ఏంటి ఈ స్పెర్మ్ కౌంట్ .. మగవారిలో సంతాన సాఫల్యత పెంచడంలో ఇదే కీలకపాత్ర పోషిస్తుంది. అయితే ఈ బిజీ అర్బన్ లైఫ్‌లో ఒత్తిడి, ఆహార అలవాట్లు, స్మోకింగ్, డ్రింకింగ్, ఒబేసిటీ వంటి వాటి వల్ల క్రమంగా పురుషుల్లో వీర్య కణాల సంఖ్య తగ్గిపోతోంది.
దీంతో సంతానం కోసం ఫెర్టిలిటీ సెంటర్ల చుట్టూ తిరుగుతున్నారు. ఈ ప్రక్రియ కూడా చాలా ఖరీదైనదే కావడంతో లక్షలు ఖర్చు చేయాల్సి వస్తుంది. సాధారణంగా మిల్లీలీటర్ వీర్యంలో 4 కోట్ల నుంచి 30 కోట్ల వరకూ వీర్య కణాలు ఉండాలి. ఇది కోటి నుంచి రెండు కోట్ల మధ్య ఉంటే తక్కువగా ఉన్నట్లు అర్థం. ఒకవేళ సరిపడా సంఖ్య ఉన్నా అవి ఆరోగ్యకరంగా లేనట్లయితే సంతానం కలగదు. అంటే వాటిలో చలనం (మొటిలిటీ), ఆరోగ్యకర కణాలు.. ఇలా అనేక అంశాలు ఉంటాయి.
స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉండటానికి అనేక కారణాలు ఉన్నట్లే.. వాటి సంఖ్యను పెంచుకోవడానికి, అవి ఆరోగ్యకరంగా ఉండడానికి చాలా ఆహార పదార్థాలే ఉన్నాయి. వీటిలో చాలా వరకు మనకు సులువుగా దొరికేవే.
మరి స్పెర్మ్ కౌంట్ పెంచుకోవడానికి ఏం తినాలి? ఏం తినొద్దు? ఇంకా ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో డియర్ అర్బన్.కామ్ అందిస్తున్న ఈ స్టోరీలో చూడండి.
ఏ ఫుడ్ తినాలి?
మన ఆరోగ్యం మనం రోజూ తినే ఆహారంపై ఆధారపడి ఉంటుంది. అలాగే స్పెర్మ్ కౌంట్ కూడా. రోజువారీ ఆహారంలో కొన్ని కౌంట్ పెరగడానికి సాయపడితే.. మరికొన్ని తగ్గేలా చేస్తాయి. అందువల్ల ఏది తినాలి? ఏది తినకూడదు అని తెలుసుకోవడం ముఖ్యం.
ముందుగా స్పెర్మ్ కౌంట్ పెరగడానికి ఏ ఆహారం తీసుకోవాలో చూద్దాం. జింక్, విటమిన్ సీ, విటమిన్ డీ, విటమిన్ బీ12, విటమిన్ ఇ, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవాలి. మరి ఇవి వేటిలో ఉంటాయో తెలుసుకోండి.
మెంతులు
మెంతులు మన శరీరంలో టెస్టోస్టెరాన్ లెవల్స్‌ను పెంచుతాయి. వీర్య కణాల ఉత్పత్తి, వాటి ఆరోగ్యానికి ఈ టెస్టోస్టెరాన్ లెవల్సే కీలకం. ఈ లెవల్స్‌ను మెంతులు ఆరోగ్యకరమైన స్థాయిలో ఉంచుతున్నట్లు ఓ అధ్యయనంలో తేలింది. ఇందులో పాలుపంచుకున్న వాళ్లు ప్రతి రోజూ 600 మిల్లీగ్రాముల మెంతులను 12 వారాల పాటు తీసుకుంటే.. వాళ్లలో టెస్టోస్టెరాన్ లెవల్స్ పెరిగినట్లు గుర్తించారు.
డార్క్ చాక్లెట్
స్పెర్మ్ కౌంట్ పెరగడానికి ఉత్తమమైన మార్గం.. డార్క్ చాక్లెట్. కొకొవా గింజలతో ఈ డార్క్ చాక్లెట్ తయారు చేస్తారు. ఇందులో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. పైగా వీర్య కణాల సంఖ్యను పెంచేందుకు సాయం చేసే ఎల్-ఆర్గినైన్ అనే ఎంజైమ్ కూడా ఈ డార్క్ చాక్లెట్‌లో ఉంటుంది. ప్రతి రోజూ ఓ డార్క్ చాక్లెట్ తింటే మంచి ఫలితం ఉంటుంది.
గుడ్లు
విటమిన్ ఇ, ప్రొటీన్ అధికంగా ఉండే గుడ్లు.. వీర్య కణాల వృద్ధికి కూడా సాయపడతాయి. గుడ్డును రోజూ ఏ రూపంలో తీసుకున్నా మంచిదే. మన రోజువారీ ఆహారంలో గుడ్డును కూడా ఒక భాగం చేసుకోవడం చాలా సులువు. పైగా ఆరోగ్యానికి చాలా మంచిది.
అరటిపండ్లు
స్పెర్మ్ కౌంట్ పెంచుకోవడానికి మనకు సులువుగా లభించే మరో ఆహార పదార్థం ఇది. ఇందులో విటమిన్ బీ1తో పాటు విటమిన్ సీ, మెగ్నీషియం ఉంటాయి. ఇవి వీర్య కణాల ఉత్పత్తిని పెంచుతాయి. అత్యంత అరుదుగా లభించే బ్రోమెలైన్ ఎంజైమ్ కూడా అరటిపండ్లలో ఉంటుంది. ఈ ఎంజైమ్ కూడా స్పెర్మ్ కౌంట్ పెరగడానికి సాయపడుతుంది. సెక్స్ హార్మోన్లను కూడా అరటిపండ్లు బాగా నియంత్రించగలవు.
వెల్లుల్లి
మనం రోజూ వంటల్లో వాడే వెల్లుల్లిలో సెలీనియం అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది వీర్య కణాలకు మేలు చేస్తుంది. శరీరంలో అన్ని భాగాలకు రక్త ప్రసరణ సాఫీగా జరగడానికి అవసరమయ్యే అలిసిన్ కూడా ఈ వెల్లుల్లిలో ఉంటుంది.
పాలకూర
వీర్య కణాల వృద్ధికి ఎంతగానో సాయం చేసే ఫోలిక్ యాసిడ్ ఈ పాలకూరలో పుష్కలంగా ఉంటుంది. రోజువారీ ఆహారంలో పాలకూరతోపాటు ఇతర ఆకు కూరలను భాగం చేసుకుంటే.. స్పెర్మ్ కౌంట్‌తోపాటు ఆరోగ్యానికీ మంచిది.
వాల్‌నట్స్
మెదడు చురుగ్గా పని చేయడానికి వాల్‌నట్స్ తినాలని చెబుతారు. అయితే ఇవి వీర్య కణాల సంఖ్యను కూడా పెంచగలవు. ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉండే వాల్‌నట్స్.. కణాల నాణ్యతనూ పెంచుతాయి. 2012లో జరిపిన ఓ అధ్యయనం వీర్య కణాలపై వాల్‌నట్స్ ప్రభావాన్ని నిరూపించాయి.
21 నుంచి 35 ఏళ్ల మధ్య వయసున్న మగవారిపై ఈ అధ్యయనం నిర్వహించారు. ఇందులో సగం మందికి 12 వారాల పాటు రోజూ 18 వాల్‌నట్స్ తినాల్సిందిగా సూచించారు. ఆ తర్వాత చూస్తే వాల్‌నట్స్ తినని వాళ్లతో పోలిస్తే.. తిన్నవాళ్లలో వీర్య కణాల వృద్ధి గణనీయంగా ఉన్నట్లు గుర్తించారు.
దానిమ్మ పండ్లు
దానిమ్మ పండులో యాంటీఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి వీర్య కణాల వృద్ధి, నాణ్యతను పెంచుతాయి. రెండు రోజులకోసారి దానిమ్మ పండు గింజలను అలాగే తినడం లేదా జ్యూస్ చేసుకొని తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
గుమ్మడికాయ గింజలు
గుమ్మడికాయ గింజల్లోనూ యాంటీఆక్సిడెంట్స్‌తోపాటు ఫైటోస్టెరోల్స్, అమినో యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి మగవారిలో ఫెర్టిలిటీ సామర్థ్యాన్ని పెంచడానికి సాయం చేస్తాయి. వీటిని అలాగే తినవచ్చు.
సంత్ర లేదా కమలా పండ్లు
ఆరెంజ్ లేదా సంత్ర లేదా కమలా పండ్లు.. పేరు ఏదైనా విటమిన్ సీ పుష్కలంగా ఉండే ఈ పండ్లు స్పెర్మ్ కౌంట్ పెంచడానికి సాయం చేస్తాయి. ఈ విటమిన్ సీ ఎక్కువగా ఉండే టమాటాటు, బ్రొకోలీ, క్యాబేజీలాంటివి కూడా తినొచ్చు.
చేపలు
నాన్‌వెజ్ అలవాటు ఉన్నవాళ్లు రెడ్ మీట్ తగ్గించేసి కాస్త ఎక్కువ మొత్తంలో చేపలను తింటే ప్రయోజనం ఉంటుందని ఓ అధ్యయనంలో తేలింది. చేపల్లోనూ ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. వీటిలో జింక్ కూడా ఉంటుంది. ఇది కూడా వీర్య కణాల వృద్ధికి తోడ్పడుతుంది.
క్యారట్స్
ఎలా చూసినా క్యారట్స్ మన ఆరోగ్యానికి మేలు చేసే వెజిటబులే. ఇందులో ఉండే బీటా కెరొటిన్ అనే యాంటిఆక్సిడెంట్.. వీర్య కణాల ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
ఆలివ్ ఆయిల్
ఆరోగ్యం కోసం ఆలివ్ ఆయిల్ వినియోగం రానురాను పెరిగిపోతోంది. దీనిని రెగ్యులర్‌గా వాడటం వల్ల వీర్య కణాల వృద్ధితోపాటు వాటి నాణ్యత కూడా పెరుగుతుంది. ఆలివ్ ఆయిల్ చెడు కొలెస్ట్రాల్ లెవల్స్‌ను తగ్గించి.. శరీరంలో ఆక్సిజన్‌ను అన్ని భాగాలకు అందేలా చేస్తుంది. దీనివల్ల వృషణాల్లో ఆరోగ్యకరమైన వీర్య కణాలు వృద్ధి చెందుతాయి.
ఈ ఫుడ్ జోలికి వెళ్లొద్దు..
ఏ ఫుడ్ తింటే స్పెర్మ్ కౌంట్ పెరుగుతుందో చూశాం. మరి స్పెర్మ్ కౌంట్‌ను తగ్గించే ప్రమాదం ఉన్న ఆహార పదార్థాలు ఏవి అన్నది తెలుసుకోవడం కూడా ముఖ్యమే. ఎందుకంటే వీటికి జోలికి వెళ్లకుండా ఉంటే.. సగం పని పూర్తయినట్లే కదా. అవేంటో ఇప్పుడు చూద్దాం..
ప్రాసెస్ చేసిన మాంసం
ఈ మధ్య మనం పొట్ట కంటే ఎక్కువగా నాలుక రుచినే చూస్తున్నాం. ఏది టేస్ట్ అనిపిస్తే దానిని లోపల వేసేస్తాం. అందుకే వివిధ రకాల ఆహార పదార్థాల టేస్ట్ పెంచడానికి, ఎక్కువ కాలం నిల్వ ఉండటానికి వాటిని ప్రాసెస్ చేస్తున్నారు. ఇందులో మాంసం కూడా ఒకటి. స్మోకింగ్, సాల్టింగ్, క్యూరింగ్, ఫెర్మెంటేషన్‌లాంటి పద్ధతుల్లో మాంసాన్ని ప్రాసెస్ చేస్తున్నారు.
ప్రాసెస్ చేసిన మాంసం అసలు ఆరోగ్యానికి మంచిది కాదు. ఇది స్పెర్మ్ కౌంట్ తగ్గడానికి కూడా కారణమవుతోందని తాజా అధ్యయనాల్లో తేలింది. వీటిని తినడం వల్ల కౌంట్ ఎలా తగ్గుతోంది అనడానికి రీసెర్చర్లకు సైంటిఫిక్ ఆధారం ఏదీ లభించకపోయినా.. తగ్గడం మాత్రం నిజమని స్పష్టమైంది.
వీర్య కణాల వృద్ధి కోసం చూస్తుంటే మాత్రం మీరు ఈ మాంసానికి దూరంగా ఉండటం మంచిది.
ట్రాన్స్ ఫ్యాట్స్
మనం రోజూ తీసుకునే వంట నూనెల్లో ఈ ట్రాన్స్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇందులోని చెడు కొలెస్ట్రాల్‌తో మన గుండెకు చేటు జరుగుతుందని డాక్టర్లు చాలా వరకూ హెచ్చరిస్తూనే ఉంటారు. రిఫైన్డ్ ఆయిల్‌కు దూరంగా ఉండటం మంచిదన్న సూచనలూ తరచూ వింటూ ఉంటాం.
ఈ ట్రాన్స్ ఫ్యాట్స్‌తో గుండెకే కాదు.. స్పెర్మ్ కౌంట్‌కూ లింకుంది. 2011లో స్పెయిన్‌లో జరిగిన ఓ అధ్యయనంలో ట్రాన్స్ ఫ్యాట్స్ ఎక్కువగా తీసుకున్న పురుషుల్లో వీర్య కణాల సంఖ్య తగ్గిపోయినట్లు గుర్తించారు. ట్రాన్స్ ఫ్యాట్స్ చాలా సులువుగా, తక్కువ ధరకే లభిస్తాయి.
ఆయిల్స్‌ను ఎక్కువ కాలం ఉండేలా చేస్తాయి. పైగా మంచి టేస్ట్ కూడా అందిస్తాయి. దీంతో అన్ని కంపెనీలు నూనెల్లో కృత్రిమంగా ట్రాన్స్ ఫ్యాట్స్‌ను కలుపుతున్నారు. డెయిరీ ప్రోడక్ట్స్‌తో సహజంగా తక్కువ మొత్తంలో తీసుకునే ట్రాన్స్ ఫ్యాట్స్‌తో పెద్ద ముప్పు లేదు కానీ.. ఇలాంటి ఆర్టిఫిషియల్ ట్రాన్స్ ఫ్యాట్స్ చాలా డేంజర్.
సోయా ఉత్పత్తులు
సోయా ఆరోగ్యానికి మంచిదే. కానీ ఇది ఎక్కువగా తీసుకుంటే మాత్రం స్పెర్మ్ కౌంట్ తగ్గిపోతుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. సోయా ఉత్పత్తుల్లో ఫైటోఎస్ట్రోజెన్స్-ఎస్ట్రోజెన్
పెస్టిసైడ్స్, బిస్ఫెనాల్ ఎ (బీపీఏ)
ఈ లిస్ట్‌లో పెస్టిసైడ్స్ ఏంటి అని మీరు అనుకోవచ్చు. కానీ పరోక్షంగా ప్రతి రోజూ మనం తీసుకుంటున్న ఆహారంతోపాటు వీటిని కూడా తింటున్నాం. మనం తినే ఆకుకూరలు, పండ్లలో ఈ పురుగు మందుల అవశేషాలు ఉంటున్నాయి. ప్యాకింగ్ రూపంలో వస్తున్న ఆహారాల్లో బిస్ఫెనాల్ ఎ ఉంటోంది.
పురుగు మందుల్లోని రసాయనాలు, ఈ బీపీఏల్లో జీనోఎస్ట్రోజెన్స్ ఉంటాయి. ఇవి స్పెర్మ్ కౌంట్‌పై ప్రభావం చూపిస్తాయి. మరో ప్రమాదకరమైన విషయం ఏమిటంటే.. ఈ పురుగు మందుల్లో ఉండే రసాయనాలు కొన్ని మనం రోజూ ఇంట్లో వాడే నాన్ స్టిక్ కుక్‌వేర్ల నుంచి విడుదలవుతున్నాయి.
డెయిరీ ఉత్పత్తులు
పాలు, పెరుగు, నెయ్యి, వెన్నలాంటి డెయిరీ ఉత్పత్తుల వల్ల శరీరానికి మేలే జరుగుతుంది. వీటిలో కొవ్వు ఉన్నా పరిమిత స్థాయిలో తీసుకుంటే ఎలాంటి నష్టం ఉండదు.
అయితే క్రీమ్, చీజ్‌తో సహా పాలను ఎక్కువగా తాగే టీనేజర్లలో స్పెర్మ్ కౌంట్ తగ్గిపోవడం, వీర్య కణాల ఆకారం అసాధారణంగా మారిపోవడంలాంటివి జరిగినట్లు ఓ అధ్యయనంలో తేలింది. ఆవులు, గేదెలకు స్టెరాయిడ్స్ ఇవ్వడం కూడా దీనికి ఓ కారణంగా తేల్చారు.
స్మెర్మ్ కౌంట్ ఆరోగ్యానికి దోహదం చేసే అంశాలు
- సాధ్యమైనంత వరకూ సేంద్రీయ కూరగాయలనే తినడానికి ప్రయత్నించండి. అవి దొరకకపోయినా, అంత ఖర్చు పెట్టలేమని అనుకున్నా.. మీరు కొనే కూరగాయలనే బాగా కడిగిన తర్వాత వాడండి.
- నాన్‌వెజ్ లేనిదే ముద్ద దిగదు అనుకుంటే.. కనీసం ప్రాసెస్ చేసిన మాంసం పక్కన పెట్టేయండి.. దాని బదులు చేపలను మీ ఆహారంలో భాగంగా చేసుకోండి. కోళ్లు, మేకలు, గొర్రెలకు విపరీతమైన వాక్సినేషన్, ఇంజెక్షన్ల కారణంగా మనపై ఆ మాంసం ప్రభావం చూపుతోంది.
- రిఫైన్డ్ ఆయిల్స్ వాడకాన్ని తగ్గించండి. జంక్ ఫుడ్ తినే అలవాటు ఉంటే వెంటనే మానుకోండి. ఇది మీ స్పెర్మ్ కౌంట్‌కే కాదు.. ఆరోగ్యానికి ఏ విధంగానూ మంచిది కాదు.
- వీలైనంతగా ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించండి.
- స్మోకింగ్ అలవాటు ఉంటే.. వెంటనే మానేయండి.
- బరువు ఎక్కువగా ఉన్నా కూడా అది వీర్య కణాల సంఖ్యపై ప్రభావం చూపుతుంది. అందువల్ల వెంటనే తగ్గడానికి ప్రయత్నించండి.
- ప్రతి రోజూ వర్కవుట్స్ చేయండి. 16 వారాల పాటు రోజూ 50 నిమిషాలు ఏరోబిక్ ఎక్సర్‌సైజ్ చేయడం వల్ల స్పెర్మ్ కౌంట్ పెరిగినట్లు 2017లో చేసిన ఓ అధ్యయనంలో తేలింది. ఏరోబిక్ ఎక్సర్‌సైజులు అంటే.. వేగంగా నడవడం, పరుగెత్తడం, స్విమ్మింగ్, సైక్లింగ్‌లాంటివి.
- సాధ్యమైనంత వరకూ ఒత్తిడిని తగ్గించుకోండి. ఒత్తిడి మన శరీరాన్ని పునరుత్పత్తి దిశగా పని చేయకుండా చేస్తుంది. హెల్తీ డైట్ తీసుకోవడం, ఎక్సర్‌సైజులు, ఇష్టమైన పని చేస్తుండటంలాంటివి ఒత్తిడిని తగ్గిస్తాయి.
- ఆల్కహాల్, డ్రగ్స్‌లాంటి వాటికి దూరంగా ఉండండి. మారిజువానా, కొకైన్‌లాంటి డ్రగ్స్.. నేరుగా స్పెర్మ్ కౌంట్‌పై ప్రభావం చూపిస్తాయి. పరిమితికి మించి ఆల్కహాల్ తీసుకోవడం వల్ల మనలోని టెస్టోస్టెరాన్ లెవల్స్ తగ్గడంతోపాటు వీర్య కణాల సంఖ్య, నాణ్యతపైనా ప్రభావం చూపుతుంది. మితిమీరిన ఆల్కహాల్, డ్రగ్స్.. నపుంసకత్వానికి కూడా దారి తీసే ప్రమాదం ఉంది.
- విటమిన్ డీ, కాల్షియం సప్లిమెంట్స్ తీసుకుంటే వీర్య కణాలు వృద్ధి చెందుతున్నట్లు కొన్ని అధ్యయనాల్లో తేలింది. శరీరంలో విటమిన్ డీ తక్కువగా ఉంటే అది స్పెర్మ్ కౌంట్ తగ్గేలా చేస్తుంది.
- అశ్వగంధ చూర్ణం కూడా వీర్య కణాల వృద్ధికి తోడ్పడుతున్నట్లు 2016లో జరిగిన ఓ అధ్యయనం తేల్చింది. 46 మంది పురుషులపై ఈ అధ్యయనం చేశారు. వీళ్లు ప్రతి రోజూ 675 మిల్లీగ్రాముల అశ్వగంధ చూర్ణాన్ని 90 రోజుల పాటు తీసుకుంటే.. వాళ్లలో స్పెర్మ్ కౌంట్ 167 శాతం పెరిగినట్లు తేలడం విశేషం.
- బిగుతైన దుస్తులు ధరించకండి. ముఖ్యంగా జీన్స్ ఎక్కువగా ధరించకండి.
- ఎక్కువగా వేడి నీళ్ల స్నానం చేయకండి. గోరు వెచ్చని నీళ్లు సరిపోతాయి. శరీర ఉష్ణోగ్రతలలో సమతుల్యం ఉండేలా చూడాలి. చలి కాలంలో అతిగా హీటర్లు వాడడం సరికాదు.
ధన్యవాదములు
మీ నవీన్ నడిమింటి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి