8, మార్చి 2017, బుధవారం

3. అతిగా కూచుంటే..అనర్థమే

Too long siting is bad for health, అతిగా కూచుంటే..అనర్థమే

Advise:
కూర్చుని తింటే కొండలైనా కరిగిపోతాయంటారు. తిండి సంగతేమో గానీ ఎక్కువసేపు కూర్చోవడం ఆరోగ్యాన్నే హరించివేస్తుందని సెలవిస్తున్నారు పరిశోధకులు. రోజుకి అరగంట సేపు వ్యాయామం చేసినా సరే.. దీర్ఘకాలం కూచొని పనిచేస్తే గుండెజబ్బులు, క్యాన్సర్‌తో పాటు వెన్నునొప్పి, తదితర సమస్యలూ చుట్టుముడుతున్నాయని హెచ్చరిస్తున్నారు. 

మారుతున్న జీవనశైలి, పని పద్ధతులు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వంటివన్నీ మనిషిని కదలనీయకుండానే 'పని' కానిచ్చేస్తున్నాయి. దీంతో గంటల తరబడి కదలకుండా కూచోవటమూ అలవడుతోంది. మనలో చాలామంది మెలకువగా ఉన్నప్పుడు 95% సమయాన్ని కూచునే గడుతున్నారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇలా ఎక్కువసేపు కూచోవటం అనేది గుండెజబ్బులు, అధిక రక్తపోటు, స్థూలకాయం, టైప్‌2 మధుమేహం, గుండెపోటు, కొన్నిరకాల కాన్సర్లకు దారి తీస్తున్నట్టు వివిధ అధ్యయనాల్లో వెల్లడైంది. వ్యాయామం చేస్తున్నప్పటకీ ఎక్కువసేపు కదలకుండా పనిచేస్తే ఈ ముప్పులు ముంచుకొస్తుండటం గమనార్హం. 

అరగంట మించుతోందా?
కుర్చీలోంచి కదలకుండా 60 నిమిషాల సేపు టీవీ చూస్తున్నారా? అయితే గుండెజబ్బులు, క్యాన్సర్‌ బారిన పడే అవకాశం ముంచుకొస్తున్నట్టే. నిజానికి స్థిరంగా కూచోవటం అనేది మానవులకు సరిపడదంటున్నారు పరిశోధకులు. ఈ సమయంలో మన శరీరంలోని లైపోప్రోటీన్‌ లైపేజ్‌ (ఎల్‌పీఎల్‌) అనే ఎంజైమ్‌ పనితీరు మందగిస్తుందని వివరిస్తున్నారు. ఇది వ్యాక్యూమ్‌ క్లీనర్‌లా పనిచేస్తూ.. రక్తంలోని చెడ్డ కొలెస్ట్రాల్‌ను పీల్చుకొని కండరాల రూపంలోకి మారుస్తుంది. కదలకుండా కూచుంటే మాత్రం ఈ ప్రక్రియ ఆగిపోతుంది. దీంతో రక్తంలో కొవ్వు పెరిగిపోయి చివరికది పొట్ట, తదితర భాగాల్లో నిల్వ ఉండిపోతుంది. ఎక్కువసేపు కదలకపోతే కండరాలూ మందకొడిగా తయారై బిగుసుకుపోతాయి. బరువు, బొజ్జ పెరుగుతాయి. పొట్ట భాగంలో పేరుకునే ఈ కొవ్వు చాలా ప్రమాదకరమైంది. ఇది రక్తంలో కొవ్వు శాతాన్ని పెంచే హర్మోన్లను సైతం ఉత్పత్తి చేస్తుంది కాబట్టి.. రక్తనాళాలు పూడుకుపోవటం, స్థూలకాయం, అధిక రక్తపోటు, మధుమేహం వంటి వాటికీ దారితీస్తుంది. 

వెన్ను సమస్యలు కూడా..!
ఎక్కువసేపు కూచోవటం వల్ల వెన్నెముక, భుజాలు, తుంటి సమస్యలూ పుట్టుకొస్తాయి. మన వెన్నెముక నిలబడేందుకు వీలుగా రూపొందింది. గంటలకొద్దీ వెన్నుని నిటారుగా ఉంచి సరైన ఆకృతిలో కూచోవాలంటే వీపు భాగంలోని కండరాలు చాలా బలంగా ఉండాలి. లేకపోతే వెన్నెముక ముందుకు వంగుతుంది. భుజాలు కిందికి వాలిపోతాయి. ఇది క్రమంగా భుజాలు, మెడ, నడుంనొప్పులకు దారి తీస్తుంది. ఆఫీసుల్లో కంప్యూటర్‌ టేబుళ్లు, కుర్చీల ఆకారం, ఎత్తు సరిగా లేకపోయినా వెన్నెముక దెబ్బతింటుంది. మెడ, వీపు, ఛాతీ, భుజాలు, చేతుల్లోని కండరాలు, నాడులపైనా ప్రభావం చూపుతుంది. 

చిన్న పనులతో పెద్ద మేలు..!
గంటలకొద్దీ కదలకుండా కూచోవాల్సి వస్తే తగు జాగ్రత్తలు పాటించటం మేలని నిపుణులు సూచిస్తున్నారు. చిన్న చిన్న పనులతోనూ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని వివరిస్తున్నారు. 

* కనీసం ప్రతి 20 నిమిషాలకు ఒకసారైనా కుర్చీలోంచి లేచి కాస్త అటూఇటూ తిరగాలి.
* రోజుకి కనీసం 40 నిమిషాల సేపైనా నడక అలవాటు చేసుకోవాలి. ఇది కీళ్లు బాగా పనిచేసేందుకు తోడ్పడుతుంది.
* ఆఫీసులో సహోద్యోగుల దగ్గరకు వెళ్లే అవకాశం ఉన్నప్పుడు ఫోన్లు, ఈ-మెయిళ్ల వంటివి చేయకుండా కాస్త కాళ్లకు పని కల్పించటం మంచిది.
* వీలైనప్పుడు శ్వాసను వదులుతూ కడుపును లోపలికి పీల్చుకొని 10 అంకెలు లెక్కబెడుతూ అలాగే ఉండండి. ఇది పొట్ట కండరాలు బలంగా ఉండేందుకు దోహదం చేస్తుంది.
* ఒత్తిడి తగ్గి భుజాలు విశ్రాంతి పొందేందుకు వీలుగా అప్పుడప్పుడు భుజాలను పైకి లేపుతూ ఉండాలి.
* ఫోన్‌ వచ్చినపుడు లేచి నిలబడి మాట్లాడటం అలవాటు చేసుకోవాలి. ఎక్కువసేపు మాట్లాడాల్సి వస్తే కారిడార్‌లో పచార్లు చేస్తూ సంభాషించటం మేలు.
* వీలైనంతవరకు లిఫ్ట్‌ని వాడకుండా మెట్లు ఎక్కేందుకు ప్రయత్నించాలి. 

                           రామ్ కర్రి
                 www.ramkarri.com
                     8096339900

4. అతి సూక్ష్మపోషకాలు మనిషికి అవసరము .

Trace elements are essential for humans, అతి సూక్ష్మపోషకాలు మనిషికి అవసరము .

Advise:

ఇనుము, జింకు, కాల్షియమ్‌, క్రోమియం, మెగ్నీషియం, కాపర్‌, ఫోలిక్‌ ఆమ్లం, బి12, సెలీనియం, వంటి అతి సూక్ష్మ పోషకాలు కూరగాయలు, ముఖ్యంగా ఆకుకూరలలో, తోటకూర, గోంగూర, బెల్లం, పచ్చి ఖర్జూర పండ్లు బాగా మాగినటువంటి పండ్లలో లభిస్తాయి. జామ, రేగి, బత్తాయి మధుమేహం ఉన్న వారు వాడవచ్చు. ఐరన్‌ మాత్రలు పడనివారు తోటకూర, గోంగూర, బెల్లం, పర్చి ఖర్జూర పండ్లు వాడితే రక్త వృద్ధికి తోడ్పడతాయి. పీచు పదార్థాలు, రక్తంలోని దోషాల నిర్మూలనకు పెద్దపేగు క్యాన్సర్‌ రాకుండా వుండేందుకు దోహదపడ్తాయి. మలబద్ధకం, జీర్ణప్రక్రియకు మేలు చేస్తాయి. 

                           రామ్ కర్రి
                 www.ramkarri.com
                     8096339900

1. అధిక బరువుకి కొన్ని కారణాలు.

Causes for more weight,
అధిక బరువుకి కొన్ని కారణాలు.

Advise:

అవగాహనాలేమితో చేసే కొన్ని పనులు.. సమస్యల్ని తెచ్చిపెడతాయి. బరువు తగ్గాలనుకునే వారికీ ఇది వర్తిస్తుంది. కేవలం తక్కువగా తినడం.. ఎక్కువగా వ్యాయామం చేయడం వల్లే సన్నబడరు. ఆ క్రమంలో జరిగే కొన్ని లోపాల్నీ సరిదిద్దుకోవాలి. 

నిద్రలేమి జీవక్రియల వేగాన్ని తగ్గిస్తుంది. ఆకలి హార్మోన్లుగా పరిగణించే లెప్టిన్‌, గ్రెలిన్‌పై ప్రభావం చూపుతుంది. ఆహారం తీసుకుంటున్నప్పుడు లెప్టిన్‌... తినడం ఆపమంటూ మెదడుకి సంకేతాలనిస్తుంది. గ్రెలిన్‌ ఆకలిని క్రమబద్ధీకరిస్తుంది. అధ్యయనాల ప్రకారం నిద్రలేమి వల్ల లెప్టిన్‌ పనితీరు తగ్గుతుంది. అదే బరువు పెరిగేందుకు దారితీస్తుంది. అందుకే వేళకు నిద్రపోవడం ఓ అలవాటుగా మార్చుకోవాలి. 

చక్కెర తీసుకుంటున్నారా:
కాఫీ, టీల్లో చక్కెర ఎక్కువగా వేసుకోకపోవచ్చు. మిఠాయిలు మానేయొచ్చు. కానీ చాలా పదార్థాల్లో తీపి శాతం కనిపించకుండా ఉంటుంది. అలాంటి వాటిల్లో హెల్దీ బార్స్‌, శీతల పానీయాలూ, సాస్‌లూ ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల పళ్ల సమస్యలూ, మధుమేహం, గుండెజబ్బుల్లాంటివి దాడిచేస్తాయి. బరువూ పెరుగుతారు. కాబట్టి వాటిని కొనేముందు పదార్థాలపై రాసున్న వివరాలను చదవాలి. చక్కెర శాతం ఎక్కువ అని రాసి ఉన్న వాటిని మానేయాలి. నేరుగా చక్కెర అని రాయకపోవచ్చు కానీ.. సుక్రోస్‌, గ్లూకోజ్‌, ఫ్రక్టోస్‌, మాల్టోస్‌, ఫ్రూట్‌జ్యూస్‌ కాన్‌సన్‌ట్రేట్‌ అని రాసి ఉంటాయి. వీటి శాతం కాస్త ఎక్కువగా ఉన్నా చక్కెర ఉన్నట్టే. 

కెలొరీలు లెక్కిస్తున్నారా:
బరువు తగ్గాలంటే ఆహారం కొద్దిగా తీసుకుంటే సరిపోతుంది.. తక్కువ కెలొరీలు అందుతాయి. కానీ దానివల్ల శరీరానికి అవసరమైన పోషకాలు అందువు. వాస్తవానికి ఏదయినా పదార్థం తీసుకునే ముందు మోతాదు కన్నా నాణ్యత గురించి ఆలోచించాలి. కేవలం కెలొరీలనే పరిగణించకుండా.. ఒక పదార్థం తినడం వల్ల అందే పోషకాలపై దృష్టిపెట్టాలి. సమృద్ధిగా పోషకాలనందించే వాటినే ఎంచుకోవాలి. ముఖ్యంగా విటమిన్లూ, ఖనిజాలూ, యాంటీ యాక్సిడెంట్లూ అందించే పండ్లూ, కూరగాయలూ, తృణధాన్యాల్ని తీసుకోవాలి. ఇంట్లో వండిన పదార్థాలను తినడానికే ప్రాధాన్యం ఇవ్వాలి. ఫాస్ట్‌ఫుడ్‌ బరువు పెరిగేందుకు కారణం అవుతుందని గుర్తించాలి. 

హార్మోన్ల సమస్యలు:
హైపోథైరాయిడిజం, పీసీఓడీ... లాంటివన్నీ హార్మోన్ల పనితీరులో మార్పుల వల్లే ఎదురవుతాయి. వీటివల్ల త్వరగా బరువు పెరుగుతారు. తిరిగి తగ్గడం కష్టమవుతుంది. ఇలాంటి సమస్యను నిర్ధరించుకునే ముందు డాక్టర్‌ దగ్గరకు వెళ్లి పరీక్ష చేయించుకోవాలి. ఏ ఒక్క సమస్య ఉందని తేలినా... శుద్ధిచేసిన పిండిపదార్థాలను మానేసి మేలుచేసే ప్రొటీన్లకు ప్రాధాన్యం ఇవ్వాలి. కూరగాయలూ, అత్యవసరమైన ఫ్యాటీ ఆమ్లాలూ ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. 

                            రామ్ కర్రి
                 www.ramkarri.com
                     8096339900

21, అక్టోబర్ 2016, శుక్రవారం

Bhava mishra - భావ మిశ్రుడు

భావమిశ్రుడు

ఆయుర్వేదంలో పచ్చిమిరపకాయను ప్రవేశపెట్టినది భావమిశ్రుడే. అంతవరకు కారానికి మిరియాలు (మరీచ) వాడటం మాత్రమే ఉండేది. ఫిరంగి రోగాన్ని (సిఫిలిస్)ను గుర్తించాడు.

ఎన్నో విలువైన వైద్య పరిశోధనలలో పాలుపంచుకున్న మన పూర్వవైద్యులలో వీరు కొందరు మాత్రమే! ఆ కాలంలోనూ కొందరు కొన్ని ప్రత్యేక వైద్య విభాగాలలో సైతం నైపుణ్యం సాగించారు. ఉదాహరణకు చరకుడు కాయ చికిత్స (జనరల్ మెడిసిన్), సుశ్రుతుడు శల్యతంత్రం (జనరల్ సర్జరీ), కశ్యపుడు కౌమారభృత్య (శిశువైద్యం లేదా పీడియాట్రిక్స్) వంటి వాటిల్లో నైపుణ్యం సాగించారని ప్రతీతి. అయితే వారు వైద్యశాస్త్ర అంశాలన్నింటినీ ఒకే గ్రంథంగా ఒకేచోట కూర్చారు. దాంతో ఆ వైద్యశాస్త్ర గ్రంథాలు ప్రత్యేక విభాగాలుగా గాక... కూర్పు చేసిన పుస్తకాలను సూచించే విధంగా సంహితలు అని పేరొందాయి

siddha nagarjuna - సిద్ధనాగార్జునుడు

సిద్ధనాగార్జునుడు


వనాల నుంచి లభ్యమయ్యే ఔషధ ద్రవ్యాల చికిత్సలో ఉండే కష్టనష్టాలను అధిగమించడానికి మన తెలుగు రాష్ట్రాలలోని శ్రీశైలం ప్రాంతాలలో దొరికే ఖనిజధాతులను శుద్ధి చేసి, ఔషధాలుగా రూపొందించడానికి బాటలు వేశాడు. నిజానికి ఇది ఆయుర్వేదంలో విప్లవశకం. దీన్ని రసశాస్త్ర విప్లవంగా పేర్కొన్నవచ్చు. ‘రస’ అంటే ఇక్కడ పాదరసం. అలాగే రకరకాల ఔషధ నిర్మాణ పద్ధతులనూ (ఫార్మస్యూటికల్ మెథడ్స్) కూడా ప్రస్తావించాడు. ప్రతి మందుకూ మోతాదు (డోసేజ్) నిర్ణయించాడు.

20, అక్టోబర్ 2016, గురువారం

Madhavakarudu - మాధవకరుడు

మాధవకరుడు :


ఈయన మాధవనిదానం అనే గ్రంథాన్ని రాశాడు. మాధవకరుడు ఆమవాత (రుమాటిక్ ఆర్థరైటిస్), అమ్లపిత్త (హైపర్ అసిడిటీ/ గ్యాస్ట్రైటిస్) పరిణామశూల (పెప్టిక్ అల్సర్స్) వ్యాధులు, వాటి చికిత్సలను విశదీకరించాడు. శారంగధరుడనే పండితుడు రాసిన గ్రంథానికి శారంగథర సంహిత అని పేరు. దీనికి కూడా మంచి ప్రామాణికత ఉంది. లఘుత్రయంలో శారంగధరుడు కూడా మంచి పేరు గడించాడు.

kashyapa - కశ్యప

కశ్యప

కశ్యప సంహిత అని పేరొందిన వైద్యశాస్త్ర అంశాలను మరీచి కశ్యపుడు అనే నిపుణుడు బోధిస్తుండగా ‘వృద్ధజీవకుడు’ అనే ఆయన రాశారు. దీన్నే ‘వృద్ధజీవకతంత్రం’గా పేర్కొంటారు. దీన్నే కాశ్యపసంహిత అని కూడా అంటారు. ఈ సంహిత క్రీ.పూ. ఆరోశతాబ్దికి చెందింది. ఇక్కడ పేర్కొన్న కశ్యపుడితో బాటు చరిత్రలో ఇతర కశ్యపులూ ఉన్నారు. ఈ కశ్యపుల్లో ఒకరు ‘కౌమారభృత్య’ నిపుణుడు. అంటే ప్రసూతి చికిత్సలు, స్త్రీ సంబంధిత రోగాల ప్రత్యేక నిపుణుడు అని అర్థం.  ‘కౌమరభృత్యం’ అంటే స్త్రీలకు, శిశువులకు చెందిన ప్రత్యేక విభాగాలకు చెందిన శాస్త్రపరిజ్ఞానం అన్నమాట.

ఇందులో శిశువు శారీరక, మానసిక వికాస వివరాలు (గ్రోత్ అండ్ డెవలప్‌మెంట్ మైల్‌స్టోన్స్) ఉన్నాయి. గర్భణీ పరిచర్యలనూ (యాంటీనేటల్ కేర్) వివరించారు. ఆధునిక కాలంలో ఇమ్యూనైజేషన్‌ను పోలిన కొన్ని ప్రక్రియలనూ ఈ విభాగంలో వివరించారు. ఇక వృద్ధత్రయం లాగే లఘుత్రయంలోనూ ముగ్గురు వైద్యనిపుణులున్నారు. వారు క్రీ.శ. ఏడో శతాబ్దానికి చెందిన మాధవకరుడు, పదమూడో శతాబ్దానికి చెందిన శారంగధరుడు, పదహారో శతాబ్దానికి చెందిన భావమిశ్రుడు.

vagbhata - వాగ్భటుడు








































వాగ్భటుడు
చరక సుశ్రుత కాశ్యప సంహితల్లోని ముఖ్యాంశాలను సంక్షిప్తం చేసి, మరికొన్ని శాస్త్రాలను మిళితం చేసి సరళీకృతమైన సంస్కృతంలో అందించిన గ్రంథాలే... ‘అష్టాంగ సంగ్రహం’, ‘అష్టాంగ హృదయం’ . వీటిలో మొదటిదాన్ని రాసింది వృద్ధ వాగ్భటుడు. రెండోది రాసినవాడు లఘువాగ్భటుడు. వీటినే ‘వాగ్భట సంహిత’లని అంటారు. ఈ సంహితల్లో జ్వరాలను తగ్గించే ఎన్నో కష్టాలను పేర్కొన్నారు. త్రిదోషాల్లో ఒకటైన శ్లేషాన్ని (కఫం) అవలంబక, క్లేదక, బోధక, శ్లేషక, శ్లేష్మాలు అంటూ ఐదు రకాలుగా విభజించిన ప్రత్యేకత వీరిది.
చరక, సుశ్రుత, వాగ్భటులను వృద్ధత్రయం అంటారు.