6, సెప్టెంబర్ 2020, ఆదివారం

ఆస్తమా సమస్య నివారణకు పరిష్కారం మార్గం ఈ లింక్స్ లో చూడాలి




ఊపిరితిత్తుల వ్యాధి అంటే ఏమిటి?

ఊపిరితిత్తుల పనితీరుకు అడ్డు తగిలే ఏదైనా రుగ్మత లేదా సమస్యనే “ఊపిరితిత్తుల వ్యాధి”గా సూచిస్తారు. ఊపిరితిత్తుల వ్యాధులు శ్వాసనాళాలు (airways), ఊపిరి తిత్తులు,  ఊపిరితిత్తుల మధ్య ఉండే పొరలు లేక అస్తిరులు,  ఊపిరితిత్తిపై నుండే పొర (pleura), ఛాతీ గోడ మరియు ఊపిరితిత్తుల రక్త నాళాలను బాధిస్తాయి. అత్యంత సాధారణ ఊపిరితిత్తుల వ్యాధులు ఏవంటే ఆస్తమాక్షయ వ్యాధిబ్రాంకైటిస్, ముదిరిన ఊపిరితిత్తుల వ్యాధి (క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్), న్యుమోనియాపల్మొనరీ ఫైబ్రోసిస్, పల్మనరీ ఎడెమా, ఊపిరితిత్తుల ధమనుల్లో నిరోధం (blocked artery of lungs),  ఊపిరితిత్తుల క్యాన్సర్.

దీని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

ఊపిరితిత్తులకు సంబంధించిన అతి తేలికైన లక్షణాల పట్ల కూడా దృష్టి పెట్టడం చాలా ముఖ్యం. కింద పేర్కొన్నవి ఊపిరితిత్తుల వ్యాధి యొక్క హెచ్చరిక సంకేతాలు:

దీనికి ప్రధాన కారణాలు ఏమిటి?

వివిధ ఊపిరితిత్తుల వ్యాధులకు వివిధ కారణాలు ఉన్నాయి. అవి క్రింది విధంగా ఉన్నాయి:

  • బాక్టీరియల్వైరల్ లేదా ఫంగల్ అంటువ్యాధులు .
  • వాయు కాలుష్యం.
  • ధూమపానం లేదా పొగకు బహిర్గతంగా గురి కావడం
  • దుమ్ము మరియు పుప్పొడి వంటి అలెర్జీ కారకాలు.
  • రోగనిరోధక (ఆటో ఇమ్యూన్) వ్యాధులున్న కుటుంబ చరిత్ర.
  • వృత్తిపరంగా రసాయనిక పొగలకు లేదా రాతినార (ఆస్బెస్టాస్) వంటి మంట పుట్టించే పదార్థాలకు బహిర్గతం కావడం.
  • పుట్టుకతో వచ్చే గుండె వ్యాధి లేదా జన్యు పరివర్తన.
  • ఊపిరితిత్తుల క్యాన్సర్ యొక్క కుటుంబ చరిత్ర.
  • శరీరం యొక్క ఇతర భాగాలలో క్యాన్సర్ ఉండుట.
  • బలహీన రోగనిరోధక వ్యవస్థ.

దీనిని ఎలా నిర్ధారణ చేస్తారు మరియు దీనికి చికిత్స ఏమిటి?

ఊపిరితిత్తుల వ్యాధి నిర్ధారణ వ్యాధి యొక్క అంతర్లీన కారణం కనుక్కోవడానికి వ్యక్తి యొక్క వివరణాత్మక వైద్య మరియు కుటుంబ చరిత్రతో ప్రారంభమవుతుంది. దీని తరువాత కింద పేర్కొన్న వ్యాధి నిర్ధారణ (డయాగ్నొస్టిక్) పరీక్షలు జరుగుతాయి:

  • ఛాతీ పరీక్ష.
  • శ్లేష్మం పరీక్ష (కఫము పరీక్ష) .
  • ప్రోటీన్లు, ప్రతిరక్షకాలు మరియు స్వీయ రోగనిరోధక వ్యాధుల గుర్తుల్ని గుర్తించడం కోసం రక్త పరిశోధన.
  • X- రే, CT స్కాన్ మరియు ఛాతీ MRI ల ద్వారా ఊపిరితిత్తుల ఇమేజింగ్.
  • ECG.
  • బ్రాంఖోస్కోపీ (Bronchoscopy.
  • ఊపిరితిత్తుల పనితీరు పరీక్షలైన స్పిరోమెట్రీ మరియు పల్స్ ఆక్సిమెట్రి వంటి పరీక్షలు.
  • కణజాల బయాప్సీ లేదా శ్వాసకోశ లావజ్ (ఊపిరి తిత్తులను శుభ్రపరిచే ఓ రకమైన ప్రక్రియ) పరీక్ష.

మీ ఛాతీ స్పెషలిస్ట్ (chest specialist) మీరు కలిగి ఉన్న ఊపిరితిత్తుల వ్యాధి రకాన్ని బట్టి చికిత్సను నిర్ణయిస్తారు. చికిత్స పద్ధతులు క్రింది విధంగా ఉంటాయి:

  • మందులు:
    • అంటువ్యాధులు లేదా సంక్రమణ వ్యాధుల చికిత్సకు యాంటిబయోటిక్స్, యాంటీ వైరల్ మరియు యాంటి ఫంగల్ మందులు మరియు యాంటీపైరెక్టిక్స్ (జ్వరానికిచ్చే మందులు).
    • ఊపిరితిత్తులలో మంట, వాపు (పల్మోనరీ మంట) నియంత్రణకు మంటనివారణా మందులు (యాంటీఇన్ఫ్లమేటరీ డ్రగ్స్).
    • ఉబ్బసం వ్యాధికి కార్టికోస్టెరాయిడ్స్ మందుల్ని పీల్చదగినవిగా, శరీరంలోనికి సిరంజి ద్వారా ఇచ్చే ఇన్ఫ్యూషన్ మందులు మరియు లేదా నోటిద్వారా కడుపుకిచ్చే మందులు.
    • క్షయవ్యాధి చికిత్సకు యాంటిటుబెర్క్యులర్ మందులు.
    • ఊపిరితిత్తులలో ఫైబ్రోసిస్ వ్యాధిని తగ్గించడానికి యాంటీ ఫైబ్రోటిక్ మందులు.
    • ఊపిరితిత్తుల వ్యాధికి కారణమయ్యే ఆమ్లత (యాసిడ్ రిఫ్లక్స్) ను నియంత్రించడానికి ‘H2-రిసెప్టర్ అంతగానిస్ట్’ ను తీసుకోవడం.
  • శ్వాసప్రక్రియను సులభతరం చేసుకునేందుకు ఆక్సిజన్ థెరపీ.
  • ఊపిరితిత్తుల పునరావాసం.
  • ఊపిరితిత్తులకు దెబ్బ తగిలిన తీవ్రమైన సందర్భాలలో ఊపిరితిత్తుల మార్పిడి శస్త్రచికిత్స (lung tranplant surgery)

పొగ మరియు కాలుష్యాన్ని మనం మింగకుండా నివారించడానికి రక్షణ ముసుగులు ఉపయోగించడం, ధూమపానం మానివేయడం, సాధారణ యోగా మరియు ప్రాణాయామ (శ్వాస వ్యాయామాలు) ను సాధన చేయడం వంటి చర్యలు ఊపిరితిత్తుల సమస్యలను నివారించడానికి సహాయం చేస్తాయి. ఊపిరితిత్తుల వ్యాధిని నియంత్రించడానికి మరియు నయం చేసుకోవడానికి మీ ప్రత్యేక వైద్యుడి సహాయంతో క్రమమైన మందులు, క్రమంగా  ఎప్పటికప్పుడు వైద్య ,సంప్రదింపులు, సలహాలు మరియు అనుసరణలు తీసుకోవడం

ఆస్తమా ,ఉబ్బసము  ఆయుర్వేదం లో నవీన్ సలహాలు 

 ఆస్తమా, క్షయ నివారణకు ---అల్లం పాకం  

      శ్వాస కోశ సంబంధ,ఉదర సంబంధ వ్యాధులు,అగ్ని మాంద్యము,ఆకలి లేకపోవడం,పిల్లి కూతలు,గొంతులో కఫం,శ్వాస ఆడక పోవడం, చాలా కాలంగా ముదిరిపోయిన పడిశం,ఎడతెరిపి లేకుండా వచ్చే దగ్గు,ఆయాసము మొదలైనవి నివారింప బడతాయి,పైత్య రోగాలు కూడా నివారింప బడతాయి.
 
            అల్లం రసం                     ------- 400 gr
           పాత బెల్లం                    --------   70 gr
          మెంతి పొడి                    -------     5 gr
          దాల్చిన చెక్క పొడి        -------      5  gr
          శొంటి పొడి                   -------      5  gr
            దో.వే. పిప్పళ్ళ పొడి      --------     5 gr
           మిరియాల పొడి            -------     5 gr
          యాలకుల పొడి            -------     5 gr
         లవంగాల పొడి              -------     5 gr
        నాగాకేసరాల పొడి         -------     5 gr
       బిర్యాని ఆకు పొడి        --------    5 gr

             బాణలి స్టవ్ మీద పెట్టి అల్లం రాసంపోయ్యాలి. బెల్లాన్ని మెత్తగా చేసి వెయ్యాలి.లేత పాకం వచ్చే  వరకు 
మరిగించాలి.ముందే చూర్ణాలన్ని కలిపి పెట్టుకోవాలి.పాకం   రాగానే కలిపిన పొడులన్నీ దానిలో కొద్ది కొద్దిగా వేస్తూ కలపాలి.
            ఆహారానికి ముందు అరగంట గాని, గంటగాని పెద్దలకు 10 గ్రాములు,చిన్న పిల్లలకు 5 గ్రాములు,ఇంకా చిన్న పిల్లలకు చాలా కొద్దిగా మూడు పూటలా వాడాలి.40 నుండి 60 రోజులలో తగ్గుతుంది.

         ఉబ్బసం, దగ్గు,ఆయాసం, ముక్కునుండి నీరు కారడం --నివారణ              
 
                        పరాశర భస్మం
 
       అరటి ఆకును చిన్న చిన్న ముక్కలుగా తుంచాలి.కాడలు,పీచులు లేకుండా చేసి బాణలిలో వేసి చిన్న మంట మీద నిదానంగా అట్లకాడ తో తిప్పాలి.ఆకు కాలిపోయి నెమ్మదిగా నల్లని బూడిద మాత్రమే మిగులుతుంది
ఆ పొడిని జల్లించుకొని గాజు సీసాలో భద్ర పరచుకోవాలి.
 
       3 గ్రాముల చిన్న పాత బెల్లం ముక్కను తీసుకొని ఒక  చిన్న గిన్నెలో వేసి ఒక టీ స్పూను నీళ్ళు పోయాలి  స్టవ్ మీద పెట్టి కరిగించాలి. ఆ పానకంలో ఒకటి లేక రెండు టీ స్పూన్ల పొడిని వేసి కలపాలి. ఈ విధంగా రోజుకు  ఒక సారి మాత్రమేపరగడుపున తీసుకోవాలి. ఇది శరీరం లోని కఫాన్ని తొలగిస్తుంది.
 
యోగాభ్యాసం :--    చేతిని పూర్తిగా ముందుకు చాపాలి.  V  గుర్తుతో చూపుడువేలు,మధ్య వేలు పైకి పెట్టి మరొక  చేతితో ఆ వెళ్ళాను బాగా నొక్కాలి.అదే విధంగా రెండవ వైపు కూడా చెయ్యాలి.తరువాత రెండు వ్హేతులను చాపి వేళ్ళను  కలిపి ఎడమ చేతి బొటన వ్రేలును మాత్రం పైకి లేపాలి. ఈ విధంగా 30 నిమిషాల సేపు ఉదయం,సాయంత్రం అభ్యాసం చెయ్యాలి.

                ఉబ్బసం, ఆయాసం --నివారణ                         
 
        ఉబ్బసం, ఆయాసం తీవ్రంగా వుండి,ఊపిరాడకుండా వున్నపుడు ఎగ శ్వాస వస్తున్నపుడు ఈ క్రింది విధంగా చెయ్యాలి.
        ఒక బకెట్లో గోరువెచ్చని నీళ్ళు, మరొక బకెట్ లో చల్లని నీళ్ళు తీసుకోవాలి. కుర్చీ లో కూర్చొని గోరువెచ్చని  నీళ్ళలో కాళ్ళు పెట్టాలి. తరువాత ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్ళు తాగాలి.ఒక గుడ్డను చల్లటి నీటిలో ముంచి  పిండి గుడ్డను తల మీద వేసుకోవాలిబెడ్ షీట్  కప్పుకోవాలి. ఈ విధంగా 15,20 నిమిషాలు  ఉంచాలి. తరువాత చన్నీళ్ళలో రెండు నిమిషాలు కాళ్ళు పెట్టాలి. దీని వలన వ్యాధి యొక్క తీవ్రత తగ్గుతుంది.
 
ప్రాణాయామం:--
 
1. సూర్యభేదన ప్రాణాయామం :-- నిటారుగా కూర్చొని కుడి చేతి బొటన వ్రేలు తో కుడి ముక్కుపైన పెట్టాలి. కుడి ముక్కు మూసి ఎడమ ముక్కుతో గాలి పీల్చాలి. ఎడమ(సూర్య), వేడిగాలి, కుడి(చంద్ర) చల్లని గాలి   నిదానంగా   గాలి పీల్చి వదలాలి.ఈ విధంగా రెండు వైపులా చెయ్యాలి. ఈ వ్యాయామాన్ని 12-24-48 సార్లు చెయ్యాలి. ఎడమ  ముక్కుతో మధ్య వేలు తో మూసి కుడి ముక్కుతో గాలి పీల్చి,కుంభించి, వదలాలి అంటే రేచకము.
 
2. వేగభస్త్రిక ప్రాణాయామం:-- పైన చెప్పబడిన వ్యాయామాలను చాల వేగంగా చెయ్యాలి.
 
      తెల్ల మద్ది (అర్జున)  చెట్టు పై బెరడు తెచ్చి కడిగి ముక్కలు చేసి ఎండబెట్టి దంచి జల్లించిన పొడిని సీసాలో నిల్వ చేసుకోవాలి.
      వ్యాధిగ్రస్తుడు పౌర్ణమి రోజున ఉదయం నుండి ఉపవాసం వుండాలి.అవసరమైతే గోరువెచ్చని నీరు తాగవచ్చు.
చీకటి పడిన తరువాత నాటు ఆవుపాలు, బియ్యం కలిపి దానిలో కలకండ వేసి పాయసం వండాలి.దీనిని పళ్ళెం లో పోసి వెన్నెలలో తెల్లవారుజామున 4 గంటల వరకు పెట్టాలి. ఈ పాయసం లో ఒక టీ స్పూను తెల్ల మద్ది చెక్క  పొడి కలిపి దీనిని ఉబ్బస రోగికి పెట్టాలి.అతడు ఎంత వరకు తినగలడో అంత తృప్తిగా తినిపించాలి.తినిన తరువాత 12 గంటల సేపు మేలుకోవాలి. ఈ విధంగా 3 పున్నములు చెయ్యాలి.
 
3. చక్కెర  కేళి అరటి పండు ను తొక్క తీసి పండును చిన్నచిన్న ముక్కలుగా చేసి అవి మునిగే వరకు ఆవు మూత్రం (మొదటి, చివరి మూత్రం వదిలేసి పట్టాలి) పొయ్యాలి. పరగడుపున ప్రతి రోజు తింటూ వుంటే 40 రోజులలో వ్యాధి నివారింపబడుతుంది.
                     ఆస్తమా ---నివారణ                                   

       ఆవ నూనెను చాతీ మీద రుద్ది తరువాత వ్యాయామం చెయ్యాలి. భుజంగాసనం వెయ్యాలి.

ఆహారం:-- 
                      కరక్కాయల  బెరడు చూర్ణం                ----- 100 gr
                      తాని కాయల బెరడు చూర్ణం               ----- 100 gr
                      ఉసిరి కాయల బెరడు చూర్ణం              ----- 100 gr
                      పిప్పళ్ళ  చూర్ణం                              ------100 gr

        అన్నింటిని విడివిడిగా దోరగా వేయించి విడివిడిగా దంచి పొడులను చేయాలి. తరువాత అన్నింటిని కలిపి  సీసాలో భద్ర పరచాలి.

       ప్రతి రోజు పావు టీ స్పూను పొడిని ఒక టీ స్పూను తేనెతో సేవించాలి.

       దీని వలన Dust Allergy  (డస్ట్ అలర్జీ ), దగ్గు, ఉబ్బసం వంటివి నివారింప బడతాయి. 40  రోజులు ఉదయం,సాయంత్రం ప్రతిరోజు తీసుకోవాలి.

       ఇది వాడేటపుడు వేడి చేసినట్లనిపిస్తే మోతాదును తగ్గించి వాడుకోవాలి. సమస్య ఎక్కువగా వున్నపుడు మోతాదును మూడు పూటలకు పెంచాలి.

                           ఆస్తమా --నివారణ                                                 
         Dust Allergy (డస్ట్ అలర్జీ),ఎగ శ్వాస, ఊపిరి ఆడకపోవడం  వంటి లక్షణాలు వున్నవాళ్ళు తక్షణం  ఈ క్రింది   వ్యాయామాన్ని చెయ్యాలి.

ఉజ్జాయి ప్రాణాయామం :--   గొంతును బిగించి కుడి ముక్కుతో గాలిని మెల్లగా, దీర్ఘంగా పీల్చి ఎడమ ముక్కుతో  నెమ్మదిగా వదలాలి.  గొంతులోకి కఫం వస్తే వుమ్మెయ్యాలి.

2. సూర్యభేదన ప్రాణాయామం   3. దీర్ఘ భస్త్రిక   4.  భుజంగాసనం

    Dust  Allergy (డస్ట్ అలర్జీ) కి ఆహార ఔషధం
1 తులసి టీ :--

                తులసి ఆకులు             ----10
                మిరియాలు                  ----10
                అల్లం                          ----  2 gr
                నీళ్ళు                          ---- 2 కప్పులు
                కలకండ                        ---- 1 స్పూను

     తులసి ఆకులను, మిరియాలను, అల్లాన్ని కచ్చా పచ్చాగా నలగగొట్టి నీటిలో వేసి స్టవ్ మీద పెట్టి మరిగించి  ఒక కప్పు కషాయానికి రానివ్వాలి. దానిని వడపోసి కలకండ కలిపి గోరువెచ్చగా తాగాలి. తాగిన తరువాత  ఒక గంట వరకు ఏమి తినకూడదు, తాగకూడదు, స్నానం చెయ్యకూడదు.

     వాసన తగిలినా, పోపు తిరగమోత వాసన తగిలినా, దుమ్ము తగిలినా విపరీతమైన తుమ్ములు వచ్చే వాళ్ళు 100 రోజులు వాడితే తప్పకుండా తగ్గుతుంది.

2.             పసుపుకొమ్ములు   ----- 100 gr
                గోధుమ గింజలు    ---- 100 gr

     రెండింటిని విడివిడిగా మట్టి మూకుడులో దోరగా వేయించి  కలిపి దంచి జల్లించి భద్ర పరచుకోవాలి.

     రెండు పూటలా ఆహారానికి ముందు  అర టీ స్పూను పొడిని తేనె తో నాకాలి. లేదా వేడి నీటితో తీసుకోవాలి.
 
పిల్లలకు                       ----రెండు చిటికెలు
పెద్దలకు                       ---- అర  టీ స్పూను

                   ఆస్తమా ---- నివారణ                            

     మెడ దగ్గర నుండి బొటన వ్రేలి వరకు శరీరమంతా ముఖ్యంగా గొంతు మీద నువ్వుల నూనెతో  గాని, ఆవ నూనెతో గాని గోరువెచ్చగా చేసి మర్దన చెయ్యాలి.

     ప్రతిరోజు ఖచ్చితంగా ఆవిరి పట్టాలి.

     తప్పని సరిగా రెండు చుక్కల ఆవ నూనెను వెచ్చగా చేసి ముక్కులో వేసుకోవాలి. పిల్లలకైతే ఒక చుక్క వేసి ఆవిరి పట్టాలి.  వేడి నీటిలో ఉప్పు, పసుపు వేసి ఆవిరి పట్టాలి. ఆ నీటితోనే కాపడం పెట్టాలి.

    కపాలభాతి ప్రాణాయామం, సూర్యభేదన ప్రాణాయామం చేయాలి.

దోరగా వేయించిన పిప్పళ్ళ పొడి           ---- 50 gr
                     సైంధవ లవణం            ---- 50 gr
                     పాత బెల్లం               ----150 gr

    అన్నింటిని రోట్లో వేసి దంచాలి. ప్రతి రోజు పది గ్రాముల ముద్దను నోట్లో వేసుకొని చప్పరించాలి.

ఆవు పాలు                                ---- 400 gr
స్వచ్చమైన నువ్వుల నూనె          ---- 100 gr
             అతిమధురం పొడి         ----   10 gr

     అన్నింటిని ఒక పాత్రలో వేసి స్టవ్ మీద పెట్టి తేమ శాతం ఇగిరిపోయి100 గ్రాముల నూనె మాత్రమే మిగిలేట్లు  కాచాలి. వడకట్టి సీసాలో భద్రపరచుకోవాలి.

     ఈ నూనెను రెండు చుక్కలు ముక్కుల్లో వేసుకుంటే ఖచ్చితంగా ఆస్తమా నివారింపబడుతుంది.

         ఉబ్బసము ---నివారణ ---శ్వాసామృతం                           

అల్లం యొక్క నిజ రసం                ---- 20 gr
వెల్లుల్లి  నిజ రసం                        ---- 20 gr
ఉల్లి నిజ రసం                             ---- 20 gr
కలబంద  గుజ్జు రసం                    -----20 gr
                       తేనె                  -----20 gr
 
            అన్నింటిని ఒక సీసాలో పోసి గట్టిగా మూతపెట్టి గుడ్డ కట్టి నేలలో పాతి పెట్టి  72  గంటల పాటు (3రోజులు)  ఉంచాలి. తీసి తుడిచి పెట్టుకోవాలి.
 
ఉపయోగించే విధానం;--       ఒక టీ స్పూను ఔషధాన్ని ఉదయం,  సాయంత్రం ఆహారానికి ముందు సేవిస్తే ఉబ్బసం ఎంత తీవ్రంగా వున్నా చాలా త్వరగా నివారింప బడుతుంది.
 
చిన్న పిల్లలకు                --- 5,  6  చుక్కలు
పెద్ద పిల్లలకు                  ---  పావు టీ స్పూను
                                  
              ఆస్తమా -- వర్ధమాన పిప్పలి యోగము ( రసాయనము )                         
 
         చరక సంహిత అను ఆయుర్వేద గ్రంధములో  రసాయన అనే అధ్యాయంలో ఈ విధంగా చెప్పబడినది.
 
మొదటి రోజు               --- ఒక పిప్పలి
రెండవ రోజు                 --- రెండు పిప్పళ్ళు
మూడవ రోజు              --  మూడు పిప్పళ్ళు
నాల్గవ రోజు                 --- నాలుగు పిప్పళ్ళు
ఐదవ రోజు                  --- ఐదు పిప్పళ్ళు
ఆరవ రోజు                  ---  ఆరు పిప్పళ్ళు
ఏడవ రోజు                  ---  ఏడు పిప్పళ్ళు
ఎనిమిదవ రోజు           ---  ఆరు పిప్పళ్ళు
తొమ్మిదవ రోజు           ---  ఐదు పిప్పళ్ళు
పదవ రోజు                  ---  నాలుగు పిప్పళ్ళు
పదకొండవ రోజు          ---  మూడు పిప్పళ్ళు
పన్నెండవ రోజు          ----  రెండు పిప్పళ్ళు
పదమూడవ రోజు        ---   ఒక పిప్పలి
 
ఈ విధంగా పదకొండు రోజుల వరకు పెంచుకుంటూ వెళ్లి పన్నెండవ రోజు నుండి తగ్గించవచ్చు. ఇది వేడి శరీరం కలిగిన వాళ్లకు వేడి చేస్తుంది. మూడు, నాలుగు రోజుల తరువాత వేడి చేసినట్లుగా వుంటే మధ్యలో  రెండు రోజులు ఆపి తరువాత కంటిన్యు చెయ్యవచ్చు.
 
       దీనిని వాడడం వలన వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. శ్వాసకోశ వ్యాధులు పూర్తిగా నాశనం చేయబడతాయి.
        పిప్పళ్లను ఆవు పాలలో ఉడికించి  తీసి వాటిని నమిలి తిని, పాలు తాగాలి.

            ఆస్తమా నివారణకు ప్రాణమిత్ర                                         
 
                  ఏక మూలికా ప్రయోగం
 
          50  గ్రాముల ముసాంబరాన్ని కల్వంలో వేసి తగినంత నీరు కలిపి నూరి మాత్రలు కట్టాలి.
 
చిన్న పిల్లలకు                     --- పెసర గింజంత
పెద్ద పిల్లలకు                       --- శనగ గింజంత
పెద్దలకు                              --- బటాణి గింజంత
      నీటితో వాడాలి.
      గర్భిణి  స్త్రీలు వాడకూడదు.  శరీరంలో ఎక్కువ వేడి వున్నపుడు, మూత్రంలో, మలంలో రక్తంపడుతున్నపుడుఇవి వాడకూడదు.
       రెండు చేతులను చాపి వేళ్ళను దూర్చి గట్టిగా బిగించి పట్టుకొని రెండు బొటన వ్రేళ్ళను పైకి పెట్టాలి. దీనివలన శరీరంలో వేడి వుత్పన్నమై  కఫం నివారింప బడుతుంది.
                                               

            అరటి కాయను తొక్క తో సహా నిప్పుల ;మీద కాల్చాలి. తొక్క తీసి లోపలి పదార్ధాన్ని తింటే ఆయాసంతగ్గుతుంది.
            
    ఉబ్బసం  --నివారణ                                     
 
      ఇది అలర్జీ  వలన అంటే వాతావరణం వలన గాని, ఆహారం వలన గాని రావచ్చు,  ఇది చాలా సాధారణమైన వ్యాధి.
ఉపశమనం కోసం:--  
 
ఉల్లి రసం         --- ఒక టీ స్పూను
తేనె                 --- ఒక టీ స్పూను
 
     దీనిని రోజుకు  మూడు సార్లు తీసుకుంటే తీవ్రత తగ్గుతుంది.
 
పిప్పళ్ళ ;పొడి    ---పావు టీ స్పూను
ఉసిరి పొడి        --- పావు టీ స్పూను
శొంటి పొడి        --- పావు టీ స్పూను
 తేనె                 --- తగినంత
కలకండ           ---- తగినంత
 
    అన్నింటిని కలిపి తినాలి.   ప్రతి రోజు మూడు పూటలా తీసుకుంటే తీవ్రత తగ్గుతుంది.
    ఇది అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది.
 
బెల్లం               ----- అర టీ స్పూను
ఆవనూనె        -----  అర టీ స్పూను
 
      రెండుకలిపి ముద్దగా చేసి 21 రోజులు ఉదయం, సాయంత్రం, రాత్రి తీసుకుంటే శాశ్వత ఉపశమనం 
కలుగుతుంది.
 
తినకూడనివి :--    శీతా ఫలం, పాల పదార్ధాలు, కఫాన్ని పెంచే పదార్ధాలు తిన కూడదు
                               
 అల్లం, మిరియాలను ఆహార పదార్ధాలలో ఎక్కువగా చేర్చాలి.

                    ఆస్తమా --- చికిత్స                              
.
         ఇది అంటు వ్యాధి కాదు.

లక్షణాలు:-   కొంత మందికి ఊపిరాడక పోవడం,కఫం ఎక్కువగా చేరడం, అజీర్ణం, ఆకలికాక పోవడం వంటి  లక్షణాలు వుంటాయి. కొంత మందికి ఈ వ్యాధి పుట్టుకతోనే వుంటుంది,  మరికొంత మందికి వారసత్వంగా కూడా వస్తుంది.

         శరీరంలో ఇన్ఫెక్షన్ చేరి  దగ్గు రావడం  దానిని పరిష్కరించుకోక పోవడం వలన  క్రమేపి అది ఆస్తమా గా
మారడం జరుగుతుంది.

         ప్రారంభ దశలో మూల కారణాలకు చికిత్స చేస్తే కొంత నయమవుతుంది.

         ప్రాణాయామం,  యోగా తప్పనిసరిగా చేస్తుండాలి. ఏదో ఒక ఔషధాన్ని వాడుతూ వుండాలి.

పిప్పళ్ళు                         --- 50 gr
మిరియాలు                     --- 50 gr
శొంటి                              --- 50 gr
ఉసిరిక                          --- 100 gr

       అన్నింటి చూర్ణాలను కలిపి సీసాలో భద్రపరచు కోవాలి.

చూర్ణం                   --- పావు టీ స్పూను
తేనె                      ---  రెండు టీ స్పూన్లు
నెయ్యి                  ---  అర టీ స్పూను

       అన్నింటిని కలిపి ముద్దగా చేసి ఉదయం సాయంత్రం ఆహారానికి ముందు తీసుకోవాలి.

       మొదట ఈ మోతాదులో వాడి తరువాత మోతాదు పెంచుకుంటూ పోవాలి.

       ప్రతి రోజు  5,  6  తులసి ఆకులను, అర టీ స్పూను పసుపు పొడిని  ఏదో ఒక రూపంలో తీసుకుంటూ వుంటేమంచిది.  సుగంధ ద్రవ్యాలను కూడా ఏదో ఒక రూపంలో తీసుకోవడం మంచిది.

                                                  ఆస్తమా నివారణకు గృహ వైద్యము

        కొంత మంది ఆస్తమా వున్నసమయంలో ఊపిరాడక గబుక్కున లేచి కూర్చోవడం  జరుగుతూ వుంటుంది.ఆ సమయంలో నువ్వుల నూనెలో కర్పూరం బిళ్ళ, కొద్దిగా ఇంగువ కలిపి వాసన చూస్తే  కొంత రిలీఫ్ గా వుంటుంది.

              ముక్కు దిబ్బడ మాత్రమే వుంటే

      ప్రతి రోజు రెండు పచ్చి ఉల్లి పాయలను తింటూ వుంటే  ఈ సమస్య నివారింపబడుతుంది.

      ఆస్తమా నివారణకు భుజంగాసనం,  భ్రామరీ ప్రాణాయామం  అనేవి చాలా ముఖ్యమైనవి. ఈ రెండువ్యాయామాలను ప్రతి రోజు ఉదయం,  సాయంత్రం చేస్తూ వుంటే కంట్రోల్ అవుతుంది.  ఈ ఆసనాల తరువాతపద్మాసనంలో కొంత సేపు రిలాక్స్ అయి  తరువాత శవాసనంలో కొంతసేపు రిలాక్స్ కావాలి.

             ఉబ్బసము ---నివారణ                                       

లక్షణాలు :--     ఈ వ్యాధిలో శ్వాస నాళాలు ఉబ్బి వుంటాయి . కఫం చిక్కగా వుంటుంది . రక్తప్రసరణ సరిగా
జరగదు కాబట్టి కళ్ళు తిరుగుతూ వుంటాయి .చలిగాలిలొ తిరిగినపుడు పొడిదగ్గు, ఆయాసం, పిల్లికూతలు, జలుబు, సైనసైటిస్ వంటి సమస్యలు ఎక్కువవుతాయి . కొన్ని రకాల మందులు ముఖ్యంగా ఆస్ప్రిన్ వంటివి
వాడినపుడు సమస్య ఎక్కువవుతుంది .

1. అతిమధురం వేరు చూర్ణం         ---- ఒక గ్రాము
             వేడి నీళ్ళు          ---- పావు కప్పు

        చూర్ణం నోట్లో వేసుకొని వేడి నీళ్ళు తాగాలి .

        ఈ విధంగా 40,  50  రోజులు వాడితే శ్వాస నాళాలు బాగా తెరుచుకుంటాయి .

2. గోధుమలు
    పసుపు కొమ్ములు

      రెండింటిని విడివిడిగా వేయించి దంచి పొడి చేసి జల్లించి కలిపి నిల్వ చెసుకొవాలి.

     ప్రతి రోజు ఒక గ్రాము పొడిని మంచి నీటితో సేవించాలి .  ఈ విధంగా నలభై రోజులు చేస్తే సమస్య నివారింప
బడుతుంది .

3. ఆవాలను మెత్తగా నూరి పక్కటెముకల మీద పట్టు వేస్తె అవి బలంగా తయారవుతాయి .

4. ఖర్జూరం
    ఎండుద్రాక్ష
    బాదంపప్పు
    పటికబెల్లం

            అన్నింటిని సమాన భాగాలుగా తీసుకొని విడివిడిగా చూర్నాలు చేసి కలిపి నిల్వ చేసుకోవాలి .
            ప్రతి రోజు ఉదయం రెండు టీ స్పూన్ల పొడిని సేవించాలి .  ఈ విధంగా నలభై రోజులు తీసుకుంటే సమస్య
బాగా నివారింపబడుతుంది

                ఉబ్బసము   --- నివారణ                           

తెల్ల జిల్లేడు పూలు            --- 100 gr
మిరియాల పొడి                --- 100 gr

         రెండింటిని కల్వంలో వేసి తగినంత నీరు కలిపి మెత్తగా నూరి శనగ గింజలంత  మాత్రలు కట్టాలి . తడి లేకుండా
ఆరబెట్టి నిల్వ చేసుకోవాలి .
         ఉదయం , సాయంత్రం ఒక్కొక్క మాత్ర చొప్పున తేనెతో గాని ,  వేడి నీటితో గాని సేవించాలి .
         దీనిని వాడడం వలన చెడు కఫం , శరీరం లోని చెడు నీరు తొలగించబడతాయి .   పిల్లికూతలు నివారింపబడతాయి .
         ఈ ఔషధం కఫాన్ని తొలగించడం లో చాలా ప్రముఖమైనది .

       శ్వాసకోశ వ్యాధి  ---  ఆస్తమా  --- నివారణ              

లక్షణాలు :--- ఆహారం జీర్ణం కాదు ,  రుచి తెలియదు . శరీరం అతివేడి గా గాని లేదా అతి శీతలంగా గాని వుంటుంది .
         పూర్వపు రోజులలో కఫ తత్వ శరీరం కలిగిన వాళ్లకు మాత్రమె ఆస్తమా సమస్య ఉండేది . కాని ఈ రోజులలో
 ఈ సమస్య అందరిని వేధిస్తున్నది .

నీరుల్లి రసం                     ---- 50 gr
వెల్లుల్లి రసం                     ---- 50 gr
కలబంద రసం                   ---- 50 gr
అల్లం రసం                       ---- 50 gr
తేనె                                ---- 50 gr

         ఏమాత్రం కొంచం కూడా తడిలేని , బాగా పొడిగా వున్న గాజు సీసాను తీసుకొని  పై పదార్దాలన్నింటి  పోయాలి .
తరువాత నెలలో  2, 3 అడుగుల లోతులో గొయ్యి తవ్వి సీసాను ఆ గోతిలో వుంచి గోతిని మట్టితో కప్పెయ్యాలి
ఆ విధంగా నేలలో మూడు రోజులు ఉంచాలి .థరువాథ సీసాను బయటకు తీసి  పైన  శుభ్రంగా కడగాలి .
      
          ప్రతి రోజు ఒక టీ స్పూను చొప్పున తాగుతూ వుండాలి . చిన్న పిల్లలకు పావు టీ స్పూను  తాగించాలి . ఇంకా చిన్న
పిల్లలకు  ( పాల ఉబ్బసం ) 4, 5 చుక్కలు తాగించాలి

సూచన :--- గిట్టని పదార్ధాలను తినకూడదు . 
                 లింగ ముద్ర వేయాలి . సూర్యభేదన ప్రాణాయామం చేయాల

ఊపిరితిత్తుల వ్యాధి కొరకు అలౌపతి మందులు 

Medicine NamePack Size
Blumox CaBlumox CA 1.2 Gm Injection)
BactoclavBactoclav 1000/200 Injection
Mega CVMega CV 1.2gm Injection
Erox CvErox CV 625 Tablet
MoxclavMOXCLAV 91.4MG DROPS 10ML
NovamoxNovamox 125 Rediuse Oral Suspension
Moxikind CVMoxikind CV 375 Tablet
PulmoxylPulmoxyl 250 Capsule
ClavamCLAVAM 1GM TABLET
AdventAdvent 1.2 gm Injection
AugmentinAugmentin 1000 DUO Tablet
ClampClamp 625 Tablet
MoxMox 250 Mg Capsule
Zemox ClZemox CL Injection
P Mox KidP Mox Kid Tablet
AceclaveAceclave 250 Mg/125 Mg Tablet
Amox ClAmox Cl 200 Mg/28.5 Mg Syrup
ZoclavZoclav Tablet
PolymoxPolymox Capsule
AcmoxAcmox 125 Dry Syrup
StaphymoxStaphymox Tablet
Acmox DSAcmox DS 250 Tablet
AmoxyclavAmoxyclav 375 Tablet
Zoxil CvZoxil CV 1000/200 Injec

ధన్యవాదములు 

మీ నవీన్ నడిమింటి 

విశాఖపట్నం 

9703706660

అస్వీకార ప్రకటన: ఈ సైటుపై లభ్యమవుతున్న మొత్తం సమాచారము మరియు లేఖనము కేవలం అవగాహనా ఆవశ్యకతల కొరకు మాత్రమే. ఇక్కడ ఇవ్వబడిన సమాచారమును ఏదైనా ఆరోగ్య సంబంధిత సమస్య లేదా అస్వస్థత నుండి కోలుకోవడానికి లేదా స్వస్థత కొరకు నిపుణుల సలహా లేనిదే ఉపయోగించుకోకూడదు. చికిత్స పరీక్షలు మరియు సేవల కొరకు ఎల్లప్పుడూ ఒక అర్హత పొందిన వైద్యుల సలహా తీసుకోవాలి.


4, సెప్టెంబర్ 2020, శుక్రవారం

మోకాళ్ళ నొప్పులు నివారణకు తీసుకో వలిసిన జాగ్రత్త లు అవగాహనా కోసం ఈ లింక్స్ లో చూడాలి


Osteo-arthritis at middle age,మోకాళ్ళ నొప్పులు నడివయసేలో అవగాహనా కోసం నవీన్ నడిమింటి సలహాలు 


Osteo-arthritis at middle age,మోకాళ్ళ నొప్పులు నడివయసేలో -- గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ..
  •  

  •  
మానవ శరీరం ఒక అత్యాధునికమైన యంత్రం. సంవత్సరాల తరబడి చేసే పనుల కారణంగా, నిలబడడం, నడక, కింద కూర్చోవడం వంటి అనేక కీలుపైన బరువు వేసే పనుల మూలంగా కీలులో ఉన్న స్ట్రక్చర్స్‌ బలహీనపడతారుు. కీలు కదిలినప్పుడల్లా ఎముకల మధ్యన రాపిడి తగ్గించడం కోసం కింది భాగంలో ఏర్పడిన కార్టిలేజ్‌ (cartilage) అనే ప్రొటీన్‌ (protein) పదార్ధం అరిగిపోతుంది. దీనితో పాటుగా ఇతర స్ట్రక్చర్స్‌ ద్రవ పదార్థాలు (sinovial fluid), రెండు ఎముకలని కలిపే లిగమెంట్లు (Ligaments), కీలు తొలగిపోకుండా ఉండటానికి కావలసిన మెనిస్కస్‌ ( meniscus), కీలు చుట్టూ ఉన్న కండరాలు (muscles) క్రమక్రమంగా క్షీణిస్తాయి . పెద్దవాళ్లలో మెుకాళ్ల నొప్పి మరింతగా బాధపెట్టడం అన్నది చాలా సాధారణమైన విషయం. కారణం మోకాళ్ల అరుగుదల. దీనినే ఆస్టియో ఆర్థరైటిస్‌ (Osteo-arthritis) అని అంటారు. కీళ్ల నొప్పుల వల్ల సామాజిక, మానసిక, శారీరక మార్పులు చేకూరుతారుు.

-మోకాళ్ల నొప్పిని ప్రారంభ సమయంలో నిర్లక్ష్యం చేస్తే నెమ్మది నెమ్మదిగా మరో కీలు, ఆ తరువాత పైకిపోకుతూ తుంటి, నడుము నొప్పులు కూడా మొదలవుతాయి. ఈ నొప్పుల మూలంగా నడక తగ్గడంతో శరీరం బరువు పెరుగుతుంది. ఇతర అనారోగ్య సమస్యలు డయాబెటిస్‌, రక్తపోటు అదుపులో ఉండకపోవడంతో కాలక్రమేనా గుండెకు సంబంధించిన సమస్యలతో బాధపడతారు. కొన్నిసార్లు ఇతర కారణాల వల్ల కూడా అనగా హర్మోన్‌ మార్పులు, విపరీతమైన శరీర బరువు, పదే పదే కీలుకి దెబ్బలు తగలడం తదితర సమస్యలతో కూడా మోకాళ్ళ నొప్పులు బాధిస్తాయి.మోకాళ్ల అరుగుదలతో మొదలయ్యే సమస్య ప్రారంభ దశలో నొప్పి కేవలం కీళుపైన భారం వేస్తేనే (ఎక్కువ నిల్చున్నా, నడిచినా, మెట్లు ఎక్కినా) ఉంటుంది. కాసేపు కూర్చుని విశ్రాంతి ఇస్తే తగ్గిపోతుంది. కొన్ని సందర్భాల్లో నొప్పితో పాటుగా వాపు, ఉదయానే దాదాపు అరగంట వరకు కీళ్లు బిగుసుకు పోవడం వంటి ఇతర సమస్యలు ఉంటాయి. కీలుని పరీక్ష చేయడంతో కిర్రు కిర్రు మన్న శబ్ధం తెలుస్తుంది.

ఆస్టియో ఆర్థరెైటిస్‌(Osteo-arthritis)ని నిర్ధారించడం కోసం కావలసిన పరీక్ష మోకాలు ముందు, పక్క నుంచి తీసిన ఎక్స్‌రే(x-ray). ఎక్స్‌రే (x-ray)లో అరుగుదల మార్పులు కనిపిస్తాయి. ఎముకల మధ్యన ఖాళీ తగ్గడం, కీలు చివరలో కొత్త ఎముక నిర్మించబడుతుంది. అరుగుదల వంటి మార్పులు కూడా స్పష్టంగా కనిపిస్తాయి. ఇతర లోపాలు తెలుసకోవడం కోసం రక్త పరీక్ష ఉపయోగపడుతుంది.

చికిత్స:
ఆస్టియో ఆర్థరెైటిస్‌ (Osteo-arthritis) వల్ల వచ్చే ఇతర సమస్యలు తగ్గించడానికి వివిధ చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. ముందు ఎముకలకి సంబంధించిన వైద్య నిపుణులని సంప్రదించి నొప్పి, వాపు తగ్గడానికి గల మందులు, తగ్గకపోతే కీళ్ల ఇంజెక్షన్‌ అవసరం పడుతుంది. దానితో పాటుగా కీళ్ల వ్యాయామం కోసం ఫిజియోథెరపిస్ట్‌ని సంప్రదించడం అత్యవసరం.
ఫిజియోథెరపి చికిత్స చేయించుకోవడం వల్ల వీలెైనంత వరకు త్వరగా మునుపటి జీవనం సాగించవచ్చు.

-ఫిజియో థెరపిస్ట్‌ మొదట్లో నొప్పి తగ్గించడం కోసం ఏదో ఒక అవసరమైన కరెంట్‌ పరికరం (ఐ.ఎఫ్‌.టి , అల్ట్రాసౌండ్‌ , ఐ.ఆర్‌.ఆర్‌. , ఎస్‌.డబ్లు.డి ) తో వారం పదిరోజుల వరకు చికిత్స చేస్తారు.నొప్పి తగ్గుతూ ఉండే కొద్ది తీసుకోవలసిన జాగ్రత్తలు, కండరాలు బలపడడానికి వ్యాయామాలు, తెలుసుకోవలసిందిగా సలహా ఇస్తారు.

    గుండె బాగా కొట్టుకుంటుంది.
    శరీరం అంతటా రక్త ప్రసరణ బాగా జరుగుతుంది.
    కనీసం 200 క్యాలరీలు (ఇ్చజూౌటజ్ఛీట) ఖర్చు అవుతాయి.
    మంచి కొవ్వు (ఏఈఔ) పెరుగుతుంది.
    చెడు కొవ్వు (ఔఈఔ) తగ్గుతుంది.
    ఇన్సులిన్‌ సూక్ష్మత పెరగడంతో షుగర్‌ వ్యాధి అదుపులోకి వస్తుంది.
    రక్తపోటు నడక మొదలు పెట్టిన మొదట్లో కొద్దిగా పెరిగినా తరువాత అదుపులోకి వస్తుంది.

    - షుగర్‌, రక్తపోటు మూలంగా వచ్చే గుండె, కిడ్నీ, పక్షవాతం, నరాల బలహీనత, భుజం నొప్పి వంటి కీలు, కండరాల బాధలు, కంటి లోపాలు తదితర సమస్యలను వీలెైనంత వరకు నిర్మూలించవచ్చు.ఇవే కాకుండా నడక మూలంగా మెదడుకి ఎల్లప్పుడు రక్తప్రసరణ అందుబాటులో ఉండడం మూలంగా మెదడు బాగా చురుగ్గా పని చేస్తుంది. ఒత్తిడి తగ్గుతుంది, నిద్రలేమి సమస్య ఉండదు. కొంతవరకు వృద్ధాప్యం వల్ల వచ్చే సమస్యలు కూడా తగ్గించవచ్చు.

    నడకకు సంబంధించిన కొన్ని చిట్కాలు:
 
        నడకకు 15 నిలతో మొదలుపెట్టి నడిచే సమయాన్ని 30-45 నిల వరకు పెంచండి.
        రోజులో ముపె్పై నిలు ఏకధాటిగా లేనిచో 10 నిలు పాటు వంతులుగా 5 సార్లు నడవచ్చు.
        బ్రిస్క్‌ వాకింగ్‌ .


        తీసుకోవలసిన జాగ్రత్తలు:
            ఎక్కువ సమయం నిల్చోవడం తగ్గించాలి.
            నొప్పిని పట్టించుకోకుండా నడవడం మంచిది కాదు.
            పదే పదే మెట్లు ఎక్కడం దిగడం తగ్గించాలి.
            వెస్టెర్న్‌ టైప్‌ కమోడ్‌ ఉపయోగించాలి.


            వ్యాయామం:
                మోకాళ్లు నొప్పి లేనంతవరకు నడవడం అతి ముఖ్యమైనది.
                స్థరమైన సైకిల్‌ తొక్కితే మంచిది.
                ఈత కొట్టడం చాలా మంచి వ్యాయామం.


                ఇవన్నీ చేసినప్పటికీ నొప్పి తగ్గకపోతే, కొన్ని అడుగులు కూడా నడవడం ఇబ్బందికరంగా ఉంటే వెంటనే ఎముకల వెైద్య నిపుణుడిని సంప్రదించి శస్త్ర చికిత్స చేయించుకోవడం అవసరం. దీనినే టోటల్‌ నీ రీప్లేస్‌మెంట్‌ (knee replacement surgery) లేక కీళ్ల మార్పిడీ అంటారు. ఆర్టిఫిషియల్‌ మెటల్‌ ఇంప్లాంట్‌తో కీళ్ల మార్పిడి చేస్తారు.శస్త్ర చికిత్స తదుపరి కీళ్ళకు తగిన జాగ్రత్తలు మోకాళ్ళ వ్యాయామం నడిచే పద్ధతులు తెలుసుకోవడం ఫిజియోథెరపి అవసరం. ఇప్పుడు శస్త్ర చికిత్సను 5-6 సంలు వాయిదా వేయడంతో పాటు నొప్పులతో బాధపడుతున్న వాళ్ళ జీవర సరళిని పెంపొందించుటకు ఒక కొత్త రకమైన పట్టీ (బ్రేస్‌) ‘అన్‌లోడర్‌ వన్‌’ అందుబాటులో ఉంది. ఈ పట్టీ వేసుకొని నడిస్తే శరీరం యొక్క బరువు కీళు చుట్టూ సరిసమానంగా పడడంతో కీళుకి నష్టం వాటిల్లదు, నడిచినా నొప్పి తెలియదు.

                    క్రమం తప్పకుండా ప్రతిరోజు కనీసం 30 నిలు నడవడం మూలంగా అనేక ఆరోగ్య ఫలితాలు లభిస్తాయి.
                    ఇప్పుడు మోకాలు చుట్టూ ఉన్న కండరాలకు బలం చేకూరుతుంది.
                    కీళు సులువుగా కదులుతుంది.
                    ఎముకలు బలపడతాయి.
                    బ్యాలెన్స్‌ పెరగడంతో తృటి ప్రమాదాలు తగ్గుతాయి.

                    చేతులు బాగా ఊపుతూ నడవగలిగినంత వేగంగా నడిస్తే చమట పడడంతో పాటు గుండె వేగంగా కొట్టుకుంటుంది. దీనితో మంచి ఫలితం దక్కుతుంది.
                    గమనిక: నడక వేగం మీరు పాట పాడలేనంత వీలుగ కాని లేక మాట్లాడగలిగేంత ఉండాలి.
                    సాధారణంగా మార్నింగ్‌ వాక్‌ ఎంచుకున్నా స్వచ్ఛమైన చల్లటి గాలి పీల్చుకోగలుగుతారు.

                    మోకాళ్ల అరుగుదలతో మొదలయ్యే సమస్య ప్రారంభ దశలో నొప్పి కేవలం కీళ్లపెైన భారం వేస్తేనే (ఎక్కువ నిల్చున్నా, నడిచినా, మెట్లు ఎక్కినా) ఉంటుంది. కాసేపు కూర్చుని విశ్రాంతి ఇస్తే తగ్గిపోతుంది. కొన్ని సందర్భాల్లో నొప్పితో పాటుగా వాపు, ఉదయానే దాదాపు అరగంట వరకు కీళ్లు బిగుసుకు పోవడం వంటి ఇతర సమస్యలు ఉంటాయి. కీలుని పరీక్ష చేయడంతో కిర్రు కిర్రు మన్న శబ్ధం తెలుస్తుంది.


  •                  Courtesy with :  డా వై. నందకిషోర్‌ కుమార్‌-- బి.పి.టి. (నిమ్స్‌), యం.యస్‌.స్పోర్ట్స్  (యు.కె.) ఫిజియోథెరపిస్ట్
  1. # మన శరీరంలో 40 నుంచి 45 సంవత్సరాల వయసు వరకే మనం స్వీకరించే ఆహారంలో నుంచి కాల్షియం తయారవుతుంది .
    # శరీరంలో కాల్షియం తగ్గితే ఎక్కవగా ఎముకలకి సంబంధించిన నొప్పులు , రక్తానికి , కఫానికి సంబందించిన రోగాలు వస్తాయి .
    # కీళ్ళ నొప్పులు , భుజాల నొప్పులు , మోకాళ్ళు , నడుము నొప్పులు వస్తాయి .
    # స్త్రీ లకు *45 సంవత్సరాలు* పూర్తికాగానే నెలసరులు ఆగిపోయిన తర్వాత శరీరం కాల్షియంను తీసుకునే సామర్ధ్యం కోల్పోతుంది .
    # కాల్షియం ఎక్కవగా ఉండే పదార్ధాలు :- *పాలు , పెరుగు , మజ్జిగ , వెన్న , నెయ్యి*.
    # కాల్షియం ఎక్కవగా ఉండే పండ్లు :- *అరటి పండు , నారింజ , కమలా , బత్తాయి , ద్రాక్ష , మామిడి పండ్లు*.

    # మీరు పండ్లు తీసుకున్నప్పటికి శరీరంలో కాల్షియంను జీర్ణం చేసే హార్మోన్లు ఉత్పత్తి ఆగిపోయినందు వలన ( 45 సంవత్సరాలు నిండిన వారికి ) మీరు కాల్షియంను బయటనుండి తీసుకోవలసి ఉంటుంది .
    # 45 సంవత్సరాల తర్వాత స్త్రీలు గాని పురుషులుగాని తప్పకుండా *సున్నం* తీసుకొనవలెను .
    # శరీరంలో కాల్షియం ఉండటం వల్లనే మిగతా పోషకాలన్ని ఉపయోగ పడతాయి .
    # కొందరికి యూరిక్ యాసిడ్ వల్ల మోకాళ్ళ నొప్పులు వస్తాయి . యూరిక్ యాసిడ్ అంటే ఆమ్లాలు .
    # ఈ మధ్య కాలంలో వాత రోగాలు ఎక్కవగా పెరుగుతున్నాయి .
    # వాత రోగులకు చలికాలంలో చల్లదనం వల్ల వాతం పెరిగి , నొప్పులు ఎక్కవగా ఉంటాయి .
    # శరీరంలో వాతం పెరిగితే నిద్ర పట్టక పోవచ్చు .
    # మీ కదలికలు ఏవైనా చేతి కదలికలైనా , కాళ్ళ కదలికలైన , మెడ కదలికలైనా , నడుము కదలికలైనా స్టిఫ్ అవుతున్నట్లయితే ఏమైనా నొప్పి కలిగిస్తున్నట్లయితే వాతానికి సంబంధించిన సమస్యలు వస్తున్నట్లు గుర్తించండి .
    # ఉదయం నిద్రలేచే సమయానికి పూర్తిగా స్టిఫ్ గా జడంగా  తయారయి ఉంటాము .
    #ఫ్యాన్ వాతాన్ని చాలా ఎక్కవగా పెంచుతుంది .
    # వేగంగా తిరిగే ఫ్యాన్ క్రింద పండు కొనరాదు . పలుచటి దుప్పటి కప్పుకొని కాస్తప్రక్కకు పడుకోవాలి .
    # గాలి నేరుగా తగలకుండా చూసుకోవాలి .
    *వాత రోగాలు కీళ్ళనొప్పులు , భుజాల నొప్పులు , మోకాళ్ళు , నడుము నొప్పులు*.
    *ఈ క్రింది ఆరోగ్య సూత్రాలను ఆచరించి నొప్పుల నుండి నివారణ పొందండి* :-
    1 . *సున్నంను తీసుకోండి*
         సున్నంలో కాల్షియం పరిపూర్ణంగా వుంది . మన శరీరానికి కావలసిన సూక్ష్మపోషకాలు కలవు .
    *సున్నం ( 1 గ్రాము ) + 1 గ్లాసు నీళ్ళు*
    ( 1 గ్రాము -- గోధుమ గింజంత మోతాదు )
    సున్నంని నీళ్ళలో బాగా కలిపి ఉదయం పరగడుపున తీసుకొనవలెను .
    సున్నం + పెరుగు లేక మజ్జిగ .
    సున్నంని పెరుగు లేక మజ్జిగలో కలిపి మధ్యాహ్నం భోజనము తర్వాత మాత్రమే తీసుకొనవలెను . 
    # ఆర్ధరైటిస్ వున్నవారు రోజుకు రెండు గ్రాముల సున్నం , మాములు వారు 1 గ్రాము సున్నం తీసుకొనవలెను .
    *గమనిక* :-
    # శరీరంలో ఏ భాగములలోనైన రాళ్ళు వున్నవారు ఎట్టి పరిస్ధితులలో సున్నుంని తీసుకొనరాదు .
                  *లేక*
    *మెంతులు కూడా ఒక మంచి మందు* :-
    *మెంతులు ఔషధాల గని. గొప్ప ఔషధం . మెంతులు వాత + కఫ రోగాల్ని తగ్గిస్తాయి*
    *మెంతులు ఉపయేగించే విధానం :*-
    # రాత్రి ఒక గ్లాసు గోరు వెచ్చని లేదా వేడి నీటిలో 1 చెంచా మెంతులు నాన బెట్టి ఉదయాన్నే పరగడుపున *బాగా నమిలి ,నమిలి* తినవలెను . నీళ్ళను త్రాగవలెను . *బాగా నమిలి తినడం వలన అది మీ లాలజలంతో కలిసి లోనికి వెళ్ళి మీకు ఎక్కువ మేలు చేస్తుంది*
    *# ఎప్పటికీ మెంతుల కంటే సున్నం ఎక్కవ వాతనాశిని* .
                      *లేక*
    # ఎక్కువ క్షారగుణం కలిగినది *పారిజాత వృక్షం చేట్టు ఆకులు*.
    # రాత్రి 4 -5 ఆకులను బాగా నలిపి ఒక గ్లాసు నీళ్ళలో వేసి ఆ నీటిని అరగ్లాసు ఆవిరి అయ్యేలాగ వేడి చేసి , ఆ నీటిని ఉదయం పరగడపున ఆకులతో సహా గుటక గుటక గా త్రాగవలెను . మీకు అన్ని రకాల ఆర్ధరైటీసులు తగ్గిపోతాయి . ఈ కషాయం దీర్ఘకాల రోగులకు మంచి మందు .
    *గమనిక :-*
    # ఈ కషాయం వాడుతున్నపుడు ఖచ్చితంగా ఎటువంటి ఏ మందులు వాడరాదు .
    # 2 లేక 3 నెలలో సంపూర్ణ ఆరోగ్యం కలుగును .
    #4. యూరిక్ యాసిడ్ వల్ల మోకాళ్ళ నొప్పులు వున్నవారు :-
    *నల్ల నువ్వులు + బెల్లంని కలిపి తినవలెను .
    # 5 . ఆస్తమా + ఆర్ధరైటీస్ వున్న వారు దాల్చిన చెక్క + శొంటి కషాయం  తప్పకుండా త్రాగాలి . వాయు సంబంధ రోగాలు వున్నవారు బెల్లాన్ని కూడా కలప వచ్చును .
    # 6 . స్థూలకాయం + ఆర్ధరైటీస్ వున్నవారు బెల్లాన్ని కూడా కలప వచ్చును .
    # 7 . పెద్ద వయస్సు వారికి మోకాళ్ళ  నొప్పలు పోవాలంటే *సున్నం* తీసుకుంటే సరిపోతుంది .
    # 8 . భుజాల నొప్పులు , మోచేతి నొప్పులకు నీటిని *చిన్నగా గుటక గుటకగా* త్రాగితే నొప్పులు తగ్గిపోతాయి .
    # 9 . కీళ్ళ నొప్పులు ఉన్నవారు భోజనం చేసిన వెంటనే వేడి నీళ్ళు త్రాగాలి . మాములు నీళ్ళు గంట లేక గంటన్నర తర్వాత త్రాగాలి. కావలసినవారు వేడి నీళ్ళలో నిమ్మరసం కూడా కలుపు కొనవచ్చును .
    # 10 . ఉపవాస సమయంలో చల్లటి పండ్ల రసాలు తీసుకుంటే చాలా సమస్యలు వస్తాయి . ఎక్కవ సేపు కాళీ కడుపులో ఉండవలసి వస్తే వాతము పెరిగి చేతులు కాళ్ళు మరియు నడుము నొప్పులు వస్తాయి . వేడి నీళ్ళు త్రాగడం వలన మీకు ఏ హాని జరుగదు .
    # వాతాన్ని శమింపచేసే అత్యుత్తమైన పదార్ధాలు .... శుద్ధమైన వంట నూనెలు ( Non - Refined Oils ) , మరియు ఏఏ పదార్ధాలలో నీటి శాతం అధికంగా ఉంటుందో అవన్నీ వాత నాశకములే. ఉదా : - పాలు , పెరుగు , మజ్జిగ , చెరకు రసం మరియు పండ్ల రసాలు .
    # మంచి నీళ్ళను ఎప్పుడూ నిలబడి త్రాగకండి . కూర్చునే త్రాగండి .
    # వేడి వేడి పాలను నిలబడి త్రాగండి .
    # ఎప్పుడూ చల్లని నీళ్ళు త్రాగకూడదు .
    # నీళ్ళు ఎప్పుడు త్రాగినా గుటక గుటక గా త్రాగవలెను . వీలైయితే సుఖాసనములో కూర్చొని నీళ్ళు త్రాగండి .
    # నిలబడి నీళ్ళు త్రాగితే మోకాళ్ళ నొప్పులు ఎప్పటికీ తగ్గవు . ఏ మందులు వాడినా తగ్గవు .
    # సైంధవ లవణం ( Rock Salt ) వాడవలెను .
    # శుద్దమైన వంట నూనె వాడవలెను .
      *శుద్ధమైన నూనె అంటే నాన్ రిఫైండు నూనె (Non Refined Oil ) .  ఏమీ కలపకుండా గానుగ నుండి సరాసరి తెచ్చుకున్న నూనె . *ఈ శుద్ధమైన నూనె మీ వాతాన్ని పెరగనీయ కండా ఉంచుతుంది* .
    # జీవితాంతం వాతాన్ని క్రమంలో ఉంచాలంటే మీరు శుద్ధమైన నూనెను వాడుకోవటమే మంచిది .
    *# రిఫైండ్ నూనెలను ఖచ్చితంగా వాడరాదు* .

    *గమనిక :- సున్నం లేక మెంతులు వాడవలెను . దీర్ఘకాలిక రోగులు పారిజాత చేట్టు ఆకుల కషాయంని వాడండి* .
    *# నిరాటంగా 3 నెలలు ఈ మందులు తీసుకుంటే 15 - 20 రోజులు ఆపి ఆ తర్వాత 3 నెలలు తీసుకోవచ్చును*. 
         ధన్యవాదములు

  2. మీ నవీన్ నడిమింటి 

  3. విశాఖపట్నం 

  4. 9703706660


హెర్నియా సమస్య ఉన్న వాళ్ళు కు తీసుకోవాలిసిన జాగ్రత్త లు అవగాహనా కోసం ఈ లింక్స్ ను చుడండి




సారాంశం  

“గిలక”వ్యాధి లేదా Hernia అంటే శరీరంలో గజ్జలు భాగం, ఉదరం వంటి మృదు కణజాలం ఉన్న చోట్లలో, లేదా బలహీనమైన మెత్తని కండరాలున్నచోట్లలోని లోపలి భాగం లేదా అవయవం పైకి పొడుచుకొని వచ్చి “ఉబ్బు” లేదా గిలక రూపంగా కనబడుతుంది. ఈ ఉబ్బునే “గిలక” లేదా Hernia అంటారు. హెర్నియా వ్యాధిరకాల్లో గజ్జల్లో వచ్చేవే అత్యంత సాధారణమైనవి. గజ్జల్లో వచ్చేవి కొన్ని సూటిగా పొడుచుకొనిపైకొచ్చినట్లుండేవి, వంకర తిరిగుండే గిలకలూ ఉంటాయి. ఇంకా, పొత్తికడుపు, బొడ్డు,  కడుపు భాగంలో, రొమ్ముకు-కడుపుకు మధ్యభాగంలో (ఆపరేషన్ వల్ల అయిన కత్తిగాటు కారణంగా) తొడ పైభాగంలో వచ్చే గిలకలూ ఉంటాయి. హెర్నియా (గిలక) వ్యాధి లక్షణాలేవంటే అదున్నచోట బలుపు, ఉబ్బు, వాపు లేక నొప్పి ఉంటాయి. ఆపరేషనే (శస్త్ర చికిత్స) గిలక సమస్యకు పరిష్కారం. హెర్నియా వల్ల దెబ్బ తిన్న కండరాలను వాటి సరైన స్థానానికి చేర్చి పొడుచుకొచ్చిన చోట ఆపరేషన్ కోసం వైద్యులు చేసే చీలిక లేదా రంద్రాన్ని కుట్టేసి పూడ్చేస్తారు. వాపు, నొప్పి, శస్త్రచికిత్స చేసిన చోటి నుండి స్రావం హెర్నియా యొక్క  ఉపద్రవలక్షణాలుగా చెప్పవచ్చు. హెర్నియాకు ఆపరేషన్ చేసిన తర్వాత మంచి ఫలితాలుంటాయి. హెర్నియాకు ఒకసారి ఆపరేషన్ చేయించుకుని నయం చేసుకున్న తర్వాత బహుశా అది మళ్ళీ రాదనే చెప్పవచ్చు. హెర్నియాకు ప్రారంభదశలోనే చికిత్స చేయించుకోకపోతే కొన్నిసార్లు మరణం సంభవించే ప్రమాదం ఉ

హెర్నియా రకాలు 

పొత్తికడుపు గోడ (ఆంత్రవేష్టనం) కు సంబంధించిన సాధారణ గిలక వ్యాధుల్ని కింద వివరిస్తున్నాం.

  • గజ్జల్లో గిలక (ఇంగునాల్ (Groin) హెర్నియా)
    గజ్జభాగంలో వచ్చే గిలకవ్యాధి స్త్రీలకంటే మగవారికే అత్యంత సాధాణంగా  వస్తుంటుంది. గజ్జల ప్రాంతంలో వచ్చే గిలక, పొత్తికడుపు కింది గజ్జల ముడతలో- తొడ యొక్క చర్మాన్ని కూడా కలుపుకుని ఉంటుంది.గజ్జల్లో హెర్నియా రెండు రకాలు. అవి ప్రత్యక్ష హెర్నియా, పరోక్ష హెర్నియా. ప్రత్యక్ష మరియు పరోక్ష హెర్నియాలు గజ్జల్లో, తొడకు ఎగువ ప్రాంతంలో ఉబికినట్లుండి ‘ఉబ్బు’ గా కనిపిస్థాయి. ఏదేమైనా, ప్రత్యక్షహెర్నియా, పరోక్ష హెర్నియా ఈ రెండు రకాల గజ్జల హెర్నియాల మధ్య భేదం తెలుసుకోవడం  వైద్యపరంగా ముఖ్యమైనది, ఎందుకంటే దీనికి చికిత్సప్రణాళిక నిర్ణయించడమనేది దీనిపైన్నే ఆధారపడుతుంది.

పరోక్ష గౙ్జల హెర్నియా  (Indirect inguinal hernia)

  • పొత్తికడుపులో ఉండే పేగులవంటి భాగాలు గజ్జలు సందుల్లోని ‘లోతైన రింగ్’ లోనికి చొచ్చుకుని వచ్చి ‘బుడిపె’ లా పైకి కన్పించేదే పరోక్ష హెర్నియా. గిలక తిత్తి (hernial sac) గౙ్జల సందులోని ఉపరితల రింగు ద్వారా సాగి వృషణం లోనికి కూడా చొచ్చుకునివెళ్లి విస్తరించవచ్చు. ఈ గజ్జల నుండి వృషణం వరకు ఉండే దారి సాధారణంగా మనిషి జన్మించేందుకు ముందుగానే (తల్లి గర్భంలోనే) మూసుకుపోతుంది. కానీ చాలా కొందరిలో ఆ దారి అలా (పుట్టక) ముందే మూసుకుపోకుండా అలాగే ఉండడం వల్ల ఆ దారిగుండా హెర్నియా/ గిలక పెరిగేందుకు ఆష్కారమేర్పడుతుంది. ‘పరోక్ష గౙ్జల హెర్నియా’ మనిషికి ఏ వయసులోనైనా రావచ్చు మరియు ఇది హెర్నియా రకాల్లో అతి సాధారణమైంది. 
  • ప్రత్యక్ష గౙ్జల హెర్నియా (Direct inguinal hernia)ప్రత్యక్ష గౙ్జల హెర్నియా అనేది హెర్నియా రకాల్లో సంక్రమిక రకం. ప్రత్యక్ష గౙ్జల హెర్నియా (పిల్లలలో అసాధారణం), కడుపులో ఉన్న కండరాలు వంటి భాగాలు, ఉదర గోడ (సాధారణంగా హెస్సెల్బాచ్ యొక్క త్రిభుజం)లోని బలహీనప్రాంతంలో చొచ్చుకునిపోయి ఉపరితల గౙ్జల రింగ్ ద్వారా ఉబ్బి బయటకు పొడజూపుతాయి. ప్రత్యక్ష గిలక/హెర్నియా అప్పుడప్పుడు వృషణాల్లోకి కూడా దిగబడ్డం జరుగుతుంది.
  • తొడగిలక (Femoral Hernia)
    “ఫెమోరల్ కెనాల్” అని పిలువబడే తొడ సందునిర్మాణం ద్వారా పొత్తికడుపులోని కండరాది భాగాలు  చొచ్చుకుని వచ్చి ఉబ్బెత్తుగా, ‘బుడిపె’లాగా రూపుదిద్దుకుంటాయి. కాలు ఎగువన తొడ మధ్యభాగంలో సుమారుగా గజ్జల మడతలో ఈ బుడిపె చోటుచేసుకుంటుంది. ఈ తొడగిలక 2: 1 నిష్పత్తిలో పురుషుల కంటే ఎక్కువగా మహిళల్లోనే కానవస్తుంది, అందునా ఇది తల్లులలో రెట్టింపు అవుతుంది. అయినప్పటికీ, గజ్జల హెర్నియాలు తరచుగా స్త్రీలలో ఎక్కువగా సంభవిస్తుంటాయి. తరువాతి స్థానం కత్తిగాటు  హెర్నియాది, తరువాత మూడోసాధారణ రకంలో తొడగిలక/Femoral Hernia ఉంటుంది. ఇది ఎక్కువగా ఎడమవైపు కంటే కుడి వైపున్నే వస్తుంటుంది మరియు 15-20% మహిళల్లో కుడి, ఎడమ-రెండు వైపులా వస్తుంటుంది.
  • బొడ్డుగిలక (Umbilical Hernia)
    మనిషిలో నాభి లేదా బొడ్డు అనేది పుట్టినప్పుడు బొడ్డుతాడును అంటిపెట్టుకుని ఉండే శరీరభాగం. బొడ్డుగిలక (umbilical hernia) సమస్య పిల్లలు మరియు నవజాత శిశువులకు సాధారణంగా వస్తుంటుంది. బొడ్డులో వాపుదేలి, బుడిపె రూపంలో బయటికి పొడుచుకొచ్చినట్లు కానవస్తుందిది. పొత్తికడుపు గోడ కండరాలలోని ఒక సందు- పుట్టకముందే మూసుకోకపోవడంవల్ల సంభవిస్తుంది. సాధారణంగా అందరిలో ఈ పొత్తికడుపు గోడ కండరాల సందు జననానికి ముందే మూసుకుపోతుంది.  బొడ్డుగిలక వ్యాధిని మూడు భాగాలుగా విభజించవచ్చు:
    •  నవజాత శిశువుల బొడ్డుగిలక
    •  శిశువులు మరియు పిల్లల యొక్క బొడ్డుగిలక
    •  వయోజనులు బొడ్డుగిలక (మగ: ఆడ, 1: 5).
  • కత్తిగాటు గిలక (Incisional Hernia)
  • కత్తిగాటు గిలకను “శస్త్ర-చికిత్సానంతర గిలక” (post-operative hernia) లేక “ఉదర-సంబంధ గిలక” అని కూడా పిలుస్తారు. ఇది పొత్తికడుపుపై ఏదేని  శస్త్రచికిత్స తర్వాత సాధారణంగా ఏర్పడే బలహీనమైన ఘాటు/మచ్చ వలన ఏర్పడుతుంది. ఇది స్త్రీలలో చాలా సాధారణం. కత్తిగాటు గిలక (incisional hernia)కు దారితీసే కారకాలు క్రింది విధంగా ఉన్నాయి:
    • పెరిటోనిటిస్/భిన్నాంత్రోదరము (లేదా దీన్నే పెరిటోనిటిస్ అంటారు-ఇది పొత్తికడుపు కుహరం లోపలి గోడల కండరపొర. పొత్తికడుపు అవయవాలన్నింటిని తనలో దాచుకుని రక్షిస్తుందిది) శస్త్రచికిత్సల తరువాతి క్రిమి దోషం లేదా డ్యూడెనియల్ (డ్యూడెనమ్ అని పిలువబడే చిన్న ప్రేగులలో ఒక పుండు) మరియు ఇతర కారకాలు.
    • గతంలో శస్త్రచికిత్స చేసిన ప్రదేశం (ముఖ్యంగా ప్రసూతి శస్త్రచికిత్సల తరువాత ఏర్పడే బలహీనమైన మిడ్లైన్).
    • తగ్గిన కండరాల శక్తితో పాటు ఊబకాయం.
    • శస్త్రచికిత్స చేస్తున్నప్పుడు తప్పుడు టెక్నిక్ వాడటం.
    • శస్త్రచికిత్స తర్వాత ఉదరం యొక్క వాపు మరియు నిరంతర దగ్గుకు కారణమయ్యే జలోదరము లేదా అసైటెస్ (ఉదరం లో అధిక ద్రవం యొక్క సేకరణ).
    • తప్పుడు శస్త్రచికిత్స కోతలు (ప్రధానంగా నరములు తెగ్గోసిన  ప్రదేశాలలో).
  • స్పిజిలియన్ హెర్నియా (Spigelian Hernia)
    స్పిజిలియన్ హెర్నియా కండర సందుల్లో వచ్చే గిలకవ్యాధి. స్పీజిలియన్ హెర్నియా అనేది కండర కణాల మధ్య ఉండే చిన్న చిన్న సందు ప్రదేశాల గుండా చొచ్చుకునిపోయి  ఏర్పడుతుంది. ఇది పునరావృత గర్భాలు, ఊబకాయం, వయసు పెరగడం, కండరాల క్షీణత, దగ్గు వలన కలిగే ఆకస్మిక అలసట, భారీ వస్తువులను ఎత్తడం వలన కల్గుతుంది. ఇది పురుషులు మరియు స్త్రీలలో సమానంగా సంభవిస్తుంది.
  • ఛాతీలో వచ్చే హెర్నియా (Epigastric Hernia)
    ఛాతీలో వచ్చే గిలకవ్యాధి అంటే నాభి పైన రొమ్ము ఎముక క్రింద ఉన్న ప్రాంతం (ఎపిగాస్ట్రిక్ ప్రాంతం) లో దాపురించేవ్యాధి. ఎపిగాస్ట్రిక్ హెర్నియా సాధారణంగా కొవ్వు కణజాలంతో కూడిఉంటుంది మరియు చాలా అరుదుగా ప్రేగులకు సోకుతుంది. ఎపిగాస్ట్రిక్ గిలకవ్యాధి బాగా కండలు కల్గిన పురుషులు మరియు శారీరక శ్రమ చేసే కార్మికుల్లో చాలా సాధారణం. ఎపిగాస్ట్రిక్ హెర్నియా తరచుగా నొప్పిలేకుండా ఉంటుంది, కానీ కొందరిలో మాత్రం ఇదున్న ప్రదేశాన్ని తాకడంతోనే చాలా బాధాకరంగా ఉంటుంది. చాలా సందర్భాలలో ఎపిగాస్ట్రిక్ హెర్నియాలు జీర్ణకోశ పుండ్ల వ్యాధితో కూడుకుని ఉంటాయి.  
  • హియేటల్ హెర్నియా (Hiatal Hernia)
    హెర్నియా వ్యాధి సాధారణ రకాల్లో హియేటల్ హెర్నియా ఒకటి. రొమ్ముకు కడుపుకు ఉన్న నడిమిభాగము (డయాఫ్రమ్) రెండు ద్వారాలను కలిగి ఉంటుంది: ఒకటో ద్వారం అన్నవాహిక మరియు రెండవ ద్వారం బృహద్ధమని. (గుండెకు ఎడమపక్కన ఉండే పెద్దనెత్తుటి నాళమే బృహద్ధమని. ఈ బృహద్ధమని గుండె నుండి మిగిలిన శరీరానికి రక్తం తీసుకుపోయే పెద్ద రక్తనాళం). కడుపులో కొంత భాగాన్ని పైకి ఎత్తినప్పుడు గాని లేదా ఒత్తిడికి గురైనపుడు ఈ రెండు ద్వారాల్లో ఎదో ఒకదానిలోనికి చొచ్చుకునిపోయి ఈ హియెటల్ హెర్నియాకు దారి తీస్తుంది. ఈ రకం గిలకవ్యాధిలో పేగు మెలిపడి మూసి కొనిపోవుట జరిగి కడుపులో స్థితి మార్పుకు దారి తీస్తుంది. దీనివల్ల చాలా సందర్భాలలో గుండెల్లో మంట, నొప్పి, మరియు వాంతులు అవడం జరుగుతుంది.  
  • డియాఫ్రాగ్మాటిక్ హెర్నియా (Diaphragmatic Hernia)
    “డియాఫ్రాగ్మాటిక్” అనే ఈ రకమైన హెర్నియా సాధారణంగా పుట్టుకతో వచ్చే లోపము వలన కలుగుతుంది. ఇది కడుపు భాగం, ప్రేగులు , కాలేయం వంటి ఉదర అవయవాలను ఛాతీ కుహరంలోకి నెట్టడానికి కారణమవుతుంది. 
  • లుంబార్ హెర్నియా(Lumbar Hernia)
    లుంబార్ హెర్నియాలో ప్రాథమిక మరియు ద్వితీయ అని రెండు రకాలు. ప్రాథమిక లుంబార్ హెర్నియా చాలా అరుదైనది, మరియు గుర్తించదగిన కారణము లేకుండా శరీర నిర్మాణ లోపము వలన సంభవిస్తుంది. అయితే ద్వితీయ లుంబార్ గిలకవ్యాధి శస్త్రచికిత్స కారణంగా వస్తుంది మరియు ముఖ్యంగా మూత్రపిండవ్యాధుల శస్త్రచికిత్సల తరువాత సర్వసాధారణంగా వస్తుంది.  

డ్యూయల్ హెర్నియా, ప్రీవెసికాల్ హెర్నియా, లిట్రే యొక్క హెర్నియా, మేడెల్స్ హెర్నియా మరియు స్లైడింగ్ హెర్నియా వంటి కొన్ని ఇతర రకాల  హెర్నియాలు అరుదుగా కనిపిస్తాయి.

హెర్నియా అంటే ఏమిటి? 

శరీరంలో ఏదేని అంతర్గత అవయవం లేదా కొవ్వు కణజాలము తన చుట్టూ ఉన్న మృదు కణజాలం లేదా బలహీనమైన మెత్తని కండరాలున్నచోట్లలో పైకి పొడుచుకొని వచ్చి “బుడిపె” లాగానో లేదా “ఉబ్బు” గానో కనబడుతుంది, ఇలా పైకి పొడుచుకొచ్చే ఉబ్బునే “హెర్నియా” లేదా “గిలక” వ్యాధి అంటాము. హెర్నియా పురుషులు, మహిళలు మరియు చిన్నపిల్లలక్కూడా వస్తుంది. ఊబకాయుల్లో ఇది చాలా సర్వసాధారణం. పేగుల్లోని ఏదేని భాగం లేదా తిత్తి పొత్తికడుపు గోడల ఖాళీ లోనికి చొచ్చుకుని పోయి బుడిపె లేక “గిలక” లేదా హెర్నియాగా పైకి కనబడుతుంది. ఇలా పైకి పొడుచుకొచ్చిన దాన్నే “గిలక తిత్తి” (hernia sac) అని అంటారు. ఈ గిలక తిత్తిలోనికి పొత్తికడుపు వెలుపలి గోడ (ఆంత్రవేస్టనం), కడుపుభాగం, బోజ్జకొవ్వు, పేగుల్లోని కొంత భాగం చొచ్చుకొనివచ్చి ఉండచ్చు. తత్ఫలితంగా, బుడిపె లాగా పైకి ఉబికొచ్చి గిలకలాగా స్పష్టంగా కనబడుతుంది.

గిలక వ్యాధి (హెర్నియా) లక్షణాలు 

గిలకవ్యాధి పొడజూపే లక్షణాలు చాలా వేరు వేరుగా ఉంటాయి. ఉదాహరణకు

  • కడుపు లేదా పొత్తికడుపు వంటి శరీర భాగాల్లో నొప్పిలేని ముద్దగానో లేక నొప్పితో కూడుకున్న వాపు గాని లేదా పొడుచుకొచ్చిన మృదువైన బుడిపెగా  గాని ఉద్భవించడం జరుగుతుంది, ఇలా బయటికి పొడుచుకొచ్చిన బుడిపెను తిరిగి కడుపులోనికి ఒత్తేసి, లోనికి నెట్టేసి సరిచేయచ్చు లేక అలా లోపలికి ఒత్తేయలేకనూ పోవచ్చు. ఉదరం లేదా కటి ప్రాంతంలో నొప్పి ఉండడం అనేది గిలకవ్యాధి (హెర్నియా) యొక్క సాధారణ లక్షణం.
  • అన్నిరకాల గిలక వ్యాధులు సమస్యాత్మకం కాదు,  నొప్పినీ కల్గించవు. అయితే, సామాన్యంగా, కొన్ని గిలకవ్యాధివల్ల అప్పుడప్పుడు నొప్పి, మండినట్లుండేది, ఒత్తిడి లేదా లాగినట్లుండడం జరుగుతుంది, ముఖ్యంగా తీవ్ర శారీరక శ్రమ చేసినపుడు పై లక్షణాలు కన్పిస్తాయి. తీవ్రమైన ఒత్తిడికి గురైన ఉదర కండరాలు గిలకవ్యాధి నొప్పికి కారకం.  
  • హియేటల్ హెర్నియాలో, ఖాళీ కడుపుతో ఉన్నపుడు ఎగువ ఉదరంలో నిస్తేజంగా ఉండే నొప్పి ఉంటుంది. గిలకవ్యాధి (హెర్నియా)కి ప్రారంభంలోనే చికిత్స చేయకపోతే వ్యాధి పెరిగేకొద్దీ వాంతి కూడా సంభవిస్తుంది. (మరింత సమాచారం: కడుపు నొప్పి కారణాలు మరియు చికిత్స)
  • గజ్జల్లో వచ్చే హెర్నియాలో గడ్డలాంటి ఉబ్బు కలుగుతుంది. గజ్జల్లో ఉండే  నరాలు కూడా ఉబ్బులో భాగమైతే ఆ నరాలు వచ్చినపుడు తీక్షణమైన నొప్పి, మండినట్లుండే నొప్పి లేదా రెండింటిని కూడా కలిగించొచ్చు. మెలితిరిగి,  చనిపోయిన ప్రేగును కల్గిన గిలక వ్యాధి మరింత ముదిరితే వికారం, వాంతులు మరియు జ్వరం కూడా సంభవించవచ్చు.
  • పిల్లలలో బొడ్డుప్రాంతంలో వాపు సంభవించినపుడు “బొడ్డుగిలక” వ్యాధి వస్తుంది. పెద్దలలో కూడా బొడ్డు ప్రాంతంలోని వాపు కారణంగా బొడ్డు గిలక కనిపిస్తుంది. దగ్గినప్పుడు లేదా ఎక్కువ శ్రమ పడి అలసట కలిగినపుడు బొడ్డుగిలక వ్యాధి మరింత పెరుగుతుంది. అప్పుడప్పుడూ లాగినట్లుండే నొప్పి కూడా ఉంటుంది.
  • కత్తిగాటు గిలకవ్యాధి (Incisional hernia) ఎప్పుడు సంభవిస్తుందంటే శస్త్రచికిత్స అనంతరం నాలుగో రోజున సూత్ర రేఖ వెంట చీము వంటి ద్రవస్రావం కలగటాన్ని గుర్తించిన్నపుడు. దీన్నే ఈ వ్యాధికి సూచనగా గ్రహించొచ్చు. ఇంకా, శస్త్రచికిత్స సమయంలో సంక్రమణ చరిత్ర కూడా ఇందుకు ఒక సంకేతం. శస్త్రచికిత్సకు సంబంధించిన మచ్చ ప్రాంతంలో గుబ్బ  లేదా వాపు కనిపిస్తుంది.

హెర్నియా కారణాలు మరియు ప్రమాద కారకాలు 

కారణాలు  

బలహీనమైన శరీర కణజాలాలు (ఉదర కండరాలు మరియు అనుబంధ బంధన కణజాలం) గిలకవ్యాధుల ప్రమాదాన్ని పెంచే కారకాలుగా చెప్పచ్చు. కొంతమందిలో బలహీనమైన బంధన కణజాలం పుట్టుకతోనే వస్తుంది. ఇంకొంతమందిలో వయసు ముదిరేకొద్దీ బంధన కణజాలం బలహీనమవుతుంది. అనారోగ్యం లేదా పునరావృతమయ్యే శస్త్రచికిత్సల కారణంగా కూడా కండర కణజాలం మరియు కండరాలు బలహీనమవుతాయి. అంతేకాకుండా, కడుపు ఒత్తిడిని పెంచే నిరంతర కఠినమైన భౌతిక చర్యలు లేదా సంబంధిత పరిస్థితులు, అప్పటికే శరీరంలో ఉన్న గిలకవ్యాధి/ హెర్నియా మరింత క్షీణించేందుకు దోహదం చేస్తాయి. ఉదాహరణకి,

  • ఊబకాయంమూలంగా పొత్తికడుపులో ఒత్తిడి పెరుగుతుంది.
  • ఆకస్మికంగా భారీ బరువుల్ని ఎత్తినప్పుడు నిరంతరంగా వచ్చే దగ్గు.
  • ప్రేగుల కదలికలో ప్రయాస గాని బెణుకు గాని లేదా మూత్రవిసర్జన సమయంలో ప్రయాస.
  • ప్రోస్టేట్ గ్రంధి పెరుగుదల 
  • పోషకాహారాల కొరత కారణంగా.
  • మగవారిలో పొడజూపిన గిలకవ్యాధిని వైద్యుడిచేత పరీక్షించుకోక పోవడం.  
  • స్త్రీలలో ప్రసూతి శస్త్రచికిత్సలు లేదా పలుసార్లు గర్భం ధరించడం మూలాన.  . పొత్తికడుపులో ద్రవ సేకరణ.

ప్రమాద కారకాలు

గిలకవ్యాధికి సంబంధం ఉన్న అనేక ప్రమాద కారకాలు ఉన్నాయి. ఉదాహరణకు  

  • వారసత్వం. కుటుంబంలోనివారికి/పూర్వీకులకు గిలకవ్యాధి కల్గిన చరిత్ర.  
  • ధూమపానం.
  • మలబద్ధకం.
  • ఆటలు (sports) ఆడేసమయంలో గాయం కావడం.
  • ఊబకాయం.
  • ఊపిరితిత్తుల పరిష్టితి. ఉబ్బసం మరియు సిఓపిడి (COPD,Chronic obstructive pulmonary disease) వ్యాధులతో  సహా.
  • గర్భం మరియు కానుపు నొప్పులు.
  • జలోదరము (Ascites), శస్త్రచికిత్స, స్టెరాయిడ్స్ మరియు మత్తుమందుల దురుపయోగం.

గిలకవ్యాధి నివారణ 

గిలకవ్యాధి (హెర్నియా) నివారణ ఆ వ్యాధి రకాన్ని బట్టి ఉంటుంది. ఉదాహరణకి,

  • కత్తిగాటు గిలకవ్యాధులను (Incisional hernias) నివారించడానికి, అధిక ఒత్తిడికి కారణమయ్యే చర్యలు చేపట్టకూడదు. శస్త్రచికిత్స తరువాత భారీ వస్తువులని మోయడం, మలవిసర్జన సమయంలో ప్రయాస, మరియు అధిక దగ్గు వంటివాటిని నివారించుకోవాలి. మితిమీరిన ఒత్తిడిని ఎదుర్కొనే శ్రమ తీసుకోకుండా పుష్కల విశ్రాంతి తీసుకోవడంపై దృష్టి పెట్టాలి.
  • ఊబకాయం మరియు అధిక బరువును కల్గిఉండటం కత్తిగాటు గిలకవ్యాధికి ప్రమాద కారకాలు, కనుక, మీ బరువును అదుపులో ఉంచడం ఉత్తమం.
  • అంతేకాకుండా, సరైన వ్యక్తిగత పరిశుభ్రతను పాటించడం, శస్త్రచికిత్సాసంబంధమైన కత్తిగాటు ప్రాంతాన్నిస్టెరిలైజ్ (క్రిమిసంహారచర్యలు) చేయడం ద్వారా శుభ్రపరుచుట, కట్టుకట్టడం, వైద్యుడికి తరచూ చూపించి చికిత్స తీసుకోవడం వంటి చర్యలు కత్తిగాటు గిలకవ్యాధిని తగ్గించేందుకు సహాయపడతాయి.
  • శస్త్రచికిత్సా గాయాల యొక్క మెరుగైన వైద్యం కోసం ధూమపానాన్ని పూర్తిగా మానుకోవడం చాలా అవసరం. ఈ చర్య కూడా కత్తిగాటు గిలకవ్యాధి (ఇన్సిజనల్ హెర్నియస్) ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
  • డయాబెటిస్రక్తహీనత, మరియు రక్తపోటు (అధిక రక్తపోటు/ అల్ప రక్తపోటు) వంటి వ్యాధులను సరైనరీతిలో చికిత్సద్వారా నయం చేసుకుంటే “కత్తిగాటు గిలకవ్యాధి” నుండి కూడా త్వరగా కోలుకోవచ్చు. (మరింత సమాచారం: అధిక రక్తపోటు చికిత్స)
  • మల విసర్జన, మూత్రవిసర్జన సమయంలో ప్రయాస పడుతున్నట్లైతే, ఆ ప్రయాసను “పొత్తికడుపు గిలకవ్యాధి”, “కత్తిగాటు గిలకవ్యాధి” విషయంలో తగ్గించుకోవాలి. భారీ వస్తువులను ఎత్తడమనే చర్యను సాధ్యమైనంతవరకూ పూర్తిగా విడనాడాలి. బరువైన వస్తువులను ఎత్తేపని చేసేటపుడు మోకాళ్లపైకి వంగడం ద్వారా చేయాలి గాని నేరుగా  వీపును వంచడం ద్వారా చేయకూడదు.

గిలకవ్యాధి నిర్ధారణ 

  • గిలకవ్యాధి (హెర్నియా) విశ్లేషణకు వైద్యుడిచేత చేయించుకునే ఓ వివరణాత్మక శారీరక పరీక్ష సరిపోతుంది. నిటారుగా నిలబడితే చాలు గిలకవ్యాధికి సంబంధించిన  కండరాల వాపు లేదా ఉబ్బు కనిపిస్తుంది. లేదా నేరుగా మీ చేతిని వాపు/ఉబ్బుపై వేసి స్పృశించడం ద్వారా లేక కిందికి వంగి పరీక్షించుకోవడం ద్వారానూ తెలుసుకోవచ్చు.
  • అల్ట్రాసౌండ్లు ప్రక్రియ సాయంతో తొడలో దాపురించే గిలకవ్యాధిని చూడవచ్చు. ప్రేగుల్లో అవరోధం ఉన్నట్లు అనుమానమొస్తే X-రే సాయంతో పరీక్షించొచ్చు. గతంలో అయితే, 'హెర్నియాగ్రామ్' అనే ప్రక్రియ ద్వారా పరీక్షించేవారు, కానీ అందులో ఉన్నటువంటి శరీరం లోపలికి పరికరాలను జొప్పింపచేసే క్రియ కారణంగా దాన్ని ప్రస్తుతం నిలిపివేయడం జరిగింది.
  • సిటి (CT) & ఎంఆర్ఐ (MRI) స్కాన్ లను కొన్ని సందర్భాల్లో సూచించవచ్చు.
  • బేరియం అని పిలువబడే ఖనిజరంగును కొన్ని వ్యాధినిర్ధారణా పరీక్షలకు వినియోగించడం అవసరమవుతుంది. “బేరియం మీల్ స్టడీ” అని దీన్ని పిలుస్తారు. పరీక్ష చేయించుకునే వ్యక్తి చేత ఈ బేరియం రంగు కల్గిన పదార్థాన్ని త్రాగించడమో లేక తినిపించడమో జరుగుతుంది. జీర్ణాశయంలో ఏదైనా అసాధారణ పరిస్థితి జీర్ణవాహికలో ఉన్నట్లయితే ఎక్స్-రేలో ఈ రంగుద్వారా చూసి కనుక్కోవచ్చు.
  • ఎండోస్కోపీ పద్ధతిలో కెమెరా బిగించిన సన్నని గొట్టాన్ని నోటి ద్వారా కడుపులోకి ప్రవేశపెట్టడం జరుగుతుంది. హియేటల్ హెర్నియా విషయంలో ఈ ఎండోస్కోపీ ని ఉపయోగిస్తారు. అంతర్గత లోపాలను చూసేందుకు మరియు హియేటల్ హెర్నియాను నిర్ధారించడానికి ఎండోస్కోపీని రోగికి నిర్వహిస్తారు.

హెర్నియా చికిత్స 

శస్త్రచికిత్స (Surgery)

శస్త్రచికిత్సే గిలకవ్యాధిని నయం చేసుకునేందుకు సరైన ఎంపిక. గిలక ఉబ్బులోనికి చొచ్చుకొచ్చిన భాగాల్ని లేదా అవయవాల్ని ఉదరంలోని వాటి యథా స్థానాల్లోకి నెట్టడం లేదా పూర్తిగా తొలగించివేయడం మరియు కుట్లు వేసి  ఏర్పడిన రంధ్రాన్ని మూసివేయడం అనేది ఉంటుందీశస్త్ర చికిత్సలో. గిలక ఏర్పడడానికి కారణమైన బలహీనమైన కణజాలం మరియు కండరాలకు మద్దతు (supportive) గా మెష్ (సింథెటిక్ లేదా జంతు-సంబంధ పదార్థంతో తయారైన కృత్రిమమైన వలవంటిది)  ఉపయోగించబడుతుంది.

ఈ శస్త్రచికిత్సను రెండు విధాలుగా చేయవచ్చు: 1. ఓపెన్ లేదా సంప్రదాయిక శస్త్రచికిత్స మరియు 2. అతి తక్కువగా జొప్పించే క్రమమున్న శస్త్రచికిత్స లేదా లాపరోస్కోపిక్ శస్త్రచికిత్స. సంప్రదాయిక ఓపెన్ శస్త్రచికిత్సలో, గిలక (ఉబ్బు)  ఉన్న చోట ఒక పొడవైన మరియు పెద్ద కట్ లేదా చీలిక చేసి లోపల ఉండే బలహీనమైన కండరాలకు వైద్యులు మరమ్మతులు చేస్తారు. లాపరోస్కోపిక్ లేదా “కీహోల్” శస్త్రచికిత్సలో, పలు చిన్న రంధ్రాలు లేదా కోతలు పెడతారు, తర్వాత ట్యూబ్-వంటి పరికరాలను ఉపయోగించి శస్త్రచికిత్స నిర్వహిస్తారు. ఒక మానిటర్ మీద వైద్యుడికి ఒక వివరణాత్మకమైన వీక్షణ పొందటానికి, అవసరమైన ప్రక్రియ నిర్వహించడానికి శస్త్రచికిత్సలో భాగంగా ఒక కెమెరా కూడా అమర్చబడి ఉంటుంది.  

గజ్జల్లో ఏర్పడ్డ గిలకవ్యాధులకు, హెర్నియోటమీ, హెనియోర్రఫ్ఫి, లేదా హెర్నియోప్లాస్టీ అనేవి కీలక శస్త్రచికిత్సా పద్దతులు. “కుంట్జ్ ఆపరేషన్,” ఆండ్రూ యొక్క ఇంబ్రికేషన్స్ (imbrications), లేదా మ్వేవే లేదా న్హ్యూస్ రిపేర్ వంటి ఇతర శస్త్రచికిత్స విధానాలను కూడా అవసరాన్ని బట్టి వైద్యుడు నిర్ణయిస్తాడు. ఇలాంటి అనేక రకాల గిలకవ్యాధుల్ని నయం చేయడానికి  వేర్వేరు శస్త్రచికిత్సలను చేస్తారు.

శస్త్రచికిత్స మాత్రమే గిలకవ్యాధికి ఎల్లప్పుడూ ప్రత్యామ్నాయం కాదు. మీకు ఉన్న గిలకవ్యాధి ఎలాంటి ఆరోగ్య సమస్యల్నికలిగించనట్లయితే శస్త్రచికిత్స ఏమాత్రం అవసరము లేదు. అంతేకాకుండా, వయసై పోయిన ముసలివారికి, తీవ్రంగా అనారోగ్యంతో ఉన్నవారికి శస్త్రచికిత్సను తప్పించవచ్చు.  

మందులు (Medications)

అప్పుడప్పుడు, హియాటల్ హెర్నియా సమయంలో, మందుల అంగడిలో  (over the counter medicines) దొరికే మందులు/ఉత్పత్తులు మరియు ఇతర మందులు కడుపు ఆమ్లం సమస్యని తగ్గిస్తాయని సూచించబడవచ్చు, తద్వారా మీరు ఎదుర్కొంటున్న అసౌకర్యం మరియు ఇతర లక్షణాలను ఉపశమనం చేస్తాయి. వీటిలో కొన్ని మందులు నొప్పిని సంహరించేవి,  కడుపులో ఉండే ‘హిస్టమిన్’ అనే పదార్థానికి వ్యతిరేకంగా పనిచేసే H-2 రిసెప్టర్ బ్లాకర్స్, యాంటాసిడ్లు మరియు ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ (కడుపు ఆమ్లం ఉత్పత్తిని తగ్గించే మందులు).

జీవనశైలి నిర్వహణ (Lifestyle management)

ఆహారంలో మార్పులు చేసుకోవడం ద్వారా తరచుగా హియాటల్ హెర్నియా లక్షణాలకు చికిత్స చేయవచ్చు కానీ పూర్తిగా నయం చేయలేవు. నాణ్యమైన మరియు పరిమాణపరంగా భారీ భోజనం చేయడం మానుకోవాలి. భోజనమైన తర్వాత వెంటనే పడుకోకూడదు మరియూ అధిక శ్రమతో కూడిన భౌతికమైన పనుల్ని చేయకూడదు. దట్టమైన మసాలాలు కల్గిన పదార్థాలు లేదా అతి పుల్లని ఆహారాలను తీసుకోవడం మానుకోవడం ద్వారా హియాటల్ హెర్నియా రోగులు ఆమ్లము తిరిగి తిరిగి ఊరడం (acid reflux) అనే సమస్యను తగ్గించవచ్చు. అంతేకాక, వ్యాధి లక్షణాలున్నంత వరకూ ధూమపానం పూర్తిగా మానుకోండి. శరీర బరువును అదుపులో ఉంచాలి, వ్యక్తి యొక్క ఎత్తుననుసరించి బరువును నియంత్రించడానికి చర్యలు తీసుకోవాలి.

కొన్ని వ్యాయామాలు శరీరంలో హెర్నియా వ్యాధి కల్గిన చోటు చుట్టూ కండరాలను బలోపేతం చేయడానికి సహాయపడతాయి, అంతే కాకుండా  ఇవి కొన్ని వ్యాధిలక్షణాలను తగ్గించవచ్చు కూడా. అయినప్పటికీ, వ్యాయామాలను అర్హత కలిగిన మార్గదర్శకుని పర్యవేక్షణ లేకుండా అభ్యాసం చేయడం వలన వ్యాధి లక్షణాలను మరింత పెంచవచ్చు మరియు పరిస్థితిని మరింత విషమం చేస్తుంది. అందువల్ల, ఒక ఫిజియోథెరపిస్టును సంప్రదించి, అతని/ఆమె పర్యవేక్షణలో వ్యాయామాలు చేసుకోవడం ఉత్తమం.

అవసరమైన అన్ని నివారణాచర్యలను చేపట్టిన తరువాత కూడా వ్యాధి లక్షణాలు ఉపశమనం కాకపోతే, గిలకవ్యాధి/హెర్నియాని నయం చేసుకోవడానికి శస్త్రచికిత్స చేయించుకోవచ్చు.  

హెర్నియా రోగ నిరూపణ

రోగ నిరూపణ

సమయానుసారంగా రోగనిర్ధారణ మరియు చికిత్స చేస్తే గిలకవ్యాధి-సంబంధిత  (హెర్నియాల్) చికిత్స యొక్క ఫలితం సాధారణంగా బాగుంటుంది. చికిత్సా ఫలితం యొక్క స్వభావం గిలకవ్యాధి యొక్క రకం మరియు దాని పరిమాణంపై ఆధారపడి ఉంటుంది, ఇంకా,  ఇది గిలకవ్యాధిని (హెర్నియా) పెంచే కారకాల సంఖ్యను తగ్గించడంపైనా ఆధారపడి ఉంటుంది.

వృద్ధాప్యం, చాలా కాలం నుండి గిలకవ్యాధికి చికిత్స చేయించుకోకపోవడం లేక గిలక భాగంగా ఏర్పడ్డ భాగాల్ని సరిచేసి తిరిగి వాటిని (లోపమున్న చోటికి) యథాతథంగా చేర్చకుండా పోవడం వంటివి అకస్మాత్తుగా ఊపిరి ఆగిపోయే పరిస్థితి లేక ప్రేగుల్లో అడ్డంకులు ఏర్పడడం వంటి ప్రమాదకారకాలకు దారి తీస్తాయి. ఇవి వైద్యరీత్యా అత్యవసరమైన పరిస్థితులు (అంటే హుటాహుటిన చికిత్సనందించాల్సిన ప్రమాదకరమైనవి). పొత్తికడుపు గిలకవ్యాధి (హెర్నియా) సాధారణంగా పిల్లలలో పునరావృతం కాదు కాని, 10% మంది పెద్దవారిలో మరలా మరలా వచ్చే ప్రమాదముంది.

బాల్యం ప్రారంభంలోనే శస్త్రచికిత్స మరియు సకాలంలో రోగనిర్ధారణ చేయడం వల్ల గిలకవ్యాధి విషయంలో అద్భుతమైన ఫలితాలు సాధించడానికి వీలుంది.  

ఉపద్రవాలు (Complications)

సాధారణంగా, గిలకవ్యాధి (హెర్నియా) శస్త్రచికిత్స తర్వాత వచ్చే సమస్యలు ఎక్కువ సంఖ్యలో ఏమీ లేవు. అయితే, ఒకవేళ అలాంటి సమస్యలేవైనా తలెత్తితే దానికి మరమ్మత్తుగా చేసే శస్త్రచికిత్సను చేయని ఎడల లేదా ఆ శస్త్రచికిత్సను సవ్యంగా చేయకపోతే, అది కొన్ని తీవ్రమైన సమస్యలకు దారితీస్తుంది, అవి:

  • తగ్గించేందుకు సాధ్యం కాని (Irreducibility) పరిస్థితి.
  • అడ్డంకిగా తయారైన గిలకవ్యాధి.
  • వ్రేలాడదీయబడిన హెర్నియా.
  • కందిపోయిన/ఎర్రబడిన హెర్నియా.
  • గిలకవ్యాధి ప్రాంతంలో మాంసాన్ని కుళ్ళబెట్టే (గాంగ్రెన్) పుండు.
  • శస్త్రచికిత్స చేసినచోట తిమ్మిరి.
  • గిలకవ్యాధి (హెర్నియా) చికిత్సకు ఉపయోగించే వలలాంటి జాలీ (mesh) ని రోగస్థితి తిరస్కరిం

గిలక వ్యాధి (హెర్నియా) కొరకు మందులు

Medicine NamePack Size
RabletRablet 10 Tablet
R Ppi TabletR Ppi 20 Mg Tablet
HelirabHelirab-20 Injection
RabiumRabium 10 Tablet
RantacRantac Injection 2ml
Rekool TabletRekool 10 Tablet
RabelocRabeloc 10 Tablet
ZinetacZinetac 150 Tablet
AcilocAciloc 25 mg Injection 2 ml
Rablet D CapsuleRablet D Capsule
Razo DRazo D Tablet
Rekool DRekool 40 D Capsule
RazoRAZO 20MG TABLET
Veloz DVeloz D Capsule SR
Erb DsrErb Dsr 30 Mg/20 Mg Capsule
Reden OReden O Tablet
Rabeyog DSRRabeyog DSR Capsule
ZadorabZadorab Tablet
R T DomR T Dom 10 Mg/150 Mg/20 Mg Tablet
Rezol DsrRezol Dsr Capsule
ZebraZebra Tablet
Fast DsrFast Dsr 30 Mg/20 Mg Capsule
AcifluxAciflux Capsule
Rabigold LRabigold L Capsule
ZnrZNR 10 Tablet

ధన్యవాదములు 

మీ నవీన్ నడిమింటి 

విశాఖపట్నం 

9703706660

అస్వీకార ప్రకటన: ఈ సైటుపై లభ్యమవుతున్న మొత్తం సమాచారము మరియు లేఖనము కేవలం అవగాహనా ఆవశ్యకతల కొరకు మాత్రమే. ఇక్కడ ఇవ్వబడిన సమాచారమును ఏదైనా ఆరోగ్య సంబంధిత సమస్య లేదా అస్వస్థత నుండి కోలుకోవడానికి లేదా స్వస్థత కొరకు నిపుణుల సలహా లేనిదే ఉపయోగించుకోకూడదు. చికిత్స పరీక్షలు మరియు సేవల కొరకు ఎల్లప్పుడూ ఒక అర్హత పొందిన వైద్యుల సలహా తీసుకోవాలి.