చేతులు,కాళ్ళు తిమ్మిరులు పెట్టె సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ ఒక్క చిట్కా పాటించండి
మీ మెదడు లేదా వెన్నుపాములో సమస్యల వల్ల తిమ్మిరి సంభవించవచ్చు. అయినప్పటికీ అలాంటి సందర్భాలలో చేయి లేదా కాళ్ళు,చేతి బలహీనత లేదా పనితీరు కోల్పోవడం కూడా జరుగుతుంది. తిమ్మిరి సాధారణంగా స్ట్రోకులు లేదా కణితులు,గడ్డలు వంటి ప్రాణాంతక రుగ్మతలతో సంబంధం కలిగి ఉండచ్చు.మీ తిమ్మిరి కారణాన్ని నిర్ధారించడానికి మీ డాక్టర్కి మీ లక్షణాల గురించి సమాచారం అవసరం. తగిన చికిత్స ప్రారంభించటానికి ముందు కారణాన్ని నిర్ధారించడానికి అనేక రకాల పరీక్షలు అవసరం కావచ్చు. మీ చేతుల్లో, కాళ్ళలో తిమ్మిర్లుకు ఈ కింద వ్యాధులు కారణం కావచ్చు.
మెదడు మరియు నాడీ వ్యవస్థకు గాయాలు, ఓకే చోట కూర్చుని ఉన్నా, గర్భాశయ స్పాండిలోసిస్, థైరాయిడ్ సమస్యలు అలాగే కిడ్నీ వ్యాధులు, గుల్లెయిన్-బారే సిండ్రోమ్, రక్తప్రసరణ లోపాలు, పరిధీయ నరాలవ్యాధి, అధికబరువు, కాల్షియం లోపాలు, నరాలు ఓవర్లోడ్ అవడం, వెన్నుపూసకు గాయము, స్ట్రోక్, , బ్రాచియల్ ప్లెక్సస్ గాయం, దీర్ఘకాలిక ఆరోగ్యపరిస్థితులు, ఆల్కహాల్ యూజ్ డిజార్డర్, అమిలోయిడోసిస్, డయాబెటిస్, అంటు వ్యాధులు, లైమ్ వ్యాధి, సిఫిలిస్, దీర్ఘకాలిక వ్యాధుల చికిత్స దుష్ప్రభావాలు, కెమోథెరపీ లేదా హెచ్ఐవి ఔషధాల దుష్ప్రభావాలు, విటమిన్ బి -12 లోపం అలాగే మెగ్నీషియం, పొటాషియం లోపం. నరాల వ్యవస్థ పనితీరును మెరుగుపరిచేది బి12 విటమిన్. బి12 లోపం వలన నరాలు సరిగ్గా పనిచేయవు. నరాల వ్యవస్థ శరీరమంతా వలయంలా వ్యాపించి ఉంటుంది. ఈ నరాలపై పొర బలహీన పడి నరాలుకూడా బలహీనంగా తయారవుతుంది.
దీనివలన కాళ్ళు, చేతులే కాకుండా శరీరంలో ఇతర భాగాలు కూడా తిమ్మిర్లు రావచ్చు. ఆహరంలో శరీరానికి తగిన బి12 అందడం లేదని అర్థం. కొన్నిసార్లు బి12 ఎక్కువగా అందినా శరీరం ఆ రోజుకి సరిపడా తీసుకుని మూత్రం, చెమట ద్వారా మిగతావి బయటకు పంపేస్తుంది. అందువలన రోజూ బి12 తీసుకోవాలి. దీనికోసం ఆపిల్ సిడార్ వెనిగర్ తీసుకోవాలీ. కాళ్ళు చేతులను ధృడంగా మార్చి జీర్ణక్రియను మెరుగుపరిస్తుంది. ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో రెండుస్పూన్ల ఆపిల్ సిడార్ వెనిగర్ వేసి కలిపి తాగాలి. మళ్ళీ సాయంత్రం పూట కూడా ఇలాగే తాగాలి. ఇలా రోజూ నెలరోజుల పాటు తీసుకోవాలి. బి12 కోసం రోజూ తీసుకోవాల్సిన ఆహారం మాంసం, పాలు, చేపలు, గుడ్లు, పన్నీర్లో బి12 పుష్కలంగా లభిస్తుంది. మీరు శాఖాహారులు అయితే పాలు, పాలసంబంధ పదార్థాలు ద్వారా బి12 లభిస్తుంది. అలాగే రోజూ కొంత వ్యాయామం, నడక వలన కూడా కాళ్ళు చేతులు ధృడంగా అయి తిమ్మిర్లు సమస్య తగ్గుతుంది.
మరింత సమాచారం కోసం క్రింద లింక్ చూడండి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి