24, డిసెంబర్ 2019, మంగళవారం

మధుమేహం ఉన్న వాళ్లకి అవగాహనా కోసం

నవీన్ రోయ్ నడిమింటి 

మధుమేహం గురించి యక్ష ప్రశ్నలు 001


1.1
ప్ర: ఒకవేళ నాకు మధుమేహం ఉంటే నేను ఎలా తెలుసుకోగలను?

జ: మీకు మధుమేహం ఉందా అని చూడటానికి మీ డాక్టర్ రక్త మరియు మూత్ర పరీక్షలు చేయవచ్చు
. రెండు రక్త పరీక్షలు
మీ ఉపవాస రక్తంలోని చక్కెర స్థాయి (మీరు ఏదైనా తినడానికి ముందు రక్తంలోని చక్కెర) 126 mg / dl లేదా ఎక్కువగా ఉంది
భోజనం తర్వాత రక్తంలోని చక్కెర స్థాయి 200 mg / dl లేదా ఎక్కువగా ఉంది అని చూపించినప్పుడు ప్రామాణిక మధుమేహ రోగనిర్ధారణ చేయబడుతుంది.
ఏ సమయంలోనైనా చేసే రక్త పరీక్షనిరాండమ్ బ్లడ్ గ్లూకోజ్ పరీక్ష అంటారు. ఈ విలువ 200 మి.గ్రా ల కంటే ఎక్కువ వుంటే డయాబెటిస్ వున్నట్లే.
ఓరల్ గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ అంటే 75 గ్రాములు గ్లూకోజ్ కలుపుకుని తాగిన తర్వాత రెండు గంటలకి చేసే రక్త పరీక్షలో గ్లూకోజ్ 200 మి.గ్రా ల కంటే ఎక్కువ వుంటే డయాబెటిస్ వున్నట్లే.
ఇంకో పద్ధతి ఈమధ్య కాలంలో వాడబడుతుంది అది HbA1C అనే పరీక్ష ద్వారా,ఇది గనక 6.4 శాతము కంటె ఎక్కువగా ఉంటె మధుమేహం రోగనిర్ధారణ చేయబడుతుంది.
1.2
ప్ర: మధుమేహం యొక్క లక్షణాలు ఏమిటి?
జ: టైప్ 2 మధుమేహం యొక్క లక్షణాలు తరచుగా గుర్తించబడవు. ఈ లక్షణాలు కాలక్రమేణా అభివృద్ధి చెందుతాయి మరియు ఈ క్రింది వాటిని కలిగి ఉంటాయి:
  • అస్పష్టమైన దృష్టి
  • నిదానమైన నివారణ కలిగిన  పుండ్లు లేదా కోతలు
  • దురద కలిగించే చర్మం (సాధారణంగా యోని లేదా గజ్జ ప్రాంతం)
  • ఈస్ట్ అంటువ్యాధులు
  • దాహం పెరగడం
  • నోరు పొడిబారడం
  • తరచుగా మూత్రవిసర్జన చేసే అవసరత

  • 1.3ప్ర: మధుమేహం యొక్క రకాలు ఏమిటి?
    జ:
    డయబెటిస్_ మధుమేహంలోని రకాలు
    డయాబెటిస్ ముఖ్యంగా నాలుగు రకాలుగా విభజించవచ్చు
    టైప్ వన్/DM1 : పూర్వం దీన్ని ఇన్సులిన్ మీద ఆధారపడే డయాబెటిస్ అనేవారు.
     టైప్ టు DM2  : ఇదివరకు దీన్ని ఇన్సులిన్ మీద ఆధారపడని డయబెటిస్ అనేవారు
     టైప్ త్రీ/secondary DM : అరుదైన ఇతర కారణాల వల్ల వచ్చేది
    టైప్ ఫోర్/Gestational DM : గర్భవతులకి వచ్చే డయాబెటిస్ (GDM)
    టైప్ వన్/DM1 డయాబెటిస్ : మన శరీరంలోని వ్యాధి నిరోధక కణాలున్నాయి కదా అవే శరీరంలోని పాంక్రియాస్ అనే గ్రంథి లోని బీటా కణాల మీదే దాడి చేసి వాటిని నిర్మూలిస్తాయి. ప్రాంక్రియాస్ లోని బీటా కణాల ద్వారానే ఇన్సులిన్ వచ్చేది. అవి నిర్మూలించబడితే ఇన్సులిన్ వుత్పత్తి కాదు. దాంతో శరీరంలో గ్లూకోజ్ ప్రమాణం పెరిగిపోయి డయాబెటిస్ వస్తుంది. మన శరీరం లోని వ్యాధి నిరోధక శక్తులు ఎందుకు ఇలా చేస్తాయి అనేది నిజానికి శాస్త్రజ్ఞులకి ఇంకా అవగాహనకి ප-ජිස්ය. జన్య సంబంధమైన కారణాల వల్ల లేదా àಲವೆ సూక్ష్మక్రిముల వల్ల గాని, మన చుట్టూ వున్న పర్యావరణ ప్రభావం వల్ల కానీ, ఇది జరగవచ్చు.
    టైప్ వన్ మధుమేహ వ్యాధి (దీన్నే జువెనైల్ డయాబెటిస్ అనేవారు) సాధారణంగా చిన్నపిల్లలకి, యువతీ యువకులకి చిన్నవయసులో వస్తుంది. అయితే అరుదుగా పెద్దవాళ్లలో కూడా కనపడవచ్చు. ఈ వ్యాది వచ్చిన వారు సాధారణంగా వుండవల్పిందాని కంటే బరువు తక్కువగా వుంటారు. లక్షణాలు చిన్న వయస్సులో కనిపిస్తాయి. వీళ్ళకి ఇన్సులిన్ తప్ప వేరే మందులు పనిచేయవు. మూత్రంలో చక్కెర (గ్లూకోజ్ వెళ్ళిపోతుంటుంది. తినేది వంట బట్టదు. దాంతో శరీరం శుష్కించిపోతుంది. సరిగా వ్యాధి నిర్ణయం చేయక ఇన్సులిన్ తో  నయం చేయకపోతే వీళ్ళకి శరీరంలో
    కీటోఎసిడ్స్ అనే విషపదార్థాలు ఎక్కువ తయారయి త్వరగా స్ప్రహ తప్పి కోమాలోకి
    వెళ్ళే అవకాశం ఉంది. డయాబెటిస్ కోమా వీళ్ళకి త్వరగా వస్తుంది. ఇది కాక
    శుష్కించిపోవడం, ఇతర వ్యాధులు త్వరగా రావడం జరుగుతుంది.
    సరిగ్గా చికిత్స చేయకపోతే వీళ్ళకి ప్రమాదకరమైన డయాబెటిక్ కీటో ఎసిడోసిస్ అనే పరిస్థితి తేలికగా వచ్చేస్తుంది. ఎసిటో ఎసెటిక్ ఏసిడ్ కీటో ఎసిటిక్ ఆసిడ్ అనే విష పదార్థాలు శరీరంలో ఎక్కువ అయ్యాయంటే స్మృహ తప్పడం, ప్రాణాంతకమైన కాంప్లికేషన్స్ వస్తాయి. వీళ్ళకి ఇన్సులిన్ రోజూ తీసుకోవడం తప్పనిసరి టైప్ టు డయాబెటిస్ : (లేక స్థూల కాయంతో వుండేవాళ్ళకి వచ్చే డయాబెటిస్, లేక ఇన్సులిన్ మీద ఆధారపడని డయాబెటిస్)
    ఎక్కువగా మనం చూసేడయాబెటిస్ ఇదే. ఇది కూడా ఇన్సులిన్ లోపం వల్ల కాని, ఇన్సులిన్ సరిపడా వున్నా సరిగ్గా పనిచేయకపోవడం వల్ల గాని వస్తుంది. దీని వల్ల కూడా రక్తంలో గ్లూకోజ్ ప్రమాణం పెరిగిపోయి, ఇందాక చెప్పిన డయాబెటిస్‌లోని సమస్యలన్నీ వస్తాయి. ఈ వ్యాది వచ్చిన వాళ్ళలో చాలామందికి అధికంగా బరువు వుండడం, అధిక రక్తపోటు అధికంగా కొలెస్టరాల్ లేక ట్రైగ్లిసరైడ్స్
    2 పెద్దవాళ్ళకి వస్తుంది 3 80శాతం టైప్ 2 రోగులకి అధిక బరువుంటుంది,
    బాల్యంలో స్థూల కాయంతో వున్న వాళ్ళకి ఇది వచ్చే అవకాశం ఎక్కువ.
  • అనే కొవ్వు పదార్ధాలు రక్తం లో వుండడం జరుగుతోంది. 1 నూటికి 90 నుంచి 35 మంది దాకా డయబెటిస్ రోగులు టైప్ టూ కు చెందినవారే.
    ధన్యవాదములు
  • మీ నవీన్ రోయ్ నడిమింటి

*సభ్యులకు విజ్ఞప్తి*
******************
 మన  గ్రూపులో పెడుతున్న మెసేజ్ లన్నీ సభ్యులలో ఆరోగ్యం పట్ల ప్రాధమిక అవగాహన కోసమే అని గమనించాలి. వివిధ జబ్బులగురించి నివారణలు సూచనలు కూడా సభ్యులలో అవగాహన పెంచడానికి మాత్రమే ..మీ డాక్టరు కి ఇది ప్రత్యామ్నాయము కాదు. సభ్యులు గమనించాలి.ఇంకా సమాచారం కావాలి కావాలి అంటే లింక్స్ లో చూడాలి 
ఈ పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే మా పేజీని👍 లైక్ చేయండి,షేర్ చేయండి....!!!
https://www.facebook.com/Naveen-Nadiminti-153673568992464

మధుమేహం వాళ్ళు సెక్స్



నిరంతర రోగంగా చెప్పుకునే డయాబెటిస్‌ను అశ్రద్ధ చేస్తే సెక్స్ సామర్థ్యాన్ని అణగదొక్కేస్తుంది. డయాబెటిస్ ఉన్న పురుషుల్లో అంగస్థంభన సమస్య ఏర్పడుతుంది. పురుషాంగపు చివరనుండే చర్మం వెనక్కి రావడం చాలా కష్టమవుతుంది. ఆ భాగం స్పర్శతోనూ సమస్య ఉంటుంది. ఫలితంగా వీరి లైంగిక జీవితం నిస్సారమైపోతుంది. సక్రమంగా సాగకపోవడంతో భాగస్వామికి సెక్స్ తృప్తినివ్వదు.

ఇక స్త్రీల విషయానికి వస్తే... డయాబెటిస్ ఉన్నవారిలో మర్మాంగం చుట్టూ దురద, అంగప్రవేశంలో బాధలతో సెక్స్‌ ఓ నరకంలా తోస్తుంది. భారీకాయమైనా, డయాబెటిస్‌తో బాగా సన్నబడినా సెక్స్‌ని ఆనందించలేరు. ఇది దంపతుల మధ్య ఆకర్షణను తగ్గించి ఎడం పెంచుతుంది.

డయాబెటిక్‌లకు మధ్య వయసులో ఏర్పడే లైంగిక సమస్యలు మానసిక సమస్యలుగా మారతాయి. మానసిక ఆందోళన ఉన్నవారు ఏ వృత్తిలో ఉన్నా వారి సమర్థత తగ్గుతుంది. కనుక డయాబెటిస్‌ను అదుపులో ఉంచుకునేందుకు ఆహార జాగ్రత్తలు పాటించాలి. ఆహారంలో 60 శాతం కార్బోహైడ్రేట్లు, 20 శాతం కొవ్వు మరో 20 శాతం ప్రోటీన్లు ఉండేటట్లు చూసుకోవాలి.

డయాబెటిక్ రోగుల ఆరోగ్యాన్ని దెబ్బతీసే కొన్ని పదార్థాలు ఉన్నాయి. అటువంటి వాటికి దూరంగా ఉండాలి. ఆ జాబితాలో బెల్లం, తేనె, జామ్, రిఫైన్డ్ షుగర్, సమోసాలు, క్రీమ్ అద్దిన సలాడ్స్, ఎయిరేటెడ్ కూల్ డ్రింక్స్, జీడిపప్పు, బాదం పప్పు, బర్ఫీ, స్వీట్ పేడా, చాక్‌లెట్స్, ఐస్‌క్రీమ్స్, క్రీమ్ బిస్కెట్స్ వంటివి ఉన్నాయి.

ఇక తీసుకోదగిన పదార్థాలలో రాగులు, కొర్రలు, జొన్నలు, సజ్జలు, పెసలు, క్యాబేజీ, వంకాయలు, ఆకుకూరలు, పాలు, పెరుగు, మజ్జిగ వంటివి ఉన్నాయి. అన్నిటికీ మించి నిర్దిష్ట సమయానికే ఆహారం తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. ప్రతిరోజూ మూడు పూటలా ఆహారం క్రమం తప్పకుండా తీసుకోవాలి.
సెక్స్‌పై డయాబెటిక్ కొరడా
  నిరంతర రోగంగా చెప్పుకునే డయాబెటిస్‌ను అశ్రద్ధ చేస్తే సెక్స్ సామర్థ్యాన్ని అణగదొక్కేస్తుంది. డయాబెటిస్ ఉన్న పురుషుల్లో అంగస్థంభన సమస్య ఏర్పడుతుంది.      


ఒకవేళ డయాబెటిక్‌కి మాత్రలు లేదా ఇన్సులిన్ వాడుతున్నట్లయితే పడుకునేముందు అల్పాహారంగా ఏదో ఒకటి తీసుకుని నిద్రపోవాలి. మధుమేహాన్ని అశ్రద్ధ చేస్తే మనిషి జీవితం నిస్సారంగా మారుతుందనీ, కనుక ఆ వ్యాధిని అదుపుచేయగల శక్తి రోగి పాటించే రోజువారీ కార్యక్రమాలపై ఆధారపడి ఉంటుందని వైద్యులు అంటున్నారు.

మధుమేహాన్ని పూర్తిగా నయం చేయగల మందులు ఇంకా కనుగొనలేదు. ఇదిలావుంటే అంతర్జాతీయ డయాబెటిస్ ఫెడరేషన్ లెక్కల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 25 కోట్లమంది ఈ వ్యాధితో బాధపడుతున్నారు. ఈ సంఖ్య రానున్న 20 ఏళ్ల కాలంలో 38 కోట్లకు చేరుకునే ప్రమాదం ఉందని ఆ సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. ప్రతి ఏటా సుమారు 7 కోట్లమంది కొత్తగా మధుమేహం వ్యాధిచే
ధన్యవాదములు 
మీ నవీన్ నడిమింటి 
*సభ్యులకు విజ్ఞప్తి*
******************
 మన  గ్రూపులో పెడుతున్న మెసేజ్ లన్నీ సభ్యులలో ఆరోగ్యం పట్ల ప్రాధమిక అవగాహన కోసమే అని గమనించాలి. వివిధ జబ్బులగురించి నివారణలు సూచనలు కూడా సభ్యులలో అవగాహన పెంచడానికి మాత్రమే ..మీ డాక్టరు కి ఇది ప్రత్యామ్నాయము కాదు. సభ్యులు గమనించాలి.ఇంకా సమాచారం కావాలి కావాలి అంటే లింక్స్ లో చూడాలి 
ఈ పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే మా పేజీని👍 లైక్ చేయండి,షేర్ చేయండి....!!!
https://www.facebook.com/Naveen-Nadiminti-1536735689924644/

దురద నివారణ సలహాలు




ఎక్కడంటే అక్కడ దురద పెడుతుందా..నివారణ కు నవీన్ నడిమింటి సలహాలు 

ఏదో కాసేపు వచ్చీపోయే దురద గురించి ఎవరూ పెద్ద కలవరపడరు. కాలుష్యాల మధ్యే కదా ఉంటున్నాం... అదేదో అయి ఉంటుందిలే అని సరిపెట్టుకుంటారు. అది సరే కానీ, రోజులూ వారాలూ గడుస్తున్నా ఆ దురద తగ్గకపోతే ఏమనుకోవాలి? వాస్తవానికి దురద అనేది అన్నిసార్లూ దుమ్మూ ధూళి వల్ల వచ్చే చర్మ సమస్యే అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే దురద ఒక లక్షణంగా ఉండే వాటిల్లో చర్మానికి సంబంధంలేని వ్యాధులెన్నో ఉన్నాయి.
మందుల దుష్ప్రభావాల వల్ల..
దీర్ఘకాలికంగా వాడుతున్న కొన్ని రకాల మందుల దుష్ప్రభావాల వల్ల కూడా దురద సమస్య రావచ్చు. ఒకే రకమైన మందుల్ని ఎక్కువ కాలంగా వాడటం వల్ల కావచ్చు లేదా ఏకకాలంలో రెండు మూడురకాల మందులు వాడటం వల్లనైనా ఈ సమస్య రావచ్చు. ముఖ్యంగా ఆస్పిరిన్‌, ఏసీఇ ఇన్హిబిటార్స్‌తో పాటు, అధికరక్తపోటు వైద్యంలో తీసుకునే మాత్రలు, యాంటీబయాటిక్స్‌ వల్ల కూడా దురద వచ్చే అవకాశం ఉంది.
ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్‌
కొన్నిసార్లు ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్‌ చికిత్సలో తీసుకునే యాంటీబయాటిక్స్‌, చర్మంలోని మంచి బ్యాక్టీరియాను చంపేస్తాయి. దీని వల్ల కొందరు దురద బారిన పడుతుంటారు. శరీరానికి పడని కొన్ని రకాల మందుల వల్ల కూడా కొందరిలో ఈ సమస్య రావచ్చు. శరీరంలోని కీలక అవయవాలు వ్యాధిగ్రస్తమైనప్పుడు కూడా కొందరు దురద బారిన పడుతుంటారు.

చర్మం మీద దద్దుర్లు
స్వల్పంగా దురదగా ఉంటూ చర్మం మీద దద్దుర్లు కూడా వస్తే, అది థైరాయిడ్‌ సమస్య వల్ల, లేదా ఐరన్‌ లోపంతో వచ్చే రక్తహీనత వల్ల కూడా కావచ్చు. కొందరిలో ఈ సమస్య కిడ్నీ, కాలేయ వ్యాధులు, లోలోపల ఉండే కొన్నిరకాల కణుతుల వల్ల లేదా నరాల సంబంధితమైన న్యూరోపతి వల్ల కూడా రావచ్చు. కొందరిలో చర్మం బాగా పొడిబారినప్పుడు ఈ సమస్య తలెత్తుతుంది.
మానసిక రుగ్మతలవల్ల కూడా
అరుదుగా కొన్నిసార్లు మానసిక రుగ్మతలవల్ల కూడా దురద రావచ్చు. కొందరిలో పక్షవాతానికి గురైన తర్వాత లేదా మధుమేహం వల్ల కూడా దురద సమస్య మొదలవుతుంది. దురదతో పాటు దద్దుర్లు కూడా రావడం అలర్జీల కారణంగా కావచ్చు. లేదా సొరియాసిన్‌ వంటి తీవ్రమైన చర్మవ్యాధుల వల్ల జరగవచ్చు. అయితే, దురదకు గురయ్యే ప్రత్యేక ప్రదేశం అంటూ ఏదీ లేదు.
మందులు వాడడం
శరీరంలోని ఏ భాగంలోనైనా అది రావచ్చు. జిరోసిన్‌ అంటే పొడి చర్మం కారణంగా వయో వృద్ధులో దురద సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. వృద్ధాప్యంలో ఎక్కువ మందిలో సహజంగా ఉండే పలురకాల వ్యాధుల వల్ల ఏకకాలంలో ఎక్కువ మందులు వాడుతూ ఉంటారు. ఇది కూడా దురదకు కారణమవుతుంది.
రక్తహీనత వల్ల
అయితే వృద్ధాప్యం కాకపోయినా, కొందరిలో రక్తహీనత వల్ల కూడా ఈ దురద సమస్య రావచ్చు. ఏమైనా, ఏదో నాలుగు రోజులు వచ్చి దానికదే తగ్గిపోయే దురదను అంతపెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేకపోయినా, రోజులూ, వారాల పర్యంతం దురద అలాగే కొనసాగుతున్నప్పుడు, రోజురోజుకూ అది పెరుగుతూ పోతున్నప్పుడు నిర్లక్ష్యం చేయకూడదు. ఆ సమస్య వచ్చీరాగానే ముందు జనరల్‌ ఫిజిషియన్‌ను, ఆయన సూచిస్తే మరే ఇతర నిపుణుడ్ని సంప్రదించడం తప్పనిసరి.

దురద నుంచి విముక్తికి
ఈ సమస్య ఎక్కువగా వేధిస్తున్న వారు, ఎక్కువ మసాలాలు వేసిన వంటకాలు, రసాలు ఇవేవీ తరుచూ తీసుకోకూడదు.అదేపనిగా యాంటీబయాటిక్‌ సోప్స్‌ వాడకుండా సాదా సీదా సబ్బులతోనే స్నానం చేయడం అలవాటు చేసుకోవాలి.ఉన్ని లేదా శరీరంలో వేడి పుట్టించే దుస్తులేవీ ధరించకూడదు. పగలంతా ధరించే దుస్తులు, రాత్రివేళ ధరించే డ్రస్‌లు, బెడ్‌షీట్‌లు, బ్లాంకెట్స్‌ ఎప్పుడూ ఉతికినవి, పూర్తిగా పొడిగా ఉన్నవేవాడాలి.
స్టెరాయిడ్స్‌ వాడకూడదు
దురద నుంచి ఉపశమనానికి, అనెస్థిటిక్స్‌ గానీ, కార్టికోస్టెరాయిడ్‌ స్టెరాయిడ్స్‌ గానీ ఎప్పుడూ వాడకూడదు. దురద మరీ ఎక్కువగా ఉంటే, రసాయనాల్లేని సహజ సిద్ధమైన లోషన్‌లు వాడవచ్చు. వీటితో పాటు చర్మం పొడిబారకుండా, ఎండలో ఎక్కువగా తిరగడం తగ్గించాలి. ఎప్పుడైనా తప్పనిసరిగా ఎండలోకి వెళ్లాల్సి వస్తే స్వల్పంగా సన్ స్రీన్స్ వాడడం మంచిది.


కొబ్బరి నూనె
అయితే ఎలాంటి చ‌ర్మ స‌మ‌స్య అయినా కింద సూచించిన ప‌లు చిట్కాల‌ను పాటిస్తే సుల‌భంగా త‌గ్గిపోతుంది.సూక్ష్మ జీవులను చంపే సహజ సిద్ధ‌మైన గుణాలను కలిగే ఉండే కొబ్బరి నూనె చాలా రకాల చర్మ సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. ఒకవేళ మీకు దురదలు వ‌స్తుంటే ప్రభావిత ప్రాంతంలో కొద్దిగా కొబ్బరి నూనెను రాసి మర్ద‌నా చేస్తే ఆ దుర‌ద‌ల బారి నుంచి త‌ప్పించుకోవ‌చ్చు.

ఆలివ్ ఆయిల్
చ‌ర్మాన్ని సంర‌క్షించే ఎన్నో గుణాలు ఆలివ్ ఆయిల్‌లో ఉంటాయి. ఆలివ్ ఆయిల్‌ను స‌మ‌స్య ఉన్న ప్ర‌దేశంపై రాసి ఆ భాగానికి వేడి గుట్ట చుట్టాలి. అలా కొంత సేపు ఉంచాలి. అవ‌స‌రం అనుకుంటే ఆలివ్ ఆయిల్‌, కొబ్బ‌రినూనెల‌ను క‌లిపి కూడా ఇలా చేయ‌వ‌చ్చు. దీంతో చ‌ర్మ స‌మ‌స్య‌ల నుంచి విముక్తి పొంద‌వ‌చ్చు.
వేప
వేప చెట్టు ఆకుల‌ను కొన్నింటిని తీసుకుని బాగా నూరి మిశ్ర‌మంగా చేయాలి. ఆ మిశ్ర‌మాన్ని చ‌ర్మంపై స‌మ‌స్య ఉన్న ప్రాంతంలో రాయాలి. కొంత సేప‌టి త‌రువాత క‌డిగేయాలి. ఇలా త‌ర‌చూ చేయ‌డం వ‌ల్ల వేప ఆకుల్లో స‌హ‌జ‌సిద్ధంగా ఉండే యాంటీ బాక్టీరియ‌ల్ గుణాలు చ‌ర్మ స‌మ‌స్య‌ల‌ను త‌గ్గిస్తాయి. చ‌ర్మాన్ని కాంతివంతంగా, మృదువుగా మారుస్తాయి.
తేనె, దాల్చిన చెక్క‌
ఒక టేబుల్ స్పూన్ తేనె, ఒక టీస్పూన్ దాల్చిన చెక్క పొడిల‌ను తీసుకుని వాటిని క‌లిపి పేస్ట్‌లా చేసి చ‌ర్మంపై రాయాలి. వీటిల్లో ఉండే యాంటీ ఫంగ‌ల్‌, యాంటీ బాక్టీరియ‌ల్ గుణాలు చ‌ర్మ స‌మ‌స్య‌ల‌ను పోగొడ‌తాయి. చ‌ర్మానికి మృదుత్వాన్ని తెస్తాయి.
నిమ్మ‌కాయ
నిమ్మ‌కాయ‌ల్లో విట‌మిన్ సి ఎక్కువ‌గా ఉంటుంది. ఇది చ‌ర్మ స‌మ‌స్య‌ల‌ను పోగొడుతుంది. చ‌ర్మంపై నిమ్మ‌కాయ ముక్క‌ను రుద్ది కొంత‌సేపు ఆగాక క‌డిగేస్తే చ‌ర్మం కాంతివంతమ‌వుతుంది. చ‌ర్మ స‌మ‌స్య‌లు పోతాయి.
కలబంద
చ‌ర్మంపై ద‌ద్దుర్లు, దుర‌ద వ‌చ్చే వారు, మొటిమ‌లు, మ‌చ్చ‌లు ఉన్న‌వారు వాటిపై రోజూ క‌ల‌బంద గుజ్జును రాస్తూ ఉంటే ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.
బొప్పాయి
చ‌ర్మ స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించ‌డంలో బొప్పాయి పండు గుజ్జు కూడా బాగానే ప‌నిచేస్తుంది. దీన్ని చ‌ర్మంపై స‌మ‌స్య ఉన్న ప్రాంతంలో రోజూ రాస్తూ ఉంటే బాధ నుంచి 
ధన్యవాదములు 
మీ నవీన్ రోయ్ 


23, డిసెంబర్ 2019, సోమవారం

అమ్మాయి లో యోని దగ్గర సమస్యలు నవీన్ రోయ్ సలహాలు

యోని, తొడల వద్ద భయంకరమైన దద్దుర్లను నివారించే హెర్బల్ రెమెడీస్ అవగాహనా కోసం నవీన్ రోయ్ సలహాలు ..!

మొదటి ఇటువంటి భయంకరమైన దద్దుర్లు ఏప్రదేశంలో వచ్చాయి, లక్షణాలు ఎలా ఉన్నాయని గుర్తించాలి. దురద, మంట పెట్టడం , లైట్ రక్తస్రావం వంటి లక్షణాలు ఉన్నయేమో గమనించాలి?
ఇటువంటి లక్షణాలున్నప్పుడు వెంటనే డాక్టర్ ను కలిసి మందులు తీసుకోవడం మంచిది. సమస్య చిన్నదైతే ఇంట్లోనే కొన్ని హోం మేడ్ రెమెడీస్ తో తగ్గించుకోవచ్చు. వీటితో ఖచ్చితంగా మార్పు కనబడుతుంది.!
బహుమూలల్లో గజ్జల్లో దురద, దద్దుర్లు వస్తుంటాయి? వీటికి కారణం ఓవర్ వెయిట్, టైట్ గా ఉండే అండర్ వేర్స్ వేసుకోవడం, ఎక్కువ చెమటలు పెట్టడం, పర్సనల్ హైజిన్ లేకపోవడం, వ్యాధినిరోధకత లోపం వల్ల రాషెస్ కనబడుతాయి.
అందుకు ఏం చేయాలి? ఇటువంటి పరిస్థితి కంటిన్యుగా వస్తుంటే, మీ వ్యక్తిగత వస్తువులు (బ్రాలు, అండర్ వేర్స్ ఇతరులు వేసుకోకుండా) జాగ్రత్త పడాలి. అలాగే వదలుగా ఉన్న కాటన్ దుస్తులను ధరించాలి. ఆ ప్రదేశంలో తడిలేకుండా ఎప్పుడూ డ్రైగా ఉంచుకోవాలి.
ఇటువంటి భయంకరమైన దద్దుర్లను నివారించడానికి కొన్ని నేచురల్ హోం రెమెడీస్ ఈ క్రింది విధంగా ఉన్నాయి..
టీట్రీ ఆయిల్
టీట్రీ ఆయిల్లో నేచురల్ యాంటీ ఫంగల్ లక్షణాలు అధికంగా ఉన్నాయి. టీట్రీ ఆయిల్ దురదను నివారిస్తుంది. ఆ ప్రదేశాన్ని శుభ్రం చేస్తుంది. ఇన్ఫెక్షన్ కు కారణమయ్యే బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది. మూడు చుక్కల టీట్రీ ఆయిల్ ను తీసుకుని అందులో ఒక టీస్పూన్ కొబ్బరి నూనెను మిక్స్ చేయాలి. కాటన్ బాల్ తీసుకుని ఈ నూనెలో డిప్ చేసి, ప్రభావిత ప్రాంతంలో అప్లై చేయాలి. చర్మంలోనికి డీప్ గా అబ్సార్బ్ అయ్యే వరకూ అప్లై చేయాలి. ఈ రెమెడీని రోజుకు రెండు సార్లు ఫాలో అయితే, లక్షణాలు పూర్తిగా తగ్గిపోతాయి.

 అలోవెర
కలబందలో యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉన్నాయి. ఇది ఇన్ఫ్లమేషన్ ను తగ్గిస్తుంది. అలోవెర ను తీసుకుని చివర్లు కట్ చేసి, లోపల ఉన్న జెల్ ను స్పూన్ తో తీసుకోవాలి. దీన్ని రిఫ్రిజరేటర్లో పెట్టాలి. చల్లగా మారిన తర్వాత బయటకు తీసి, దద్దుర్లున్న ప్రదేశంలో అప్లై చేసి, మసాజ్ చేయాలి. చర్మంలోకి బాగా షోషింపబడేవరకూ అప్లై చేయాలి. ఇలా రాత్రి పడుకునే ముందు అప్లై చేస్తే త్వరగా నయం అవుతుంది
తేనె
తేనెలో యాంటీ సెప్టిక్ మరియు యాంటీ ఫంగల్ లక్షణాలు ఎక్కువగా ఉన్నాయి. ఇది రాషెస్ ను తగ్గించడం మాత్రమే కాదు, బ్లిస్టర్స్ ను స్మూత్ గా మార్చుతుంది. చర్మంలో దద్దుర్లు త్వరగా తగ్గడానికి సహాయపడుతుంది.
తేనెను ప్రభావిత ప్రాంతంలో అప్లై చేయాలి. అరగంట తర్వాత చల్లటి నీటితో కడిగేసుకోవాలి. తర్వాత పొడి బట్టతో తేమలేకుండా తుడవాలి. ఇలా రోజుకొకసారి చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.
వెల్లుల్లి
వెల్లుల్లిలో యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు, యాంటీ ఫంగల్ లక్షణాలు అధికంగా ఉన్నాయి. ఇది గ్రోయిన్ రాషెస్ ను నివారించడంలో గొప్పగా సహాయపడుతుంది. 5, 6 వెల్లుల్లి రెబ్బలను తీసుకుని అరకప్పు ఆలివ్ ఆయిల్లో వేసి వేడి చేయాలి. 5 నిముషాలు వేడి చేసిన తర్వాత, స్టౌ ఆఫ్ చేసి, చల్లారనివ్వాలి. తర్వాత వడగట్టి, రాషెస్ మీద అప్లై చేసి మసాజ్ చేయాలి. 2 గంటల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. రోజుకు రెండుసార్లు అప్లై చేస్తుంటే గజ్జల్లో దద్దుర్లును ఎఫెక్టివ్ గా నివారిస్తుంది.
వెనిగర్
వెనిగర్ లో ఉండే అసిడిక్ నేచర్ రాషెస్ ను డ్రైగా మార్చుతుంది. స్కిన్ కు ఏ మాత్రం ఇరిటేషన్ కలగించదు. ఒక పార్ట్ వెనిగర్ ను నాలుగు బాగాల నీళ్ళు మిక్స్ చేయాలి. రెండూ బాగా మిక్స్ చేసి, ఈ నీటితో మొటిమలున్న ప్రదేశంను శుభ్రం చేసుకోవాలి.ఈ నీటితో కడిగిన తర్వాత తిరిగి వేరే నీళ్ళతో కడగకూదు. ఇలా రోజూ చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.
ఆల్కహాల్ ను అప్లై చేయాలి
ఆల్కహాల్ స్ట్రాంగ్ డ్రైయింగ్ ఏజెంట్ గా పనిచేస్తుంది, ఇది రాషెస్ ను నివారిస్తుంది. ఇందులో ఉండే యాంటీఫంగల్ లక్షణాలు, మైక్రోబ్స్ ను నాశనం చేస్తుంది. ఇన్ఫెక్షన్స్ ను నివారిస్తుంది. ఆల్కహాల్లో కాటన్ బాల్ ను డిప్ చేసి స్కిన్ రాషెస్ ఉన్న ప్రదేశంలో అప్లై చేయాలి. త్వరగా డ్రైగా మారుతుంది. రోజుకు రెండు మూడు సార్లు ఇలా చేస్తుంటే రాషెస్ లక్షణాలు 
ధన్యవాదములు 
మీ నవీన్ రోయ్