5, జనవరి 2020, ఆదివారం

చిన్న పిల్లలు కు టీకా ఎప్పుడు వేసుకోవాలి


వ్యాధి నిరోధక టీకాలు అవగాహనా కోసం నవీన్ నడిమింటి సలహాలు  , Vaccination Schedule

* శిశువుకు ఐదేళ్ళ వయసు వచ్చే వరకు జూన్, జనవరి నెలలలో ప్రతి ఆరు నెలలకు ఒక సారి - విటమిన్ ఏ చుక్కలు ఇవ్వాలి.
* గర్భవతులు - ప్రారంభ దశలో - టీటి లేదా బూస్టర్ ఇన్జెక్షన్/ సూది ; 4 వారాల తరువాత టీ.టి 2

టీకాల ద్వారా నిరోధించగల అంటు వ్యాధులు

1. డిఫ్తీరియా : ఇంటిలో పిల్లలకి గొంతులో అంగుటమీద తెల్లటి పొర ఏర్పడి తీవ్ర జ్వరం, దుష్పలితాలు ఏర్పడతాయి. చాలా ప్రాణాపాయం.
2. పర్ ట్యూసిస్ : కోరింత దగ్గు ఇందులో పిల్లలు జ్వరం, విపరీతంగా తెరలు తెరలుగా దగ్గుతూ నీరసించి పోతారు. ప్రాణాపాయం ఎక్కువ.
3. టెటనసం – ధనుర్వాతం : దీని వలన జ్వరం, ఫిట్స్, విల్లులుగా వెనక్కి విరచుకుపోతారు. ప్రాణం పోవచ్చు.
4. పోలియో – పక్షవాతం : దీనిలో జ్వరంతో మొదలయి కొద్దిపాటి విరోచనాల తరువాత కాళ్ళు చేతులు పక్షవాతంకి గురి అవుతాయి.
5. బిసిజి : ఈ టీకావలన క్షయ వ్యాధి రాకుండా నిరోధించవచ్చు.
6. పొంగు : మీజిల్స్ టీకావలన పిల్లలకి ఈ వ్యాధి రాకుండా నిరోధించవచ్చును.
7. హెపటైటిసం బి : కాలేయమునకు సంబంధించిన వ్యాధులు రాకుండా నిరోధించవచ్చును.

ఏ వయస్సులో ఏ టీకా ఇవ్వాలి?

వయస్సు ----------- మందు పేరు ---- 

పుట్టిన వెంటనే -------- బి.సి.జి. మరియు ఓరల్ పోలియో,
6 వారాలకు--------------- డి.పి.టి., హెపటైటిస్ బి, ఓరల్ పోలియో,
10 వారాలకు-------------- డి.పి.టి., హెపటైటిస్ బి, ఓరల్ పోలియో
14 వారాలకు-------------- డి.పి.టి., హెపటైటిస్ బి, ఓరల్ పోలియో
9 మాసాలకు-------------- మీజిల్స్,
16 – 24 నెలలు----------- డి.పి.టి., పోలియో, బూస్టర్ డోసుల

ప్రతి 5 సంవత్సరాలకు బూస్టర్ డోసు ఇవ్వాలి -- మీ ఫామిలీ డాక్టర్ ని సంప్రదించంది .


నిరోధక టీకాల కార్యక్రమం గత చరిత్ర :
ప్రధాన లక్ష్యాలు

*మూడు ప్రధాన లక్ష్యాలతో మన దేశంలో సార్వత్రిక వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

1. 1990 నాటికి దేశంలోని ఏడాదిలోపు పిల్లల్లో 85 శాతం మందికి ఒక మోతాదు బిసిజి టీకా, మూడు మోతాదుల ఓరల్‌ పోలియో, మూడు మోతాదులు డిపిటి, ఒక మోతాదు తట్టు సూది అందించడం. 100 శాతం గర్భవతులు టెటనస్‌ టాక్సాయిడ్‌తో రక్షించడం.

2. 1990 నాటికి టీకాల గురించి 'డిమాండ్‌' కలిగించడం. అంటే ప్రజలలో టీకాల గురించి సంపూర్ణ అవగాహన కలిగి, వారు ఆరోగ్య కార్యకర్తలను టీకాలు ఇవ్వమని అడిగే స్థితికి ఎదగడం. ' ప్రజారోగ్యంలో ప్రజల భాగస్వామ్యం' అనే గొప్ప ఆదర్శానికి ఈ లక్ష్యం ఆయువు పట్టు.

3. టీకాల ఉత్పత్తిలో దేశం స్వయం సమృద్ధి కావడం.

ఇరవై ఐదేళ్ల కిందట అంటే నవంబరు 19,1985 న మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జన్మదిన సందర్భంగా నాటి ప్రభుత్వం మన పిల్లల రక్షణకు ఒక మహోజ్వల కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అదే 'సార్వత్రిక వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం'. ఈ నెల 19కి కార్యక్రమం రజతోత్సవం జరుపుకున్నాం.

చిన్న పిల్లల రక్షణలో సార్వత్రిక వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం ఒక మైలురాయి. ఈ కార్యక్రమం ప్రారంభించినప్పుడు ఎన్నో విన్నూత్నమైన అంశాలు ఇందులో ప్రవేశపెట్టారు. వ్యాక్సినులు పాడుగాకుండా రక్షించే శీతలీకరణ పద్ధతి, పరిశుభ్రమైన సూదుల వాడకం, వీటిని రక్షించడంలో అనేక కొత్త మెలకువలు, వ్యాక్సీనులతో నిరోధించే వ్యాధులపై నిఘా, విజయవంతంగా టీకాలు వేసేందుకు ప్రజల భాగస్వామ్యం...ఇలా ఎన్నో అంశాలు.

ఈ అంశాల గురించి కార్యక్రమం మొదలు పెట్టేముందు డాక్టర్లకు ఆరోగ్య కార్యకర్తలకు శిక్షణ ఇచ్చారు. శిక్షణ పొందినప్పుడు అందరికీ 'ఇంతవరకు మనం వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం శాస్త్రీయంగా, పటిష్టంగా నిర్వహించలేదు' అనే భావన కలిగింది. దేశంలో అప్పటికే ప్రైవేటు వైద్యవ్యవస్థ బలంగా ఉంది. ప్రైవేటు వైద్యులు కూడా పిల్లలకు టీకాలు వేస్తారు. మాకు శిక్షణలో చెప్పిన చాలా అంశాలు ప్రైవేటు వైద్యులు పాటించరు. వ్యాక్సీను సీసా తెరిచిన తర్వాత వెంటనే టీకా మందును దగ్గర్లోని మెడికల్‌ షాపు వాళ్ల ఫ్రీజర్‌లో పెట్టేవాళ్లు. చాలా మంది మెడికల్‌ షాపు యజమానులు డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ను తృప్తిపరిచేందుకు రిఫ్రిజిరేటర్‌ పెట్టేవాళ్లు. రాత్రిపూట రిఫ్రిజరేటర్‌ ఆపు చేసేవారు. 'ప్రైవేటు డాక్టర్లకు కూడా ఈ కార్యక్రమం గురించి శిక్షణ' ఇస్తే బాగుంటుందని మాకందరికీ అనిపించింది. మా శిక్షకులకు ఈ అభిప్రాయాన్ని తెలిపాం. ప్రైవేటు డాక్టర్లకు శిక్షణ ఇచ్చేందుకు ప్రయత్నాలు జరిగాయి, కానీ సంతృప్తికరంగా నిర్వహించలేదు.

తొలి రోజుల్లో...

అప్పటికే నాలాగా ఆలోచించే వారందరూ 'ప్రాథమిక ఆరోగ్య రక్షణపై ఆల్మా-ఆటా ప్రకటన' నిషాలో ఉన్నాం. '2000 సంవత్సరం నాటికి అందరికీ ఆరోగ్యం' - అదోక గొప్ప ఊహ. కార్యక్రమం గురించి అప్పటి ప్రభుత్వ దార్శనికత నన్నెంతో ఉత్తేజితున్ని చేసింది. 'నాదేశంలో పిల్లలందరికీ క్షయ, పోలియో, గొంతువాపు, కోరింత దగ్గు, ధనుర్వాతం, తట్టు వ్యాధుల నుండి త్వరలో విముక్తి'. నాలో ఉత్సాహం కట్టలు తెంపుకొంది. కలల్లో కూడా ఇవే ఆలోచనలు. ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా, దశల వారీగా జిల్లాలను ఎంపిక చేసి అమలు చేసారు .

కార్యక్రమం మొదలు పెట్టేముందు వైద్యాధికారులందరికీ జిల్లా కేంద్రంలో నాలుగు రోజులు వైద్యకళాశాల ప్రొఫెసర్లతో శిక్షణ ఇప్పించారు. ఆ శిక్షణ, ఆ మాడ్యుల్స్‌ చాలా గొప్పగా ఉన్నాయి. శిక్షణ ఇచ్చిన ప్రొఫెసర్‌ స్లైడ్స్‌ ద్వారా ఎన్నో విషయాలు బోధించారు. వ్యాధి నిరోధక టీకాల గురించి లోతుగా అధ్యయనం చేయాలని ఆరోగ్య కేంద్రంలో పారామెడికల్‌ సిబ్బందికి కూడా తెలుగు మాడ్యుల్‌ సహాయంతో శిక్షణ ఇచ్చారు . నవంబర్‌ 19, 1985న ఆరోగ్య కేంద్రంలో కూడా ఈ కార్యక్రమాన్ని అమలు చేశారు. నిజంగా అది మా అందరికీ పండుగ. 1989 వరకు ఆరోగ్య కార్యకర్తలు ఎంతో శ్రద్ధతో అన్ని గ్రామాలు తిగిరి పిల్లలకు టీకాలు వేశారు. . 1987 ప్రపంచ ఆరోగ్య సంస్థ- ప్రపంచ ఆరోగ్య దినం నినాదం 'ఇమ్యునైజేషన్‌ ఎ అచివ్‌ ఫర్‌ ఎవిరి చైల్డ్‌' - వ్యాధి నిరోధక టీకాలు ప్రతి బిడ్డకు ఒక అవకాశం. ఈ నినాదం మాకు మరింత ఉత్సాహాన్నిచ్చింది. ప్రపంచ ఆరోగ్య దినం 1988 నినాదం 'ఆరోగ్యం అందరికీ- అందరూ ఆరోగ్య కోసం'. 1989 నినాదం ' మనం ఆరోగ్యాన్ని గురించి మాట్లాడుకుందాం ' లాంటి అంశాలు మమ్మల్ని ఉత్తేజితులను చేసింది. అదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా సమసమాజం, ఆరోగ్యం సామాజికీకరణ చేయడం, ఆరోగ్యంలో సమానత్వం లాంటి ఆలోచనలు ఎక్కువగా ఉండేవి. ఈ ఆలోచనల ప్రభావం సార్వత్రిక వ్యాధినిరోధక టీకాల కార్యక్రమం అమలులో ఉండేది. దేశంలో జరుగుతున్న ' బిడ్డ నుండి బిడ్డకు', 'లిటిల్‌ డాక్టర్స్‌' కార్యక్రమాలు, మన రాష్ట్రంలో అమలువుతున్న 'తెలుగు బాలల సుఖీభవ పథకం', ప్రపంచ బాలల నిధి ప్రచురించిన 'ఫ్యాక్ట్స్‌ ఫర్‌ లైఫ్‌ - ప్రాణ రణక్ష సూత్రాలు', హెస్పేరియన్‌ ఫౌండేషన్‌ ప్రచురించిన 'వేర్‌ దేర్‌ ఇజ్‌ నో డాక్టర్‌- వైద్యుడి లేని చోటు' లాంటి ఎన్నో అంశాలు ప్రజారోగ్యం పట్ల మాకు స్ఫూర్తినిచ్చాయి. పరోక్షంగా సార్వత్రిక వ్యాధినిరోధక టీకాల కార్యక్రమం పటిష్టంగా అమలు చేయడానికి దోహదపడ్డాయి.

వైద్యకళాశాలల పాత్ర

ఈ కార్యక్రమం ప్రారంభించినప్పుడు వైద్య కళాశాలల పాత్ర ప్రముఖంగా ఉండేది. అక్కడ పనిచేసే సోషల్‌ అండ్‌ ప్రివెంటివ్‌ మెడిసిన్‌ (ఎస్‌పిఎం) ప్రొఫెసర్లు వైద్యాధికారులకు శిక్షణ ఇచ్చే ఏర్పాటు ఉండేది. వైద్యకళాశాల ఉండే పట్టణానికి కార్యక్రమం అమలు బాధ్యత వైద్యకళాశాలలదే. ఇందులోని ఎస్‌పిఎం ప్రొఫెసరు ఈ కార్యక్రమానికి ఆ పట్టణానికి నోడల్‌ ఆఫీసరు. దీని అమలులో వైద్య విద్యార్థులు ప్రొఫెసర్‌ నాయకత్వంలో పాల్గొనేవారు. ఒక ప్రజారోగ్య కార్యక్రమానికి వైద్య విద్యార్థి దశలోనే పాల్గొనే ఒక గొప్ప ఆదర్శానికి నాంది పలికారు. వైద్య విద్యార్థులను సమాజం పట్ల వారి బాధ్యతలను పెంచే ఒక గొప్ప ప్రక్రియ ఇది. ఇప్పుడు ఈ కార్యక్రమానికి పూర్తిగా గండికొట్టారు. ఇటీవల వచ్చే చాలా జాతీయ ఆరోగ్య కార్యక్రమాల గురించి వైద్య కళాశాలలను భాగస్వామ్యం చేయడం లేదు. అందువల్లే వైద్యకళాశాలల నుండి వచ్చిన కొత్త డాక్టర్లకు జాతీయ ఆరోగ్య కార్యక్రమాలు, ప్రజల ఆరోగ్య ప్రాధాన్యాల గురించి ఎలాంటి అవగాహన లేదు. వీరు ఉద్యోగంలో చేరిన తర్వాత ఈ కార్యక్రమాల అమలులో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు.

నేషనల్‌ టెక్నాలజీ మిషన్‌

మన దేశంలో ప్రజలకు సంబంధించిన ప్రధాన అంశాలైన మంచినీరు, నూనె గింజలు, పాల ఉత్పత్తి, అక్షరాసత్య, టెలికమ్యూనికేషన్స్‌, వ్యాధినిరోధక టీకాలపై 1986లో ఆరు నేషనల్‌ టెక్నాలజీ మిషన్స్‌ కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. నేషనల్‌ టెక్నాలజీ మిషన్స్‌లో వ్యాధినిరోధక టీకాల కార్యక్రమం ఒక భాగం కావడం వల్ల సార్వత్రిక వ్యాధినిరోధక టీకాల కార్యక్రమానికి మరింత ఊపునిచ్చింది.

పట్టణ సమస్యలు

మన దేశంలో గ్రామీణ ప్రాంతాల మాదిరిగా ఇంటి దగ్గరే ఆరోగ్య సేవలు అందించే వ్యవస్థీకృత ఆరోగ్య వ్యవస్థ పట్టణాలలో లేదు. కార్యక్రమం ప్రారంభించినప్పటి నుండి పట్టణాలలో అందరికీ టీకాలు అందించడం చాలా కష్టతరమైన సమస్యగా తయారైంది.1985 నుంచి 89 జిల్లా యాంత్రాంగానికి పట్టణాలలో టీకాల సమస్య అధిగమించడానికి ఒక ఆలోచన వచ్చింది. నెలకు 3 రోజులు పట్టణానికి చుట్టూ ఉండే గ్రామీణ ప్రాంత ఆరోగ్య కార్యకర్తల సహకారం తీసుకుని అమలు చేసే పద్ధతి. ఆ కార్యక్రమం కింద 24 బాలవాడీలు ఉండేది. పట్టణంలోని మౌలిక సేవల్లో పనిచేసే సిబ్బంది, పట్టణంలోని ఆసుపత్రి, ఆరోగ్య సిబ్బంది, చుట్టూ పనిచేసే ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని ఆరోగ్య కార్యకర్తల సహకారంతో 8 టీములు తయారు చేశారు . నెలలో 3 రోజులు, రోజూ 8 చోట్లా - బాలవాడీ కేంద్రాలలో టీకాల కార్యక్రమం నిర్వహించేవారు . ఆ నాటి జిల్లా కలెక్టర్‌కు ఈ బాలవాడి కేంద్రాలలో పిల్లలకు వైద్య పరీక్షలు చేయలనేది ఒక కోర్కె. ఇలా టీకాల కార్యక్రమం నిర్వహిస్తూనే, బాలవాడీలలో పిల్లకు వైద్య పరీక్షలు చేసి రిపోర్టు ఇచ్చేవారు . ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించినందుకు జిల్లా కలెక్టర్‌ గారి ప్రసంశలు జీవితంలో మరచిపోలేనివి. టీకాల కార్యక్రమం అమలు చేయడంలో పట్టణాలు ఎదుర్కొంటున్న
ధన్యవాదములు 
మీ నవీన్ నడిమింటి 

మెడ నొప్పి నివారణ


మెడనొప్పి నివారణ కు నవీన్ నడిమింటి సలహాలు అవగహన కోసం ,Neck Pain in Human


ఈ మధ్య చాలా మందిని వేధిస్తున్న సమస్య మెడనొప్పి. ఒకప్పుడు వృద్ధుల్లో మాత్రమే కనిపించే సర్వైకల్‌ స్పాండిలోసిస్‌ ఇప్పుడు వయసుతో నిమిత్తం లేకుండానే వస్తోంది. యుక్తవయసులో ఉన్నవారు సైతం ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. దీనికి ముఖ్య కారణం జీవనశైలి విధానమే. మెడనొప్పే కదా అని నిర్లక్ష్యం చేయడంతోనే ఈ సమస్య ఇంకా తీవ్రమవుతుంది. అలా కాకుండా వ్యాధి తొలిదశలోనే చికిత్స తీసుకుంటే సమస్య త్వరగా నమయవుతుంది.
మెడ నుంచి భుజానికో, చేతుల చివర్లకో నొప్పి పాకు తూ ఉంటే కొంచెం శ్రద్ధ తీసుకోవాలి. మెడ నొప్పి తీవ్రమైపోయి అది ఇతర ఆరోగ్య సమస్యలకు దారి తీయవచ్చు. మెడనొప్పి తీవ్రత వల్ల మూత్రాశయంలో మార్పులు వచ్చే అవకాశం ఎక్కువ. నొప్పి ఎక్కువైన కొద్దీ నరాల మీద ఒత్తిడి పెరిగి అటు తర్వాత మూత్ర విసర్జనలో తేడాలు వచ్చి ఇతర ఆరోగ్య సమస్యలకు దారి తీసే అవకాశం ఉంది.

మనం నిలబడే, కూర్చునే భంగిమలు సరిగ్గా లేకపోవడం కారణంగానే మెడనొప్పి సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి.
ఒక్కోసారి వెన్నుపూసల మధ్యలో ఉండే డిస్క్‌ వల్ల కూడా విపరీతమైన సమస్యలు వస్తాయి. ఈ డిస్క్‌ జారి నరాల మీద ఒత్తిడి కలిగినప్పుడు నొప్పి వస్తుంటుంది. వెన్నుపూసలో నుండి మెదడులోకి వెళ్ళే రెండు రక్తనాళాలైన వర్టిబ్రల్‌ ఆర్టరీస్‌ చిన్న మెదడుకు రక్తప్రసరణ అందిస్తాయి. నొప్పి తీవ్రంగా ఉన్నప్పుడు ఈ ఆర్టరీస్‌ రక్తప్రసారంలో తేడా వచ్చి మెదడుకు రక్త ప్రసారం అంతగా ఉండదు. దీని మూలంగా నొప్పితో పాటు తల తిరగడం, దిమ్ముగా అనిపించడం, వాంతు లు అవడం జరుగుతుంది.

మెడ దగ్గర ఉండే వెన్నుముకలో ఏడు వెన్నుపూసలు ఉంటాయి. వాటిలో మొదటి వెన్నుపూసను అట్లాస్‌ అని, రెండవ దానిని ఆక్సిస్‌ అని అంటారు. ఆ తర్వాత పూ సలను వరుసగా సర్వెకల్‌ 3,4,5,6,7 అంటారు. ఇవ న్నీ ఒకదానికొకటి జాయింట్స్‌గా అమర్చి ఉంటాయి. మెడ వెనుక భాగంలో తల నుండి మొదలయ్యే మొదటి ఏడు వెన్నుపూసల మధ్య సులువుగా కదిలేందుకు కార్టిలేజ్‌ (మృధులాస్థి) అనే మెత్తని ఎముక ఉంటుంది. వెన్నుపూస సులువుగా కదలడానికి కార్టిలేజ్‌ తోడ్పడుతుంది. ఈ ఎముక ఒక్కోసారి పెరిగి ఆస్టియోఫైట్స్‌ ఏర్పడతాయి. ఇలా కార్టిలేజ్‌లో వచ్చే మార్పు వల్ల తీవ్ర మెడనొప్పి వస్తుంది. ఈ సమస్యనే సర్వికల్‌ స్పాండిలోసిస్‌ అంటారు. వీటిలో స్పైనల్‌ కెనాల్‌ ఉంటుంది. దాని ద్వారా స్పైనల్‌ కార్డ్‌ అంటే వెన్నుపాము మెదడు నుండి కాళ్ళకు, చేతులకు నరాలకు తీసుకెళుతుంది. ఒక వెన్నుపూసకు, మరొక వెన్నుపూసకు మధ్యలో ఉండే ఇంటర్‌ వెర్టిబ్రల్‌ పారామినా నుండి ఒకకొక్క నరం బయటకు వస్తుం ది. ఈ నరాలు ఒక్కో వైపుకి విస్తరించి ఉంటాయి. వెన్నుపూసల మధ్యలో ఉండే డిస్క్‌ షాక్‌ అబ్జార్బర్‌లా పని చేస్తుంది. డిస్క్‌కి రక్తప్రసరణ అవసరం ఉండదు. మనం తీసుకున్న ఆహారం ద్వారానే దీనికి పోషకాలు అందుతాయి. శరీర బరువు, తలబరువును బ్యాలెన్స్‌ చేయడానికి ఇది దోహదపడుతుంది.

కారణాలు :
ఈ సమస్య ముఖ్యంగా వెన్నుపూసల మధ్య ఉన్న కార్టిలేజ్‌ క్షీణించి, ఆస్టియోఫైట్స్‌ ఏర్పడడం వల్ల వస్తుంది.
స్పాంజి లేదా దూది ఎక్కువ ఉపయోగించిన కుర్చీల్లో అసంబద్ధ భంగిమలలో కూర్చోవడం.
కంప్యూటర్ల ముందు ఎక్కువసేపు కదలకుండా కూర్చుని విధులను నిర్వర్తించడం.
ఒకే చోట గంటల తరబడి కదలకుండా పనిచేయడం.
నిత్యం తీసుకునే ఆహారంలో కాల్షియం, విటమిన్స్‌ లోపించడం.

పరీక్షలు :
ఎక్స్‌రే -స్కానింగ్‌: మెడనొప్పి వచ్చేవారికి ఎక్స్‌రే తీస్తే సమస్య తీవ్రత ఎంత ఉందో తెలుసుకోవచ్చు. ఎక్స్‌రేను బట్టి మెడపూసలలో ఏమైనా తేడాలు ఉన్నాయా అనేది తెలుసుకొని దీనిని బట్టి చికిత్స ఇవ్వడం జరుగుతుంది. దానిని బట్టి పుట్టుకతోనే వెన్నుపూసలో సమస్యలు ఉన్నాయా? మధ్యలో ఏమైనా వచ్చి చేరాయా అనేది తెలుసుకోవడానికి వీలవుతుంది. ఇంకా సూక్ష్మమైన సమస్యలు ఉన్నవారికి ఎం.ఆర్‌.ఐ. స్కాన్‌ ద్వారా పరీక్షలు నిర్వహించి దీని ద్వారా ఏ నరం మీద ఎంత వత్తిడి ఉందో తెలుసుకొని ఆ వత్తిడి దేని వల్ల వచ్చింది? ఏదైనా ఎముక ఫ్రాక్చర్‌ అయిందా? నరాల్లో వాపు ఏమైనా ఉందా? గడ్డలు ఉన్నాయా? ఇవన్నీ ఎం.ఆర్‌.ఐ. పరీక్ష ద్వారా తెలుసుకోవచ్చు. డిస్క్‌ ప్రొలాప్స్‌ (డిస్క్‌ తాను ఉండే స్థానం నుంచి తొలగడం) ఉంటే ఎంతమేరకు ఆ సమస్య ఉందో గమనించి దానికి చికిత్స చేస్తారు.

పర్సనల్‌ కేర్‌: మెడ నొప్పి వచ్చినప్పుడు వేడి నీళ్ళలో మెత్త టి వస్త్రాన్ని ముంచి, పిండి మెడపైన కాపడం లేదా ఐస్‌ ముక్కను క్లాత్‌లో చుట్టి దీనితో కాప డం పెడితే సాధారణ నొప్పి నుంచి రిలీఫ్‌ లభిస్తుంది. మెడ కండరాలలో నొప్పి ఉన్నప్పుడు తప్పనిసరిగా వాటికి విశ్రాంతి ఇవ్వాలి. ఎందుకంటే కండరాలు బిగుసుకుపోయి ఉం టాయి. అందుకని నొప్పి ఉన్నప్పుడు పను లు చేయకుండా విశ్రాంతి తీసుకోవాలి. లేదంటే నొప్పి తీవ్రత పెరిగే అవకాశం ఉంది. ఫిజియోథెరపిస్ట్‌ని కలిసి కండరాల విశ్రాంతి కోసం నెక్‌ ఎక్సర్‌సైజ్‌లను చేస్తే నొప్పి త్వరగా తగ్గే అవకాశం ఉంది. సాధారణ నొప్పి అయితే పెయిన్‌ కిల్లర్‌ ఆయింట్‌మెంట్లు ఉంటాయి. వీటిలో రోజుకి ఐదు, ఆరుసార్లు సున్నితంగా మసాజ్‌ చేస్తే నొప్పి నుంచి రిలీఫ్‌ ఉంటుంది.

బరువైన బ్యాగులను ఒక భుజానికే తగిలించుకొని నడవడం వల్ల మెడ కండరాలు, నరాలపై ఒత్తిడి పెరిగి నొప్పి వస్తుంది.నడిచేటపుడు ఒకవైపుకే వంగడం సరికాదు.

మెడ గూర్చి కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు

ముఖాన్ని నిటారుగా నిలబెట్టేది మెడ. మహిళల్లో ఎక్కువగా కనిపించే ఆరోగ్య సమస్యల్లో మెడనొప్పి కూడా ఒకటి. నిరంతరం చేసే పనులు, కొన్ని సంప్రదాయ పద్ధతులు ఇందుకు ఎక్కువగా కారణం అవ్ఞతున్నాయి. అవేంటో తెలుసుకోండి...

తలెగరేస్తూ అలా నడవకు పొగరను కుంటారు. తల వంచుకుని కూర్చోవాలి తెలిసిందా. ఆడపిల్లలకు తమ జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు ఎదురయ్యే మాటలే ఇవి. కానీ ఇవి ఆరోగ్యకరమైన అలవాట్లు కావని చెప్తోంది ఆధునిక వైద్యశాస్త్రం. ఎందుకంటే తలవంచుకు కూర్చోవడం, నడవడం, పెద్దమనిషి తరహా అను కుంటారు కొందరు. అణకువగా ఉన్నట్లు భావిస్తారు. నిరంతరం ఇదే ప్రక్రియ కొన సాగిస్తే మెడలోని వెన్నుపూసలు, వెన్నుపాము, నరాలపై ఒత్తిడి ఎక్కువ అవ్ఞతుంది. అందువల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. తల భారాన్ని మోసేది మన మెడ. అంతేకాక మన శరీరంలోని రెండు ముఖ్యభాగాలైన మొండెం, తలను కలుపుతోంది. మెదడు ఇంకా ఇతర అవయవాల మధ్య సమాచార మార్పిడి చేసే నరాలు మెడ ద్వారా వెళతాయి. అందువల్ల మెడ కూడా శరీరంలోని ఒక ముఖ్యభాగమే. సాధా రణంగా మెడ పరిశుభ్రత, ఆరోగ్యం గురించి అంతగా పట్టించుకోరు. తల బరువ్ఞను మోసే మెడను శుభ్రంగా ఉంచుకోవాలి. మరీ కష్టపెట్ట కూడదు. అప్పుడు మెడ ఆరోగ్యంగా ఉంటుంది. ముఖసౌందర్యం కోసం వాడే క్రీముల్ని మెడకు కూడా పట్టిస్తే, మెడమీది చర్మం కాంతులీనుతూ ఉంటుంది. అంతేకాక మెడమీద చర్మం కోసం సన్‌స్క్రీన్‌ లోషన్లు వాడటం కూడా మంచిదే.

కూర్చున్నా, నడుస్తున్నా లేక ఏ స్థితిలో ఉన్నా మెడను నిటారుగా ఉంచాలి. టివి, సినిమా చూసేటప్పుడు ముందుకు ...................... వంగవద్దు.
కొందరికి విపరీతమైన మెడనొప్పి ఉంటుంది. అది భుజంలోకి, చేతులలోకి కూడా వ్యాపిస్తుంది. దీనినే సర్వికల్‌ స్పాండిలైటిస్‌ అంటారు. ఫిజియోథెరపీ, కాలర్లను ఉపయోగించడంతో పాటు పూర్తి బెడ్‌రెస్ట్‌ కూడా ఈ నొప్పి తగ్గడానికి అవసరం. అంతేకానీ, ఇరుకు మంత్రం, బెణుకు మంత్రం మెడవిరిపించు కోవడం వంటి వాటివల్ల నొప్పి పెరిగి, పరిస్థితి మరింత అధ్వాన్నంగా తయారవ్ఞతుంది.
చింతాకుల ముద్ద మెడచుట్టూ నాలుగు నుండి ఐదురోజులు పట్టిస్తూ ఉంటే మెడనొప్పి తగ్గే అవకాశం ఉంది. ఇది చిట్కా మాత్రమే. కొన్నిసార్లు మెడ దగ్గర చాలా ఎక్కువగా ఉండే లింఫ్‌గ్లాండ్స్‌ వాస్తే కూడా మెడనొప్పి వస్తుంది. మెడనరాలపై ఒత్తిడి ఎక్కువైనప్పుడు నొప్పి చేతులు, భుజాలలోకి వ్యాపించడం జివ్ఞ్వమని లాగడం ఉంటుంది. ఛాతీలో ముందు వెనుకలకు కూడా వ్యాపించ వచ్చు.
కంటిదోషాల వల్ల కూడా మెడనొప్పి వచ్చే అవకాశం ఉంది. కంటికి తగిన వైద్యం చేయిస్తే మెడనొప్పి కూడా తగ్గిపోతుంది. ఎండ, వేడి, చలి వీటికి మెడ ఎక్స్‌పోజ్‌ చేయకూడదు. అలాచేస్తే మెడ కమిలి పోతుంది. నల్లబడుతుంది. మరీ ఎక్కువ ఆభర ణాలతో మెడను ఇబ్బంది పెడితే చర్మం ఒరుసుకు పోతుంది. బిరుసుగా అవ్ఞతుంది. ఇంట్లో ఉన్నప్పుడు సింపుల్‌గా ఉండే నగలు ధరించడం మంచిది. ముఖంతో పాటు మెడను కూడా సబ్బుతో శుభ్రపరుస్తుండాలి.
గిల్ట్‌ నగలు ధరించినప్పుడు ఆయా నగల తయా రీలో ఉపయోగించిన మెటల్స్‌ పడక కొందరికి ఎలర్జీ వస్తుంది. మెడనల్లగా మారడానికి స్త్రీలలో ఉత్పత్తి అయ్యే ఈస్ట్రోజన్‌ హార్మోన్‌ కూడా కొంత వరకు కారణం.
మెడకు కూడా వ్యాయామం అవ సరం. అన్ని వైపులకు మెడను తిప్పాలి. అందువల్ల మెడకు సరిగా రక్తప్రసరణ జరుగుతుంది. అంతేగాక మెడ కొవ్ఞ్వ కరిగి చర్మం పలచబడుతుంది. నాజూకుగా ఉంటుంది. ఎక్కువ బరువ్ఞలు మోయడం, ఎక్కువసేపు వాహనాలు నడపడం, నిలబడడం మానాలి.
నిద్రపోయే సమయంలో చాలామంది తలగడపై తల మాత్రమే ఉంచుతారు. తలతో పాటు మెడ కూడా ఉంచాలి. 
ధన్యవాదములు 
మీ నవీన్ నడిమింటి 

4, జనవరి 2020, శనివారం

ముక్కు లో వెంటుకలు తీసిన నప్పుడు జాగ్రత్తలు

త‌ల‌పై ఉన్న వెంట్రుక‌లు పెరిగితే పురుషులు వాటిని ఎప్ప‌టిక‌ప్పుడు క‌ట్ చేయించుకుంటారు. కొంత మంది మ‌హిళ‌లు, యువ‌తులు కూడా హెయిర్ క‌ట్ చేయించుకుని స్టైల్ చేసుకుంటారు లెండి. అది వేరే విష‌యం. అయితే పురుషులైనా, స్త్రీలైనా హెయిర్ క‌ట్ మాత్ర‌మే కాదు, ముక్కులో ఉన్న వెంట్రుక‌ల‌ను కూడా క‌ట్ చేయించుకుంటారు. అంత వ‌ర‌కు బాగానే ఉన్నా కొన్ని సంద‌ర్భాల్లో సెలూన్‌కు వెళ్ల‌కుండా ఇంట్లోనే ఆ ప‌ని చేస్తుంటారు. కొంద‌రు ముక్కులోని వెంట్రుక‌ల‌ను డైరెక్ట్‌గా ప‌ట్టుకుని లాగిన‌ట్టు తీసేస్తే, కొంద‌రు మాత్రం ప్ర‌త్యేక‌మైన మిష‌న్ల‌తో ముక్కులోప‌లంతా ఉన్న వెంట్రుక‌ల‌ను మూలాల వ‌ర‌కు క్లీన్ అండ్ గ్రీన్ చేసుకుంటారు. అయితే ఇలా చేయ‌డం ప్ర‌మాద‌క‌ర‌మ‌ట‌. ఎందుకంటే…

hair-in-nose

hair-in-nose
ముక్కులోని వెంట్రుక‌ల‌ను ప‌ట్టుకుని లాగితే ఆ వెంట్రుక‌లు ఉన్న ప్ర‌దేశంలో ఖాళీ ఏర్ప‌డుతుంది. ఒక్కోసారి తెలియకుండానే వెంట్రుక‌ల మూలం నుంచి ర‌క్తం వ‌స్తుంది. కానీ అది అన్ని సంద‌ర్భాల్లో బ‌య‌టి దాకా రాదు. ఈ క్ర‌మంలో అలా ఏర్ప‌డ్డ ఖాళీ లోప‌లికి ముక్కు లోప‌ల ఉండే బాక్టీరియా, వైర‌స్‌లు ప్ర‌వేశిస్తాయి. అనంత‌రం అక్క‌డి నుంచి ర‌క్త‌నాళాల్లోకి ప్ర‌యాణించి మెద‌డు దాకా వ్యాప్తి చెందుతాయి. ఎందుకంటే ముక్కు లోప‌లి నుంచి కొన్ని నాళాలు డైరెక్ట్‌గా మెద‌డుకు వెళ్తాయి కాబ‌ట్టి. ఈ క్ర‌మంలో మెద‌డుకు చేరిన బాక్టీరియా ఇన్‌ఫెక్ష‌న్ల‌ను క‌లిగించి మ‌న‌ల్ని వ్యాధుల‌కు గురి చేస్తుంది. అలా వ‌చ్చే వ్యాధుల‌ను మెనింజైటిస్ అని పిలుస్తారు. ఇవి మ‌న‌కు చాలా ప్ర‌మాద‌క‌రం. ఒక్కో సారి ప్రాణాంత‌కాలుగా కూడా ప‌రిణ‌మించ‌వ‌చ్చు.

triangle-on-nose
చిత్రంలో చూపిన విధంగా ముక్కుపై త్రిభుజాన్ని గీయ‌గా వ‌చ్చే ప్ర‌దేశం మ‌న‌కు చాలా కీల‌కమైంద‌ట‌. దాన్ని అత్యంత సున్నిత‌మైన ప్ర‌దేశంగా మ‌నం భావించి అందుకు తగిన విధంగా ర‌క్ష‌ణ చ‌ర్య‌లు తీసుకోవాల‌ట‌. లేదంటే పైన చెప్పిన విధంగా వ్యాధుల‌కు గురయ్యేందుకు అవ‌కాశం ఉంటుంది. అయితే మ‌రి ముక్కులో బాగా వెంట్రుక‌లు పెరిగి ఇబ్బందిగా ఉంటే ఏం చేయాలి? అని మీరు అడిగితే అందుకు కూడా స‌మాధానం ఉంది. ఆ ప‌రిస్థితిలో ఏం చేయాలంటే ముందుగా ముక్కు లోప‌లి భాగాన్ని శుభ్ర‌మైన నీటితో క‌డిగేయాలి. దీంతో ప్ర‌మాద‌క‌ర‌మైన బాక్టీరియా దాదాపుగా న‌శిస్తుంది. అనంత‌రం అందులోని వెంట్రుక‌ల‌ను క‌త్తెర స‌హాయంతో క‌ట్ చేయాలి. అయితే వెంట్రుక‌ల మూలాల వ‌ర‌కు క‌ట్ చేయ‌కూడ‌దు. కేవ‌లం బ‌య‌టికి క‌నిపించే వెంట్రుక‌ల‌ను మాత్ర‌మే క‌ట్ చేసుకోవాలి. ఒక వేళ మిష‌న్ ఉప‌యోగించినా ఇదే విధంగా క‌ట్ చేయాలి. లేదంటే పైన చెప్పిన‌ట్టు వెంట్రుక‌లు ఊడిపోయి దాని స్థానంలో బాక్టీరియా ప్ర‌వేశించేందుకు అనువుగా మారుతుంది. కాబ‌ట్టి, ముక్కులోని వెంట్రుక‌ల‌ను క్లీన్ చేసే ముందు త‌ప్ప‌నిస‌రిగా జాగ్ర‌త్త వ‌హించండి!

ధన్యవాదములు 

మీ నవీన్ నడిమింటి 


బరువు తగ్గాలి అనుకుంటే మంచి ఆహరం, వ్యాయామాలు అనుసరించాలి. ఆహర విషయానికి వస్తే బరువు పెంచే పట్టిక గురించి ఇక్కడ తెలుపబడింది

బరువు తగ్గడం ఎలా పరిష్కారం మార్గం నవీన్ నడిమింటి సలహాలు 


       ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది అధిక బరువు , స్ధూలకాయంతో సతమతమవుతున్నారు . ఏ వయస్సులోనైనా బరువు పెరిగే అవకాశం ఉన్నప్పటికి , చాలా మంది మధ్యవయస్సులోనే ఎక్కవగా *బరువు* పెరుగుతుంటారు .
        శారీరక శ్రమ అంతగా లేని ఉద్యోగాలు , ఆహారంపై అవగాహన లేకుండా చిరుతిళ్ల అలవాటు వంటి జీవనశైలితో స్ధూలకాయం వస్తుంది .
      స్ధూలకాయం కారణంగా గుండె జబ్బులు , అధిక రక్తపోటు , మధుమేహం , సంతాన సమస్యలు , క్యాన్సర్ , ఊపిరితిత్తుల జబ్బులు , పిత్తాశయంలో కిడ్నీల్లో రాళ్ళు , అల్సర్లు , గ్యాస్ట్రిక్ సమస్యలు , మోకాళ్ళ నొప్పులు మొదలగునవి చుట్టుమడుతున్నాయి .
         స్త్రీలు రజస్వల అయినపుడు గర్భం ధరించినపుడు , ముట్లుడిగన తర్వాత మహిళలు అధికంగా బరువు పెరిగే అవకాశం ఉంటుంది .
# స్తూలకాయులు కఫ , వాత రోగులు .
# శారీరక దుఃఖాలలో 90 % పొట్ట వల్ల వచ్చేవి .
# మనము తిన్న ఆహారం పొట్టలో సక్రంగా జీర్ణం అవ్వడం చాలా ముఖ్యం . కాబట్టి తినడం ఎంత ప్రధానమో , సక్రమంగా జీర్ణమటం అంతే ముఖ్యం . భోజనం కుళ్ళినప్పుడు శరీరంలో L.D.L. / V.L.D.L. ( చెడు కొలెస్ట్రాల్ ) తయారవుతుంది . మీకు ఈ చెడుకొలెస్ట్రాల్ వల్లనే స్ధూలకాయం వస్తుంది . మేలు చేసే కొలెస్ట్రాల్ ( H.D.L. ) ఎప్పుడైతే తయారవుతుందో స్ధూలకాయం తగ్గిపోతుంది . శరీరంలో కాల్షియం , విటమిన్ ' సి '  లోపించిన స్ధూలకాయం వస్తుంది .
*బరువు తగ్గే మార్గాలు* :-
1. *నీరు త్రాగే విధానం*...
   # నీటిని గుటక గుటకగా త్రాగాలి . బ్రేక్ ఫాస్ట్ , భోజనమునకు 1 గంట ముందు నీళ్ళు త్రాగాలి . బ్రేక్ ఫాస్ట్ , భోజనము తర్వాత 1 1/2 గంట తర్వాత త్రాగాలి . భోజనము మధ్యలో త్రాగాలని పిస్తే 1 లేక 2 గుటకలు త్రాగవచ్చు . భోజనము తర్వాత గొంతు సాఫీగా ఉంచటానికి 2 లేక 3 గుటకల నీరు త్రాగ వచ్చును .
# మీరు పై పద్దతిలో నీళ్ళు త్రాగిన యెడల తిన్న ఆహారం సక్రమంగా *జీర్ణం* అవుతుంది . ఆహారం *కుళ్ళి పోదు* . L. D. L. / V. L. D.L. అనే *చెడు కొలెస్ట్రల్* తయారవదు
*అధిక బరువు* సమస్య వుండదు .
*నీటిని గుటక గుటకగా త్రాగితే ఎలాంటి గుండె జబ్బులు , మధు మేహం , అధిక బరువు వంటి సమస్యలు రావు*.
*వంట నూనె*
# మీరు వంటకు ఉపయోగించే *శుద్దమైన నూనె ( Non Refined Oil )* మీ *వాతాన్ని* పెరగనీయ కుండా ఉంచుతుంది . స్ధూలకాయం సమస్య వుండదు . శుద్ధమైన నూనె తీసుకుంటే శరీరంలో *లివర్* సహాయంతో మంచి *కొలెస్ట్రాల్ ( H.D.L)* ఎక్కువ మోతాదులో తయారవుతుంది . ఈ (H.D.L)  మంచి చేసే కొలెస్ట్రాల్ ఎప్పుడైతే తయారవుతుందో స్ధూలకాయం , అధిక బరువు తగ్గిపోతుంది .
# *హాని చేసే కొలెస్ట్రాల్ ( L.D.L./ V.L.D.L )* వల్లనే *స్ధూలకాయం* వస్తుంది . కావున ఎటువంటి *(Refined Oils) రిఫైండ్ నూనెల* ను వాడరాదు
ఈ రీఫైండ్ నూనెను తయారు చేసేటప్పుడు 6 లేక 13 రకాల హానికరమైన కెమికల్స్ ని కలుపుతారు . ఈ కెమికల్స్ ముందు ముందు వాటంతట అవే విషాన్ని పుట్టిస్తాయి .
# శుద్దమైన నూనెను వాడితే మీరు జీవితాంతం ఆరోగ్యంగా జీవించ గలరు .
*శుద్దమైన నునెలు* ..
  *వేరు శనగ నూనె , నువ్వుల నూనె , కుసుమల నున్ మరియు కొబ్బెర నూనెలు* .
*3త్రిఫల చూర్ణం*
*కరక్కాయ + తానెకాయ + ఉసరికాయలు కలిసినదే త్రిఫల చూర్ణం* వాత,పిత్త,కఫముల ఈ మూడింటినీ అద్భతముగా శమింప చేస్తుంది ఈ త్రిఫల.
*త్రిఫల యొక్క మోతాదు*
  1భాగం కరక్కాయ +2 భాగాలు తానేకాయ + 3 భాగాలు ఉసరికాయలు కలుప వలెను .
ఈ మోతాదులో తయారు చేసిన *త్రిఫల చూర్ణం* నే వాడవలెను . ఉత్తమమైనది .
# కొన్ని రకాల ప్రత్యేకమైన రోగాలకు మాత్రమే సమపాళ్ళలో ఉన్న త్రిఫల చూర్ణంని తీసుకోవలసి వస్తుంది .
# ఆయుర్వేద షాపులలో  సమపాళ్ళలో వున్న త్రిఫల చూర్ణం లభిస్తుంది . కావున మీరే 1:2:3. నిష్పత్తిలో త్రిఫల చూర్ణంని తయారు చేసుకొనండి .
*త్రిఫల వాడే విధానము*.
    ఉదయం పరగడపున అల్పాహారినికి 45 నిమిషాల ముందు ఈ త్రిఫలని తీసుకొనవలెను .
*1 ( పెద్ద స్పూన్ ) త్రిఫల చూర్ణం + బెల్లం లేక తేనెను కలిపి తినవలెను* 
*తర్వాత ఆవు పాలు త్రాగవలెను* 
అధిక బరువు తగ్గుతారు .
# ఉదయం పూట త్రిఫల తీసుకోవడం వలన శరీరానికి కావలసిన *విటమిన్స్ , మైక్రో నూట్రియన్స్ ని , కాల్షియం , ఐరన్ అన్నిరకాల పోషకాలు అందుతాయి . *ఖచ్చితంగా బరువు తగ్గుతారు* .
*4. ఆవు పాలు + ఆవు నెయ్యి*..
  # దేశీయ ఆవు పాలు అమృతం . ఆవు పాలు ఎంత వేడి చేసినా దానిలో ఉన్న ఏ గుణం నశించదు .
# ఆవు నెయ్యిలో అద్భతమైన ఆశ్చర్యకరమైన ఔషధ గుణాలు కలవు . *ఆవు నెయ్యి శరీరం యొక్క బరువును సమతూకంలో ఉంచుతుంది* . అధిక బరువు వున్న వారు బరువు తగ్గుతారు .
*ఆవు నెయ్యిని తీసుకొనే విధానం* : ----
# రాత్రి భోజనం తర్వాత 1 గ్లాసు వేడి వేడి ఆవు పాలలో 1 లేక 2 గ్లాసుల చెంచాల ఆవు నెయ్యిని+చిటికెడు పసుపు  కలిపి , రెండు గ్లాసులతో ఎక్కువ సేపు , సుమారుగా 20-25 సార్లు పైకీ క్రిందికి తిరగతిప్పాలి. అప్పుడు ఆ పాలను గుటక గుటకగా త్రాగ వలెను.
*బరువు తగ్గుతారు*.
# వేడి వేడి కిచిడిలో బాగా ఎక్కువ నెయ్యి కలుపుకుని వారానాకి ఒక సారి తిన వలెను. *బరువు తగ్గుతారు*.
*పాటించ వలసిన నియమాలు* .
# సైంధవ లవణం ( Rock Salt ) వాడవలెను .
# ప్రతి రోజు ఉదయం 10-15 నిమిషాలీ తిరగలి తిప్పాలి .
# స్త్రీలు తిరగలి తిప్పిన యెడల మోనోపాజ్ సమస్యల నుండి రక్షిస్తుంది .
# పొట్ట తగ్గాలన్నా , ఎసిడిటి , విరేచన , జీర్ణ వ్యాధులన్నీ తగ్గాలంటే ప్రతి రోజు తిరగలి తిప్పండి .
# భోజనం తర్వాత నల్ల నువ్వులను బాగా నమిలి తినండి . 3 లేక 4 నెలల్లో 7 లేక 8 కిలోల బరువు తగ్గుతారు .
*వేసవిలో నువ్వులను తినరాదు* .
# ఫ్రిజ్ నీటిని , ఐస్ ముక్కలు వేసిన నీటిని త్రాగరాదు .
# పొట్ట బాగా ముందుకు వచ్చిన వారు సుఖాసనంలో కూర్చోని భోజనం చేసిన యెడల 2 లేక 3 నెలల్లో వారి పొట్ట వెనక్కి వెళ్ళి ఉంటుంది .
#.మైదా. తో చేసిన పదార్థాలు తినకొఢథు.
# పరోటా రాత్రి తినటం వల్ల పొట్ట పెరిగే అవకాశం వున్నది .
# గోధుమలు , మైదాను వాడరాదు .
# గోడంబి బరువును పెంచుతుంది .
# నువ్వుల నూనెతో మసాజ్ చేసుకుంటే బరువు తగ్గుతారు .
# ఆహారంలో *చిరు దాన్యాలు ( Millets ) ను చేర్చుకొన వలెను .
ధన్యవాదములు 
మీ నవీన్ నడిమింటి 

జుట్టు రాలుట నివారణ మార్గం


జుట్టు రాలుట సమస్యలు-నివారణ మార్గాలు అవగాహనా కోసం నవీన్ నడిమింటి సలహాలు 



          జుట్టు రాలుట సమస్యలు –నివారణ మార్గాలు
     పురుషుల కైనా, స్త్రీల కైనా అందాన్ని ఇనుమడింప జేసేవి వెంట్రుకలే. ఒకప్పుడు మనదేశములో కేశసంపదకుకొదవలేదు.     స్త్రీలు  పొడవైనజుట్టుతో , పురుషులు  ఉంగరాల,నొక్కుల, జులపాలతో అందంగా కనపడేవారు. బట్టతల గలవారు 1%   కంటే  తక్కువ వుండేవారు. కాని ఇప్పుడు యువకులలోనే 30% పైగా బట్టతలవారు కనిపిస్తున్నారు. ముఖ్యంగా ఉన్నత విద్యావంతులు,సాఫ్ట్ వేర్ రంగం లో వారికి జుట్టు ఊడిపోయే సమస్య ఎక్కువగా కన్పిస్తున్నది.
     జుట్టు రాలుట  (హేర్ ఫాలింగ్ ) కు ప్రధాన కారణాలు :
      .1. మానసిక ఒత్తిడి, చిన్న విషయానికి ఎక్కువ ఆలోచించడం.
      2. వేళకు నిద్రపోక పోవడం    3. సమతుల పోష కాహారం లోపించడం.
      4. వాతావరణ కాలుష్యం.      5. రసాయనాలు (షాంపులు,హేర్ డై ) ఎక్కువ వాడడం.
      6. చీటికి మాటికి యాంటీ బయోటిక్స్  ఎక్కువ తీసుకోవడం.
     7. జబ్బు చేసి బలహీన పడినప్పుడు  ఎక్కువ జుట్టు రాలుతుంది.
     8 త్వరగా సన్నపడాలని అతిగాచేసే ఎక్సర్ సైజులు, డైటింగ్ లు
     9. ఎనీమియా (ఐరన్ లోపం ), B12 విటమిన్ లోపించడం, జింక్ లోపించడం.
     
10. టైఫాయిడ్ వల్ల,    
11 యాంటీ క్యాన్సర్ మందులు వాడటం,రేడియో తెరఫీ వల్ల.
     12.ప్రొజెస్టిరాన్, టెస్టో స్టిరాన్  హార్మోన్స్ లోపించడం లేదా ఎక్కువ కావడం.
     13. వంశ పారంపర్యంగా బట్ట తల రావడం.
    వంశపారంపర్యంగా, సహజంగా  వచ్చిన బట్టతల మళ్ళీ మొలవదు. ఇన్ఫెక్షన్, జబ్బులవల్ల పోషకాహార లోపం వల్ల,
      ఏర్పడిన బట్టతలకు చికిత్స చేస్తే చాలావరకు  జుట్టు వస్తుంది.
     జుట్టు రాలకుండా ఆపడానికి, తిరిగి వెంట్రుకలు మొలవడానికి  మార్గాలు:
   అల్లోపతీ వైద్యం: బట్టతల  ఏర్పడినచోట  
HAIREX solution(Minoxidil) or HEBALDsolution(Minoxidil)
   పై మందులలో ఏదో ఒకటి ఉదయం ఒక చుక్క (1 ml),సాయంత్రం ఒక చుక్క మందును వేసి వేలితో మర్దన చేయాలి.
   అలా కనీసం నాలుగు నెలలు రాయాలి. 4 నెలలతర్వాత వెంట్రుకలు మొలవడం మొదలవుతాయి. మొలిచిన తర్వాత     కూడా రోజు రెండు పూటలు  పై మందు రాయాలి.

  ఆయుర్వేదం, ప్రకృతి వైద్యం   

1.నల్లమందు,లిల్లీపూరసాన్నిసారాయిలోకలిపితైలముగావాడితేజుట్టురాలదు. క్రీ. పూ 400 లో హిప్పో క్రేట్స్ ఈ విధానం కనుగొన్నాడు.
 2. కలబంద లోని తెల్లని గుజ్జును తీసి, కొబ్బరి నూనె లో మరిగించి, ఆ తైలాన్ని రోజు రాసిమర్దన చేస్తుంటే జుట్టు 
రాలదు .                                                                                                                      
3. కట్టెలు, దుంగలపై తేమకు పెరిగే ఒక రకమైన పుట్టకొక్కులు(శిలీంద్రం ) ను తెచ్చి ఎండబెట్టి, కాల్చి ఆ బూడిదను     కొబ్బరి నూనె లేదా నువ్వుల నూనెలో కలిపి బట్టతలకు రాస్తుంటే  ఒకటి రెండు నెలలలో  నూగులా' వెంట్రుకలు మొలుస్తాయి. తర్వాత దట్టంగా పెరుగుతాయి. ఇది చాలా ఉత్తమ చికిత్స.
4.  ఒక ఉల్లిపాయను కచ్చాపచ్చా దంచి ఒక కప్పు  రమ్ లో వేసి 24 గంటల తర్వాత దానిని గుడ్డలోవేసి వడకట్టి(గట్టిగా పిండి ),ఆ రసాన్ని ఒక సీసాలో భద్రపరచుకొని రోజూ తలకు రాస్తుంటే వెంట్రుకలు రాలవు. జుట్టు పెరుగుతుంది. ప్రపంచ సుందరి, ఈజిప్సియన్  రాణి క్లియోపాట్ర  ఈ విధానం అవలంభించేదట.
5.ముల్లంగిరసం ,ఉల్లిపాయలరసం కలిపి రాసి,మర్దన చేస్తుంటే జుట్టు పెరుగును.
6. జింక్ ఎక్కువగా ఉండే గుమ్మడి గింజలు, బీన్స్, నల్లనువ్వులు, లాంటివి ఆహారంగా తీసుకొంటే జుట్టు పెరుగును.
7. B12 విటమిన్, ఫోలిక్ యాసిడ్, జుట్టు రాలుటను నివారించును.
కొసమెరుపు B.P ని తగ్గించడానికి వాడే ట్యాబ్లెట్స్ లో వెంట్రుకలు పెరగడానికి దోహదపడే ఒక రకమైన ఔషధం (సైడ్ఎఫెక్ట్ గా ) ఉంది. అందుకనే వారికి జుట్టు బాగా పెరుగుతున్నదట.  
గమనిక: వయస్సు పైబడినవారికి ,ముసలి వారికి పై చికిత్సా విధానాలు సత్ఫలితాలనివ్వవు. వారు మంచి పోషకాహారం తీసుకొంటుంటే కొంతవరకు జుట్టు రాలుటను నివారించ వచ్చు.

పొడిబారిన కళ్ళు పరిష్కారం మార్గం


డ్రై మరియు ఇచీ ఐస్ సమస్య సాధారణ సమస్యగా మారిపోయింది. కళ్ళల్లో అలాగే కంటి చుట్టూ దురద వలన అసౌకర్యంగా ఉంటుంది.

అలర్జిక్ రియాక్షన్ లేదా ఏదైనా ఇన్ఫెక్షన్ వలన డ్రై మరియు ఇచీ ఐస్ సమస్య వేధిస్తుంది. కాంటాక్ట్ లెన్సెస్ ని వాడటం అలాగే ఐ హైజీన్ ని సరిగ్గా పాటించకపోవడం, ఎక్సపైర్ అయిపోయిన ఐ కాస్మెటిక్స్ ను వాడటం, కళ్ళల్లో దుమ్ము పడటం వంటివి డ్రై ఐస్ సమస్యను తీసుకువస్తాయి. డ్రై ఐస్ కి అలాగే కళ్లల్లో దురదలనేవి ఈ కారణాల వలన ఏర్పడతాయి.

కళ్ళల్లో ఇరిటేషన్, దురద అలాగే బర్నింగ్ సెన్సేషన్ వంటివి డ్రై ఐస్ తో పాటు వచ్చే కొన్ని ఇబ్బందికర లక్షణాలు. కళ్ళలో వాపును కూడా గమనించవచ్చు. వీటితోపాటు కళ్ళల్లో డిశ్చార్జ్, ఎరుపు, లైట్ సెన్సిటివిటీ పెరగడం వంటివి కూడా అనుభవంలోకి వస్తాయి.

అలర్జీస్ కలిగే సీజన్ కావడం వలన కూడా డ్రై మరియు ఇచీ ఐస్ సమస్య వేధిస్తుంది. ఈ సమస్యను త్వరగా తగ్గించుకోవడం ముఖ్యం. చికిత్స చేయకుండా ఈ సమస్యను అలాగే వదిలేస్తే కళ్ళు డేమేజ్ అయ్యే ప్రమాదం ఉంది.

తక్షణ ఉపశమనం కోసం, ఈ నేచురల్ రెమెడీస్ ను ప్రయత్నిస్తే డ్రై మరియు ఇచీ ఐస్ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.

1. నీళ్లు మరియు ఉప్పు:

నీళ్లు మరియు ఉప్పు మిశ్రమం అనేది డ్రై మరియు ఇరిటేటెడ్ ఐస్ సమస్యను పరిష్కరించేందుకు ఉత్తమ రెమెడీగా పనికొస్తుంది. సాల్ట్ అనేది కళ్ళలో పేరుకున్న ఉప్పును తొలగించేందుకు ఉపయోగపడుతుంది. అలాగే సాల్ట్ లో యాంటీ బాక్టీరియల్ ఏజెంట్స్ కలవు. ఇవి బాక్టీరియాను నశింపచేస్తాయి.

ఒక టీస్పూన్ సాల్ట్ ని ఒక కప్పుడు డిస్టిల్డ్ వాటర్ లో కలపాలి.

ఉప్పు పూర్తిగా కరిగిపోయే వరకు ఈ మిశ్రమాన్ని బాయిల్ చేయాలి.

ఆ తరువాత ఈ మిశ్రమాన్ని చల్లార్చి కళ్ళను వాష్ చేసేందుకు వాడుకోవాలి.

2. చమోమైల్ టీ:

చమోమైల్ లో శక్తివంతమైన యాంటీ అలర్జెనిక్ ఎఫెక్ట్స్ కలవు. వీటివలన, ఇది కోల్డ్ కంప్రెస్ గా అలాగే ఐ వాష్ గా పనిచేస్తుంది. తద్వారా, కళ్ళకి రిలీఫ్ ను కలిగిస్తుంది. చమోమైల్ అనేది హిస్టామిన్ విడుదలను నిరోధిస్తుంది. తద్వారా, అలర్జిక్ రియాక్షన్ ను నియంత్రిస్తుంది.

1 చమోమైల్ టీ బ్యాగ్ ను ఒక కప్పుడు వేడి నీటిలో అయిదు నిమిషాల పాటు ఉంచాలి.

ఆ తరువాత ఆ టీ ని చల్లారనివ్వాలి.

ఈ కూల్ టీ ను ఐ వాష్ లా రోజుకు రెండు లేదా మూడు సార్లు వాడాలి.

3. రోజ్ వాటర్:

రెడ్ మరియు ఇచీ ఐస్ సమస్యను నిర్మూలించేందుకు రోజ్ వాటర్ అద్భుతమైన రెమెడీగా పనికొస్తుంది. ఇది కళ్ళని చల్లబరుస్తుంది. తద్వారా, తక్షణ ఉపశమనాన్ని అందిస్తుంది. స్వచ్ఛమైన రోజ్ వాటర్ ను వాడితే కళ్ళు రిలీఫ్ ను పొందుతాయి. అలసట పొందిన కళ్ళకు ప్రశాంతత లభిస్తుంది. పఫ్ఫీ ఐస్ సమస్య తొలగుతుంది.

రోజ్ వాటర్ తో రోజుకు రెండు సార్లు కళ్ళను రిన్స్ చేసుకోండి.

రోజ్ వాటర్ ని ఐ డ్రాప్స్ లా కూడా వాడవచ్చు. రెండు లేదా మూడు రోజ్ వాటర్ డ్రాప్స్ ను ఇంఫ్లేమ్డ్ ఐ లో రోజుకు రెండుసార్లు వేసుకోవాలి.

లేదా కాటన్ బాల్స్ ని రోజ్ వాటర్ లో డిప్ చేసి వాటిని మూసిన కనురెప్పలపై 15 నుంచి 20 నిమిషాల పాటు ఉంచాలి.

ఈ ప్రాసెస్ ని రోజుకు రెండు లేదా మూడు సార్లు రిపీట్ చేయాలి.

4. చల్లటి పాలు:

ఇచీ ఐస్ సమస్యను తగ్గించడానికి చల్లటి పాలు అద్భుతమైన రెమెడీగా పనికొస్తాయి. బర్నింగ్ సెన్సేషన్ ను తగ్గించి ఇచ్చినెస్ తో అనుసంధానమైన అసౌకర్యాన్ని కూడా తగ్గిస్తుంది. పాలలో ఉన్న ఫ్యాట్ అనేది ఉబ్బిన కళ్ళ సమస్యను కూడా తగ్గిస్తుంది.

ఒక కాటన్ బాల్ ని చల్లటి పాలలో ముంచి దాంతో కళ్ళ చుట్టూ అద్దాలి.

ఈ పద్దతిని రోజుకి రెండుసార్లు పాటించాలి.

పాలలో ముంచిన కాటన్ బాల్ ను కనురెప్పలపై 15 నుంచి 20 నిమిషాల పాటు ఉంచితే ఇన్స్టెంట్ కూలింగ్ ఎఫెక్ట్ లభిస్తుంది.

ఈ ప్రాసెస్ ను రోజుకు మూడు లేదా నాలుగు సార్లు పాటిస్తే మంచిది.

5. దోశకాయ:

దోశకాయలో యాంటీ ఆక్సిడెంట్ ప్రాపెర్టీస్ కలవు. ఇవి ఇంఫ్లేమేషన్ ను తగ్గించి ఇచి ఐస్ వలన కలిగే ఇరిటేషన్ నుంచి ఉపశమనం కలిగిస్తాయి. దోశకాయలోని కూలింగ్ నేచర్ అనేది పఫీనెస్ ను అలాగే డార్క్ సర్కిల్స్ ను తగ్గించేందుకు తోడ్పడుతుంది.

దోశకాయను వాష్ చేసి స్లైసెస్ గా కట్ చేయండి.

ఈ స్లైసెస్ ను 20 నిమిషాల పాటు రెఫ్రిజిరేట్ చేయండి.

ఈ దోశకాయ స్లైసెస్ ను మూసిన కళ్లపై పదినిమిషాల పాటు ఉంచండి.

ఈ ప్రాసెస్ ను రోజుకు 4 లేదా 5 సార్లు పాటించండి.

6. గ్రీన్ టీ:

గ్రీన్ టీలో అనేక హెల్త్ బెనిఫిట్స్ లభిస్తాయి. ఇవి ఇచీ ఐస్ నుంచి రక్షణనిచ్చి కళ్ళను ప్రశాంతబరుస్తాయి. గ్రీన్ టీ లో ఉండే యాంటీ ఇంఫ్లేమేటరీ ప్రాపర్టీస్ వలన కళ్ళలో అలసట తగ్గుతుంది. గ్రీన్ టీ లో వైరల్ మరియు యాంటీ బాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ పై పోరాడే సామర్థ్యం కలదు. తద్వారా, కళ్ళలో ఇచీ సెన్సేషన్ ను తగ్గించడానికి ఈ ప్రాపర్టీస్ ఉపయోగకరంగా ఉంటాయి.

రెండు గ్రీన్ టీ బ్యాగ్స్ ను ఒక కప్పుడు బాయిలింగ్ వాటర్ లోకి తీసుకోండి.

వీటిని 5 నిమిషాల పాటు స్టీప్ చేయండి.

ఈ టీ ను పూర్తిగా చల్లారనివ్వండి.

ఈ సొల్యూషన్ తో కళ్ళను రోజుకు రెండు సార్లు వాష్ చేసుకోండి.

అలాగే, చల్లని గ్రీన్ టీ బ్యాగ్ ను మూసిన కనురెప్పలపై కొద్ది నిమిషాలపాటు ఉంచితే ప్రయోజనం ఉంటుంది.

7. అలోవెరా:

అలోవెరాలో సూతింగ్ మరియు మాయిశ్చరైజింగ్ ప్రాపర్టీలు కలవు. ఇవి డ్రై మరియు ఇచీ ఐస్ సమస్యను తొలగించేందుకు సమర్థవంతమైన హోమ్ రెమెడీగా పనిచేస్తాయి. అలోవెరాలో ఉన్న మెడిసినల్ ప్రాపర్టీస్ అనేవి ఐ పఫీనెస్ ను అలాగే ఇంఫ్లేమేషన్ ను తగ్గించేందుకు తోడ్పడతాయి.

అలోవెరా లీఫ్ ను ఓపెన్ చేసి అందులోంచి జెల్ ను సేకరించండి.

ఈ జెల్ ను ఐ లిడ్స్ వెలుపల అప్లై చేయండి.

15 నుంచి 20 నిమిషాల పాటు ఈ జెల్ ని అలాగే ఉండనివ్వండి.

ఈ పద్దతిని రోజుకు రెండుసార్లు పాటించండి.

8. మెంతిగింజలు:

ఇచీ ఐస్ సమస్యను తగ్గించేందుకు మెంతిగింజలు తోడ్పడతాయి. ఇది ఇచింగ్ ను అలాగే ఇతర ఐ ప్రాబ్లెమ్స్ ను తగ్గించేందుకు మంచి పదార్థంగా పనిచేస్తుంది. డయాబెటిస్ ను ట్రీట్ చేయడానికి మెంతిగింజలు ఎంతగానో తోడ్పడతాయి.

రాత్రంతా మెంతిగింజలను నీళ్ళలో నానబెట్టండి.

వీటితో ఒక పేస్ట్ ను తయారుచేయండి.

ఈ పేస్ట్ ను మూసిన కళ్లపై అప్లై చేయండి. 20 నిమిషాల పాటు అలాగే ఉండనివ్వండి.

ఆ తరువాత చల్లటి నీటితో రిన్స్ చేయండి.

9. పొటాటోస్:

పొటాటో అనేది నేచరల్ అస్ట్రింజెంట్ గా పనిచేయడం వలన ఇంఫ్లేమేషన్ ను తగ్గిస్తుంది. కళ్ళలో దురదలతో ఇబ్బందిపడుతున్నవారికి పొటాటో అద్భుతమైన రెమెడీగా పనిచేస్తుంది.

పొటాటోను సన్నటి స్లైసెస్ గా కట్ చేసి ఫ్రిడ్జ్ లో కూల్ చేయండి.

ఈ స్లైసెస్ ను కళ్లపై 15 నుంచి 20 నిమిషాల పాటు ఉంచండి.

ధన్యవాదములు 

మీ నవీన్ నడిమింటి 


కళ్ళు ఎరుపు రంగు లో మారిన నప్పుడు తీసుకోవాలిసిన జాగ్రత్తలు


రెడ్ ఐ అంటే ఏమిటి మరియు మీరు ఎలా నివారించవచ్చు?అవగాహనా కోసం నవీన్ నడిమింటి సలహాలు 

రెడ్ ఐ అంటే ఏమిటి మరియు మీరు ఎలా నివారించవచ్చు?

ఫోటోలలో రెడ్ ఐ లేకపోవడం క్యాన్సర్ను సూచించాలా?

ప్రజల ఛాయాచిత్రాలలో ప్రకాశవంతమైన ఎరుపు రంగు విద్యార్థిని సూచించడానికి సాధారణంగా ఉపయోగించే పదం 'రెడ్ కంటి'. ఇది కుటుంబం స్నాప్షాట్లు అన్ని సమయం జరుగుతుంది మరియు మీరు సులభంగా నివారించవచ్చు ఏదో ఉంది.

ఎరుపు కన్ను కారణం చాలా సులభం: కాంతి కన్ను వెనుక రక్త నాళాలు ఆఫ్ ప్రతిబింబిస్తుంది. మరింత స్పష్టంగా, కాంతి ప్రతిబింబిస్తుంది కాబట్టి మీరు రెటీనా వెనుక వెలుగుని కాంతి చూసినట్లు.

కెమెరా ఫ్లాష్ను ఉపయోగిస్తున్నప్పుడు ఇది సంభవిస్తుంది, మరియు ఇది చాలా సాధారణ సమస్య, ఇది కొన్ని సాధారణ దురభిప్రాయాలకు దారితీస్తుంది.

ది కనెక్షన్ ఆఫ్ క్యాన్సర్ టు రెడ్ ఐ ఇన్ ఫోటోస్

పుకార్లు ఇంటర్నెట్ లో ఫ్లై మరియు వాటిలో ఎరుపు కంటి లేకపోవడం మరియు క్యాన్సర్ ఉనికిని మధ్య సంబంధం ఉంది. సరిగ్గా దీనిని స్పష్టంగా తెలియజేయండి: ఛాయాచిత్రాలలో ఎరుపు కళ్ళు లేనప్పుడు ఎవరైనా క్యాన్సర్ ఉన్నట్లు కాదు.

కేసుల్లో అధికభాగం, ఎరుపు కన్ను లేకపోవడం అంటే ఫోటో సరైన మార్గం (మీరు గ్రహించకపోయినా) తీసుకున్నారని అర్థం. కంటి క్యాన్సర్ యొక్క నిర్దిష్ట రకం సూచించే సామర్థ్యాన్ని ఛాయాచిత్రాలు కలిగి ఉన్నాయి.

ఎరుపు కన్ను పరిస్థితుల్లో తెలుపు ప్రతిబింబం చూపినపుడు, ఆందోళన సమయం ఉంటుంది. తరచుగా, ఇది కేవలం ఒకే కంటిలో సంభవిస్తుంది. ఉదాహరణకు, ఫోటోలో ఉన్న వ్యక్తి ఒక ఎర్రని కన్ను మరియు ఒక తెల్లని కన్ను కలిగి ఉంటాడు.

రెటినోబ్లాస్టోమా అనేది కంటి క్యాన్సర్ రకం, దీనిలో రెటీనా ముందు కణితి ఏర్పడుతుంది. ఫోటోగ్రాఫ్ చేసినప్పుడు, వ్యక్తి యొక్క కంటి తెల్లటి గ్లో కలిగి ఉండవచ్చు ఎందుకంటే వైట్ కణితి ఆరోగ్యకరమైన రెటీనాకు బదులుగా ప్రకాశిస్తుంది.

ఇది మీ ప్రియమైన వారి దృష్టిలో ఫోటోలను తీయడం మరియు ప్రకాశవంతమైన లైట్లు మెరుస్తూ ఉండాలి. ఏదైనా ఆందోళన కోసం ఒక కంటి వైద్యుడిని చూడండి, సున్నితమైన కళ్ళకు హాని చేయకుండా రూపొందించబడిన లైట్లు ఉంటాయి.

అలాగే, అనేక జంతువుల దృష్టిలో తెలుపు లేదా ఆకుపచ్చ గ్లో ఖచ్చితంగా సంపూర్ణంగా ఉంటుంది.

ఇది "ఆకుపచ్చ కన్ను" దృగ్విషయంలో భాగం మరియు మానవులలో ఎర్రని కన్ను వలె ఉంటుంది. జంతువులు వేర్వేరు కంటి నిర్మాణాలను కలిగి ఉన్నాయి మరియు ఇది కెమెరాకు ప్రతిబింబించే రంగును మారుస్తుంది.

ఫోటోల్లో రెడ్ ఐకు ఏది కారణమైంది?

కన్ను దాదాపు ఒకే స్థాయిలో కన్నులోకి ప్రవేశించినప్పుడు రెడ్ కంటి సంభవిస్తుంది. ప్రకాశవంతమైన కాంతిని (ఒక ఫ్లాష్ నుండి వంటిది) దాదాపు ఏ కోణంలోనైనా కంటిలోకి ప్రవేశించినప్పుడు అది తిరిగి ప్రతిబింబిస్తుంది మరియు కెమెరాకి కనిపించేలా చేస్తుంది, దాని ప్రవేశానికి సమానమైన మరియు వ్యతిరేక కోణం వద్ద కాంతి ప్రతిబింబిస్తుంది .

కంటి యొక్క విద్యార్థి విపరీతమైనప్పుడు ఇది చాలా తరచుగా జరుగుతుంది, ఇది కంటిలోకి ప్రవేశించడానికి మరియు బయటికి వెళ్లేందుకు మరింత కాంతిని ఇస్తుంది. మా కళ్ళు సహజంగా మా విద్యార్థులు విస్తరించడం ద్వారా కాంతి వెలుగులోకి సర్దుబాటు చేసినప్పుడు అది చీకటి గదులు మరియు రాత్రి చాలా తరచుగా కనిపిస్తుంది ఎందుకు.

కింది పరిస్థితుల్లో రెడ్ కంటి ఎక్కువగా ఉంటుంది:

  • ఒక అంతర్నిర్మిత కెమెరా ఫ్లాష్ ఉపయోగిస్తున్నప్పుడు. చాలా కెమెరాలలో లెన్స్కు ఫ్లాష్ యొక్క సాన్నిహిత్యం కారణంగా.
  • విద్యార్థులు డిలీట్ చేసినప్పుడు. పెద్ద విద్యార్థుల వ్యాసం కెమెరాకు మరింత కాంతిని ప్రతిఫలిస్తుంది.
  • కెమెరా లెన్స్ కన్నుతో సమానంగా ఉంటుంది. ఫ్లాష్ అంటే అదే స్థాయిలో ఉండవచ్చు.

రెడ్ ఐ అడ్డుకో ఎలా

ఎరుపు కన్ను నివారించడం మీరు అనుకోవచ్చు వంటి కష్టం కాదు.

మీరు కేవలం కాంతిని ప్రవేశిస్తున్నప్పుడు కోణం మార్చే అవసరం మరియు కంటికి వెలుపలికి వెళ్తుంది లేదా కాంతి యొక్క కఠినత్వం మార్చబడుతుంది.

  • ఒక వంపు తల తో ఫ్లాష్ ఉపయోగించండి. పరోక్ష కాంతిని సృష్టించేందుకు ఒక పైకప్పు లేదా సమీపంలోని గోడ నుండి కాంతిని బౌన్స్ చేయండి.
  • కాంతి జోడించడానికి ఒక రిఫ్లెక్టర్ ఉపయోగించండి. ఇది ఫ్లాష్ బయటపడటానికి ముందు మీ విషయం యొక్క కళ్ళు ప్రకాశవంతమైన కాంతికి సర్దుబాటు చేయడానికి కూడా అనుమతిస్తుంది.
  • మీ ఫ్లాష్ లో ఒక డిఫ్యూజర్ ఉపయోగించండి. ఒక డిఫ్యూజర్ కణజాలం లేదా ఇదే పాక్షిక-పారదర్శక, తెల్లని పదార్ధం వలె సులభమైనది.
  • మీ కెమెరా కోణం మార్చండి. మీ విషయం కన్నా కొంచెం ఎక్కువ లేదా తక్కువ స్థానం నుండి షూట్.

కెమెరాలపై రెడ్ ఐ రిడక్షన్ వర్క్ ఎలా పనిచేస్తుంది?

ఎన్నో కెమెరాలు 'రెడ్ ఐ రెడక్షన్' అని పిలువబడే ఒక అమర్పును కలిగి ఉంటాయి మరియు ఇది ఎరుపు కన్ను తగ్గించడానికి ఒక ఉపయోగకరమైన మార్గం. అయితే, ఇది ఫూల్ప్రూఫ్ కాదు మరియు మీరు తీసుకునే ప్రతి చిత్రానికి పనిచేయదు.

ఈ కెమెరా అమర్పు షట్టర్ను జారవిడిచినప్పుడు ఏర్పడే ఫ్లాష్ కోసం ఒక వ్యక్తి యొక్క కళ్ళను సిద్ధం చేయడానికి ప్రయత్నిస్తుంది.

ఇది పెద్ద, విస్తరించిన విద్యార్థులను చిన్నగా పెరగడానికి బలవంతం చేయడానికి చిన్నపిల్లల చిన్న చిన్న బరతులను పంపించడం ద్వారా ఇది చేస్తుంది. పరిపూర్ణమైన ప్రపంచంలో, ఇది చాలా చిన్నదైన విద్యార్థిగా ఉండాలి, తద్వారా కాంతి యొక్క ప్రధాన ఫ్లాష్ ఏర్పడినప్పుడు, ఎర్ర-కన్ను ప్రభావం తగ్గించబడుతుంది.

ఇది ప్రతిసారీ పని చేయదు మరియు సాధారణంగా ఎరుపు కన్ను తగ్గిస్తుంది , అది తొలగించదు .

షట్టర్ లాగ్ సమయాన్ని పెంచుతుందని ఈ లక్షణానికి నిజమైన లోపము. ఫోటోను తీయడానికి మీరు షట్టర్ బటన్ను నొక్కవచ్చు, కానీ ఆ ఫోటోను తొలగిపోయే ముందుగా కెమెరా మొదటి ఆరంభాన్ని వెలిగించాలి. మీరు చర్య లేదా ఖచ్చితమైన స్మైల్ కోల్పోవచ్చు అర్థం. ఇది ఒక బ్లింక్ పట్టుకోవడంలో అవకాశాలు కూడా పెరుగుతుంది.

మీ ఫోటోలలో ఎరుపు కన్ను తగ్గించడానికి మరియు తొలగించడానికి పేర్కొన్న ఇతర పద్ధతులను ఉపయోగించడం ఉత్తమం.

ధన్యవాదములు 

మీ నవీన్ నడిమింటి 


పులిపిరికయ్య నివారణ మార్గం

*How to Remove Moles, Warts, Blackheads, Skin Tags & Age Spots Naturally*

   *శరీరంపై పులిపిరి కాయలు ఎక్కువగా ఉండి నలుగురిలో ఇబ్బంది పడుతున్నారా?  పులిపిరి కాయలను ఈజీగా తొలగించొచ్చు.. ఎలా అంటే...*

*Viral Warts, ఉలిపిరి కాయలు , పులిపిరులు , పులిపెరకాయలు. తగ్గాలి అంటే ఏమి చేయాలి*

Advise:
మనిషి శరీరంలో అక్కడక్కడ చర్మము ఎక్కువగా ఉండి కాలిఫ్లవర్ ఆకారములో, చిన్నపాటి కురుపులా ఉండటాన్ని పులిపెర అంటారు. పులిపిరి సుఖవ్యాధి ‘హ్యూమన్ పాపిల్లోమా వైరస్’వల్ల వస్తుంటాయి. పొక్కులు , గడ్డలు లాంటి వాటిని లాగేసినా మళ్ళీ వస్తుంటాయి. వీటిలో సుమారు పది రకాలు ఉన్నాయి . ఇది అంటువ్యాది .. గాయపడిన చర్మము , మ్యూకస్ పొరల ద్వారా ఒకరి నుండి ఒకరికి వ్యాపించును . ఈ పులిపిరులు వాటంతటవే తగ్గిపోవును . కొంతమందిలో సంవత్సరాల కొద్ది ఉండిపోవును . కొంతమందిలో మాయమై మళ్ళీ కనిపించును (recurring) . వీటిలో రకాలు అవి శరీరములో ఉన్న ప్రదేశము బట్టి, పాపిల్లోమా వైరస్ టైపు బట్టి వర్గీకరిస్తారు . 

కామన్‌ వార్ట్ (Verruca vulgaris): రఫ్ గా ఉన్న ఉపరితలముతో కొంచము ఎత్తు గా ముఖ్యముగా చేతులపై కనిపించును . చేతులపైనే కాకుండా శరీరము పై ఎక్కడైనా పుట్టవచ్చును . 

ప్లాట్ వార్ట్ (Verruca plana) : ఇది బల్లపరుప గా మాంసము (flesh) రంగులో ఎక్కువ సంఖ్యలో ముఖ్యముగా ముఖము మెడ , చేతులు , మణికట్టు , ముడుక భాగాలలో కనిపుంచును . 

ఫిలిఫారమ్‌ వార్ట్ (Filiform) : చిన్న పోగులా , లేదా పిలక లా ఉండి కనురెప్పలు , పెదవులు , ముఖము భాగాలలో వ్యాపించును . 

జెనిటల్ వార్ట్శ్ (Venerial warts-condyloma acuminatum) : పురజాల భాగాలలో ... కోడి జుత్తు ఆకారములో వ్యాప్తి చెందును . 

మొజాయిక్ వార్ట్స్ (Mosaik warts) : గుత్తు గుత్తులు గా గ్రూపులు గా అరికాలు, అరిచేతులు భాగాలలో ఎక్కువగా కనిపించును . 

పెరీఅంగుల్ వార్ట్స్ (periungual wart) : కాలిఫ్లవర్ ఆకారములో గోళ్ళు చుట్టు వ్యాపించి అసహ్యముగా కనిపించును . 

ప్లాంటార్ వార్ట్స్ (verruca plantaris) : గట్టిగా కాయమాదిరిగా , నొప్పితోకూడికొని అరిపాదాలు ,చేతులు భాగాలలో అరుగుదల చెందే శరీరభాగాలలో (pressure points) కనిపించును . 

కారణము :
హ్యూమన్‌ పాపిల్లోమా వైరస్ (HPV) . ఈ వైరస్ లో సుమారు 100 రకాలు ఉన్నాయి. చర్మములో కందికాయలు నుండి కోడి జుత్తు వరకు . . స్త్రీలలో సెర్వైకల్ క్యాన్క్షర్ నుండి నోరు ,గొంతు క్యాన్‌సర్లు వరకు వీటివలన కలిగే ప్రమాదము ఉంది . 

వ్యాధి కారకం:
మానవ పులుపురికాయ -- HPV అనే వైరస్ ద్వారా వస్తాయి. మానవ పులుపురికాయ వైరస్లు సుమారు 100 జాతులు ఉన్నాయి. రకం 1, 2, మరియు 3 కారణాలు చాలా సాధారణంగా వార్ట్ ల్లో - టైప్ 1 లోతైన అరికాలి (అడుగుల) మరియు చేతి వార్ట్ ల్లో (అరచేతిలో) తో ముడిపడి ఉంది. టైప్ 2 సాధారణ వార్ట్ ల్లో, సూక్ష్మతంతువు వార్ట్ ల్లో, అరికాలి వార్ట్ ల్లో, మొజాయిక్ వార్ట్ ల్లో కారణమవుతుంది. టైప్ 3 సమతల వార్ట్ లకు కారణమవుతుంది, లేదా చదునుగా ఉన్న వార్ట్స్ అని పిలుస్తారు .. సంభోగ వార్ట్స్ రకాలు 6, 11, 16, 18, 30, 31, 33, 34, 35, 39, 40 కారణమవుతుంది. HPV టైప్ 6 మరియు టైప్11 జననేంద్రియ వార్ట్స్ కేసుల్లో 90% లు కారణమవుతున్నాయి. HPV రకాలు 16 మరియు 18 గర్భాశయ క్యాన్సర్ కేసుల్లో ప్రస్తుతం 70% కారణం , మరియు కొన్ని vulvar , యోని , పురుషాంగము మరియు ఆసన క్యాన్సర్లుకు కారణం. గార్డాసిల్ అనేది HPV టీకా మందు. HPV రకాలు 16, 18, 6, మరియు 11 వ్యాధి కోసం నివారించడానికి ఉద్దేశించబడింది. ఇది HPVs ఇతర రకాల వ్యతిరేకంగా క్రాస్ రక్షణ ద్వారా సంభోగాంగ మొటిమల్లో ఇతర జాతులు సోకకుండా నిరోధించడానికి పనికొస్తుందని ప్రకటించారు. HPV నోటి క్యాన్సర్, స్వరపేటిక కాన్సర్, బ్రోంఖియాల్ మరియు ఊపిరితిత్తుల కాన్సర్ తో ముడిపడి ఉంది అని అదారాలు ఉన్నాయి. 

చికిత్స : 
* సరియైన పూర్తి గా నయమయ్యే చికిత్స లేదు .
* సాలిసిలిక్ యాసిడ్ తో క్రయో తెరఫీ చేయడము .
* జెనిటల్ వార్ట్స్ కి " ఫోడోపైలం " రెసిన్‌ అప్లై చేయడం ,
* ఇమిక్విమోడ్ క్రీం వార్ట్ పై పెట్టడము మూలముగా " interferon" తయారై మన శరీరమే వైరస్ ని నిర్మూలించే పద్దతి .
* కాంతారిడిన్‌ (Cantharidin) అనే కెమికల్ తమలపాకు సంబంధిత మొక్కలనుండి తీసి అప్లై చేయడము ,
* బ్లియోమైసిన్‌ ని లోకల్ గా ఇంజక్ట్ చేయడం వలన వార్ట్స్ కుళ్ళి నశించును ,
* Dinithrochlorobenzene ఇది సాలిసిలిక్ యాసిడ్ లాగనే వార్ట్ ఉన్న ప్రదేశమును కొరికి నాశనము చేయును .
* Flurouraxil వైరస్ "డి.ఎన్‌.ఎ" ను నాశనము చేసి వార్ట్స్ బారినుండి కాపాడును .
* గడ్డ(wart)ను లేజర్ ద్వారా సమూలంగా పునాదినుంచి పెకలిస్తాము. ఆ తర్వాత దానిని బయాప్సీకి పంపిస్తాము. తద్వారా దాని అసలు గుణం తెలుస్తుంది. పులిపిరి(వార్ట్) లకు కారణమైన ’హ్యుమన్ పాపిలోమా వైరస్(హెచ్ పి వి) లోని మిగిలిన రకాలను(సబ్ టైప్)కనిపెట్టి, గర్భాశయ కాన్సర్ కు ’హెర్పస్ సింప్లెక్స్ వైరస్’ కారణమని నిరూపించి వారు జూర్ హుస్సేన్(జర్మనీ) .

ఉలిపిర్ల నివారణకు కొన్ని ఆయుర్వేదిక్ చిట్కాలు :
* కొంతమందికి ముఖంపైన మెడ మీద పులిపిరి కాయలు వస్తూంటాయి. అలాంటి వారు దాల్చిన చెక్క కాల్చి ఆ బూడిదని కొంచెం సున్నంలో కలిపి నూనెలో నూరి వాటిపైన రాస్తే అవి రాలిపోతాయి.
* పులిపిరి కాయలు పోవాలంటే అల్లాన్ని సున్నంతో అద్దిపెడితే రాలిపోతాయి.
* పులిపిర్లు పోవాలంటే కాలిఫ్లవర్‌ రసాన్ని రాయాలి. కాలిఫ్లవర్‌ను గ్రైండ్‌ చేసి రసం తీసుకోవాలి. ఈ రసాన్ని పులిపిరి మీద రాస్తుండాలి. రోజుకు వీలైనన్నిసార్లు కనీసం అరగంట విరామంతో రాస్తుంటే పులిపిరి రాలిపోతుంది. మచ్చకాని గుంట కాని పడటం జరగదు.
* మందం గా ఉన్న పులిపిరి కాయలమీద ఆవాలు నూరిన ముద్ద రాస్తే పులిపిరులు ఎండి రాలిపోతాయి .
* రావి చెట్టు ఫై బెరడును కాల్చి బూడిద చేసి సున్నపు నీరు తేటను కలిపి నిల్వచేసుకుని తగినంత మిశ్రమంలో కొద్దిగా నెయ్యి వేసి అది పులిపిరి ఫై పుస్తూ ఉంటే అవి రాలిపోతాయి.
* చిటికెడు అతిమధురం పొడి, చిటికెడు అశ్వగంధ పొడి, రెండు చుక్కలు కొబ్బరి నూనె ,రెండు చుక్కలు నిమ్మరసం వేసి బాగా కలిపి అల్లంను పుల్లలగా సన్నగా కట్ చేసుకుని ఈ అల్లం పుల్లతో ఫై పేస్టు ను తీసుకుని పులిపిరి ఫై రాయాలి.
ధన్యవాదములు 
మీ నవీన్ నడిమింటి 
         అందరికి ఉపయోగపడే సులభమైన ఆరోగ్య హెల్త్ ! కనుక తప్పక షేర్ చెయ్యండి అవసరం ఉన్న వారికీ ఉపయోగపడవచ్చు.
ఈ పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే మా పేజీని👍 లైక్ చేయండి,షేర్ చేయండి....!!!

https://www.facebook.com/Naveen-Nadiminti-1536735689924644/

అమ్మాయి లో తెల్ల బట్ట పరిష్కారం మార్గం

తెల్లబట్ట మహిళల్లో కనిపించే సాధారణ మరియు మాములు స్థితి. ఇది ఒక పారదర్శక ద్రవం యొక్క స్రావం లేదా శ్లేష్మం, ఇది యోనిని తేమగా మరియు సరళతగా ఉంచి, యోని సంక్రమణలను నివారిస్తుంది.. ఒక మహిళ యొక్క వయోజన జీవితంలో యుక్తవయస్సు నుండి రుతువిరతి వరకు కలిగే హార్మోన్ల స్థాయిలో మార్పుల మూలంగా తెల్లబట్ట ఏర్పడుతుంది. దురదలేని తెల్లటి స్రావం మరియు తడిగా ఉండటం వంటివి తెల్లబట్ట యొక్క లక్షణాలు, ఇది హానిరహితమైనది మరియు ఎటువంటి సంక్లిష్టత లేకుండా పరిష్కరించవచ్చు. తెల్లబట్టకు గల ఇతర కారణాల్లో లైంగికేతర మరియు లైంగికంగా సంక్రమించే అంటువ్యాధులు కూడా ఉన్నాయి. ఈ సందర్భాలలో, దురద, ఎరుపుదనం, చెడు వాసన, అసౌకర్యం లేదా నొప్పి వంటి లక్షణాలు కూడా ఎదుర్కోవచ్చును. అటువంటి సంక్రమణలు సోకకుండా నివారించడానికి లేదా సంక్లిష్టతలను నివారించడానికి మందులు అలాగే ఇతర జాగ్రత్తలు తీసుకోవాలి. ఇది అధికంగా లేదా అసాధారణంగా ఉంటే తప్ప, తెల్లబట్టకు 


తెల్లబట్ట (ల్యూకోరియా) అంటే ఏమిటి? - 

ప్రపంచ జనాభాలో ఐదవ వంతు సంతానోత్పత్తి వయసులో ఉన్న మహిళలను కలిగి ఉంటుంది. భారతదేశంలో, 2001 జనాభా లెక్కల ప్రకారం జనాభాలో 19% మంది ఈ వయసు మహిళలు ఉన్నారు. భారతీయ మహిళలలో, ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న వారిలో యోని ఉత్సర్గం నిర్లక్ష్యం చేయబడుతున్న సమస్య. మహిళా పునరుత్పాదక మార్గ సంక్రమణలు భారతదేశము మరియు బంగ్లాదేశ్లతో సహా అనేక అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఉన్న ఒక ప్రజా ఆరోగ్య సమస్య. ఇక్కడ సంతానోత్పత్తి మార్గ సంక్రమణా సంఘటనలు 52-92% మధ్య ఉంటుంది. తెల్లబట్ట ఒక సహజ యోని స్రావం అయినప్పటికీ, ఇప్పటికీ ఇది ఒక వ్యాధిగా పరిగణించబడుతుంది. తెల్లబట్ట అనేది యుక్త వయసు మహిళలలో ఉండే ఒక లక్షణం అయినప్పటికీ, ఇది 3 నుంచి 10 ఏళ్ల వయస్సు మధ్య వయస్సున్న ఆడపిల్లల్లో కూడా చూడవచ్చు.

తెల్లబట్ట అనేది ఎటువంటి అంతర్లీనంగా వైద్య సమస్యలు లేకుండా యోని నుండి వచ్చే ఒక తెల్లటి స్రావం. క్లినికల్ ప్రాక్టీసులో, అన్ని రకాలైన స్రావాలు, తెలుపు లేదా పసుపు, ఏదైనాసరే రక్తం కలిగి ఉండకపోతే తెల్లబట్ట అనే అంటారు. సాధారణంగా స్త్రీల ఋతుచక్ర దశ మీద ఆధారపడి, యోని ద్రవం యొక్క రంగు, పరిమాణం మరియు చిక్కదనం మారుతూ ఉంటుంది. తెల్లబట్ట రంగు మరియు వాసన లేనిది, కానీ స్రావం ఎరుపుదనంతో పాటు ఆకుపచ్చ లేదా పసుపుగా ఉండి, దురద మరియు దుర్వాసనతో ఉంటే, ఇది పునరుత్పత్తి మార్గ సంక్రమణకు (ఆర్ టి ఐ) గుర్తుగా చెప్పవచ్చు.

తెల్లబట్ట (ల్యూకోరియా) యొక్క లక్షణాలు - 

సాధారణంగా, ఇన్ఫెక్షన్ సోకని తెల్లబట్ట అనేది ఒక పలచని, పారదర్శకమైన నీటి స్రావం. ఇన్ఫెక్షన్ సోకినప్పుడు, స్రావాల యొక్క మొత్తం, మందం మరియు రంగు మారుతూ ఉంటాయి. ఇది ఇతర లక్షణాలతో కూడా కూడి ఉంటుంది, ఇలా:

తెల్లబట్ట (ల్యూకోరియా) యొక్క చికిత్స - 

మందులు

తెల్లబట్టకి కొంత కాలం యాంటీమైక్రోబియల్ మందులు వాడి చికిత్స చేయవచ్చును. అసాధారణమైన యోని స్రావాలకి, నిర్ధారించిన ఇన్ఫెక్షన్ యొక్క రకం మీద ఆధారపడి విధానాలు ఉంటాయి. ఈస్ట్ ఇన్ఫెక్షన్లకు, సాధారణంగా యాంటీఫంగల్ మందుల కోర్సు సూచించబడుతుందిఏ చికిత్స లేకుండానే  BV యొక్క లక్షణాలు తగ్గుతాయి. హెర్పిస్ వ్యాధికి చికిత్స అందుబాటులో లేదు. యాంటీవైరల్ మందులు వ్యాప్తిని తగ్గిస్తాయి. సంక్రమణ సోకడాన్ని తగ్గించడానికి యాంటీవైరల్ మందులు కూడా ఇవ్వబడతాయి. ప్రస్తుతం, అనేక క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తున్నప్పటికీ ,హెర్పెస్ కోసం టీకా అందుబాటులో లేదు.

ఆహారంలో మెంతులు, ఎండిన కొత్తిమీర, పండిన అరటిపండ్లు వంటి హెర్బల్ రెమెడీలు చేర్చుకుంటే, తెల్లబట్టని అదుపు చేయవచ్చు. "రావి" చెట్టు, ఫికస్ రేసెమోసా, మరియు తెస్పియా నుండి తయారు చేసిన ఆయుర్వేద తయారీలు కూడా స్రావాన్ని తగ్గించడంలో సహాయపడతాయి.

జీవనశైలి నిర్వహణ

మందులు మరియు మూలికా ఔషధాలతో పాటు, సరైన పరిశుభ్రతను పాటించడం ఉత్తమమైన మార్గం.

  • సింథటిక్ లోదుస్తులను ధరించవద్దు కాటన్ లేదా లినెన్ ప్యాంటీలను ధరించండి. మంట పుట్టించని సబ్బుతో శుభ్రపరుచుకోండి. జననాంగ ప్రాంతాన్ని అతిగా కడగవద్దు, ఎందుకంటే అది pH సమతుల్యాన్ని పాడుచేస్తుంది మరియు బ్యాక్టీరియా యొక్క పెరుగుదలకు కారణమవుతుంది.
  • యోని యొక్క సంక్రమణను నివారించడానికి మల విసర్జన తరువాత ముందు నుండి వెనక దిశగా శుభ్రపరుచుకోండి.
  • వాష్రూమ్ కి వెళ్లిన ప్రతిసారీ యోని ప్రాంతాన్ని శుభ్రపరుచుకోండి.
  • సమతుల్య ఆహారం తీసుకోండి.
  • విష పదార్ధాలను తొలగించడానికి ప్రతిరోజూ 10 నుంచి 12 గ్లాసుల నీరు తాగండి..
  • వాకింగ్, జాగింగ్, యోగ, ధ్యానం వంటి తేలికైన వ్యాయామాలు చేయండి ఎందుకంటే అధిక వ్యాయామం తెల్లబట్టను పెంచవచ్చు.
  • ఎల్లప్పుడూ ఒక దంపతీ లైంగిక సంబంధాన్ని(ఒక సమయంలో ఒక లైంగిక భాగస్వామి మాత్రమే కలిగి ఉండటం) కొనసాగించండి.
  • ప్రతి లైంగిక చర్య సమయంలో రబ్బరు కండోమ్లను వాడండి.

తెల్లబట్ట (ల్యూకోరియా)నివారణ కొన్ని మందులు  - 

Medicine NamePack Size
Microdox LbxMicrodox Lbx Capsule
Doxt SlDoxt Sl Capsule
Bjain Arsenicum Sulphuratum Flavum DilutionBjain Arsenicum Sulphuratum Flavum Dilution 1000 CH
ADEL 2 Apo-Ham DropADEL 2 Apo-Ham Drop
Bjain Aurum Metallicum DilutionBjain Aurum Metallicum Dilution 1000 CH
ADEL 32 Opsonat DropADEL 32 Opsonat Drop
Bjain Candida albicans DilutionBjain Candida albicans Dilution 1000 CH
Dr. Reckeweg Stannum Metallicum DilutionDr. Reckeweg Stannum Metallicum Dilution 1000 CH
Dr. Reckeweg Ova Testa 3x TabletDr. Reckeweg Ova Testa 3x Tablet
Bjain Saponinum DilutionBjain Saponinum Dilution 1000 CH
Bjain Caulophyllum Thalictroides DilutionBjain Caulophyllum Thalictroides Dilution 1000 CH
ADEL 34 Ailgeno DropADEL 34 Ailgeno Drop
Doxy 1Doxy 10
Bjain Stannum metallicum LMBjain Stannum metallicum 0/1 LM
SBL Hydrocotyle Asiatica LMSBL Hydrocotyle Asiatica 0/1 LM
Ec DoxEc Dox 30 Mg/100 Mg Tablet
Schwabe Nymphaea odorata MTSchwabe Nymphaea odorata MT
Schwabe Cubeba officinalis CHSchwabe Cubeba officinalis 1000 CH
SBL Euphorbia pilulifera DilutionSBL Euphorbia pilulifera Dilution 1000 CH
ధన్యవాదములు 
మీ నవీన్ నడిమింటి