27, జూన్ 2020, శనివారం

పాదాలు వాపు నివారణ పరిష్కారం మార్గం



సారాంశం

పాదాలు వాచుకోవడాన్ని పాదాల వాపు అని కూడా పిలుస్తారు. అది ఎక్కువ ద్రవం  లేదా నీరు పేరుకుపోవడానికి సంకేతం. పాదాలు, చీలిమండలలో నొప్పి లేనట్టి వాపు సాధారణ సమస్య. ఇది ప్రధానంగా వయసు మళ్లిన వారిలో మరియు గర్భిణులలో కనిపిస్తుంది. వాపు దానికి అది ఒక వ్యాధి కాదు.  అయితే అది వ్యాధి కారకానికి ముఖ్యమైనట్టి సంకేతం లేదా సూచన కావచ్చు. వాపునకు దారితీస్తున్న జబ్బు ఆధారంగా మరికొన్ని జబ్బులు కనిపించవచ్చు సంపూర్ణ బ్లడ్ కౌంట్, కాలేయం, కిడ్నీ పనితీరు, ఎక్స్ రే వంటి ఇమేజింగ్ పరిశీలనల .ద్వారా ,   లేబరేటరీ  జబ్బు నిర్ధారణ పరీక్షల ఫలితాల ద్వారా జబ్బు నిర్ధారణ జరుగుతుంది. ఇట్టి వాపునకు వ్యాయామం, బరువు తగ్గించుకోవడం , పెచ్చుపెరిగే జబ్బులకు మందులు , ఆహారంలో మార్పులు  మరికొన్నింటి ద్వారా చికిత్స నిర్వహిస్తారు

పాదాల వాపు యొక్క లక్షణాలు 

వాపు పాదమునకు గానీ లేదా చీలమండ ప్రాంతానికి గాని  సంబంధించి నొప్పి లేకుండా  ఉండి కాలముతో పాటు నొప్పి పెరిగితే , చర్మం రంగు మరియు చర్మం నిర్మాణంలో మార్పు రావచ్చు. జబ్బుఇతర లక్షణాలు చర్మం ఉష్ణోగ్రత పెరగడం,  తాకినప్పుడు వేడి స్పర్శ  కలగడం, పుండు ఏర్పడటం మరియు చీము ఉత్సర్గం వంటివి.

  • చర్మాన్ని వేలుతో క్రిందికి నొక్కినప్పుడు గుంట లేదా మాంద్యం ఏర్పడుతుంది, తర్వాత వేలును తీసినప్పుడు గుంటమూతబడి చర్మం వాపుతో కూడిన యధాస్థితికి వస్తుంది.
  • షూ మరియు సాక్స్ తీసిన తర్వాత పాదాల చర్మంపై కనిపించే చిన్న గుంటలు ( మాంద్యానికి గురైనట్టి ప్రాంతాలు) వాపునకు ముఖ్యమైన సంకేతం
  • గుంటలు నల్లగా ఉండి వాటి చుట్టూ గల చర్మం సాధారణ చర్మం రంగు కంటే లేతగా ఉంటుంది.

పాదాల వాపు యొక్క చికిత్స 

చికిత్స

తేలిక అయిన లేదా చిన్నస్థాయి వాపు (ఎడెమా)  దానికదే వాసి కాగలదు, మీరు మీ వాపునకు గురైన పాదాన్నిగుండె స్థాయికంటె హెచ్చు ఎత్తుకు  ఎత్తగలిగితే  నయం కాగలదు.  పాదాలలో వాపు ఆరోగ్య సమస్యల కారణంగా కానట్లయితే దానికి  మీ డాక్టరు సలహాతో సరళమైన జీవన సరళి మార్పులతో  దానికి చికిత్స కల్పించవచ్చు,  అయితే  వాపు ఏదయినా ఆరోగ్యానికి సంబంధించిన సమస్య కారణంగా ఏర్పడితే, చికిత్సకు జబ్బు పూర్తి వివరాలు, సంబంధిత పరిశోధనలు, ఉపయోగిస్తున్న మందులు  అలాగే వాటితోపాటు జీవన విధానంలో మార్పుల పరిశీలన అవరరమవుతుంది.

  • ఎక్కువ సమయం నిలబడిన కారణంగా వాపు ఏర్పడినప్పుడు దానిని విశ్రాతి తీసుకోవడం ద్వారా లేదా పాదాలను ఎత్తులో ఉంచడం ద్వారా నయం చేసుకోవచ్చు. పడుకొన్నప్పుడు మీ కాళ్లను తలదిండుపై గుండె కంటె ఎక్కువ ఎత్తులో ఉండే విధంగా ఉంచుకోండి..
  • వాపు వేడి వాతావరణం కారణంగా ఏర్పడితే  మీరు దానిని సులభంగా నివారించవచ్చు, దానికోసం  వేడి వాతావరణానికి దూరంగ ఉండండి. మీ పాదాలను చల్లగా ఉంచుకోంది, దీనికై 15-20 నిమిషాలపాటు మీ పాదాలను చల్లని నీటిలో ఉంచండి.
  • పాదాల వాపు గుండె జబ్బుల కారణంగా ఏర్పడితే, లేదా ద్రవం నిలవడం వల్ల జరిగితే,  మీ డాక్టరు ఉప్పు వాడకాన్ని నియంత్రిఛమని సలహా ఇవ్వవచ్చు.(తక్కువ ఉప్పుతో ఆహారం) మరియు ఎక్కువగా నీరు త్రాగమని సూచించవచ్చు.
  • మీ శరీరపు బరువు ఎక్కువ కావడం వల్ల కూడా పాదాల వాపు కావచ్చు. ఈ సందర్భంగా మీ డాక్టరు తగిన ఆహారాన్ని తీసుకోమని, వ్యాయామం చేయమని  చెప్పవచ్చు. ఇవి శరీరపు బరువును తగ్గిస్తాయి.
  • కంప్రెషన్ స్టాకింగులు అరుదుగా ప్రయోజనం కల్పిస్తాయి.  తీవ్రమైన వాపు కలిగినవారు సాధారణంగా వాటిని సహించలేరు.
  • గర్భం కారణంగా వాపు ఏర్పడితే, ఎలాంటి చికిత్స అవసరం ఉండదు. అయితే తీవ్రమైన వాపును నిర్లక్ష్యం చేయకూడదు. అది ఎక్లాంసియా (మూర్చ) కారణంగా ప్రబలి ఉండవచ్చు.
  • వాపు ఉన్న చోట వీలయిన వెంటనే ఐసును 15- 20 నిమిషాలపాటు ఉంచండి. తర్వాత ఈ ప్రక్రియను మూడు నాలుగు గంటలకు ఒకమారు కొనసాగించంది.. ఈ చర్య తాత్కాలిక ఉపశమనం కలిగిస్తుంది.
  • వాపు తీవ్రంగా ఉంటే ఔషధాలతో చికిత్స జరపవలసి ఉంటుంది. . మీ డాక్టరు మీకు మందులు సూచిస్తారు. అవి వాపు తగ్గించడానికి శరీరం లోని అదనపు నీటిని తొలగించడానికి సహాయపడే డైయీరెటిక్స్ వంటివి. అది రక్తప్రసరణ గుండెపోటు వల్ల జరిగి ఉండవచ్చు.
  • తీవ్రమైన గాయాల సందర్భంగా డాక్టరు బలవంతంగా తోయడం, శస్త్రచికిత్స మరియు ప్రక్రియలు మరియు హెచ్చు నొప్పి నివారణకై విశ్రాంతి సూచించవచ్చు
  • నొప్పితో కూడిన వాపు సందర్భంగా మీ డాక్టరు నొప్పి నివారణ మాత్రలను సూచించవచ్చు. అవి పారసెటమాల్ మరియు ఇబుప్రొఫెన్ వంటివి. తర్వాత విశ్రాంతి సూచించవచ్చు
  • హెచ్చు మోతాదులో నీరు త్రాగడం కూడా సహకరిస్తుంది
  • రక్తం స్థాయి తక్కువ మరియు వేధించే గుండె జబ్బులకు (హెచ్చుస్థాయి రక్తపోటు, హై కొలస్ట్రాల్ వంటివి) మీ డాక్టరు ఔషధాలు సూచించవచ్చు. తక్కువ ప్రోటీన్ ఆహారం, క్యాల్షియం మరియు విటమిన్ డి పోషకాంశాలు, ఆరోగ్యకరమైన జీవన సరళిని కూడా సూచించవచ్చు
  • వాపు ఔషధాల కారణంగా ఏర్పడినపుడు మీ డాక్టరు మందుల స్థాయిని తగ్గించవచ్చు లేదా మందులను నిలుపవచ్చు

జీవన సరళి/ విధానం నిర్వహణ

దైనందిన జీవితంలో కొన్ని మార్పులు అవసరం కావచ్చు

  • వ్యాయామం
    వ్యాయామం  హెచ్చు రక్తప్రసారానికి వీలు కల్పిస్తుంది మరియు శోషరస ప్రవాహాన్ని మెరుగు పరుస్తుంది దీనితో  మీ డాక్టరు లేదా ఫిట్ నెస్ నిపుణుని  సలహాతో కనీసం రోజుకు ఒక వ్యాయామం చేయడం ప్రారంభించండి వాకింగ్ లేదా జాగింగ్ వంటి ఏదైనా ఒక వ్యాయామాన్ని క్రమం తప్పకుండా చేయండి
  • ఎత్తులో ఉంచడం
    పాదాలను ఎత్తులో ఉంచడం ప్రక్రియ  సిరలలో పీడనాన్ని తగ్గించి సిరల వడపోతను తగ్గిస్తుంది. ఇది రక్తప్రసారాన్ని పెంచుతుంది
  • స్థాయిల వారీ వెలుపలి పీడనం
    స్థాయిల వారీ వెలుపలి పీడనం కేశనాళిక వడపోతను తొలగించి, సిరల వ్యవస్థలో ద్రవాన్నిసరిగా ఉంచుతుంది.
  • శోషరస మర్దనం
    శోషరస మర్దనం శోషరస మార్గాన్ని సరిపరచి సవ్యంగా ప్రవహించడానికి రక్తప్రసారాన్ని మెరుగు పరచడానికి సహకరిస్తుంది

పాదాల వాపు అంటే ఏమిటి? 

పాదాలలో వాపు అనగా పాదాలలో ద్రవం పేరుకుపోవడం.  పాదం, చీలమండ మరియు కాలు వాపు గురించి చెప్పడానికి నొప్పి కలిగిన చోట వాటిని వేలితో నొక్కినప్పుడు గుంట పడుతుంది.

పాదాల వాపు చాలా సాధారణమైన  జబ్బు. మీరు ఎక్కువ సమయం నిలబడి ఉంటే లేదా ఎక్కువ దూరం  నడిస్తే జబ్బుకు చికిత్స అవసరం లేదు. అయితే, వాపు ఎక్కువ కాలం ఉండి, ఇతర లక్షణాలతో కలిసి కనిపిస్తే, అంటే శ్వాసక్రియకు ఇబ్బంది, నొప్పి లేదా అల్సర్లు కనిపిస్తే అవి జబ్బు  తీవ్రరూపంలో ఉన్నదనడానికి సంకేతం.

మీ పాదాలలో ఒకటిగానీ లేదా రెండు కూడా గానీ వాచుకొంటే అది అసౌకర్యానికి, నొప్పికి, దైనందిన కార్యకలాపాలు జరపడానికి ఇబ్బంది కలిగిస్తుంది. మీరు గర్భంతో ఉన్నట్లయితే  పాదాలు సహజంగా వాపునకు గురవుతాయి. ఎందుకంటే గర్భిణీ స్త్రీ శరీరంలో  సాధారణ స్త్రీ కంటే హెచ్చుగా నీరు నిల్వ ఉంటుంది. కొన్ని సందర్భాలలో మీరు ఎక్కువ సమయం నిలబడి ఉంటే, రోజు చివరన నొప్పి ఎక్కువగా అనిపిస్తుంది. అది తల్లికి, లేద శిశువుకు తీవ్రమైన సమస్య కానప్పటికీ తల్లికి అసౌకర్యంగా ఉంటుంది.

పాదాలలో వాపును కేశనాళిక వడపోతలో పెరుగుదలకు పోల్చవచ్చు.  ఇది రక్తకేశనాళికలలోని ద్రవాన్ని వెలుపలకు  పంపివేస్తుంది: శోషరస పారుదలలో తగ్గుదల మీ శరీరంలో శోషరస ప్రవాహాన్ని అడ్దుకొంటుంది. లేదా ఈ రెండు కూడా జరగవచ్చు.  పాదాలలో వాపునకు పెక్కు జబ్బులు కారణమయినప్పటికీ, మీ డాక్టరుచే వివిధ కారణాలకు వివరమైన పరిశోధనతో సముచితమైన జబ్బు నిర్ధారణ అవసరం .  వాపునకు నిర్ధారపూర్వకమైన కారణం లేనపుడు సాధారణంగా చికిత్స అవసరం ఉండదు. అయితే   వాపునకు నిర్ధారిత కారణం ఉన్న రోగులలో, పాదాల వాపు కొన్ని ఔషధాల కారణంగా వచ్చినట్లు తెలిస్తే, సముచితమైన చికిత్స అవసరమవుతుంది.. దీనివల్ల  పాదాల వాపు మందుల కారణంగా ప్రబలి ఉంటే లేదా రోగలక్షణం నిర్ధారణ అయితే డాక్టరును సంప్రతించడం

కీళ్ల నొప్పులుకు ఆయుర్వేదం సలహాలు : 

యుర్వేద శాస్త్రం మనిషి శరీరంలోని జాయింట్లను 'సంధులు' అని వ్యవహరించిది. సంధి అంటే కూడిన, వ్యవహారిక భాషలో జాయింట్లను కీళ్లు అంటారు. కీళ్ళనొప్పులకు సంబంధించి, కీళ్ల వ్యాధులకు సంబంధించి ఆయుర్వేద శాస్త్రంలో చాలా విస్తృతమైన వివరణలు లభిస్తాయి.


కీళ్ల ప్రధాన విధి శరీరంలో కదలికలను కలిగచేయడం, కొన్ని కీళ్లు తక్కువస్థాయి కదలికలు కలిగినవిగా ఉంటే, మరికొన్ని ఎక్కువస్థాయి కదలికలను కలిగిఉంటాయి. 

ఉదాహరణకు భుజం కీలు శరీరంలో ఇతర కీళ్లకంటే అధిక స్థాయిలో, విభిన్న దిశలలో కదలికలు కలిగి ఉంటుంది. బంతిగిన్నె కీలుగా అందరికీ తెలిసిన ఈ జాయింటు ముందుకూ, వెనకకూ, లోపలికీ, బైటకూ,పైకి, కిందకూ ఇలా రకరకాల కోణాలలో కదలికలు కలిగి ఉంటుంది. ఇంత విస్తృతమైన కదలికలు ఉన్నప్పుడు సహజంగానే ఈ జాయింటుకు స్వస్థానం నుంచి పక్కకు వైదొలగడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. 'గూడ జారడా'న్ని మనం ఎక్కువగా చూసేది అందుకే. దీనికి విరుద్దంగా నడుము కింద భాగంలో ఉండే త్రికాస్థి శ్రేణ్యస్థిల సంగమం (సేక్రో ఇలియాక్ జాయింట్) లో దాదాపు కదలికలు పూజ్యమనే చెప్పాలి. 


మనలో చాలామందికి కీళ్లకు సంబంధించిన ఉచితానుచితజ్ఞత అనేది కీళ్లలో నొప్పి ఉన్నప్పుడు మాత్రమే కలుగుతుంటుంది. మనం ప్రతినిత్యం అలవోకగా ఎన్నెన్నో పనులను చేతులతోను, కాళ్లతోనూ చేసేస్తుంటాము, అయితే ఆయా భాగాల కీళ్లలో నొప్పి మొదలైతే మాత్రం తేలికగా జరిగిపోయే చిన్న పనైనా అసాధ్యంగా మారుతుంది. జాయింట్ల నొప్పులు బాధిస్తున్నప్పుడు కారణాలవైపు దృష్టి సారించడం అవసరం. లక్షణాత్మకమైన చికిత్సకంటే కారణానుగుణమైన చికిత్స తీసుకుంటే శాశ్వత ప్రయోజనం కలుగుతుంది. 

1. అభిఘాతాలు / దెబ్బలు:

కీళ్ల మీద ఒత్తిడి పడినా, దెబ్బలు తగిలినా వాపు జనిస్తుంది. ఎముకల చిట్ట చివరిభాగం సాధారణంగా మృదులాస్థి చేత నిర్మితమై ఉంటుంది. ఇది సైనోవియల్ ద్రవంలో మునిగి ఉంటుంది. జాయింట్లను ఒకటిగా బంధించి ఉంచే క్యాప్సూల్ తాలూకు లోపలి పొర ఈ తైలయుతమైన సైనోవియల్ ద్రవాన్ని విడుదల చేస్తుంటుంది. ఒకవేళ కీలుకు ఏదైనా హాని జరిగినా, దెబ్బ తగిలినా సైనో వియల్ పొరకు విఘాతం కలగడం, కీలు నుండి చిన్న చిన్న ముక్కలు విడిపోవడం వంటివి జరుగుతాయి. అప్పుడు సైనోవియల్ పొర విపరీతంగా స్పందించి, అత్యధికస్థాయిలో ద్రవాన్ని విడుదల చేస్తుంది. ఇలా విడుదలైన ద్రవమూ, దానిలో ఉండే కొన్ని పదార్థాలూ కలిసి నొప్పికి, వాపునకూ కారణమవుతాయి. 

ఒక్కొక్కసారి కొంతమందికి దెబ్బ తగిలిన విషయం దృష్టిలోకి రాకుండా, సంఘటన జరిగిన రెండు మూడు రోజుల తరువాత హఠాత్తుగా జాయింటు వాచిపోయి కనపడుతుంది. అలాంటి సందర్భాలలో నింపాదిగా ఆలోచిస్తే దెబ్బ తగిలిన విషయం బైటపడుతుంది. 


సూచనలు: దెబ్బలు తగిలినప్పుడు జాయింట్లలో వాపు రాకుండా ఉండాలంటే జాయింటును కొంచెం ఎత్తులో ఉంచాలి. కదలకుండా పూర్తిస్థాయిలో విశ్రాంతి తీసుకోవాలి. దెబ్బ తగిలిన వెంటనే ఐస్ ముక్కలను పొడిలాగా నూరి ఒక గుడ్డలో వేసి కీలుపైన కట్టుకడితే వాపు జనించడానికి ఆస్కారం ఉండదు. కీళ్ల చుట్టూ స్థానికంగా వేడిగా ఉంటే శీతల ఉపచారాలనూ, చల్లగా బిగదీసుకుని ఉంటే ఉష్ణ సంబంధమైన ఉపచారాలనూ ఆయుర్వేదం సూచించింది.

ఔషధాలు: పునర్నవాదిగుగ్గులు, మహావాత విధ్వంసినీ రసం.

బాహ్యప్రయోగాలు - మర్మగుటిక, సురదారులేపం. 

2. పాత దెబ్బలు, గాయాలు:

ఒకోసారి, చాలా సంవత్సరాల క్రితం తగిలిన దెబ్బలూ, బెణుకులూ వర్తమానంలో కీళ్ల నొప్పులుగా మారుతాయి. నడుము నొప్పి దీనికి మంచి ఉదాహరణ. జాయింట్లలో ఎముకలు విరగడం, తప్పుకోవడాలు జరిగినప్పుడు అప్పటికి బాధ సమిసిపోయినా, తరువాత ఎప్పుడో తీవ్రమైన నొప్పిరూపంలో తిరగబెట్టే అవకాశం ఉంది. 

సూచనలు: అంతకు ముందెప్పుడో దెబ్బతగిలి, ఇప్పుడు దెబ్బతగిలినకీలు నొప్పిగా తయారైతే స్నేహ స్వేదాలను చికిత్సగా ప్రయోగించాల్సి ఉంటుంది. ఈ చికిత్సా ప్రక్రియలలో ఔషధ తైలాలను బాహ్యంగా ప్రయోగించి, పదమూడు రకాలైన స్వేద ప్రక్రియలలో ఒకదానిని ఎంచుకుని చమటను పుట్టించేలా చేయడం జరుగుతుంది. ఈ చికిత్సల వల్ల రక్త ప్రసరణ వ్యవస్థ మెరుగవ్వటమే కాకుండా, కీళ్లకు ఇరువైపులా ఉండే కండరాలు కూడా బలంగా తయారై నొప్పి తగ్గుముఖం పడుతుంది. 

ఔషధాలు: త్రయోదశాంగగుగ్గులు, వాతవిధ్వంసినీరసం, రాసానా ఏరండాదిక్వాథం, బాహ్యప్రయోగం -మహానారాయణతైలం.

3. సంధి శూల (ఆస్టియోఆర్తరైటిస్): 

మోకాళ్లలోనో, తుంటి కీలులోనో నొప్పి ఉంటూ, విశ్రాంతితో బిగదీసుకుపోవడం, కదిలేటప్పుడు మరింత బాధామయంగా తయారవ్వటం జరుగుతుంటే అది సంధి వాతాన్ని (ఆస్టియోఆర్తరైటిస్) సూచిస్తుంది. ఎముకల కణజాలాల సముదాయాలు శిథిలమవడం వలన ఈ స్థితి ప్రాప్తిస్తుంది. ఈ స్థితి ఎక్కువగా శరీరపు బరువును మోసే జాయింట్లు - అంటే మోకాళ్లు, తుంటి కీళ్లకే పరిమితమై ఉండటాన్ని బట్టి, అధిక బరువు వలన అరుగుదల ఏర్పడి. తత్ఫలితంగా నొప్పులు ఉత్పన్నం అవుతుంటాయని అర్థం చేసుకోవచ్చు. అయితే లావుగా ఉండే వ్యక్తులందరిలోనూ కీళ్ల నొప్పులు ఉండకపోవటమూ, సన్నగా ఉండే వాళ్లలో కూడా కీళ్ల నొప్పులుండటాన్ని బట్టి సంధి వాతానికి కారణాలుగా వంశపారంపర్యత, జన్మతః ఏర్పడిన నిర్మాణ లోపాల వంటి వాటిని కూడా పరిగణించాల్సి ఉంటుంది.

ఆయుర్వేదం వ్యాధులు రావటానికి గల కారణాలను తెలియచేస్తూ అతియోగం అనే దానిని ప్రముఖంగా చెప్పింది. జాయింట్లను అతిగా, అసహజంగా ఉపయోగించడమే అతియోగమంటే, బాక్సర్ల మణికట్టు నొప్పులకూ, ఫుట్బాల్ ఆటాగాళ్ల మోకాళ్ల నొప్పులకూ కారణం ఇలాంటి అతియోగమే. 

సూచనలు: సంధివాతం (ఆస్టియోఆర్తరైటిస్) జాయింట్ల అరుగుదల వలన సిద్దిస్తుంది కనుక దీనిలో విశ్రాంతికి మించిన చికిత్స లేదు. అలాగే వేడి కావడాలను, ఐస్ ప్యాక్ లను మార్చి మార్చి ప్రయోగించడం వలన కూడా నొప్పి తగ్గుముఖం పడుతుంది. ఇంతే కాకుండా దీనిలో ఆముదం, పిండ తైలాలూ అయోఘంగా పనిచేస్తాయి. వీటిలో ఒక దానిని కొద్దిగా వేడి చేసి కీలు పైన పలుచగా రాసి ఉప్పు మూటతో కాపడం పెట్టుకోవాలి. అలాగే సరైన వ్యాయామాలను ఎంచుకుని సాధన చేస్తే కీళ్లు అల్లుకుపోకుండా కదలికలు నిరాటంకంగా కొనసాగుతాయి. 

గృహ చికిత్సలు: 1. వెల్లుల్లిని ముద్దగా నూరి రెండు చెంచాల మోతాదుగా నువ్వులనూనెతో కలిపి (ఒక చెంచాడు) రోజుకు రెండుసార్లు వేడినీళ్లతో తీసుకోవాలి. 2. పారిజాతం ఆకులను (పది) గాని, వావిలి ఆకులను (గుప్పెడు) గాని ముద్దగా దంచి ఒక గ్లాసు నీళ్ళలో వేసి చిన్న మంటమీద సగం కషాయం మిగిలెంతవరకు మరిగించాలి. దీనికి ఆముదం (ఒక చెంచా) చేర్చి ప్రతిరోజు ఉదయం పరిగడుపున తీసుకోవాలి. 3. మహిసాక్షి గుగ్గిలాన్ని అరచెంచాడు మోతాదుగా రోజుకు రెండుసార్లు వేడినీళ్ళతో పుచ్చుకోవాలి. 4. శొంఠికషాయానికి (అరకప్పు) ఆముదం (రెండు చెంచాలు) చేర్చి రోజుకు రెండుసార్లు తీసుకోవాలి. 5. శొంఠి (అరచెంచా), నువ్వులు (ఒక చెంచా), బెల్లం (అరచెంచా) అన్నీ కలిపి ముద్దగా నూరి రోజూ రెండు పూటలా తీసుకోవాలి. 

ఔషధాలు: యోగరాజగుగ్గులు, త్రయోదశాంగగుగ్గులు, లాక్షాదిగుగ్గులు, మహారాస్నాదిక్వాథం, మహావాతవిధ్వంసినీ రసం.

బాహ్యప్రయోగం - మహానారాయణతైలం. మోకాలు జాయింటు

4. అమవాతం (రుమటాయిడ్ ఆర్తరైటిస్):

కీళ్ళనొప్పులతో పాటు సాదారణారోగ్యం కూడా దెబ్బతింటే అది అమవాతాన్ని (రుమటాయిడ్ ఆర్త రైటిస్) ని సూచిస్తుంది. సంధి వాతం (ఆస్టియోఆర్తరైటిస్) లో మాదిగిగా దీనిలో కేవలం జాయిట్ల చివర్లు శితిలమవడం మాత్రమే ఉండదు. కేవలం బరువు మోసే జాయింట్లే వ్యాధిగ్రస్తం కావు. అంటే, సంధివాతంలో ఇన్ ఫ్లమేషన్ కు ఆస్కారం లేదు. అమవాతంలో అరుగుదలకు అవకాశం లేదు. రెండూ రెండు విభిన్నమైన వ్యాధులు. ప్రతి వందమందిలోనూ ముగ్గురు వ్యక్తులు అమవాతంలో బాధపడుతున్నారని ఒక అంచనా, అందునా, మగవారికంటే మహిళలే ఎక్కువగా ఎక్కువగా దీని బారిన పడుతుంటారు. ఈ వ్యాధిలో ముందస్తుగా రెండు మడిమలూ, లేదా రెండు మణికట్లూ వాస్తాయి. నొప్పి ఉంటుంది. నీరసంగా అనిపిస్తుంది. ఉదయంపూట ఈ లక్షణాలు మరీ ఎక్కువగా కనిపిస్తాయి. రక్తాల్పత కూడా ఉండవచ్చు.

కీళ్ళనొప్పులు ఎప్పుడూ ఒకే ప్రదేశానికి నిబద్ధం కాకుండా మారుతుండటం ఈ వ్యాధి ప్రధాన లక్షణం. ఈ వ్యాధిని కేవలం కీళ్ల వ్యాధిగా కాకుండా, శారీరక వ్యవస్థాగత వ్యాధిగా (సిస్టమిక డిసీజ్) పరిగణించి చికిత్స చేయాల్సి ఉంటుంది. అమవాతంలో కళ్లు, ఊపిరితిత్తులు, గుండె, ఎముకలలో ఉండే మూలుగ ఇలా అనేక శరీర భాగాలు వ్యాధిగ్రస్తమవుతాయి. జీర్ణవ్యవస్థలో లోపాలు సంభవిస్తాయి. విరేచనాలు, అజీర్ణం వంటివి కూడా కనిపిస్తాయి. ఈ వ్యాధికి ఒక ప్రధాన కారణం శరీరపు స్వీయ రక్షణ వ్యవస్థ లోపభూయిష్టంగా మారడం. దీనిలో ఆటో ఇమ్యూనిటీ డిజార్డర్ అంటారు. (అంటే, శరీరంలో ఉండే ప్రతిరక్షక కణాలు శరీరపు స్వంత కణజాలాలను బయటివాటిగా భావించి పాదదోలే ప్రయత్నం చేయడంతో సమస్య ఏర్పడటం). దీని ఫలితంగా శరీరంలో వాపు, జ్వరం (రుమాటిక్ ఫీవర్) మొదలైనవి కనిపిస్తాయి. ఈ లక్షణాలు ఒకేసారి కాకుండా, దీర్ఘకాలం పాటు పునరావృత్తమౌతుంటాయి.

అమవాతానికి పూర్తిస్థాయి చికిత్స తీసుకోనట్లయితే శాశ్వత అంగవైకల్యంతోపాటు గుండె జబ్బులు కూడా వచ్చే అవకాశం ఉంది. వ్యాధి పురోగమనంలో కాని, వ్యక్తీకృత లక్షణ తీవ్రతలో కాని, వ్యక్తీనుండి వ్యక్తికీ కొంత వ్యత్యాసమున్నప్పటికీ ఇది ప్రాప్తించిన ప్రతివారూ నిస్సృహలకు, నిరాశకూ లోనవుతారనేది మాత్రం నిజం. అయితే దీని సమగ్ర రూపాన్ని అర్థం చేసుకుని చికిత్స తీసుకుంటే నిరాశా నిస్పృహలకు తావుండదు. సూచనలు: అమవాతానికి కొంత విజ్ఞతతో చికిత్సచేయాల్సి ఉంటుంది. ఈ వ్యాధిలో రెండు అవస్థలుంటాయి; ప్రకోపావస్థ మొదటిదైతే, శమనావస్థ రెండవది. ఈ రెండు అవస్థలలోనూ 'అమం' అనేది అన్యాపదేశంగా ఉంటుంది. (అపరిపూర్ణంగా, వ్యత్యస్థంగాపచనమైన ఆహారం విషతుల్యంగా మారి, శరీరపుధాతువులలోనికి విలీనమైనప్పుడు దానిని అమం అంటారు)రుమటాయిడ్ ఆర్త రైటిస్ తగ్గాలంటే ముందు అమానికి చికిత్స జరగాలి. అమవాతంలో ఆకలి మీద వేటు పడుతుంది కనుక ఆహారం తేలికగా జీర్నమయ్యేదిగా, అంటే ద్రవయుక్తంగా ఉండాలి.

జీర్ణశక్తి మెరుగవుతున్నకొద్దీ క్రమంగా అన్నం, పెసరకట్టు, పులగం వంటివి చేర్చుకుంటూ వెళ్లాలి. ఆహారంలో ఏ పదార్థాలు సరిపడవో వాటిని వాటిని గుర్తించి వదిలివేయాలి. ఆహార పదార్థాల్లో మీకు సరిపడని వాటిని కనిపెట్టడం కష్టమైతే దానికి ఒక పధ్ధతి ఉంది; ఆహార పదార్థాన్ని తినకముందూ, తిన్న తరువాత నాడిని చూసుకోండి, ఆహారం తీసుకున్న తర్వాత నాడి ఐదు శాతం పెరిగితే మీకు ఆ పదార్థం సరిపడటం లేదని గ్రహించాలి. పంచకర్మలతో పాటు ఈ వ్యాధిలో షోథహర ఔషధాలు (ఇన్ ఫ్లమేషన్ తగ్గించే మందులు) ఉపయోగిస్తే మంచి ఫలితాలుంటాయి. యోగ, మెడిటేషన్ వంటివి కూడా ఈ వ్యాధి నుంచి త్వరితంగా కోలుకునేలా చేస్తాయి. 

ఔషధాలు: మహాయోగరాజగుగ్గులు, స్వర్ణవాతరాక్షసం, వాత గజాంకుశరసం, సింహనాదగుగ్గులు, మహారాస్నాదిక్వాథం,

బాహ్యప్రయోగం: మహావిషగర్భతైలం. అరిగిన మోకాల

5. ఇన్ఫెక్షన్ వల్ల కీళ్లనొప్పి (ఇన్ ఫెక్టివ్ ఆర్తరైటిస్):

శరీరంలోని ఇతర భాగాల మాదిరిగానే జాయింట్లకు కూడా ఇన్ఫెక్షన్సోకే అవకాశం ఉంది. జలుబుకు కారణమైన వైరస్ కు సైతం తాత్కాలికంగా అయినప్పటికీ - కీళ్ల వాపును కలిగించే వీలుంది. అలాగే, జర్మన్ మీజిల్స్, హైపటైటిస్ వైరస్ లను కూడా ఈ నైజం ఉంది. జ్వరంతోపాటు వేళ్ల కణువుల వంటి చిన్న జాయింట్లలో నొప్పి ఉంటూ, అది ఒక చోటు నుంచి మరొక చోటుకు కదులుతూ ఉంటే, దానిని రుమాటిజానికి చెందిన జ్వరంగా అనుమానించాల్సి ఉంటుంది.  

సాధారణంగా ఈ రకమైన జ్వరం గొంతునొప్పితో ప్రారంభమవుతుంది. జాయింట్లపైన ఏవైనా గడ్డలుకాని, కంతులుకాని లేస్తే, వాటినుంచి ఇన్ఫెక్షన్ జాయింట్ల లోనికి ప్రవేశించి, అక్కడినుంచి గుండె కవాటాలను చేరి, ఆ కవాటాలను లేదా వాల్వులను సైతం వ్యాధిగ్రస్తం చేసే అవకాశం ఉంది. ఈ కారణాలను అలా ఉంచితే అనైతిక లైంగిక సంబంధాలతో ప్రాప్తించే గనోరియా వ్యాధిలో జననాంగాల స్రావాలు మాత్రమే కాకుండా కీళ్ల నొప్పులు సైతం వచ్చే అవకాశం ఉంది. దీనికి కారణం, ఇన్ఫెక్షన్ రక్తం ద్వారా జాయింట్లను చేరి వాటిని వ్యాధిగ్రస్తం చేయడమే.  

సూచనలు: ఇన్ఫెక్షన్ వలన కీళ్ల నొప్పులు ఉత్పన్నమైనప్పుడు మొదట ఇన్ఫెక్షన్ నియంత్రించాల్సి ఉంటుంది. దీనికి కీటాణు నాశక ఔషధాలు అవసరమవుతాయి. 

ఔషధాలు: మల్లసింధూరం, తాళసింధూరం, గంధక రసాయనం, శారిబాద్యాసవం, మహామంజష్టాదిక్వాథం, వ్యాధిహరణరసాయనం, భల్లాతకవటి. 

6. వాతరక్తం (గౌట్):

పాదం బొటనవేలు వాచిపోయి నొప్పిని కలిగించడమనేది గౌట్ వ్యాధి లక్షణం. గౌట్ వ్యాధిని ఆయుర్వేదం విశదీకరించిన వాతరక్తంతో పోల్చవచ్చు. ఇది ఎక్కువగా మధ్యవయస్కుల్లో కనిపిస్తుంది. ఐతే స్త్రీలలో చాలా అరుదనే చెప్పాలి. ఏ కొద్దీమందిలోనో కనిపించినా, అది బహిష్టులు ఆగిపోయిన తరువాతనే. ఈ వ్యాధి కొన్ని కుటుంబాలలో వంశపారంపర్యలక్షణంగా కొనసాగుతుంటుంది. అలాగే జన్యుపరమైన అంశాలు కూడా దీనికి తోడ్పడుతాయి. గౌట్ వ్యాధి బయటపడేటప్పుడు ఒక నిర్దిష్టమైన విధానాన్ని అనుసరిస్తుంది. వేళ్ల కణువుల్లో (ముఖ్యంగా కాలి బొటనవేలులో) ప్రప్రథమంగా గౌట్ వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి. ఆ తరువాత క్రమంగా కాలి మడమలు, మోకాళ్లు, ఇతర వేళ్ల కణువులు, మణికట్టు, మోచేతులు.... ఇలా ఒక్కొక్క దానిలోనూ, నొప్పి మొదలవుతుంది.

ఏ అర్థరాత్రో హఠాత్తుగా కాలి బొటనవేలి బాధతో మెలకువ వస్తుంది. వ్యాధికి గురైన జాయింటు వేడిగా, ఎర్రగా ఉబ్బిపోయి కనిపించడమే కాకుండా నునుపుగా, ఉబికిన రక్తనాళాలతో కూడి కనిపిస్తుంది. నొప్పి చాలా తీవ్రస్థాయిలో ఉంటుంది. చిన్నగా చేతితో తాకినా భరించలేరు. ప్రారంభావస్థలో అనుబంధ లక్షణంగా జ్వరం ఉంటుంది, గౌట్ బయటపడేముందు ఆకలి మందగించడం, వాంతి వచ్చినట్లుండటం, చిరాకుగా ఉండటం వంటి లక్షణాలు కొంతమందికి అనుభవమవుతాయి.  

నొప్పి కొన్ని రోజులపాటు, లేదా కొన్ని వారాలపాటు బాధించి సద్దుమనుగుతుంది. ఆ సమయంలో కొద్దిగా దురదగా కూడా ఉండొచ్చు. నొప్పి మళ్లీ కొన్ని నెలల తరువాత తిరగబెడుతుంది. రానురాను ఇలాంటి పునరావృతాల మధ్య వ్యవధి తగ్గిపోయి నొప్పి ఒక నిరంతర లక్షణంగా, మారుతుంది. శారీరక శ్రమ, ఆపరేషన్లు, దీర్ఘవ్యాధుల వంటివీ, మిరిమీరి ఆహారాన్ని తీసుకోవడం (ముఖ్యంగా మాంసాహార భోజనాలు), త్వరితగతిన బరువును తగ్గించుకునే ప్రయత్నంలో కఠోరంగా ఉపవాస దీక్షలు చేయడం వ వంటివీ, మద్యపానం, మూత్రాన్ని జారీచేసే మందులు వంటివీ గౌట్ ను ఎక్కువ చేస్తాయి. దీని వల్ల రక్తంలో ల్యాక్టిక్ ఆమ్లం పేరుకుపోయి సీరం యూరేట్స్ కు ఆస్కారం ఏర్పడుతుంది. గౌట్ కు ఒక ప్రధాన కారణం ఇలా సీరమ్ యూరేట్స్ పెరగడమే.

సూచనలు: గౌట్ వ్యాధి ఉన్నప్పుడు మద్యాన్నీ, మాంసకృత్తులు కలిగిన ఆహారాలనూ పూర్తిగా మానేయాలి. అలాగే తటాలున బరువు తగ్గటం కూడా మంచిది కాదు.

ఔషధాలు: మహామంజిష్టాదిక్వాథం, సిద్ధహరితాళభస్మం, తాళ సింధూరం, కైశోరగుగ్గులు, మహాయోగరాజగుగ్గులు, చవికాసవం, శారిబాద్యాసవం, భల్లాతకవటి.

7. సోరియాసిస్ వల్ల కీళ్ళనొప్పులు (సోరియాటిక్ ఆర్తరైటిస్):

చర్మం పైన మోస్తరు ఎరుపు రంగుతో వలయాలు మాదిరి పొరలు ఏర్పడి. వాటిపైన దళసరిగా పొలుసులు తయారవుతుంటే అలాంటి స్థితిని సోరియాసిస్ అంటారు. నిజానికి సోరియాసిస్ చర్మవ్యాధే ఐనప్పటికీ, దానిని ఉపేక్షిస్తే జాయింట్లు వ్యాధిగ్రస్తమయ్యే అవకాశం ఉంది. ఒక్కొక్కసారి కొద్దీ మందిలో ఈ సోరియాసిన్ చర్మంపైన మచ్చలుగా కనిపించకపోయినా, తలలో చుండ్రు మాదిరిగా భ్రమింపచేస్తూనో, లేదా వేలి గోళ్లను పిప్పిగోళ్లుగా కనిపించేలా చేస్తూనో ఉండవచ్చు. అప్పుడు సహజంగానే సోరియాసిస్ అన్న అనుమానం రాదుగాని, నిద్రాణంగా వ్యాధి మాత్రం కొనసాగుతూ జాయింట్లను వ్యాధిగ్రాసం చేస్తుంది. సోరియాసిస్ వలన కీళ్ల నొప్పులు వస్తుంటే ముందస్తుగా రక్తశోధనౌషధాలతోసోరియాసిస్ ను చికిత్సించాల్సి ఉంటుంది.

గృహచికిత్సలు: 1. తెల్లగన్నేరు వేరు, కానుగ చెట్టు పట్ట, జాజి చిగుళ్లు అన్నీ కలిపి ముద్దగా నూరి లేపనం చేసుకోవాలి. 2. మనష్శిల, అన్నభేది, మైలతుత్థం వీటిని సమభాగాలు తీసుకుని గోమూత్రంతో సహా నూరి పైకి రాయాలి. ఇవన్నీ తీక్షణ పదార్థాలు కనుక కంటికి, నోటికి తగలకూడదు. 3. కానుగ గింజలను ముద్దగానూరి పిండితే నూనె వస్తుంది, దీనిని నిలవచేసుకుని రోజువారిగా పైపూతగా వాడాలి. 4. రేల లేత చిగుళ్లను మెత్తగా నూరి పులిసిన మజ్జిగతో కలిపిరాయాలి. 5. గుప్పెడు వేపాకులను ముద్దగానూరి రోజు రెండుపూటలా చన్నీళ్ళతో తెసుకోవాలి. 6. తెడ్ల పాలాకుతో సూర్యపాక విధానాన్ని అనుసరించి తైలం తయారుచేసి పైకి, లోపలికి (ఒక చెంచాడు గ్లాసుడు పాలతో) వాడాలి.

ఔషధాలు: ఆరోగ్యవర్దినీ వటి, మహామంజిష్టాదిక్వాథం, పంచతిక్త గుగ్గులు, ఘృతం, అమృతభల్లాతక లేహ్యం, సర్పగంధవటి, చండమారుతం.

8. అంతర్గత రక్తస్రావం:

దెబ్బల వల్లనో,యథాలాపంగానో జాయింటులోనికి రక్తం స్రవిస్తే వాపు జనించడమే కాకుండా, కదలికలు కూడా పరిమితమై పోతాయి. అలాంటి సందర్భాలలో నొప్పి అన్యాపదేశంగా ఉంటుంది.

సూచనలు: జాయింట్లలోనికి రక్తస్రావమావుతున్నప్పుడు కారణాలను విశ్లేషించి తదనుగుణమైన చికిత్సలు చేయాల్సి ఉంటుంది.

ఔషధాలు: చంద్రకళారసం, బోల బద్దరసం, నాగకేశరచూర్ణం.

9. మందుల దుష్ఫలితాలు:

చాలా రకాల ఇంగ్లీషు మందులకు సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. చర్మం పైన దద్దుర్లు ఏర్పడడం, వాంతి వచ్చినట్లుండటం, కడుపులో గడబిడ వంటి లక్షణాలే కాకుండా కీళ్ళనొప్పులు కూడా ఇలాంటి అవాంచిత లక్షణాలలో భాగమే. అందుకే, ఏ మందునూ మీకై మీరు వాడకూడదు, ఒకవేళ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ తో వాడుతున్నప్పుడు కీళ్ళనొప్పులు వస్తే ఆ విషయాన్ని డాక్టర్ దృష్టికి తీసుకువెళ్లండి. కీళ్ళనొప్పుల వెనుక సాధారణమైన కారణాల నుండి అసాధారణమైన కారణాల వరకూ ఎన్నో ఉంటాయి. నొప్పిని తగ్గించే మందు బిళ్లలను నేరుగా కొనేసి వేసుకోవడం దీనికి పరిష్కారం కాదు; అలా చేస్తే కడుపులో మంట పుట్టడమే కాకుండా, ఒకోసారి రక్తస్రావం కూడా అయ్యే ప్రమాదం ఉంది.

పాదాల వాపు కొరకు మందులు

Medicine NamePack Size
Telsartan HTelsartan H 40 Tablet
Telma HTelma H Tablet
Co DiovanCo Diovan 160 Mg/25 Mg Tablet
Tazloc TrioTazloc Trio 40 Tablet
Hopace HHopace-H 2.5 Capsule
LasixLASIX 150MG INJECTION 15ML
PolycapPolycap Capsule
FrumideFrumide 40 Mg/5 Mg Tablet
Misart HMISART H 40/12.5MG TABLET 10S
FrumilFrumil 40 Mg/5 Mg Tablet
Missile HMissile H 40 Mg/12.5 Mg Tablet
Cosart HCosart H Tablet
AmifruAmifru Plus Tablet
Ngsart ChNgsart Ch 40 Mg/12.5 Mg Tablet
Lanxes HLanxes H 50 Mg/12.5 Mg Tablet
Exna KExna-K Tablet
Ngsart HNgsart H 40 Mg/12.5 Mg Tablet
Lara HLara H Tablet
Omen TrioOmen Trio 20/12.5 Tablet
Bisocar HtBisocar Ht 2.5 Mg/6.25 Mg Tablet
Ozotel HOzotel H Tablet
Lorsave HLorsave H Tablet
Concor PlusConcor Plus Tablet
Relmisart HRelmisart H 40 Mg/12.5 Mg Tablet
 

ధన్యవాదములు 

మీ నవీన్ నడిమింటి 

విశాఖపట్నం 

9703706660


అధిక చెమటలు &చెమట పొక్కులు నివారణ పరిష్కారం మార్గం




చెమట కాయలు అంటే ఏమిటి?

చెమట కాయలు, సాధారణంగా వాటిని చెమట పొక్కులు అని కూడా పిలుస్తారు, చర్మం దురదతో పాటు శరీరంలో వివిధ ప్రదేశాలలో పై ఎరుపు రంగు మచ్చలు కనిపించే ఒక చర్మ పరిస్థితి (సమస్య). చెమట కాయలు సాధారణంగా సంవత్సరంలోని వేడి నెలలలో ఏర్పడతాయి, శరీరానికి సాధారణం కంటే అధికంగా చెమటలు పెట్టేటప్పుడు వీటిని గమనించవచ్చు మరియు అవి చాలా అసౌకర్యాన్ని కలిగిస్తాయి.

దీని సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

చెమట కాయల యొక్క ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు చర్మంపై కనిపిస్తాయి మరియు వాటిని సులువుగా గుర్తించవచ్చు.

లక్షణాలు వీటిని కలిగి ఉంటాయి:

  • చర్మంపై ఎరుపు మచ్చలు కనిపిస్తాయి
  • చర్మం పైన బొబ్బలు ఏర్పడటం
  • చర్మం యొక్క తీవ్రమైన దురద
  • దుస్తులు చర్మానికి వ్యతిరేకంగా రుద్దుకున్నపుడు అసౌకర్యం  
  • చర్మం గరుకుగా మారడం

ఈ లక్షణాలు సాధారణంగా మెడ, భుజాలు, ఛాతీ మరియు నడుము వంటి భాగాలలో సంభవిస్తాయి. కొన్ని సందర్భాల్లో, మోచేతుల మరియు గజ్జల మడతలలో కూడా చెమట కాయలు ఏర్పడవచ్చు.

దీని ప్రధాన కారణాలు ఏమిటి?

శరీరం వేడికి గురైనప్పుడు, చెమట అధికంగా పడుతుంది. అధిక వేడి మరియు తేమ కారణంగా చెమట వాహికలకు (sweat ducts) అవరోధం ఏర్పడినప్పుడు చెమటకాయలు/పొక్కులు సంభవిస్తాయి. ఈ అవరోధం కారణంగా, చర్మం వాచీ, అది దురద మరియు ఎరుపుదనానికి దారితీస్తుంది.

ఎలా నిర్ధారిస్తారు మరియు చికిత్స ఏమిటి?

చెమటకాయలు/పొక్కులు అనేవి సాధారణం మరియు అవి ఎటువంటి సమస్యలకు దారితీయవు. కొన్ని రోజులు లేదా కొన్ని వారాల వరకు లక్షణాలు ఉండవచ్చు మరియు సాధారణంగా ఏ చికిత్స లేకుండా తగ్గిపోతాయి. అయితే, ఈ పరిస్థితి చాలా అసౌకర్యంగా ఉంటుంది కాబట్టి, వైద్యులు దానిని నివారించడానికి మరియు ఉపశమనానికి కొన్ని నివారణ చర్యలను సూచించవచ్చు.

నివారణ చర్యలు వీటిని కలిగి ఉంటాయి:

  • చర్మం శ్వాసించడానికి వీలుగా వదులుగా ఉండే బట్టలను ధరించాలి
  • చల్లని, పొడి వాతావరణంలో ఉండాలి
  • శారీరక వ్యాయామం తర్వాత స్నానం చెయ్యాలి
  • చర్మపు చికాకును నివారించడానికి మృదువుగా ఉండే బట్టలు ధరించాలి

చల్లటి కలబంద జెల్ను వాడటం మరియు చల్లటి నీటితో కడగడం వంటి గృహ చిట్కాలు దురద నుండి ఉపశమనం పొందడానికి సహాయపడతాయి.

ఒకవేళ చెమటవాహికలకు ఇన్ఫెక్షన్ సోకితే, మరింత చికిత్స అవసరమవుతుంది

ఎండాకాలం చెమట దుర్గంధం... అభ్యంగన స్నానం అవసరం... నువ్వుల నూనె రాసుకుని...


ఎండాకాలం వచ్చేసింది. కొందరికి చెమట పోయడం ఓ మోతాదులో ఉంటే మరికొందరు నీళ్లు కారిపోతుంటారు. శరీరం నుంచి చెమట కారడంతో దుర్గంధం వస్తుంటుంది. అందువల్ల శరీరం దుర్వాసన పూర్తిగా తగ్గిపోవాలంటే ప్రతివారంలో ఒక్కరోజు నువ్వుల నూనె ఒంటికి రాసుకుని చింతపండు గానుగ గింజలు నూరి ఆ ముద్దతో ఒంటికి నలుగుపెట్టుకుంటే చర్మం నుంచి వచ్చే దుర్వాసన పూర్తిగా తగ్గిపోతుంది. 

మరికొంతమందిలో విపరీతంగా చెమట పోస్తుంది. అటువంటివారు వేపాకు, తామరపువ్వులు, దానిమ్మ చెక్క, నీళ్లతో నూరి ఆ ముద్దతో శరీరానికి నలుగుపెట్టుకుంటే అధికంగా వచ్చే చెమట శాతం తగ్గుతుంది. 

ఇంకా చర్మంపై దురద, చిన్నచిన్న మచ్చలు వచ్చి బాధపెడుతుంటే తులసి ఆకులను నిమ్మకాయ రసంలో నూరి ఒంటికి రాసుకుని నాలుగు గంటల తర్వాత స్నానం చేస్తే దురద, చిడుములు తగ్గిపోతాయి.

    అధిక చెమట సమస్య --నివారణ                                   
                     50, 60 సంవత్సరాల వయసు దాటిన  వారిలో  అధిక చెమట సమస్య వుంటుంది. 
                                               నాగకేసరాలు
                                               వట్టి వేళ్ళు
                                               దిరిసెన చెట్టు బెరడు (చర్మ సౌందర్య విష హరిణి)
                                               ఆకు పత్రి
                                               పచ్చ కర్పూరం
                                               నల్ల ఉలవలు 
         అన్నింటిని నానబెట్టి రుబ్బి ముద్దలాగా చేసి శరీరం పై రుద్దితే అతి చెమట సమస్య నివారింప బడుతుంది. 
ఇది అన్ని వయసుల వాళ్లకు ఉపయోగపడుతుంది. ఇది పూసుకున్న తరువాత గంట ఆగి స్నానం చెయ్యాలి. 

 అధికంగా చెమట పట్టుట --నివారణ                      

లక్షణాలు:-- ఎండలో తిరగక పోయినా, ఇంట్లో వున్నా, ఫ్యాన్ కింద వున్నా అరికాళ్ళకు, అరిచేతులకు ఎక్కువగా చెమట పట్టడం. 

కారణాలు:-- కాలేయంలో ఎక్కువగా వేడి చేరడం వలన ఇది వస్తుంది.  కారం, చెడు, మాంసం, మద్యం ఎక్కువగా  సేవించడం వలన వస్తుంది.

       పొట్ట మీద కాలేయం వున్నచోట నువ్వుల నూనెతోమృదువుగా  మర్దన చెయ్యాలి.

ఆసనాలు:-- 

1. జానుశిరాసనం :-- కాళ్ళు చాపి కూర్చొని ఒక కాలును గుదమునకు ఆనుకునేట్లు పెట్టి కుడి చేతిని నడుము  మీదపెట్టి, ఎడమ చేతితో ఎడమ కాలి బొటన వ్రేలును పట్టుకొని వంగాలి.  ఈ విధంగా రెండవ వైపు కూడా  చెయ్యాలి. 

2. నౌకాసనం:-- వెల్లకిలా పడుకొని రెండు చేతులను బాగా  చాపి రెండు కాళ్ళను కదలకుండా లేపాలి. 

ఆహారం:-- వామును శుభ్రం చేసి దోరగా వేయించి దంచి పొడి చెయ్యాలి. అది మునిగే వరకు నువ్వుల నూనె పోసి  రాత్రంతా నానబెట్టాలి.  ఉదయం దంతధావనం తరువాత కొంచం కొంచం గా తినాలి. ఒక గంట వరకు ఏమి తిన కూడదు .

  చిన్న పిల్లలకు           ----- పావు టీ స్పూను 
  పెద్ద పిల్లలకు             ----- అర టీ స్పూను 
  పెద్దలకు                    ----- ఒక టీ స్పూను 

     సునాముఖి ఆకును ఎండబెట్టి దంచి జల్లించిన పొడిని సీసాలో భద్రపరచాలి.
  
     పావు టీ స్పూను సునాముఖి పొడిని అర కప్పు ఆవు మజ్జిగ లో కలిపి రాత్రి నిద్రించే ముందు తాగాలి.
 చారెడు ఉలవలను చాలా మెత్తగా పప్పులాగా ఉడకబెట్టాలి. రెండు పూటలా స్నానానికి ముందు ఈ పప్పు ముద్దను అర చేతుల్లో వేసుకొని అరి కాళ్ళ మీద, అరి చేతుల్లో  రుద్దాలి. 

  అధిక చెమట వలన శరీర దుర్గంధం --నివారణ                    
        గాలిని బాగా తగలనివ్వాలి.
        కొన్ని గ్రంధుల పని తీరు,  వంశ పారంపర్యం ముఖ్యమైన  కారణాలు. 
        గోధుమ పిండి నుండి, యాపిల్ నుండి తయారైన వెనిగర్ ను డియోడరెంట్ గా దూదితో అడ్డుకోవాలి. 
       పటిక పొడిని చెమట పట్టిన చోట చల్లాలి. 
 మొక్క జొన్నల పిండి               --- 10 gr
వంట సోడా                              --- 10 gr
మంచి గంధం నూనె                   ---  రెండు చుక్కలు 
     అన్నింటిని కలిపి పౌడర్ లాగా పూసుకోవాలి. 
2. స్నానపు నీళ్ళలో రెండు కప్పుల టొమాట రసం కలిపి స్నానం చేస్తే ఎంతో ఫ్రెష్ గా వుంటుంది.
3. స్నానం చేసే నీటిలో రెండు టీ స్పూన్ల వంట సోడా కలిపి చేస్తే ఎంతో మంచిది.
4. టాల్కం పౌడర్, వంట సోడా కలిపి పోసుకుంటే ఫ్రెష్ గా వుంటుంది.

               అతి క్తోవ్వు వలన శరీరంలో వచ్చే దుర్గంధం-- నివారణ            

ఎర్రని లేదా తెల్ల చందనం         ----10 gr 
          లొద్దుగ చెక్క పొడి        ---- 10 gr 
          నాగ కేసరాల పొడి        ---- 10 gr 
                 వట్టి వేర్ల పొడి       ---- 10 gr 
                పచ్చ కర్పూరం     ---- 10 gr ( భీమసేని కర్పూరం మంచిది )

       అన్నింటిని కలిపి డబ్బాలో నిల్వ చేసుకోవాలి. 

       దీనితో స్నానం చెయ్యడం వలన దుర్గంధం తొలగింప బడుతుంది. అధికంగా చెమట పట్టడం తగ్గుతుంది.

       శరీరంలోని వేడి తగ్గుతుంది. స్నానానికి ఒక గంట ముందుగా ఈ పొడి తో లేపనం చేయాలి,
 మర్మ భాగాల  లోని చర్మ వ్యాధులు కూడా నివారింప బడతాయి. 

   అధిక స్వేదం ---నివారణ                          

త్రిఫలాలు      (1 : 1 :  1 ) 
శొంటి
తుంగ ముస్తలు
అతిమధురం 

      అన్నింటిని సమాన భాగాలుగా తీసుకుని  దంచి పోడులుగా చేసి జల్లించి కలిపి నిల్వ చేసుకోవాలి.

పూటకు ఒక టీ స్పూను చొప్పున మూడు పూటలా నీటితో సేవిస్తే అతి స్వేదం సమస్య  నివారింప బడుతుంది. 

      దీనితోబాటు జటామాంసి పొడిని కూడా కలుపుకోవచ్చు. 

    చెమట వాసన నివారణకు చిట్కా                   

    నేరేడు ఆకులను నీటిలో కలిపి ఉడికించి  వడకట్టి ఆ నీటిని స్నానపు నీటిలో కలుపుకొని స్నానం చేస్తే చెమట వాసన తగ్గుతుంది. 

చెమట కాయలు కొరకు మందులు

Medicine NamePack Size
WysoloneWysolone 20 Tablet DT
Loxcip PDLOXCIP PD EYE DROPS 5ML
Gatiquin PGATIQUIN P EYE DROP 5ML
PredzyPredzy 3 Mg/10 Mg Eye Drops
Gatsun PGatsun P 0.3%/1% Drops
Siogat PSiogat P Eye Drop
Zengat PZengat P Eye Drops
Z PredZ Pred Eye Drop
Gate PDGate PD Eye Drops
Gate P PGate P P 3 Mg/10 Mg Eye Drops
4 Quin Pd4 Quin Pd 0.5% W/V/1% W/V Eye Drop
Apdrops PDAPDROPS PD EYE DROPS 5ML
CombaceCombace Eye Drop
EmsoloneEmsolone 10 Mg Tablet
Mo 4 PdMO 4 PD EYE DROPS 10ML
KidpredKidpred Syrup
MethpredMethpred 125 Injection
MoxipredMoxipred Eye Drop
OmnacortilOmnacortil 10 Tablet DT
Omnacortil ForteOmnacortil Forte Oral Suspension
Moxigram PMoxigram P Eye Drop
Prednisolone Acetate (Alcon Lab)Prednisolone Acetate 1% Drop
Occumox POccumox P Eye Drop
Prednisolone Acetate (Aller)Prednisolone Acetate Opthalmic Suspension

ధన్యవాదములు 

మీ నవీన్ నడిమింటి 

విశాఖపట్నం 

9703706660

*సభ్యులకు సూచన*

*************

సమయాభావం వలన వ్యక్తిగతంగా సమాధానాలు ఎవరికీ ఇవ్వడం సాధ్యపడదు. మీ సమస్యకు సరిపడా పరిష్కారాలకొరకు, మీ అవగాహనకొరకు మేము పెడుతున్న సంబంధిత సమాచారంతో కూడిన సవివరమైన పోస్టులు చదవవలసినదిగా ప్రార్థన..


.

గర్భిణీ కు నిద్ర సమస్యలు పరిష్కారం మార్గం




గర్భిణీ స్త్రీలలో నిద్రలేమి సమస్యకి నవీన్ నడిమింటి అవగాహనా కోసం సలహాలు  –  tips for pregnant women


గర్భిణీగా ఉన్నప్పుడు హార్మోన్ల మార్పు, శారీరక అసమానతలు వల్ల గర్భిణీ స్త్రీలలో నిద్ర లేమి సమస్య మొదలవుతుంది. ప్రెగ్నెన్సీలో ప్రతీ త్రైమాసికానికీ నిద్ర లేమి సవాళ్ళను గర్భిణుల ముందు నిలుస్తాయి. నేషనల్ స్లీప్ ఫౌండేషన్ ప్రకారం ప్రతీ త్రైమాసికానికి కొన్ని నిద్రలేమి మార్పులు వస్తాయని చెప్పటం జరిగింది. అంతేకాక 78 శాతం గర్భిణీ స్త్రీలు ఈ సమస్యతో బాధపడుతున్నారని వెల్లడించింది. వాటిని ప్రత్యేకంగా గర్భిణీ స్త్రీల కోసం మీ తెలుగు టిప్స్ అందిస్తోంది. అవేంటో చూద్దామా..!
గర్భిణీ స్త్రీలలో నిద్రలేమి అనేది సహజమైన సమస్య. గర్భము దాల్చాక ఎంతో కొంత నీరసము అతినిద్ర ఉండడము సహజమే కాని ఎక్కువ అలసట , మరీ నిద్రపోవడము మంచిది కాదు. ఉదయం నిద్ర లేవటం అనేది మీకు తరచూ ఎదురయ్యే సవాలు. ఉల్లాసంగా విశ్రాంతిగా మరునాడు మేల్కోవాలంటే మీరు ఒక దినచర్య అలవాటు చేసుకోవాలి.

మొదటి త్రైమాసికంలో నిద్ర లేమి సమస్య

1. తరచుగా నడుస్తుండటం వల్ల ఎక్కువగా బాత్ రూం కి వెళ్ళాల్సివస్తుంది.
2. ప్రెగ్నెన్సీలో నిద్రించే సమయంలో అంతరాయాలు ఏర్పడటం వల్ల శారీరకంగా, మానసికంగా స్ట్రెస్ ఏర్పడటం జరుగుతుంది.
3. పగటి పూట ఎక్కువగా నిద్రించటం.

రెండవ త్రైమాసికంలో నిద్ర లేమి సమస్య

1.రెండవ త్రైమాసికంలో నిద్ర లేమి సమస్య దాదాపూ చాలా మంది గర్భిణీ స్త్రీలలో ఒకటేలా ఉంటుంది. రాత్రి సమయాల్లో మూత్రం ఎక్కువ రాకపోవటం దీనికి కారణం పిండం రోజు రోజుకీ వృధ్ధి చెందటం. పిండం పెరగటం వల్ల ఇది బ్లాడెర్ పై ఎక్కువ ఒత్తిడి ని కలిగించనివ్వకపోవటం వల్ల ఈ సమస్య తలెత్తుతుంది. ఈ పరిస్తితిలో మానసిక ఒత్తిడి ఎక్కువై నిద్రలేమి సమస్యను పెంచుతుంది.

మూడవ త్రైమాసికంలో నిద్రలేమి సమస్య

ఈ త్రైమాసికంలో గర్భిణీ స్త్రీలు చాలా నిద్రలేమి సమస్యల్ని ఎదుర్కొంటారు.
1. క్రమక్రమంగా బొడ్డు పెరుగుదల వల్ల అసౌకర్యంగా ఉండటం.
2. గుండెల్లో మంట, కాళ్ళ తిమ్మిర్లు, సైనుస్ రద్దీ.
3. రాత్రిళ్ళు మూత్రం ఎక్కువగా రావటం ఎందుకంటే బిడ్డ కదలికల వల్ల ఆ ఒత్తిడి బ్లాడెర్ పై పడి తరచుగా మూత్రం వస్తుంది.

ప్రెగ్నెన్సీ సమయంలో నిద్ర పట్టేందుకు కొన్ని టిప్స్

కొన్ని టిప్స్ వల్ల మీ ప్రెగ్నెన్సీలో చక్కని నిద్ర మీ సొంతం అవుతుంది. కాని మరీ మీ నిద్రలేమి సమస్య ఎక్కువ ఉంటే మీ డాక్టరుని సంప్రదించటం మంచిది.

అదనంగా పిల్లోస్ వాడటం

ప్రెగ్నెన్సి సమయంలో మీరు వాడే పిల్లోస్ అంటే తలగడ దిండ్లు అదనంగా వాడటం మంచిది. పడుకునేటప్పుడు మీ కడుపుకీ, వెనుక భాగంలో అంటే పిరుదుల దగ్గర పిల్లోస్ వేస్కోవాలి. దీని వల్ల మీ కడుపుకీ ఎంతో సపోర్ట్ దొరుకుతుంది. అంతేకాక మీ రెండు కాళ్ళ మధ్య ఒక పిల్లో వేసుకోవాలి. దీనివల్ల మీ కింది భాగంలో సపోర్ట్ దొరుకుతుంది. కొన్ని పిల్లోలు ఆకారంలో ఇరుకుగా ఉండేవి, అలాగే పూర్తిగా బోడీ కి సరిపడే పిల్లోలని వాడటం మంచిది.

పొష్టికాహారం

ఒక గ్లాస్ పాలు త్రాగటం వల్ల మీకు మంచి నిద్ర వస్తుంది. కార్బోహైడ్రేడ్లు ఉన్న పదార్ధాలను తీసుకోవటం మంచిది. బ్రెడ్, క్రాకర్లు మీ నిద్రను పెంచుతాయి. అంతేకాక కొన్ని ఎక్కువ ప్రోటీన్లు ఉన్న స్నాక్స్ తీసుకోవటం వల్ల మీ బ్లడ్ షుగర్ ను పెంచటమే కాక మీకు చెడు కలలు రాకుండా, తలనొప్పులు రాకుండా చేస్తాయి.

ఆయాసం

కొంతమంది గర్భిణీ స్త్రీలు ఆస్త్మ లేదా హైపెర్థైరాయిడిజం సమస్యతో సతమతమవుతుంటారు.

గురక పెట్టడం

గర్భిణీ స్తీలకు సహజంగా ముక్కులోని రంద్రాలు ఉబ్బటం వల్ల ఎక్కువగా బిగ్గరగా గురక తీస్తుంటారు. నేషనల్ స్లీప్ ఫౌండేషన్ లెక్కల ప్రకారం 30 శాతం ఈ సమస్యకు గురి అవుతున్నారు.

విశ్రాంతి పొందే మార్గాలు

విశ్రాంతి తీసుకోవటం వల్ల మీ మనస్సు కి, కండరాలకూ విశ్రాంతి పొందుతాయి. ఈ మార్గాల్లేమిటంటే యోగ, మస్సాజ్, స్ట్రెచింగ్ లాంటివి. ఎక్కువగా శ్వాస తీసుకోవటం, వేడి నీళ్ళతో స్నానం, పడుకునే ముందు ఖచ్చితంగా స్నానం చేయాలి.

వ్యాయామం

ప్రెగ్నెన్సీ తో ఉన్నప్పుడు వ్యాయామం చేయటం ఎంతో మంచిది. వ్యాయామం చేయటం వల్ల మీ శరీరానికి, మనస్సుకి ఉల్లసం, ఉత్తేజం వస్తాయి. అంతేకాక ఒత్తిడి తొలగుతుంది. ఆరోగ్యకరంగ మాత్రమే వ్యాయామం చేయాలి. అధిక వ్యాయామం చెయకూడదు. డాక్టరు సలహా మేరకే ఈ వ్యాయమం చేయటం మంచిది. ముఖ్యంగా రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు అంటే 4 గంటల ముందు మాత్రం వ్యాయామం అసలు చేయరాదు.

నిద్ర

మొత్తానికి గర్భిణి స్త్రీలకు, నిద్రలేమి తప్పదు. నిద్రకు ఉపక్రమించే ముందు వేడిపాలు త్రాగాలి. పగలు కొంచెం వ్యాయామం చేస్తే రాత్రి బాగా నిద్ర పడుతుంది. రాత్రులు 8-10 గంటలు, పగలు 1 గంట నిద్ర లేదా విశ్రాంతి తీసుకోవాలి. నిద్రించే సమయంలో ఒక ప్రక్కకు (వీలైతే ఎడమ వైపు ) తిరిగి పడుకోవాలి.

వేరే మందుల వాడకం

ప్రెగ్నెన్సీ సమయంలో వేరే మందులు వాడటం మంచిది కాదు. ఇవి మీ బిడ్డ పెరుగుదలపై ప్రభావం చూపుతాయి. అంతేకాక కొన్ని మందులు అంటే యాంటీ బయాటిక్స్, హెర్బల్ ప్రాడక్ట్లు వాడటం అంత మంచిది కాదు. మీరు ఏ మందులు వేసుకోవాలన్నా మీ డాక్టరుని సంప్రదించి మాత్రమే వేసుకోవాలి.
ధన్యవాదములు 
మీ నవీన్ నడిమింటి 
విశాఖపట్నం 
*సభ్యులకు సూచన*
*************
సమయాభావం వలన వ్యక్తిగతంగా సమాధానాలు ఎవరికీ ఇవ్వడం సాధ్యపడదు. మీ సమస్యకు సరిపడా పరిష్కారాలకొరకు, మీ అవగాహనకొరకు మేము పెడుతున్న సంబంధిత సమాచారంతో కూడిన సవివరమైన పోస్టులు చదవవలసినదిగా ప్రార్థన..

.

గురక కారణాలపై విశ్లేషణ: #SleepApnea వల్ల వచ్చే సున్నితమైన, ముఖ్యమైన సమస్య గురక. గురక పెట్టి నిద్రపోతున్నారంటే గాఢనిద్రలో ఉన్నారని అనుకుంటారు చాలామంది. నిజానికి గాఢనిద్ర కాదు కదా.. మామూలుగా కూడా వాళ్లు నిద్ర సుఖాన్ని అనుభవించలేరు.మూలం


గురక అంటే ఏమిటి?

నిద్రిస్తున్న సమయంలో గాలి (ఊపిరి) యొక్క అనుకూల కదలికలకు అడ్డంకి ఏర్పడినప్పుడు గురక సంభవిస్తుంది. తరచుగా గురక పెట్టేవారికి వారి యొక్క గొంతు/కంఠం మరియు నాసికా కణజాలం పెద్దగా/అధికంగా ఉంటుంది, అది కంపించి (vibrate) ప్రత్యేకమైన గురక శబ్దానికి దారితీస్తుంది.

దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

గురక వలన నిద్ర లేమి లేదా తగ్గడం, పగటి వేళా మత్తుగా అనిపించడం, ఏకాగ్రత లేకపోవడం మరియు లైంగిక కోరిక తగ్గిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇది మానసిక సమస్యల మరియు గుండెపోటు ప్రమాదాన్ని కూడా పెంచుతుంది.

దీని ప్రధాన కారణాలు ఏమిటి?

గురక అనేది చాలా సాధారణం మరియు సాధారణంగా అది ఏవిధమైన ఆందోళనకరమైన పరిస్థితులను కలిగించదు. మనం నిద్రిస్తున్నపుడు, మన నాలుక, గొంతు, నోరు, శ్వాస మార్గాలు మరియు ఊపిరితిత్తులు సేదతీరుతాయి మరియు కొంచెం సన్నగా/ఇరుకుగా మారుతాయి. శ్వాసించేటప్పుడు ఈ భాగాలు వైబ్రేట్ (కంపిస్తే) ఐతే, అది గురకకు దారితీస్తుంది. గురక యొక్క కొన్ని సాధారణ కారణాలు:

  • అలెర్జీ లేదా సైనస్ ఇన్ఫెక్షన్.
  • ముక్కు దూలం (nasal septum) పక్కకు ఒరిగిపోవడం లేదా నేసల్ పోలీప్ కారణంగా అవరోధం/అడ్డంకి ఏర్పడడం వంటి ముక్కు వైకల్యాలు.
  • ఊబకాయం.
  • మందమైన నాలుక.
  • గర్భం.
  • జన్యు కారకాలు.
  • మద్యపానం మరియు ధూమపానం.
  • టాన్సిల్స్ మరియు అడినాయిడ్లు విస్తరించడం .
  • కొన్ని రకాల మందులు.

దీనిని ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?

ఏవైనా గురక యొక్క కారణాలను తనిఖీ చెయ్యడానికి వైద్యులు ముక్కు మరియు నోటిని పరిశీలిస్తారు. వ్యక్తి యొక్క గురక విధానాన్ని గురించి వైద్యులకు తెలియజేయడానికి వ్యక్తి భాగస్వామి ఉత్తమమైన వారు. కారణం స్పష్టంగా తెలియనట్లయితే వైద్యులు నిపుణుడిని సూచించవచ్చు. వైద్యులు ఇంటిలో నిద్ర పరీక్షను (in-home sleep test) లేదా తీవ్ర కేసులలో లాబ్ లో నిద్ర పరీక్ష (in-lab sleep test) ను ఆదేశించవచ్చు.

నిద్ర అధ్యయనం (sleep study) లో, సెన్సార్లు శరీరంలోని వివిధ భాగాలలో పెడతారు అవి మెదడు, హృదయ స్పందన మరియు వ్యక్తి యొక్క శ్వాస నమూనా నుండి సంకేతాలను రికార్డు చేస్తాయి. సాధారణంగా పాలీసోమ్నోగ్రఫీ (polysomnography) అని పిలువబడే ఇంటిలో నిద్ర పరీక్ష సహాయంతో అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా గుర్తించబడుతుంది. అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా కాకుండా ఇతర నిద్ర రుగ్మతలు (స్లీప్ డిజార్డర్స్) స్టడీ సెంటర్లో (అధ్యయన కేంద్రంలో) ఇన్-లాబ్ నిద్ర అధ్యయనం ద్వారా నిర్దారించబడతాయి.

నిద్ర అధ్యయనాలు కారణాన్ని నిర్దారించలేకపొతే, గురక యొక్క ఖచ్చితమైన కారణాన్ని గుర్తించడానికి చెస్ట్ ఎక్స్-రే, సిటి (CT) మరియు ఎంఆర్ఐ (MRI) స్కాన్ వంటి ఇతర పరీక్షలు నిర్వహించవచ్చు.

ఒకే నిర్దిష్టమైన చికిత్స ద్వారా గురకను పూర్తిగా తాగించలేరు కాని కొన్ని చికిత్సలు అడ్డంకులని తొలగించటం ద్వారా శ్వాసలోని అసౌకర్యాన్ని తగ్గిస్తాయి.

నిద్రపోయే ముందు సెడేటివ్ మందుల ఉపయోగాన్ని నివారించడం, ధూమపానం మరియు మద్యపానం విడిచిపెట్టడం వంటి జీవనశైలి మార్పులు. నేసల్ స్ప్రేలు, స్ట్రిప్లు (strips)  లేదా క్లిప్లు (clips), ఓరల్ ఉపకరణాలు (oral appliances), యాంటీ- స్నోర్ (anti-snore) దిండ్లు మరియు వస్త్రాల వంటి వాటి వినియోగం అనేది గురకని తగ్గిస్తుంది.

వైద్యులు ఈ కింది సవరణలను సలహా ఇస్తారు:

  • కొంటిన్యూస్ పాజిటివ్ ఎయిర్వే ప్రెషర్ (CPAP) [నిరంతర సానుకూల వాయు పీడనం]
  • లేజర్-అసిస్టెడ్ యువలోపలటోప్లాస్టీ (LAUP, Laser-assisted uvulopalatoplasty)
  • పలెటల్ ఇంప్లాంట్లు (Palatal implants)
  • సోమ్నోప్లాస్టీ (Somnoplasty) - అధిక కణజాలాలను తీసివేసేందుకు రేడియో తరంగాలను (radiofrequency) తక్కువ స్థాయిలో ఉపయోగిస్తారు
  • కస్టమ్-ఫిట్టేడ్ డెంటల్ పరికరాలు (Custom-fitted dental devices) లేదా కింది దవడ-పొజిషనర్లు (lower jaw-positioners)
  • యువాలోపలటోఫారింగోప్లాస్టీ (UPPP, uvulopalatopharyngoplasty), థర్మల్ అబ్లేషన్ పాలటోప్లాస్టీ (TAP, thermal ablation palatoplasty), టాన్సిలెక్టోమీ (tonsillectomy) మరియు అడెనోయిడైక్టోమీ (adenoidectomy) వంటి శస్త్రచికిత్సా విధానాలు

వెల్లకిలా పడుకోవడం కాకుండా ఒక పక్కకి పడుకోవడం వలన గురకకు తగ్గించవచ్చు మరియు ఒక యాంటీ స్నోరింగ్ నోటి వస్తువును (anti-snoring mouth appliance) ఉపయోగించవచ్చు

.

గురక సమస్య—ఆయుర్వేద చికిత్స….

1.-గ్లాసు నీటిలో 1—2 పిప్పర్ మెంట్ ఆయిల్ చుక్కలు వేసి రాత్రి నిద్రపోయే ముందు బాగా పుక్కిలించాలి.

2.-కొద్దిగా పిప్పర్ మెంట్ ఆయిల్ ను చేతివేళ్ళకు రాసుకుని వాసన చూస్తుంటే గురక తగ్గిపోతుంది.

3.-1/2 టీ స్పూను ఆలివ్ ఆయిల్ 1/2 టీ స్పూను తేనె కలిపి రాత్రి నిదురపోయేముందు తాగాలి.

4.-మరిగే నీటిలో 4లేదా5 చుక్కలు యూకలిప్టస్ ఆయిల్ వేసి తలకు ముసుగు పెట్టి రాత్రి నిదురపోయే ముందు 10ని” పాటు ముక్కుద్వారా ఆవిరి పీల్చాలి.

5.-ఆవు నెయ్యిని రోజూ కొద్దిగా వేడిచేసి కరిగించి రెండు చుక్కల చొప్పున రెండు ముక్కురంధ్రాలలో పోసి పీల్చుతుంటే గురక తగ్గుతుంది.

6.-1/2టీ స్పూను యాలకుల చూర్ణంను ఒక గ్లాసు వేడీనీటిలో కలిపి రాత్రి నిదురపోయే ముందు తాగాలి.

7.-రెండు టీ స్పూనుల పసుపుపొడిని కప్పు వేడి పాలల్లో కలిపి రాత్రి నిద్ర పోయే ముందు త్రాగండి

గురక కొరకు మందులు

Medicine NamePack Size
ArmodArmod 150 Tablet
WaklertWaklert 100 Mg Tablet
WakactiveWAKACTIVE 100MG TABLET
ModafilModafil 100 Tablet MD
ModalertModalert 100 Tablet
ModatecModatec 100 Tablet
ProvakeProvake 100 Mg Tablet
WellmodWellmod 100 Mg Tablet

ధన్యవాదములు 

మీ నవీన్ నడిమింటి 

విశాఖపట్నం 

9703706660

*సభ్యులకు సూచన*

*************

సమయాభావం వలన వ్యక్తిగతంగా సమాధానాలు ఎవరికీ ఇవ్వడం సాధ్యపడదు. మీ సమస్యకు సరిపడా పరిష్కారాలకొరకు, మీ అవగాహనకొరకు మేము పెడుతున్న సంబంధిత సమాచారంతో కూడిన సవివరమైన పోస్టులు చదవవలసినదిగా ప్రార్థన..



.

నిద్ర సమస్యలు అవగాహనా కోసం


నిద్ర సమస్యలు అవగాహనా కోసం నవీన్ నడిమింటి సలహాలు అవగాహనా కోసం  , Sleep

నిద్ర లేదా నిదుర (Sleep) ఒక శరీరానికి సంబంధించిన విశ్రాంతి స్థితి. ఇది జంతువులలోనే కాకుండా పక్షులు, సరీసృపాలు, ఉభయచరాలు మరియు చేపలలో కూడా కనిపిస్తుంది. మనుషులు, ఇతర జంతువులలో దైనందిక నిద్ర బ్రతకడానికి అవసరం. 8 గంటల కంటే తక్కువ నిద్రపోయిన వారిలో శరీర సామర్ధ్యం తగ్గినట్లుగా గుర్తించారు. అయితే నిద్ర యొక్క ప్రాముఖ్యత గురించి ఇంకా పూర్తిగా అర్ధం కాలేదు. విస్తృతమైన పరిశోధనలు జరుగుతున్నాయి. గాలి ,నీరు , ఆహారము లాగే నిద్ర కూడా ఒక సహజ శారీరక అవసరము . ఎవరెన్ని గంటలు నిద్రపోవాలన్న అంశం పైన భిన్నాబిప్రాయాలు ఉన్నా వేళకు తిని , వేళకు పడుకుంటే ఆరోగ్యాము నిక్షిప్తం గా ఉంటుంది . అలసిన మనసుకు , తనువుకు నిద్ర ఒక వరము . నిద్రలో శరీరానికి తగినంత విశ్రాంతి కలుగు తుంది . . . కలతపడ్డ మనసు కుదుట పడుతుంది . చాలినంత నిద్రలేక పోతే అది చాలా రుగ్మతల్కు దారి తీస్తుంది . మనసు మీద ప్రభావము చూపుతుంది . శారీరక జీవక్రియలు దెబ్బతింటాయి.


ఆరోగ్యమునకు  " నిద్ర "

అందమె ఆనందం,   ఆనందమె జీవిత  మకరందం  అని ఓ మహాకవి వర్ణిం చారు.
.అందరు అందంగా ఉండాలని, ఆరోగ్యముగ ఉండాలని కోరుకుంటారు .కానీ మన
ముఖం ప్రశాంతంగా అందంగా కనిపించాలంటే మంచి నిద్ర కావాలి లేదంటే
మన ముఖంలో తేడా కనిపించి పోతుంది 
రెండు రోజులు అన్నం లేకపోయినా పర్వాలేదు కాని , నిద్ర లేకపోతే ఎంత  మాత్రం  బ్రతకలేము.
 ప్రతి జీవికి  నిద్ర అంత  ముఖ్యమైనది  .
నిద్రలోనే  metabolism అంతా జరుగుతుంది. నిద్ర లోనే  anti oxidents  పని చేసి  టాక్సిన్  క్లిఎర్  చేసిఆరోగ్యముగా  ఉంచుతుంది .
రాత్రి  పదకొండు  గంటలనుండి  ఉదయం  నాలుగు  గంటలవరకు  anti oxidents work చేస్తాయని  చెపుతారు.అందువలన రాత్రి ఏ రెండు గంటలకో  పడుకొంటే  అవి కేవలం  రెండు గంటలు మాత్రమే పనిచేసి  , toxins clear అవడము  లేటు  అవుతుంది. అందువలన కొన్ని  సమస్యలు ఏర్పడతాయి
అని చెపుతారు.
నిద్ర లేమి వలన  కళ్ళు  లాగడము  ,చేసే పని మీద  శ్రద్ద తగ్గడము  మొదలైన  లక్షణాలు  కనిపిస్తాయి  .
ఒక గంట మనము పోగొట్టుకున్న  నిద్ర ని cover  చ్రేయడానికి  కనీసము  మూడు గంటలు పడుకోవాలి.అందువలనమనముపధ్ధతిప్రకారమునిద్రనిఅలవాటుచేసుకుంటే ,అందము,ఆరోగ్యాము, ఉత్సాహము ఎక్కువ అవుతాయి . ఎన్ని పనులు ఉన్నా నిద్ర  సమయాన్ని. , నిద్రకి  కేటాయిస్తే  ,ఆ పనులన్నీ  సక్రమము గా  ,సమయానికి  సమర్థ వంతముగా చేయగలము. 
తగినంత  నిద్ర లేకపోతె  మధు మేహము  ముప్పు  పెరిగే  అవకాశము ఉంది  అని తాజా. అధ్యనయనాలు  చెపుతున్నాయి .insulin. తత్వము  లో  మార్పులు  ,glucose నియంత్రణ లోసామర్థ్యము  తగ్గి పోయే  అవకాశములు  ఉన్నాయ్ అని colorado belter university పరోసోధకులు పేర్కొన్నారు . 9 గంటల నిద్ర  తప్పనిసరి అని  దాని వలన సామర్థ్యము పెరుగుతుంది  అని పేర్కొన్నారు.
మంచి నిద్ర కొరకు కొన్ని చిట్కాలు :

 1.పడుకునే ముందు. మనసులోకి ఏ  ఆలోచనలు రానీయకూడదు 
 2.తెల్లవారు ఘామున , లేదా సాయంత్రం   jagging కానీ walking కానీ  చేయడం వలన         రాత్రి  నిద్ర బాగా పడుతుంది
 3.  మంచినీరు  సమృద్దిగా  తీసుకోవాలి
4. రాత్రి  భోజనం తగ్గించాలి (అంటే పరిమిత భోజనం )
 5. పడుకోవడానికి  ముందు మూడుగంటల ముందే  భోజనంపూర్తి  చేయాలి .
6. సాధ్యమైనంత వరకూ  సాత్వికాహారము తీసుకుంటే మంచిది .
.     masaalafood తినడం వలన acidity,indigestion  లాంటి సమస్యలు 
    అవకాశాలు ఉన్నాయ్ .
7. కొంచెం సేపు  అటు ఇటు  నడిస్తే నిద్ర  వస్తుంది
 8. నిద్ర వచ్చే వరకూ T.V., చూడడము వలన  కళ్ళకు  స్ట్రైన్  పెరుగుతుంది.
     మైండ్ రిలాక్స్  అవదు.
9. ఏదైనా పుస్తకము చదవడము వలన నిద్ర  వస్తుంది  .
10. పడుకునే  ముందు గోరు వెచ్చని పాలు  శ్రేష్టము. అందులో  ఉండే. enzyme  మనకు నిద్ర వచ్చేలా చేస్తుంది.
 11. మంచి సంగీతము వినడము వలన నిద్ర  వస్తుంది  .
12. మనము పడుకునే  పరుపు ,దిండు సరిగా ఉన్నాయో లేవో చూడాలి 
 13. పడక గది వస్తువులతో  చిందర వందర గా ఉండకుండా సర్దుకోవాలి
14. గోడలకు ముదురు రంగులు కాకుండా, లేత  రంగులు  ఉండేలా చూసుకోవాలి 
15. గాలి వచ్చేలా కిటికీలు  ఉండాలి. oxygen  ఎక్కువగా వుంటుంది
16. ఎక్కువ  లైట్  ఉండకుండా  చూసుకోవాలి.వెలుగు కళ్ళ మిద  పడితే నిద్ర పట్టదు
17. అన్నింటి కన్నా ముఖ్యము  ఐయినది  శారీరక శ్రమ .ప్రస్తుత కాలమాన పరిస్థితులలో  అది కష్టమే  కానీ  మందులు అవసరము లేకుండా మంచి నిద్ర కావాలనుకుంటే శారీరక  శ్రమ తప్పని సరి.
 చిన్న చిన్న చిట్కాలు పాటిద్దాము , సుఖ  నిద్ర, శాశ్వత  ఆరోగ్యము  పొందుదాము.

ఎన్ని గంటలు నిద్రపోవాలి

సామాన్యంగా పిల్లలకు పెద్దలకంటే ఎక్కువగా నిద్ర అవసరం. ఇది వారి శారీరక పెరుగుదలకు మానసిక అభివృద్ధికి చాలా అవసరం. అప్పుడే పుట్టిన పిల్లలైతే సుమారు 18 గంటల నిద్ర అవసరం, వారు పెరుగుతున్న కొద్దీ ఇది తగ్గిపోతుంది.


వయసు ---------రోజుకు కావలసిన సగటు నిద్ర
పురిటిబిడ్డ -------సుమారు 18 గంటలు
1–12 నెలలు--------------14–18 గంటలు
1–3 సంవత్సరాలు---------12–15 గంటలు
3–5 సంవత్సరాలు ---------11–13 గంటలు
5–12 సంవత్సరాలు ---------9–11 గంటలు
యువకులు -----------------9-10 గంటలు
పెద్దవారు --------------------7–8 గంటలు
గర్భణీ స్త్రీలు -----------------8 (+) 

ప్రయోజనం

నిద్ర వలన మెదడుకు విశ్రాంతి దొరుకుతుంది. దానితో జ్ఞాపకశక్తి పెరుగుతుంది.
శరీరంలో రోగ నిరోధక శక్తిని అభివృద్ధి చేస్తుంది.
నాడీ వ్యవస్థ సరిగా పనిచేసేందుకు దోహదం చేస్తుంది.
హార్మోన్ల ఉత్పత్తి, నియంత్రణ నిద్ర వలన సక్రమంగా జరుగుతుంది.
నిద్రలో దశలు :
రాత్రి నిద్రపోయే సమయాన్ని రెండు రకాలుగా గుర్తిస్తారు. " రెమ్‌ " , "నాన్‌ రెమ్‌"  అని .
రెమ్‌ అంటే " రాపిడ్ ఐ మూవ్ మెంట్ " అనేదానికి సంక్షిప్త నామము . ఇందులో నాలుగు దశలుంటాయి. 
1. తొలి దశ 5 నిముషాలే . ఇది నిద్రలోకి వెళ్ళేదశ . కనురెప్పలు కింద కళ్ళు కదులుతూ ఉంటాయి. ఈ దశలో చిన్న శభ్దానికైనా వెంటనే మెలకువ వస్తుంది .
 
నిద్ర లేమి :
ఏ కారణము చేతనైనా నిద్ర పట్టకపోవడం , సరిగా నిద్రపట్టకపోవడం ను నిద్రలేమి అంటాము . దీనివలన ఆరోగ్యము చెడిపోతుంది .
నిర్వచనము : నిద్ర రావడం లేదని చెప్పే వారిలో కనిపించే ప్రధాన సమస్య నిద్రలేమి (ఇన్‌సోమ్నియా). దాదాపు 15 నుంచి 30 శాతం మందిలో ఈ సమస్య ఉంటుంది. 'వారానికి కనీసం మూడు రోజులు, కనీసం ఒక నెలపాటు నిద్రపట్టడానికి ఎక్కువ సమయం తీసుకోవడం, మధ్యలో మెలకువ రావడం, రోజూ నిద్రలేవడానికంటే ముందుగా మెలకువరావడం' జరిగితే వాళ్లు నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నట్లు. పడుకున్న తర్వాత 20 నిమిషాల్లో నిద్రపోవడం సాధారణం. కానీ 30 నిమిషాలు గడిచినా నిద్ర రాకుంటే సమస్య ఉన్నట్లు గమనించాలి.
కారణాలు :
దైనందిన జీవితం లో పని వత్తిడి ,
మానషిక వత్తిడి ,
టీవీ చూడడం ,
కంప్యుటర్ పై పనిచేయడం ,
కుటుంబ సమస్యలు ,
ఆర్ధిక సమస్యలు ,
ఆహార నియమాలు ,
చెడ్డ అలవాట్లు ,

నిద్రలేమి నుండి బయటపడడానికి కొన్ని చిట్కాలు :
రాత్రి 9 గంటలు దాటిన తరువాత ఆల్కహాలు తీసుకోడదు . ఆల్కహాలు మధ్యలో నిద్రను చెడగొడుతుంది .
రాత్రి 7 గంటలు తరువాత తీ , కాఫీ , కెఫీన్ ఉన్న పానీయాలు తీసుకోకూడదు ,
రాత్రి చాలా పొద్దుపోయిన తర్వాత ఆహారం కూడదు.
రాత్రులు ఎక్కువగా ఆహారము (full meal) తినకూడదు ,డిన్నర్‌లో తేలిగ్గా జీర్ణమయ్యే ఆహార పదార్థాలను మాత్రమే తీసుకోవాలి.
పడుకునే ముందు వ్యాయామము చేయకూడదు ,
పడక గదిని ... పనిచేసే ఆఫీస్ గది గా మార్చకూడదు ,
పడుకునే ముందు వేడిపాలు తాగితే మంచి నిద్ర వస్తుంది .
నిద్ర రానపుడు ఏదైనా మంచి పుస్తమును చదవాలి ,
నిద్రపోయేముందు వేడినీళ్ళ స్నానము చేస్తే మంచి నిద్ర పడుతుంది ,
సుఖ నిద్ర పోవటానికి ఆహారం, పానీయాలు తోడ్పడతాయి . మంచి ఆహారం, సుఖనిద్ర ఆరోగ్యానికి చాలా అవసరం.

* శరీరంలో షుగర్‌ సమస్థితిలో ఉండేలా చూసుకోవాలి. బ్లడ్‌షుగర్‌ తక్కువగా ఉన్నట్లయితే నిద్రపట్టదు. కలత నిద్ర కలుగుతుంది.
* ఆహారం తీసుకున్న వెంటనే మత్తుగా అనిపించి కునుకు పట్టొచ్చు. ఆహారం తీసుకున్న వెంటనే నిద్రపోవటం ఆరోగ్యకరం కాదు కొంతసేపటికి నిద్రా భంగం కలిగి, తర్వాత నిద్ర పట్టకపోవచ్చు. ఆహారం తీసుకున్నాక కొంత సమయం తర్వాతనే పడకచేరాలి.

* పడక చేరబోయేముందు ఎక్కువ నీరు తాగకూడదు.

* మూత్ర విసర్జన చేసి పడకచేరాలి.

ట్రీట్మెంట్ :
అవసరమైతే డాక్టర్ సలహాపై నిద్రమాత్రలు తీసుకోవాలి .
నిద్రలేమి ... కంటికింద నల్లటి వలయాలు -- ముఖసౌన్దర్యం :


నిద్రలేమి, దిగులు, ఆందోళన... ఇలా కారణమేదైనా కావొచ్చు, దీర్ఘకాలంలో అవి కంటికింద నల్లటి వలయాలను ఏర్పరచడం ద్వారా ముఖసౌందర్యం మీద ప్రభావం చూపిస్తాయి. వాటిని తొలగించుకోవడానికి బోలెడన్ని చిట్కాలు ఉన్నాయి. ఉదాహరణకు బంగాళా దుంపలిో చర్మాన్ని తేటపరిచే(స్కిన్‌ లైటెనింగ్‌) తత్వం ఉంది. అది ఈ సమస్యకు చక్కటి విరుగుడు. బంగాళాదుంప రసాన్ని కంటి కింద రాసి పదినిమిషాల తర్వాత చల్లటి నీటితో కడగాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తుంటే నలుపు క్రమంగా విరుగుతుంది. ఇలాంటి సౌందర్య చిట్కాలతోనే కాదు, ఆహారంలో మార్పులతోనూ ఇదే ఫలితాన్ని పొందొచ్చు. ఉదాహరణకు విటమిన్లలో కె విటమిన్‌కు కూడా ఇదే తత్వం(స్కిన్‌ లైటెనింగ్‌) ఉంది. కంటికింద మచ్చలతో బాధపడేవారు సౌందర్య చిట్కాలను పాటించడంతో పాటు కె విటమిన్‌ అధికంగా లభ్యమయ్యే ఆహారం తీసుకుంటే మెరుగైన ఫలితాలు త్వరగా కనిపిస్తాయి. ఇంతకీ కె విటమిన్‌ి పుష్కలంగా దొరికే ఆహారం ఏంటంటారా, ఇదుగో ఆ జాబితా... క్యాలీఫ్లవర్‌, క్యాబేజీ, బ్రాకోలి, క్యారెట్‌, బీన్స్‌, దోసకాయ, సోయాబీన్స్‌, పచ్చిబఠాణీలు, కాలేయం(బీఫ్‌, పోర్క్‌), చేపనూనె, పెరుగు, పాలు, అన్నిరకాల ఆకుకూరలు(పాలకూరలో అత్యధికం).

నిద్ర వయస్సు ను తెలియనివ్వదు :

వయసుకు తగినట్టుగా శరీరము మారుతుంది . అది సహజము . ఐతే కొందరి ముఖాలు వయసును తెలియనివ్వవు . వారి అసలు వయసుకన్నా ఐదారేళ్ళు చిన్నగా కనిపిస్తారు . వారి యవ్వన రహస్యము వారు క్రమము తప్పక తీసే నిద్రలో ఉంటుంది. నిద్ర వల్ల వచ్చే లాభాలు ఒకటి రెండు కాదు . సుఖనిద్రపోవడం ఒక వరము .
నిద్రలో శరీర లోపాలు సరిదిద్దబడాతాఇ. ఆరోగ్యము కుదుటపడుతుంది . తగినంత నిద్ర , విశ్రాంతి కలవారిలో రక్తపోటు , మధుమేహము అదుపులో ఉంటుంది . రక్తపోటుతో పాటే మిగిలిన అంతర్గత అవయవాల పనితీరు సక్రమముగా ఉంటుంది . సరిగా నిద్రలేనివారి కళ్ళలో వెలుగు ఉండదు . . చర్మము ఆరోగ్యముగా కనిపించదు . ముఖము మీద ముడతలు వస్తాయి. అసలు వయసు కన్నా పదేళ్ళు అదనపు వయసు కనిపిస్తుంది . నిద్ర ఉన్నప్పుడే వయసు ముదిరు నట్లు కనపడకుండా ఉంటుందన్నది తాజా నిర్ధారణ అయిన విషయము .

నిద్ర పట్టేదెట్లా?
పురుషుల కన్నా స్త్రీలకు సగటున 20 నిమిషాల నిద్ర ఎక్కువ అవసరమని బ్రిటన్‌ పరిశోధకుల అధ్యయనంలో తేలింది. మరీ ముఖ్యంగా... తెలివితేటలు, భాషా నైపుణ్యం, జ్ఞాపకశక్తి వంటి కీలకమైన విధులను నిర్వర్తించే సెరిబ్రల్‌ కార్టెక్స్‌ బాగా పనిచేయాలంటే తగినంత నిద్ర తప్పనిసరి అని వారు చెబుతున్నారు. అలా చక్కగా నిద్రపట్టడానికి కొన్ని చిట్కాలు కూడా చెబుతున్నారు వారు...

* రోజూ ఒకే సమయానికి పడుకోవడానికి ప్రయత్నించండి. కొన్నాళ్లకు అది అలవాటైపోయి ఆ సమయానికి నిద్ర వస్తుంది.
* పడుకోవడానికి అరగంట ముందు... పుస్తకం చదువుకోవడం, మంద్రమైన సంగీతం వినడం, గోరువెచ్చటి పాలు తాగడం లాంటి ఏదో ఒక అలవాటు చేసుకోండి. ఆ పని చేయగానే నిద్రపోవాలని మెదడు సంకేతాలు పంపుతుంది.
* పడుకునేటప్పుడు బిగుతు దుస్తులు కాకుండా శరీరానికి సౌకర్యంగా వదులుగా ఉండే కాటన్‌ దుస్తుల్ని ధరిస్తే మంచిది.
* కాఫీ, టీలలో ఉండే కొన్ని పదార్థాలు మెదడును ఉత్తేజితం చేసి నిద్రపట్టనివ్వవు. అంచేత రాత్రి ఎనిమిది దాటాక వాటి జోలికి పోవద్దు.

రాత్రిపూట గాఢనిద్ర తగ్గితే--పురుషులకు గుండె జబ్బులే!

లండన్‌: మహిళలతో పోలిస్తే పురుషులు రాత్రివేళ గాఢ నిద్ర తక్కువగా ఉంటుంది. దీనివల్ల వారిలో అధిక రక్తపోటు, గుండెపోటు వంటి సమస్యలు వస్తాయని హార్వర్డ్‌ విశ్వవిద్యాలయం నిర్వహించిన తాజా అధ్యయనంలో తేలింది. రాత్రి సమయంలో మధ్యమధ్యలో నిద్ర లేవడం పురుషుల్లోనే అధికమని పరిశోధకులు పేర్కొన్నారు. కొన్నిసార్లు తమ సొంత గురకవల్లే నిద్ర లేస్తారని చెప్పారు. ఫలితంగా నిరంతరాయ నిద్ర సమయం తగ్గిపోతుందని వివరించారు. అంతరాయాలులేని నిద్ర తక్కువగా ఉండేవారిలో అధిక రక్తపోటు తలెత్తే ప్రమాదం ఉందని చెప్పారు. ఇదిగుండెపోటు, పక్షవాతానికి దారితీస్తుందని వివరించారు. అధ్యయనంలో భాగంగా 65ఏళ్లు పైబడ్డ 784మంది పురుషుల నిద్ర అలవాట్లను పరిశీలించారు. రాత్రిళ్లు చాలా తక్కువగా గాఢనిద్ర పోయేవారిలో అధిక రక్తపోటు వచ్చే ప్రమాదం 80% ఎక్కువగా ఉన్నట్లు ఇందులో తేలింది.

ఏడు గంటల నిద్ర చాలు : 
ఆరు , ఏడు , ఎనిమిది ... ఎన్ని గంటల నిద్ర అవసరము ? ... అని ప్రశ్నించుకుంటే ఏడు గంటల గాడనిద్ర అని చెప్పుకోవాలి. 7 గంటలకంటే తక్కువ  లేదా ఎక్కువ నిద్ర పోతే గుండే జబ్బులు వచ్చే ఆస్కారము ఎక్కువ అని పరిశోధనలలో గుర్తించారు . ఈ నియమము 20 సంవత్సరాలు దాటినవారికే.

Extra sleep is good,అదనపు నిద్ర మంచిదే!

అతిగా నిద్రపోవటమనేది మంచి అలవాటేమీ కాదు. కానీ తక్కువ సమయం నిద్రపోయేవారు అదనంగా రెండు గంటల సేపు ఎక్కువగా నిద్రపోవటం మంచిదేనని పరిశోధకులు చెబుతున్నారు. దీంతో చురుకుదనం మాత్రమే కాదు.. నొప్పిని తట్టుకునే సామర్థ్యమూ పెరుగుతున్నట్టు తాజా అధ్యయనంలో బయటపడింది. తగినంత నిద్రపోనివారు మరింత ఎక్కువసేపు నిద్రపోతే నొప్పి తీవ్రత తగ్గటానికి దోహదం చేస్తోందని అమెరికాలోని హెన్రీఫోర్డ్‌ ఆసుపత్రికి చెందిన థామస్‌ రోథ్‌ పేర్కొంటున్నారు. దీర్ఘకాల వెన్నునొప్పి వంటి అన్నిరకాల నొప్పులపైనా దీని ప్రభావం కనబడుతుండటం గమనార్హం. ఒకవేళ ఇప్పటికే 8 గంటల సేపు నిద్రపోతుంటే మాత్రం మరింత నిద్ర అవసరం లేదని గుర్తించాలని వివరిస్తున్నారు. ఇంతకీ నొప్పికి, నిద్రలేమికి సంబంధం ఏంటి? ఈ రెండూ శరీరంలో వాపు సంకేతాల స్థాయులను పెంచుతాయని.. అందువల్ల మరింత ఎక్కువ నిద్రపోవటం వాపు తగ్గేందుకు దోహదం చేస్తుండొచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. ------ source : Medicine update (magazine).

జ్ఞాపకశక్తికి నిద్రే మందు!
ఎంత చదివినా గుర్తుండటం లేదా? అయితే రాత్రిపూట కంటినిండా నిద్రపోండి. ఎందుకంటే రోజంతా మనం నేర్చుకున్న విషయాలను, ఎదురైన సంఘటనలను బలమైన జ్ఞాపకాలుగా పదిల పరచుకోవటానికి నిద్ర ఎంతగానో తోడ్పడుతుంది. గత జ్ఞాపకాలతో కొత్తవాటిని కలపటానికీ, సృజనాత్మక ఆలోచనలు పుట్టుకురావటానికీ దోహదం చేస్తుంది. ఇంతకీ నిద్రపోతున్నప్పుడు మన మెదడులోని జ్ఞాపకాలు ఎలా స్థిరపడతాయి? నిద్ర సరిగా లేకపోతే నేర్చుకునే, గుర్తుంచుకునే సామర్థ్యం ఎందుకు తగ్గుతుంది? వీటిని పసిగట్టేందుకే నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్స్‌ ఆఫ్‌ హెల్త్‌ ఆధ్వర్యంలో శాస్త్రవేత్తలు ఇటీవల అధ్యయనం చేశారు. విద్యార్థుల్లో జ్ఞాపకశక్తి సామర్థ్యాన్ని పెంచటానికి, వృద్ధుల్లో మతిమరుపును తగ్గించటానికి కొత్త పద్ధతులను రూపొందించటంలో ఈ అధ్యయన ఫలితాలు ఉపయోగపడగలవని భావిస్తున్నారు.

మనం నిద్రపోతున్నప్పుడు తేలికైన నిద్ర, గాఢనిద్ర, కంటి కదలికలు వేగంగా ఉండే (రెమ్‌) నిద్ర వంటి దశలుంటాయి. సాధారణంగా రెమ్‌ దశలోనే కలలు వస్తుంటాయి. ఈ దశలన్నీ క్రమంగా ప్రతి 90 నిమిషాలకు ఒకసారి తిరిగి ఏర్పడుతుంటాయి. విషయాలను నేర్చుకోవటంలో రెమ్‌ దశ చాలా కీలకపాత్ర పోసిస్తుంది. ఒకవేళ నిద్ర సరిగా పట్టకపోతే నేర్చుకునే సామర్థ్యమూ 40% వరకు పడిపోతుంది. కొత్త జ్ఞాపకాలు స్థిరపడేందుకు తోడ్పడే మెదడులోని హిప్పోక్యాంపస్‌ భాగంపై నిద్రలేమి తీవ్ర ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. మనం మెలకువగా ఉన్నప్పుడు ఆయా సంఘటనల వారీగా మెదడులో కొత్త జ్ఞాపకాలు పోగుపడుతుంటాయి. వీటిలో చాలావరకు మరచిపోతుంటాం కూడా. జ్ఞాపకాలు తొలిసారి ఏర్పడినప్పుడు అంత బలంగా ఉండవు. చాలా అపక్వంగా, సున్నితంగా ఉంటాయి. కానీ నిద్ర పోయినప్పుడు వాటిని నెమరువేసుకోవటానికి మెదడుకు తగినంత సమయం దొరుకుతుంది. ఏయే సంఘటనలను గుర్తుంచుకోవాలో, వేటిని వదిలించుకోవాలో కూడా నిర్ణయించుకుంటుంది. రాత్రిపూట నిద్రపోయినప్పుడు జ్ఞాపకాలు బలోపేతమవుతాయని హార్వర్డ్‌ మెడికల్‌ స్కూల్‌కు చెందిన డాక్టర్‌ రాబర్ట్‌ స్టిక్‌గోల్డ్‌ చెబుతున్నారు. పియానోపై మంచి గేయాన్ని వాయించటం వంటి కొన్ని పనులకు సంబంధించిన జ్ఞాపకాలు నిద్రపోతున్నప్పుడు మెరుగుపడుతున్నట్టు పరిశోధనలో తేలింది. గాఢనిద్ర దశలో జ్ఞాపకాలు మరింత స్థిరంగా కొనసాగుతాయి. రెమ్‌ దశలోనేమో ఈ జ్ఞాపకాల్లో ఒకదాంతో మరోదానికి సంబంధం గల వాటి మధ్య బంధాలు ఏర్పడతాయి. భావోద్వేగ జ్ఞాపకాల విశ్లేషణకూ రెమ్‌ దశ తోడ్పడుతుంది. దీంతో భావోద్వేగాల తీవ్రతా తగ్గుతుంది.

నిజానికి వయసు మీద పడుతున్నకొద్దీ నిద్రా పద్ధతులు కూడా మారుతుంటాయి. దురదృష్టవశాత్తు 30 ల చివర్లో బలమైన జ్ఞాపకాలకు తోడ్పడే నిద్ర తగ్గిపోవటం మొదలవుతుంది. 18-25 ఏళ్ల వారితో పోలిస్తే 60 ఏళ్లు పైబడినవారిలో గాఢనిద్ర 70% వరకు తగ్గిపోతున్నట్టు తాజా అధ్యయనంలో బయటపడింది. ముందురోజు జరిగిన సంఘటనలను గుర్తుకు తెచ్చుకోవటంలో వృద్ధులు చాలా ఇబ్బంది పడుతుంటారని, ఇందుకు గాఢ నిద్ర తగ్గిపోవటంతో సంబంధం ఉంటోందని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్‌ మాథ్యూ వాకర్‌ పేర్కొంటున్నారు. అందువల్ల వృద్ధుల్లో గాఢనిద్రను పెంచటానికి తోడ్పడే పద్ధతుల మీద పరిశోధకులు ఇప్పుడు దృష్టి సారించారు. వృద్ధాప్యంలో జ్ఞాపకశక్తిని పెంపొందించే చికిత్సలు అంతగా అందుబాటులో లేవు. ఈ నేపథ్యంలో నిద్ర సరిగా పట్టే చికిత్సలు రూపొందిస్తే గణనీయమైన ఫలితాలు కనబడతాయని వాకర్‌ చెబుతున్నారు. యువకులు కూడా ముఖ్యంగా విద్యార్థులు.. చదువుకున్న తర్వాత రాత్రిపూట నిద్రపోతే మంచి ఫలితాలు ఉంటాయని, ఆయా విషయాలు బాగా గుర్తుండటానికిది తోడ్పడుతుందని స్టిక్‌గోల్డ్‌ సూచిస్తున్నారు.

చక్కటి నిద్ర సప్త మార్గాలు!

సంపూర్ణ ఆరోగ్యానికి నిద్ర చాలా కీలకం. నిద్రలో శరీరం తిరిగి శక్తిని కూడగట్టుకుంటుంది. దీంతో కొత్త ఉత్సాహం వస్తుంది. నిద్ర సరిగా పట్టకపోతే అలసట, నిస్సత్తువే కాదు.. ఏకాగ్రత కూడా లోపిస్తుంది. ఫలితంగా పని మీద శ్రద్ధ తగ్గిపోతుంది. కానీ ప్రస్తుతం చాలామందికి నిద్ర బంగారమైపోతోంది. పడక మీదికి చేరుకుని గంటలు గడిచినా నిద్రపట్టక సతమతమయ్యేవారు ఎందరో. పని ఒత్తిడి, కుటుంబ బాధ్యతలు, సంబంధ బాంధవ్యాలు, జబ్బులు.. ఇలా చాలా అంశాలు నిద్రను దెబ్బతీయొచ్చు. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే నిద్ర సరిగా పట్టేలా చూసుకోవచ్చు.

* వేళకు పడక: రోజూ ఒకే సమయానికి పడుకోవటం, నిద్రపోవటం అలవాటు చేసుకోవాలి. సెలవురోజుల్లోనూ దీన్ని మానరాదు. దీంతో శరీరంలోని నిద్ర, మెలకువ చక్రం సర్దుకుని రాత్రిపూట నిద్ర బాగా పట్టేలా చేస్తుంది. పడక మీదికి చేరుకున్నాక 15 నిమిషాలైనా నిద్రపట్టకపోతే వెంటనే లేచి, పుస్తకం చదవటం వంటివి చేయాలి. అలసట అనిపించినపుడు పడక మీదికి చేరుకోవాలి.

* తిండిపై కన్ను: కడుపు నిండుగా తిన్నవెంటనే గానీ ఆకలిగా ఉన్నప్పుడు గానీ మంచం ఎక్కొద్దు. ఇవి నిద్రను దెబ్బతీస్తాయి. ఇక ద్రవాలను ఎక్కువగా తీసుకుంటే మధ్యలో లేవాల్సి రావొచ్చు. అలాగే నిద్రపోవటానికి ముందు సిగరెట్లు, కాఫీల జోలికి అసలే వెళ్లరాదు. వీటిల్లోని నికొటిన్‌, కెఫీన్‌ చాలాసేపు మెలకువ ఉండేలా చేస్తాయి. మద్యం తాగితే మొదట్లో నిద్రమత్తు ముంచుకొస్తుంది గానీ మధ్యలో చాలాసార్లు మెలకువ వచ్చేలా చేస్తుంది.

* సన్నద్ధ అలవాట్లు: రోజూ పడక మీదికి చేరటానికి ముందు ఒకేకరకమైన పనులు.. అంటే స్నానం చేయటం, పుస్తకం చదవటం, సంగీతం వినటం వంటివి.. చేస్తే శరీరం నిద్రకు సన్నద్ధమయ్యేలా తయారవుతుంది. కానీ టీవీ, కంప్యూటర్ల వంటి వాటికి దూరంగా ఉండటం మేలు.

* మంచి గది: పడకగది చల్లగా, ప్రశాంతంగా ఉండేలా చూసుకోవాలి. ఎక్కువ వెలుగునిచ్చే లైట్లు ఆర్పేయాలి. అలాగే మంచం, పరుపు వంటివి సౌకర్యవంతంగా ఉండేవి ఎంచుకోవాలి. పిల్లలు, పెంపుడు జంతువులు నిద్ర మధ్యలో లేపకుండా చూసుకోవాలి.

* పగటినిద్ర వద్దు: పగటిపూట ఎక్కువసేపు నిద్రపోతే రాత్రుళ్లు నిద్రపట్టటం కష్టం. ఒకవేళ పగటిపూట కునుకుతీయాలనుకుంటే 10-30 నిమిషాల కన్నా ఎక్కువసేపు పడుకోకూడదు. అయితే రాత్రి షిఫ్టుల్లో పనిచేసేవారు పగటిపూట తగినంత సేపు నిద్రపోయేలా చూసుకోవాలి. ఇలాంటివారు బయటి నుంచి ఎండ లోపలికి పడకుండా కిటికీలకు పరదాలు వేసుకోవాలి.

* వ్యాయామం: రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే త్వరగా నిద్రపట్టటానికే కాదు.. గాఢ నిద్రకూ దోహదం చేస్తుంది. అయితే కాసేపట్లో నిద్రపోతామనగా వ్యాయామం చేయరాదు. ఉదయం పూట వ్యాయామం చేయటం ఉత్తమం.

* ఒత్తిడికి దూరం: పని ఒత్తిడితో పాటు మానసిక ఒత్తిడీ నిద్రకు భంగం కలిగిస్తుంది. అందువల్ల ఒత్తిడిని తగ్గించుకునే మార్గాలపై దృష్టి సారించటం మంచిది. చేయాల్సిన పనులను వర్గీకరించుకోవటం, ప్రాధామ్యాలను గుర్తించటం, లక్ష్యాలను నిర్దేశించుకోవటం వంటివి ప్రశాంతతకు బీజం వేస్తాయి. అవసరమైనప్పుడు తమకు తాముగానే పని నుంచి విశ్రాంతి తీసుకోవటం, స్నేహితులతో సరదాగా గడపటం వంటివి మేలు చేస్తాయి.

స్త్రీ-పురుషుల నిద్ర వేరువేరుగా ఉంటుందా?
నిద్ర.. స్త్రీ పురుషులకి సమానమేనా? ఇంత వరకూ అలాగే భావిస్తూ వచ్చారు శాస్త్రవేత్తలు! అయితే నిద్ర పద్ధతీ, మోతాదూ, గాఢత వంటివన్నీ స్త్రీ పురుషులకి వేర్వేరని చెబుతోంది తాజా అధ్యయనం ఒకటి. అమెరికాకి చెందిన ప్రవాసాంధ్ర శాస్త్రవేత్త మోనికా మల్లంపల్లి నేతృత్వంలోని సొసైటీ ఫర్‌ విమెన్‌ హెల్త్‌ రీసెర్చ్‌ (ఎస్‌డబ్ల్యూహెచ్‌ఆర్‌) ఈ పరిశోధన నిర్వహించింది. మగవారికంటే మహిళల్లో నిద్రలేమి సమస్య ఎక్కువగా ఉందని ఇందులో తేల్చారు. పురుషుల కంటే స్త్రీలు నిద్రలోకి జారుకోవడానికీ ఎక్కువ సమయం పడుతోందని కనిపెట్టారు. పగటివేళ మగతగా ఉందనే ఫిర్యాదూ ఎక్కువగా మన నుంచే ఎదురవుతోందట. వీటన్నింటికీ మహిళల్లోని ప్రత్యేక హార్మోన్ల ప్రభావమే కారణమని చెబుతున్నారు. నెలసరికి ముందూ, నెలసరప్పుడూ స్త్రీలు ఎక్కువగా నిద్రలేమి సమస్య ఎదుర్కొంటున్నారట. పెళ్లయ్యాక గర్భం, కాన్పు తర్వాత శరీరంలో ఏర్పడే పరిణామాలూ, వీటికి తోడు ఇల్లూ, ఉద్యోగ బాధ్యతలూ... ఇవన్నీ స్త్రీల గాఢమైన నిద్ర వేళల్ని హరిస్తున్నాయని పరిశోధన తేల్చింది. పురుషులకు ఇటువంటి సమస్యలు ఎప్పుడో కానీ ఉండవనీ అంటోంది. 'నిద్ర విషయంలో స్త్రీలకు ఇన్ని సమస్యలున్నా, ఇంతవరకూ దానిపై ప్రత్యేకంగా ఆశించినంతగా ఎవరూ దృష్టిపెట్టడంలేదు. నిద్రలేమి పరీక్షలన్నీ కూడా పురుషుల నిద్ర తీరుల్ని దృష్టిలో పెట్టుకునే రూపొందించారు' అంటున్నారు 
ధన్యవాదములు 
మీ నవీన్ నడిమింటి 
విశాఖపట్నం 
9703706660
*సభ్యులకు సూచన*
*************
సమయాభావం వలన వ్యక్తిగతంగా సమాధానాలు ఎవరికీ ఇవ్వడం సాధ్యపడదు. మీ సమస్యకు సరిపడా పరిష్కారాలకొరకు, మీ అవగాహనకొరకు మేము పెడుతున్న సంబంధిత సమాచారంతో కూడిన సవివరమైన పోస్టులు చదవవలసినదిగా ప్రార్థన..

.