ఆయుర్వేద మందులను వాడితే ఇమ్యూనిటీ ఇంతలా పెరుగుతుందా..?
వైరస్‌లు రూపం మార్చుకుంటూ పంజా విసురుతోన్న నేపథ్యంలో అందరి చూపు రోగనిరోధక శక్తి వైపు మళ్లుతోంది. ఆరోగ్యంగా ఉండడం కోసం ప్రతీ ఒక్కరు మంచి ఫుడ్ ను తీసుకోవడాని ఎక్కువగా ప్రాధాన్యతనిస్తున్నారు. ఏదైనా చిన్న జ్వరం లాంటిది వచ్చినా యాంటీబయోటిక్స్ ను వాడి తాత్కాలిక ఉపషమనం పొందుతున్నారు. కానీ కొన్ని ఆయుర్వేద మందులతో ఎలాంటి ఆరోగ్య సమస్యలనైనా క్షణాల్లో నయం చేసుకోవచ్చు. ఆయుర్వేద మందులు చాలా పురాతన కాలం నుంచి మన దేశంలో వాడుతూ ఉంన్నాం. అయితే, ఆయుర్వేదం మందులతో శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
రోగనిరోధక శక్తి మన శరీరంలో సహజంగా ఏర్పడాలంటే మనం నిత్యం కొన్ని ఆయుర్వేదం మందులను వాడడం ద్వారా ఇమ్యునిటీని పెంచుకోవచ్చు. ఆయుర్వేద మందులను వాడండం ద్వారా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. విటమిన్ల గురించి తెలియని రోజుల్లో మన పూర్వికులు.. ఆయుర్వేదంలోని కొన్ని మందులను వాడి ఆరోగ్యంగా ఉండే వారు.
తిప్పతీగలో ఔషద గుణాలు : తిప్పతీగ దీన్నే(గిలోయి లేదా గుడూచీ) అంటారు. అప్పటి కాలం వారికి తిప్పతీగ బాగా పరిచయం ఉంటుంది. తిప్పతీగను మన పూర్వికులు ‘అమృతంగా భావించేవారు. తిప్పతీగ వేరును కట్ చేసినా.. మళ్లీ పెరిగుతుంది. జ్వరం వచ్చినప్పుడు ఇంగ్లీష్ మందులకు బదులు తిప్పతీగ కషాయాన్ని తాగించేవారు. ఇది శరీరంలోని వేడిని తగ్గిస్తుంది. దీన్ని రెగ్యులర్‌గా తీసుకోవచ్చు. పౌడర్, ట్యాబ్లెట్స్ రూపంలో కూడా ఇది దొరుకుతుంది. ప్రభుత్వం ఆమోదించిన ఆయుర్వేద ఔషదాల్లో కూడా ఇది ప్రమఖమైంది. తిప్పతీగ ఎలాంటి ప్రమాదకరమైన వైరస్లనుండైనా రక్షణ కల్పిస్తుంది.
డ్రాగన్ దేశం కూడా ఆయుర్వేదం వైపే : తిప్పతీగ (గిలోయి లేదా గుడూచీ)తోపాటు అశ్వగంధ, అతి మధురం, నేల వేము వంటివి కూడా రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అతి మధుర మాత్రలు, ఫౌడర్ రూపంలో కూడా దొరుకుతుంది. ‘అతి మధురం’ తీసుకోవడం ద్వారా ఊపిరితీత్తుల్లోని కఫాన్ని తొలగిస్తుంది. కాబట్టి దీన్ని రోజుకో మాత్ర చొప్పున వేసుకోవచ్చు.
వంటింటి ఔషదాలు : మూలికలే కాకుండా మన వంటింట్లో ఉండే ఔషదాలైన దాల్చిన చెక్క, మిరియాలు, సొంఠిని తీసుకోవచ్చు. వీటిలో వేడి చేసే గుణం ఎక్కువగా ఉంటుంది. యాంటీ ప్రాపర్టీస్ కలిగిన ఈ కషాయంతో అనారోగ్య సమస్యల బారీన పడకుండా ఉంటాం. ఒక టేబుల్ స్పూన్ కషాయంలో 200 ఎంఎల్ నీరు కలిపి.. బాగా మరిగించిన తర్వాత ఉదయం, సాయంత్రం త్రాగినట్లయితే ఇమ్యునిటీని పెంచుకోవచ్చు.
చేదుతోనే మేలు : మెడిసిన్స్ లో చేదుగా ఉండే దాతువులనే ఔషదాలుగా వాడేవారు. అశ్వగంధ, తిప్పతీగ, అతి మధురం, నేల వేము ఔషదాలు చాలా చేదుగా ఉంటాయి. అలాగే ఉసిరి, గుంటగలగరాకులు కూడా చేదుగానే ఉంటాయి. చేదును ‘జ్వరహరం’గా భావిస్తారు. అంటే.. చేదుగా ఉండేవి జ్వరాన్ని త్వరగా తగ్గించి ఆరోగ్యాన్ని ఇస్తాయి. వీటిని నాలుక మీద పెట్టుకోగానే శరీరంలోని ప్రతి భాగానికి వ్యాపిస్తుంది.
మలేరియా మందుతో : కరోనా ప్రారంభంలో కరోనా నివారణలో భాగంగా “అలోపతి” మలేరియా మందులు వాడారు. వీటిని యాంటీ వైరల్ మందులుగా కూడా వాడేవారు. చేదుగా ఉండే ఔషదాలను వాడితే ఇమ్యూనిటిని పెంచుకోవచ్చు.
సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు : ఆయుర్వేద మందులతో, మూలికలతో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మనం చెప్పుకునే ప్రతి చేదు ఔషదం ఇమ్యునిటీని పెంచేవే. చేదు యాంటీ వైరల్, యాంటీమైక్రోబయల్‌గా పనిచేసి లివర్‌ను పనితీరును మెరుగు పరుస్తోంది. లివర్ ను యాక్టీవ్ చేస్తుంది.
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి