శరీరంలో ఆమ్లం నిల్వ శాతం పెరగడాన్ని హైపర్ యూరికేమియా అని పేర్కొంటారు. యూరిక్ యాసిడ్/ యూరిక్ ఆమ్లము స్థాయి చాలా హెచ్చుగా ఉండటం ఆరోగ్య సమస్యకు దారితీస్తుంది. ప్రోటీన్ల విచ్ఛిన్నం కారణంగా శరీరంలో యూరిక్ ఆసిడ్ తయారవుతుంది. ప్రొటీన్లు విచ్ఛిన్నమయినపుడు వాటిలోని రసాయనక సమ్మేళనాన్ని ప్యూరిన్లు అంటారు. అవి యూరికి ఆసిడ్ గా విచ్చిత్తి అవుతాయి. మూడు ప్రధానంగా కారణాల వల్ల యూరిక్ ఆమ్లం స్థాయి పెరగవచ్చు . అవి యూరిక్ ఆసిడ్ హెచ్చు ఉత్పత్తి, యూరిక్ ఆసిడ్ విసర్జన తగ్గడం, లేదా ఈ రెండు వ్యవస్థల కలయిక.
హైపర్ యూరికేమియా ఏ లక్షణం లేకుండా (అసింప్టోమాటిక్) ఉండవచ్చు. లేదా అది లక్షణాలతో కూడి ఉండవచ్చు ( సింప్టొమాటిక్). శరీరంలో యూరిక్ ఆసిడ్ స్థాయి పెరుగుదలకు పెక్కు వైద్యపరమైన స్థితిగతులు ఉంటాయి. అవి లక్షణాలతో కనిపిస్తాయి. ఇవి యూరిక్ ఆసిడ్ నెఫ్రోపతి ( మూత్రంలో హెచ్చుస్థాయిలో యూరిక్ ఆసిడ్ ఉన్న కారణంగా కిడ్నీ పనితీరు తగ్గుతుంది.) , గౌట్ ( రక్తంలో ప్రసరించే హెచ్చు స్థాయి యూరిక్ ఆసిడ్ మోతాదు కారణంగా కీళ్లలో యూరేట్ క్రిస్టల్ డిపొజిషన్) , యూరిక్ ఆసిడ్ నెఫ్రోలితియాసిస్ ( యూరిక్ ఆసిడ్ కిడ్నీస్టోన్స్) మేరకు ఉంటాయి శరీరంలో ఆమ్లం నిల్వ శాతం పెరగడంతో ఏలాంటి వెంబడించే లక్షణాలు లేకపోయినప్పుడు, సాధారణంగా చికిత్స సిఫారసు చేయబడదు. అయితే లక్షణాలతో కూడిన హపర్ యూరికేమియాకు నిర్ధారణను అనుసరించి చికిత్స అవసరం కాగలదు. శరీరంలో ఆమ్లం నిల్వ శాతం పెరగడంతో ఎదురయ్యే సమస్యలలో గౌట్, అక్యూట్ యూరిక్ ఆసిడ్ నెఫ్రాపతీ, యూరిక్ ఆసిడ్ నెఫ్రాలితియాసిస్ మరియు దీర్ఘకాలిక రెనాల్ తక్కువ మోతాదు వంటివి ఉంటాయి
మీకు హైపర్ యూరికేమియా జబ్బు ఉన్నట్లయితే, మీ వైఫ్యుడు మీ జబ్బు పూర్వాపరాలను కూలంకషంగా పరిశీలిస్తాడు. తద్వారా మీరు జబ్బు లక్షణాలను పొందినవారా లేదా లక్షణాలకు అతీతులా అని నిర్ధారిస్తాడు. తర్వాత జబ్బు కారణాలను మరియు ఎదురవుతున్న ఇతర వైద్య సహ సమస్యలను గుర్తిస్తాడు.
జబ్బు లక్షణాలు కనిపించనప్పుడు సాధారణంగా ప్రత్యేకంగా జబ్బు నిర్ధారణ జరిపే అవసరం ఉండదు. అయితే జబ్బు లక్షణాలు ఉన్నప్పుడు, పరీక్ష తర్వాత ఈ క్రింది అంశాలు వెలుగులోకి వస్తాయి. :
- తీవ్రమైన గౌట్ కీళ్లనొప్పుల సందర్భంగా దెబ్బతిన్న కీలు చూసేందుకు ఎర్రగా ( ఎరిథెమాటస్) కనిపిస్తుంది. తాకినప్పుడు వెచ్చగా ఉంటుంది. వాపు కలిగి ఉంటుంది మరియు హెచ్చు నొప్పికి దారితీస్తుంది.
- దీర్ఘకాలంగా గౌటీ కీళ్లనొప్పులకు గురవుతున్నవారిలో క్రిస్టలిన్ యూరిక్ ఆసిడ్ (టోఫీ) నిల్వలు పేరుకుపోతాయి. అవి చెవి మృదులాస్థిలో, చేయి ముందుభాగం లోపల, మోచేయి మరియు శరీరం లేదా ఇతర కణజాలం మధ్య పలుచని ద్రవం పొరలో ఇది చేరి ఉంటుంది.
- యూరిక్ ఆసిడ్ నెఫ్రోలితియాసిస్ లో జబ్బుమనిశి పొత్తికడుపు లేదా ఒరలో ( పృష్టభాగం మరియు పక్క ఎముకల మధ్య ప్రదేశంలో) నొప్పి కలిగి ఉంటాడు ( హెచ్చు వివరాలకు చదవండి – కిడ్నీలో రాళ్లకు చికిత్స)
హైపర్ యూరికేమియాకు ఇతర వైద్యకీయ జబ్బులకు మధ్య గల తేడాను గమనించవలసి ఉన్నది. అవి ఒకే రకం లక్షణాలను కలిగి ఉంటాయి. వాటిలో క్రిందివి చోటుచేసుకొని ఉంటాయి.
- ఆల్కహాలిక్ కేటోఆసిడోసిస్
మద్యం వాడకం మరియు ఆహారం లేమితో ఎదురయ్యే జైవిక దుస్థితి. - డయాబెటిక్ కేటోఆసిడోసిస్
మీ బ్లడ్ షుగర్ చాలాకాలంపాటు చాలా హెచ్చుగా ఉన్నప్పుడు మీ రక్తంలో ఆసిడ్లు చోటుచేసుకోవడం. - గౌట్ మరియు సూడోగౌట్
ఇవి మంటతో కూడిన కీళ్లనొప్పికి సంబంధించినవి. - హేమోలిటిక్ రక్తహీనత
శరీరంలో రక్తంలోని ఎర్రకణాలు తమ సాధారణ జీవితకాలానికి మునుపే వినాశానికి గురయ్యే దుస్థితి - హొడ్గ్కిన్ లింఫోమా
తెల్ల రక్త కణాలలో ఆవర్భవించే ఒక రకం కేన్సర్ - హైపర్ పారాథైరోయిడిజం
ఇట్టి దుస్థితిలో రక్తప్రవాహంలో పారా థైరాయిడ్ హార్మోన్ హెచ్చుగా ఉంటుంది - హపోథైరాయిడిజమ్
శరీరం అవసరమైన స్థాయిలో థైరాయిడ్ హార్మోన్లను ఉత్పత్తి చేయలేయలేని స్థితి - నెఫ్రోలిథియాసిస్ (మూత్రపిండాలలో రాళ్లు చేరడం)
ఇది మూత్రవ్యవస్థలో రాళ్లు చేరే ప్రక్రియ - నెఫ్రోలిథియాసిస్
గర్భంతో ఉన్న దశలో ఒక మహిళ ( ఇదివరకు హెచ్చుస్థాయిలో రక్తపీడనం లేకుండా ఉండి ) ఇప్పుడు హెచ్చుస్థాయి రక్తపీడనం పెంపొందించు కోవడం మరియు దానితోపాటు మూత్రంలో హెచ్చుస్థాయి ప్రోటీన్లు కలిగి ఉండటం. - I ఏ రకం గ్లైకోజన్ స్టోరేజ్ జబ్బు
ఈ రకం జబ్బును జి ఎస్ డి 1 ఏ జబ్బు అని కూడా అంతారు. రక్తకణాలలో గ్లైకోజన్ అనబడే చక్కెర ఉన్న కారణంగా ఎదురయ్యే దుస్థితి. కొన్ని అవయవాలలో మరియు కణజాలంలో కూడా గ్లైకోజెన్ స్థాయి పెరగవచ్చు - యూరిక్ ఆసిడ్ నెఫ్రోపతి
మూత్రంలో హెచ్చుస్థాయి యూరిక్ అసిడ్ ఉన్న కారణంగా కిడ్నీ పనితీరు దిగజారడంతో ఎదురయ్యే స్థితి
లక్షణరహితమైన హైపర్ యూరికేమియా
లక్షణరహితమైన హైపర్ యూరికేమియా రోగులకు సాధారణంగా వైద్య చికిత్స సిఫారసు చేయబడదు. అట్టి రోగులలో జీవన సరళి/ విధానం లో మార్పు అవసరం. వాటిలో ఆహార వ్యవస్థలో మార్పు, వ్యాయామం ఉంటాయి. అవి యూరిక్ ఆసిడ్ స్థాయిని అదుపు చేస్తాయి.
లక్షణాలతో కూడిన హైపర్ యూరికేమియా
హైపర్ యూరికేమియా గౌట్ రూపంలో, యూరిక్ ఆసిడ్ రాళ్లు లేదా యూరిక్ ఆసిడ్ వెఫ్రాపతి లక్షణాలతో కూడినది కావచ్చు
గౌట్ ( వాతము )
- తీవ్రమైన గౌటీ కీళ్లనొప్పులు
తీవ్రమైన గౌట్ కీళ్లనొప్పి జబ్బుకు చికిత్స కల్పించే ముఖ్య ఉద్దేశం నొప్పి నివారణ. దీనితో సాధారణంగా మంట నివారణ జరిగేవరకు ఎన్ ఎస్ ఏ ఐ డి లను ( నాన్ స్టెరాయిడల్ ఆంటి-ఇన్ఫమెటరీ డ్రగ్స్) సిఫారసు చేస్తారు. ఇవి సాధారణంగా 7 – 10 రోజుల వాడకానికి సూచిస్తారు. లేదా వైద్యపరీక్ష నిర్ధారణను పరిస్థితిని బట్టి 3-4 రోజులకు కూడా సూచిస్తారు. - దీర్ఘకాలిక గౌట్ థెరపీ
వాతపు కీళ్లనొప్పి లక్షణాలు నయమయిన తర్వాత, వాతపు కీళ్లనొప్పి రోగి అంతర-తీవ్రస్థాయి దశకు చేరుకొంటాడు. ఈ దశలో సాధారణంగా ప్రోఫిలాటిక్ కాల్కిసైన్, యూరికోస్యూరిక్ మందులు, (యూరిక్ ఆసిడ్ ను విసర్జింపజెసే మందులు) మరియు సాంతిన్ ఆక్సిడేస్ నిరోధకాలు ( యూరిక్ ఆసిడ్ ఉత్పత్తిని నిరోధింపజేసే మందులు) సూచింపబడతాయి.
యూరిక్ అసిడ్ నెఫ్రాలిథియాసిస్
ఈ సందర్భంలో అల్లోప్యూరినాల్ మందులు వాడుతారు
యూరిక్ ఆసిడ్ నెఫ్రాపతి
యూరిన్ ను పలచపరచడానికై ఫ్యూరోసెమైడ్ లేదా మానిటాల్ వంటి మందులు) ఇంట్రావీనస్ సెలైన్ మరియు మందులు ఉపయోగించి యూరిక్ ఆసిడ్ మరింత గట్టిపడకుండా నివారిస్తారు. సోడియం బైకార్బినేట్ లేదా అసెటాజోలామైడ్ తోపాటు యూరిన్ ఆల్కలైజేషన్ కూడా చేయవచ్చు.
క్లినికల్ పరీక్షలు, జబ్బు నిర్ధారణ ఫలితాల ఆధారంగా మీ వైద్యుడు మిమ్మల్ని ఒకానొక వైద్య నిపుణుని (స్పెషలిస్ట్) సలహాకై పంపవచ్చు
- తీవ్రమైన లేదా దీర్ఘకాలిక గౌటీ కీళ్లనొప్పుల రోగులను ర్యుమటాలజిస్టును సంప్రతించమని సూచించవచ్చు
- తీవ్రమైనయురెట్ నెఫ్రాపతీ లేదా దీర్ఘకాలిక రెనాల్ ఫెయిల్యూర్ రోగులను కిడ్నీ స్పెషలిస్టును సంప్రతింపమని సూచించవచ్చు.
- లక్షణాత్మక యూరిక్ ఆసిడ్ నెఫ్రాలిథియసిస్ రోగులను యూరాలజిస్టును సంప్రతింపమని సూచించవచ్చు.
జీవన సరళి నిర్వహణ
హైపర్ యూరీకేమియా, ప్రత్యేకంగా లక్షణరహితమైనట్టిది, పెక్కు సందర్భాలలో జీవనవిధానంలో మార్పులతో నయం చేస్తారు. లక్షణాత్మకమైన హైపర్ యూరీకేమియా కూడా ఈ మార్పులతో ప్రయోజనం పొందగలదు.
ఆహారవ్యవస్థలో మార్పులు
- వేటిని సేవించరాదు ?
- గొర్రె, పంది, ఎద్దు వంటివాటి ఎర్ర మాంసాన్ని తీసుకొనకండి
- కొవ్వుతో కూడినట్టి పౌల్ట్రీ మరియు హెచ్చు కొవ్వు కలిగిన డెయిరీ ఉత్పత్తుల వాడకాన్ని అదుపు చేయండి
- సార్డైన్, టునా షెల్ చేపలు మరియు ఆంకోవీ జాతి చేపల వాడకాన్ని తగ్గించండి. వాటిలో ప్యూరిన్స్ హెచ్చుగా ఉంటాయి. అలాగే తీపుగావింపబడిన సంపూర్ణ ధాన్యాలను వాడకండి.
- ఫ్రక్టొస్ తో తీపు చేయబడ్ద పానీయాలను, ఆల్కహాల్ ను (ముఖ్యంగా బీర్) మానండి
- ఏవి తినవచ్చు ?
- అవసరమైన మోతాదులో నీరు సేవించి చక్కటి హైడ్రేషన్ కలిగి ఉండండి
- తక్కువ కొవ్వుతో కూడిన డెయిరీ ఉత్పత్తులను, ప్రొటీన్ వనరుల కోసం కూరగాయలను సేవించండి
- హెచ్చు మోతాదులో ( వితమిన్ సి హెచ్చుగా ఉండే) పళ్లను, కూరగాయలను, తృణధాన్యాలను సేవించండి
- వ్యాయామం
మీ ఎత్తుకు సరిపడే శారీరక బరువును పొందడానికి క్రమం తప్పకుండా వ్యాయామం జరపండి వ్యాయామం యూరిక్ ఆసిడ్ ఉత్పత్తి స్థాయిని తగ్గించడమే కాకుండా అది కీళ్లపై బరువును తగ్గిస్తుంది మరియు కాళ్లను బలపరచడానికి సహాయం చేస్తుంది.అధిక యూరిక్ ఆసిడ్ ను కంట్రోల్ చేసే మార్గాలు:
మన శరీరంలో ఒక సేంద్రీయ సమ్మేళనం అయిన యూరిక్ ఆమ్లం ఉంటుంది.ఇది ఒక ఉప ఉత్పత్తిగా రక్తప్రవాహంలో తిరుగుతూ మన శరీరం యొక్క జీవక్రియకు సహాయం చేస్తుంది. రక్తంలో యూరిక్ ఆమ్లం హెచ్చు స్థాయిలో ఉంటే ఆర్థరైటిస్ సమస్యకు దారితీస్తుంది. దీనిని గౌట్ అని పిలుస్తారు. శరీరం దీనిని విసర్జన చెయ్యలేకపోతే అప్పుడు దాని స్థాయి పెరుగుతుంది. శరీరంలో యూరిక్ ఆమ్లాలు పేరుకుపోతే గౌట్ మాత్రమే కాకుండా కిడ్నీలో రాళ్ళ లాంటి ఇతర ఆరోగ్య సమస్యలకు కారణం కావచ్చు.
మీరు ఈ పరిస్థితిని లేదా మీ తల్లిదండ్రులు లేదా తాతలకు ఈ సమస్య కలిగి ఉంటే కనుక మీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది తరచుగా యూరిక్ ఆమ్లం ప్రాసెస్,శరీరం యొక్క సామర్ధ్యానికి వారసత్వ అసాధారణతకు సంబంధం కలిగి ఉంటుంది. మీరు నిరోధించబడిన మరియు క్రమశిక్షణతో ఆహారపు అలవాట్లను అనుసరిస్తే కొంత వరకు నియంత్రించవచ్చు.
అనేక ఆహారాలు రక్తంలో యూరిక్ ఆమ్లంను పెంచుతాయి. కానీ నిజానికి కొన్ని ఆహారాలు ఈ సాంద్రతలు తగ్గించేందుకు సహాయపడతాయి.యూరిక్ ఆమ్లంతో బాధపడుతున్న వ్యక్తులు విటమిన్ సి,ఫైబర్ మరియు నీటిని,తాజా పండ్లు మరియు కూరగాయలను సమృద్ధిగా తీసుకోవాలని సూచించడం జరుగుతుంది.ఇవి శరీరంలో యూరిక్ ఆమ్లం స్థాయిలను తగ్గిస్తాయి. అంతేకాక వారు మాంసాహారాన్ని,ఆర్గాన్ మాంసాలు మరియు అత్యంత ప్రాసెస్ చేసిన ఆహారాలను నివారించమని సలహా ఇస్తారు.యూరిక్ ఆమ్లంతో బాధపడుతున్న వ్యక్తులు తినవలసిన ఆహారాలు గురించి తెలుసుకుందాము.
కొన్ని పరిశోధన ప్రకారం, ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు యూరిక్ యాసిడ్ ను కంట్రోల్ చేస్తాయి. కాబట్టి, మీ యూరిక్ యాసిడ్ డైట్ ను తెలుసుకోవాలంటే మీ రెగ్యులర్ డైట్ లో అధిక ఫైబర్ ఫుడ్స్ ను తీసుకోవాలి. ఓట్స్, ఆకుకూరలు, బ్రొకోలీ మొదలగునవి తీసుకోవాలి.
సాధారణ నూనెల కంటే ఆలివ్ ఆయిల్ తో తయారుచేసే వంటలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. బట్టర్ లేద వెజిటేబుల్ ఆయిల్ కంటే ఇది చాలా ఉత్తమమైనది . రెగ్యులర్ ఆయిల్స్ రాన్ సిడ్ ఫ్యాట్స్ ను ఉత్పత్తి చేసి, విటమిన్ ఇ ని నాశనం చేస్తాయి. ఇది యూరిక్ యాసిడ్ గా మారుతాయి. దీన్ని తొలగించాలంటే ఆలివ్ ఆయిల్ ను ఉపయోగించడం ఉత్తమం.
షుగర్ తో తయారుచేసినటువంటి జంక్ ఫుడ్స్ ను తీసుకోవడం నివారించాలి. ఇవి మన శరీరంలో అధిక యూరిక్ యాసిడ్ ఉత్పత్తికి కారణం అవుతాయి. కాబట్టి, కేక్స్, పాస్ట్రీస్ వంటివి నివారించాలి.
మీ శరీరంలో యూరిక్ ఆమ్ల స్థాయి తగ్గించడానికి కనీసం ప్రతి రోజు 2-3 లీటర్ల నీరు త్రాగటానికి ప్రయత్నం చేయాలి. నీరు యూరిక్ ఆమ్లంతో సహా మీ వ్యవస్థ యొక్క విషాన్ని బయటకు పంపటానికి సహాయపడుతుంది. ఎక్కువగా ద్రవాలు త్రాగటం వలన మీ శరీరంలో ఉన్న అదనపు యూరిక్ ఆమ్లంను తొలగించటానికి సహాయం చేస్తుంది.
చెర్రీస్ రక్తంలో యూరిక్ ఆమ్ల స్థాయిలను తగ్గించడానికి వాడతారు. రక్తంలో మీ యూరిక్ ఆమ్ల స్థాయిలను తగ్గించడానికి చెర్రీస్ తప్పనిసరిగా తినాలి. మీరు చెర్రీ రసం లేదా డబ్బాలో ఉండే చెర్రీస్ ను కూడా అల్పాహారంగా తీసుకోవచ్చు. కొన్ని అధ్యయనాల ప్రకారం ప్రతి రోజు చెర్రీ సీరం తీసుకోవడం వలన శరీరంలో యూరిక్ ఆమ్లం స్థాయిలను తగ్గిస్తాయని నిరూపణ అయ్యింది.
మీ శరీరంలో యూరిక్ ఆమ్ల స్థాయిలను తగ్గించడానికి ప్రతిరోజు నిమ్మరసం త్రాగాలి. కాల్షియం కార్బోనేట్ శరీరంలో తటస్థం ఆమ్లాలకు సహాయపడుతుంది. అయితే యూరిక్ ఆమ్లం మరియు నిమ్మరసం కలిపి కాల్షియం కార్బోనేట్ ఉత్పత్తికి సహాయపడతాయి. విటమిన్ సి యూరిక్ యాసిడ్ ను కంట్రోల్ చేస్తుంది .
గౌట్‌కు శాశ్వత పరిష్కారం :
గౌట్ అనేది యూరిక్ ఆసిడ్ అసమతుల్యత వల్ల ఏర్పడే సమస్య. ఈ వ్యాధిలో యూరిక్ యాసిడ్ మోతాదు రక్తంలో తీవ్రంగా పెరుగుతుంది. పెరిగిన యూరిక్ ఆమ్లం స్ఫటికలుగా మారి కీళ్లలోకి చేరి తీవ్రమైన నొప్పిని కలగజేస్తాయి. ఇలాంటి కీళ్ళ నొప్పులని వైద్య పరిభాషలో ‘గౌటీ ఆర్థరైటిస్’ అని అంటారు. ఇది చాలా తీవ్రమైన సమస్య.
ప్రపంచవ్యాప్తంగా గణాంకాల ప్రకారం 2 నుంచి 4 శాతం మంది ప్రజలు ఈ వ్యాఽధితో బాధపడుతున్నారు. సాధారణంగా ఈ వ్యాధి 30 నుంచి 45 సంవత్సరాల వయస్సు వారిలో అధికంగా కనిపిస్తుంది. స్ర్తీలతో పోలిస్తే పురుషుల్ని గౌట్ వ్యాధి ఎక్కువగా బాధిస్త్తుంది. చారిత్రాత్మకంగా గౌట్ వ్యాధి ‘శ్రీమంతుల జబ్బు’ లేదా ‘రాజుల జబ్బు’గా అభివర్ణించబడింది.
వ్యాధి కారణాలు:
గౌట్ వ్యాధి రావటానికి గల ప్రధాన కారణం రక్తంలో పెరిగిన యూరిక్ ఆమ్లశాతం. యూరిక్ ఆమ్లం అనేది ఒక అనవసరమైన పదార్థం. ఇది మనం తీసుకునే ఆహారంలోని ప్రొటీన్లు జీర్ణమయిన తర్వాత ఏర్పడే ఒక విష పదార్థం. ప్రాధమికంగా ఈ విష పదార్థం రక్తంలో కలిసి శుద్ధి కోసం మూత్రపిండాలకు చేరుతుంది. మూత్రపిండాలు రక్తాన్ని శుద్ధిచేసి అందులోని విషపదార్థాలను వ్యాధి కారక పదార్థాలను వేరుచేసి మూత్రం ద్వారా మన శరీరం నుంచి బయటకు పంపివేస్తాయి.
ఈ సమస్య ఎవరికి?
వంశ పారంపర్య మూలాలున్న వారుఅధిక మోతాదులో ప్రొటీన్లు తీసుకోవటం అంటే మంసాహారం, చేపలు తదితర ఆహారం ఎక్కువగా తీసుకునేవారిలోస్థూలకాయులుమద్యపానం చేసే వారుమూత్రపిండాల వ్యాధితో బాధపడేవాళ్లుఅధిక రక్తపోటు ఉన్నవారురోగనిరోధక శక్తి తగ్గిపోయిన వారు ఈ వ్యాధి బారిన పడుతుంటారు.
వ్యాధి లక్షణాలు:
వ్యాధి లక్షణాలు చాలా రకాలుగా కనబడతాయి. అందులో ముఖ్యంగా తరుచుగా వచ్చే కీళ్ళవాపు ఒకటి. గౌట్ వ్యాధిలో కాలి బొటనవేలు మొదటగా వాపునకు గురవుతుంది. అందుకని గౌటీ ఆర్థరైటిస్‌ను వైద్య పరిభాషలో ‘పాడగ్రా’ అని అంటారు
కీళ్లవాపుతోపాటు కీళ్లు ఎర్రగా మారటంవాపుతో పాటు విపరీతమైన నొప్పికీళ్లు వేడిగా ఉండటంరాత్రి వేళలో విపరీతమైన జ్వరంనీరసంగా ఉండటంగౌటీ ఆర్థరైటి్సలో ఎక్కువగా కాలి బొటనవేలు, మడమలు, మోకాళ్లు ఎక్కువగా వాపునకు గురవుతాయి.
యూరిక్ యాసిడ్ స్ఫటికలు కీళ్ళలో చేరటాన్ని వైద్య పరిభాషలో ‘టోఫై’ అంటారు. టోఫై తీవ్రమైన ప్పుడు పగిలిపోయి పుండుకు దారితీస్తుంది.. యూరిక్ యాసిడ్ స్ఫటికలు మూత్రపిండాలలో కూడా పేరుకుపోవచ్చు. ఇలా పేరుకుపోయిన స్ఫటికలు మూత్రపిండాలలో రాళ్లు ఏర్పడటానికి దారితీస్తాయి. దీన్ని ‘యూరేట్ నెఫ్రోపతి’ అని అంటారు.
వ్యాధి నిర్థారణకు ముందు తర్వాత తీసుకోవలసిన జాగ్రత్తలు
మద్యపానం మానివేయటంస్థూలకాయాన్ని తగ్గించుకోవటంమాంసాహారం నియంత్రించటంక్రమం తప్పకుండా వ్యాయామం చేయటంపోషకాహారం తీసుకోవటంమానసిక ఒత్తిడిని తగ్గించుకోటం
హోమియోపతి వైద్యం:
హోమియోపతిలో గౌటీ ఆర్థరైటి్‌సకు చాలా చక్కటి వైద్యం అందుబాటులో ఉంది. హోమియోపతిలో జబ్బురావటానికి గల కారణాన్ని దృష్టిలో ఉంచుకొని వైద్యం చేయటం జరుగుతుంది. హోమియోపతిలో గౌటీ ఆర్థరైటి్‌సకు బెల్లడోనా, బ్రయోనియా బెంజోయిక్ ఆసిడ్, లెడంపాల్
వంటి అద్భుతమైన మందులు ఉన్నాయి. పైన పేర్నొ మందులను వ్యక్తి శారీరక, మానసిక, వ్యాధి లక్షణాలను పరిగణలోనికి తీసుకొని ఒక సరియైున మందును ఎంపిక చేస్తారు. ఈ పద్ధతిని ‘కాన్స్టిటూషనల్ థెరపీ’ అంటారు. ఇలాంటి పద్ధతిలో ఎంపిక చేసిన మందును హోమియో వైద్యుని పర్యవేక్షణలో సూచించే కాలపరిమితి మేర వాడటం వల్ల గౌటీ ఆర్థరైటి్‌సకు ఒక సురక్షితమైన నొప్పి రహితమైన శాశ్వతమైన పరిష్కారం లభిస్తుంది.
అవనిలో ఒక అరుదయిన మూలిక సదాపాకు (RUTA GRAVEOLENSE )
సదాపాకు ని సంస్కృతంలో “నాగదాలి” అంటారు. ఇది ఒక మూలిక. సదాపాకు హోమియోపతి లో అద్భుతమైన ఔషదంగా 200 ఏళ్ళ నుండి ప్రాచుర్యంలో ఉంది. ఈ మొక్క చాల ఔషధ గుణాలను కలిగి అనేక క్లిష్టమైన వ్యాధులకు మందుగా ఉపయోగించబడుతుంది.
ప్రయోజనాలు :
- నరాలకు సంబందించిన సమస్యలను నివారిస్తుంది.
- మెదడు కాన్సర్ కారకాలను అడ్డుకుంటుంది.
- దోమలను, పాములను రానివ్వదు.
- కీళ్ల నొప్పులు, యూరిక్ ఆసిడ్ సమస్యలకు ఈ సదాపాకు కాషాయం ఒక మంచి మెడిసిన్.
- కండరాల నొప్పులకు ఈ కషాయాన్ని 3 గంటలలో 3-5 తీసుకుంటే నొప్పులు తగ్గిపోతాయి.
- లివర్ సిరోసిస్ సమస్యకు ఈ కాషాయం మంచి ఫలితాన్నిస్తుంది.
- బ్రెయిన్ ట్యూమర్ వ్యాధిని తగ్గిస్తుంది.
- మైండ్ రిలాక్సేషన్ కి ఈ కాషాయం బాగా పనిచేస్తుంది.
- వాత నొప్పులను హరిస్తుంది
ప్రయోజనాలు :
- నరాలకు సంబందించిన సమస్యలను నివారిస్తుంది.
- మెదడు కాన్సర్ కారకాలను అడ్డుకుంటుంది.
- దోమలను, పాములను రానివ్వదు.
- కీళ్ల నొప్పులు, యూరిక్ ఆసిడ్ సమస్యలకు ఈ సదాపాకు కాషాయం ఒక మంచి మెడిసిన్.
- కండరాల నొప్పులకు ఈ కషాయాన్ని 3 గంటలలో 3-5 తీసుకుంటే నొప్పులు తగ్గిపోతాయి.
- లివర్ సిరోసిస్ సమస్యకు ఈ కాషాయం మంచి ఫలితాన్నిస్తుంది.
- బ్రెయిన్ ట్యూమర్ వ్యాధిని తగ్గిస్తుంది.
- మైండ్ రిలాక్సేషన్ కి ఈ కాషాయం బాగా పనిచేస్తుంది.
- వాత నొప్పులను హరిస్తుంది
యూరిక్ యాసిడ్ కొరకు మందులు
Medicine Name | Pack Size | |
---|---|---|
Feburic | Feburic 40 Tablet | |
Febubest | Febubest 40 Tablet | |
Fabex | FABEX 40MG TABLET 10S | |
Febuloric | FEBULORIC 40MG TABLET 10S | |
Urigo | URIGO 40MG TABLET 10S | |
Dutofeb | Dutofeb 40 Tablet | |
Ibaxit XR | Ibaxit 40 XR Tablet | |
Fasturtec | Fasturtec Injection | |
Fiboxo | FIBOXO 40MG TABLET 10S | |
Fabure | FABURE 40MG TABLET 10S | |
Factus SR | FACTUS SR 40MG TABLET 10S | |
Febupen | FEBUPEN 40MG TABLET 10S | |
Febuplus | FEBUPLUS 40MG TABLET | |
Aloric | Aloric Tablet | |
Febutroy | FEBUTROY 40MG TABLET 10S | |
Febugold | FEBUGOLD 40MG TABLET | |
Febs | FEBS 40MG TABLET | |
Uriway | URIWAY 40MG TABLET 10S | |
Febstar | Febstar 40 Mg Tablet | |
FBX | FBX 40 Tablet | |
Febuget Tablet | Febuget 40 Tablet | |
Alinol | Alinol 10 Mg Tablet | |
Febumac | Febumac 40 Mg Tablet | |
Ciploric | Ciploric 100 Tablet |
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి