25, అక్టోబర్ 2021, సోమవారం

వెరికో సెల్ సమస్య ఉన్న వాళ్ళు వీర్యం కణాలు సమస్య పరిష్కారం మార్గం అవగాహనా కోసం లింక్స్ లో చూడాలి

 Causes for low sperm count in Vericocele

వెరికోసీల్ ఉన్నవారిలో వీర్యకణాల సంఖ్య తగ్గటానికి కారణాలు: బీజాలకి క్రెమోస్టర్, డార్టస్ అనే కండరాలు సపోర్టు ఇస్తాయి. క్రెమోస్టర్ భయం లేదా దెబ్బ తగులుతుందని అనుకున్నప్పుడు బీజాల్ని పైకి లాగుతుంది. డార్టన్ కండరం బీజం బరువు మోసి ఉష్ణోగ్రతలో మార్పులకనుగుణంగా పనిచేస్తుంది. వీర్యకణాల ఉత్పత్తికి బీజాలకు శరీర ఉష్ణోగ్రత కన్నా తక్కువ ఉష్ణోగ్రత ఉండడం అవసరం. అలాగే అతితక్కువ ఉష్ణోగ్రత కూడా ఉండకూడదు. చలికాలంలో పొట్టకు దగ్గరగా తీసుకువెళ్ళడం, వేడిగా ఉన్నప్పుడు కిందికి జార్చడం ద్వారా బీజాలలో తగిన ఉష్ణోగ్రత ఉండేటట్లు డార్టస్ కండరం చేస్తుంది. వెరికోసీల్ లో ఈ ఉష్ణోగ్రతలలో భేదం 0.1 డిగ్రీల సెంటీగ్రేడుకు తగ్గి వీర్యకణాల ఉత్పత్తిలో బాధ కలుగుతుంది.

ఉష్ణోగ్రతలో మార్పు కాకుండా మూత్రపిండాలు, ఎడ్రినల్ గ్రంధులనుంచి వచ్చే పదార్ధాలు, ఆక్సిజన్ తక్కువవడం లాంటివి కూడా తోడ్పడతాయి. కనుక పిల్లలు పుట్టకపోవడానికి వెరికోసీల్ లో కూడా కారణాలనేకం ఉంటాయి. వెరికోసీల్ ఉండి పొగ త్రాగేవారిలో ఇంకా ఎక్కువ హాని ఉంటుంది. ప్రయోగశాలలో జంతువులలో వెరికోసీల్ కలిగించినప్పుడు బీజాలకి రక్తప్రసారం పెరిగి, వాటిలో ఉష్ణోగ్రత పెరిగి, ఫలితంగా వీర్యకణాల ఉత్పత్తిలో బాధ కలగడం చూశారు. ఈ జంతువులలో వెరికోసీల్ చికిత్స చేసినప్పుడు రక్తప్రసారం, ఉష్ణోగ్రతలు మామూలుగా అవ్వడం చూశారు. ఆపరేషన్ తర్వాత 70శాతం మందిలో వీర్య కణాలలో మార్పు వస్తుంది. 40-50 శాతం మందిలో పిల్లలు కలుగుతారు. మొటిలిటీలో మార్పు 70శాతం మందిలో, నిర్మాణంలో మార్పులు 40 శాతం మందిలో కలుగుతాయి. గజ్జలపైన, పొత్తికడుపులో ఉన్న టెస్టిక్యులర్ వీన్ వద్ద ఆపరేషన్ చేస్తారు. ఈ ఆపరేషన్ ఫలితంగా బీజాలలో చల్లదనం కలిగి 70-80శాతం మందిలో వీర్యకణాల సంఖ్య మామూలు దశకు వచ్చి పిల్లలు కలుగుతారు. వెరికోసిల్ ఉన్న అందరిలోనూ పిల్లలు లేకపోవడం అన్నది ఉండదు కనుక ఎవరిలో సమస్య ఉంటుంది అన్నది పరీక్షించి చికిత్స వెంటనే చేయించాలి. వెరికోసీల్ తర్వాత ఆయుర్వేద మందులు వాడినవారిలో వీర్యకణాల సంఖ్య, కదలికలు, ప్రాకృత కణాల సంఖ్య పెరగడం గమనిస్తున్నాము.

వరిబీజం (HYDROCELE): బీజాలకి వచ్చే సమస్యల్లో ముఖ్యమైంది వరిబీజం. బుడ్డ అని సాధారణ భాషలోనూ హైడ్రోసీల్ అని వైద్యభాషలోనూ దీన్ని పిలుస్తారు. బీజాలుండే బీజాకోశాన్ని స్క్రోటమ్ అంటారు. సంచిలాగా ఉండే స్క్రోటమ్ (బీజకోశం) బీజాల్ని రక్షిస్తూ ఉంటుంది. ఈ బీజకోశంలో అనేక పొరలు సాగేవి, మాంసయుక్తమైనవి పై చర్మం కింద ఉంటాయి. బీజాలపై పొర, బీజకోశం లోపలికి పొర దగ్గర దగ్గరగా ఉంటాయి. ఈ రెండింటి మధ్య ఖాళీ కొద్దిగా ఉంటుంది. కొందరిలో ఈ ఖాళీ ఎక్కువగా ఉండి, ఆ ఖాళీలో ద్రవం ఎక్కువగా చేరుతుంది. దీన్నే వరిబీజం అంటారు. ద్రవం ఉత్పత్తి ఎక్కువైనా, ద్రవశోషణ యంత్రాంగం దెబ్బతిన్నా వరిబీజం ఏర్పడుతుంది. ద్రవశోషణ యంత్రాంగం దెబ్బతినడం ముఖ్యమైనది. దీనికి కారణం ఇదమిద్దంగా చెప్పలేకపోయినా ఇన్ ఫెక్షన్ వలన అక్కడి గోడలు దెబ్బతిని ద్రవాన్ని పీల్చుకోలేకపోవడం వలన వరిబీజం ఏర్పడవచ్చు. వరిబీజంలో ఉండే ద్రవం అంబర్ వర్ణంలో ఉంటుంది. ఈ ద్రవం బయటకు వచ్చాక గడ్డ కట్టదు. కానీ ఈ ద్రవంలో కొద్ది చుక్కలు రక్తం కలిపినా మొత్తం ద్రవం గడ్డ కడుతుంది.

వరిబీజం అన్ని వయసుల వారిలోనూ వస్తుంది. వాపు ఒక్కటే ఉంటుంది కనుక సాధారణంగా బాగా పెద్దదయ్యేవరకు నిర్లక్ష్యం చేస్తారు. సుమారు 5 శాతం మందిలో వరిబీజంతోపాటు హెర్నియా కూడా ఉంటుంది. కొందరిలో పుట్టుకతోనే ఇది ఏర్పడుతుంది. బీజకోశం లోపలి భాగానికి ఉదరంతో సంబంధమేర్పడి నిల్చున్నప్పుడు ద్రవం బీజకోశంలోకి వస్తుంది. పడుకున్నప్పుడు మళ్ళీ పొట్టలోకి ద్రవం వెళ్ళిపోతుంది. వరిబీజానికి గట్టి దెబ్బ తగిలితే ఆ ద్రవంలోకి రక్తం చేరి అది హెమటోసిల్ గా మారవచ్చు. బోదకాలు కలిగించే క్రిమివలన కూడా వరిబీజం వస్తుంది. చాలామందిలో బోదకాలు ఉండదు కానీ ఆ క్రిమివలన ఎపిడిడమైటిస్ కలిగి వరిబీజం కలుగుతుంది. వరిబీజంలోకి గొట్టాన్ని గుచ్చి ద్రవం బయటకు తీస్తారు. దీన్ని ట్యాపింగ్ అంటారు. కానీ మళ్ళీ కోశంలోకి ద్రవం వచ్చి చేరుతుంది. ట్యాపింగ్ అయిన తరువాత బీజాల్ని తప్పనిసరిగా పరీక్షించాలి. సరిఅయిన జాగ్రత్తతో చెయ్యకపోతే ఇన్ ఫెక్షన్ కలిగి ఏ ఉపద్రవమైనా కలగవచ్చు. వరిబీజం మందులతో తగ్గదు. దీనికి ఉత్తమ చికిత్స ఆపరేషన్. ఆపరేషన్ తరువాత మళ్ళీ ద్రవం చేరదు. వరిబీజం వలన సెక్స్ సమస్యలుగానీ, పిల్లలు పుట్టడంలో అభ్యంతరంగానీ కలగవు. కాకపోతే మరీ పెద్దదైతే సెక్స్ జరపడంలో ఇబ్బంది కలగవచ్చు. వరిబీజం ఉన్నవాళ్ళు అనవసర ఆందోళన పడకుండా సర్జన్ ని సంప్రదించి ఆపరేషన్ చేయించుకుంటే మంచిది. ఆపరేషన్ తేలికై

కామెంట్‌లు లేవు: