3, జనవరి 2020, శుక్రవారం

పైల్స్(మూలశంక) ఫిస్టులా, ఫిషర్స్(మొలలు) వచ్చిన అప్పుడు తీసుకోవాలిసిన జాగ్రత్తలు


మొలలు , ఫైల్స్ , హేమరాయిడ్స్ నివారణ కు నవీన్ నడిమింటి సలహాలు 

, పేరేదైనా తరచూ వినిపించే సమస్యల్లో ఇదొకటి . వంశ పారంపర్యంగా ఏర్పడే వ్యాధులలో అర్శమొలలు ఒకటి. అంతేగాక ఆనారోగ్య ఆహార అలవాట్లు, మారుతున్న జీవన శైలి వంటి కారణాల వల్ల మల విసర్జన ద్వారంలోపల పైల్స్, ఫిషర్, ఫిస్టులా వంటి వ్యాధులు ఏర్పడతాయి. సరియైన ఆహార నియమాలు పాటించకపోవడం , మలబద్ధకం , వంటి వాటితో ఈ సమస్య తలెత్తుతుంది . మలాశయం లోపల బయట చిన్న చిన్న బుడిపెలు రూపం లో మొలలేర్పడి ఇబ్బంది పెడతాయి . మలద్వారము చివరిలో సిరలు గోడలలో మార్పులవల్ల అవి ఉబ్బి మొలలు గా ఏర్పడతాయి. వీటిలో నాలుగు డిగ్రీలు ఉన్నాయి . 1st డిగ్రీ -ఏభాదలేకుండా చిన్న మొలలు ఉండడం , 2nd డిగ్రీ -- మొలలు బయటకు కనిపిస్తాయి , విరోచనం అయినపుడు మంటా , దురద ఉంటుంది , 3rd డిగ్రీ -- మొలలు పెద్దవిగా ఉంది విరోచనం అయినప్పుడు రక్తం పడుతూ .. నొప్పి , మంట ఉంటుంది . 4th డిగ్ర్రీ ఫైల్స్ -- ప్రోలాప్సుడ్ (prolapsed) మొలలు పెద్దవిగా ఉంటూ రక్తం కారుతుంది . . నొప్పి , మంట ఉంటాయి .

ఈ సమస్య రాకుండా .. వచ్చాకా తీసుకోవలసిన జాగ్రత్తలు >

ఆహారపరం గా :
నూనెలో వేయించిన మాంసము , పిండివంటలు , బిర్యాని , ఆలుగడ్డ , చామగడ్డ ,వంటివి తరచూ తింటున్నపుడు సమస్య తీవ్రమవుతుంది . ఉప్పు , పులుపు , నిల్వ పచ్చళ్లు , కారము ,ఆవాలు అధికం గా తీసునే వారికి ఈసమస్య ఎక్కువవుతుంది .
పొడిగా ఉండే ఆహారమే తీసుకున్తు పీచు పదార్దాలు తినని వారికి ఫైల్స్ వచ్చే అవకాసము ఉంది. నీరు తక్కువ , ఎండు ఆకుకూరలు లను ఎక్కువగా తీసుకోవడం , పదే పదే కాఫీ , టీ అధికం గా సేవించడం కుడా ఈ సమస్యకుదారితీస్తుంది.
గర్భస్రావము జరిగునపుడు , విషమ ప్రసవము వల్ల మహిళలకు ఫైల్స్ రావడానికి అవకాశముంది . అధిక వేడి ప్రదేశం లో పనిచేసేవారు , దృఢమైన ఆసనం పై కూర్చునే వారు , ఎక్కువ ప్రయాణాలు చేస్తూ సరైన ఆహారం తీసుకొని వారు వాటి బారిన పడతారు . అలాగే మానసిక ఒత్తిడి అధికం గా ఉన్న వారికి ఇవి వచ్చే సూచనలు ఎక్కువ .
ఆహార నియమాలు :
మొలలతో బాధపడే వారు మలబద్దకం లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సమయానికి భోజనం చేయడంఅన్నిటికంటే ప్రధానం . రోజు ఆహారంలో పీచుపదార్దము ఎక్కువగా ఉండే బీరకాయ , ఆనప , పొట్ల , కంద , బచ్చలివంటివి ఉండేలా చూసుకోవాలి .
కొబ్బరి నీళ్లు , సుగందిపాలు , వట్టివేళ్ళు తీసుకోవడం వల్ల వంటికి చలవ . మెత్తటి పరుపుమీద కూర్చోవడం , వేడినీళ్ళతో తొట్టి స్నానం చేయడం వల్ల కొంతవరకు బాధ నుంచి ఉపశమనం లభిస్తుంది .
వ్యాయామం ఎక్కువగా చేయడం , రాత్రిపూట ఆలస్యం గా నిద్రించటం వంటి అలవాట్లు మానుకోవాలి .
ట్రీట్మెంట్ :
pilex మాత్రలు రోజుకు ౩ చొప్పున్న ౩ మాసాలు వాడాలి ,
Dobesil మాత్రలు (Diasmin) రోజుకి 2 చొప్పున్న 15 రోజులు వాడాలి ,
Duolaxin ద్రావకం (టానిక్) విరోచనం సాఫీగా అవడానికి నోటి ద్వారా తీసుకోవాలి ,
Hedensa ఆయింట్మెంట్ మలద్వారం లో రాయాలి .
పై మందుల వల్ల తగ్గనిచో ఆపరేసన్ చేయించుకోవాలి . దీనికి లేజార్ ట్రీట్మెంట్ కలదు .. బాగానే ఫలితాలు ఉన్నాయి.

మొలలు ముళ్ల మీది జీవితం!  మి నవీన్ నడిమింటి

    *ప్రాణాల మీదికేమీ రాకపోవచ్చుగానీ....అనుక్షణం ముల్లుగా గుచ్చుకుంటూ.. నిత్యం నరకం చూపించే సమస్యలు కొన్ని ఉంటాయి. ఇలాంటి వాటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మొలలు. కూర్చోవాలంటే కష్టం.* నడవాలంటే నరకం. ఇక మలవిసర్జనకు వెళ్లాలంటే మహా భయం. తెల్లారుతోందంటే చాలు... ఎక్కడ రక్తం కళ్ల జూడాల్సి వస్తుందో.. చివరికి ఇదెక్కడికి దారి తీస్తుందో... ఈ భయాల పరంపరకు అంతుండదు. దినదిన గండంలా అనిపించే... నిత్యం ఎంతోమందిని వేధించే ఈ సర్వసాధారణ మొలలకు పరిష్కారం ఎక్కడ? బయటకు చెప్పుకోలేక.. భయాలు దాచుకోలేక.. చాలామంది నాటువైద్యాలను ఆశ్రయించి తీవ్ర ఇక్కట్ల పాలవుతుంటారు. నిజానికి అవగాహన పెంచుకుంటే మొలలను తేలికగానే వదిలించుకోవచ్చు. దీనికి అత్యాధునికమైన విధానాలూ చాలా అందుబాటులోకి వచ్చాయి. ఒక రకంగా... గత దశాబ్దకాలంలో మొలల పట్ల వైద్యరంగం అవగాహనే చాలా వరకూ మారిపోయింది.

నిజం చెప్పాలంటే...'పైల్స్‌' అనేవి ఒక స్థాయిలో అందరికీ ఉంటాయి. కాకపోతే వాటిని 'పైల్స్‌' అని పిలవకుండా మలద్వారంలో ఉండే మొత్తటి పొరలు (యానల్‌ కుషన్స్‌) అంటాం. ఈ పొరలే సాగి, పెరిగి, జారి, ముదిరి సమస్యాత్మకంగా తయారైతే అప్పుడు వీటిని వ్యాధిలా గుర్తిస్తూ.. 'పైల్స్‌' అనీ, 'హెమరాయిడ్స్‌' అనీ పిలుస్తారు.

*ఒకప్పుడు ఈ మలద్వారంలోని మెత్తటి పొరలకు ప్రత్యేకమైన ప్రయోజనమేదీ లేదని భావించేవాళ్లు. కానీ గత దశాబ్ద కాలంలో వీటిపై అవగాహనలో చాలా మార్పు వచ్చింది. ఈ మెత్తటి పొరలకు రెండు రకాల ప్రత్యేక ప్రయోజనాలున్నాయని గుర్తించారు.*

1. సాంప్లింగ్‌ రిఫ్లెక్స్‌: మలద్వారం నుంచి బయటకు వస్తున్నదేమిటి? అనేది గుర్తించి మనకు తెలియజెప్పే అతి ముఖ్యమైన బాధ్యత నిర్వర్తించేది ఈ పొరలే. బయటకు వస్తున్నది గ్యాసా? విరేచనమా? వచ్చేది మెల్లగా వస్తోందా? మెత్తగా వస్తోందా? గ్యాసైతే దాన్ని నలుగురిలో ఉన్నప్పుడు విసర్జించొచ్చా? లేదా? ఇవన్నీ గుర్తించి మన మెదడుకు ఈ సమాచారాన్ని చేరవేసి.. దానికి తగ్గట్టుగా మలద్వారం స్పందించేలా చేసేది ఈ పొరలే. ఈ ప్రక్రియ అంతా మనకు తెలియకుండానే.. రేయింబవళ్లు జరిగిపోతూనే ఉంటుంది. రాత్రి నిద్రిస్తున్న సమయంలో మల విసర్జన జరిగే అవకాశమున్నా ఇవి ఆ విషయాన్ని కూడా మనకు తెలిసేలా చేస్తాయన్నమాట.

2. మలంపై పట్టు: మలవిసర్జన పైన మనకు గట్టి పట్టు, నియంత్రణ ఉన్నాయంటే దానికి మలద్వారం లోపల ఉండే రెండు దృఢమైన కండర బంధనాలు (ఇంటర్నల్‌, ఎక్స్‌టర్నల్‌ యానల్‌ స్ఫింక్టర్స్‌), పొత్తికడుపు నుంచి పురీషనాళం వరకూ ఉండే 'ప్యూబో రెక్టాలిస్‌' కండరం.. ఇవి 99% వరకూ బలంగా తోడ్పడతాయి. ఆ మిగిలిన ఒక్కశాతం నియంత్రణకు.. ఈ మలద్వార పొరలు దోహదం చేస్తుండటం విశేషంగా చెప్పుకోవాల్సిన అంశం. వీటికి రక్తసరఫరా అధికంగా ఉంటుంది. ఈ పొరలు రోజంతా ఉబ్బుతూ, తిరిగి మామూలు స్థాయికి వస్తూ ఉంటాయి. ఇవి ఉబ్బినపుడు మలద్వారం బిగుతుగా మూసుకుపోతుంది. ఇవి మామూలు స్థాయికి వచ్చినపుడు కాస్త వదులవుతుంటుంది. ఇలా ఈ మలద్వార పొరలు మలంపై పట్టుకు కూడా దోహదం చేస్తుంటాయి. ఈ విషయాన్ని గుర్తిచటం.. మొలల పట్ల, అలాగే మొలలకు చేసే చికిత్సల పట్ల మన అవగాహనలో చాలా మార్పు తీసుకువచ్చింది. ఒకప్పుడు మొలలకు చికిత్సలో భాగంగా మలద్వారాన్ని తెరిచి.. సర్జరీ చేసి.. ఉబ్బి ఉన్న మొలలను పూర్తిగా తొలగించేవారు. కానీ వీటిని సాధ్యమైనంత వరకూ తొలగించాల్సిన అవసరం లేకుండా సమస్యను సరిదిద్దటం వల్ల మరింత ప్రయోజనం ఉంటుందని గుర్తించి ప్రస్తుతం 'స్టేప్లర్‌' విధానాన్ని ఆవిష్కరించారు.
ఎప్పుడు సమస్య?
మలద్వారంలో పైల్స్‌ వంటి మెత్తటి పొరలు అందరికీ ఉంటాయి, అవసరం కూడా. అయితే వాటిల్లోంచి రక్తం పడుతున్నా, నొప్పిగా ఉంటున్నా, అవి పైకి పొడుచుకొచ్చినా, అవి మలద్వారం నుంచి బయటికి వస్తూ-పోతున్నా సమస్యగా పరిణమిస్తాయి. దీన్నే మనం సాధారణ భాషలో మొలల సమస్యగా (పైల్స్‌, హెమరాయిడల్‌ డిసీజ్‌) భావిస్తుంటాం. సమస్యగా పరిణమించినప్పుడు మాత్రమే వీటికి చికిత్స తప్పనిసరి అవుతుంది.
సమస్యగా ఎందుకు మారతాయి?
మొలల సమస్యకు ప్రధానంగా చెప్పుకోవాల్సిన అతి ముఖ్యకారణం మల బద్ధకం, మల విసర్జన సమయంలో ముక్కటం! కొందరిలో వంశపారంపర్యంగా స్ఫింక్టర్లను మలద్వారానికి పట్టి ఉంచే కొలాజెన్‌ పొర బలహీనంగా ఉంటుంది. ఇదీ మొలలకు దోహదం చెయ్యొచ్చు. మల విసర్జన సమయంలో ముక్కితే పైల్స్‌తో కూడిన కండర బంధనం (లిగమెంట్‌) సాగిపోతుంది. తరచూ ఇలా జరుగుతుంటే కండర బంధనం పల్చబడుతుంది. దీంతో మలం గట్టిగా వచ్చినపుడు అది ఆ భాగానికి రుద్దుకొని రక్త స్రావమవుతుంది. కొన్నిసార్లు ఇవి బయటకు పొడుచుకొని రావొచ్చు. మలబద్ధకమే కాదు.. అతిగా విరేచనాలు కావటం కూడా మొలలకు దారితియ్యొచ్చు.

ముక్కినపుడు మలద్వారం వెనక భాగం లోపలికి పొడుచుకు రావటం ఆరంభమవుతుంది. ఇలా తరచుగా ముక్కుతుంటే కొద్దికొద్దిగా కిందికి వస్తూ.. చివరికి మొత్తమంతా తోసుకొస్తుంది. ఒకరకంగా దీన్ని పైల్స్‌ సమస్య తొలిదశ అనుకోవచ్చు.
పిల్లలకూ రావచ్చు!
పైల్స్‌ సమస్య పెద్దల్లో తరచుగా కనబడుతుంది. వయసుతో పాటు మొలల ముప్పూ పెరుగుతుంటుంది. ఎందుకంటే వయసు పెరుగుతున్నకొద్దీ కండరాలు బలహీనపడుతుంటాయి, అదే సమయంలో పెద్దపేగు కదలికలు తగ్గి మలబద్ధకం సమస్యా పెరుగుతుంటుంది. దీంతో ముక్కటం, మొలల బారినపడటం చాలా ఎక్కువ. అయితే మొలలు పెద్దలూ, వృద్ధులకే కాదు... పిల్లల్లోనూ రావచ్చు. ముఖ్యంగా మలవిసర్జన అలవాట్లు సరిగా లేకపోవటం, సరైన ఆహారం తీసుకోకపోవటం వల్ల పిల్లలకు ఈ ముప్పు ఎక్కువ. చాలామంది పిల్లలు రోజూ మల విసర్జన చేయరు. రెండు మూడు రోజులకు ఒకసారి వెళ్తుంటారు. దీంతో ముక్కటం మొదలై మొలలకు దారి తీస్తుంది. అలాగే నేటి యువతరంలో పాశ్చాత్య జీవనశైలి, ఆహారపుటలవాట్లు పెరుగుతున్న నేపథ్యంలో వీరిలోనూ మొలల సమస్య ఎక్కువగానే కనబడుతోంది.
అపోహ
*చాలాసేపు కూచొని పనిచేసే ఉద్యోగులకు మొలల సమస్య ఎక్కువని భావిస్తుంటారు. కానీ ఇది నిజం కాదు. మొలలకూ, చేసే ఉద్యోగాలకూ సంబంధం లేదు. అయితే సరైన వ్యాయామం, శారీరక శ్రమ లేనివారికి మలబద్ధకం సమస్య ఎక్కువ. కాబట్టి వారికి మొలల బెడద ఎక్కువగానే ఉంటుంది.
మొలలు దశలు
* గ్రేడ్‌-1: ఈ దశలో మొలలు పైకి కనిపించవు. నొప్పి ఉండదుగానీ రక్తం మాత్రం పడుతుంది. వీరిలో సాధారణంగా మల విసర్జనకు ముందుగానీ, తర్వాత గానీ రక్తం పడటం కనిపిస్తుంది. మలంతో కలిసిపోకుండా, విసర్జన సమయంలో తాజా రక్తం పడుతుంటే మొలల సమస్యగానే భావించాల్సి ఉంటుంది. కానీ మలంతో కలిసి రక్తం పడుతుంటే మాత్రం జాగ్రత్త పడాలి. క్యాన్సర్‌ ఉందేమో నిర్ధరించుకోవాలి.

* గ్రేడ్‌-2: ఈ దశలో రక్తం పడొచ్చు, పడకపోవచ్చు కానీ మలవిసర్జన సమయంలో మొలలు బయటకు వస్తుంటాయి. విసర్జన తర్వాత వాటంతట అవే లోపలికి వెళ్లిపోతుంటాయి. ఈ దశలో సరైన ఆహారపుటలవాట్లు, జీవనశైలిని పాటిస్తే.. మొలల సైజు తగ్గి, మొదటి దశలోకి మారిపోవచ్చు కూడా.

* గ్రేడ్‌-3: మల విసర్జన చేసినప్పుడు పైల్స్‌ బయటకు వస్తాయి. కానీ విసర్జన అనంతరం వాటంతట అవే లోపలికి పోవు. వేలితో నెడితే లోనికి వెళ్తాయి.

* గ్రేడ్‌-4: ఈ దశలో ఉన్న పైల్స్‌ మలద్వారం బయటే ఉండిపోతాయి. నెట్టినా లోనికి వెళ్లవు.

*మొలల సమస్య సాధారణంగా లోపలే ఆరంభమవుతుంది.* మొలలతో కూడిన పొర కిందికి జారుతున్నకొద్దీ అవి బయటకు పొడుచుకురావటం, తోసుకురావటం ఎక్కువ అవుతుంది.

*చికిత్సలు*
సమస్యగా మారిన మొలలు ఉబ్బినట్టుగా, కాస్త పెద్దగా ఉంటాయి. ప్రోక్టోస్కోప్‌తో చూస్తే వాటిపై రక్తస్రావం అవుతున్న గుర్తులు కనిపిస్తాయి.

*మొలల సమస్య మొదటి దశలో ఉన్నవారికి- ముందు తగు ఆహారపుటలవాట్లు, జీవనశైలిని సూచిస్తారు.* సమస్య చాలావరకూ వీటితోనే తగ్గిపోవచ్చు. అవసరమైతే వీరికి రక్తనాళాల బిగువును పెంచి, రక్తస్రావం కాకుండా చూసే కొన్ని రకాల మందులూ సూచిస్తారు. అయితే ఇవి అందరిలోనూ పనిచేయకపోవచ్చు. కాబట్టి ఆహార నియమాలను కచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. మందులు వాడినా రక్తస్రావం తగ్గకపోతే- దాన్ని ఆపేందుకు ఇన్‌ఫ్రారెడ్‌ కిరణాలతో అక్కడి రక్తనాళం మూసుకుపోయేలాగా చికిత్స లేదా ఆ రక్తనాళంలోకి మందును ఎక్కించి అది మూసుకుపోయి, తొలగిపోయేలా చేసే 'స్ల్కెరోథెరపీ' వంటివి చేస్తారు.

*మొలలు రెండో దశలో ఉంటే 'రబ్బర్‌బ్యాండ్‌ లైగేషన్‌' బాగా పనిచేస్తుంది.* ఇందులో ఒక పరికరం ద్వారా పైల్స్‌ను పైకి లాగి, దాని మూలం దగ్గర గట్టిగా రబ్బరు బ్యాండు వేసేస్తారు. దాంతో దానికి రక్తసరఫరా నిలిచిపోయి, పైల్స్‌ ఎండి, వారంలో రాలిపోతాయి. ఈ దశలో అవసరమైతే స్ల్కెరోథెరపీ, ఇన్‌ఫ్రారెడ్‌ చికిత్సలూ ఉపకరిస్తాయి.

*మూడు, నాలుగో దశల్లో ఉన్న మొలలకు సర్జరీ చెయ్యాల్సి ఉంటుంది.* గతంలో వీటికి మలద్వారాన్ని తెరిచి, తొలగించే 'ఓపెన్‌ ఆపరేషన్‌' చేస్తుండేవారు. ప్రస్తుతం స్టేప్లర్‌, డిజీహాల్‌ ప్రక్రియలతో తేలికగా పూర్తిచేసే అధునాతన సర్జరీ విధానాలూ అందుబాటులో ఉన్నాయి.
మొలలు-క్యాన్సర్లు
మొలలను చాలా వరకూ రోగి చెప్పే లక్షణాల ఆధారంగా, మలద్వారంలోకి ప్రోట్రోస్కోప్‌ పంపి చూడటం ద్వారానే నిర్ధరిస్తారు. అయితే 40 ఏళ్లు దాటిన వారిలో మలద్వారం నుంచి రక్తం పడుతుంటే మొలలుగా కొట్టిపారెయ్యకుండా.. తప్పనిసరిగా కొలనోస్కోపీతో గానీ సిగ్మాయిండోస్కోపీతో గానీ పరీక్షించాలి. మలాశయంలో వారికి క్యాన్సరేమైనా ఉందేమో చూడాలి. ఎందుకంటే మలద్వార క్యాన్సర్‌లోనూ మలంలో రక్తం పడటం వంటి మొలల లక్షణాలే కనిపిస్తాయి. దాన్ని మనం గుర్తించలేకపోతే పరిస్థితి ప్రమాదకరంగా పరిణమిస్తుంది. పైగా- మొలలతో పాటు క్యాన్సర్‌ కూడా ఉన్నవారికి ఆ విషయం గుర్తించకుండా కేవలం మొలలకు మాత్రమే ఆపరేషన్‌ చేస్తే... క్యాన్సర్‌ కణాలు అక్కడికి వచ్చి స్థిరపడి అక్కడ పెరగటం మొదలుపెడతాయి. దీంతో మలద్వారం, పురీషనాళం మొత్తం తొలగించాల్సి ఉంటుంది. అదే క్యాన్సర్‌ను తొలిదశలోనే గుర్తిస్తే ఆ భాగాన్ని మాత్రమే తొలగిస్తే సరిపోతుంది.

*మొలలు క్యాన్సర్‌గా మారతాయేమోనన్న భయం మాత్రం అక్కర్లేదు.*, 


మొలలు- ముక్కొద్దు
అసలు మొలలు రాకుండా నివారించుకోవాలంటే... ప్రతి ఒక్కరూ కూడా విరేచనం మెత్తగా, సాఫీగా అయ్యేలా చూసుకోవాలి. ముఖ్యంగా- విసర్జన కోసమని బలంగా గంటల తరబడి ప్రయత్నించకూడదు. ముక్కకూడదు. పీచు ఎక్కువగా ఉండే పళ్లూ కూరగాయలూ నిత్యం ఎక్కువగా తీసుకోవటం, నీళ్లు ఎక్కువగా తాగటం ముఖ్యం. దీంతో విరేచనం ముక్కాల్సిన అవసరం లేకుండా మెత్తగా, తేలికగా, సాఫీగా అవుతుంది. ఇప్పటికే మొలలు ఉన్నవాళ్లు అవి ముదరకుండా చూసుకునేందుకు, అలాగే ఇప్పటికే ఒకసారి మొలలకు సర్జరీల వంటి చికిత్సలు చేయించుకున్న వారు మళ్లీ వాటి బారినపడకుండా ఉండేందుకు కూడా ఇవే జాగ్రత్తలు పాటించటం అవసరం.
మొలలు సర్జరీలు
*ఓపెన్‌ ఆపరేషన్‌: మలద్వారాన్ని తెరిచి.. మొలలను పూర్తిగా తొలగించే విధానం ఇది. మొలలు మరీ పెద్దగా ఉన్నప్పుడు కొందరికి ఇది ఇప్పటికీ తప్పకపోవచ్చుగానీ.. ఈ ఆపరేషన్‌ను సరిగా చేయకపోతే మాత్రం మలవిసర్జన మీద పట్టు కోల్పోయే (ఇన్‌కాంటినెన్స్‌) ప్రమాదముంది. విసర్జన మీద పూర్తి పట్టు ఉండాలంటే ఆ మెత్తటి పొరలు (పైల్స్‌) అవసరం. కానీ ఆపరేషన్‌ ద్వారా మొలలను తొలగిస్తే ఈ మేరకు కొంత పట్టు తగ్గే అవకాశం ఉంటుంది. అలాగే మొలలను తొలగించే సమయంలో కొన్నిసార్లు- లోపలి కండర వలయం (స్ఫింక్టర్‌) కూడా కొద్దిగా దెబ్బతినొచ్చు. దానివల్లా విసర్జన మీద పట్టు తప్పే అవకాశం ఉంటుంది. ఇటువంటి ఇబ్బందులు కొన్ని ఉన్నా- మొలలు చాలా పెద్దగా ఉండి, పూర్తిగా బయటకు పొడుచుకొచ్చి, వేలితో నెట్టినా లోపలికి వెళ్లని వారికి ఇప్పటికీ ఈ పద్ధతి తప్పదు.
*స్టేప్లర్‌: ఇది విరివిగా వాడకంలోకి వచ్చిన అధునాతన పద్ధతి. ఉబ్బి బయటకు పొడుకొచ్చిన పైల్స్‌ను తొలగించకుండా.. వాటిని లోపలికి నెట్టి.. అవి మళ్లీ కిందికి జారకుండా దానికంటే పైభాగాన్ని కత్తిరించి, దగ్గరకు లాగి కుట్లు వేయటం దీని ప్రత్యేకత. దీనిలో- ముందుగా గొట్టంలాంటి పరికరంతో బయటకు పొడుచుకొచ్చిన పైల్స్‌ను లోపలికి.. అంటే పైకి నెడతారు. దీంతో మలద్వారం లోపల.. తిత్తిలాగా.. కొంతభాగం సాగినట్లుగా తయారవుతుంది. దాన్ని స్టేప్లర్‌తో కత్తిరించి, దగ్గరకులాగినట్లుగా గుండ్రంగా కుట్లు వేసేస్తారు. దీంతో ఇక మొలలు కిందికి జారవు. మలద్వారం తిరిగి బిగువుగా తయారైపోతుంది. ఈ ప్రక్రియలో మొలలకు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాలనూ కొద్దిగా కత్తిరిస్తారు. దాంతో ఉబ్బిఉన్న మొలలు కాస్తా... ఆరు వారాల నుంచి మూడు నెలల్లోపు కుంచించుకుపోయి తిరిగా మామూలు ఆకారానికి వచ్చేస్తాయి. ఈ విధానం ప్రత్యేకత ఏమంటే పైకి పుండు, రక్తస్రావం వంటివేమీ కనబడవు. సర్జరీ అంతా లోపలే జరుగుతుంది, తెరుచుకున్నట్టుగా ఉండే పుండు ఏదీ ఉండదు. కాబట్టి వెంటనే పనులకు వెళ్లిపోయేటంత సౌకర్యం ఉంటుంది. సర్జరీ సమయంలో రక్తస్రావం, నొప్పి చాలా తక్కువ. తర్వాత స్టేపుల్స్‌ (పిన్నులు) వాటంతట అవే వూడి పడిపోతాయి. 3-5 రోజుల్లోనే తిరిగి మామూలుగా పని చేసుకోవచ్చు. ఇందులో విసర్జన మీద పట్టుకోల్పోయే అవకాశం అసలే ఉండదు. ఇన్‌ఫెక్షన్ల బెడదా ఉండదు. అయితే ఒకసారి ఉపయోగించిన స్టేప్లర్‌ను తిరిగి వాడటానికి అవకాశముండదు కాబట్టి.. దీనికయ్యే ఖర్చుకాస్త ఎక్కువగా ఉంటుంది.

*డిజీహాల్‌: 'డాప్లర్‌ గైడెడ్‌ హెమరాయిడ్‌ ఆర్టరీ లైగేషన్‌' అనే ఈ ప్రక్రియ* అంత విస్తృత స్థాయిలో ప్రచారంలో లేదుగానీ దీనిలో- ధమనిలోని రక్తప్రవాహ శబ్దాన్ని పసిగట్టి వినిపించే డాప్లర్‌ గొట్టాన్ని మలద్వారంలోకి ప్రవేశపెడతారు. దాని సాయంతో సరిగ్గా ఆ ధమనిని పట్టుకుని, దాని మీద కుట్టు వేసేస్తారు. దీంతో పైల్స్‌కు రక్త సరఫరా తగ్గిపోతుంది. ఉబ్బిన పైల్స్‌ కొద్దిగా కుంచించుకుపోతాయి. అయితే దీంతో పైల్స్‌ పూర్తిగా లోపలికి పోవటం లేదని గమనించి, ఈ ప్రక్రియను మరింత ఆధునికీరించారు. ఇదే 'డిజీహాల్‌ విత్‌ రెక్టో ఆనల్‌ రిపేర్‌'. ఇందులో చాలా కుట్లు కూడా వేసి మొలలు లోపలికి వెళ్లేలా చేస్తారు.

ఏ విధానంలో ఆపరేషన్‌ చేసినా... వీటితో మొలలు పూర్తిగా తగ్గిపోయినా కూడా.. ఆ తర్వాతా ముక్కకుండా ఉండటం, మలబద్ధకం తలెత్తకుండా ఆహార నియమాల వంటివి పాటించటం తప్పనిసరి. లేకపోతే తిరిగి మొలలు ఏర్పడే ప్రమాదముంటుంది.
ద్వారంలో రక్తపుగడ్డ.. పెరీయానల్‌ హెమటోమా
కొందరికి మలద్వారం వద్ద బుడిపెలా తోసుకొచ్చి విపరీతమైన బాధ మొదలవుతుంది. ఇది మొలల మాదిరిగానే కనబడుతుంది. కానీ నిజానికిది మొలల సమస్య కాదు. మొలలను నెడితే లోపలికి పోతాయి. కానీ ఇది మలద్వారం వద్ద చర్మానికే పరిమితమైంది కాబట్టి నెట్టినా అక్కడే ఉంటుంది. దీన్ని 'పెరీయానల్‌ హెమటోమా' అంటారు. మలద్వారం దగ్గర చర్మంలో చాలా రక్తనాళాలు ఉంటాయి. తీవ్రంగా ముక్కినపుడు ఆ రక్తనాళాలు పగిలి, అక్కడ రక్తం గడ్డ ఏర్పడుతుంది. ఇది విపరీతమైన నొప్పి కలిగిస్తుంది. కానీ సాధారణంగా ఈ గడ్డ ఏడు రోజుల్లో దానంతటదే తగ్గిపోతుంది. అందుకే దీన్ని 'సెవెన్‌ డేస్‌ వండర్‌ పెయిన్‌' అంటారు. నొప్పి ఎక్కువగా ఉంటే చర్మానికి మత్తు మందు ఇచ్చి, గడ్డను తొలగిస్తారు. మొలలున్నవారికీ ఇలా రక్తపు గడ్డ ఏర్పడే అవకాశముంది.
వృద్ధులకే కాదు, మలవిసర్జన అలవాట్లు సరిగా లేకపోవటం, సరైన ఆహారం తీసుకోకపోవటం వల్ల పిల్లలకు ఈ ముప్పు ఎక్కువ.
ధన్యవాదములు
మి నవీన్ నడిమింటి

9703706660


2, జనవరి 2020, గురువారం

గర్భం పొందుటలో అవాంతరాలను ఎదుర్కొంటున్నారా? ఈ లింక్ లో తెలిపిన సూచనలు పాటిస్తే సులువుగా మరియు త్వరగా గర్భం పొందుతారు...




ప్రతి స్త్రీ ఒక తల్లి కావాలని కలలు కంటుంది. కొందరు తల్లులు అవుతారు, కానీ కొందరి కి మాత్రం ఎప్పటికీ ఒక కలలనే ఉంటుంది. కొందరు మహిళలు చాలా సులభంగా గర్భం దాల్చుతారు, మరికొందరు గర్భాన్ని పొందడంలో చాలా సవాళ్లను ఎదుర్కొంటారు. మీరు కింది సమస్యలను ఎదుర్కొంటున్న వారిలో ఒకరు అయితే, మేము క్రింద పేర్కొన్న చిట్కాల నుండి మీకు సహాయం పొందవ

మీ ఋతుచక్రం గురించి తెలుసుకోండి -

అండోత్సర్గము (ovulation) మరియు ఫలదీకరణం (fertilization) అంటే ఏమిటి?

ప్రతి నెల, మీ అండాశయాలలో ఒకటి అండాలను విడుదల చేస్తుంది, ఊహగా ఒకే అండం. ఈ ప్రక్రియను అండోత్సర్గం (ovulation) అని పిలుస్తారు. అప్పుడు ఈ అండంఫాలోపియన్ గొట్టాల ద్వారా ప్రయాణించి, వీర్యకణంతో కలుస్తుంది. ఈ ప్రక్రియను ఫలదీకరణం (fertilization) అంటారు. ఈ సమయంలో మీ అండోత్సర్గము చక్రాన్ని గుర్తించడం ముఖ్యం ఎందుకంటే సంతానోత్పత్తి కాలం ఐదు రోజులు మాత్రమే ఉంటుంది. ఇది ఎందుకంటే మీ గర్భంలో వీర్యకణాల యొక్క సాధ్యత ఐదు రోజులు మాత్రమే ఉంటుంది, మరియు మీ అండం 12-24 గంటలకు మాత్రమే ఫలదీకరణకు అందుబాటులో ఉంటుంది.

అండోత్సర్గము ట్రాకింగ్ (Ovulation tracking)

ప్రతి స్త్రీకి అండోత్సర్గము వ్యవధి (ovulationperiod) ఆమె ఋతు చక్రం మీద ఆధారపడి ఉంటుంది. సాధారణంగా, ఋతు చక్రంలో 12 నుండి 16 రోజు మధ్య కాలం అత్యంత సంతానోత్పత్యక కాలం అని గైనకాలజిస్ట్ల సూచన. అండోత్సర్గము 28 రోజుల రుతు చక్రంలో 14 వ రోజు జరుగుతుంది మరియు ఈ సమయంలో సంభోగం జరపడం వల్ల గర్భాన్ని పొందే మీ అవకాశాలను పెంచుతుంది. ఉదాహరణకు, ఒక నెలలో 30 వ తేదీన మీ ఋతు చక్రం ప్రారంభమైతే, మరుసటి నెలలో 14 నుండి 18 వ తేదీ వరకు మీ అండోత్సర్గం కాలం ఉంటుంది. 

ఎదో ఒక సరైన శృంగార భంగిమ గర్భాన్నిదాల్చడానికి అవకాశాలను పెంచుతుందని శాస్త్రీయ ఆధారాలు లేవు. అయితే, గురుత్వాకర్షణ-వ్యతిరేక (gravity-defying) భంగిమలైన నిలబడడం లేక కూర్చోవడం మరియు స్త్రీ పైన ఉండే భంగిమలు వీర్యకణాలను ఎగువకి ప్రయాణించడాన్నీ కష్టతరం చేస్తాయి. కాబట్టి, మిషనరీ భంగిమలలో శృంగారం జరిపి గర్భాన్ని పొందడం ఉత్తమం. మీరు వెనుక ప్రవేశ భంగిమ లేదా డాగీ శైలిని కూడా ప్రయత్నించవచ్చు. గర్భాశయం లోకి గర్భాశయ మార్గం సహాయం ద్వారా వీర్యకణాలు ప్రయాణించడానికి సంభోగం తర్వాత (సెక్స్) 15-20 నిమిషాలు మీరు పడుకోవాలని చెప్తారు.

కొన్ని మందులు గర్భధారణ మీద ప్రతికూల ప్రభావాన్ని కలిగి ఉంటాయి. మీరు ఈ క్రింది ఔషధాలలో ఏదైనా వాడుతుంటే, గర్భంకోసం ప్రయత్నించే ముందు మీ వైద్యుడిని సంప్రదించాలి.

  • యాంటీఇన్ఫ్లమేటరీ మందులు
  • వీటిలో ఐబుప్రోఫెన్ లేదా ఆస్పిరిన్ వంటి ఎక్కువ ప్రతికూలంగా ఉండే మందులు ఉన్నాయి.
  • కీమోథెరపీ
  • క్యాన్సర్ చికిత్స కోసం కీమోథెరపీలో ఉపయోగించే మందులు శాశ్వత అండాశయ వైఫల్యాన్ని కలిగిస్తాయి.
  • న్యూరోలెప్టిక్ మందులు
  • ఇవి ఋతు చక్రాలకు అంతరాయం కలిగించే యాంటిసైకోటిక్ మందులు. వంధ్యత్వానికి (infertility) కూడా కారణం కావచ్చు.
  • స్పిరోనోలక్టన్ (Spironolactone)
  • ఈ ఔషధం శరీరంలో ద్రవం నిలుపుదల (ఫ్లూయిడ్ రేటెన్షన్) తగ్గించడానికి ఉపయోగిస్తారు. ఈ మందు వ్యతిరేక ప్రభావాలు కలిగి ఉంటుంది మరియుఈ మందు వాడడం ఆపిన కొద్ది నెలల తర్వాత మీరు గర్భం ధరించవచ్చు.
  • నొప్పి నివారిణులు (pain killers)
  • యాంటిడిప్రేసన్ట్స్
  • మీ భాగస్వామి ఈ క్రింది ఔషధాలలో ఏదో ఒకదానిని తీసుకుంటున్నారేమో గమనించి, ఒకవేళ తీసుకుంటుంటే మీరు వైద్యుడిని సంప్రదించాలి:
  • టెస్టోస్టెరాన్
  • ప్రత్యామ్నాయటెస్టోస్టెరాన్ (కంప్లీమెంటరీ టెస్టోస్టెరాన్ అని కూడా పిలుస్తారు) సహజ టెస్టోస్టెరాన్ ఉత్పత్తిని ప్రభావితం చేస్తుంది, ఇది వీర్యకణాల ఉత్పత్తిని నిరోధిస్తుంది.
  • అనాబాలిక్ స్టెరాయిడ్స్
  • ఇవి కండరాల పెరుగుదల పెంచడానికి మరియు శరీర కొవ్వు తగ్గించేందుకు ఉపయోగిస్తారు. కానీ, ఈ మందు ఉపయోగించడం వల్ల మీ సంతానోత్పత్తి కూడా ప్రభావితమవుతుంది. అందువల్ల, మీ భాగస్వామి బాడీబిల్డర్ అయితే, అతడు బాడీ బిల్డింగ్ ప్రయత్నాలను ఆపాలి.
  • యాంటిడిప్రెసెంట్స్ మరియు ఆందోళనవ్యతిరేక (యాంటీ ఆంక్సియేటి) మందులు
  • ఒత్తిడి మరియు నిస్పృహ (డిప్రెషన్) చికిత్సకు ఉపయోగించే కొన్ని మందులు పునరుత్పాదక మార్గంలో ప్రవేశించవచ్చు మరియు వీర్యకణాల యొక్క చలనాన్ని తగ్గించవచ్చు.
  • యాంటీ ఫంగల్ మందులు
  • కేటోకానజోల్, ఒక యాంటి ఫంగల్ మందు, దాని నోటి (oral) టాబ్లెట్గా ఉపయోగించినట్లయితే టెస్టోస్టెరాన్ మరియువీర్యకణాల ఉత్పత్తిని ప్రభావితం చేస్తుంది.

శాస్త్రీయ అధ్యయనాలు ఆడవాళ్ళలో మద్యపాన అలవాటు, గర్భధారణ యొక్క అవకాశాలను తగ్గిస్తుందని చూపుతున్నాయి. స్త్రీలు మద్యం సేవిస్తే, తమ సంతానయోగ్యమైన కాలంలో శృంగారం తరువాత కూడా ఆమెకు గర్భధారణ అవకాశాలు తగ్గుతాయని పరిశోధకులు నిర్ధారించారు.

ఒకవేళ, మీరు ఒక వారంలో ఐదు రోజులు మద్యం త్రాగుతూ ఉంటే అప్పుడు మీకు పిల్లలను కలిగే అవకాశాలు చాలా వరకు తగ్గిపోతాయి. ఇది కష్టంగా ఉండవచ్చు, కానీ మీరు ఒక బిడ్డను కోరుకుంటే, మీరు మరియు మీ భాగస్వామి వైన్, విస్కీ, స్కాచ్ లేదా ఆల్కహాల్ ఆధారిత పానీయాల నుండి దూరంగా ఉండాలని.మీ భాగస్వామి తన వీర్యం యొక్క నాణ్యతతో రాజీపడకూడని కోరుకుంటే అతడు మద్యపానానికి దూరంగా ఉండాలని మీరు తెలియజేయాలి. అధిక మద్యపానం రక్త సీరం (blood serum) లో టెస్టోస్టెరాన్ స్థాయిని పెంచుతుంది, ఇది వీర్యం యొక్క పరిమాణాన్ని అలాగే వీర్య కణాలను తగ్గిస్తుంది. అధిక మద్యపానం శృంగార సమయంలో మీ పనితీరును కూడా ప్రభావితం చేయవచ్చు. ఇదికాకుండా, మీరు మరియు మీ భాగస్వామీ కాఫీ మరియు ధూమపానాన్ని తగ్గించాలి.

మీరు గర్భం పొందడానికి ప్రణాళిక చేస్తున్నట్లయితే మీరు తినకూడని కొన్ని ఆహార ఉత్పత్తులు ఉన్నాయి,

చక్కెర

చక్కెరలో ఉండే కార్బోహైడ్రేట్ మీ శరీరానికి హాని కలిగిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇది మీ రక్త సీరం లో ఇన్సులిన్ స్థాయిని సమతుల్యం చెయ్యడం కష్టం చేస్తుంది. అందువల్ల గర్భిణీ స్త్రీలు అధికంగా చక్కెరను తినకూడదు. శుద్ధి చేసిన చక్కెర కలిగిన ఆహార ఉత్పత్తుల నుండి దూరంగా ఉండండి.

పాదరసం (mercury)

చేపలు మాంసకృత్తుల (ప్రోటీన్)తో  పుష్కలంగా ఉంటాయి, కానీ కొన్నిసార్లు అవి పెద్ద మొత్తంలో పాదరసాన్నికలిగి ఉంటాయి. ఈ పాదరసం అధికంగా మీ రక్తంలో కరిగిపోతే, అది మీ సంతానోత్పత్తిపై ప్రతికూల ప్రభావాలను చూపిస్తుంది. మీరు మీ గర్భధారణ సమయంలో లేదా ముందు, పాదరసం ఎక్కువగా ఉండే చేపలను తింటే, మీ గర్భంలో అభివృద్ధి చెందుతున్న బిడ్డ యొక్క మెదడు మరియు నాడీ వ్యవస్థను తరువాత ప్రభావితం చేయవచ్చు.

మీ శారీరక మరియు పునరుత్పత్తి ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు, మీరు పుష్కలంగా పండ్లు మరియు కూరగాయలను తినాలి. ఆహారం మరియు సంతానోత్పత్తిపై ఎనిమిదేళ్లపాటు 18000 మంది మహిళలపై జరిపిన అధ్యయనాలు, మహిళల్లో సంతానోత్పత్తి మెరుగుపరిచే ఎనిమిది విషయాలను ఈ క్రింది విధంగా తెలిపాయి:

  • అన్ సాచురేటెడ్ నూనె
    ఇది నేరేడు, బాదం, ఆలివ్ నూనె మరియు అవోకాడో నూనె వంటి గింజలు మరియు
  • గింజలలో కనిపిస్తుంది. ఇది ఇన్సులిన్ పై శరీర కణాల యొక్క సున్నితత్వాన్ని పెంచుతుంది మరియు వాపు తగ్గించడంలో సహాయపడుతుంది. మీ సంతానోత్పత్తి మెరుగుపరచడానికి ఈ రెండు గుణాలు ముఖ్యమైనవి.
  • సాల్మొన్ మరియు సార్డిన్ వంటి చేపలను మీరు మంచి ప్రదేశాల నుండి కొనుగోలు చెయ్యాలి, ఎందుకంటే కుళ్ళిన చేపలు తినడం వల్ల మీ ఆరోగ్యం తీవ్రంగా ప్రభావితమవుతుంది.
  • బీన్స్, బఠానీలు మరియు గింజలు వంటి ప్రోటీన్ కూరగాయల తినండి.
  • తృణధాన్యం, కూరగాయలు, పండ్లు తినండి.
  • పాలు మరియు పూర్తి క్రీమ్ గలపెరుగు లేదా యోగర్ట్ ను తీసుకోండి.
  • ఫోలిక్ ఆమ్లం మరియు మల్టీవిటమిన్లను తీసుకోండి.
  • తృణధాన్యం, గుమ్మడి, బచ్చలికూర, టమాటాలు, మరియు బీట్రూట్లు వంటి ఐరన్ ఎక్కువగా ఉండే ఆహారం తినడం ఆరోగ్యానికి మంచిది.
  • నీటి పుష్కలంగా త్రాగాలి.
  • ఇది కాకుండా, 20-24 మధ్య ఉండే BMI (బాడీ మాస్ ఇండెక్స్)తో  ఆరోగ్యకరమైన బరువును నిర్వహించండి. BMI అనేది మీ బరువు మరియు ఎత్తు యొక్క ప్రమాణాన్ని లెక్కించే సూచిక. అధిక బరువు ఉండటం వలన క్రమరహిత ఋతు చక్రాలకు దారి తీయవచ్చు మరియు అండోత్సర్గం (ovulation) ప్రక్రియను కూడా ప్రభావితం చేయవచ్చు. అందువల్ల, చురుకుగా ఉండటం మరియు క్రమంగా వ్యాయామం చెయ్యడం కూడా చాలా ముఖ్యం.
  • మీ వైద్యసంబంధమైన చరిత్రను స్రీలవైద్యనిపుణులకు (గైనకాలజిస్ట్) వివరంగా తెలియజేయండి. మీరు అధిక రక్తపోటుమధుమేహంపిసిఒఎస్ (పాలీసిస్టిక్ ఓవరియన్ సిండ్రోమ్), థైరాయిడ్ సమస్యలు మొదలైన వ్యాధులకు మందుల మీద ఉంటే వైద్యునికి తెలియజేయండి. మీ మునుపటి గర్భధారణ లేదా గర్భస్రావం (ఏదైనా ఉంటే) గురించి, ఆహారం మరియు జీవనశైలి గురించి మీ వైద్యుడికి తెలియజేయండి.

చాలా తరచుగా, మహిళలు తెలియకుండానే గర్భాన్ని నిరోధించే కొన్ని తప్పులు చేస్తారు. మీరు శృంగారం తర్వాత చేయకూడని కొన్ని విషయాలను పరిశీలించండి:

శృంగారం జరిపిన వెంటనే నిలబడడం

కొంతమంది స్త్రీలు శృంగారం జరిపిన వెంటనే నిలబడి పోతారు, ఇది వీర్యకణాలు వాళ్ళ శరీరంలో పైకి వెళ్ళడానికి బదులుగా బయటకు వచ్చేసేలా చేస్తుంది. కాబట్టి శృంగారం జరిపిన తరువాత,కొంతసేపు ఆలా వెనుకకి జారబడి ఉండాలి వేయండి, అది వీర్యకణాలు మీ గర్భాసయం లో ఉన్నఅండాన్ని కలిసేటట్లు చేస్తుంది.

శృంగారం తర్వాత మిమ్మల్ని మీరు శుభ్రం చేసుకోవడం

కొందరు మహిళలు అంటువ్యాధులను నివారించడానికి సెక్స్ తర్వాత వారి యోనిని శుభ్రం చేసుకుంటారు. యోనిని నీటితో శుభ్రపరిచేటప్పుడు, వీర్యకణాలు వారి శరీరం నుండి బయటకు వచ్చేస్తాయి అందువలన వారు గర్భాన్ని పొందలేరు. కాబట్టి, గర్భం పొందే అవకాశాలను పెంచడానికి, శృంగారం జరిపిన వెంటనే మిమ్మల్ని మీరు శుభ్రం చేసుకోకుండా ఉండాలి.

గర్భాన్ని పొందడం చాలా వరకు మీ శరీరం మీద ఆధారపడి ఉంటుంది. గర్భం దాల్చేముందు, మీరు మీ వైద్యున్ని కలసి, గర్భధారణ యొక్క మొత్తం ప్రక్రియను గురించి తెలుసుకోవాలి. మీరు దాని కోసం కొన్ని పరీక్షలు చేయించుకోవలసి ఉంటుంది.ఈ పరీక్షలు మీ శరీరం గర్భం కోసం సిద్దపడి ఉందా లేదా అని తెలియజేస్తాయి. ఈ పరీక్షల ద్వారా, మీ శరీరంలో ఏదైనా అసాధారణత ఉంది అని తెలిసినట్లయితే దానికి ప్రారంభ దశలో పూర్తిస్థాయిలో చికిత్స పొందాలి.

మీరు ఏ పనిని అయినా ప్రారంభించడానికి ముందు ఒక ప్రణాళికను రూపొందించడం చాలా ముఖ్యం. అదేవిధంగా, మీ శరీరాన్ని మరియు మనస్సుని పూర్తిగా గర్భధారణ కోసం తయారు చేయడానికి జాగ్రత్తయిన ప్రణాళిక అవసరం.దాని కోసం, మీరు కొన్ని ముఖ్యమైన విషయాలను ప్రారంబించవలసి ఉంటుంది. వాటిలో ఒకటి ఫోలిక్ యాసిడ్ ను క్రమముగా తీసుకోవడం. ఇందులో, మీరు ఒక నెల ఫోలిక్ యాసిడ్ (విటమిన్ B9) ఉండే పదార్ధాలు తీసుకోవాల్సి ఉంటుంది. విటమిన్ B9 గర్భధారణ సమయంలో సంభవించే పలు సమస్యలను నిరోధిస్తుంది. అదీకాకుండా, ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడానికి ఫోలిక్ యాసిడ్ చాలా ముఖ్యం. అధిక బరువు ఉండటం వల్ల మీ శరీరం అనేకరకాలైన వ్యాధుల బారిన పడేలా చేస్తుంది. అందువల్ల మీ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడం ముఖ్యం. మీ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి, అవి:

మీరు గర్భాన్ని పొందడానికి ప్రయతించే ముందు మీ శరీరం ఆరోగ్యంగా ఉంచుకోవడం ముఖ్యం.

మీరు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోకపోతే, మీరు గర్భధారణ సమయంలో కొన్ని సమస్యలు మరియు కష్టాలు అనుభవించవచ్చు. ఈ సమస్యలను నివారించడానికి, మీరు మొదట మీ ఆహారంలో కొవ్వు మరియు ప్రోటీన్-రిచ్ ఆహార పదార్ధాలు తగినంత మొత్తంలో చేర్చాలి. మీరు గర్భాన్ని పొందడానికి ముందు బరువు తగ్గించాలని కోరుకుంటే, కొవ్వులో కొంచెం తక్కువగా ఉండి, మరియు ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని తినాలి. అంతే కాకుండా మీ ఆహారంలో కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, కొవ్వులు, విటమిన్లు మరియు ఖనిజాలు కూడా చేర్చుకోవాలి. ఇవి మీ శరీరంలోని హార్మోన్ స్థాయిలను సమతుల్యపరచడంలో సహాయపడతాయి మరియు మీరు గర్భదారణను సులభతరం చేస్తాయి.

కార్బోహైడ్రేట్ల యొక్క నిర్దిష్ట స్థాయి మన శరీరానికి ఎంతో ముఖ్యం. కార్బోహైడ్రేట్ గర్భధారణకు అవసరమైన ముఖ్యమైన పోషకాలలో ఒకటిగా పరిగణించబడింది.ఇది కేవలం గర్భం కోసమే ముఖ్యమైనది కాకుండా,మన శరీరంలోని ప్రాథమిక జీవక్రియ (శక్తి ఉత్పత్తి) ప్రక్రియల్లో కూడా ఇది ముఖ్యమైన భాగం. ప్రాసెస్ చేసిన మరియు చైనీస్ ఆహారం వంటి శరీరానికి హాని కలిగించే కార్బోహైడ్రేట్లు అధికంగా ఉన్న ఆహారాన్ని తినకుండా ఉండటం కూడా చాలా ముఖ్యమైనది. బదులుగా, మీరు ఆకుపచ్చ కూరగాయలు మరియు పండ్లు తినాలి. కార్బోహైడ్రేట్ల యొక్క సహజ వనరులు తీపి బంగాళాదుంపలు, బంగాళాదుంపలు, చామదుంప ("అర్బి"), పప్పులు, అరటిపండ్లు, మామిడి, బీన్స్ మరియు ఇతర కూరగాయలు (అన్ని పండ్లు కార్బోహైడ్రేట్ల మంచి మూలం) .

మన శరీరంలో కొవ్వు, ముఖ్యంగా అన్-సాచురేటెడ్ కొవ్వు అవసరం. ఇది శరీరానికి ఆరోగ్యకరమైనదిగా పరిగణించబడుతుంది. శరీరం యొక్క సరైన పనితీరులో ఇది సహాయపడుతుంది. ఇది మన రక్తంలో లో చెడ్డ కొలెస్ట్రాల్ (ఎక్కువ సాంద్రత కలిగిన లిపోప్రొటీన్ లేదా HDL) స్థాయిని తగ్గిస్తుంది. HDL యొక్క పెరిగిన స్థాయి గుండె వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. అన్-సాచురేటెడ్ కొవ్వు మన ఎముకలలో కాల్షియం పెరుగుదలకు సహాయపడుతుంది, అందుకే అన్-సాచురేటెడ్ కొవ్వు మన ఎముకలకు కూడా చాలా ముఖ్యమైనది. ఎముకలకే కాకుండా, అన్-సాచురేటెడ్ కొవ్వు కాలేయం, ఊపిరితిత్తులు, మెదడు, నరములు మరియు రోగనిరోధక వ్యవస్థ వంటి ఇతర శరీర అవయవాలకు కూడా చాలా ముఖ్యమైనది.

గర్భిణీ స్త్రీ యొక్క శరీరానికి ప్రధానంగా కొవ్వు ఆమ్లాలు (ఫ్యాటీ యాసిడ్స్) అవసరం. అవి హార్మోన్ల యొక్క సాధారణ పనితీరులో సహాయపడతాయి మరియు గర్భాశయం (శిశువును మోసే ఒక పియర్ ఆకారపు బ్యాగ్-వంటి నిర్మాణం) యొక్క రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. అవి కూడా అండోత్సర్గము చక్రం (ovulation cycle) నియంత్రిస్తాయి మరియు గర్భాశయ మార్గాన్ని (యూనిమార్గం లో ఒక భాగం) ఆరోగ్యకరమైన ఉంచుతాయి. అందువలన, ఇవి అండంతో  వీర్య కణాలను (స్పెర్మ్ సెల్స్) విజయవంతంగా కలవడానికి సహాయపడతాయి. అన్-సాచురేటెడ్ కొవ్వు యొక్క ముఖ్యమైన సహజ వనరులు కొబ్బరి మరియు కొబ్బరి నూనె, ఆలీవ్లు మరియు ఆలివ్ నూనె, వెన్న, గుడ్లు, అవోకాడో,ఎండు పండ్లు, మొదలైనవి జంక్ ఫుడ్ మరియు శుద్ధి చేసిన నూనెలో వండబడిన ఆహార పదార్దాలు శరీరానికి హానికరం. అందువల్ల, సహజంగా లభించే అన్-సాచురేటెడ్ కొవ్వును మాత్రమే మీరు తినాలి.

గర్భధారణ కోసం ప్రోటీన్లు ముఖ్యమైనవి. శరీరానికి ప్రోటీన్లు ఒక ముఖ్యమైన పోషకాలు అని భావిస్తారు. అమెరికన్ కాలేజ్ ఆఫ్ ఒబెస్ట్రీషియన్స్ (obstetricians) మరియు గైనకాలోజిస్ట్స్ నిర్వహించిన ఒక పరిశోధనలో, ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహారం తినడం వల్ల ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ (IVF) పద్ధతిలో సంతానోత్పత్తి ని (పునరుత్పాదక సామర్థ్యం) పొందిన మహిళల మీద సానుకూల ప్రభావాన్ని చూపిందని కనుగొనబడింది. కాబట్టి, ప్రోటీన్లు అధికంగా మరియు కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉన్న ఆహారం, మహిళల్లో అండాల నాణ్యతను మెరుగుపరుస్తుంది. అందువల్ల, మీరు ప్రోటీన్లు ఎక్కువగా మరియు కార్భోహైడ్రేట్లు తక్కువగా ఉన్న ఆహారం కనీసం గర్భం దాల్చాడానికి మూడు నెలలు ముందు నుండి ఒక ప్రణాళిక వేసుకొని తినడం ముఖ్యం. చికెన్, గుడ్లు, తక్కువ కొవ్వు ఉన్న మాంసం, చేపలు, పాల ఉత్పత్తులు, బీన్స్, మరియు ఎండు పండ్లు వంటి వివిధ ఆహార ఉత్పత్తుల నుండి ప్రోటీన్ పొందవచ్చు.

నీరు మన శరీరానికి చాలా ముఖ్యమైనది అని భావిస్తారు. నిర్జలీకరణం (డిహైడ్రాషన్) అన్ని శరీర భాగాల సాధారణ పనితీరును అడ్డుకుంటుంది. మీరు గర్భం పొందడానికి అన్ని శరీర భాగాలు సరిగా పనిచేయడం చాలా ముఖ్యం. తగినంత నీటిని తాగడం వల్ల,అది మీ గర్భాశయాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంద. ఇది గర్భాశయ శ్లేష్మం (మ్యూకస్) యొక్క ఉత్పత్తిని పెంచుతుంది, అది వీర్య కణాలు అండం వరకు ప్రయాణించడానికి ఒక మాధ్యమాన్ని అందిస్తుంది. అందువల్ల, గర్భం ధరించడానికి, మీరు ప్రతిరోజూ తగినంత నీరు త్రాగడం ఎంతో ముఖ్యమైనది.

ఒక ఆరోగ్యకరమైన దినచర్య మిమ్మల్ని చాలా వ్యాధుల నుండి దూరంగా ఉంచుతుంది. ఒక విజయవంతమైన గర్భధారణ కోసం, మీరు ఈ విధంగా మీ దినచర్యను మార్చుకోవచ్చు:

తగినంత నిద్రపోండి

అన్ని శరీర భాగాలు మరియు అంతర్గత అవయవాలు సరిగ్గా మరియు సమర్ధవంతంగా పనిచేయడానికి గాఢంగా నిద్రపోవడం చాలా ముఖ్యం. శరీర హార్మోన్లను నిర్వహించడం లో ఇది ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.మెలటోనిన్ మరియు సెరోటోనిన్ల (నిద్రకు చాలా ముఖ్యమైన హార్మోన్లు) తక్కువ స్థాయి ల్టియల్ ఫేజ్ (luteal phase) యొక్క కాలవ్యవధిని తగ్గిస్తుందని అది అండోత్సర్గము (ovulation) మరియు ఋతు చక్రం (menstrual cycle)తో  సంబంధం కలిగి ఉందని అధ్యయనాలు సూచిస్తున్నాయి.

క్రమం తప్పకుండా వ్యాయామం చెయ్యండి

క్రమమైన వ్యాయామం మీరు సులభంగా గర్భందాల్చడానికి సహాయపడుతుంది. అందువల్ల మీరు ఆరోగ్యకరమైన బరువును కొనసాగించి మరియు మీ గర్భాశయం ఆరోగ్యంగా మరియు క్రియాశీలంగా ఉంచడంలో సహాయపడే వ్యాయామాలను మీ దినచర్య లో భాగంగా చేసుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం అనేది, గర్భధారణకు ఆటంకం కలిగించే వ్యాధులను నివారించడానికి కూడా సహాయం చేస్తుంది.

ఒత్తిడి లేకుండా ఉండండి / మీ ఒత్తిడిని విడుదల చేయండి

గర్భధారణను ఆటంకపరుస్తున్న ప్రధాన కారకాల్లో ఒత్తిడి కూడా ఒకటి. మీరు మీ ఒత్తిడిని విడిచిపెట్టడానికి యోగా మరియు ధ్యానం సాధన చేయవచ్చు.

గర్భాన్ని పొందడానికి, మీ మరియు మీ భాగస్వామి యొక్క లైంగిక ఆరోగ్యం పై శ్రద్ధ వహించాలి. పునరుత్పాదక వ్యవస్థ (reproductive system) లో ఉన్న ఏదైనా అసాధారణత, గర్భం దాల్చడం లో సమస్యలు మొదలైయ్యేలా చేస్తుంది. అందుకే, మీ జంట మానసికంగా, లైంగికంగా ఆరోగ్యంగా ఉన్నారని నిర్ధారించుకోవాలి.

ఒక మనిషి యొక్క వీర్యం లో విడుదల అయ్యే వీర్య కణాల సంఖ్య మరియు నాణ్యత పెరగడం అనేది విజయవంతమైన గర్భధారణ కోసం చాలా ముఖ్యమైనదని భావిస్తారు. మీ వీర్యం లో వీర్యకణాల సంఖ్యను పెంచడానికి, మీ దినచర్యను మెరుగుపరుచుకోవడం చాలా ముఖ్యం. అలాగే, చెడు అలవాట్లకు మరియు వ్యసనాలకు దూరంగా ఉండటం కూడా ముఖ్యం. పొగాకు, ధూమపానం మరియు మద్యపాన సేవనం మీ లైంగిక ఆరోగ్యంపై హానికరమైన ప్రభావాన్ని కలిగి ఉంటాయి, ఎందుకంటే అవి వీర్య కణాల సంఖ్యను తగ్గిస్తాయి. వీటితో పాటు పురుషులు ఆరోగ్యకరమైన బరువు కలిగి ఉండాలి.

చాలా వేడి నీటిని ఉపయోగించి స్నానం చేయడం వల్ల, ఆ వేడినీరు వీర్య కణాలను నాశనం చేసి, వాటి సంఖ్యను వీర్యంలో తగ్గించవచ్చు.

వీర్య కణాల సంఖ్యను మెరుగుపరచడానికి, మీరు మీ ఆహారాన్ని మార్చి మరియు మెరుగుపరచాలి. మీ ఆహారంలో జింక్, ఫోలిక్ ఆమ్లం మరియు విటమిన్ -సిలను చేర్చుకోవాలి. ఈ పోషకాలు వీర్య కణాల సంఖ్యను పెంచడంలో చాలా ప్రభావవంతమైనవి. ఏదేమైనా, వీర్య కణాల సంఖ్య పెరగడానికి మూడు నెలల వరకు సమయం పడుతుంది.

ఒక విజయవంతమైన గర్భధారణ ఒక మహిళ యొక్క లైంగిక ఆరోగ్యానికి మాత్రమే సంబంధించినది కాదు, దాని అవకాశాలు పురుషుని ఆరోగ్యంపై కూడా ఆధారపడి ఉంటాయి. అందువల్ల పురుషులు కూడా ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడమనేది ముఖ్యమైనది. వీర్యం యొక్క ఉత్పత్తి మరియు నాణ్యతను మెరుగుపరిచే కొన్ని పోషకాలు:

జింక్
ఇది గుమ్మడికాయ మరియు బచ్చలికూరలో ఉంటుంది. ఇది వీర్యకణాల సంఖ్యను పెంచి మరియు వీర్యకణాల చలనము మెరుగుపరుస్తుంది.

విటమిన్ సి
ఇది ఆకు కూరలు మరియు సిట్రస్ పండ్లలో లభిస్తుంది. ఇది వీర్యకణాలు ఉండలుగా మారడాన్ని నుండి నిరోధిస్తుంది.

సెలీనియం మరియు విటమిన్ ఈ (E)
ఇవి బాదం మరియు చియా గింజలలో కనిపిస్తారు మరియు వీర్య కణాల యొక్క నాణ్యతను మెరుగుపరుస్థాయి

ఒమేగా -3 ఫ్యాటీ యాసిడ్స్
అవి చేపల నూనె మరియు చియా విత్తనాలలో లభిస్తాయి, మరియు వీర్య కణాల యొక్క జీవన సామర్ధ్యాన్ని (విజయవంతంగా పని చేసే సామర్థ్యం) మెరుగుపరచబడతాయి.

సొయా గింజలను తినకూడదు ఎందుకంటే సొయా -ఆధారిత ఆహార ఉత్పత్తులు పాలు, టోఫు మరియు ఎడామామెలో జన్యుసంబంధమైనవి ఉంటాయి, ఇవి వీర్యకణాల చలనాన్ని తగ్గించి మరియు వాటిని నాశనం చేస్తాయి.

గర్భధారణ కోసం ఆలోచిస్తున్నప్పుడు స్త్రీలు వారి ఆహారపు అలవాట్లను జీవన శైలిని మార్చుకోవాలి. గర్భధారణ కోసం మీరు మార్చాల్సిన లేదా ఆపవల్సిన అలవాట్లను మీకు మేము తెలియజేస్తున్నాము:

మీరు ఏదైనా జనననియంత్రణ మాత్రలు ఉపయోగిస్తూ ఉంటే, మీ గర్భధారణ కోసం, ముందు వాటిని ఆపాలి. కొన్నిసార్లు గర్భధారణ, మీరు ఉపయోగించిన గర్భనిరోధక పద్ధతిని బట్టి మరియు గర్భనిరోధకాలను ఆపిన తర్వాత, మీ శరీరం గర్భధారణకు అనుకూలంగా మారాడానికి పట్టే సమయాన్ని బట్టి ఉంటుంది. మీరు జనన నియంత్రణ కోసం కాపర్-టిని ఉపయోగిస్తుంటే, దానిని తొలగించిన వెంటనే మీ శరీరం గర్భధారణకు సిద్ధంగా అవుతుంది. కానీ,ఒకవేళ హార్మోన్ మాత్రలు వాడుతుంటే, గర్భధారణ కోసం మీ శరీరం అనుకూలించడానికి కొంత సమయం పడుతుంది. చాలా కాలం జనన నియంత్రణ మాత్రలు ఉపయోగించిన మహిళలుకు గర్భందాల్చడం కోసం ఎక్కువ సమయం పట్టవచ్చు. సాధారణంగా, మాత్రలు ఆపిన తర్వాత, మీ శరీరం గర్భం కోసం సిద్ధం కావడానికి 6-8 వారాలు పడుతుంది.

కండోమును ఉపయోగించకూడదు. గర్భం కోసం చూస్తున్నపుడు ఏవిధమైన జనన నియంత్రణ మందులలైనా ఆపివేయాలి. 

గర్భం పొందడానికి శృంగారం చెయ్యడం చాలా ముఖ్యం. ఇది గర్భం యొక్క పునాది / పునాది-రాయిగా పరిగణించబడుతుంది. మీరు మరియు మీ భాగస్వామి సంభోగిస్తేనే గర్భం దదాల్చడం సాధ్యమవుతుంది. కానీ, సులభంగా గర్భాన్ని పొందేందుకు, మీరు సరైన మార్గాన్ని ఎంచుకోవడం ముఖ్యం. సరైన సమయం లో శృంగారం జరపడం, సంతానోత్పత్తి కాలం, అండోత్సర్గం చక్రం, గర్భం పొందడానికి సరైన భంగిమలు మొదలైనవి కింద వివరించబడ్డాయి.

మీరు మీ అండోత్సర్గాన్ని (ovulation) పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాత, ఆ సమయంలో మీరు శృంగారం జరపాలి. స్పె వీర్యకణం అండంతో  కలవగానే, ఆ రోజు నుంచే గర్భం మొదలవుతుంది. అండోత్సర్గ కాలంలో గర్భాన్ని పొందే అవకాశాలు ఎక్కువ. అందువల్ల, ఇద్దరు భాగస్వాములు అదే సమయంలో స్త్రీ యొక్క గర్భధారణ కోసం ప్రయత్నించాలి.

శృంగార సమయం లో లూబ్రికెన్ట్లను ఉపయోగించి స్పెర్మ్ యొక్క నాణ్యతను ప్రభావితం చేయవచ్చు. బహిర్గతంగా లేదా సమయోచితంగా ఉపయోగించిన లూబ్రికెన్ట్లు వీర్య కణాలను నాశనం చేసే కొన్ని రసాయనాలను కలిగి ఉంటాయి. అనేక అధ్యయనాలు శృంగార సమయంలో లూబ్రికెన్ట్లను ఉపయోగిస్తే వీర్యకణాల యొక్క సామర్థ్యాన్ని తగ్గిస్తుందని తెలిపాయి. లూబ్రికెన్ట్ ను సంభోగ ప్రేరణ (foreplay) సమయంలో ఉపయోగించవచ్చు, కానీ మీరు గర్భం పొందాలి అనుకుంటే,ఉపయోగించకుండా ఉండటానికి ఉండాలి.

మీరు యుక్త వయస్సులో ఉన్నప్పుడు మరియు మీ ఋతు చక్రం మరియు అండోత్సర్గం ప్రక్రియ క్రమముగా ఉన్నప్పుడు, గర్భం దాల్చడానికి ఎక్కువ సమయం పట్టదు. కానీ, మీ వయస్సు పెరిగితే, అది గర్భధారణలో ఆలస్యానికి కారణమవుతుంది. అయితే,గర్భధారణకు ఖచ్చితమైన వయస్సు గురించి తెలియదు, కానీ కొంతమంది నిపుణులు గర్భం కోసం 35ఏళ్ళు దాటిన మహిళలకు కొంచెం సమయం పడుతుంది అని అభిప్రాయ పడతారు. అలాంటి స్త్రీలు ఆరు నెలల పాటు ప్రయత్నించినా కూడా గర్భం ధరించలేక పోతే ఒక వైద్యుడిని సంప్రదించాలి.

35 ఏళ్ల లోపు వయస్సు ఉన్న మహిళలకు ఒక సంవత్సరం ప్రయత్నించినా కూడా గర్భం దాల్చక పోతే వారు వైద్యున్నీ సంప్రదించాలి. 35 ఏళ్ల పైన వయస్సు ఉన్నవారు ఆరునెలల తర్వాత కూడా గర్భాన్ని పొందలేకపోతున్నారని తెలుసుకుంటే వారి వైద్యున్ని సంప్రదించా

అవగాహనా ఆవశ్యకతల కొరకు మాత్రమే. ఇక్కడ ఇవ్వబడిన సమాచారమును ఏదైనా ఆరోగ్య సంబంధిత సమస్య లేదా అస్వస్థత నుండి కోలుకోవడానికి లేదా స్వస్థత కొరకు నిపుణుల సలహా లేనిదే ఉపయోగించుకోకూడదు. చికిత్స పరీక్షలు మరియు సేవల కొరకు ఎల్లప్పుడూ ఒక అర్హత పొందిన వైద్యుల సలహా తీసుకోవాలి.

ధన్యవాదములు 

మీ నవీన్ నడిమింటి 


మగవాళ్ళు లో వీర్యం కణాలు పెరగాలి అంటే నవీన్ డైట్ ప్లాన్


sperm count

ఏంటి ఈ స్పెర్మ్‌ కౌంట్‌ .. మగవారిలో సంతాన సాఫల్యత పెంచడంలో ఇదే కీలకపాత్ర పోషిస్తుంది. అయితే ఈ బిజీ అర్బన్‌ లైఫ్‌లో ఒత్తిడి, ఆహార అలవాట్లు, స్మోకింగ్‌, డ్రింకింగ్‌, ఒబేసిటీ వంటి వాటి వల్ల క్రమంగా పురుషుల్లో వీర్య కణాల సంఖ్య తగ్గిపోతోంది.

దీంతో సంతానం కోసం ఫెర్టిలిటీ సెంటర్ల చుట్టూ తిరుగుతున్నారు. ఈ ప్రక్రియ కూడా చాలా ఖరీదైనదే కావడంతో లక్షలు ఖర్చు చేయాల్సి వస్తుంది. సాధారణంగా మిల్లీలీటర్‌ వీర్యంలో 4 కోట్ల నుంచి 30 కోట్ల వరకూ వీర్య కణాలు ఉండాలి. ఇది కోటి నుంచి రెండు కోట్ల మధ్య ఉంటే తక్కువగా ఉన్నట్లు అర్థం. ఒకవేళ సరిపడా సంఖ్య ఉన్నా అవి ఆరోగ్యకరంగా లేనట్లయితే సంతానం కలగదు. అంటే వాటిలో చలనం (మొటిలిటీ), ఆరోగ్యకర కణాలు.. ఇలా అనేక అంశాలు ఉంటాయి.

స్పెర్మ్‌ కౌంట్‌ తక్కువగా ఉండటానికి అనేక కారణాలు ఉన్నట్లే.. వాటి సంఖ్యను పెంచుకోవడానికి, అవి ఆరోగ్యకరంగా ఉండడానికి చాలా ఆహార పదార్థాలే ఉన్నాయి. వీటిలో చాలా వరకు మనకు సులువుగా దొరికేవే.

మరి స్పెర్మ్‌ కౌంట్‌ పెంచుకోవడానికి ఏం తినాలి? ఏం తినొద్దు? ఇంకా ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో డియర్‌ అర్బన్‌.కామ్‌ అందిస్తున్న ఈ స్టోరీలో చూడండి.

ఏ ఫుడ్‌ తినాలి?

మన ఆరోగ్యం మనం రోజూ తినే ఆహారంపై ఆధారపడి ఉంటుంది. అలాగే స్పెర్మ్‌ కౌంట్‌ కూడా. రోజువారీ ఆహారంలో కొన్ని కౌంట్‌ పెరగడానికి సాయపడితే.. మరికొన్ని తగ్గేలా చేస్తాయి. అందువల్ల ఏది తినాలి? ఏది తినకూడదు అని తెలుసుకోవడం ముఖ్యం.

ముందుగా స్పెర్మ్‌ కౌంట్‌ పెరగడానికి ఏ ఆహారం తీసుకోవాలో చూద్దాం. జింక్‌, విటమిన్‌ సీ, విటమిన్‌ డీ, విటమిన్‌ బీ12, విటమిన్‌ ఇ, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీఆక్సిడెంట్స్‌ ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవాలి. మరి ఇవి వేటిలో ఉంటాయో తెలుసుకోండి.

మెంతులు

మెంతులు మన శరీరంలో టెస్టోస్టెరాన్‌ లెవల్స్‌ను పెంచుతాయి. వీర్య కణాల ఉత్పత్తి, వాటి ఆరోగ్యానికి ఈ టెస్టోస్టెరాన్‌ లెవల్సే కీలకం. ఈ లెవల్స్‌ను మెంతులు ఆరోగ్యకరమైన స్థాయిలో ఉంచుతున్నట్లు ఓ అధ్యయనంలో తేలింది. ఇందులో పాలుపంచుకున్న వాళ్లు ప్రతి రోజూ 600 మిల్లీగ్రాముల మెంతులను 12 వారాల పాటు తీసుకుంటే.. వాళ్లలో టెస్టోస్టెరాన్‌ లెవల్స్‌ పెరిగినట్లు గుర్తించారు.

డార్క్ చాక్లెట్‌

స్పెర్మ్‌ కౌంట్‌ పెరగడానికి ఉత్తమమైన మార్గం.. డార్క్‌ చాక్లెట్‌. కొకొవా గింజలతో ఈ డార్క్‌ చాక్లెట్‌ తయారు చేస్తారు. ఇందులో యాంటీఆక్సిడెంట్స్‌ పుష్కలంగా ఉంటాయి. పైగా వీర్య కణాల సంఖ్యను పెంచేందుకు సాయం చేసే ఎల్‌-ఆర్గినైన్‌ అనే ఎంజైమ్‌ కూడా ఈ డార్క్‌ చాక్లెట్‌లో ఉంటుంది. ప్రతి రోజూ ఓ డార్క్‌ చాక్లెట్‌ తింటే మంచి ఫలితం ఉంటుంది.

గుడ్లు

విటమిన్‌ ఇ, ప్రొటీన్‌ అధికంగా ఉండే గుడ్లు.. వీర్య కణాల వృద్ధికి కూడా సాయపడతాయి. గుడ్డును రోజూ ఏ రూపంలో తీసుకున్నా మంచిదే. మన రోజువారీ ఆహారంలో గుడ్డును కూడా ఒక భాగం చేసుకోవడం చాలా సులువు. పైగా ఆరోగ్యానికి చాలా మంచిది.

అరటిపండ్లు

స్పెర్మ్‌ కౌంట్‌ పెంచుకోవడానికి మనకు సులువుగా లభించే మరో ఆహార పదార్థం ఇది. ఇందులో విటమిన్‌ బీ1తో పాటు విటమిన్‌ సీ, మెగ్నీషియం ఉంటాయి. ఇవి వీర్య కణాల ఉత్పత్తిని పెంచుతాయి. అత్యంత అరుదుగా లభించే బ్రోమెలైన్‌ ఎంజైమ్‌ కూడా అరటిపండ్లలో ఉంటుంది. ఈ ఎంజైమ్‌ కూడా స్పెర్మ్‌ కౌంట్‌ పెరగడానికి సాయపడుతుంది. సెక్స్‌ హార్మోన్లను కూడా అరటిపండ్లు బాగా నియంత్రించగలవు.

వెల్లుల్లి

మనం రోజూ వంటల్లో వాడే వెల్లుల్లిలో సెలీనియం అనే ఎంజైమ్‌ ఉంటుంది. ఇది వీర్య కణాలకు మేలు చేస్తుంది. శరీరంలో అన్ని భాగాలకు రక్త ప్రసరణ సాఫీగా జరగడానికి అవసరమయ్యే అలిసిన్‌ కూడా ఈ వెల్లుల్లిలో ఉంటుంది.

పాలకూర

వీర్య కణాల వృద్ధికి ఎంతగానో సాయం చేసే ఫోలిక్‌ యాసిడ్‌ ఈ పాలకూరలో పుష్కలంగా ఉంటుంది. రోజువారీ ఆహారంలో పాలకూరతోపాటు ఇతర ఆకు కూరలను భాగం చేసుకుంటే.. స్పెర్మ్‌ కౌంట్‌తోపాటు ఆరోగ్యానికీ మంచిది.

వాల్‌నట్స్‌

మెదడు చురుగ్గా పని చేయడానికి వాల్‌నట్స్‌ తినాలని చెబుతారు. అయితే ఇవి వీర్య కణాల సంఖ్యను కూడా పెంచగలవు. ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్‌ ఎక్కువగా ఉండే వాల్‌నట్స్‌.. కణాల నాణ్యతనూ పెంచుతాయి. 2012లో జరిపిన ఓ అధ్యయనం వీర్య కణాలపై వాల్‌నట్స్‌ ప్రభావాన్ని నిరూపించాయి.

21 నుంచి 35 ఏళ్ల మధ్య వయసున్న మగవారిపై ఈ అధ్యయనం నిర్వహించారు. ఇందులో సగం మందికి 12 వారాల పాటు రోజూ 18 వాల్‌నట్స్‌ తినాల్సిందిగా సూచించారు. ఆ తర్వాత చూస్తే వాల్‌నట్స్‌ తినని వాళ్లతో పోలిస్తే.. తిన్నవాళ్లలో వీర్య కణాల వృద్ధి గణనీయంగా ఉన్నట్లు గుర్తించారు.

దానిమ్మ పండ్లు

దానిమ్మ పండులో యాంటీఆక్సిడెంట్స్‌ ఎక్కువగా ఉంటాయి. ఇవి వీర్య కణాల వృద్ధి, నాణ్యతను పెంచుతాయి. రెండు రోజులకోసారి దానిమ్మ పండు గింజలను అలాగే తినడం లేదా జ్యూస్‌ చేసుకొని తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

గుమ్మడికాయ గింజలు

గుమ్మడికాయ గింజల్లోనూ యాంటీఆక్సిడెంట్స్‌తోపాటు ఫైటోస్టెరోల్స్‌, అమినో యాసిడ్స్‌ ఎక్కువగా ఉంటాయి. ఇవి మగవారిలో ఫెర్టిలిటీ సామర్థ్యాన్ని పెంచడానికి సాయం చేస్తాయి. వీటిని అలాగే తినవచ్చు.

సంత్ర లేదా కమలా పండ్లు

ఆరెంజ్‌ లేదా సంత్ర లేదా కమలా పండ్లు.. పేరు ఏదైనా విటమిన్‌ సీ పుష్కలంగా ఉండే ఈ పండ్లు స్పెర్మ్‌ కౌంట్‌ పెంచడానికి సాయం చేస్తాయి. ఈ విటమిన్‌ సీ ఎక్కువగా ఉండే టమాటాటు, బ్రొకోలీ, క్యాబేజీలాంటివి కూడా తినొచ్చు.

చేపలు

నాన్‌వెజ్‌ అలవాటు ఉన్నవాళ్లు రెడ్‌ మీట్‌ తగ్గించేసి కాస్త ఎక్కువ మొత్తంలో చేపలను తింటే ప్రయోజనం ఉంటుందని ఓ అధ్యయనంలో తేలింది. చేపల్లోనూ ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌ ఎక్కువగా ఉంటాయి. వీటిలో జింక్‌ కూడా ఉంటుంది. ఇది కూడా వీర్య కణాల వృద్ధికి తోడ్పడుతుంది.

క్యారట్స్‌

ఎలా చూసినా క్యారట్స్‌ మన ఆరోగ్యానికి మేలు చేసే వెజిటబులే. ఇందులో ఉండే బీటా కెరొటిన్‌ అనే యాంటిఆక్సిడెంట్‌.. వీర్య కణాల ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

ఆలివ్‌ ఆయిల్‌

ఆరోగ్యం కోసం ఆలివ్‌ ఆయిల్‌ వినియోగం రానురాను పెరిగిపోతోంది. దీనిని రెగ్యులర్‌గా వాడటం వల్ల వీర్య కణాల వృద్ధితోపాటు వాటి నాణ్యత కూడా పెరుగుతుంది. ఆలివ్‌ ఆయిల్‌ చెడు కొలెస్ట్రాల్‌ లెవల్స్‌ను తగ్గించి.. శరీరంలో ఆక్సిజన్‌ను అన్ని భాగాలకు అందేలా చేస్తుంది. దీనివల్ల వృషణాల్లో ఆరోగ్యకరమైన వీర్య కణాలు వృద్ధి చెందుతాయి.

ఈ ఫుడ్‌ జోలికి వెళ్లొద్దు..

ఏ ఫుడ్‌ తింటే స్పెర్మ్‌ కౌంట్‌ పెరుగుతుందో చూశాం. మరి స్పెర్మ్‌ కౌంట్‌ను తగ్గించే ప్రమాదం ఉన్న ఆహార పదార్థాలు ఏవి అన్నది తెలుసుకోవడం కూడా ముఖ్యమే. ఎందుకంటే వీటికి జోలికి వెళ్లకుండా ఉంటే.. సగం పని పూర్తయినట్లే కదా. అవేంటో ఇప్పుడు చూద్దాం..

ప్రాసెస్‌ చేసిన మాంసం

ఈ మధ్య మనం పొట్ట కంటే ఎక్కువగా నాలుక రుచినే చూస్తున్నాం. ఏది టేస్ట్ అనిపిస్తే దానిని లోపల వేసేస్తాం. అందుకే వివిధ రకాల ఆహార పదార్థాల టేస్ట్‌ పెంచడానికి, ఎక్కువ కాలం నిల్వ ఉండటానికి వాటిని ప్రాసెస్ చేస్తున్నారు. ఇందులో మాంసం కూడా ఒకటి. స్మోకింగ్‌, సాల్టింగ్‌, క్యూరింగ్‌, ఫెర్మెంటేషన్‌లాంటి పద్ధతుల్లో మాంసాన్ని ప్రాసెస్‌ చేస్తున్నారు.

ప్రాసెస్‌ చేసిన మాంసం అసలు ఆరోగ్యానికి మంచిది కాదు. ఇది స్పెర్మ్‌ కౌంట్‌ తగ్గడానికి కూడా కారణమవుతోందని తాజా అధ్యయనాల్లో తేలింది. వీటిని తినడం వల్ల కౌంట్‌ ఎలా తగ్గుతోంది అనడానికి రీసెర్చర్లకు సైంటిఫిక్‌ ఆధారం ఏదీ లభించకపోయినా.. తగ్గడం మాత్రం నిజమని స్పష్టమైంది.

వీర్య కణాల వృద్ధి కోసం చూస్తుంటే మాత్రం మీరు ఈ మాంసానికి దూరంగా ఉండటం మంచిది.

ట్రాన్స్‌ ఫ్యాట్స్‌

మనం రోజూ తీసుకునే వంట నూనెల్లో ఈ ట్రాన్స్‌ ఫ్యాట్స్‌ ఎక్కువగా ఉంటాయి. ఇందులోని చెడు కొలెస్ట్రాల్‌తో మన గుండెకు చేటు జరుగుతుందని డాక్టర్లు చాలా వరకూ హెచ్చరిస్తూనే ఉంటారు. రిఫైన్డ్‌ ఆయిల్‌కు దూరంగా ఉండటం మంచిదన్న సూచనలూ తరచూ వింటూ ఉంటాం.

ఈ ట్రాన్స్‌ ఫ్యాట్స్‌తో గుండెకే కాదు.. స్పెర్మ్‌ కౌంట్‌కూ లింకుంది. 2011లో స్పెయిన్‌లో జరిగిన ఓ అధ్యయనంలో ట్రాన్స్‌ ఫ్యాట్స్‌ ఎక్కువగా తీసుకున్న పురుషుల్లో వీర్య కణాల సంఖ్య తగ్గిపోయినట్లు గుర్తించారు. ట్రాన్స్‌ ఫ్యాట్స్‌ చాలా సులువుగా, తక్కువ ధరకే లభిస్తాయి.

ఆయిల్స్‌ను ఎక్కువ కాలం ఉండేలా చేస్తాయి. పైగా మంచి టేస్ట్‌ కూడా అందిస్తాయి. దీంతో అన్ని కంపెనీలు నూనెల్లో కృత్రిమంగా ట్రాన్స్‌ ఫ్యాట్స్‌ను కలుపుతున్నారు. డెయిరీ ప్రోడక్ట్స్‌తో సహజంగా తక్కువ మొత్తంలో తీసుకునే ట్రాన్స్‌ ఫ్యాట్స్‌తో పెద్ద ముప్పు లేదు కానీ.. ఇలాంటి ఆర్టిఫిషియల్‌ ట్రాన్స్‌ ఫ్యాట్స్‌ చాలా డేంజర్‌.

సోయా ఉత్పత్తులు

సోయా ఆరోగ్యానికి మంచిదే. కానీ ఇది ఎక్కువగా తీసుకుంటే మాత్రం స్పెర్మ్‌ కౌంట్‌ తగ్గిపోతుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. సోయా ఉత్పత్తుల్లో ఫైటోఎస్ట్రోజెన్స్‌-ఎస్ట్రోజెన్‌లాంటి సమ్మేళనాలు ఉంటాయి. ఇవి వీర్య కణాల సంఖ్యను తగ్గిస్తున్నాయని బోస్టన్‌లో వివిధ ఫెర్టిలిటీ క్లీనిక్స్‌ 99 మంది పురుషులపై జరిపిన అధ్యయనంలో తేలింది.

పెస్టిసైడ్స్‌, బిస్ఫెనాల్‌ ఎ (బీపీఏ)

ఈ లిస్ట్‌లో పెస్టిసైడ్స్‌ ఏంటి అని మీరు అనుకోవచ్చు. కానీ పరోక్షంగా ప్రతి రోజూ మనం తీసుకుంటున్న ఆహారంతోపాటు వీటిని కూడా తింటున్నాం. మనం తినే ఆకుకూరలు, పండ్లలో ఈ పురుగు మందుల అవశేషాలు ఉంటున్నాయి. ప్యాకింగ్‌ రూపంలో వస్తున్న ఆహారాల్లో బిస్ఫెనాల్‌ ఎ ఉంటోంది.

పురుగు మందుల్లోని రసాయనాలు, ఈ బీపీఏల్లో జీనోఎస్ట్రోజెన్స్‌ ఉంటాయి. ఇవి స్పెర్మ్ కౌంట్‌పై ప్రభావం చూపిస్తాయి. మరో ప్రమాదకరమైన విషయం ఏమిటంటే.. ఈ పురుగు మందుల్లో ఉండే రసాయనాలు కొన్ని మనం రోజూ ఇంట్లో వాడే నాన్‌ స్టిక్‌ కుక్‌వేర్ల నుంచి విడుదలవుతున్నాయి.

డెయిరీ ఉత్పత్తులు

పాలు, పెరుగు, నెయ్యి, వెన్నలాంటి డెయిరీ ఉత్పత్తుల వల్ల శరీరానికి మేలే జరుగుతుంది. వీటిలో కొవ్వు ఉన్నా పరిమిత స్థాయిలో తీసుకుంటే ఎలాంటి నష్టం ఉండదు.

అయితే క్రీమ్‌, చీజ్‌తో సహా పాలను ఎక్కువగా తాగే టీనేజర్లలో స్పెర్మ్‌ కౌంట్‌ తగ్గిపోవడం, వీర్య కణాల ఆకారం అసాధారణంగా మారిపోవడంలాంటివి జరిగినట్లు ఓ అధ్యయనంలో తేలింది. ఆవులు, గేదెలకు స్టెరాయిడ్స్‌ ఇవ్వడం కూడా దీనికి ఓ కారణంగా తేల్చారు.

స్మెర్మ్ కౌంట్ ఆరోగ్యానికి దోహదం చేసే అంశాలు

  1. సాధ్యమైనంత వరకూ సేంద్రీయ కూరగాయలనే తినడానికి ప్రయత్నించండి. అవి దొరకకపోయినా, అంత ఖర్చు పెట్టలేమని అనుకున్నా.. మీరు కొనే కూరగాయలనే బాగా కడిగిన తర్వాత వాడండి.
  2. నాన్‌వెజ్‌ లేనిదే ముద్ద దిగదు అనుకుంటే.. కనీసం ప్రాసెస్‌ చేసిన మాంసం పక్కన పెట్టేయండి.. దాని బదులు చేపలను మీ ఆహారంలో భాగంగా చేసుకోండి. కోళ్లు, మేకలు, గొర్రెలకు విపరీతమైన వాక్సినేషన్, ఇంజెక్షన్ల కారణంగా మనపై ఆ మాంసం ప్రభావం చూపుతోంది.
  3. రిఫైన్డ్‌ ఆయిల్స్‌ వాడకాన్ని తగ్గించండి. జంక్‌ ఫుడ్‌ తినే అలవాటు ఉంటే వెంటనే మానుకోండి. ఇది మీ స్పెర్మ్‌ కౌంట్‌కే కాదు.. ఆరోగ్యానికి ఏ విధంగానూ మంచిది కాదు.
  4. వీలైనంతగా ప్లాస్టిక్‌ వాడకాన్ని తగ్గించండి.
  5. స్మోకింగ్‌ అలవాటు ఉంటే.. వెంటనే మానేయండి.
  6. బరువు ఎక్కువగా ఉన్నా కూడా అది వీర్య కణాల సంఖ్యపై ప్రభావం చూపుతుంది. అందువల్ల వెంటనే తగ్గడానికి ప్రయత్నించండి.
  7. ప్రతి రోజూ వర్కవుట్స్‌ చేయండి. 16 వారాల పాటు రోజూ 50 నిమిషాలు ఏరోబిక్‌ ఎక్సర్‌సైజ్‌ చేయడం వల్ల స్పెర్మ్‌ కౌంట్‌ పెరిగినట్లు 2017లో చేసిన ఓ అధ్యయనంలో తేలింది. ఏరోబిక్‌ ఎక్సర్‌సైజులు అంటే.. వేగంగా నడవడం, పరుగెత్తడం, స్విమ్మింగ్‌, సైక్లింగ్‌లాంటివి.
  8. సాధ్యమైనంత వరకూ ఒత్తిడిని తగ్గించుకోండి. ఒత్తిడి మన శరీరాన్ని పునరుత్పత్తి దిశగా పని చేయకుండా చేస్తుంది. హెల్తీ డైట్‌ తీసుకోవడం, ఎక్సర్‌సైజులు, ఇష్టమైన పని చేస్తుండటంలాంటివి ఒత్తిడిని తగ్గిస్తాయి.
  9. ఆల్కహాల్, డ్రగ్స్‌లాంటి వాటికి దూరంగా ఉండండి. మారిజువానా, కొకైన్‌లాంటి డ్రగ్స్‌.. నేరుగా స్పెర్మ్‌ కౌంట్‌పై ప్రభావం చూపిస్తాయి. పరిమితికి మించి ఆల్కహాల్‌ తీసుకోవడం వల్ల మనలోని టెస్టోస్టెరాన్‌ లెవల్స్‌ తగ్గడంతోపాటు వీర్య కణాల సంఖ్య, నాణ్యతపైనా ప్రభావం చూపుతుంది. మితిమీరిన ఆల్కహాల్‌, డ్రగ్స్‌.. నపుంసకత్వానికి కూడా దారి తీసే ప్రమాదం ఉంది.
  10. విటమిన్‌ డీ, కాల్షియం సప్లిమెంట్స్‌ తీసుకుంటే వీర్య కణాలు వృద్ధి చెందుతున్నట్లు కొన్ని అధ్యయనాల్లో తేలింది. శరీరంలో విటమిన్‌ డీ తక్కువగా ఉంటే అది స్పెర్మ్‌ కౌంట్‌ తగ్గేలా చేస్తుంది.
  11. అశ్వగంధ చూర్ణం కూడా వీర్య కణాల వృద్ధికి తోడ్పడుతున్నట్లు 2016లో జరిగిన ఓ అధ్యయనం తేల్చింది. 46 మంది పురుషులపై ఈ అధ్యయనం చేశారు. వీళ్లు ప్రతి రోజూ 675 మిల్లీగ్రాముల అశ్వగంధ చూర్ణాన్ని 90 రోజుల పాటు తీసుకుంటే.. వాళ్లలో స్పెర్మ్‌ కౌంట్‌ 167 శాతం పెరిగినట్లు తేలడం విశేషం.
  12. బిగుతైన దుస్తులు ధరించకండి. ముఖ్యంగా జీన్స్ ఎక్కువగా ధరించకండి.
  13. ఎక్కువగా వేడి నీళ్ల స్నానం చేయకండి. గోరు వెచ్చని నీళ్లు సరిపోతాయి. శరీర ఉష్ణోగ్రతలలో సమతుల్యం ఉండేలా చూడాలి. చలి కాలంలో అతిగా హీటర్లు వాడడం సరికాదు.

ధన్యవాదములు 

మీ నవీన్ నడిమింటి 


నరాలు వాపు (వెరికోస్ వేయిన్స్) పై తీసుకొవాల్సిన జాగ్రత్తలు



*వెరికోస్ వెయిన్స్ సింపుల్ గా తగ్గేందుకుఅవగాహనా కోసం |Cure for varicose vein|Naveen Nadimini
 ఉబ్బునరాలు (వెరికోస్ వెయిన్స్)

*👉🏿ఉబ్బునరాలు అంటే ఏమిటి?*
రక్తం (నరాల్లో) గుమిగూడడంవల్ల నరాలు వాచి పరిమాణంలో విస్తరిస్తాయి, దీన్నే "ఉబ్బునరాలు” గా వ్యవహరిస్తారు. ఉబ్బునరాలు కంటికి స్పష్టంగా గోచరిస్తాయి. చర్మం కింద నరాలు ఉబ్బిఉండడాన్ని, పురితిరిగి ఉండడాన్ని మనం చూడవచ్చు; ఇంకా, ఈ నరాలు ఉండలు చుట్టుకుని, ఉబ్బి, నీలం లేదా ముదురు ఊదా రంగులో చర్మం కింద కనిపిస్తాయి. సాధారణంగా, ఉబ్బిన నరాలు కాళ్ళలో కనిపిస్తాయి, కానీ ఇతర శరీర భాగాలలో కూడా ఉబ్బు నరాలు కనిపిస్తాయి .
దీని సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?
చాలా మంది రోగులలో ఉబ్బిన నరాలు చాలా కాలంవరకూ ఎలాంటి వ్యాధి లక్షణాల్ని పొడజూపకుండా ఉంటాయి. ఈ రుగ్మత యొక్క సాధారణ లక్షణాలు కిందివిధంగా ఉంటాయి

కాళ్ళు నొప్పి

కాళ్ళు వాపు

కాళ్లు లేదా పిక్కల్లో తిమ్మిరి (లేక ఈడ్పులు, పట్టేయడం)

పిక్కలు మరియు తొడల మీద సాలెపురుగువంటి ఆకుపచ్చ సిరలు కనిపిస్తాయి

ఉబ్బిన నరాలున్నచోట దురద

పొడి చర్మం, పొలుసులుదేలిన మరియు మంటతో కూడిన చర్మం


అంత త్వరగా నయం కాని పుండ్లు,

దీని ప్రధాన కారణాలు ఏమిటి?
సిరల యొక్క కవాటాలు మరియు గోడల బలహీనత కారణంగా, సిరలు వాపు, వంకర్లు తిరిగి (వక్రీకృతంగా) మరియు చుట్టబడినవిగా ఏర్పడి నరాల్లో రక్తం గుమిగూడి “ఉబ్బునరాల” రుగ్మతగా రూపుదాలుస్తాయి. సాధారణంగా, కవాటాలు గురుత్వాకర్షణకు వ్యతిరేకంగా రక్తాన్ని పైకి ఎగదోస్తాయి కాని అవి బలహీనంగా ఉన్నప్పుడు, సిరల్లో రక్తం జమగూడి “ఉబ్బు నరాల” రుగ్మతకు  కారణమవుతాయి.
ప్రమాద కారకాలు

దీర్ఘకాలంపాటు నిలబడటం ఉదా. చిత్రకారులు, బస్సు / రైలు కండక్టర్లు, ఉపాధ్యాయులు మొదలైనవి.

లింగపరంగా మహిళలవడం

గర్భం

ఊబకాయం

ముసలితనం

ఉబ్బునరాల కుటుంబ చరిత్ర

పొత్తికడుపులో కణితి, సిరల్లో ఉన్న రక్తం గడ్డకట్టడం వంటి అరుదైన పరిస్థితులు.

దీనిని ఎలా నిర్ధారణ చేస్తారు మరియు దీనికి చికిత్స ఏమిటి?
కాళ్లలో ఏవైనా మార్పులను చూసేందుకు డాక్టర్ కాళ్ళలో కిందివాటిని పరిశీలిస్తారు

కాళ్ళ చర్మం రంగు

నయమైన లేదా నయం కాని కాళ్ళ పుండ్లు

చర్మం యొక్క వెచ్చదనం

చర్మం ఎరుపుదేలడాన్ని

నరాల్లో రక్త ప్రవాహాన్ని మరియు నరాల్లో రక్తం గడ్డకట్టడాన్ని తనిఖీ చేయడానికి డాప్లర్ అల్ట్రాసౌండ్ సిఫారస్ చేయబడుతుంది. ఆంజియోగ్రామ్ చాలా సాధారణం కాదు, కానీ  రోగ నిర్ధారణను ధ్రువపర్చడానికి ఆంజియోగ్రామ్ ను సూచించవచ్చు.
చికిత్సలో క్రింది చర్యలు ఉంటాయి:

కంప్రెషన్ మేజోళ్ళు - ఇది వాపును తగ్గిస్తుంది మరియు కాళ్ళను మెత్తగా ఒత్తుతూ రక్తం గుండె వైపు ఎగువకు ప్రసరించేలా సహాయపడుతుంది, తద్వారా రక్తం గడ్డ కట్టడాన్ని మేజోళ్ళు నివారిస్తాయి.

అబ్లేషన్ థెరపీ- ఉబ్బెక్కిన నరాల్లో రక్తం ఉబ్బును నివారించేందుకు రేడియో ధృవీకరణ అబ్లేషన్, లేజర్ అబ్లేషన్.

స్క్లెరోథెరపీ- సిరలో రక్తసరఫరాను నిలిపేసేందుకు ఒక ఏజెంట్ ను జొప్పిస్తారు.

శస్త్రచికిత్స (ఫ్లెబెక్టమీ) - రక్త సరఫరా చేయడానికి సమాంతర సిరలు ఉన్నపుడు ఉబ్బునరాల రుగ్మతకు గురైన సిరను తొలగించడం.

తీవ్రమైన కేసుల్లో బాధిత సిరను ముడి వేయుట మరియు తొలగించడం (stripping).

స్వీయ రక్షణచర్యలు కింది వాటిని కలిగి ఉంటుంది:

నిరంతరం ఎక్కువసేపు నిలబడకుండా ఉండండి.

కాళ్ళను రోజులో కనీసం 3-4 సార్లు 15 నిమిషాలపాటు పైకెత్తి  ఉంచాలి

శరీరం దిగువభాగం అంగాలపై ఒత్తిడిని తగ్గించడానికి బరువు తగ్గడం

రక్త ప్రసరణను మెరుగుపరిచేందుకు ఎక్కువ శారీరక శ్రమ చేయండి. నడక (వాకింగ్) లేదా ఈత మంచి వ్యాయామ ఎంపికలు.

ఏవైనా పుండ్లు, బహిర్గతమైన గాయాలు ఉంటే వాటిని మాన్పడానికి శ్రద్ధ తీసుకోండి.
కాళ్ళను తేమగా ఉంచండి మరియు చర్మం పొడిబారడాన్ని, చర్మం పగలకుండా  నివారించండి.
ఉబ్బునరాలు (వెరికోస్ వెయిన్స్) కొరకు మందులు
, *💊కొన్ని మందులు*
Medicine NamePack 
1.- DropADEL 29 Akutur Drop200.
2.- LMBjain Pulsatilla 0/1 
3.-SBL Carduus benedictus Mother టింక్చర్ 
4.- Carduus benedictus Dilution 1000 
5.- Chamodent Globules

  కేవలం అవగాహనా ఆవశ్యకతల కొరకు మాత్రమే. ఇక్కడ ఇవ్వబడిన సమాచారమును ఏదైనా ఆరోగ్య సంబంధిత సమస్య లేదా అస్వస్థత నుండి కోలుకోవడానికి లేదా స్వస్థత కొరకు నిపుణుల సలహా లేనిదే ఉపయోగించుకోకూడదు. చికిత్స పరీక్షలు మరియు సేవల కొరకు ఎల్లప్పుడూ ఒక అర్హత పొందిన వైద్యుల సలహా తీసుకోవాలి.

https://www.facebook.com/Naveen-Nadiminti-1536735689924644/
https://m.facebook.com/story.php?story_fbid=2331685173763021&id=1536735689924644
ధన్యవాదములు 
మీ నవీన్ నడిమింటి 

సోరియాసిస్ ఉన్న వాళ్ళు కు డైట్ ప్లాన్

*సోరియాసిస్ ఉన్న వాళ్ళు తీసుకోవాలిసిన జాగ్రత్తలు అవగాహనా కోసం నవీన్ నడిమింటి సలహాలు*

           సోరియాసిస్ చర్మపు కణాల అసాధారణ వృద్ధి వల్ల ఏర్పడిన దీర్ఘకాలిక చర్మ స్థితి. ఈ చర్మ కణాలు వేగంగా వృద్ధి అవుతాయి మరియు ప్రభావిత ప్రాంతం యొక్క వాపును ప్రేరేపిస్తాయి. సోరియాసిస్ వలన సాధారణంగా చర్మంపై ఎరుపు ప్యాచెస్ ఏర్పడడానికి కారణమవుతుంది. ఎరుపు పాచెస్ నొప్పికి కారణమవుతాయి మరియు భయంకరమైన దురద కలిగి వెండి-తెలుపు వంటి పొరలతో కప్పబడి ఉంటాయి. శారీరకమైన లక్షణాలు పెరుగుతున్న మరియు క్షీణిస్తున్న అనేక దశలను చూపుతాయి, కానీ దురదృష్టవశాత్తు ఈ వ్యాధికి ఎలాంటి శాశ్వత నివారణ లేదు.
*👉సోరియాసిస్ యొక్క లక్షణాలు*
       వ్యక్తులను బట్టి మరియు సోరియాసిస్ రకం బట్టి సోరియాసిస్ లక్షణాలు మారుతూ ఉంటాయి. ఈ ప్యాచ్లు కొన్ని మచ్చలు నుండి పెద్ద గాయాలు వరకు ఉంటాయి. చర్మం, మోచేతులు, మోకాలు, చేతులు మరియు కాళ్ళు ఎక్కువగా ప్రభావితమయ్యే ప్రాంతాలు.
సోరియాసిస్ లక్షణాలు ఈ క్రింది విధంగా ఉంటాయి:

చర్మంపై ఎరుపు  మచ్చలు కనిపించడం, ఇవి మందపాటి వెండి పొరలుగా ఉంటాయి.

ఈ మచ్చలు దురదలా మారుతాయి, మంటను కలిగిస్తాయి మరియు బాధ కలిగించడానికి కారణమవుతాయి.

కొన్నిసార్లు చర్మం అధిక పొడిగా ఉండడం లేదా స్క్రాచ్ కారణంగా రక్తస్రావం జరుగవచ్చు.

ప్రభావితమైన ప్రాంతాలు చర్మం,మోచేతులు, మోకాలు లేదా ఎగువ శరీర భాగం.

నెయిల్ సోరియాసిస్ వలన గోళ్ళ యొక్క మందం, గుంతలు అవడం మరియు రంగు మారడం వంటి లక్షణాలకు కారణమవుతుంది. గోర్లు వాటి ఆధారం నుండి కొన్నిసార్లు ఊడిపోతాయి.

పస్టులర్ సోరియాసిస్ అనేది చేతులు మరియు కాళ్ళ మీద చీము నిండిన ఎర్రని-పొరలు, పగిలిన చర్మం వంటి లక్షణాలను కలిగి ఉంటుంది.

సాధారణంగా, ఈ లక్షణాలు వృద్ది చెందుతున్న మరియు క్షీణిస్తున్న క్రమానుగత లేదా వలయాలను చూపుతాయి. లక్షణాలు కొన్ని రోజులు లేదా వారాల వరకూ  తీవ్రంగా ఉండవచ్చు మరియు సాధారణ స్థితికి వస్తాయి లేదా కొన్నిసార్లు అవి కూడా నయం అవుతాయి మరియు గుర్తించదగినవి కావు. ఆపై మళ్ళీ, ఈ ప్రభావాలు రేకెత్తించే లక్షణాల కారణoగా మరల కనిపిస్తాయి.
సోరియాటిక్ ఆర్థరైటిస్ లక్షణాలు క్రింది వాటితో సహా:

శరీరంలో ఒక వైపు లేదా ఇరువైపులా కీళ్ల ప్రమేయం.

ప్రభావిత కీళ్ళు బాధాకరమైనవిగా మరియు వాపు  కలిగి తాకడం వలన వెచ్చని అనుభూతి పొందవచ్చు.

వేళ్లు మరియు కాలి యొక్క కీళ్ళు వాపు వలన సాసేజ్-లాంటివిగా కనిపిస్తాయి మరియు ఇవి వైకల్యాలకు కారణమవుతాయి.

కొన్నిసార్లు, వెన్నుపూస మధ్య కీళ్ళు ప్రభావితం అవుతాయి మరియు నడుము నొప్పి లక్షణాలు (లంబర్ స్పొండిలైటిస్ ను పోలి ఉంటుంది) కలిగి ఉంటుంది.

ప్రభావిత అకిలెస్ స్నాయువు మరియు అరికాలి అంటిపట్టుకొన్న కణజాలము మడమ లేదా వెనుక పాదంలో తీవ్రమైన నొప్పికి కారణమవుతుంది. (మరింత చదవండి - మడమ నొప్పి కారణాలు మరియు చికిత్స)

*👉సోరియాసిస్ యొక్క చికిత్స -*
క్రమబద్ధమైన మందుల వాడుక
సోరియాసిస్ తీవ్రమైన లేదా సమయోచిత చికిత్సకు ఆటంకo కలిగితే నోటి లేదా సూది మందులు సూచించబడతాయి. సాధారణంగా, ఈ మందులు తీవ్రమైన దుష్ప్రభావాలను కలిగి ఉంటాయి, అందుచే అవి తక్కువ వ్యవధి కోసం ఉపయోగించబడతాయి మరియు ఇతర రకాల చికిత్సలతో ప్రత్యామ్నాయoగా చేయబడతాయి

జీవనశైలి యాజమాన్యము
సోరియాసిస్ ఒక వ్యక్తి యొక్క జీవనశైలిని అలాగే అతని/ ఆమె యొక్క జీవన నాణ్యతను ప్రభావితం చేయవచ్చు. సోరియాసిస్ గురించి అవగాహన అనేది ఒక వ్యక్తి సోరియాసిస్­ని మరింత సమర్థవంతంగా ఎదుర్కొనుటలో సహాయ పడుతుంది. ఇది వ్యాధిని నయం చేయుటలో మరియు వ్యాధి ప్రభావాలకు పరిష్కారాలను కనుగొనుటలో సహాయపడుతుంది. ఈ కోలుకునే పద్ధతులలో ఈ క్రిందివి ఉంటాయి:

ఒత్తిడి యాజమాన్యము
ఒత్తిడి అనేది సోరియాసిస్ యొక్క అత్యంత ఎక్కువగా గురి అయ్యే కారక అంశాలలో ఒకటి.

దురద లేకుండా చేయుట
సాధారణంగా, దురద ఒక దుష్ట వలయo లాగానే ఉంటుంది, మీరు మరింతగా గోకినపుడు అది మరింత దురదను కలిగిస్తుంది. కాబట్టి, ముఖ్యంగా సోరియాసిస్ అనేది చర్మం యొక్క పొరల కోసం, దురదను నివారించడం కోసం గోకడం మానుకోవాలి. మాయిశ్చరైజర్ల ఉపయోగం దురదను తగ్గించడంలో సహాయపడుతుంది. 

బరువు నియంత్ర్రణ
బరువు కోల్పోవడం లేదా లక్ష్యిత BMI సాధించడంలో సోరియాసిస్ లక్షణాల తీవ్రత తగ్గించడం అనేది బాగానే పనిచేస్తుంది. అంతేకాకుండా, పండ్లు, కూరగాయలు, కాయ ధాన్యాలు, క్రొవ్వు లేని మాంసం మరియు చేపలు కలిగిన ఆహారాన్ని సోరియాసిస్ మీద సానుకూల ప్రభావం చూపుతుంది. మరోవైపు ఎర్రని మాంసం, అధిక కొవ్వు గల పాల ఉత్పత్తులు, శుద్ధి చేసిన ఆహారం మరియు ఆల్కహాల్ వంటివి సోరియాసిస్­ని మరింత తీవ్రతరం చేస్తాయి.

ఒత్తిడి యాజమాన్యము
ఒత్తిడి అనేది సోరియాసిస్ యొక్క అత్యంత ఎక్కువగా గురి అయ్యే కారక అంశాలలో ఒకటి

*👉సోరియాసిస్ అంటే ఏమిటి?*
సోరియాసిస్ చర్మ కణాల పెరుగుదలను హెచ్చించుట ద్వారా చర్మం యొక్క వృద్ధి వేగవంతం అయ్యే ఒక స్థితి. ఇది చర్మ కణాల నిర్మాణానికి దారితీస్తుంది. కణాలు ఈ సమూహాలుగా చేరి దురదను కలిగి ఉంటాయి మరియు ఎరుపుగా మారుతాయి మరియు కొన్నిసార్లు ఇవి బాధాకరమైనవిగా కూడా  ఉంటాయి. 
*💊సోరియాసిస్ నివారణ కు కొన్ని మందులు*
1.-BetnesolBETNESOL 0.1% EYE DROPS 5ML
2.-AerocortAEROCORT CFC FREE 200MD INHALER
3.-AdapanAdapan Gel 15gm
4.-Candid GoldCANDID GOLD 30GM CREAM
5.-Exel GnExel Gn 0.05% W/W/0.5% W/W Cream
6.-Propyderm NfPROPYDERM NF CREAM 5GM
7.-AdapenAdapen 0.1% W/W Gel
8.-Propygenta NfPROPYGENTA NF CREAM 20GM
ధన్యవాదములు 🙏
మీ నవీన్ నడిమింటి 
*సభ్యులకు విజ్ఞప్తి*
******************
. వివిధ జబ్బులగురించి నివారణలు సూచనలు కూడా సభ్యులలో అవగాహన పెంచడానికి మాత్రమే .
https://www.facebook.com/Naveen-Nadiminti-1536735689924644/

https://m.facebook.com/story.php?story_fbid=2422807817984089&id=1536735689924644
ధన్యవాదములు 
మీ నవీన్ నడిమింటి 

గర్భిణీ తీసుకొని వలిసిన జాగ్రత్తలు

గర్భిణి స్త్రీలు ఆహారం విషయం లో తీసుకోవలసిన జాగ్రత్తలు అవగాహనా కోసం నవీన్ నడిమింటి సలహాలు  
గర్భిణీ స్త్రీలు అన్ని రకాల ఆహార పదార్ధాలు అంటే ధాన్యాలు, పప్పులు, కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, పాలు, పాలతో చేసిన పదార్ధాలు, మాంసం మొదలైనవి తగిన మోతాదులో తీసుకోవాలి పాలు, మాంసం, గుడ్లు,చేపలు, క్రొవ్వు పదార్దాలు ఎక్కువగా తీసుకోవటం మంచిది . తల్లికి ఎక్కువగా శక్తి లభించే ఆహార పదార్ధాలు ఇవ్వడం వలన తక్కువ బరువుతో ఉన్న పిల్లలు పుట్టకుండా ఉంటారు. అలాగే కాన్పు సమయంలో, ప్రసవానంతర అత్యవసర పరిస్ధితులకు గురికాకుండా ఆరోగ్యంగా ఉంటారు. గర్భిణీ సమయంలో తల్లి ఆరోగ్యానికి, బిడ్డ పెరుగుదలకు సరిపోయేంత ఆహారం కొంచెంకొంచెంగా ఎక్కువ సార్లు తినాలి.

రోజూ తినే ఆహారం కంటే ఎక్కువ తినాలి. కాల్షియం, ఇనుము అధికంగా ఉన్న ఆహారం తీసుకోవాలి. వీటితో పాటు పుల్లటి పండ్లు తీసుకోవాలి. పాలు, మాంసం, గుడ్లు,చేపలు, క్రొవ్వు పదార్దాలు ఎక్కువగా తీసుకోవటం మంచిది. మలబద్దకం లేకుండా ఎక్కువ ద్రవపదార్ధాలు, పీచుపదార్ధాలు తీసుకోవాలి.

సరైన పోషకాహారంతో పాటు సరైన విశ్రాంతి తీసుకోవాలి. (పగలు కనీసం 2 గంటలు, రాత్రి 8 గంటలు)
• గర్భిణీ స్త్రీలలో ముఖ్యంగా రక్తహీనత సమస్య ఉంటుంది. దీని వలన బరువు తక్కువ ఉన్న బిడ్డలు పుట్టడం, తల్లికి అధిక రక్తస్రావం కావడం జరుగుతుంది. కాబట్టి ఇనుము ఎక్కువగా ఉన్న ఆహారం అంటే ఆకుకూరలు, బెల్లం, రాగులు, ఎండిన పండ్లు (కర్జూరం, ద్రాక్ష ) , నువ్వులు, చెఱకురసం, ఉలవలు, మాంసం (కాలేయం) తీసుకోవాలి. రోజుకు ఒకటి చొప్పున ఐరన్ మాత్రలు తీసుకోవాలి. పోషకాహారం తీసుకుని ఆరోగ్యం గా ఉన్న స్త్రీకి సుఖప్రసవం జరుగుతుంది.

తీసుకోకూడని పదార్ధము :
బాగా ఉడకని మాంసము ముఖ్యము గా పందిమాంసము తినకూడదు .. దీనివల "toxoplasmosis"అనే ఇంఫెక్షన్‌ వచ్చి బిడ్డ మెదడు పెరుగుదలను దెబ్బతీయును లేదా పుట్టే బిడ్డ గుడ్దిదిగా పుట్తును .

కాల్చిన సముద్రపు చేపల రొట్టెలు (smoked seafoods)తినకూడదు . దీనివల " Listeriosis " అనే ఇంఫెక్షన్‌ వచ్చే అవకాశము ఉన్నది . దీనివల అబోర్షన్లు జరిగే అవకాశము ఉన్నది .

అతి వేడి చేసే పదార్దాలు అంటే ఆవకాయ ,మామిడికాయ,ఆవపెట్టిన కూరలు ,నువ్వులు,బొప్పాయి వంటివి తొలి నెలల్లొఅంటే 1-3 నెలల గర్భిణీ తీసుకోకూడదు.

పాచ్యురైజేషన్‌ చేయని పాలతో తయారుఛేసిన జున్ను వంటి పదార్ధము లు తినకూడదు . పాచ్యురైజేషన్‌ చేయని పాలలో " Listeria " , Bovine T.B అనే బాక్టీరియా ఉంటుంది . దానివలన miscarriage అయ్యే ప్రమాధము ఉండును.

కాఫీ లోని కెఫిన్‌ మరియు కెఫినేటెడ్ డ్రింక్స్ మొదటి మూడు మాసాలలో ఎక్కువగా తీసుకోకూడదు . రోజుకి 200 మి.గ్రా. కంటే ఎక్కువ కెఫిన్‌ తీసుకుంటే గర్భస్రావము జరిగే ప్రమాధము ఉంది . కెఫిన్‌ డైయూరిటిక్ గా పనిచేయును . వంటిలోని నీరును బయటికి పంపివేయడం వలన డీహైడ్రేషన్‌ వచ్చే అవకాశము వలన గర్భస్రావము జరిగే చాన్స్ ఎక్కువ.

సారా (Alcohol) మరియు సారా సంబంధిత పదార్ధములు తీసుకోకూడదు . బేబీ పెరుగుదలను , ఆరోగ్యాన్ని దెబ్బతీయును. "foetal alcohol syndrome "కి దారితీయును . కాలేయసంబంధిత రుగ్మతలు బేబీకి కలుగును,

కాయకూరలు బాగా కడిగి తినాలి . కడగని ఆకుకూరలు , కాయలు , పండ్లు పైన " Toxoplasmosis" కలుగజేసే బాక్టీరియా ఉండును . ఇది చాలా ప్రమాదకరము .

విటమిన్‌ ' ఎ ' ఎక్కువగా ఉన్న మాంసాహారము అనగా లివర్ తో వండిన కూర తినకూడదు - దీనివలన బేబీ పుట్టికతో కూడుకున్న డిఫెక్ట్స్ తో పుట్టే అవకాశమున్నది. బీటా కెరటీన్‌ తో కూడుకొని ఉన్న విటమిన్‌ ' ఎ ' (కేరెట్స్ ) తినవచ్చును .

food to avoid during pregnancy in brief:

Alcohol--మత్తుపానీయాలు ,
Caffeine--కాఫీ , కెఫినేటెడ్ డ్రింక్స్ ,
Raw eggs -- పచ్చి , సరిగా ఉడకని గుడ్లు ,
fish with mercury-- మెర్కురీ మూలకము ఉన్న చేపలు ,,
Smoked sea food-- కాల్చిన సముద్రపు ఉత్పత్తులు ,
fish exposed to Industrial pollution-- కర్మాగారాల కెమికల్ తో కూడుకొని ఉన్న చేపలు ,
Raw shelfish -- పచ్చి , సరిగా ఉడక్ని ఆల్చిప్పలు , ఎండ్రకాలయలు ,
soft cheese -- పాచ్యురైజ్డ్ చేయని పాలతో చేసిన జున్ను ,
unwashed vegetables-- శుబ్రముగా కడగని కాయలు ,కూరలు ,
unpasteurized milk -- వేడిచేయని పాలు , పాలు పదార్ధాలు ,
Pickle and chilly chetnys-- కారము , మసాలా ,ఇంగువతో కూడుకున్న పచ్చళ్ళు , ఊరగాగలు ,

అపోహలు
కొన్ని రకాల పండ్లు తినడం మూలంగా మనకు సమస్యలు వస్తాయని, ముఖ్యంగా మహిళల విషయంలో ఎక్కువగా ఉంటాయనే అపొహ వుంది. వాస్తవాలను వాస్తవాలుగా తెలుసుకుంటే ఈ ప్రశ్నలు తిరిగి ఉత్పన్నం కావనే విషయాన్ని గుర్తించాలి.

కొన్ని రకాల అపోహలు
- బొప్పాయి తినడం వల్ల గర్భస్రావం అవుతుంది.
- కొబ్బరి నీళ్లు తాగితే చలువ చేసి జలుబు చేస్తుంది.
- మాంసాహారం కన్నా శాకాహారంలో ఎక్కువ మాంసకృత్తులుంటాయి.
- గుడ్లు తింటే వేడిచేసి, విరేచనాలు అవుతాయి. గర్భవతులు గుడ్లు తినకూడదు.
-నారింజ, అనాస తింటే జలుబు చేస్తుంది.
-నెలసరి సమయంలో నువ్వు లు తింటే అధిక రక్తస్రావం అవుతుంది.
-క్యారెట్‌, బీట్‌రూట్‌ కన్నా బలమైనది.
-కాకరకాయ రసం తాగితే డయాబెటిస్‌ ఉన్నవారికి ఉపయోగం ఉంటుంది.
- అరటి పండు తింటే పుట్టే పిల్లలు నల్లగా పుడతారు.
- జున్ను తింటే వాతం చేస్తుంది.
నిజానికి ఇవన్నీ మనం తరచుగా వినే విషయాలు. జాగ్రత్తగా పరిశీలించి చూస్తే ఇవేవీ మనకు హాని చేసేవి కావన్న విషయం అర్థమవుతుంది. అందుకే వీటిని గురించి వాస్తవాలు తెలసుకోవలసిన అవసరం ఉంది.

-బొప్పాయి తినడం వల్ల గర్భస్రావం అవుతుందనడం ఎంత మాత్రం నిజం కాదు. ఇందు లో అధిక కేలరీలు ఉంటాయి. అందుకే తొందరగా జీర్ణం కాదు. అందువల్ల విరేచనాలు, బహిష్టు స్రావం కల్గవచ్చు. ఇది చాలా బలహీనంగా ఉన్న వారి లో మాత్రమే కనిపించే అవకాశం ఉంది.

-కొబ్బరి నీళ్లు తాగడం అందరికీ మంచిది. ఇందు లో ఎక్కువ మోతాదులో పొటాషియం+ లవణాలు ఉంటా యి. అందుకే ఎక్కువ తాగితే జలుబు చేసి కఫం రావచ్చు.అంతే కానీ కొబ్బరి నీళ్లు తాగితే జలుబురాదు.

-మాంసాహారంలో ఎక్కువ మాంసకృత్తులుంటాయి. మాంసం తినడం వల్ల శరీరం దృడంగానూ, బలంగానూ తయారవుతుంది. శాకాహారం కన్నా మాంసాహారం కొంతవరకూ మేలే.

- గుడ్లు తినడం వల్ల ఎటువంటి నష్టమూ ఉండదు.కానీ ఇందులో ఎక్కువ కేలరీలు ఉంటాయి గను త్వరగా జీర్ణం కాదు. అందు వల్ల అధికంగా తినకపోవడమే మంచిది. గర్భిణీలు మొత్తం ఉడక బెట్టినవితినాలి.

- నారింజ, అనాస తినడం వల్ల వెంటనే జలుబు వచ్చేయదు. అవి శీతాకాలంలోనో, చల్లగా ఉన్నప్పుడో తింటే జలుబు చేసే అవకాశం ఉంటుంది. ఒక్కోసారి ఇందులో ఉండే సోడియం, పొటాషియం లవణాలు సాధారణ స్థాయి నుండి అధికమయినట్లయితే ఊపిరితిత్తుల్లో కఫం చేరి జలుబు రావచ్చు. రోగ నిరోదక శక్తి తక్కువ ఉన్న వారికి వచ్చే ఆస్కారం ఉంది.

-నెలసరి సమయంలో నువ్వులు తినడం వల్ల బలంగా ఉంటారు. అలాగే నువ్వుల కేలరీల రేటు ఎక్కువగా ఉంటుంది గనక హార్మోన్లు సులువుగా విడుదల అవుతాయి. అందువల్ల రుతుస్రావం ఫ్రీగా అవుతుంది. దీన్నే ఎక్కువగా రక్తస్రావం అవుతుందను కొని భయపడి నువ్వులు తినొద్దు అంటారు.

-బీట్‌రూట్‌లో ఇనుము, బీటా కెరోటిన్లు... క్యారెట్‌ కన్నా ఎక్కువ మోతాదులో ఉంటాయి. అందువల్ల బీట్‌రూట్‌ కన్నా క్యారెట్‌ కొంత వరకూ మంచిదే.

- కాకరకాయ రసం నేరుగా తాగకూడదు. దీనివల్ల మధుమేహం తగ్గదు. కానీ కాకరకాయ కన్నా కాకరకాయ గింజలు మధుమేహం తగ్గించడంలో చాలా ఉపయోగపడతాయి. వాటిని పొడిచేసి తింటే మంచిది.

-అరటిపండు తినడం వల్ల పిల్లలు నల్లగా పుట్టరు. కానీ కొంత మందికి కుంకుమ పువ్వు తింటే పిల్లలు ఎర్రగా పుడతారు.

- జున్ను తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. దీనిలో ఎక్కువగా కొవ్వు పదార్ధాలు ఉంటాయి. అందువల్ల ఎక్కువ తింటే అజీర్ణం చేయవచ్చు . అందుకే మిరియాలను కలుపుకొని తినాలి. దానివల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు.
ధన్యవాదములు 
మీ నవీన్ నడిమింటి 

1, జనవరి 2020, బుధవారం

చర్మం పై ఇన్ఫెక్షన్ తగ్గాలి అంటే

Hello everyone..
So this is the incident which happened just now with me.
I use an ointment since one  years now; which helps in reducing acne.
The ointment is named as *FEMCINOL-A-GEL* 
I apply this every night before sleeping.
Thus my use of this product is quite evident.
Tonight while applying this gel, I saw this piece of paper literally oozing out from the mouth of the tube with the gel.
And I was surprised to know this is the kind of  quality check some pharmaceutical companies make.
Now, I think that whatever kind of other messages which come on WhatsApp & other social media, are not fake.
This piece of paper came from inside the product tube..
This product is of *FEM* & is marketed by *DABUR INDIA LTD* 
What quality assurance processes which they state, are actually followed!?
Is it so hard to maintain a Good Manufacturing Practice?
with -Naveen Nadiminti 

మిత్రులారా... వైద్య సలహాల కోసం మన *వైద్య నిలయం* బ్లాగ్ ని ఒకసారి సందర్శించండి....

https://vaidyanilayam.blogspot.com/