24, డిసెంబర్ 2019, మంగళవారం

మధుమేహం ఉన్న వాళ్లకి అవగాహనా కోసం

నవీన్ రోయ్ నడిమింటి 

మధుమేహం గురించి యక్ష ప్రశ్నలు 001


1.1
ప్ర: ఒకవేళ నాకు మధుమేహం ఉంటే నేను ఎలా తెలుసుకోగలను?

జ: మీకు మధుమేహం ఉందా అని చూడటానికి మీ డాక్టర్ రక్త మరియు మూత్ర పరీక్షలు చేయవచ్చు
. రెండు రక్త పరీక్షలు
మీ ఉపవాస రక్తంలోని చక్కెర స్థాయి (మీరు ఏదైనా తినడానికి ముందు రక్తంలోని చక్కెర) 126 mg / dl లేదా ఎక్కువగా ఉంది
భోజనం తర్వాత రక్తంలోని చక్కెర స్థాయి 200 mg / dl లేదా ఎక్కువగా ఉంది అని చూపించినప్పుడు ప్రామాణిక మధుమేహ రోగనిర్ధారణ చేయబడుతుంది.
ఏ సమయంలోనైనా చేసే రక్త పరీక్షనిరాండమ్ బ్లడ్ గ్లూకోజ్ పరీక్ష అంటారు. ఈ విలువ 200 మి.గ్రా ల కంటే ఎక్కువ వుంటే డయాబెటిస్ వున్నట్లే.
ఓరల్ గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ అంటే 75 గ్రాములు గ్లూకోజ్ కలుపుకుని తాగిన తర్వాత రెండు గంటలకి చేసే రక్త పరీక్షలో గ్లూకోజ్ 200 మి.గ్రా ల కంటే ఎక్కువ వుంటే డయాబెటిస్ వున్నట్లే.
ఇంకో పద్ధతి ఈమధ్య కాలంలో వాడబడుతుంది అది HbA1C అనే పరీక్ష ద్వారా,ఇది గనక 6.4 శాతము కంటె ఎక్కువగా ఉంటె మధుమేహం రోగనిర్ధారణ చేయబడుతుంది.
1.2
ప్ర: మధుమేహం యొక్క లక్షణాలు ఏమిటి?
జ: టైప్ 2 మధుమేహం యొక్క లక్షణాలు తరచుగా గుర్తించబడవు. ఈ లక్షణాలు కాలక్రమేణా అభివృద్ధి చెందుతాయి మరియు ఈ క్రింది వాటిని కలిగి ఉంటాయి:
  • అస్పష్టమైన దృష్టి
  • నిదానమైన నివారణ కలిగిన  పుండ్లు లేదా కోతలు
  • దురద కలిగించే చర్మం (సాధారణంగా యోని లేదా గజ్జ ప్రాంతం)
  • ఈస్ట్ అంటువ్యాధులు
  • దాహం పెరగడం
  • నోరు పొడిబారడం
  • తరచుగా మూత్రవిసర్జన చేసే అవసరత

  • 1.3ప్ర: మధుమేహం యొక్క రకాలు ఏమిటి?
    జ:
    డయబెటిస్_ మధుమేహంలోని రకాలు
    డయాబెటిస్ ముఖ్యంగా నాలుగు రకాలుగా విభజించవచ్చు
    టైప్ వన్/DM1 : పూర్వం దీన్ని ఇన్సులిన్ మీద ఆధారపడే డయాబెటిస్ అనేవారు.
     టైప్ టు DM2  : ఇదివరకు దీన్ని ఇన్సులిన్ మీద ఆధారపడని డయబెటిస్ అనేవారు
     టైప్ త్రీ/secondary DM : అరుదైన ఇతర కారణాల వల్ల వచ్చేది
    టైప్ ఫోర్/Gestational DM : గర్భవతులకి వచ్చే డయాబెటిస్ (GDM)
    టైప్ వన్/DM1 డయాబెటిస్ : మన శరీరంలోని వ్యాధి నిరోధక కణాలున్నాయి కదా అవే శరీరంలోని పాంక్రియాస్ అనే గ్రంథి లోని బీటా కణాల మీదే దాడి చేసి వాటిని నిర్మూలిస్తాయి. ప్రాంక్రియాస్ లోని బీటా కణాల ద్వారానే ఇన్సులిన్ వచ్చేది. అవి నిర్మూలించబడితే ఇన్సులిన్ వుత్పత్తి కాదు. దాంతో శరీరంలో గ్లూకోజ్ ప్రమాణం పెరిగిపోయి డయాబెటిస్ వస్తుంది. మన శరీరం లోని వ్యాధి నిరోధక శక్తులు ఎందుకు ఇలా చేస్తాయి అనేది నిజానికి శాస్త్రజ్ఞులకి ఇంకా అవగాహనకి ප-ජිස්ය. జన్య సంబంధమైన కారణాల వల్ల లేదా àಲವೆ సూక్ష్మక్రిముల వల్ల గాని, మన చుట్టూ వున్న పర్యావరణ ప్రభావం వల్ల కానీ, ఇది జరగవచ్చు.
    టైప్ వన్ మధుమేహ వ్యాధి (దీన్నే జువెనైల్ డయాబెటిస్ అనేవారు) సాధారణంగా చిన్నపిల్లలకి, యువతీ యువకులకి చిన్నవయసులో వస్తుంది. అయితే అరుదుగా పెద్దవాళ్లలో కూడా కనపడవచ్చు. ఈ వ్యాది వచ్చిన వారు సాధారణంగా వుండవల్పిందాని కంటే బరువు తక్కువగా వుంటారు. లక్షణాలు చిన్న వయస్సులో కనిపిస్తాయి. వీళ్ళకి ఇన్సులిన్ తప్ప వేరే మందులు పనిచేయవు. మూత్రంలో చక్కెర (గ్లూకోజ్ వెళ్ళిపోతుంటుంది. తినేది వంట బట్టదు. దాంతో శరీరం శుష్కించిపోతుంది. సరిగా వ్యాధి నిర్ణయం చేయక ఇన్సులిన్ తో  నయం చేయకపోతే వీళ్ళకి శరీరంలో
    కీటోఎసిడ్స్ అనే విషపదార్థాలు ఎక్కువ తయారయి త్వరగా స్ప్రహ తప్పి కోమాలోకి
    వెళ్ళే అవకాశం ఉంది. డయాబెటిస్ కోమా వీళ్ళకి త్వరగా వస్తుంది. ఇది కాక
    శుష్కించిపోవడం, ఇతర వ్యాధులు త్వరగా రావడం జరుగుతుంది.
    సరిగ్గా చికిత్స చేయకపోతే వీళ్ళకి ప్రమాదకరమైన డయాబెటిక్ కీటో ఎసిడోసిస్ అనే పరిస్థితి తేలికగా వచ్చేస్తుంది. ఎసిటో ఎసెటిక్ ఏసిడ్ కీటో ఎసిటిక్ ఆసిడ్ అనే విష పదార్థాలు శరీరంలో ఎక్కువ అయ్యాయంటే స్మృహ తప్పడం, ప్రాణాంతకమైన కాంప్లికేషన్స్ వస్తాయి. వీళ్ళకి ఇన్సులిన్ రోజూ తీసుకోవడం తప్పనిసరి టైప్ టు డయాబెటిస్ : (లేక స్థూల కాయంతో వుండేవాళ్ళకి వచ్చే డయాబెటిస్, లేక ఇన్సులిన్ మీద ఆధారపడని డయాబెటిస్)
    ఎక్కువగా మనం చూసేడయాబెటిస్ ఇదే. ఇది కూడా ఇన్సులిన్ లోపం వల్ల కాని, ఇన్సులిన్ సరిపడా వున్నా సరిగ్గా పనిచేయకపోవడం వల్ల గాని వస్తుంది. దీని వల్ల కూడా రక్తంలో గ్లూకోజ్ ప్రమాణం పెరిగిపోయి, ఇందాక చెప్పిన డయాబెటిస్‌లోని సమస్యలన్నీ వస్తాయి. ఈ వ్యాది వచ్చిన వాళ్ళలో చాలామందికి అధికంగా బరువు వుండడం, అధిక రక్తపోటు అధికంగా కొలెస్టరాల్ లేక ట్రైగ్లిసరైడ్స్
    2 పెద్దవాళ్ళకి వస్తుంది 3 80శాతం టైప్ 2 రోగులకి అధిక బరువుంటుంది,
    బాల్యంలో స్థూల కాయంతో వున్న వాళ్ళకి ఇది వచ్చే అవకాశం ఎక్కువ.
  • అనే కొవ్వు పదార్ధాలు రక్తం లో వుండడం జరుగుతోంది. 1 నూటికి 90 నుంచి 35 మంది దాకా డయబెటిస్ రోగులు టైప్ టూ కు చెందినవారే.
    ధన్యవాదములు
  • మీ నవీన్ రోయ్ నడిమింటి

*సభ్యులకు విజ్ఞప్తి*
******************
 మన  గ్రూపులో పెడుతున్న మెసేజ్ లన్నీ సభ్యులలో ఆరోగ్యం పట్ల ప్రాధమిక అవగాహన కోసమే అని గమనించాలి. వివిధ జబ్బులగురించి నివారణలు సూచనలు కూడా సభ్యులలో అవగాహన పెంచడానికి మాత్రమే ..మీ డాక్టరు కి ఇది ప్రత్యామ్నాయము కాదు. సభ్యులు గమనించాలి.ఇంకా సమాచారం కావాలి కావాలి అంటే లింక్స్ లో చూడాలి 
ఈ పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే మా పేజీని👍 లైక్ చేయండి,షేర్ చేయండి....!!!
https://www.facebook.com/Naveen-Nadiminti-153673568992464

కామెంట్‌లు లేవు: