2, మార్చి 2021, మంగళవారం

రోజు సరిగా నిద్ర పట్టడంలేడా నిద్ర సమస్యకు తీసుకోవాలిసిన జాగ్రత్త లు అవగాహనా ఈ లింక్స్ లో చూడాలి


నిద్ర పట్టడం లేదు మేలుకో వచ్చుంటే నిద్ర పాటు తలనొప్పి వస్తుంది దీనికి మంచి పరిష్కారం నవీన్ నడిమింటి సలహాలు 

 , Sleep

 


నిద్ర లేదా నిదుర (Sleep) ఒక శరీరానికి సంబంధించిన విశ్రాంతి స్థితి. ఇది జంతువులలోనే కాకుండా పక్షులు, సరీసృపాలు, ఉభయచరాలు మరియు చేపలలో కూడా కనిపిస్తుంది. మనుషులు, ఇతర జంతువులలో దైనందిక నిద్ర బ్రతకడానికి అవసరం. 8 గంటల కంటే తక్కువ నిద్రపోయిన వారిలో శరీర సామర్ధ్యం తగ్గినట్లుగా గుర్తించారు. అయితే నిద్ర యొక్క ప్రాముఖ్యత గురించి ఇంకా పూర్తిగా అర్ధం కాలేదు. విస్తృతమైన పరిశోధనలు జరుగుతున్నాయి. గాలి ,నీరు , ఆహారము లాగే నిద్ర కూడా ఒక సహజ శారీరక అవసరము . ఎవరెన్ని గంటలు నిద్రపోవాలన్న అంశం పైన భిన్నాబిప్రాయాలు ఉన్నా వేళకు తిని , వేళకు పడుకుంటే ఆరోగ్యాము నిక్షిప్తం గా ఉంటుంది . అలసిన మనసుకు , తనువుకు నిద్ర ఒక వరము . నిద్రలో శరీరానికి తగినంత విశ్రాంతి కలుగు తుంది . . . కలతపడ్డ మనసు కుదుట పడుతుంది . చాలినంత నిద్రలేక పోతే అది చాలా రుగ్మతల్కు దారి తీస్తుంది . మనసు మీద ప్రభావము చూపుతుంది . శారీరక జీవక్రియలు దెబ్బతింటాయి.


ఎన్ని గంటలు నిద్రపోవాలి

సామాన్యంగా పిల్లలకు పెద్దలకంటే ఎక్కువగా నిద్ర అవసరం. ఇది వారి శారీరక పెరుగుదలకు మానసిక అభివృద్ధికి చాలా అవసరం. అప్పుడే పుట్టిన పిల్లలైతే సుమారు 18 గంటల నిద్ర అవసరం, వారు పెరుగుతున్న కొద్దీ ఇది తగ్గిపోతుంది.


  • వయసు ---------రోజుకు కావలసిన సగటు నిద్ర
  • పురిటిబిడ్డ -------సుమారు 18 గంటలు
  • 1–12 నెలలు--------------14–18 గంటలు
  • 1–3 సంవత్సరాలు---------12–15 గంటలు
  • 3–5 సంవత్సరాలు ---------11–13 గంటలు
  • 5–12 సంవత్సరాలు ---------9–11 గంటలు
  • యువకులు -----------------9-10 గంటలు
  • పెద్దవారు --------------------7–8 గంటలు
  • గర్భణీ స్త్రీలు -----------------8 (+) గంటలు

ప్రయోజనం

  • నిద్ర వలన మెదడుకు విశ్రాంతి దొరుకుతుంది. దానితో జ్ఞాపకశక్తి పెరుగుతుంది.
  • శరీరంలో రోగ నిరోధక శక్తిని అభివృద్ధి చేస్తుంది.
  • నాడీ వ్యవస్థ సరిగా పనిచేసేందుకు దోహదం చేస్తుంది.
  • హార్మోన్ల ఉత్పత్తి, నియంత్రణ నిద్ర వలన సక్రమంగా జరుగుతుంది.
నిద్రలో దశలు :
రాత్రి నిద్రపోయే సమయాన్ని రెండు రకాలుగా గుర్తిస్తారు. " రెమ్‌ " , "నాన్‌ రెమ్‌"  అని .
రెమ్‌ అంటే " రాపిడ్ ఐ మూవ్ మెంట్ " అనేదానికి సంక్షిప్త నామము . ఇందులో నాలుగు దశలుంటాయి.  
1. తొలి దశ 5 నిముషాలే . ఇది నిద్రలోకి వెళ్ళేదశ . కనురెప్పలు కింద కళ్ళు కదులుతూ ఉంటాయి. ఈ దశలో చిన్న శభ్దానికైనా వెంటనే మెలకువ వస్తుంది .
 
నిద్ర లేమి :
ఏ కారణము చేతనైనా నిద్ర పట్టకపోవడం , సరిగా నిద్రపట్టకపోవడం ను నిద్రలేమి అంటాము . దీనివలన ఆరోగ్యము చెడిపోతుంది .
నిర్వచనము : నిద్ర రావడం లేదని చెప్పే వారిలో కనిపించే ప్రధాన సమస్య నిద్రలేమి (ఇన్‌సోమ్నియా). దాదాపు 15 నుంచి 30 శాతం మందిలో ఈ సమస్య ఉంటుంది. 'వారానికి కనీసం మూడు రోజులు, కనీసం ఒక నెలపాటు నిద్రపట్టడానికి ఎక్కువ సమయం తీసుకోవడం, మధ్యలో మెలకువ రావడం, రోజూ నిద్రలేవడానికంటే ముందుగా మెలకువరావడం' జరిగితే వాళ్లు నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నట్లు. పడుకున్న తర్వాత 20 నిమిషాల్లో నిద్రపోవడం సాధారణం. కానీ 30 నిమిషాలు గడిచినా నిద్ర రాకుంటే సమస్య ఉన్నట్లు గమనించాలి.
కారణాలు :
  • దైనందిన జీవితం లో పని వత్తిడి ,
  • మానషిక వత్తిడి ,
  • టీవీ చూడడం ,
  • కంప్యుటర్ పై పనిచేయడం ,
  • కుటుంబ సమస్యలు ,
  • ఆర్ధిక సమస్యలు ,
  • ఆహార నియమాలు ,
  • చెడ్డ అలవాట్లు ,

నిద్రలేమి నుండి బయటపడడానికి కొన్ని చిట్కాలు :
  • రాత్రి 9 గంటలు దాటిన తరువాత ఆల్కహాలు తీసుకోడదు . ఆల్కహాలు మధ్యలో నిద్రను చెడగొడుతుంది .
  • రాత్రి 7 గంటలు తరువాత తీ , కాఫీ , కెఫీన్ ఉన్న పానీయాలు తీసుకోకూడదు ,
  • రాత్రి చాలా పొద్దుపోయిన తర్వాత ఆహారం కూడదు.
  • రాత్రులు ఎక్కువగా ఆహారము (full meal) తినకూడదు ,డిన్నర్‌లో తేలిగ్గా జీర్ణమయ్యే ఆహార పదార్థాలను మాత్రమే తీసుకోవాలి.
  • పడుకునే ముందు వ్యాయామము చేయకూడదు ,
  • పడక గదిని ... పనిచేసే ఆఫీస్ గది గా మార్చకూడదు ,
  • పడుకునే ముందు వేడిపాలు తాగితే మంచి నిద్ర వస్తుంది .
  • నిద్ర రానపుడు ఏదైనా మంచి పుస్తమును చదవాలి ,
  • నిద్రపోయేముందు వేడినీళ్ళ స్నానము చేస్తే మంచి నిద్ర పడుతుంది ,
  • సుఖ నిద్ర పోవటానికి ఆహారం, పానీయాలు తోడ్పడతాయి . మంచి ఆహారం, సుఖనిద్ర ఆరోగ్యానికి చాలా అవసరం.

    • * శరీరంలో షుగర్‌ సమస్థితిలో ఉండేలా చూసుకోవాలి. బ్లడ్‌షుగర్‌ తక్కువగా ఉన్నట్లయితే నిద్రపట్టదు. కలత నిద్ర కలుగుతుంది.
    • * ఆహారం తీసుకున్న వెంటనే మత్తుగా అనిపించి కునుకు పట్టొచ్చు. ఆహారం తీసుకున్న వెంటనే నిద్రపోవటం ఆరోగ్యకరం కాదు కొంతసేపటికి నిద్రా భంగం కలిగి, తర్వాత నిద్ర పట్టకపోవచ్చు. ఆహారం తీసుకున్నాక కొంత సమయం తర్వాతనే పడకచేరాలి.

    • * పడక చేరబోయేముందు ఎక్కువ నీరు తాగకూడదు.

    • * మూత్ర విసర్జన చేసి పడకచేరాలి.

ట్రీట్మెంట్ :
  • అవసరమైతే డాక్టర్ సలహాపై నిద్రమాత్రలు తీసుకోవాలి .
నిద్రలేమి ... కంటికింద నల్లటి వలయాలు -- ముఖసౌన్దర్యం :

నిద్రలేమి, దిగులు, ఆందోళన... ఇలా కారణమేదైనా కావొచ్చు, దీర్ఘకాలంలో అవి కంటికింద నల్లటి వలయాలను ఏర్పరచడం ద్వారా ముఖసౌందర్యం మీద ప్రభావం చూపిస్తాయి. వాటిని తొలగించుకోవడానికి బోలెడన్ని చిట్కాలు ఉన్నాయి. ఉదాహరణకు బంగాళా దుంపలిో చర్మాన్ని తేటపరిచే(స్కిన్‌ లైటెనింగ్‌) తత్వం ఉంది. అది ఈ సమస్యకు చక్కటి విరుగుడు. బంగాళాదుంప రసాన్ని కంటి కింద రాసి పదినిమిషాల తర్వాత చల్లటి నీటితో కడగాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తుంటే నలుపు క్రమంగా విరుగుతుంది. ఇలాంటి సౌందర్య చిట్కాలతోనే కాదు, ఆహారంలో మార్పులతోనూ ఇదే ఫలితాన్ని పొందొచ్చు. ఉదాహరణకు విటమిన్లలో కె విటమిన్‌కు కూడా ఇదే తత్వం(స్కిన్‌ లైటెనింగ్‌) ఉంది. కంటికింద మచ్చలతో బాధపడేవారు సౌందర్య చిట్కాలను పాటించడంతో పాటు కె విటమిన్‌ అధికంగా లభ్యమయ్యే ఆహారం తీసుకుంటే మెరుగైన ఫలితాలు త్వరగా కనిపిస్తాయి. ఇంతకీ కె విటమిన్‌ి పుష్కలంగా దొరికే ఆహారం ఏంటంటారా, ఇదుగో ఆ జాబితా... క్యాలీఫ్లవర్‌, క్యాబేజీ, బ్రాకోలి, క్యారెట్‌, బీన్స్‌, దోసకాయ, సోయాబీన్స్‌, పచ్చిబఠాణీలు, కాలేయం(బీఫ్‌, పోర్క్‌), చేపనూనె, పెరుగు, పాలు, అన్నిరకాల ఆకుకూరలు(పాలకూరలో అత్యధికం).

నిద్ర వయస్సు ను తెలియనివ్వదు :

వయసుకు తగినట్టుగా శరీరము మారుతుంది . అది సహజము . ఐతే కొందరి ముఖాలు వయసును తెలియనివ్వవు . వారి అసలు వయసుకన్నా ఐదారేళ్ళు చిన్నగా కనిపిస్తారు . వారి యవ్వన రహస్యము వారు క్రమము తప్పక తీసే నిద్రలో ఉంటుంది. నిద్ర వల్ల వచ్చే లాభాలు ఒకటి రెండు కాదు . సుఖనిద్రపోవడం ఒక వరము .
నిద్రలో శరీర లోపాలు సరిదిద్దబడాతాఇ. ఆరోగ్యము కుదుటపడుతుంది . తగినంత నిద్ర , విశ్రాంతి కలవారిలో రక్తపోటు , మధుమేహము అదుపులో ఉంటుంది . రక్తపోటుతో పాటే మిగిలిన అంతర్గత అవయవాల పనితీరు సక్రమముగా ఉంటుంది . సరిగా నిద్రలేనివారి కళ్ళలో వెలుగు ఉండదు . . చర్మము ఆరోగ్యముగా కనిపించదు . ముఖము మీద ముడతలు వస్తాయి. అసలు వయసు కన్నా పదేళ్ళు అదనపు వయసు కనిపిస్తుంది . నిద్ర ఉన్నప్పుడే వయసు ముదిరు నట్లు కనపడకుండా ఉంటుందన్నది తాజా నిర్ధారణ అయిన విషయము .

నిద్ర పట్టేదెట్లా?
పురుషుల కన్నా స్త్రీలకు సగటున 20 నిమిషాల నిద్ర ఎక్కువ అవసరమని బ్రిటన్‌ పరిశోధకుల అధ్యయనంలో తేలింది. మరీ ముఖ్యంగా... తెలివితేటలు, భాషా నైపుణ్యం, జ్ఞాపకశక్తి వంటి కీలకమైన విధులను నిర్వర్తించే సెరిబ్రల్‌ కార్టెక్స్‌ బాగా పనిచేయాలంటే తగినంత నిద్ర తప్పనిసరి అని వారు చెబుతున్నారు. అలా చక్కగా నిద్రపట్టడానికి కొన్ని చిట్కాలు కూడా చెబుతున్నారు వారు...


* రోజూ ఒకే సమయానికి పడుకోవడానికి ప్రయత్నించండి. కొన్నాళ్లకు అది అలవాటైపోయి ఆ సమయానికి నిద్ర వస్తుంది.
* పడుకోవడానికి అరగంట ముందు... పుస్తకం చదువుకోవడం, మంద్రమైన సంగీతం వినడం, గోరువెచ్చటి పాలు తాగడం లాంటి ఏదో ఒక అలవాటు చేసుకోండి. ఆ పని చేయగానే నిద్రపోవాలని మెదడు సంకేతాలు పంపుతుంది.
* పడుకునేటప్పుడు బిగుతు దుస్తులు కాకుండా శరీరానికి సౌకర్యంగా వదులుగా ఉండే కాటన్‌ దుస్తుల్ని ధరిస్తే మంచిది.
* కాఫీ, టీలలో ఉండే కొన్ని పదార్థాలు మెదడును ఉత్తేజితం చేసి నిద్రపట్టనివ్వవు. అంచేత రాత్రి ఎనిమిది దాటాక వాటి జోలికి పోవద్దు.

రాత్రిపూట గాఢనిద్ర తగ్గితే--పురుషులకు గుండె జబ్బులే!

లండన్‌: మహిళలతో పోలిస్తే పురుషులు రాత్రివేళ గాఢ నిద్ర తక్కువగా ఉంటుంది. దీనివల్ల వారిలో అధిక రక్తపోటు, గుండెపోటు వంటి సమస్యలు వస్తాయని హార్వర్డ్‌ విశ్వవిద్యాలయం నిర్వహించిన తాజా అధ్యయనంలో తేలింది. రాత్రి సమయంలో మధ్యమధ్యలో నిద్ర లేవడం పురుషుల్లోనే అధికమని పరిశోధకులు పేర్కొన్నారు. కొన్నిసార్లు తమ సొంత గురకవల్లే నిద్ర లేస్తారని చెప్పారు. ఫలితంగా నిరంతరాయ నిద్ర సమయం తగ్గిపోతుందని వివరించారు. అంతరాయాలులేని నిద్ర తక్కువగా ఉండేవారిలో అధిక రక్తపోటు తలెత్తే ప్రమాదం ఉందని చెప్పారు. ఇదిగుండెపోటు, పక్షవాతానికి దారితీస్తుందని వివరించారు. అధ్యయనంలో భాగంగా 65ఏళ్లు పైబడ్డ 784మంది పురుషుల నిద్ర అలవాట్లను పరిశీలించారు. రాత్రిళ్లు చాలా తక్కువగా గాఢనిద్ర పోయేవారిలో అధిక రక్తపోటు వచ్చే ప్రమాదం 80% ఎక్కువగా ఉన్నట్లు ఇందులో తేలింది.

ఏడు గంటల నిద్ర చాలు : 
ఆరు , ఏడు , ఎనిమిది ... ఎన్ని గంటల నిద్ర అవసరము ? ... అని ప్రశ్నించుకుంటే ఏడు గంటల గాడనిద్ర అని చెప్పుకోవాలి. 7 గంటలకంటే తక్కువ  లేదా ఎక్కువ నిద్ర పోతే గుండే జబ్బులు వచ్చే ఆస్కారము ఎక్కువ అని పరిశోధనలలో గుర్తించారు . ఈ నియమము 20 సంవత్సరాలు దాటినవారికే.

Extra sleep is good,అదనపు నిద్ర మంచిదే!

అతిగా నిద్రపోవటమనేది మంచి అలవాటేమీ కాదు. కానీ తక్కువ సమయం నిద్రపోయేవారు అదనంగా రెండు గంటల సేపు ఎక్కువగా నిద్రపోవటం మంచిదేనని పరిశోధకులు చెబుతున్నారు. దీంతో చురుకుదనం మాత్రమే కాదు.. నొప్పిని తట్టుకునే సామర్థ్యమూ పెరుగుతున్నట్టు తాజా అధ్యయనంలో బయటపడింది. తగినంత నిద్రపోనివారు మరింత ఎక్కువసేపు నిద్రపోతే నొప్పి తీవ్రత తగ్గటానికి దోహదం చేస్తోందని అమెరికాలోని హెన్రీఫోర్డ్‌ ఆసుపత్రికి చెందిన థామస్‌ రోథ్‌ పేర్కొంటున్నారు. దీర్ఘకాల వెన్నునొప్పి వంటి అన్నిరకాల నొప్పులపైనా దీని ప్రభావం కనబడుతుండటం గమనార్హం. ఒకవేళ ఇప్పటికే 8 గంటల సేపు నిద్రపోతుంటే మాత్రం మరింత నిద్ర అవసరం లేదని గుర్తించాలని వివరిస్తున్నారు. ఇంతకీ నొప్పికి, నిద్రలేమికి సంబంధం ఏంటి? ఈ రెండూ శరీరంలో వాపు సంకేతాల స్థాయులను పెంచుతాయని.. అందువల్ల మరింత ఎక్కువ నిద్రపోవటం వాపు తగ్గేందుకు దోహదం చేస్తుండొచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. ------ source : Medicine update (magazine).

  • జ్ఞాపకశక్తికి నిద్రే మందు!
ఎంత చదివినా గుర్తుండటం లేదా? అయితే రాత్రిపూట కంటినిండా నిద్రపోండి. ఎందుకంటే రోజంతా మనం నేర్చుకున్న విషయాలను, ఎదురైన సంఘటనలను బలమైన జ్ఞాపకాలుగా పదిల పరచుకోవటానికి నిద్ర ఎంతగానో తోడ్పడుతుంది. గత జ్ఞాపకాలతో కొత్తవాటిని కలపటానికీ, సృజనాత్మక ఆలోచనలు పుట్టుకురావటానికీ దోహదం చేస్తుంది. ఇంతకీ నిద్రపోతున్నప్పుడు మన మెదడులోని జ్ఞాపకాలు ఎలా స్థిరపడతాయి? నిద్ర సరిగా లేకపోతే నేర్చుకునే, గుర్తుంచుకునే సామర్థ్యం ఎందుకు తగ్గుతుంది? వీటిని పసిగట్టేందుకే నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్స్‌ ఆఫ్‌ హెల్త్‌ ఆధ్వర్యంలో శాస్త్రవేత్తలు ఇటీవల అధ్యయనం చేశారు. విద్యార్థుల్లో జ్ఞాపకశక్తి సామర్థ్యాన్ని పెంచటానికి, వృద్ధుల్లో మతిమరుపును తగ్గించటానికి కొత్త పద్ధతులను రూపొందించటంలో ఈ అధ్యయన ఫలితాలు ఉపయోగపడగలవని భావిస్తున్నారు.

మనం నిద్రపోతున్నప్పుడు తేలికైన నిద్ర, గాఢనిద్ర, కంటి కదలికలు వేగంగా ఉండే (రెమ్‌) నిద్ర వంటి దశలుంటాయి. సాధారణంగా రెమ్‌ దశలోనే కలలు వస్తుంటాయి. ఈ దశలన్నీ క్రమంగా ప్రతి 90 నిమిషాలకు ఒకసారి తిరిగి ఏర్పడుతుంటాయి. విషయాలను నేర్చుకోవటంలో రెమ్‌ దశ చాలా కీలకపాత్ర పోసిస్తుంది. ఒకవేళ నిద్ర సరిగా పట్టకపోతే నేర్చుకునే సామర్థ్యమూ 40% వరకు పడిపోతుంది. కొత్త జ్ఞాపకాలు స్థిరపడేందుకు తోడ్పడే మెదడులోని హిప్పోక్యాంపస్‌ భాగంపై నిద్రలేమి తీవ్ర ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. మనం మెలకువగా ఉన్నప్పుడు ఆయా సంఘటనల వారీగా మెదడులో కొత్త జ్ఞాపకాలు పోగుపడుతుంటాయి. వీటిలో చాలావరకు మరచిపోతుంటాం కూడా. జ్ఞాపకాలు తొలిసారి ఏర్పడినప్పుడు అంత బలంగా ఉండవు. చాలా అపక్వంగా, సున్నితంగా ఉంటాయి. కానీ నిద్ర పోయినప్పుడు వాటిని నెమరువేసుకోవటానికి మెదడుకు తగినంత సమయం దొరుకుతుంది. ఏయే సంఘటనలను గుర్తుంచుకోవాలో, వేటిని వదిలించుకోవాలో కూడా నిర్ణయించుకుంటుంది. రాత్రిపూట నిద్రపోయినప్పుడు జ్ఞాపకాలు బలోపేతమవుతాయని హార్వర్డ్‌ మెడికల్‌ స్కూల్‌కు చెందిన డాక్టర్‌ రాబర్ట్‌ స్టిక్‌గోల్డ్‌ చెబుతున్నారు. పియానోపై మంచి గేయాన్ని వాయించటం వంటి కొన్ని పనులకు సంబంధించిన జ్ఞాపకాలు నిద్రపోతున్నప్పుడు మెరుగుపడుతున్నట్టు పరిశోధనలో తేలింది. గాఢనిద్ర దశలో జ్ఞాపకాలు మరింత స్థిరంగా కొనసాగుతాయి. రెమ్‌ దశలోనేమో ఈ జ్ఞాపకాల్లో ఒకదాంతో మరోదానికి సంబంధం గల వాటి మధ్య బంధాలు ఏర్పడతాయి. భావోద్వేగ జ్ఞాపకాల విశ్లేషణకూ రెమ్‌ దశ తోడ్పడుతుంది. దీంతో భావోద్వేగాల తీవ్రతా తగ్గుతుంది.

నిజానికి వయసు మీద పడుతున్నకొద్దీ నిద్రా పద్ధతులు కూడా మారుతుంటాయి. దురదృష్టవశాత్తు 30 ల చివర్లో బలమైన జ్ఞాపకాలకు తోడ్పడే నిద్ర తగ్గిపోవటం మొదలవుతుంది. 18-25 ఏళ్ల వారితో పోలిస్తే 60 ఏళ్లు పైబడినవారిలో గాఢనిద్ర 70% వరకు తగ్గిపోతున్నట్టు తాజా అధ్యయనంలో బయటపడింది. ముందురోజు జరిగిన సంఘటనలను గుర్తుకు తెచ్చుకోవటంలో వృద్ధులు చాలా ఇబ్బంది పడుతుంటారని, ఇందుకు గాఢ నిద్ర తగ్గిపోవటంతో సంబంధం ఉంటోందని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్‌ మాథ్యూ వాకర్‌ పేర్కొంటున్నారు. అందువల్ల వృద్ధుల్లో గాఢనిద్రను పెంచటానికి తోడ్పడే పద్ధతుల మీద పరిశోధకులు ఇప్పుడు దృష్టి సారించారు. వృద్ధాప్యంలో జ్ఞాపకశక్తిని పెంపొందించే చికిత్సలు అంతగా అందుబాటులో లేవు. ఈ నేపథ్యంలో నిద్ర సరిగా పట్టే చికిత్సలు రూపొందిస్తే గణనీయమైన ఫలితాలు కనబడతాయని వాకర్‌ చెబుతున్నారు. యువకులు కూడా ముఖ్యంగా విద్యార్థులు.. చదువుకున్న తర్వాత రాత్రిపూట నిద్రపోతే మంచి ఫలితాలు ఉంటాయని, ఆయా విషయాలు బాగా గుర్తుండటానికిది తోడ్పడుతుందని స్టిక్‌గోల్డ్‌ సూచిస్తున్నారు.

చక్కటి నిద్ర సప్త మార్గాలు!

సంపూర్ణ ఆరోగ్యానికి నిద్ర చాలా కీలకం. నిద్రలో శరీరం తిరిగి శక్తిని కూడగట్టుకుంటుంది. దీంతో కొత్త ఉత్సాహం వస్తుంది. నిద్ర సరిగా పట్టకపోతే అలసట, నిస్సత్తువే కాదు.. ఏకాగ్రత కూడా లోపిస్తుంది. ఫలితంగా పని మీద శ్రద్ధ తగ్గిపోతుంది. కానీ ప్రస్తుతం చాలామందికి నిద్ర బంగారమైపోతోంది. పడక మీదికి చేరుకుని గంటలు గడిచినా నిద్రపట్టక సతమతమయ్యేవారు ఎందరో. పని ఒత్తిడి, కుటుంబ బాధ్యతలు, సంబంధ బాంధవ్యాలు, జబ్బులు.. ఇలా చాలా అంశాలు నిద్రను దెబ్బతీయొచ్చు. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే నిద్ర సరిగా పట్టేలా చూసుకోవచ్చు.

* వేళకు పడక: రోజూ ఒకే సమయానికి పడుకోవటం, నిద్రపోవటం అలవాటు చేసుకోవాలి. సెలవురోజుల్లోనూ దీన్ని మానరాదు. దీంతో శరీరంలోని నిద్ర, మెలకువ చక్రం సర్దుకుని రాత్రిపూట నిద్ర బాగా పట్టేలా చేస్తుంది. పడక మీదికి చేరుకున్నాక 15 నిమిషాలైనా నిద్రపట్టకపోతే వెంటనే లేచి, పుస్తకం చదవటం వంటివి చేయాలి. అలసట అనిపించినపుడు పడక మీదికి చేరుకోవాలి.

* తిండిపై కన్ను: కడుపు నిండుగా తిన్నవెంటనే గానీ ఆకలిగా ఉన్నప్పుడు గానీ మంచం ఎక్కొద్దు. ఇవి నిద్రను దెబ్బతీస్తాయి. ఇక ద్రవాలను ఎక్కువగా తీసుకుంటే మధ్యలో లేవాల్సి రావొచ్చు. అలాగే నిద్రపోవటానికి ముందు సిగరెట్లు, కాఫీల జోలికి అసలే వెళ్లరాదు. వీటిల్లోని నికొటిన్‌, కెఫీన్‌ చాలాసేపు మెలకువ ఉండేలా చేస్తాయి. మద్యం తాగితే మొదట్లో నిద్రమత్తు ముంచుకొస్తుంది గానీ మధ్యలో చాలాసార్లు మెలకువ వచ్చేలా చేస్తుంది.

* సన్నద్ధ అలవాట్లు: రోజూ పడక మీదికి చేరటానికి ముందు ఒకేకరకమైన పనులు.. అంటే స్నానం చేయటం, పుస్తకం చదవటం, సంగీతం వినటం వంటివి.. చేస్తే శరీరం నిద్రకు సన్నద్ధమయ్యేలా తయారవుతుంది. కానీ టీవీ, కంప్యూటర్ల వంటి వాటికి దూరంగా ఉండటం మేలు.

* మంచి గది: పడకగది చల్లగా, ప్రశాంతంగా ఉండేలా చూసుకోవాలి. ఎక్కువ వెలుగునిచ్చే లైట్లు ఆర్పేయాలి. అలాగే మంచం, పరుపు వంటివి సౌకర్యవంతంగా ఉండేవి ఎంచుకోవాలి. పిల్లలు, పెంపుడు జంతువులు నిద్ర మధ్యలో లేపకుండా చూసుకోవాలి.

* పగటినిద్ర వద్దు: పగటిపూట ఎక్కువసేపు నిద్రపోతే రాత్రుళ్లు నిద్రపట్టటం కష్టం. ఒకవేళ పగటిపూట కునుకుతీయాలనుకుంటే 10-30 నిమిషాల కన్నా ఎక్కువసేపు పడుకోకూడదు. అయితే రాత్రి షిఫ్టుల్లో పనిచేసేవారు పగటిపూట తగినంత సేపు నిద్రపోయేలా చూసుకోవాలి. ఇలాంటివారు బయటి నుంచి ఎండ లోపలికి పడకుండా కిటికీలకు పరదాలు వేసుకోవాలి.

* వ్యాయామం: రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే త్వరగా నిద్రపట్టటానికే కాదు.. గాఢ నిద్రకూ దోహదం చేస్తుంది. అయితే కాసేపట్లో నిద్రపోతామనగా వ్యాయామం చేయరాదు. ఉదయం పూట వ్యాయామం చేయటం ఉత్తమం.

* ఒత్తిడికి దూరం: పని ఒత్తిడితో పాటు మానసిక ఒత్తిడీ నిద్రకు భంగం కలిగిస్తుంది. అందువల్ల ఒత్తిడిని తగ్గించుకునే మార్గాలపై దృష్టి సారించటం మంచిది. చేయాల్సిన పనులను వర్గీకరించుకోవటం, ప్రాధామ్యాలను గుర్తించటం, లక్ష్యాలను నిర్దేశించుకోవటం వంటివి ప్రశాంతతకు బీజం వేస్తాయి. అవసరమైనప్పుడు తమకు తాముగానే పని నుంచి విశ్రాంతి తీసుకోవటం, స్నేహితులతో సరదాగా గడపటం వంటివి మేలు చేస్తాయి.

  • స్త్రీ-పురుషుల నిద్ర వేరువేరుగా ఉంటుందా?
నిద్ర.. స్త్రీ పురుషులకి సమానమేనా? ఇంత వరకూ అలాగే భావిస్తూ వచ్చారు శాస్త్రవేత్తలు! అయితే నిద్ర పద్ధతీ, మోతాదూ, గాఢత వంటివన్నీ స్త్రీ పురుషులకి వేర్వేరని చెబుతోంది తాజా అధ్యయనం ఒకటి. అమెరికాకి చెందిన ప్రవాసాంధ్ర శాస్త్రవేత్త మోనికా మల్లంపల్లి నేతృత్వంలోని సొసైటీ ఫర్‌ విమెన్‌ హెల్త్‌ రీసెర్చ్‌ (ఎస్‌డబ్ల్యూహెచ్‌ఆర్‌) ఈ పరిశోధన నిర్వహించింది. మగవారికంటే మహిళల్లో నిద్రలేమి సమస్య ఎక్కువగా ఉందని ఇందులో తేల్చారు. పురుషుల కంటే స్త్రీలు నిద్రలోకి జారుకోవడానికీ ఎక్కువ సమయం పడుతోందని కనిపెట్టారు. పగటివేళ మగతగా ఉందనే ఫిర్యాదూ ఎక్కువగా మన నుంచే ఎదురవుతోందట. వీటన్నింటికీ మహిళల్లోని ప్రత్యేక హార్మోన్ల ప్రభావమే కారణమని చెబుతున్నారు. నెలసరికి ముందూ, నెలసరప్పుడూ స్త్రీలు ఎక్కువగా నిద్రలేమి సమస్య ఎదుర్కొంటున్నారట. పెళ్లయ్యాక గర్భం, కాన్పు తర్వాత శరీరంలో ఏర్పడే పరిణామాలూ, వీటికి తోడు ఇల్లూ, ఉద్యోగ బాధ్యతలూ... ఇవన్నీ స్త్రీల గాఢమైన నిద్ర వేళల్ని హరిస్తున్నాయని పరిశోధన తేల్చింది. పురుషులకు ఇటువంటి సమస్యలు ఎప్పుడో కానీ ఉండవనీ అంటోంది. 'నిద్ర విషయంలో స్త్రీలకు ఇన్ని సమస్యలున్నా, ఇంతవరకూ దానిపై ప్రత్యేకంగా ఆశించినంతగా ఎవరూ దృష్టిపెట్టడంలేదు. నిద్రలేమి పరీక్షలన్నీ కూడా పురుషుల నిద్ర తీరుల్ని దృష్టిలో పెట్టుకునే రూపొందించారు' అంటున్నారు అధ్యయన

ధన్యవాదములు 🙏

మీ నవీన్ నడిమింటి
     విశాఖపట్నం
 ఫోన్ -9703706660

1, మార్చి 2021, సోమవారం

దంతాలు నొప్పి నివారణకు తీసుకోవాలిసిన జాగ్రత్త లు అవగాహనా కోసం ఈ లింక్స్ లో చూడాలి

దవడ పంటి నొప్పి అంటే  ఏమిటి?

దవడ మరియు దాని దంతాల చుట్టూ ఉండే నొప్పి దవడ పంటి నొప్పిని సూచిస్తుంది. ఇది సాధారణంగా దంత క్షయం వలన సంభవిస్తుంది. దవడ పళ్ళు (మొలార్ పళ్ళు) నోటి వెనుక భాగంలో ఉంటాయి. నాలుగు మోలార్ (దవడ) పళ్ళు, ఉంటాయి రెండు పై దవడలో మరియు రెండు కింద దవడలో ఉంటాయి. కొందరు వ్యక్తులలో తక్కువ మోలార్ (దవడ) పళ్ళు/దంతాలు ఉంటాయి లేదా అసలు ఉండవు. కొందరు వ్యక్తులలో, మోలార్ పళ్ళు ఒక కోణంలో అభివృద్ధి చెందుతాయి, అవి చుట్టుపక్కల ఉన్న పళ్ళను/దంతాలను లేదా పంటి చిగురును పక్కకు తోసేస్తాయి. ఈ ప్రక్రియ చాలా బాధాకరముగా ఉంటుంది, మరియు ఆ పంటి చుట్టూ ఉన్న ప్రాంతాన్ని శుభ్రం చేయడం కష్టం అవుతుంది.

దాని ప్రధాన సంబంధిత సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

దవడ పంటి నొప్పితో ముడి పడి ఉన్న ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు:

  • మోలార్/దవడ పంటి దగ్గర ఉండే దవడ భాగం బిరుసుగా మారిపోవడం లేదా నొప్పిగా ఉండడం
  • మింగడంలో కష్టం, పళ్ళు తోమడం మరియు నోరు తెరవడంలో కష్టం
  • దంత క్షయం
  • పళ్ళ మీద పళ్ళు ఏర్పడడం
  • చిగుళ్లలో చీము ఏర్పడడం
  • మోలార్ పళ్ళ చుట్టూ ఉన్న చిగుళ్ల యొక్క ఇన్ఫెక్షన్ లేదా వాపు
  • చెడు శ్వాస
  • అశాంతి
  • జ్ఞాన దంతాలు మరియు వాటి పక్కన ఉండే దంతాల మధ్య ఆహారం మరియు బాక్టీరియా చేరడం
  • లింఫ్ నోడ్లలో (శోషరస కణుపులలో) వాపు
  • పళ్ళు తప్పు కోణంలో పెరగడం వలన నాలుక, చెంప, నోటిలో పైన లేదా కింద నొప్పి లేదా చికాకు
  • చిగుళ్ల వ్యాధి
  • జ్వరం

దీని ప్రధాన కారణాలు ఏమిటి?

దవడ పంటి నొప్పి యొక్క ప్రధాన కారణాలు:

  • డెంటల్ పల్ప్ (dental pulp, పంటి లోపలి పొర) లో వాపు
  • పంటి కురుపులు (పంటి మధ్యభాగంలో బ్యాక్టీరియా మరియు ఇన్ఫెక్టేడ్ పదార్దాల యొక్క చేరిక)
  • చిగుళ్ళ పరిమాణం తగ్గిపోవడం ఇది మోలార్/దవడ పళ్ళ మూలలను సున్నితముగా చేస్తుంది
  • పరిశుభ్రత లేకపోవడం
  • చీము ఏర్పడటం

దీనిని ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?

దంతవైద్యులు పంటి చెక్-అప్/తనిఖీ ద్వారా దవడ దంతంలో నొప్పిని నిర్ధారింస్తారు మరియు నిర్వహించడం మరియు ఎక్స్- రే ఆధారంగా ఏ మోలార్ పంటి వలన నొప్పి సంభవిస్తుందో గుర్తిస్తారు.

దవడ పంటి నొప్పికి ఈ కింది పద్ధతుల ద్వారా చికిత్స జరుగుతుంది:

  • ఓవర్ ది కౌంటర్ నొప్పి నివారుణులు (పెయిన్ కిల్లర్స్)
  • యాంటిబయోటిక్స్
  • ఇన్ఫెక్షన్ సోకిన ప్రాంతాలను శుభ్రపరచడం
  • పన్ను తీవ్రంగా పాడయినట్లైతే పన్ను పీకివేయడం
  • వెచ్చని ఉప్పు నీటితో నోరు పుక్కిలించడం
  • రూట్ కెనాల్ (Root canal)
దవడ పంటి నొప్పి కొరకు మందులు
Medicine NamePack Size
Oxalgin DPOxalgin DP Tablet
Diclogesic RrDiclogesic RR Injection
DivonDivon Gel
VoveranVoveran 50 GE Tablet
EnzoflamEnzoflam SV Tablet
DolserDolser Tablet MR
Renac SpRenac Sp Tablet
Dicser PlusDicser Plus Tablet
D P ZoxD P Zox Tablet
Unofen KUnofen K 50 Tablet
పంటి నొప్పి  నివారణకు ఆయుర్వేదం లో నవీన్ సలహాలు అవగాహనా కోసం మాత్రమే 

నేటి సమాజంలో మనం తినే చిరుతిళ్లకు పండ్లు పాడై పోవడమో లేక పండ్లకు సంబంధించిన వ్యాధులు రావడమో సర్వ సాధారణంగా మారింది. నూటిలో తొంబై శాతం మంది పంటి నొప్పి తో బాధపడుతున్నారు. దీనికి ప్రధాన కారణం తీపి పదార్థాలు తినడం సరిగా బ్రష్ చేసుకోక పోవడం వంటివి. పంటి నొప్పిని తట్టుకోలేక ఏమి తినలేక తీవ్ర యిబ్బందులు ఎదురౌతూ ఓర్చుకోలేనంత బాధలు పడుతున్న పరిస్థితి. మనం తినే తీపి పదార్థములు పిండి పదార్థాలతో పంటిపై గారలు ఏర్పడతాయి. వాటిలో సూక్ష్మ జీవులు చేరతాయి. వీటి వలన ఏనుగు దంతము వలె గట్టిదైన పంటి పైనున్న ఎనామిల్ పాడవుతుంది. అప్పుడు ఇన్ఫెక్షన్స్ ఏర్పడడం పిప్పళ్ల వంటివి ఏర్పడి ఏమి తినకుండా నొప్పి కలగడం జరుగుతుంది. అంతేకాక పంటి నరాలకు దంతమూలాలకు చేరి పళ్లను పాడుచేస్తాయి.

మరి ఈ పంటి నొప్పి వెంటనే తగ్గడానికి తీసుకోవల్సివ జాగ్రత్తలు, చిట్కాలు ఏంటో చూద్దాం.

 వెల్లుల్లి, లవంగం ను తీసుకుని మెత్తగా పేస్ట్ చేసి పంటి నొప్పి ఉన్న ప్రాంతంలో ఉంచితే కొద్ది సేపట్లోనే ఉపశమనం కలుగుతుంది. ఈ పేస్ట్ వలన ఎప్పటి నుండో ఉన్న నొప్పి కూడా తగ్గి పోతుంది.

పంటి నొప్పి ఉన్న చోట లవంగాన్ని ఒక నాలుగు, ఐదు గంటల పాటు ఉంచితే కొంచెం తిమ్మిరి కలిగి తర్వాత నొప్పి మాయమవుతుంది. యిది మంచి చిట్కా.

  కాగితపు టవల్ పైన విక్స్ లేదా అమృతాంజన్ ను రాసి నొప్పి ఉన్న దవడ ప్రాంతంలో చర్మం పై కాసేపు ఉంచినట్లైతే నొప్పి తగ్గు ముఖం పడుతుంది.

  దంత శుద్దికి, పంటి నొప్పికి గోధుమ గడ్డి రసం ను ఉపయోగిస్తారు. యిది చక్కని ఆయుర్వేదంలా పనిచేసి దంత క్షయాన్ని నొప్పిని నివారిస్తుంది.
 
 పంటి నొప్పి ఉన్న దంత భాగంలో ఐస్ క్యూబ్ పెడితే నొప్పి తగ్గిపోతుంది.
 
 చిగుళ్ల వాపు మరియు నొప్పి తగ్గుటకు మిరియాల పొడిని దంత మంజన్ లా వాడి పళ్లపై రుద్దితే నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది.
 
 చాలా మందికి ఉల్లిపాయ తినే అలవాటు ఉంటుంది. యిది చాలా మంచి అలవాటు అంటున్నారు వైద్యులు. ఉల్లిపాయను మూడు నిమిషాలు నమిలితే పంటి నొప్పి తగ్గిపోతుంది. నమలడం యిబ్బంది అనుకుంటే అప్పుడే కోసిన ఉల్లిముక్కని నొప్పి దగ్గర పెడితే నొప్పి మాయం అవుతుంది
 
 ఇక పొద్దున రాత్రిపూట క్రమం తప్పకుండా బ్రష్ చేసుకోవడం ఆరోగ్యానికి మంచిది. ముఖ్యంగా పంటి సమస్యలతో బాధ పడేవారు రెండు పూటలా బ్రష్ చేయాలి.

  ఈ చిన్న చిట్కాలను పాటించి పంటి నొప్పిని తగ్గించుకోండి. ఏదైనా తిన్నపుడు నోటిని పరిశుభ్రం చేసుకోవాలి .

ధన్యవాదములు 🙏

మీ నవీన్ నడిమింటి

 విశాఖపట్నం

ఫోన్ -9703706660

అస్వీకార ప్రకటన: ఈ సైటుపై లభ్యమవుతున్న మొత్తం సమాచారము మరియు లేఖనము కేవలం అవగాహనా ఆవశ్యకతల కొరకు మాత్రమే. ఇక్కడ ఇవ్వబడిన సమాచారమును ఏదైనా ఆరోగ్య సంబంధిత సమస్య లేదా అస్వస్థత నుండి కోలుకోవడానికి లేదా స్వస్థత కొరకు నిపుణుల సలహా లేనిదే ఉపయోగించుకోకూడదు. చికిత్స పరీక్షలు మరియు సేవల కొరకు ఎల్లప్పుడూ ఒక అర్హత పొందిన వైద్యుల సలహా తీసుకోవాలి.


27, ఫిబ్రవరి 2021, శనివారం

మహిళా లో మధుమేహం అదుపులో ఉండాలి అంతే తీసుకోవాలిసిన జాగ్రత్త లు


మహిళల్లో మధుమేహం నివారణ: ఏ మందులు మరియు మాత్రలు తీసుకోవాలి?అవగాహనాకోసం నవీన్ నడిమింటి సలహాలు 

 
  
 

ఈ పరిస్థితికి కారణం మహిళలు, వారి శరీరధర్మశాస్త్రం వల్ల, సంపూర్ణత్వానికి ఎక్కువ అవకాశం ఉంది. అధిక బరువు ఉండటం డయాబెటిస్‌కు ఒక కారణం. వ్యాధి యొక్క విస్తృత వ్యాప్తికి వ్యాధి సంభవించకుండా నిరోధించడానికి నివారణ చర్యలు అవసరం.

మహిళల్లో డయాబెటిస్ నివారణలో శరీర బరువును సాధారణీకరించడం, శరీర హార్మోన్ల సమతుల్యతను సాధారణీకరించడం మరియు శరీరంలో జీవక్రియ ప్రక్రియలను మెరుగుపరచడం లక్ష్యంగా చర్యలు తీసుకోవాలి.

స్త్రీ శరీరంలో మధుమేహం రెండు రకాలుగా అభివృద్ధి చెందుతుంది:

  • ఇన్సులిన్-ఆధారిత టైప్ 1 డయాబెటిస్ మెల్లిటస్;
  • నాన్-ఇన్సులిన్-ఆధారిత టైప్ 2 డయాబెటిస్ మెల్లిటస్.

మధుమేహాన్ని నివారించే మార్గాలు

వ్యాధి నివారణలో మందులు, క్రీడలు, ఫిజియోథెరపీటిక్ విధానాలు మరియు సాంప్రదాయ medicine షధ పద్ధతుల వాడకం ఉండవచ్చు.

మహిళల్లో మధుమేహం నివారణ శరీరంలో కనుగొనబడిన వ్యాధి రకం మీద ఆధారపడి ఉంటుంది.

డయాబెటిస్ నివారణకు ప్రధాన సహాయకుడు సరైన జీవనశైలిని పాటించడం, ఈ క్రింది అంశాలను కలిగి ఉండాలి:

  1. సమతుల్య మరియు సమతుల్య ఆహారాన్ని వాడండి. ఆహారంలో తక్కువ కెమిస్ట్రీ మరియు ఎక్కువ పండ్లు, కూరగాయలు మరియు మూలికలు ఉండాలి. చాక్లెట్ మరియు మద్య పానీయాల వినియోగాన్ని తగ్గించడం అవసరం. పాక్షిక పద్ధతి ప్రకారం తినడం మంచిది, రోజువారీ ఆహారం తీసుకోవడం 5-6 రెట్లు విభజిస్తుంది.
  2. శరీరంపై మితమైన శారీరక శ్రమను అందించడం. 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న రోజువారీ నడకలు క్లోమం యొక్క పనితీరు మరియు హృదయనాళ వ్యవస్థపై సానుకూల ప్రభావాన్ని చూపుతాయి. నడక మొత్తం శరీరంపై ఉత్తేజపరిచే ప్రభావాన్ని చూపుతుంది.
  3. వీలైతే, శరీరాన్ని వివిధ ఒత్తిళ్ల నుండి రక్షించాలి. ప్రతికూల భావోద్వేగాలను సాధ్యమైనప్పుడల్లా నివారించాలని సిఫార్సు చేయబడింది.
  4. రక్తంలో చక్కెర స్థాయిని నిరంతరం పర్యవేక్షించడం. గ్లూకోస్ టాలరెన్స్ను పర్యవేక్షించడానికి ఇది అవసరం.

ఇటువంటి సందర్భాల్లో, వ్యాధిని నివారించడానికి మందులు ఉపయోగిస్తారు.

మొదటి మరియు రెండవ రకాల మధుమేహం నివారణ

టైప్ 1 డయాబెటిస్ నివారించబడదు. మధుమేహాన్ని నివారించడానికి ప్రత్యేకమైన మందులు ఉపయోగించినప్పటికీ ఈ రకమైన వ్యాధి అభివృద్ధిని నివారించడం అసాధ్యం.

ఈ పరిస్థితికి కారణం అనారోగ్యం ఉన్న వ్యక్తి యొక్క వంశపారంపర్యత. టైప్ 1 డయాబెటిస్ వారసత్వంగా ఉందని గుర్తుంచుకోవాలి.

డయాబెటిస్ శరీరంపై ప్రభావాన్ని తగ్గించడానికి, రోగనిరోధక శక్తిని బలోపేతం చేయాలి మరియు అనేక రకాల అంటు వ్యాధులను నివారించాలి.

శరీరంలో టైప్ 2 డయాబెటిస్ అభివృద్ధి గర్భం ద్వారా ప్రేరేపించబడుతుంది, దీనిలో హార్మోన్ల పేలుళ్లు సంభవిస్తాయి. అయినప్పటికీ, గర్భధారణ ప్రక్రియలో, బలహీనమైన గ్లూకోస్ టాలరెన్స్‌కు దారితీసే హార్మోన్ల పెరుగుదల చాలా అరుదుగా జరుగుతుంది.

చాలా తరచుగా, అధిక బరువు ఉన్న మహిళల్లో టైప్ 2 డయాబెటిస్ అభివృద్ధి గమనించవచ్చు. నివారణ చర్యలను నిర్వహించే ప్రక్రియలో, మీరు ఆహార పోషణను గమనించాలి, మీ వైద్యుడు సిఫార్సు చేసిన మందులు తీసుకొని ఆరోగ్యకరమైన జీవనశైలిని కాపాడుకోవాలి.


డయాబెటిస్ ఉన్న మహిళలకు ఆహారం

డయాబెటిస్ కోసం ఆహారం అనేది పునాది, ఇది లేకుండా నివారణ చర్యలు సంబంధిత ప్రభావాన్ని ఇవ్వలేవు. స్త్రీకి అధిక బరువుకు జన్యు సిద్ధత ఉంటే ఆహారం పాటించడం చాలా ముఖ్యం. ఆహారాన్ని అభివృద్ధి చేయడానికి తగిన విధానంతో, మీరు శరీర బరువును సాధారణ పరిధిలో నిర్వహించడమే కాకుండా, రుచికరంగా తినవచ్చు. ఇటువంటి పోషణ స్త్రీ శరీరాన్ని మధుమేహం నుండి మాత్రమే కాకుండా, పెద్ద సంఖ్యలో ఇతర వ్యాధుల నుండి కూడా రక్షిస్తుంది.

ఉత్తమ ఎంపిక భిన్నమైన భోజనం. దీనికి రోజువారీ భోజనం రోజుకు 5-6 భోజనంగా విభజించబడింది.

అన్నింటిలో మొదటిది, ఆహారాన్ని అభివృద్ధి చేసేటప్పుడు, మీరు జీర్ణమయ్యే కార్బోహైడ్రేట్లను వాడటానికి నిరాకరించాలి. ఈ కార్బోహైడ్రేట్లను కలిగి ఉన్న ఉత్పత్తులలో రకరకాల స్వీట్లు, కాల్చిన వస్తువులు, చక్కెర, బీర్, సోడాస్, కొన్ని కూరగాయలు మరియు పండ్లు ఉన్నాయి. మీరు చక్కెర లేకుండా ప్రత్యేక డెజర్ట్‌లను తినవచ్చు

స్త్రీ ఆహారంలో ఇలాంటి ఉపయోగకరమైన ఆహారాలు ఉండాలి:

  • వివిధ తృణధాన్యాలు - బుక్వీట్, బార్లీ మరియు వోట్మీల్;
  • అనుమతించబడిన మధుమేహం జాబితా నుండి తాజా కూరగాయలు మరియు పండ్లు;
  • ఉడికించిన బీన్స్, సెలెరీ, సౌర్క్క్రాట్.

అరటి మరియు ద్రాక్ష తీసుకోవడం పరిమితం చేయాలని సిఫార్సు చేయబడింది. క్లోమంపై అదనపు భారం పడకుండా మరియు దాని పనితీరుకు అంతరాయం కలిగించకుండా ఉండటానికి, మీరు వేయించిన ఆహారాలు మరియు కారంగా మరియు ఉప్పగా ఉండే ఆహార పదార్థాల వాడకాన్ని వదిలివేయాలి.

తినే బ్లాక్ టీని బలహీనమైన ఆకుపచ్చగా, కాఫీని షికోరీగా మార్చాలని సిఫార్సు చేయబడింది. మీరు చక్కెర వాడకాన్ని పూర్తిగా వదలివేయాలి లేదా స్వీటెనర్తో భర్తీ చేయాలి.

ఆరోగ్యకరమైన జీవనశైలిని నడిపించడానికి మరియు క్లోమం యొక్క పనిలో రుగ్మతలు సంభవించకుండా ఉండటానికి, మహిళలు ధూమపానం మరియు మద్య పానీయాలు పూర్తిగా ఆపాలని సిఫార్సు చేయబడింది. ఆరోగ్యకరమైన జీవనశైలిని కొనసాగించే ప్రక్రియలో, శరీర నీటి సమతుల్యత గురించి మరచిపోకూడదు.

ఉదయం ఖాళీ కడుపుతో మరియు ప్రతి భోజనానికి ముందు రోజూ కనీసం 250 మి.లీ నీరు త్రాగాలి.

మధుమేహం నివారణకు శారీరక శ్రమ మరియు సాంప్రదాయ medicine షధం

మధుమేహం నివారణలో శరీరంపై క్రమంగా స్పోర్ట్స్ లోడ్ చేయటం ఒక ముఖ్యమైన అంశం. రోజుకు కనీసం 30 నిమిషాలు శారీరక వ్యాయామాలు ఉత్తమ ఎంపికగా భావిస్తారు.

అవసరమైతే, క్రీడలను రోజుకు మూడు విధానాలుగా విభజించవచ్చు. ప్రతి విధానం యొక్క వ్యవధి కనీసం 10 నిమిషాలు ఉండాలి. స్వచ్ఛమైన గాలిలో నడక గురించి మర్చిపోవద్దు. 1000-1500 మీటర్ల నడకలో ప్రతిరోజూ నడవడం మంచిది.

రోగనిరోధక శక్తిని బలోపేతం చేసే ప్రక్రియలో మరియు డయాబెటిస్ నివారణలో ఒక ముఖ్యమైన అంశం ఏమిటంటే, మానసిక విచ్ఛిన్నం యొక్క శరీరంపై ప్రభావాన్ని తగ్గించడం, ఎండోక్రినాలజిస్టులు తక్కువ నాడీని సిఫార్సు చేస్తారు.

St షధ మూలికల యొక్క వివిధ రకాల కషాయాలను స్త్రీ వాడటం శరీరంపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. నివారణ కోసం, పానీయంగా, మీరు అడవి స్ట్రాబెర్రీ లేదా వాల్నట్, అడవి రోవాన్ బెర్రీలు మరియు బ్లూబెర్రీస్ ఆకుల నుండి తయారైన కషాయాలను ఉపయోగించవచ్చు.

నివారణ చర్యగా, దానిలోని గ్లూకోజ్ స్థితిని విశ్లేషించడానికి ప్రతి ఆరునెలలకు ఒకసారి రక్తం తీసుకోవడం మంచిది.

రెగ్యులర్ మానిటరింగ్ ప్రీడియాబెటిస్ దశలో వ్యాధిని గుర్తించడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది, కొన్ని సందర్భాల్లో ఈ వ్యాధిని సకాలంలో వదిలించుకోవడానికి వీలు కల్పిస్తుంది.

అనారోగ్యాన్ని నివారించడానికి మందుల వాడకం

ప్రస్తుతం, డయాబెటిస్ అభివృద్ధిని నివారించడానికి మూడు ప్రధాన మందులు ఉపయోగిస్తున్నారు.

ఈ మాత్రలు స్త్రీ శరీరంలో వ్యాధి అభివృద్ధిని నివారించడంలో అద్భుతమైన ఫలితాలను చూపించాయి. పెరిగిన గ్లూకోస్ టాలరెన్స్ ఉన్నవారికి ఈ drugs షధాలన్నీ సిఫార్సు చేయబడతాయి. శరీరంలో అధిక రక్తంలో చక్కెర ఉంటే ఈ నివారణలు ఏవీ సిఫారసు చేయబడవు.

ఈ మందులు ఈ క్రింది విధంగా ఉన్నాయి:

  • మెట్ఫోర్మిన్;
  • Ksenikap;
  • Acarbose.

మెట్‌ఫార్మిన్ అనేది యాంటీడయాబెటిక్ ఏజెంట్, ఇది బిగ్యునైడ్ల తరగతికి చెందినది. ఈ సాధనం యొక్క ప్రధాన లక్షణాలు ఏమిటి? ఈ drug షధం మైటోకాండ్రియాలో ATP సంశ్లేషణ ప్రక్రియను ప్రభావితం చేయగలదు - ఉత్పత్తి ప్రక్రియ మందగిస్తుంది, గ్లైకోజెన్ క్రియాశీలతను ప్రోత్సహిస్తుంది, body షధ శరీర కణజాల కణాలపై పనిచేస్తుంది, తద్వారా గోడల గ్లూకోజ్‌కు పారగమ్యత పెరుగుతుంది.

టైప్ 2 డయాబెటిస్ అభివృద్ధిని నివారించే లక్ష్యంతో కార్యకలాపాల సమయంలో నివారణ చికిత్సకు ఈ సాధనం ఉపయోగించబడుతుంది. డయాబెటిస్ సమక్షంలో సమస్యల అభివృద్ధిని నివారించడానికి ఈ సాధనాన్ని as షధంగా ఉపయోగించవచ్చు.

ఇతర నివారణల మాదిరిగానే, drug షధానికి వ్యతిరేకతలు మరియు దుష్ప్రభావాలు ఉన్నాయి. దుష్ప్రభావాలు:

  1. ఆకలి లేకపోవడం;
  2. శరీరంలో బలహీనత కనిపిస్తుంది;
  3. శరీరంలో మెగాలోబ్లాస్టిక్ రక్తహీనత ఉండటం.

వ్యతిరేక సూచనలు:

  • రోగి వయస్సు 15 సంవత్సరాల వరకు;
  • మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్;
  • డయాబెటిక్ ప్రీకోమా;
  • of షధ భాగాలకు అలెర్జీ ప్రతిచర్యలు;
  • తీవ్రమైన మూత్రపిండ వైఫల్యం;
  • తీవ్రమైన అంటు వ్యాధులు;
  • మద్య.

మరొక రోగనిరోధకత జెనికల్. ఈ drug షధం లిపిడ్-తగ్గించే is షధం, ఇది జీర్ణవ్యవస్థలోని కొవ్వుల జీర్ణతను తగ్గించడానికి సహాయపడుతుంది. Ob బకాయం బారినపడే మహిళలకు మాత్రమే ఈ of షధ వాడకం సిఫార్సు చేయబడింది. మానవులలో కొవ్వు ద్రవ్యరాశి మొత్తాన్ని తగ్గించడానికి ఈ సాధనం ఉపయోగించబడుతుంది.

అకార్బోస్ సింథటిక్ గ్లూకోసిడేస్ ఇన్హిబిటర్. ఈ drug షధం జీర్ణవ్యవస్థలోని కార్బోహైడ్రేట్ల జీర్ణతను తగ్గిస్తుంది, ఇది రక్తంలో గ్లూకోజ్ తగ్గుతుంది.

డయాబెటిస్ నివారణకు ప్రధాన సిఫార్సులు

దీనికి ముందడుగు ఉన్న స్త్రీ శరీరంలో మధుమేహం అభివృద్ధి చెందకుండా ఉండటానికి, ఈ సిఫార్సులను పాటించాలని సిఫార్సు చేయబడింది:

  1. శరీర బరువు నియంత్రణ.
  2. చురుకైన జీవనశైలిని నిర్వహించడం. కంప్యూటర్ మానిటర్ లేదా టీవీ వెనుక సమయం గడపడం సిఫారసు చేయబడలేదు. క్రమం తప్పకుండా నడకలు శరీరం యొక్క వైద్యం, అలాగే మధుమేహంలో శారీరక శ్రమకు దోహదం చేస్తాయి.
  3. డైటీషియన్ మరియు ఎండోక్రినాలజిస్ట్ సిఫారసులకు అనుగుణంగా.
  4. వాటి కూర్పులో వేగంగా కార్బోహైడ్రేట్లు ఉన్న ఆహారాన్ని తినడానికి నిరాకరించడం.
  5. ద్రవ కూరగాయల నూనెలలో లభించే పాలీఅన్‌శాచురేటెడ్ కొవ్వులు తినాలి.
  6. మీరు ఎరుపు ప్రాసెస్ చేసిన మాంసాన్ని ఉపయోగించడానికి నిరాకరించాలి.
  7. నాడీ వ్యవస్థ యొక్క స్థితిని జాగ్రత్తగా చూసుకోండి - నాడీ ఒత్తిడిని నివారించండి.

అదనంగా, నివారణ చర్యలు నిర్వహించేటప్పుడు, రోగి కోసం ప్రత్యేకంగా ఎండోక్రినాలజిస్ట్ అభివృద్ధి చేసిన వ్యక్తిగత మోతాదు నియమావళికి అనుగుణంగా మందులు వాడాలి.

ఈ వీడియోలో ఎలెనా మలిషేవా ఒక మహిళకు 

25, ఫిబ్రవరి 2021, గురువారం

మూత్రవిసర్జన సమస్య (మలబద్దకం )నివారణకు తీసుకోవాలిసిన జాగ్రత్త లు అవగాహనా కోసం లింక్స్ లో చూడాలి


 

మలబద్దకం అనేది ఒక సాధారణ పరిస్థితి, ఇందులో ప్రేగు కదలికలు కష్టంగా ఉంటాయి మరియు అవి తక్కువగా జరుగుతాయి ఇది ఆహారం, వైద్య చరిత్ర లేదా ఇతర ఆరోగ్య పరిస్థితుల ఉనికి వంటి అనేక అంశాలకు సంబంధించినది. కొన్నిసార్లు, కొన్ని మందులు కూడా మలబద్ధకం కలిగిస్తాయి. వైద్యులు మలబద్ధకం ఒక వ్యాధి కాదు కానీ అంతర్లీన జీర్ణ స్థితి యొక్క అభివ్యక్తి అని అభిప్రాయపడుతున్నారు. మలబద్ధకం యొక్క  ఇతర కారణాలలో పేగు అడ్డంకులు, బలహీన కటి కండరములు, ఆహారం లో ఫైబర్ లేకపోవడం, లేదా నిర్జలీకరణము కూడా ఉన్నాయి.

మలబద్దకం అనేది లాక్సిటివ్ గా పిలువబడే ఓవర్-ది-కౌంటర్ మందులతో సమర్థవంతంగా నిర్వహించబడుతుంది. ఈ మందులు వెంటనే ఉపశమనం కలిగించినప్పటికీ, అవి రోజూ తీసుకోకూడదు. అనేక ఇంటి చిట్కాలు కూడా ఉపయోగపడతాయి. దీర్ఘకాలిక మలబద్ధకం సమస్యాత్మకంగా ఉంటుంది మరియు దీని కారణాన్ని గుర్తించేందుకు వైద్యుడు అనేక పరీక్షలు చేయవలసిన అవసరముంటుంది.. మలబద్ధకం అదుపు అవడానికి ఆహార మార్పులు చాలా తోడ్పడతాయి. చికిత్స చేయకుండా ఉంటే మలబద్ధకం యొక్క సంగ్రహాలు ఉత్పన్నమవచ్చు.

మలబద్ధకము యొక్క లక్షణాలు 

మలబద్ధకం యొక్క లక్షణాలు గుర్తించడం సులభం మరియు ఇలా ఉంటాయి:

  • మాములుగా కంటే తక్కువ ప్రేగు కదలికలు.
  • అసంపూర్ణ ప్రేగు కదలికల భావన.
  • మల విసర్జనలో ఇబ్బంది లేదా నొప్పి
  • గట్టి విరేచనాలు

ఈ లక్షణాలు కొన్ని గంటలలో ఉపశమనం కలిగించవచ్చు లేదా ఎక్కువ సేపు ఉండవచ్చు. ఏదైనాసరే, ఒక వ్యక్తి ఈ క్రింది లక్షణాలను అనుభవిస్తే, అతను / ఆమె వారి వైద్యుడ్ని వెంటనే సందర్శించాలి:

మలబద్ధకము యొక్క చికిత్స - Treatment of Constipation in Telugu

వెంటనే ఉపశమనం అందించడానికి, మీ వైద్యుడు విరేచనాకారిని సిఫారసు చేయవచ్చు. ఈ లాక్సేటివ్స్ మలబద్ధక చికిత్సకు  అప్పుడప్పుడు సహాయం చేస్తాయి, కానీ అంతర్లీనంగా ఉండే సమస్యను నయం చేయలేవు. లాక్సైటివ్ల మితిమీరిన ఉపయోగం చాలా దుష్ప్రభావాలకు దారి తీస్తుంది మరియు దీర్ఘకాలిక ఉపయోగం హానికరం కావచ్చు

వివిధ రకాల ఆరోగ్య సమస్యలకు దారితీసే లాక్సైటివ్ల మితిమీరిన వాడకం మలబద్ధకం ఉన్న ప్రజలలో చాలా సాధారణం. తినడంలో  లోపాలు  ఉన్న వ్యక్తులలో, లాక్సైటివ్ల నిరంతరాయ వినియోగం చాలా హానికరం మరియు జీర్ణాశయం యొక్క గోడకు హాని చేయవచ్చును. కాబట్టి, ఉపశమనం పొందడానికి  ఓవర్ ది కౌంటర్ లాక్సేటివ్స్ జాగ్రత్తగా వాడాలి.

లాక్సేటివ్స్ తీసుకున్న తర్వాత ఒక వ్యక్తి ఈ క్రింది లక్షణాలను అనుభవిస్తే, వెంటనే వైద్యుని సంప్రదించాలి:

  • మల విసర్జన చేసేటప్పుడు రక్తం రావడం.
  • ముక్కు నుండి రక్తస్రావం అవ్వడం
  • పొత్తి కడుపు నొప్పి.
  • వికారం.
  • ప్రేగు కదలికలలో మార్పు.
  • బలహీనత.

మలబద్ధక చికిత్స కోసం అనేకమైన లాక్సేటివ్స్ మందుల దుకాణాలలో లభిస్తున్నాయి. ఓరల్ ఓస్మోటిక్ ఏజెంట్లు మల విసర్జన సులభం చేయటానికి పెద్దప్రేగులోకి  నీటిని ఆకర్షిస్తాయి ఓరల్ బల్క్ ఫార్మర్లు మలం ఏర్పడటానికి నీటిని శోషించడం ద్వారా సరసన మార్గంలో పనిచేసి, మల విసర్జనను తేలిక చేస్తాయి. ఇతర లాక్సేటివ్స్ లో ఓరల్ స్టూల్ సాఫ్టేనెర్స్ మరియు  ఓరల్  స్టిములంట్స్ కూడా ఉన్నాయి.

ఓరల్ లాక్సేటివ్స్ కొన్ని పోషకాలు మరియు ఔషధాలను శోషించడానికి శరీర సామర్ధ్యానికి అడ్డు కలగచేయవచ్చును. కొన్ని లాక్సేటివ్స్  ఎలక్ట్రోలైట్ అసమతుల్యతను కూడా కలిగిస్తాయి. లాక్సేటివ్స్  తీసుకునే ముందు, ఈ క్రింది విషయాలను సరి చూడటానికి  లేబుల్ చదవడం ముఖ్యం:

  • కూడుకున్న దుష్ప్రభావాలు.
  • ఔషధ సంకర్షణ.
  • మధుమేహం, మూత్రపిండ సమస్యలు, లేదా గర్భం వంటి ఆరోగ్య పరిస్థితుల ఉనికి.
  • 6 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు ముందుగా వైద్యులను సంప్రదించకుండా లాక్సేటివ్స్ ని ఇవ్వకూడదు.
  • తినే అలవాట్లు మరియు ఆహార జాగ్రత్తలు తీసుకోవడం వల్ల కూడా మలబద్ధక సమస్యను దూరంగా ఉంచవచ్చని వైద్యులు  సిఫార్సు చేస్తున్నారు. మలబద్ధకం తీవ్రంగా మరియు కాలక్రమేణా తీవ్రస్థాయిలో ఉంటే, వైదేడు కొన్ని ఇతర మందులను సూచించవచ్చుఒకవేళ ఏదైనా అడ్డుపడితే, దాన్ని సరిదిద్దడానికి వైద్యులు శస్త్రచికిత్స ను సిఫార్సు చేయవచ్చు.

ఇంటి చిట్కాలు

మలబద్ధకం నుండి ఉపశమనాన్ని అందించడంలో ఇంటి చిట్కాలు చాలా సహాయకరంగా ఉంటాయి. కొన్ని సులభమైన ఇంటి చిట్కాలు ఈ  క్రింది విధంగా ఉన్నాయి:

  • ఇంగువ
    ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో రెండు చిటికెలు ఇంగువ కలిపి రోజుకి రెండుసార్లు తీసుకోవాలి
  • వాము విత్తనాలు
    ఒక పాన్లో వాము విత్తనాలను దోరగా వేయించి పొడి చేసుకొని, గోరువెచ్చని నీటితో దీన్ని తాగండి
  • నీళ్లు
    మీరు అప్పుడప్పుడు స్వల్ప మలబద్ధత ఎదుర్కొంటున్నట్లైతే, ఒక గ్లాసు గోరువెచ్చని నీటితో మీ రోజును ప్రారంభించండి, ఇది ప్రేగు కదలికలను కలగజేస్తుంది. ప్రతి ఉదయం ఖాళీ కడుపుతో నీరు త్రాగాలి. నిర్జలీకరణాన్ని నివారించడానికి రోజంతా క్రమంగా నీరును త్రాగుతూ ఉండాలి.
  • కాఫీ
    కెఫీన్ ఒక సహజమైన లాక్సేటివ్ మరియు సహజంగా ఇది చాలా తేలికపాటిది.. ఉదయాన్నే ఒక కప్పు బ్లాక్ కాఫీ కాచుకుని తాగండి. ఎవరైనా ఈ చిట్కా మీద ఆధారపడకూడదు ఎందుకంటే కెఫీన్ నిర్జలీకరణాన్ని కలుగజేసి మరియు నిద్రవేళలో తీసుకున్నప్పుడు నిద్ర సమస్యలు కలుగజేయవచ్చు.

జీవనశైలి నిర్వహణ

  • ఆహరం
    మలబద్ధకం నుండి దీర్ఘకాలిక ఉపశమనం కలగాలంటే తీసుకోవాల్సిన మొట్టమొదటి అడుగు ఆహరం విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం. ఆహారం ఇందులో కీలక పాత్ర పోషిస్తుంది. మలబద్ధకం నివారించడానికి, ఆహారంలో మరింత పీచు పదార్ధాలు చేర్చడం ముఖ్యం. పుష్కలమైన నీటితో పాటు పీచు పదార్ధం అధికంగా ఉండే ఆహారాలు ఉపశమనాన్ని అందించడంలో బాగా సహాయపడతాయి. ఒక సగటు మనిషికి ప్రతిరోజూ 25 గ్రాముల పీచు పదార్ధం అవసరమవుతుంది. గోధుమ రొట్టె, వోట్మీల్ వంటి తృణధాన్యాలు పీచుపదార్ధాలు అధికంగా ఉండే మంచి ఆహార వనరులు. రాజ్మా మరియు సోయాబీన్స్ వంటి పప్పుదినుసులలో  కూడా పీచు పదార్ధం అధికంగా ఉంటుంది. ఆకు కూరలు పీచు పదార్ధాలు అందించడమే కాకుండా అవసరమైన పోషకాలను కూడా సరఫరా చేస్తాయి. అధిక పీచు పదార్ధాలకై బాదం మరియు వేరుశెనగ వంటి పప్పులను, ఆరోగ్యకరమైన కొవ్వులుగా తీసుకోవచ్చు. 
  • జీర్ణప్రక్రియలు సజావుగా సాగడానికి ప్రతిరోజూ తగినంత నీరు త్రాగడం చాలా ముఖ్యం. మలం మృదువుగా మరియు విసర్జన సులభం అవ్వడానికి కూడా నీరు సహాయపడుతుంది. పండ్ల రసాలు వంటి ఇతర ద్రవాలను కూడా తీసుకోవచ్చు.
  • ప్రోబయోటిక్లు అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవడం కూడా జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది మరియు దీర్ఘకాల ప్రయోజనాలను అందిస్తుంది.
  • ఆహారం-సంబంధ మలబద్ధతను నివారించడానికి, ప్రాసెస్ చేయబడిన ఆహారాలు, ఎయిరేటెడ్ పానీయాలు మరియు ఘనీభవించిన ఆహారాలను తినకుండా ఉండండి

వ్యాయామం

క్రమం తప్పని శారీరక వ్యాయామం జీర్ణ ఆరోగ్యాన్ని ప్రోత్సహించడంలో సహాయపడుతుంది మరియు ప్రేగు కండరాలను ప్రేరేపిస్తుంది. వైద్యుడు కూడా పేగులు ఒక క్రమ పద్ధతిలో రూపొందించడానికి ప్రేగుల శిక్షణను సూచించవచ్చు, తద్వారా మలబద్ధకం నుండి ఉపశమనం పొందవచ్చు.

మందులు

మీరు ఏదైనా మందులు లేదా సప్లిమెంట్లను తీసుకుంటున్నట్లైతే, మలబద్ధకానికి కారణం ఇవి కావచ్చేమో అని తెలుసుకోవడానికి మీ వైద్యుడిని సంప్రదించండి. అలా గనుక అయితే, మీరు ప్రత్యామ్నాయ మందు కోసం అభ్యర్థించవచ్చు.

మలబద్ధకము కొరకు మందులు

Medicine NamePack Size
PruvictPruvict 1 Tablet
Gelusil MPSGelusil MPS Liquid Sachet
DigeneDigene Pudina Pearls
DuphalacDuphalac Bulk Oral Solution Lemon
CremaffinCremaffin (Mint Flav) Plain Syrup
ConsticaloConsticalo 1 Tablet
SoftdropsSoftdrops PM Eye Gel
FreegoFreego Granules
AristozymeAristozyme Fizz Tablet

మలబద్దకం సమస్య ను ఆయుర్వేదం లో నవీన్ నడిమింటి సలహాలు 


 

నరాల దౌర్భల్యం (సర్వ్ వీక్నెస్) ఆయుర్వేదం సహజమైన కాలకృత్యాలుగా పదమూడు వేగాలను పేర్కొంది. వీటిలో మల విసర్జన ఒకటి. దీనినెప్పుడు ఆపుకోకూడదు. అలా ఆపితే, మలబద్దకంతోపాటు పలు రకాలైన ఇతర వ్యాధులు ప్రాప్తిస్తాయి.

 

డాక్టర్లు పేషెంట్ల నుంచి ఎదుర్కొనే అతిసాధారణమైన ఫిర్యాదు మలబద్ధకం. కొంతమంది పేషెంట్లకు మలబద్దకమనేది ప్రధాన సమస్య అయినప్పటికీ దానిని చెప్పడానికి సిగ్గుపడి మిగతా వాటిని ఏకరువు పెడతారు. మరికొంతమంది అసలు ముఖ్యమైన సమస్యను పక్కకుపెట్టి మలబద్ధకం గురించే మాట్లాడుతుంటారు.

బాధితుల వైపునుంచి చూసినట్లయితే మలబద్దకం గురించి అందరి అభిప్రాయాలూ ఒకేలా ఉండవు, దీనిని ఒకొక్కరు ఒక్కో రకంగా అన్వయించుకుంటారు. చాలా మందికి ప్రతిరోజు మల విసర్జన చేయడం అలవాటు. ఈ దైనందిన కార్యక్రమంలో మార్పు వచ్చిందంటే వారి దృష్టి ప్రకారం మలబద్ధకం ఉన్నట్లు. మరికొంతమందికి రోజుకు రెండు నుంచి మూడుసార్లు మల విసర్జన చేస్తే తప్ప 'తృప్తి' ఉండదు. కొద్దిమంది వారానికి ఒకసారి మాత్రమే మలవిసర్జన చేస్తుంటాయి. ఇతరత్రా ఆరోగ్యంగా ఉండటం, రొటీన్ గా ఇలాగే జరుగుతుండటం అనేవి ఉంటే వీరికి మలబద్ధకం లేనట్లే. ఇంతకీ చెప్పవచ్చేదేమిటంటే, మలబద్ధకం గురించి మాట్లాడేటప్పుడు వ్యక్తిగత కోణాల నుంచి చూడాల్సి ఉంటుందని. ఎవరిలోనైనా సరే - వారి రొటిన్ లో మార్పు సంభవించి, జరగాల్సిన సమయంలో , మల విసర్జన జరగనట్లయితే దానిని మలబద్దకంగా భావించాలి.

 

మలబద్దకం ప్రాప్తించినప్పుడు సాధారణంగా కడుపు ఉబ్బరించినట్లుగా ఉంటుంది. పొట్టలోపల అసౌకర్యంగా, నులినొప్పిగా ఉంటుంది. అన్నింటికీ మించి ముక్కితే తప్ప మల విసర్జన జరుగని పరిస్థితి ఉంటుంది. ఇటువంటి లక్షణాలున్నప్పుడు చికిత్స అవసరమవుతుంది.

 

మూడు రోజులకు మించి మలబద్దకం ఉంటూ దానికి కారణం ఆహారంలో మార్పులు, ఎండ లేదా వేడి వాతావరణంలో గడపటం, అదేపనిగా కూర్చోవటం, ఎక్కువ సేపు పడుకోవటం వంటివి కాకుండా ఉంటే సరైన వ్యాధి నిర్ణయం కోసం వైద్య సలహా తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఈ సూచన 40 సంవత్సరాలు దాటిన వారికి ఎక్కువగా వర్తిస్తుంది.

 

మనం ఆహార పదార్థాలను తిన్నప్పుడు, లేదా తాగినప్పుడు అవి వాటి ప్రాథమిక అంశాలుగా - అంటే ప్రోటీన్లు, పిండి పదార్థాలు లేదా కార్బోహైడ్రేట్లు, క్రొవ్వు తదితరాలుగా తయారవుతాయన్న సంగతి తెలిసిందే. మన నోటిలోని లాలాజలం ఆహార పచానాన్ని మొదలుపెట్టినప్పటికీ పచన క్రియ వేగవంతమయ్యేది మాత్రం ఆమాశయంలోని గాఢాంమ్లం ద్వారానే. ఆహార పచనానంతరం శరీరం జీర్ణరసాలను చిన్న పేగులనుంచి తనలోనికి విలీనం చేసుకుంటుంది. మిగిలిపోయిన వ్యర్థాలు, జీర్ణంకాని పీచు పదార్థాలు, కాలేయం నుంచి విడుదలయ్యేబై - ప్రొడక్టులూ, ఇతర ద్రవ పదార్థాలూ ఇవన్నీ పేగుల కండరాలు కదలికల సహాయంతో చిన్న పేగు నుంచి పెద్ద పేగుకూ, అక్కడినుంచి మలద్వారా వెలుపలికి విసర్జితమవుతాయి. ఇదే సమయంలో పెద్ద పేగు చివరిభాగం శరీరానికి అవసరమైన ద్రవాంశాలను తిరిగి పీల్చేసుకుంటుంది.

 

అధిక చమట, వేడి వాతారవరణం, నీళ్ళను తక్కువగా తాగటం వంటి వాటి వలన శరీరంలో ద్రవాంశం ఉండవలసిన ప్రమాణం కన్నా తగ్గుతుంది. డీ హైడ్రేషన్ లేదా నిర్జలీయత. ఐనప్పటికీ, పెద్ద పేగు ద్రవరూప మలం నుంచి గ్రహించాల్సినంత ద్రవాంశాన్ని గ్రహిస్తూనే ఉంటుంది. ఫలితంగా మలం గట్టిపడి ఉండలుగా తయారై ముక్కితే తప్ప వెలుపలికి రాని స్థితి నెలకొంటుంది. దీనినే మలబద్ధకం అంటారు.

 

ఆహారం తీసుకోవడం ఎంత రోజువారీ కార్యక్రమమో, మల విసర్జన కూడా అంతే. మీ సమస్యకు కారణం ఒకవేళ మీ రొటీన్ లో మార్పు చోటుచేసుకోవడమే అయితే ఆ విషయం డాక్టర్ కంటే మీకే ఎక్కువ స్పష్టంగా తెలుస్తుంది. కాబట్టి మీ సమస్యకు కారణం మీ దైనందిన కార్యక్రమంలో మార్పా లేక మరేదైనా శారీరక రుగ్మతా అనేది తెలుసుకోవాలంటే కొంత తర్కం అవసరం. ఈ కోండి పాయింట్లు చూస్తే మీ సమస్యకు క్లూ దొరకవచ్చు.

 

1. పేగుల కదలికల్లో అపక్రమం మలబద్దకాన్ని అనుసరించి విరేచనాలు అవుతుంటే అది 'గ్రహణి' అనే వ్యాధి లక్షణం. ఈ వ్యాధిని ఐ.బి.యస్ (ఇరటబుల్ బొవెల్ సిండ్రోమ్) తో పోల్చవచ్చు. దీనిలో సాధారణంగా పొట్ట ఎడమ భాగంలో నులినొప్పి ఉంటుంది. మలం, అపాన వాయువులను విసర్జించిన తరువాత కూడా ఈ నొప్పి తగ్గకుండా అలాగే ఉంటుంది. ఒక్కొక్కసారి కడుపు ఉబ్బరించినట్లుగానూ, పేగులను మెలిపెడుతున్నట్లుగానూ, కడుపులో వికారంగానూ అనిపించవచ్చు. మల విసర్జన అయిదార్లు సార్లు చేయాల్సి వస్తుంది. ఎన్నిసార్లు వెళ్లినా పూర్తిగా కానట్లు వుండటం, ఇంకా వెళ్లాలనిపించడం దీనిలోని ప్రధానం లక్షణం. మలం ద్రవయుక్తంగా కాకుండా, మామూలు స్థితిలోనే పల్చగా, స్వల్పంగా వెడలుతుంటుంది. ఈ వ్యాధికి ప్రధాన కారణం అర్థంలేని ఆందోళన, మానసిక అస్థిరతలేనని చెప్పవచ్చు. అల్సర్లూ, పాలిప్ లూ, అపెండిసైటిస్, అమీబియాసిస్ లు లేవని తేలిన తరువాత మాత్రమే ఈ వ్యాధిని నిర్ధారణ చేయాల్సి ఉంటుంది. ఈ వ్యాధితో బాధపడే వారికి రక్త పరీక్ష, మల పరీక్ష, బేరియం ఎక్స్ రే, సిగ్మాయిడోస్కోపీ వంటి వన్నీ నార్మల్ గానే ఉంటాయి.

 

గ్రహణి వ్యాధిలో కనిపించే మలబద్దకం సమస్యను అన్ని కోణాలనుంచి - శారీరకమా లేక మానసికమా అనేది విశ్లేషించవలసి ఉంటుంది. అవసరమైతే 'పర్పటి కల్పాలను' వైద్య సలహాతో వాడాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో, స్నేహకర్మ, స్వేద కర్మ, శోధన చికిత్సలు కూడా అవసరమవుతాయి.

 

కొన్నిసార్లు షుగర్ వ్యాధిలో కూడా ఇవే లక్షణాలు - అంటే మలబద్ధకాన్ని అనుసరించి విరేచనాలవ్వడమనేది కనిపించవచ్చు. అయితే 50 సంవత్సరాల వయస్సు తరువాత ఈ లక్షణాలు ప్రస్పుటమైతే లోపల పాలిప్ లు, ట్యూమర్లు వంటివి పెరుగుతున్నాయేమో చూడాలి. సమస్య ఏమిటన్నది జాగ్రత్తగా పరీక్షించి దానికి తగిన చికిత్సను చేస్తే మలబద్ధకం తగ్గిపోతుంది.

 

2. అలవాటుగా మారిన మలబద్ధకం: పీచు పదార్థాలను, నీళ్లను తక్కువగా తీసుకునేవారిలోనూ, విరేచనానికి మందు వేసుకోవడం దినచర్యలో భాగంగా ఉన్నవారిలోనూ, పెద్ద పేగు కండరాలలో సహజ శక్తి కోల్పోతుంది. ఫలితంగా మలబద్దకం అలవాటుగా మారుతుంది. దీని నుంచి బయటపడాలంటే ఈ కారణాలను దృష్టిలో పెట్టుకోవాలి.

 

3. మందుల దుష్ఫలితాలు: చాలా రకాలైన అల్లోపతి మందులు మలబద్ధకాన్ని కలిగిస్తాయి. ఉదాహరణకు కొడైల్ కలిగిన దగ్గు మందులు, నొప్పిని తగ్గించే మందులు మొదలైనవి. అలాగే, బైబీపీని నియంత్రించడానికి వాడే విరాపమిల్, బీటా బ్లాకర్లూ. ఆస్టియోపోరోసిస్ లో వాడే కాల్షియం మందులూ, ఆందోళనను తగ్గించడం కోసం వాడే ట్రాంక్విలైజర్లు, కడుపులో మంటను తగ్గించడానికి వాడే యాంటాసిడ్స్ వీటన్నిటికి మలబద్ధకాన్ని కలిగించే గుణం ఉంది. అలోపతి మందుల వలన మలబద్దకం ప్రాప్తిస్తున్నప్పుడు ఆ విషయం మీ డాక్టరు దృష్టికి తీసుకువెళ్లండి.


4. పెద్ద పేగులో ట్యూమర్లు పెద్ద పేగులో ట్యూమర్లు మొదలయినవి తయారైనప్పుడు మల విసర్జనకు అడ్డుపడి మలబద్దకాన్ని కలిగిస్తాయి. పెరుగుదల వల్ల మలం రిబ్బనులాగా బైటకు వస్తుంది. పేగులు ఇన్ ఫేమ్ అయినప్పుడు కూడా ఇలాగే జరగవచ్చు, ఈ సమస్య రోజుల తరబడి ఉంటుంటే తదుపరి పరీక్షలు అవసరమవుతాయి.

ఔషధాలు: లవణ భాస్కర చూర్ణం, కాంకాయనవటి (గుల్మ), పీయూషవల్లి రసం, ప్రాణదా గుటిక

 

5. మలాశయంలో అల్సర్లు, పుండ్లు (అల్సరేటివ్ కోలైటిస్) మలానికి స్వచ్చమైన కాంతి కలిగిన ఎర్రని రక్తం అంటుకుపోయి కనిపిస్తే దానికి మొలల వ్యాధి కారణమయ్యే అవకాశం ఉంది. అలా కాకుండా, మలం ఉపరితలానికి జిగురు, బంక వంటి పదార్థం అంటుకుని కనిపిస్తే దానిని మ్యూకస్ గా గ్రహించాలి. ఇలా అల్సరేటివ్ కొలైటిస్ లోనూ, ఇరిటబుల్ బోవెల్ సిండ్రోమ్ లోనూకనిపించే అవకాశం ఉంది. వీటన్నిటిలోనూ మలబద్దకం ఉంటుంది. ఈ వ్యాధుల్లో మలబద్ధకానికి చెప్పిన సూచనలను పాటిస్తూ ఆయా వ్యాధులకు చెప్పిన ప్రత్యేక చికిత్సలను తీసుకుంటే సరిపోతుంది.

సూచనలు: ఆహారాన్ని కొద్దిమొత్తాల్లో తరచుగా తీసుకోవాలి. మషాలాల వాడకం తగ్గించాలి. మాంసం, గుడ్లు వంటివాటిని తీసుకుంటే లోపల కుళ్లిపోయి మలాశయాన్ని ఇరిటేట్ చేసే నైజం ఉంటుంది కాబట్టి వాడకూడదు. పంచదార, పెసలు, పిండి పదార్థాలు వాడకూడదు. ఈ వ్యాధిలో మంచివికావు. మజ్జిగ, కూరగాయలు, పండ్లు ఎక్కువగా తీసుకోవాలి. తగినంతగా విశ్రాంతి తీసుకోవాలి.

గృహచికిత్సలు: శల్లకి (అందుగు) నిర్యాసాన్ని గాని లేదా యష్టి మధుకాన్ని గాని లేదా కలబంద గుజ్జుకాని పావుచెంచాడు మోతాదులో తేనె చేర్చి తీసుకోవాలి.

ఔషధాలు: యశద భస్మం, లోహభస్మం, ఈసబ్ గోల్ చూర్ణం, స్వర్ణపర్పటి.

6. పేగుల్లో రక్తస్రావం మలబద్దకంతో పాటు మలం నల్లగా వస్తుంటే పేగులలోపల ఎక్కడో బ్లీడింగ్ అవుతున్నట్లుగా అనుమానించాలి. అల్సర్లు, ట్యూమర్ల వంటివి దీనికి కారణం.

ఔషధాలు: బొలబద్ధరసం, చంద్రకళారసం, బోలపర్పటి, లాక్షాచూర్ణం, వాసారిష్టం

7. అర్శమొలలు/ఫిషర్లు మలబద్ధంకంతోపాటు సాధారణంగా అర్శమొలలు, ఫిషర్లు అనుబంధించి ఉంటాయి. ఫిషర్లవల్ల గాని, మొలలు చిట్లడం వల్ల గాని మల ద్వారం వద్ద నొప్పిగా అనిపిస్తుంటుంది. నొప్పి మల విసర్జన సమయంలో మరీ ఎక్కువవుతుంది. మలబద్దకం వలన ఇవీ, వీటి వలన మలబద్ధకమూ - ఇలా ఒక దాని వలన ,మరొకటి ఎక్కువవుతాయి.

ఔషధాలు: అర్శకుఠారరసం, అర్శోఘ్నవటి, అభయారిష్టం, బాహ్యప్రయోగం - జాత్యాది ఘృతం.

 

8. వృత్తి రీత్యా విభిన్న ప్రదేశాలలో తిరగాల్సి రావటం, లేదా కొత్త ప్రదేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ నీళ్లు తాగాల్సి రావటం. లేదా కొత్త రకమైన ఆహారం తినాల్సి రావటం వంటి వాటి వల్ల మలబద్దకం రావచ్చు.ఇలా జరుగుతుంటే తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి.

 

9. థైరాయిడ్ గ్రంథి చురుకుదనం తగ్గటం (హైపోథైరాయిడిజం) మలబద్ధకంతోపాటు అధికబరువు కూడా ఉంటే అది థైరాయిడ్ గ్రంథి మందగించడాన్ని సూచిస్తుంది. ఈ గ్రంథి మందకొడిగా తయారైనప్పుడు శరీరపు క్రియలన్నీ నెమ్మదిస్తాయన్న సంగతి తెలిసిందే. ఈ లక్షణాలతో పాటు చలి వాతావరణాన్ని తట్టుకోలేకపోవడం, నాడి వేగం తగ్గటం, చర్మం దళసరిగా మారడం, జుట్టు పలుచన కావడం, చమట పట్టకపోవడం, డిప్రెషన్ మొదలయినవి కనిపిస్తాయి.

థైరాయిడ్ గ్రంథి మందకొడిగా తయారైనప్పుడు కారణానుగుణమైన చికిత్సను చేయాల్సి ఉంటుంది. అపతర్పణ చికిత్సలు వీటిల్లో ప్రధానమైనవి. ఇవి శరీరం పనితీరును వేగవంతం చేస్తాయి.

ఔషధాలు: చతుర్ముఖ రసం, క్రమవృద్ధి లక్ష్మీ విలాస రసం, మకరధ్వజ సింధూరం పూర్ణ చంద్రోదయం, పంచబాణ రసం, స్వర్ణక్రవ్యాది రసం, వసంతకుసుమాకర రసం, ఆరోగ్యవర్ధినీ వటి, చంద్రప్రభావటి, గోక్షురాది గుగ్గులు, కాంచనార గుగ్గులు, మధుస్నుహి రసాయనం, మహాయోగరాజ గుగ్గులు, నవక గుగ్గులు, పంచతిక్త గుగ్గులు ఘృతం, త్రయోదశాంగ గుగ్గులు, యోగరాజ గుగ్గులు, భృంగరాజాసవం, దాత్రీలోహం, కుమార్యాసవం, కాంతవల్లభ రసం, లోహాసవం, లోహరసాయనం, లోకనాధ రసం, నవాయస చూర్ణం, ప్రాణదా గుటిక, రాజతలోహ, రసాయనం, స్వర్ణకాంత వల్లభరసం, సప్తామృత లోహం.

 

11. క్యాన్సర్ మలబద్దకంతోపాటు బరువు కోల్పోతుంటే - ముఖ్యంగా 50 ఏళ్ళు దాటిన వారిలో ఇలా జరుగుతుంటే ఉన్నపళంగా చెకప్ చేయించుకోవడం అవసరం. ఇలాంటి లక్షణాలు పేగులకు సంబంధించిన క్యాన్సర్ లో కనిపించే అవకాశం ఉంది.

 

11. వ్యాయామరహిత జీవితం: వ్యాయామం అనునిత్యం చేసేవారిలో మలబద్ధకం కనిపించదు. అయితే వ్యాయామం చేస్తున్న సమయంలో తగినన్ని నీళ్ళు తాగకపోతే మాత్రం శరీరంలోని ద్రవాంశం స్వేదం రూపంలో ఆవిరైపోయి, మలబద్ధకం ప్రాప్తించే అవకాశం ఉంది.

 

12. పెద్ద పేగులో కంతులూ, పెరుగుదలలు పెద్దపేగు చివరిభాగంలో ఏదయినా కంతి పెరిగితే అది మూత్రకోశం మీద ఒత్తిడిని కలుగచేస్తుంది. దీని వలన మలబద్దకంతో పాటు పలుమార్లు మూత్రానికి వెళ్ళాల్సి వస్తుంది. దీనికి తదుపరి పరీక్షలు అవసరమవుతాయి.

 

13. నరాల దౌర్భల్యం (నర్వ్ వీక్నెస్) మలబద్దకంతోపాటు మూత్రం బట్టల్లో పడిపోవడం అనే లక్షణం నరాలు వ్యాధిగ్రస్తమవడాన్ని సూచిస్తుంది. వెన్నుపూసలో ట్యూమర్లు పెరగడం, డిస్క్ స్లిప్కావడం వంటి సందర్భాలలో కూడా ఇలా జరగవచ్చు, దీనికి శమనౌధాలతోపాటు ఆయుర్వేద పంచకర్మ చికిత్సల్లో ఒకటైన వస్తికర్మను చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది. ఇది ఒక ఎనిమా లాంటి పధ్ధతి. నరాలు శక్తివంతమవుతాయి.

ఔషధాలు: మాణిక్య భస్మం, వాతకులాంతక రసం, సిద్ధమకరద్వజం, కంజనకారి రసం, రజత సింధూరం, విషతిందుకవటి.

 

నవీన్లు: 1. ఇతర అలవాట్ల మాదిరిగా మలబద్ధకం కూడా ఒక అలవాటే. దీనిని క్రమంగా వదిలించుకోవాలి తప్పితే, హైరానా పడిపోకూడదు.

2. పీచు పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. గోధుమలు, మొక్కజొన్నలు, రాగులు, ఓట్స్, బార్లిగింజలు, ఇతర గింజ ధాన్యాలు (పొట్టుతో కూడిన పెసలు, కందులు, బఠాణీలు), పండ్లు (తోలుతో సహా), కూరగాయలు (చెక్కుతో సహా), బియ్యం (తవుడుతో సహా) - వీటన్నిటిలో ఫైబర్ ఉంటుంది. వీటిని హఠాత్తుగా మొదలెట్టకూడదు. ఆహారంలో క్రమంగా చేర్చుకుంటూ వెళ్లాలి. అలా కాకుండా, ఒకేసారి మొదలెడితే, అజీర్ణం కారణంగా కడుపు ఉబ్బరింపు, విరేచనాలు, గ్యాస్ తయారుకావడం వంటి అనేక సమస్యలు ఉత్పన్నమవుతాయి.

3. అరటిపండు, గింజలు తీసివేసిన జామకాయ వంటివి మలబద్దకంలో అన్ని విధాలా మంచివి.

4. ద్రవపదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి. రోజుకు కనీసం ఎనిమిది నుంచి పన్నెండు గ్లాసులు నీళ్లు తాగాలి. ఇలా చేయడం వల్ల మలం మృదువుగా, స్నిగ్ధంగా, హెచ్చుగా తయారవుతుంది. ఉదయం లేచిన తరువాత వెంటనే మూడు నాలుగు గ్లాసుల నీళ్లు తాగండి. అలాగే ఆహారానికి అరగంట ముందుగాని, అరగంట తరువాత గాని మిగిలిన నీళ్లు తాగండి. (ఆహారంతో పాటు నీళ్లు ఎక్కువగా తాగితే జీర్ణరసాలు పలుచబడి అజీర్ణం ప్రాప్తిస్తుంది)

5. రోజు మొత్తంలో మీకు ఏ సమయంలో అనువుగా ఉంటుందో ఆ సమయంలోనే మలవిసర్జన చేయండి. చాలామందికి ఉదయం లేచిన తరువాత మలవిసర్జనకు అనువుగా ఉంటుంది, మరికొంతమందికి ఆహారం తిన్న తరువాత పేగుల కదలిక మొదలై మలవిసర్జన జరుగుతుంది. గ్యాస్ట్రోకోలిక్ రిప్లక్స్ వల్ల ఇలా జరుగుతుంది తప్పితే ఇది వ్యాధి కాదు.

6. మలవిసర్జనకు వెస్ట్రన్ కమోడ్ కు బదులు ఇండియన్ కమోడ్ ను ఉపయోగించడం మంచిది. దీని వల్ల పొట్టమీద ఒత్తిడి పడి మలవిసర్జన సజావుగా జరుగుతుంది. ఒకవేళ వెస్ట్రన్ కమోడ్ ను ఉపయోగించడం తప్పదనుకుంటే, పాదాల క్రింద ఎత్తైన స్టూలు నొకదానిని అమర్చుకోండి.

7. రోజువారీగా వ్యాయామం చేయడం వల్ల మలబద్దకం దరిచేరదు. చాలా మందిలో వయస్సు పెరుగుతున్నకొద్ది స్థిరమైన జీవన శైలి అలవడుతుంది. ఇలాంటి వారు సహజంగానే శారీరక శ్రమకు దూరమవుతుంటారు. కాబట్టి మీరు ప్రత్యేక శ్రద్ధతో వ్యాయామం చేయాలి. వ్యాయామానెప్పుడు అర్థశక్తిగానే చేయాలని ఆయుర్వేదం చెపుతుంది.

8. ప్రతిరోజూ కనీసం నలభై అయిదు నిమిషాలు నడవండి. నడిచేటప్పుడు మొదటి పదిహేను నిముషాలు నెమ్మదిగా నడవాలి. తర్వాత పదిహేను నిమిషాలు వేగంగా, చేతులు ఊపుతూ నడవాలి. చివరి పదిహేను నిమిషాలు మళ్లీ నెమ్మదిగా నడవాలి. నడవడం కుదరకపోతే, ఇంట్లోనేఏదన్నా వ్యాయామం చేయండి. యోగాసనాలు చేయదల్చుకుంటే, ముందుకు, వెనుకకు వంగుతూ చేసే ఏ భంగిమైనా మంచిదే.

9. ఉదయం లేచిన తర్వాత వెల్లికిలా పడుకొని పొట్టప్రాంతంలో మసాజ్ చేసుకోండి.కుడిచేయి పిడికిలి బిగించి పొత్తికడుపు ప్రదేశం నుంచి మొదలెట్టి, ఒత్తిడి ప్రయోగిస్తూ, కుడి ప్రక్కనుంచి ఎడమ ప్రక్కకు నలుచదరంగా మసాజ్ చేసుకోవాలి. దీనితో పెద్ద పేగు సంకోచం వ్యాకోచాలు ఉత్తేజితమవుతాయి. చెయ్యి తేలికగా కదలడం కోసం పొట్ట మీద టాల్కం పౌడర్ జల్లుకోవచ్చు, ఇలా ప్రతిరోజూ కనీసం ఇరవై నుంచి ముప్పై రౌండ్లు చేసేట్టయితే,. పేగులో 'పెరిస్టాటిక్ మూవ్ మెంట్' సక్రమంగా జరిగి మలబద్దకం దరిచేరకుండా ఉంటుంది.

10. మానసిక ఒత్తిడిని తగ్గించుకొని ప్రశాంతంగా ఉండండి. టెన్షన్లు తగ్గించుకుంటే విరేచనం సాఫీగా జరుగుతుంది.

11. ఒత్తిడి వల్ల శరీరంలో ప్రతిక్రియా వేగవంతమౌతుంది. ఫలితంగా నీరు శాతం తగ్గిపోతుంది. దీనితో మలం గట్టిపడి మలబద్ధత ప్రాప్తిస్తుంది. యోగా, ధ్యానం, మెడిటేషన్, హిప్నోసిస్ ఇలాంటివన్నీ రిలాక్సేషన్ ని కలిగించి, ఒత్తిడిని తగ్గించగలుగుతాయి. అంతేకాదు - మనసారా నవ్వడం వల్ల కూడా పొట్ట కండరాలు మసాజ్ కు గురవుతాయి. పైగా దీని వల్ల కూడా రిలాక్సేషన్ లభిస్తుంది.

12. ఇంగ్లీషు మందులు కొన్నిటికి మలబద్దకాన్ని కలిగించే నైజం ఉంది. ముఖ్యంగా క్యాల్షియం, అల్యూమినియం కలిగిన యాంటాసిడ్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే మూత్రాన్ని జారీచేసే మందులు, డిప్రెషన్ మందులు, ఎలర్జీ మందులు మొదలైన వాటి విషయంలో కూడా అప్రమత్తంగా ఉండాలి.

13. గ్యాస్ తయారయ్యే పదార్థాలను మానేయాలి. చిక్కుడు, దోసకాయ, క్యాబేజీ, క్యాలీఫ్లవర్, ఉల్లిపాయ, శెనగపిండి వంటకాలు, కోడిగుడ్లు, కూల్ డ్రింక్స్, పులిసిన పదార్థాలు, వేపుడు పదార్థాలు, సరిగా ఉదికించని పదార్థాలు గ్యాస్ ను తయారు చేసే నైజం ఉంది. వీటివల్ల కడుపుబ్బరింపు, దానిని అనుసరించి మలబద్దకం ప్రాప్తిస్తాయి.

14. మలవిసర్జన చేసేటప్పుడు వలవంతంగా ముక్కకూడదు; ఇలా చేస్తే ఆర్శమొలలు తయారై మలాన్ని అడ్డుకొని తిరిగి మలబద్దకాన్ని కలిగిస్తాయి.

15. పిల్లలలో మలబద్దకం ఉన్నప్పుడు కుప్పింట (హరిత మంజరి) ఆకులను సపోజిటరీలాగా చేసి మల ద్వారంలో చొప్పించాలి. లేదా తమలపాకు తొడిమను ఆముడంలో ముంచి కూడా ఇలాగే చేయవచ్చు. ఇలా కాదనుకుంటే గాడిదగడపాకును ముద్దగానూరి పొట్టపైన పట్టు వేసినా సరిపోతుంది

. 16. పెద్ద వారిలో మలబద్దకం పోగొట్టడానికి అనేక రకాలైన ఆయుర్వేద ఔషధాలు ఉన్నాయి. వాటిలో కొన్ని కేవలం మల విసర్జనకు ఉపయోగపడితే, కొన్ని ఆహారాన్ని పచనం చేసే విధంగా కూడా ఉంటాయి. కొన్ని మలాన్ని యథాతథంగా విసర్జింపచేస్తే మరికొన్ని అపక్వ మలాన్ని పూర్తిగా పక్వం చేసి మరీ విసర్జింపచేస్తాయి. ఈ మందులను అవసరానుసారం ఆయా సందర్భాలను బట్టి వాడవలసి ఉంటుంది.

17. త్రిఫలా చూర్ణం, పంచనకారచూర్ణాలు మలబద్దకాన్ని తగ్గిస్తాయి. ఇక్కడో ముఖ్యమైన విషయం ప్రస్తావించాలి. మలబద్దకాన్ని పోగొట్టుకోవడానికి వాడే కొన్ని రకాల చూర్ణాలలో లవణాలు కలుస్తాయి కనుక రక్తభారం (బిపీ) అధికంగా ఉండే వారు వాటిని వైద్య సలహా మేరకు మాత్రమే వాడాల్సి ఉంటుంది.

18. పంచకర్మ చికిత్సా విధానంలో ఒకటైన విరేచన కర్మ ద్వారా మలబద్దకాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనవచ్చు.

గృహ చికిత్సలు: 1. కరక్కాయ పెచ్చుల చూర్ణాన్ని చెంచాడు మోతాదుగా అంతే భాగం ఉప్పు కలిపి రాత్రి పడుకునేముందు తీసుకోవాలి.

2. రేలపండు గుజ్జును చెంచాడు మోతాదుగా రెండు చెంచాలు చెక్కెర కలిపి గోరువెచ్చని నీళ్ళతో తీసుకోవాలి.

3. రోజు కనీసం పావుకిలో నల్ల ద్రాక్ష పండ్లను తినాలి. తాజా పండ్లు దొరకని పక్షంలో ఎండు ద్రాక్షలను 24 గంటలు నీళ్లలో నానేసి నీళ్ళతోసహా తీసుకోవాలి.

4. వస కొమ్ము, కరక్కాయ పెచ్చులు, చిత్రమూలం వేరు, పిప్పళ్లు, అతివస, చెంగల్వ కోష్టు, యవక్షారం వీటిని సమభాగాలు తీసుకొని అన్నిటిని పొడిచేసికొని నిలువచేసుకోవాలి. ఈ పొడిని అరచెంచాడు మోతాదుగా రాత్రిపూట పడుకునేముందు తీసుకోవాలి.

5. అతసీతైలం (లిన్సీడ్ ఆయిల్) భోజనానికి ముందు చెంచాడు పరిమాణంలో నీళ్లతో కలిపి తీసుకుంటే మలం హెచ్చుమొత్తాల్లో మృదువుగా విసర్జితమౌతుంది.

ఔషధాలు: త్రిఫలచూర్ణం, లశునాదివటి, అభయారిష్టం, పంచసకార చూర్ణం, ఏరండపాకం

ధన్యవాదములు 🙏

మీ నవీన్ నడిమింటి

విశాఖపట్నం

9703706660

అస్వీకార ప్రకటన: ఈ సైటుపై లభ్యమవుతున్న మొత్తం సమాచారము మరియు లేఖనము కేవలం అవగాహనా ఆవశ్యకతల కొరకు మాత్రమే. ఇక్కడ ఇవ్వబడిన సమాచారమును ఏదైనా ఆరోగ్య సంబంధిత సమస్య లేదా అస్వస్థత నుండి కోలుకోవడానికి లేదా స్వస్థత కొరకు నిపుణుల సలహా లేనిదే ఉపయోగించుకోకూడదు. చికిత్స పరీక్షలు మరియు సేవల కొరకు ఎల్లప్పుడూ ఒక అర్హత పొందిన వైద్యుల సలహా తీసుకోవాలి


22, ఫిబ్రవరి 2021, సోమవారం

రైనాడ్స్ ఫేనోమెనన్ సమస్య ఉన్న వాళ్ళ తీసుకోవాలిసిన జాగ్రత్త లు ఈ లింక్స్ లో చూడాలి


రేనాడ్స్ ఫెనోమినన్ అంటే ఏమిటి?

శరీరం తీవ్రమైన చలికి  లేదా ఒత్తిడికి గురైనపుడు అంత్య/చిట్ట చివరి భాగాలకు రక్త ప్రసరణ తగ్గిపోవటం వలన చేతి వేళ్ళ మరియు కాలి వేళ్ళ రంగు (తెల్ల, నీలం మరియు ఎరుపు రంగులోకి) మారిపోతుంది దానిని రేనాడ్స్ వ్యాధి లేదా రేనాడ్స్ ఫెనోమినన్ (ఆర్ పి) అని పిలుస్తారు. ఇది అంతర్లీన కారణం ఆధారంగా ప్రాథమిక లేదా ద్వితీయంగా ఉంటుంది.

దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

ఒక వ్యక్తి ఈ పరిస్థితి యొక్క ఒక ఎపిసోడ్ను (తీవ్ర చలికి  లేదా ఒత్తిడికి) అనుభవిస్తున్నప్పుడు, లక్షణాలు అప్పుడప్పుడూ (intermittently) కనిపిస్తాయి, అవి వీటిని కలిగి ఉంటాయి:

  • ప్రభావిత భాగాలలో ఈ క్రింది అనుభూతులు (sensations) కలుగుతాయి:
    • నొప్పి.
    • సూదితో గుచ్చినట్లు అనిపించడం.
    • తిమ్మిరి.
    • జలదరింపు.
    • అసౌకర్యం.
  • నీలం, తెలుపు లేదా ఎరుపు రంగులోకి ప్రభావిత చర్మ రంగు మారిపోవడం.
  • బాధిత భాగాన్ని కదిలించడం కష్టం అవుతుంది

దీని ప్రధాన కారణాలు ఏమిటి?

రేనాడ్స్ ఫెనోమినన్ ప్రధానంగా కొంత మంది వ్యక్తులలో కాలి మరియు చేతి వేళ్లలో అతి సున్నితంగా రక్త నాళాల వలన కలుగుతుంది. ప్రాధమిక రేనాడ్స్ ఫెనోమినన్ ఇడియోపథిక్ (కారణం తెలియనిది), అయితే ద్వితీయ రేనాడ్స్ ఫెనోమినన్ రకం యొక్క కారణాలు:

  • ఆటో ఇమ్యూన్ రుగ్మతలు మరియు ఆర్థరైటిస్ వంటి కొన్ని సమస్యలు.
  • మంచుతిమ్మిరి.
  • బీటా బ్లాకర్స్ మరియు కొన్ని కెమోథెరపీ ఏజెంట్లను కలిగి ఉండే మందులు.
  • యాంత్రిక కంపనం (Mechanical vibration).
  • ఎథెరోస్క్లెరోసిస్ (ధమనుల యొక్క సంకుచితం మరియు గట్టిపడటం).
  • ధూమపానం.

దీనిని ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?

రోగ నిర్ధారణ పూర్తి ఆరోగ్య చరిత్ర మరియు క్షుణ్ణమైన శారీరక పరీక్ష ఆధారంగా జరుగుతుంది, తర్వాత ఈ కింది పరీక్షలు ఉంటాయి:

  • ఆటో ఇమ్మ్యూనిటీని గుర్తించడానికి రక్త పరీక్షలు.
  • నెయిల్ ఫోల్డ్ క్యాపిల్లారోస్కోపీ (nailfold capillaroscopy) అని పిలువబడే పరీక్షను ఉపయోగించి వేళ్లగోళ్ల క్రింద ఉండే రక్తనాళాలను పరీక్షించడం.
  • వ్రేళ్ళ కణజాలపు మైక్రోస్కోపిక్ పరీక్ష.
  • కోల్డ్ స్టిమ్యులేషన్ పరీక్ష (Cold stimulation test).

ఈ పరిస్థితి నిర్వహణ వీటిని కలిగి ఉంటుంది:

  • లైఫ్స్టయిల్ సవరింపులు/మార్పులు, అవి:
    • రేనాడ్స్ ఫెనోమినన్ దాడి  యొక్క మొదటి సంకేతం కనిపించిన వెనువెంటనే వెచ్చని నీటిలో చేతులు పెట్టడం/ఉంచడం.
    • చేతులు మరియు కాళ్ళు వెచ్చగా ఉంచడానికి చల్లని వాతావరణంలో చేతికి వెచ్చదనం కలిగించేవి (warmers) మరియు చేతి తొడుగుల (gloves)ను ఉపయోగించడం.
    • ఒత్తిడి మరియు కొన్ని రకాల మందులు వంటి ప్రేరేపకాలను నివారించడం.
    • రేనాడ్స్ ఫెనోమినన్ను నివారించడానికి ధూమపానం నిలిపివేయడం ఒక ముఖ్యమైన చర్య.
  • మందులు:
    • కాల్షియం ఛానల్ బ్లాకర్లు (calcium channel blockers) మరియు ఆంజియోటెన్సిన్-రిసెప్టర్ బ్లాకర్లు (angiotensin-receptor blockers) వంటి రక్తపోటు మందులు ఇవ్వబడతాయి, అవి రక్తనాళాలను విస్తరించడం ద్వారా ప్రభావిత భాగాలలోకి రక్త ప్రసరణను పెంచుతాయి.
    • సెయిల్డినఫిల్ (sildenafil) లేదా ప్రొస్టాసైక్లిన్ల (prostacyclins) ను ఉపయోగించి ఇతర సమస్యలకు (పుండ్లు వంటివి) చికిత్స చేయవచ్చు.
    • లక్షణాలను మెరుగుపరిచే మందులు:
      • సమయోచిత క్రీమ్లు.
      • సెలెక్టివ్-సెరోటోనిన్-రిప్టేక్ ఇన్హిబిటర్లు (SSRI,   Selective-serotonin-reuptake inhibitors).
      • కొలెస్ట్రాల్ తగ్గించే (స్టాటిన్) మందులు.

రేనాడ్స్ ఫెనోమినన్ కొరకు మందులు

Medicine NamePack Size
Suprex SRSUPREX SR 40MG TABLET 10S
CevadilCevadil 200 Capsule
Cyclo (Elder)Cyclo 200 Mg Tablet
CyclospasmolCyclospasmol 400 Capsule
UtogenUtogen Tablet SR
SBL Proteus vulgaris DilutionSBL Proteus vulgaris Dilution 1000 CH
AdilanAdilan 10 Mg Tablet
AdilinAdilin 40 Tablet SR
हमारी ऐप डाउनलोड करें
myUpcharडॉक्टरों के लिए ऐप

ధన్యవాదములు 🙏

మీ నవీన్ నడిమింటి

విశాఖపట్నం

ఫోన్ -9703706660

అస్వీకార ప్రకటన: ఈ సైటుపై లభ్యమవుతున్న మొత్తం సమాచారము మరియు లేఖనము కేవలం అవగాహనా ఆవశ్యకతల కొరకు మాత్రమే. ఇక్కడ ఇవ్వబడిన సమాచారమును ఏదైనా ఆరోగ్య సంబంధిత సమస్య లేదా అస్వస్థత నుండి కోలుకోవడానికి లేదా స్వస్థత కొరకు నిపుణుల సలహా లేనిదే ఉపయోగించుకోకూడదు. చికిత్స పరీక్షలు మరియు సేవల కొరకు ఎల్లప్పుడూ ఒక అర్హత పొందిన వైద్యుల సలహా తీసుకోవాలి.