4, జనవరి 2020, శనివారం

పొడిబారిన కళ్ళు పరిష్కారం మార్గం


డ్రై మరియు ఇచీ ఐస్ సమస్య సాధారణ సమస్యగా మారిపోయింది. కళ్ళల్లో అలాగే కంటి చుట్టూ దురద వలన అసౌకర్యంగా ఉంటుంది.

అలర్జిక్ రియాక్షన్ లేదా ఏదైనా ఇన్ఫెక్షన్ వలన డ్రై మరియు ఇచీ ఐస్ సమస్య వేధిస్తుంది. కాంటాక్ట్ లెన్సెస్ ని వాడటం అలాగే ఐ హైజీన్ ని సరిగ్గా పాటించకపోవడం, ఎక్సపైర్ అయిపోయిన ఐ కాస్మెటిక్స్ ను వాడటం, కళ్ళల్లో దుమ్ము పడటం వంటివి డ్రై ఐస్ సమస్యను తీసుకువస్తాయి. డ్రై ఐస్ కి అలాగే కళ్లల్లో దురదలనేవి ఈ కారణాల వలన ఏర్పడతాయి.

కళ్ళల్లో ఇరిటేషన్, దురద అలాగే బర్నింగ్ సెన్సేషన్ వంటివి డ్రై ఐస్ తో పాటు వచ్చే కొన్ని ఇబ్బందికర లక్షణాలు. కళ్ళలో వాపును కూడా గమనించవచ్చు. వీటితోపాటు కళ్ళల్లో డిశ్చార్జ్, ఎరుపు, లైట్ సెన్సిటివిటీ పెరగడం వంటివి కూడా అనుభవంలోకి వస్తాయి.

అలర్జీస్ కలిగే సీజన్ కావడం వలన కూడా డ్రై మరియు ఇచీ ఐస్ సమస్య వేధిస్తుంది. ఈ సమస్యను త్వరగా తగ్గించుకోవడం ముఖ్యం. చికిత్స చేయకుండా ఈ సమస్యను అలాగే వదిలేస్తే కళ్ళు డేమేజ్ అయ్యే ప్రమాదం ఉంది.

తక్షణ ఉపశమనం కోసం, ఈ నేచురల్ రెమెడీస్ ను ప్రయత్నిస్తే డ్రై మరియు ఇచీ ఐస్ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.

1. నీళ్లు మరియు ఉప్పు:

నీళ్లు మరియు ఉప్పు మిశ్రమం అనేది డ్రై మరియు ఇరిటేటెడ్ ఐస్ సమస్యను పరిష్కరించేందుకు ఉత్తమ రెమెడీగా పనికొస్తుంది. సాల్ట్ అనేది కళ్ళలో పేరుకున్న ఉప్పును తొలగించేందుకు ఉపయోగపడుతుంది. అలాగే సాల్ట్ లో యాంటీ బాక్టీరియల్ ఏజెంట్స్ కలవు. ఇవి బాక్టీరియాను నశింపచేస్తాయి.

ఒక టీస్పూన్ సాల్ట్ ని ఒక కప్పుడు డిస్టిల్డ్ వాటర్ లో కలపాలి.

ఉప్పు పూర్తిగా కరిగిపోయే వరకు ఈ మిశ్రమాన్ని బాయిల్ చేయాలి.

ఆ తరువాత ఈ మిశ్రమాన్ని చల్లార్చి కళ్ళను వాష్ చేసేందుకు వాడుకోవాలి.

2. చమోమైల్ టీ:

చమోమైల్ లో శక్తివంతమైన యాంటీ అలర్జెనిక్ ఎఫెక్ట్స్ కలవు. వీటివలన, ఇది కోల్డ్ కంప్రెస్ గా అలాగే ఐ వాష్ గా పనిచేస్తుంది. తద్వారా, కళ్ళకి రిలీఫ్ ను కలిగిస్తుంది. చమోమైల్ అనేది హిస్టామిన్ విడుదలను నిరోధిస్తుంది. తద్వారా, అలర్జిక్ రియాక్షన్ ను నియంత్రిస్తుంది.

1 చమోమైల్ టీ బ్యాగ్ ను ఒక కప్పుడు వేడి నీటిలో అయిదు నిమిషాల పాటు ఉంచాలి.

ఆ తరువాత ఆ టీ ని చల్లారనివ్వాలి.

ఈ కూల్ టీ ను ఐ వాష్ లా రోజుకు రెండు లేదా మూడు సార్లు వాడాలి.

3. రోజ్ వాటర్:

రెడ్ మరియు ఇచీ ఐస్ సమస్యను నిర్మూలించేందుకు రోజ్ వాటర్ అద్భుతమైన రెమెడీగా పనికొస్తుంది. ఇది కళ్ళని చల్లబరుస్తుంది. తద్వారా, తక్షణ ఉపశమనాన్ని అందిస్తుంది. స్వచ్ఛమైన రోజ్ వాటర్ ను వాడితే కళ్ళు రిలీఫ్ ను పొందుతాయి. అలసట పొందిన కళ్ళకు ప్రశాంతత లభిస్తుంది. పఫ్ఫీ ఐస్ సమస్య తొలగుతుంది.

రోజ్ వాటర్ తో రోజుకు రెండు సార్లు కళ్ళను రిన్స్ చేసుకోండి.

రోజ్ వాటర్ ని ఐ డ్రాప్స్ లా కూడా వాడవచ్చు. రెండు లేదా మూడు రోజ్ వాటర్ డ్రాప్స్ ను ఇంఫ్లేమ్డ్ ఐ లో రోజుకు రెండుసార్లు వేసుకోవాలి.

లేదా కాటన్ బాల్స్ ని రోజ్ వాటర్ లో డిప్ చేసి వాటిని మూసిన కనురెప్పలపై 15 నుంచి 20 నిమిషాల పాటు ఉంచాలి.

ఈ ప్రాసెస్ ని రోజుకు రెండు లేదా మూడు సార్లు రిపీట్ చేయాలి.

4. చల్లటి పాలు:

ఇచీ ఐస్ సమస్యను తగ్గించడానికి చల్లటి పాలు అద్భుతమైన రెమెడీగా పనికొస్తాయి. బర్నింగ్ సెన్సేషన్ ను తగ్గించి ఇచ్చినెస్ తో అనుసంధానమైన అసౌకర్యాన్ని కూడా తగ్గిస్తుంది. పాలలో ఉన్న ఫ్యాట్ అనేది ఉబ్బిన కళ్ళ సమస్యను కూడా తగ్గిస్తుంది.

ఒక కాటన్ బాల్ ని చల్లటి పాలలో ముంచి దాంతో కళ్ళ చుట్టూ అద్దాలి.

ఈ పద్దతిని రోజుకి రెండుసార్లు పాటించాలి.

పాలలో ముంచిన కాటన్ బాల్ ను కనురెప్పలపై 15 నుంచి 20 నిమిషాల పాటు ఉంచితే ఇన్స్టెంట్ కూలింగ్ ఎఫెక్ట్ లభిస్తుంది.

ఈ ప్రాసెస్ ను రోజుకు మూడు లేదా నాలుగు సార్లు పాటిస్తే మంచిది.

5. దోశకాయ:

దోశకాయలో యాంటీ ఆక్సిడెంట్ ప్రాపెర్టీస్ కలవు. ఇవి ఇంఫ్లేమేషన్ ను తగ్గించి ఇచి ఐస్ వలన కలిగే ఇరిటేషన్ నుంచి ఉపశమనం కలిగిస్తాయి. దోశకాయలోని కూలింగ్ నేచర్ అనేది పఫీనెస్ ను అలాగే డార్క్ సర్కిల్స్ ను తగ్గించేందుకు తోడ్పడుతుంది.

దోశకాయను వాష్ చేసి స్లైసెస్ గా కట్ చేయండి.

ఈ స్లైసెస్ ను 20 నిమిషాల పాటు రెఫ్రిజిరేట్ చేయండి.

ఈ దోశకాయ స్లైసెస్ ను మూసిన కళ్లపై పదినిమిషాల పాటు ఉంచండి.

ఈ ప్రాసెస్ ను రోజుకు 4 లేదా 5 సార్లు పాటించండి.

6. గ్రీన్ టీ:

గ్రీన్ టీలో అనేక హెల్త్ బెనిఫిట్స్ లభిస్తాయి. ఇవి ఇచీ ఐస్ నుంచి రక్షణనిచ్చి కళ్ళను ప్రశాంతబరుస్తాయి. గ్రీన్ టీ లో ఉండే యాంటీ ఇంఫ్లేమేటరీ ప్రాపర్టీస్ వలన కళ్ళలో అలసట తగ్గుతుంది. గ్రీన్ టీ లో వైరల్ మరియు యాంటీ బాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ పై పోరాడే సామర్థ్యం కలదు. తద్వారా, కళ్ళలో ఇచీ సెన్సేషన్ ను తగ్గించడానికి ఈ ప్రాపర్టీస్ ఉపయోగకరంగా ఉంటాయి.

రెండు గ్రీన్ టీ బ్యాగ్స్ ను ఒక కప్పుడు బాయిలింగ్ వాటర్ లోకి తీసుకోండి.

వీటిని 5 నిమిషాల పాటు స్టీప్ చేయండి.

ఈ టీ ను పూర్తిగా చల్లారనివ్వండి.

ఈ సొల్యూషన్ తో కళ్ళను రోజుకు రెండు సార్లు వాష్ చేసుకోండి.

అలాగే, చల్లని గ్రీన్ టీ బ్యాగ్ ను మూసిన కనురెప్పలపై కొద్ది నిమిషాలపాటు ఉంచితే ప్రయోజనం ఉంటుంది.

7. అలోవెరా:

అలోవెరాలో సూతింగ్ మరియు మాయిశ్చరైజింగ్ ప్రాపర్టీలు కలవు. ఇవి డ్రై మరియు ఇచీ ఐస్ సమస్యను తొలగించేందుకు సమర్థవంతమైన హోమ్ రెమెడీగా పనిచేస్తాయి. అలోవెరాలో ఉన్న మెడిసినల్ ప్రాపర్టీస్ అనేవి ఐ పఫీనెస్ ను అలాగే ఇంఫ్లేమేషన్ ను తగ్గించేందుకు తోడ్పడతాయి.

అలోవెరా లీఫ్ ను ఓపెన్ చేసి అందులోంచి జెల్ ను సేకరించండి.

ఈ జెల్ ను ఐ లిడ్స్ వెలుపల అప్లై చేయండి.

15 నుంచి 20 నిమిషాల పాటు ఈ జెల్ ని అలాగే ఉండనివ్వండి.

ఈ పద్దతిని రోజుకు రెండుసార్లు పాటించండి.

8. మెంతిగింజలు:

ఇచీ ఐస్ సమస్యను తగ్గించేందుకు మెంతిగింజలు తోడ్పడతాయి. ఇది ఇచింగ్ ను అలాగే ఇతర ఐ ప్రాబ్లెమ్స్ ను తగ్గించేందుకు మంచి పదార్థంగా పనిచేస్తుంది. డయాబెటిస్ ను ట్రీట్ చేయడానికి మెంతిగింజలు ఎంతగానో తోడ్పడతాయి.

రాత్రంతా మెంతిగింజలను నీళ్ళలో నానబెట్టండి.

వీటితో ఒక పేస్ట్ ను తయారుచేయండి.

ఈ పేస్ట్ ను మూసిన కళ్లపై అప్లై చేయండి. 20 నిమిషాల పాటు అలాగే ఉండనివ్వండి.

ఆ తరువాత చల్లటి నీటితో రిన్స్ చేయండి.

9. పొటాటోస్:

పొటాటో అనేది నేచరల్ అస్ట్రింజెంట్ గా పనిచేయడం వలన ఇంఫ్లేమేషన్ ను తగ్గిస్తుంది. కళ్ళలో దురదలతో ఇబ్బందిపడుతున్నవారికి పొటాటో అద్భుతమైన రెమెడీగా పనిచేస్తుంది.

పొటాటోను సన్నటి స్లైసెస్ గా కట్ చేసి ఫ్రిడ్జ్ లో కూల్ చేయండి.

ఈ స్లైసెస్ ను కళ్లపై 15 నుంచి 20 నిమిషాల పాటు ఉంచండి.

ధన్యవాదములు 

మీ నవీన్ నడిమింటి 


కామెంట్‌లు లేవు: