8, జనవరి 2020, బుధవారం

శరీరానికి కాల్షియం ఎంత అవసరం. మీ వయసును బట్టి కాల్షియం అవసరమయ్యే స్థాయిల గురించి ఇక్కడ తెలుపబడింది


కాల్షియం లోపం అంటే ఏమిటి?

మన శరీరంలో 99 శాతం కాల్షియం దంతాలు మరియు ఎముకల రూపంలో గట్టి కణజాలం వలె నిల్వ చేయబడి ఉంది. కాల్షియమ్ అనేది మన శరీరంలో ఓ కీలక పోషకపదార్థం.  నరాలద్వారా సందేశాలు పంపేటువంటి కీలక శరీరవిధులకు కాల్షియమ్ చాలా అవసరం. ఇంకా, హార్మోన్ల స్రావం, కండరాలు మరియు నరాల సంకోచ,వ్యాకోచాలకు కాల్షియం యొక్క అవసరం ఉంటుంది. మరీ ముఖ్యంగా, అస్థిపంజర పనితీరుకు కాల్షియమ్ మద్దతుగా నిలుస్తుంది.

కాల్షియం లోపాన్నే “హైపోకాల్సీమియా” అని కూడా అంటారు. హైపోకాల్సామియాకు చికిత్స తీసుకోకపోతే “ఓస్టియోపేనియా” అనబడే ఎముకలు సన్నబడిపోయే (ఒస్టోపీనియా) వ్యాధి, పిల్లల్లో బలహీనమైన ఎముకలు (రికెట్స్) మరియు ఎముక సాంద్రత కోల్పోయే వ్యాధి (బోలు ఎముకల వ్యాధి) వంటి తీవ్రమైన సమస్యలను లేవనెత్తుతుంది. కాల్షియం లోపం వ్యాధిలో ఉత్తమాంశం ఏమంటే ఇది ఆహార అలవాట్లను మార్చుకోవడంవల్ల నయమవుతుంది.

దీని సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

ప్రారంభ దశల్లో కాల్షియం లోపం రుగ్మతను గుర్తించడం కష్టం. అయితే, వ్యాధి పరిస్థితి మరింతపురోగతి చెందుతూ ఉంటే కొన్ని వ్యాధిలక్షణాలు గుర్తించబడతాయి.

రుగ్మత ప్రారంభ లక్షణాలు:

  • వేళ్లు, పాదాలు, మరియు కాళ్లలో తిమ్మిరి మరియు జలదరింపు
  • కండరాలలో తిమ్మిరి మరియు సంకోచం లేక ఆకస్మిక కండరాల ఈడ్పు లేక కండరాలు పట్టేయడం (మరింత చదువు: కండరాల సంకోచం చికిత్స)
  • బద్ధకం మరియు తీవ్రమైన అలసట కలగడం

దీర్ఘకాలిక కాల్షియం లోపం అనేక ఇతర శరీర భాగాలను బాధించవచ్చు. రుగ్మత పొడజూపినపుడు కనిపించే వ్యాధి లక్షణాలు:

  • తక్కువ తీవ్రతతో కూడిన బోలు ఎముకల వ్యాధి మరియు బోలు ఎముకల వ్యాధి- ఎముక ఫ్రాక్చర్లు ఏర్పడే స్వభావంతో కూడిన వ్యాధులు
  • దంత సమస్యలు-దంత మరియు ఎనామెల్ హైపోప్లాసియా, మొద్దుబారిన పళ్ళవేరు (tooth root) అభివృద్ధి, మరియు దంతాలు రావడంలో ఆలస్యం.
  • బలహీనమైన మరియు పెళుసుగా ఉండే గోర్లు
  • పొడిబారిన మరియు దురదపెట్టే చర్మం - తామర
  • డిప్రెషన్ అండ్ గందరగోళం
  • ఆకలి లేకపోవడం (మరింత సమాచారం: ఆకలి కోల్పోవడానికి కారణాలు)
  • అసాధారణ గుండె స్పందన (హృదయ లయలు) (మరింత సమాచారం: అరిథ్మియా నివారణ)
  • రక్తం ఆలస్యంగా గడ్డకట్టే వ్యాధి

క్యాల్షియం లోపానికి కారణాలు ఏమిటి?

కాల్షియం కనీస అవసరం ఒక వయోజనుడికి రోజుకు 700 mg మరియు వృద్ధులకు రోజుకు 1200 mg.

కాల్షియం లోపానికి గురయ్యే అధిక  ప్రమాదం ఉన్న జనాభాలు

  • మహిళలు, ముఖ్యంగా ముట్లుడిగిన మహిళలు
  • వృద్ధులు
  • కౌమారప్రాయపు వయస్కులు
  • పాలలో ఉండే లాక్టోస్ అనే పదార్ధం పడని వ్యక్తులు (లాక్టోస్ అసహనం కల్గిన వ్యక్తులు) .

కాల్షియం లోపం యొక్క కొన్ని సాధారణ కారణాలు క్రింది విధంగా ఉన్నాయి:

  • ఆహారం తీసుకోవడం చాలా తక్కువైపోవడం
  • సిలియాక్ వ్యాధి వంటి జీర్ణ రుగ్మతల వల్ల అపశోషణం (malabsorption)
  • పారాథైరాయిడ్ గ్రంథులు స్రవించే హార్మోన్ తక్కువైతే సంభవించు స్థితి (Hypoparathyroidism)
  • మెగ్నీషియం యొక్క హెచ్చు -తక్కువ స్థాయిలు
  • ఫాస్స్ఫేట్‌ యొక్క అధిక స్థాయిలు
  • ఫెనితోయిన్, ఫెనాబార్బిటల్, రిఫాంపిన్, కోర్టికోస్టెరాయిడ్స్ అలాగే కీమోథెరపీ మందులు వంటి మందులు సేవిస్తున్నవ్యక్తులు
  • సెప్టిక్ షాక్ (మరింత సమాచారం: సెప్సిస్ చికిత్స)
  • మూత్రపిండాల (కిడ్నీ) వైఫల్యం
  • పాంక్రియాటైటిస్
  • విటమిన్ D తక్కువ స్థాయిలు

క్యాల్షియం లోపం  రుగ్మతను ఎలా నిర్ధారణ చేస్తారు మరియు దీనికి చికిత్స ఏమిటి?

వైద్యుడు మొదట రోగులను క్లినికల్ ప్రదర్శన మరియు రోగనిర్ధారణ శాస్త్రం ఆధారంగా అంచనా వేస్తాడు. క్లినికల్ లక్షణాలను నిర్ధారించడానికి తదుపరి దశలో రోగాలక్షణ  పరీక్షలైన సీరం కాల్షియంస్థాయిల పరీక్ష, పారాథైరాయిడ్ హార్మోన్, సీరం ఫాస్ఫేట్, మెగ్నీషియం, 25-హైడ్రాక్సీవైటమిన్ D, మరియు 1,25-డైహైడ్రాక్సీ విటమిన్ డి స్థాయిలు పరీక్షించే పరీక్షలు. కాల్షియం-సెన్సింగ్ రిసెప్టర్ కోసం చేసే జన్యుమార్పిడి పరీక్ష చేయించమని డాక్టర్ వ్యక్తి ని అడగొచ్చు. క్యాల్షియం-సెన్సింగ్ రిసెప్టర్ అంటే “జి ప్రోటీన్ సబ్యునిట్ ఆల్ఫా 11”.

కాల్షియం ఫుష్కలంగా ఉండే ఆహారం తీసుకోవడంవల్ల కాల్షియం లోపం (హైపోకెక్సేమియా) రుగ్మతకు ఓ మంచి చికిత్సగా పని చేయడమే గాక ఈ రుగ్మత అసలు ఆ రుగ్మత రాకుండానే నిరోధిస్తుంది. కాల్షియం పుష్కలంగా ఉండే గొప్ప ఆహారపు వనరులు కొన్ని ఇలా ఉన్నాయి

  • పాలు మరియు ఇతర పాల ఉత్పత్తులు- చీజ్, పెరుగు, “యోగర్ట్” అనబడే పాలు పులియబెట్టి చేసిన పెరుగువంటి పదార్ధం మరియు పనీర్
  • కూరగాయలు- బచ్చలికూర మరియు పాలకూర (spinach), బ్రోకలీ, పప్పుధాన్యాలు, -బీన్స్ మరియు బఠానీలు
  • ధృఢమైన ధాన్యాలు, తృణధాన్యాలు
  • కాల్షియం అధికంగా ఉండే మినరల్ వాటర్
  • సముద్రం నుండి లభించే ఆహారపదార్థాలు (సీఫుడ్), కొవ్వు లేని మాంసాలు (lean meat) మరియు గుడ్లు
  • ఎండిన పండ్లు (నట్స్), విత్తనాలు, సోయా ఉత్పత్తులు- టోఫు అనబడే సోయాపాలతో చేసే పదార్ధం  

వైద్యుడు సూచించిన కాల్షియం సప్లిమెంట్ మందులు కాల్షియం స్థాయిలను మెరుగుపరచడంలో కూడా సహాయపడుతాయి. .

  • స్వీయ చికిత్సను నివారించండి
  • కాల్షియంను అధిక మోతాదుల్లో తీసుకోకండి, - ఎందుకంటే మోతాదును శరీర బరువును అనుసరించి ఇవ్వడం జరుగుతుంది.
  • హై మోతాదులకి డియోగోక్సిన్ టాక్సిక్టీని కలిగించవచ్చు, కాల్షియం లోపం రాత్రిపూట అభివృద్ధి చెందుతుంది, అందువల్ల తిరిగి రావడానికి సమయం పడుతుంది.
  • కాల్షియం మందులు కొన్ని మందులతో ప్రతిస్పందిస్తాయి  - రక్తపోటు మరియు కొలెస్ట్రాల్ ను తగ్గించే మందులు, యాంటీబయాటిక్స్ - టెట్రాసైక్లిన్ మరియు ఫ్లూరోక్వినోలోన్లతో కాల్షియం మందులతో సంఘర్షణ చెందుతాయి.

అదనంగా, వ్యక్తిగత పరిస్థితిని బట్టి కాల్షియం సూది మందులు అవసరం కావచ్చు.తీవ్రతను బట్టి, హైపోకాల్సీమియాకు పూర్తిగా చికిత్స చేయడానికి ఒక నెల నుంచి ఆరు నెలల వ్యవధి  పట్టవచ్చు.

క్యాల్షియం లోపం మందులు 

క్యాల్షియం లోపం నివారణ కు కొన్ని మందులు మీ డాక్టర్ సలహా మేరకు వాడాలి 

Medicine NamePack Size
GemcalGEMCAL LIQUID
CalcirolCalcirol 600000 IU Capsule
RenolenRenolen Eye Drop
Calvista K2CALVISTA K2 TABLET 10S
DexacalDEXACAL TABLET
Calcium + Calcitriol TabletCalcium 500 Mg + Calcitriol 0.25 Mg Tablet
Calcitriol + Calcium Carbonate + ZincCalcium Carbonate 500 Mg + Calcitriol 0.25 Mcg + Zinc 7.5 Mg Tablet
Calcium + Vitamin D3Calcium + Vitamin D3 250 IU Tablet
BasolBasol Solution
Dailycal OKDAILYCAL OK TABLET 15S
OsifortOSIFORT TABLET 30S
DisprinDISPRIN 325MG TABLET 10S
T ScoreT Score Kit
CatlonCatlon Drop
NelciumNelcium Injection
SterofundinSterofundin Iso Infusion
Caloday K2CALODAY K2 CAPSULE 10S
AlfacalcidolAlfacalcidol 0.25 Mcg Soft Gelatin Capsules
Vitalpha CVitalpha C Tablet
CalzomixCALZOMIX CAPSULE 10S
ResicaRESICA KIT 35/500MG/500IU TABLET 13S
AuxitrolAuxitrol Capsule
DevitaDevita 6 Lac Injection

అస్వీకార ప్రకటన: ఈ సైటుపై లభ్యమవుతున్న మొత్తం సమాచారము మరియు లేఖనము కేవలం అవగాహనా ఆవశ్యకతల కొరకు మాత్రమే. ఇక్కడ ఇవ్వబడిన సమాచారమును ఏదైనా ఆరోగ్య సంబంధిత సమస్య లేదా అస్వస్థత నుండి కోలుకోవడానికి లేదా స్వస్థత కొరకు నిపుణుల సలహా లేనిదే ఉపయోగించుకోకూడదు. చికిత్స పరీక్షలు మరియు సేవల కొరకు ఎల్లప్పుడూ ఒక అర్హత పొందిన వైద్యుల సలహా తీసుకోవాలి.


విరిగిన ఎముక నివారణ కు



ఎముకలు విరగడం (ఫ్రాక్చర్) అంటే ఏమిటి?

ఎముకలలో పగుళ్లు లేదా బీటలు ఏర్పడితే  వాటిని ఎముకలు విరగడం అని సూచిస్తారు. ఫ్రాక్చర్ (విరగడం) అనేది ఏ ఎముకనైనా ప్రభావితం చేయగలదు, అది పూర్తిగా లేదా పాక్షికంగా కావచ్చు. పరిసర కణజాలానికి హాని చేయని ఒక ఫ్రాక్చర్ ను క్లోజ్డ్ ఫ్రాక్చర్ (మూసి ఉన్న పగుళ్లు) అని పిలుస్తారు మరియు పరిసర కణజాలానికి  నష్టం కలిగించి మరియు చర్మాన్ని దెబ్బతీసే వాటిని ఓపెన్ ఫ్రాక్చర్ (బహిరంగ పగుళ్లుగా) అని పిలుస్తారు.

ఇతర రకాల ఫ్రాక్చర్లు:

  • స్థిరమైన ఫ్రాక్చర్ (Stable fracture)  - ఎముక యొక్క చివరలు ఎక్కువగా ఒకే చోట ఉంటాయి.

  • ట్రాన్స్వర్స్ ఫ్రాక్చర్ (Transverse fracture) - సమాంతర ఫ్రాక్చర్ రేఖ.

  • ఆబ్లిక్ ఫ్రాక్చర్ (Oblique fracture) - కోణ ఫ్రాక్చర్ రేఖ.

  • కోమిన్యూటెడ్ ఫ్రాక్చర్(Comminuted fracture) - ఎముకలు అనేక ముక్కలుగా విరిగిపోతాయి.

దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

ఎముక ఫ్రాక్చర్ల యొక్క మూడు సాధారణ లక్షణాలు

  • నొప్పి
    ఎముక యొక్క అంచులు( పెరియోస్టియం, periosteum) నరాలతో సమృద్ధిగా ఉంటాయి.,  ఈ నరముల యొక్క వాపు తీవ్ర నొప్పికి కారణమవుతుంది. విరిగిపోయిన ఎముక భాగంలోని రక్త స్రావం, ఎముకల అంచుల మీద పేరుకుపోతుంది.
  • వాపు
    రక్తం పేరుకుపోవడం మరియు గాయం ఫలితంగా రోగనిరోధక వ్యవస్థ యొక్క ప్రతిచర్య కారణంగా  వాపు ఏర్పడుతుంది.
  • అంగవికృతి (Deformity)
    విరిగిన భాగం (ఎముక) యొక్క స్థానభంగం కారణంగా ఇది సంభవించవచ్చు.
  • సమీపంలోని ధమనికి (ఆర్టరీ) నష్టం కలిగితే, ఆ ప్రాంతం చల్లగా మరియు పేలవంగా మారుతుంది. నరముకు హాని కలిగితే, ఫ్రాక్చర్ ప్రాంతంలో తిమ్మిరి ఏర్పడుతుంది.

దీని ప్రధాన కారణాలు ఏమిటి?

ఎముకల విరగడానికి సాధారణ కారణాలు:

  • పడిపోయినప్పుడు కానీ , ప్రమాదం లేదా ఫుట్ బాల్ వంటి క్రీడలను ఆడుతున్నప్పుడు కానీ ఎముకకు గరిష్ట ఒత్తిడి కలిగినప్పుడు ఎముకలు విరగడం జరుగుతుంది.
  • బోలు ఎముకల వ్యాధి (osteoporosis) వంటి వ్యాధుల విషయంలో  బలహీనమైన ఎముకల కారణంగా ఫ్రాక్చర్లు ఎక్కువగా సంభవించవచ్చు. ఎముకల నుండి కాల్షియం రక్తప్రవాహంలోకి చేరిపోవడం వలన  ఎముక సాంద్రత తగ్గిపోతుంది.
  • ఒక నిర్దిష్ట (ఒకే) ఎముకను అధికంగా వాడినప్పుడు ఒత్తిడి ఫ్రాక్చర్లు (Stress fractures) ఏర్పడతాయి. అనేక సార్లు కదలడం వలన కండరాలకు అలసటను కలిగిస్తుంది, అది ఎముకలపై ఒత్తిడిని పెంచుతుంది.

దీనిని ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?

వైద్యులు ప్రభావిత ప్రాంతాన్ని పూర్తిగా పరిశీలిస్తాడు మరియు ప్రభావిత శరీర భాగం యొక్క కదలిక మరియు వాపు తీవ్రతను తనిఖీ చేస్తారు. వైద్యులు రోగి ఆరోగ్య చరిత్రను గురించి, ఎలా గాయం సంభవించిందని మరియు లక్షణాలు గురించి రాసి పెట్టుకుంటారు. ఎక్స్-రే లు ఫ్రాక్చర్ల కోసం ఉత్తమ నిర్దారణా సాధనాలు, ఇవి ఫ్రాక్చర్ రకం, దాని ఖచ్చితమైన స్థానం మరియు ఫ్రాక్చర్  తీవ్రతను చూపుతాయి/తెలుపుతాయి.

కాస్ట్ ఇమ్మొబిలైసెషన్ ( కాస్ట్ ను ఉపయోగించి విరిగిన ఎముక పైన కింద ఉండే ఎముకల కదలికలను నివారించడం), ట్రాక్షన్ (traction, విరిగిన ముక్కలలు తిరిగి వాటి స్థానంలోకి చేర్చడం), ఎక్స్టర్నల్ ఫిక్సేషన్ (external fixation), ఫంక్షనల్ కాస్ట్ (functional cast, కొన్ని కదలికలను అనుమతించే కాస్ట్), మెటల్ పిన్నులను ఉపయోగించి ఎక్స్టర్నల్ ఫిక్సేషన్ (external fixation with metal pins), స్క్రూలు మరియు ఇంటర్నల్ ఫిక్సేషన్ (విగిగిన ఎముక ముక్కలని వాటి స్థానంలో పట్టిఉంచే ఒక  వస్తువుని [device] లోపల పెడతారు) వంటివి విరిగిన ఎముకల చికిత్సకు ఉపయోగించే విధానాలు.  

ఫ్రాక్చర్ యొక్క తీవ్రతను బట్టి అది తగ్గడానికి కొన్ని వారాల నుండి కొన్ని నెలల వరకు పడుతుంది. ఫిజియోథెరపీ సహాయంతో ప్రత్యేక వ్యాయామాలు ఫ్రాక్చర్ చుట్టూ ఉన్న కండరాలను బలోపేతం చేయడానికి అవసరమవుతాయిఎ

ముకలు విరగడం (ఫ్రాక్చర్)

ఎముకలు విరగడం (ఫ్రాక్చర్)నొప్పి నివారణ కు మీ ఫ్యామిలీ డాక్టర్ సలహా మేరకు మందులు వాడాలి 

Medicine NamePack Size
BrufenBRUFEN 400MG/2MG CAPSULE
CombiflamCOMBIFLAM 60ML SYRUP
Ibugesic PlusIBUGESIC PLUS SUSPENSION
BrugelBrugel 5% W/W Gel
TizapamTizapam 400 Mg/2 Mg Tablet
FbnFbn 0.03% Eye Drop
FlurbinFlurbin 0.03% W/V Eye Drop
Espra XnESPRA XN 500MG TABLET 10S
LumbrilLumbril Tablet
OstofenOSTOFEN 50MG CAPSULE 10S
OcuflurOcuflur Eye Drop
TizafenTizafen 400 Mg/2 Mg Capsule
EndacheEndache Gel
FenlongFenlong 400 Mg Capsule
Ibuf PIbuf P Tablet
IbugesicIBUGESIC 200MG TABLET 10S
IbuvonIbuvon 100 Mg Suspension
Ibuvon (Wockhardt)Ibuvon Syrup
Bjain Symphytum officinale LMBjain Symphytum officinale 0/1 LM
IcparilIcparil 400 Mg Tablet
MaxofenMaxofen Tablet
TricoffTricoff Syrup
AcefenAcefen 100 Mg/125 Mg Tablet

అస్వీకార ప్రకటన: ఈ సైటుపై లభ్యమవుతున్న మొత్తం సమాచారము మరియు లేఖనము కేవలం అవగాహనా ఆవశ్యకతల కొరకు మాత్రమే. ఇక్కడ ఇవ్వబడిన సమాచారమును ఏదైనా ఆరోగ్య సంబంధిత సమస్య లేదా అస్వస్థత నుండి కోలుకోవడానికి లేదా స్వస్థత కొరకు నిపుణుల సలహా లేనిదే ఉపయోగించుకోకూడదు. చికిత్స పరీక్షలు మరియు సేవల కొరకు ఎల్లప్పుడూ ఒక అర్హత పొందిన వైద్యుల సలహా 

బోన్ మెటాస్టాసిస్ సమస్య నివారణ కు





బోన్ మెటాస్టాసిస్ అంటే ఏమిటి?

ఎముక రోగకణ (బోన్ మెటాస్టాసిస్) వ్యాప్తి అంటే శరీరంలోని ఏ అవయవానికి రోగకారక కణితి (tumour) సోకిందో, ఆ గడ్డలోని రోగకాణాలు శరీరంలోని ఇతర ప్రాంతాల్లోని ఎముకలకు వ్యాప్తి చెందడం. సాధారణంగా, రొమ్ము క్యాన్సర్ లేదా ప్రోస్టేట్ క్యాన్సర్ ఎముకలకు విస్తరించే అవకాశం ఉంది. ఎముక రోగకణ వ్యాప్తి వ్యాధి బారిన పడే అత్యంత సాధారణమైన శరీర అవయవాలు వెన్నెముక, తొడ ఎముక మరియు కటి ఎముకలు. ఊపిరితిత్తులకు వ్యాధి కణాలు సోకినప్పుడు ఏవిధంగా వెంటనే తెలియకుండా వ్యాధి ముదిరిన తర్వాతనే  బయటపడుతుందో అలాగే ఎముకలకు ఈ రోగకారక గడ్డ కణాలు సోకినప్పుడు వెంటనే తెలియక ఆలస్యంగా “ముదిరిపోయిన వ్యాధి”గా పొడజూపుతుంది, మరి ఈ స్థితిలో ఈ వ్యాధి నయం కాదు.

దీని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

కొన్నిసార్లు, ఎముక రోగకణ వ్యాప్తి వ్యాధి ఎలాంటి సంకేతాలు లేదా వ్యాధి లక్షణాలను ఉత్పత్తి చేయదు. ఏవైనా లక్షణాలు పొడజూపినపుడు అవి సాధారణంగా వ్యాధి సోకిన ఎముకకు సంబంధించినవే అయ్యుంటాయి.

ఏమైనప్పటికీ, ఈ వ్యాధి శరీరంలోని ఏ ఎముకకి సోకినా, ఎముక రోగ కణ వ్యాధి యొక్క కొన్ని సాధారణ సంకేతాలు మరియు లక్షణాలు ఇలా ఉంటాయి. ఈ వ్యాధి లక్షణాలేవంటే:

  1. ఎముక నొప్పి
  2. వ్యాధి సోకిన ఎముకలో విరుపు (ఫ్రాక్చర్)
  3. మల, మూత్ర విసర్జనలపై నియంత్రణ కోల్పోవడం (అంటే ఆపుకోలేక పోవడం)
  4. కాళ్ళు లేదా చేతుల్లో బలహీనత లేదా నొప్పి
  5. హైపర్కాల్సేమియా (ఎముకలు విరగడంవల్ల రక్తంలో కాల్షియం స్థాయి పెరగడం) ఇది కింది లక్షణాలను కలిగిస్తుంది

దీని ప్రధాన కారణాలు ఏమిటి?

క్యాన్సర్ కణాలు రక్తంలోనికి లేదా శోషరసాలలోకి ప్రవేశించినపుడు అవి సుదూర అవయవాలకు వెళ్లి వాటిని బాధిస్తాయి. ఈ క్యాన్సర్ కణాలు ఎముకలో ప్రవేశించి, ఎముక లోపల విపరీతంగా వృద్ధి చెందడం, మరింతగా వ్యాప్తి చెందడం ప్రారంభించవచ్చు. ఈ ప్రక్రియలో, ఈ కాన్సర్ కణాలు పరాన్నజీవులుగా మార్పు చెందుతాయి, అటుపై అవి ఎముకలోని పోషకాలను తినేయడం ప్రారంభించడం, దానివల్ల ఎముక పెళుసుబారడం జరుగుతుంది.

ఎముకలకు వ్యాప్తి చెందే అతి సాధారణ క్యాన్సర్లు ఇవీ:

ఈ వ్యాధి నిర్ధారణను ఎలా చేస్తారు, దీనికి చికిత్స ఏమిటి?

వైద్యుడిచే జరుపబడే సంపూర్ణమైన వైద్య చరిత్ర మరియు శారీరక పరీక్ష ఈ ఎముక రోగకణ వ్యాధి సోకిన ఎముకను గుర్తించేందుకు వీలవుతుంది. ఎముక రోగకణ వ్యాప్తి వ్యాధి విషయంలో, రక్త పరీక్షలు అరుదుగా ఉపయోగించబడతాయి; ఇమేజింగ్ పద్ధతులు తుది రోగ నిర్ధారణలో సహాయపడతాయి. ఈ ఇమేజింగ్ పద్ధతులు ఏవంటే:

  • ఎక్స్-రే  (X-రే)
  • ఎముక స్కాన్
  • కంప్యూటెడ్ టోమోగ్రఫీ (CT) స్కాన్
  • అయస్కాంత ప్రతిధ్వని ఇమేజింగ్ (MRI) స్కాన్
  • పాసిట్రాన్ ఎమిషన్ టోమోగ్రఫీ (PET) స్కాన్

చికిత్స యొక్క లక్ష్యం నొప్పిని తగ్గించడం, ఎముక విరుగుళ్లను నివారించడం మరియు ఇతర ఎముకలకు మరింతగా విస్తరించడాన్ని నివారించడం.

ఎముక రోగకణ వ్యాధి కోసం ఉపయోగించే చికిత్సా పద్ధతులు:

  • కెమోథెరపీ ఎజెంట్లు - క్యాన్సర్ కణాలను కుంచింపజేయడానికి మందులు వాడతారు
  • హార్మోన్ చికిత్స - ఇది ప్రోస్టేట్ క్యాన్సర్ వ్యాప్తిని నియంత్రించడానికి ఉపయోగించే ఆండ్రోజెన్ క్షీణత చికిత్స వంటి ప్రాధమిక కణితిని నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇది పారాథైరాయిడ్ హార్మోన్ వంటి హార్మోన్ల వినియోగాన్ని కలిగి ఉంటుంది, ఇది విరిగిన ఎముకల మరమత్తులో సహాయపడుతుంది
  • లక్ష్య చికిత్స
  • ఇమ్యునోథెరపీ- ఈ పద్ధతి క్యాన్సర్ కణాలను చంపడానికి సహాయపడే ఇమ్యునోగ్లోబులిన్స్ అనబడే రోగనిరోధక వ్యవస్థ కణాలను ఉపయోగిస్తుంది.
  • బిస్ఫాస్ఫోనేట్స్ మందులు - ఈ మందులు ఎముక నొప్పిని తగ్గించడంలో సహాయం చేస్తాయి, రక్త- కాల్షియం స్థాయిలను తగ్గించడం, ఎముకల విరుపులు వచ్చే ప్రమాదాన్ని తగ్గించడం మరియు ఎముకలకు జరిగే నష్టాన్ని మందగింపజేసి ఆ ఎముక నష్టం నెమ్మదిగా జరిగేట్టు సాయపడుతుంది.
  • రేడియోధార్మిక చికిత్స - వ్యాధి సోకిన ఎముకలలోని క్యాన్సర్ కణాలను స్ట్రోంటియం -89 మరియు రేడియం -223 వంటి రేడియోఐసోటోప్లతో క్యాన్సర్ కణాలను చంపడంలో సహాయపడుతుంది

బోన్ మెటాస్టాసిస్ కొరకు మందులు

బోన్ మెటాస్టాసిస్ నివారణ కు కొన్ని మందులు మీ ఫ్యామిలీ డాక్టర్ సలహా మేరకు వాడాలి 

Medicine NamePack Size
BiodronateBiodronate 30 Mg Injection
AredronetAredronet 30 Mg Injection
PamidriaPamidria 30 Mg Injection
ధన్యవాదములు 
మీ navee నడిమింటి 

అస్వీకార ప్రకటన: ఈ సైటుపై లభ్యమవుతున్న మొత్తం సమాచారము మరియు లేఖనము కేవలం అవగాహనా ఆవశ్యకతల కొరకు మాత్రమే. ఇక్కడ ఇవ్వబడిన సమాచారమును ఏదైనా ఆరోగ్య సంబంధిత సమస్య లేదా అస్వస్థత నుండి కోలుకోవడానికి లేదా స్వస్థత కొరకు నిపుణుల సలహా లేనిదే ఉపయోగించుకోకూడదు. చికిత్స పరీక్షలు మరియు సేవల కొరకు ఎల్లప్పుడూ ఒక అర్హత పొందిన వైద్యుల సలహా తీసుకోవాలి.

7, జనవరి 2020, మంగళవారం

అమ్మయిలు లో PCOD సమస్య నివారణ కు


పాలిసిస్టిక్ ఓవరీ అండాశయ సిండ్రోమ్ (PCOS) అంటే ఏమిటి?

పాలిసిస్టిక్ ఓవరి సిండ్రోమ్ లేక పి సి ఒ ఎస్ (PCOS) గా సంక్షిప్తీకరించిన ఈ రుగ్మత మహిళల్లో హార్మోన్ల అసమతుల్యత కారణంగా కనపడే ఓ వ్యాధిలక్షణాల సంకలనం. ఇది సాధారణంగా 18-35 ఏళ్ల వయస్సు మధ్య ఉండే పునరుత్పాదక వయస్సున్న మహిళలను ప్రభావితం చేస్తుంది. ఈ రుగ్మత యొక్క పేరును దాని యొక్క సాంప్రదాయిక లక్షణాల నుండి పొందింది. బాధిత మహిళల అండాశయాలు (ఎల్లప్పుడు కాదు) 12 లేక అంతకంటే ఎక్కువ ఏకవిదారక ఫలాల్ని కల్గి ఉంటాయి. కనీసం ఒక అండాశయం లేక ఎక్కువ అండాశయాల్లో ఈ ఏకవిదారక ఫలాల్ని, ఫోక్లికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ (FSH) మరియు లుటినైజింగ్ (luteinizing) హార్మోన్ (LH) వంటి ఇతర హార్మోన్ల చెదిరిన స్థాయిలతో పాటు అండాశయాలు కనీసం ఒక 12 లేదా ఎక్కువ ఫోలికల్స్ కలిగి ఉంటాయి.

దీని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

లక్షణాలు ఇలా ఉంటాయి

  • అమేనోరియా అంటే ఋతుచక్రాలు లేదా ముట్లు క్రమంగా లేకపోవడం
  • డిస్మెనోరియా అంటే బాధాకరమైన ఋతుచక్రాలు (ముట్లు)
  • అక్రమ ఋతుచక్రాలు
  • హిర్సూటిజం అనగా శరీరంపైన మరియు ముఖముపైన అధికమైన జుట్టు పెరుగుదల
  • మొటిమలు (acne)
  • కటి (పెల్విక్) ప్రాంతంలో నొప్పి
  • గర్భవతి కావడం కష్టమవడం
  • ఊబకాయం, ఉదరభాగంలో కొవ్వు చేరడమనే ధోరణిని కల్గి ఉండడం
  • పరిధీయ ఇన్సులిన్ నిరోధకత
  • వంధ్యత్వం/సంతానలేమి
  • రోగి ఋతు లోపాలు, అడ్రినల్ ఎంజైమ్ లోపాలు, వంధ్యత్వం, ఊబకాయం మరియు జీవక్రియ సిండ్రోమ్, లేదా మధుమేహం యొక్క కుటుంబ చరిత్రతో ఉండవచ్చు. ప్రత్యామ్నాయంగా, వారు (రోగులు) అధిక రక్తస్రావం లేదా దీర్ఘకాలిక ముట్లు (రుతుక్రమం) వస్తున్నట్లు  ఫిర్యాదు చేయవచ్చు.

దీని ప్రధాన కారణాలు ఏమిటి?

పోలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (లేక PCOS) జన్యు సిద్ధతను (genetic predisposition) చూపిస్తుంది మరియు తల్లిదండ్రుల నుండి ఓ అలైంగిక క్రోమోజోమ్ సంబంధిత (ఆటోసోమల్) ఆధిపత్య పద్ధతిలో వారసత్వంగా వచ్చినట్లు కనిపిస్తుంది. రోగులు తమ శరీరాల్లో, ముఖ్యంగా టెస్టోస్టెరాన్, ఆండ్రోజెన్ల (మగ హార్మోన్లు) స్థాయిని కలిగి ఉంటారు. ఈ హార్మోన్లు అండోత్సర్గం నమూనాలతో జోక్యం చేసుకుంటాయి మరియు ఇతర లక్షణాల శ్రేణికి దారి తీస్తుంది. హార్మోన్లు ఫోలికల్స్ యొక్క పరిపక్వత ఆటంకానికి దారితీస్తాయి. ఈ అపరిపక్వ ఏకవిదారక ఫలాలు (follicles) అండాశయం ద్రవం నిండిన తిత్తులు నిండినట్లుగా కనిపిస్తాయి.

దీనిని ఎలా నిర్ధారణ చేస్తారు మరియు దీనికి చికిత్స ఏమిటి?

రోగ నిర్ధారణ వివరణాత్మక వైద్య (క్లినికల్) చరిత్ర మరియు భౌతిక పరీక్షను కలిగి ఉంటుంది. ప్రయోగశాల పరిశోధనల్లో థైరాయిడ్ ఫంక్షన్ పరీక్షలు; FSH యొక్క స్థాయిలు, ప్రోలాక్టిన్, మరియు LH; టెస్టోస్టెరోన్ (testosterone) మరియు బ్లడ్ గ్లూకోజ్ స్థాయిలు. వీటికి ముందు, అల్ట్రాసోనోగ్రఫీ వంటి నాన్-ఇన్వాసివ్ ఇమేజింగ్ను వైద్యుడు సూచించవచ్చు. అండాశయాల్లో ముత్యాల హారంలాగా తిత్తులు గోచరించడం జరుగుతుంది.

చికిత్సలో భాగంగా రోగిని ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవరచుకోమని ప్రేరేపించడం. హార్మోన్ల సంతులనాన్ని తిరిగి పొందడానికి చేసుకోవాల్సిన మార్పులు ఆరోగ్యకరమైన ఆహారం, బరువు తగ్గడం మరియు క్రమం తప్పని సాధారణ వ్యాయామం. ఇంకా, హార్మోన్ల చికిత్సను డాక్టర్ సూచించవచ్చు. మెట్ఫోర్మిన్ వంటి ఇన్సులిన్ సెన్సిటిజింగ్ ఔషధాలను ప్రీ-డయాబెటీస్ లేదా ఇన్సులిన్ నిరోధకత కలిగినవారికి సహాయపడతా

పోలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్

పోలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ కొన్ని మందులు మీ ఫ్యామిలీ డాక్టర్ సలహాలు మేరకు వాడాలి ఎందుకు అంటే మీ ఏజ్ బరువు సమస్య బట్టి మందులు మారుతాయి 

Medicine NamePack Size        
i-PillIpill 1.5 Mg Tablet
Duoluton L TabletDuoluton L 0.25 Mg/0.05 Mg Tablet
Loette TabletLoette Tablet
Ovilow TabletOvilow 0.02 Mg/0.1 Mg Tablet
Ovral G TabletOvral G 0.05 Mg/0.5 Mg Tablet
Ovral L TabletOvral L 0.03 Mg/0.15 Mg Tablet
Suvida TabletSuvida 0.3 Mg/0.03 Mg Tablet
MetafolateMETAFOLATE TABLET
Triquilar TabletTriquilar Tablet
Dearloe TabletDearloe 0.02 Mg/0.1 Mg Tablet
Ergest TabletErgest 0.05 Mg/0.25 Mg Tablet
Ergest Ld TabletErgest Ld 0.03 Mg/0.15 Mg Tablet
Esro TabletEsro 0.03 Mg/0.15 Mg Tablet
Elyn 35ELYN 35MG TABLET 28S
Esro G TabletEsro G 0.050 Mg/0.250 Mg Tablet
SmartilonSMARTILON 20MG TABLET 21S
Esro L TabletEsro L 0.02 Mg/0.10 Mg Tablet
Florina TabletFlorina 0.1 Mg/0.02 Mg Tablet
Florina G TabletFlorina G 0.05 Mg/0.25 Mg Tablet
Florina N TabletFlorina N Tablet
Mala D TabletMala D Tablet
Nogestol TabletNogestol 0.15 Mg/0.03 Mg Tablet
Orgalutin TabletOrgalutin 0.05 Mg/2.5 Mg Tablet
Levora TabletLEVORA TABLET 10S

ధన్యవాదములు 
మీ నవీన్ నడిమింటి 
da

అస్వీకార ప్రకటన: ఈ సైటుపై లభ్యమవుతున్న మొత్తం సమాచారము మరియు లేఖనము కేవలం అవగాహనా ఆవశ్యకతల కొరకు మాత్రమే. ఇక్కడ ఇవ్వబడిన సమాచారమును ఏదైనా ఆరోగ్య సంబంధిత సమస్య లేదా అస్వస్థత నుండి కోలుకోవడానికి లేదా స్వస్థత కొరకు నిపుణుల సలహా లేనిదే ఉపయోగించుకోకూడదు. చికిత్స పరీక్షలు మరియు సేవల కొరకు ఎల్లప్పుడూ ఒక అర్హత పొందిన వైద్యుల సలహా తీసుకోవాలి.

గనేరియా నివారణ కోసం నవీన్ సలహాలు



గనెరియా అంటే ఏమిటి?

గనెరియా అనేది లైంగిక సంక్రమణ వ్యాధి, ఇది నిస్సిరియా గనెరియా అనే బాక్టీరియా వలన సంభవిస్తుంది. ఈ అంటువ్యాధి ఉన్నవారితో అసురక్షితమైన లైంగిక సంబంధం కలిగి ఉన్నపుడు ఇది సంభవిస్తుంది.

దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

గనెరియా ఉన్న వ్యక్తులు ఎటువంటి సంకేతాలు మరియు లక్షణాలను చూపించరు , లక్షణాలు ఉంటే, అవి తేలికపాటివిగా ఉంటాయి. మూత్రవిసర్జన సమయంలో నొప్పి మరియు మంటగా ఉంటుంది, అదే గనెరియా యొక్క సాధారణ లక్షణం

పురుషుల్లో ఉండే లక్షణాలు:

  • పురుషాంగం నుండి తెల్లని, పసుపు లేదా ఆకుపచ్చ రంగులో స్రావాలు
  • వృషణాల నొప్పి లేదా వాపు (ఇది అరుదుగా కనిపిస్తుంది)

మహిళలలో ఉండే సాధారణ లక్షణాలు:

పురుషులు మరియు స్త్రీలు ఇద్దరిలో కనిపించే సాధారణ లక్షణాలు:

  • పుండ్లు పడడం
  • రక్తస్రావం లేదా డిచ్ఛార్జ్ (స్రావాలు)
  • మలద్వార దురద (Anal itching)
  • బాధాకరమైన మలవిసర్జన

ప్రధాన కారణాలు ఏమిటి?

ఈ బ్యాక్టీరియా వ్యాధి సోకిన వ్యక్తుల వీర్యం, వీర్యం ముందు స్రవించే ద్రవాలు మరియు యోని ద్రవాలలో కనిపిస్తుంది (ఉంటుంది), అందువల్ల అది ప్రధానంగా అసురక్షిత యోని, యానల్ లేదా ఓరల్ సెక్స్ ద్వారా వ్యాపిస్తుంది. కలుషిత ద్రవాలను (ఫ్లూయిడ్స్) తాకిన చేతులతో కళ్ళును తాకడం వలన కళ్ళలో కూడా సంక్రమణం (ఇన్ఫెక్షన్) కలుగుతుంది. ఇది ప్రసవ సమయంలో సంక్రమిత తల్లి నుండి శిశువుకి కూడా  వ్యాపిస్తుంది/సంక్రమిస్తుంది.

దీనిని ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?

ముందుగా, వైదులు వివరణాత్మక చరిత్రను తీసుకుంటారు, దాని తరువాత సంపూర్ణ భౌతిక పరీక్ష ఉంటుంది. వీటి ఆధారంగా, వైద్యులు ఈ క్రింది పరీక్షలను ఆదేశిస్తారు:

  • ప్రభావిత ప్రదేశం నుండి నమూనాను సేకరించి పరిక్షించడం
  • గనెరియా పరీక్ష - సేకరించిన నమూనాల సాగు, నమూనాల మైక్రోస్కోపిక్ పరీక్ష, మరియు న్యూక్లిక్ యాసిడ్ యాంప్లిఫికేషన్ పరీక్ష (NAAT, nucleic acid amplification test)
  • పరీక్ష కోసం మూత్రం నమూనాను సేకరించడం

చికిత్స పద్ధతులు ఈ క్రింది విధంగా ఉంటాయి:

  • డ్యూయల్ థెరపీ యాంటీబయాటిక్స్, ఇవి ఒక మోతాదుగా నోటి ద్వారా తీసుకునేవి మరియు మరొక మోతాదుగా ఇంట్రామస్కులర్ (intramuscular) ఇంజెక్షన్గా  ఇవ్వబడేవి.
  • వ్యాధి సంక్రమిత వ్యక్తికి సంబంధించి లైంగిక భాగస్వాములు (రోగ నిర్ధారణకు 60 రోజుల ముందు వరకు) తప్పనిసరి పరీక్షలు మరియు చికిత్స చేయించుకోవాలని సలహా ఇస్తారు.
  • గోనేరియాకు చికిత్స తీసుకునే వ్యక్తులకు తదుపరి పరీక్షలు.
  • గోనేరియాకు చికిత్స పొందుతున్న వ్యక్తులు క్లామిడియాకు చికిత్సను కూడా అందించాలి.
  • చికిత్స ముగిసేంత వరకు సెక్స్ను నివారించాలి (ఒక మోతాదు చికిత్స తర్వాత, సెక్స్కు 7 రోజులు వేచి ఉండాలి)

గనెరియా కొరకు మందులు

Medicine NamePack Size
Blumox CaBLUMOX CA 1.2GM INJECTION 20ML
BactoclavBACTOCLAV 1.2MG INJECTION
Mega CvMEGA CV 1.2GM INJECTION
Erox CvEROX CV 625MG TABLET
Moxclav 625 Mg TabletMOX CLAV DS 457MG TABLET 10S
NovamoxNOVAMOX SYRUP
Moxikind CvMOXIKIND CV 375MG TABLET
PulmoxylPulmoxyl 250 Mg Tablet Dt
ClavamCLAVAM 1GM TABLET 10S
AdventADVENT DROPS
AugmentinAUGMENTIN 500/100MG INJECTION 10ML
ClampCLAMP 30ML SYRUP
MoxCIPMOX 500MG CAPSULE
Zemox ClZemox Cl 1000 Mg/200 Mg Injection
P Mox KidP Mox Kid 125 Mg/125 Mg Tablet
AceclaveAceclave 250 Mg/125 Mg Tablet
Amox ClAmox Cl 200 Mg/28.5 Mg Syrup
ZoclavZoclav 500 Mg/125 Mg Tablet
PolymoxPolymox 250 Mg/250 Mg Capsule
AcmoxAcmox 125 Mg Dry Syrup
StaphymoxStaphymox 250 Mg/250 Mg Tablet
Acmox DsAcmox Ds 250 Mg Tablet
AmoxyclavAMOXYCLAV 228.5MG DRY SYRUP 30ML
Zoxil CvZoxil Cv 1000 Mg/200 Mg Injectionధన్యవాదములు 
మీ నవీన్ నడిమింటి 

పురుషాగం ఇన్ఫెక్షన్ నివారణ



పురుషాంగ ఈస్ట్ సంక్రమణం సంక్రమణం అంటే ఏమిటి?

ఈస్ట్ అనేది ఒక బూజు (ఫంగస్) రకం లేక మధుశిలీంధ్రం, ఇది జీర్ణ వాహిక, నోరు, చర్మంపై, మరియు జననేంద్రియాల వంటి శరీర అవయవాలలో నివసిస్తుంది. పురుషాంగంపై సాధారణ ఆవశ్యకత కంటే  ఎక్కువగా మధుశిలీంధ్రం (ఈస్ట్) యొక్క పెరుగుదల కల్గినప్పుడు పురుషాంగ ఈస్ట్ సంక్రమణలు సంభవిస్తాయి. ఈ వ్యాధిని 'కాండిడియాసిస్' అని కూడా పిలుస్తారు, ఎందుకంటే 'కాండిడా అల్బికాన్స్' అనే సూక్ష్మజీవి దీనికి కారణమవుతుంది. కాండిడా సంక్రమణలు సున్నతి చేసిన శిశ్నము కల్గిన పురుషుల్లో కంటే సున్నతి చేయని శిశ్నము కల్గిన పురుషులకే ఎక్కువగా సంభవిస్తాయి. ఎందుకంటే సున్నతి చేయని శిశ్నము కల్గిన  శిశ్నాగ్రచర్మము (foreskin) కింద తేమ మరియు వెచ్చదనం ఉండడంవల్ల ఈ మధుశిలీంధ్రం (ఈస్ట్) యొక్క పెరుగుదలను సులభతరం చేస్తాయి. 40 ఏళ్లు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు గల పురుషులలో కాండిడా సూక్ష్మజీవి ఎక్కువగా స్థానమేరచుకుని ఉంటుంది.

దీని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

పురుషాంగ ఈస్ట్ సంక్రమణం పురుషాంగం యొక్క కింద పక్కన (foreskin-side)  క్రింది లక్షణాలను కలుగజేస్తుంది:

  • బాధాకరమైన దద్దుర్లు.
  • చర్మం పొలుసులుదేలడం (స్కేలింగ్).
  • ఎర్రగా మారుతుంది.

పురుషాంగం యొక్క తలపై (అంటే శిశ్నఅగ్రం) దురద పుట్టడమనేది పురుషులు అనుభవించే అత్యంత సాధారణ లక్షణం.

దీని ప్రధాన కారణాలు ఏమిటి?

పురుషాంగ ఈస్ట్ సంక్రమణాలకు దారితీసే శిలీంధ్రాలు పెచ్చుపెరిగి పోవడానికి కింది కారణాలను పేర్కొనవచ్చు:

  • తేమ లేదా వెచ్చని పరిస్థితులు.
  • బలహీన రోగనిరోధక వ్యవస్థ.
  • యాంటీబయాటిక్స్ (ఈ యాంటిబయోటిక్స్ ఆరోగ్యకరమైన బ్యాక్టీరియాను చంపినప్పుడు, మధుశిలీంధ్రాల యొక్క పెరుగుదల అవుతుంది).
  • హెచ్ఐవి (HIV) సంక్రమణ మరియు మధుమేహం వంటి కొన్ని వ్యాధులతో ఉన్న వ్యక్తులు ఈస్ట్ ఇన్ఫెక్షన్ అభివృద్ధికి మరింతగా లోనవుతారు.
  • సువాసనాభరిత (scented) సబ్బులు మరియు స్నానానికి ఉపయోగించే షవర్ జెల్స్ తో పురుషాంగాన్ని శుభ్రం చేయడంవల్ల శిశ్నము చర్మం మంట కలగడం మరియు కాండిడా సూక్ష్మజీవులు పెరిగిపోయే ప్రమాదాన్ని పెంచుతుంది.
  • యోని ఈస్ట్ సంక్రమణ కలిగిన స్త్రీతో అసురక్షితమైన (unprotected)  లైంగిక సంబంధం పెట్టుకోవడంవల్ల.

దీనిని ఎలా నిర్ధారణ చేసేది మరియు దీనికి చికిత్స ఏమిటి?

మీ డాక్టర్ కింది చర్యల ద్వారా  పురుషాంగ ఈస్ట్ సంక్రమణం వ్యాధిని నిర్ధారణ చేస్తారు:

  • మీ వైద్య చరిత్ర మరియు వ్యాధి లక్షణాలు గమనించడం.
  • భౌతిక పరీక్షను నిర్వహిస్తారు .
  • పురుషాంగం యొక్క ద్రవం లేదా కణజాలం నమూనా పరిశీలన.

పురుషాంగ ఈస్ట్  సంక్రమణలకు అందుబాటులో ఉన్న చికిత్సలు క్రిందివిధంగా ఉన్నాయి:

  • యాంటీ ఫంగల్ క్రీములు లేదా లోషన్లు  .
  • ఔషధ ఫలవర్తులు (medicated suppositories)
  • బలహీన రోగనిరోధక శక్తి కారణంగా ఈ సంక్రమణకు గురైన వ్యక్తులకు మౌఖికంగా తీసుకునే ‘ఓరల్ యాంటీ ఫంగల్ మందులు’.

చాలామటుకు ఈ ఔషధాలు మందుల షాపుల్లో” ఓవర్-ది-కౌంటర్” ప్రాతిపదికన అందుబాటులో ఉన్నాయి, అంటే వీటికి వైద్యుడి ప్రిస్క్రిప్షన్ లేకుండానే మందుల షాపులో లభిస్తాయి. ఈ ఔషధాలను ఉపయోగించిన తర్వాత కూడా అంటువ్యాధి కొనసాగితే, మీ వైద్యుడు యాంటీ ఫంగల్ మందుల యొక్క దీర్ఘకాల కోర్సును తరుణోపాయంగా సూచించ

పురుషాంగ ఈస్ట్ సంక్రమణ కొరకు మందులు

పురుషాంగ ఈస్ట్ సంక్రమనివారణ కు మందులు 

Medicine NamePack Size
SyscanSYSCAN 100MG CAPSULE 4S
DermizoleDermizole 2% Cream
Clenol LbClenol Lb 100 Mg/100 Mg Tablet
Candid GoldCANDID GOLD 30GM CREAM
Propyderm NfPROPYDERM NF CREAM 5GM
PlitePlite Cream
FungitopFungitop 2% Cream
PropyzolePropyzole Cream
Q CanQ Can 150 Mg Capsule
MicogelMicogel Cream
Imidil C VagImidil C Vag Suppository
Propyzole EPropyzole E Cream
ReocanReocan 150 Mg Tablet
MiconelMiconel Gel
Tinilact ClTinilact Cl Soft Gelatin Capsule
Canflo BnCanflo Bn 1%/0.05%/0.5% Cream
Toprap CToprap C Cream
Saf FSaf F 150 Mg Tablet
Relin GuardRelin Guard 2% Cream
VulvoclinVulvoclin 100 Mg/100 Mg Capsule
Crota NCrota N Cream
Clop MgClop Mg 0.05%/0.1%/2% Cream
FubacFUBAC CREAM 10GM
Canflo BCanflo B Cream
ధన్యవాదములు 
మీ నవీన్ నడిమింటి 

అస్వీకార ప్రకటన: ఈ సైటుపై లభ్యమవుతున్న మొత్తం సమాచారము మరియు లేఖనము కేవలం అవగాహనా ఆవశ్యకతల కొరకు మాత్రమే. ఇక్కడ ఇవ్వబడిన సమాచారమును ఏదైనా ఆరోగ్య సంబంధిత సమస్య లేదా అస్వస్థత నుండి కోలుకోవడానికి లేదా స్వస్థత కొరకు నిపుణుల సలహా లేనిదే ఉపయోగించుకోకూడదు. చికిత్స పరీక్షలు మరియు సేవల కొరకు ఎల్లప్పుడూ ఒక అర్హత పొందిన వైద్యుల సలహా తీసుకోవాలి.