అటోపిక్ చర్మవ్యాధినే తామర అని కూడా పిలుస్తారు. అటోపిక్ చర్మశోథ అని కూడా వ్యవహరించడం వాడుకలో ఉంది. దురద మరియు పొలుసులు దేలిన చర్మం లక్షణాలతో కూడిన ఒక సాధారణ చర్మ పరిస్థితి ఈ జబ్బు. ఇది పెద్దలలో కంటే పిల్లలలోనే చాలా సాధారణం. అంతే కాదు ఈ చర్మ జబ్బు పునరావృత ధోరణిని కలిగి ఉంటుంది. శిశువుకు మొదటి 6 నెలల వయసులోనే ఈ అటోపిక్ చర్మవ్యాధి దాపురించే అవకాశం ఉంది.
దీని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
- తామర వ్యాధి యొక్క వైద్య-పర లక్షణాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారుతూ ఉంటాయి. కానీ సాధారణంగా విపరీతమైన దురదతో కూడి, పొడిబారి, ఎర్రగా మారిన చర్మం దీని లక్షణంగా ఉంటుంది.
- ఎక్కువగా గోకడంతో (గీరడంతో) చర్మంపై మంట పుడుతుంది, రక్తస్రావం కూడా అవుతుంది.
- తరచుగా ఈ జబ్బు పరిస్థితి చీము నిండిన పొక్కులు, సంక్రమణకు సూచనగా ఉంటుంది. ఇది సోకినట్లయితే, శరీరంలోని ఇతర భాగాలకు వ్యాప్తి చెందుతుంది.
- దీని ఇతర లక్షణాలు ద్రవంతో కూడిన దద్దుర్లు, నలుపుదేలిన మరియు ముడతలు పడ్డ చర్మం. కళ్ళు మరియు పెదాల చుట్టూ ఉన్న ప్రాంతం ఈ స్థితిలో ముదురు నలుపు రంగులోకి మారుతుంది.
- దురద రాత్రిసమయాల్లో గరిష్టంగా ఉంటుంది మరియు ఇది నిద్రకు ఆటంకం కల్గిస్తుంది.
- తామర అనేది ఆస్తమా, తృణగంధజన్య జ్వరము లేదా గవత జ్వరం లేదా ఇతర అలెర్జీలతో కూడిన దీర్ఘకాలిక పరిస్థితి.
దీని ప్రధాన కారణాలు ఏమిటి?
- ఏ ఒక్క కారణం లేనప్పటికీ, తామరని ప్రేరేపించే ప్రమాద కారకాలు ఉన్నాయి.
- అదే కుటుంబం యొక్క అనేక మంది సభ్యులు ఇదే జబ్బుతో బాధపడుతున్న వారితో జన్యుపరమైన కారణం ఉందని పరిశోధకులు కూడా విశ్వసిస్తున్నారు.
- అధిక కాలుష్యంతో కూడిన వాతావరణంలో నివసిస్తున్నప్పుడు, లేదా చాలా పొడి మరియు చల్లని పరిస్థితులు కూడా ఈ పరిస్థితికి అనువుగా ఉంటాయి.
- ఆహార అలెర్జీలు, పుప్పొడి, ఉన్ని బట్టలు, దుమ్ము, చర్మ ఉత్పత్తులు మరియు పొగాకు పొగ వంటి ఇతర కారణాలు తామరని ప్రేరేపించగలవు.
అటోపిక్ చర్మవ్యాధిని ఎలా నిర్ధారణ చేసేది మరియు దీనికి చికిత్స ఏమిటి?
- చర్మవ్యాధి నిపుణుడు తామరవ్యాధి దృష్టితోనే వైద్య పరీక్ష చేస్తాడు. ఎరుపుదేలి, పొడిగా ఉండి మరియు దురద కల్గిన చర్మం అటోపిక్ చర్మవ్యాధి పరిస్థితికి సూచన.
- ఈ జబ్బు చర్మంపైన్నే కన్పించేదవటంవల్ల వైద్యులకు స్పష్టమైన అవగాహనను కల్గిస్తుంది. కనుక, రక్త పరీక్ష లేదా ఇమేజింగ్ అవసరం లేదు.
- మీకు లేదా మీ బిడ్డకు నిరంతరంగా వచ్చే జ్వరం లేదా ఇతర వ్యాధి లక్షణాలను కలిగి ఉంటే, మీ వైద్యుడు ప్రాథమిక రక్త పరీక్షను సలహా ఇస్తారు.
- జబ్బు పూర్తిగా తొలగించబడకపోయినట్లైతే, యాంటీ హిస్టామిన్లు, యాంటిబయోటిక్స్ మరియు స్టెరాయిడ్ క్రీమ్లు వంటి మందులు ఉపశమనం కోసం ఉపయోగించవచ్చు.
- జబ్బు పునరావృతమయ్యే పరిస్థితిని నివారించడానికి ఇతర మార్గాలు ఏవంటే జబ్బు కారణాల్ని గుర్తించడం మరియు తొలగించడం, కఠినమైన సబ్బులు లేదా చర్మ ఉత్పత్తుల వాడకంలో జాగ్రత్తగుండడం మరియు అన్ని సమయాల్లో మంచి పరిశుభ్రతను నిర్వహించుకోవడం.
- స్నానం తర్వాత మీ పిల్లల చర్మాన్ని పొడిగా ఉంచండి మరియు రోజుకు కనీసం రెండు సార్లు తేమ చేయం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి