22, మే 2020, శుక్రవారం

మూత్రం ఆపుకోలేక పోవడం మూత్రం మంట నివారణకు కు యోగ మరియు ఆయుర్వేదం నివారణకు పరిష్కారం మార్గం లింక్లో చూడండి

మూత్ర విసర్జనను నియంత్రించుకోలేకపోవటం.. దగ్గినా, తుమ్మినా మూత్రం లీక్‌‌ అవటం, ఎక్కువసార్లు మూత్ర విసర్జన చేయాల్సిరావటం.. ఇలా మూత్ర సంబంధ సమస్యలెన్నో! వయసుతో సంబంధం లేకుండా పసిపిల్లల నుంచి వృద్ధుల వరకు  ఇదే  సమస్య. అయితే కొన్ని ​ యోగాసనాలు వేస్తే   ఆ సమస్యల నుంచి బయటపడొచ్చు.

ఉత్కటాసనం..


యోగా మ్యాట్​పైన  రెండు కాళ్ళను దగ్గరగా ఉంచి నిటారుగా నిలబడాలి. రెండు చేతులు దండం పెడుతున్న పోజ్ లోకి తీసుకురావాలి. చేతులను తలపైకి అలాగే లేపాలి. ఇప్పుడు మెల్లగా మోకాళ్ళ దగ్గర వంచి శరీరాన్ని కుర్చీ ఆకారంలోకి తీసుకోవాలి. ఇలా ఐదారు సెకండ్లు చేయాలి. ఇలా చేయడం వల్ల  మూత్రం లీకేజ్​ సమస్య తగ్గుతుంది.   

బద్ధ కోణాసనం


యోగా మ్యాట్​పై   రెండు కాళ్లని చాపి కూర్చోవాలి. తర్వాత  రెండు కాళ్లని లోపలి వైపుకి ఫొటోలో చూపిన విధంగా మడిచి  అరికాళ్లను పొట్ట  భాగానికి ఆన్చాలి. అరికాళ్లు ఒకదానికి ఒకటి తాకేలా చేస్తూ రెండు చేతులతో పాదాలను పట్టుకోవాలి. చేతివేళ్లను జాయింట్ చేసినట్లుగా పాదాలను కలిపి.. మోకాళ్లను నేలకు దగ్గరగా ఉంచాలి. శ్వాస నెమ్మదిగా తీసుకుంటూ వదిలేయాలి. ఈ ఆసనాన్ని రెగ్యులర్​గా చేస్తే మూత్రాశయ  సమస్యలు తగ్గుతాయి.

త్రికోణాసనం


నిటారుగా నిల్చొని కాళ్లు రెండూ దూరం పెట్టి చేతులు పక్కకు చాపాలి. ఇప్పుడు కుడిచేతి వేళ్లని  తీసుకువచ్చి కుడివైపు నేలకు ఫొటోలో చూపిన విధంగా తాకించాలి. ఎడమచెయ్యి పైకి ఎత్తాలి. తలని పైకెత్తి చేతిని చూడాలి. చేతులు మారుస్తూ  ఇలా 20, -25 సార్లు చేయొచ్చు. క్రమంగా పెంచుకోవచ్చు. నడుము నొప్పి  ఉన్నవారు ఈ ఆసనం వేయొద్దు. ఒకవేళ చేయాలనుకుంటే పూర్తిగా వంగకూడదు. మొదట్లో మెల్లిగా మొదలుపెట్టి క్రమంగా ఎక్కువసార్లు చేయాలి. అలాగే ఈ ఆసనం పొట్ట ఖాళీగా ఉన్నప్పుడు మాత్రమే చేయాలి. భోజనం చేశాక చేయాలనుకుంటే నాలుగు గంటల తరువాత చేయాలి. ఈ ఆసనం వల్ల మూత్రాశయ సమస్యలు దూరమవుతాయి.

బాలాసనం


ఈ ఆసనం కోసం మోకాళ్లని మడిచి  పిరుదులు కాలి పాదాలపై ఆన్చాలి.  ఫొటోలో చూపిన విధంగా శరీరాన్ని ముందుకు వంచి ఛాతిని మోకాళ్లకు ఆన్చాలి.  తర్వాత నుదుటిని నేలకు ఆన్చి చేతులను ముందుకు చాపాలి. ఈ పొజిషన్​లో పదిసార్లు గాలి పీలుస్తూ వదలాలి. ఇలా చేయడం వల్ల  మూత్ర సమస్యతో పాటే అలసట, కడుపు ఉబ్బరం కూడా తగ్గుతాయి. 

మలాసనం..


యోగా మ్యాట్​పై   రెండు కాళ్లని దూరంగా ఉంచి నిలబడాలి. తర్వాత నెమ్మదిగా ఫొటోలో  చూపినట్టుగా చేతులను నమస్కార ముద్రలో ఉంచి  కూర్చోవాలి. వెన్నెముక నిటారుగా ఉండేలా చూసుకోవాలి.  అలాగే రెండు మోకాళ్ల మధ్యలో నమస్కార ముద్ర ఉండాలి. ఈ పొజిషన్​ 15 నుంచి 20 సెకన్లు ఉండి తర్వాత ఆసనం నుంచి బయటకు రావాలి. ఇలా  రెగ్యులర్​గా చేయడం వల్ల మూత్రం లీకేజ్​ సమస్యతో పాటు యూరిన్​ ఇన్​ఫెక్షన్స్​ కూడా   తగ్గుతుంది 

మూత్ర సమస్యలు ఆయుర్వేదం మందులు 
                    మూత్రంలో రాళ్ళు
 
         పసుపు పచ్చగా పండిన వేపాకులను తెచ్చి ,ఎండబెట్టి ,నలిపి,బాణలి లోవేసి మాడ్చాలి.
తరువాత జల్లించాలి. ఈ బూడిదను ఒక సీసాలో భద్రపరచుకోవాలి.
        పావు టీ స్పూను పొడిని  ఒక స్పూను తేనె కలిపి ఉదయం, సాయంత్రం వాడుతూ వుంటే మూత్రంలో రాళ్ళు  అరిగి పోతాయి.
                    అతి మూత్ర సమస్య --నివారణ                              
.
     కఫ  శరీరం వున్న వాళ్ళు ఎక్కువ నీళ్ళు తాగ కూడదు .వాళ్ళు సహజంగానే నీటి శాతంతోనే పుడతారు.
 
                                        బలమైన పసుపు కొమ్ముల పొడి        ----50 gr
                                                         నల్ల నువ్వుల పొడి        ----50 gr
                                                               త్రిఫల చూర్ణం        ----50 gr
 
     అన్నింటిని కలిపి ముద్ద అయ్యేట్లు దంచాలి. ఈ ముద్దను మాత్రలు కట్టాలి. చేదు  అనిపిస్తే తాటిబెల్లం ఎక్కువగా     కలుపుకోవచ్చు.పొడిగా కూడా వాడవచ్చు. ఉదయం, సాయంత్రం భోజనానికి ముందుగాని, తరువాత గాని ఒక మాత్ర నీటితో వేసుకోవాలి.
                                     పిల్లలకు               ---- 1,2 gr
                                     పెద్దలకు               ---- 3,4 gr
 
     సమస్య ఎక్కువగా వున్నవాళ్ళు మోతాదు పెంచి వాడుకోవచ్చు, మరీ ఎక్కువగా వాడితే మూత్రం రావడం   అసలే ఆగిపోవచ్చు. కావున జాగ్రత్తగా వాడాలి.
 
           మూత్ర కృచ్చసమస్య --నివారణ                            

         మూత్రం బొట్లు బొట్లు గా పడడం

       శరీరంలో వేడి, పైత్యం, కఫం ఎక్కువైతే ఈ సమస్య వస్తుంది. ఇది స్త్రీల లో కన్నా పురుషులలోనే ఎక్కువగా  వస్తుంది.

ఈ సమస్య రాకుండా ఉండాలంటే :--

1. మూలబంధము :-- వజ్రాసనంలో ఆసనం లాగి బిగించి కూర్చోవాలి. కాళ్ళు వెనక్కు పెట్టుకొని మోకాళ్ళు  నేలకు ఆనించాలి.

2. ఉడ్యానబంధము :--వజ్రాసనంలో కూర్చొని గాలిని లోపలి లాగి అంటే పొట్టను లోపలికి  లాగి చేతులను మోకాళ్ళ  పై పెట్టుకోవాలి. ఈ విధంగా గాలి పీలుస్తూ వదుల్తూ చెయ్యాలి. ఈ విధంగా చెయ్యడం వలన ఈ సమస్య రాదు.

3. పద్మాసనం లేదా అర్ధ పద్మాసనం లో నిటారుగా కూర్చోవాలి. చేతులను వెనక్కి పెట్టుకోవాలి. శరీరాన్ని   పక్కటెముకల వైపు కుడి వైపుకు, ఎడమ వైపుకు వంచాలి. దీనిని గాలి పీలుస్తూ వదులుతూ చెయ్యాలి. పై విధంగా కూర్చొని, తలను వంచి మోకాలును గడ్డం తో అందుకోవాలి. అదే విధంగా కూర్చొని రెండు పిడికిళ్ళు  బిగించి పొట్టను  అదుముతూ తలను కిందికి వంచాలి.

చేయకూడని పనులు :-- వెన్ను పూసకు ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళు, బహిష్టు అయిన వాళ్ళు,  మెడ నొప్పి వున్న వాళ్ళు పై వ్యాయామాలు చెయ్యకూడదు.

సూచన :-- పరిమితిని మించి అతిగా భోజనం చేయరాదు.మద్యపానం, కుళ్ళిన మాంసం, అతినడక, అతి  వ్యాయామం పనికి రావు.

                ఎండిన కొండ పిండి వేళ్ళ పొడి              
                                      యాలకుల పొడి
                                      దోరగా వేయించిన పిప్పళ్ళ పొడి
                                      శుద్ధ గో మూత్ర శిలాజతు లేదా అతిమధురం పొడి

      అన్నింటిని కలిపి సీసాలో భద్ర పరచుకోవాలి.

      ఒక కప్పు బియ్యం కడిగిన నీళ్ళు తీసుకొని దానిలో పావు టీ స్పూను నుండి అర టీ స్పూను పొడిని కలిపి    ఉదయం, సాయంత్రం తాగాలి. దీనితో మూత్ర వ్యాధులు నివారింప బడతాయి.

                               మూత్ర విసర్జనలో సమస్యలు --నివారణ                          

1. వాతజ మూత్ర కృచ్హము:--పొట్టను బాగా తైలం తో చెమట పట్టేటట్లు మర్దన చెయ్యాలి. (ఓమ,ప్రజా రక్షణ, గరిక,  లేక నువ్వుల నూనె :--వీనిలో ఏదో ఒక తైలం తో మర్దన చెయ్యాలి. ఉదర చాలనం చెయ్యాలి.

మోకాళ్ళ మీద   చేతులను పెట్టి కొద్దిగా వంగి పొట్టను వేగంగా కదిలించాలి. నిటారుగా నిలబడి చేతులను పూర్తిగా వదిలి గాలిని  పీలుస్తూ ఒక కాలును వదలాలి. అదే విధంగా రెండవ కాలును కూడా నెమ్మదిగా లేపి దించాలి. అలాగే వెనక్కు పక్కలకు కూడా ఒక్కొక్క కాలును ఎత్తి దించాలి.

    పిరుదులకు, నడుముకు మధ్య వెనక చేతులుంచి నడుమును వేగంగా, గుండ్రంగా తిప్పాలి,  దీని
వలనచెమటపడుతుంది. వాయువులు పేరుకు పోవడం వలన ఏర్పడిన సమస్యలు తొలగి పోతాయి
.
వ్యాధిని గుర్తించడం :-- మూత్రం బొట్లు బొట్లు గా రావడం,

    మూత్రం వచ్చేటపుడు  నొప్పిగా వుండడం, పొత్తి కడుపుబిగుసుకుపోయి నొప్పిగావుండడం ,
గజ్జల్లో బిగుసుకున్నట్లు వుండడం, మర్మాంగం లో నొప్పి ఉంటాయి.దీనిని
బట్టి నొప్పి అంటే వాతం వలన అని గుర్తించాలి.

                                    తిప్ప తీగ పొడి             ----- 50 gr
                                    అశ్వగంధ పొడి             ----- 50  gr
                                    పల్లేరు కాయల పొడి   -   -----50 gr
                                    శొంటి పొడి                  ------50 gr
                                    ఉసిరిక పొడి                 ------50 gr

     అన్నింటిని కలిపి సీసాలో భద్ర పరచాలి. 

     రెండు గ్లాసుల నీటిలో రెండు టీ స్పూన్ల పొడిని వేసి మరిగించి రెండు కప్పుల కషాయం  మిగిలే విధంగా  కాచి దించాలి.

దీనిని రెండు భాగాలు చేసి రెండు పూటలా తాగాలి.తేనె కలుపుకొని కూడా తాగవచ్చు.  దీనితో మూత్రం సాఫీగా  జారీ అవుతుంది.

                     మూత్ర విసర్జనలో సమస్యలు --నివారణ                               

2. పిత్తజ మూత్ర కృచ్హము:-- 

    లక్షణాలు:--  మూత్రం వచ్చినట్లే వుండి రాకుండా వుండడం. అతి ప్రవర్తన, అతిగా వ్యాయామం చెయ్యడం,   అతిగా నడవడం, ఎక్కువ వేడిగా వున్న పదార్ధాలను ,ఎక్కువ చేదుగా వున్న పదార్ధాలను, వేడి  చేసే పదార్ధాలు  సేవించడం మొదలైన కారణాల వలన శరీరం లో ఎక్కువ వేడి పుట్టి పైత్యం ప్రకోపిస్తుంది.

 లింగ స్నానం :-- తొట్టిలోని చల్లటి నీళ్ళు పోసుకొని కూర్చోవాలి. చల్లటి గుడ్డతో మర్మాంగాన్ని మాటి మాటికి  తాకించాలి.  కూర్చోలేని వాళ్ళను పడుకోబెట్టి చెయ్యాలి. ఈ సమస్య ఎక్కువగా పురుషులకే వస్తుంది. స్త్రీలకు కూడా అదే విధంగా చెయ్యాలి.

లక్షణాలు:-- కళ్ళు ,ముఖం  ఎర్రగా వుంటాయి. మూత్ర విసర్జన సమయంలో చురుకు ఎక్కువగా వుంటుంది.
మూత్రం పసుపుగా, ఎర్రగా వస్తుంది. పొత్తికడుపు నొప్పి ఎక్కువగా వుంటుంది. దాహం ఎక్కువగా వుంటుంది.
ఆహారం:-- తాగేతపుడు,తాగినతరువాత చల్లగా వుండే కూల్ డ్రింక్స్ తాగాలి. చెరకు రసం, నల్ల ద్రాక్ష రసం వంటివి   తాగితే అప్పటికప్పుడు వేడి తగ్గుతుంది.

                                 కాచిన పాలు            ----100 ml
                                 చక్కర                   ----  50 gr

      రెండింటిని కలిపి కొంచం కొంచం గా తాగుతూ వుంటే వెంటనే వేడి తగ్గుతుంది.

      ఉసిరిక కాయల రసంలో గాని లేదా ఎండు ఉసిరిక ముక్కలను ఉడికించిన నీటిలో గాని లేదా రెండు టీ స్పూన్ల పొడిని వేసి కాచిన సగం నీటిలో గాని ఒక టీ స్పూను తేనె కలుపుకొని తాగితే  మూత్రంలో మంట, మూత్రం పసుపుగా రావడం, వేడి అన్ని నివారింప బడతాయి.

         మూత్ర సమస్యలు --నివారణ                                      

3. కఫజమూత్ర కృచ్హము:--

            ఇది మూత్రంలో కఫం చేరడం వలన వస్తుంది.

లక్షణాలు:-- మూత్రావయవాల్లో వాపు, మర్మాంగం మీద వాపు, మూత్ర నాళంవాపు వుంటుంది.

కఫ స్వభావం:-- పొట్ట ఉబ్బరం, అజీర్ణం

    పొత్తి పొట్ట మీద తైలం తో మర్దన చెయ్యాలి. నులక మంచం మీద బోర్లా పడుకోబెట్టాలి. మంచం తిరగేసి కోళ్ళకింద రాళ్ళు పెట్టాలి. నొప్పుల నివారణ ఆకులు నీటిలో వేసి బాగా మరిగించి ఆ పాత్రను మంచం కింద పెట్టాలి.

  తైలతో మర్దన చేసిన ప్రాంతం లో ఆవిరి తగిలేటట్లు పెట్టాలి.దీని వలన మూత్రం బయటకు వస్తుంది.

 నువ్వుల నూనెను ఎనిమా డబ్బాలో పోసి ఎక్కించాలి. తరువాత కొంచం సేపు అటు ఇటు తిరగాలి. దీని వలన మల విసర్జన త్వరగా జరుగుతుంది. కఫం బయటకు వస్తుంది.

ఉప్పు గాని, సైంధవ లవణం గాని ఒక లీటరు నీటిలో వేసి తాగడం వలన కఫం బయటకు వస్తుంది.

      కఫం యొక్క స్వభావం శీతలం. శీతలం ఎక్కువైతే నాడులు బిగుసుకు పోతాయి. నోట్లో అరుచి, పొట్టలో అజీర్ణం వుంటాయి.

ఆహారం :-- బార్లీ, వేడి పానీయాలను తాగించ వచ్చు.

                             అల్లం రసం             ---ఒక టీ స్పూను
                             నిమ్మరసం            ----ఒక టీ స్పూను
                             తేనె                    ---- ఒక టీ స్పూను

      అన్నింటిని కలిపి తాగాలి.

      కొండ పిండి వేళ్ళను చిన్న ముక్కలుగా చేసి దంచి పొడి చేసుకోవాలి.  పావు టీ స్పూను లేక
అర టీ స్పూను    పొడిని పలుచని,తియ్యనిమజ్జిగలోకలుపుకొని  ఉదయం, మధ్యాహ్నం,సాయంత్రం తాగాలి.

     ఆహారం, అన్నం, కూరలు వేడి వేడిగా  తినాలి.

                             మూత్ర విసర్జనలో సమస్యలు --నివారణ                     

4.. త్రిదోషజ మూత్ర కృచ్చ సమస్య:--

          వాత, పిత్త, కఫములు మూడు ఒకే సారి ఏర్పడితే ఈ సమస్య వలన ఇంతకు ముందు చెప్పబడిన మూడు  సమస్యలు ఏర్పడతాయి.

         జలము తో ఈ సమస్యను నివారింప వచ్చు. మెత్తని గుడ్డను తీసుకొని తడిపి నాలుగు మడతల తో గోచి పెట్టుకోవాలి.(మర్మాంగానికి కట్టాలి). పైన పొడి గుడ్డ కట్టాలి. తరువాత నాభి నుండి చట్టు కలిసేట్లు కట్టాలి. తరువాత ఉలన్ గుడ్డను లేక లావు గుడ్డను కట్టాలి. అంటే మూడు గుడ్డలు .

వాపు, పోటు,మంట ఒకే సారి వస్తే :---

శతావరి(పిల్లిపీచర వేర్లు) తెచ్చి ముక్కలు చేసి ఎండబెట్టి నిల్వ చేసుకోవాలి. ఒక లీటరు మంచి నీటి లో 50 గ్రా దుంపలు వేసి పావు లీటరు కషాయం మిగిలే వరకు కాచాలి.  దించి వడపోసి చల్లార్చి దీనిని మూడు భాగాలు చేసి ఉదయం, మధ్యాహ్నం, రాత్రి ఒక టీ స్పూను తేనెను కలిపి తాగాలి.


                                                 శతావరి వేర్ల పొడి కషాయం
                                                                తేనె

               మూత్ర విసర్జనలో సమస్యలు --నివారణ                              

5. మూత్ర కృచ్చ శల్యజ అభిఘాత సమస్యల నివారణ

            శల్యజ    = గుచ్చుకోవడం వలన కలిగే
            అభి ఘాత  = దెబ్బలు తగలడం

        దెబ్బ తగిలిన చోట నువ్వుల నూనె తో గాని ఓమ తైలంతో ;గాని గోరువెచ్చగా సున్నితంగా మర్దన చెయ్యాలి. కాపడం పెట్టాలి. పొత్తి కడుపు మీద, ఇంకా కింద కాపడం పెట్టాలి. ఎనిమా ఇవ్వడం, టేబుల్ లాంప్ కు బ్లూ కలర్

కాగితాన్ని చుట్టి ఎదురుగా పెట్టుకొని (మోకాళ్ళ పై కూర్చొని)   నీలి రంగు కిరణాలు ప్రసరించేటట్లు పెట్టుకోవాలి
ఒక నీటితో నిండిన గాజు గ్లాసుకు నీలి రంగు కాగితాన్ని చుట్టి ఒకటి లేదా రెండు గంటలు ఎండలో వుంచి తాగితే మూత్ర విసర్హ్జన సులభంగా జరుగుతుంది.

     పడుకొని నెమ్మదిగా గాలి పీల్చి వదలాలి. (భావనా పూర్వక వ్యాయామం)

ఆహారం:-- 

     పై సమస్య వాహనాల వాడకం వలన జరగవచ్చు.
                                మర్రి చెట్టు బెరడు
                                రావి చెట్టు బెరడు
                                మేడి (అత్తి)చెట్టు బెరడు
                                జువ్వి చెట్టు బెరడు
                                గంగ రావి చెట్టు బెరడు

     అన్నింటిని సమాన భాగాలుగా తీసుకొని కడిగి దంచి రసం తీసి చెరువులోని జిగట కలిగిన శుభ్రమైన మెత్తని బంకమట్టి లో కలిపి పట్టు వెయ్యాలి.  గాయమైతే గాయం పై పలుచని గుడ్డ కప్పి దానిపై మట్టి పట్టి వెయ్యాలి.

    పైన చెప్పినవన్నీ దొరకక పోతే ఒక్క బెరడుతో నైనా చేసుకోవచ్చు .

                        మూత్ర విసర్జనలో సమస్యలు --నివారణ                        

6. పురీషజ మూత్ర కృచ్చ సమస్య :--

       ఈ సమస్య మలము బంధించ బడుట వలన మూత్రము సరిగా రాక పోవడం వలన వస్తుంది.
      బెడ్ లైట్ కి ఎర్ర కాగితాన్ని చుట్టి పొత్తి కడుపు పై ఐదు నుండి పది లేక పదిహేను నిమిషాలు ఆ కాంతి  పడేటట్లు స్విచ్ ఆన్ చేసి కూర్చోవాలి.  దీనితో మలము, మూత్రము సాఫీగా జారీ అవుతాయి.

     నీళ్ళ గ్లాసుకు ఎర్ర కాగితం చుట్టి ఎండలో పెట్టి కొంతసేపు తరువాత ఆ నీటిని తాగాలి.

యోగాసనం :--1. దీర్ఘ భస్త్రిక :-- పాదాలను గట్టిగా బిగించి ఆపగలిగినంత సేపు ఆపి తరువాత నెమ్మదిగకాలును జరపాలి.

ఆహారం:--

   పల్లేరు కాయల కషాయం   :--

     రెండు గ్లాసుల నీటిలో రెండు స్పూన్ల పల్లేరు కాయల పొడి కలిపి వేడి చేసి కషాయం దించి దానిలోరెండు లేక మూడు చిటికెల  యవాక్షారం కలిపి ఉదయం, సాయంత్రం ఒక్కొక్క గ్లాసు చొప్పున తాగాలి.

               మూత్ర విసర్జనలో సమస్యలు --నివారణ                   

7. అశ్మరి మూత్ర కృచ్చ సమస్య:     అశ్మరి అనగా రాళ్ళు

    ఆహారం:-- గుమ్మడి కాయ కూర, అరటి దుంప లేక దూట, ముల్లంగి దూట, తెల్ల గలిజేరు, నేలఉసిరి, కొండపిండి కూర, ఉలవ చారు, ఉలవ గుగ్గిళ్ళు తింటే మూత్ర పిండాలలో రాళ్ళు రావు.

    మూత్ర పిండాలలో రాళ్ళు ఏర్పడితే నడుము నొప్పి, పొత్తి కడుపులో విపరీతమైన నొప్పి ఏర్పడుతుంది.

    మర్మాంగానికి చల్లని నీటితో తడిపిన గుడ్డను అంటించాలి.

   ఒక కప్పు నీటిలో కొన్ని ఉలవలు వేసి కాచి ఆ నీటిలో సైంధవ లవణం కలుపుకొని త్రాగితే నొప్పి వెంటనే  తగ్గుతుంది

యోగాసనం:-- కటి చక్రాసనం పది, పన్నెండు సార్లు చెయ్యాలి.

లక్షణాలు:-- . రాయి ఏర్పడి మూత్రం సరిగా రాక నొప్పి గా వుంటుంది. థైరాయిడ్ గ్రంధి సరిగా పని చేయకపోతే  రాళ్ళు ఏర్పడతాయి. ఈ గ్రంధి కాల్షియం ను రక్తానికి సరిగా అందించక రాళ్ళు ఏర్పడతాయి.

                కొండ పిండి వేళ్ళు                        ---- 50 gr
                                 నీళ్ళు                      ---- ఒక లీటరు

      వేళ్ళను నీటిలో వేసి పావు లీటరు కషాయం మిగిలే వరకు కాచి  వదపోయ్యాలి.  దీనిని మూడు భాగాలు గా చేసి మూడు పూటలా మూడు గ్లాసులు తాగాలి.  లేదా
     ఉలవలను ఒక గ్లాసు నీటిలో వేసి ఉడికించి పావు గ్లాసు వరకు రానిచ్చి సైంధవ లవణం కలుపుకొని  ఆ నీటిని తాగాలి.

                              మూత్ర విసర్జనలో సమస్యలు --నివారణ                       14-3-09.

8.శుక్రజ మూత్ర కృచ్హ సమస్య :--       శుక్రము    = వీర్యము

         ఇది స్వస్థానము విడిచి మూత్ర నాళము చేరి మూత్రమును రానీకుండా అడ్డుపడి మూత్రం బొట్లు బొట్లు గా రావడం దీని లక్షణం .

         దీనికి గోరువెచ్చని లింగ స్నానం చెయ్యాలి.  ఒక టబ్బులో గోరువెచ్చని నీటిని పోసి లింగం మునిగేటట్లు కూర్చోవాలి. గోరువెచ్చని నీటితో ఐదు నిమిషాలు తడపాలి.

1. నౌకాసనం  2. వక్రాసనం

         కామోద్దీపన అది ఏ సమయం లో జరగాలో అదే సమయం లో జరగాలి. వాల్ పోస్టర్లు, ఇంటర్నెట్, టీవీలలో అర్ధ నగ్న ప్రదర్శనలు కనిపించడం వలన కామోద్దీపన జరిగి శుక్రం స్వస్థానం నుండి జారి మూత్ర నాళం లోనికి వెళుతుంది. ఈ సమస్య వీర్యాన్ని ఆపడం వలన కూడా ఏర్పడుతుంది.

                                            శుద్ధి చేయబడిన గోమూత్ర శిలాజతు        ---- 3 చిటికెలు
                                                                                 పాలు          ---- 10 gr
                                                                                 వెన్న          ---- 10 gr
                                                                                 నెయ్యి         ---- 10 gr
                                                                                 చక్కర         ---- 10 gr
                                                                                 తేనె             ---- 10 gr

        పై పదార్దాలన్నింటిని ఒక కప్పులో వేసి శిలాజతు కలుపుకొని తాగాలి.

2.  అతిబల వేర్లను దంచిన పొడి, లేదా అప్పటికప్పుడు తెచ్చి నలగగొట్టి నీళ్ళలో వేసి కషాయం సగానికి దించి   గోరువెచ్చగా అయిన తరువాత ఒక టీ స్పూను తేనె కలిపి తాగాలి.

                    అన్ని రకాల మూత్ర సమస్యల నివారణ                                 

   1                           యాలకుల పొడి                        ------  పావు టీ స్పూను
                              ఉసిరిక రసం లేదా కషాయం      ------ 

       ఇవి రెండు కలిపి తాగితే ఇంతకు ముందు చెప్పబడిన 8 రకాల మూత్ర సమస్యలు నివారింప బడతాయి.

2.                             త్రిఫల చూర్ణం
                                సైంధవ లవణం

      రెండింటిని నీటితో కలిపి తాగితే మూత్ర సమస్యలు నివారింప బడతాయి.

      అనగా 8 రకాల వ్యాధులకు ఒకటే నివారణ అన్న మాట.

యోగాసనం:--

1. భోజనం చేసిన తరువాత వజ్రాసనం వేసుకోవాలి,దీని వలన అన్ని వ్యాధులు నివారింప బడతాయి.

2. శశాంక ఆసనం   3. ఉద్దాన పాదాసనం

తినదగినవి:-- ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, పొట్టు తీయని పాత బియ్యం, బూడిద గుమ్మడి కాయ   అరటి దూట, ముల్లంగి, పొట్ల కాయ, దోస మొదలైనవి తినవచ్చును.

తినకూడనివి:-- మాంసాహారం, అతి దాహకర పదార్ధాలు(గిట్టనివి),కొత్త బియ్యం, గేదె పెరుగు, అతి పుల్లని   పదార్ధాలు తిన కూడదు. అతి నడక. అతి వ్యాయామం పనికి రావు. 

           మూత్ర బంధ సమస్య ---నివారణ                                  
 
నువ్వులు                ---100 gr  (నల్ల నువ్వులు లేదా తెల్ల నువ్వులు)
పత్తి గింజలు            --- 100 gr
 
    ఒకబాణలి లోనువ్వులను,పత్తి గింజలను వేసి నల్లగా మాడి బూడిద అయ్యే వరకు వేయించాలి. పొగ తగ్గి 
చల్లారిన తరువాత దంచి జల్లించి సీసాలో భద్ర పరచుకోవాలి.
 
పిల్లలకు                   ----  ఒక గ్రాము 
పెద్దలకు                   ----  మూడు వేళ్ళకు వచ్చినంత
 
       ఒక కప్పు తియ్యటి పెరుగులో కలుపుకొని ఉదయం, సాయంత్రం తీసుకోవడం వలన మూత్ర బంధసమస్యలు 
నివారిమ్పబడి మూత్రం సాఫీగా జారీ అవుతుంది.
 
      అతి చేదు, అతి పులుపు,అతి వగరు వున్న పదార్ధాలు తినరాదు. త్వరగా జీర్ణం గాని పదార్ధాలు తినరాదు.
ముందు తిన్న ఆహారం పూర్తిగా జీర్ణమైన తరువాతనే మరలా ఆహారం తీసుకోవాలి.
 
మూత్రం ధారాళంగా రావడానికి --- గులాబి పానీయం.                  6-6-09.
 
   1.                               తాజా గులాబి రేకులు         ----20 gr
                                                       నీళ్ళు            ---- పావు లీటరు

          రాత్రి వేళ గులాబి రేకులను నీటిలో వేసి బాగా కలియబెట్టి నానబెట్టాలి. ఉదయం వాటిని చేతితో బాగా
పిసికి  వడ  పోసుకోవాలి.  ఆ నీటిలో రెండు టీ స్పూన్ల చక్కర కలిపి ఆ నీటిని తాగితే వెంటనే మూత్రం ధారాళంగా  జారీ అవుతుంది.
\
         దీనిని రోజుకు రెండు మూడు సార్లు తాగవచ్చు. ఉదయం నానబెట్టి సాయంత్రం, సాయంత్రం నానబెట్టి  ఉదయం తాగాలి.

2. ధనియాలను దంచి, చేరిగితే పప్పు వస్తుంది. దానిని పొడిగా చేసుకొని ఒక టీ స్పూను పొడిలో తగినంత  చక్కెర కలుపుకొని నాలుకతో అద్దుకొని తినాలి.  మూత్రం ఎర్రగా వస్తున్నా, బొట్లు బొట్లుగా వస్తున్నా, అసలే రాకున్న రాళ్ళు అడ్డుపడి రాకున్న దీనిని వాడితే మూత్రం సులభంగా జారీ అవుతుంది.

3. పలుచని తియ్యని మజ్జిగలో చక్కెర కలుపుకొని తాగితే మూత్రం సులభంగా జారీ అవుతుంది.

   బహిష్టు సమస్యల వలన వచ్చే మూత్ర సంబంధ వ్యాధులు --నివారణ                           1-7-09
.
లక్షణాలు:-- మోకాళ్ళ దగ్గర నీరు చేరి చొట్టలు పడడం.

     మట్టి పట్టిని పొత్తి కడుపుపై వేసుకోవాలి. ప్రతి రోజు అర గంట చొప్పున 6,7 సార్లు వేసుకోవాలి.  అత్యవసర పరిస్థితులలో నూలు గుడ్డను చల్లటి నీటిలో ముంచి నీళ్ళు పిండకుండా నాభి మీదుగా నడుము చుట్టూ చుట్టాలి.
దానిపై పొడిగా వున్న పలుచని గుడ్డను, దానిపై లావు టవలును చుట్టాలి. ఈ విధానం చాలా అద్భుతంగా  పని చేస్తుంది.  ఉదయం, సాయంత్రం చేస్తే తప్పకుండ మూత్ర సమస్యలు నివారింప బడతాయి.
    ఎక్కువగా వ్యాయామం చేయడం, అసలే చేయక పోవడం, ఆకలి వున్నా తినక పోవడం, ఆకలి లేకపోయినా తినడం వంటి కారణాల వలన ఈ సమస్యలు వస్తాయి.

                           అతిమూత్ర సమస్య --- నివారణ                                   

   మట్టి పట్టి వేసుకోవాలి, అరగంట తరువాత తీసేయ్యాలి.

      ప్రాణాయామం లో కపాలభాతి, ఉడ్యాన బంధం, మూలబంధం మొదలగునవి చెయ్యాలి.

   ఎక్కువ నీరు త్రాగడం వలన మూత్ర సంచి వదులైపోతుంది. దాని వలన అతిమూత్ర సమస్య ఏర్పడుతుంది.

     మూత్రాన్ని బంధించా కూడదు. అన్నం తినడం మానెయ్యాలి.

    పాత రాగులను నానబెట్టి మొలకలు వచ్చిన తరువాత ఎండబెట్టి నెయ్యి వేసి వేయించి పొడి చేసి నిల్వ చేసుకోవాలి. తగినంత తీసుకొని జావ కాచి దానిలో మజ్జిగ కలుపుకొని తాగితే తప్పక తగ్గుతుంది. దీనిలో చక్కెర కూడా వాడుకోవచ్చు.

తంగేడు ఆకులు
తంగేడు పూలు

   రెండింటిని నీళ్ళలో వేసి కాచి ఆ నీటిని తాగాలి.

   మామిడి ఆకులను ఎండబెట్టి దంచి పొడి చేసి రెండు చిటికెల పొడిని తిని నీళ్ళు తాగితే తగ్గుతుంది.

   రాలిన మామిడి పిందెలు ముక్కలు చేసి ఎండబెట్టి పొడి చేసి దానిని నీళ్ళలో కలుపుకొని తాగితే అతి మూత్ర సమస్య నివారింపబడుతుంది.

   మూడో పట్టు తవుడు జల్లించి డబ్బాలో నిల్వ చెయ్యాలి. దీనితో రొట్టె తయారు చేసుకొని మట్టి మూకుడులో నెయ్యి రాసి కాల్చి దానిపై  నెయ్యి రాసి కూర వేసుకొని తినాలి.

   దీని వలన రక్త వృద్ధి జరుగుతుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. నడకలో వేగం హెచ్చుతుంది.

                            మూత్రంలోని మలినాల సమస్య --నివారణ                       

   మట్టి పట్టి వేసుకోవాలి. లింగ స్నానం అత్యుత్తమమైనది .రోజుకు ఐదు నిమిషాల చొప్పున 15,20 రోజులు చేస్తే మూత్ర సమస్యలే వుండవు.

ఉడ్యానబంధము, ఉదరచాలనము, మేరుదండాసనం,కటి చక్రాసనము, కపాల భాతి ప్రాణాయామము
చెయ్యాలి.

ఆహారం:--

  ఒక కప్పు మంచి నీటిలో ఒక టీ స్పూను మేలు రకమైన టీ పొడి వేసి వేడిచేసి అర కప్పుకు మరిగే
వరకు మరిగించాలి. వడపోసి అర కప్పు మంచి నీళ్ళు కలిపి ఉదయాన్నే పరగడుపున తాగాలి. ఒక గంట వరక ఏ పానీయము గాని, నీరు గాని, ఆహారం గాని తీసుకో కూడదు.

    ఉదయాన్నే రోగి యొక్క మొదటి మూత్రాన్ని ఒక గాజు గ్లాసులోకి పట్టాలి.  అది పసుపుగా వుండాలి. దుర్వాసన
వుండకూడదు. చిక్కగా, మడ్డిగా వుండకూడదు.

    పైన చెప్పబడిన టీ డికాషన్ ను తాగుతూ వుంటే మరలా మూత్రాన్ని పరిశీలిస్తే శుభ్రంగా వుంటుంది.

    " ఇది అనుభవం ద్వారా చెప్పబడినది"

    ఉలవలను (మూత్ర పిండాల ఆకారంలో వుంటాయి)  అప్పుడప్పుడు గుగ్గిళ్ళు, చారు రూపంలో వాడాలి. ఇవి మూత్ర పిందాలలోని రాళ్ళను కూడా కరిగిస్తాయి.  మలినాలను తొలగిస్తాయి.
 శరీరాన్ని చల్లబడనివ్వకుండా   ఉలవలు ఉష్ణాన్ని కాపాడతాయి.

    ముల్లంగి ఆహారంగా చాలా మంచిది,

సూచనలు  :-- మల మూత్రాలను ఆపకూడదు, వెంటనే విసర్జించాలి.
     పిల్లలు నిలబడి మూత్ర విసర్జన చెయ్యకూడదు. కూర్చుని మాత్రమే చెయ్యాలి.

                              తులసితో మూత్ర వ్యాధుల నివారణ                                        2-3-10.

    మూత్రాన్ని ఎక్కువసేపు ఆపివుంచడం వలన, అతివేడి పదార్ధాలను, అతి చల్లని పదార్ధాలను సేవించడం వలన, అజీర్ణ పదార్ధాలను తినడం వలన మూత్ర వ్యాదులు వస్తాయి. అంతే కాక, చెడు ప్రదేశాలలో, రోగులు   విసర్జించిన చోట మూత్ర విసర్జన చేయడం వలన కూడా మూత్ర రోగాలు వస్తాయి. కఫం ఎక్కువైనపుడు కూడా మూత్ర వ్యాధులు వస్తాయి.

    బంకమట్టిని పలుచని తడి గుడ్డకు దట్టంగా పూసి పట్టి లాగా చేసి పొత్తి కడుపుమీద వెయ్యాలి.
    స్త్రీలు, పురుషులు కూడా లింగ స్నానం చెయ్యాలి.  దీని  వలన మరామ్గంలోని నాడుల ద్వారా నీటి తరంగాలుమెదడుకు చేరతాయి.  దీని వలన నపుంసకత్వం, మూత్రం రాకపోవడం, మూత్రంలో తెలుపు పోవడం వంటివి నివారింప బడతాయి. లింగ స్నానం ఐదు నిమిషాలు మాత్రమే చెయ్యాలి. లేచి కొద్దిసేపు నడవాలి. దీని వలన వాయు, రక్త ప్రసరణలు బాగా జరిగి  శరీరం చైతన్య వంతమవుతుంది.

     అధికంగా నీటిని సేవించరాదు.     అతి సర్వత్ర వర్జయేత్

     ప్రతి రోజు రాత్రి పూట రాగి చెంబులో ఒక గ్లాసు నీటిని పోసి ఉదయం లేవగానే ఆనీటిని తాగితే ఎంతో ఆరోగ్యకరం.

      ఆరు గజాల పొడవు రెండు జానల వెడల్పు వున్న నూలు గుడ్డను తీసుకొని చల్లటి నీటిలో ముంచి పిండి రోగి యొక్క నాభి నుండి తొడల వరకు చుట్టాలి. దాని పై పొడి గుడ్డను చుట్టాలి. దాని పై అంతే పొడవు, అంతే వెడల్పు వున్న దుప్పటి వంటి మందమైన  పొడి గుడ్డను చుట్టాలి.

     దీని వలన అన్ని రకాల మూత్ర వ్యాధులు నివారింప బడతాయి.

     మూత్రము తగినంత మాత్రమే రావాలి. మూత్రము ఊర్ధ్వ ముఖంగా పయనిస్తే  శరీరంలో నీరు, ఉబ్బు వస్తాయి.

     పూర్వ కాలంలో నడుము వరకు శరీరాన్ని నీటి తొట్టిలో వుంచి తొట్టి స్నానం చేసే వారు. దీని వలన శరీరం చల్లబడుతుంది.

      కృష్ణ తులసి సమూలంగా తెచ్చి కడిగి ముక్కలు చేసి ఎండబెట్టి దంచి అతి మెత్తని చూర్ణాన్ని తయారు చేసుకొని సీసాలో భద్ర పరచుకోవాలి.

పిల్లలకు              --- ఒక చిటికెడు లేదా ఒకటినుండి  మూడు చిటికెలు
పెద్దలకు              --- పావు టీ స్పూను

       రెండు టీ స్పూన్ల నిమ్మ రసం లో ఈ పొడిని కలుపుకొని కొంచం కొంచం గా మెల్లగా సేవిస్తూ వుండాలి.

దీని వలన సమస్త మూత్ర రోగాలు నివారింప బడతాయి.

                                 అతి  మూత్ర సమస్య --నివారణ                                            17-5-10.

       తంగేడు మొక్కల వేర్లను సేకరించి కడిగి ఎండబెట్టి దంచి పొడిని నిల్వ చేసుకోవాలి.

తంగేడు వేర్ల పొడి            ---- పావు టీ స్పూను
మేక పాల వెన్న             ---- ఒక టీ స్పూను

      రోజుకొకసారి చొప్పున ;పరగడుపున  40 రోజులు వాడితే ఈ సమస్య పూర్తిగా నివారింపబడుతుంది.

ఆహార నియమాలు-- అతిమూత్రం సమస్య వున్నవాళ్ళకు మధుమేహం వుండే అవకాశం కలదు.వాళ్ళు కూడా ఈ ఔషధాన్ని వాడవచ్చు. దీని వలన మధుమేహం నియంత్రించ బడుతుంది, కఫం తగ్గుతుంది.

                           అతి మూత్ర వ్యాధి నివారణ ----అగ్నివేశ చూర్ణము                    12-7-10.
 
దోరగా వేయించిన శొంటి పొడి               ---- 50 gr
                    కలకండ పొడి                ---- 50 gr
 
       రెండింటిని కలిపి ఒక సీసాలో భద్ర పరచాలి.
 
 అర టీ స్పూను పొడిలో ఒకటీస్పూను నెయ్యి కలిపి తినాలి. పిల్లలకు వాళ్ళ వాళ్ళ స్థాయిని బట్టి ఇవ్వాలి.

              మూత్ర నాళంలో రాళ్ళు ఏర్పడి మూత్రం బొట్లు బొట్లుగా రావడం                    23-11-10.
 
       అరటి బోడెను దంచి రసం తీసి ఒక గ్లాసు రసానికి కొంచం యాలకుల పొడి కలిపి మూడు పూటలా వాడాలి    రాళ్ళు పడిపోతాయి.
         మూత్రపు సంచి వాపు వలన ఏర్పడే మూత్ర సమస్యలు--నివారణ                       6-7-10.

      మూత్రపు సంచి వాపు వలన మూత్రానికి సరిగా పోలేక పోవడం, మాటి మాటికి మూత్రానికి పోవాలని అనిపించడం వంటి సమస్యలు వుంటాయి.

      మూత్రపు సంచి లేక ప్రోస్త్రేట్  గ్రంధి మూత్ర సంచి నుండి వచ్చే మూత్ర నాళము చుట్టూ లోపలి వైపుకు వుంటుంది.

వరుణ చెట్టు (ఉలిమిరి చెట్టు) యొక్క బెరడును తెచ్చి ఎండబెట్టి దంచి పొడి చేసి సీసాలో నిల్వ చేసుకోవాలి.

      ఒక పాత్రలో 50  గ్రాముల పొడిని  వేసి అర లీటరు నీళ్ళు పోసి స్టవ్  మీద పెట్టి 100 ml  కషాయం మిగిలే వరకు నెమ్మదిగా  కాచాలి.  వడకట్టి  గోరువెచ్చగా ఉదయం పరగడుపున తాగాలి.

     దీని వలన రాత్రి పూట ఎక్కువసార్లు మూత్రానికి వెళ్ళడం తగ్గుతుంది.

                                మూత్రంలో మంట నివారణకు --చిట్కా                                      27-9-10.

    దోసకాయలలోని గింజలను ఎండబెట్టి  దాచిపెట్టుకోవాలి.  వాటిని అప్పుడప్పుడు తింటూ వుంటే మూత్రంలో మంట తగ్గుతుంది.

                           Prostate  Gland  -- పౌష్య గ్రంధి వాపు -- నివారణ                         2-10-10.

  ఈ గ్రంధిగ్రంధి వాచినపుడు  పురుషులలోని మూత నాళము చుట్టూ ఉంగరం లాగా వుంటుంది. దీని వలన మూత్ర విసర్జన సరిగా జరగదు.  దీని వలన చిన్న ఇబ్బందులు తప్ప పెద్ద ప్రమాదమేమి వుండదు.  50 సంవత్సరాల వయసు దాటిన  90 శాతం పురుషులలో ఇది వయసుతోబాటు వచ్చే సాధారణ మార్పు.  ఇది    హార్మోన్లలో తేడాల వలన గాని లేదా కండరాల పెరుగుదల వలన గాని వస్తుంది.

       జలుబు మందులు ముఖ్యంగా బెనడ్రిల్ వంటి మందులు ఈ వ్యాధిని ఎక్కువ చేస్తాయి.
లక్షణాలు :--  మూత్ర కోశం ఖాళి కావడంలో సమస్య ఏర్పడుతుంది. మూత్ర విసర్జనకు, మూత్ర ప్రవాహానికి  ముక్క వలసి వస్తుంది. మాటి మాటికి వెళ్ళాలనిపిస్తుంది. మూత్ర విసర్జన సమయంలో నొప్పిగా వుంటుంది.

మూత్రకోశంలో కొంత మూత్రం మిగిలిపోవడం  రాత్రి వేళ మాటి మాటికి వెళ్ళవలసి రావడం జరుగుతూ వుంటుంది.  అర్జంటుగా వెళ్లాలని  అనిపించడం   వంటి లక్షణాలు వుంటాయి.

సూచనలు ;-- బలవంతంగా ఒత్తిడి ప్రయోగించకూడదు.  ముక్క కూడదు.  నీటిని ఎక్కువ శాతం ఒకే సారి తాగకూడదు. సాయంత్రం ద్రవాహారాన్ని తగ్గించాలి.

       శృంగార పరంగా ఉత్సాహంగా వుంటే శుక్ర కణాల ద్వారా ఈ వాపు కొంత పోతుంది. 

       కటి వలయపు కండరాలను పెంచాలి.  అనగా ఆ కండరాలను పది నిమిషాల సేపు బిగించి వదులుతూ వుండాలి  దీని వలన ప్రోస్త్రేట్ గ్రంధి వ్యాధి గ్రస్తం కాదు.

        గుమ్మడి గింజల పప్పు,ప్రొద్దుతిరుగుడు  గింజల పప్పు, వేరు శనగ పప్పు, జీడి పప్పు మొదలైన జింక్ ఎక్కువగా వున్నగింజలను వాడుతూ వుంటే వాపు అదుపులో వుంటుంది.

అతి మధురం పొడి
గుమ్మడి గింజల పప్పుల పొడి

        రెండింటిని కలిపి తీసుకోవడం వలన గ్రంధి వాపు అదుపులో వుంటుంది.
                                          చిట్కా                                                              30-11-10.

        తెల్ల గలిజేరు ఆకు ను వారానికి ఒకసారి కూర వండుకుని తింటే మూత్ర సమస్యలు నివారింప బడతాయి.

                          మూత్రం బొట్లు బొట్లుగా రావడం -- నివారణ                               19-12-10.

         మూత్రం చాలా త్వరగా వస్తున్నట్లు అనిపించడం,  అసలే రాకపోవడం వంటి లక్షణాలు వుంటాయి.
         గనేరియా వంటి వ్యాదులలో మూత్రంతో బాటు చీము రావడం జరుగుతుంది.

                                                                     చందనాది  వటి
అతిమధురం                   ---- 30 gr
చలవ మిరియాలు           ---- 30 gr
సురేకారం                       ---- 10 gr
తుమ్మ జిగురు              ----  30 gr
రూమి ముస్తకి                ----  10 gr
చందన తైలం                 ----  10 gr
కోసైవా నూనె                  ----  10 gr
పన్నీరు                       ----   10 gr

       తుమ్మ జిగురు పొడిని కల్వంలో వేసి పన్నీరు పోస్తూ నూరాలి.  దీనికి మిగిలిన పదార్ధాలు  కలిపి ముద్దగా మైనం లాగా నూరాలి. . చివరలో దీనికి కోసైబా నూనె కలపాలి.

       రెండు గ్రాముల మోతాదులో మాత్రలు తయారు చేసి ప్లేటులో  విడివిడిగా వేసి నీడలో ఆరబెట్టాలి. బాగా ఆరిన  తరువాత గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి.

       పూటకు ఒక మాత్ర చొప్పున ఉదయం,  మధ్యాహ్నం,  రాత్రి వాడాలి.  సమస్య తీవ్రంగా వుంటే  రోజుకు నాలుగు  సార్లు వాడాలి.  దీనితో అన్ని రకాల మూత్ర సమస్యలు నివారింప బడతాయి.

            అనువుగాని సమయంలో మూత్ర విసర్జనకు వెళ్లాలని  అనిపిస్తే                  21-12-10.


     ఏదైనా ఇంటర్వ్యూ లో వున్నపుడు గాని,  ఎవరితోనైనా అత్యవసరంగా మాట్లుడున్నపుడు గాని, బయట వీలుగాని ప్రదేశాలలో వున్నపుడు గాని మూత్ర విసర్జనకు వెళ్ళాలని అనిపిస్తే మనసును వీ విషయం మీదికి  మళ్లించాలీ.  ఉదాహరణకు శృంగార భావన,  భక్తి భావన,  ఏదైనా ఉద్యానవనంలో  వున్నట్లు, మంచి  సంగీతాన్ని వింటున్నట్లు  సుగందాన్ని ఆస్వాదిస్తున్నట్లు  గా భావిస్తే మూత్ర విసర్జనకు వెళ్ళాలనే భావనను తగ్గించుకోవచ్చు.

     ఈ విధంగా అత్యసర పరిస్థితులలో మాత్రమే  చేయాలి.  అంతేగాని  మూత్ర ప్రవాహాన్ని మాటి మాటికి ఆపకూడదు. దీని వలన సమస్యలు ఏర్పడతాయి.
                  
                       అతి మూత్రం --నివారణ                                                           27-12-10.
 
1. అల్లనేరేడు గింజల చూర్ణాన్ని ప్రతి రోజు ఒక టీ స్పూను ఉదయం,  సాయంత్రం మంచి నీటితో తీసుకోవాలి.
 
2. తంగేడు గింజల పొడి                   --- 100 gr
    గసాలు                                     --- 100 gr
    నల్ల నువ్వులు                          ----100 gr
 
        అన్నింటిని విడివిడిగా దంచి చూర్నాలు చేసి  కలిపి నిల్వ చేసుకోవాలి.
        ఒక టీ స్పూను పొడిని  కషాయం  కాచుకొని తాగాలి.

3.  మర్రి
     మేడి
     నల్ల తుమ్మ

           చెట్ల యొక్క  బెరడులను తెచ్చి కషాయం కాచాలి.  దీనిని తాగాలి.

                                                 మూత్రంలో మంట                                                12-3-11.

             వేడి టీ           --- ఒక కప్పు      
             నిమ్మరసం     ---  ఒక టీ స్పూను

      రెండింటిని కలిపి తాగితే మూత్రంలో మంట తగ్గుతుంది.

                             
                                      మూత్రాశయంలో  మంట                                           15-3-11.

              శరీరంలో నీటి శాతం తగ్గడం వలన మూత్రం  చిక్కబడి మలినాలు తొలగించబడక  మంట
     వస్తుంది.  దీనివలన రాళ్ళు ఏర్పడే అవకాశం కలదు.  మరియు  మూత్ర పిండాలలో సమస్యలు
     ఏర్పడే అవకాశం కలదు.

    గోక్షూరాది  గుగ్గులు
    చందనాసవం
    ఉషీరాసవం

          వీటిలో ఏదైనా వాడుకోవచ్చు.

     1.   సుగంధపాల వేర్ల పొడి        
                      చక్కెర

                 పొడితో కషాయం కాచుకుని చక్కెర  కలుపుకుని తాగాలి.

      2.   వట్టివేర్ల పొడి
            సుగంధపాల వేర్ల పొడి


                     రెండింటిని సమాన భాగాలుగా తీసుకుని కషాయం కాచి దానికి చక్కెర  కలుపుకుని
            తాగాలి.

            దీనిని వాడడం వలన మూత్రాశయ సమస్యల నివారణే  కాక,  దాని వలన వచ్చే ఇన్ఫెక్షన్
      కూడా నివారింపబడుతుంది.

      3.  పల్లేరుకాయల మెత్తటి పొడి                   ---  100 gr
           కొండపిండి యొక్క సమూలం పొడి           --- 100 gr

      రెండింటిని కలిపి నిల్వ చేసుకోవాలి.

      ప్రతి రోజు రెండు టీ స్పూన్ల పొడిని నీళ్ళలో వేసి కషాయం కాచి చక్కెర  కలిపి తాగాలి.

               మూత్రమార్గంలో ఇన్ఫెక్షన్ --నివారణకు తమలపాకు పాలు               29-3-11.

                                                నాగవల్లీ క్షీరం

      e --కోలై  అనగా కోలన్ లో నివసించే బ్యాక్టీరియ  అని అర్ధం .

      లక్షణాలు:--     కోలన్ నుండి ఇన్ఫెక్షన్ మూత్ర మార్గంలోకి చేరడం, పరిశుభ్రత లేకపోవడం,
      మూత్ర పిండాలలో రాళ్ళు,  మూత్ర విసర్జన సరిగా చేయక పోవడం,  మొదలైన కారణాల
      వలన మూత్రమార్గంలో ఇన్ఫెక్షన్ చేరుతుంది. .

          తమలపాకులు                   --- 6
                 పాలు                         --- 250 ml
                  తేనె                           --- ఒక పెద్ద స్పూను

            తమలపాకులను  శుభ్రంగా కడగాలి.  కల్వాన్ని శుభ్రంగా కడిగి ఆకులను వేసి మెత్తగా
     నూరి  గుడ్డలో వేసి రసం పిండాలి. దీనిని  గోరువెచ్చని పాలలో కలపాలి. తరువాత తేనె కలిపి
     బాగా కలిపి  గ్లాసులో పోసుకుని తాగాలి.

           దీనిని కనీసం ఒకటి రెండు నెలలు వాడాలి.

     సూచనలు:--  ఈ వ్యాధి మాటిమాటికి రాకుండా ఉండాలంటే ఒక టీ స్పూను వంట సోడాను
     ఒక గ్లాసు నీటిలో కలిపి రోజంతా తాగుతూ వుండాలి.

           ,మసాలాలు,  ఘాటు పదార్ధాలు,  ఆల్కహాలు వాడకూడదు.  మూత్రాన్ని ఎక్కువగా
    జారీ చేసే పదార్ధాలను కూడా వాడకూడదు.

                              మూత్రం సాఫీగా జారీ కావడానికి చిట్కా                               29-3-11.

              మూత్రం సరిగా రాకపోతే  మోదుగ పూలను  ఉడికించి పొట్ట మీద కడితే మూత్రం
   సాఫీగా జారీ అవుతుంది.

                                   మూత్ర విసర్జనలో అసౌకర్యము                                      10-4-11
           
               ఇన్ఫెక్షన్ , కిడ్నీ లలో రాళ్ళు,  బ్లాడర్ క్యాన్సర్ ,యోని సంబంధిత సమస్యలు,  
    మొదలైన కారణాల వలన ఈ సమస్య ఏర్పడుతుంది.

                                            చందనం మాత్రలు

               చందన తైలం             --- 10 ml
               తేనె మైనం                --- 30 gr
               పల్లేరు కాయలు         --- 50 gr
                       నీళ్ళు               --- నాలుగు కప్పులు

    పల్లేరు కాయలను కచ్చాపచ్చాగా దంచాలి.   ఒక గిన్నెలోనీళ్ళుపోసి దంచిన  పల్లేరు కాయలను వేసి మరిగించి ఒక గ్లాసు కషాయానికి రానివ్వాలి.

    ఒక పాత్రను స్టవ్ మీద పెట్టి నీళ్ళు పోసి దానిలో ఒక చిన్న గిన్నెను పెట్టి దానిలో తేనేమైనం
వేయాలి. అది కరిగిన తరువాత దానిలో చందన తైలం కలపాలి. దించి చల్లార్చితే అది గట్టిపడుతుంది.  గట్టిపడే దశలో మాత్రలు కట్టాలి.   .

    రోజుకొక మాత్ర మింగి  ముందే తయారు చేసుకున్న కషాయం తాగాలి. సమస్య తీవ్రంగా వుంటే
పూటకు రెండు మాత్రల చొప్పున వాడవచ్చు.   ఈ విధంగా 40 రోజులు వాడాలి.

    దీనివలన  మూత్రంలో మంట,  చీము, అసౌకర్య మూత్ర విసర్జన సమయంలో తొడల వరకు
లాగుతున్నట్లుగా వుండే నొప్పి నివారింపబడతాయి.

    కారం, పులుపు, మసాలాలు తగ్గించి తినాలి.  నీళ్ళు ఎక్కువగా తాగుతూ వుండాలి.

    ధనియాల కషాయం కాచి దానిలో చక్కెర  కలిపి తాగాలి. టీ డికాషన్ వలన కూడా తగ్గుతుంది.
   
    పొత్తి కడుపు నొప్పి గా వుంటే ఇసుక కాపడం పెడితే తగ్గుతుంది.

    పావు టీ స్పూను వంట సోడాను నీళ్ళకు కలుపుకొని తాగాలి. B. P. వున్నవాళ్ళు తాగకూడదు.
    పులుపు కారణంగానే మంట ఎక్కువ అవుతుంది.  కాబట్టి దాని నివారణ అతి ముఖ్యం .

                                         స్త్రీలలో అతిమూత్ర సమస్య -- నివారణ                            13-4-11
  
                  నేరేడు గింజల పొడి             ---50 gr
                  పల్లేరు కాయల పొడి           ---50 gr
                     నల్ల నువ్వుల పొడి          ---25 gr
                     నల్ల జీలకర   పొడి           ---25 gr

      నువ్వులను, జిలకరను దోరగా వేయించాలి.

      అన్నింటిని విడివిడిగా దంచి,  జల్లించి,  కలిపి భద్రపరచుకోవాలి.  లేదా బెల్లం కలిపి మాత్రలు
 తయారు చేసుకోవచ్చు. ( శనగ గింజలంత)

      ఉదయం రెండు,  సాయంత్రం రెండు మాత్రల చొప్పున వేసుకోవాలి.  లేదా ఒక టీ స్పూను
 పొడిని ఒక గ్లాసు నీటిలో వేసి కషాయం కాచి అర గ్లాసుకు రానిచ్చి తాగాలి.

                                     అతిమూత్ర వ్యాధి నివారణకు జాజికాయ మాత్రలు                       17-6-11.

1. జాజికాయ చూర్ణం                    --- 18 gr
    పచ్చ కర్పూరం                        --- రెండు గ్రాములు
          తేనె                                  --- కొద్దిగా

             జాజికాయ పొడి, పచ్చకర్పూరం కలిపి సీసాలో భద్ర పరచుకొని అవసరమైనపుడు తగినంత తీసుకొని
తేనె కలిపి నాకేయ్యవచ్చు .   లేదా తేనె కూడా కలిపి  శనగ గింజలంత మాత్రలు చేసి పెట్టుకోవచ్చు,

           పూటకు ఒక మాత్ర చొప్పున రోజుకు రెండు పూటలా  నీటితో సేవించాలి

2. మూడు టీ స్పూన్ల నువ్వులను ఒక కప్పు నీటిలో వేసి కషాయం కాఛి వడకట్టి కషాయం తాగితే మూత్ర
సంబంధ సమస్యలు తగ్గుతాయి
 
3. కటి వలయాల కండరాలను బిగిస్తూ నడుముకు బలం కలిగించాలి .

                                   మూత్రం ఆగకుండా పోతూవుంటే                             

             పావు కప్పు ఆవు మూత్రాన్ని తీసుకొని 24 సార్లు వడకట్టాలి .దానికి రెండు వంతుల నీటిని  మరియు  ఒక టీ
స్పూను తేనె ను కలిపి తాగాలి . ఈ విధంగా రెండు ,  మూడు వారాలు గాని వాడితే  సమస్య తప్పక నివారింపబడుతుంది
    
                 మూత్రాశయం లో సమస్యలు రాకుండా --- జాగ్రత్తలు           

ఎండబెట్టిన పల్లేరు కాయలు                      --- 50 gr
వాయువిడంగాలు                                    --- 50 gr
మిరియాలు                                           --- 50 gr
శొంటి ముక్కలు                                      --- 50 gr
తీపి కోడిశపాల గింజలు  ( కుటజ )             --- 50 gr  ( దీనిలో చేదు , తీపి అని రెండు రకాలుంటాయి ) .

    ఒక పుచ్చ కాయను తీసుకోవాలి . దాని మధ్యలో రెండు అంగుళాల సైజు లో గాటు పెట్టి ముక్కను బయటకు తీయాలి
కాయలోని గుజ్జును కూడా కొంత తీయవచ్చును . ఆ రంధ్రం లో పైన చెప్పబడిన పదార్దాలన్నింటిని  పోయాలి . తరువాత
తొలగించిన ముక్కను ఆ రంధ్రాన్ని కప్పుతూ మూత్ పెట్టాలి . తరువాత ఈ పుచ్చకాయను  రాత్రంతా  వెన్నెలలో ఉంచాలి .  ఉదయం కాయలో  వేసిన పదార్దాలను అన్నింటిని బయటకు తీసి ఎండబెట్టాలి .బాగా ఎండిన తరువాత
దంచి , జల్లించి  నిల్వ చేసుకోవాలి .

      ప్రతి రోజు అర టీ స్పూను పొడిని నీటితో సేవించాలి . దీనితో మూత్ర సమస్యలన్నీ నివారింపబడతాయి .

                        అతి మూత్ర సమస్య ---నివారణ                  

     కొండపిండి ఆకును పప్పులో వేసి కూర వండుకొని తింటే వ్యాధి నివారింపబడుతుంది

     ఈ ఆకు అతి మూత్ర సమస్యను నివారించడమే కాక , మూత్రం బొట్లు బొట్లు గా పడుతున్నా సాఫీగా జారీ అయ్యేట్లు చేస్తుంది . మధుమేహాన్ని నివారిస్తుంది .

కొండ పిండి ఆకును  పాషాణభేది అనికూడా అంటారు
ధన్యవాదములు 
మీ నవీన్ నడిమింటి 
విశాఖపట్నం 
9703706660                                   భాగస్వామ్యం చెయ్యి
వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి  

*సభ్యులకు విజ్ఞప్తి* 
******************
ఈ  గ్రూపులో పెడుతున్న మెసేజ్ లన్నీ సభ్యులలో ఆరోగ్యం పట్ల ప్రాధమిక అవగాహన కోసమే అని గమనించాలి. వివిధ  నివారణలు సూచనలు కూడా సభ్యులలో అవగాహన పెంచడానికి మాత్రమే ..మీ డాక్టరు కి ఇది ప్రత్యామ్నాయము కాదు. సభ్యులు గమనించాలి.
https://www.facebook.com/Naveen-Nadiminti-1536735689924644/


21, మే 2020, గురువారం

యూరిక్ ఆసిడ్ సమస్య పరిష్కారం మార్గం స్పటికాలను కరిగించే ఔషదాల గురించి తెలుసుకోటానికి ఈ లింక్ పై క్లిక్ చేయండి....................

              శరీరంలో ఆమ్లం నిల్వ శాతం పెరగడాన్ని  హైపర్ యూరికేమియా అని పేర్కొంటారు. యూరిక్ యాసిడ్/ యూరిక్ ఆమ్లము స్థాయి చాలా హెచ్చుగా ఉండటం  ఆరోగ్య సమస్యకు దారితీస్తుంది. ప్రోటీన్ల విచ్ఛిన్నం కారణంగా శరీరంలో యూరిక్ ఆసిడ్ తయారవుతుంది. ప్రొటీన్లు విచ్ఛిన్నమయినపుడు వాటిలోని రసాయనక సమ్మేళనాన్ని ప్యూరిన్లు అంటారు. అవి యూరికి ఆసిడ్ గా విచ్చిత్తి అవుతాయి. మూడు  ప్రధానంగా కారణాల వల్ల యూరిక్ ఆమ్లం స్థాయి పెరగవచ్చు . అవి యూరిక్ ఆసిడ్ హెచ్చు ఉత్పత్తి, యూరిక్ ఆసిడ్ విసర్జన  తగ్గడం, లేదా ఈ రెండు వ్యవస్థల కలయిక.

హైపర్ యూరికేమియా ఏ లక్షణం లేకుండా (అసింప్టోమాటిక్) ఉండవచ్చు. లేదా అది లక్షణాలతో కూడి ఉండవచ్చు ( సింప్టొమాటిక్).  శరీరంలో యూరిక్ ఆసిడ్ స్థాయి పెరుగుదలకు పెక్కు వైద్యపరమైన స్థితిగతులు ఉంటాయి. అవి లక్షణాలతో కనిపిస్తాయి. ఇవి యూరిక్ ఆసిడ్ నెఫ్రోపతి ( మూత్రంలో  హెచ్చుస్థాయిలో యూరిక్ ఆసిడ్ ఉన్న కారణంగా కిడ్నీ పనితీరు తగ్గుతుంది.) , గౌట్ ( రక్తంలో ప్రసరించే హెచ్చు స్థాయి యూరిక్ ఆసిడ్ మోతాదు కారణంగా కీళ్లలో యూరేట్ క్రిస్టల్ డిపొజిషన్) , యూరిక్ ఆసిడ్ నెఫ్రోలితియాసిస్ ( యూరిక్ ఆసిడ్ కిడ్నీస్టోన్స్) మేరకు ఉంటాయి శరీరంలో ఆమ్లం నిల్వ శాతం పెరగడంతో ఏలాంటి  వెంబడించే లక్షణాలు లేకపోయినప్పుడు,  సాధారణంగా చికిత్స సిఫారసు చేయబడదు. అయితే లక్షణాలతో కూడిన హపర్ యూరికేమియాకు నిర్ధారణను అనుసరించి చికిత్స అవసరం కాగలదు. శరీరంలో ఆమ్లం నిల్వ శాతం పెరగడంతో ఎదురయ్యే సమస్యలలో  గౌట్, అక్యూట్ యూరిక్ ఆసిడ్ నెఫ్రాపతీ, యూరిక్ ఆసిడ్ నెఫ్రాలితియాసిస్ మరియు దీర్ఘకాలిక రెనాల్  తక్కువ మోతాదు వంటివి ఉంటాయి

యూరిక్ యాసిడ్ యొక్క లక్షణాలు 

మీకు హైపర్ యూరికేమియా జబ్బు ఉన్నట్లయితే, మీ వైఫ్యుడు మీ జబ్బు పూర్వాపరాలను కూలంకషంగా పరిశీలిస్తాడు. తద్వారా మీరు జబ్బు లక్షణాలను పొందినవారా లేదా లక్షణాలకు అతీతులా అని నిర్ధారిస్తాడు. తర్వాత జబ్బు కారణాలను మరియు ఎదురవుతున్న ఇతర వైద్య సహ సమస్యలను గుర్తిస్తాడు.

జబ్బు లక్షణాలు కనిపించనప్పుడు సాధారణంగా ప్రత్యేకంగా జబ్బు నిర్ధారణ జరిపే అవసరం ఉండదు. అయితే జబ్బు లక్షణాలు ఉన్నప్పుడు, పరీక్ష తర్వాత ఈ క్రింది అంశాలు వెలుగులోకి వస్తాయి. :

  • తీవ్రమైన గౌట్ కీళ్లనొప్పుల సందర్భంగా దెబ్బతిన్న కీలు చూసేందుకు ఎర్రగా ( ఎరిథెమాటస్) కనిపిస్తుంది. తాకినప్పుడు వెచ్చగా ఉంటుంది. వాపు కలిగి ఉంటుంది మరియు హెచ్చు నొప్పికి దారితీస్తుంది.
  • దీర్ఘకాలంగా గౌటీ కీళ్లనొప్పులకు గురవుతున్నవారిలో క్రిస్టలిన్ యూరిక్ ఆసిడ్ (టోఫీ) నిల్వలు పేరుకుపోతాయి. అవి చెవి మృదులాస్థిలో, చేయి ముందుభాగం లోపల, మోచేయి మరియు శరీరం లేదా ఇతర కణజాలం మధ్య పలుచని ద్రవం పొరలో ఇది చేరి ఉంటుంది.
  • యూరిక్ ఆసిడ్ నెఫ్రోలితియాసిస్ లో  జబ్బుమనిశి పొత్తికడుపు లేదా ఒరలో ( పృష్టభాగం మరియు పక్క ఎముకల మధ్య ప్రదేశంలో) నొప్పి కలిగి ఉంటాడు హెచ్చు వివరాలకు చదవండి  కిడ్నీలో రాళ్లకు చికిత్స)

హైపర్ యూరికేమియాకు ఇతర వైద్యకీయ జబ్బులకు మధ్య గల తేడాను గమనించవలసి ఉన్నది. అవి ఒకే రకం లక్షణాలను కలిగి ఉంటాయి. వాటిలో క్రిందివి చోటుచేసుకొని ఉంటాయి.

  • ఆల్కహాలిక్ కేటోఆసిడోసిస్
    మద్యం వాడకం మరియు ఆహారం లేమితో ఎదురయ్యే జైవిక దుస్థితి.
  • డయాబెటిక్ కేటోఆసిడోసిస్
    మీ బ్లడ్ షుగర్ చాలాకాలంపాటు చాలా హెచ్చుగా ఉన్నప్పుడు మీ రక్తంలో ఆసిడ్లు చోటుచేసుకోవడం.
  • గౌట్ మరియు సూడోగౌట్
    ఇవి మంటతో కూడిన కీళ్లనొప్పికి సంబంధించినవి.
  • హేమోలిటిక్ రక్తహీనత
    శరీరంలో రక్తంలోని ఎర్రకణాలు తమ సాధారణ జీవితకాలానికి మునుపే వినాశానికి గురయ్యే దుస్థితి
  • హొడ్గ్కిన్ లింఫోమా
    తెల్ల రక్త కణాలలో ఆవర్భవించే ఒక రకం కేన్సర్
  • హైపర్ పారాథైరోయిడిజం
    ఇట్టి దుస్థితిలో రక్తప్రవాహంలో పారా థైరాయిడ్ హార్మోన్ హెచ్చుగా ఉంటుంది
  • హపోథైరాయిడిజమ్
    శరీరం అవసరమైన స్థాయిలో థైరాయిడ్ హార్మోన్లను ఉత్పత్తి చేయలేయలేని స్థితి
  • నెఫ్రోలిథియాసిస్ (మూత్రపిండాలలో రాళ్లు చేరడం)
    ఇది మూత్రవ్యవస్థలో రాళ్లు చేరే ప్రక్రియ
  • నెఫ్రోలిథియాసిస్
    గర్భంతో ఉన్న  దశలో ఒక మహిళ ( ఇదివరకు హెచ్చుస్థాయిలో రక్తపీడనం లేకుండా ఉండి ) ఇప్పుడు హెచ్చుస్థాయి రక్తపీడనం పెంపొందించు కోవడం మరియు దానితోపాటు మూత్రంలో హెచ్చుస్థాయి ప్రోటీన్లు కలిగి ఉండటం.
  • I ఏ రకం గ్లైకోజన్ స్టోరేజ్ జబ్బు
    ఈ రకం జబ్బును జి ఎస్ డి 1 ఏ జబ్బు అని కూడా అంతారు. రక్తకణాలలో గ్లైకోజన్ అనబడే చక్కెర ఉన్న కారణంగా ఎదురయ్యే దుస్థితి. కొన్ని అవయవాలలో మరియు కణజాలంలో కూడా గ్లైకోజెన్ స్థాయి పెరగవచ్చు
  • యూరిక్ ఆసిడ్ నెఫ్రోపతి
    మూత్రంలో హెచ్చుస్థాయి యూరిక్ అసిడ్ ఉన్న కారణంగా కిడ్నీ పనితీరు దిగజారడంతో ఎదురయ్యే స్థితి

యూరిక్ యాసిడ్ యొక్క చికిత్స 

లక్షణరహితమైన హైపర్ యూరికేమియా

లక్షణరహితమైన హైపర్ యూరికేమియా రోగులకు  సాధారణంగా వైద్య చికిత్స సిఫారసు చేయబడదు. అట్టి రోగులలో జీవన సరళి/ విధానం లో మార్పు అవసరం. వాటిలో ఆహార వ్యవస్థలో మార్పు,  వ్యాయామం ఉంటాయి. అవి యూరిక్ ఆసిడ్ స్థాయిని అదుపు చేస్తాయి.

లక్షణాలతో కూడిన హైపర్ యూరికేమియా

హైపర్ యూరికేమియా గౌట్ రూపంలో, యూరిక్ ఆసిడ్ రాళ్లు లేదా యూరిక్ ఆసిడ్ వెఫ్రాపతి లక్షణాలతో కూడినది కావచ్చు

గౌట్ ( వాతము )

  • తీవ్రమైన గౌటీ కీళ్లనొప్పులు
    తీవ్రమైన గౌట్ కీళ్లనొప్పి జబ్బుకు చికిత్స కల్పించే ముఖ్య ఉద్దేశం నొప్పి నివారణ. దీనితో సాధారణంగా మంట నివారణ జరిగేవరకు  ఎన్ ఎస్ ఏ ఐ డి లను ( నాన్ స్టెరాయిడల్ ఆంటి-ఇన్ఫమెటరీ డ్రగ్స్) సిఫారసు చేస్తారు. ఇవి సాధారణంగా 7 – 10 రోజుల వాడకానికి సూచిస్తారు. లేదా వైద్యపరీక్ష నిర్ధారణను  పరిస్థితిని బట్టి 3-4 రోజులకు కూడా సూచిస్తారు.
  • దీర్ఘకాలిక గౌట్ థెరపీ
    వాతపు కీళ్లనొప్పి లక్షణాలు నయమయిన తర్వాత, వాతపు కీళ్లనొప్పి రోగి  అంతర-తీవ్రస్థాయి దశకు చేరుకొంటాడు. ఈ దశలో సాధారణంగా  ప్రోఫిలాటిక్ కాల్కిసైన్, యూరికోస్యూరిక్ మందులు, (యూరిక్ ఆసిడ్ ను విసర్జింపజెసే మందులు) మరియు సాంతిన్ ఆక్సిడేస్ నిరోధకాలు ( యూరిక్ ఆసిడ్ ఉత్పత్తిని నిరోధింపజేసే మందులు) సూచింపబడతాయి.

యూరిక్ అసిడ్ నెఫ్రాలిథియాసిస్
ఈ సందర్భంలో అల్లోప్యూరినాల్ మందులు వాడుతారు

యూరిక్ ఆసిడ్ నెఫ్రాపతి
యూరిన్ ను పలచపరచడానికై  ఫ్యూరోసెమైడ్ లేదా మానిటాల్ వంటి మందులు) ఇంట్రావీనస్ సెలైన్ మరియు మందులు ఉపయోగించి యూరిక్ ఆసిడ్ మరింత గట్టిపడకుండా నివారిస్తారు. సోడియం బైకార్బినేట్ లేదా అసెటాజోలామైడ్ తోపాటు  యూరిన్ ఆల్కలైజేషన్ కూడా చేయవచ్చు.

క్లినికల్ పరీక్షలు, జబ్బు నిర్ధారణ ఫలితాల ఆధారంగా మీ వైద్యుడు మిమ్మల్ని ఒకానొక వైద్య నిపుణుని (స్పెషలిస్ట్)  సలహాకై పంపవచ్చు

  • తీవ్రమైన లేదా దీర్ఘకాలిక  గౌటీ కీళ్లనొప్పుల రోగులను  ర్యుమటాలజిస్టును సంప్రతించమని సూచించవచ్చు
  • తీవ్రమైనయురెట్ నెఫ్రాపతీ లేదా దీర్ఘకాలిక రెనాల్ ఫెయిల్యూర్ రోగులను కిడ్నీ స్పెషలిస్టును సంప్రతింపమని సూచించవచ్చు.
  • లక్షణాత్మక యూరిక్ ఆసిడ్ నెఫ్రాలిథియసిస్ రోగులను యూరాలజిస్టును సంప్రతింపమని సూచించవచ్చు.

జీవన సరళి  నిర్వహణ

హైపర్ యూరీకేమియా, ప్రత్యేకంగా లక్షణరహితమైనట్టిది, పెక్కు సందర్భాలలో జీవనవిధానంలో మార్పులతో నయం చేస్తారు. లక్షణాత్మకమైన  హైపర్ యూరీకేమియా కూడా ఈ మార్పులతో ప్రయోజనం పొందగలదు.

ఆహారవ్యవస్థలో మార్పులు

  • వేటిని సేవించరాదు ?
    • గొర్రె, పంది, ఎద్దు వంటివాటి ఎర్ర మాంసాన్ని తీసుకొనకండి
    • కొవ్వుతో కూడినట్టి పౌల్ట్రీ మరియు హెచ్చు కొవ్వు కలిగిన డెయిరీ ఉత్పత్తుల వాడకాన్ని అదుపు చేయండి
    • సార్డైన్, టునా షెల్ చేపలు మరియు ఆంకోవీ జాతి చేపల వాడకాన్ని తగ్గించండి. వాటిలో ప్యూరిన్స్ హెచ్చుగా ఉంటాయి. అలాగే తీపుగావింపబడిన సంపూర్ణ ధాన్యాలను వాడకండి.
    • ఫ్రక్టొస్ తో తీపు చేయబడ్ద పానీయాలను, ఆల్కహాల్ ను (ముఖ్యంగా బీర్)  మానండి
  • ఏవి తినవచ్చు ?
    • అవసరమైన మోతాదులో నీరు సేవించి చక్కటి హైడ్రేషన్ కలిగి ఉండండి
    • తక్కువ కొవ్వుతో కూడిన డెయిరీ ఉత్పత్తులను, ప్రొటీన్ వనరుల కోసం కూరగాయలను సేవించండి
    • హెచ్చు మోతాదులో ( వితమిన్ సి హెచ్చుగా ఉండే) పళ్లను, కూరగాయలను, తృణధాన్యాలను సేవించండి
  • వ్యాయామం
    మీ ఎత్తుకు సరిపడే శారీరక బరువును పొందడానికి క్రమం తప్పకుండా వ్యాయామం జరపండి వ్యాయామం యూరిక్ ఆసిడ్ ఉత్పత్తి స్థాయిని తగ్గించడమే కాకుండా అది కీళ్లపై బరువును తగ్గిస్తుంది మరియు కాళ్లను బలపరచడానికి సహాయం చేస్తుంది.అధిక యూరిక్ ఆసిడ్ ను కంట్రోల్ చేసే మార్గాలు:

మన శరీరంలో ఒక సేంద్రీయ సమ్మేళనం అయిన యూరిక్ ఆమ్లం ఉంటుంది.ఇది ఒక ఉప ఉత్పత్తిగా రక్తప్రవాహంలో తిరుగుతూ మన శరీరం యొక్క జీవక్రియకు సహాయం చేస్తుంది. రక్తంలో యూరిక్ ఆమ్లం హెచ్చు స్థాయిలో ఉంటే ఆర్థరైటిస్ సమస్యకు దారితీస్తుంది. దీనిని గౌట్ అని పిలుస్తారు. శరీరం దీనిని విసర్జన చెయ్యలేకపోతే అప్పుడు దాని స్థాయి పెరుగుతుంది. శరీరంలో యూరిక్ ఆమ్లాలు పేరుకుపోతే గౌట్ మాత్రమే కాకుండా కిడ్నీలో రాళ్ళ లాంటి ఇతర ఆరోగ్య సమస్యలకు కారణం కావచ్చు. 

మీరు ఈ పరిస్థితిని లేదా మీ తల్లిదండ్రులు లేదా తాతలకు ఈ సమస్య కలిగి ఉంటే కనుక మీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది తరచుగా యూరిక్ ఆమ్లం ప్రాసెస్,శరీరం యొక్క సామర్ధ్యానికి వారసత్వ అసాధారణతకు సంబంధం కలిగి ఉంటుంది. మీరు నిరోధించబడిన మరియు క్రమశిక్షణతో ఆహారపు అలవాట్లను అనుసరిస్తే కొంత వరకు నియంత్రించవచ్చు. 

అనేక ఆహారాలు రక్తంలో యూరిక్ ఆమ్లంను పెంచుతాయి. కానీ నిజానికి కొన్ని ఆహారాలు ఈ సాంద్రతలు తగ్గించేందుకు సహాయపడతాయి.యూరిక్ ఆమ్లంతో బాధపడుతున్న వ్యక్తులు విటమిన్ సి,ఫైబర్ మరియు నీటిని,తాజా పండ్లు మరియు కూరగాయలను సమృద్ధిగా తీసుకోవాలని సూచించడం జరుగుతుంది.ఇవి శరీరంలో యూరిక్ ఆమ్లం స్థాయిలను తగ్గిస్తాయి. అంతేకాక వారు మాంసాహారాన్ని,ఆర్గాన్ మాంసాలు మరియు అత్యంత ప్రాసెస్ చేసిన ఆహారాలను నివారించమని సలహా ఇస్తారు.యూరిక్ ఆమ్లంతో బాధపడుతున్న వ్యక్తులు తినవలసిన ఆహారాలు గురించి తెలుసుకుందాము.

కొన్ని పరిశోధన ప్రకారం, ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు యూరిక్ యాసిడ్ ను కంట్రోల్ చేస్తాయి. కాబట్టి, మీ యూరిక్ యాసిడ్ డైట్ ను తెలుసుకోవాలంటే మీ రెగ్యులర్ డైట్ లో అధిక ఫైబర్ ఫుడ్స్ ను తీసుకోవాలి. ఓట్స్, ఆకుకూరలు, బ్రొకోలీ మొదలగునవి తీసుకోవాలి.

సాధారణ నూనెల కంటే ఆలివ్ ఆయిల్ తో తయారుచేసే వంటలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. బట్టర్ లేద వెజిటేబుల్ ఆయిల్ కంటే ఇది చాలా ఉత్తమమైనది . రెగ్యులర్ ఆయిల్స్ రాన్ సిడ్ ఫ్యాట్స్ ను ఉత్పత్తి చేసి, విటమిన్ ఇ ని నాశనం చేస్తాయి. ఇది యూరిక్ యాసిడ్ గా మారుతాయి. దీన్ని తొలగించాలంటే ఆలివ్ ఆయిల్ ను ఉపయోగించడం ఉత్తమం.

 షుగర్ తో తయారుచేసినటువంటి జంక్ ఫుడ్స్ ను తీసుకోవడం నివారించాలి. ఇవి మన శరీరంలో అధిక యూరిక్ యాసిడ్ ఉత్పత్తికి కారణం అవుతాయి. కాబట్టి, కేక్స్, పాస్ట్రీస్ వంటివి నివారించాలి.

 మీ శరీరంలో యూరిక్ ఆమ్ల స్థాయి తగ్గించడానికి కనీసం ప్రతి రోజు 2-3 లీటర్ల నీరు త్రాగటానికి ప్రయత్నం చేయాలి. నీరు యూరిక్ ఆమ్లంతో సహా మీ వ్యవస్థ యొక్క విషాన్ని బయటకు పంపటానికి సహాయపడుతుంది. ఎక్కువగా ద్రవాలు త్రాగటం వలన మీ శరీరంలో ఉన్న అదనపు యూరిక్ ఆమ్లంను తొలగించటానికి సహాయం చేస్తుంది.

 చెర్రీస్ రక్తంలో యూరిక్ ఆమ్ల స్థాయిలను తగ్గించడానికి వాడతారు. రక్తంలో మీ యూరిక్ ఆమ్ల స్థాయిలను తగ్గించడానికి చెర్రీస్ తప్పనిసరిగా తినాలి. మీరు చెర్రీ రసం లేదా డబ్బాలో ఉండే చెర్రీస్ ను కూడా అల్పాహారంగా తీసుకోవచ్చు. కొన్ని అధ్యయనాల ప్రకారం ప్రతి రోజు చెర్రీ సీరం తీసుకోవడం వలన శరీరంలో యూరిక్ ఆమ్లం స్థాయిలను తగ్గిస్తాయని నిరూపణ అయ్యింది.

 మీ శరీరంలో యూరిక్ ఆమ్ల స్థాయిలను తగ్గించడానికి ప్రతిరోజు నిమ్మరసం త్రాగాలి. కాల్షియం కార్బోనేట్ శరీరంలో తటస్థం ఆమ్లాలకు సహాయపడుతుంది. అయితే యూరిక్ ఆమ్లం మరియు నిమ్మరసం కలిపి కాల్షియం కార్బోనేట్ ఉత్పత్తికి సహాయపడతాయి. విటమిన్ సి యూరిక్ యాసిడ్ ను కంట్రోల్ చేస్తుంది .

గౌట్‌కు శాశ్వత పరిష్కారం :

గౌట్‌ అనేది యూరిక్‌ ఆసిడ్‌ అసమతుల్యత వల్ల ఏర్పడే సమస్య. ఈ వ్యాధిలో యూరిక్‌ యాసిడ్‌ మోతాదు రక్తంలో తీవ్రంగా పెరుగుతుంది. పెరిగిన యూరిక్‌ ఆమ్లం స్ఫటికలుగా మారి కీళ్లలోకి చేరి తీవ్రమైన నొప్పిని కలగజేస్తాయి. ఇలాంటి కీళ్ళ నొప్పులని వైద్య పరిభాషలో ‘గౌటీ ఆర్థరైటిస్‌’ అని అంటారు. ఇది చాలా తీవ్రమైన సమస్య. 

ప్రపంచవ్యాప్తంగా గణాంకాల ప్రకారం 2 నుంచి 4 శాతం మంది ప్రజలు ఈ వ్యాఽధితో బాధపడుతున్నారు. సాధారణంగా ఈ వ్యాధి 30 నుంచి 45 సంవత్సరాల వయస్సు వారిలో అధికంగా కనిపిస్తుంది. స్ర్తీలతో పోలిస్తే పురుషుల్ని గౌట్‌ వ్యాధి ఎక్కువగా బాధిస్త్తుంది. చారిత్రాత్మకంగా గౌట్‌ వ్యాధి ‘శ్రీమంతుల జబ్బు’ లేదా ‘రాజుల జబ్బు’గా అభివర్ణించబడింది. 

వ్యాధి కారణాలు:

గౌట్‌ వ్యాధి రావటానికి గల ప్రధాన కారణం రక్తంలో పెరిగిన యూరిక్‌ ఆమ్లశాతం. యూరిక్‌ ఆమ్లం అనేది ఒక అనవసరమైన పదార్థం. ఇది మనం తీసుకునే ఆహారంలోని ప్రొటీన్లు జీర్ణమయిన తర్వాత ఏర్పడే ఒక విష పదార్థం. ప్రాధమికంగా ఈ విష పదార్థం రక్తంలో కలిసి శుద్ధి కోసం మూత్రపిండాలకు చేరుతుంది. మూత్రపిండాలు రక్తాన్ని శుద్ధిచేసి అందులోని విషపదార్థాలను వ్యాధి కారక పదార్థాలను వేరుచేసి మూత్రం ద్వారా మన శరీరం నుంచి బయటకు పంపివేస్తాయి.

ఈ సమస్య ఎవరికి?

వంశ పారంపర్య మూలాలున్న వారుఅధిక మోతాదులో ప్రొటీన్లు తీసుకోవటం అంటే మంసాహారం, చేపలు తదితర ఆహారం ఎక్కువగా తీసుకునేవారిలోస్థూలకాయులుమద్యపానం చేసే వారుమూత్రపిండాల వ్యాధితో బాధపడేవాళ్లుఅధిక రక్తపోటు ఉన్నవారురోగనిరోధక శక్తి తగ్గిపోయిన వారు ఈ వ్యాధి బారిన పడుతుంటారు.

వ్యాధి లక్షణాలు:

వ్యాధి లక్షణాలు చాలా రకాలుగా కనబడతాయి. అందులో ముఖ్యంగా తరుచుగా వచ్చే కీళ్ళవాపు ఒకటి. గౌట్‌ వ్యాధిలో కాలి బొటనవేలు మొదటగా వాపునకు గురవుతుంది. అందుకని గౌటీ ఆర్థరైటిస్‌ను వైద్య పరిభాషలో ‘పాడగ్రా’ అని అంటారు

కీళ్లవాపుతోపాటు కీళ్లు ఎర్రగా మారటంవాపుతో పాటు విపరీతమైన నొప్పికీళ్లు వేడిగా ఉండటంరాత్రి వేళలో విపరీతమైన జ్వరంనీరసంగా ఉండటంగౌటీ ఆర్థరైటి్‌సలో ఎక్కువగా కాలి బొటనవేలు, మడమలు, మోకాళ్లు ఎక్కువగా వాపునకు గురవుతాయి. 

యూరిక్‌ యాసిడ్‌ స్ఫటికలు కీళ్ళలో చేరటాన్ని వైద్య పరిభాషలో ‘టోఫై’ అంటారు. టోఫై తీవ్రమైన ప్పుడు పగిలిపోయి పుండుకు దారితీస్తుంది.. యూరిక్‌ యాసిడ్‌ స్ఫటికలు మూత్రపిండాలలో కూడా పేరుకుపోవచ్చు. ఇలా పేరుకుపోయిన స్ఫటికలు మూత్రపిండాలలో రాళ్లు ఏర్పడటానికి దారితీస్తాయి. దీన్ని ‘యూరేట్‌ నెఫ్రోపతి’ అని అంటారు. 

వ్యాధి నిర్థారణకు ముందు తర్వాత తీసుకోవలసిన జాగ్రత్తలు

మద్యపానం మానివేయటంస్థూలకాయాన్ని తగ్గించుకోవటంమాంసాహారం నియంత్రించటంక్రమం తప్పకుండా వ్యాయామం చేయటంపోషకాహారం తీసుకోవటంమానసిక ఒత్తిడిని తగ్గించుకోటం

హోమియోపతి వైద్యం:

హోమియోపతిలో గౌటీ ఆర్థరైటి్‌సకు చాలా చక్కటి వైద్యం అందుబాటులో ఉంది. హోమియోపతిలో జబ్బురావటానికి గల కారణాన్ని దృష్టిలో ఉంచుకొని వైద్యం చేయటం జరుగుతుంది. హోమియోపతిలో గౌటీ ఆర్థరైటి్‌సకు బెల్లడోనా, బ్రయోనియా బెంజోయిక్‌ ఆసిడ్‌, లెడంపాల్‌ 

వంటి అద్భుతమైన మందులు ఉన్నాయి. పైన పేర్నొ మందులను వ్యక్తి శారీరక, మానసిక, వ్యాధి లక్షణాలను పరిగణలోనికి తీసుకొని ఒక సరియైున మందును ఎంపిక చేస్తారు. ఈ పద్ధతిని ‘కాన్‌స్టిటూషనల్‌ థెరపీ’ అంటారు. ఇలాంటి పద్ధతిలో ఎంపిక చేసిన మందును హోమియో వైద్యుని పర్యవేక్షణలో సూచించే కాలపరిమితి మేర వాడటం వల్ల గౌటీ ఆర్థరైటి్‌సకు ఒక సురక్షితమైన నొప్పి రహితమైన శాశ్వతమైన పరిష్కారం లభిస్తుంది.

అవనిలో ఒక అరుదయిన మూలిక సదాపాకు (RUTA GRAVEOLENSE )

    సదాపాకు ని సంస్కృతంలో “నాగదాలి” అంటారు. ఇది ఒక మూలిక. సదాపాకు హోమియోపతి లో అద్భుతమైన ఔషదంగా 200 ఏళ్ళ నుండి ప్రాచుర్యంలో ఉంది. ఈ మొక్క చాల ఔషధ గుణాలను కలిగి అనేక క్లిష్టమైన వ్యాధులకు మందుగా ఉపయోగించబడుతుంది.

ప్రయోజనాలు :

  1. నరాలకు సంబందించిన సమస్యలను నివారిస్తుంది.
  2. మెదడు కాన్సర్ కారకాలను అడ్డుకుంటుంది.
  3. దోమలను, పాములను రానివ్వదు.
  4. కీళ్ల నొప్పులు, యూరిక్ ఆసిడ్ సమస్యలకు ఈ సదాపాకు కాషాయం ఒక మంచి మెడిసిన్.
  5. కండరాల నొప్పులకు ఈ కషాయాన్ని 3 గంటలలో 3-5 తీసుకుంటే నొప్పులు తగ్గిపోతాయి.
  6. లివర్ సిరోసిస్ సమస్యకు ఈ కాషాయం మంచి ఫలితాన్నిస్తుంది.
  7. బ్రెయిన్ ట్యూమర్ వ్యాధిని తగ్గిస్తుంది.
  8. మైండ్ రిలాక్సేషన్ కి ఈ కాషాయం బాగా పనిచేస్తుంది.
  9. వాత నొప్పులను హరిస్తుంది

యూరిక్ యాసిడ్ కొరకు మందులు


Medicine NamePack Size
FeburicFeburic 40 Tablet
FebubestFebubest 40 Tablet
FabexFABEX 40MG TABLET 10S
FebuloricFEBULORIC 40MG TABLET 10S
UrigoURIGO 40MG TABLET 10S
DutofebDutofeb 40 Tablet
Ibaxit XRIbaxit 40 XR Tablet
FasturtecFasturtec Injection
FiboxoFIBOXO 40MG TABLET 10S
FabureFABURE 40MG TABLET 10S
Factus SRFACTUS SR 40MG TABLET 10S
FebupenFEBUPEN 40MG TABLET 10S
FebuplusFEBUPLUS 40MG TABLET
AloricAloric Tablet
FebutroyFEBUTROY 40MG TABLET 10S
FebugoldFEBUGOLD 40MG TABLET
FebsFEBS 40MG TABLET
UriwayURIWAY 40MG TABLET 10S
FebstarFebstar 40 Mg Tablet
FBXFBX 40 Tablet
Febuget TabletFebuget 40 Tablet
AlinolAlinol 10 Mg Tablet
FebumacFebumac 40 Mg Tablet
CiploricCiploric 100 Tablet

పై మందు అన్ని డాక్టర్ సలహాలు మేరకు వాడాలి మీ ఏజ్ సమస్య బట్టి మందులు మార్పు జరుగుతుంది గమనించగలరు 

ధన్యవాదములు 

మీ నవీన్ నడిమింటి 

విశాఖపట్నం 

9703706660

అస్వీకార ప్రకటన: ఈ సైటుపై లభ్యమవుతున్న మొత్తం సమాచారము మరియు లేఖనము కేవలం అవగాహనా ఆవశ్యకతల కొరకు మాత్రమే. ఇక్కడ ఇవ్వబడిన సమాచారమును ఏదైనా ఆరోగ్య సంబంధిత సమస్య లేదా అస్వస్థత నుండి కోలుకోవడానికి లేదా స్వస్థత కొరకు నిపుణుల సలహా లేనిదే ఉపయోగించుకోకూడదు. చికిత్స పరీక్షలు మరియు సేవల కొరకు ఎల్లప్పుడూ ఒక అర్హత పొందిన వైద్యుల సలహా తీసుకోవాలి.

20, మే 2020, బుధవారం

శరీరంలో అతి వేడి తగ్గడానికి ఆయుర్వేదం లో పరిష్కారం మార్గం


Little illness child medicine flu fever healthcare

శరీరంలో వేడి తగ్గడానికి ఆయుర్వేద మార్గం అవగాహనా కోసం నవీన్ నడిమింటిi సలహాలు .. | Ayurvedic Tips to Reduce Body Heat 

 ఒక టీస్పూన్ కరక్కాయ పొడిని తీసుకొని అందులో ఒక అరచెంచాడు పంచదార ను కలిపి ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకుంటే శరీరంలో వేడి తగ్గుతుంది అదేవిధంగా నీరు ఎక్కువగా ఉండే ఆహారాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. బాడీ హీట్ చాలా మంది ఉన్న కామన్ హెల్త్ ప్రాబ్లెమ్ . బాడీ హీట్(శరీరంలో ఉష్ణోగ్రత)వల్ల కూడా హీట్ స్ట్రెస్ కు కారణం కావచ్చు . బాడీహీట్ దానంతట అదే తగ్గదు ఎందుకంటే శరీరంలోపల అనేక ఆరోగ్య సమస్యలు,
ఉదా : అంతర్గత అవయవాలకు నష్టం, వేడి తిమ్మిర్లు, వేడి దద్దుర్లు, మొటిమలు, మైకం మరియు వికారం వంటి అనేక ఆరోగ్య సమస్యలకు కారణం అవుతుంది. మితిమీరిన వేడి వాతావరణం, వేడిలో పనిచేయడం, వేడి కలిగించే ఆహారాలను తీసుకోవడం, నీరు అతి తక్కువగా త్రాడం ఇవన్నీ కూడా బాడీ హీట్ కు ప్రధాన కారణాలు.విటమిన్ సి అధికంగా ఉండే పండ్లను తీసుకోవాలి . వెన్న తీసిన మజ్జిగను తీసుకోవడం కూడా మంచి ఉపయోగం .

శరీరంలో వేడి ఉండటం అనేది చాల మందికి ఉండే ఆరోగ్య సమస్య. శరీరంలో వేడి చేయటం వలన చాలా రకాల ఇబ్బందులు పడాల్సి వస్తుంది. వేడి వలన అంతర్గత అవయవాలకు నష్టం, వేడి తిమ్మిర్లు, వేడి దద్దుర్లు, మొటిమలు, కురుపులు, మూత్రం మంటతో రావటం, ముక్కులోంచి రక్తం కారటం, మైకం మరియు వికారం వంటి అనేక ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. మితిమీరిన వేడి వాతావరణం, వేడిలో పనిచేయడం, వేడి కలిగించే ఆహారాలను తీసుకోవడం, నీరు అతి తక్కువగా త్రాగడం ఇవన్నీవేడి చేయటానికి కారణాలు. కింద తెలిపిన సులభమైన పద్ధతుల ద్వారా వేడి తగ్గించుకోవచ్చు.

1.-ఒక టీస్పూన్ కరక్కాయ పొడిని తీసుకొని, అందులో ఒక అరచెంచాడు పంచదారను కలిపి ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకుంటే శరీరంలో వేడి తగ్గుతుంది.

2.-విటమిన్-సి అధికంగా ఉండే పండ్లను ఎక్కువగా తీసుకోవాలి.న్న

3.=వెన్న  తీసిన మజ్జిగను తీసుకోవడం మంచిది.

ఎప్పటికప్పడు చల్లటి నీరు త్రాగడం వల్ల శరీరం వేడి నుండి ఉపశమనం పొందుతుంది.

4.-రోజులో రెండు లేదా మూడు సార్లు కొబ్బరి నీళ్లు తాగడం వల్ల బాడీ హీట్, హీట్ స్ట్రెస్ తగ్గించుకోవచ్చు.

5.-పల్చటి మజ్జిగలో నిమ్మరసం, ఉప్పు వేసుకొని తాగితే శరీరంలోని వేడి తగ్గుతుంది.

6.-పుచ్చకాయ తినటం వలన చాలా త్వరగా శరీరంలోని వేడి తగ్గుతుంది.

7.-స్పూన్ మెంతులను ఏదో ఒక రూపంలో ప్రతిరోజు తీసుకోవాలి.

8.-పాలలో తేనే కలిపి తాగాలి.

9.-వంటకాలలో కొబ్బరి నూనె, ఆలివ్ ఆయిల్ వాడితే మంచిది.

10.-నాన్ వెజ్, స్పైసీ, జంక్ ఫుడ్ మరియు ఆల్కహాల్ కి దూరంగా ఉండటం మంచిది.

11.-రోజు ఉదయాన్నే దానిమ్మ జ్యూస్ తాగాలి.

12.-గసగసాలు శరీరాన్ని చల్ల పరచడానికి బాగా పని చేస్తాయి.

అతివేడి

       అతివేడి (వేసవి తాపం) నివారణకు  బ్రహ్మఫల చూర్ణం   
 
    పైత్య (అతి వేడి) శరీరం తో పుట్టిన వాళ్ళు ఎక్కువగా మాట్లాడుతూ వుంటారు, తేనె రంగు శరీరం తో వుంటారు వీళ్ళ శరీరం ఎక్కువ వేడి చేసి వుంటుంది. మొలలు వేసవి సమస్యలు  మొదలగు వేడి సమస్యలతో బాధపడుతూ వుంటారు.

    బాగా పండిన మర్రి పండ్లను ఎండబెట్టి దంచిన పొడి      ---- 100 gr
     అతిమధురం పొడి  ---- 100 gr
          కలకండ పొడి   ---- 100 gr
 
     అన్నింటిని బాగా కలిపి సీసాలో భద్రపరచుకోవాలి.
 
          10 గ్రాముల పొడిని కుండలోని  నీటిలో కలిపి  మూడు పూటలా తాగాలి.
 
          దీనిని వాడడం వలన ముక్కు నుండి రక్తం కారడం, మొల్ల ద్వారా ఆసనం నుండి, మలము ద్వారా రక్తం పడడం నివారింప బడతాయి.శీఘ్ర స్ఖలన సమస్యలు, గర్భాశయ సమస్యలు,నపుంసకత్వం  నివారింప బడతాయి, 
 
పిల్లలు వాడితే పొడవు పెరుగుతారు,  వృద్ధులు వాడితే మోకాళ్ళలో గుజ్జు పెరుగుతుంది. నడవలేని వాళ్ళు దీనిని  వాడితే సమస్య  నివారింపబడి నడకలో వేగం పెరుగుతుంది.

                అతి వేడి --- నివారణ  

      ఉష్ణము ఎక్కువైతే  పైత్యం ఎక్కువవుతుంది.  దీని వలన రక్తపైత్యము,  అధిక రక్తపోటు చర్మ రోగాలు  మొదలైనవి  వస్తాయి.  కావున వేడి శరీరం వున్నవాళ్ళు వేడిని తగ్గించే పదార్ధాలను వాడాలి.  ముఖ్యంగా తీపిపదార్ధాలను ఎక్కువగా వాడాలి.    ఆవుపాల పాయసాన్నము తినాలి.

      పొన్నగంటి కూర, బచ్చలి, పెరుగు తోటకూర, కరివేపాకు  మొదలైనవి వాడుకోవాలి.

      ద్రాక్ష, బాదం, ఎండు ఖర్జూరం,  కొబ్బరినీళ్ళు  తరచుగా వాడాలి.

      వేడి ఎక్కువైతే పైత్యము ఎక్కువవుతుంది. దీని వలన నోటిపూత, అరిచేతుల, అరికాళ్ళ మంటలు, శరీరమంతా వేడిగా వుండడం మొదలైన లక్షణాలుంటాయి.

     కొబ్బరినూనె, ఆముదము శరీరాన్ని ఎంతో చల్లబరుస్తాయి.  ఆముదాన్ని లోపలి సేవిస్తే వేడి చేస్తుంది. పై పూతగా వాడితే శరీరాన్ని చల్లబరుస్తుంది.

      చెరువులోని బంకమట్టిని తెచ్చి ఎండబెట్టి, దంచి, జల్లించి, నీళ్ళు పోసి పిసికి శరీరం మొత్తానికి అరికాళ్ళతో  సహా పట్టిస్తే వెంటనే శరీరం చల్లబడుతుంది.

      వేడి ఎక్కువైతే మలము గట్టి పడి సమస్య ఏర్పడుతుంది.

ఆహారం:--

      గుప్పెడు ఎండు ద్రాక్షను రాత్రి ఒక గ్లాసులో వేసి నీళ్ళు పోసి నానబెట్టాలి. దానిని ఉదయం బాగా పిసికి   పానీయం లాగా చేసి తాగాలి. దీని వలన వేడి తగ్గి ఒక గంటలో సుఖ విరేచనమవుతుంది.  రక్తంలోని మలినాలు   తొలగించబడతాయి.

      అలాగే ఆహారంలో మజ్జిగ ఎక్కువగా వాడుకోవాలి.

     బార్లీ  నీళ్ళు, చక్కర కలిపి ఉదయం, సాయంత్రం ఒక్కొక్క గ్లాసు సేవిస్తే వేడి తగ్గుతుంది.
     వేడి గంజిలో పాలు, చక్కెర కలుపుకొని తాగితే వేడి తగ్గుతుంది.

                    వేడి తగ్గడానికి

 తులసి రసం                         ---- ఒక టీ స్పూను
నిమ్మ రసం                           ----   "    "       "
అల్లం రసం                            ----   "    '       "
చక్కెర                                  ----- ఒకటి లేక రెండు స్పూన్లు

     అన్నింటిని కలుపుకొని ఉదయం, సాయంత్రం ఆహారానికి గంట ముందు సేవిస్తే పైత్యం వలన కలిగే వాంతి,  అన్నం చూస్తేనే వాంతి (అన్న ద్వేషం) ,అజీర్ణం, ఆకలి లేకపోవడం, కళ్ళు ఎర్రబడడం, గొంతులో మంట    మొదలైనవి నివారంప బడతాయి.

దీని వలన కఫము, వేడి రెండు తగ్గుతాయి.

     చిన్న పిల్లలకు మోతాదు తగ్గించి వాడాలి.

2. తులసి రసం                  ----- ఒక గ్లాసు
నువ్వుల నూనె                   ----- ఒక గ్లాసు

       రెండింటిని కలిపి స్టవ్ మీద పెట్టి రసం ఇగిరిపోయి నూనె మాత్రమే మిగిలే వరకు కాచాలి.

       తలలో పైత్యం ఎక్కువై మంటలు, చురుకు వున్నపుడు ఆ నూనెను తలకు పెట్టి  సున్నితంగా మర్దన  చెయ్యాలి.

       అతి వేడి సమస్య --నివారణ                                      

                            దీని వలన పైత్యము ఎక్కువవుతుంది.

అతి మధురం పొడి           --- ఒక టీ స్పూను
పాలు                            --- అర గ్లాసు 
కలకండ లేదా చక్కెర        --- ఒక టీ స్పూను
 
       పాలు స్టవ్ మీద పెట్టి మూడు పొంగులు రానిచ్చి, దించి వడపోసి గోరువెచ్చగా అయిన తారువాత చక్కెర  గాని, కలకండ గాని, తేనె గాని కలుపుకొని తాగాలి. దీని  వలన వెంటనే వేడి తగ్గుతుంది.  ఇది ఇరవై రకాల  వేడి సమస్యలను నివారిస్తుంది.

          అతి వేడి నివారణకు అమృతాహారం                              

     ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదు.

     అతి వేడి వలన కళ్ళు మంటలు, కాళ్ళ మంటలు వుంటాయి.

ఉల్లి                          ----  50 gr
నూనె లేక నెయ్యి         ----  50 gr
పెరుగు                     ----   ఒక కప్పు 

   ఉల్లి గడ్డలను సన్న ముక్కలుగా తరిగి ఒక గిన్నెలో పోసి నెయ్యి తో గాని నూనె తో గాని  వేయించాలి. చల్లార్చి  ఒక కప్పు పెరుగు కలపాలి.  దీనిని ఉదయం గాని, సాయంత్రం గాని ఆహారంగా తీసుకోవాలి. వేడి ఎక్కువగా   వుంటే రెండు పూటలా వాడుకోవచ్చు.

                  శరీరంలోని  అతి వేడి తగ్గడానికి తంగేడు కాఫీ    

తంగేడు పూల పొడి                  --- 100 gr
పత్తి గింజల పొడి                     ---   50 gr
ధనియాల పొడి                      ---   50 gr
గులాబి రేకుల పొడి                ---   30 gr
             శొంటి పొడి               ---   20 gr
 చిన్న ఏలకుల పొడి              ---   20 gr
సుగంధ పాల వేర్ల పొడి            ---   10 gr
తంగేడు విత్తనాల పొడి           ---   10 gr
 
      అన్ని పదార్ధాలను కలిపితే  తంగేడు కాఫీ పొడి  తయారవుతుంది.
 
      కాఫీ ఫిల్టర్ లో పొడి వేసి డికాషన్ తయారు చేసి చక్కెర కలుపుకొని తాగితే శరీరం యొక్క వేడి తగ్గి,  మెదడు చల్లబడుతుంది.  మెదడుకు బలం చేకూరుతుంది.
 
                అత్యుష్ణాన్ని  తగ్గించే పానీయం      
 
సుగంధ పాల వేళ్ళపొడి  ----- అర టీ స్పూను
ధనియాల పొడి           ---- అర టీ స్పూను
వట్టి వేర్ల  పొడి           ----- పావు టీ స్పూను
కలకండ పొడి            ----- ఒక టీ స్పూను
 
        ఒక గ్లాసు నీళ్ళలో అన్ని పొడులను వేసి మరిగించి అర గ్లాసు కషాయానికి రానివ్వాలి, వడపోసి, చల్లార్చి కలకండను కలపాలి.  చల్లారిన తరువాత తాగాలి.
 
       దీని వలన   పైత్య దోషము వలన వచ్చే తలనొప్పి ( లేదా అతి వేడి వలన వచ్చే తలనొప్పి )  తగ్గుతుంది.
 
పిత్త సంహార ముద్ర :--  దీనినే ప్రాణ ముద్ర లేక శక్తి ముద్ర అని కూడా అంటారు.
  
     బొటన వ్రేలి కొన, చిటికెన వ్రేలి కొన,  ఉంగరపు వ్రేలి కొన లను కలిపి మిగిలిన రెండు వ్రేళ్ళను కిందికి పెట్టి  ముద్ర వేసుకొని పద్మాసనంలో కూర్చోవాలి.
 
      దీని వలన అత్యుష్ణము వలన వచ్చే సమస్యలు, సెగ గడ్డలు, పొక్కులు, తలనొప్పులు చాలా అద్భుతంగా  తగ్గుతుంది 

 బార్లీ పేలాల పిండి
             చక్కెర

     రెండింటిని కలిపి తింటే అతి వేడి తగ్గుతుంది.

                  అతి వేడి  వలన శరీరలో వచ్చే మంటలు --నివారణ    

      ఆవాలను మెత్తగా నూరి పేస్ట్ లాగా చేసి పాదాలకు పూస్తే శరీరంలోని మంటలు తగ్గుతాయి.

            శరీరం లోని అతి వేడిని తగ్గించడానికి మృత్తికా స్నానం   

      ఈ ప్రక్రియ శరీరంలోని సకల మలినాలను తొలగిస్తుంది.

      పూర్వం ఒండ్రుమట్టిని తెచ్చి పిసికి ఒంటికి తలకు మట్టి పూసేవాళ్ళు. కొంతసేపటికి తలమీద మట్టి పులిసేది.

       ఒండ్రుమట్టి  5,  10 కిలోలు తెచ్చి ఎండబెట్టి నలగగొట్టి జల్లించి పట్టుకోవాలి.

       వేపాకుపొడిని, తులసి ఆకుల పొడిని, ;పసుపు పొడిని కలిపి  విడిగా కలిపి పెట్టుకోవాలి.

వేపాకు పొడి           --- రెండు స్పూన్లు
తులసి ఆకుల పొడి --- రెండు స్పూన్లు
పసుపు పొడి          --- రెండు స్పూన్లు

       బాగా వేడి శరీరం వున్నవాళ్ళు కొద్దిగా ముద్దకర్పూరం కలుపుకోవచ్చు.  ఈ చూర్నాల మిశ్రమాన్ని, మట్టిపొడిని  తగినంత నీటితో కలిపి శరీరానికి,  తలకు, ముఖానికి పట్టించి అర గంట తరువాత స్నానం చేయాలి.

      దీని వలన శరీరంలో వుండే వేడి అంతా తగ్గిపోతుంది. చర్మం కాంతివంతంగా తయారవుతుంది.

   అతి వేడి ( పైత్య) దోషాల వలన ఏర్పడే   గుండె సమస్యల నివారణకు హృదయగుటికలు   
    
ఎండుద్రాక్ష                    --- పది గ్రాములు
కరక్కాయల పొడి           --- చిటికెడు
కలకండ                       --- అర టీ స్పూను
       కలిపి తీసుకోవాలి.

     మానసిక ఒత్తిడి ,  అతివేడి  ,  తలతిరగడం తగ్గడానికి                

1. రాత్రి ఒక చిన్న కుండ లో  ఒక గ్లాసు నీళ్ళు పోసి వాటిలో కొన్ని ధనియాలను , కొద్దిగా ఎండు  ఉసిరి ముక్కలను వేయాలి . ఉదయం ఆ నీటిని వడ కట్టుకొని దానిలో చక్కర కలుపుకొని తాగాలి   దీని వలన

     తలలోని అతివేడి తగ్గడానికి  --చిట్కా                       

     ఆముదం , నిమ్మరసం సమాన భాగాలుగా తీసుకొని కలిపి తలకు పట్టిస్తే  వేడి తగ్గుతుంది .  గంట తరువాత
తల స్నానం చేయాలి .

           శరీరం లో అతివేడి    --- నివారణ                             

 కారణాలు:--     Hyper Metabolism,  Hyper Thyroid , పిత్త ప్రకృతి ఆందోళన , విడాహక ఆహార సేవనము . వంటివి .
       వీటివలన  శరీరంలో ఉష్ణోగ్రత ఎక్కువ అవుతుంది .  రక్తప్రవాహ వేగం పెరుతుంది .

1. ఒక టీ స్పూను మెంతులను పెరుగులో రాత్రంతా నానబెట్టి  ఉదయాన్నే ఆ మెంతులను నూరి పెరుగుతో సహా తాగాలి .

2 ఒక స్పూను ధనియాలను నలగ గొట్టి రెండు కప్పు నీటిలో వేసి కాచి ఒక కప్పుకు రానిచ్చి వడకట్టి  కలకండ కలుపుకొని
   తాగాలి .
సూచన  :-- పగలు ఎక్కువ భోజనం ,  రాత్రిపూట తక్కువ భోజనం సెవించాలి.

     వేడి తగ్గడానికి    ----  సుగంధ పానీయం                          

సుగంధపాల వెళ్ళు                   ---- ఒక కిలో
         నీళ్ళు                           ---- 4 లీటర్లు
     పటికబెల్లం                         ---- ఒక కిలో 

         సుగంధపాల వేర్ల ను ఒక రోజంతా లేదా ఒక రాత్రంతా గాని నీటిలో నానబెట్టాలి . దీనిని ఉదయం స్టవ్ మీద పెట్టి
ఒక లీటరు నీళ్ళకు వచ్చే వరకు కాచాలి .  తరువాత ఆ నీటిలో పటికబెల్లం వేసి నీరు ఇంకి పోయి తీగ పాకం వచ్చే వరకు
కాచాలి . చల్లారిన తరువాత సీసాలో భద్రపరచుకోవాలి .

         ప్రతిరోజు  రెండు టీ స్పూన్ల పాకాన్ని గ్లాసులో వేసి  దానికి కుండలో నీళ్ళు  కలిపి తాగాలి .
         దీని వలన వేడి తగ్గి రక్తశుద్ధి జరుగుతుంది . మూడు నెలల వరకు తాగితే శరీరంలో మెరుపు వస్తుంది .
 ధన్యవాదములు 
మీ నవీన్ నడిమింటి 
విశాఖపట్నం 
9703706660
వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యంది 

 *సభ్యులకు విజ్ఞప్తి* 

******************

ఈ  గ్రూపులో పెడుతున్న మెసేజ్ లన్నీ సభ్యులలో ఆరోగ్యం పట్ల ప్రాధమిక అవగాహన కోసమే అని గమనించాలి. వివిధ  నివారణలు సూచనలు కూడా సభ్యులలో అవగాహన పెంచడానికి మాత్రమే ..మీ డాక్టరు కి ఇది ప్రత్యామ్నాయము కాదు. సభ్యులు గమనించాలి.

https://www.facebook.com/Naveen-Nadiminti-1536735689924644/





19, మే 2020, మంగళవారం

సోరియాసిస్ నివారణకు పరిష్కారం మార్గం

సోరియాసిస్ చర్మపు కణాల అసాధారణ వృద్ధి వల్ల ఏర్పడిన దీర్ఘకాలిక చర్మ స్థితి. ఈ చర్మ కణాలు వేగంగా వృద్ధి అవుతాయి మరియు ప్రభావిత ప్రాంతం యొక్క వాపును ప్రేరేపిస్తాయి. సోరియాసిస్ వలన సాధారణంగా చర్మంపై ఎరుపు ప్యాచెస్ ఏర్పడడానికి కారణమవుతుంది. ఎరుపు పాచెస్ నొప్పికి కారణమవుతాయి మరియు భయంకరమైన దురద కలిగి వెండి-తెలుపు వంటి పొరలతో కప్పబడి ఉంటాయి. శారీరకమైన లక్షణాలు పెరుగుతున్న మరియు క్షీణిస్తున్న అనేక దశలను చూపుతాయి, కానీ దురదృష్టవశాత్తు ఈ వ్యాధికి ఎలాంటి శాశ్వత నివారణ లేదు. అయితే, తగిన చికిత్సతో, వ్యాధి లక్షణాలు నియంత్రణలో ఉంచబడతాయి. జీవనశైలి మార్పులతో (ఒత్తిడిని నివారించడం, తేమను ఉపయోగించడం, ధూమపానం మరియు మద్యపానాన్ని తొలగించడం వంటివి) తో పాటు పాటు టార్గెట్ చికిత్స (స్థానిక అనువర్తనం, ఫోటో థెరపీ మరియు నోటి ద్వారా తీసుకొనే మందులు) సాధారణంగా ఉపశమనం యొక్క కాలం (లక్షణం లేని దశ) పొడిగింపు చేయబడుతుంది.

సోరియాసిస్ యొక్క లక్షణాలు 

వ్యక్తులను బట్టి మరియు సోరియాసిస్ రకం బట్టి సోరియాసిస్ లక్షణాలు మారుతూ ఉంటాయి. ఈ ప్యాచ్లు కొన్ని మచ్చలు నుండి పెద్ద గాయాలు వరకు ఉంటాయి. చర్మం, మోచేతులు, మోకాలు, చేతులు మరియు కాళ్ళు ఎక్కువగా ప్రభావితమయ్యే ప్రాంతాలు.

సోరియాసిస్ లక్షణాలు ఈ క్రింది విధంగా ఉంటాయి:

  • చర్మంపై ఎరుపు  మచ్చలు కనిపించడం, ఇవి మందపాటి వెండి పొరలుగా ఉంటాయి.
  • ఈ మచ్చలు దురదలా మారుతాయి, మంటను కలిగిస్తాయి మరియు బాధ కలిగించడానికి కారణమవుతాయి.
  • కొన్నిసార్లు చర్మం అధిక పొడిగా ఉండడం లేదా స్క్రాచ్ కారణంగా రక్తస్రావం జరుగవచ్చు.
  • ప్రభావితమైన ప్రాంతాలు చర్మం,మోచేతులు, మోకాలు లేదా ఎగువ శరీర భాగం.
  • నెయిల్ సోరియాసిస్ వలన గోళ్ళ యొక్క మందం, గుంతలు అవడం మరియు రంగు మారడం వంటి లక్షణాలకు కారణమవుతుంది. గోర్లు వాటి ఆధారం నుండి కొన్నిసార్లు ఊడిపోతాయి.
  • పస్టులర్ సోరియాసిస్ అనేది చేతులు మరియు కాళ్ళ మీద చీము నిండిన ఎర్రని-పొరలు, పగిలిన చర్మం వంటి లక్షణాలను కలిగి ఉంటుంది.

సాధారణంగా, ఈ లక్షణాలు వృద్ది చెందుతున్న మరియు క్షీణిస్తున్న క్రమానుగత లేదా వలయాలను చూపుతాయి. లక్షణాలు కొన్ని రోజులు లేదా వారాల వరకూ  తీవ్రంగా ఉండవచ్చు మరియు సాధారణ స్థితికి వస్తాయి లేదా కొన్నిసార్లు అవి కూడా నయం అవుతాయి మరియు గుర్తించదగినవి కావు. ఆపై మళ్ళీ, ఈ ప్రభావాలు రేకెత్తించే లక్షణాల కారణoగా మరల కనిపిస్తాయి.

సోరియాటిక్ ఆర్థరైటిస్ లక్షణాలు క్రింది వాటితో సహా:

  • శరీరంలో ఒక వైపు లేదా ఇరువైపులా కీళ్ల ప్రమేయం.
  • ప్రభావిత కీళ్ళు బాధాకరమైనవిగా మరియు వాపు  కలిగి తాకడం వలన వెచ్చని అనుభూతి పొందవచ్చు.
  • వేళ్లు మరియు కాలి యొక్క కీళ్ళు వాపు వలన సాసేజ్-లాంటివిగా కనిపిస్తాయి మరియు ఇవి వైకల్యాలకు కారణమవుతాయి.
  • కొన్నిసార్లు, వెన్నుపూస మధ్య కీళ్ళు ప్రభావితం అవుతాయి మరియు నడుము నొప్పి లక్షణాలు (లంబర్ స్పొండిలైటిస్ ను పోలి ఉంటుంది) కలిగి ఉంటుంది.
  • ప్రభావిత అకిలెస్ స్నాయువు మరియు అరికాలి అంటిపట్టుకొన్న కణజాలము మడమ లేదా వెనుక పాదంలో తీవ్రమైన నొప్పికి కారణమవుతుంది. (మరింత చదవండి - మడమ నొప్పి కారణాలు మరియు చికిత్స)

సోరియాసిస్ యొక్క చికిత్స 

సోరియాసిస్ కు శాశ్వతంగా నయమయ్యే చికిత్స లేదు. చికిత్స అనేది వ్యక్తి యొక్క జీవన నాణ్యతను మెరుగుపరచడానికి మరియు లక్షణాలను ఉపశమనం చేసుకొనే లక్ష్యంతో చేయబడుతుంది. సోరియాసిస్ చికిత్స 3 కేటగిరీలుగా విభజించబడింది- పైపూత చికిత్స, క్రమబద్ధమైన మందులు వాడుక మరియు ఫోటో థెరపీ (కాంతి చికిత్స)

  • పైపూత చికిత్స
    తేలికపాటి సోరియాసిస్ లో, పైపూత మందులు మాత్రమే సరిపోవచ్చు.  మధ్యస్థమైన లేదా తీవ్రమైన సోరియాసిస్ లో, పైపూతగా రాసే మందులతో పాటుగా నోటి ద్వారా తీసుకునే మందులు లేదా ఫోటోథెరపీ అవసరం అవుతుంది. పైపూతగా రాసే మందులలో ఇవి ఉంటాయి:
    • కోర్టికోస్టెరాయిడ్లు
    • విటమిన్ డి అనలాగ్‌లు
    • పైపూత రెటీనాయిడ్లు
    • శాలిసైలిక్ ఆసిడ్
    • కోల్ తార్
    • కాల్సినీయురిన్ ఇన్‌హిబిటర్లు
    • ఆంత్రాలిన్
    • మాయిశ్చరైజర్లు
  • క్రమబద్ధమైన మందుల వాడుక
    సోరియాసిస్ తీవ్రమైన లేదా సమయోచిత చికిత్సకు ఆటంకo కలిగితే నోటి లేదా సూది మందులు సూచించబడతాయి. సాధారణంగా, ఈ మందులు తీవ్రమైన దుష్ప్రభావాలను కలిగి ఉంటాయి, అందుచే అవి తక్కువ వ్యవధి కోసం ఉపయోగించబడతాయి మరియు ఇతర రకాల చికిత్సలతో ప్రత్యామ్నాయoగా చేయబడతాయి. సోరియాసిస్ కు చికిత్స చేయడానికి వాడే మందులు:
  • మెథోట్రెక్సేట్
  • సైక్లోస్పోరిన్
  • రెటీనాయిడ్లు
  • ఇమ్యునోమోడ్యులేటర్లు
  • హైడ్రాక్సీయూరియాస్
  • ఫోటో థెరపీ
  • ఆదర్శ ఫోటో థెరపీలో అల్ట్రా-వైలెట్ కిరణాల (సహజ లేదా కృత్రిమ) కు ఈ పొరల గాయాలను గురవుతాయి. సాధారణంగా తీవ్రమైన సోరియాసిస్ యొక్క మోతాదు సమయోచిత చికిత్సా ప్రయోజనాలలో లేదా క్రమబద్ధమైన మందుల వాడుకతో కలిపి ఫోటోథెరపీతో సహా నిర్వహించబడుతుంది. వివిధ రకాల తేలిక చికిత్స రూపాలలో ఈ క్రిందివి చేరి ఉంటాయి:
    • ఎండ తగులుట
    • యువిబి ఫోటోథెరపీ
    • గోకర్‌మ్యాన్ థెరపీ
    • లేజర్ థెరపీ
    • సోరాలెన్ ప్లస్ అల్ట్రావయొలెట్ ఎ థెరపీ

జీవనశైలి యాజమాన్యము

సోరియాసిస్ ఒక వ్యక్తి యొక్క జీవనశైలిని అలాగే అతని/ ఆమె యొక్క జీవన నాణ్యతను ప్రభావితం చేయవచ్చు. సోరియాసిస్ గురించి అవగాహన అనేది ఒక వ్యక్తి సోరియాసిస్­ని మరింత సమర్థవంతంగా ఎదుర్కొనుటలో సహాయ పడుతుంది. ఇది వ్యాధిని నయం చేయుటలో మరియు వ్యాధి ప్రభావాలకు పరిష్కారాలను కనుగొనుటలో సహాయపడుతుంది. ఈ కోలుకునే పద్ధతులలో ఈ క్రిందివి ఉంటాయి:

  • ఒత్తిడి యాజమాన్యము
    ఒత్తిడి అనేది సోరియాసిస్ యొక్క అత్యంత ఎక్కువగా గురి అయ్యే కారక అంశాలలో ఒకటి.
  • దురద లేకుండా చేయుట
    సాధారణంగా, దురద ఒక దుష్ట వలయo లాగానే ఉంటుంది, మీరు మరింతగా గోకినపుడు అది మరింత దురదను కలిగిస్తుంది. కాబట్టి, ముఖ్యంగా సోరియాసిస్ అనేది చర్మం యొక్క పొరల కోసం, దురదను నివారించడం కోసం గోకడం మానుకోవాలి. మాయిశ్చరైజర్ల ఉపయోగం దురదను తగ్గించడంలో సహాయపడుతుంది. 
  • బరువు నియంత్ర్రణ
    బరువు కోల్పోవడం లేదా లక్ష్యిత BMI సాధించడంలో సోరియాసిస్ లక్షణాల తీవ్రత తగ్గించడం అనేది బాగానే పనిచేస్తుంది. అంతేకాకుండా, పండ్లు, కూరగాయలు, కాయ ధాన్యాలు, క్రొవ్వు లేని మాంసం మరియు చేపలు కలిగిన ఆహారాన్ని సోరియాసిస్ మీద సానుకూల ప్రభావం చూపుతుంది. మరోవైపు ఎర్రని మాంసం, అధిక కొవ్వు గల పాల ఉత్పత్తులు, శుద్ధి చేసిన ఆహారం మరియు ఆల్కహాల్ వంటివి సోరియాసిస్­ని మరింత తీవ్రతరం చేస్తాయి.
  • ఒత్తిడి యాజమాన్యము
    ఒత్తిడి అనేది సోరియాసిస్ యొక్క అత్యంత ఎక్కువగా గురి అయ్యే కారక అంశాలలో ఒ
 సోరియాసిస్ వ్యాధికి ఆయుర్వేద చికిత్స 

అల్లోపతిలో దీనికి సరైన/ సంపూర్ణ చికిత్స లేదు. అల్లోపతి మందులు చాలించిన కొద్ది రోజులకే/ నెలలకే ఈ వ్యాధి మళ్ళి వస్తుంది.



ఆయుర్వేద చికిత్స ఎలాంటి దుష్ఫలితాలు లేకుండా ఈ వ్యాధిని నయం చేస్తుంది.

 మా క్లినిక్ ల అనుభవంలో ఈ క్రింది ఆయుర్వేద మందులు భాగా పని చేస్తున్నాయి.

Psora – caps 1 tid – Ayulabs
Atrisor caps - Atrimed
Pesin caps – Dr JRK
Imupsora tab/oint/oil - Charak
Cuticare caps - Bhavani

పై పూతకు 

Sorian ointment – Atrimed
Winsoria oil – KAPL
Psora  oil - Ayulabs
777 oil + Psorolin ointment -Dr JRK
Neem ka Tail - Baidyanath
Chalmungra Oil - Baidyanath

మలభాద్ధకం ఉంటే;
త్రిఫల చూర్ణం/ నిత్యం చరణం/ పంచ్స్కర్ చరణం వంటివి

Stress (ఒత్హిళ్ళు)వుంటే ;
Perment - AVN
Alert - VASU
Stresscom - Dabur

రక్త శుద్ధి అవసరం ఐయితే

Shodhak syr – Prakruthi
Purodil caps/syrup - Aimil
Hemocleen  Syrup - Sandu

Khadhirarista
Saribadyasava

కొదరికి లివర్ టానిక్కులు కుడా వాడవలసి వస్తుంది.

వ్యాధి లక్షణాలు, కారణాలు బట్టి మందులు మారుతుంటాయి. కావున మీ ఆయుర్వేద డాక్టర్ను సంప్రదించి వాడండి. లేదా మీ జబ్బు గురిచి మాకు వివరంగా తెలియ సేయండి.


మీకందరికీ ఆరోగ్యము, సంతోసము, ప్రశాంతత & దివ్యానందము  చేకూరాలని ఆశిస్తూ,


మనుషులకు సోకే చర్మ వ్యాధులు వందకు పైగా ఉన్నాయి. ఈ స్థితులలో అత్యధికం ఒకే రకమైన లక్షణాలు కలిగి ఉంటాయి. ఈ పరిస్థితుల్లో అధిక భాగం ఇలాంటి లక్షణాలు కలిగి ఉంటాయి. తాత్కాలికమైన లేదా శాశ్వతమైన, బాధాకరమైన లేదా నొప్పిలేకుండా, దురద కలిగిన లేదా దురద లేని లక్షణాల ఆధారంగా ఈ పరిస్థితులు వేర్వేరుగా ఉంటాయి. కారణాలు భిన్నంగా ఉంటాయి మరియు రోగనిరోధక వ్యవస్థ మరియు జన్యువుల్లోని అలెర్జీ, ఇన్ఫెక్షన్, లోపాలు కూడా కారణం కావచ్చు. లక్షణాలు వాటి తీవ్రతను బట్టి మారుతుంటాయి. కొన్ని లక్షణాలు తక్కువగా ఉంటాయి మరియు అదృశ్యం అవుతాయి, అయితే కొన్ని చాలా తీవ్రంగా ఉంటాయి మరియు ఆసుపత్రిలో చేరవలసి వస్తుంది. సోరియాసిస్ ప్రపంచ జనాభాలోని 5% మందిని ప్రభావితం చేసే అత్యంత సాధారణ చర్మ వ్యాదుల్లో ఒకటి.

సోరియాసిస్ అంటే ఏమిటి?

సోరియాసిస్ చర్మ కణాల పెరుగుదలను హెచ్చించుట ద్వారా చర్మం యొక్క వృద్ధి వేగవంతం అయ్యే ఒక స్థితి. ఇది చర్మ కణాల నిర్మాణానికి దారితీస్తుంది. కణాలు ఈ సమూహాలుగా చేరి దురదను కలిగి ఉంటాయి మరియు ఎరుపుగా మారుతాయి మరియు కొన్నిసార్లు ఇవి బాధాకరమైనవిగా కూడా  ఉంటాయి. ఇది ఎక్కువ కాలం (దీర్ఘకాలిక) ప్రభావం చూపే ఒక స్థితి, ఇది ఒక క్రమానుగత నమూనాలో కనిపిస్తుంది. ఇది పూర్తిగా నయo అవదు మరియు అందువల్ల చికిత్స యొక్క ప్రధాన లక్ష్యం దీని లక్షణాలను నియంత్రణలో ఉంచడమే.

సోరియాసిస్ కు ఆకు వైద్యం

సొరియాసిస్‌ తరచుగా వస్తూపోయే దీర్ఘకాల చర్మవ్యాధి. ఇది శరీరకంగా, మానసికంగా బాధిస్తుంది. వాస్తవాకి ఇది వ్యాధికాదు. వంశపారంపర్యంగా శరీరంతత్వంలో ఏర్పడిన అలజడి మాత్రమే. వేల సంవత్సరాల చరిత్రఉన్న ఈ వ్యాధిని ఆయుర్వేద గ్రంథాల్లో కిటిభ అన్నారు. ఆలివ్‌ నూనెతో ఏసుక్రీస్తు కూడా ఈ వ్యాధికి చికిత్స చేసినట్లు బైబిల్‌ లో ఉంది. ప్రపంచజనాభాలో దాదాపు మూడు శాతం సొరియాసిస్‌ వ్యాధిగ్రస్తులే.
వ్యాధికి కారణాలు : యాభైశాతం రోగుల్లో ఈ వ్యాధి వంశపారంపర్యమే. అయితే ఇది అంటువ్యాధికాదు. సైనసైటిస్‌, బ్రోంకైటిస్‌, ఆస్మా, టి.బి మొదలైన ఊపిరితిత్తుల సంబంధమైన వ్యాధులు, గర్భధారణ, గర్భస్రావం, మానసిక ఒత్తిడి, ఆధునికవైద్యంలో విరివిగా ఉపయోగిస్తున్న స్టెరాయిడ్లు, మలేరియా జ్వరంలో రక్తపోటు, గుండెజబ్బుల్లోను వాడే కొన్ని ఔషధాలు సొరియాసిస్‌ తీవ్రతరం కావటానికి కారణాలుగా గుర్తించారు.
వ్యాధి లక్షణాలు : ప్రారంభంలో సొరియాసిస్‌ తలలో చుండ్రుగానూ, శరీరంపై చిన్నచిన్న పొక్కులు మొదలై దురదతో కూడి ఇతర శరీరభాగాల్లో దళసరి నల్లని మచ్చలుగా ఏర్పడుతుంది. ఈ మచ్చలు వెండిలా తెల్లగా మెరిసే చేప పొలుసుల్లా కప్పబడి ఉంటాయి. గోళ్లపై చిన్న చిన్న గుంటలు ఏర్పడి, చివరికి గోళ్లు పుచ్చిపోయి అందవికారంగా మారతాయి.
ఒక్కోసారి ఈ వ్యాధి ప్రారంభంలో ఏ మందులు వాడకున్నా తగ్గుతుంది. అలాగని అశ్రద్ధ చేస్తే ఒక్కసారిగా ఈ వ్యాధి దాడి చేసి జీవితాంతం మనశ్శాంతి లేకుండా చేస్తుంది. నమ్మకం, పట్టుదల, సహనంతో ఎక్కువకాలం మందులు వాడి సొరియాసిస్‌ని అదుపుచేయవచ్చు. మనం నిత్యం చూసే పెరటిమొక్కలు సొరియాసిస్‌ వ్యాధి ప్రారంభదశలో అదుపుచేయవచ్చు. అదెలాగో తెలుసుకుందాం.
కామంచి రసం
కావాల్సిన పదార్థాలు : కామంచి ఆకులు
తయారీవిధానం : కామంచి మొక్కని కామాక్షి, గాజుచెట్టు అని కూడా పిలుస్తారు. మొదట కామంచి ఆకులతో రసాన్ని తయారుచేసుకోవాలి. ఈ రసాన్ని గిన్నెలో పోసి సన్ననిమంటపై మరిగిస్తుంటే కొద్దిసేపటికి రసం ముద్దలు ముద్దలుగా విడిపోతుంది. ఈ ముద్దలు కలవకుండా జాగ్రత్తగా వడపోసి ఈ రసాన్ని రోజూ ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం వేళల్లో మూడు టేబుల్‌ స్పూన్ల చొప్పున తాగాలి. శరీరంపైనా ఈ రసాన్ని రాసుకోవచ్చు. ఇలా క్రమంగా కొన్నాళ్లు చేస్తే సొరియాసిస్‌ అదుపులోకి వస్తుంది.
కసివింద మిశ్రమం
కావాల్సిన పదార్థాలు- కసవింద ఆకులు, వేర్లు
తయారీవిధానం - రోడ్డు పక్క, పొలాల గట్లపై దొరికే కసివింద ఆకులతో రసాన్ని చేసుకోవాలి. లేదా వేర్లతో కూడా రసాన్ని చేసుకోవచ్చు. ఈ కసవింద రసాన్ని శరీరంలో సొరియాసిస్‌ ఉన్నచోట రాసుకోవాలి. ఈ ఆకు పచ్చడిగానూ, గింజలు కారంపొడిగా కొట్టి రోజూ ఆహారంలో తీసుకున్నా చాలా మంచిది. సొరియాసిస్‌ని అదుపులో ఉంచవచ్చు.
కుప్పింటి మిశ్రమం
కావాల్సిన పదార్థాలు : కుప్పింటి ఆకులు
తయారీవిధానం : కుప్పింటి ఆకునే హరితమంజరి అని పిలుస్తారు. వారానికి ఒరోజు ఈ ఆకులతో కూర చేసుకుని అన్నంలో తినాలి. దీనివల్ల ఉదయాన్నే కాలవిరేచనం అయ్యి సొరియాసిస్‌ వ్యాధి త్వరగా అదుపులోకి వస్తుంది. ఈ ఆకురసాన్ని పూతగా కూడా రాసుకోవచ్చు.
ఇక పలు మొక్కలతో సొరియాసిస్‌ని అదుపుచేసే ఓ పొడి తయారు చేసుకుంటే చాలా మంచిది. అదెలాగో తెల్సుకుందాం.
నాలుగు ఆకుల మిశ్రమం
కావాల్సిన పదార్థాలు :ఉత్తరేణి, కామంచి, కుప్పింటి, మల్చరీ ఆకులు, మిర్యాలు
తయారీవిధానం : ఉత్తరేణి, కామంచి, కుప్పింటి, మల్బరీ ఆకులను నీటిలో శుభ్రంగా కడగాలి. తర్వాత నీడలో ఆరబెట్టి పొడిచేయలి. ఈ పొడికి నాలుగోవంతు మిర్యాల చూర్ణాన్ని కలపాలి. రోజూ చెంచాడు ఈ ఆకుపొడిని గ్లాసు మజ్జిగలో కలిపి తాగాలి. లేకుంటే రోజువారి ఆహారంలో కూరలు, పచ్చళ్లు, పొడుల రూపంలో కూడా తినటం చాలా మంచిది.
ఈ సొరియాసిస్‌ వ్యాధి ఉన్న వారు ఎలాంటి సబ్బులను వాడరాదు. ఇంట్లో చేసుకున్న సున్నిపిండితోనే స్నానం చేసుకోవాలి. అనివార్య పరిస్థితిలో పిల్లలకు వాడే బేబీ సబ్బులు వాడవచ్చు. ఈ వ్యాధి ఉన్న వారు వేసవికాలంలో ఆలివ్‌ నూనె, శీతాకాలంలో నువ్వుల నూనె రాసుకోవటం ఉత్తమం.


సోరియాసిస్ నివారణకు మందులు

Medicine NamePack Size
BetnesolBetnesol 4 Tablet
AerocortAerocort Inhaler
AdapanAdapan Gel 15gm
Candid GoldCandid Gold Cream
Exel GnExel Gn 0.05% W/W/0.5% W/W Cream
Propyderm NfPropyderm NF Cream
AdapenAdapen Gel
Propygenta NfPropygenta NF Cream
PropyzolePropyzole Cream
AdaretAdaret 0.1% W/V Gel
Propyzole EPropyzole E Cream
AdeneAdene 0.1% Gel
Canflo BnCanflo Bn 1%/0.05%/0.5% Cream
Tenovate GNTenovate GN Cream
Toprap CToprap C Cream
AdhibitAdhibit Gel
Crota NCrota N Cream
Clop MGClop MG Cream
FubacFUBAC CREAM 10GM
Canflo BCanflo B Cream
Adiff AqsAdiff Aqs 0.1% W/W Gel
Sigmaderm NSigmaderm N 0.025%/1%/0.5% Cream
Clovate GmClovate Gm Cream
FucibetFUCIBET CREAM
Rusidid BRusidid B 1%/0.025% Cream


ధన్యవాదములు 

మీ నవీన్ నడిమింటి 

విశాఖపట్నం 

అస్వీకార ప్రకటన: ఈ సైటుపై లభ్యమవుతున్న మొత్తం సమాచారము మరియు లేఖనము కేవలం అవగాహనా ఆవశ్యకతల కొరకు మాత్రమే. ఇక్కడ ఇవ్వబడిన సమాచారమును ఏదైనా ఆరోగ్య సంబంధిత సమస్య లేదా అస్వస్థత నుండి కోలుకోవడానికి లేదా స్వస్థత కొరకు నిపుణుల సలహా లేనిదే ఉపయోగించుకోకూడదు. చికిత్స పరీక్షలు మరియు సేవల కొరకు ఎల్లప్పుడూ ఒక అర్హత పొందిన వైద్యుల సలహా తీసుకోవాలి.