7, జనవరి 2020, మంగళవారం

పురుషాగం ఇన్ఫెక్షన్ నివారణ



పురుషాంగ ఈస్ట్ సంక్రమణం సంక్రమణం అంటే ఏమిటి?

ఈస్ట్ అనేది ఒక బూజు (ఫంగస్) రకం లేక మధుశిలీంధ్రం, ఇది జీర్ణ వాహిక, నోరు, చర్మంపై, మరియు జననేంద్రియాల వంటి శరీర అవయవాలలో నివసిస్తుంది. పురుషాంగంపై సాధారణ ఆవశ్యకత కంటే  ఎక్కువగా మధుశిలీంధ్రం (ఈస్ట్) యొక్క పెరుగుదల కల్గినప్పుడు పురుషాంగ ఈస్ట్ సంక్రమణలు సంభవిస్తాయి. ఈ వ్యాధిని 'కాండిడియాసిస్' అని కూడా పిలుస్తారు, ఎందుకంటే 'కాండిడా అల్బికాన్స్' అనే సూక్ష్మజీవి దీనికి కారణమవుతుంది. కాండిడా సంక్రమణలు సున్నతి చేసిన శిశ్నము కల్గిన పురుషుల్లో కంటే సున్నతి చేయని శిశ్నము కల్గిన పురుషులకే ఎక్కువగా సంభవిస్తాయి. ఎందుకంటే సున్నతి చేయని శిశ్నము కల్గిన  శిశ్నాగ్రచర్మము (foreskin) కింద తేమ మరియు వెచ్చదనం ఉండడంవల్ల ఈ మధుశిలీంధ్రం (ఈస్ట్) యొక్క పెరుగుదలను సులభతరం చేస్తాయి. 40 ఏళ్లు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు గల పురుషులలో కాండిడా సూక్ష్మజీవి ఎక్కువగా స్థానమేరచుకుని ఉంటుంది.

దీని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

పురుషాంగ ఈస్ట్ సంక్రమణం పురుషాంగం యొక్క కింద పక్కన (foreskin-side)  క్రింది లక్షణాలను కలుగజేస్తుంది:

  • బాధాకరమైన దద్దుర్లు.
  • చర్మం పొలుసులుదేలడం (స్కేలింగ్).
  • ఎర్రగా మారుతుంది.

పురుషాంగం యొక్క తలపై (అంటే శిశ్నఅగ్రం) దురద పుట్టడమనేది పురుషులు అనుభవించే అత్యంత సాధారణ లక్షణం.

దీని ప్రధాన కారణాలు ఏమిటి?

పురుషాంగ ఈస్ట్ సంక్రమణాలకు దారితీసే శిలీంధ్రాలు పెచ్చుపెరిగి పోవడానికి కింది కారణాలను పేర్కొనవచ్చు:

  • తేమ లేదా వెచ్చని పరిస్థితులు.
  • బలహీన రోగనిరోధక వ్యవస్థ.
  • యాంటీబయాటిక్స్ (ఈ యాంటిబయోటిక్స్ ఆరోగ్యకరమైన బ్యాక్టీరియాను చంపినప్పుడు, మధుశిలీంధ్రాల యొక్క పెరుగుదల అవుతుంది).
  • హెచ్ఐవి (HIV) సంక్రమణ మరియు మధుమేహం వంటి కొన్ని వ్యాధులతో ఉన్న వ్యక్తులు ఈస్ట్ ఇన్ఫెక్షన్ అభివృద్ధికి మరింతగా లోనవుతారు.
  • సువాసనాభరిత (scented) సబ్బులు మరియు స్నానానికి ఉపయోగించే షవర్ జెల్స్ తో పురుషాంగాన్ని శుభ్రం చేయడంవల్ల శిశ్నము చర్మం మంట కలగడం మరియు కాండిడా సూక్ష్మజీవులు పెరిగిపోయే ప్రమాదాన్ని పెంచుతుంది.
  • యోని ఈస్ట్ సంక్రమణ కలిగిన స్త్రీతో అసురక్షితమైన (unprotected)  లైంగిక సంబంధం పెట్టుకోవడంవల్ల.

దీనిని ఎలా నిర్ధారణ చేసేది మరియు దీనికి చికిత్స ఏమిటి?

మీ డాక్టర్ కింది చర్యల ద్వారా  పురుషాంగ ఈస్ట్ సంక్రమణం వ్యాధిని నిర్ధారణ చేస్తారు:

  • మీ వైద్య చరిత్ర మరియు వ్యాధి లక్షణాలు గమనించడం.
  • భౌతిక పరీక్షను నిర్వహిస్తారు .
  • పురుషాంగం యొక్క ద్రవం లేదా కణజాలం నమూనా పరిశీలన.

పురుషాంగ ఈస్ట్  సంక్రమణలకు అందుబాటులో ఉన్న చికిత్సలు క్రిందివిధంగా ఉన్నాయి:

  • యాంటీ ఫంగల్ క్రీములు లేదా లోషన్లు  .
  • ఔషధ ఫలవర్తులు (medicated suppositories)
  • బలహీన రోగనిరోధక శక్తి కారణంగా ఈ సంక్రమణకు గురైన వ్యక్తులకు మౌఖికంగా తీసుకునే ‘ఓరల్ యాంటీ ఫంగల్ మందులు’.

చాలామటుకు ఈ ఔషధాలు మందుల షాపుల్లో” ఓవర్-ది-కౌంటర్” ప్రాతిపదికన అందుబాటులో ఉన్నాయి, అంటే వీటికి వైద్యుడి ప్రిస్క్రిప్షన్ లేకుండానే మందుల షాపులో లభిస్తాయి. ఈ ఔషధాలను ఉపయోగించిన తర్వాత కూడా అంటువ్యాధి కొనసాగితే, మీ వైద్యుడు యాంటీ ఫంగల్ మందుల యొక్క దీర్ఘకాల కోర్సును తరుణోపాయంగా సూచించ

పురుషాంగ ఈస్ట్ సంక్రమణ కొరకు మందులు

పురుషాంగ ఈస్ట్ సంక్రమనివారణ కు మందులు 

Medicine NamePack Size
SyscanSYSCAN 100MG CAPSULE 4S
DermizoleDermizole 2% Cream
Clenol LbClenol Lb 100 Mg/100 Mg Tablet
Candid GoldCANDID GOLD 30GM CREAM
Propyderm NfPROPYDERM NF CREAM 5GM
PlitePlite Cream
FungitopFungitop 2% Cream
PropyzolePropyzole Cream
Q CanQ Can 150 Mg Capsule
MicogelMicogel Cream
Imidil C VagImidil C Vag Suppository
Propyzole EPropyzole E Cream
ReocanReocan 150 Mg Tablet
MiconelMiconel Gel
Tinilact ClTinilact Cl Soft Gelatin Capsule
Canflo BnCanflo Bn 1%/0.05%/0.5% Cream
Toprap CToprap C Cream
Saf FSaf F 150 Mg Tablet
Relin GuardRelin Guard 2% Cream
VulvoclinVulvoclin 100 Mg/100 Mg Capsule
Crota NCrota N Cream
Clop MgClop Mg 0.05%/0.1%/2% Cream
FubacFUBAC CREAM 10GM
Canflo BCanflo B Cream
ధన్యవాదములు 
మీ నవీన్ నడిమింటి 

అస్వీకార ప్రకటన: ఈ సైటుపై లభ్యమవుతున్న మొత్తం సమాచారము మరియు లేఖనము కేవలం అవగాహనా ఆవశ్యకతల కొరకు మాత్రమే. ఇక్కడ ఇవ్వబడిన సమాచారమును ఏదైనా ఆరోగ్య సంబంధిత సమస్య లేదా అస్వస్థత నుండి కోలుకోవడానికి లేదా స్వస్థత కొరకు నిపుణుల సలహా లేనిదే ఉపయోగించుకోకూడదు. చికిత్స పరీక్షలు మరియు సేవల కొరకు ఎల్లప్పుడూ ఒక అర్హత పొందిన వైద్యుల సలహా తీసుకోవాలి.

కామెంట్‌లు లేవు: