సయాటికా నొప్పి నివారణకు నవీన్ నడిమింటి ఆయుర్వేదం వైద్యం సలహాలు
సయాటికా ఆయుర్వేద వైద్యం
తుంటి నుండి వెనుకవైపు, ప్రక్కల విపరీతమయిన నొప్పి, తిమ్మిరిగా ఉండటం, రెండు కాళ్ల కండరాలు బలహీనపడటం, సూదులు పొడిచినట్లుండటం, అశాంతి ఇవి సైయాటికా నొప్పిని సూచిస్తాయి. అసలు సయాటికా అనేది మన శరీరంలో అతి పెద్ద నరం. ఇది నడుం నుండి పిరుదుల వెనుకకు ఉంటుంది. ఇది వెన్నుపూసలలో చివర ఉన్న నాలుగు అయిదు లంబారు పూసలు మొదటి సేక్రల్ పూసల మధ్య నుండి వెలువడి సేక్రల్‌ప్లెగ్జేస్ అనే నరాల కూటమి నుండి వచ్చి నడుం కింద భాగాలని, తొడలు, కాళ్లు, అరికాళ్లు వీటిలో కదలికని, స్పర్శని కలుగచేస్తుంది.
ఇది శరీరంలో అత్యంత బలమైన నరం. దీనికి రెండు ఉపనరాలు అనుసంధానంగా ఉంటాయి. అవి కామన్ పెరోనియల్, టిబియల్ అనేవి. ఇవి మోకాలు కింద కండరాలని పాదాలు కాలివేళ్ల కండరాలకి స్పర్శని, కదలికని కలుగచేస్తుంది. ఆధునిక వైద్య శాస్త్ర రీత్యా సైయాటికా అంటేనే సయాటికా నరానికి వచ్చిన లోపాల వల్ల వచ్చే నొప్పి అని నిర్వచించవచ్చు. ఈ నరం చుట్టూ ఉన్న పొర వాయటం వల్ల కాని, నరాల మూలంపై ఏదైనా ఒత్తిడి కాని కారణం కావచ్చు. నిజానికి ఇప్పటి వరకూ ఈ నొప్పికి మందులంటూ ఏమీ లేవ్ఞ. పూర్తి విశ్రాంతి తప్ప సంపూర్ణ చికిత్స అనేది లేదు.
సైయాటికా ఆయుర్వేదంలో గృధ్రశీ వాతం అంటారు. వాతమంటే మన కదలికలకి కారణమైన నరాల శక్తి. అది గృధ్రశ్రీ నరాన్ని దెబ్బతీస్తే దాని వల్ల వచ్చే నొప్పి కనుక గృధ్రశీ వాతమంటారు. నాటి శాస్త్రజ్ఞులు శరీరాన్ని నడిపించే మూడు శక్తుల కారణంగా శరీరం, మనస్సు, ఆత్మ ఏ బాధా లేకుండా ప్రసన్నంగా ఉంటే ఆరోగ్యమని, అందులో ఏ శక్తికైనా మార్పులొస్తే వ్యాధి అని అంటారు. అలాగే ఎక్కువా ఎండిపోయిన నిలువ ఉన్న ఆహారం తినటవ వల్ల, ఎక్కువగా ఇష్టం వచ్చినట్లు చరించడం వల్ల మానసికంగా ఎప్పుడూ చింతిస్తూ ఉండటం వల్ల, దెబ్బలు తగలడం వల్ల ఈ గృధ్రశీ నరం పాడై విపరీతమయిన నొప్పి, తిమ్మిరి ఎక్కడం, గట్టిగా నొక్కి పట్టుకుంటే కాస్త తగ్గినట్లుండటం వంటివి కనిపిస్తాయి.
సాధారణంగా నొప్పి నడుం చివర భాగంలో ఆరంభమై తొడల లోపలి భాగంలోకి ప్రాకి మోకాళ్ల కిందకి జారి పిక్కలకు చేరి మొత్తం కాలుతో ఆరంభమై విపరీతంగా లాగినట్లు బాధ ఉంటుంది. కాళ్లు కదపడం కూడా కష్టం అవ్ఞతుంది. మొత్తానికి ఈ నొప్పి తిమ్మిరితో కూడి సూదులు పొడిచినట్లు ఉండి ఒక్కొక్కప్పుడు కళ్లలో నీళ్లు వస్తాయి. నిజానికి ఎటువైపు ఉంచినా నొప్పి తగ్గినట్లు అనిపించదు. దీని నివారణ ఆయుర్వేదంలో రెండు రకాలుగా చెప్పబడింది. ఒకటి – కారణాన్ని సరిచేయడం, రెండవది వచ్చిన స్థితిని క్రమపరచడం. మొదట శరీరం అంతా నువ్వుల నూనెతో కాని ధన్వంతరీ తైలంతో గాని ముఖ్యంగా నడుం నుంచి కిందకీ బాగా రాసి సున్నితంగా మర్దన చేసిన తర్వాత చెమట పట్టేటట్లు స్వేదన క్రియ చేసి లోపల దోషాలని బయటకు పంపాలి. అలాగే వారానికి ఒక్కసారి ఎనిమా చేసుకోవడం కూడా అవసరం.
దీన్ని ఆయుర్వేద చికిత్సలలో వస్తి అంటారు. సాధారణంగా మాంసరసం, ఉసిరిక రసం చాలా ఉపయుక్తంగా ఉంటాయి. వెల్లుల్లి, నిర్గుండి, త్రిఫల చూర్ణం, రాస్నా వంటివి ఉపయుక్తంగా ఉంటాయి. త్రయోదశాంగ గుగ్గులు, వాతగజంకుశరసం, బృహత్‌వాత చింతామణి, రాస్నాది కషాయం, యేరండస్నేహం వంటివి చక్కటి మందులు. నీరుల్లిపాయల రసం, ఆవనూనె సమభాగాలుగా తీసుకుని కలిపి పైన మర్దన చేసుకుంటే చాలా శాంతిగా ఉంటుంది. నీరుల్లిపాయ రసం, అల్లపురసం, తేనె సమభాగాలుగా తీసుకుని పూటకు రెండు చెమ్చాల చొప్పున తీసుకుంటే నొప్పి తగ్గుతుంది.
ఈ వాత వ్యాధులలో మనం ఆవాతాన్ని అంటే ఆ నరంలో మారిన శక్తిని సమపరిచే ఆహారం తీసుకుంటే తొందరగా మందు పనిచేసి తగ్గుతుంది. అలాగే ఆ వ్యాధిని పెంచే పదార్థాలు తినకుడా ఉంటే వ్యాధి తొందరగా తగ్గుతుంది. బూడిదగుమ్మడికాయ, మినుములు, వంకాయ, ములగకాయ, కాకరాకాయ, చక్రవర్తి కూర, నల్ల ఉలవలు, గోధుమలు, చేమ, పొట్ల,ముల్లంగి, జీలకర్ర, ఇంగువ, కంద వేడినీళ్లతో అభ్యంగనస్నానం పథ్యము, అలాగే చల్లటి నీళ్లు, దోసకాయ, ఆనపకాయ, సొరకాయ, పెసలు, అమము, ఆవాలు, వేపపండ్లు, కొత్తధాన్యం, ఉపవాసం, బీరకాయ, చల్లటి ప్రదేశాలకు వెళ్లడం అపథ్యము. విషయిష్ట తైలం, బలాతైలం, క్షారబలాతైలం, బలాశృగంధతైలం, ధన్వంతరీ తైలం, కర్పూరతైలం, వీటిలో ఏదైనా సాయంత్రం మర్దన చేసుకుని వేన్నీళ్లతో స్నానం చేయడం హితకరం. విడంగాసవం ఉదయం, సాయంత్రం మూడు చెమ్చాలు మందు, మూడు చెమ్చాల నీరు కలిపి తీసుకుంటే కడుపులో ఉన్న క్రిములన్నీ వెళ్లిపోతాయి. అల్లం 50 గ్రాములు, పంచదార 50 గ్రాములు కలిపి నూరి రోజూ రెండు సార్లు గోరువెచ్చటి నీళ్లతో తీసుకుంటే చాలా హితకరం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి