద్దల్లో కేవలం కొద్దిమందికి(5%) మాత్రం ఆర్నెల్ల తర్వాత కూడా హెపటైటిస్‌ - బి వైరస్‌ ఒంట్లో ఉండిపోవచ్చు. అదే పిల్లల్లో అయితే 90 శాతం మందికి ఈ వైరస్‌ పూర్తిగా పోదు, అది అలాగే శరీరంలో ఉండిపోతుంది.
4. అంటే హెపటైటిస్‌ -బి ఎంతోమందికి సోకినా కేవలం కొద్దిమందికి మాత్రమే అది ఒంట్లో నిల్వ ఉండిపోతుంది. ఇది దీర్ఘకాలిక సమస్యకు ఆరంభం!
5. ఒకసారి హెపటైటిస్‌ -బి ఉన్నట్టు తేలిందంటే వారి నుంచి అది ఇతరులకు సంక్రమించకుండా ఇంట్లోని వారంతా టీకాలు వేయించుకోవటం వంటి జాగ్రత్తలన్నీ తీసుకోవాలి. జీవిత భాగస్వాములకు ఈ జాగ్రత్తలు మరీ ముఖ్యం!

వైరస్‌ మకాం
కామెర్లు తగ్గిన ఆర్నెళ్ల తర్వాత కూడా HBsAg పరీక్ష పాజిటివ్‌ వస్తుంటే దాన్ని దీర్ఘకాలిక సమస్యగా క్రోనిక్ పటైటిస్‌ గా పరిగణిస్తారు. అంటే ఇక హెపటైటిస్‌ - బి వైరస్‌ శరీరంలో ఉండిపోవటానికే ప్రయత్నిస్తోందన్నట్టే. ఇలా హెపటైటిస్‌ -బి ఒంట్లో ఉండిపోతున్నా కూడా వీరిలో 60 శాతం మంది జీవితాంతం అలాగే... ఏ సమస్యలూ లేకుండా ఉండిపోవచ్చు. వీళ్ళను అస్‌ఎఫెక్టెడ్‌ క్యారియర్స్‌ అంటారు. ఏలక్షణాలూ, ఏబాధలూ ఉండవు. చాలాసార్లు ఒంట్లో వైరస్‌ ఉన్న విషయం కూడా వీరికి తెలీదు. మామూలు హెల్త్‌చెకప్‌లకు వెళ్ళినప్పుడో, రక్తదానం చేసినప్పుడో, గర్భం దాల్చినప్పుడు సాధారణంగా చేసే పరీక్షలోనే ఈ విషయం బయటపడుతుంది. మరిన్ని పరీక్షలు చేస్తే వీరికి ఎలీష -HBsAg పాజిటివ్‌ ఉంటుంది గానీ SGPT నార్మల్‌గానే ఉంటుంది, HBeAg నెగిటివ్‌ ఉంటుంది. వైరల్‌లోడ్‌ కూడా తక్కువే ఉంటుంది. అంటే వీళ్ళ ఒంట్లో వైరస్‌ ఉందిగానీ దానివల్ల లివర్‌ ప్రభావితం కావటం లేదని అర్థం. వైరస్‌ వల్ల వీరికే సమస్యా లేకపోయినా వీరి నుంచి వైరస్‌ ఇతరులకు సంక్రమించే అవకాశం మాత్రం ఉంటుంది.

1. వీళ్ళకు లివర్‌ సమస్యలు వచ్చే అవకాశం తక్కువే. అయినా వీళ్ళు ఆర్నెల్లకోసారి వైద్యులను కలిసి ముఖ్యమైన పరీక్షలు ఒకటి రెండు చేయించుకోవటం ఉత్తమం. ఎందుకంటే ఇప్పటికి వైరస్‌ వల్ల ఏ ఇబ్బందీ లేకపోయినా జీవితాంతం ఇలాగే ఉంటుందని చెప్పలేం.
2. కొందరు జీవితాంతం ఈ దశలోనే ఇలాగే ఏ ఇబ్బందీ లేకుండా గడిచిపోయేవారూ ఉంటారు.
3. వీళ్ళు ఎప్పుడు రక్తదానం చెయ్యకూడదు. దేనికోసం వైద్యుల దగ్గరకు వెళ్ళినా హెపటైటిస్‌ -బి ఉన్న విషయం చెప్పాలి. మద్యం ముట్టకూడదు. చక్కటి ఆహారం తీసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. వీరి నుంచి వైరస్‌ సంక్రమించకుండా సన్నిహితులంతా జాగ్రత్తలు తీసుకోవాలి
1. పరీక్షల్లో - HBsAg పాజిటివ్‌గా ఉండటమే కాకుండా HBeAg కూడా పాజిటివ్‌ ఉండి, SGPT (కాలేయానికి సంబంధించిన ఎన్‌జైమ్‌) ఉండాల్సిన దానికంటే ఎక్కువ ఉండి వైరల్‌ లోడ్‌ 5లక్షల కంటే ఎక్కువ ఉందంటే అర్థం వీరికి భవిష్యత్తులో ఎప్పుడోకప్పుడు లివర్‌ వ్యాధులు వచ్చే అవకాశం ఉందని!
2. దాన్ని నివారించుకోటానికి కావాల్సిన మందులు ఇప్పుడు మన అందుబాటులో ఉన్నాయి. వీరు తక్షణం హోమియో మందులు తీసుకోవటం ద్వారా మున్ముందు వ్యాధి  నివారించుకునే అవకాశం ఉంది.
3. సన్నిహితులకు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. మద్యం ముట్టకుండా, ఆరోగ్యకరమైన జీవితాన్ని గడుపుతుండాలి. తరచూ వైద్యులను సంప్రదిస్తుండాలి. కొంతకాలంగా హెపటైటిస్‌ - బి వైరస్‌ ఒంట్లో ఉండి లివర్‌ ప్రభావితమైనా కూడా ఏ సమస్యా లేకుండా గడిపేవాళ్ళు కొందరైతే కొందరికి ఎప్పుడైనా తీవ్రమైనా లివర్‌ సమస్యలు ఆరంభం కావచ్చు. తీవ్రస్థాయి కామెర్లు, లేదా పొట్ట ఉబ్బరం, జలోదరం, సరైనా స్పృహ లేకపోవటం, రక్తపువాంతుల వంటి లక్షణాల్లో ఏవో ఒకటి మొదలవ్వచ్చు, కొందరికి అన్నీ రావచ్చు.
4. పరీక్షల్లో: వీరికి HBsAg పాజిటివ్‌ ఉంటుంది. ఇక HBeAg పాజిటివ్‌ ఉండొచ్చు, నెగిటివ్‌ ఉండొచ్చు. అలాగే వైరల్‌ లోడ్‌ ఉండొచ్చు, తక్కువ కూడా ఉండొచ్చు. ఎందుకంటే లివర్‌ మీద దుష్ర్పభావాలు వచ్చిన తర్వాత ఒంట్లో వైరల్‌ లోడ్‌ తగ్గిపోవచ్చు కూడా.
5. అల్ట్రాసౌండ్‌ పరీక్షలో చూస్తే మెత్తగా, మృదువుగా ఉండాల్సిన లివర్‌ గట్టిబడుతూ చిన్నదవుతున్నట్టు, గడ్డలుగడ్డలుగా తయారవుతున్నట్టు కనబడొచ్చు, ప్లీహం పెద్దదై కూడా ఉంటుంది, ఎండోస్కోపీలో అన్నవాహికలోని రక్తనాళాలు పెద్దవై కనబడతాయి.
6. దీనర్థం: వైరస్‌ దీర్ఘకాలం ఒంట్లో ఉండటం వల్ల లివర్‌ దెబ్బతినటం ఆరంభమైంది. వైరస్‌ వల్ల అది గట్టిబడిపోవటం మొదలైంది. కొద్దికొద్దిగా గట్టిబడుతున్న తొలి దశను పైబ్రోసిస్‌ అనీ, మరీ ముదిరిన తర్వాత దశను ‘సిర్రోసిస్‌’ అనీ అంటారు. దీనికి కూడా యాంటీ వైరల్‌ మందులు ఆరంభిస్తే లివర్‌ అస్థితి నుంచి మరింత దెబ్బతినకుండా ఉంటుంది. రక్తపువాంతుల వంటి సమస్యలకు కూడా చికిత్స చెయ్యొచ్చు. మొత్తం మీద ఇప్పుడున్న చికిత్సలతో - చాలాకాలం పాటు వీరి సాధారణ జీవితానికి సమస్యల్లేకుండా చూడొచ్చు.
7. సిర్రోసిస్‌ మొదలైన తర్వాత కూడా కొన్ని దశాబ్దాల పాటు జీవించే వాళ్ళు చాలా మంది ఉంటారు. కాబట్టి నిర్వేదంలోకి జారిపోకుండా చికిత్స తీసుకోవటం ముఖ్యం.
8. ఆల్కహాల్‌ ముట్టకూడదు, తరచూ వైద్యుల పర్యవేక్షణ అవసరం.
9. వైరస్‌ సన్నిహితులకు సంక్రమించకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకోవాలి.

విపరీత పరిస్థితి
కొందరికి ఇతరత్రా లివర్‌ సమస్యలేమీ మొదలవ్వకపోయినా.. దీర్ఘకాలంగా ఒంట్లో హెపటైటిస్‌-బి వైరస్‌ ఉన్న కారణంగా లివర్‌ క్యాన్సర్‌ వచ్చే అవకాశం ఉంటుంది.

ముందు జాగ్రత్త
ఇది సోకకుండా చూసుకోవాలంటే ముందుస్తు జాగ్రత్తలు కొన్ని తీసుకోవాలి.
1. హెపటైటిస్‌ - బి సెక్స్‌ ద్వారా సంక్రమించే అవకాశాలు చాలా ఎక్కువ. కాబట్టి కండోమ్‌ వంటి సురక్షిత జాగ్రత్తలు తీసుకోకుండా సెక్స్‌లో పాల్గోనవద్దు.
2. ఒకరి టూత్‌బ్రష్‌లు, రేజర్లు, నెయిల్‌కట్టర్లు వంటివి మరోకరు వాడొద్దు. బయట సెలూన్లలో కూడా కచ్చితంగా కొత్త బ్లేడు వాడేలా చూడాలి.
3. ఇంజక్షన్‌ సూదుల వంటివి ఒకరికి వాడినవి మరొకరు ఉపయోగించవద్దు. డిస్పోజబుల్‌ సూదులు, సిరంజీలు వాడటం ఉత్తమం.
4. చెవులు కుట్టటం, ముక్కులు కుట్టటం, పచ్చబొట్లు వేయించుకోవటం వీటికి ఒకరికి వాడిన పరికరాలు మీకు వాడకుండా చూసుకోవాలి.
5. రక్తం ఎక్కించేటప్పుడు, రక్తమార్పడి విషయంలో పూర్తి సురక్షితమైన పద్ధతులను అనుసరించటం... చాలా అవసరం!

పెళ్లి
టీకాలున్నాయి కాబట్టి హెపటైటిస్‌ -బి బాధితులు ఈ విషయం ముందుకానే అందరికీ తెలిపి, వారి అనుమతితో నిశ్చితంగా పెళ్ళి చేసుకోవచ్చు. భాగస్వామికి తప్పకుండా హెపటైటటిస్‌ - బి టీకా మూడు డోసులు ఇప్పించాలి. మూడో డోసు కూడా పూర్తయిన రెండు నెలల తర్వాతే సాధారణ సెక్సు జీవితాన్ని ప్రారంభించాలి. కొన్ని సందర్భాల్లో సిరోసిస్‌ వచ్చిన వాళ్ళు తప్పించి మిగతా అందరూ (అన్‌అఫెక్టెడ్‌ క్యారియర్స్‌ కూడా) పిల్లలను కూడా కనొచ్చు.

గర్భిణులు
గర్భిణులంతా తప్పనిసరిగా HBsAg పరీక్ష చేయించుకోవాలి. హెపటైటిస్‌-బి ఉన్నా కూడా బిడ్డలను కనొచ్చు. గర్భస్రావాలు చేయించుకోవాల్సిన అవసరమే లేదు. కాకపోతే పుట్టగానే బిడ్డకు ఒక తొడకు Hepatitis-B ఇమ్యూనోగ్లోబ్యులిన్ల ఇంజక్షన్‌, మరో తొడకి హెపటైటిస్‌-బి టీకా రెండు తప్పకుండా ఇవ్వాలి. నెల రోజులకు మరో టీకా, ఆర్నెల్లకు మరో టీకా ఇప్పించాలి. దీంతో తల్లి నుంచి బిడ్డకు వైరస్‌ సంక్రమించకుండా 95 శాతం వరకూ నివారించవచ్చు.

టీకాలు
1. ప్రపంచ ఆరోగ్య సంస్థతో సహా ఏ ప్రామాణిక సంస్థా కూడా ప్రజలంతా హెపటైటిస్‌ టీకా తప్పకుండా తీసుకోవాలని సిఫార్సు చెయ్యటం లేదు. కొంతమంది మాత్రం తప్పకుండా తీసుకోవాలి.
2. చిన్న పిల్లలకూ, స్కూలు వయసు పిల్లలందరకీ తప్పకుండా టీకా ఇప్పించాలి.
3. కుటుంబంలో ఎవరికన్నా హెపటైటిస్‌ -బి ఉంటే, ఆ ఇంట్లోని వారంతా తప్పకుండా టీకా తీసుకోవాలి. వైద్య సిబ్బంది, తరచూ రక్తమార్పిడి అవసరమయ్యే రకరకాల వ్యాధి పీడితులకు కూడా టీకా తప్పనిసరి.
4. ఇవాళ మొదటి టీకా వేయించుకుంటే - మళ్ళీ సరిగ్గా నెలకు ఒకటి, ఆర్నెల్లకు మరోకటి, మొత్తం మూడు టీకాలే తీసుకోవాలి , మరియు నివారణ కోసం తప్పనిసరిగా హోమియో మందులు వాడితే మంచి ఫలితాలు వస్తాయి 

*హెపటైటిస్-బి కి ఆయుర్వేదం  మందులు* 

*వ్యాధికి కారణాలు:* కలుషిత ఆహారం, కలుషితమైన నెత్తురు ఎక్కించడం ముఖ్య కారణాలు.

*జాగ్రత్తలు:* పచ్చకామెర్లు వస్తే నాటువైద్యుల దగ్గరకెళ్లి పసరు వైద్యం చేయించుకోవడం వల్లే ప్రయోజనం ఉంటుందని ఒక అపోహ. వాస్తవానికి ఇది చాలా ప్రమాదకరం. క్వాలిఫైడ్ డాక్టర్లకు మాత్రమే వ్యాధిపైన, చికిత్సపైన సరైన అవగాహన ఉంటుంది.

ప్రస్తుతం మీరు ఈక్రింద సూచించిన సలహాలు పాటించండి.
*మందులు:* ఆరోగ్యవర్ధని (మాత్రలు): ఉదయం 1, రాత్రి 1

భూమ్యామలకి (నేల ఉసిరిక): ఆకుల రసాన్ని ఉదయం ఒక చెంచా, రాత్రి ఒక చెంచా, తేనెతో సేవించాలి. ఇదే మొక్కతో తయారు చేయబడ్డ ‘‘నిరోసిల్’’ మాత్రలు ఆయుర్వేదిక్ షాపులలో లభిస్తాయి. (ఉదయం 1, రాత్రి 1)

*భృంగరాజాసవ:* ఒక చెంచా, కుమార్యాసవ 1 చెంచా ఒక గ్లాసులో కలుపుకుని సమానంగా నీళ్లు కలిపి రెండు పూటలా తాగాలి.

*చిత్రకాదివటి (మాత్రలు):* రోజుకి 5 వరకు చప్పరిస్తే, అరుచిని, ఆజీర్ణాన్ని పోగొట్టి, ఆకలి పెంచుతుంది.

*ఆహారం:* శాకాహారం, తేలికగా జీర్ణమయ్యే పదార్థాలు, తాజా ఫలాలు, పచ్చిసలాడ్లు మంచిది. మరిగించి చల్లార్చిన నీరు, బార్లీ జావ, చెరుకురసం (రోడ్లపైన బండ్ల దగ్గర తాగొద్దు. ఎందుకంటే అక్కడి పాత్రలు, గ్లాసులు, ఐస్‌ముక్కలు కలుషితంగానే ఉంటాయి), ఇంట్లో తయారు చేసుకునే పానీయాలు ఎక్కువగా తాగడం మంచిది. నూనె పదార్థాలు, ఉప్పు, కారం బాగా తగ్గించాలి. జండ్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్ జోలికి పోవద్దు. ఇడ్లీలు, మజ్జిగ చాలా మంచివి. కరివేపాకు, అల్లం రోజూ వాడండి. మద్యసేవన, ఇతర మత్తు పదార్థాలు చాలా హానికరం.

*విహారం::* తగురీతిలో వ్యాయామం, ప్రాణాయామం చాలా మంచిది.

సూచన: రోజూ ఒక ఉసిరికాయ (ఆమలకి)ని, జీవిత పర్యంతం తినడం ఎవరికైనా మంచిదే. వ్యాధి నిరోధకశక్తి పెరగడానికి, లివరు వ్యాధుల నివారణకు, ఆయువృద్ధికి ఇది ఉపకరిస్తుంది.

ధన్యవాదములు 🙏

మీ నవీన్ నడిమింటి

విశాఖపట్నం

9703706660

అస్వీకార ప్రకటన: ఈ సైటుపై లభ్యమవుతున్న మొత్తం సమాచారము మరియు లేఖనము కేవలం అవగాహనా ఆవశ్యకతల కొరకు మాత్రమే. ఇక్కడ ఇవ్వబడిన సమాచారమును ఏదైనా ఆరోగ్య సంబంధిత సమస్య లేదా అస్వస్థత నుండి కోలుకోవడానికి లేదా స్వస్థత కొరకు నిపుణుల సలహా లేనిదే ఉపయోగించుకోకూడదు. చికిత్స పరీక్షలు మరియు సేవల కొరకు ఎల్లప్పుడూ ఒక అర్హత పొందిన వైద్యుల సలహా తీసుకోవాలి.


21, డిసెంబర్ 2020, సోమవారం

మీ శరీరంలో ఉన్న కొవ్వు గడ్డలు, కంతులు కరిగించే అద్భుతమైన సలహాలు అవగాహన కోసం నవీన్ నడిమింటి సలహాలు


క్రొవ్వు కరగడానికి నవీన్ నడిమింటి సలహాలు 

             అతిగా వున్న కొవ్వు నివారణకు      
 
    శరీరంలో కొవ్వు అతిగా పేరుకున్న వాళ్ళు నెలకొక సారి విరేచానానికి మందు వేసుకోవాలి.పగటిపూట నిద్రించ రాదు.రాత్రి పూట 4,5 గంటలు మాత్రమే నిద్ర పోవాలి.
 
        కొర్రల గంజి మంచిది, యవలు మంచి ధాన్యము. బియ్యము, గోధుమలు వాడకూడదు. పాల ఉత్పత్తులు ,చెరకు ఉత్పత్తులు తినరాదు.
 
           విరేచానానికి మందు
 
                   అల్లం రసం     ------ 2  టీ స్పూన్లు
                            తేనె      ------ 2  టీ స్పూన్లు
                   వంటాముదం  -----  4  టీ స్పూన్లు
 
         అన్నింటిని కలిపి ఒక గిన్నెలో వేసి స్టవ్ మీద పెట్టి మూడు పొంగులు రానిచ్చి దించి గోరువెచ్చగ వేకువ జామున తాగాలి. ఆ రోజంతా చారన్నం తినాలి.

       శరీర భాగాలలో కొవ్వు కరిగించడానికి   
.
   వెల్లకిలా పడుకొని నిదానంగా కుడి కాలును పైకి లేపాలి.అదే విధంగా రెండవ వైపు కూడా గాలి పీలుస్తూ వదులుతూ చెయ్యాలి .   మరల  రెండు కాళ్ళను ఒకే సారి పైకేత్తాలి, నెమ్మదిగా దించాలి.ఈ వ్యాయామాన్ని రెండు, మూడు సార్లతో ప్రారంభించి హెచ్చించాలి.
 
     ఈ విధంగా చెయ్యడం వలన నడుము నొప్పి  తగ్గుతుంది, పొట్టలో వున్న కొవ్వు కరుగుతుంది.
ఉదయం, సాయంత్రం ఖాళి కడుపుతో మాత్రమే చెయ్యాలి.
 
ఆహార నియమాలు:-
 
     అతి చల్లని పదార్ధాలు.నిల్వ ఉంచిన పదార్ధాలు,వేపుడు కూరలు, ఉడికి వుడకని పదార్ధాలు తినకూడదు.
 
జెర్సీ ఆవుల, గేదెల పాలలో కొవ్వు ఎక్కువగా వుంటుంది. కాబట్టి అవి వాడకూడదు,  మాంసాహారం జీర్ణం కావడానికి 48 నుండి 72 గంటలు పడుతుంది
 
    ఉదయం టిఫిను మానేసి ఉదయపు భోజనం 6 గంటల లోపు, రెండవ భోజనం 8 గంటల లోపు భోంచేయ్యాలిసాయంత్రం పండ్ల రసాలు తీసుకోవచ్చు.
 
ఉదయపు భోజనం :- 
 
        పాత గోధుమలు గాని, పాత రాగులు గాని, పాత బియ్యం గాని ఒక గ్లాసు తీసుకోవాలి.దానికి 14 గ్లాసుల నీటిని కలిపి మెత్తగా జావ లాగా ఉడికించాలి.దానికి చిటికెడు జిలకర, చిటికెడు ధనియాల పొడి,చిటికెడు వాము,చిటికెడు మిరియాల పొడి అర టీ స్పూను సన్నగా తురిమిన అల్లం ముక్కలు,కారెట్ ,బీట్రూట్, ఇతర కూరగాయల ముక్కలు అందులో  వేసి కిచిడి లాగా చేసి కొత్తిమీర, కరివేపాకు వేసి తినాలి. సైంధవ లవణం కలపాలి.
 
      దీని వలన ఒక్క గ్రాము కూడా అదనంగా కొవ్వు పెరగదు, పైగా కొవ్వు కరుగుతుంది.

              శరీరంలో కొవ్వు కరిగించడానికి.     

  ప్రాణాయామం ద్వారా :--  సుఖాసనంలో కూర్చొని బాగా దీర్ఘంగా గాలిని పీల్చి నెమ్మదిగావదలాలి.ఈ విధంగా చేసేటపుడు పొట్ట బాగా లోపలి పోవాలి.
 
1. ఒక కప్పు మెంతి ఆకుల రసం లో ఒక టీ స్పూను తేనె కలుపుకొని తాగాలి.ఈ విధంగా ఉదయం, సాయంత్రం   రెండు పూటలా చెయ్యాలి.లేదా కనీసం రోజుకొకసారైనా చెయ్యాలి.
 
2. మామిడి, సపోటా, అరటి కొవ్వును పెంచుతాయి.
    బొప్పాయి కొవ్వును కరిగించడంలో ప్రధానమైనది.  
    ఉదయం   --పచ్చి ఆకుల రసం
    సాయంత్రం  --పండ్ల రసం
 
    దీనితోబాటు గోరువెచ్చని నీటిలో ఒక టీ స్పూను తేనె కలుపుకొని తాగాలి.దీని వలన నీరసం రాదు.తేనె, నీరు చాలా బలాన్నిస్తుంది.
 
        కొవ్వును కరిగించడానికి తైలం
 
     100 గ్రాముల ఆవాల నూనెను స్టవ్ ,\మీద పెట్టి వేడి చేసి దించి దానిలో 20 గ్రాముల మిరియాల పొడి, 10 గ్రాముల ముద్ద కర్పూరం కలిపి నిల్వ చేసుకోవాలి. ఇది అద్భుతంగా కొవ్వును కరిగిస్తుంది.
 
    స్నానానికి గంట ముందు కొంత తైలం తీసుకొని కొవ్వు వున్న భాగంలో మర్దన చెయ్యాలి. ఒక అర గంట సేపు గాని, గంట సేపు గాని మర్దన చెయ్యాలి. దీనితో శరీరం మీద వున్న మచ్చలు కూడా నివారింప బడతాయి.అద్భుతమైన అందం, నిగారింపు వస్తాయి.
 
             శరీరంలో అతిగా కొవ్వు చేరడం వలన వచ్చే దుర్గంధాన్ని నివారించడం  

                నల్ల తుమ్మ ఆకులను రుబ్బిన పేస్ట్
               కరక పెచ్చులను రుబ్బిన పేస్ట్

     నల్ల తుమ్మ ఆకుల పేస్ట్ ను ముందు ఒళ్లంతా పట్టించాలి. తరువాత కరక్కాయ పేస్ట్ రుద్దాలి. దీని వలన శరీర దుర్గంధము నివారింప బడుతుంది.  కొవ్వు కర్గుతుంది.

              అధిక క్రొవ్వును తగ్గించడం.                            

                    ఉల్లి గడ్డల రసం          ----- పావు కిలో
                    ఆవాల నూనె             ----- పావు కిలో

     రెండింటిని కలిపి స్టవ్ మీద పెట్టి సన్న మంట మీద రసం ఇంకి పోయి నూనె మాత్రమే మిగిలేట్లు కాచాలి. చల్లారిన తరువాత బట్టలో పోసి వడకట్టాలి.

     శరీరంలో ఎక్కడ చెడు వాయువు, కొవ్వు చేరి ఉంటాయో అక్కడ ఈ తైలం తో బాగా మర్దన చెయ్యాలి.

      Cellulite  --- చర్మం కింద కొవ్వు చేరడం -- నివారణ           
 
      ఈ సమస్య మహిళల్లో ఎక్కువగా వుంటుంది.
      వయసు మీద పడినట్లుండడం, చర్మం కమలా పండు లాగా మందంగా తయారవడం జరుగుతుంది.
 
     పిరుదులలో, ముంజేతుల పై భాగంలో, పొట్ట మీద ఎక్కువగా పేరుకుంటుంది.
 
     ఈ సమస్య స్థూల కాయం , హార్మోన్ల లో తేడా, అతినీల లోహిత కిరణాల ప్రభావం మొదలైన కారణాల వలన వస్తుంది.
 
 చర్మం లో బిగువు తగ్గి వేలాడుతున్నట్లు ఉండడం వీడియొ గేమ్స్ ఆడేటపుడు ప్రాణ వాయువు తగ్గడం ధూమ పానం , కెఫీన్ ఎక్కువగా వాడడం వలన శరీరంలోఆక్సిజెన్ తగ్గడం వంటివి జరుగుతాయి.
 వయ్యారి భామ  లేదా కాంగ్రెస్ గడ్డి ప్రభావానికి గురి అయినపుడు గర్భధారణకు, పాల ఉత్పత్తికి సమస్య 
ఏర్పడుతుంది.
 
     వయసు మీరడం కూడా ఒక ప్రధాన కారణం
 
     ఉదయం 11  గంటల నుండి మధ్యాహ్నం  3 గంటల వరకు అతి నీల లోహిత కిరణాల ప్రభావం ఎక్కువగా వుంటుంది. కావున ఆ సమయం లో జాగ్రత్తలు పాటించాలి.
 
పాటించ వలసిన నియమాలు:---    క్రమంగా బరువు తగ్గాలి. రోజుకు ఆరు నుండి పది లీటర్ల నీటిని తాగాలి.
 
క్రొవ్వు పదార్ధాలు, నిల్వపదార్ధాలు, కాఫీ, టీలు, ఉప్పు తగ్గించి వాడుకోవాలి. వ్యాయామం చెయ్యాలి.
 
     ఆరోగ్యదారి ( రేల పండు ) యొక్క గుజ్జుతో మర్దన చెయ్యాలి. తైల మర్దన తప్పని సరి.
 

     నూనె, నెయ్యి ఎక్కువగా వాడినపుడు దానికి తగిన శారీరక శ్రమ లేకపోవడం  వలన శరీరంలో కొవ్వు పేరుకుపోతుంది. కాని  నూనె, నెయ్యి తగినంత వాడుకోవాలి. పూర్తిగా వాడడం మానేస్తే శరీరం ఎండి పోయినట్లు అవుతుంది., ఆహారం జీర్ణం కాదు.

దోరగా వేయించిన వాయు విడంగాలు
    "            "         శొంటి
                        ఉసిరిక పొడి

    అన్నింటిని సమాన భాగాలుగా తీసుకుని విడివిడిగా చూర్ణాలు  చేసి కలిపి నిల్వ చేసుకోవాలి.
ప్రతి రోజు రెండు పూటలా అర టీ స్పూను పొడిని ఒక గ్లాసు బార్లీ జావాలో కలుపుకొని తాగాలి లేక తేనెతోకలుపుకొని తాగాలి. దీని వలన మూత్రము ఎక్కువగా వస్తున్నా భయపడవలసిన పని లేదు.

                  కొవ్వు కరగడానికి
తిప్ప తీగ పొడి
తుంగ గడ్డల పొడి

    రెండింటిని సమాన భాగాలుగా తీసుకుని మెత్తగా దంచి జల్లించి కలిపి భద్ర పరచుకోవాలి.

    అర టీ స్పూను పొడిని  ఒక టీ స్పూను తేనెతో ప్రతి రోజు తీసుకుంటే కొవ్వు అద్భుతంగా కరుగుతుంది
1. త్రిఫలాలు
    త్రికటుకాలు
    సైంధవ లవణం

           అన్ని చూర్ణాలను కలిపి ముద్దగా చేసుకోవాలి. ప్రతి రోజు కుంకుడు కాయంత ముద్దను తినాలి. లేదా ఉదయం బార్లీ నీళ్ళలో కలుపుకొని తాగ వచ్చు.

2. మధ్యాహ్న భోజనానికి రొట్టె
     బార్లీ పిండి       --- 125 gr
     గోధుమ పిండి ---- పావు కిలో
     మిరియాల పొడి --చిటికెడు
     శొంటి పొడి         --      "
     పిప్పళ్ళ  పొడి      ---     '
     సైంధవ లవణం --- తగినంత

            అన్నింటిని నీటితో కలిపి రొట్టె చేసుకుని తినాలి. దీనిలోకి పొన్నగంటి కూర  గాని, మెంతి కూర గాని కలుపుకొని తినాలి.

3.  సాయంత్రం ఉలవకట్టులో సైంధవ లవణం కలుపుకొని తాగాలి.
4.   రాత్రి పుల్లటి పండ్లను తినాలి.
త్రిఫలాలు
తుంగ గడ్డలు
మాని పసుపు

       అన్నింటిని సమాన భాగాలుగా తీసుకొని విడివిడిగా దంచి జల్లించి కలిపి సీసాలో భద్ర పరచుకోవాలి.

ఒక గ్లాసు నీటిలో ఒక టీ స్పూను పొడిని కలిపి అర గ్లాసు కషాయం రానిచ్చి గోరువెచ్చగా అయిన తరువాత ఒక టీ స్పూను తేనె కలుపుకొని తాగాలి.

      దీని వలన శరీరంలో అధికంగా వున్నకొవ్వు తగ్గుతుంది. రక్త నాళాలలో పెరిగిన కొవ్వు కూడా తొలగించబడుతుంది.

                           అధికంగా వున్న కొవ్వును, ఆకలిని తగ్గించడానికి  సంజీవనీ రసాయనం

ఉత్తరేణి గింజల పొడి                 ----  అర టీ స్పూను

       ఒక గ్లాసు నీటిలో ఈ పొడిని వేసి ఉడికించాలి. దానిలో పాలు, చక్కర కలుపుకోవాలి. దీనిని తాగితే 2  3 రోజులు ఆకలి కాదు. తరువాత ఆకలైతేనే తినాలి.

       దీనిని విపరీతమైన లావు శరీరం వున్నవాళ్ళు, విపరీతమైన ఆకలి వున్నవాళ్ళు మాత్రమే వాడాలి. దీనితో విపరీతమైన ఆకలి తగ్గుతుంది,  శరీరంలోని కొవ్వు కరుగుతుంది.

                కొలెస్ట్రాల్  సమస్య --నివారణ                                           

        రెండు వెల్లుల్లి పాయలను సన్నని ముక్కలుగా తరిగి ఒక గిన్నెలో వేసి ఒక కప్పు పాలు, ఒక కప్పు నీళ్ళుపోసి స్టవ్ మీద పెట్టి ఒక కప్పు మిగిలేట్లు కాచాలి.  చల్లారిన తరువాత ఒక టీ స్పూను తేనె కలుపుకొని నిద్రించే ముందు తాగాలి. 40 రోజులు వాడాలి. దీని వలన కొలెస్ట్రాల్ అనబడే చెడు క్రొవ్వు నివారింప బడుతుంది.

         కఫ శరీరము కలిగి లావుగా వున్నవాళ్ళు  రెండు పాయలను, పైత్య (వేడి ) శరీరము కలిగిన వాళ్ళు ఒక వెల్లుల్లి పాయను వాడాలి.

                     కొలెస్ట్రాల్  కరగడానికి చిట్కా                                                  

తులసి గింజలు
జాజికాయ

      రెండింటి  చూర్ణాలను   సమాన భాగాలుగా తీసుకుని  కలిపి నిల్వ చేసుకోవాలి.  ప్రతి రోజు ఒక టీ స్పూనుపొడిని  నీటితో తీసుకుంటే కొలెస్ట్రాల్ నివారింప బడుతుంది.

                           శరీర భాగాలలోని కొవ్వును కరిగించడానికి లేపనం                  

        తొడలలో కొవ్వు ఎక్కువైతే రాసుకుంటాయి. చర్మం లో కొవ్వు పెరుకున్నపుడు కమలాపండు
 తొక్క మీద లాగా గుంటలు ఏర్పడతాయి.

       ఈస్ట్రోజన్,  హార్మోన్లు,  ఒత్తిడి మొదలైన కారణాల వలన కొవ్వు ఏర్పడుతుంది.

       కళ్ళ కింద వలయాలు,  గడ్డం కింద కొవ్వు ( Double Chin),  స్థూలకాయం మొదలైన
 కారణాల వలన శరీర భాగాలలో కొవ్వు పేరుకుంటుంది.
    
   

                        కాఫీ పొడి పేస్ట్                       ---ఒక కప్పు
                        కలకండ పొడి                        ---అర కప్పు
                        సముద్రపు ఉప్పు పొడి           ---అర కప్పు
    ప్రొద్దుతిరుగుడు గింజల నూనె --- అర కప్పు

         కాఫీ పొడి లో వేడి నీళ్ళు కలిపి చిక్కటి పేస్ట్ లాగా తయారు చేయాలి. దీనికి కలకండ, ఉప్పు,
 నూనె కలిపి పేస్ట్ లాగా తయారు చేయాలి.

         కొవ్వు అధికంగా పెరుకున్న  ( సెల్యులైట్ ) భాగాల మీద దీనిని రుద్దాలి .

         కొవ్వు సహజంగా తొడల లో, మెడ మీద, గడ్డం కింద, పొట్ట మీద, ఎక్కువ ఏర్పడుతుంది.

         మొదట ఆ భాగాలను వేడి నీటితో శుభ్రపరచాలి. ఈ లేపనాన్ని పూసి అదుముతూ పైకి
( గుండె వైపుకు ) రుద్దాలి.

ఉపయోగాలు :--  ఇది చర్మం కింద కొవ్వు ఏర్పడకుండా కాపాడుతుంది.

సూచనలు :--   గర్భధారణ సమయంలో, బహిష్టు కు ముందు రోజులలో కొవ్వు ఎక్కువగా తయారవుతుంది. కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలి.

       తీపి పదార్ధాలను, నూనె పదార్ధాలను తగ్గించాలి. నడవాలి. ఉలవ కషాయం తాగాలి. నాలుగైదు మిరియాలను తమలపాకులలో పెట్టుకొని నమిలి తిని నీళ్ళు తాగాలి.  భోజనానికి ముందు నీళ్ళు ఎక్కువగా తాగాలి.        
ధన్యవాదములు 🙏
మీ నవీన్ నడిమింటి
విశాఖపట్నం
9703706660
*సభ్యులకు విజ్ఞప్తి*
******************
ఈ  గ్రూపులో పెడుతున్న మెసేజ్ లన్నీ సభ్యులలో ఆరోగ్యం పట్ల ప్రాధమిక అవగాహన కోసమే అని గమనించాలి. వివిధ జబ్బులగురించి నివారణలు సూచనలు కూడా సభ్యులలో అవగాహన పెంచడానికి మాత్రమే ..మీ డాక్టరు కి ఇది ప్రత్యామ్నాయము కాదు. సభ్యులు గమనించాలి.

జాయంట్ పెయిన్ నొప్పులు నివారణకు నవీన్ నడిమింటి సలహాలు


జాయింట్ పెయిన్స్ నివారణకు నవీన్ నడిమింటి సలహాలు 


పొద్దున్నే చలికి వణికిపోతూ తప్పని పరిస్థితిలో పనులున్నాయని లేచి కూర్చుంటున్నారా? మంచం మీద నుంచి కాలు కింద పెడదామంటే భరించరానంత నొప్పిగా ఉంటుందా? నొప్పి నివారణకు అదేపనిగా పెయిన్ కిల్లర్లు వేసుకుంటూ చలికాలాన్ని ఎలాగోలా గడిపేయాల్సిందే అంటూ నిట్టూరుస్తున్నారా? చలికాలంలో ఎముకలకు, కీళ్లకు సంబంధించిన సమస్యలు ఎందుకు అధికమవుతాయి? వీటి నుంచి రిలీఫ్ పొందడం ఎలా?

చలికాలం శరద్ రుతువు చివరన మొదలై హేమంత రుతువులో బలీయంగా ఉండి శిశిర రుతువు మొదటి భాగం వరకు ఉంటుంది. ఈ కాలంలో ఉత్తర దిక్కు నుంచి వీచే అతి చల్లని గాలుల వల్ల మన చర్మం పొడిబారి, ఎండినట్టుగా అవుతుంది. చలి, రూక్ష గుణం(పొడిబార్చే గుణం) వల్ల వాతం ప్రకోపం చెందుతుంది. ఈ కాలంలో ఆకలి ఎక్కువగా ఉంటుంది. సరైన వేళలో తగినంత ఆహారం తీసుకోకుంటే ఈ అగ్ని శరీర ధాతువులను వికృతం చేస్తుంది. భోజన వేళలు పాటించకపోతే వాతం వృద్ధి చెందుతుంది. అధిక ప్రయాణాలు, రాత్రిపూట ఎక్కువ సమయం మేల్కొని ఉండటం, పగలు నిద్రించడం, చల్లని గాలులు అధికంగా ఉండటం... వల్ల వాతం ప్రకోపం చెంది (పెరిగి) అది శరీరంలో వివిధ అవయవాలలో చేరి అనేక వ్యాధులను కల్గిస్తుంది.
ఆమవాతం (రుమటాయిడ్ ఆర్థరైటిస్):  


శరీరంలోని ఆమం (అన్‌డెజెస్టైడ్ మెటీరియల్) ప్రకోపించి వాతంతో అనేక జాయింట్స్‌కు చేరి, అక్కడ తీవ్రమైన నొప్పిని, వాపును, మంటను కలిగిస్తుంది. ఈ వ్యాధులకు కారణభూతమైన ఆమం శరీరంలో విషంతో సమానమైంది. మిగిలిన కాలాలతో పోలిస్తే రుమటాయిడ్ ఆర్థరైటిస్ చలికాలంలో తీవ్రంగా ఉండి అమితమైన బాధకు గురిచేస్తుంది. ఈ వ్యాధి కేవలం జాయింట్స్‌లోనే గాక శరీరమంతా విస్తరించడంతో ఉదయం పూట శరీరం కదలించలేకపోతారు. ఆకలి మందగిస్తుంది. జ్వరంగా ఉంటుంది. కీళ్లలో తేలు కుట్టినంత నొప్పి ఉంటుంది. మలం దుర్వాసన వస్తుంది. ఈ వ్యాధిని నిర్లక్ష్యం చేస్తే కీళ్లు పూర్తిగా స్తంభించిపోయి, శరీరాన్ని కదిలించలేకపోతారు. మెల్లగా గుండెకు కూడా పాకుతుంది. తీసుకున్న ఆహారం జీర్ణం కాకుండానే మళ్లీ తినడం, మసాలాలు, నూనె ఉన్న పదార్థాలు, మాంసాహారం, రాత్రిపూట పొద్దుపోయిన తర్వాత భుజించడం... వంటి కారణాల వల్ల ఈ వ్యాధి ఎక్కువవుతుంది. సంధివాతం, ఆమవాతంలలో కీళ్ల నొప్పులు వస్తాయి. చలికాలంలో అధికమవుతాయి. అయితే ఈ రెండింటి చికిత్సలో పూర్తి విరుద్ధమైన చికిత్స ఇవ్వాల్సి ఉంటుంది. ఆమవాతం ఉన్నవారికి మొదట ఆకిలిని, జీర్ణ శక్తిని పెంపొందించాలి. కీళ్లలో ఉండే ఆమం (ఇన్‌డైజేషన్ మెటీరియల్)ను కరిగించే పాచన చికిత్స అనే ప్రక్రియ ద్వారా బయటకు పంపేయాలి. ఈ చికిత్సలో వాలుకాస్వేదం, ధాన్యామ్లధార, కషాయధార, వస్తికర్మ, విరేచనం వంటి శోధన చికిత్సలు, ఔషధాలతో కలిపి శమన చికిత్స చేయాలి. శమన చికిత్సలో భాగంగా షడ్‌ధరనచూర్ణం, ఎరండతైలం, సింహనాదగుగ్గులు, ఆమవాతంరస్, షడ్గుణ సింధూరం, వాతగజాంకుశరస్ వంటి ఔషధాలు వాడాలి.



ముందు జాగ్రత్తలు: 

ఆమవాతం లక్షణాలు కనిపించినప్పుడు సులభంగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవాలి. ఎప్పుడూ గోరువెచ్చని నీరు తాగాలి. భోజనం చేసిన వెంటనే కనీసం వంద అడుగులు నడవాలి. శొంఠి చూర్ణం, బియ్యం కడుగును వేడినీళ్లతో సేవిస్తే ఉపశమనం పొందవచ్చు. ఈ ఆమవాతానికి ఉదయం పూట చిన్న చిన్న యోగాసనాలు చేస్తే మార్నింగ్ స్టిఫ్‌నెస్ నుంచి విముక్తి పొందవచ్చు. గృధ్రసీ వాతంలో కాళ్లు తిమ్మిరి పట్టడం, నడుంనొప్పి వంటి లక్షణాలు కన్పిస్తాయి. ఈ లక్షణాలు కనిపిస్తే భుజంగాసనం, వజ్రాసనం వంటి ఆసనాలు, వేడినీళ్లతో స్నానంతో ఉపశమనం పొందవచ్చు. మలబద్ధకం లేకుండా చూసుకోవాలి. కాస్త గట్టిగా ఉండే పడకమీద నిద్రించాలి. రాత్రిళ్లు ఎక్కువసేపు మేలుకోకూడదు. ఈ కాలం శరీరంలో వాతం ప్రకోపించడం వల్ల నొప్పులు (కండరాల నొప్పి), శరీరం పట్టేసినట్టు ఉండటం, సైనసైటిస్, బద్దకంగా అనిపించడం సాధారణ లక్షణాలు. అధిక రూక్షత్వం (పొడిబారడం) వల్ల చర్మం పొడిగా ఉండి దురద, పగుళ్లు, చుండ్రు ఎక్కువవుతాయి. చలికాలంలో ప్రతీ ఉదయం సాధారణంగా మన ఇళ్లలో లభించే నువ్వుల నూనెతో శరీరం అంతా మర్దన చేసుకోవడం, ఉష్ణ జల స్నానం, వేడిని కలిగించే వస్ర్తాలతో శరీరాన్ని కప్పి ఉంచాలి. శీతల పానీయాలను తీసుకోకూడదు. తప్పనిసరిగా నెయ్యి భోజనంలో వాడాలి. పైన చెప్పిన పంచకర్మచికిత్సలు వ్యాధులను తగ్గించడమే కాకుండా, వ్యాధి రాకుండా చేస్తాయి. అయితే ఈ పంచకర్మలను నిపుణుల పర్యవేక్షణలోనే చేయించుకోవాలి.
సంధివాతం (ఆస్టియో ఆర్ర్థరైటిస్):
ఈ వ్యాధి ప్రకోపిస్తే వాతం సంధుల (కీళ్లు)లో చేరి ఎముకల అరుగుదలకు కారణమై వాపు, నొప్పి, తిత్తివటిస్పర్మ వల్ల ఎముకల మధ్య ఖాళీ ప్రదేశం తగ్గుతుంది. కాళ్లను కదిలించినప్పుడు తీవ్రమైన నొప్పితో బాధపడతారు. నడవలేరు. వ్యాధి తీవ్రావస్థలో నడవకున్నా విపరీతమైన బాధ కలుగుతుంది. ఈ వాతం కారణంగా కీళ్ల వద్ద ఎముకలను పట్టి ఉంచే డిస్క్ ముడుచుకొని ఉంటాయి. స్ర్తీలలో రుతుస్రావం ఆగిపోయిన తర్వాత, చిన్న వయసులో గర్భాశయం తొలగించినప్పుడు కలిగే హార్మోన్ల అసమతుల్యం వల్ల, అధిక బరువు కారణంగా ఎముకల మీద ఒత్తిడి పెరిగి ఎముకలలో పటుత్వం తగ్గి ఈ వ్యాధితో బాధపడాల్సి వస్తుంది.
చికిత్స: 

రోగి వయసు, శక్తిని బట్టి శమన, శోధనకర్మ చికిత్స చేయాలి. శోధన చికిత్స శరీరంలో ఉండే అనేక విషపదార్థాలను బయటికి పంపడమే కాకుండా నీరసపడ్డ జీవకణాల్లో నూతన ఉత్తేజాన్ని కలిగిస్తుంది. వ్యాధి పూర్తిగా శోధనం అయిన తర్వాత శమన చికిత్స (ఔషధా లు) ద్వారా పూర్తిగా ఉపశమనం లభిస్తుంది. ఈ సంధివాతానికి చికిత్సలో అభ్యంగస్వేదనం చేయాలి. అభ్యంగన వల్ల శరీరంలోని అన్ని జాయింట్లలో కదలికలు సాధారణ స్థితిలో కల్పించవచ్చు. ఈ అభ్యంగ చికిత్సలో అవసరాన్ని బట్టి పత్రపోటల స్వేదం, కాయసేకం, వస్తికర్మ, షస్టికశాలిపిండస్వేదం, రక్తమోక్షణం (జలగలచే చెడు రక్తం తీయడం) వంటి పంచకర్మ ప్రక్రియల ద్వారా చికిత్స చేయాలి. వీటిలో వస్తికర్మ చాలా ప్రధానం. అయితే దీన్ని వైద్యుల పర్యవేక్షణలోనే చేయాలి. తైల అభ్యంగం, వేడినీటి స్నానం ద్వారా మంచి ఉపశమనం కలుగుతుంది.

కీళ్లనొప్పులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు

కాల్షియం అధికంగా ఉండే పాలు, పెరుగు, మజ్జిగ, ఘృతం(నెయ్యి),

కీరదోస... లను విరివిగా తీసుకోవాలి. వ్యాయామాలు ఎక్కువగా చేయకూడదు.

మెట్లు, కొండలు, గుట్టలు ఎక్కడం, కింద కూర్చోవడం వంటివి చేయకూడదు. 


చల్లని నీటితో స్నానం చేయకూడదు.

తీపి, పులుపు రసాలు ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి.

దుంపకూరలు, శనగపిండి తీసుకోకూడదు.
చలి కాలంలో బాధించే వ్యాధులు...
సంధివాతం (ఆస్టియో ఆర్ర్థరైటిస్), ఆమవాతం (రుమటాయిడ్ ఆర్ర్థరైటిస్), కటిశూలం (లో బ్యాకేక్), గృధ్రసీ (సయాటికా), అస్థిచ్యుతి (డిస్క్ ప్రొలాప్స్), శిరశ్శూల (మైగ్రెయిన్), అస్థి సౌషీర్యం (ఆస్టియో పోరోసిస్), వాతవహసిర (వేరికోస్‌వైన్స్), ఆర్జిత వాతం (ఫేసియల్ పెరాలసిస్), పక్షవాతం (పెరాలసిస్), నిద్రానాశనం (ఇన్‌సామ్నియా)... మొదలైనవి.
గృధ్రసీ వాతం (సయాటికా):




నడుములో నొప్పి మొదలై, కాలి బొటనవేలి వరకు లాగినట్లు నొప్పి ఉంటుంది. వెన్నెముకలో పూసలు (వర్టిబ్రే) అస్థచ్యుతి జరగడం, అరగడం, ఎముకల మధ్య ఉండే స్నాయువు (డిస్క్) ముందుకు జరగడం వల్ల అక్కడి నుంచి మొదలయ్యే నరాల మీద ఒత్తిడి పడి ఆ నరం శరీరంలో ఎక్కడి వరకు వెళుతుందో అంతమేరకు సూదులు పొడిచినట్టుగా నొప్పి, బాధ, తిమ్మిర్లు కలుగుతాయి. దీంతో రోగి కుంటినట్లు నడుస్తాడు. ఈ వ్యాధి వల్ల ఎక్కువసేపు నిలబడలేక , కూర్చోలేక, నడవలేకపోతాడు. ఎగుడు దిగుడు ప్రదేశాలలో నడవడం, అధిక ప్రయాణం, సరైన పరుపు, పాదరక్షలు వాడకపోవడం, నడుముకు దెబ్బ తగలడం, ఎక్కువ సేపు కూర్చొని ఉండటం, అధికబరువు మోయడం, తీవ్రమైన మలబద్ధకం మొదలైన వాటి వల్ల, పైన చెప్పిన వాత ప్రకోప కారణాల వల్ల వాత ప్రకోపం జరిగి నడుము ఎముకలలోని సందులలో కదలికలు ఏర్పడి ఈ వ్యాధి వస్తుంది.
చికిత్స:
విరేచనం, వస్తికర్మ, కటివస్తికామసేకం, పత్రపోటలీ స్వేదం, షష్టికశాలి పిండస్వేదం మొదలైన శోధన కర్మలు ఈ సమస్యకు ఉపయుక్తంగా ఉంటాయి. వీటితో పాటు శమన చికిత్సలో భాగంగా బృహత్‌వాతచింతామణి, త్రయోదశాంగ గుగ్గులు, రసరాజరసం, యోగేంద్రరసం, రాస్నాసప్తక కషాయం.. అవసరం మేరకు వాడాలి.

వాతం ప్రకోపం చెంది శిరస్సును చేరినప్పుడు మైగ్రేన్, కళ్లనొప్పి, నిద్రానాశనం (ఇన్‌సామ్నియా) వస్తాయి. ఇతర హార్మోన్ సంబంధిత వ్యాధులను కలిగించే వాతం జీర్ణాశయం చేరినప్పుడు గ్యాస్‌ట్రబుల్, మలబద్ధకం, పైల్స్‌ను కలిగిస్తుంది. రక్తంతో చేరినప్పుడు శరీరంలో అనేక రకాలైన పుండ్లను, సిరలలో చేరినప్పుడు వేరికోస్ వెయిన్స్‌ను, గౌట్ కలిగిస్తుంది. వాతం - ఎముకలు, మజ్జతో చేరినప్పుడు కీళ్లనొప్పి, ఆస్టియోపోరోసిస్ కలిగిస్తుంద
ధన్యవాదములు 🙏
మీ నవీన్ నడిమింటి
విశాఖపట్నం
9703706660
*సభ్యులకు విజ్ఞప్తి*

triglycerides నివారణకు తీసుకోని వలిసిన జాగ్రత్త లు నివారణకు మార్గం ఈ లింక్స్ లో చుడండి


అధిక ట్రైగ్లిజెరైడ్స్ అంటే ఏమిటి?

ట్రైగ్లిజరైడ్లు అనేవి మీ రక్తప్రవాహంలో కనిపించే ఓ రకమైన కొవ్వు పదార్థాలు. ఓ ప్రామాణిక కొలెస్ట్రాల్ పరీక్షలో మనం చూసే నాలుగు సంఖ్యలలో ఒకటి ఈ ట్రైగ్లిజరైడ్ల స్థాయిని తెలుపుతుంది. చాలా ఆహార కొవ్వులు ట్రైగ్లిజరైడ్స్, ఇవి ప్రారంభంలో కొవ్వు కణాలలో నిల్వ చేయబడతాయి, తరువాత రక్తప్రవాహంలోకి విడుదలవుతాయి. రక్తప్రసరణలో అధిక స్థాయి ట్రైగ్లిజెరైడ్లుండడం మన శరీరానికి నిజంగా హాని కలిగించవచ్చు. దీన్నే  “హైపర్ ట్రైగ్లిసరిడామియా” అని కూడా పిలుస్తారు,

దీని ప్రధాన సంబంధిత సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

సాధారణంగా, ట్రైగ్లిజరైడ్స్ యొక్క అధిక స్థాయిలు ఏ నిర్దిష్ట వ్యాధిలక్షణాలకు కారణం కావు.

అయినప్పటికీ, అవి కొన్ని వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతాయి. ఆ వ్యాధులు:

ప్రధాన కారణాలు ఏమిటి?

హై ట్రైగ్లిజరైడ్స్ అనేక కారకాలు లేదా అంతర్లీన పరిస్థితుల ద్వారా సంభవించవచ్చు, అవేమంటే:

  • ఊబకాయం.
  • నియంత్రించని మధుమేహం.
  • క్రియారహితమైన థైరాయిడ్.
  • కాలేయం మరియు మూత్రపిండ వ్యాధి.
  • జన్యు ప్రభావం.
  • అరుగుదల శక్తిని మించి అధిక కేలరీల ఆహారాల్ని ప్రతి నిత్యం తినడం. (eating more calories than you burn).
  • ఎప్పుడూ కూర్చునే ఉండే (సెడెంటరీ) జీవనశైలి.
  • మద్యం చాలా తాగడం.
  • ధూమపానం.
  • మూత్రవిసర్జనకారక మందులు (శరీరం నుండి అదనపు నీటిని తొలగించడం) వంటివి, స్టెరాయిడ్స్, జనన నియంత్రణ మాత్రలు మరియు రోగనిరోధక వ్యవస్థను అణిచివేసే మందులు సేవించడం.
  • హార్మోన్ల చికిత్సలో లేదా పాలిసిస్టిక్ అండాశయ సిండ్రోమ్ తో  బాధపడుతున్న స్త్రీలు అధిక ట్రైగ్లిజరైడ్స్ స్థాయిని పొందే ప్రమాదాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు.

దీనిని ఎలా నిర్ధారణ చేసేది మరియు దీనికి చికిత్స ఏమిటి?

  • వైద్య చరిత్ర మరియు ఇతర పరిశోధనల ఆధారంగా ట్రైగ్లిజరైడ్స్ యొక్క అధిక స్థాయిని నిర్ధారణ చేస్తారు.
  • లిపిడ్ ప్రొఫైల్ పరీక్ష మీ రక్తప్రవాహంలో అధిక ట్రైగ్లిజెరైడ్స్ పరిశీలించడానికి మరియు గుర్తించడానికి సిఫార్సు చేయబడుతుంది. ట్రైగ్లిజరైడ్ స్థాయి 150 mg / dL ను సాధారణ స్థాయిగా పరిగణింపబడుతుంది.
  • మీ డాక్టర్ మీ రక్తం నమూనాలను సేకరించేందుకు ముందు 12 గంటలపాటు ఉపవాసం చేయమని మీకు చెబుతారు.
  • అధిక ట్రైగ్లిజరైడ్ స్థాయిల చికిత్స లక్ష్యం అంతర్లీన పరిస్థితులను పరిష్కరించడం మరియు వాటిని నియంత్రించడం.
  • హార్మోన్ల స్థాయిలను సమతుల్యపరచడానికి మరియు ఏవైనా మూత్రపిండాలు లేదా కాలేయ వ్యాధిని చికిత్స చేయడానికి ఒక ఆరోగ్యకరమైన శరీర బరువును నిర్వహించాలి.
  • స్టాటిన్స్, నియాసిన్ లేదా ఒమేగా -3 ఫ్యాటీ యాసిడ్ సప్లిమెంట్స్ వంటి కొన్ని మందులను మీ డాక్టర్ మీకుసూచించవచ్చు.

స్వీయ రక్షణ:

  • ధూమపానం లేదా మద్యపానాన్ని నివారించండి.
  • ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి.
  • ఓ క్రమమైన నడక (వ్యాహ్యాళినడక) షికార్లకెళ్ళండి మరియు తగినంతగా వ్యాయామాలు చేయండి

అధిక ట్రైగ్లిజరైడ్లు కొరకు అలౌపతి మందులు


Medicine NamePack Size
XtorNEXTOR 10MG TABLET 10S
AtherochekAtherochek 10 Tablet
NovastatNovastat 40 Tablet
LiponormLiponorm 10 Mg Tablet
ClopitorvaClopitorva 10 Capsule
AtocorAtocor 10 Tablet
LipicureLipicure 10 Tablet
AstinAstin 10 Tablet
RozucorRozucor 10 Tablet
TonactTonact CP 10 Tablet
RosaveRosave 10 Tablet
Rosave TrioRosave Gold 10 Capsule
Atorfit CVAtorfit CV 10/75 Mg Capsule
Tonact TgTonact TG Tablet
AztorAztor 10 Tablet
Rosutor GoldRosutor Gold 20/150 Capsule
Rosave DRosave D 10 Tablet
AtorvaAtorva 20 Tablet
RosuvasRosuvas 10 Tablet
RozatRozat 10 Tablet
RozavelRozavel 10 Tablet
Ecosprin AV CapsuleEcosprin AV 150 Capsule
Rosuchek DRosuchek D 10 Tablet
Rosave CRosave C 10 Capsule
Rosufit CVROSUFIT CV 10MG TABLET 10S
हमारी ऐप डाउनलोड कर

ధన్యవాదములు 🙏

మీ నవీన్ నడిమింటి

విశాఖపట్నం

9703706660

అస్వీకార ప్రకటన: ఈ సైటుపై లభ్యమవుతున్న మొత్తం సమాచారము మరియు లేఖనము కేవలం అవగాహనా ఆవశ్యకతల కొరకు మాత్రమే. ఇక్కడ ఇవ్వబడిన సమాచారమును ఏదైనా ఆరోగ్య సంబంధిత సమస్య లేదా అస్వస్థత నుండి కోలుకోవడానికి లేదా స్వస్థత కొరకు నిపుణుల సలహా లేనిదే ఉపయోగించుకోకూడదు. చికిత్స పరీక్షలు మరియు సేవల కొరకు ఎల్లప్పుడూ ఒక అర్హత పొందిన వైద్యుల సలహా తీసుకోవాలి.