19, జూన్ 2020, శుక్రవారం

నరాలు బలహీనత సమస్య కు పరిష్కారం మార్గం



నరాల బలహీనత అంటే ఏమిటి?

మన శరీరంలో సంకేతాల ప్రసారానికి నరాలు బాధ్యత వహిస్తాయి. నరాల రుగ్మతలు లేదా నరాలకయ్యే గాయాలు నరాల సాధారణ పనిని దెబ్బతీస్తాయి, అదే నరాల బలహీనతకు దారి తీస్తుంది. నరాల బలహీనత రుగ్మత మన శరీర భాగాల విస్తృత పనితీరును దెబ్బ తీస్తుంది, తద్వారా నరవైకల్య పరిస్థితులు దాపురిస్తాయి.

దీని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

నరాల బలహీనత యొక్క ప్రధాన చిహ్నాలు మరియు లక్షణాలు క్రింది విధంగా ఉన్నాయి:

  • నొప్పి
  • పొడిచినట్లుండడం లేక చక్కిలిగింత ఉన్నట్లుండడం
  • తిమ్మిరి
  • అనుభూతి జ్ఞానాన్నికోల్పోవడం
  • అలసట
  • కండరాల బలహీనత
  • ఫుట్ డ్రాప్ (పాదం ముందు భాగాన్నిపైకెత్తాలంటే వీల్లేని అసమర్ధత)

దీని ప్రధాన కారణాలు ఏమిటి?

నరాల బలహీనతకు అనేక కారణాలు ఉండవచ్చు. అవి ఈ క్రింది విధంగా ఉన్నాయి:

దీనిని ఎలా నిర్ధారణ చేస్తారు మరియు దీనికి చికిత్స ఏమిటి?

వ్యాధి సంకేతాలు మరియు లక్షణాలు నాడీ వ్యవస్థ యొక్క ప్రమేయాన్ని సూచిస్తాయి. అయినప్పటికీ, నరాల బలహీనత యొక్క వ్యాధి లక్షణాలు చాలా నిర్దిష్టమైనవి కాదు; అందువల్ల వైద్యపర నిర్ధారణ (క్లినికల్ డయాగ్నొసిస్) చాలా కీలకమైనది. రోగి వైద్య చరిత్ర, కుటుంబం చరిత్ర, మరియు వృత్తి చరిత్రల  గురించి అధ్యయనం చేయటం వలన డాక్టర్కు వ్యాధి యొక్క ముఖ్యమైన సమాచారాన్ని అందించవచ్చు, ఇది అంతర్లీన కారణాన్ని నిర్ధారణ చేయడంలో సహాయపడుతుంది. క్రింది రోగనిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తారు:

  • ఎలెక్ట్రో డయాగ్నగ్నోస్టిక్ పరీక్షలు
  • జ్ఞాన మరియు మోటార్ నరాల ప్రసరణ
  • ఎఫ్ (F) ప్రతిస్పందన
  • హెచ్ (H) రిఫ్లెక్స్
  • నీడిల్ ఎలెక్ట్రోమయోగ్రఫీ  
  • రక్త పరిశోధన (బ్లడ్ ఇన్వెస్టిగేషన్)
  • రోగనిరోధక రుగ్మతలు (ఆటోఇమ్యూన్ డిజార్డర్స్)
  • హెచ్ఐవి  
  • సియస్ఎఫ్ (CSF) పరీక్ష (సెరెబ్రోస్పైనల్ ద్రవం)

నరాల బలహీనత అనేది ఒకటి లేదా మరిన్ని అంతర్లీన పరిస్థితులు లేదా వ్యాధుల ఫలితంగా సంభవిస్తుంది. అందువల్ల, చికిత్స ప్రధానంగా వ్యాధికి కారకమైన అంతర్లీన పరిస్థితుల లేకవ్యాధుల్ని నయం చేయడంపై దృష్టి పెడుతుంది. ఇందుగ్గాను కింది చికిత్స ఎంపికలు అందుబాటులో ఉన్నాయి:

నొప్పిని నియంత్రించే మందులు:

  • నల్లమందు
  • నాన్-స్టెరాయిడ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ (NSAIDS)
  • క్యాప్సైసిన్ పాచెస్
  • నైరాశ్య నిరోధకాల.
  • నరాల మరమ్మత్తు మరియు ప్రేరణ కోసం కైనెటిక్ థెరపీ.
  • విద్యుత్ప్రేరకం:
  • ట్రాన్స్క్యుటేనియస్ ఎలక్ట్రోస్టిములేషన్ (TCES)
  • విద్యుత్ ద్వారా సూదివైద్యం (electroacupuncture)
  • మాగ్నెటోథెరపీ: పల్సెడ్ అయస్కాంత క్షేత్రం ఎంజైమ్ ప్రేరణ ద్వారా నరములు పునరుత్పత్తి, రక్త ప్రసరణ పెరిగింది.
  • బయో లేజర్ ఉద్దీపన: నరాలని సరిచేయడానికి లేజర్ రేడియేషన్లను ఉపయోగించవచ్చు.
  • ముఖ పక్షవాతం చికిత్స కోసం ముఖ నాడీకండర నిరోధక పద్ధతులు.
  • కండరాలను బలోపేతం చేసేందుకు భౌతిక చికిత్స వ్యాయామాలు
  • యోగా మరియు ధ్యానం నరముల ఉధృతిని శాంతపరిచి వాటిని బలోపేతం చేసేందుకు.
  • శస్త్రచికిత్స జోక్యం.

నరాల బలహీనతను నిర్వహించడానికి, ఆరోగ్యకరమైన జీవనశైలిని కలిగి ఉండటం మరియు సమతుల్య 

నరాల బలహీనతకు పవరుఫుల్ 10 ఆయుర్వేదం లో నవీన్ నడిమింటి సలహాలు  మీ కోసం -



నరాల బలహీనత అనే ఒక వ్యాధికిచాలా మంది గురి అవుతుంటారు.అలాగే ఈ వ్యాధితో బాధపాడుతు ఉంటారు. ఈ నరాల బలహీనత వలన ఎటువంటి పనికుడా సరిగా చేయాలిక పోతు,ఎక్కువగా స్ట్రెస్ కి గురిఅవుతుంటారు. అలాంటి వారు చాలా సులువుగా ఈ  వ్యాధిని నయం చేసుకోవటానికి పవరుఫుల్ ఆయుర్వేద చిట్కాలు ఉన్నాయి. వాటి గురుంచి తెలుసుకుందాం 


1.కసవిందు ఆకు రసం లో వెన్నె కలపి శరీరంపై మర్దన చేయుచుండిన నరముల బలహీనత తగ్గుతుంది.

2. ద్రాక్షరసములో తేనె కలిపి సేవించుచుండిన నరాల బలహీనత తగ్గును .

3. 1 స్పూన్ కరివేపాకు రసంలో 1 స్పూన్ నిమ్మకాయ రసం కలిపి దానిలో కొద్దిగా  పంచదార వేసి సేవిస్తే నరాల బలహీనత తగ్గును .

4. రుమస్తకి వసపోడి చ్చేసి సేవించుచుండిన నరాల బలహీనత పోయి అహ్క్తి కలుగును.

5. పెను వేప చెక్కల నుండి తీసిన తైలం 10-15చుక్కలు పాలలో కలిపి త్రాగుచుండిన నార్ల బలహీనత తగ్గును.

6. మశిని గింజలు నల్లగా కాల్చి మసిజేసి వడ్లగింజంత మాత్ర చేసి తేనె తో లేక వెన్న తో రోజుకి ఒక్కసారి  సేవించవలేను .

7 ఉల్లిగడ్డ లు ముక్కలు ను నేతిలో వేయించి రోజు  కొకసరి తింటూ ఉంటే నరము

నరాల బలహీనత కొరకు మందులు

Medicine NamePack Size
G NeuroG Neuro Capsule
Pregeb MPREGEB M 150MG TABLET
PregalinPREGALIN SR 75MG CAPSULE 10S
Alnex NTAlnex NT Tablet
Pregalin MPregalin M 150 Capsule
Milcy ForteMilcy Forte Tablet
EngabaEngaba 150 Mg Tablet
GabaGABA 100MG CAPSULE 10S
ProsovitPROSOVIT 75MG CAPSULE 10S
AlfagabaALFAGABA 100MG TABLET 10S
Mecobion PMecobion P Tablet
EzegalinEzegalin 75 Mg Tablet
GabacapGABACAP 100MG CAPSULE 10S
Pentanerv MPentanerv M Tablet
Mecoblend PMecoblend P Tablet
GabacureGabacure 75 Mg Tablet Sr
GabacentGabacent 100 Mg Tablet
Neurodin GNeurodin G 300 Mg/1500 Mcg Tablet
Mecofort PgMECOFORT PG SR TABLET
Gabamax NTGabamax NT Tablet
GabafitGabafit 100 Mg Capsule
GabacipGabacip Capsule
Neuro GmNeuro Gm 300 Mg/500 Mcg Tablet
GabanextGabanext Capsu

ధన్యవాదములు 

మీ నవీన్ నడిమింటి 

విశాఖపట్నం 

9703706660

అస్వీకార ప్రకటన: ఈ సైటుపై లభ్యమవుతున్న మొత్తం సమాచారము మరియు లేఖనము కేవలం అవగాహనా ఆవశ్యకతల కొరకు మాత్రమే. ఇక్కడ ఇవ్వబడిన సమాచారమును ఏదైనా ఆరోగ్య సంబంధిత సమస్య లేదా అస్వస్థత నుండి కోలుకోవడానికి లేదా స్వస్థత కొరకు నిపుణుల సలహా లేనిదే ఉపయోగించుకోకూడదు. చికిత్స పరీక్షలు మరియు సేవల కొరకు ఎఅర్హత పొందిన వైద్యుల సలహా తీసుకోవాలి.


మధుమేహం నివారణ పరిష్కారం మార్గం మరియు అపోహలు

షుగర్ (చక్కెర వ్యాధి) రాకుండా ఉండాలంటే ఏం చేస్తే మంచిదో తెలుసుకోండి : డయాబెటిస్ ప్రాణాంతకం అవగాహనా కోసం నవీన్ నడిమింటి సలహాలు 

ప్రస్తుతం మనదేశంలో ప్రతి 5 మందిలో కనీసం ఒక్కరైనా డయాబెటిస్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారని తాజా అధ్యయనాలలో తేలింది. ఇన్సులిన్ హార్మోన్ స్థాయి తగ్గడం వలన మరియు రక్తంలో అధిక స్థాయిలో గ్లూకోజ్ లక్షణాల వలన వచ్చే వ్యాధినే మధుమేహం, చక్కెర వ్యాధి (డయాబెటిస్) అని అంటారు డయాబెటిస్ లక్షణాలు ఎలా ఉంటాయి, డయాబెటిస్ రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో తప్పకుండా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి.

షుగర్ వ్యాధి లక్షణాలు

ఆకలి మందగించడం, ఎక్కువగా దాహం కలగడం, ఎక్కువ సార్లు మూత్రం రావడం, గాయాలు త్వరగా మానకపోవడం, ఉన్నట్లుండి బరువు తగ్గడం,  కొన్ని సార్లు వంశ పారపర్యంగా కూడా వచ్చే అవకాశం, చర్మ వ్యాధులు తరచూ వస్తుండటం డయాబెటిస్ వస్తుందని చెప్పే లక్షణాలు.

షుగర్ ఏ వయస్సు వారికి ఎలా ఉంటే వస్తుంది?

బరువు ఎక్కువగా ఉన్నవారికి, శారీరక శ్రమ లేనివారికి, పీచు పదార్థాలు సరిగ్గా తీసుకోని వారికి, మానసిక శారీరక ఒత్తిడికి గురయ్యే వారిలోనూ, ఎక్కువ శాతం బియ్యంతో (అన్నం) చేసిన ఆహార పదార్థాలు, స్వీట్స్ తినేవారిలో, అంతకుముందు మీ కుటుంబంలో ఎవరికైనా ఉన్నా కూడా షుగర్ వ్యాధి వచ్చే అవకాశం ఉంది.

చక్కెర వ్యాధి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు

చాలామంది డయాబెటిస్ ప్రమాదకరం కాదనుకుంటారు, నిర్లక్ష్యంగా ఆ ఏముందిలే అని వదిలేస్తూ ఉంటారు. కానీ శరీరాన్ని బలహీనపరిచి ఏ పనిచేయడానికి ఆసక్తి లేకుండా కుదురుగా ఒక్కచోట కూర్చోనివ్వదు. అందుకని ఈ హోమ్ రెమెడీస్ వాడటం వలన షుగర్ వ్యాధి రాదు, ఉన్నవారు కూడా ఈ సమస్య నుండి బయటపడవచ్చు.

కాకర జ్యూస్

కాకరకాయ అంటే చేదుగా ఉంటుందని అందరూ తినడానికి ఇష్టపడరు కానీ షుగర్ ను కంట్రోల్ లో ఉంచి, రక్తంలో అధిక గ్లూకోజ్ స్థాయిని తగ్గించివేసే గుణం కాకరకాయలో ఉంది. కొన్ని కాకరకాయలను తీసుకుని బాగా కట్ చేసుకుని మిక్సీలో వేసి జ్యూస్ గా చేసుకోవాలి. ఇందులో కొద్దిగా నీటిని కలుపుకోవచ్చు. 2 నెలలు ఖాళీ కడుపుతో ఉదయం సేవించడం వలన షుగర్ ఉండదు.

దాల్చిన చెక్క

ఒక అర స్పూన్ దాల్చిన చెక్క పొడిని ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో కలిపి బాగా మిక్స్ చేసుకుని ప్రతి రోజూ సేవించడం వలన డయాబెటిస్ ను దూరం చేసుకోవచ్చు. లేదా నాలుగు దాల్చిన చెక్కలు తీసుకుని ఒక గ్లాస్ నీటిలో మరిగించి ఆ నీటిని సేవించినా మంచి ఫలితం ఉంటుంది.

వెల్లుల్లి

ప్రతి రోజూ 2 లేదా 3 వెల్లుల్లి రిబ్బలను తినడం వలన షుగర్ వ్యాధి రాదు. అలాగే ప్రతి రోజూ కనీసం 30 నిముషాల పాటు వ్యాయామం చేయడం వలన మీ శరీరానికే మంచిది. అప్పుడప్పుడు శరీరం కాస్త కదిలితేనే కదా రక్తప్రసరణ కూడా బాగా జరుగుతుంది.

పచ్చి అరటిపండు తొక్క

ఎస్. పచ్చి అరటిపండు తొక్కను తీసుకుని ఒక గిన్నెలో ఉంచి అందులో రాత్రి పడుకునేముందు నీటిని పోయాలి. ఉదయాన్నే ఈ నీటి నుండి తొక్కను వేరుచేసి వడగట్టుకోవాలి. ఈ నీటిని రోజులో మూడుపూటలా తీసుకోవడం మంచిది.

మధుమేహం పై : అపోహలు - నిజాలునవీన్ నడిమింటి సలహాలు 


Diabetes Diet Myths and Facts

స్వీట్లంటే ఇష్టమా... ఎక్కువ తినేస్తావా? అయితే నీకు డయాబెటిస్ వచ్చేస్తుంది జాగ్రత్త. డయాబెటిస్ ఉందా..? అయితే అన్నం మానేసి జొన్న రొట్టె తిను.. రాత్రి పూట అన్నం మానేసి చపాతీ తినడం బెటర్... అనే మాటలు వింటూనే ఉంటాం. నువ్వసలే షుగర్ పేషెంటువి.. పండు తింటావా..? దాని బదులు కాకరకాయ రసం తాగు.. అనే మందలింపులూ, సూచనలూ కూడా వస్తుంటాయి. ఇంతకీ ఈ అభిప్రాయలన్నీ నిజమేనా? కేవలం అపోహలేనా..? నిజానిజాలేంటీ ? 


1. అపోహ : తీపి తింటే డయాబెటిస్ వస్తుందా?
నిజం - తియ్యని తేనె, బెల్లం తీసుకుంటారా..? నో ప్రాబ్లం. ఎందుకంటే తీపి పదార్థాల కన్నా కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉండే పనీర్, ఛీజ్, బర్గర్ల వంటి ఫాస్ట్ ఫుడ్స్ తింటేనే డయాబెటిస్ వచ్చే అవకాశం ఎక్కువ. అయితే స్వీట్లలో నూనె పదార్థాలు కూడా ఉంటాయి కాబట్టి డయాబెటిస్ ఉన్నవాళ్లు వాటి జోలికి పోవద్దు. చక్కెర తిన్నంత మాత్రాన చక్కెర వ్యాధి వస్తుందనడం కరెక్ట్ కాదు. అదేవిధంగా చక్కెర తినకపోతే రాదనీ చెప్పలేం. చక్కెర వ్యాధికీ, తినే చక్కెరకీ సంబంధం లేదు. తీపి పదార్థాల కన్నా కొవ్వు పదార్థాలు తింటేనే డయాబెటిస్ వస్తుంది. 


2. అపోహ : మధుమేహం ఉంటే అన్నం మానేయాలా?
నిజం - అన్నం తినడం వల్లనే డయాబెటిస్ కంట్రోల్ కావడం లేదు అనే నమ్మకంతో ఉంటారు చాలామంది. కానీ వందల ఏళ్లుగా తింటున్న అన్నం తింటున్నాం. కానీ డయాబెటిస్ మాత్రం ఇటీవలి కాలంలోనే పెరిగింది. కాబట్టి మనం తినే అన్నానికీ, రక్తంలో ఉండే చక్కెరకూ పెద్దగా సంబంధం లేదు. అయితే అన్నంతో పాటు నూనె పదార్థాలైన వేపుడు కూరలు, పిండివంటలు తీసుకుంటే మాత్రం కష్టమే. లో కార్బ్ డైట్ వల్ల ఉపయోగం ఏమీ లేదు. పైగా ఆహారంలో పిండి పదార్థాన్ని తగ్గిస్తే ఆటోమేటిగ్గా కొవ్వు పదార్థాలను ఎక్కువగా తీసుకుంటాం. దాంతో డయాబెటిస్ వచ్చే అవకాశం పెరుగుతుంది. కొవ్వు పదార్థాల వల్ల సమస్య గానీ పిండి పదార్థం వల్ల కాదు. అందుకే అన్నం తినడం మానడం కరెక్ట్ కాదు. 


3. అపోహ : ఓట్స్ తీసుకుంటే డయాబెటిస్ తగ్గుతుందా? 
నిజం - ఓట్స్ మన ప్రాంతానికి చెందిన పదార్థం కాదు. మన దగ్గర పండే పంటా కాదు. అది తీసుకుంటే డయాబెటిస్ తగ్గుతుందనడం అపోహ. పైగా అవి రక్తంలో గ్లూకోజ్ ను పెంచుతాయి. ఓట్స్ ను ప్రాసెస్ చేసి అమ్ముతారు కాబట్టి ఓట్స్ తిన్న వెంటనే గ్లూకోజ్ పెరుగుతుంది. అలా పాశ్చాత్య దేశాల్లోంచి వచ్చిన ఏ పదార్థాలు కూడా మన వాళ్ల డయాబెటిస్ ను తగ్గించలేవు. ఓట్స్ వల్ల రక్తంలో గ్లూకోజ్ పెరుగుతుందే గానీ తగ్గదు. 


4. అపోహ. తృణ ధాన్యాలు ఎక్కువగా తీసుకుంటే డయాబెటిస్ తగ్గుతుందా?
నిజం - వరి అన్నానికి బదులుగా రాగులు, జొన్నల వంటి చిరు ధాన్యాలు తీసుకోవడం వల్ల డయాబెటిస్ రాదనడంలో కొంత నిజం ఉన్నప్పటికీ తగ్గడం మాత్రం జరగదు. అయితే ఏ ప్రాంతంలో ఏ ఆహారపు అలవాటు ఉంటే అవి మాత్రం తీసుకోవాలి. ఎన్నాళ్ల నుంచో మన స్వభావానికి అలవాటైన ఆహారం అన్నమే. కాబట్టి అలవాటైంది తీసుకోవడమే మేలు. తృణధాన్యాల వల్ల మధుమేహం తగ్గదు. 


5. అపోహ : మధుమేహులు పండ్లు తినకూడదా?
నిజం - ప్రకృతి సిద్ధంగా లభించే పండ్లు మామిడి, సీతాఫలం లాంటివైనా సరే వాటితో మధుమేహం వస్తుందనడం కరెక్ట్ కాదు. డయాబెటిస్ ఉన్నవాళ్లు కూడా తినొచ్చు. ఈ పండ్లలో ఉండే పిండిపదార్థం వేరు. చక్కెర వ్యాధిలో చక్కెర వేరు. పండ్లలో యాంటి ఆక్సిడెంట్లు, ఖనిజలవణాలు ఎక్కువగా ఉంటాయి. క్యాన్సర్ రాకుండా నివారించే రంగు పదార్థాలు ఉంటాయి. అందుకే డయాబెటిస్ ఉన్నంత మాత్రాన వీటిని మిస్ చేసుకోవద్దు. చక్కగా పండ్లు తినొచ్చు. 


6. అపోహ : అన్నం వదిలేసి చపాతీ తినాలా?
నిజం - గోధుమల్లో పిండి పదార్థం తక్కువగా ఉంటుందనుకుంటారు కానీ ఇది కరెక్ట్ కాదు. అన్నంలో, చపాతీలో రెండింటిలో కూడా పిండి పదార్థం ఒకే మోతాదులో ఉంటుంది. అయితే వరి బియ్యాన్ని వండుకుని తేలిగ్గా జీర్ణమయ్యే విధంగా తీసుకుంటాం కాబట్టి అరగంటలోనే రక్తంలో గ్లూకోజ్ పెంచుతుంది. కానీ గోధుమల వల్ల వెంటనే పెరగదు గానీ దానిలో ఉండే చక్కెరల పరిమాణం మాత్రం ఒకటే. గోధుమల్లో గ్లూటెన్ అనే జిగట పదార్థం ఉంటుంది. చాలామంది డయాబెటిస్ పేషెంట్లకు అంటే దాదాపు 25 శాతం మందికి ఇది పడదు. దీనివల్ల చిన్నపేగులోని కణాలు పాడైపోయి, ఆహార పదార్థాల శోషణ తగ్గిపోతుంది.  అందుకే అనవసరంగా అన్నం మానేసి చపాతీకి మారడం కరెక్ట్ కాదు. అయితే చపాతీలను లెక్కపెట్టుకుని తింటాం కాబట్టి కొంచెం తక్కువ కేలరీలు తీసుకునేందుకు ఆస్కారం ఉంటుందని అలా చెప్తారు. 


7. అపోహ : చేదు పదార్థాలు తింటే డయాబెటిస్ నివారించొచ్చా?
నిజం - కాకరకాయ రసం, మెంతుల వంటి చేదుగా ఉన్న పదార్థాలు తీసుకుంటే డయాబెటిస్ ను కంట్రోల్ చేయొచ్చని, నివారించొచ్చని అనుకుంటారు. కానీ ఇందులో పెద్దగా నిజం ఏమీ లేదు. చేదుగా ఉన్న వాటిలో ఆల్కలాయిడ్స్ అనే కెమికల్స్ ఉంటాయి. ఇవి ప్రమాదకరం. వీటిని జీర్ణం చేయడానికి జీర్ణాశయం ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. ఇందుకోసం జీర్ణాశయంలో ఆమ్లం ఎక్కువగా తయారవుతుంది. తద్వారా కడుపులో మంట ఎక్కువై అల్సర్లు తయారయ్యేందుకు ఆస్కారం ఉంటుంది. 


8. అపోహ : ఆయుర్వేదం, హోమియోపతి లాంటి ప్రత్యామ్నాయ వైద్య విధానాలు డయాబెటిస్ ను పూర్తిగా తగ్గిస్తాయా?
నిజం - ఏ వైద్య విధానంలోనూ డయాబెటిస్ ను సమూలంగా తగ్గించే అవకాశం లేదు. ఇప్పుడు అందుబాటులో ఉన్న ఇంగ్లీషు వైద్యంలో కూడా కొన్ని రకాల ప్రత్యామ్నాయ వైద్య విధానంలో వాడే మందుల నుంచి సేకరించిన పదార్థాల నుంచే డయాబెటిస్ మెడిసిన్స్ తయారుచేశారు. కాబట్టి అల్లోపతి లో లేని మెడిసిన్స్ ఏవీ ఇతర వైద్య విధానాల్లో లేవు. ఆయుర్వేదం, యునాని, హోమియోపతిల ద్వారా డయాబెటిస్ ను పూర్తి స్థాయిలో నయం చేయడానికి అవకాశం లేదు. కాని కొంతవరకు కంట్రోల్ చేయవచ్చు. డయాబెటిస్‌ను తగ్గించే వైద్య విధానం ఏదీ లేదు.

ధన్యవాదములు 

మీ నవీన్ నడిమింటి 

విశాఖపట్నం 

9703706660

     *సభ్యులకు సూచన*

**************************

సమయాభావం వలన వ్యక్తిగతంగా సమాధానాలు ఎవరికీ ఇవ్వడం సాధ్యపడదు. మీ సమస్యకు సరిపడా పరిష్కారాలకొరకు, మీ అవగాహనకొరకు మేము పెడుతున్న సంబంధిత సమాచారంతో కూడిన సవివరమైన పోస్టులు చదవవలసినదిగా ప్రార్థన..


.



























18, జూన్ 2020, గురువారం

నడుము నొప్పి ఎక్కువగా ఉంటే తీసుకోవాలినిన జాగ్రత్తలు మరియు i రోజు క్రమం తప్పకుండా ఈ ఆసనాలు వేస్తే నడుం నొప్పి తగ్గుతుంది.


సారాంశం

వీపునొప్పి లేదా వెన్ను నొప్పి  ఆరోగ్య  సమస్యలలో సాధారణంగా తరచు ఎదురయ్యే సమస్య.  దీని వల్ల అప్పుడపుడు డాక్టరు వద్దకు వెళ్లవలసి వస్తుంటుంది. వీపు నొప్పి కారణంగా తరచు పనికి వెళ్లడానికి ఇబ్బంది ఏర్పడుతుంటుంది. వీపునొప్పి తీవ్రంగా ఉండటమే కాకుండా కొన్ని రోజులపాటు లేదా కొన్ని వారాలపాటు కొనసాగుతుంది. లేదా దీర్ఘకాలిక జబ్బుగా ( 3 నెలలు అంత కంటే ఎక్కువ) పరిణమించవచ్చు.  వీపులో నెలకొన్న చోటును అనుసరించి, వీపు నొప్పి మందంగా లేదా తీవ్రంగా ఉండవచ్చు. కొనసాగేదిగా లేదా నిలిపి నిలిపి వచ్చేదిగా  లేదా  నిలుపుదల లేకుండా వచ్చేదిగా కూడా ఉంటుంది. నొప్పి  వచ్చేలా ఉండే చిహ్నాలు లేదా కాళ్లలో , గజ్జలలో తిమ్మరి, స్పర్శరాహిత్యం, గట్టిదనం, పరిమితమైన కదలికలు, లేద మూత్రాశయం  కోల్పోవడం లేదా పేగుల నియంత్రణ ఎదురయినప్పుడు వెంటనే వైద్యుని వద్దకు వెళ్లి ఆరోగ్య పరీక్ష జరిపించవలసి ఉంటుంది. వీపు క్రింది భాగం నొప్పికి సాధారణమైన కారణాలు కండరాల ఆకస్మిక చైతన్యం, గాయాలు, ఇన్వెర్టిబ్రాల్ డిస్క్ , హెర్నియా సంబంధిత లేదా పక్కకు తొలిగిన డిస్క్ వంటివి. వెన్నెముక విరగడం, తుంటి నొప్పి, విరగడం లేదా నరము మూలము  కుదింపు నొప్పి, వయసు మళ్లిన కారణంగా  ఎదురయ్యే కీళ్లనొప్పి,  బోలు ఎముకల జబ్బు, ఆటొ ఇమ్యునో జబ్బు, (ఆంకీలూజింగ్ స్పాండిలిటీస్) వెన్నెముక స్టెనోసిస్,, వెన్నెముకలో లోపాలు, మరియు కెన్సర్. తరచుగా మానసిక ఒత్తిడి కూడా వీపు క్రిందిభాగం నొప్పి కలిగిస్తుంది. అయితే అది తరచు నిర్లక్ష్యం చేయబడుతుంది. వీపు క్రిందిభాగంలో నొప్పి కొన్ని సందర్భాలలో వివిధ అవయవాలలో అంటే మూత్రపిండాలు ( ఉదా: నొప్పి వల్ల ఎదురవుతుందని చెప్పబడుతున్నది. రెనాల్ కాల్క్యులస్, ట్యూమర్)  గర్భాశయం ( ఉదా: ఫైబ్రాయిడ్, రుతుక్రమం నొప్పి మరియు గర్భం.  తీవ్రమైన వీపు నొప్పి వైద్య సమస్యలు లేని సందర్భంలో సాధారణంగా  విశ్రాంతితో, మందులతో నయమవుతుంది. ఉన్నపళంగా  కదలికలో ఇబ్బంది, ముఖ్యంగా ఎముక విరగడం, ఇంటర్వర్టెబ్రాల్ పక్కకుపోవడం పర్యవసానంగా ఎదురైతే దానికి శస్త్రచికిత్స అవసరమవుతుంది. తర్వాత సంప్రదాయ చికిత్స కల్పిస్తారు. దీర్ఘకాలిక వీపు నొప్పికి దీర్ఘ కాలపు చికిత్స అవసరం.  దీనిలో ఔషధాలు సేవించదం, ఫిజియోథెరపీ, మరియు నిర్దుష్టమైన వ్యాయామాలు చేరి ఉంటాయి.

వీపు నొప్పి యొక్క లక్షణాలు

వీపులో క్రింది భాగం నొప్పితోపాటుగా తరచుగా మరికొన్ని లక్షణాలు కనిపిస్తాయి.  ఈ లక్షణాలు ఇలా ఉంటాయి.:

  • కూర్చొన్నప్పుడు, పడుకొన్నప్పుడు, బరువులు ఎత్తినప్పుడు మరియు వంగినప్పుడు  నొప్పి మరింత హెచ్చుగా ఉంటుంది.
  • వీపునొప్పి కాళ్లు, పిర్రల వరకు వ్యాపించి ఉంటుంది.
  • నొప్పి జలదరింపుతో మరియు స్పర్శ కలిగించక  కాళ్లలో లేదా గజ్జలలో ఉంటుంది.
  • నొప్పి మూత్రాశయం కొల్పోవడం మరియు పేగుల నియంత్రణతో కలుగుతుంది.
  • అవయవాలు తీవ్రంగా గట్టిపడటంతో  కూర్చొనే, నిలబడే లేదా నడిచే సందర్భంగా నొప్పి కలుగుతుంది..
  • నొప్పి వీపు నుండి మూత్రశయం వరకు వ్యాపించి తరచుగా మూత్రవిసర్జనకు దోహదం చేస్తుంది.
  • వీపులో నొప్పి తీవ్రమైన పొత్తికడుపు నొప్పికి దారితీసి జ్వరానికివమనాలకు దారితీస్తుంది..
  • పొత్తికడుపు ఉబ్బరం కొన్ని సందర్భాలలో వీపునొప్పికి దారితీస్తుంది.
  • గడ్ద లేదా వాపు వీపునొప్పి కల్పిస్తాయి. అది పొత్తికడుపుపై  పడుకొన్నప్పుడు నొప్పి కలిగించి అలసటకు బరువు కోల్పోవడానికి వీలుకల్పిస్తుంది

వీపు నొప్పి యొక్క చికిత్స 

వీపునొప్పికి కల్పించే చికిత్స సామాన్యంగా మూడు రకాలుగా వర్గీకరింపబడుతుంది. వీపునొప్పికి  నొప్పి రకాన్ని, లక్షణాలను గమనించి డాక్టరు చికిత్సను నిర్ధారిస్తారు.

వైద్యేతర చికిత్స

తీవ్రమైన మరియు అనిర్దిష్ట వెన్ను నొప్పి సాధారణంగా విశ్రంతితో, స్వయం చికిత్సలతో  వివారణ పొందగలదు.. వీపునొప్పికి కొన్ని స్వయంచికిత్సలు పేర్కొనబడినాయి

  • వేడినీటి కాపుడు మరియు మర్దనం
    ఈ ప్రక్రియ రక్త ప్రసారాన్ని పెంచి కండరాల గట్టిదనాన్ని సడలిస్తుంది
  • ఫిజియోథెరపీ మరియు ట్రాక్షన్
    ఈ విధానం చికిత్స ఫిజియోథెరపిస్టుల నేతృత్వంలో జరుగుతాయి. ఇది నొప్పిని చాలావరకు పూర్తిగా తగ్గిస్తుంది.
  • ప్రత్యామ్నాయ థెరపీలు
    వాటిలో ఇవి చేరి ఉంటాయి
    • యోగా, దీనిలో అవయవాలను పొడువుగా లాగే ప్రక్రియ చేరిఉంటుంది మరియు స్థితిగతులు  కండరాల గట్టితనాన్ని సరళం చేస్తాయి.
    • ఆక్యుపంచర్  సూదులు పొడవటంతో చేరిన ప్రక్రియ, దీనిలో శరీరంలో  నిర్దుష్టమైన స్థానాలలో సూదులు పొడిచే ప్రక్రియతో శరీరంలో నొప్పిని తొలగిస్తారు.
    • చిరోప్రాక్టిక్ ప్రక్రియలో  వెన్నెముకను తారుమారు చేసి వర్టెబ్రాల్ పై ఒత్తిడి జరిపి గట్టిదనాన్ని సడలింపజేస్తారు. వెన్నెముక/ కశేరుకముల కీళ్లలో సరళత్వం కల్పిస్తారు.
    • మనసును హాయిగా  ఉంచి చికిత్స జరుపుతారు. అవి : ధ్యానం, బయోఫీడ్ బ్యాక్, ప్రవర్తన తీరులో మార్పులతో చికిత్సతో నొప్పి నివారణ జరుపుతారు.

వైద్య చికిత్స

దీర్ఘకాలిక వీపు నొప్పి నివారణ చర్యలలో, నిర్వహణలో  ఔషధాలు కీలకపాత్ర వహిస్తాయి. అవి వైద్యేతర  చికిత్స విధానం క్రింద  నొప్పి తగ్గించడంలో విఫలమైనప్పుడు ఈ చికిత్స కొనసాగిస్తారు. సాధారణంగా సూచించబడే మందులు ఇవి :

  • పారాసెటమాల్ లేదా అసెటామినియోఫెన్
    ఇది  సాధారణంగా వీపునొప్పికి తొలుత వాడే ఔషధం.. దీనితో కొన్ని దుష్ఫలితాలు లేదా  సైడ్ ఎఫెక్ట్స్ కనిపిస్తాయి.
  • నాన్స్టెరాయ్డల్ ఆంటిఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ (ఎన్ ఎస్ ఏ ఐ డి ఎస్)
    ఈ బాధానివారణిలో ఇబుప్రొఫెన్ మరియు నాప్రోక్సెన్ కలిగి ఉంటాయి.. పారాసెటమాల్ నొప్పిని తొలగించడంలో విఫలమైనప్పుడు వీటిని ఉపయోగిస్తారు.
    బాధానివారిణులలో సమయోచితమైన క్రీముల, ఆయింట్ మెంట్ల మరియు స్ప్రేల  రూపంలో కూడా లభిస్తాయి. అవి నొప్పిస్థాయిని తగ్గిస్తాయి.
  • కండరాల సడలింపునకు ఉపయుక్తమైనవి 
    డాక్టర్లు కండరాల సడలింపునకు పనిచేసే మందులను సూచిస్తారు.. అవి సైక్లోబెంజాప్రైన్ మరియు మీథోకార్బమాల్ రూపంలో లభిస్తాయి. వీటితోపాటు కండరాల గట్టిదనం సడలింపునకు ఎన్ ఎస్ ఏ ఐ డి ఎస్ మందులను ఉపయోగిస్తారు
  • మాదకద్రవ్యాల వంటి ఔషధాలు
    తీవ్రమైన వీపునొప్పికి ట్రమడాల్ మరియు మార్ఫైన్ వంటి వాటిని ఉపయోగిస్తారు. వాటినికొద్ది పాటి వ్యవధికి మాత్రమే ( 2- 3 వారాలు) సూచిస్తారు. సైడ్ ఎఫెక్ట్ ల కారణంగా  ఇవి దీర్ఘకాలిక ఔషధంగా ఉపయోగపడవు. వీటివల్ల  మత్తుగా ఉండటం, అజీర్తి. నోరు ఎండుకుపోవటం, శ్వాసక్రియలో జాప్యం, చర్మంపై దురదఎదురుకావచ్చు.
  • యాంటీడిప్రసెంట్స్
    దీర్ఘకాలిక వీపునొప్పి సందర్భంగా. ఎక్కువ కాలంగా నొప్పి అనుభవిస్తూ మానసిక క్షోభానికి గురైనవారి విషయంలొ  ప్రధానంగా వీటిని ఉపయోగిస్తారు. వీటిలో అమిట్రిప్టైలిన్, డ్యూలోక్సెటిన్, ఇమిప్రామిన్ చేరినవి. సైడ్ ఎఫెక్ట్స్ ( చూపు మందగించడం, బరువు పెరగడం, మందకొడితనం వంటివి) సాధారణం కావడం వల్ల  వీటిని ఖచ్చితంగా వైద్యుని సిఫారస్య్ మెరకు మాత్రమే తీసుకొనవలసి ఉంటుంది.
  • స్టీరాయిడ్స్ 
    ప్రెడ్నిసోలాన్ వంటి   కార్టికోస్టీరాయిడ్స్  కాళ్ల అడుగు భాగంలో నొప్పి తగ్గించడంలో ఫలితం ఇస్తాయి. శరీరంలో మంట, గాయం అయిన చోట వాపు వీపు నొప్పికి కారకం కాగలవు. ఈ మందులు వాటిని తొలగిస్తాయి.
  • మూర్చనివారణి
    బాధానివారిణులు లేదా పెయిన్  కిల్లర్లతో పాటుగా యాంటీ-ఎపిలమెటిక్  మందుల వాడకం  నరాల-నొప్పిని తొలగిస్తుందని ఇటీవలి అధ్యయనాలు  చూపుతున్నాయి. ముఖ్యంగా దీర్ఘకాలిక వీపునొప్పికి ఇవి చక్కగా పనిచేస్తాయి కార్బామాజ్ పైన్, గాబాపెంటిన్ మరియు వల్పోరిక్ ఆసిడ్ లు సాధారణంగా ఉపయోగించబడే యాంటీ- సీజర్ ఔషధాలు.. మూర్చనివారిణులు సాధారణంగా తికమకపొందడం, గ్యాస్ట్రిక్ సమస్య తలనొప్పి వంటి సైడ్ ఎఫెక్ట్స్ కల్పిస్తాయి.

శస్త్రచికిత్స

వీపునొప్పిని తగ్గించడంలో శస్త్రచికిత్సేతర వైద్యం పని చేయనప్పుడు వైద్యులు శస్త్రచికిత్సను సూచిస్తారు నరాల నొప్పి రెడియేషన్,  కండరాలలో  బలహీనత పెరుగుదల  వెన్నెముక రూపభ్రంశం పొందడం (స్పైనల్ స్టెనోసిస్ ) ఇంటర్ వర్టిబ్రెల్ డిస్క్ పగలడం, వంటివి మందులతో విజయవంతంగా  నయం కానప్పుడు లేదా వైద్యేతర చికిత్సకు లొంగకపోయినప్పుడు శస్త్రచికిత్స తప్పనిసరి కాగలదు. అత్యవసర పరిస్థితులలో కూడా శస్త్రచికిత్స జరుపుతారు. అంటే ఎముకలు విరగడం,  వెన్నెముక కాడా ఈక్వెయిన్ ( గుర్రం తోక) రూపం దాల్చడం సందర్భంగా శస్త్ర చికిత్స కొనసాగిస్తారు. అవి వీపునొప్పితోపాటుగా పార్శ్వవాయువుకు దారితీయవచ్చు.

  • వెన్నెముక కలయిక వ్యవస్థ క్రింద వెన్నపూస భాగాలను ఒకటిగా కూర్చుతారు. లేదా ఒకతితో మరొకటిని కలుపుతారు. తద్వారా అవి వేర్వేరుగా కాకుండా చర్య తీసుకొంటారు. ఈ ప్రక్రియ వెన్నపూస కీళ్లనొప్పుల విషయంలో సహకరిస్తుంది దీనితో  శరీరం కదలిక సందర్భ గా తక్కువ నొప్పి. లేదా నొప్పి లేకుండా చేస్తుంది.
  • లామినెక్టమీ అనేది ఒక శస్త్రచికిత్స ప్రక్రియ. దీనిద్వారా డాక్టరు  నరంపై ఒత్తిడిని కల్పిస్తున్న వెన్నపూస ఎముక భాగాన్ని లేదా స్నాయువును తొలగిస్తాడు.
  • ఫోరామినియోటమీ వెన్నపూసమార్గాన్ని వెడల్పు చేసి వెన్నెముక నుండి నరాల వరకు ద్వారం వద్ద అంతరాన్ని పెంచుతుంది.
  • డైసెక్టమీ వ్యవస్థలో , డాక్టరు డిస్కును పూర్తిగా లేదా పాక్షికంగా తొలగిస్తాడు . అది  తన నిర్దుష్ట స్థానం నుండి పక్కకు పోవటం లేదా హెర్నియాకు గురి అయిన సందర్భంలో ఈ ప్రక్రియను చేపడుతారు

ప్రతి చర్యలో ఒడిదుడుకులు ఎదురవుతున్నప్పటికీ, మొత్తం మీద ఆశించే ఫలితం   నొప్పి నివారణ జరగడం. కదలికలు స్వేచ్ఛగా కొనసాగదం, తక్కువస్థాయిలో మమ్దులు వాడటం,  పనుల నిర్వహడ చద్వార హెచ్చు ఉత్పాదకత జరపడం.  శస్త్రచికిత్సకు అంగీకరించడానికి ముందుగా డాక్టరుతో మంచిచెడులను కూలంకషంగా చర్చించడం మంచిది.

వీపునొప్పి నిర్వహణలో జీవనసరళి

  • వెన్నునొప్పి సిడులను నివారించండి
    వీపునొప్పి చాలా హెచ్చుస్థాయిలో ఇబ్బంది కలిగిస్తుంది. వీపునొప్పితో మనుగడ సాగించడం నొప్పి నిర్వహణలో సవాలును ఎదుర్కోవడం వంటిది.  ఇంటిలో, కార్యాలయంలో రోజూ చేపట్టే పనులు కొన్ని సమయాలలో  వీపునొప్పిని  కలిగించి ఉన్ననొప్పి స్థాయిని పెంచుతాయి. ఇంటి పని, ఆఫీసు పనుల సందర్భంగా శరీరం లో మళ్లీమళ్లీ జరిగే కదలికలు , పనులు వెన్నెముక కదలికలు వీపునొప్పిని కల్పిస్తాయి లేదా ఉన్ననొప్పి స్థాయిని మరింత పెంచుతాయి. ఈ కారణంగా  ఇంటిలో లేదా కార్యాలయంలో పనులు కొనసాగించే సందర్భంగా నొప్పిని కల్పించే పనులకు దూరంగా ఉంటూ వీపునొప్పిని నివారించాలి.
  • రోజు పూర్తి చురుకుగా ఉండండి
    కదలికలకు దూరంగా, నిశ్చలస్థితిలోని మనుగడతో కూడిన  జీవన సరళి కూడా వీపునొప్పికి దోహదం చేస్తుంది. తిని కూర్చోవడం వల్ల  ఊబకాయం ఏర్పడుతుంది. తద్వారా వీపునొప్పి కలుగుతుంది. రోజు పూర్తిగా చురుకుగా ఉండండి అలాగే ఒకమోస్తరు స్థాయిలో వ్యాయామం వంటి శరీరం కదలికల పనులు చేపట్టండి.  45 నిమిషాల నదక, ఈత, ఇతర వ్యాయామాలు శరీరాన్ని చక్కగా వంచే  ప్రక్రియలు చేపట్టండి. ఇవి వీపు కందరాలను బలపరచడమే కాకుండా బరువును తగ్గిస్తాయి కూడా.
  • అరోగ్యకరమైన , పోషకాహార ఆహారాన్ని సేవింఛండి
    హెచ్చుగా ఖనిజములు మరియు విటమిన్లు హెచ్చుగా కలిగిన ఆహారాన్ని తీసుకోవడం వల్ల , ఆరోగ్యాన్ని పెంచే పోషకాహారాన్ని సేవించడం వల్ల  వెన్నెముక బలపడుతుంది. విటమిన్ డి, క్యాల్షియం కలిగిన ఆహార పదార్థాలను సేవించండి. ఈ పోషకాహారాలు మీ ఎముకలను గట్టి పరిస్తాయి, బోలు ఎముకల జబ్బును నివారించి, ఎముకలు విరగడాన్ని అదుపు చేస్తాయి.
  • ధూమపానం మానండి
    ధూమపానం కారణంగా వెన్నెముకకు రక్తప్రసారం తగ్గుతుంది.  తద్వారా దగ్గు ఏర్పడి వీపునొప్పిని పెంచుతుంది.
  • మీ శరీర నిటారుతనాన్ని మెరుగుపరచుకోండి
    మీ పాదాలపై శరీరం బరువును సమతౌల్యంగా ఉంచుతూ శరీరం బరువును పాదాలపై సమంగా ఉండేలా చూడండి. శరీరం నిటారుగా ఉండాలంటే వెన్నెముకలో నిటారుతనం ఉండాలి. కూర్చొన్నప్పుడు  మరియు  నిలబడి ఉన్నప్పుడు కూడా  ఈ ప్రక్రియను  పాటించాలి. అలాకాకుండా సరికానట్టి శరీరం నిటారుతనం వీపు కండరాలపై  ఒత్తిడిని పెంచి దీర్ఘకాలిక వీపునొప్పికి దోహదం చేస్తుంది. హెచ్చు బరువులను ఎత్తేటప్పుడు లేదా మోసేటప్పుడు  శరీరాన్ని సవ్యంగా నితారుగా ఉంచడం  ఎంతో ముఖ్యం.  వీపు కండరాలపై ఒత్తిడి లేకుండా చేయడం కూడా అవస
    నడుము నొప్పి ఉడుము మాంసము తినిన నడుము నొప్పి పోవును. నడుము నరాలు బలం గా తాయారు అగును 
  • మిర్యాలు బియ్యము నూరి ఉడికించి  నొప్పి చోట కట్టితే నొప్పి పోవును 
  • మేడి కొమ్ము పాలు పట్టు వేసిన నడుము నొప్పి పోవును

వీపు నొప్పి కొరకు మందులు

వంచే.. వంగే.. వందే యోగమ్! 

ఆధునిక సమస్యలు.. రెండు! సనాతన పరిష్కారం.. ఒకటి! నేటి తరం ఆధునిక మానవులను వేధిస్తున్న అతిపెద్ద సమస్యలు రెండు. నడుము నొప్పి, మెడ నొప్పి. రోజంతా ఇంటి పనితో సతమతమయ్యే గృహిణుల నుంచి రేయింబవళ్లు కంప్యూటర్లతో కుస్తీలు పడుతుండే ఐటీ ఉద్యోగుల వరకూ ఎవరిని పలకరించినా ఇదే గోడు. నిజానికి ఆధునిక కాలంలో అందర్నీ వేధిస్తున్న ఈ సమస్యలకు.. మన సనాతన యోగ విధానంలో సమర్థమైన పరిష్కారం ఉండటం విశేషం. రోజూ ఉదయాన్నే ఓ పావు గంట సమయం వెచ్చించి.. పద్ధతి ప్రకారం కొన్ని యోగాసనాలు సాధన చేస్తే చాలు.. ఈ వెన్ను బాధలు రెండూ తొలగిపోతాయి. అందుకే వీటికి సంబంధించిన ప్రత్యేక యోగాసనాలను మీ ముందుకు తెస్తోంది 
సీటుబంధా స నం ఈ ఆసనం నడుము నొప్పి తగ్గిస్తుంది కాళ్ళు దృఢంగా ఉంటాయి ఈ ఆసనం 2 సార్లు 3 సార్లు చేయండి కపిల మహర్షి యోగా కేంద్రం.
• మర్చరీ ఆసనం!

నడుము నొప్పి మహిళల్లో చాలా సాధారణంగా కనిపించే సమస్య. ఈ నొప్పి మొదలైతే చేసే పని మీద దృష్టి ఉండదు.  మర్చరీ ఆసనం వేయడం వల్ల నడుముకు ఉపశమనం లభించి నొప్పి తగ్గుముఖం పడుతుంది.
 భుజంగాసనం
1. బోర్లా పడుకోండి . 2. చేతులను మడచి  తలను  చేతులపై పెట్టుకుని పడుకోండి . 3. కాళ్ళను దగ్గరకు చేర్చండి . 4. మీ అరచేతులు  నేలకు తగిలేలా ఉంచండి . ఈ సారి మీ మోచేతులను కూడా పైకి ఎత్తాలి  5. తలను . చాతీని బొడ్డు వరకూ పైకి ఎత్తండి . 6. మీరు ఉండగలిగినంత సేపు  ఆసన స్థితి లో ఉండండి .
దీనిని  భుజంగాసనం అంటారు . 
దీని వలన లాభాలు :
 వెన్ను పూసలు వెనుకకు వంగడం వలన నడుము నొప్పి తగ్గుతుంది . వెన్ను పూసల మధ్య ఖాళీ పెరుగుతుంది
శలభాసనం 
1. మకరాసనం  స్థితిలో ఉండండి .  2.  చేతులను తొడల క్రింద  పెట్టుకోండి .  3. ఊపిరి పీలుస్తూ కాళ్ళను పైకి ఎత్తండి . మోకాళ్ళ వద్ద మడవ కూడదు .  4.  కాళ్ళను బిగించి ఉంచండి . . 10 నుండి 30 సెకనుల వరకూ ఉండండి . 
.
లాభాలు :
మీ నడుము నొప్పి , సయాటికా , తగ్గుతాయి . కిడ్నీ కి కూడా మంచిది . అధిక బరువు , తడలు , పిరుదులు తగ్గుతాయి 
గుండె సమస్యలు ఉన్నవారు , హెర్నియా ఉన్నవారు చెయ్యవద్దు .


Medicine NamePack Size
DoloparDolopar 500/25 Tablet
Sumo LSumo L Drops
PacimolPacimol 1000 Mg Tablet
DoloDolo- 100 Drops
BrufenBrufen Active Ointment
CombiflamCOMBIFLAM PAED SUSPENSION
Zerodol PZerodol P Tablet
Ibugesic PlusIbugesic Plus Oral Suspension
Calpol TabletCalpol 500 Tablet
Samonec PlusSamonec Plus 100 Mg/500 Mg Tablet
EbooEboo 500 Mg Tablet
Hifenac P TabletHifenac P Tablet
Eboo PlusEboo Plus 500 Mg Tablet
IbicoxIbicox 100 Mg/500 Mg Tablet
Serrint PSerrint P 100 Mg/500 Mg Tablet
Eboo SpazEboo Spaz 500 Mg Tablet
Ibicox MrIbicox Mr Tablet
TizapamTizapam 400 Mg/2 Mg Tablet
FabrimolFabrimol 250 Mg Suspension
MaxzenMAXZEN GEL 30GM
Iconac PIconac P 100 Mg/500 Mg Tablet
Sioxx PlusSioxx Plus 100 Mg/500 Mg Tablet
FebrexFebrex 500 Tablet
Inflanac PlusInflanac Plus 100 Mg/500 Mg Tablet
Sistal APSistal AP Tablet

ధన్యవాదములు 

మీ నవీన్ నడిమింటి 

విశాఖపట్నం 

9703706660

అస్వీకార ప్రకటన: ఈ సైటుపై లభ్యమవుతున్న మొత్తం సమాచారము మరియు లేఖనము కేవలం అవగాహనా ఆవశ్యకతల కొరకు మాత్రమే. ఇక్కడ ఇవ్వబడిన సమాచారమును ఏదైనా ఆరోగ్య సంబంధిత సమస్య లేదా అస్వస్థత నుండి కోలుకోవడానికి లేదా స్వస్థత కొరకు నిపుణుల సలహా లేనిదే ఉపయోగించుకోకూడదు. చికిత్స పరీక్షలు మరియు సేవల కొరకు ఎల్లప్పుడూ ఒక అర్హత పొందిన వైద్యుల సలహా తీసుకోవాలి.



17, జూన్ 2020, బుధవారం

కంటి కింద నల్లటి వలయాలు ఆయుర్వేదం సలహాలు


కంటి కింద నల్లటి వలయాలా? - ఎందుకు వస్తాయి?అవగాహనా కోసం నవీన్ నడిమింటి సలహాలు 

కళ్లు... ఎన్నో ఊసులను చెబుతాయి. 
కళ్లు... ఎన్నెన్నో భావాలను పలికిస్తాయి. 
కళ్లు... నిశ్శబ్దంగానే అనేక అంశాలు వెల్లడిస్తాయి. మరి కళ్ల కింద ఏర్పడే వలయాలు... 
ఆరోగ్యం గురించి హెచ్చరిస్తాయి. అనేక అనారోగ్యాలకు సూచనలు ఇస్తాయి. అసలు... ఈ నల్లని వలయాలు ఎందుకు వస్తాయి? తగ్గించుకోవడం ఎలా? 
తెలియజేసేదే ఈ ముందుజాగ్రత్త...
‘‘కంటి కింద నల్లటి వలయాలా? అయితే... ఫలానా క్రీమ్ అప్లై చేయండి. కళ్ల కింద నల్లని వలయాలను పోగొట్టుకోండి...!’’ అనే రకరకాల ప్రకటనలు చూస్తుం టాం. ఆ క్రీములను తెచ్చి కొన్నిరోజులు కళ్ల చుట్టూ రాసుకోవడం, అయినా వలయాలు తగ్గడం లేదే అని బాధపడటం.. సహజం. నల్లని వలయాలతో నిస్తేజంగా ఉన్న కళ్లు ముఖ అందాన్ని పోగొట్టడమే కాదు, మనం తీవ్ర ఒత్తిడిలోనో, ఏదైనా ఆరోగ్యసమస్యతోనో ఉన్నామనే విషయాన్ని బహిర్గతం చేస్తాయి. కలువల్లాంటి కళ్లకింద నల్లటి చారికలు ఎందుకు ఏర్పడతాయి? ఆ చారికలపైన సనసన్నని కురుపులు ఎందుకు వస్తాయి? ఎంతో సున్నితంగా ఉండే ఐ స్కిన్ గరుకుగా ఎందుకు తయారవుతుంది? ఈ వలయాలను ఏవిధంగా పోగొట్టుకోవచ్చు? ఈ వివరాలకు సంబంధించిన అన్ని వివరాలతో పాటు... దాన్ని నివారించుకోడానికి అవసరమైన ‘ముందు జాగ్రత్త’లు ఇవి...
డెర్మటాలజీలో అతిసాధారణంగా పేర్కొనే సమస్య కళ్లకింద నల్లని వలయాలు. ఇంగ్లీషులో డార్క్ సర్కిల్స్ అనే ఈ వలయాలు వయసు పైబడట్టుగా, అనారోగ్యంగా, అలసిపోయినట్టుగా బయటి వారికి తెలియజేస్తాయి. ఇవి స్ర్తీ, పురుషులిద్దరిలోనూ వస్తుంటాయి. ఈ మధ్య కాలంలో పిల్లల్లోనూ వృద్ధి చెందుతున్న డార్క్‌సర్కిల్స్ యుక్తవయసులోనూ ఎక్కువగా గమనిస్తున్నాం.

ప్రధాన కారణం... 
రక్తనాళాల చివరను రక్తకేశనాళికలు అంటారు. అంటే వెంట్రక అంత సన్నగా ఉండే రక్తనాళాలన్నమాట. వీటినే క్యాపిల్లరీస్ అంటారు. కనురెప్పల్లో చివరన ఉండే రక్తకేశనాళికల చివరలు చిట్లడం, అందులోని ఎర్ర రక్తకణాలు విరిగిపోయినట్లుగా అయిపోతాయి. అలా విరిగినప్పుడు అక్కడ మిగిలిపోయే కొన్ని పదార్థాల వల్ల అది నలుపు, ముదురునీలం రంగులో కనిపిస్తుంటుంది. అక్కడి చర్మం సున్నితంగా, పారదర్శకంగా ఉండటం వల్ల కంటికింది భాగం నల్లగా, ముదురునీలంగా కనిపిస్తుంటుంది. ఫలితంగా ఇవి కళ్ల కింద ఇలా వలయాల్లా కనిపిస్తుంటాయి. కంటి కింద నల్ల వలయాలు కనిపించడానికి అనేక కారణాలున్నాయి. 
చికిత్స... 
ఇటీవల కంటికింది నలుపును తగ్గించుకోడానికి చాలా చికిత్స విధానాలు అందుబాటులోకి వచ్చాయి. ఇందులో సాధారణ మేకప్ ప్రక్రియలు మొదలుకొని లేజర్ చికిత్స, సర్జరీ వంటి అధునాతనమైన సర్జరీ వరకు ఉన్నాయి. 
హైపర్ పిగ్మెంటేషన్:
ఎండకు ఎక్కువగా ఎక్స్‌పోజ్ అవడం వల్ల చర్మం నల్లగా మారి మచ్చలాగా కనిపించడం జరుగుతుంది. దీన్నే పిగ్మెంటేషన్ అంటారు. పిగ్మెంటేషన్ మరీ ఎక్కువగా ఉండి, కనురెప్పలకు కూడా పాకితే కళ్లకింద నల్లటి వలయాలు ఏర్పడతాయి. సూర్యకాంతికి ఎక్కువగా ఎక్స్‌పోజ్ కాకుండా కళ్లు, కంటి కింద బ్లాక్ సర్కిల్స్ ఏర్పడకుండా ఉండాలంటే సన్‌గ్లాసెస్ ధరించడం, తలకు క్యాప్ పెట్టుకోవడం మొదటగా చేయాల్సిన పని. 
గుంటకళ్లు: 
కొందరిలో కంటి కింద చర్మం లోతుగా ఉన్నట్లు అనిపిస్తూ కనుగుడ్డు లోపలికి ఉంటుంది. దాంతో కన్ను చుట్టూ ఒక నల్లటి వలయం ఉన్నట్లుగా కనిపించడం మామూలే. కనుగుడ్డు కింద ఉండే కొవ్వు పదార్థం లోపించడం వల్ల చాలామందిలో ఇది అనువంశికంగా కనిపిస్తుంటుంది. కంటికింద కొవ్వునింపడం, (ఫ్యాట్ గ్రాఫ్టింగ్), బ్లఫరోప్లాస్టీ వంటి శస్తచ్రికిత్సల ద్వారా ఈ లోపాన్ని సరిదిద్దవచ్చు. కొందరిలో శస్తచ్రికిత్స చేయకుండానే కంటి కింద డెర్మల్ ఫిల్లర్ ఇంజెక్షన్ల ద్వారా చాలా తక్కువ గాటుతో చేసే శస్తచ్రికిత్సలూ అందుబాటులో ఉన్నాయి. డెర్మల్ ఫిల్లర్స్ అంటే చాలా మృదువైన కణజాలంతో అక్కడి ఖాళీని భర్తీ చేయడం అన్నమాట. ఈ ప్రక్రియ ద్వారా కూడా కంటికింది నల్లమచ్చల వలయాలకు చికిత్స చేయవచ్చు.
నివారణ  
డార్క్ సర్కిల్స్‌కు చాలా రకాల చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. ముఖకాంతి కోసం లేజర్ థెరపీలు అందుబాటులోకి వచ్చినప్పటికీ ఎవరికి వారు తీసుకునే జాగ్రత్తలే ఈ సమస్య నివారణకు ఉపయోగపడతాయి. 
తగినంత విశ్రాంతి తీసుకోవాలి. 
సమతులాహారం వేళ ప్రకారం తీసుకోవాలి. 
వంశపారంపర్యంగా వచ్చే వలయాలను చికిత్స ద్వారా తగ్గించుకోవచ్చు. 
మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలి. 
శారీరక వ్యాయామాలు మనసునూ ఉత్తేజంగా ఉంచుతాయి. ఫలితంగా ఒత్తిడి తగ్గి రిలాక్సింగ్‌గా ఉంటారు. అందుకని రోజూ 30 నుంచి 60 నిమిషాలు శారీరక వ్యాయామానికి ప్రాధాన్యం ఇవ్వాలి. 
చల్లని నీటిలో ముంచిన కాటన్‌ని అలసిన కళ్లపై ఉంచడం ద్వారా ఒత్తిడి తగ్గుతుంది. 
కంటికి సంబంధించిన అలర్జీలు ఉన్నప్పుడు నిర్లక్ష్యం చేయకుండా వైద్య చికిత్స తీసుకోవాలి. 
క్రీములతో... 
హైపర్ పిగ్మెంటేషన్ వల్ల కంటి కింద నల్లటి వలయాలు వస్తే... వాటిని కొన్ని పూత మందుల (క్రీమ్‌ల) ద్వారా తగ్గించవచ్చు. డాక్టర్‌ల సలహా మేరకు హోడ్రోక్వినైన్, కోజిక్ యాసిడ్, ఆర్‌బ్యుర్టిన్ వంటి పదార్థాలు ఉన్న క్రీమ్‌లు వాడటంతో నల్లటి వలయాలకు చికిత్స చేయడం సాధ్యమే. అర్జనైన్ వంటి హైడ్రాక్సీ యాసిడ్స్ ఉండే కెమికల్ పీలింగ్‌తోనూ (అంటే... పూత మందు రాశాక కాసేపాగి అది పొరలా ఏర్పడ్డ తర్వాత దాన్ని తొలగించడం) వాటిని తొలగించడం ఇప్పుడు సాధ్యమే. అయితే ఇది ఒకేసారిగాక కొన్ని సిట్టింగ్స్‌లో చేసే ప్రక్రియ.
కంటి కింది నలుపునకు కారణాలు:
ఎడతెరిపిలేని కంటి దురద 
నిద్రలేమి (ఒత్తిడి, డిప్రెషన్, నిద్రలోపాలు....)
అటోపిక్ డెర్మటైటిస్ 
అలెర్జీలు 
హె ఫీవర్ 
దుమ్ము 
ఎగ్జిమా
పాలిపోవడం: 
ఏదైనా దీర్ఘకాల ఆరోగ్యసమస్య ఉంటే కళ్లచుట్టూ ఉన్న చర్మం పాలిపోయినట్టుగా కనిపిస్తుంటుంది. 
ఐరన్ లేదా విటమిన్ లోపాలు 
వైద్యపరంగా వచ్చే ఇతర ఆరోగ్య సమస్యలు 
వయసు: 
మందంగా ఉండే చర్మం వయసు పై బడుతున్నా కొవ్వును కోల్పోతుంది. దీని వల్ల రక్తకణాలకు అవసరమైన ఆహారం అందక కళ్లకింద వలయాలు ఏర్పడతాయి. 
డి-హైడ్రేషన్
వంశపారంపర్యం: 
కుటుంబంలో తరతరాల నుంచి ఈ సమస్య ఉంటే అది వారి పిల్లలకూ వచ్చేఅవకాశాలు ఉంటాయి. 
జీవనశైలి: 
పొగ తాగడం, మద్యం సేవించడం, కేఫినేటెడ్ సోడాలు తీసుకోవడం... వంటివి. 
ముక్కు సమస్యలు: 
కంటికి ముక్కుకు సంబంధించిన సూక్ష్మరక్తనాళాలు ఒత్తిడికి లోనయినప్పుడు డార్క్ సర్కిల్స్ ఏర్పడతాయి) 
పిగ్మెంటేషన్ 
సూర్యకాంతికి ఎక్స్‌పోజ్ అవడం. 
క్యాచెక్సియా
అదేపనిగా చదవడం, టీవీ చూడ్డం..

16, జూన్ 2020, మంగళవారం

ఫిషర్ సమస్య నివారణకు పరిష్కారం మార్గం నవీన్ సలహాలు


ఆనల్ ఫిషర్ అంటే ఏమిటి?

ఆనల్ ఫిషర్ అనేవి మలద్వారం వద్ద చిన్న, సన్నని, అండాకార ఆకారపు పగుళ్లు లేదా పుండ్లు. అవి సాధారణంగా మలద్వార మార్గము యొక్క గోడల మీద వస్తాయి, ముఖ్యంగా వెనుక వైపున ఉంటాయి. మలద్వార మార్గము అనేది పురీషనాళం మరియు మలద్వారం మధ్య ఒక గొట్టం వంటి నిర్మాణం. పాయువు/మలద్వారం వద్ద రక్తస్రావంతో బాధ మరియు నొప్పి అనేవి ఈ వ్యాధి సాధారణ లక్షణాలు. అవి ఏ వయసులో వారికైనా సంభవించవచ్చు. సాధారణంగా, వాటిని మొలల వ్యాధి అని భ్రమపడతాము. ఫిషర్లు తీవ్రముగా లేదా దీర్ఘకాలికంగా ఉంటాయి. తీవ్రమైన ఫిషర్లు ఒక చిన్న పగులు మాదిరిగా ఉంటాయి, కానీ దీర్ఘకాలిక ఫిషర్లు మలద్వార మార్గము యొక్క గోడల మీద చర్మం గడ్డల్లా ఉంటాయి.

ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

నొప్పి మరియు రక్తస్రావం అనేవి సాధారణ లక్షణాలు. సాధారణంగా, నొప్పి ప్రేగుల కదలికల సమయంలో ప్రారంభమవుతుంది మరియు కొన్ని గంటల పాటు కొనసాగుతుంది. దురద మరియు వాపు కూడా అనుభవించబడుతున్నాయి. నొప్పి తీవ్రత సహించదగినది, కానీ కొన్నిసార్లు తీవ్రమైన నొప్పి అనుభవించవచ్చు.ఎర్రటి రక్తం మచ్చలు మలంపై, లేదా టిష్యూ పేపర్ మీద లేదా మలద్వారం చుట్టూ కనిపిస్తాయి. పాయువు/మలద్వార చర్మంపై ఒక సన్నని పగులు కనిపిస్తుంది. ఈ వ్యక్తికి సాధారణంగా రెండు ప్రేగు కదలికల మధ్య ఈ లక్షణాల నుండి స్వేచ్చగా లభిస్తుంది.

ప్రధాన కారణాలు ఏమిటి?

ఆనల్ ఫిషర్లు అనేవి మలద్వార మార్గము ద్వారా మలబద్దకం వలన, గట్టి, భారీ మలం ప్రయాణించినప్పుడు ప్రధానంగా ఉత్పన్నమవుతాయి. క్రోన్'స్ వ్యాధి వంటి ప్రేగు వాపు వ్యాధుల వలన కూడా ఈ ఫిషర్లు ఏర్పడవచ్చు. గర్భం ధరించినప్పుడు మరియు ప్రసవ సమయంలో కూడా ఫిషర్లు సంభవించవచ్చు. విరేచనాలు మరియు నిరంతరంగా వచ్చే అతిసారంకూడా ఒక అంతర్లీన కారణం కావచ్చు.

ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?

వైద్యులు ఒక వేలుకు తొడుగు(glove) ధరించన వేలుని పెట్టడం ద్వారా లేదా ఒక అనోస్కోప్ (ఒక చివరలో కెమెరాను అమర్చిన ఒక సన్నని గొట్టం) లోపలకు పెట్టడం ద్వారా మలద్వార మార్గాన్ని తనిఖీ చేస్తారు. ఆనల్ ఫిషర్ యొక్క స్థానం కూడా సాధ్యమయ్యే కారణాన్నితెలుపుతుంది. క్రోన్'స్ వ్యాధి కారణంగా ఫిషర్లు అనేవి వెనుక లేదా ముందు కన్నా పక్కన సంభవించవచ్చు. అవసరమైతే, మరింత నిర్ధారణ కోసం లేదా అంతర్లీన పరిస్థితులను విశ్లేషించడానికి, వైద్యులు బాధిత వ్యక్తి యొక్క పరిస్థితిని బట్టి సిగ్మాయిడోస్కోపీ (sigmoidoscopy) లేదా కోలొనోస్కోపీ (colonoscopy)ను ఉపయోగించవచ్చు.

ఆనల్ ఫిషర్లను సులభంగా చికిత్స చేయవచ్చు మరియు కొన్ని వారాల్లో వాటికవే తగ్గిపోతాయి కానీ, అంతర్లీన పరిస్థితులకు చికిత్స చేయకపోతే పునరావృతమవుతాయి. సాధారణంగా, పీచుపదార్థం (ఫైబర్) అధికంగా ఉండే ఆహారం మరియు నీరు పుష్కలంగా తాగడం వల్ల మలమును మృదువుగా చేయవచ్చు మరియు పెద్ద మొత్తంలో మలాన్ని సులభంగా బయటకు పంపించవచ్చు, తద్వారా మరింత నష్టం జరగకుండా నిరోధించి మరియు ఆనల్ ఫిషర్లను నయం చేయడానికి కుదురుతుంది. మలద్వార నొప్పి నుండి ఉపశమనం అందించడానికి మత్తుమందులను సమయోచితంగా వాడవచ్చు. మలాన్ని మృదువు చేసే మందులను కూడా చికిత్సలో సూచించబడతాయి.

రోజులో 10-20 నిమిషాల పాటు పలు సార్లు ఒక వెచ్చని తొట్టి స్నానం చేస్తే మలద్వార కండరాలకు ఉపశమనాన్నీ కలిగించి మరియు విశ్రాంతిని కలుగ చేస్తుంది. నార్కోటిక్ నొప్పి మందులు మలబద్ధకాన్నీ ప్రేరేపించడం వలన వాటిని ఉపయోగించరాదు. నైట్రో-గ్లిసరిన్ (nitro-glycerine) లేపనం మరియు కాల్షియం ఛానల్ బ్లాకర్ల (calcium channel blockers) వంటి మందులు ఉపయోగించబడతాయి. చాలా అరుదుగా శస్త్రచికిత్స చికిత్సను నిర్వహిస్తారు. శస్త్ర చికిత్సలో బోట్యులిన్ టాక్సిన్ ఇంజెక్షన్ (botulinum toxin injection) మరియు స్పిన్స్టెరోటోమీ (sphincterotomy) (anal sphincter కు సంబంధించిన శస్త్రచికిత్స) ఉంటుంది. శస్త్రచికిత్సా విధానాలతో ప్రేగు నియంత్రణ కోల్పోయే ప్రమాదం తక్కువగానే

అల్లోపతి : నొప్పిగా ఉన్నప్పుడు నొప్పినివారణ మాత్రలు (Nimsulide, Ibuprofen , diclofenac, aceclofenac) వాడాలి . ఇన్‌ఫెక్షన్‌ అయి చీము , రసి కారుతున్నప్పుడు ఫిస్టులా దరిదాపుపా శుభ్రము చేస్తూఉండాలి. . . యాంటీబయోటిక్స్ (ciprofloxin +ornidazole) వాడాలి.

ఏమీ చెయ్యకుండా ఉండడము : రసి శుభ్రము చేస్తూ ఉండి విరోచనము సాఫీ గా అయ్యేటట్లు ఆహారనిమాలు మార్చుకోవాలి .

ఫిస్టులాని తెరచి ఉంచడం : మూసుకొని ఉన్న గాయాన్ని కట్ చేసి తెరచి ఉంచి క్లీనింగ్ చేస్తూ ఉండలి .. లోపనుంది మానుకుంటూ వస్తుంది . ఇన్‌ఫెక్షన్‌ అవకుండా యాంటీబయోటిక్స్ వాడాలి.

సర్జెరీ : మంచి శస్త్రచికిత్స వైద్యనిపుణుని సంప్రదించి తగిన సలహా , సహాయాన్ని పొందాలి .


    ఆయుర్వేదము : క్షారసూత్ర ప్రక్రియ ద్వారా క్షార సూత్ర వైద్య ప్రక్రియతో భగంధరం దూరం అవుతుందని ఓరుగల్లు నగరంలోని ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ కెఎంవిడి ప్రసాద్‌ చెప్పారు. దీనిలో ఔషధాలు లేపనం చేసి ఒక నూలు దారాన్ని మలద్వారంనుంచి ఫిస్టులా మార్గంలోకి పంపి బైటనుంచి ముడి వేస్తారు. దారం లోపలినుంచి కోసుకుంటూ గాయాన్ని మాన్పుతూ బైటకు వస్తుంది. ఈ విధానమే కాకుండా ప్రారంభావస్థలో జాత్యాదిఘృతం వంటి రోపణ ఔషధాలను ప్రయోగించి కూడా వ్యాధిని తగ్గించవచ్చు.


తీసుకోవాల్సిన జాగ్రత్తలు


    చేపలు, కారం, మసాలలను, వాడకూడదు,

    మద్యం సేవించడం, ధూమపానం, పనికిరాదు,

    మజ్జిగ, కొబ్బరినీళ్ళు, పళ్ళరసాలు వంటివి తాగాలి.

    మలబద్దకం కాని కాయగూరలు, ఆకుకూరలు, ఎక్కువగా తినాలి.

    ఎక్కువ ప్రయాణాలు ఎక్కువ సేపు కూర్చోవడం పనికిరాదు.

    మనం కూర్చునే కుర్చి అడుగునుంచి గాలివచ్చేలా ఉండే కుర్చిలోనే కూర్చొవాలి.శరీరానికి చల్లగాలి అవసరం.


    చెప్పుకోవాలంటే సిగ్గు. అలాగని వూరుకోవాలంటే భయం! నలుగురిలో ఎక్కడ నగుబాటుకు గురవుతామోనన్న శంక.. పట్టించుకోకుండా తిరిగితే ఇదెంత పెద్ద సమస్యగా పరిణమిస్తుందోనన్న ఆందోళన. ఇవన్నీ నిరంతరం మనసును తొలి చేస్తుంటాయి. ఏ పని చెయ్యాలన్నా ఇదే బెరుకు. మలద్వారానికి సంబంధించి ఏ సమస్య తలెత్తినా ఆ బాధలకు తోడు మనసు కూడా ఇలా పరిపరివిధాలుగా విలకమై పోతుంటుంది. ఇక భగందరం వంటి సమస్యలైతే ఈ బాధ మాటల్లో చెప్పలేం! మలద్వారం చుట్టుపక్కల ఎక్కడో పుండులా మొదలవుతుంది. చిట్లి చీము కారుతూ వేధించి.. కొద్దిరోజుల్లో మానినట్లే ఉంటుంది. పోయిందిలెమ్మని అనుకుంటుండగానే మళ్లీ మొదటికి వస్తుంటుంది. ఇలా ఆ చుట్టు పక్కలే ఒకటి.. రెండు.. చాలా పుండ్లు మొదలవ్వచ్చు. పైపైన పుండ్లు మానినట్లే ఉంటాయి, కానీ ఎక్కడో లోపలి నుంచి మళ్లీ మొలుచుకొస్తుంటాయి. నిజానికి ఈ సమస్యకు మూలం పైన చర్మం మీద కాదు.. లోలోపల ఎక్కడో మలమార్గం నుంచే ఉంటుంది. దాన్ని ఆ లోపలి నుంచి సంపూర్ణంగా ముయ్యగలిగితేనేగానీ ఇది మానదు. ఇదే భగందరం! ఒక రకంగా మొండి సమస్య. సరైన నైపుణ్యంతో చికిత్స చెయ్యకపోతే.. మొదటికే మోసం వచ్చి, మలంపై పట్టు కూడా కోల్పోయే ప్రమాదం ఉంటుంది. అందుకే దీన్ని సరిగ్గా గుర్తించటం.. మూలాలు ఎక్కడున్నాయో తెలుసుకుని.. అది సంపూర్ణంగా తొలగిపోయేలా సరైన చికిత్స తీసుకోవటం అవసరం.


మలద్వార బాధల గురించి మాటల్లో చెప్పటం కష్టం! అందుకే చాలామంది సాధ్యమైనంత వరకూ తోసేసుకు తిరిగేందుకు ప్రయత్నిస్తుంటారు. కానీ ఇవి తెచ్చిపెట్టే చికాకు, బాధ, ఇబ్బందుల కారణంగా అట్టే కాలం వీటిని విస్మరించటం కష్టం. రెండోది- ముడ్డి దగ్గర వచ్చే సమస్యలన్నీ ఒకే రకం కూడా కాదు. వీటిల్లో మూలశంక, భగందరం, చీలికల వంటి చాలా సమస్యలు ఉంటాయి. వీటిలో కొన్ని అప్పటికప్పుడు అంత ఇబ్బంది పెట్టకపోయినా మెల్లగా ముదిరి తీవ్ర ఇబ్బందులూ తెచ్చిపెట్టొచ్చు. కాబట్టి మలద్వారం వద్ద ఏదైనా ఇబ్బంది అనిపించినప్పుడు వైద్యులకు చూపించుకుని.. అసలా సమస్య ఏమిటో నిర్ధారించుకోవటం, సత్వరమే వాటికి చికిత్స తీసుకోవటం ఉత్తమం. ఉదాహరణకు భగందరాన్నే తీసుకుంటే.. మామూలుగా ఎవరికి వారు దీన్ని గుర్తుపట్టటం కష్టం. ఎందుకంటే మలద్వారం చుటుపక్కల ఎక్కడో.. చిన్న సెగగడ్డలా మొదలవుతుంది కాబట్టి చాలామంది దీన్ని అసలు మలద్వారానికి సంబంధించిన సమస్య అనే అనుకోకపోవచ్చు. కానీ అది వదలకుండా మళ్లీమళ్లీ వేధిస్తూనే ఉంటుంది. చివరకు పగిలి చీము-రక్తం వస్తోందనో.. బట్టలు ఖరాబవుతున్నాయనో.. ఎప్పుడో వైద్యుల వద్దకు వస్తుంటారు. ఇది ఇన్ఫెక్షన్‌ కాబట్టి దీన్ని సాధ్యమైనంత త్వరగా తగ్గించుకోవటం మంచిది. దీనికి సర్జరీ ఒక్కటే సరైన చికిత్స! దీనిలో కూడా చాలా రకాలుంటాయి. ఈ మార్గాల మూలాలను గుర్తించటం, కండర వలయాలు దెబ్బతినకుండా నైపుణ్యంతో చికిత్స చెయ్యటం ముఖ్యం.


ఏమిటీ ఫిస్టులా?

తేలిక భాషలో చెప్పాలంటే.. గోడలో పైనుంచి ఒక నీళ్ల గొట్టం వస్తోందనుకుందాం. ఆ గొట్టం ఎక్కడన్నా పగిలితే దాని నుంచి నీరు బయటకు లీకై.. అక్కడ గోడను పాడుచేసి.. ఏదోవైపు నుంచి బయటకు వస్తుంటుంది. ఒక రకంగా భగందరం కూడా అంతే. మలద్వారం నుంచి బయటకు 'దారులు' ఏర్పడటం, ఇవి చుట్టుపక్కల చర్మం మీద ఎక్కడో పైకి తేలటం ఈ సమస్యకు మూలం. ఇలా ఎందుకు జరుగుతుందో చూద్దాం.


మలద్వారం లోపలి గోడలకు కొన్ని గ్రంథులు (యానల్‌ గ్లాండ్స్‌) ఉంటాయి. ఇవి మల మార్గంలో జిగురులాంటి స్రావాలను విడుదల చేస్తూ.. మలవిసర్జన సాఫీగా జరిగేలా సహకరిస్తుంటాయి. వీటి మార్గాలు మలద్వారంలోకి తెరచుకొని ఉంటాయి. ఏదైనా కారణాన వీటి మార్గం మూసుకుపోతే వీటి నుంచి వచ్చే జిగురు స్రావాలు మలమార్గంలోకి రాకుండా లోపలే నిలిచిపోతాయి. మెల్లగా మలంలో ఉండే బ్యాక్టీరియా సూక్ష్మక్రిముల వంటివి దీనిలో చేరి చీము పడుతుంది. దీంతో ఇది చీముగడ్డలా (యానల్‌ ఆబ్సెస్‌) తయారవుతుంది. ఈ చీము బయటకు వచ్చే మార్గం లేక.. పక్కనున్న కండరాలను తొలుచుకుంటూ అక్కడి ఖాళీల మధ్య నుంచి క్రమంగా లోపల్లోపలే విస్తరించటం మొదలుపెడుతుంది. ఇది మెల్లగా మలద్వారం చుట్టుపక్కల ఎక్కడో చోటకు చేరుకుని.. అక్కడ పైకి సెగగడ్డలా కనబడుతుంది. దీనికి రంధ్రం పడితే ఇందులోంచి చీము బయటకు వస్తుంటుంది. అయినా పైన ఇన్ఫెక్షన్‌ సోకిన గ్రంథి అలాగే ఉంది కాబట్టి తిరిగి మళ్లీ మళ్లీ చీము వస్తూనే ఉంటుంది. అందుకే చీము బయటకు పోయినా.. సమస్యకు మూలం గ్రంథిలో ఉంది కాబట్టి, దాన్ని తొలగిస్తేనే ఫిస్టులా పూర్తిగా నయమవుతుందని గుర్తించాలి.

అసలా మలద్వార గ్రంథులు ఎందుకు మూసుకుపోతాయన్నది కచ్చితంగా చెప్పటం కష్టం. కొందరిలో మలబద్ధకం వంటివి, మరికొందరిలో ఇతరత్రా కారణాలూ దీనికి కారణం కావచ్చు. మొత్తమ్మీద ఈ సమస్య స్త్రీలలో కంటే పురుషుల్లో అధికం. వృద్ధులకూ రావచ్చుగానీ యువకుల్లో ఎక్కువ. ఒకసారి గ్రంథులకు చీముపట్టి, లోపల దారులు ఏర్పడిన తర్వాత.. దానంతట అదే మానటం కష్టం. ఆ ఫిస్టులా మార్గాన్ని శుభ్రం చేసి వదిలేసినా ఉపయోగం ఉండదు. ఇన్‌ఫెక్షన్‌ సోకిన గ్రంథి అలాగే ఉంటుంది కాబట్టి సమస్య మళ్లీమళ్లీ తిరగబెడుతూనే ఉంటుంది. సక్రమమైన చికిత్స తీసుకోకపోతే ఇది మానదు. నాటు విధానాలను ఆశ్రయిస్తే మల విసర్జన మీద పట్టు పోయే ప్రమాదం ఉండటం దీనితో ఎదురయ్యే పెద్ద ఇబ్బంది.


నిర్ధారణ ఎలా?

చీముగడ్డతో వచ్చినప్పుడు.. ముందుగా చీమును తొలగించి మార్గాన్ని శుభ్రం చేస్తారు. అక్కడి కండర కణజాలమంతా వాచి ఉంటుంది కాబట్టి నిపుణులైన వైద్యులు తప్పించి ఆ సమయంలో లోలపకు గొట్టం ప్రవేశపెట్టటం వంటివేవీ చెయ్యకూడదు. ఎందుకంటే ఆ గొట్టం వేరే భాగాల్లోకి చేరి, కొత్త మార్గాలను సృష్టించే ప్రమాదం ఉంటుంది. అందువల్ల చీమును తొలగించాక, అక్కడి కణజాలం వాపు వంటివన్నీ తగ్గిన తర్వాత.. పరీక్షలు చేసి ఫిస్టులాను కచ్చితంగా గుర్తిస్తారు.


* వేలితో పరీక్షించటం: ఫిస్టులాను చాలా వరకూ లక్షణాలను బట్టే గుర్తించొచ్చు. మలద్వారం బయటగానీ, లోపలికి గానీ వేలు పెట్టి చూస్తే రంధ్రం ఉన్న భాగం తగులుతుంది. నైపుణ్యాన్ని బట్టి మార్గం ఎక్కడికి వెళ్తుందో కూడా కొంతవరకూ తెలుసుకోవచ్చు.


* ఎండోయానల్‌ స్కాన్‌: సన్నగొట్టంలా ఉండే అల్ట్రాసౌండ్‌ పరికరాన్ని మలద్వారంలోకి పంపి పరీక్షిస్తారు. దీంతో ఫిస్టులా మార్గం లోపలికి తెరచుకొని ఉంటే గుర్తించొచ్చు. సాధారణంగా మలద్వార కండరాల్లో ఎక్కడా గాలి ఉండదు. ఒకవేళ గాలి ఉన్నట్టు తేలితే అక్కడ మార్గం ఉన్నట్టుగా గుర్తిస్తారు. ఇది చవకైన, తేలికైన పరీక్ష.


* ఎంఆర్‌ఐ: ఫిస్టులా దారులు మరీ సంక్లిష్టంగా ఉంటే ఎంఆర్‌ఐ స్కానింగు చెయ్యాల్సి ఉంటుంది. దీనిలో ఎన్ని దారులు ఎలా ఉన్నదీ స్పష్టంగా తెలుస్తుంది.


వీటి ఆధారంగా వైద్యులు లోపల మార్గం ఒకటే ఉందా? చాలా మార్గాలున్నాయా? అవి మలద్వారానికి దగ్గరగా, కిందగానే ఉన్నాయా? లేక పైనుంచి ఉన్నాయా? ముఖ్యంగా మల నియంత్రణకు ఉపయోగపడే కీలకమైన రెండు కండర వలయాలకు (స్ఫింక్టర్‌కు) ఇవి దగ్గరగా ఉన్నాయా? వాటి మధ్య నుంచి వస్తున్నాయా? ఎక్కడి నుంచి మొదలై ఎటు వెళుతున్నాయి? వంటివన్నీ గుర్తిస్తారు. చికిత్సకు ఇది ఏరకమన్నది గుర్తించటం చాలా కీలకం.

చికిత్స ఏమిటి?

సాధారణంగా భగందరం దానంతట అదే మానిపోవటమనేది ఉండదు. చాలాసార్లు దీనికి సర్జరీ తప్పదు. ఏ చికిత్స చేసినా ఇది మళ్లీ మళ్లీ రాకుండా పూర్తిగా మూసుకుపోయేలా చూడటం ముఖ్యం. రెండోది- ఈ చికిత్సా క్రమంలో మలవిసర్జనను నియంత్రించే రెండు కండరవలయాలూ (స్ఫింక్టర్లు) దెబ్బతినకుండా చూడటం మరింత ముఖ్యం. దీనికోసం ఎప్పటి నుంచో చేస్తున్న ప్రామాణిక సర్జరీ విధానాలతో పాటు ఇటీవలి కాలంలో కొత్తరకాలూ అందుబాటులోకి వచ్చాయి. భగందరం మార్గం ఎలా ఉంది? ఎక్కడి నుంచి ఉంది? స్ఫింక్టర్లకు దగ్గరగా ఉందా? వంటి అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని వైద్యులు వీటిలో ఏ విధానం ఉత్తమమన్నది నిర్ధారిస్తారు.


* ఫిస్టులాటమీ: చాలకాలంగా అనుసరిస్తున్న, ఇప్పటికీ ప్రామాణికమైన విధానం ఇది. భగందరం మార్గం లోపలా బయటా స్పష్టంగా ఉన్నప్పుడు దాని గుండా గొట్టాన్ని పంపటం, మార్గం మొత్తాన్ని తెరవటం, శుభ్రం చేసి.. చీముపట్టిన గ్రంథిని తీసేసి.. వదిలేయటం ద్వారా దానంతట అదే మానేలా చూస్తారు. దీనివల్ల చాలాసార్లు బాగానే మానుతుంది. ఫిస్టులా మార్గం కండరంలో తక్కువ భాగానికే పరిమితమైనప్పుడు ఇది ఉత్తమమైన విధానం. ఈ విచక్షణ ముఖ్యం కాబట్టి నిపుణులైన వైద్యుల వద్ద చేయించుకోవటం ముఖ్యం.


* 'లిఫ్ట్‌' సర్జరీ: ఇటీవలి కాలంలో అందుబాటులోకి వచ్చిన ఈ 'లైగేషన్‌ ఆఫ్‌ ఇంటర్‌ స్ఫింక్టరిక్‌ ఫిస్టులా ట్రాక్ట్‌' పద్ధతితో మెరుగైన ఫలితాలు కనబడుతున్నాయి. మన మలద్వారం వద్ద అంతర, బాహ్య కండర వలయాలకు (ఇంటర్నల్‌, ఎక్స్‌టర్నల్‌ స్ఫింక్టర్లు) తోడు కటి-మలద్వార (ప్యూబోరెక్టాలిస్‌) కండరం కూడా ఉంటుంది. బాహ్య, అంతర కండర వలయాలు రెండూ ఒకదానితో మరోటి అనుసంధానమై పని చేస్తాయి. మలాన్ని పట్టి ఉంచటంలో కటి-మలద్వార కండరం ప్రధానమైంది. ఇది దెబ్బతింటే మల విసర్జనపై పట్టు పోతుంది. అందుకని ఇవేవీ దెబ్బతినకుండా.. ఈ లిఫ్ట్‌ పద్ధతిలో అంతర, బాహ్య కండర వలయం మధ్యలోంచి లోపలికి వెళ్లి, ఫిస్టులా మార్గాన్ని గుర్తించి.. దాన్ని మధ్యలో కత్తిరిస్తారు. రెండు వైపులా శుభ్రం చేసి, అటూఇటూ ముడివేసేస్తారు. ఈ ప్రక్రియతో ఫిస్టులా నయం కావటమే కాకుండా మల విసర్జన మీద పట్టు కూడా దెబ్బతినదు, 90% వరకూ మళ్లీ వచ్చే అవకాశాలు కూడా ఉండటం లేదని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి.


* సీటన్‌ విధానం: కొన్ని రకాల ఫిస్టులాలకు- భగందర మార్గం లోపలి నుంచి దారం వంటిదాన్ని లోపలికి పంపి, మలద్వారం గుండా బయటకు తెచ్చి ముడివేసే విధానం బాగానే ఉపయోగపడుతుంది. క్రమేపీ బిగువుగా ముడి వేస్తూ.. కొన్ని నెలల సమయంలో మార్గం దానంతట అదే మానిపోయేలా చూడటం ఈ విధానం ప్రత్యేకత. క్షారసూత్రం పేరుతో మన దేశంలో కూడా ఈ విధానం చిరకాలంగా అమల్లో ఉంది. కండరం ఎంత భాగం ప్రభావితమైందో తెలియనప్పుడు తాత్కాలికంగా ఈ చికిత్స చేసి తర్వాత పూర్తిగా మానేలా చేయటానికి ఏ విధానాన్ని అనుసరించాలో నిర్ధరిస్తారు. ఏ రకం భగందరానికి ఇది బాగా ఉపయోగపడుతుందన్నది గుర్తించి చికిత్స చెయ్యటం కీలకం.


* ఫిబ్రిన్‌ గ్లూ: భగందర మార్గాన్ని శుభ్రం చేసి.. దానిలోకి జిగురువంటి పదార్ధాన్ని ఎక్కించి.. రెండు వైపులా కుట్టేస్తారు. దీనివల్ల తాత్కాలికంగా మార్గం మూసుకుపోయి మానినట్లే అనిపించినా దీర్ఘకాలంలో మళ్లీ వస్తున్నట్టు గుర్తించారు. అలాగే 'ఫిస్టులా ప్లగ్‌' అనే మరో విధానం కూడా ఉంది. దీనిలో జంతుచర్మం నుంచి తయారు చేసిన ప్లగ్‌ను అమర్చి మార్గాన్ని మూసేస్తారుగానీ వీటికి అయ్యే ఖర్చు ఎక్కువ, దీర్ఘకాలంలో మళ్లీ వచ్చే అవకాశం ఉంటోంది. అందుకని సర్జరీని తట్టుకోలేని వృద్ధులు, కండరాలు బాగా బలహీనపడిన వారికి దీనిని సిఫార్సు చేస్తుంటారు.


సర్జరీ తర్వాత..

ఆపరేషన్‌ తర్వాత వైద్యులు అవసరాన్ని బట్టి యాంటీబయాటిక్స్‌తో పాటు నొప్పి తెలియకుండా మందులు సిఫార్సు చేస్తారు. అలాగే మలవిసర్జన ఇబ్బంది లేకుండా సాఫీగా అయ్యేందుకు కూడా మందులు ఇస్తారు. ఇవాల్టిరోజున అందుబాటులో ఉన్న సమర్థ విధానాలతో సర్జరీ చేస్తే ఫిస్టులా మళ్లీ తిరిగి వచ్చే అవకాశాలు తక్కువనే చెప్పాలి.

స్త్రీలలో మరింత సమస్యాత్మకం!

కొందరు స్త్రీలకు భగందరం- యోని వద్ద ముందు భాగంలో తెరచుకొని ఉంటుంది. ఇది చాలా ప్రమాదకరమైంది. ఎందుకంట యోని వైపున కండర వలయం పల్చగా ఉంటుంది. రెండోది కాన్పు అయిన వారిలో ఈ కండరం మరింతగా సాగినట్త్లె దృఢత్వాన్ని కూడా కోల్పోయి ఉంటుంది. పురుషులతో పోలిస్తే వీరిలో మలంపై పట్టు కోల్పోయే ముప్పు మరింత ఎక్కువ. అందుకే స్త్రీలు, వృద్ధులకు సర్జరీ మరింత జాగ్రత్తగా చెయ్యాల్సి ఉంటుంది.

యానల్ ఫిషర్ (ఆనల్ ఫిషర్) కొరకు మందులు

Medicine NamePack Size
NitrocontinNITROCONTIN 2.6MG TABLET 25S
Schwabe Ratanhia CHSchwabe Ratanhia 1000 CH
GTN Sorbitrate CRGTN SORBOTRATE 6.4MG TABLET CR 30S
Bjain Ratanhia Mother Tincture QBjain Ratanhia Mother Tincture Q
Dr. Reckeweg Syphilinum DilutionDr. Reckeweg Syphilinum Dilution 1000 CH
Schwabe Sal carolinum CHSchwabe Sal carolinum 1000 CH
Schwabe Ratanhia MTSchwabe Ratanhia MT
SBL Syphilinum DilutionSBL Syphilinum Dilution 1000 CH
ADEL Ratanhia Mother Tincture QADEL Ratanhia Mother Tincture Q
Dr. Reckeweg Ratanhia DilutionDr. Reckeweg Ratanhia Dilution 1000 CH
Bjain Syphilinum DilutionBjain Syphilinum Dilution 1000 CH
Omeo Piles OintmentOmeo Piles Ointment
Dr. Reckeweg Ratanhia QDr. Reckeweg Ratanhia Q
Schwabe Syphilinum CHSchwabe Syphilinum 1000 CH
ADEL Ratanhia DilutionADEL Ratanhia Dilution 1000 CH
DibucaineDibucaine 1% Ointment
GTNGTN Spray
Nitroderm TtsNitroderm Tts 10 Mg Patch
NitrogesicNitrogesic 0.2 %W/W Ointment
NitrolingualNitrolingual 0.4 Spray
Angiplat TabletAngiplat 2.5 Capsule TR
Top NitroTop Nitro 10 Transdermal Patch
AngispanAngispan - TR 2.5 mg Capsule
Nitrocin (Pen)Nitrocin (Pen) 25 Mg Spray

ధన్యవాదములు 

మీ నవీన్ నడిమింటి 

విశాఖపట్నం 

9703706660

                 ఆస్వీకార ప్రకటన: ఈ సైటుపై లభ్యమవుతున్న మొత్తం సమాచారము మరియు లేఖనము కేవలం అవగాహనా ఆవశ్యకతల కొరకు మాత్రమే. ఇక్కడ ఇవ్వబడిన సమాచారమును ఏదైనా ఆరోగ్య సంబంధిత సమస్య లేదా అస్వస్థత నుండి కోలుకోవడానికి లేదా స్వస్థత కొరకు నిపుణుల సలహా లేనిదే ఉపయోగించుకోకూడదు. చికిత్స పరీక్షలు మరియు సేవల కొరకు ఎల్లప్పుడూ ఒక అర్హత పొందిన వైద్యుల సలహా తీసుకోవాలి.