13, జులై 2020, సోమవారం

రక్తంలో ప్లేట్ లెట్ పెరగాలి అంటే తీసుకో వాలినసిన జాగ్రత్తలు


రక్తంలో ప్లేట్ లెట్ కౌంట్ ను పెంచుకోవడానికి డాక్టర్స్ సూచించిన పండ్లు అవగాహనా కోసం 

డేంగ్యూ ట్రీట్మెంట్: బ్లడ్ పెరగడానికి పండ్లు తినమని డాక్టర్లు ఎక్కువగా సూచిస్తుంటారు. డేంగ్యూ ఫీవర్ 2నుండి 7 రోజుల వరకూ దీర్ఘకాలిక జ్వరంగా ఉంటుంది. దీన్ని బోన్ ఫీర్ అని కూడా పిలుస్తారు. డేంగ్యూ ఫీవర్ వచ్చిన వారిలో జాయింట్ మరియు మజిల్ పెయిన్స్ ఎక్కువగా ఉంటుంది.

డేంగ్యూ ఫీవర్ వస్తే హై ఫీవర్, తలనొప్పి ఎక్కువగా ఉంటుంది.

డేంగ్యూ జ్వరంను రక్త పరీక్ష ద్వారా కనుగొంటారు. జ్వరం వల్ల ప్లేట్ లెట్ కౌంట్ చాలా తక్వగా ఉంటుంది. 65శాతం మందిలో థ్రోంబోసైటోపినియా లోప్లేట్ లెట్ గా పిలుస్తారు.

డేంగ్యూ వైరస్ రక్తంలో ద్రవాలను ఉత్పత్తి చేస్తుంది. ఇది రక్తంలో హెమటోక్రైట్స్ ను పెంచుతుంది. అలాగే ప్లేట్ లెట్ కౌంటన్ ను తగ్గించడానికి సహాయపడుతుంది.

రక్తంలో ఉత్పత్తి అయిన హెమటో క్రైట్ లెవల్స్ ప్రమాదకరమైన అంతర్గత హెమరేజెస్ కు దారితీస్తుంది. ప్లేట్ లెట్ కౌంట్ తక్కువగా ఉండి, హెమటో క్రైట్ లెవల్స్ కాటస్ట్రోఫీగా మారవచ్చు. శరీరంలో రక్తం తగ్గడం వల్ల రక్తం గడ్డ కట్టే ప్రమాదం ఉండి.

నార్మల్ ప్లేట్ లెట్ కౌంట్ 150,000నుండి 450,000మైక్రోలీటర్స్ అంటే 150-450 ఉంటాయి. అదే విధంగా 150 కంటే తక్కువగా 30కి చేరితే ప్రాణానికే ప్రమాదం.

డెంగ్యు జ్వరంతో బాధపడుతున్నారా?ఐతే ఇవి తినండి!

ఎప్పుడైతే పీరియడిక్ ఫీవర్ తో బాధపడుతారో, చర్మంలో దద్దుర్లు , వాంతులతో బాధపడుతారు. దాంతో డాక్టర్లు ప్లేట్ లెట్ కౌంట్ టెస్ట్ ను సూచిస్తారు.


లో ప్లేట్ లెట్ కౌంట్ బ్లీడింగ్ కు దారితీస్తుంది. ముక్కు నుండి రక్తస్రావం, ఎక్కువ తలనొప్పి, రెక్టమ్ నుండి రక్తస్రావం, కండరాల్లో నొప్పి, మలంలో రక్తం లక్షణాలు కనబడుతాయి. కొంత మంది మహిళల్లో పీరియడ్స్ లో ఎక్కువ బ్లీడింగ్ అవుతుంది.

కాబట్టి, డేంగ్యూ ఫీవర్ లక్షణాలునివారించుకోవడానికి, బ్లడ్ ప్లేట్ లెట్ కౌంట్ ను పెంచుకోవడానికి డాక్టర్లు కొన్ని పండ్లను సూచించారు..

దానిమ్మ:

దానిమ్మలో పాలీ ఫినోలిక్ ఫ్లెవనాయిడ్స్ అధికంగా ఉంటాయి. ఇవి యాంటీమైక్రోబయల్ యాక్టివిటి కలిగి ఉంటాయి. ఒక గ్లాసు దానిమ్మ జ్యూస్ లో 2 టేబుల్ స్పూన్ల నిమ్మరసం కలిపి తాగితే వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. ఈ జ్యూస్ ను ప్రతి రెండు గంటలకొకసారి తాగాలి. దానిమ్మలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. విటమిన్ సి ఇన్ఫెక్షన్స్ తగ్గించడంలో వ్యాధినిరోధకత పెంచడానికి సహాయపడుతుంది. ఇది లో ప్లేట్ లెట్ కౌంట్ ను పెంచుతుంది.

దానిమ్మ, బ్లాక్ గ్రేప్స్ ను కాంబినేషన్ లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి.ఇవి ప్లేట్ లెట్ కౌంట్ ను పంెచి, వ్యాధినిరోధకశక్తిని పెంచుతాయి. ప్రతి రెండు గంటలకు ఒకసారి 300ఎంఎల్ జ్యూస్ తాగితే ప్లేట్ లెట్ కౌంట్ పెరుగుతుంది.

డెంగ్యూ మహమ్మారిని గుర్తించే 10 లక్షణాలు

కివి ఫ్రూట్ :

కివి పండ్లలో విటమిన్ సి, విటమిన్ కె, విటమిన్ ఇ, ఫొల్లెట్, పొటాషియంలు అధికంగా ఉన్నాయి.ఈ పండులో యాంటీఆక్సిడెంట్, ఫైబర్ ఎక్కువ. కివి ఫ్రూట్ లో న్యూట్రీషియన్స్ అధికంగా ఉంటం వల్ల వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. కివి పండ్లలో ఉండే పొటాషియం, శరీరంలో ఎలక్ట్రోలైట్స్ ను బ్యాలెన్స్ చేస్తుంది. అదే విధంగా విటమిన్ సి వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది. ఫ్రూట్ జ్యూస్ తాగడం వల్ల ప్లేట్ లెట్ కౌంట్ పెరుగుతుంది. ఇందులో ఉండే మైక్రోన్యూట్రీషియన్ప్ ప్లేట్ లెట్ కౌంట్ పెంచుతుంది.

బొప్పాయి:

బొప్పాయి లో అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఈ ఫ్రూట్ లో విటమిన్స్ , ఫొల్లెట్, ఫైబర్, పొటాషియంలు ఎక్కువ. బొప్పాయిలో ఉండే న్యూట్రీషియన్ బెనిఫిట్స్ విటమిన్ సి ని పెంచుతుంది. ఇది యాంటీఆక్సిడెంట్ లక్షణాలు కలిగి ఉంటుంది. దాంతో డేంగ్యూ ఫీవర్ తగ్గుతుంది. ఇందులో ఉండే ఫైబర్ కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. బొప్పాయి గాయాలను మాన్పుతుంది. డేంగ్యూ ఫీవర్ ను తగ్గిస్తుంది. ప్లేట్ లెట్స్ పునరుత్పత్తి చేస్తుంది.వైట్ బ్లడ్ సెల్స్ ను పెంచుతుంది.

12, జులై 2020, ఆదివారం

యోగ ప్రతి రోజులు చేయడం వల్ల ఉపయోగం ఏమిటి &నిద్ర లేచిన వెంటనే యోగ చేయండి దాని వల్ల ఉపయోగం ఏమిటి తెలుసు కొందాం


ఈ ఆధునిక ప్రపంచంలో ఆరోగ్యం మీద అవగాహన, బాధ్యత కలిగి ఉండాలి. ఆరోగ్యంగా ఉండటానికి ఒక లక్ష్యాన్ని ఏర్పరుచుకోవాలి. అందుకు యోగా బాగా సహాయపడుతుంది. యోగా చేయాలంటే బద్దకిస్తున్నారా? అయితే మీకు సహాయం చేయడానికి మేమున్నాం.

 ప్రతి రోజూ ఉదయం యోగా చేయడం వల్ల ఆరోగ్యానికి మంచిదని, చాలా మందికి తెలుసు, అయితే ఎంత మంది ఈ పద్దతిని అనుసరిస్తున్నారు? ఖచ్చితంగా ఏ కొద్ది మాత్రమే రోజూ యోగను సాధన చేస్తుంటారు. 

మరికొద్దిమంది, యోగ మొదలు పెడతారు ఒక నెలలో, రెండు నెలలో ప్రాక్టీస్ చేసి, ఆపేస్తుంటారు. ఆ తర్వాత ఐదు, ఆరు నెలలు బ్రేక్ తీసుకుని, తిరిగి ప్రారంభిస్తుంటారు.
రోజూ ఉదయం నిద్రలేచిన వెంటనే పరగడపుతో యోగాను ప్రాక్టీస్ చేయడం వల్ల అనేక ప్రయోజనాలున్నాయి. రోజూ యోగ సాధన చేయడం వల్ల శరరంలో ఏం జరుగుతుందో తెలుసుకోండి. యోగ అనేది కేవలం బరువు తగ్గడానికి మాత్రమే కాదు, దీని వల్ల ఆస్త్మా, వెన్నునొప్పి, ఇతర శ్వాస సంబంధిత సమస్యలను నివారించుకోవచ్చు. నిద్రలేచిన వెంటనే చేయాల్సిన కొన్ని యోగాసనాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

1.లార్డ్ ఆఫ్ డ్యాన్స్ ఫోజ్ (నటరాజ ఆసనం): 


నటరాజాసన (నట-డ్యాన్స్, రాజ-కింగ్, ఆసన-భంగిమ) ఇది స్పైనల్ ఫ్లెక్సిబులిటికి, జీర్ణవ్యవస్థకు చాలా మంచి ఆసనం. నిద్రలేచిన వెంటనే చేయాల్సిన ఆసనం ఇది. 

ఎలా చేయాలి.


అద్భుతమైన నాట్యంతో తాండవం చేసే శివునికి మరోపేరు నటరాజు. అలాంటి నాట్య ముద్రలను పోలి ఉంటుంది కాబట్టే ఈ ఆసనానికి నటరాజాసనం అన్న పేరు వచ్చింది. 

వెల్లకిలా నిటారుగా పడుకోవాలి. తర్వాత రెండు కాళ్ళను నెమ్మదిగా మడవాలి.

 కాళ్ళ పాదాలు హిప్ వరకూ వచ్చే వరకూ మోకాళ్లు మడవాలి. తర్వాత రెండు చేతులను ఎంతవరకూ సాధ్యమైతే అంతవరకూ చాపాలి. ఈ ఆసనంలోనే నెమ్మదిగా శ్వాస తీసుకోవాలి. 

తర్వాత నెమ్మదిగా బయటకు వదలాలి. తలను ఎడమవైపుకు తిప్పినప్పుడు కుడి భుజం చూడాలి. తలను ఎడమవైపుకు తిప్పినప్పుడు కుడివైపు భుజంను చూడాలి. 

భుజాలు రెండూ ఫ్లోర్ కు ఆనించే వెల్లకిలా పడుకోవాలి. కుడికాలును ఫ్లోర్ కు పూర్తిగా ఆనించాలి. ఎడమచేతిని ఉపయోగించి మరింత ప్రెజర్ పెట్టి ప్రెస్ చేయచ్చు.

 ఇదే భంగిమలో పడుకుని 3, 4 డీప్ బ్రీత్ తీసుకోవాలి. మీకు సాధ్యమైతే ఎన్నిసార్లైనా తీసుకోవచ్చు. 

నటరాజాసనం వల్ల ఉపయోగాలు:


 వెన్నుముక ఫ్లెక్సిబులిటిని పెంచుతుంది. 

ఊపిరితిత్తులకు మంచి వ్యాయామం. 

పెద్ద ప్రేగులకు మంచి ప్రయోజనం.

 ఉదయం పరడగుపున ఈ యోగ చేయడం వల్ల బ్లాడర్, బౌల్ మూమెంట్ నార్మల్ గా ఉంటుంది.

 జీర్ణ శక్తిని పెంచుతుంది. 

మైండ్ అండ్ బాడీని రిలాక్స్ చేయడంలో చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

2. సుఖాసనం: 


ఏదైనా సాధాన చేయడానికి యోగాకు మించినది మరొకటి లేదు. సుఖ్' అంటే జాయ్(సంతోషం). సుఖాసన అనేది 'సుఖం' అనే సంస్కృత పదం నుండి వచ్చింది. దీనర్ధం తేలిక లేదా ఇష్టమైన అని, 'ఆసన' అంటే భంగిమ అని అర్ధం. సుఖాసన అన్ని ఆసనాలలో కి తేలికైనది, దీనిని ఏ వయసు వారైనా చేయవచ్చు.

 ఎలా వేయాలి: 


సుఖాసన ఒక యోగా భంగిమ మీరు చాలా సులభంగా కూర్చొనే భంగిమ. "సుఖః" అంటే"సుఖము"అని, "ఆసన"అంటే"భంగిమ"అని సంస్కృతంలో అర్ధం.

 ఈ రకం యోగాసన అనుసరణలో చాపపై కూర్చోని కాళ్ళను తిన్నగా ముందుకు చాపాలి.

 తరువాత కాళ్ళను మడచి (బాచాబట్లు లేక నేల మీద కూర్చొని భోజనం చేసే పద్ధతి)లో కూర్చొండి వెన్నుముక నిఠారుగా ఉండేట్లుగా చూసుకోండి.

 మీరు ఓపిక ననుసరించి ఎంతసైపైనా ఈ ఆసనం వేయవచ్చు. 

మీ భుజాలను చక్కగా ఉంచండి. సౌకర్యంగా ఉన్నంత సేపూ ఈ భంగిమలో కూర్చోండి. క్రాసింగ్ భంగిమలో ఉన్న కాళ్ళను మధ్యలో అటూ ఇటూ మార్చుకోవచ్చు.

 సుఖాసనం వల్ల ఇతర ప్రయోజనాలు: 


మనసుకి ఉపశమనాన్ని ఇస్తుంది. 

శరీర కదలికలను మెరుగుపరుస్తుంది. 

రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది.

 జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. 

శక్తివంతంగా ఉన్న భావనను కలుగచేస్తుంది.

3. ఆల్టర్నేట్ నాజల్ బ్రీతింగ్ టెక్నిక్స్ (నది షోధన ప్రాణాయం)


 ఆల్టర్నేట్ నాజల్ బ్రీతింగ్ యోగాసనం వల్ల శ్వాస సంబంధ సమస్యలను దూరం చేసుకోంచ్చు. శరీరంలోని కండరాలకు, ఊపిరితిత్తులకు మంచి ఎనర్జీని అందిస్తుంది. శరీరాన్ని ఉత్తేజపరచడం మాత్రమే కాదు, నాడీవ్యవస్థ ఆరోగ్యంగా ఉంచుతుంది.

 ఎలా చేయాలి: 


పద్మాసనంలో కూర్చొని శ్వాస మీద ఏకాగ్రత పెట్టాలి. కొన్ని నిముషాలు సాధారణ శ్వాస తీసుకోవాలి.

 తర్వాత గయన్ ముద్ర, మీరు కుడి లేదా ఎడమ చేతి ఇండెక్స్ ఫిగర్ తో బొటవేలితో రెండు కులపుతూ, మిగిలిన వేళ్లు దూరం ఉంచి (ఫోటోలో చూపిన విధంగా)ముక్కును పట్టుకోవాలి. 

రెండు ముక్కు రంద్రాల నుండి ఒకదాని తర్వాత ఒకటి గాఢంగా శ్వాత తీసుకోవడం, వదలడం చేయాలి. 

అయితే ఒక ముక్కు రంద్రం తెరచుకున్నప్పుడు, ఆటోమేటిక్ గా రెండవదాన్ని మూసుకోవాలి.

 శ్వాస తీసుకున్నప్పుడు, నిధానంగా తీసుకుని, పొట్టను బిగ బట్టాలి. 

వెంటనే వదిలేయకుండా ఒక పది నెంబర్స్ లెక్క పెట్టి తర్వాత నిధానంగా శ్వాసన వదలాలి. ఇలా రెండువ ముక్కు రంద్రం నుండి చేయాలి. ఇలా ఐదు, ఆరు సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

నదిషోధన ఉపయోగాలు: 


శ్వాస సంబంధిత సమస్యలు తగ్గుతాయి. 

టైడల్ వాల్యూమ్ పెరుగుతుంది.

 ఏకాగ్రతను పెంచుతుంది.

 శరీరంలోని అవయవాలను మేల్కొలుపుతుంది.

 బ్రెయిన్ లో హార్మోనులను బ్యాలెన్స్ చేస్తుంది.

 శరీరంలో ఉష్ణోగ్రతను మెయింటైన్ చేస్తుంది.

బాలాసనం 


బాలాసనం పిల్లల ఫోజు, ఈ ఆసనం వల్ల మొత్తం శరీరం ఒత్తిడి తగ్గుతుంది. 

ఎలా చేయాలి.


 ఫ్లోర్ మీద లేదా బెడ్ మీద కూర్చొని, హిప్ బ్యాక్ పొజిషన్ లో ఫోటోలో చూపిన విధంగా కూర్చోవాలి. 

తర్వాత రెండు చేతులను ముందుకు పూర్తిగా చాపాలి. 

శరీరం పూర్తిగా విశ్రాంతి తీసుకోనివ్వాలి. శ్వాస మీద ఏకాగ్రత పెట్టి, శరీరం, మనస్సు ఫ్రీ చేసుకోవాలి. 

ఈ భంగిమను కొన్ని నిముషాలపాటు చేయాలి. 

ఉపయోగాలు


 పిల్లల భంగిమ అని సముచితంగా పిలవబడే ఈ ఆసనం ఒత్తిడిని దూరం చేస్తుంది. 

ఇది నడుము, తొడలు, చీలమండలంను కొద్దిగా సాగదీసి, మెదడును శాంతపరచి, ఒత్తిడిని, అలసటను దూరం చేయడానికి సహాయపడుతుంది.

 ఈ బాల భంగిమ రక్తప్రసరణ మెరుగుపరుస్తుంది.

 నరాల పని తీరును కూడా మెరుగుపరుస్తుంది. 

రక్తపోటు కారణంగా తరచుగా ఆందోళన, కోపం వస్తూ ఉంటాయి. 

బాలాసన లేదా పిల్లల యొక్క భంగిమలో ఆందోళన అనవసరమైన అయోమయం తగ్గి మీ మనస్సు ప్రశాంతతకు సహాయపడుతుంది.

భుజంగాసన(కోబ్రాపోజ్): 


భుజంగం అంటే పాము ఈ ఆసనం పాము పడగ విప్పటానికి పైకి లేచినపుడు ఉండే ఆకారాన్ని పోలి వుంటుంది కాబట్టి దీన్ని భుజంగాసనం అంటారు. 

ఎలా చేయాలి 


రెండు కాళ్ళను దగ్గరగా వెనక్కి చాపి బోర్లాపడుకోవాలి. 

చేతులను ఛాతి దగ్గర వుంచి, నెమ్మదిగా శ్వాస తీసుకుంటు వీలైనంత వరకు నడుము భాగం (నాభిస్థానం) నుండి తల వరకు శరీరాన్ని పైకి లేపి వెనక్కి వంచాలి. 

ఇప్పుడు సాధారణ శ్వాసతో ప్రశాంతంగా వెన్నుపై దృష్టి పెట్టి, ఈ స్థితిలో 20 సెకన్లు వుండాలి. 

ఆ తర్వాత శ్వాస వదులుతూ నెమ్మదిగా ఛాతి, తల నేలకు ఆనించి పూర్వస్థితికి రావాలి. 

దీన్ని మరో మూడు సార్లు సాధన చేస్తూ ఎక్కువ సమయం ఆసన స్థితిలో వుండే ప్రయత్నం చేయాలి.

 

 ఉపయోగాలు : 


వెన్ను నొప్పితో సహా ఇతర నడుము సంబంధ నొప్పుల నుండి ఉపశమనం లభిస్తుంది. 

నాడీ మండలం ఉత్తేజితమై స్ట్రెస్‌ దూరమౌతుంది.

 ఛాతీ కండరాలు, వెన్ను బలంగా వుంటాయి. 

కాలేయం, కిడ్నీ, ఊపిరితిత్తులు సమర్థవంతంగ పనిచేస్తాయి.

మెడనొప్పి, పొత్తికడుపు సమస్యలు, మలబద్దకం, నడుము దగ్గర కొవ్వు తగ్గుతాయి.

యోగాసనాలు - ఉపయోగాలు

మెడవీపునొప్పులుచేతి నరాల బలహీనతఆయాసం లాంటి  వ్యాధులలో ఈ ఆసనం పనిచేస్తుంది.

1. గోముఖాసనం వలన ఉపయోగాలు : 1. మూత్రం అతిగా వెలువడడంధాతు నీరసంలికోరియామధుమేహంఊపిరితిత్తులుమెడవీపునొప్పులుచేతి నరాల బలహీనతఆయాసం లాటి ం వ్యాధులలో ఈ ఆసనం పనిచేస్తుంది.

2. నర్వస్‌ సిస్టం యొక్క నీరసాన్ని తగ్గించి మనస్సుకి స్థిరత్వాన్నిస్తుంది.

3. అవసరం లేని అండకోశం పెరుగుదలను ఆపుతుంది.

5. తొడలుపిక్కలుసీవనానాడికిప్రదేశంకంఠంభుజాలుహృదయ వ్యాధులన్నిని పోగొడుతుంది. ఛాతీ వెడల్పుగా తయారవుతుంది.

2. స్వస్తికాసనం వలన ఉపయోగాలు : 1. రొమ్ముహృదయందానిలోనికి వచ్చిపోయే పెద్ద రక్తనాళాలుఊపిరితిత్తులువాయుమార్గాలతోబాటు ఆహారనాళం కూడా చురుకుగా ఉంటుంది.

2. వీపు కింది నరాలు లాగబడటం వలన ఆరోగ్యవంతంగా ఉంట్టాయి.

3. చలికాలంలో చల్లబడిపోయే పాదాలు వెచ్చగా ఉంట్టాయి. అలాగే వేసవిలో అతిగా పట్టే చెమట కూడా తగ్గుతుంది.

4. కాళ్ళ నొప్పులు తగ్గుతాయి.

3. సింహాసనం వలన ఉపయోగాలు : 1.ట్టాన్సిల్సునత్తి విం కంఠ దోషాలు తగ్గుతాయి.

2. కళ్ళుముక్కుచెవులు బాగుపడతాయి.

3. శుక్రగ్రంథి ప్రభావానికి లోనవటం వలన వీర్యం సురక్షితంగా ఉంటుంది.

4. మూడు బంధాలూ ఉడియాన బంధంమూలబంధంజలంధర బంధాలను వేయగలిగే శక్తి లభిస్తుంది.

4. మయూరాసనం వలన ఉపయోగాలు : 1. జీర్ణ మండలంలోని అవయవాలన్నీ బాగు పడతాయి. అన్నాశయంతోపాటు పేగులు కూడా ధృడంగాను చురుకుగాను తయారవుతాయి. ఆకలి పెరుగుతుంది. బాన కడుపు తగ్గుతుంది.

2. మణికట్టుభుజాలుఊపిరితిత్తులుకండరాలుహృదయం బలాన్ని సంతరించు కుట్టాంయి.

3. వాత పిత్త కఫ దోషాలు దూరమవుతాయి.

4. కడుపులోని నులి పురుగులు నశిస్తాయి.

5. రక్తం శుభ్రపడుతుంది. శరీరంలో తేజస్సు కాంతి చురుకుదం ఇంజెక్షన్‌ ఇచ్చినట్లు పనిచేస్తాయి.

5. పద్మాసనం వలన ఉపయోగాలు : పద్మాసనంలో శరీరం స్థిరంగా ఉంటుంది. ఎక్కువసేపు కూర్చోవడం వలన కాళ్ళలో రక్త ప్రసరణ తగ్గి మిగిలిన రక్తం మెదడుకు చేరి ధ్యానానికి ఉపయోగపడుతుంది.

వెన్నముక సహజంగా ఈ ఆసనంలో గ్టి పడుతుంది. రక్తప్రసరణ వ్యవస్థ సరిగా పనిచేస్తుంది. నాడీమండలం బాగుపడుతుంది.

రెండుకాళ్ళు అరిపాదాలు పైకి ఉండడం వలన రెండు చేతులూ జ్ఞాన ముద్రలో ముడుకుల పైన ఉండటం వలన కాళ్ళు పంజాలు వేళ్ళ కణుపుల నుండి బైటకు పోయే విద్యుచ్ఛక్తి బైటి కి పోక శక్తి అంతా శరీరంలోనే ఉంటుంది.

నాభికి ఎడమవైపున ఉన్న సరస్వతీనాడి ఎడమ మడమతో నొక్కబడినందువలన సుషుమ్న నుండి ప్రాణ ప్రవాహం ఆరంభం అవుతుంది. నాసాగ్ర భాగాన గాని కనుబొమల మధ్య కేంద్రీకరించిన ధ్యానం వలన కాని సరియైన స్థితిలో ఉత్పన్నం అవుతుంది.

కాళ్ళకు సంబంధించిన వ్యాధులన్నీ దూరమౌతాయి. సయాటి కావాతరోగాల బాధ తగ్గుతాయి.

మడమ కడుపులో పెట్టడం వలన జీర్ణశక్తి పెరుగుతుంది.

మనసు త్వరగా ఏకాగ్రతను పొందుతుంది. దానివలన ధ్యానంలో ఎక్కువసేపు ఉండవచ్చు.

పద్మాసనంలో జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు అన్నీ విశ్రాంతిని పొందుతాయి. దాని వలన వాటి  శక్తి మిగులుతుంది

ఈ ఆసనాలు చేయడం వలన ఎవరికి వారు స్వతంత్రంగా జీవిస్తూ ఆనందంగా కాలాన్ని గడుపుతారు. ఒకరిపై ఆధారపడే అవసరం లేకుండా ఉంటుంది. మనిషి బ్రతికినంతకాలం స్వతంత్రంగా ఉండాలి కాని ఎప్పుడూ ఏదో అనారోగ్యంతో బాధపడుతూ ఉండి తను బాధపడుతూ తన చుట్టూ ఉన్నవారిని బాధపెట్టడం తమ లక్ష్యం కాకూడదు. ఈ భావనను అర్థం చేసుకునేవారు ప్రతి ఒక్కరూ ప్రతి నిత్యం యోగాసనాలు వేయవలసిందే.

  • ధన్యవాదములు 

  • మీ నవీన్ నడిమింటి 

  • విశాఖపట్నం 

  • 9703706660

                    *సభ్యులకు విజ్ఞప్తి*
      ***********************************
ఈ వాట్సాప్ గ్రూపులో పెడుతున్న మెసేజ్ లన్నీ సభ్యులలో ఆరోగ్యం పట్ల ప్రాధమిక అవగాహన కోసమే అని గమనించాలి. వివిధ జబ్బులగురించి నివారణలు సూచనలు కూడా సభ్యులలో అవగాహన పెంచడానికి మాత్రమే ..మీ డాక్టరు కి ఇది ప్రత్యామ్నాయము కాదు. సభ్యులు గమనించాలి.

11, జులై 2020, శనివారం

తెల్ల రక్తకణాలు పెరగాలి అంటే తీసుకోవాలిసిన జాగ్రత్తలు


దీర్ఘకాలిక తెల్లరక్తకణాల లుకేమియా (Chronic Lymphocytic Leukemia-CLL) అనేది శరీరంలోని ఓ రకం తెల్లరక్త కణాలకు దాపురించే ఒక క్యాన్సర్ రకం. ఎముకమజ్జలో (inside bone marrow) ఉంటూనే తెల్లరక్తకణాలు ఈ రుగ్మతను కలుగజేస్తాయి. వయోజనులు లేదా పెద్దవాళ్ళలో చాలా ఎక్కువగా కనిపించే పాండురోగం రకం ఇది. దీర్ఘకాలిక తెల్లరక్తకణాల పాండురోగంలో రెండు రకాలున్నాయి:

  • ఓ రకం CLL వ్యాధి నెమ్మదిగా పెరుగుతున్నందున కనిపించడానికి ఎక్కువ సమయం పడుతుంది.
  • మరో రకం CLL వ్యాధి మరింత తీవ్రమైన రూపం, ఇది వేగంగా పెరుగుతుంది.

ఈ రుగ్మత పశ్చిమదేశాల్లో (25% -30%) కనిపిస్తుండగా భారతదేశంలో (1.7% -8.8%)  అసాధారణమైనది.

CLL యొక్క సంభవం సంవత్సరానికి 100,000 మంది పురుషులు మరియు ఆడవారికి 4.7 గా ఉంది.

దీని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

అనేక సందర్భాల్లో, CLL సంవత్సరాల తరబడి ఎలాంటి లక్షణాలను వెల్లడించదు. CLL క్యాన్సర్ వ్యాప్తి చెందిన తర్వాత చాలా కాలం తరువాత వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి, ఇది ముఖ్యంగా శోషరస కణుపులు, కాలేయం మరియు ప్లీహములను బాధిస్తుంది. దీని లక్షణాలు ఇలా ఉంటాయి:

  • మెడ, చంకల్లో, కడుపు లేదా గజ్జల్లో శోషరస కణుపుల నొప్పిలేని వాపు
  • అలసట
  • పక్కటెముకల క్రింద నొప్పి
  • జ్వరం
  • రాత్రి చెమటలు
  • తరచుగా అంటువ్యాధులు
  • వివరించలేని బరువు నష్టం

దీనికి ప్రధాన కారణాలు ఏమిటి?

CLL యొక్క ఖచ్చితమైన కారణం తెలియకపోయినా, రక్త కణాల పెరుగుదల మరియు అభివృద్ధిని నియంత్రించే జన్యువులలో మార్పు (ఉత్పరివర్తన) కారణంగా తలెత్తుతుందని భావించబడుతుంది. ఈ మార్పు కారణంగా కణాలు అసహజమైన, అసమర్థ తెల్లరక్తకణాల (లింఫోసైట్లు) ను ఉత్పత్తి చేస్తాయ్, ఇలా ఉత్పత్తి అయినవి విపరీతంగా పెరిగి రక్తంలోను మరియు కొన్ని ఇతర అవయవాల్లో జమవుతాయి. ఈ కణాలు రక్త కణాల ఉత్పత్తిని కూడా బాధించి నష్టం కలుగ చేస్తాయి.

ప్రమాద కారకాలు:

  • మధ్య వయస్కులు లేదా ఇంకా వయసులో పెద్దయినవారు
  • CLL యొక్క కుటుంబ చరిత్ర లేదా శోషరసగ్రంథుల క్యాన్సర్
  • శ్వేతజాతీయులు, యూదుల (jewish) సంతతికి చెందిన రష్యన్ మరియు తూర్పు యూరోపియన్ ప్రజలు
  • హెర్బిసైడ్లు మరియు క్రిమిసంహారకాలు వంటి కొన్ని రసాయనాలకు గురికావడం

ఈ రుగ్మతను ఎలా నిర్ధారణ చేస్తారు మరియు దీనికి చికిత్స ఏమిటి?

దీర్ఘకాలిక తెల్లరక్తకణాల లుకేమియా (CLL) క్రింది పద్ధతుల ద్వారా రోగ నిర్ధారణ చేయబడుతుంది:

  • శారీరక పరీక్ష మరియు చరిత్ర: మొత్తం ఆరోగ్య తనిఖీ.
  • సంపూర్ణ రక్త గణన (CBC): అన్ని రక్త కణాల పరిమాణం మరియు సంఖ్యను తనిఖీ చేయడానికి.
  • ఇమ్మ్యూనోఫెనోటైపింగ్ (Immunophenotyping) లేదా ఫ్లో సైటోమెట్రీ: తెల్లరక్తకణాల (WBC) రక్షకపదార్థ జనకాల్ని తనిఖీ చేయడం కోసం.
  • సిటు హైబ్రిడైజేషన్ (FISH) లో ఫ్లోరోసెన్స్: జన్యు సమాచారమును అంచనా వేయడానికి.

దీర్ఘకాలిక తెల్లరక్తకణాల లుకేమియా (CLL) తో ఉన్నవారికి ఐదు ప్రామాణిక చికిత్సలు:

  • వ్యాధి ప్రారంభ దశలో రోగి పరిస్థితిని సన్నిహితంగా పర్యవేక్షించండం
  • రేడియేషన్ థెరపీ
  • కీమోథెరపీ
  • ప్లీహము తొలగించడానికి శస్త్రచికిత్స
  • మోనోక్లోనల్ యాంటీబాడీస్తో చేయాలని సంకల్పించిన లక్ష్య చికిత్స
  • ఎముక మజ్జ మార్పిడి

అనుగమనం (Follow Up):

  • వ్యాధిని గుర్తించిన తరువాత, వ్యాధి యొక్క పురోగతిని పర్యవేక్షించడానికి పరీక్షలు అవసరమవుతాయి.
  • చికిత్స వ్యాధిని పూర్తిగా నయం చేయలేకపోవచ్చు, మరియు ఉపశమనకాలం తర్వాత లక్షణాలను అభివృద్ధి చేయవచ్చు.
  • చికిత్సలు కొన్ని వారాలు లేదా నెలలు లేదా కొన్ని సంవత్సరాల వరకూ కూడా  ఉండవచ్చు.
  • తదుపరి వ్యాధి నిర్వహణ మునుపటి చికిత్స ప్రభావం పై  ఆధారపడి ఉంటుంది.

జీవనశైలి (లైఫ్స్టయిల్) సవరింపులు:

  • దూమపానం వదిలేయండి.
  • మంచి పరిశుభ్రతను పాటించడం ద్వారా సంక్రమణ ప్రమాదాన్ని తగ్గించండి.
  • ఆహార మార్పులు. ఆహార నిపుణుడి సహాయంతో మీకు హితకరమైన భోజన ప్రణాళికను సిద్ధం చేయండి.
  • క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి.
  • ఒత్తిడి మరియు అలసటను నిర్వహించండి. ప్రాధాన్యత గల్గిన పనులకు ప్రాధాన్యమివ్వండి, మీ రోజువారీ పనుల్ని చేయడానికి ఇతరులను అనుమతించండి.
  • కుటుంబం, స్నేహితులు మరియు మద్దతు సమూహాల మద్దతును కోరండి.
  • సలహాల సమావేశాలకు వెళ్ళండి.

దీర్ఘకాలిక తెల్లరక్తకణాల లుకేమియా కొరకు మందులు

Medicine NamePack Size
WysoloneWysolone 20 Tablet DT
RedituxReditux 100 Injection 10 Ml
CampathCampath Injection
Loxcip PDLOXCIP PD EYE DROPS 5ML
Gatiquin PGATIQUIN P EYE DROP 5ML
PredzyPredzy 3 Mg/10 Mg Eye Drops
BemustinBemustin 100 Mg Injection
Gatsun PGatsun P 0.3%/1% Drops
BenditBendit 100 Mg Injection
Siogat PSiogat P Eye Drop
BenzzBenzz 100 Injection
Zengat PZengat P Eye Drops
BimodeBimode Injection
Z PredZ Pred Eye Drop
CytomustineCytomustine Injection
Gate PDGate PD Eye Drops
MaxtorinMaxtorin Injection
Gate P PGate P P 3 Mg/10 Mg Eye Drops
MustinMustin 100 Mg Injection


ధన్యవాదములు 

మీ నవీన్ నడిమింటి 

విశాఖపట్నం 

9703706660

అస్వీకార ప్రకటన: ఈ సైటుపై లభ్యమవుతున్న మొత్తం సమాచారము మరియు లేఖనము కేవలం అవగాహనా ఆవశ్యకతల కొరకు మాత్రమే. ఇక్కడ ఇవ్వబడిన సమాచారమును ఏదైనా ఆరోగ్య సంబంధిత సమస్య లేదా అస్వస్థత నుండి కోలుకోవడానికి లేదా స్వస్థత కొరకు నిపుణుల సలహా లేనిదే ఉపయోగించుకోకూడదు. చికిత్స పరీక్షలు మరియు సేవల కొరకు ఎల్లప్పుడూ ఒక అర్హత పొందిన వైద్యుల సలహా తీసుకోవాలి


10, జులై 2020, శుక్రవారం

లో బీపీ ఉన్న వారికీ తీసుకోవాలిసిన జాగ్రత్తలు


లో బీపీ వస్తోందా…ఇవి వాడేయండి !అవగాహనా కోసం నవీన్ నడిమింటి సలహాలు 


tips preventing low bp

రాక్తపోటుని బీపీ అని కూడా అంటారన్న విషయం తెలిసిందే. అయితే దానిని నార్మల్ గా 120/ 80 అని చెబుతారు. అంటే అలా కాకుండా ఇంకా takkuva రీడింగ్ లు వస్తే వారికి లో బీపీ అంటాము.
అందులో మరో మూడు రకాలు ఉన్నాయి.
90 – 60 – బార్డర్ లైన్ లో బ్లడ్ ప్రెజర్ .
60 – 40 – టూ లో బ్లడ్ ప్రెజర్ .
50 – 33 – డేంజర్ బ్లడ్ ప్రెజర్ .
అయితే బీపీ ఎక్కువ అయితే ఎంత డేంజరో…లో బీపీ అంతకన్నా డేంజర్. ఆ లోబీపీతగ్గించుకునేందుకు మీకోసం కొన్ని చిట్కలు

1.పచ్చి బీట్ రూట్ రసం లోబీపీకి మంచి ఔషదంగా చెప్పవచ్చు.

2.బలహీనంగా లేదా మైకంగా అనిపించినపుడు, పాలు కలపని కాఫీ(డికాషన్) తాగండి.


బీపీ నార్మల్ అయ్యే వరకు, ఉప్పు ఎక్కువగా ఉన్న ఆహారాలను
తినండి.

4.రోజు సైక్లింగ్, వాకింగ్ లేదా యోగ వంటి చిన్న చిన్న వ్యాయమలను చేయండి.

5. 30 ఎండుద్రాక్షలను తీసుకొని, గిన్నెలో వేసి, పూర్తి రాత్రి నానబెట్టండి. ఉదయాన, ఖాళీ కడుపుతో వీటిని తినండి. తరువాత ఒక గ్లాసు నీటిని తాగండి. ఇలా వారానికి 2 నుండి 3 సార్లు చేయటం వలన కూడా లోబీపీ నుండి తక్కువ సమయంలో ఉపశమనం పొందుతారు.

6.తులసీ ఆకులను తీసుకొని, సరిగా దంచండి. తరువాత పలుచని గుడ్డ సహాయంతో, ఈ మిశ్రమాన్ని వడపోయండి. ఇలా వడపోసిన మిశ్రమాన్ని, ఒక చెంచా తేనెతో కలిపి, రోజు ఉదయాన ఖాళీ కడుపుతో ఉన్నపుడు తీసుకోండి. తేనె కలపటం వలన దీని ప్రభావం రెట్టింపు అవుతుంది


Low B.P - లో బ్లడ్ ప్రెజర్ :
  • మన రక్తపోటు ఈ క్రింద రీడింగు లలో ఉంటే వారిని.. లో బి.పి. ఉన్న వారిగా అంటాము .
  • 90 - 60 - బార్డర్ లైన్ లో బ్లడ్ ప్రెజర్ .
  • 60 - 40 - టూ లో బ్లడ్ ప్రెజర్ .
  • 50 - 33 - డేంజర్ బ్లడ్ ప్రెజర్ .

లో బ్లడ్ ప్రెజర్ లక్షణాలు
  • చిన్న పనులకే అలసిపోవడం, నీరసంగా ఉండటం, అస్తమానం నిద్ర మత్తులో ఉండటం, చివరిగా బి.పి లో అయితే కోమా లోకి వెళ్ళే ప్రమాదముంది.

కారణాలు : లో బ్లడ్ ప్రజర్ కి 'ఇది' కారణము అని సరిగా చెప్పలేము . ఈ కింది వాటితో సంబంధము(associated) కలిగి ఉండవచ్చును .
  • గర్భము దరించిన వారిలో,
  • హార్మోనుల సమస్యము -- hypothyroidism, diabetes, hypoglycemia.
  • కొన్ని మందులు దుశ్పరిణాము వలన ,
  • హార్ట్ ఫైల్యూర్ ఉన్నవారిలో,
  • కాలేయం వ్యాధులలోను ,

ముఖ్య  కారణాలు :
  • రక్త స్రావము ,
  • శరీరఉష్ణోగ్ర బాగా తగ్గినపుడు (చలవలు కమ్ముట ),
  • శరీర ఉష్ణోగ్ర బాగా పెరిగినపుడు (తీవ్రమైన జ్వరము ),
  • గుండె కండరాల వ్యాధులు (హార్ట్ ఫైల్యూర్ )
  • సెప్సిస్ ( రక్తము అధికము గా ఇన్పెట్క్ అయిపోవడము ),
  • వాంతులు ,విరోచనాలు మూలాన డీహైడ్రేషన్‌ వలన ,
  • కొన్ని మందులు రియాక్షన్‌, ఆల్కహాల్ రియాక్షన్ (మితిమీరిన తాగుడు) ,
  • సివియర్ ఎలర్జిక్ అంటే anaphylaxis shock వలన .
  • శస్త్ర చికిత్స సమయములో మత్తుమందు దుస్పరిణామము వలన ,

చికిత్స : కారణాన్ని బట్టి చికిత్స చేయాలి . లో బి.పి ఉన్న చాలామందికి చికిత్స అవసము ఉండదు. కొద్దిసేపు  విశ్రాంతి తీసుకుంటే సరిపోతుంది. Low Pressure కి మందులు అవసరం ఉండదు .
  • నీరసంగా ఉన్నప్పుడు ... పడుకొని రెస్ట్ తీసుకోవాలి .
  • నీరు , మజ్జిక త్రాగాలి ,
  • అవసరమైతే .. డాక్టర్ సలహాతో సెలైన్ ఎక్కించుకోవాలి .
  • బి .కాంప్లెక్ష్ మాత్రలు వాడితే లోప్రెజర్ అంతగా రాదు .
  • సాదారణము గా మినరల్ వాటర్ , ఎలక్ట్రో లైట్స్ (electrolytes) తీసుకుంటే సర్దుకుంటుంది .

వైద్యులు చేసే ట్రీట్మెంట్ --
  • వాల్యూమ్‌ పునరుజ్జీవనం -Volume resuscitation (usually with crystalloid).
  • రక్తపోటుని పెంచే రసాయనిక పదార్ధములు-Blood pressure support with a vasopressor (all seem to be equivalent).
  • తగినంత కణజాల పెర్ఫ్యూషన్‌-Ensure adequate tissue perfusion (maintain SvO2 >70 with use of blood or dobutamine).
  • అంతర్జీవ సమస్య సరిచేయుట -Address the underlying problem (i.e. antibiotic for infection, stent or CABG (coronary artery bypass graft surgery) for infarction, steroids for adrenal insufficiency, etc...).
  • Medium-term (and less well-demonstrated) treatments of hypotension include:
  • రక్తములో చెక్కెర అదుపు చేయడము -Blood sugar control (80-150 by one study).
  • ప్రారంభ పోషణ -Early nutrition (by mouth or by tube to prevent ileus).
  • స్టిరాయిడ్ మద్దతు -Steroid support.
ధన్యవాదములు 
మీ నవీన్ నడిమింటి 
విశాఖపట్నం 
9703706660

*సభ్యులకు విజ్ఞప్తి*
******************
ఈ వాట్సాప్ గ్రూపులో పెడుతున్న మెసేజ్ లన్నీ సభ్యులలో ఆరోగ్యం పట్ల ప్రాధమిక అవగాహన కోసమే అని గమనించాలి. వివిధ జబ్బులగురించి నివారణలు సూచనలు కూడా సభ్యులలో అవగాహన పెంచడానికి మాత్రమే ..మీ డాక్టరు కి ఇది ప్రత్యామ్నాయము కాదు. సభ్యులు గమనించాలి.

జుట్టు రాలడం సమస్య పరిష్కారం మార్గం


ప్రతి రోజు 100 తంతువుల (వెంట్రుకలు) జుట్టును రాలిపోవడం సాధారణం. జుట్టు యొక్క సహజ జీవిత చక్రం (natural life cycle) దీనికి కారణం. పాత జుట్టు కొత్తదానితో భర్తీ చేయబడుతుంది. కానీ, జుట్టు పలుచబడడం, జుట్టు దువ్విన ప్రతి సారి అధికంగా జుట్టు రాలిపోవడం, బట్టతల వంటి పాచెస్ (ఖాళీలు) ఏర్పడడం వంటి లక్షణాలు గమనించిన్నప్పుడు సమస్య తలెత్తుతుంది. అది ఒక భయానకమైన విషయం, కదా?

జుట్టు రాలడం మహిళల కంటే పురుషులలో ఎక్కువగా కనిపిస్తుంది, వయస్సుతో పాటు దాని తీవ్రత క్రమంగా పెరుగుతుంది. ఇది ఒత్తిడి, ఆకస్మికంగా బరువు తగ్గడం, పోషక లోపాలు, కొన్ని మందుల వలన వస్తుంది. కానీ, ముఖ్యంగా వ్యక్తి  జన్యువుల వల్లన ఇది సంభవిస్తుంది.

కొంత మొత్తంలో జుట్టు రాలడం అనివార్యం, కానీ, తీవ్రమైన జుట్టు నష్టాన్ని నివారించడానికి సులువుగా  అనుసరించగల కొన్ని చిట్కాలు, నివారణలు మరియు చికిత్సలు ఉన్నాయి. కొబ్బరి నూనె మరియు లావెండర్ నూనె వంటి కొన్ని నూనెలు మరియు విటమిన్ ఇ వంటి విటమిన్లు జుట్టు ఆరోగ్యానికి మేలు చేస్తాయని నిరూపించబడ్డాయి మరియు అవి సమర్థవంతమైన జుట్టు రాలడాన్ని తగ్గించే చిట్కాలుగా కూడా పనిచేస్తాయి.

ఈ వ్యాసంలో జుట్టు రాలడాన్ని నివారించగల అనేక ముఖ్యమైన నివారణలు/చిట్కాలు చర్చించబడ్డాయి

మీ జన్యువులు కాకుండా, ఆహార విధానం, పోషకాలు, వ్యాయామం మరియు ఆరోగ్యం మీ జుట్టు రాలడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. జుట్టు పలుచబడడం మరియు జుట్టు రాలడాన్ని నివారించడానికి, మీరు ఈ కారకాల పట్ల జాగ్రత్త వహించవచ్చు. ఈ కింద ఇవ్వబడిన చిట్కాలను అనుసరించడం వలన జుట్టు రాలడాన్ని నివారించడంలో మీకు సహాయపడుతుంది.

పోషక పదార్దాల యొక్క సరైన నిష్పత్తితో సహా సమతుల్య ఆహారం యొక్క ప్రాముఖ్యత అందరికీ తెలుసు. అయితే, కొన్ని విటమిన్లు, ఖనిజాలు మరియు ఇతర పదార్దాలు జుట్టు రాలడాన్ని నివారించడంలో ప్రత్యేక పాత్రను కలిగి ఉంటాయి మరియు వీటిని తగినంతగా తీసుకునేలా చూడాలి

జుట్టు కోసం విటమిన్లు 

విటమిన్ ఇ

విటమిన్ ఇ జుట్టుకు అవసరమైన ముఖ్య పోషకాలలో ఒకటి, ఇది ఆక్సిడేటివ్ ఒత్తిడి వల్ల కలిగే అన్ని రకాల నష్టాల నుండి మన జుట్టును రక్షించడంలో సహాయపడుతుంది. ఆండ్రోజెనిక్ అలోపేసియా కారణంగా బట్టతల రావడానికి ఆక్సీకరణ ఒత్తిడి ఒక కారణమని గుర్తించబడింది, ఇది పురుషులలో ఎక్కువగా కనిపిస్తుంది.

బాదంఆక్రోటుకాయలు మరియు వేరుశెనగ పిక్కలు, పొద్దుతిరుగుడు పువ్వు విత్తనాలు వంటి నట్స్  మరియు పొద్దుతిరుగుడు పువ్వు నూనె, సోయాబీన్ నూనె వంటి కొన్ని కూరగాయల నూనెలు విటమిన్ ఇ యొక్క గొప్ప వనరులు మరియు వీటిని మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చాలి.

యాంటీఆక్సిడెంట్ ఆహారాలు

ఫ్రీ రాడికల్స్‌కు వ్యతిరేకంగా పనిచేసే ఆహార పదార్దాలను యాంటీఆక్సిడెంట్లు అని అంటారు. విటమిన్ ఇ యాంటీయాక్సిడెంట్లలో ఒకటి. అయితే, యాంటీఆక్సిడెంట్ల యొక్క ఇతర ఆహార వనరులలో కమలాపండునిమ్మకివి, సాల్మన్, సీఫుడ్, బ్రోకలీ, ఆకు కూరలు మరియు గ్రీన్ టీ ఉంటాయి.

బయోటిన్

జుట్టు పెరుగుదలలో ముఖ్య పాత్రను పోషించే ఉన్న మరొక విటమిన్ బయోటిన్ లేదా విటమిన్ బి7, దీని లోపం అలోపేసియా అరేటా (అతుకులాతుకులుగా జుట్టు రాలిపోవడం) తో సంబంధం కలిగి ఉంటుంది. దీనిని నివారించడానికి, మీ ఆహారంలో బయోటిన్ యొక్క ఆహార వనరుల పరిమాణాన్ని పెంచడం మంచిది, ఎందుకంటే అలోపేసియా నిర్వహణలో బయోటిన్ సప్లీమెంట్ల చర్య స్పష్టంగా గమనింపబడలేదు. గుడ్డు పచ్చసొన, నట్స్, విత్తనాలు మరియు అవోకాడోలు బయోటిన్ యొక్క గొప్ప వనరులు.

జుట్టు రాలడాన్ని నియంత్రించేందుకు సూక్ష్మపోషకాలు 

సూక్ష్మపోషకాలు (మైక్రోన్యూట్రియెంట్స్) కలిగిన ఖనిజాలు, అంటే అవి శరీరానికి తక్కువ మొత్తంలో అవసరమావుతాయి, మన జుట్టు ఆరోగ్యాన్ని నియంత్రించడంలో కూడా ఇవి ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి.

ఐరన్

ఐరన్ అటువంటి ఖనిజాలలో ఒకటి, దీని లోపం ఐరన్ లోపం రక్తహీనత (iron deficiency anaemia) కు కారణమవుతుంది. జుట్టు రాలడం దీనికి ఒక సాధారణ లక్షణం, కాబట్టి, ఐరన్ అధికంగా ఉండే ఆహార వనరులను తీసుకోవడం చాలా ఉపయోగపడుతుంది.

రక్తహీనత మరియు జుట్టు రాలడానికి కారణమయ్యే ఇనుము లోపం నివారించడానికి సన్నని మాంసం, పప్పుధాన్యాలు, కాయలు, తృణధాన్యాలు మరియు పచ్చి ఆకు కూరలు వంటి ఆహారాన్ని చేర్చాలని సిఫార్సు చేయబడింది.

నిమ్మ, జామ, కివి, బంగాళాదుంపటమటా వంటి విటమిన్ సి అధికంగా ఉండే ఆహార పదార్థాల వినియోగాన్ని కూడా పెంచాలని సలహా ఇవ్వబడుతుంది. శరీరంలో నాన్ హిమ్ ఐరన్ (non-haem iron) ను పీల్చుకోవడంలో/గ్రహించుకోవడంలో విటమిన్ సి సహాయపడుతుంది.

సెలీనియం మరియు జింక్

మీ జుట్టు ఆరోగ్యానికి ఇతర ముఖ్యమైన ఖనిజాలు సెలీనియం మరియు జింక్. మీ జుట్టును ఆక్సీకరణ నష్టం నుండి రక్షించడం ద్వారా సెలీనియం పనిచేస్తుంది, మరియు దాని లోపం తక్కువ జుట్టు పెరుగుదలతో ముడిపడి ఉంటుంది. సీఫుడ్, పౌల్ట్రీ, గుడ్లు మరియు చిక్కుళ్ళు సెలీనియం యొక్క గొప్ప వనరులు.

జింక్, ప్రోటీన్ సంశ్లేషణ (synthesis)లో సహాయపడుతుంది మరియు తద్వారా, జుట్టు ఫోలికల్ ఏర్పడటాన్ని నిర్వహిస్తుంది (జుట్టు కెరాటిన్ అనే ప్రోటీన్‌తో తయారవుతుంది). జింక్ లోపం సాధారణంగా అనేక రకాల అలోపేసియా మరియు బట్టతల సమస్యలలో కనిపిస్తుంది. ఈ లోపం జుట్టును పెళుసుగా చేస్తుంది, దీనివల్ల జుట్టు దెబ్బతినడం, రాలిపోవడం మరియు చిట్లడం వంటి అవకాశాలు పెరుగుతాయి.

దీనిని నివారించడానికి, ఓయిస్టర్లు, బీన్స్, కాలేయం, పాలు మరియు పాల ఉత్పత్తులను మీ ఆహారంలో చేర్చాలి.

నియాసిన్

నియాసిన్ మరొక సూక్ష్మపోషకం, దీని లోపం అలోపేసియాతో సంబంధం కలిగి ఉంటుంది. మాంసం, కాలేయం, సాల్మన్, ట్యూనా, ట్రౌట్ మరియు సార్డైన్ వంటి కొన్ని రకాల చేపలు నియాసిన్ యొక్క ఆహార వనరులు, వీటిని మీ ఆహారంలో చేర్చవచ్చు.

జుట్టు రాలడాన్ని నియంత్రిచే ఆహారాలు 

ప్రోటీన్లు 

సూక్ష్మపోషకాలు కాకుండా, తీవ్రమైన జుట్టు రాలడాన్ని నివారించడంలో ప్రోటీన్లు చాలా ముఖ్య పాత్రను కలిగి ఉంటాయి, కొత్త జుట్టు ఫోలికల్స్ యొక్క సింథసిస్ లో ఇవి  పాల్గొంటాయి, ఇది పాత వెంట్రుకలను భర్తీ చేస్తుంది. ప్రోటీన్ల ఆహార వనరులు లీన్ మీట్, లీన్ చికెన్, పాలు, గుడ్లు, పప్పుధాన్యాలు మరియు సోయా ఉత్పత్తులు.

ఫ్యాటీ యాసిడ్లు (కొవ్వు ఆమ్లాలు) 

ఫ్యాటీ యాసిడ్లు, ముఖ్యంగా ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు కూడా జుట్టు రాలడాన్ని నివారించడానికి అవసరం. ఫోలికల్ వ్యాప్తికి సహాయపడటం ద్వారా ఇవి జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. వీటి లోపం వలన స్కాల్ప్ జుట్టును కోల్పోతుంది.

కాబట్టి, ఆక్రోటుకాయలు, సోయాబీన్, సాల్మన్, అవిసె గింజలు మరియు గుడ్లు వంటి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవడమనేది ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది కాక, సాఫ్ ఫ్లవర్ (safflower) నూనె వంటి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు అధికంగా ఉండే నూనెల యొక్క సమయోచిత పూత (తలకు రాసుకోవడం) కూడా జుట్టు పెరుగుదలకు దారితీస్తుంది. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లను ఈ రెండు రూపాల్లోనూ ఉపయోగించవచ్చు.

జుట్టు రాలడానికి ప్రధాన కారణాలలో ఒత్తిడి ఒకటి. తీవ్రమైన ఒత్తిడి వలన నెత్తిమీద జుట్టు సగం నుండి మూడు వంతులు రాలిపోవచ్చు. సాధారణంగా, ఇది అధిక ఒత్తిడి ఉన్న సమయాలలో సంభవిస్తుంది మరియు దీనిని నియంత్రిచవచ్చు. ఏదేమైనా, దీర్ఘకాలిక ఒత్తిడి మరియు ఆందోళన జుట్టు పలుచబడడానికి దారితీస్తుంది, ఇది తల దువ్విన ప్రతిసారీ జుట్టు గుత్తులు గుత్తులుగా రాలిపోవడం ద్వారా గమనింపబడుతుంది.

ఒత్తిడి తగ్గించడం ద్వారా దీనిని నిర్వహించవచ్చు, దీనిని యోగా, ధ్యానం, విశ్రాంతి లేదా శ్వాస ప్రక్రియల ద్వారా సాధించవచ్చు. వ్యాయామం ఎండార్ఫిన్‌ల స్థాయిని పెంచుతుంది లేదా వీటిని ‘ఫీల్ గుడ్ ’ హార్మోన్లని కూడా అంటారు, ఇది ఒత్తిడిని ఎదుర్కోవడానికి సహాయపడుతుంది. మీకు  జిమ్ లో చేరాలని లేదా యోగా ని ఎంచుకోవాలని అనిపించకపొతే, నడక, సైక్లింగ్ లేదా జాగింగ్ వంటి సాధారణ చర్యలు కూడా ఒత్తిడిని తొలగించడంలో సహాయపడతాయి.

పైన ఉన్న చిట్కాలు మాత్రమే కాక, కొన్ని ప్రత్యేక గృహ చిట్కాలు కూడా జుట్టు రాలడాన్ని నివారించడంలో మరియు నిర్వహించడంలో సహాయం చేస్తాయి. వీటిలో కొన్ని నూనెలు మరియు ఇంట్లో తయారు చేసుకుని  తలకు పట్టించే కొన్ని మిశ్రమాలు ఉంటాయి అవి ఈ విభాగంలో చర్చించబడ్డాయి

జుట్టుకు కొబ్బరి నూనె 

కొన్ని నూనెలు, ముఖ్యంగా కొబ్బరి నూనె జుట్టుపై లోతైన ప్రయోజనాలను కలిగి ఉంటుంది మరియు జుట్టు రాలడాన్ని నివారించడంలో సహాయపడుతుంది. కొబ్బరి నూనె జుట్టు రాలడానికి కారణమయ్యే ప్రోటీన్ నష్టాన్ని గణనీయంగా తగ్గించిందని పరిశోధన ఫలితాలు రుజువు చేశాయి. తల స్నానానికి ముందు మరియు తరువాత కొబ్బరి నూనెను ఉపయోగించినప్పుడు, అది ఇతర నూనెలతో పోలిస్తే గణనీయమైన ప్రభావాన్ని చూపిందని తెలిసింది.

పరమాణు బరువు (మొలిక్యూలర్ వెయిట్) తక్కువగా ఉండడం వలన, కొబ్బరి నూనె వెంట్రుకల షాఫ్ట్ (కాండంలోకి) లోపలికి సులభంగా చొచ్చుకుపోతుంది, తద్వారా వెంట్రుకకు బలాన్ని ఇస్తుంది మరియు అది రాలిపోయే అవకాశాన్ని తగ్గిస్తుంది. కొబ్బరి నూనె దెబ్బతిన్న జుట్టు మరియు దెబ్బతినని జుట్టు రెండింటి మీద సమర్థవంతంగా పనిచేస్తుంది. కాబట్టి, దీనిని చికిత్సగా మరియు నివారణ చర్యగా కూడా ఉపయోగించవచ్చు. మీ జుట్టుకు కొబ్బరి నూనెను ఎలా ఉపయోగించవచ్చో ఇక్కడ ఉంది.

  • మీ జుట్టు పొడవును బట్టి 1 నుండి 2 టీస్పూన్ల కొబ్బరి నూనె తీసుకోండి
  • దానిని కొంచెం వేడి చేయండి 
  • మీ జుట్టు కుదుళ్ళలో రాయండి మరియు నెత్తిని సున్నితంగా మసాజ్ (మర్దన) చేయండి
  • అలా ఒక అరగంట లేదా ఒక రాత్రంతా వదిలివేయవచ్చు
  • నూనె రాసిన జుట్టుతో బయటకు వెళ్లడం సిఫారసు చేయబడదు ఎందుకంటే ఇది ధూళి మరియు దుమ్ము తలలో చిక్కుకుపోయెలా చేస్తుంది మరియు నష్టం కలిగిస్తుంది
  • మీరు బయటకు వెళ్ళవలసి వస్తే, నష్టాన్ని నివారించడానికి మీ తలను కప్పుకోవాలని  సిఫార్సు చేయబడుతుంది

ఉత్తమ ఫలితాల కోసం రోజు విడిచి రోజును ఉపయోగించవచ్చు.

జుట్టు పెరుగుదలకు పిప్పరమెంటు నూనె - Peppermint oil

పిప్పరమింట్ నూనె మెంథా పైపరిటా అనే మొక్క నుండి వస్తుంది మరియు దీనికి జుట్టు రాలడాన్ని నిరోధించే లక్షణాలను ఉంటాయి. పిప్పరమింట్ నూనె శక్తివంతమైన హెయిర్ రిగ్రోత్ ఏజెంట్ (జుట్టు తిరిగి పెరిగేలా చేసే ఏజెంట్) అని 2014 లో ఒక అధ్యయనం నిరూపించింది. ఇది జుట్టు ఫోలికల్స్ సంఖ్యను మరియు నెత్తి మీద వాటి లోతును పెంచుతుంది, అదే సమయంలో వాటి మందాన్ని కూడా పెంచుతుంది. జుట్టుకు పిప్పరమెంటు నూనెను ఎలా ఉపయోగించాలో ఇక్కడ ఉంది.

  • కొన్ని చుక్కల పిప్పరమెంటు నూనె తీసుకొని కొంచెం సహజ నూనెతో కలపండి 
  • షాంపూతో శుభ్రం చేసే ముందు నెత్తిమీద బాగా మసాజ్ చేసి అరగంట పాటు అలానే ఉంచండి
  • ప్రత్యామ్నాయంగా, మీరు ఈ నూనె కొన్ని చుక్కలను షాంపూ మరియు కండీషనర్‌లో కలిపి  మాములుగా తలస్నానం చేయవచ్చు

జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడానికి లావెండర్ నూనె 

జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడంలో లావెండర్ నూనె సామర్థ్యాన్ని ఒక తాజా అధ్యయనం ధ్రువీకరించింది. లావెండర్ నూనె యొక్క సమయోచిత పూత జుట్టు ఫాలికిల్స్ సంఖ్య మరియు దాని లోతు పెరగడానికి సహాయపడుతుంది. ఇది జుట్టు రాలడాన్ని నివారించడానికి కూడా పని చేస్తుంది. ఈ ప్రయోజనాల కోసం లావెండర్ నూనెను ఉపయోగించడానికి, మీరు ఇలా చేయవచ్చు:

  • ఒక టీస్పూన్ లావెండర్ నూనెను తీసుకొని రెండు టీస్పూన్ల కొబ్బరి నూనెతో కలపండి
  • మీ వేళ్లతో నెత్తి మీద బాగా మసాజ్ చేసి ఒక రాత్రంతా వదిలివేయండి
  • ఉదయం తలస్నానం చేయండి, ఉత్తమ ఫలితాల కోసం వారానికి రెండుసార్లు దీనిని చేయండి.

పురుషులలో జుట్టు పెరుగుదలకు గుమ్మడి విత్తనాల నూనె 

గుమ్మడి విత్తనాల నూనెకు జుట్టు పెరుగుదలను మెరుగుపర్చడంలో గణనీయమైన సామర్థ్యం ఉంటుంది, అలోపేసియా రోగులలో నిర్వహించిన ఇటీవలి అధ్యయనం ద్వారా ఇది నిర్ధారించబడింది. ప్లేసిబో (చికిత్సా సామర్థ్యం లేని ఏజెంట్లు) ఇచ్చిన వారితోతో పోల్చినప్పుడు, గుమ్మడి విత్తన నూనెతో చికిత్స ఇచ్చిన బృందంలో వారి మొత్తం జుట్టు పరిమాణం పెరిగిందని చికిత్స ముందు తీసిన ఛాయాచిత్రాల (ఫొటోల) ద్వారా తేలింది. దాని ప్రయోజనాలను పొందటానికి గుమ్మడి విత్తనాల నూనెను ఈ కింది విధంగా ఉపయోగించవచ్చు:

  • ఒక కప్పు గ్రీన్ టీ తయారు చేసి, దానికి ఒక అర టీస్పూన్ గుమ్మడికాయ సీడ్ ఆయిల్ జోడించండి
  • ఒకసారి జుట్టును శుభ్రం చేసి, వెంటనే ఈ ద్రావణాన్ని తలకు పట్టించండి
  • 5 నిమిషాలు అలాగే ఉంచి తరువాత నీటితో కడగాలి

జుట్టు నష్టం చికిత్స కోసం అరోమాథెరపీ 

అరోమాథెరపీలో థైమ్ (ఒక విధమైన వామకు మొక్క) , లావెండర్, రోజ్మేరీ మరియు దేవదారు చెక్క (సెడార్వుడ్) నూనెల వంటి అనేక అరోమాటిక్  నూనెలు ఉంటాయి, ఇవి మన ఆరోగ్యంతో సహా జుట్టు పై కూడా అనేక ప్రయోజనాలను కలిగి ఉంటాయి.

ఈ నూనెల పై పరిశోధనలు వాటి యొక్క యాంటీహెయిర్ ఫాల్ ప్రభావాలను ధ్రువీకరించాయి. ఇతర నూనెలతో పోల్చితే, జోజోబా మరియు గ్రేప్‌సీడ్ వంటి క్యారియర్ నూనెలతో కలిపి ఈ ఎస్సెంషియాల్ నూనెలను ఉపయోగించినప్పుడు అలోపేసియా అరేటా చికిత్సలో మరింత ప్రభావవంతంగా ఉన్నాయని తెలిసింది. ఈ నూనెల యొక్క ప్రయోజనాలను పొందటానికి, ఈ కింది దశలను అనుసరించండి:

  • ఒక సగం టీస్పూన్ లావెండర్ మరియు రోజ్మేరీ నూనెలను తీసుకోండి మరియు దీనికి రెండు చుక్కల థైమ్ మరియు దేవదారు చెక్క (సెడార్వుడ్) నూనెలతో కలపండి
  • వాటిని 6 చుక్కల గ్రేప్‌సీడ్, 4 చుక్కల జోజోబా నూనెలతో కలపండి
  • ఈ మిశ్రమాన్ని నెత్తికి పట్టించి ఒక 5 నుండి 10 నిమిషాలు మసాజ్ చేయండి
  • తరువాత, స్టీమ్ చేసిన టవల్ ను తలకు చుట్టి ఒక రాత్రంతా అలా ఉంచండి
  • మరుసటి రోజు ఉదయం తలస్నానం చేయండి

ఉత్తమ ప్రయోజనాల కోసం ఈ చికిత్స 6 నెలలు చేయవచ్చు.

జుట్టు రాలడాన్ని నియంత్రించడం కోసం  నిమ్మకాయ 

నిమ్మకాయ అనేది సాధారణంగా ఉపయోగించే ఇంటి చిట్కాలలో ఒకటి. ఇది ఒక బలమైన యాంటీఆక్సిడెంట్ కావడం వల్ల స్కాల్ప్ (నెత్తి) మీద నుండి జుట్టు రాలడానికి కారణమయ్యే ఆక్సీకరణ నష్టాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. నిమ్మ హెయిర్ వాష్ చేయడానికి మీరు ఈ కింది దశలను అనుసరించవచ్చు:

  • 1 టేబుల్ స్పూన్ నిమ్మరసంలో  3 టేబుల్ స్పూన్ల కలబంద రసాన్ని కలపండి
  • ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి ఒక 5 నిమిషాలు మసాజ్ చేసి అరగంట తరువాత కడగాలి

జుట్టు తిరిగి పెరగడానికి ఉల్లిపాయ 

ఉల్లిపాయ కూడా మరోక సాధారణ ఇంటి చిట్కా, జుట్టు తిరిగి పెరిగేలా చెయ్యడంలో ఉల్లిపాయ రసం యొక్క ప్రభావాలు క్లినికల్ అధ్యయనం ద్వారా నిరూపించబడ్డాయి.  ఈ అధ్యయనం సాధారణ నీటితో ఉల్లిపాయ రసాన్ని పోల్చి చేయబడింది. అలోపేసియాతో బాధపడుతున్న రోగులలో జుట్టు పెరుగుదలకు ఉల్లిపాయ ఉపయోగపడుతుందని ఫలితాలు వెల్లడించాయి. ఉల్లిపాయ రసం ఉపయోగించడానికి, మీరు వీటిని పాటించవచ్చు:

  • ఒక టేబుల్ స్పూన్ ఉల్లిపాయ రసం తీసుకొని ఒక కాటన్ బాల్ ను దానిలో ముంచండి 
  • ఈ కాటన్ బాల్ సహాయంతో మీ తల అంతా ఈ రసాన్ని రాయండి
  • వేళ్ళతో మసాజ్ చేయండి
  • సుమారు గంటసేపు అలా వదిలి వేసి, తరువాత కడగాలి

రోజు విడిచి రోజు ఈ చిట్కాని పాటించవచ్చు. 

జుట్టు రాలడాన్ని నియంత్రించడం కోసం మందార 

మందార సాధారణంగా అందుబాటులో ఉండే మొక్క మరియు ఇది జుట్టు రాలడాన్ని నివారించడానికి మరియు నియంత్రించడానికి ఒక అద్భుతమైన చిట్కా. జుట్టు కోసం మందారను రెండు విధాలుగా ఉపయోగించవచ్చు, అవి:

మందార నూనె

  • 8 నుండి 10 మందార ఆకులను తీసుకోండి 
  • ఈ ఆకులను నూరి 1 కప్పు వేడిచేసిన కొబ్బరి నూనెలో కలపండి
  • అది చల్లారిన తరువాత, ఈ నూనెను మీ తలకు పట్టించి ఒక రాత్రంతా అలా వదిలివేయండి
  • మరుసటి రోజు యథావిధిగా తలస్నానం చేయండి

మందార హెయిర్ మాస్క్

  • కొన్ని మందార ఆకులను పేస్ట్‌ చేయండి 
  • దీనికి 4 టేబుల్ స్పూన్ల పెరుగు కలపండి
  • దీనిని మీ తలకు పట్టించి 
  • ఒక గంట ఉంచండి 
  • తేలికపాటి గాఢత కలిగిన షాంపూతో తలస్నానం చేయండి 

మీరు ఈ సుదీర్ఘ ప్రక్రియను పాటించలేకపోతే మందార నూనె కూడా వాణిజ్యపరంగా లభిస్తుంది మరియు అది ఉపయోగించడానికి సులువుగా 

ధన్యవాదములు 

మీ నవీన్ నడిమింటి 

విశాఖపట్నం 

9703706660

అస్వీకార ప్రకటన: ఈ సైటుపై లభ్యమవుతున్న మొత్తం సమాచారము మరియు లేఖనము కేవలం అవగాహనా ఆవశ్యకతల కొరకు మాత్రమే. ఇక్కడ ఇవ్వబడిన సమాచారమును ఏదైనా ఆరోగ్య సంబంధిత సమస్య లేదా అస్వస్థత నుండి కోలుకోవడానికి లేదా స్వస్థత కొరకు నిపుణుల సలహా లేనిదే ఉపయోగించుకోకూడదు. చికిత్స పరీక్షలు మరియు సేవల కొరకు ఎల్లప్పుడూ ఒక అర్హత పొందిన వైద్యుల సలహా తీసుకోవాలి.