20, అక్టోబర్ 2016, గురువారం

kashyapa - కశ్యప

కశ్యప

కశ్యప సంహిత అని పేరొందిన వైద్యశాస్త్ర అంశాలను మరీచి కశ్యపుడు అనే నిపుణుడు బోధిస్తుండగా ‘వృద్ధజీవకుడు’ అనే ఆయన రాశారు. దీన్నే ‘వృద్ధజీవకతంత్రం’గా పేర్కొంటారు. దీన్నే కాశ్యపసంహిత అని కూడా అంటారు. ఈ సంహిత క్రీ.పూ. ఆరోశతాబ్దికి చెందింది. ఇక్కడ పేర్కొన్న కశ్యపుడితో బాటు చరిత్రలో ఇతర కశ్యపులూ ఉన్నారు. ఈ కశ్యపుల్లో ఒకరు ‘కౌమారభృత్య’ నిపుణుడు. అంటే ప్రసూతి చికిత్సలు, స్త్రీ సంబంధిత రోగాల ప్రత్యేక నిపుణుడు అని అర్థం.  ‘కౌమరభృత్యం’ అంటే స్త్రీలకు, శిశువులకు చెందిన ప్రత్యేక విభాగాలకు చెందిన శాస్త్రపరిజ్ఞానం అన్నమాట.

ఇందులో శిశువు శారీరక, మానసిక వికాస వివరాలు (గ్రోత్ అండ్ డెవలప్‌మెంట్ మైల్‌స్టోన్స్) ఉన్నాయి. గర్భణీ పరిచర్యలనూ (యాంటీనేటల్ కేర్) వివరించారు. ఆధునిక కాలంలో ఇమ్యూనైజేషన్‌ను పోలిన కొన్ని ప్రక్రియలనూ ఈ విభాగంలో వివరించారు. ఇక వృద్ధత్రయం లాగే లఘుత్రయంలోనూ ముగ్గురు వైద్యనిపుణులున్నారు. వారు క్రీ.శ. ఏడో శతాబ్దానికి చెందిన మాధవకరుడు, పదమూడో శతాబ్దానికి చెందిన శారంగధరుడు, పదహారో శతాబ్దానికి చెందిన భావమిశ్రుడు.

కామెంట్‌లు లేవు: