4, జనవరి 2020, శనివారం

ముక్కు లో వెంటుకలు తీసిన నప్పుడు జాగ్రత్తలు

త‌ల‌పై ఉన్న వెంట్రుక‌లు పెరిగితే పురుషులు వాటిని ఎప్ప‌టిక‌ప్పుడు క‌ట్ చేయించుకుంటారు. కొంత మంది మ‌హిళ‌లు, యువ‌తులు కూడా హెయిర్ క‌ట్ చేయించుకుని స్టైల్ చేసుకుంటారు లెండి. అది వేరే విష‌యం. అయితే పురుషులైనా, స్త్రీలైనా హెయిర్ క‌ట్ మాత్ర‌మే కాదు, ముక్కులో ఉన్న వెంట్రుక‌ల‌ను కూడా క‌ట్ చేయించుకుంటారు. అంత వ‌ర‌కు బాగానే ఉన్నా కొన్ని సంద‌ర్భాల్లో సెలూన్‌కు వెళ్ల‌కుండా ఇంట్లోనే ఆ ప‌ని చేస్తుంటారు. కొంద‌రు ముక్కులోని వెంట్రుక‌ల‌ను డైరెక్ట్‌గా ప‌ట్టుకుని లాగిన‌ట్టు తీసేస్తే, కొంద‌రు మాత్రం ప్ర‌త్యేక‌మైన మిష‌న్ల‌తో ముక్కులోప‌లంతా ఉన్న వెంట్రుక‌ల‌ను మూలాల వ‌ర‌కు క్లీన్ అండ్ గ్రీన్ చేసుకుంటారు. అయితే ఇలా చేయ‌డం ప్ర‌మాద‌క‌ర‌మ‌ట‌. ఎందుకంటే…

hair-in-nose

hair-in-nose
ముక్కులోని వెంట్రుక‌ల‌ను ప‌ట్టుకుని లాగితే ఆ వెంట్రుక‌లు ఉన్న ప్ర‌దేశంలో ఖాళీ ఏర్ప‌డుతుంది. ఒక్కోసారి తెలియకుండానే వెంట్రుక‌ల మూలం నుంచి ర‌క్తం వ‌స్తుంది. కానీ అది అన్ని సంద‌ర్భాల్లో బ‌య‌టి దాకా రాదు. ఈ క్ర‌మంలో అలా ఏర్ప‌డ్డ ఖాళీ లోప‌లికి ముక్కు లోప‌ల ఉండే బాక్టీరియా, వైర‌స్‌లు ప్ర‌వేశిస్తాయి. అనంత‌రం అక్క‌డి నుంచి ర‌క్త‌నాళాల్లోకి ప్ర‌యాణించి మెద‌డు దాకా వ్యాప్తి చెందుతాయి. ఎందుకంటే ముక్కు లోప‌లి నుంచి కొన్ని నాళాలు డైరెక్ట్‌గా మెద‌డుకు వెళ్తాయి కాబ‌ట్టి. ఈ క్ర‌మంలో మెద‌డుకు చేరిన బాక్టీరియా ఇన్‌ఫెక్ష‌న్ల‌ను క‌లిగించి మ‌న‌ల్ని వ్యాధుల‌కు గురి చేస్తుంది. అలా వ‌చ్చే వ్యాధుల‌ను మెనింజైటిస్ అని పిలుస్తారు. ఇవి మ‌న‌కు చాలా ప్ర‌మాద‌క‌రం. ఒక్కో సారి ప్రాణాంత‌కాలుగా కూడా ప‌రిణ‌మించ‌వ‌చ్చు.

triangle-on-nose
చిత్రంలో చూపిన విధంగా ముక్కుపై త్రిభుజాన్ని గీయ‌గా వ‌చ్చే ప్ర‌దేశం మ‌న‌కు చాలా కీల‌కమైంద‌ట‌. దాన్ని అత్యంత సున్నిత‌మైన ప్ర‌దేశంగా మ‌నం భావించి అందుకు తగిన విధంగా ర‌క్ష‌ణ చ‌ర్య‌లు తీసుకోవాల‌ట‌. లేదంటే పైన చెప్పిన విధంగా వ్యాధుల‌కు గురయ్యేందుకు అవ‌కాశం ఉంటుంది. అయితే మ‌రి ముక్కులో బాగా వెంట్రుక‌లు పెరిగి ఇబ్బందిగా ఉంటే ఏం చేయాలి? అని మీరు అడిగితే అందుకు కూడా స‌మాధానం ఉంది. ఆ ప‌రిస్థితిలో ఏం చేయాలంటే ముందుగా ముక్కు లోప‌లి భాగాన్ని శుభ్ర‌మైన నీటితో క‌డిగేయాలి. దీంతో ప్ర‌మాద‌క‌ర‌మైన బాక్టీరియా దాదాపుగా న‌శిస్తుంది. అనంత‌రం అందులోని వెంట్రుక‌ల‌ను క‌త్తెర స‌హాయంతో క‌ట్ చేయాలి. అయితే వెంట్రుక‌ల మూలాల వ‌ర‌కు క‌ట్ చేయ‌కూడ‌దు. కేవ‌లం బ‌య‌టికి క‌నిపించే వెంట్రుక‌ల‌ను మాత్ర‌మే క‌ట్ చేసుకోవాలి. ఒక వేళ మిష‌న్ ఉప‌యోగించినా ఇదే విధంగా క‌ట్ చేయాలి. లేదంటే పైన చెప్పిన‌ట్టు వెంట్రుక‌లు ఊడిపోయి దాని స్థానంలో బాక్టీరియా ప్ర‌వేశించేందుకు అనువుగా మారుతుంది. కాబ‌ట్టి, ముక్కులోని వెంట్రుక‌ల‌ను క్లీన్ చేసే ముందు త‌ప్ప‌నిస‌రిగా జాగ్ర‌త్త వ‌హించండి!

ధన్యవాదములు 

మీ నవీన్ నడిమింటి 


బరువు తగ్గాలి అనుకుంటే మంచి ఆహరం, వ్యాయామాలు అనుసరించాలి. ఆహర విషయానికి వస్తే బరువు పెంచే పట్టిక గురించి ఇక్కడ తెలుపబడింది

బరువు తగ్గడం ఎలా పరిష్కారం మార్గం నవీన్ నడిమింటి సలహాలు 


       ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది అధిక బరువు , స్ధూలకాయంతో సతమతమవుతున్నారు . ఏ వయస్సులోనైనా బరువు పెరిగే అవకాశం ఉన్నప్పటికి , చాలా మంది మధ్యవయస్సులోనే ఎక్కవగా *బరువు* పెరుగుతుంటారు .
        శారీరక శ్రమ అంతగా లేని ఉద్యోగాలు , ఆహారంపై అవగాహన లేకుండా చిరుతిళ్ల అలవాటు వంటి జీవనశైలితో స్ధూలకాయం వస్తుంది .
      స్ధూలకాయం కారణంగా గుండె జబ్బులు , అధిక రక్తపోటు , మధుమేహం , సంతాన సమస్యలు , క్యాన్సర్ , ఊపిరితిత్తుల జబ్బులు , పిత్తాశయంలో కిడ్నీల్లో రాళ్ళు , అల్సర్లు , గ్యాస్ట్రిక్ సమస్యలు , మోకాళ్ళ నొప్పులు మొదలగునవి చుట్టుమడుతున్నాయి .
         స్త్రీలు రజస్వల అయినపుడు గర్భం ధరించినపుడు , ముట్లుడిగన తర్వాత మహిళలు అధికంగా బరువు పెరిగే అవకాశం ఉంటుంది .
# స్తూలకాయులు కఫ , వాత రోగులు .
# శారీరక దుఃఖాలలో 90 % పొట్ట వల్ల వచ్చేవి .
# మనము తిన్న ఆహారం పొట్టలో సక్రంగా జీర్ణం అవ్వడం చాలా ముఖ్యం . కాబట్టి తినడం ఎంత ప్రధానమో , సక్రమంగా జీర్ణమటం అంతే ముఖ్యం . భోజనం కుళ్ళినప్పుడు శరీరంలో L.D.L. / V.L.D.L. ( చెడు కొలెస్ట్రాల్ ) తయారవుతుంది . మీకు ఈ చెడుకొలెస్ట్రాల్ వల్లనే స్ధూలకాయం వస్తుంది . మేలు చేసే కొలెస్ట్రాల్ ( H.D.L. ) ఎప్పుడైతే తయారవుతుందో స్ధూలకాయం తగ్గిపోతుంది . శరీరంలో కాల్షియం , విటమిన్ ' సి '  లోపించిన స్ధూలకాయం వస్తుంది .
*బరువు తగ్గే మార్గాలు* :-
1. *నీరు త్రాగే విధానం*...
   # నీటిని గుటక గుటకగా త్రాగాలి . బ్రేక్ ఫాస్ట్ , భోజనమునకు 1 గంట ముందు నీళ్ళు త్రాగాలి . బ్రేక్ ఫాస్ట్ , భోజనము తర్వాత 1 1/2 గంట తర్వాత త్రాగాలి . భోజనము మధ్యలో త్రాగాలని పిస్తే 1 లేక 2 గుటకలు త్రాగవచ్చు . భోజనము తర్వాత గొంతు సాఫీగా ఉంచటానికి 2 లేక 3 గుటకల నీరు త్రాగ వచ్చును .
# మీరు పై పద్దతిలో నీళ్ళు త్రాగిన యెడల తిన్న ఆహారం సక్రమంగా *జీర్ణం* అవుతుంది . ఆహారం *కుళ్ళి పోదు* . L. D. L. / V. L. D.L. అనే *చెడు కొలెస్ట్రల్* తయారవదు
*అధిక బరువు* సమస్య వుండదు .
*నీటిని గుటక గుటకగా త్రాగితే ఎలాంటి గుండె జబ్బులు , మధు మేహం , అధిక బరువు వంటి సమస్యలు రావు*.
*వంట నూనె*
# మీరు వంటకు ఉపయోగించే *శుద్దమైన నూనె ( Non Refined Oil )* మీ *వాతాన్ని* పెరగనీయ కుండా ఉంచుతుంది . స్ధూలకాయం సమస్య వుండదు . శుద్ధమైన నూనె తీసుకుంటే శరీరంలో *లివర్* సహాయంతో మంచి *కొలెస్ట్రాల్ ( H.D.L)* ఎక్కువ మోతాదులో తయారవుతుంది . ఈ (H.D.L)  మంచి చేసే కొలెస్ట్రాల్ ఎప్పుడైతే తయారవుతుందో స్ధూలకాయం , అధిక బరువు తగ్గిపోతుంది .
# *హాని చేసే కొలెస్ట్రాల్ ( L.D.L./ V.L.D.L )* వల్లనే *స్ధూలకాయం* వస్తుంది . కావున ఎటువంటి *(Refined Oils) రిఫైండ్ నూనెల* ను వాడరాదు
ఈ రీఫైండ్ నూనెను తయారు చేసేటప్పుడు 6 లేక 13 రకాల హానికరమైన కెమికల్స్ ని కలుపుతారు . ఈ కెమికల్స్ ముందు ముందు వాటంతట అవే విషాన్ని పుట్టిస్తాయి .
# శుద్దమైన నూనెను వాడితే మీరు జీవితాంతం ఆరోగ్యంగా జీవించ గలరు .
*శుద్దమైన నునెలు* ..
  *వేరు శనగ నూనె , నువ్వుల నూనె , కుసుమల నున్ మరియు కొబ్బెర నూనెలు* .
*3త్రిఫల చూర్ణం*
*కరక్కాయ + తానెకాయ + ఉసరికాయలు కలిసినదే త్రిఫల చూర్ణం* వాత,పిత్త,కఫముల ఈ మూడింటినీ అద్భతముగా శమింప చేస్తుంది ఈ త్రిఫల.
*త్రిఫల యొక్క మోతాదు*
  1భాగం కరక్కాయ +2 భాగాలు తానేకాయ + 3 భాగాలు ఉసరికాయలు కలుప వలెను .
ఈ మోతాదులో తయారు చేసిన *త్రిఫల చూర్ణం* నే వాడవలెను . ఉత్తమమైనది .
# కొన్ని రకాల ప్రత్యేకమైన రోగాలకు మాత్రమే సమపాళ్ళలో ఉన్న త్రిఫల చూర్ణంని తీసుకోవలసి వస్తుంది .
# ఆయుర్వేద షాపులలో  సమపాళ్ళలో వున్న త్రిఫల చూర్ణం లభిస్తుంది . కావున మీరే 1:2:3. నిష్పత్తిలో త్రిఫల చూర్ణంని తయారు చేసుకొనండి .
*త్రిఫల వాడే విధానము*.
    ఉదయం పరగడపున అల్పాహారినికి 45 నిమిషాల ముందు ఈ త్రిఫలని తీసుకొనవలెను .
*1 ( పెద్ద స్పూన్ ) త్రిఫల చూర్ణం + బెల్లం లేక తేనెను కలిపి తినవలెను* 
*తర్వాత ఆవు పాలు త్రాగవలెను* 
అధిక బరువు తగ్గుతారు .
# ఉదయం పూట త్రిఫల తీసుకోవడం వలన శరీరానికి కావలసిన *విటమిన్స్ , మైక్రో నూట్రియన్స్ ని , కాల్షియం , ఐరన్ అన్నిరకాల పోషకాలు అందుతాయి . *ఖచ్చితంగా బరువు తగ్గుతారు* .
*4. ఆవు పాలు + ఆవు నెయ్యి*..
  # దేశీయ ఆవు పాలు అమృతం . ఆవు పాలు ఎంత వేడి చేసినా దానిలో ఉన్న ఏ గుణం నశించదు .
# ఆవు నెయ్యిలో అద్భతమైన ఆశ్చర్యకరమైన ఔషధ గుణాలు కలవు . *ఆవు నెయ్యి శరీరం యొక్క బరువును సమతూకంలో ఉంచుతుంది* . అధిక బరువు వున్న వారు బరువు తగ్గుతారు .
*ఆవు నెయ్యిని తీసుకొనే విధానం* : ----
# రాత్రి భోజనం తర్వాత 1 గ్లాసు వేడి వేడి ఆవు పాలలో 1 లేక 2 గ్లాసుల చెంచాల ఆవు నెయ్యిని+చిటికెడు పసుపు  కలిపి , రెండు గ్లాసులతో ఎక్కువ సేపు , సుమారుగా 20-25 సార్లు పైకీ క్రిందికి తిరగతిప్పాలి. అప్పుడు ఆ పాలను గుటక గుటకగా త్రాగ వలెను.
*బరువు తగ్గుతారు*.
# వేడి వేడి కిచిడిలో బాగా ఎక్కువ నెయ్యి కలుపుకుని వారానాకి ఒక సారి తిన వలెను. *బరువు తగ్గుతారు*.
*పాటించ వలసిన నియమాలు* .
# సైంధవ లవణం ( Rock Salt ) వాడవలెను .
# ప్రతి రోజు ఉదయం 10-15 నిమిషాలీ తిరగలి తిప్పాలి .
# స్త్రీలు తిరగలి తిప్పిన యెడల మోనోపాజ్ సమస్యల నుండి రక్షిస్తుంది .
# పొట్ట తగ్గాలన్నా , ఎసిడిటి , విరేచన , జీర్ణ వ్యాధులన్నీ తగ్గాలంటే ప్రతి రోజు తిరగలి తిప్పండి .
# భోజనం తర్వాత నల్ల నువ్వులను బాగా నమిలి తినండి . 3 లేక 4 నెలల్లో 7 లేక 8 కిలోల బరువు తగ్గుతారు .
*వేసవిలో నువ్వులను తినరాదు* .
# ఫ్రిజ్ నీటిని , ఐస్ ముక్కలు వేసిన నీటిని త్రాగరాదు .
# పొట్ట బాగా ముందుకు వచ్చిన వారు సుఖాసనంలో కూర్చోని భోజనం చేసిన యెడల 2 లేక 3 నెలల్లో వారి పొట్ట వెనక్కి వెళ్ళి ఉంటుంది .
#.మైదా. తో చేసిన పదార్థాలు తినకొఢథు.
# పరోటా రాత్రి తినటం వల్ల పొట్ట పెరిగే అవకాశం వున్నది .
# గోధుమలు , మైదాను వాడరాదు .
# గోడంబి బరువును పెంచుతుంది .
# నువ్వుల నూనెతో మసాజ్ చేసుకుంటే బరువు తగ్గుతారు .
# ఆహారంలో *చిరు దాన్యాలు ( Millets ) ను చేర్చుకొన వలెను .
ధన్యవాదములు 
మీ నవీన్ నడిమింటి 

జుట్టు రాలుట నివారణ మార్గం


జుట్టు రాలుట సమస్యలు-నివారణ మార్గాలు అవగాహనా కోసం నవీన్ నడిమింటి సలహాలు 



          జుట్టు రాలుట సమస్యలు –నివారణ మార్గాలు
     పురుషుల కైనా, స్త్రీల కైనా అందాన్ని ఇనుమడింప జేసేవి వెంట్రుకలే. ఒకప్పుడు మనదేశములో కేశసంపదకుకొదవలేదు.     స్త్రీలు  పొడవైనజుట్టుతో , పురుషులు  ఉంగరాల,నొక్కుల, జులపాలతో అందంగా కనపడేవారు. బట్టతల గలవారు 1%   కంటే  తక్కువ వుండేవారు. కాని ఇప్పుడు యువకులలోనే 30% పైగా బట్టతలవారు కనిపిస్తున్నారు. ముఖ్యంగా ఉన్నత విద్యావంతులు,సాఫ్ట్ వేర్ రంగం లో వారికి జుట్టు ఊడిపోయే సమస్య ఎక్కువగా కన్పిస్తున్నది.
     జుట్టు రాలుట  (హేర్ ఫాలింగ్ ) కు ప్రధాన కారణాలు :
      .1. మానసిక ఒత్తిడి, చిన్న విషయానికి ఎక్కువ ఆలోచించడం.
      2. వేళకు నిద్రపోక పోవడం    3. సమతుల పోష కాహారం లోపించడం.
      4. వాతావరణ కాలుష్యం.      5. రసాయనాలు (షాంపులు,హేర్ డై ) ఎక్కువ వాడడం.
      6. చీటికి మాటికి యాంటీ బయోటిక్స్  ఎక్కువ తీసుకోవడం.
     7. జబ్బు చేసి బలహీన పడినప్పుడు  ఎక్కువ జుట్టు రాలుతుంది.
     8 త్వరగా సన్నపడాలని అతిగాచేసే ఎక్సర్ సైజులు, డైటింగ్ లు
     9. ఎనీమియా (ఐరన్ లోపం ), B12 విటమిన్ లోపించడం, జింక్ లోపించడం.
     
10. టైఫాయిడ్ వల్ల,    
11 యాంటీ క్యాన్సర్ మందులు వాడటం,రేడియో తెరఫీ వల్ల.
     12.ప్రొజెస్టిరాన్, టెస్టో స్టిరాన్  హార్మోన్స్ లోపించడం లేదా ఎక్కువ కావడం.
     13. వంశ పారంపర్యంగా బట్ట తల రావడం.
    వంశపారంపర్యంగా, సహజంగా  వచ్చిన బట్టతల మళ్ళీ మొలవదు. ఇన్ఫెక్షన్, జబ్బులవల్ల పోషకాహార లోపం వల్ల,
      ఏర్పడిన బట్టతలకు చికిత్స చేస్తే చాలావరకు  జుట్టు వస్తుంది.
     జుట్టు రాలకుండా ఆపడానికి, తిరిగి వెంట్రుకలు మొలవడానికి  మార్గాలు:
   అల్లోపతీ వైద్యం: బట్టతల  ఏర్పడినచోట  
HAIREX solution(Minoxidil) or HEBALDsolution(Minoxidil)
   పై మందులలో ఏదో ఒకటి ఉదయం ఒక చుక్క (1 ml),సాయంత్రం ఒక చుక్క మందును వేసి వేలితో మర్దన చేయాలి.
   అలా కనీసం నాలుగు నెలలు రాయాలి. 4 నెలలతర్వాత వెంట్రుకలు మొలవడం మొదలవుతాయి. మొలిచిన తర్వాత     కూడా రోజు రెండు పూటలు  పై మందు రాయాలి.

  ఆయుర్వేదం, ప్రకృతి వైద్యం   

1.నల్లమందు,లిల్లీపూరసాన్నిసారాయిలోకలిపితైలముగావాడితేజుట్టురాలదు. క్రీ. పూ 400 లో హిప్పో క్రేట్స్ ఈ విధానం కనుగొన్నాడు.
 2. కలబంద లోని తెల్లని గుజ్జును తీసి, కొబ్బరి నూనె లో మరిగించి, ఆ తైలాన్ని రోజు రాసిమర్దన చేస్తుంటే జుట్టు 
రాలదు .                                                                                                                      
3. కట్టెలు, దుంగలపై తేమకు పెరిగే ఒక రకమైన పుట్టకొక్కులు(శిలీంద్రం ) ను తెచ్చి ఎండబెట్టి, కాల్చి ఆ బూడిదను     కొబ్బరి నూనె లేదా నువ్వుల నూనెలో కలిపి బట్టతలకు రాస్తుంటే  ఒకటి రెండు నెలలలో  నూగులా' వెంట్రుకలు మొలుస్తాయి. తర్వాత దట్టంగా పెరుగుతాయి. ఇది చాలా ఉత్తమ చికిత్స.
4.  ఒక ఉల్లిపాయను కచ్చాపచ్చా దంచి ఒక కప్పు  రమ్ లో వేసి 24 గంటల తర్వాత దానిని గుడ్డలోవేసి వడకట్టి(గట్టిగా పిండి ),ఆ రసాన్ని ఒక సీసాలో భద్రపరచుకొని రోజూ తలకు రాస్తుంటే వెంట్రుకలు రాలవు. జుట్టు పెరుగుతుంది. ప్రపంచ సుందరి, ఈజిప్సియన్  రాణి క్లియోపాట్ర  ఈ విధానం అవలంభించేదట.
5.ముల్లంగిరసం ,ఉల్లిపాయలరసం కలిపి రాసి,మర్దన చేస్తుంటే జుట్టు పెరుగును.
6. జింక్ ఎక్కువగా ఉండే గుమ్మడి గింజలు, బీన్స్, నల్లనువ్వులు, లాంటివి ఆహారంగా తీసుకొంటే జుట్టు పెరుగును.
7. B12 విటమిన్, ఫోలిక్ యాసిడ్, జుట్టు రాలుటను నివారించును.
కొసమెరుపు B.P ని తగ్గించడానికి వాడే ట్యాబ్లెట్స్ లో వెంట్రుకలు పెరగడానికి దోహదపడే ఒక రకమైన ఔషధం (సైడ్ఎఫెక్ట్ గా ) ఉంది. అందుకనే వారికి జుట్టు బాగా పెరుగుతున్నదట.  
గమనిక: వయస్సు పైబడినవారికి ,ముసలి వారికి పై చికిత్సా విధానాలు సత్ఫలితాలనివ్వవు. వారు మంచి పోషకాహారం తీసుకొంటుంటే కొంతవరకు జుట్టు రాలుటను నివారించ వచ్చు.

పొడిబారిన కళ్ళు పరిష్కారం మార్గం


డ్రై మరియు ఇచీ ఐస్ సమస్య సాధారణ సమస్యగా మారిపోయింది. కళ్ళల్లో అలాగే కంటి చుట్టూ దురద వలన అసౌకర్యంగా ఉంటుంది.

అలర్జిక్ రియాక్షన్ లేదా ఏదైనా ఇన్ఫెక్షన్ వలన డ్రై మరియు ఇచీ ఐస్ సమస్య వేధిస్తుంది. కాంటాక్ట్ లెన్సెస్ ని వాడటం అలాగే ఐ హైజీన్ ని సరిగ్గా పాటించకపోవడం, ఎక్సపైర్ అయిపోయిన ఐ కాస్మెటిక్స్ ను వాడటం, కళ్ళల్లో దుమ్ము పడటం వంటివి డ్రై ఐస్ సమస్యను తీసుకువస్తాయి. డ్రై ఐస్ కి అలాగే కళ్లల్లో దురదలనేవి ఈ కారణాల వలన ఏర్పడతాయి.

కళ్ళల్లో ఇరిటేషన్, దురద అలాగే బర్నింగ్ సెన్సేషన్ వంటివి డ్రై ఐస్ తో పాటు వచ్చే కొన్ని ఇబ్బందికర లక్షణాలు. కళ్ళలో వాపును కూడా గమనించవచ్చు. వీటితోపాటు కళ్ళల్లో డిశ్చార్జ్, ఎరుపు, లైట్ సెన్సిటివిటీ పెరగడం వంటివి కూడా అనుభవంలోకి వస్తాయి.

అలర్జీస్ కలిగే సీజన్ కావడం వలన కూడా డ్రై మరియు ఇచీ ఐస్ సమస్య వేధిస్తుంది. ఈ సమస్యను త్వరగా తగ్గించుకోవడం ముఖ్యం. చికిత్స చేయకుండా ఈ సమస్యను అలాగే వదిలేస్తే కళ్ళు డేమేజ్ అయ్యే ప్రమాదం ఉంది.

తక్షణ ఉపశమనం కోసం, ఈ నేచురల్ రెమెడీస్ ను ప్రయత్నిస్తే డ్రై మరియు ఇచీ ఐస్ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.

1. నీళ్లు మరియు ఉప్పు:

నీళ్లు మరియు ఉప్పు మిశ్రమం అనేది డ్రై మరియు ఇరిటేటెడ్ ఐస్ సమస్యను పరిష్కరించేందుకు ఉత్తమ రెమెడీగా పనికొస్తుంది. సాల్ట్ అనేది కళ్ళలో పేరుకున్న ఉప్పును తొలగించేందుకు ఉపయోగపడుతుంది. అలాగే సాల్ట్ లో యాంటీ బాక్టీరియల్ ఏజెంట్స్ కలవు. ఇవి బాక్టీరియాను నశింపచేస్తాయి.

ఒక టీస్పూన్ సాల్ట్ ని ఒక కప్పుడు డిస్టిల్డ్ వాటర్ లో కలపాలి.

ఉప్పు పూర్తిగా కరిగిపోయే వరకు ఈ మిశ్రమాన్ని బాయిల్ చేయాలి.

ఆ తరువాత ఈ మిశ్రమాన్ని చల్లార్చి కళ్ళను వాష్ చేసేందుకు వాడుకోవాలి.

2. చమోమైల్ టీ:

చమోమైల్ లో శక్తివంతమైన యాంటీ అలర్జెనిక్ ఎఫెక్ట్స్ కలవు. వీటివలన, ఇది కోల్డ్ కంప్రెస్ గా అలాగే ఐ వాష్ గా పనిచేస్తుంది. తద్వారా, కళ్ళకి రిలీఫ్ ను కలిగిస్తుంది. చమోమైల్ అనేది హిస్టామిన్ విడుదలను నిరోధిస్తుంది. తద్వారా, అలర్జిక్ రియాక్షన్ ను నియంత్రిస్తుంది.

1 చమోమైల్ టీ బ్యాగ్ ను ఒక కప్పుడు వేడి నీటిలో అయిదు నిమిషాల పాటు ఉంచాలి.

ఆ తరువాత ఆ టీ ని చల్లారనివ్వాలి.

ఈ కూల్ టీ ను ఐ వాష్ లా రోజుకు రెండు లేదా మూడు సార్లు వాడాలి.

3. రోజ్ వాటర్:

రెడ్ మరియు ఇచీ ఐస్ సమస్యను నిర్మూలించేందుకు రోజ్ వాటర్ అద్భుతమైన రెమెడీగా పనికొస్తుంది. ఇది కళ్ళని చల్లబరుస్తుంది. తద్వారా, తక్షణ ఉపశమనాన్ని అందిస్తుంది. స్వచ్ఛమైన రోజ్ వాటర్ ను వాడితే కళ్ళు రిలీఫ్ ను పొందుతాయి. అలసట పొందిన కళ్ళకు ప్రశాంతత లభిస్తుంది. పఫ్ఫీ ఐస్ సమస్య తొలగుతుంది.

రోజ్ వాటర్ తో రోజుకు రెండు సార్లు కళ్ళను రిన్స్ చేసుకోండి.

రోజ్ వాటర్ ని ఐ డ్రాప్స్ లా కూడా వాడవచ్చు. రెండు లేదా మూడు రోజ్ వాటర్ డ్రాప్స్ ను ఇంఫ్లేమ్డ్ ఐ లో రోజుకు రెండుసార్లు వేసుకోవాలి.

లేదా కాటన్ బాల్స్ ని రోజ్ వాటర్ లో డిప్ చేసి వాటిని మూసిన కనురెప్పలపై 15 నుంచి 20 నిమిషాల పాటు ఉంచాలి.

ఈ ప్రాసెస్ ని రోజుకు రెండు లేదా మూడు సార్లు రిపీట్ చేయాలి.

4. చల్లటి పాలు:

ఇచీ ఐస్ సమస్యను తగ్గించడానికి చల్లటి పాలు అద్భుతమైన రెమెడీగా పనికొస్తాయి. బర్నింగ్ సెన్సేషన్ ను తగ్గించి ఇచ్చినెస్ తో అనుసంధానమైన అసౌకర్యాన్ని కూడా తగ్గిస్తుంది. పాలలో ఉన్న ఫ్యాట్ అనేది ఉబ్బిన కళ్ళ సమస్యను కూడా తగ్గిస్తుంది.

ఒక కాటన్ బాల్ ని చల్లటి పాలలో ముంచి దాంతో కళ్ళ చుట్టూ అద్దాలి.

ఈ పద్దతిని రోజుకి రెండుసార్లు పాటించాలి.

పాలలో ముంచిన కాటన్ బాల్ ను కనురెప్పలపై 15 నుంచి 20 నిమిషాల పాటు ఉంచితే ఇన్స్టెంట్ కూలింగ్ ఎఫెక్ట్ లభిస్తుంది.

ఈ ప్రాసెస్ ను రోజుకు మూడు లేదా నాలుగు సార్లు పాటిస్తే మంచిది.

5. దోశకాయ:

దోశకాయలో యాంటీ ఆక్సిడెంట్ ప్రాపెర్టీస్ కలవు. ఇవి ఇంఫ్లేమేషన్ ను తగ్గించి ఇచి ఐస్ వలన కలిగే ఇరిటేషన్ నుంచి ఉపశమనం కలిగిస్తాయి. దోశకాయలోని కూలింగ్ నేచర్ అనేది పఫీనెస్ ను అలాగే డార్క్ సర్కిల్స్ ను తగ్గించేందుకు తోడ్పడుతుంది.

దోశకాయను వాష్ చేసి స్లైసెస్ గా కట్ చేయండి.

ఈ స్లైసెస్ ను 20 నిమిషాల పాటు రెఫ్రిజిరేట్ చేయండి.

ఈ దోశకాయ స్లైసెస్ ను మూసిన కళ్లపై పదినిమిషాల పాటు ఉంచండి.

ఈ ప్రాసెస్ ను రోజుకు 4 లేదా 5 సార్లు పాటించండి.

6. గ్రీన్ టీ:

గ్రీన్ టీలో అనేక హెల్త్ బెనిఫిట్స్ లభిస్తాయి. ఇవి ఇచీ ఐస్ నుంచి రక్షణనిచ్చి కళ్ళను ప్రశాంతబరుస్తాయి. గ్రీన్ టీ లో ఉండే యాంటీ ఇంఫ్లేమేటరీ ప్రాపర్టీస్ వలన కళ్ళలో అలసట తగ్గుతుంది. గ్రీన్ టీ లో వైరల్ మరియు యాంటీ బాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ పై పోరాడే సామర్థ్యం కలదు. తద్వారా, కళ్ళలో ఇచీ సెన్సేషన్ ను తగ్గించడానికి ఈ ప్రాపర్టీస్ ఉపయోగకరంగా ఉంటాయి.

రెండు గ్రీన్ టీ బ్యాగ్స్ ను ఒక కప్పుడు బాయిలింగ్ వాటర్ లోకి తీసుకోండి.

వీటిని 5 నిమిషాల పాటు స్టీప్ చేయండి.

ఈ టీ ను పూర్తిగా చల్లారనివ్వండి.

ఈ సొల్యూషన్ తో కళ్ళను రోజుకు రెండు సార్లు వాష్ చేసుకోండి.

అలాగే, చల్లని గ్రీన్ టీ బ్యాగ్ ను మూసిన కనురెప్పలపై కొద్ది నిమిషాలపాటు ఉంచితే ప్రయోజనం ఉంటుంది.

7. అలోవెరా:

అలోవెరాలో సూతింగ్ మరియు మాయిశ్చరైజింగ్ ప్రాపర్టీలు కలవు. ఇవి డ్రై మరియు ఇచీ ఐస్ సమస్యను తొలగించేందుకు సమర్థవంతమైన హోమ్ రెమెడీగా పనిచేస్తాయి. అలోవెరాలో ఉన్న మెడిసినల్ ప్రాపర్టీస్ అనేవి ఐ పఫీనెస్ ను అలాగే ఇంఫ్లేమేషన్ ను తగ్గించేందుకు తోడ్పడతాయి.

అలోవెరా లీఫ్ ను ఓపెన్ చేసి అందులోంచి జెల్ ను సేకరించండి.

ఈ జెల్ ను ఐ లిడ్స్ వెలుపల అప్లై చేయండి.

15 నుంచి 20 నిమిషాల పాటు ఈ జెల్ ని అలాగే ఉండనివ్వండి.

ఈ పద్దతిని రోజుకు రెండుసార్లు పాటించండి.

8. మెంతిగింజలు:

ఇచీ ఐస్ సమస్యను తగ్గించేందుకు మెంతిగింజలు తోడ్పడతాయి. ఇది ఇచింగ్ ను అలాగే ఇతర ఐ ప్రాబ్లెమ్స్ ను తగ్గించేందుకు మంచి పదార్థంగా పనిచేస్తుంది. డయాబెటిస్ ను ట్రీట్ చేయడానికి మెంతిగింజలు ఎంతగానో తోడ్పడతాయి.

రాత్రంతా మెంతిగింజలను నీళ్ళలో నానబెట్టండి.

వీటితో ఒక పేస్ట్ ను తయారుచేయండి.

ఈ పేస్ట్ ను మూసిన కళ్లపై అప్లై చేయండి. 20 నిమిషాల పాటు అలాగే ఉండనివ్వండి.

ఆ తరువాత చల్లటి నీటితో రిన్స్ చేయండి.

9. పొటాటోస్:

పొటాటో అనేది నేచరల్ అస్ట్రింజెంట్ గా పనిచేయడం వలన ఇంఫ్లేమేషన్ ను తగ్గిస్తుంది. కళ్ళలో దురదలతో ఇబ్బందిపడుతున్నవారికి పొటాటో అద్భుతమైన రెమెడీగా పనిచేస్తుంది.

పొటాటోను సన్నటి స్లైసెస్ గా కట్ చేసి ఫ్రిడ్జ్ లో కూల్ చేయండి.

ఈ స్లైసెస్ ను కళ్లపై 15 నుంచి 20 నిమిషాల పాటు ఉంచండి.

ధన్యవాదములు 

మీ నవీన్ నడిమింటి 


కళ్ళు ఎరుపు రంగు లో మారిన నప్పుడు తీసుకోవాలిసిన జాగ్రత్తలు


రెడ్ ఐ అంటే ఏమిటి మరియు మీరు ఎలా నివారించవచ్చు?అవగాహనా కోసం నవీన్ నడిమింటి సలహాలు 

రెడ్ ఐ అంటే ఏమిటి మరియు మీరు ఎలా నివారించవచ్చు?

ఫోటోలలో రెడ్ ఐ లేకపోవడం క్యాన్సర్ను సూచించాలా?

ప్రజల ఛాయాచిత్రాలలో ప్రకాశవంతమైన ఎరుపు రంగు విద్యార్థిని సూచించడానికి సాధారణంగా ఉపయోగించే పదం 'రెడ్ కంటి'. ఇది కుటుంబం స్నాప్షాట్లు అన్ని సమయం జరుగుతుంది మరియు మీరు సులభంగా నివారించవచ్చు ఏదో ఉంది.

ఎరుపు కన్ను కారణం చాలా సులభం: కాంతి కన్ను వెనుక రక్త నాళాలు ఆఫ్ ప్రతిబింబిస్తుంది. మరింత స్పష్టంగా, కాంతి ప్రతిబింబిస్తుంది కాబట్టి మీరు రెటీనా వెనుక వెలుగుని కాంతి చూసినట్లు.

కెమెరా ఫ్లాష్ను ఉపయోగిస్తున్నప్పుడు ఇది సంభవిస్తుంది, మరియు ఇది చాలా సాధారణ సమస్య, ఇది కొన్ని సాధారణ దురభిప్రాయాలకు దారితీస్తుంది.

ది కనెక్షన్ ఆఫ్ క్యాన్సర్ టు రెడ్ ఐ ఇన్ ఫోటోస్

పుకార్లు ఇంటర్నెట్ లో ఫ్లై మరియు వాటిలో ఎరుపు కంటి లేకపోవడం మరియు క్యాన్సర్ ఉనికిని మధ్య సంబంధం ఉంది. సరిగ్గా దీనిని స్పష్టంగా తెలియజేయండి: ఛాయాచిత్రాలలో ఎరుపు కళ్ళు లేనప్పుడు ఎవరైనా క్యాన్సర్ ఉన్నట్లు కాదు.

కేసుల్లో అధికభాగం, ఎరుపు కన్ను లేకపోవడం అంటే ఫోటో సరైన మార్గం (మీరు గ్రహించకపోయినా) తీసుకున్నారని అర్థం. కంటి క్యాన్సర్ యొక్క నిర్దిష్ట రకం సూచించే సామర్థ్యాన్ని ఛాయాచిత్రాలు కలిగి ఉన్నాయి.

ఎరుపు కన్ను పరిస్థితుల్లో తెలుపు ప్రతిబింబం చూపినపుడు, ఆందోళన సమయం ఉంటుంది. తరచుగా, ఇది కేవలం ఒకే కంటిలో సంభవిస్తుంది. ఉదాహరణకు, ఫోటోలో ఉన్న వ్యక్తి ఒక ఎర్రని కన్ను మరియు ఒక తెల్లని కన్ను కలిగి ఉంటాడు.

రెటినోబ్లాస్టోమా అనేది కంటి క్యాన్సర్ రకం, దీనిలో రెటీనా ముందు కణితి ఏర్పడుతుంది. ఫోటోగ్రాఫ్ చేసినప్పుడు, వ్యక్తి యొక్క కంటి తెల్లటి గ్లో కలిగి ఉండవచ్చు ఎందుకంటే వైట్ కణితి ఆరోగ్యకరమైన రెటీనాకు బదులుగా ప్రకాశిస్తుంది.

ఇది మీ ప్రియమైన వారి దృష్టిలో ఫోటోలను తీయడం మరియు ప్రకాశవంతమైన లైట్లు మెరుస్తూ ఉండాలి. ఏదైనా ఆందోళన కోసం ఒక కంటి వైద్యుడిని చూడండి, సున్నితమైన కళ్ళకు హాని చేయకుండా రూపొందించబడిన లైట్లు ఉంటాయి.

అలాగే, అనేక జంతువుల దృష్టిలో తెలుపు లేదా ఆకుపచ్చ గ్లో ఖచ్చితంగా సంపూర్ణంగా ఉంటుంది.

ఇది "ఆకుపచ్చ కన్ను" దృగ్విషయంలో భాగం మరియు మానవులలో ఎర్రని కన్ను వలె ఉంటుంది. జంతువులు వేర్వేరు కంటి నిర్మాణాలను కలిగి ఉన్నాయి మరియు ఇది కెమెరాకు ప్రతిబింబించే రంగును మారుస్తుంది.

ఫోటోల్లో రెడ్ ఐకు ఏది కారణమైంది?

కన్ను దాదాపు ఒకే స్థాయిలో కన్నులోకి ప్రవేశించినప్పుడు రెడ్ కంటి సంభవిస్తుంది. ప్రకాశవంతమైన కాంతిని (ఒక ఫ్లాష్ నుండి వంటిది) దాదాపు ఏ కోణంలోనైనా కంటిలోకి ప్రవేశించినప్పుడు అది తిరిగి ప్రతిబింబిస్తుంది మరియు కెమెరాకి కనిపించేలా చేస్తుంది, దాని ప్రవేశానికి సమానమైన మరియు వ్యతిరేక కోణం వద్ద కాంతి ప్రతిబింబిస్తుంది .

కంటి యొక్క విద్యార్థి విపరీతమైనప్పుడు ఇది చాలా తరచుగా జరుగుతుంది, ఇది కంటిలోకి ప్రవేశించడానికి మరియు బయటికి వెళ్లేందుకు మరింత కాంతిని ఇస్తుంది. మా కళ్ళు సహజంగా మా విద్యార్థులు విస్తరించడం ద్వారా కాంతి వెలుగులోకి సర్దుబాటు చేసినప్పుడు అది చీకటి గదులు మరియు రాత్రి చాలా తరచుగా కనిపిస్తుంది ఎందుకు.

కింది పరిస్థితుల్లో రెడ్ కంటి ఎక్కువగా ఉంటుంది:

  • ఒక అంతర్నిర్మిత కెమెరా ఫ్లాష్ ఉపయోగిస్తున్నప్పుడు. చాలా కెమెరాలలో లెన్స్కు ఫ్లాష్ యొక్క సాన్నిహిత్యం కారణంగా.
  • విద్యార్థులు డిలీట్ చేసినప్పుడు. పెద్ద విద్యార్థుల వ్యాసం కెమెరాకు మరింత కాంతిని ప్రతిఫలిస్తుంది.
  • కెమెరా లెన్స్ కన్నుతో సమానంగా ఉంటుంది. ఫ్లాష్ అంటే అదే స్థాయిలో ఉండవచ్చు.

రెడ్ ఐ అడ్డుకో ఎలా

ఎరుపు కన్ను నివారించడం మీరు అనుకోవచ్చు వంటి కష్టం కాదు.

మీరు కేవలం కాంతిని ప్రవేశిస్తున్నప్పుడు కోణం మార్చే అవసరం మరియు కంటికి వెలుపలికి వెళ్తుంది లేదా కాంతి యొక్క కఠినత్వం మార్చబడుతుంది.

  • ఒక వంపు తల తో ఫ్లాష్ ఉపయోగించండి. పరోక్ష కాంతిని సృష్టించేందుకు ఒక పైకప్పు లేదా సమీపంలోని గోడ నుండి కాంతిని బౌన్స్ చేయండి.
  • కాంతి జోడించడానికి ఒక రిఫ్లెక్టర్ ఉపయోగించండి. ఇది ఫ్లాష్ బయటపడటానికి ముందు మీ విషయం యొక్క కళ్ళు ప్రకాశవంతమైన కాంతికి సర్దుబాటు చేయడానికి కూడా అనుమతిస్తుంది.
  • మీ ఫ్లాష్ లో ఒక డిఫ్యూజర్ ఉపయోగించండి. ఒక డిఫ్యూజర్ కణజాలం లేదా ఇదే పాక్షిక-పారదర్శక, తెల్లని పదార్ధం వలె సులభమైనది.
  • మీ కెమెరా కోణం మార్చండి. మీ విషయం కన్నా కొంచెం ఎక్కువ లేదా తక్కువ స్థానం నుండి షూట్.

కెమెరాలపై రెడ్ ఐ రిడక్షన్ వర్క్ ఎలా పనిచేస్తుంది?

ఎన్నో కెమెరాలు 'రెడ్ ఐ రెడక్షన్' అని పిలువబడే ఒక అమర్పును కలిగి ఉంటాయి మరియు ఇది ఎరుపు కన్ను తగ్గించడానికి ఒక ఉపయోగకరమైన మార్గం. అయితే, ఇది ఫూల్ప్రూఫ్ కాదు మరియు మీరు తీసుకునే ప్రతి చిత్రానికి పనిచేయదు.

ఈ కెమెరా అమర్పు షట్టర్ను జారవిడిచినప్పుడు ఏర్పడే ఫ్లాష్ కోసం ఒక వ్యక్తి యొక్క కళ్ళను సిద్ధం చేయడానికి ప్రయత్నిస్తుంది.

ఇది పెద్ద, విస్తరించిన విద్యార్థులను చిన్నగా పెరగడానికి బలవంతం చేయడానికి చిన్నపిల్లల చిన్న చిన్న బరతులను పంపించడం ద్వారా ఇది చేస్తుంది. పరిపూర్ణమైన ప్రపంచంలో, ఇది చాలా చిన్నదైన విద్యార్థిగా ఉండాలి, తద్వారా కాంతి యొక్క ప్రధాన ఫ్లాష్ ఏర్పడినప్పుడు, ఎర్ర-కన్ను ప్రభావం తగ్గించబడుతుంది.

ఇది ప్రతిసారీ పని చేయదు మరియు సాధారణంగా ఎరుపు కన్ను తగ్గిస్తుంది , అది తొలగించదు .

షట్టర్ లాగ్ సమయాన్ని పెంచుతుందని ఈ లక్షణానికి నిజమైన లోపము. ఫోటోను తీయడానికి మీరు షట్టర్ బటన్ను నొక్కవచ్చు, కానీ ఆ ఫోటోను తొలగిపోయే ముందుగా కెమెరా మొదటి ఆరంభాన్ని వెలిగించాలి. మీరు చర్య లేదా ఖచ్చితమైన స్మైల్ కోల్పోవచ్చు అర్థం. ఇది ఒక బ్లింక్ పట్టుకోవడంలో అవకాశాలు కూడా పెరుగుతుంది.

మీ ఫోటోలలో ఎరుపు కన్ను తగ్గించడానికి మరియు తొలగించడానికి పేర్కొన్న ఇతర పద్ధతులను ఉపయోగించడం ఉత్తమం.

ధన్యవాదములు 

మీ నవీన్ నడిమింటి 


పులిపిరికయ్య నివారణ మార్గం

*How to Remove Moles, Warts, Blackheads, Skin Tags & Age Spots Naturally*

   *శరీరంపై పులిపిరి కాయలు ఎక్కువగా ఉండి నలుగురిలో ఇబ్బంది పడుతున్నారా?  పులిపిరి కాయలను ఈజీగా తొలగించొచ్చు.. ఎలా అంటే...*

*Viral Warts, ఉలిపిరి కాయలు , పులిపిరులు , పులిపెరకాయలు. తగ్గాలి అంటే ఏమి చేయాలి*

Advise:
మనిషి శరీరంలో అక్కడక్కడ చర్మము ఎక్కువగా ఉండి కాలిఫ్లవర్ ఆకారములో, చిన్నపాటి కురుపులా ఉండటాన్ని పులిపెర అంటారు. పులిపిరి సుఖవ్యాధి ‘హ్యూమన్ పాపిల్లోమా వైరస్’వల్ల వస్తుంటాయి. పొక్కులు , గడ్డలు లాంటి వాటిని లాగేసినా మళ్ళీ వస్తుంటాయి. వీటిలో సుమారు పది రకాలు ఉన్నాయి . ఇది అంటువ్యాది .. గాయపడిన చర్మము , మ్యూకస్ పొరల ద్వారా ఒకరి నుండి ఒకరికి వ్యాపించును . ఈ పులిపిరులు వాటంతటవే తగ్గిపోవును . కొంతమందిలో సంవత్సరాల కొద్ది ఉండిపోవును . కొంతమందిలో మాయమై మళ్ళీ కనిపించును (recurring) . వీటిలో రకాలు అవి శరీరములో ఉన్న ప్రదేశము బట్టి, పాపిల్లోమా వైరస్ టైపు బట్టి వర్గీకరిస్తారు . 

కామన్‌ వార్ట్ (Verruca vulgaris): రఫ్ గా ఉన్న ఉపరితలముతో కొంచము ఎత్తు గా ముఖ్యముగా చేతులపై కనిపించును . చేతులపైనే కాకుండా శరీరము పై ఎక్కడైనా పుట్టవచ్చును . 

ప్లాట్ వార్ట్ (Verruca plana) : ఇది బల్లపరుప గా మాంసము (flesh) రంగులో ఎక్కువ సంఖ్యలో ముఖ్యముగా ముఖము మెడ , చేతులు , మణికట్టు , ముడుక భాగాలలో కనిపుంచును . 

ఫిలిఫారమ్‌ వార్ట్ (Filiform) : చిన్న పోగులా , లేదా పిలక లా ఉండి కనురెప్పలు , పెదవులు , ముఖము భాగాలలో వ్యాపించును . 

జెనిటల్ వార్ట్శ్ (Venerial warts-condyloma acuminatum) : పురజాల భాగాలలో ... కోడి జుత్తు ఆకారములో వ్యాప్తి చెందును . 

మొజాయిక్ వార్ట్స్ (Mosaik warts) : గుత్తు గుత్తులు గా గ్రూపులు గా అరికాలు, అరిచేతులు భాగాలలో ఎక్కువగా కనిపించును . 

పెరీఅంగుల్ వార్ట్స్ (periungual wart) : కాలిఫ్లవర్ ఆకారములో గోళ్ళు చుట్టు వ్యాపించి అసహ్యముగా కనిపించును . 

ప్లాంటార్ వార్ట్స్ (verruca plantaris) : గట్టిగా కాయమాదిరిగా , నొప్పితోకూడికొని అరిపాదాలు ,చేతులు భాగాలలో అరుగుదల చెందే శరీరభాగాలలో (pressure points) కనిపించును . 

కారణము :
హ్యూమన్‌ పాపిల్లోమా వైరస్ (HPV) . ఈ వైరస్ లో సుమారు 100 రకాలు ఉన్నాయి. చర్మములో కందికాయలు నుండి కోడి జుత్తు వరకు . . స్త్రీలలో సెర్వైకల్ క్యాన్క్షర్ నుండి నోరు ,గొంతు క్యాన్‌సర్లు వరకు వీటివలన కలిగే ప్రమాదము ఉంది . 

వ్యాధి కారకం:
మానవ పులుపురికాయ -- HPV అనే వైరస్ ద్వారా వస్తాయి. మానవ పులుపురికాయ వైరస్లు సుమారు 100 జాతులు ఉన్నాయి. రకం 1, 2, మరియు 3 కారణాలు చాలా సాధారణంగా వార్ట్ ల్లో - టైప్ 1 లోతైన అరికాలి (అడుగుల) మరియు చేతి వార్ట్ ల్లో (అరచేతిలో) తో ముడిపడి ఉంది. టైప్ 2 సాధారణ వార్ట్ ల్లో, సూక్ష్మతంతువు వార్ట్ ల్లో, అరికాలి వార్ట్ ల్లో, మొజాయిక్ వార్ట్ ల్లో కారణమవుతుంది. టైప్ 3 సమతల వార్ట్ లకు కారణమవుతుంది, లేదా చదునుగా ఉన్న వార్ట్స్ అని పిలుస్తారు .. సంభోగ వార్ట్స్ రకాలు 6, 11, 16, 18, 30, 31, 33, 34, 35, 39, 40 కారణమవుతుంది. HPV టైప్ 6 మరియు టైప్11 జననేంద్రియ వార్ట్స్ కేసుల్లో 90% లు కారణమవుతున్నాయి. HPV రకాలు 16 మరియు 18 గర్భాశయ క్యాన్సర్ కేసుల్లో ప్రస్తుతం 70% కారణం , మరియు కొన్ని vulvar , యోని , పురుషాంగము మరియు ఆసన క్యాన్సర్లుకు కారణం. గార్డాసిల్ అనేది HPV టీకా మందు. HPV రకాలు 16, 18, 6, మరియు 11 వ్యాధి కోసం నివారించడానికి ఉద్దేశించబడింది. ఇది HPVs ఇతర రకాల వ్యతిరేకంగా క్రాస్ రక్షణ ద్వారా సంభోగాంగ మొటిమల్లో ఇతర జాతులు సోకకుండా నిరోధించడానికి పనికొస్తుందని ప్రకటించారు. HPV నోటి క్యాన్సర్, స్వరపేటిక కాన్సర్, బ్రోంఖియాల్ మరియు ఊపిరితిత్తుల కాన్సర్ తో ముడిపడి ఉంది అని అదారాలు ఉన్నాయి. 

చికిత్స : 
* సరియైన పూర్తి గా నయమయ్యే చికిత్స లేదు .
* సాలిసిలిక్ యాసిడ్ తో క్రయో తెరఫీ చేయడము .
* జెనిటల్ వార్ట్స్ కి " ఫోడోపైలం " రెసిన్‌ అప్లై చేయడం ,
* ఇమిక్విమోడ్ క్రీం వార్ట్ పై పెట్టడము మూలముగా " interferon" తయారై మన శరీరమే వైరస్ ని నిర్మూలించే పద్దతి .
* కాంతారిడిన్‌ (Cantharidin) అనే కెమికల్ తమలపాకు సంబంధిత మొక్కలనుండి తీసి అప్లై చేయడము ,
* బ్లియోమైసిన్‌ ని లోకల్ గా ఇంజక్ట్ చేయడం వలన వార్ట్స్ కుళ్ళి నశించును ,
* Dinithrochlorobenzene ఇది సాలిసిలిక్ యాసిడ్ లాగనే వార్ట్ ఉన్న ప్రదేశమును కొరికి నాశనము చేయును .
* Flurouraxil వైరస్ "డి.ఎన్‌.ఎ" ను నాశనము చేసి వార్ట్స్ బారినుండి కాపాడును .
* గడ్డ(wart)ను లేజర్ ద్వారా సమూలంగా పునాదినుంచి పెకలిస్తాము. ఆ తర్వాత దానిని బయాప్సీకి పంపిస్తాము. తద్వారా దాని అసలు గుణం తెలుస్తుంది. పులిపిరి(వార్ట్) లకు కారణమైన ’హ్యుమన్ పాపిలోమా వైరస్(హెచ్ పి వి) లోని మిగిలిన రకాలను(సబ్ టైప్)కనిపెట్టి, గర్భాశయ కాన్సర్ కు ’హెర్పస్ సింప్లెక్స్ వైరస్’ కారణమని నిరూపించి వారు జూర్ హుస్సేన్(జర్మనీ) .

ఉలిపిర్ల నివారణకు కొన్ని ఆయుర్వేదిక్ చిట్కాలు :
* కొంతమందికి ముఖంపైన మెడ మీద పులిపిరి కాయలు వస్తూంటాయి. అలాంటి వారు దాల్చిన చెక్క కాల్చి ఆ బూడిదని కొంచెం సున్నంలో కలిపి నూనెలో నూరి వాటిపైన రాస్తే అవి రాలిపోతాయి.
* పులిపిరి కాయలు పోవాలంటే అల్లాన్ని సున్నంతో అద్దిపెడితే రాలిపోతాయి.
* పులిపిర్లు పోవాలంటే కాలిఫ్లవర్‌ రసాన్ని రాయాలి. కాలిఫ్లవర్‌ను గ్రైండ్‌ చేసి రసం తీసుకోవాలి. ఈ రసాన్ని పులిపిరి మీద రాస్తుండాలి. రోజుకు వీలైనన్నిసార్లు కనీసం అరగంట విరామంతో రాస్తుంటే పులిపిరి రాలిపోతుంది. మచ్చకాని గుంట కాని పడటం జరగదు.
* మందం గా ఉన్న పులిపిరి కాయలమీద ఆవాలు నూరిన ముద్ద రాస్తే పులిపిరులు ఎండి రాలిపోతాయి .
* రావి చెట్టు ఫై బెరడును కాల్చి బూడిద చేసి సున్నపు నీరు తేటను కలిపి నిల్వచేసుకుని తగినంత మిశ్రమంలో కొద్దిగా నెయ్యి వేసి అది పులిపిరి ఫై పుస్తూ ఉంటే అవి రాలిపోతాయి.
* చిటికెడు అతిమధురం పొడి, చిటికెడు అశ్వగంధ పొడి, రెండు చుక్కలు కొబ్బరి నూనె ,రెండు చుక్కలు నిమ్మరసం వేసి బాగా కలిపి అల్లంను పుల్లలగా సన్నగా కట్ చేసుకుని ఈ అల్లం పుల్లతో ఫై పేస్టు ను తీసుకుని పులిపిరి ఫై రాయాలి.
ధన్యవాదములు 
మీ నవీన్ నడిమింటి 
         అందరికి ఉపయోగపడే సులభమైన ఆరోగ్య హెల్త్ ! కనుక తప్పక షేర్ చెయ్యండి అవసరం ఉన్న వారికీ ఉపయోగపడవచ్చు.
ఈ పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే మా పేజీని👍 లైక్ చేయండి,షేర్ చేయండి....!!!

https://www.facebook.com/Naveen-Nadiminti-1536735689924644/

అమ్మాయి లో తెల్ల బట్ట పరిష్కారం మార్గం

తెల్లబట్ట మహిళల్లో కనిపించే సాధారణ మరియు మాములు స్థితి. ఇది ఒక పారదర్శక ద్రవం యొక్క స్రావం లేదా శ్లేష్మం, ఇది యోనిని తేమగా మరియు సరళతగా ఉంచి, యోని సంక్రమణలను నివారిస్తుంది.. ఒక మహిళ యొక్క వయోజన జీవితంలో యుక్తవయస్సు నుండి రుతువిరతి వరకు కలిగే హార్మోన్ల స్థాయిలో మార్పుల మూలంగా తెల్లబట్ట ఏర్పడుతుంది. దురదలేని తెల్లటి స్రావం మరియు తడిగా ఉండటం వంటివి తెల్లబట్ట యొక్క లక్షణాలు, ఇది హానిరహితమైనది మరియు ఎటువంటి సంక్లిష్టత లేకుండా పరిష్కరించవచ్చు. తెల్లబట్టకు గల ఇతర కారణాల్లో లైంగికేతర మరియు లైంగికంగా సంక్రమించే అంటువ్యాధులు కూడా ఉన్నాయి. ఈ సందర్భాలలో, దురద, ఎరుపుదనం, చెడు వాసన, అసౌకర్యం లేదా నొప్పి వంటి లక్షణాలు కూడా ఎదుర్కోవచ్చును. అటువంటి సంక్రమణలు సోకకుండా నివారించడానికి లేదా సంక్లిష్టతలను నివారించడానికి మందులు అలాగే ఇతర జాగ్రత్తలు తీసుకోవాలి. ఇది అధికంగా లేదా అసాధారణంగా ఉంటే తప్ప, తెల్లబట్టకు 


తెల్లబట్ట (ల్యూకోరియా) అంటే ఏమిటి? - 

ప్రపంచ జనాభాలో ఐదవ వంతు సంతానోత్పత్తి వయసులో ఉన్న మహిళలను కలిగి ఉంటుంది. భారతదేశంలో, 2001 జనాభా లెక్కల ప్రకారం జనాభాలో 19% మంది ఈ వయసు మహిళలు ఉన్నారు. భారతీయ మహిళలలో, ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న వారిలో యోని ఉత్సర్గం నిర్లక్ష్యం చేయబడుతున్న సమస్య. మహిళా పునరుత్పాదక మార్గ సంక్రమణలు భారతదేశము మరియు బంగ్లాదేశ్లతో సహా అనేక అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఉన్న ఒక ప్రజా ఆరోగ్య సమస్య. ఇక్కడ సంతానోత్పత్తి మార్గ సంక్రమణా సంఘటనలు 52-92% మధ్య ఉంటుంది. తెల్లబట్ట ఒక సహజ యోని స్రావం అయినప్పటికీ, ఇప్పటికీ ఇది ఒక వ్యాధిగా పరిగణించబడుతుంది. తెల్లబట్ట అనేది యుక్త వయసు మహిళలలో ఉండే ఒక లక్షణం అయినప్పటికీ, ఇది 3 నుంచి 10 ఏళ్ల వయస్సు మధ్య వయస్సున్న ఆడపిల్లల్లో కూడా చూడవచ్చు.

తెల్లబట్ట అనేది ఎటువంటి అంతర్లీనంగా వైద్య సమస్యలు లేకుండా యోని నుండి వచ్చే ఒక తెల్లటి స్రావం. క్లినికల్ ప్రాక్టీసులో, అన్ని రకాలైన స్రావాలు, తెలుపు లేదా పసుపు, ఏదైనాసరే రక్తం కలిగి ఉండకపోతే తెల్లబట్ట అనే అంటారు. సాధారణంగా స్త్రీల ఋతుచక్ర దశ మీద ఆధారపడి, యోని ద్రవం యొక్క రంగు, పరిమాణం మరియు చిక్కదనం మారుతూ ఉంటుంది. తెల్లబట్ట రంగు మరియు వాసన లేనిది, కానీ స్రావం ఎరుపుదనంతో పాటు ఆకుపచ్చ లేదా పసుపుగా ఉండి, దురద మరియు దుర్వాసనతో ఉంటే, ఇది పునరుత్పత్తి మార్గ సంక్రమణకు (ఆర్ టి ఐ) గుర్తుగా చెప్పవచ్చు.

తెల్లబట్ట (ల్యూకోరియా) యొక్క లక్షణాలు - 

సాధారణంగా, ఇన్ఫెక్షన్ సోకని తెల్లబట్ట అనేది ఒక పలచని, పారదర్శకమైన నీటి స్రావం. ఇన్ఫెక్షన్ సోకినప్పుడు, స్రావాల యొక్క మొత్తం, మందం మరియు రంగు మారుతూ ఉంటాయి. ఇది ఇతర లక్షణాలతో కూడా కూడి ఉంటుంది, ఇలా:

తెల్లబట్ట (ల్యూకోరియా) యొక్క చికిత్స - 

మందులు

తెల్లబట్టకి కొంత కాలం యాంటీమైక్రోబియల్ మందులు వాడి చికిత్స చేయవచ్చును. అసాధారణమైన యోని స్రావాలకి, నిర్ధారించిన ఇన్ఫెక్షన్ యొక్క రకం మీద ఆధారపడి విధానాలు ఉంటాయి. ఈస్ట్ ఇన్ఫెక్షన్లకు, సాధారణంగా యాంటీఫంగల్ మందుల కోర్సు సూచించబడుతుందిఏ చికిత్స లేకుండానే  BV యొక్క లక్షణాలు తగ్గుతాయి. హెర్పిస్ వ్యాధికి చికిత్స అందుబాటులో లేదు. యాంటీవైరల్ మందులు వ్యాప్తిని తగ్గిస్తాయి. సంక్రమణ సోకడాన్ని తగ్గించడానికి యాంటీవైరల్ మందులు కూడా ఇవ్వబడతాయి. ప్రస్తుతం, అనేక క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తున్నప్పటికీ ,హెర్పెస్ కోసం టీకా అందుబాటులో లేదు.

ఆహారంలో మెంతులు, ఎండిన కొత్తిమీర, పండిన అరటిపండ్లు వంటి హెర్బల్ రెమెడీలు చేర్చుకుంటే, తెల్లబట్టని అదుపు చేయవచ్చు. "రావి" చెట్టు, ఫికస్ రేసెమోసా, మరియు తెస్పియా నుండి తయారు చేసిన ఆయుర్వేద తయారీలు కూడా స్రావాన్ని తగ్గించడంలో సహాయపడతాయి.

జీవనశైలి నిర్వహణ

మందులు మరియు మూలికా ఔషధాలతో పాటు, సరైన పరిశుభ్రతను పాటించడం ఉత్తమమైన మార్గం.

  • సింథటిక్ లోదుస్తులను ధరించవద్దు కాటన్ లేదా లినెన్ ప్యాంటీలను ధరించండి. మంట పుట్టించని సబ్బుతో శుభ్రపరుచుకోండి. జననాంగ ప్రాంతాన్ని అతిగా కడగవద్దు, ఎందుకంటే అది pH సమతుల్యాన్ని పాడుచేస్తుంది మరియు బ్యాక్టీరియా యొక్క పెరుగుదలకు కారణమవుతుంది.
  • యోని యొక్క సంక్రమణను నివారించడానికి మల విసర్జన తరువాత ముందు నుండి వెనక దిశగా శుభ్రపరుచుకోండి.
  • వాష్రూమ్ కి వెళ్లిన ప్రతిసారీ యోని ప్రాంతాన్ని శుభ్రపరుచుకోండి.
  • సమతుల్య ఆహారం తీసుకోండి.
  • విష పదార్ధాలను తొలగించడానికి ప్రతిరోజూ 10 నుంచి 12 గ్లాసుల నీరు తాగండి..
  • వాకింగ్, జాగింగ్, యోగ, ధ్యానం వంటి తేలికైన వ్యాయామాలు చేయండి ఎందుకంటే అధిక వ్యాయామం తెల్లబట్టను పెంచవచ్చు.
  • ఎల్లప్పుడూ ఒక దంపతీ లైంగిక సంబంధాన్ని(ఒక సమయంలో ఒక లైంగిక భాగస్వామి మాత్రమే కలిగి ఉండటం) కొనసాగించండి.
  • ప్రతి లైంగిక చర్య సమయంలో రబ్బరు కండోమ్లను వాడండి.

తెల్లబట్ట (ల్యూకోరియా)నివారణ కొన్ని మందులు  - 

Medicine NamePack Size
Microdox LbxMicrodox Lbx Capsule
Doxt SlDoxt Sl Capsule
Bjain Arsenicum Sulphuratum Flavum DilutionBjain Arsenicum Sulphuratum Flavum Dilution 1000 CH
ADEL 2 Apo-Ham DropADEL 2 Apo-Ham Drop
Bjain Aurum Metallicum DilutionBjain Aurum Metallicum Dilution 1000 CH
ADEL 32 Opsonat DropADEL 32 Opsonat Drop
Bjain Candida albicans DilutionBjain Candida albicans Dilution 1000 CH
Dr. Reckeweg Stannum Metallicum DilutionDr. Reckeweg Stannum Metallicum Dilution 1000 CH
Dr. Reckeweg Ova Testa 3x TabletDr. Reckeweg Ova Testa 3x Tablet
Bjain Saponinum DilutionBjain Saponinum Dilution 1000 CH
Bjain Caulophyllum Thalictroides DilutionBjain Caulophyllum Thalictroides Dilution 1000 CH
ADEL 34 Ailgeno DropADEL 34 Ailgeno Drop
Doxy 1Doxy 10
Bjain Stannum metallicum LMBjain Stannum metallicum 0/1 LM
SBL Hydrocotyle Asiatica LMSBL Hydrocotyle Asiatica 0/1 LM
Ec DoxEc Dox 30 Mg/100 Mg Tablet
Schwabe Nymphaea odorata MTSchwabe Nymphaea odorata MT
Schwabe Cubeba officinalis CHSchwabe Cubeba officinalis 1000 CH
SBL Euphorbia pilulifera DilutionSBL Euphorbia pilulifera Dilution 1000 CH
ధన్యవాదములు 
మీ నవీన్ నడిమింటి 

3, జనవరి 2020, శుక్రవారం

పైల్స్(మూలశంక) ఫిస్టులా, ఫిషర్స్(మొలలు) వచ్చిన అప్పుడు తీసుకోవాలిసిన జాగ్రత్తలు


మొలలు , ఫైల్స్ , హేమరాయిడ్స్ నివారణ కు నవీన్ నడిమింటి సలహాలు 

, పేరేదైనా తరచూ వినిపించే సమస్యల్లో ఇదొకటి . వంశ పారంపర్యంగా ఏర్పడే వ్యాధులలో అర్శమొలలు ఒకటి. అంతేగాక ఆనారోగ్య ఆహార అలవాట్లు, మారుతున్న జీవన శైలి వంటి కారణాల వల్ల మల విసర్జన ద్వారంలోపల పైల్స్, ఫిషర్, ఫిస్టులా వంటి వ్యాధులు ఏర్పడతాయి. సరియైన ఆహార నియమాలు పాటించకపోవడం , మలబద్ధకం , వంటి వాటితో ఈ సమస్య తలెత్తుతుంది . మలాశయం లోపల బయట చిన్న చిన్న బుడిపెలు రూపం లో మొలలేర్పడి ఇబ్బంది పెడతాయి . మలద్వారము చివరిలో సిరలు గోడలలో మార్పులవల్ల అవి ఉబ్బి మొలలు గా ఏర్పడతాయి. వీటిలో నాలుగు డిగ్రీలు ఉన్నాయి . 1st డిగ్రీ -ఏభాదలేకుండా చిన్న మొలలు ఉండడం , 2nd డిగ్రీ -- మొలలు బయటకు కనిపిస్తాయి , విరోచనం అయినపుడు మంటా , దురద ఉంటుంది , 3rd డిగ్రీ -- మొలలు పెద్దవిగా ఉంది విరోచనం అయినప్పుడు రక్తం పడుతూ .. నొప్పి , మంట ఉంటుంది . 4th డిగ్ర్రీ ఫైల్స్ -- ప్రోలాప్సుడ్ (prolapsed) మొలలు పెద్దవిగా ఉంటూ రక్తం కారుతుంది . . నొప్పి , మంట ఉంటాయి .

ఈ సమస్య రాకుండా .. వచ్చాకా తీసుకోవలసిన జాగ్రత్తలు >

ఆహారపరం గా :
నూనెలో వేయించిన మాంసము , పిండివంటలు , బిర్యాని , ఆలుగడ్డ , చామగడ్డ ,వంటివి తరచూ తింటున్నపుడు సమస్య తీవ్రమవుతుంది . ఉప్పు , పులుపు , నిల్వ పచ్చళ్లు , కారము ,ఆవాలు అధికం గా తీసునే వారికి ఈసమస్య ఎక్కువవుతుంది .
పొడిగా ఉండే ఆహారమే తీసుకున్తు పీచు పదార్దాలు తినని వారికి ఫైల్స్ వచ్చే అవకాసము ఉంది. నీరు తక్కువ , ఎండు ఆకుకూరలు లను ఎక్కువగా తీసుకోవడం , పదే పదే కాఫీ , టీ అధికం గా సేవించడం కుడా ఈ సమస్యకుదారితీస్తుంది.
గర్భస్రావము జరిగునపుడు , విషమ ప్రసవము వల్ల మహిళలకు ఫైల్స్ రావడానికి అవకాశముంది . అధిక వేడి ప్రదేశం లో పనిచేసేవారు , దృఢమైన ఆసనం పై కూర్చునే వారు , ఎక్కువ ప్రయాణాలు చేస్తూ సరైన ఆహారం తీసుకొని వారు వాటి బారిన పడతారు . అలాగే మానసిక ఒత్తిడి అధికం గా ఉన్న వారికి ఇవి వచ్చే సూచనలు ఎక్కువ .
ఆహార నియమాలు :
మొలలతో బాధపడే వారు మలబద్దకం లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సమయానికి భోజనం చేయడంఅన్నిటికంటే ప్రధానం . రోజు ఆహారంలో పీచుపదార్దము ఎక్కువగా ఉండే బీరకాయ , ఆనప , పొట్ల , కంద , బచ్చలివంటివి ఉండేలా చూసుకోవాలి .
కొబ్బరి నీళ్లు , సుగందిపాలు , వట్టివేళ్ళు తీసుకోవడం వల్ల వంటికి చలవ . మెత్తటి పరుపుమీద కూర్చోవడం , వేడినీళ్ళతో తొట్టి స్నానం చేయడం వల్ల కొంతవరకు బాధ నుంచి ఉపశమనం లభిస్తుంది .
వ్యాయామం ఎక్కువగా చేయడం , రాత్రిపూట ఆలస్యం గా నిద్రించటం వంటి అలవాట్లు మానుకోవాలి .
ట్రీట్మెంట్ :
pilex మాత్రలు రోజుకు ౩ చొప్పున్న ౩ మాసాలు వాడాలి ,
Dobesil మాత్రలు (Diasmin) రోజుకి 2 చొప్పున్న 15 రోజులు వాడాలి ,
Duolaxin ద్రావకం (టానిక్) విరోచనం సాఫీగా అవడానికి నోటి ద్వారా తీసుకోవాలి ,
Hedensa ఆయింట్మెంట్ మలద్వారం లో రాయాలి .
పై మందుల వల్ల తగ్గనిచో ఆపరేసన్ చేయించుకోవాలి . దీనికి లేజార్ ట్రీట్మెంట్ కలదు .. బాగానే ఫలితాలు ఉన్నాయి.

మొలలు ముళ్ల మీది జీవితం!  మి నవీన్ నడిమింటి

    *ప్రాణాల మీదికేమీ రాకపోవచ్చుగానీ....అనుక్షణం ముల్లుగా గుచ్చుకుంటూ.. నిత్యం నరకం చూపించే సమస్యలు కొన్ని ఉంటాయి. ఇలాంటి వాటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మొలలు. కూర్చోవాలంటే కష్టం.* నడవాలంటే నరకం. ఇక మలవిసర్జనకు వెళ్లాలంటే మహా భయం. తెల్లారుతోందంటే చాలు... ఎక్కడ రక్తం కళ్ల జూడాల్సి వస్తుందో.. చివరికి ఇదెక్కడికి దారి తీస్తుందో... ఈ భయాల పరంపరకు అంతుండదు. దినదిన గండంలా అనిపించే... నిత్యం ఎంతోమందిని వేధించే ఈ సర్వసాధారణ మొలలకు పరిష్కారం ఎక్కడ? బయటకు చెప్పుకోలేక.. భయాలు దాచుకోలేక.. చాలామంది నాటువైద్యాలను ఆశ్రయించి తీవ్ర ఇక్కట్ల పాలవుతుంటారు. నిజానికి అవగాహన పెంచుకుంటే మొలలను తేలికగానే వదిలించుకోవచ్చు. దీనికి అత్యాధునికమైన విధానాలూ చాలా అందుబాటులోకి వచ్చాయి. ఒక రకంగా... గత దశాబ్దకాలంలో మొలల పట్ల వైద్యరంగం అవగాహనే చాలా వరకూ మారిపోయింది.

నిజం చెప్పాలంటే...'పైల్స్‌' అనేవి ఒక స్థాయిలో అందరికీ ఉంటాయి. కాకపోతే వాటిని 'పైల్స్‌' అని పిలవకుండా మలద్వారంలో ఉండే మొత్తటి పొరలు (యానల్‌ కుషన్స్‌) అంటాం. ఈ పొరలే సాగి, పెరిగి, జారి, ముదిరి సమస్యాత్మకంగా తయారైతే అప్పుడు వీటిని వ్యాధిలా గుర్తిస్తూ.. 'పైల్స్‌' అనీ, 'హెమరాయిడ్స్‌' అనీ పిలుస్తారు.

*ఒకప్పుడు ఈ మలద్వారంలోని మెత్తటి పొరలకు ప్రత్యేకమైన ప్రయోజనమేదీ లేదని భావించేవాళ్లు. కానీ గత దశాబ్ద కాలంలో వీటిపై అవగాహనలో చాలా మార్పు వచ్చింది. ఈ మెత్తటి పొరలకు రెండు రకాల ప్రత్యేక ప్రయోజనాలున్నాయని గుర్తించారు.*

1. సాంప్లింగ్‌ రిఫ్లెక్స్‌: మలద్వారం నుంచి బయటకు వస్తున్నదేమిటి? అనేది గుర్తించి మనకు తెలియజెప్పే అతి ముఖ్యమైన బాధ్యత నిర్వర్తించేది ఈ పొరలే. బయటకు వస్తున్నది గ్యాసా? విరేచనమా? వచ్చేది మెల్లగా వస్తోందా? మెత్తగా వస్తోందా? గ్యాసైతే దాన్ని నలుగురిలో ఉన్నప్పుడు విసర్జించొచ్చా? లేదా? ఇవన్నీ గుర్తించి మన మెదడుకు ఈ సమాచారాన్ని చేరవేసి.. దానికి తగ్గట్టుగా మలద్వారం స్పందించేలా చేసేది ఈ పొరలే. ఈ ప్రక్రియ అంతా మనకు తెలియకుండానే.. రేయింబవళ్లు జరిగిపోతూనే ఉంటుంది. రాత్రి నిద్రిస్తున్న సమయంలో మల విసర్జన జరిగే అవకాశమున్నా ఇవి ఆ విషయాన్ని కూడా మనకు తెలిసేలా చేస్తాయన్నమాట.

2. మలంపై పట్టు: మలవిసర్జన పైన మనకు గట్టి పట్టు, నియంత్రణ ఉన్నాయంటే దానికి మలద్వారం లోపల ఉండే రెండు దృఢమైన కండర బంధనాలు (ఇంటర్నల్‌, ఎక్స్‌టర్నల్‌ యానల్‌ స్ఫింక్టర్స్‌), పొత్తికడుపు నుంచి పురీషనాళం వరకూ ఉండే 'ప్యూబో రెక్టాలిస్‌' కండరం.. ఇవి 99% వరకూ బలంగా తోడ్పడతాయి. ఆ మిగిలిన ఒక్కశాతం నియంత్రణకు.. ఈ మలద్వార పొరలు దోహదం చేస్తుండటం విశేషంగా చెప్పుకోవాల్సిన అంశం. వీటికి రక్తసరఫరా అధికంగా ఉంటుంది. ఈ పొరలు రోజంతా ఉబ్బుతూ, తిరిగి మామూలు స్థాయికి వస్తూ ఉంటాయి. ఇవి ఉబ్బినపుడు మలద్వారం బిగుతుగా మూసుకుపోతుంది. ఇవి మామూలు స్థాయికి వచ్చినపుడు కాస్త వదులవుతుంటుంది. ఇలా ఈ మలద్వార పొరలు మలంపై పట్టుకు కూడా దోహదం చేస్తుంటాయి. ఈ విషయాన్ని గుర్తిచటం.. మొలల పట్ల, అలాగే మొలలకు చేసే చికిత్సల పట్ల మన అవగాహనలో చాలా మార్పు తీసుకువచ్చింది. ఒకప్పుడు మొలలకు చికిత్సలో భాగంగా మలద్వారాన్ని తెరిచి.. సర్జరీ చేసి.. ఉబ్బి ఉన్న మొలలను పూర్తిగా తొలగించేవారు. కానీ వీటిని సాధ్యమైనంత వరకూ తొలగించాల్సిన అవసరం లేకుండా సమస్యను సరిదిద్దటం వల్ల మరింత ప్రయోజనం ఉంటుందని గుర్తించి ప్రస్తుతం 'స్టేప్లర్‌' విధానాన్ని ఆవిష్కరించారు.
ఎప్పుడు సమస్య?
మలద్వారంలో పైల్స్‌ వంటి మెత్తటి పొరలు అందరికీ ఉంటాయి, అవసరం కూడా. అయితే వాటిల్లోంచి రక్తం పడుతున్నా, నొప్పిగా ఉంటున్నా, అవి పైకి పొడుచుకొచ్చినా, అవి మలద్వారం నుంచి బయటికి వస్తూ-పోతున్నా సమస్యగా పరిణమిస్తాయి. దీన్నే మనం సాధారణ భాషలో మొలల సమస్యగా (పైల్స్‌, హెమరాయిడల్‌ డిసీజ్‌) భావిస్తుంటాం. సమస్యగా పరిణమించినప్పుడు మాత్రమే వీటికి చికిత్స తప్పనిసరి అవుతుంది.
సమస్యగా ఎందుకు మారతాయి?
మొలల సమస్యకు ప్రధానంగా చెప్పుకోవాల్సిన అతి ముఖ్యకారణం మల బద్ధకం, మల విసర్జన సమయంలో ముక్కటం! కొందరిలో వంశపారంపర్యంగా స్ఫింక్టర్లను మలద్వారానికి పట్టి ఉంచే కొలాజెన్‌ పొర బలహీనంగా ఉంటుంది. ఇదీ మొలలకు దోహదం చెయ్యొచ్చు. మల విసర్జన సమయంలో ముక్కితే పైల్స్‌తో కూడిన కండర బంధనం (లిగమెంట్‌) సాగిపోతుంది. తరచూ ఇలా జరుగుతుంటే కండర బంధనం పల్చబడుతుంది. దీంతో మలం గట్టిగా వచ్చినపుడు అది ఆ భాగానికి రుద్దుకొని రక్త స్రావమవుతుంది. కొన్నిసార్లు ఇవి బయటకు పొడుచుకొని రావొచ్చు. మలబద్ధకమే కాదు.. అతిగా విరేచనాలు కావటం కూడా మొలలకు దారితియ్యొచ్చు.

ముక్కినపుడు మలద్వారం వెనక భాగం లోపలికి పొడుచుకు రావటం ఆరంభమవుతుంది. ఇలా తరచుగా ముక్కుతుంటే కొద్దికొద్దిగా కిందికి వస్తూ.. చివరికి మొత్తమంతా తోసుకొస్తుంది. ఒకరకంగా దీన్ని పైల్స్‌ సమస్య తొలిదశ అనుకోవచ్చు.
పిల్లలకూ రావచ్చు!
పైల్స్‌ సమస్య పెద్దల్లో తరచుగా కనబడుతుంది. వయసుతో పాటు మొలల ముప్పూ పెరుగుతుంటుంది. ఎందుకంటే వయసు పెరుగుతున్నకొద్దీ కండరాలు బలహీనపడుతుంటాయి, అదే సమయంలో పెద్దపేగు కదలికలు తగ్గి మలబద్ధకం సమస్యా పెరుగుతుంటుంది. దీంతో ముక్కటం, మొలల బారినపడటం చాలా ఎక్కువ. అయితే మొలలు పెద్దలూ, వృద్ధులకే కాదు... పిల్లల్లోనూ రావచ్చు. ముఖ్యంగా మలవిసర్జన అలవాట్లు సరిగా లేకపోవటం, సరైన ఆహారం తీసుకోకపోవటం వల్ల పిల్లలకు ఈ ముప్పు ఎక్కువ. చాలామంది పిల్లలు రోజూ మల విసర్జన చేయరు. రెండు మూడు రోజులకు ఒకసారి వెళ్తుంటారు. దీంతో ముక్కటం మొదలై మొలలకు దారి తీస్తుంది. అలాగే నేటి యువతరంలో పాశ్చాత్య జీవనశైలి, ఆహారపుటలవాట్లు పెరుగుతున్న నేపథ్యంలో వీరిలోనూ మొలల సమస్య ఎక్కువగానే కనబడుతోంది.
అపోహ
*చాలాసేపు కూచొని పనిచేసే ఉద్యోగులకు మొలల సమస్య ఎక్కువని భావిస్తుంటారు. కానీ ఇది నిజం కాదు. మొలలకూ, చేసే ఉద్యోగాలకూ సంబంధం లేదు. అయితే సరైన వ్యాయామం, శారీరక శ్రమ లేనివారికి మలబద్ధకం సమస్య ఎక్కువ. కాబట్టి వారికి మొలల బెడద ఎక్కువగానే ఉంటుంది.
మొలలు దశలు
* గ్రేడ్‌-1: ఈ దశలో మొలలు పైకి కనిపించవు. నొప్పి ఉండదుగానీ రక్తం మాత్రం పడుతుంది. వీరిలో సాధారణంగా మల విసర్జనకు ముందుగానీ, తర్వాత గానీ రక్తం పడటం కనిపిస్తుంది. మలంతో కలిసిపోకుండా, విసర్జన సమయంలో తాజా రక్తం పడుతుంటే మొలల సమస్యగానే భావించాల్సి ఉంటుంది. కానీ మలంతో కలిసి రక్తం పడుతుంటే మాత్రం జాగ్రత్త పడాలి. క్యాన్సర్‌ ఉందేమో నిర్ధరించుకోవాలి.

* గ్రేడ్‌-2: ఈ దశలో రక్తం పడొచ్చు, పడకపోవచ్చు కానీ మలవిసర్జన సమయంలో మొలలు బయటకు వస్తుంటాయి. విసర్జన తర్వాత వాటంతట అవే లోపలికి వెళ్లిపోతుంటాయి. ఈ దశలో సరైన ఆహారపుటలవాట్లు, జీవనశైలిని పాటిస్తే.. మొలల సైజు తగ్గి, మొదటి దశలోకి మారిపోవచ్చు కూడా.

* గ్రేడ్‌-3: మల విసర్జన చేసినప్పుడు పైల్స్‌ బయటకు వస్తాయి. కానీ విసర్జన అనంతరం వాటంతట అవే లోపలికి పోవు. వేలితో నెడితే లోనికి వెళ్తాయి.

* గ్రేడ్‌-4: ఈ దశలో ఉన్న పైల్స్‌ మలద్వారం బయటే ఉండిపోతాయి. నెట్టినా లోనికి వెళ్లవు.

*మొలల సమస్య సాధారణంగా లోపలే ఆరంభమవుతుంది.* మొలలతో కూడిన పొర కిందికి జారుతున్నకొద్దీ అవి బయటకు పొడుచుకురావటం, తోసుకురావటం ఎక్కువ అవుతుంది.

*చికిత్సలు*
సమస్యగా మారిన మొలలు ఉబ్బినట్టుగా, కాస్త పెద్దగా ఉంటాయి. ప్రోక్టోస్కోప్‌తో చూస్తే వాటిపై రక్తస్రావం అవుతున్న గుర్తులు కనిపిస్తాయి.

*మొలల సమస్య మొదటి దశలో ఉన్నవారికి- ముందు తగు ఆహారపుటలవాట్లు, జీవనశైలిని సూచిస్తారు.* సమస్య చాలావరకూ వీటితోనే తగ్గిపోవచ్చు. అవసరమైతే వీరికి రక్తనాళాల బిగువును పెంచి, రక్తస్రావం కాకుండా చూసే కొన్ని రకాల మందులూ సూచిస్తారు. అయితే ఇవి అందరిలోనూ పనిచేయకపోవచ్చు. కాబట్టి ఆహార నియమాలను కచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. మందులు వాడినా రక్తస్రావం తగ్గకపోతే- దాన్ని ఆపేందుకు ఇన్‌ఫ్రారెడ్‌ కిరణాలతో అక్కడి రక్తనాళం మూసుకుపోయేలాగా చికిత్స లేదా ఆ రక్తనాళంలోకి మందును ఎక్కించి అది మూసుకుపోయి, తొలగిపోయేలా చేసే 'స్ల్కెరోథెరపీ' వంటివి చేస్తారు.

*మొలలు రెండో దశలో ఉంటే 'రబ్బర్‌బ్యాండ్‌ లైగేషన్‌' బాగా పనిచేస్తుంది.* ఇందులో ఒక పరికరం ద్వారా పైల్స్‌ను పైకి లాగి, దాని మూలం దగ్గర గట్టిగా రబ్బరు బ్యాండు వేసేస్తారు. దాంతో దానికి రక్తసరఫరా నిలిచిపోయి, పైల్స్‌ ఎండి, వారంలో రాలిపోతాయి. ఈ దశలో అవసరమైతే స్ల్కెరోథెరపీ, ఇన్‌ఫ్రారెడ్‌ చికిత్సలూ ఉపకరిస్తాయి.

*మూడు, నాలుగో దశల్లో ఉన్న మొలలకు సర్జరీ చెయ్యాల్సి ఉంటుంది.* గతంలో వీటికి మలద్వారాన్ని తెరిచి, తొలగించే 'ఓపెన్‌ ఆపరేషన్‌' చేస్తుండేవారు. ప్రస్తుతం స్టేప్లర్‌, డిజీహాల్‌ ప్రక్రియలతో తేలికగా పూర్తిచేసే అధునాతన సర్జరీ విధానాలూ అందుబాటులో ఉన్నాయి.
మొలలు-క్యాన్సర్లు
మొలలను చాలా వరకూ రోగి చెప్పే లక్షణాల ఆధారంగా, మలద్వారంలోకి ప్రోట్రోస్కోప్‌ పంపి చూడటం ద్వారానే నిర్ధరిస్తారు. అయితే 40 ఏళ్లు దాటిన వారిలో మలద్వారం నుంచి రక్తం పడుతుంటే మొలలుగా కొట్టిపారెయ్యకుండా.. తప్పనిసరిగా కొలనోస్కోపీతో గానీ సిగ్మాయిండోస్కోపీతో గానీ పరీక్షించాలి. మలాశయంలో వారికి క్యాన్సరేమైనా ఉందేమో చూడాలి. ఎందుకంటే మలద్వార క్యాన్సర్‌లోనూ మలంలో రక్తం పడటం వంటి మొలల లక్షణాలే కనిపిస్తాయి. దాన్ని మనం గుర్తించలేకపోతే పరిస్థితి ప్రమాదకరంగా పరిణమిస్తుంది. పైగా- మొలలతో పాటు క్యాన్సర్‌ కూడా ఉన్నవారికి ఆ విషయం గుర్తించకుండా కేవలం మొలలకు మాత్రమే ఆపరేషన్‌ చేస్తే... క్యాన్సర్‌ కణాలు అక్కడికి వచ్చి స్థిరపడి అక్కడ పెరగటం మొదలుపెడతాయి. దీంతో మలద్వారం, పురీషనాళం మొత్తం తొలగించాల్సి ఉంటుంది. అదే క్యాన్సర్‌ను తొలిదశలోనే గుర్తిస్తే ఆ భాగాన్ని మాత్రమే తొలగిస్తే సరిపోతుంది.

*మొలలు క్యాన్సర్‌గా మారతాయేమోనన్న భయం మాత్రం అక్కర్లేదు.*, 


మొలలు- ముక్కొద్దు
అసలు మొలలు రాకుండా నివారించుకోవాలంటే... ప్రతి ఒక్కరూ కూడా విరేచనం మెత్తగా, సాఫీగా అయ్యేలా చూసుకోవాలి. ముఖ్యంగా- విసర్జన కోసమని బలంగా గంటల తరబడి ప్రయత్నించకూడదు. ముక్కకూడదు. పీచు ఎక్కువగా ఉండే పళ్లూ కూరగాయలూ నిత్యం ఎక్కువగా తీసుకోవటం, నీళ్లు ఎక్కువగా తాగటం ముఖ్యం. దీంతో విరేచనం ముక్కాల్సిన అవసరం లేకుండా మెత్తగా, తేలికగా, సాఫీగా అవుతుంది. ఇప్పటికే మొలలు ఉన్నవాళ్లు అవి ముదరకుండా చూసుకునేందుకు, అలాగే ఇప్పటికే ఒకసారి మొలలకు సర్జరీల వంటి చికిత్సలు చేయించుకున్న వారు మళ్లీ వాటి బారినపడకుండా ఉండేందుకు కూడా ఇవే జాగ్రత్తలు పాటించటం అవసరం.
మొలలు సర్జరీలు
*ఓపెన్‌ ఆపరేషన్‌: మలద్వారాన్ని తెరిచి.. మొలలను పూర్తిగా తొలగించే విధానం ఇది. మొలలు మరీ పెద్దగా ఉన్నప్పుడు కొందరికి ఇది ఇప్పటికీ తప్పకపోవచ్చుగానీ.. ఈ ఆపరేషన్‌ను సరిగా చేయకపోతే మాత్రం మలవిసర్జన మీద పట్టు కోల్పోయే (ఇన్‌కాంటినెన్స్‌) ప్రమాదముంది. విసర్జన మీద పూర్తి పట్టు ఉండాలంటే ఆ మెత్తటి పొరలు (పైల్స్‌) అవసరం. కానీ ఆపరేషన్‌ ద్వారా మొలలను తొలగిస్తే ఈ మేరకు కొంత పట్టు తగ్గే అవకాశం ఉంటుంది. అలాగే మొలలను తొలగించే సమయంలో కొన్నిసార్లు- లోపలి కండర వలయం (స్ఫింక్టర్‌) కూడా కొద్దిగా దెబ్బతినొచ్చు. దానివల్లా విసర్జన మీద పట్టు తప్పే అవకాశం ఉంటుంది. ఇటువంటి ఇబ్బందులు కొన్ని ఉన్నా- మొలలు చాలా పెద్దగా ఉండి, పూర్తిగా బయటకు పొడుచుకొచ్చి, వేలితో నెట్టినా లోపలికి వెళ్లని వారికి ఇప్పటికీ ఈ పద్ధతి తప్పదు.
*స్టేప్లర్‌: ఇది విరివిగా వాడకంలోకి వచ్చిన అధునాతన పద్ధతి. ఉబ్బి బయటకు పొడుకొచ్చిన పైల్స్‌ను తొలగించకుండా.. వాటిని లోపలికి నెట్టి.. అవి మళ్లీ కిందికి జారకుండా దానికంటే పైభాగాన్ని కత్తిరించి, దగ్గరకు లాగి కుట్లు వేయటం దీని ప్రత్యేకత. దీనిలో- ముందుగా గొట్టంలాంటి పరికరంతో బయటకు పొడుచుకొచ్చిన పైల్స్‌ను లోపలికి.. అంటే పైకి నెడతారు. దీంతో మలద్వారం లోపల.. తిత్తిలాగా.. కొంతభాగం సాగినట్లుగా తయారవుతుంది. దాన్ని స్టేప్లర్‌తో కత్తిరించి, దగ్గరకులాగినట్లుగా గుండ్రంగా కుట్లు వేసేస్తారు. దీంతో ఇక మొలలు కిందికి జారవు. మలద్వారం తిరిగి బిగువుగా తయారైపోతుంది. ఈ ప్రక్రియలో మొలలకు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాలనూ కొద్దిగా కత్తిరిస్తారు. దాంతో ఉబ్బిఉన్న మొలలు కాస్తా... ఆరు వారాల నుంచి మూడు నెలల్లోపు కుంచించుకుపోయి తిరిగా మామూలు ఆకారానికి వచ్చేస్తాయి. ఈ విధానం ప్రత్యేకత ఏమంటే పైకి పుండు, రక్తస్రావం వంటివేమీ కనబడవు. సర్జరీ అంతా లోపలే జరుగుతుంది, తెరుచుకున్నట్టుగా ఉండే పుండు ఏదీ ఉండదు. కాబట్టి వెంటనే పనులకు వెళ్లిపోయేటంత సౌకర్యం ఉంటుంది. సర్జరీ సమయంలో రక్తస్రావం, నొప్పి చాలా తక్కువ. తర్వాత స్టేపుల్స్‌ (పిన్నులు) వాటంతట అవే వూడి పడిపోతాయి. 3-5 రోజుల్లోనే తిరిగి మామూలుగా పని చేసుకోవచ్చు. ఇందులో విసర్జన మీద పట్టుకోల్పోయే అవకాశం అసలే ఉండదు. ఇన్‌ఫెక్షన్ల బెడదా ఉండదు. అయితే ఒకసారి ఉపయోగించిన స్టేప్లర్‌ను తిరిగి వాడటానికి అవకాశముండదు కాబట్టి.. దీనికయ్యే ఖర్చుకాస్త ఎక్కువగా ఉంటుంది.

*డిజీహాల్‌: 'డాప్లర్‌ గైడెడ్‌ హెమరాయిడ్‌ ఆర్టరీ లైగేషన్‌' అనే ఈ ప్రక్రియ* అంత విస్తృత స్థాయిలో ప్రచారంలో లేదుగానీ దీనిలో- ధమనిలోని రక్తప్రవాహ శబ్దాన్ని పసిగట్టి వినిపించే డాప్లర్‌ గొట్టాన్ని మలద్వారంలోకి ప్రవేశపెడతారు. దాని సాయంతో సరిగ్గా ఆ ధమనిని పట్టుకుని, దాని మీద కుట్టు వేసేస్తారు. దీంతో పైల్స్‌కు రక్త సరఫరా తగ్గిపోతుంది. ఉబ్బిన పైల్స్‌ కొద్దిగా కుంచించుకుపోతాయి. అయితే దీంతో పైల్స్‌ పూర్తిగా లోపలికి పోవటం లేదని గమనించి, ఈ ప్రక్రియను మరింత ఆధునికీరించారు. ఇదే 'డిజీహాల్‌ విత్‌ రెక్టో ఆనల్‌ రిపేర్‌'. ఇందులో చాలా కుట్లు కూడా వేసి మొలలు లోపలికి వెళ్లేలా చేస్తారు.

ఏ విధానంలో ఆపరేషన్‌ చేసినా... వీటితో మొలలు పూర్తిగా తగ్గిపోయినా కూడా.. ఆ తర్వాతా ముక్కకుండా ఉండటం, మలబద్ధకం తలెత్తకుండా ఆహార నియమాల వంటివి పాటించటం తప్పనిసరి. లేకపోతే తిరిగి మొలలు ఏర్పడే ప్రమాదముంటుంది.
ద్వారంలో రక్తపుగడ్డ.. పెరీయానల్‌ హెమటోమా
కొందరికి మలద్వారం వద్ద బుడిపెలా తోసుకొచ్చి విపరీతమైన బాధ మొదలవుతుంది. ఇది మొలల మాదిరిగానే కనబడుతుంది. కానీ నిజానికిది మొలల సమస్య కాదు. మొలలను నెడితే లోపలికి పోతాయి. కానీ ఇది మలద్వారం వద్ద చర్మానికే పరిమితమైంది కాబట్టి నెట్టినా అక్కడే ఉంటుంది. దీన్ని 'పెరీయానల్‌ హెమటోమా' అంటారు. మలద్వారం దగ్గర చర్మంలో చాలా రక్తనాళాలు ఉంటాయి. తీవ్రంగా ముక్కినపుడు ఆ రక్తనాళాలు పగిలి, అక్కడ రక్తం గడ్డ ఏర్పడుతుంది. ఇది విపరీతమైన నొప్పి కలిగిస్తుంది. కానీ సాధారణంగా ఈ గడ్డ ఏడు రోజుల్లో దానంతటదే తగ్గిపోతుంది. అందుకే దీన్ని 'సెవెన్‌ డేస్‌ వండర్‌ పెయిన్‌' అంటారు. నొప్పి ఎక్కువగా ఉంటే చర్మానికి మత్తు మందు ఇచ్చి, గడ్డను తొలగిస్తారు. మొలలున్నవారికీ ఇలా రక్తపు గడ్డ ఏర్పడే అవకాశముంది.
వృద్ధులకే కాదు, మలవిసర్జన అలవాట్లు సరిగా లేకపోవటం, సరైన ఆహారం తీసుకోకపోవటం వల్ల పిల్లలకు ఈ ముప్పు ఎక్కువ.
ధన్యవాదములు
మి నవీన్ నడిమింటి

9703706660