6, జనవరి 2022, గురువారం

గర్భశ్రయం పైబ్రేయిడ్ కల కారణం నివారణకు జాగ్రత్త కోసం లొంక్స్ లో చూడాలి

గర్భాశయ ఫైబ్రాయిడ్ లు అంటే ఏమిటి?

గర్భాశయం యొక్క కండరాల కణాల్లో పెరిగే కాన్సర్ కానీ కణుతులు గర్భాశయ ఫైబ్రాయిడ్ లు. ఒకటి నుంచి చాలావరకు, మహిళలు విభిన్న పరిమాణాలలో ఉండే విభిన్న సంఖ్యలో ఫైబ్రాయిడ్లను కలిగి ఉండవచ్చు. ఇది ఒక చిన్న గింజ నుంచి పెద్ద ద్రవ్యరాశి ఉండే పదార్ధంగా ఉండవచ్చు. సరైన పరీక్ష లేకుండా పెల్విక్ పరీక్షల సమయంలో ఇవి యాదృచ్చికంగా కనిపిస్తాయి. మరియు ఆ తరువాత, ఈ ఫైబ్రాయిడ్ల ఉనికిని ధృవీకరించడానికి ఇమేజింగ్ మరియు ల్యాబ్ టెస్ట్ లు సాధారణంగా నిర్వహించబడతాయి.

మెనోపాజ్ వచ్చిన మహిళల్లో 20-40% మంది ఫైబ్రాయిడ్లతో బాధపడుతున్నారు. కొంత మంది వైద్యుల ప్రకారం, ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉండవచ్చునని అంచనా. వాస్తవానికి, ఇవి ఉన్న మహిళల్లో 5-10% మంది మాత్రమే వాస్తవంగా ఏవైనా లక్షణాలను ఎదుర్కొంటారు. సాధారణంగా, ఫైబ్రాయిడ్ల స్వభావం ప్రమాదకరం కాదు మరియు అవి శరీరంలోని ఇతర భాగాలకు వ్యాప్తి చెందవు, అయితే అవి లక్షణాలను చూపించడం ప్రారంభించినప్పుడు, తీవ్రంగా ఉండవచ్చు. ఫైబ్రాయిడ్లు ఉన్న మహిళలు ఎలాంటి లక్షణాలను అనుభవించరు కనుక, ఇది పరిస్థితిని మరింత తీవ్రం చేస్తుంది. అయితే, తరచుగా ఎలాంటి లక్షణాలను అనుభవించని మహిళలు వాటిని ఎదుర్కోవడానికి గణనీయమైన జీవనశైలి మార్పులు చేయవలసి ఉంటుంది.

గర్భాశయ ఫైబ్రాయిడ్లకు కారణం ఏంటి?

ఫైబ్రాయిడ్ల అబివృద్ధహయి చెందడం వెనుక స్పష్టమైన కారణం లేదు, అయితే ఫైబ్రాయిడ్ల ఏర్పడటాన్ని ప్రభావితం చేసే అనేక కారకాలు ఉన్నాయి.

గర్భాశయ ఫైబ్రాయిడ్లలో ఇవి ఉంటాయి:

1. హార్మోన్లు– ఈస్ట్రోజెన్ మరియు ప్రొజెస్టిరాన్ సహా హార్మోన్లు మహిళల అండాశయాల ద్వారా ఉత్పత్తి అవుతాయి. ఈ హార్మోన్లు ప్రతి ఋతుచక్రం సమయంలో గర్భాశయ లైనింగ్ పునరుత్పత్తికి దారి తీస్తాయి మరియు ఫైబ్రాయిడ్ల పెరుగుదలను ఉత్తేజపరచవచ్చు.

2. కుటుంబ చరిత్ర- ఫైబ్రాయిడ్ల కండిషన్ వంశపారంపర్యంగా ఉండవచ్చు. మీ అమ్మమ్మ, సోదరి మరియు అమ్మతో సహా మీ కుటుంబ సభ్యులలో ఫైబ్రాయిడ్ల చరిత్ర ఉన్నట్లయితే, అప్పుడు అది మీకు కూడా అభివృద్ధి చెందవచ్చు.

3. గర్భధారణ- గర్భధారణ వల్ల మహిళ శరీరంలో ఈస్ట్రోజెన్ మరియు ప్రొజెస్టిరాన్ హార్మోన్ల ఉత్పత్తి పెరుగుతుంది, దీని ఫలితంగా ఫైబ్రాయిడ్లు పెరుగుతాయి, మరియు గర్భధారణ సమయంలో వేగంగా అభివృద్ధి చెందవచ్చు.

ఇందులో గర్భాశయ ఫైబ్రాయిడ్లకు లక్షణాలు ఏంటి?

ఈ లక్షణాలు పూర్తిగా ఒక మహిళకు ఉన్న ఫైబ్రాయిడ్ల సంఖ్యపై ఆధారపడి ఉంటాయి. వాటి స్థానం మరియు పరిమాణం కూడా ఒక ప్రధాన అంశం. ఉదాహరణకు, సబ్ మ్యూకోసల్ ఫైబ్రాయిడ్లు భారీ ఋతుస్రావానికి దారి తీయవచ్చు మరియు గర్భధారణలో సమస్యలు తలెత్తవచ్చు.

చిన్న కణుతులు ఉన్న మహిళలు లేదా ఇప్పటికే మెనోపాజ్ ను పొందిన వారు, ఎలాంటి లక్షణాలను ఎదుర్కొనకపోవచ్చు, ఎందుకంటే వాటి ఎదుగుదలకు దోహదపడే ఈస్ట్రోజెన్ మరియు ప్రొజెస్టిరాన్ స్థాయిలు మెనోపాజ్ తరువాత తగ్గిపోవడం వలన ఫైబ్రాయిడ్ల ఎదుగుదల తగ్గి రోగ లక్షణాలు తక్కువగా ఉండవచ్చు.

గర్భాశయ ఫైబ్రాయిడ్ల లక్షణాలు:

1. దీర్ఘకాలిక, భారీ లేదా అసాధారణ ఋతుస్రావం, ఇది తరచుగా రక్తహీనతకు దారి తీస్తుంది.

2. కటి భాగంలో తీవ్రమైన నొప్పి. వెన్ను మరియు కాళ్ళ నొప్పి కూడా చాలా సందర్భాలలో ఒక లక్షణంగా చెప్పవచ్చు.

3. శారీరిక సంభోగం సమయంలో నొప్పిగా ఉంటుంది.

4. మూత్రాశయంలో ఒత్తిడి వల్ల తరచుగా మూత్ర విసర్జన చేయాలనే కోరిక కలుగుతుంది.

5. ప్రేగులో ఒత్తిడి కారణంగా మలబద్ధకం ఏర్పడుతుంది.

6. పొత్తికడుపు వాపు ఉంటుంది.

గర్భాశయ ఫైబ్రాయిడ్లు ఏ విధంగా నిర్ధారించబడతాయి?

ఖచ్చితమైన మరియు సవిస్తరమైన రోగ నిర్ధారణ కొరకు మీరు నిర్దిష్ట పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది, దీనిలో ఇవి ఉంటాయి –

1. అల్ట్రా సౌండ్ స్కాన్-

ఇది గర్భాశయ అంతర్గత నిర్మాణాలు మరియు ఫైబ్రాయిడ్ల ఉనికిని విశ్లేషించడంలో సహాయపడుతుంది. ఈ సందర్భంలో, ట్రాన్స్ వెజీనల్ అల్ట్రా సౌండ్ స్కాన్ మెరుగైన రోగ నిర్ధారణ కోసం స్పష్టమైన చిత్రాలను అందించవచ్చు.

2. పెల్విక్ ఎంఆర్ఐ-

పెల్విక్ ఎంఆర్ఐ అనేది లోతైన ఇమేజింగ్ టెస్ట్ ప్రొసీజర్, ఇది మహిళ గర్భాశయం, అండాశయాలు మరియు ఇతర కటి అవయవాల స్పష్టమైన చిత్రాలను ఉత్పత్తి చేస్తుంది.

గర్భాశయంలో ఫైబ్రాయిడ్లకు చికిత్స ఏమిటి?

మీ ఫైబ్రాయిడ్లకు సంబంధించిన సమస్యలతో మీరు మీ వైద్యుడిని సందర్శించిన తరువాత, మీ వయస్సు, మీ ఫైబ్రాయిడ్ల పరిమాణం మరియు మీ మొత్తం ఆరోగ్యానికి అనుగుణంగా ఫైబ్రాయిడ్ల చికిత్స కొరకు ఆయన ఒక ప్లాన్ ను అభివృద్ధి చేస్తారు.

మీరు వివిధ రకాలైన చికిత్సలు చేయించుకోవాల్సి ఉంటుంది,

ఫైబ్రాయిడ్ చికిత్సలో ఇవి ఉంటాయి:

మెడిసిన్:

గర్భాశయంలో ఫైబ్రాయిడ్ల చికిత్స కొరకు, మీ హార్మోన్ల స్థాయిలను నియంత్రించడం కొరకు మందులు సిఫారసు చేయబడతాయి, తద్వారా వాటి ఎదుగుదల తగ్గిపోతుంది.

ల్యూప్రోలిడ్ (లెప్రాన్)తో సహా గ్లోనాడోట్రోఫిన్ విడుదల చేసే హార్మోన్ (జీఎన్ ఆర్ హెచ్) అగోనిస్టులు ఈస్ట్రోజెన్ మరియు ప్రొజెస్టిరాన్ హార్మోన్ల స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి.

సెట్రోరెలిక్స్ ఎసిటేట్ మరియు గానిల్రెలిక్స్ ఎసిటేట్ తో సహా జీఎన్ఆర్ హెచ్ అంటగోనిస్టులు కూడా ఫైబ్రాయిడ్లను కుదించడానికి సహాయపడతాయి.

ఋతుస్రావం మరియు నొప్పిని నియంత్రించడంలో సహాయపడే ఇతర ఎంపికలు కూడా ఉన్నాయి, అయితే అవి ఫైబ్రాయిడ్లను కుదించవు లేదా తొలగించవు. వీటిలో ఇవి ఉంటాయి:

1. గర్భనిరోధక మాత్రలు

2. ప్రొజెస్టిరాన్ హార్మోన్ విడుదల చేసే గర్భాశయాంతర పరికరం (ఐయూడి)

3. ఇబుప్రొఫీన్ తో సహా నొప్పి నుంచి ఉపశమనం కలిగించే చిట్టీ లేకుండా లభించే(వోటీసీ) యాంటీ ఇన్ఫ్లమేటరీ నొప్పిని తగ్గించే మందులు

శస్త్రచికిత్స-

శస్త్రచికిత్స ద్వారా ఎక్కువగా మరియు బాగా పెరిగిన వాటిని తొలగించవచ్చు. ఈ తొలగింపు ప్రక్రియను మయోమెక్టోమీ అంటారు, దీనిలో గర్భాశయాన్ని యాక్సెస్ చేసుకోవడానికి మరియు ఎదిగిన ఫైబ్రాయిడ్లను తొలగించడానికి పొత్తికడుపు భాగంలో పెద్ద గాటును పెడతారు. చిన్నగా గాటు పెట్టి, శస్త్రచికిత్స పరికరాలు మరియు కెమెరాని లోపలికి పంపించి కూడా లాప్రోస్కోపి చేయవచ్చు. అయితే శస్త్రచికిత్స తరువాత ఫైబ్రాయిడ్లు పెరిగే అవకాశం ఉంది.

ఈ ప్రక్రియ తరువాత కూడా, మీ పరిస్థితి తగ్గనట్లయితే మరియు ఇతర చికిత్సలు పనిచేయనట్లయితే, అప్పుడు మీ స్పెషలిస్ట్ హిస్టరెక్టొమి చేయవచ్చు. అయితే, ఈ ప్రక్రియలో భవిష్యత్తులో సహజంగా పిల్లల్ని కనకుండా మిమ్మల్ని నిషేధించే గర్భాశయాన్ని తొలగించడం ఇమిడి ఉంటుంది.

Uterine Fibroids, గర్భాశయం లో గడ్డలు.


Advise:

చాలా మంది నడివయస్సు స్త్రీలలో రక్తస్రావము ఒక సాధారణ సమస్య . నెలసరి 4-5 రోజులు ఏబాధాలేకుండ స్రవించే ఋతుస్రావము సహజమైనది . అది నొప్పితోనో , క్రమము లేకుండానో , అధికంగానో ఎక్కువరోజులు ఉంటే అది వ్యాధి లక్షణము . అందులొ ఎక్కువ రోజులు స్రవిస్తూ ... మనిషి నీరషం పడుతుంటే బహు కారణాలలో గర్భాశయం లో గడ్డలు (uterine fibroids) ఒక కారణం కావచ్చును . 


గర్భాశయంలో ఏర్పడే గడ్డలను యుటిరైన్‌ ఫైబ్రాయిడ్స్‌ అని అంటారు. యుటిరైన్‌ ఫైబ్రా యిడ్స్‌తో 15నుంచి 20శాతం బాధపడు తున్నారు.సాధారణంగా గర్భాశయ గడ్డలు 35 సంవత్సరాలు పైబడిన వారిలో ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. చికిత్స అనేది ఫైబ్రాయిడ్‌ సైజుని బట్టి అది ఏర్పడిన స్థానాన్ని బట్టి నిర్ణయించాల్సి ఉంటుంది. సంతానం కలుగని దంపతుల్లో స్త్రీలకు సంబంధించిన కారణాల్లో యుటిరైన్‌ ఫైబ్రాయిడ్స్‌ ముఖ్యకారణంగా ఉంటున్నది. సాధారణంగా ఈ వ్యాధి పిల్లలు కనే వయసులో ఉన్న వారిలోనే ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. 


గర్భాశయ గడ్డలు గర్భాశయ గోడలను ఆధారం చేసుకుని ఎదుగుతాయి. కేవలం గర్భాశయ కండరాల సహాయంతో వృద్ధి చెందుతూ, మిల్లీమీటర్‌ నుంచి సెంటీమీటర్‌ వరకూ పెరుగుతాయి. గర్భాశయ రక్తనాళాల నుంచి వీటి ఎదుగుదల ఆరంభమవుతుంది. మృదుకణ జాలంతో నిర్మితమై గులాబీ వర్ణంలో ఉంటాయి. వీటిని చుట్టూ కప్పి ఉంచి పొరల వంటి భాగం ఏమీ ఉండదు. ఈ ఫైబ్రాయిడ్స్‌ అనేవి ఒకటే ఉండి పరిమాణంలో పెద్దది ఉండొచ్చు. లేదాచిన్నచిన్న గడ్డల రూపంలో ఒకటి కంటే ఎక్కువగా కలిసి ఏర్పడవచ్చు. 


ఈవిధంగా ఏర్పడే గడ్డలు గర్భాశయ కుహరాన్ని శిథిలం చేస్తాయి. ఎందువల్ల ఫైబ్రాయిడ్స్‌ ఉన్నవారిలో సంతానం కలుగదంటే, సాధారణంగా గర్భాశయ గడ్డలు 4రకాలుగా ఉంటాయి. వాటిలో కార్నుయల్‌ ఫైబ్రాయిడ్‌గా పిలువబడే గడ్డల కారణంగా గర్భాశయ అంచుకు ట్యూబ్స్‌ను కలిసే భాగాన్ని మూసివేస్తాయి. అలాగే ఫలదీకరణ చెందిన అండం ఫైబ్రాయిడ్స్‌ పై (సబ్‌మ్యూకస్‌ ఫైబ్రాయిడ్స్‌)న పొదిగినట్లయితే ఎండోమెట్రియం కుదించుకుపోతుంది. తద్వారా గర్భాశయంలో ఎదగాల్సిన పిండానికి పోషణ సరిగ్గా అందకపోవడం వల్ల గర్భం దాల్చిన మొదటిరోజుల్లోనే అబార్షన్‌ అయి పోయే అవకాశాలు ఉంటాయి. 


కారణాలు : 

- ఈస్ట్రోజన్ హార్మోన్ల విడుదలలో హెచ్చుతగ్గులు.

- అధిక బరువు, ఊబకాయం.

- ఋతుచక్రం పది సంవత్సరాలకే ప్రారంభం కావడం.

- వంశపారపర్యంగా.


లక్షణాలు:

- రక్తస్రావం అధికమవడం, ఋతుస్రావం ఎక్కువ రోజులు ఉండటం, రక్తం ముద్దలుగా(బ్లడ్ క్లాట్స్) పడటం జరుగుతుంది.

- ఫైబ్రాయిడ్స్ వల్ల మూత్రాశయం మీద ఒత్తిడి పెరుగుతుంది. దీనివల్ల తరచుగా మూత్రానికి వెళ్లాల్సి వస్తుంది.

- మలాశయం మీద ఒత్తిడి వల్ల మలబద్ధకం ఏర్పడుతుంది.

- పెల్విక్ భాగంలో ఒత్తిడి పెరగటం వలన ఉదరమునకు కింది భాగములో బరువుగా అనిపిస్తుంది. నొప్పి ఉంటుంది.

- నడుము భాగము పెరగటం, ఉదరము రూపు మారిపోవడం జరుగుతుంది.

- సంతానలేమి ఉంటుంది.

- మత్తుగా ఉండటం, శ్వాసలో ఇబ్బంది, ఛాతీలో నొప్పి వంటి లక్షణాలు ఉంటాయి.

- ఋతుస్రావం ఆగిపోవడం లేక ఋతుస్రావం ఎక్కువ కావడం కనిపిస్తుంది.

- అధిక మెతాదులో రక్తస్రావం, తీవ్రమైన పొత్తికడుపునొప్పి వల్ల ఎమర్జెన్సీ చికిత్స అవసరమవుతుంది.

- ఫైబ్రాయిడ్స్‌ వలన రక్తహీనత, ఆయాసం, గుండెదడ మొదలైన లక్షణాలు కూడా ఉంటాయి. 


నిర్ధారణ:

- ఫిజికల్ ఎగ్జా/మినేషన్‌తో పాటు పెల్విక్ ఎగ్జామినేషన్ చేయడం ద్వారా ఫైబ్రాయిడ్స్‌ను గుర్తించవచ్చు.

- ట్రాన్స్‌వెజైనల్, పెల్విక్ అల్ట్రాసౌండ్ ఎగ్జామినేషన్ చేయడం ద్వారా గర్భాశయంలో ఏర్పడే కణితుల సంఖ్యను, సైజును, ఆకారాన్ని నిర్ధారించుకోవచ్చు. 


* ఎండోమెట్రియల్ బయాప్సీ : ఇందులో గర్భాశయం నుంచి కణాలను తీసుకొని పరిశీలించడం జరుగుతుంది. సర్వైకల్ ద్వారా చిన్న ఇనుస్ట్రుమెంట్‌ను ప్రవేశపెట్టి కణాలు సేకరిస్తారు. బయాప్సీ ద్వారా ఫైబ్రాయిడ్స్‌ను నిర్ధారించుకోవచ్చు.


* హిస్టరోస్కోపి : చిన్న ఫైబర్ ఆప్టిక్ కెమెరాను సెర్విక్స్ ద్వారా ప్రవేశపెట్టి గర్భాశయంను పరిశీలించడం జరుగుతుంది. 


* హిస్టరోసాల్ఫింజోగ్రఫీ : లోపలి నిర్మాణాలను పరిశీలించడానికి ఒకరకమైన రంగును గర్భాశయం, ఫాలోపియన్ ట్యూబ్‌లోకి ప్రవేశపెట్టి ఎక్స్‌రే తీయడం జరుగుతుంది. 


* లాప్రోస్కోపీ: ఫైబర్ఆప్టిక్ కెమెరాను ఉదరంలోకి ప్రవేశపెట్టి లోపలి ఉన్న భాగాలను పరిశీలించడం జరుగుతుంది. 


చికిత్స:

ఆల్ట్రాసౌండ్‌ స్కానింగ్‌ ద్వారా గర్భాశయ స్థానం, సైజు తెలుసుకోవచ్చు. ఫైబ్రాయిడ్స్‌ని శస్త్రచికిత్స ద్వారా తొలగించినప్పటికీ కొన్ని సందర్భాలలో మరలా ఫైబ్రాయిడ్స్‌ ఏర్పడుతున్నా వారూ లేక పోలేదు. ఫైబ్రాయిడ్స్‌ సైజులో పెద్దవిగా ఉన్నప్పుడు శస్త్రచికిత్స అవసరమవుతుంది. గర్భాశయగడ్డలు మిల్లీమీటర్‌ సైజులో ఉన్నప్పుడు ఔషధాల ద్వారా కరిగించవచ్చు.ఫైబ్రాయిడ్స్‌ ఉన్నప్పటికీ ప్రెగ్నెన్సీ వచ్చేఅవకాశం ఉంటుంది. కానీ తరుచుగా అబార్షన్‌ అయిపోయే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి. ఒక వేళ గర్భం నిలబడినప్పటికీ కొన్ని సార్లు పెరుగుతున్న గర్భంతో పాటు ఫైబ్రాయిడ్స్‌ కూడా పెరిగే అవకాశం లేకపోలేదు. 


ఫైబ్రాయిడ్స్ కి ఏ వైద్య విధానములోను మంచి చికిత్స లేదు . ఈ వ్యాది క్యాన్‌సర్ కాదు . క్యాన్‌సర్ గా మారె చాన్‌సు లెదు . ఫైబ్రాయిడలున్న స్త్రీలు ఎక్కువమంది ఏ బాధలు లేకుండా జీవితం గడిచిపోతుంది . కొద్దిమందికే పైన చెప్పిన బాధలు కలుగుతూ ఉంటాయి . బాధల నివారణ కోసం వాడిన మందులు ఫైబ్రాయిడ్స్ ని నయము చేయలేవు . 


1. ఓరల్ కాంట్రాసెప్టివ్స్ లేదా ప్రొగెస్టిన్స్ బహిస్ట బ్లీడింగ్ ను తగ్గించేందుకు ఉపయోగపడతాయి . ఫైబ్రాయిడ్స్ సైజు ను తగ్గించలేవు . NSAIDS నొప్పిని , రక్తస్రావాన్ని తగ్గిస్తాయి కాని ఫైబ్రాయిడ్ సైజు ను తగ్గించలేవు . 

2. Gn-RH agonists : గొనడొట్రోఫిన్‌ రిలీజింగ్ హార్మోన్‌ ... ఎస్ట్రోజన్‌ ... ప్రొజెస్ట్రోన్‌ ల తయారీని రెగ్యులేట్ చేస్తుంది కావున దాని lupron(Luprolide) , synarel(Nefarelin) వంటివి వాడడం వలన స్ట్రీ హాన్మోనులు తయారి తగ్గి ఫైబ్రాయిడ్ సైజు తగ్గే అవకాశము ఉంది .

3. Androgens : ఇవి మేల్ హార్మోన్స్ సంబంధించిన ... Danazole , testosterone వాడడం వలన ఫైబ్రాయిడ్ సైజు తగ్గే అవకాశము ఉంది . దానికున్న సైడు ఎఫెక్ట్స్ ...weight gain , acne , unwanted hair growth , deeper voice మున్నగునవి ఉంటాయి .

4. Hysterectomy : గర్భసంచిని తొలగించడం.

5. Myomectomy : abdominal , laparoscopic , hysteroscopic Myomectomy -- గర్భాశయ గడ్డలను తొలగించడం. రకరకాల పద్దతులున్నాయి . 


ఆయుర్వేదం లో చికిత్స :

గర్భాశయ గడ్డలుచిన్నవిగా ఉండి ఇతర వ్యాధులు అనుబంధంగా లేనపుడు ఆయుర్వేద చికిత్సద్వారా నయం చేయవచ్చు. కొంతమందిలో సర్జరీ చేసినప్పటికీ మరలా ఫైబ్రాయిడ్స్‌ ఏర్పడినవారిలో కూడా ఆయుర్వేద చికిత్స ద్వారా నివారించవచ్చు.కలబంద గుజ్జును ఆవునెయ్యితో కలిపి 10గ్రాముల మందును రోజుకు రెండుసార్లు తీసుకోండి. సప్తవింశతి గుగ్గులును పూటకు రెండుచొప్పున రెండుసార్లు భోజనం తర్వాత సేవించండి.దేవకాంచనపు పువ్వుల చూర్ణం, శొంఠి చూర్ణం రోజుకు రెండు పర్యాయాలు 5గ్రాముల చొప్పున తేనెతో కలిపి సేవించండి.మజ్జిగ, నీరు ఎక్కువగా సేవించాల్సి ఉంటుంది. ఫైబ్రాయిడ్స్‌ చికిత్స వైద్యుల సలహా మేరకు మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. సొంతవైద్యం ఇతరత్రా సమస్యలు తలెత్తవచ్చు. 


హోమియో చికిత్స:

గర్భాశయంలో కణితి ఉండి లక్షణాలు లేకపోయినా, సైజు తక్కువగా ఉన్నా, మెనోపాజ్ దశలో ఉన్నా చికిత్స అవసరం లేదు. ఫైబ్రాయిడ్స్ వల్ల రక్తస్రావం అవుతూ ఉన్నప్పుడు గర్భాశయంను డీఅండ్‌సీ పద్ధతి ద్వారా క్లీన్ చేయాల్సి ఉంటుంది. ఫైబ్రాయిడ్స్ క్యాన్సర్‌కి సంబంధించినవి కాకపోతే హార్మోనల్ మెడికేషన్ ద్వారా రక్తస్రావాన్ని అరికట్టవచ్చు. 


హోమియో మందులు:

* కాల్కేరియా కార్బ్ : గర్భాశయంలో కణితులు, ఋతుస్రావం త్వరగా రావడం, ఎక్కువ రోజులు ఉండటం, రక్తహీనత, తలనొప్పి, ఉదరం కింది భాగంలో నొప్పి, వికారం, వాంతులు, తల, మెడపైన చెమటలు, మలబద్ధకం తదితర లక్షణాలు ఉన్నవారికి ఈ మందు బాగా ఉపకరిస్తుంది. కాల్కేరియా ఫ్లోర్ : ఋతుస్రావం ఎక్కువగా కావడం, నిద్రలేమి, మలబద్ధకం, నడుం నొప్పి, డిప్రెషన్, ఉదరం కింది భాగంలో నొప్పి, తొడ భాగంలో నొప్పి, విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు సమస్య ఎక్కువ కావడం వంటి లక్షణాలు ఉన్న వారికి ఇది దివ్యౌషధం. 


* సెపియా : ఋతుస్రావం త్వరగా రావడం, కొన్నిసార్లు ఆలస్యంగా రావడం, ఋతుచక్రానికి, ఋతుచక్రానికి మధ్యలో రావడం, శ్వాసలో ఇబ్బంది, నాభి వరకు నొప్పి, వాసనను భరించలేకపోవడం, ఏపనీ చేయాలనిపించకపోవడం, జుట్టు రాలడం, తలనొప్పి, పచ్చళ్లు, స్వీట్లను ఇష్టపడుతుండటం వంటి లక్షణాలు ఉన్నప్పుడు ఈ మందు ఉపయోగించవచ్చు. 


* ఫాస్పరస్ : గర్భాశయంలో కణితులు, తరచుగా రక్తస్రావం కావడం, గర్భాశయ క్యాన్సర్, ఎడమ వైపు పడుకుంటే నొప్పి ఎక్కువ కావడం, చల్లని నీరు తాగాలని అనిపించడం, ఐస్‌క్రీమ్స్, ఉప్పును ఇష్టపడటం వంటి లక్షణాలకు ఈ మందు వాడవచ్చు. 


* క్రొటాలస్ : గర్భాశయంలో కణితులు, రక్తస్రావం, వాసన ఉండటం, రక్తహీనత, ఉదరం కింది భాగంలో నొప్పి, చర్మం పొడి బారడం, కుడి వైపున నొప్పి ఎక్కువగా ఉండటం, సాయంత్రం, ఉదయం పూట, పడుకుని లేచిన తరువాత సమస్యలు ఎక్కువ కావడం వంటి లక్షణాలు ఉన్న వారు వాడదగిన మందు. 


* థలాస్పిబర్సా: గర్భాశయంలో నొప్పి, అధిక రక్తస్రావం, వాంతులు, రక్తం ముద్దలుగా పడటం, ఋతుస్రావానికి ముందు తెల్లని స్రావం కావడం, వాసన ఉండటం, మూత్రాశయ సమస్యలు వంటి లక్షణాలు ఉన్నప్పుడు ఈ మందు వాడవచ్చు. 


* టర్‌బెంథిన : గర్భాశయ కణితులకు వాడదగిన ముఖ్యమైన మందు. అధిక రక్తస్రావం, మూత్రాశయ సమస్యలు, మూత్రంలో రక్తం, జీర్ణాశయ సమస్యలు, విరేచనాలు రక్తంతో రావడం, సంగా వంటి లక్షణాలు ఉన్నప్పుడు వాడదగిన మందు.


మీరు మాతో చేరవచ్చు టెలిగ్రామ్ లో https://t.me/HelathTipsbyNaveen

మీ గర్భం మరియు సంతానోత్పత్తి ప్రశ్నల కోసం ఈ రోజు దేశంలోని ఉత్తమ సంతానోత్పత్తి నిపుణుల బృందంతో మాట్లాడండి.

Call now :- 18003092323

ధన్యవాదములు 🙏

మీ నవీన్ నడిమింటి

విశాఖపట్నం

ఫోన్ -9703706660


కామెంట్‌లు లేవు: