29, జనవరి 2022, శనివారం

ప్రెగ్నెంట్ సమయంలో ఆరోగ్యం సమస్య పై అవగాహనా కోసం


ప్రెగ్నెన్సీ సమయంలో అడిగేందుకు.. ఇబ్బందిపడే సందేహాలకు సమాధానాలివిగో..!అవగాహనా కోసం నవీన్ నడిమింటి సలహాలు 
ప్రెగ్నెన్సీ సమయంలో అడిగేందుకు.. ఇబ్బందిపడే సందేహాలకు సమాధానాలివిగో..!

ప్రెగ్నెన్సీ (Pregnancy) అనేది ఒక మహిళ జీవితంలో ఎంతో ముఖ్యమైన దశగా చెప్పుకోవచ్చు. ఓ బిడ్డకు జన్మనివ్వబోతున్నా అన్న విషయం ప్రతి మహిళకూ ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. అయితే ప్రెగ్నెన్సీ సమయంలో తలెత్తే ఎన్నో సందేహాలు దాన్ని అంతే ఇబ్బందికరమైన దశగా కూడా మారుస్తాయి. సాధారణంగా అయితే ప్రెగ్నెన్సీ సమయంలో మీకున్న ప్రతి సందేహాన్ని డాక్ట‌ర్‌తో పంచుకొని వారి సలహా తీసుకోవడం ఎంతో అవసరం.

అయితే కొంతమంది సిగ్గుతో డాక్టర్‌ని కొన్ని రకాల ప్రశ్నలు అడిగేందుకు ఇబ్బందిపడుతుంటారు. అలాంటి కొన్ని ప్రశ్నలను ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్ కోరాలో ఎనానిమస్ (అపరిచిత వ్యక్తి) పేరుతో కొందరు పంచుకున్నారు. ప్రెగ్నెన్సీ సమయంలో తీసుకొనే పలు నిర్ణయాలు  సరైనవేనా? ? కొన్ని పదాలకు అర్థం ఏంటి? కొన్ని అత్యవసర పరిస్థితులలో ఏం చేయాలి? లాంటి కొన్ని ప్రశ్నలకు(questions) నిపుణులను అడిగి మీకు సమాధానాలను మేం అందిస్తున్నాం.. ఓసారి చదివేయండి.

gf

 

ప్రశ్న : ప్రెగ్నెన్సీ సమయంలో ట్యాటూ వేయించుకోవడం మంచిదేనా?

జవాబు: ఈ రోజుల్లో ట్యాటూ వేయించుకోవడం పెద్ద ఫ్యాషన్‌గా మారిపోయింది. దీన్ని వేయించుకునే పద్ధతులు కూడా సురక్షితమైనవి రావడంతో  పెద్దగా ఎలాంటి ఇబ్బంది కూడా తలెత్తడం లేదు. కానీ ప్రెగ్నెన్సీ సమయంలో మాత్రం ముందు జాగ్రత్తగా ట్యాటూలకు దూరంగా ఉండడం మంచిది. సాధారణంగా కొందరికి ట్యాటూలు వేయించుకోవడం వల్ల ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. గర్భం ధరించిన మహిళలకు అలాంటి ఇన్ఫెక్షన్ సోకితే అది పిల్లలకు కూడా అంటుకునే ప్రమాదం ఉంటుంది. కాబట్టి దీనికి దూరంగా ఉండాలి.

wine

ప్రశ్న: ప్రెగ్నెన్సీ సమయంలో మద్యం తాగొచ్చా? దీనివల్ల కడుపులోని బిడ్డకు ఏదైనా ప్రమాదం జరుగుతుందా?

జవాబు : నిపుణుల సలహా మేరకు గర్భం ధరించిన తర్వాత తొమ్మిది నెలల పాటు ఏమాత్రం మద్యం తీసుకోకుండా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందట. గర్భం ధరించిన మహిళలు మద్యం తాగడం వల్ల ఫీటల్ ఆల్కహాల్ స్పెక్ట్రం డిజార్డర్ సమస్య వచ్చే ప్రమాదం ఉంటుందట. దీని వల్ల బిడ్డ పుట్టిన తర్వాత ఎన్నో ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందుకే గర్భం ధరించిన తర్వాత వెంటనే మద్యం మానేయడం మంచిది.

 hiv2

ప్రశ్న: ప్రెగ్నెన్సీ సమయంలో సెక్స్‌లో పాల్గొనడం సురక్షితమేనా?

జవాబు : సాధారణంగా ప్రెగ్నెన్సీ సమయంలో సెక్స్‌లో పాల్గొనడం వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవు. కానీ ఈ విషయంలో మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిది. ప్రెగ్నెన్సీ సమయంలో ఆఖరి రెండు నెలల పాటు సెక్స్ కి దూరంగా ఉంటే మంచిదని నిపుణుల సూచన. ఎందుకంటే దీనివల్ల గర్భాశయ ముఖద్వారంపై ఒత్తిడి పడి.. సమయం కంటే ముందుగానే డెలివరీ అయిపోయే ప్రమాదం ఉంటుంది. లేదా గర్భంలో ఉన్న బిడ్డ పై ప్రభావం పడే అవకాశం కూడా ఉంటుంది. అందుకే కేవలం సెక్స్‌ని మాత్రం పక్కన పెట్టి మిగిలిన మార్గాల్లో రొమాన్స్ చేసుకోవచ్చు అని నిపుణులు చెబుతున్నారు.

sex3

ప్రశ్న : ప్రెగ్నెన్సీ రావడానికి ఎన్నిసార్లు సెక్స్ చేయాల్సి ఉంటుంది?

జవాబు : ప్రెగ్నెన్సీ రావడానికి రోజూ ఇన్నిసార్లు సెక్స్ చేయాలని నియమమేమీ లేదు. కానీ సరైన సమయంలో సెక్స్ చేయడం వల్ల గర్భం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సాధారణంగా పురుషుల్లో వీర్య కణాల సంఖ్య ఎప్పుడూ ఒకేలా ఉంటుంది. కానీ మహిళల్లోనే ఎప్పుడుపడితే అప్పుడు కాకుండా నెలలో ఓ కచ్చితమైన సమయంలో మాత్రమే అండం విడుదలవుతుంది.

మీరు ఈ సమయం ఎప్పుడో తెలుసుకొని ఆ సమయంలో కలిస్తే చాలు.. గర్భం ధరించేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సాధారణంగా మీకు 28 రోజులకు ఒకసారి నెలసరి వస్తుంటే అండం విడుదలయ్యే రోజు మీ రుతుస్రావం ప్రారంభమైన మొదటి రోజు నుంచి పద్నాలుగో రోజుగా చెప్పుకోవచ్చు. ఈ రోజున సెక్స్‌లో పాల్గొనడం వల్ల ప్రెగ్నెన్సీ రావడానికి ఎక్కువ అవకాశాలుంటాయి.

MS63fRth 453

ప్రశ్న: సెక్స్ సమయంలో శీఘ్ర స్కలనం వల్ల గర్భధారణ పై ఏదైనా ప్రభావం ఉంటుందా?

జవాబు : చాలామంది భార్యాభర్తల మధ్య ఈ విషయం గొడవకు కారణవుతుంటుంది. కానీ శీఘ్రస్కలనం గర్భధారణ అవకాశాలపై ఏమాత్రం ప్రభావం చూపించదు. మీ భాగస్వామి సెక్స్ ఎలా చేస్తున్నాడనే విషయం కంటే వీర్యస్కలనం అయిందా.. ఆ వీర్య కణాలు అండంతో కలిసాయా? లేదా? అన్నదే గర్భధారణకు ముఖ్యం. అయితే వీర్య కణాల ఆరోగ్యం మాత్రం గర్భధారణ అవకాశాలు.. పుట్టే పిల్లల ఆరోగ్యం పై ప్రభావం చూపుతుంది.


*గర్భిణీ స్త్రీలు తినవలసిన ఆహరం ఏమిటి?అవగాహనా కోసం నవీన్ నడిమింటి సలహాలు*

గర్భిణీ స్త్రీలు తినవలసిన ఆహారం ఏమిటంటే, పోషకాహారం అన్నీ తినవచ్చు, డ్రై ఫ్రూట్స్, పళ్ళు, కూరగాయలు. కొంతమందికి వాంతులు అయినా కూడా తినాలి అనిపించకపోయినా తప్పనిసరిగా తినాలి, ఎందుకంటే ఎదుగుదల ముఖ్యం కాబట్టి. కానీ పచ్చళ్ళు లాంటివి తినకూడదు, ఎందుకంటే బీపీ పెరిగితే రేపు పురిటికి కష్టమవుతుంది, కానీ రోటి పచ్చడి అయితే తినవచ్చు కారం కొంచెం ఉప్పు కొంచెం తక్కువ చేసి తినవచ్చు ఉన్న గర్భిణీ స్త్రీ అయితే ఇందులో కొన్ని పళ్ళు, తినకూడదు. నేను చెప్పేది శాఖాహారులకు మాత్రమే, కాళ్ళకి నీరు పట్టే వాళ్ళు బార్లీ గింజలు ఉడకబెట్టుకుని పొద్దున్నే తాగాలి, మామూలుగా ఉన్నప్పుడు కంటే గర్భిణీగా ఉన్న స్త్రీ ఎక్కువ పాలను తీసుకోవాలి.


*పళ్ళు*


1. దానిమ్మ. 2. ద్రాక్ష.


3. సపోటా. 4. యాపిల్ రెండు రంగులు తినవచ్చు


5. నల్ల ద్రాక్ష. 5. నారింజ.


6. సీతాఫలం. 7. కివి ఫ్రూట్


8. పనసకాయ. 9. జామ పండు.


10. పుచ్చకాయ. 11. పంపరపనస.


12. మామిడి పండు. 13. అరటిపండు


14. కమలా పండు. 15. కీరా దోసకాయ.


16. బత్తాయి.


*కూరగాయలు*


1. మామిడికాయ,.2. దోసకాయ


3. బీరకాయ . 4. పొట్లకాయ


5. దొండకాయ. 6. బెండకాయ


7. కాకరకాయ. 8. వంకాయ్ చాలా రకాలు ఉన్నాయి అన్నీ తినొచ్చు


9. మునక్కాయ. 10. క్యాప్సికం చాలా కలర్స్ ఉన్నాయి అన్ని కలర్ క్యాప్సికం తినొచ్చు.


11. ఆనపకాయ. 12. గుమ్మడి కయ అయితే తినకూడదట.


13. ముల్లంగి. 14. టమాటా


15. చిక్కుడు కాయలు రెండు రకాలు చిక్కుడుకాయలు తినవచ్చు


16. ఉల్లిపాయలు తినవచ్చు, ఉల్లికాడలు కూడా తినవచ్చు.


17. క్యారెట్. 18. బీట్ రూటు ఈ రెండు చాలా ఎక్కువగా తినాలి ఎందుకంటే దీనివల్ల రక్తం పెంపొందించి పురిటి టైంలో చాలా అవసరం పడుతుంది.


19. పనసపొట్టు


*ఆకుకూరలు*


1. తోటకూర 2 . పాలకూర.


3. గోంగూర.4. కరివేపాకు.


5. కొత్తిమీర.6. పొదీనా.


7. బచ్చలి కూర. 8. చుక్కకూర.


9. మునగాకు.


*డ్రై ఫ్రూట్స్*


1. జీడిపప్పు. 2. బాదంపప్పు నానబెట్టుకుని తర్వాత పొద్దున్నే తొక్క కొలుచుకుని తింటే పుట్టే బిడ్డకు బ్రెయిన్ షార్ప్ గా ఉంటుంది


3. పిస్తా. 4. అక్రూట్ తింటే తల్లికీ బిడ్డకీ కూడా గుండె పదిలంగా ఉంటుంది


5. అంజీర. 5. కిస్ మిస్.


6. ఖర్జూరం.


7. ఎండు ఖర్జూరం రాత్రి నానబెట్టుకుని పొద్దునే ఆ నీళ్లు తాగితే ఎండా ఆ ఈ సమయంలో తల్లికి డీహైడ్రేషన్ రాకుండా ఉంటుంది.

మీ సమస్య లకు ఆయుర్వేద అల్లోపతి పరిష్కారం ఉచితంగా ఇస్తాను.మీ రిపోర్ట్స్ పంపినట్లు అయితే మీకు ఏ సమస్యలు ఉన్నాయో తెలియజేస్తాను.ఈ గ్రూప్ లో మీ స్నేహితులకు add చెయ్యండి.

https://t.me/joinchat/L0NFDxIWFfKwzpAYwRV5sA

ఇవి కూడా చదవండి

ధన్యవాదములు 🙏

మీ నవీన్ నడిమింటి

విశాఖపట్నం

ఫోన్ -9703706660

కామెంట్‌లు లేవు: