నిరంతర రోగంగా చెప్పుకునే డయాబెటిస్‌ను అశ్రద్ధ చేస్తే సెక్స్ సామర్థ్యాన్ని అణగదొక్కేస్తుంది. డయాబెటిస్ ఉన్న పురుషుల్లో అంగస్థంభన సమస్య ఏర్పడుతుంది. పురుషాంగపు చివరనుండే చర్మం వెనక్కి రావడం చాలా కష్టమవుతుంది. ఆ భాగం స్పర్శతోనూ సమస్య ఉంటుంది. ఫలితంగా వీరి లైంగిక జీవితం నిస్సారమైపోతుంది. సక్రమంగా సాగకపోవడంతో భాగస్వామికి సెక్స్ తృప్తినివ్వదు. |
ఇక స్త్రీల విషయానికి వస్తే... డయాబెటిస్ ఉన్నవారిలో మర్మాంగం చుట్టూ దురద, అంగప్రవేశంలో బాధలతో సెక్స్ ఓ నరకంలా తోస్తుంది. భారీకాయమైనా, డయాబెటిస్‌తో బాగా సన్నబడినా సెక్స్‌ని ఆనందించలేరు. ఇది దంపతుల మధ్య ఆకర్షణను తగ్గించి ఎడం పెంచుతుంది.
డయాబెటిక్‌లకు మధ్య వయసులో ఏర్పడే లైంగిక సమస్యలు మానసిక సమస్యలుగా మారతాయి. మానసిక ఆందోళన ఉన్నవారు ఏ వృత్తిలో ఉన్నా వారి సమర్థత తగ్గుతుంది. కనుక డయాబెటిస్‌ను అదుపులో ఉంచుకునేందుకు ఆహార జాగ్రత్తలు పాటించాలి. ఆహారంలో 60 శాతం కార్బోహైడ్రేట్లు, 20 శాతం కొవ్వు మరో 20 శాతం ప్రోటీన్లు ఉండేటట్లు చూసుకోవాలి.
డయాబెటిక్ రోగుల ఆరోగ్యాన్ని దెబ్బతీసే కొన్ని పదార్థాలు ఉన్నాయి. అటువంటి వాటికి దూరంగా ఉండాలి. ఆ జాబితాలో బెల్లం, తేనె, జామ్, రిఫైన్డ్ షుగర్, సమోసాలు, క్రీమ్ అద్దిన సలాడ్స్, ఎయిరేటెడ్ కూల్ డ్రింక్స్, జీడిపప్పు, బాదం పప్పు, బర్ఫీ, స్వీట్ పేడా, చాక్‌లెట్స్, ఐస్‌క్రీమ్స్, క్రీమ్ బిస్కెట్స్ వంటివి ఉన్నాయి.
ఇక తీసుకోదగిన పదార్థాలలో రాగులు, కొర్రలు, జొన్నలు, సజ్జలు, పెసలు, క్యాబేజీ, వంకాయలు, ఆకుకూరలు, పాలు, పెరుగు, మజ్జిగ వంటివి ఉన్నాయి. అన్నిటికీ మించి నిర్దిష్ట సమయానికే ఆహారం తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. ప్రతిరోజూ మూడు పూటలా ఆహారం క్రమం తప్పకుండా తీసుకోవాలి.
| |
| |
ఒకవేళ డయాబెటిక్‌కి మాత్రలు లేదా ఇన్సులిన్ వాడుతున్నట్లయితే పడుకునేముందు అల్పాహారంగా ఏదో ఒకటి తీసుకుని నిద్రపోవాలి. మధుమేహాన్ని అశ్రద్ధ చేస్తే మనిషి జీవితం నిస్సారంగా మారుతుందనీ, కనుక ఆ వ్యాధిని అదుపుచేయగల శక్తి రోగి పాటించే రోజువారీ కార్యక్రమాలపై ఆధారపడి ఉంటుందని వైద్యులు అంటున్నారు.
మధుమేహాన్ని పూర్తిగా నయం చేయగల మందులు ఇంకా కనుగొనలేదు. ఇదిలావుంటే అంతర్జాతీయ డయాబెటిస్ ఫెడరేషన్ లెక్కల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 25 కోట్లమంది ఈ వ్యాధితో బాధపడుతున్నారు. ఈ సంఖ్య రానున్న 20 ఏళ్ల కాలంలో 38 కోట్లకు చేరుకునే ప్రమాదం ఉందని ఆ సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. ప్రతి ఏటా సుమారు 7 కోట్లమంది కొత్తగా మధుమేహం వ్యాధిచే
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి