18, మే 2020, సోమవారం

ఛాతి నొప్పి వచ్చాక తీసుకో కోవలిసిన జాగ్రత్తలు

        తరచుగా ఛాతీ నొప్పి అంటే భయపెట్టేదిగా ఉంటుంది. ఎందుకంటే ఇది గుండె పోటు మరియు ఇతర గుండె వ్యాధులకు దగ్గర పోలికల్ని కల్గి ఉంటుంది. ఛాతీ నొప్పి తేలికపాటి నొప్పి నుండి తీవ్రమైన నొప్పిగా కూడా వస్తుంటుంది. ఛాతీ నొప్పి ప్రాథమిక ఔషధాలతో తగ్గకపోతే వైద్య నిపుణులచేత దీనిని పరీక్ష చేయించుకోవాల్సిందిగా మీకు సిఫార్సు చేయడమైంది. మన ఛాతీలో గుండెతో పాటు అనేక అవయవాలు ఉన్నాయి. అవే కడుపు, ఊపిరితిత్తులు, క్లోమం లేదా (ప్యాంక్రియాస్) వృక్వము, పిత్తాశయం మొదలైన కండరాలు, పక్కటెముకలు, నరములు, మరియు చర్మం వంటివి. అందువల్ల, ఛాతీ నొప్పి పైన పేర్కొన్న అవయవాల నుండి ఉద్భవించగలదు. కొన్నిసార్లు, మీకొచ్చే ఛాతీ నొప్పి దానంతట అదే పోవచ్చు.  కానీ అలా జరగకపోతే, అంటే నొప్పి అట్లాగే కొనసాగితే, మీరు వైద్యుల్ని సంప్రదించి వ్యాధి ఏమిటో నిర్ధారించుకోవడం చాలా ముఖ్యం. మీ దేహానికున్న అంతర్గత కారణాల ఆధారంగా మీ వైద్యుడు మీకు మందులు ఇచ్చి, జీవనశైలి మార్పులు సూచించి చికిత్స చేస్తాడు. లేదా, అవసరమైతే, శస్త్రచికిత్స కూడా చేస్తాడు.

ఛాతి నొప్పి యొక్క రకాలు 

ఛాతీ నొప్పిని క్రింది విధంగా వర్గీకరించవచ్చు:

తీవ్రత ఆధారంగా:

  • స్వల్పమైన ఛాతి నొప్పి అనేది సాధారణంగా వస్తుంది మళ్లీ వెళ్లిపోతుంది. ఈ రకమైన ఛాతి నొప్పి సాధారణంగా సహించుకోదగినదిగా ఉంటుంది.
  • ఓ మోస్తరు నొప్పి ప్రారంభమవుతుంది, అటుపై మీరే పనులూ చేయకుండా మిమ్మల్ని క్షోభపెడుతుంది.
  • తీవ్రమైన నొప్పి ఏమంటే నొప్పిని భరించలేకపోయినప్పుడు, ఇక తక్షణ వైద్య సంరక్షణ అనివార్యమైనప్పటి పరిస్థితి.

వ్యాధి లక్షణం ఆధారంగా

  • తీవ్రమైన నొప్పి - అధిక తీవ్రత కలిగిన పదునైన నొప్పి ఆకస్మికంగా ఛాతిపై దాడి చేస్తే దాన్ని ‘తీవ్రమైన నొప్పి’ అని పిలుస్తారు.
  • నిస్తేజమైన నొప్పి- దీని యొక్క  స్థాయి మితమైన నొప్పి నుండి తీవ్రంగా ఉండే నొప్పి. ఛాతి నొప్పి కల్గిన శరీర భాగాన్ని నొక్కనట్లైతే నొప్పి మరింత ఎక్కువవుతుంది.
  • కత్తిపోటులాంటి నొప్పి: ఒక కత్తి మీ శరీరంలోకి దిగబడితే నొప్పి ఎంత హింసాత్మకంగా భరించలేనిదిగా ఉంటుందో అంత తీవ్రమైందిగా ఉంటుందీ  ‘కత్తిపోటువంటి ఛాతి నొప్పి’. ఇది అధిక తీవ్రత మరియు భరించలేనిధిగా ఉంటుంది.
  • బోరింగ్ నొప్పి-ఛాతిలోని లోతైన భాగాలలో సూదులతో పొడిచినట్లు భయంకర అనుభూతిని కల్గించే నొప్పినే బోరింగ్ నొప్పిగా వ్యవహరిస్తారు.
  • సలిపే నొప్పి-కొట్టినట్లుండే చాతి నొప్పి లేదా ఛాతి యొక్క నాడీవ్యవస్థలో సలుపుతున్నట్లుంటే దాన్నే ‘సలిపే ఛాతి నొప్పి’ లేదా  ‘త్రోబింగ్ నొప్పి’ అని పిలుస్తారు.
  • మండుతున్నట్లుండే ఛాతి నొప్పి-బాధిత ఛాతి భాగంలో మండుతున్నట్లు నొప్పి కల్గితే  దాన్నే మండే ఛాతి నొప్పి (బర్నింగ్ పెయిన్) అని వ్యవహరిస్తారు.
  • సూదులతో పొడిచినట్లుండే నొప్పిని ‘టింగ్లింగ’ పెయిన్’ లేదా సూదులతో గుచ్చినట్లున్న నొప్పి లేదా సూదితో కుట్టినట్లున్న నొప్పి అని భావించబడింది.
  • ఒత్తిడి నొప్పి-మీ శరీరం యొక్క బాధిత భాగం, అంటే ఛాతీ భాగంలో, నొప్పితో పాటు బిగుతుగా పట్టేసినట్లున్న భావన కానీ, లేదా ఛాతీ అంతటా నొప్పి అనిపిస్తే దాన్నే ఒత్తిడి నొప్పి లేదా సంపూర్ణనొప్పి అని పిలువబడుతుంది.

స్థానం ఆధారంగా

ఛాతీ ప్రాంతాన్ని ఎడమ, కుడి, మరియు మధ్యభాగాలుగా విభజించవచ్చు. నొప్పి ఈ ప్రాంతాల్లో ఎక్కడైనా రాగలదు.

వ్యాపిస్తున్న ఛాతీ నొప్పి: ఛాతీ నుండి మెడ, దవడ లేదా భుజం వంటి ఇతర భాగాలకు వ్యాపిస్తుంది ఈ రకం ఛాతీ నొప్పి.

వ్యవధి ఆధారంగా

  • తీవ్రమైన నొప్పి కొద్దీ వ్యవధిలోనే ఛాతీలో ఆకస్మికంగా రావడం, ఇలాంటి  ఆకస్మికం తీవ్ర నొప్పికి అత్యవసర వైద్య సాయం అవసరం.
  • మీరు దీర్ఘకాలిక నొప్పిని, అంటే 3 నెలల కన్నా ఎక్కువ కాలం, నిరంతరం లేదా అప్పుడప్పుడూ ఎదుర్కొంటున్నప్పుడు.
  • పునరావృత ఛాతీనొప్పి (లేదా ఎపిసోడిక్ నొప్పి): అప్పుడప్పుడు ప్రతిసారి నొప్పి అనుభవించినప్పుడు. ఇలా అప్పుడప్పుడు వచ్చే రెండు వరుస ఛాతీ నొప్పి ఎపిసోడ్ల మధ్య సమయం ఓ నిర్దిష్ట క్రమంగా లేదా క్రమరహితంగా ఉండవచ్చు. ఇలా వచ్చే ఛాతీ నొప్పి ఎపిసోడ్ల మధ్యకాలంలో ఆ వ్యక్తికి ఎలాంటి బాధ ఉండదు.
  • విచ్చిన్నకర ఛాతీ నొప్పి: ఓ సుదీర్ఘమైన కాలం పాటు నిస్తేజమైన ఛాతీ నొప్పిని అనుభవించినప్పుడు, అది ఆకస్మికంగా వస్తుండి, పదునైన నొప్పిగా  ఉంటుంది. ఒకిన్ని కాల వ్యవధుల్లో ఆకష్మికంగా తీవ్రమైన ఛాతీ నొప్పి గుంపులు గుంపులుగా వస్తే దాన్నే ‘విచ్చిన్నకర ఛాతీ నొప్పి’ గా పిలుస్తారు.

హాని ఆధారితంగా ఛాతీ నొప్పి

  • నోసిసెప్టివ్ నొప్పి
    ‘నోసిసెప్టివ్’ ఛాతీనొప్పి: అంతర్గత కండరకణజాలంలో జరిగే హాని కారణంగా ఛాతీలో  కలిగే నొప్పి ఇది. ఛాతీ యొక్క ఉపరితల కణజాలం అయిన చర్మం, దాని అంతర్గత భాగాల్లో హాని జరిగినప్పుడు కలిగే ఛాతీ నొప్పి, దీనినే “శారీరక నొప్పి” అని కూడా  పిలుస్తారు. ఛాతీ అంతర్గత అవయవాలైన ఊపిరితిత్తులలో, పిత్తాశయము, క్లోమము, గుండె వంటి వాటిలో హాని సంభవించినప్పుడు దాన్ని “విస్సురల్ పెయిన్” లేదా “అంతరాంగ ఛాతీ నొప్పి” గా పిలువబడుతుంది.

  • నరాలసంబంధ నొప్పి
    ఛాతీ ప్రాంతానికి రక్తం సరఫరా చేసే నరంలో హాని సంభవించినప్పుడు కలిగే  ఛాతీ నొప్పిని “నరాలకు సంబంధించిన ఛాతీ నొప్పి” అంటారు.

  • మనోవ్యాధిజనిత ఛాతీనొప్పి
    మీరు తీవ్ర ఒత్తిడికి గురైనప్పుడు లేదా భావోద్వేగ సమస్యలను ఎదుర్కొంటున్నప్పుడు, ఛాతీ ప్రాంతంలో తరచుగా నొప్పి వస్తూ ఉంటుంది. ఈ నొప్పి సాధారణంగా ఆందోళన మరియు తీవ్ర భయాందోళనలకు సంబంధించినది. ఇది మానసిక నొప్పిగా లేదా ‘సైకోజెనిక్ పెయిన్’ గా పిలువబడుతుంది.

  • మస్క్యులోస్కెలెటల్
    ఛాతీప్రాంతంలోని ఎముకలు మరియు కండరాలు దెబ్బతిన్నపుడు లేదా ఒక ప్రక్కటెముక విరిగిపోయినప్పుడు కలిగే ఛాతీ నొప్పినే ‘కండరాలు-ఎముకలకు సంబంధించిన’ ఛాతీ నొప్పి (మస్క్యులోస్కెలెటల్ పెయిన్) గా  చెప్పబడుతుంది.

ఛాతి నొప్పి అంటే ఏమిటి? 

మీ మెడ నుండి (కడుపుకు దిగువనున్న) పక్కటెముకల మధ్యలో ఉన్న ఏభాగంలో నొప్పి వచ్చినా దాన్ని ‘ఛాతీ నొప్పి’ అని పిలుస్తారు. ఈ నొప్పి ఛాతిలో సంపూర్ణంగా ఉండచ్చు.  ఇంకా, ఛాతీలో బిగుతుగా, పిండేసినట్లు, మండుతున్నట్లు లేదా ఛాతీలో ఒత్తిడితో కూడిన సంచలనం కూడా కావచ్చు. ఊపిరాడక పోవడం, అలసట, చెమట, వికారంజ్వరం, చలి వంటి అనేక లక్షణాలు ఛాతి నొప్పితో ముడిపడి ఉంటాయి. కొన్ని తీవ్రమైన సందర్భాల్లో  ఛాతీ నొప్పికి సంబంధించిన అనేక లక్షణాలు మరణానికి కూడా దారి తీస్తాయి. ఛాతీ నొప్పికి అనేక కారణాలు ఉంటాయి. కానీ వైద్యుడు మాత్రమే మీ ఛాతి నొప్పికి ఖచ్చితమైన కారణమేంటో చెప్పగలడు.

ఛాతి నొప్పి యొక్క లక్షణాలు 

మేము పైన చెప్పినట్లుగా, మీరు అనుభవించే ఛాతీ నొప్పి వివిధ రకాలుగా ఉంటుంది. ఛాతీ నొప్పితో పాటు, మీరు క్రింది లక్షణాలను కూడా అనుభవించవచ్చు:

  • ఛాతీ ప్రాంతంలో బిర్రబిగుసుతనం (బిగుసుతనం) లేదా పట్టేసినట్లున్నఅనుభూతి.
  • ఛాతీ లో పూర్తిగా భారం అనిపించడం
  • నొప్పి మెడ, దవడ లేదా భుజం ప్రాంతాలకు వ్యాపించడం 
  • ఛాతీ ప్రాంతంలో ఒత్తిడి భావన
  • పెరిగిన హృదయ స్పందన లేదా పెరిగిన గుండె లయల రేటు
  • భుజం నొప్పి
  • వ్యత్యాసమైన హృదయ స్పందన: ఈ స్థితిలో గుండె  వేగంగా, గట్టిగా, మరియు అక్రమపద్ధతిలో కొట్టుకుంటుంది.
  • వికారం
  • వాంతులు
  • జ్వరం (ఫీవర్) లేదా చలి
  • పసుపు-ఆకుపచ్చ కఫం లేదా శ్లేష్మంతో దగ్గు
  • ఊపిరి ఆడని స్థితి
  • తక్కువ (లో బ్లడ్ ప్రెషర్)  లేదా అధిక రక్తపోటు
  • చమటోడడం (డయపోరేసిస్) అనేది అమితంగా చమటలు పట్టడం. ఛాతీలో నొప్పి కారణంగానే ఇళ్ల ఎక్కువగా చమటలు పడతాయి.  
  • తలనొప్పి కూడా అనుభవించవచ్చు. కొన్ని సందర్భాల్లో, ఛాతీ నొప్పి కల్గిన వ్యక్తి తెలివి తప్పి పడిపోవచ్చు (స్పృహ తప్పటం) .
  • సుస్తీ లేదా అలసట. అలసట వల్ల ఎలాంటి పని చేయలేక పోతారు.

డాక్టర్ని ఎప్పుడు చూడాలి?

మీరు క్రింది వ్యాధి లక్షణాలలో ఏదైనా సరే అనుభవించినట్లయితే, తక్షణమే వెళ్ళి డాక్టర్ని చూడండి. మీ పరిస్థితి తీవ్రంగా ఉంటే, మీ కుటుంబ సభ్యుల్లో లేదా స్నేహితుడికి చెప్పండి డాక్టర్ వద్దకు మిమ్మల్ని వెంటనే తీసుకెళ్లమని లేదా డాక్టర్ కు ఫోన్ చేసి వెంటనే పిలవమని చెప్పండి.

  • ఛాతీలో బిగుతు లేదా పట్టేస్తున్నట్లు అనిపించే తీవ్రమైన నొప్పి.
  • నొప్పి మీ మెడ, దవడ లేదా ఎడమ చేతికి వ్యాపిస్తుంది.
  • శ్వాసలో సమస్యలు లేక ఊపిరాడక పోవడం.
  • హఠాత్తుగా వచ్చే ఛాతీనొప్పి తీవ్రమైనదిగా ఉండచ్చు. మరియు మీ వైద్యుడు గతంలో సూచించిన ఔషధాలను తీసుకున్న తర్వాత కూడా ఛాతీ నొప్పి తగ్గకపోవడం జరగొచ్చు.
  • మైకము, ఆందోళన, విపరీతంగా చెమట పట్టడం, గందరగోళం మొదలైనవి.
  • నిరంతరంగా కొనసాగే ఛాతీ నొప్పి, తగ్గనే తగ్గకపోవడం జరిగినప్పుడు.
  • పడుకున్నా, ముందుకు వంగినా కూడా ఉపశమనం పొందని ఛాతీ నొప్పి.
  • చాలా తక్కువ రక్తపోటు లేదా అధిక రక్తపోటు.
  • చలి పట్టడం లేదా జ్వరం, దగ్గినపుడు పసుపు-ఆకుపచ్చ రంగుల్లో శ్లేష్మం పడటం.

ఛాతి నొప్పి యొక్క కారణాలు

ఎందుకు ఛాతీ నొప్పి జరుగుతుంది?

ఛాతీ ప్రాంతంలో ఊపిరితిత్తులు, గుండె, క్లోమం (పాంక్రియాస్), కడుపు, పిత్తాశయం, ఎముకలు, కండరాలు, నరములు మొదలైన అనేక అవయవ నిర్మాణాలు ఉన్నాయి. అందువల్ల ఛాతీ నొప్పి అనేది అంతర్గత పరిస్థితికి సంబంధించింది. పైన పేర్కొన్న అవయవాలకు ఏదైనా హాని, గాయము, సంక్రమణం, వాటిల్లో కణితి (గడ్డ) ఏర్పడినా లేదా ఇతరత్రా ఎలాంటి అసాధారణ మార్పులేర్పడ్డా కూడా ఛాతీనొప్పి రావచ్చు.

గుండె సమస్యలు

“ఆంజినా” అనే పదం ఛాతీలో వచ్చే పిండేసినట్లుండే నొప్పిని లేదా తీవ్ర ఒత్తిడితో కూడిన నొప్పిని నిర్వచించడానికి ఉపయోగించేది. అంతర్లీన గుండె సమస్యల కారణంగానే ఈవిధంగా ఛాతీలో నొప్పి సంభవిస్తుంది. ఆంజినా మరియు గుండెపోటు అనేవి రెండు వేర్వేరు విషయాలు. ఆంజినా సంభవిస్తే అది గుండె జబ్బు యొక్క సంకేతం, అయితే, గుండెపోటు (మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్) అనేది తీవ్రమైన వ్యాధి, దీనికి అత్యవసర చికిత్స చేయకపోతే కూడా ప్రాణాంతకం కావచ్చు అంటే మనిషి వెంటనే చనిపొయ్యే ప్రమాదముంది.

  • వాపు (ఇన్ఫ్లమేషన్)
    వాపు పరిస్థితిలో శరీరం యొక్క ఏదైనా భాగం లేదా అవయవం ద్రవంతో చేరి ఊడుకుపోవడం, అలాగే రోగనిరోధక వ్యవస్థ కణాలు లేదా విదేశీ శరీర విషపదార్ధాల కారణంగా వాపులేర్పడ్డం. హృదయాన్ని చుట్టుముట్టి ఉండే తిత్తిలో కూడా వాపు సంభవించవచ్చు. దీన్నే గుండె నంజు లేదా  “పెరికార్డిటిస్” అని పిలుస్తారు, ఇది ఛాతీలో పదునైన నొప్పిని కలిగిస్తుంది. ఈ నొప్పి మెడ లేదా భుజం కండరాలకు వ్యాప్తి చెందే అవకాశం ఉంది.

  • అంటురోగం (ఇన్ఫెక్షన్)
    కొంతమందిలో, అంటుకొనే బ్యాక్టీరియా క్రిములు గుండె కండరాలకు అంటుకుని అంటువ్యాధికి దారి తీయచ్చు. అటువంటివాటిల్లో ఒకటే ఈ గుండె ‘కండరాల క్రిమిదోష అంటువ్యాధి’ లేదా ‘అక్యూట్ బాక్టీరియల్ ఎండోకార్డిటిస్”. మీరు శ్వాస పీల్చినా, తుమ్మినా లేదా దగ్గినా ఛాతీ నొప్పికి కారణమవుతుంది.

  • ప్రతిష్టంభన (అడ్డంకులు) 
    రక్తంలో కొవ్వు (కొలెస్ట్రాల్)  స్థాయిన ఎక్కువగా ఉంటే, గుండెకు రక్తము సరఫరా చేసే హృదయ ధమనుల గోడలపై కొవ్వు పేరుకుపోతుంది. అలా ధమనుల్లో కొవ్వు పెరిగి పెరిగి గుండెకు రక్త సరఫరాను అడ్డుకోవటానికి దారి తీస్తుంది. ఇది “హృద్దామని వ్యాధి’ లేదా  “కొరోనరీ ఆర్టరీ” వ్యాధి గా పిలువబడుతుంది. ఈ వ్యాధిలో, ఛాతీ నొప్పి సంభవిస్తుంది. ఎందుకంటే మీ గుండె కండరాలకు ఆక్సిజన్ లభ్యత తగ్గిపోతుంది తద్వారా గుండె నొప్పికి కారణమవుతుంది. ఆ నొప్పి ఛాతీ లో ఒక కష్టతర పరిస్థితిని  అంటే ఒత్తిడితో కూడిన సంచలనాన్ని కలిగిస్తుంది. ఈ ఛాతీ నొప్పి మెడ, దవడ, భుజం, లేదా చేతికి కూడా పాకుతుంటూ ఉంటుంది.(మరింత సమాచారం: అధిక కొలెస్ట్రాల్)

  • హృదయ కండరాలకు హాని
    గుండె కండరాలకు తగినంత ఆక్సిజన్ సరఫరా కాకపోతే, ఇది గుండె కండరాలహానికి  దారితీస్తుంది. ఇది జరిగినప్పుడు, ఆంజినా దశలో కలిగే నొప్పికి సమానమైన నొప్పి ఛాతీ మధ్యలో లేదా ఛాతీకి ఎడమ వైపున గాని సంభవిస్తుంది. ఇది ఆంజినా నొప్పి కంటే తీక్షణంగా ఉండి తీవ్రంగా పిండేస్తున్నట్టు లేదా అది మేస్తున్నట్టు ఉంటుంది.

  • జన్యుపరమైన రుగ్మత
    కొన్ని జన్యుపరమైన అవ్యవస్థల్లో గుండె యొక్క ఒక భాగంలో కండరాలు చాలా మందంగా మారవచ్చు. ఇది వ్యాయామం చేసేటపుడు లేదా తీవ్ర శారీరక శ్రమ కల్గిన  సమయంలో ఛాతీలో నొప్పికి కారణమౌతుంది. అంటే గాక ఊపిరాడక పోయే పరిస్థితిని కలుగజేస్తుంది. అలా గుండె కండరాల మందం అట్లే పెరుగుతూ పోతే గుండెకు రక్తం సరఫరాలో అంతరాయమేర్పడి గుండె పని చేయటం కష్టం అవుతుంది. ఫలితంగా, తరువాతి దశలలో, మైకము కమ్మడం, అలసట, మూర్ఛ మొదలైనవాటిని ఎదుర్కోవచ్చు. తీవ్రమైన సందర్భాల్లో, గుండెపోటు కూడా రావచ్చు.

  • హృదయ నిర్మాణాలు పనిచేయకపోవడం
    కొన్నిసార్లు, గుండె యొక్క ఒకటి లేదా అంతకంటే ఎక్కువ నిర్మాణాలు సరిగ్గా పని చేయకపోవచ్చు. ఉదాహరణకు, మన గుండెకు ఎగువ మరియు దిగువ గదుల మధ్య రక్తాన్నిసరఫరా చేసే ప్రధాన రక్తనాళాల మధ్య కూడా కవాటాలు ఉన్నాయి. ఈ కవాటాలు రక్తం యొక్క అక్రమ ప్రవాహాన్న నిరోదించి రక్తం ఒక దిశలోనే  ప్రవహిస్తుంచేందుకు సహాయ పడతాయి. ద్విపత్ర కవాట భ్రంశం లాగా ఒక కవాటం (వాల్వ్) పనిచేయకపోతే, అది పూర్తిగా మూసివేయదు, రక్తం సరఫరా చేయడానికి గుండె గదిలో తగినంత ఒత్తిడి ఉండదు. ఈ కావాలట భ్రంశం (ప్రోలప్స్) తేలికపాటిదిగా ఉంటే, వ్యాధి ఏ లక్షణాలను చూపించకపోవచ్చు. తీవ్రమైన కేసుల్లో వ్యక్తి ఛాతి నొప్పిని అనుభవిస్తాడు, ఇది ఇతర లక్షణాలైనటువంటి తీవ్ర హృదయ కంపనం, తలతిప్పడం, కళ్ళు తిరగడాలతో ముడిపడి ఉంటుంది.

  • ధమని చినుగు
    కొన్ని సందర్భాల్లో, గుండె యొక్క ఒక ధమని (హృదయ ధమని) గోడ చినగొచ్చు.  దీన్నే’హృదయ ధమని ఛేదనం’ లేదా “కొరోనరీ ఆర్టరీ డిసెక్షన్” అని పిలుస్తారు. బృహద్ధమని లేదా అవోర్తా-గుండె నుండి రక్తాన్ని శరీరానికి సరఫరా చేసే ప్రధాన రక్తనాళం. దీన్నే “బృహద్ధమని ఛేదనం” అంటారు. ఇది ఛాతీ కుహరంలో రక్తాన్ని నింపడానికి దారితీస్తుంది. ఈ రక్తస్రావం మరింత ఎక్కువవడంతో ఛాతీలో ఆకస్మికమైన తీవ్రనొప్పి ఏర్పడుతుంది. ఈ నొప్పి మెడ, మీద వెనుక లేదా ఉదరం (ఎముకలు మరియు పొత్తికడుపు మధ్య ప్రాంతం) లోకి కూడా తీక్షణంగా పాకుతుంది.

ఊపిరితిత్తుల సమస్యలు

  • వాపు 
    మన ఊపిరితిత్తులను కప్పే కండర పొరను ‘ప్లుయెరా’ (pleura)  అంటారు ‘ప్లుయెరా’లో ఏదైనా మంట పుట్టిందంటే అది కాస్త “పువురైటిస్’ అని పిలువబడే  వాపుకు దారి తీయవచ్చు. ఈ ప్లుయెరా కండర పొరకు సంబంధించిన నొప్పి ఛాతీలో తీక్షణమైన నొప్పికి దారి తీస్తుంది. ఈ ఛాతీ నొప్పి  శ్వాసిస్తున్నపుడు, దగ్గుతున్నపుడు లేదా తుమ్ముతున్నపుడు వస్తుంటుంది.

  • ఇన్ఫెక్షన్
    కొన్నిసార్లు, మన ఊపిరితిత్తుల బ్యాక్టీరియా లేదా వైరస్ క్రిముల బారిన పడవచ్చు. ఇటువంటి పరిస్థితులలో మీరు ఛాతీ నొప్పిని అనుభవించవచ్చు, ఇది ప్లుయెరా కండర పొరకు సంబంధించిన నొప్పిని పోలి ఉంటుంది మరియు తుమ్మినపుడు, దగ్గినపుడు లేదా శ్వాసిస్తున్నపుడు ఛాతీలో రావడం జరుగుతుంది. న్యుమోనియాలో, ఛాతీ నొప్పి నిస్తేజంగా (dull) ఉంటుంది. ఈ ఛాతీ నొప్పి జ్వరం, దగ్గు, చలి వంటి ఇతర లక్షణాలతో సంబంధం కలిగి ఉంటుంది. కొన్నిసార్లు, దగ్గినప్పుడు శ్లేష్మంతో పాటుగా చీము కూడా వస్తుంది. .

  • రక్తం గడ్డకట్టడం లేదా అడ్డుపడటం
    గడ్డకట్టిన రక్తం రక్తప్రవాహంలో ప్రవహించి ఊపిరితిత్తుల వరకు ప్రయాణించవచ్చు మరియు ఊపిరితిత్తులలోనే నిలిచిపోవచ్చు. ఈ రక్తం గడ్డకట్టడం అనేది పువురైటిస్’  లో లాగా కనిపించే తీవ్రమైన, పదునైన నొప్పికి దారి తీస్తుంది మరియు దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు మరియు శ్వాసిస్తున్నపుడు ఈ నొప్పి వస్తుంటుంది. ఈ ఛాతీ నొప్పి  కూడా జ్వరాన్ని కలిగించవచ్చు. తీవ్ర సందర్భాల్లో, వ్యక్తి షాక్ స్థితిని ఎదుర్కొంటాడు. ప్రాణాంతకమైన ప్రమాదకరమైన పరిస్థితి ఇది. ఈస్థితిలో తగినంత ప్రాణవాయువు శరీరానికి సరఫరా చేయబడక పోవడంతో వివిధ అవయవాలకు హాని కలగొచ్చు. రక్తం గడ్డ కట్టడం అనేది గడ్డను తొలగించేందుకు చేసే శస్త్రచికిత్స తర్వాత, లేదా లోతైన సిరలో రక్తం గడ్డకట్టడం వల్ల సంభవిస్తుంది.

  • గాయం
    ప్రమాదవశాత్తు గాయం లేదా ఛాతీకి అకస్మాత్తుగా దెబ్బ తగిలినప్పుడు, ఛాతీ కుహరంలోకి గాలి చేరుతుంది. ఈ పరిస్థితినే “న్యుమోథొరాక్స్” అంటారు. ఇది ఆకస్మిక మరియు పదునైన నొప్పిని కలిగిస్తుంది, ఈ ఛాతీ నొప్పి తరచుగా తక్కువ రక్తపోటుతో సంబంధం కలిగి ఉంటుంది.

  • అధిక రక్తపోటు
    గుండె యొక్క కుడి వైపుభాగం ఊపిరితిత్తుల నుండి రక్తం సరఫరాని పొందుతుంది. అందువల్ల, ఊపిరితిత్తుల ధమనులలో అధిక రక్తపోటు మూలంగా గుండె కుడి వైపున పనిలో ఒత్తిడి పెరుగుతుంది. దీన్నే ‘పల్మోనరీ హైపర్వెంటిలేషన్’ అంటారు. ఈ పరిస్థితిలో అనుభవించిన ఛాతీ నొప్పి ఆంజినానొప్పికి సమానంగా ఉంటుంది.

  • వ్యాధి లేదా అలెర్జీ
    మీరు ఉబ్బసం వంటి వాయుమార్గ వ్యవస్థలో వ్యాధి లేదా అలెర్జీ ఉన్నట్లయితే మీరు ఛాతీ నొప్పిని కూడా అనుభవించవచ్చు. ఈ నొప్పి తరచుగా గుర్రుగుర్రుమని శ్వాసలో శబ్దం చేయడం, శ్వాస తీసుకోలేకపోవడం, ఆస్తమాగురక మరియు శ్వాసక్రియలో అసౌకర్యం వంటి లక్షణాలని కలిగి ఉంటుంది.

జీర్ణ వ్యవస్థ యొక్క సమస్యలు

  • పుండ్లు (పూతలు)
    కడుపు గోడల పొరల్లో పుళ్ళు గనుక ఉంటే వాటినే ‘కడుపు పూతలు’ అని పిలుస్తారు. ఈ పుండ్ల కారణంగానే ఛాతీ ప్రాంతంలో నొప్పి మరియు తీవ్ర అసౌకర్యం ఎదుర్కొంటారు. నొప్పి తరచుగా తీవ్రమైందిగా ఉండి మంటతో కూడుకొని ఉంటుంది.

  • గ్యాస్ట్రోఎసోఫాగియల్ రిఫ్లక్స్ వ్యాధి
    మీ కడుపులోనికి చేరిన ఆహారం తిరిగి అన్నవాహిక లోకి ఆమ్లంతో కలిసి  ప్రవహించినట్లైతే తొందర కల్గుతుంది, ఈ తొందరనే “గ్యాస్ట్రోఎసోఫాగియల్ రెఫ్లక్స్” వ్యాధి (GERD) అని పిలుస్తారు. ఇలా కడుపులోని ఆమ్లాలు అన్నవాహికలోకి ప్రవేశించినపుడు ఛాతీ దిగువన కేంద్ర ప్రాంతంలో కడుపు నొప్పి, మంట,  గుండె మంటను కలుగజేస్థాయి.

  • అన్నవాహిక (ఎసోఫాగస్) సమస్య
    అన్నవాహిక (ఎసోఫాగస్) కండరాలలో సమస్య అన్నవాహిక (ఎసోఫాగస్) యొక్క కండరాలు ఏకకాలంలో సంకోచించకపోతే లేదా ఎక్కువగా సంకోచించినా ఛాతీ మధ్యలో నొప్పిని కలిగిస్తుంది. ఈ ఛాతీ నొప్పి సాధారణంగా ఆహారాన్ని తింటున్నప్పుడు ఆహారం గొంతులో దిగుతున్నపుడు మంట పుట్టి నొప్పి ఏర్పడుతుంది.

  • వాపు
    మీ క్లోమము లేదా పిత్తాశయం వాపు కలిగి ఉంటే, అది చాలా ఛాతీ నొప్పిని కలిగిస్తుంది. క్లోమానికి సంబంధించిన నొప్పి అయితే చాతీకి ఎడమ వైపున నొప్పిస్తుంది. పిత్తాశయానికి సంబంధించినదైతే నొప్పి కుడి వైపున ఉంటుంది. ఇది ఛాతీ మధ్యలో కూడా నొప్పి వస్తుంది మరియు అదే శరీరం యొక్క ఇతర ప్రాంతాలకు కూడా వ్యాపించవచ్చు. నొప్పి పదునైనదిగాను మరియు తీవ్రమైనదిగాఉంటుంది. ముందుకు వంగడం ద్వారా క్లోమం నొప్పి నుంచి శమనం (రిలీఫ్) పొందవచ్చు. .

  • హైపర్సెన్సిటివిటీ/అతిసున్నితత్వం
    కొన్నిసార్లు, అన్నవాహిక (ఎసోఫ్యాగస్) పై ఒత్తిడి లేదా ఆమ్ల (పులుపు) పదార్థాలు తాకిడి కాస్త ఎక్కువైనా అన్నవాహిక అతిసున్నితత్వంతో బాధాకరంగా మారవచ్చు. ఇలాంటి పరిస్థితినే అన్నవాహిక అతిసున్నితత్వం లేదా ఎసోఫాగియల్ హైపర్సెన్సిటివిటీ అని పిలుస్తారు.

  • అన్నవాహికలో పగుళ్లు  
    తీవ్రమైన వాంతుల సందర్భాల్లో లేదా ఏదైనా ఆపరేషన్ (శస్త్రచికిత్స) చేయించుకున్న తర్వాత, అన్నవాహిక ఛిద్రం అవచ్చు. అంటే పగలవచ్చు. ఇది ఛాతీ లో ఆకస్మికమైన మరియు పదునైన నొప్పికి కారణమవుతుంది.

  • హెర్నియా (వరిబీజం)  
    ఆహారం తిన్న తర్వాత పొట్ట తనకు తానుగా ఛాతీ దిగువ ప్రాంతంలోకి  నెట్టివేయబడుతుంది. ఈ పరిస్థితిని వివరించడానికే ‘హియాటల్ హెర్నియా’ పదాన్ని ఉపయోగించడమైనది. దీన్నే ‘వరిబీజం దిగబడింది లేదా బుడ్డ దిగింది అంటారు. ఈ పరిస్థితి కారణంగా, ఛాతీలో భారం, నొప్పి, తీవ్ర అసౌకర్యం కలగొచ్చు.

  • ఎపిగ్లోటిటీస్
    ఇది చాలా అత్యవసర పరిస్థితి. మీ బేబీ యొక్క శ్వాసనాళికకు అంతరాయం లేదా అడ్డు ఏర్పడడం. ఇలాంటి ప్రమాదకర పరిస్థితిలో శిశువు శ్వాస పీల్చలేకపోవడం, అధిక జ్వరం, ఛాతీ నొప్పి, చాలా విపరీతంగా గొంతు నొప్పి వంటి లక్షణాలుంటాయి ఈ లక్షణాలన్నీ మింగడంలో కష్టపడటానికి కూడా కారణం కావచ్చు.

అస్థిపంజర కండర (మస్క్యులోస్కెలెటల్) సమస్యలు

అస్థిపంజరం పక్కటెముకలలోని కండరాల్లో బెణుకు సంభవించినా లేదా పక్కటెముకలు విరిగినా ఛాతీ నొప్పి కలుగుతుంది. ఈ రకం నొప్పి పదునైనదిగా, తీవ్రమైనదిగా ఉంటుంది. మరియు నొప్పి గాయం లేదా ఎముక విరిగిన ప్రాంతంలోనే ఎక్కువగా ఉంటుంది. .

ఛాతీ గోడల నొప్పి లేదా ‘కోస్టోకోండ్రిటిస్’ పరిస్థితి ఎలాంటిదంటే ఛాతీ ఎముకలను కలుపుతున్న కణజాలానికి వాపు ఏర్పడినపుడు అది తీవ్ర ఛాతీ నొప్పికి కారణమవుతుంది. ఛాతీ గోడల నొప్పి లేదా కోస్టోకోండ్రిటిస్ అనేది శిశువులలో సంభవిస్తుంది. ఈ నొప్పి పొడి దగ్గుతో కలిపి వస్తూ ఉంటుంది.

నరాల సమస్యలు

ఛాతీలోని నరాలకు గాయం లేదా అంటువ్యాధి సోకినపుడు వెన్నెముక ప్రాంతంలో గాని, రొమ్ము లేదా ఛాతీపై దద్దుర్లు (షింగిల్స్) ఏర్పడి ఛాతీలో నొప్పి రావడం సాధారణం. . ఛాతీపై దద్దుర్లు (షింగిల్స్గు) విషయంలో వరిసెల్లా-జోస్టర్ వైరస్ ద్వారా సంక్రమణం కారణంగా నరాలతో సంభవిస్తుంది. ఇది ఛాతీ, భుజం, మరియు వెనక భాగంలో తీవ్ర నొప్పిని కలిగిస్తుంది. తరచుగా నరాల పక్కన ప్రాంతంలో ఈ దద్దుర్లు (rashes) ఏర్పడుతుంటాయి.

ప్రమాద కారకాలు

క్రిందిచ్చిన కొన్ని కారకాలు ఛాతీ నొప్పికి లోనయ్యేలా చేస్తాయి.

  • ధూమపానం.
  • అధిక సురాపానం (సారాయి/ఆల్కహాల్ తీసుకోవడం).
  • ఊబకాయం (అధిక బరువు)
  • రోగనిరోధక వ్యవస్థలో లోపాలు కారణంగా అంటురోగాల భారిన పడేలా చేస్తుంది.
  • రక్తంలోని సిరలలో ఉండే అధిక కొవ్వు (కొలెస్ట్రాల్) కారణంగా హృదయ ధమని నిరోధకత (coronary artery blockage) ప్రమాదాన్ని పెంచుతుంది.
  • అధిక రక్తపోటు మన గుండె మీద మరింత శ్రమను పెంచుతుంది.
  • శారీరక శ్రమ ఏమాత్రం లేకపోవడం లేక శారీరక శ్రమ తగినంత లేకపోవడం వల్ల గుండెపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. శారీరక శ్రమ లేకపోవడం అనేది మొత్తం శరీరానికే ప్రతికూల ప్రభావం కలుగజేస్తుంది.
  • అనారోగ్యకరమైన చిరు తిండ్లు (‘జంక్ ఫుడ్’) తినడం మూలాన గుండె సమస్యలు  మరియు జీర్ణ వ్యవస్థకు సంబంధించిన సమస్యలను కలుగజేస్తాయి.


08/06/16
ఉద్ధియాన బంధనం చేయు విధానం మరియు ఉపయోగాలు…

ఉద్ధియాన బంధనం:  
1. సుఖాసనంలో కూర్చొని చేతులను కాళ్ళపై ఉంచుము.  

2. శ్వాసనంతటిని బయటికి వదలి పొట్టను లోనికి తీసుకోవాలి.  

3. శక్తినంతటిని పొట్టదగ్గరికి తీసుకుని వచ్చి పొట్ట ముందుకు వెనుకకు కదిలించాలి.  

4. చేయగలిగినంత సేపు చేసి శ్వాసను తీసుకొనుము.  

ఉపయోగం:  
- పొత్తికడుపులోని క్రొవ్వు కరిగి పొట్టతగ్గును.  

- జఠరాగ్ని పెరుగుతుంది. గ్యాస్ట్రిక్, అజీర్తి, మలబద్ధకం తొలగును.  

- ప్రేవులు శుద్ధి అవుతాయి.  

- ఋతుక్రమము సక్రమమగును. గర్భాశయ సమస్యలు తొలగును.  

- వెన్ను నొప్పి తొలగును.

ఛాతి నొప్పి యొక్క నివారణ 

జన్యుపరమైన లేదా అలెర్జీపరమైన కారణాలు మినహాయిస్తే ఛాతీ నొప్పిని కలుగజేసే మిగతా చాలా కారణాలను నివారించవచ్చు.

ఛాతీ నొప్పి నివారణకు తీసుకోవాల్సిన చర్యల జాబితా కింది విధంగా ఉంది:

  • వ్యక్తిగత పరిశుభ్రతను కాపాడుకోండి
    మీరు వ్యక్తిగత పరిశుభ్రతను సమర్థవంతంగా నిర్వహించినప్పుడు, న్యుమోనియా, క్షయవ్యాధి మొదలైన అనేక వ్యాధులను నిరోధించవచ్చు.

  • ఆరోగ్యకరమైన సమతుల్య ఆహారాన్ని తీసుకోండి.
    ఆరోగ్యకరమైన శరీరం కల్గి ఉండాలంటే సరైన ఆహారం తినాలి మనం. బలమైన రోగనిరోధకత కేవలం ఒక రోజులోనే నిర్మించబడదు. ముఖ్యమైన నూనెలు, విటమిన్లు, ఖనిజాలు, కార్బోహైడ్రేట్లు మరియు ప్రోటీన్లు వంటి అవసరమైన కీలకమైన పోషకాలను ఎల్లప్పుడూ తినడం ద్వారా ఆరోగ్యకరమైన శరీరం మనదవుతుంది. హృదయసంబంధమైన వ్యాధులు, అధిక రక్తపోటు, గుండె ధమనుల్లో అడ్డుకోవడం, రక్తం గడ్డ కట్టుకుపోవడం మొదలైన రక్తనాళాల వ్యాధులను నివారించడానికి తక్కువ-కొవ్వున్న ఆహారం తీసుకోవడం చాలా అవసరం.

  • మద్యం తీసుకోవడం పరిమితం చేయండి మరియు ధూమపానం ఆపండి
    ధూమపానం మానేసి సారాయి తాగడం పరిమితం చేసినట్లయితే అధిక రక్తపోటు, ఊపిరితిత్తుల, గుండె మరియు కాలేయ వ్యాధులను మరియు ధూమపానంతో సంబంధం ఉన్న క్యాన్సర్లను నిరోధిస్తుంది.

  • మీకొచ్చిన జబ్బు అంటువ్యాధి అని అనుమానించినట్లయితే ఇంట్లో పుష్కలమైన విశ్రాంతి తీసుకోండి
    ఔషధసేవనంతో పాటు ఇంటివద్ద విశ్రాంతి తీసుకుంటే, మీ శరీరంలోని జబ్బు  వేగంగా నయం అవుతుంది.

  • రోజూ వ్యాయామం చేయండి  
    నిత్య వ్యాయామం మీ రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది, మీ గుండె మరియు ఊపిరితిత్తులను ఆరోగ్యకరంగా ఉంచుతుంది, మరియు మీ రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తుంది. రోజూ శారీరక కసరత్తు చేయడం వల్ల వ్యాధులు నివారించబడడమే కాకుండా ఆవ్యాధులకు వ్యతిరేకంగా పోరాడేటందుకు శరీరానికి శక్తి కల్గుతుంది. .

  • ఆరోగ్యకరమైన శరీర బరువు ఉండేట్లు చూసుకోండి
    గుండె, జీర్ణ వ్యవస్థ, క్లోమం మరియు పిత్తాశయాలకు సంబంధించిన వ్యాధులను నివారించడంలో ఆరోగ్యకరమైన బరువు చాలా ముఖ్యం.  

  • ఏవైనా అసాధారణ ఆరోగ్య పరిస్థితులు లేదా వ్యాధులను దరి చేరనీయకుండా ఉండేందుకు ప్రతి 6 నెలలకు ఒక సాధారణ రక్త పరీక్షను చేయించుకోండి.

  • మీరు ఆరోగ్యవంతులని మరియు ఎలాంటి వ్యాధులు లేనివారని నిర్ధారించుకోవడానికి సంవత్సరంలో ఒకసారి పూర్తి శరీరాన్ని వైద్య పరీక్షల సాయంతో తనిఖీ చేయించుకోండి.

  • మీకు ఛాతీలో ఎలాంటి అసాధారణ లక్షణాలు లేక అసౌకర్యం కలిగినా డాక్టర్ కు చూపించండి.

ఛాతి నొప్పి యొక్క వ్యాధినిర్ధారణ 

మేము పైన చెప్పినట్లుగా, మీ ఛాతీనొప్పిని కేవలం ఓ డాక్టర్ మాత్రమే సరిగ్గా విశ్లేషించగలడు. అందువల్ల, మీ ఛాతీ నొప్పిని ఏమాత్రం విస్మరించకూడదని మేము కోరుతున్నాము. ఎందుకంటే మీ ఛాతీనొప్పి వెనుక చికిత్స అవసరమైన ఒక తీవ్రమైన వైద్య పరిస్థితి దాగి  ఉండటానికి అవకాశాలు ఉన్నాయి.

మీ ఛాతీ నొప్పి నిర్ధారణ అనేది మీపై జరిపే వైద్య పరిశోధనలు  లేదా డయాగ్నొస్టిక్ పరీక్షల కన్నా ఎక్కువగా వివరమైన మీ ఆరోగ్య చరిత్ర, భౌతిక పరీక్షల మీద ఆధారపడి ఉంటుంది. మీ ఛాతీ నొప్పి యొక్క నిర్ధారణ క్రింది దశలను కలిగి ఉంటుంది:

వైద్య చరిత్ర

మీ ఛాతీ నొప్పి యొక్క కారణాన్ని నిర్ధారించడంలో మీకున్న వైద్య చరిత్ర చాలా ముఖ్యమైన దశ అయినందున, మీ వైద్యుడు పలు ప్రశ్నలను అడుగుతాడు మరియు ఏవైనా రోగనిర్ధారణ పరీక్షకు సలహా ఇచ్చే ముందు మీ ఛాతీ ప్రాంతం యొక్క శారీరక పరీక్షను నిర్వహిస్తారు.

మీ ఛాతీ నొప్పి, మీ ఆరోగ్య స్థితి గురించి స్పష్టంగా తెలుసుకోవడానికి కింద తెలిపినటువంటి పలు ప్రశ్నల్ని వైద్యుడు మిమ్మల్ని అడగవచ్చు. :

  • మీ నొప్పిని వివరించండి?
  • నొప్పి ఎప్పుడు సంభవించింది?
  • ఛాతీలో ఏ ప్రాంతంలో మీకు నొప్పి వస్తోంది?
  • చాతీ నొప్పి ఎంతసేపు ఉంటుంది?
  • చాతీ నొప్పి మీ శరీరం యొక్క ఇతర భాగాలకు వ్యాపిస్తుందా?
  • శారీరక శ్రమ తర్వాత మీకు చాతీ నొప్పి వస్తోందా?
  • మీకు  జ్వరం, చలి, వాంతి వికారం, మైకము, చెమట, రక్తం లేదా చీముతో కూడిన దగ్గు, నోటిలో చేదు రుచి వంటి ఇతర లక్షణాలు ఉన్నాయా?
  • మీరు శ్వాసించినపుడు, దగ్గినప్పుడు లేదా తుమ్మినపుడు మీకు ఛాతీ నొప్పి వస్తోందా?
  • మీ ఛాతీ ప్రాంతాన్ని నొక్కినప్పుడు ఛాతీ నొప్పి మరింత తీవ్రంగా ఉందా?
  • ఆహారం తిన్నాక ఛాతీ నొప్పి ఎలా ఉంటుంది? ఖాళీ కడుపుతో ఉన్నపుడు ఛాతీ నొప్పి ఎలా ఉంటుంది?
  • మీ ఛాతీనొప్పి ఏవిధంగా తీవ్రమవుతుంది?
  • ఛాతీ నొప్పి వచ్చినపుడు ఔషధాలను తీసుకోవడం, విశ్రాంతి తీసుకోవడం, కింద పడుకోవడం వంటివి చేసినపుడు నొప్పిలో ఉపశమనం కల్గుతోందా?
  • మీకు ఛాతీ నొప్పి ఉన్న ప్రాంతంలో దద్దుర్లు ఏమైనా ఉన్నాయా?
  • మీరు ఇటీవల గాని లేదా గతంలో గాని గాయపడ్డారా?
  • మీరు అధిక రక్తపోటు, మధుమేహం, క్షయ, కాలేయ వ్యాధిపిత్తాశయ రాళ్లు, గుండె జబ్బులు, మూత్రపిండాల వ్యాధి, ఊపిరితిత్తుల వ్యాధి వంటి ఏవైనా జబ్బుల కారణంగా బాధపడుతున్నారా?
  • మీరు మీ ఛాతీ ప్రాంతంలో ఏదేని శస్త్రచికిత్స చేయించుకున్నారా?

శారీరక పరీక్ష

  • మీ వ్యాద్ధి యొక్క వివరణాత్మక చరిత్ర తీసుకున్న తర్వాత, మీ వైద్యుడు మీ శారీరక పరీక్షను ఈ క్రింది విధంగా నిర్వహిస్తారు:
  • ప్రాణాధార సంకేతాలు: ఒక వ్యక్తి యొక్క ముఖ్యమైన శరీర విధుల యొక్క స్థితిని సూచించే క్లినికల్ కొలతలు. వీటిలో గుండె లయల రేటు, నాడి రేటు లేదా పల్స్ రేటు, రక్తపోటు, శ్వాస రేటు మరియు శరీర ఉష్ణోగ్రత ఉన్నాయి.
  • మీ వైద్యుడు బృహద్ధమని విభజన (aortic dissection) కు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ఉండేందుకు మీ రెండు చేతుల్లో రక్తపోటుని కొలుస్తారు.
  • మీ గుండె మరియు శ్వాస శబ్దాలను కూడా స్టెతస్కోప్ ఉపయోగించి మీ డాక్టర్ తనిఖీ చేస్టారు.
  • దీని తరువాత మీ ఛాతీ చర్మంపై దద్దుర్లు, గాయం లేదా బాధకారకాలైన మరేవైనా గాయాలు, నొప్పి లేదా ‘ఫట్’ మని విరుగుడు ధ్వని ఏమైనా ఉన్నాయా అని ఛాతీ నొప్పి ఉన్న చోట నొక్కడం ద్వారా పరీక్షిస్తారు. ఇంకా, శ్వాస తీసుకున్నపుడు మీ ఛాతీ సాధారణంగానే  విస్తరిస్తుందా లేదా మీరు దగ్గినప్పుడు లేదా తుమ్మినపుడు మీకేమైనా ఛాతీ నొప్పి కల్గుతోందా అన్నవాటిని పరీక్షిస్తారు.

విశ్లేషణ పరీక్షలు

మీ ఛాతీ నొప్పిని నిర్ధారించడానికి కింది పరీక్షలు జరుపబడతాయి:

  • బ్లడ్ టెస్ట్
    ఈ పరీక్షలో, మీ శరీరం నుండి రక్తం యొక్క నమూనా తీసుకోబడుతుంది. ఈ రక్త పరీక్ష మీ రక్తకణాల సంఖ్య ను, గుండె (హృదయము) ఎంజైమ్లు (క్వి న్నం లేదా దోహక పదార్ధం)  మరియు ప్రోటీన్ల సంఖ్యను అంచనా వేస్తుంది. తెల్ల రక్త కణాల సంఖ్య పెరుగుదల అంటురోగం (సంక్రమణ) యొక్క ఉనికిని సూచిస్తుంది. రక్తప్రవాహంలో హృదయ ఎంజైములు మరియు హృదయ ప్రోటీన్ల ఉనికి గుండెకు హానిని సూచిస్తుంది. రక్త ప్రసరణలోకి వీటి విడుదల గుండెకు ప్రమాద సూచికే. రక్త ప్రసారంలో ఈ హృదయ ఎంజైములు మరియు ప్రోటీన్ల ఉనికి భవిష్యత్తులో గుండెపోటుకు ప్రమాద సూచికేనాని వైద్య నిపుణుల హెచ్చరిక.

  • కఫం పరీక్ష
    మీకు ఛాతీ నొప్పితో పాటుగా తడిదగ్గు (శ్లేష్మంతో కూడిన దగ్గు) కూడా ఉంటే, దగ్గులో పడే కఫాన్ని (మీ వైద్యుడు) వైద్యతనిఖీ నిమిత్తం సేకరించవచ్చు. ఈ కఫ పరీక్ష ద్వారా న్యుమోనియా, క్షయవ్యాధి వంటి తీవ్రమైన అంటువ్యాధులేమైనా సోకినాయా  అని పరీక్షిస్తారు. అంటువ్యాధి (సంక్రమణం) ఉన్నట్లయితే, మీకు సోకిన ఆ అంటువ్యాధి (సంక్రమణ) రకాన్ని, దాని తీవ్రతను కఫ పరీక్ష లెక్క కడుతుంది. ఈ శ్లేష్మం లేదా గవదబిళ్ళ నమూనాను బాక్టీరియా పెరిగే ఒక ప్లేట్ మీద ఉంచబడుతుంది. న్యుమోనియా, క్షయవ్యాధి వంటి తీవ్రమైన సంక్రమణం ఉన్నట్లయితే, ఈ బ్యాక్టీరియాను సూక్ష్మదర్శిని (కంటికి కనిపించని సూక్ష్మ క్రిములు,  పదార్ధాలను పెద్దవిగా చూపించే పరికరం) కింద పరీక్షించబడతాయి.

  • బ్రోన్కోస్కోపీ
    ఈ పరీక్షలో, కాంతివంతమైన వెలుగు ఆధారంతో కూడిన సూక్ష్మ కెమెరా కల్గిన ఒక సన్నని ట్యూబ్ ను వైద్యుడు ఉపయోగిస్తాడు. దీనినే ‘బ్రోన్కోస్కోప్’ అని పిలుస్తారు. మీ నోరు లేదా ముక్కు ద్వారా ఈ ట్యూబ్ విడువబడుతుంది. బ్రోన్చోస్కోపీ మీ వాయుమార్గ (శ్వాసనాళం) వ్యవస్థ యొక్క స్పష్టమైన చిత్రాన్ని ఇస్తుంది. ఇంకా ఈ పరీక్ష మీ శ్వాసనాళంలో వాయుప్రసరణ, బ్రోంకస్ (ట్రాచీ మరియు ఊపిరితిత్తుల మధ్య ఉండే వాయుమార్గం యొక్క భాగం) మరియు ఊపిరితిత్తులలో రక్తస్రావం, గడ్డలు, కణితుల వంటి , లోపాలను గుర్తించడంలో సహాయపడుతుంది. శ్వాసనాళం లోతు భాగాలలో నుండి కఫము (శ్లేష్మం), సేకరించడానికి, ప్రత్యేకంగా పిల్లలలో,  ఈ పరికరాన్ని వైద్య నిపుణులు ఉపయోగిస్తారు.

  • ఛాతీ X- రే
    ఛాతీ X- రేలు ఊపిరితిత్తులు లేదా గుండె వంటి ఛాతీ అవయవాలు అసాధారణంగా విస్తరించడం, మీ శ్వాసనాళం (విండ్పైప్) యొక్క విచలనం (deviation), మీ పక్కటెముకల పగులు, అంటువ్యాధి (సంక్రమణ) ఉన్నట్లయితే, మరేదైనా అనుమానాస్పద ప్రాంతం మొదలైనవాటిని గుర్తించడంలో ఉపయోగపడుతుంది.

  • CT (కంప్యూటెడ్ టోమోగ్రఫీ) స్కాన్మీ
     ఛాతీ ప్రాంతంలో CT స్కాన్ అంతర్గత అవయవాలకు స్పష్టమైన చిత్రాన్ని ఇస్తుంది. ఇది కడుపు, పిత్తాశయం, కాలేయం, మరియు క్లోమం వంటి అవయవాల  అసాధారణ వాపును, పిత్తాశయ రాళ్లు, ఊపిరితిత్తులలో ఏవైనా మార్పులు లేదా వీటి యొక్క అసాధారణ వాపును గుర్తించడంలో ఉపయోగపడుతుంది.

  • ECG
    ECG పరీక్ష గుండె యొక్క లయ మరియు గుండె లయల రేటు సాధారణంగా ఉందా లేదా అని తనిఖీ చేసేందుకు చేసే ఒక వైద్య పరీక్ష. ఇది హృదయానికి ఎలాంటి నష్టం కలిగించగలదు. ఈ విధానంలో, ఒక జెల్ మీ ఛాతీ మరియు కొన్నిసార్లు మీ చేతులు, కాళ్ళుకు పూస్తారు. తర్వాత సెన్సార్లు (ఎలక్ట్రోడ్లు అని పిలుస్తారు) ద్వారా మీ గుండె యొక్క చర్యలను రికార్డు చేస్తారు.

  • ఎఖోకార్డియోగ్రఫీ
    గుండె, దాని నిర్మాణాలు మరియు అది నిర్వర్తించే రక్తం పంపింగ్ సాధారణంగానే ఉందా లేదా అనే విషయాన్ని తనిఖీ చేయడానికి ఎఖోకార్డియోగ్రఫీ పరీక్ష చేస్తారు.

  • క్యాతిటరైజేషన్
    గుండెను పరిశీలించడానికి ఒక ‘కాథెటర్’ ను ఉపయోగించి చేసే పరీక్ష ఇది. ఇదో గొట్టపు పరికరము. ఈ ప్రక్రియలో, కాథెటర్ ను గుండె వద్దకు పంపేందుకు మీ చేతి లేదా కాలిలో ఉన్న మీ రక్తనాళాల ద్వారా జొప్పించి హృదయాన్ని చేరుకొనేలా చేస్తారు. హృదయంలో ప్రవేశించే కాథెటర్లో ఒక రంగు (dye) కూడా  చొప్పించబడుతుంది అటుపై మరియు X-రే కిరణాలు తీసుకోబడతాయి. ధమనులలో ఏవైనా అడ్డంకులను గుర్తించడంలోనూ, సరైన శస్త్రచికిత్సా విధానాన్ని నిర్ణయించడానికి ఇది ఉపయోగపడుతుంది.

  • ఆంజియోగ్రఫీ
    కరోనరీ ఆంజియోగ్రఫీ లేదా అర్టెరియోగ్రఫీ అనే ఈ ప్రక్రియలో రక్తంలో ఓ రంగు (dye) చేర్చబడుతుంది. ఈ రంగు కలిపినా రక్తం హృదయానికి చేరినప్పుడు, X-రే  కిరణాలు గుండె యొక్క ధమనుల (కరోనరీ ధమనులు) యొక్క స్పష్టమైన చిత్రాన్ని చూపిస్థాయి. ఇది అడ్డంకుల ఉనికిని గుర్తించడానికి సహాయపడుతుంది.

  • న్యూక్లియర్ స్కాన్
    ఈ విధానంలో ఒక రేడియోధార్మిక పదార్థం (తేలికపాటి వికిరణాన్ని విడుదల చేసే పదార్థాలు) రక్తప్రవాహంలో చొప్పించబడుతుంది. గుండె ద్వారా రక్తం యొక్క ప్రవాహాన్ని పర్యవేక్షించడానికి ఈ ఇమేజింగ్ విధానం పరీక్ష చేయబడుతుంది.

ఛాతి నొప్పి యొక్క చికిత్స 

ఛాతీ నొప్పి చికిత్స అంతర్లీన కారణాలపై ఆధారపడి ఉంటుంది, మరియు ఇది మందులు, శస్త్రచికిత్స మరియు జీవనశైలి మార్పులను కలిగి ఉంటుంది.

మందులు

  • నొప్పి నివారణలు మరియు వాపు నిరోధక మందులు
    ఛాతీనొప్పికి అంతర్లీన కారణం వాపు అయితే అంటే అంతర్గత అవయవాలైన కడుపు, పిత్తాశయము, క్లోమము, పక్కటెముక మృదులాస్థులు వంటి వాటి వాపు అయితే మీ వైద్యుడు మీ నొప్పి నుంచి ఉపశమనం పొందేందుకు మరియు వాపును  తగ్గించడానికి కొన్ని మందులను సూచించవచ్చు.

  • యాంటీబయాటిక్స్ మరియు యాంటివైరల్స్
    మీ ఛాతీ నొప్పికి మూల కారణం అంటువ్యాధి (సంక్రమణం) అయితే  యాంటీబయాటిక్స్ మరియు యాంటివైరల్స్ మందులు ఇవ్వబడుతాయి. ఈ మందులవల్ల అంటువ్యాధి తగ్గిన వెంటనే మీ ఛాతీ నొప్పి కూడా తాగుతుంది. వాపు మరియు నొప్పిని తగ్గించడానికి యాంటిబయోటిక్స్ సాధారణంగా నొప్పి నివారిణులు మరియు వాపు నిరోధక మందులతో పాటు సూచించబడతాయి. న్యుమోనియా, ప్యాంక్రియాటైటిస్షింగిల్స్, పెప్టిక్ పూతల, కోలేసైస్టిటిస్ (పిత్తాశయం యొక్క వాపు) మొదలైన వ్యాధుల చికిత్సకు ఇది సహాయపడుతుంది.

  • ఆంటీప్లేట్లెట్ (Antiplatelet) మందులు
    రక్త నాళాల్లో రక్తం గడ్డకట్టి రక్త ప్రసారానికి అడ్డంకి ఏర్పడి తద్వారా ఛాతీ నొప్పి వచ్చినపుడు ఈ మందులు ఉపయోగిస్తారు. ఈ మందులు రక్తం గడ్డ కట్టడాన్ని నివారించేందుకు, తద్వారా రక్త ప్రసారంలో అడ్డంకుల్ని తొలగించేందుకు సహాయపడుతాయి. ఉదాహరణకు,ఆస్పిరిన్.

  • రక్తాన్ని పలుచబరిచే మందులు
    ఈ మందులు ‘ఆంటీకాగులెంట్లు’ అని కూడా పిలువబడుతాయి. రక్తాన్ని పలుచబరిచి అది గడ్డకట్టకుండా నివారిస్తుంది. రక్తంలో ఇప్పటికే గడ్డలు కట్టి ఉంటే, ఆ గడ్డలు మరింత పెరగకుండా అంటే వాటి పరిమాణం పెరక్కుండా నివారిస్తుంది.

  • రక్త గడ్డల్ని కరిగించే మందులు   
    ఈ మందులు ‘ట్రంబోలైటిక్ ఏజెంట్లు’ అని కూడా పిలువబడుతాయి. గుండె నరాల్లో ఇప్పటికే రక్తం ఘనీభవించి గడ్డలుగా మారినవాటిని ఈ మందులు కరిగిస్తాయి. ఉదాహరణకు ఆ మందులేవంటే హెఫా రిన్, వార్ఫారీన్.

  • గుండె కండరాలకు మందులు
    డిజిటాలిస్ అనే మందు గుండె కండరాలు చురుగ్గా పని చేసేందుకు మరియూ గుండె రక్తాన్ని మరింత సమర్థవంతంగా తోడేందుకు (pumping) సహాయపడుతుంది. ఈ  మందు గుండె లయను మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుంది.

  • ACE (యాంజియోటెన్సిన్ కన్వర్టింగ్ ఎంజైమ్) నిరోధకాలు
    ఈ మందులు రక్తం ఒత్తిడి అధికంగా ఉన్నవారికి ఉపయోగకరమైనవి. ఈ మందులు యాంజియోటెన్సిన్ కన్వర్టింగ్ ఎంజైమ్ (ACE) యొక్క చర్యను నిరోధిస్తాయి.  మరియు రక్త నాళాలు ముకుళించుకుని ఇరుకై పోకుండా ఉండేందుకు సహాయపడుతుంది. రక్తనాళం ముకుళించుకుని పోయి ఇరుకయ్యేందుకు కారణమయ్యే హార్మోన్ ల (యాంజియోటెన్సినోజెన్ ల) ఉత్పత్తిని నిరోధిస్తుంది. ఈ హార్మోన్లను నిరోధిస్తే రక్తపోటు అధికంగా ఉన్న వ్యక్తులలో రక్తపోటు (బిపి) తగ్గిపోతుం ది. గుండె రక్తాన్ని సమర్ధవంతంగా (పంప్) తోడడంలో ఈ మందులు సహాయపడతాయి.

  • బీటా-బ్లాకర్స్
    ఈ మందులు రక్తపోటును తగ్గించి గుండె పైని పని భారాన్ని తగ్గిస్తాయి. అసంబద్ధ గుండె లయను తప్పించి రెండో సారి గుండెపోటు రాకుండా కాపాడుతాయి ఈ మందులు.

  • నైట్రోగ్లిసరిన్ లేదా నైట్రేట్స్
    ఈ మందులు రక్తనాళ గోడలలోని కండరాలను సడలించడం ద్వారా బాధిస్తున్న ఛాతీ నొప్పి నుండి ఉపశమనాన్ని అందిస్తాయి.

  • కాల్షియం ఛానల్ బ్లాకర్స్
    ఈ మందులు నైట్రోగ్లిజరిన్ మాదిరిగానే పనిచేస్తాయి మరియు రక్తపోటు మరియు ఛాతీ నొప్పి చికిత్సకు ఉపయోగపడతాయి

  • డయూరెటిక్స్ మందులు (అతిమూత్రవిసర్జనకారకాలు)
    శరీరం నుండి ద్రవాలు మరియు లవణాలను తొలగించడం ద్వారా రక్తపోటును తగ్గించడంలో ఈ మందులు సహాయపడతాయి. అందువల్ల వీటిని "నీటి మాత్రలు" అని కూడా పిలుస్తారు. ఈ మందులు గుండె మీది పనిభారాన్ని తగ్గించి, గుండెపోటు ప్రమాదాన్ని నివారిస్తాయి.

  • కొలెస్ట్రాల్ ని-నియంత్రించే మందులు
    ఈ మందులు తక్కువ సాంద్రత కలిగిన లిపోప్రొటీన్ (LDL) లు లేదా’ చెడు కొవ్వుల’ స్థాయిని తగ్గిస్తాయి. లిపోప్రొటీన్ లనే ‘చెడ్డ కొలెస్ట్రాల్’ అని కూడా అంటారు. ఈ మందులు గుండె యొక్క ధమనులలో ఏర్పడే అడ్డంకుల్ని తగ్గిస్తుంది.

శస్త్రచికిత్స (సర్జరీ)

మీ ఛాతీ నొప్పికి గల మూల కారణము రక్త నాళాల అవరోధాలు, రక్తం గడ్డకట్టడం, పిత్తాశయ రాళ్ళు లేదా అవయవాలు దెబ్బతినటం వలన అయితే, మీరు శస్త్రచికిత్స చేయించుకోవాల్సి ఉంటుంది.ఆ శస్త్రచికిత్సలు ఏవంటే కోలిసిస్టెక్టోమీ, ప్యాంక్రియాటెక్టోమీ, రిబ్ ఫ్రాక్చర్ రిపేర్, కరోనరీ ఆంజియోప్లాస్టీ మరియు స్టెంటింగ్, కొరోనరీ ఆర్టరీ బైపాస్ గ్రాఫ్టింగ్ (CABG), గుండె కవాటాల భర్తీ, గుండె మార్పిడి, పేస్ మేకర్ పెట్టే శస్త్రచికిత్స మొదలైనవి. ఈ శస్త్రచికిత్సల్లో ఏవి సముచితమో వైద్యుల సలహా మేరకు చేయించుకోవలసి ఉంటుంది..

  • కోలలెసిస్టెక్టోమీ
    వ్యాధికి గురైన పిత్తాశయం యొక్క తొలగింపు.

  • క్లోమం శస్త్రచికిత్స లేదా ప్యాంక్రియాటమీ
    వ్యాధికి గురైన క్లోమం (పాంక్రియా) యొక్క బాధిత భాగం లేదా మొత్తాన్ని తొలగించడం.

  • రిబ్ ఫ్రాక్చర్ రిపేర్
    విరిగిన పక్కటెముక యొక్క భాగాలను అతికించి మరమ్మతు చేయడం.

  • న్యుమోథొరాక్స్ కు శస్త్రచికిత్స
    ఈ శస్త్ర  చికిత్స ‘ప్లెరోడెసిస్’ (శ్లేష్మపటలం/ శ్లేష్మస్తరం లేదా ప్లేవురాను అతికించడం) ఆపరేషన్, శ్లేష్మ పటలాన్ని రాపిడి చేయడం (ఊపిరితిత్తులకు శ్లేష్మస్తరాన్ని అతికించేందుకు శ్లేష్మస్తరాన్ని (ప్లూరాను) రుద్దడం), ప్లేఉరెక్టమీ (శ్లేష్మస్తరం తొలగింపు, తద్వారా ఊపిరితిత్తులు ఛాతీ గోడకు అతుక్కుంతాయి.) మొదలైనవి ఉన్నాయి. ఈ శస్త్రచికిత్సలు అన్నీ శ్లేష్మ పొరల మధ్య గాలి లేదా ద్రవం గుమిగూడడాన్ని అరికడతాయి.

  • కరోనరీ ఆంజియోప్లాస్టీ మరియు స్టెంటింగ్
    స్టెంట్ (ట్యూబులాంటిది) ట్యూబ్ గుండెకు చేరుకోవడానికి చేతి లేదా కాలు యొక్క ధమనిలో చేర్చబడుతుంది మరియు ప్రారంభంలో ధమనిని నిరోధించిన ఫలకాన్ని విచ్ఛిన్నం చేయడానికి ఒక చిన్న ఊపిరిబుడ్డ (లేదా బెలూన్) ఉపయోగించబడుతుంది.

  • కరోనరీ ఆర్టరీ బైపాస్ గ్రాఫ్టింగ్:
    నిరోధించబడిన ధమనికి ఒక ఆరోగ్యకరమైన రక్తనాళాన్ని కలుపుతారు లేదా అంటుకట్టబడుతుంది అంటే కలుపుతారు. దీనివల్ల, గుండె రక్తనాళం (కొరోనరీ ఆర్టరీ) యొక్క అడ్డంకిని (బ్లాక్ చేయబడిన ప్రాంతాన్ని) తప్పించుకుంటుంది ఇలా ఆరోగ్యకర రక్తనాళాన్ని ధమనికి కలిపి రక్తాన్ని గుండెకు ప్రవహించుటకు ఒక నూతన మార్గాన్ని ఏర్పరుస్తుంది.

  • హార్ట్ వాల్వ్ రిపేర్ లేదా భర్తీ
    ఒక కొత్త కవాటం సాయంతో సరిగ్గా లేదా అసలు పనిచేయని హృదయ కవాటాన్ని సరిచేయడానికి లేదా భర్తీ చేయడానికి ఈ శస్త్ర చికిత్స చేయబడుతుంది.

  • గుండె మార్పిడి లేదా హార్ట్ ట్రాన్స్ ప్లాంట్
    తీవ్రంగా దెబ్బతిన్న గుండె విషయంలో, వ్యాధినిరోధక హృదయాన్ని దాత నుండి సేకరించి వ్యాధిగ్రస్తమైన గుండెను తొలగించి దాని స్థానంలో దాత ఇచ్చిన కొత్త గుండెను భర్తీ చేయడం. దీన్నే ‘గుండె మార్పిడి’ అంటారు. .

  • పేస్ మేకర్ (Pacemaker)
    ఛాతీ చర్మం క్రింద పేస్ మేకర్ ను వైర్లుతో గుండెకు అనుసంధానం చేస్తారు. ఇది గుండె యొక్క లయను సరిగా నిర్వహించడంలో సహాయపడుతుంది.

  • విఏడి (VAD) శస్త్రచికిత్సలు (వెంటిక్యులర్ అసిస్ట్ డివైస్) మరియు టీఏహెచ్ (TAH) (సంపూర్ణ కృత్రిమ హృదయం)
    బలహీనమైన గుండెను కల్గినవారికి రక్తాన్ని మరింత సమర్థవంతంగా పంప్ చేయడంలో VAD శస్త్రచికిత్సలు సహాయపడుతాయి. హృదయం యొక్క దిగువ భాగాన ఉన్న రెండు గదులను భర్తీ చేయడానికి TAH (పూర్తిగా నకిలీ గుండె) ను వాడతారు.

ఛాతి నొప్పి యొక్క చిక్కులు 

ఛాతీ నొప్పికి అనేక కారణాలున్నాయి. అవి చాలా తీవ్రమైనవి కావు. అయితే నిరంతరంగా లేదా తీవ్రంగా ఉన్న ఛాతీ నొప్పిని నిర్లక్ష్యం చేయతగదు. ఎందుకంటే అలాంటి తీవ్రమైన ఛాతీ నొప్పి తీవ్ర వైద్య సమస్యను సూచిస్తుంది. ఇలాంటి ఛాతీ నొప్పికి  చికిత్స చేయకపోతే, మీ శరీరం యొక్క వివిధ భాగాలకు నష్టం కలిగించి తీవ్ర ఉపద్రవాలను తెచ్చి పెట్టొచ్చు. అలాంటి ఉపద్రవాలు ఏమిటో క్రింది విధంగా ఉన్నాయి గమనించండి:

  • ఛాతీ నొప్పి అంతర్గత అవయవాలను దెబ్బతీస్తుంది.
    ఛాతీ నొప్పికి అంటువ్యాధి (ఇన్ఫెక్షన్), పిత్తాశయ రాళ్ళు, రక్తం గడ్డకట్టడం, గుండె రక్తనాళం పనిచేయకపోవడం, పూతల వంటివి అంతర్లీన కారణం అయితే, వాటికి తగిన సమయంలో చికిత్స చేయకపోతే గుండె, ఊపిరితిత్తులు, క్లోమం ( ప్యాంక్రియాస్), పిత్తాశయం వంటి అవయవాలకు తీవ్రమైన నష్టాన్ని కల్గిస్తాయి.

  • కుళ్ళకం (సెప్సిస్)
    శరీరంలో అంటువ్యాధి (infection) గనుక ఉంటే, సంబంధించిన అవయవాలకు హాని కల్గించి, అటుపై కుళ్ళకానికి (పూతిక)కు లేదా “సెప్సిస్” కు దారితీస్తుంది.

  • సెప్టిక్ షాక్
    సంక్రమణము లేదా అంటువ్యాధి దాని యొక్క మూలం నుండి శరీర ఇతర  భాగాలకు రక్తప్రవాహం ద్వారా వ్యాపిస్తే, దీన్నే ‘సెప్టిక్ షాక్’ అంటారు.

  • మరణం 
    సెప్టిక్ షాక్ అనేది శరీరం యొక్క ప్రధాన అంగ వ్యవస్థల వైఫల్యానికి (మల్టీసిస్టమ్ వైఫల్యం), కొన్నిసార్లు మరణానికి కూడా దారితీస్తుంది. గుండె కండరాలు దెబ్బతిన్నట్లయితే, అది గుండెపోటుకు దారితీయవచ్చు, చికిత్స చేయకపోతే వెంటనే మరణానికి దారితీయవచ్చు.

ఛాతి నొప్పి కొరకు మందులు


Medicine NamePack
Amlodac TabletAmlodac 10 Table
Amchek TabletAmchek 10 Mg Table
Angicam TabletAngicam 2.5 Mg Table
Amlokind AtAMLOKIND AT TABLET
Amtas TabletAmtas 5 Table
Concor AmConcor AM 2.5 Tablet
Met Xl AmMet XL AM 25/2.5 Tablet
Revelol AmREVELOL AM 25/5MG TABLET 7S
Tazloc TrioTazloc Trio 40 Table
Amlopres ATAmlopres AT 25 Tabl
Stamlo BetaSLAMLO BETA TABLE
StamloStamlo 10 Tab
Telma AmTelma 80 AM Tablet
Bpc AtBpc At 50 Mg/5 Mg Tablet
Metofid AmMetofid Am 25 Mg Tablet
ADEL Arnica Mont DilutionADEL Arnica Mont Dilution 1000 CH
Amdac 5 Mg TabletAmdac 5 Mg Tablet
Telmiride AmTelmiride Am 40 Mg Tablet
B.P.Norm AtB.P.Norm At 50 Mg/5 Mg Tablet
Metograf AmMetograf Am 25 Mg/5 Mg Tablet
Bjain Arnica montana Mother Tincture QBjain Arnica montana Mother Tincture Q
Schwabe Latrodectus mactans CHSchwabe Latrodectus mactans 1000 C
AmdepinAmdepin 2.5 Tablet
Telmisafe AmTelmisafe Am 40 Mg Tablet
Metolar AMMetolar AM 25 Table

ధన్యవాదములు 

మీ నవీన్ నడిమింటి 

విశాఖపట్నం 

అస్వీకార ప్రకటన: ఈ సైటుపై లభ్యమవుతున్న మొత్తం సమాచారము మరియు లేఖనము కేవలం అవగాహనా ఆవశ్యకతల కొరకు మాత్రమే. ఇక్కడ ఇవ్వబడిన సమాచారమును ఏదైనా ఆరోగ్య సంబంధిత సమస్య లేదా అస్వస్థత నుండి కోలుకోవడానికి లేదా స్వస్థత కొరకు నిపుణుల సలహా లేనిదే ఉపయోగించుకోకూడదు. చికిత్స పరీక్షలు మరియు సేవల కొరకు ఎల్లప్పుడూ ఒక అర్హత పొందిన వైద్యుల సలహా తీసుకోవాలి.


అతి నిద్ర వల్ల ఆరోగ్యం సమస్య పై అవగాహనా



అతినిద్ర లేక హైపర్సోమ్నియా అంటే ఏమిటి?

అతినిద్ర (Hypersomnia) అనేది దీర్ఘకాలిక నాడీ వ్యవస్థ రుగ్మత. ఈ రోగం కల్గిన వారిలో   దీర్ఘకాలపు రాత్రినిద్ర తెల్లవారింతర్వాత కూడా ఇంకా కొనసాగుతూనే ఉంటుంది లేదా పగటిపూట కూడా నిద్రావస్థను అనుభవించే స్థితి ఉంటుంది. నిద్ర చాలకపోవడంవల్లనో లేక కలత కల్గిన నిద్ర కారణంగానో అలసిపోయే వారికి భిన్నంగా అతినిద్ర (హైపర్ సోమ్నియా) రుగ్మత ఉన్నవారు పూర్తిరాత్రి నిద్రానంతరం, పగటిపూట కూడా సుధీర్ఘంగా నిద్రపోవడానికి తహ తహలాడుతుంటారు. అతినిద్ర (హైపర్సోమ్నియా) తరచుగా ఇతర వ్యాధులతో ముడిపడి ఉంటుంది, మరియు ఈ రుగ్మత రోగుల యొక్క రోజువారీ జీవితాన్నీ దెబ్బ తీస్తుంది.

అతినిద్ర ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

అతినిద్ర యొక్క అత్యంత సాధారణ లక్షణాలు:

  • పగటిపూట అతినిద్రగా ఉంటోందని లేదా పగలంతా నిద్రమత్తుగా ఉంటుందని  నిరంతర ఫిర్యాదు
  • తగని వేళల్లో, అంటే పనివేళల్లో- పని చేసేటప్పుడు, తింటున్నప్పుడు లేదా సంభాషణల మధ్యలో కూడా వ్యక్తికీ మళ్ళీ మళ్ళీ నిద్రపోవాలన్న బలమైన కోరిక జనించడం.
  • పగటిపూట నిద్రలు అతినిద్ర యొక్క లక్షణాల్ని తగ్గించవు, మరియు ఒక దీర్ఘనిద్ర తర్వాత కూడా వ్యక్తికి తరచుగా జబ్బుపడ్డట్టు అనిపించవచ్చు.

ఇతర లక్షణాలు:

  • ఆందోళన
  • పెరిగిన చికాకు
  • అశాంతి (విరామము లేకపోవటం)
  • తగ్గిన శక్తి
  • నెమ్మదిగా ఆలోచించే ప్రక్రియ మరియు ప్రసంగం, అదేప్రక్రియ రోజులోనూ కొనసాగడం
  • ఆకలి తగ్గిపోవడం
  • కుటుంబం లేదా సామాజిక సమావేశాల్లో మరియు మరియు వృత్తిపరమైన అమరికలలో పనిచేయడం కష్టమవడం

దీని ప్రధాన కారణాలు ఏమిటి?

చాలా నరాల సంబంధిత రుగ్మతల లాగానే, అతినిద్రకు కారణం ఇంకా తెలియరాలేదు. ఏమైనప్పటికీ, మెదడులోని హార్మోన్తో సంఘర్షణ చెందే శరీరభాగంలోని ఒక నిర్దిష్ట అణువు యొక్క అధిక ఉత్పత్తి అతినిద్రకు కారణమవుతుందనే నిదర్శనం ఉంది.

సాధారణ కారణాలు:

  • నిద్రపోవాలనే బలమైనకోరిక (నార్కోలెప్సీ) మరియు స్లీప్ అప్నియా వంటి నిద్ర రుగ్మతలు
  • స్వయంప్రతిష్క నాడీ వ్యవస్థ పనిచేయకపోవడం
  • మత్తుమందుల (డ్రగ్స్) లేదా మద్యం దుర్వినియోగం

ఇతర కారణాలు:

  • కణితులు (ట్యూమర్స్)
  • మెదడుకు గాయం లేదా కేంద్ర నాడీ వ్యవస్థకు గాయం
  • కుంగుబాటు నివారణా మందులు (యాంటిడిప్రెసెంట్స్), ఆందోళన తగ్గించే ఏజెంట్ మందులు, అలెర్జీ నివారణా మందులు (యాంటిహిస్టామినిక్స్) ఇంకా ఇతర  మందులు లేదా కొన్ని ఔషధాల ఉపసంహరణ అతినిద్రకు దారి తీయవచ్చు.
  • బహువిధంగా నరాలు గట్టిపడే (మల్టిపుల్ స్క్లెరోసిస్) వ్యాధి, కుంగుబాటు (డిప్రెషన్), మెదడువాపువ్యాధి (ఎన్సెఫాలిటిస్), మూర్ఛ (ఎపిలేప్సి) లేదా ఊబకాయం వంటి రుగ్మతలు అతినిద్ర రోగానికి కారణమవుతాయి
  • అతినిద్రకు దోహదపడే ఓ జన్యు సిద్ధతకు సంబంధించిన ఆధారాలూ ఉన్నాయి. అలాంటపుడు, అటువంటి కేసుల్లో యుక్తవయస్కత (వయోజనత్వం) వచ్చే ముందు దశలో అతినిద్ర గుర్తించబడును.

అతినిద్ర రుగ్మతను ఎలా నిర్ధారణ చేస్తారు మరియు దీనికి చికిత్స ఏమిటి?

లక్షణాలు మరియు నిద్ర అలవాట్లను అంచనా వేయడానికి కుటుంబం సభ్యుడి సమక్షంలో ఒక సంపూర్ణ వైద్య చరిత్ర రోగనిర్ధారణలో సహాయం చేస్తుంది.

  • ఔషధాల యొక్క ఔషధాల యొక్క పరిస్తితులలో ఔషధాలను తొలగించడానికి మందులు నిలిపివేయబడవచ్చు.
  • మీరు ఏ అండర్ లైయింగ్ వైద్య పరిస్థితులను నిర్ధారించడానికి పరీక్షలకు సలహా ఇస్తారు.

అతినిద్రకుపకరించే పరిశోధనలు ఉన్నాయి:

  • రాత్రిపూట నిద్ర పరీక్ష లేదా పాలీసోమ్నోగ్రఫీ (PSG) పరీక్ష
  • బహుళ నిద్ర అంతర్గత పరీక్ష (Multiple sleep latency test-MSLT)
  • మేల్కొలిపే పరీక్ష నిర్వహణ

అతినిద్రకు (హైపర్సోమ్నియా) చేసే చికిత్స ఆ రుగ్మత లక్షణాలకు ఉపశమనం అందించడం మరియు అంతర్లీన కారణాన్ని నిర్వహించడం మీద ఆధారపడి ఉంటుంది

  • అతినిద్రాకిచ్చే మందుల్లో కుంగుబాటునివారణా మందులు (యాంటిడిప్రెసెంట్స్) మరియు మేల్కొలుపును-ప్రోత్సహించే ఏజెంట్ మందులు కూడా ఉంటాయి
  • మేధావికాస ప్రవర్తనా చికిత్స (కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ-CBT) కూడా అతినిద్రతో బాధపడుతున్న కొందరు రోగులకు సహాయపడుతుంది

స్వీయ రక్షణ:

  • మీ నిద్రకు  అంతరాయం కల్గించే విధానాలైన రాత్రిపూట పొద్దుపోయేవరకూ  పని చేయటాన్నికానీ లేక మరెలాంటి సాంఘిక కార్యకలాపాలనైనా మానుకోండి..
  • మద్యం మరియు కెఫిన్ సే

నిద్ర అవసరమేనా? మంచి నిద్రకి పాటించవలసిన ఆయుర్వేద నవీన్ నడిమింటి సలహాలు 

నిద్ర ఎందుకు ముఖ్యమో ఇప్పుడు తెలుసుకుందాం. కాఫీ మరియు ఎనర్జీ వంటి ఎన్నో స్టిములంట్స్ తో పాటు డ్రగ్స్ మరియు మెదడును ఉత్తేజపరిచే మందులు అనేకం నెర్వస్ సిస్టం పై ప్రభావం చూపుతాయి. మెలకువగా ఉండేలా చేస్తాయి. అయితే, మంచి నిద్రకు మించిన మందు మరేదీ లేదు. సరైన నిద్ర వలన మెదడు చురుగ్గా ఉంటుంది.

గుడ్ క్వాలిటీ స్లీప్ అనేది మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచడానికి అలాగే ఆనందంగా ఉంచడానికి ప్రముఖ పాత్ర పోషిస్తుంది. సరైన నిద్ర లేకపోవడం వలన ఆకలి ఎక్కువగా వేస్తుంది, చిరాకు కలుగుతుంది, ప్రీమెచ్యూర్ ఏజింగ్ సమస్య మొదలవుతుంది, అడ్రినల్ గ్లాండ్స్ పనితీరు దెబ్బతింటుంది అలాగే ఏకాగ్రత కుదరదు. వీటితో పాటు ఎన్నో అసౌకర్యాలు ఎదుర్కోవలసి వస్తుంది.

మంచి నిద్రకు ప్రత్యామ్నాయం ఏదీ లేదు. తగినంత నిద్రను పొందటం ద్వారా శరీరం అలాగే మనసు రిలాక్స్ అవుతాయి.

ఆయుర్వేదమనే ప్రాచీన వైద్య శాస్త్రం నిద్రకు సంబంధించిన గొప్పతనం గురించి గట్టిగా చెప్తోంది. నిద్రలేమి సమస్యను తగ్గించుకునేందుకు అనేక చిట్కాలను తెలియచేస్తోంది. నిద్రలేమికి గల మూల కారణాన్ని తెలుసుకోవడం ద్వారా ఈ సమస్యను అరికట్టవచ్చని చెప్తోంది.

కొంత నూనెను స్కాల్ప్ పై అలాగే అరికాళ్లపై అప్లై చేయడం

కొంత నూనెను స్కాల్ప్ పై అలాగే అరికాళ్లపై అప్లై చేయడం ద్వారా మంచి నిద్రను పొందవచ్చని ఆయుర్వేదం స్పష్టం చేస్తోంది. నిద్రపోయే ముందు ఈ పద్దతిని పాటించాలని చెప్తోంది. నువ్వుల నూనె, బ్రాహ్మి ఆయిల్, జాస్మిన్ ఆయిల్ లేదా కొబ్బరి నూనెతో కొంత సేపు మసాజ్ చేసుకోవాలి. నూనెను వెచ్చచేస్తే మరింత మెరుగైన ఫలితాన్ని పొందుతారు.

ఒక కప్పుడు ఆల్మండ్ మిల్క్ ను నిద్రపోయే ముందు తీసుకోవాలి.

ఒక కప్పుడు ఆల్మండ్ మిల్క్ ను నిద్రపోయే ముందు తీసుకోవాలి. ప్లెయిన్ మిల్క్ ని తీసుకోవచ్చు. లేదా చిటికెడు నట్ మెగ్ (1/8 టీస్పూన్) మరియు ఇలాచీను వేస్తె ఫ్లేవర్ పెరుగుతుంది. అలాగే, దీని ద్వారా అందే ఫలితం కూడా మెరుగ్గా ఉంటుంది.


డైలీ రొటీన్ ను అలాగే బెడ్ టైమ్ షెడ్యూల్ ను ఏర్పాటు చేసుకోండి.

నిద్రపట్టదన్న నెగటివ్ ఆలోచనలను తోసివేయండి. పాజిటివ్ గా ఆలోచించండి. నిద్ర పడుతుందని భావించండి. "మంచి నిద్రపడుతుంది. హాయిగా నిద్రిస్తాను. శరీరం రిలాక్స్ అవుతుంది" అంటూ పాజిటివ్ గా ఆలోచించండి.

చమోమైల్ టీ

చమోమైల్ టీ లో కెఫైన్ ఉండదు. అలాగే ఇన్సోమ్నియాకు కూడా ఇది మంచి రెమెడీ

వేలేరియన్ రూట్

వేలేరియన్ రూట్ అనేది ఒత్తిడిని తగ్గించి రిలాక్సేషన్ ను అందిస్తుంది. టీ మరి

అతి నిద్ర కొరకు మందు

Medicine NamePack Size
VasograinVasograin Tablet
SaridonSARIDON PLUS TABLET
Quick Action (Kopran Ltd)Quick Action Tablet
RhinoRhino Tablet
TalicoldTalicold Tablet
Anacin PainAnacin Pain Cream
DartDart Tablet
Aekil ColdAekil Cold Tablet
LaryLary Tablet
M Cold PlusM Cold Plus Syrup
Toff PlusToff Plus Capsule
ApihistApihist Tablet
B HoldB Hold Tablet
ActicratActicrat Tablet
DeconginDecongin Tablet
FluridFlurid Tablet
RemcoldRemcold Tablet
Rupar Cold TabletRupar Cold Tablet
Carisoma CompoundCarisoma Compound Tablet
TerexTerex Tablet
Alex ColdAlex Cold Tablet

ధన్యవాదములు 

మీ నవీన్ నడిమింటి 

విశాఖపట్నం 

9703706660

అస్వీకార ప్రకటన: ఈ సైటుపై లభ్యమవుతున్న మొత్తం సమాచారము మరియు లేఖనము కేవలం అవగాహనా ఆవశ్యకతల కొరకు మాత్రమే. ఇక్కడ ఇవ్వబడిన సమాచారమును ఏదైనా ఆరోగ్య సంబంధిత సమస్య లేదా అస్వస్థత నుండి కోలుకోవడానికి లేదా స్వస్థత కొరకు నిపుణుల సలహా లేనిదే ఉపయోగించుకోకూడదు. చికిత్స పరీక్షలు మరియు సేవల కొరకు ఎల్లప్పుడూ ఒక అర్హత పొందిన వైద్యుల సలహా తీసుకోవాలి.


17, మే 2020, ఆదివారం

కంటి చూపు ని మెరుగు పరిచే ఆరోగ్య సలహాలు కోసం మా పేజి ని లింక్స్ చుడండి.

కంటి చూపును మెరుగుపరచుకోవడం ఎలా: ఆహారాలు, వ్యాయామాలు, అవగాహనా కోసం నవీన్ నడిమింటి సలహాలు  - How to improve eyesight: foods, exercises, home remedies 

వయస్సు, జన్యులు మరియు ఆధునిక ఎలక్ట్రానిక్ పరికరాలు వంటి వివిధ అంశాలు కంటి చూపును ప్రభావితం చేస్తాయి, అయితే జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవడం వలన రెటీనా మరియు కార్నియాను ఆరోగ్యంగా ఉంచడంతో పాటు ఫోటోడ్యామేజ్‌ను నివారించడంలో అవి సహాయపడతాయి. కంటి లోపాలకు ఒత్తిడి ఒక ప్రధాన కారణమని ఇటీవలి పరిశోధనలు చెబుతున్నాయి. ఈ వ్యాసం కంటి చూపును మెరుగుపరిచేందుకు పాటించవలసిన అన్ని ఆహార చిట్కాలు మరియు వ్యాయామాలను గురించి చర్చిస్తుంది

విటమిన్లు మరియు ఖనిజాలు అధికంగా ఉండే కొన్ని ఆహారాలను మీ రోజువారీ ఆహారంలో చేర్చుకుంటే అవి కంటి చూపును మెరుగుపరచడంలో సహాయం చేస్తాయి. కంటి చూపును కాపాడే కణాల పెరుగుదల మరియు మరమ్మత్తు (రిపేర్) కు ఈ ఆహారాలు ఉపయోగపడతాయి. కంటి చూపు సహజంగా మెరుగుపడంలో సహాయపడే అటువంటి కొన్నిఆహారాల జాబితా ఈ క్రింద వివరంగా చర్చించ

కంటి చూపు కోసం క్యారెట్లు - Carrots for eyesight 

కంటి చూపును మెరుగుపర్చడానికి పోషకాహార నిపుణులు సూచించే ఒక సాధారణ ఆహార పదార్థం క్యారెట్. వీటిలో బీటా కెరోటిన్ అధికంగా ఉంటుంది, బీటా కెరోటిన్ ఒక యాంటీఆక్సిడెంట్ మరియు విటమిన్ ఎ యొక్క పూర్వగామి (ప్రికసర్). ఆహారంలో  క్యారెట్లను తీసుకోవడం వలన అవి రాత్రి సమయంలో చూపుని మెరుగుపరుస్తాయని మరియు కంటి చూపు క్షీణించడాన్ని నివారించగలవని అధ్యయనాలు కనుగొన్నాయి.

ఈ విటమిన్ కళ్ళ యొక్క రాడ్ (rods) మరియు కోన్ (cone) కణాలకు అవసరమైన రోడాప్సిన్ అనే పిగ్మెంట్ను పెంచడంలో సహాయపడుతుంది. ఈ కణాల యొక్క ఆక్సీకరణ నష్టం మరియు వాపు కళ్ళ సమస్యలకు రెండు ప్రధాన కారణాలు, వీటిని నివారించడానికి కూడా క్యారెట్లు సహాయపడతాయి.

పచ్చి క్యారెట్లు గరిష్ట పోషణను అందిస్తాయి ఎందుకంటే వాటిని వండటం వల్ల వాటిలో ఉన్న పోషక విలువ కొద్దిగా తగ్గుతుంది. వాటిని సలాడ్ల రూపంలో పచ్చిగా తినవచ్చు లేదా వాటిని సూప్‌లకు జోడించవచ్చు. అయితే, విటమిన్ ఎ అధిక మోతాదు కూడా విషపూరితమైనది కాబట్టి క్యారెట్లను అతిగా తినడం కూడా హానికరం.

ఆరోగ్యకరమైన కళ్ళకు గుడ్లు - Eggs for healthy eyes 

కంటి ఆరోగ్యాన్ని మెరుగుపర్చడంలో గుడ్లును ఉత్తమమైన  ఆహారంగా భావిస్తారు. గుడ్డు సొనలలో విటమిన్ ఎ, జియాక్సంతిన్ (zeaxanthin), ల్యూటిన్ మరియు జింక్ అధికంగా ఉంటాయి, ఇవి కంటి ఆరోగ్యానికి కీలకమైనవి. విటమిన్ ఎ కంటి ఉపరితలాన్ని, అంటే కార్నియాను రక్షిస్తుంది. లుటిన్ మరియు జియాక్సంతిన్ మాక్యులర్ డిజనెరేషన్ మరియు కంటిశుక్లం వంటివి వయస్సు-సంబంధిత కంటి సమస్యల యొక్క సంభావ్యతను  తగ్గిస్తాయి. కంటి చూపు మెరుగుపరచడానికి అవసరమైన రెటీనాను కాపాడడంలో  జింక్ సహాయపడుతుంది.

మీ కళ్ళు ఆరోగ్యంగా ఉండటానికి, రోజూ ఒకటి లేదా రెండు గుడ్లు ఉడకబెట్టి తినవచ్చు.

కంటి చూపును మెరుగుపరచడానికి ఆకుకూరలు - Green leafy vegetables for increasing eyesight 

మెరుగైన దృష్టి కోసం ఆరోగ్య నిపుణులు బ్రోకలీ, కాలే మరియు బచ్చలికూర వంటి ఆకుకూరలను సిఫార్సు చేస్తారు. బ్రోకలీ అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూరగాయ. దీనిలో ఉండే విటమిన్లు ఎ, ఇ, సి మరియు ల్యూటిన్ బ్రోకలీని కళ్ళ కోసం ఒక అద్భుతమైన ఆహారంగా చేస్తాయి. ఫోటోడామేజ్ మరియు ఆక్సీకరణ నష్టాన్ని నివారించడం ద్వారా బ్రోకలీ కంటి ఆరోగ్యాన్ని కాపాడుతుంది. వేడి నీటిలో ఉడకబెట్టి లేదా వేపి తీసుకున్నపుడు బ్రోకలీ యొక్క ప్రయోజనాలు చాలా ప్రభావవంతంగా ఉంటాయి.

బచ్చలికూర మరియు కాలే రెండింటిలో కంటి చూపును మెరుగుపర్చడంలో అద్భుతాలు చేయగల విటమిన్లు మరియు ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ల్యూటిన్ మరియు జింక్ యొక్క గొప్ప వనరులు, ఇవి రెండూ ఆరోగ్యకరమైన కళ్ళకు అవసరం. కళ్ళు ఆరోగ్యంగా ఉంచడానికి  బచ్చలికూర మరియు కాలేని స్మూతీలు మరియు సూప్‌లలో చేర్చవచ్చు.

కంటి చూపు మెరుగుపరచడానికి చేప - Fish to improve eyesight 

చేపలు, ముఖ్యంగా కొవ్వు అధికంగా ఉండే చేపలు కంటి చూపును మెరుగుపరచే పోషకాహారం యొక్క గొప్ప మూలాలు. కొవ్వు అధికంగా ఉండే చేపలు ఒమేగా -3-ఫ్యాటీ ఆసిడ్ల యొక్క గొప్ప వనరులు. ఈ కొవ్వు ఆమ్లాలు (ఫ్యాటీ ఆసిడ్లు) కణాలలో ఒమేగా -3 మరియు ఒమేగా -6 ఫ్యాటీ ఆసిడ్ల నిష్పత్తిని సమతుల్యం చేయడం ద్వారా వాపును తగ్గిస్తాయి. రెటీనాకు సమీపంలోని ప్రాంతంలో డిహెచ్ఏ (DHA) అనే ఒక రకమైన ఒమేగా -3 కొవ్వు ఆమ్లం పుష్కలంగా ఉంటుంది. అందువల్ల, సాల్మన్, ట్యూనా వంటి కొవ్వు అధికంగా ఉండే చేపలను తీసుకోవడం అవి కంటి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. నత్త గుల్లలు వంటి సీఫుడ్స్ లో కూడా జింక్ పుష్కలంగా ఉన్నందున అవి కూడా కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.

ఒకవేళ మీరు శాఖాహారులైతే మరియు చేపలు తినకపోతే, మీ వైద్యుడిని సంప్రదించిన తరువాత మీరు చేప నూనెల (ఫిష్ ఆయిల్) సప్లిమెంట్లను తీసుకోవచ్చు. చేపలను వేపితే వాటిలో ఉండే పోషకాలు తగ్గవచ్చు కాబట్టి వాటిని గ్రిల్ చేసి తినవచ్చు.

కంటి చూపు మెరుగుపరచడం కోసం తృణధాన్యాలు - Whole grains for increasing eyesight 

తృణధాన్యాలు కూడా కంటి చూపు మెరుగుపరచడంలో ప్రయోజనకరంగా ఉంటాయని తెలిసింది. ఇవి ఫైబర్, విటమిన్లు, ఫైటోన్యూట్రియెంట్స్ మరియు ఖనిజాల యొక్క గొప్ప వనరులు. విటిలో విటమిన్ ఇ మరియు జింక్ వంటి ముఖ్యమైన పోషకాలు కూడా ఉంటాయి. కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు క్వినోవా, వోట్స్, తృణధాన్యాలు మరియు బ్రౌన్ రైస్ వంటి తృణధాన్యాలను  మీ ఆహారంలో చేర్చండి.

కంటి చూపు మెరుగుపరచడం కోసం నిమ్మజాతి పండ్లు - Citrus fruits to improve eyesight 

కళ్ళలో మెటబోలిక్ (జీవక్రియ) చర్యలు చాలా ఎక్కువగా ఉంటాయి మరియు ఈ జీవక్రియ ప్రతిచర్యల ఫలితంగా ఉత్పత్తి అయ్యే టాక్సిన్లను తొలగించడానికి యాంటీఆక్సిడెంట్లు నిరంతరంగా అవసరమవుతాయి. సిట్రిక్ యాసిడ్ అధికంగా ఉండే ఆహారాలు కంటి వ్యాధులను నివారించడంలో సహాయపడతాయని అధ్యయనాలు కనుగొన్నాయి. బెర్రీలు, కమలాలు మరియు కివీలు  వంటి సిట్రస్ పండ్లలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది ఒక యాంటీఆక్సిడెంట్, ఇది హానికరమైన ఆక్సిజన్ రాడికల్స్ ను నైట్రలైజ్ చేయడంలో సహాయపడుతుంది, తద్వారా కంటి కండరాలు దెబ్బతినకుండా కాపాడుతుంది. విటమిన్ సి కళ్ళలో ఉండే రక్త నాళాలను మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుంది.

మెరుగైన కంటి చూపు కోసం చిలగడదుంప - Sweet potato for improved eyesight 

చిలగడదుంప మరియు ఊదా రంగు చిలగడదుంప రెండూ చూపును మెరుగుపరచడంలో ప్రభావవంతంగా ఉంటాయి. వీటిలో ఉండే గొప్ప రంగు జియాక్సంతిన్, లుటిన్ వంటి పిగ్మెంట్లు ఉండటం వల్ల వస్తుంది. చిలగడదుంపలలో ఈ యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి, అవి వాపును తగ్గించడానికి మరియు టాక్సిన్స్ ను బయటకు తొలగించడానికి సహాయపడతాయి. చిలగడదుంపలను తినడానికి ఉత్తమ మార్గం వాటిని కాల్చి లేదా ఉడకబెట్టి తినడం, అలా చేయడం వలన వాటిలో పోషకాలు తొలగిపోవు.

కాయధాన్యాలు మరియు బీన్స్ వలన కంటి చూపు పెరుగుతుంది - Legumes and beans for increased eyesight i

బీన్స్ మరియు కాయధాన్యాలను తినడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది. ఇవి జింక్ మరియు బయోఫ్లేవినోయిడ్ల (bioflavonoids) యొక్క గొప్ప వనరులు, ఇవి రెటీనాను రక్షిస్తాయి మరియు కంటిశుక్లం వచ్చే ప్రమాదాన్ని కూడా నివారిస్తాయి. మీ కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు మీ ఆహారంలో రాజ్మా గింజలు, పెసలు, అలసందలు, ఉలవలు, పచ్చి బఠానీలు, శనగలు మరియు మొలకలు తగినంత మొత్తంలో ఉండాలి.

కంటి ఆరోగ్యం మెరుగుపడడానికి నట్స్ (గింజలు) - Nuts for improved eye health 

కంటి ఆరోగ్యానికి బాదం వంటి గింజలు (గింజలు) చాలా మంచివి. బాదంపప్పులో విటమిన్ ఇ ఉంటుంది, ఇది ఆరోగ్యకరమైన కణజాలాలను ప్రభావితం చేస్తే  అన్ స్టేబుల్ మొలిక్యూల్స్ నుండి కళ్ళను రక్షించడంలో సహాయపడుతుంది. విటమిన్ ఇ ఉండే ఆహారాలను తినడం వలన చాలా కంటి వ్యాధులను నివారించడంలో ఇవి సహాయపడతాయి. అత్యంత ప్రభావివంతమైన ఫలితాలను పొందడానికి బాదంపప్పులను రాత్రిపూట నీటిలో నానబెట్టి, ఉదయం తినడం మంచిది.

మంచి కంటి చూపుకు పాల ఉత్పత్తులు - Dairy products for better eyesight 

పాలు, పెరుగు వంటి పాల ఉత్పత్తులు కళ్ళకు చాలా మేలు చేస్తాయి. వాటిలో విటమిన్ ఎ మరియు జింక్ ఖనిజం కూడా ఉంటుంది. విటమిన్ ఎ కార్నియాను రక్షిస్తుంది మరియు జింక్ విటమిన్ కాలేయం నుండి కళ్ళకు సరఫరా కావడంలో సహాయపడుతుంది. జింక్ కంటిలో, ముఖ్యంగా రెటీనా మరియు కోరాయిడ్ (choroid),(రెటీనాకు అంతర్లీనంగా ఉండే ఒక వాస్కులర్ కణజాలం) లో పుష్కలంగా ఉంటుంది. ఈ ముఖ్యమైన ఖనిజం రాత్రి సమయంలో దృష్టిని మెరుగుపరచడంతో పాటు కంటిశుక్లం నివారణకు కూడా సహాయపడుతుంది. రోజుకు కనీసం ఒక గ్లాసు పాలు తీసుకోవడం మంచిది. రోజులో ఎప్పుడైనా భోజనంతో పాటుగా పెరుగు తినవచ్చు.

ఆహారాన్ని మెరుగుపరచడం అనేది కళ్ళ ఆరోగ్యాన్ని మెరుగుపర్చడానికి ఒక మార్గం. ఇది కాకుండా, కళ్ళ ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు మీరు కొన్ని శిక్షణా వ్యాయామాలు చేయవచ్చు. ఈ వ్యాయామాలు కంటి కణాలను పునర్నిర్మించడానికి మరియు అరిగిపోకుండా ఉండడానికి  సహాయపడతాయి తద్వారా కంటి చూపు మరియు కళ్ళ యొక్క పూర్తి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. అటువంటి కొన్ని వ్యాయామాలు ఈ క్రింద వివరంగా వివరించబడ్డాయి.

మెరుగైన కంటి చూపు కోసం స్వింగింగ్ వ్యాయామం - Swinging exercise for better eyesight 

ఈ వ్యాయామం మొత్తం శరీరం కోసం ఇది  అలసట మరియు ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది, దృష్టిని మెరుగుపరుస్తుంది మరియు కళ్ళ యొక్క చైతన్యాన్ని పెంచుతుంది. ఈ వ్యాయామం చేయడానికి, నిటారుగా నుంచుని మీ పాదాలను ఒకదానికొకటి 12 అంగుళాల దూరంలో ఉండేలా పెట్టండి. ఇప్పుడు, మీ శరీరాన్ని కొద్దిగా ఎడమ వైపుకు తిప్పండి, మీ బరువును మీ ఎడమ పాదం మీద మోపండి, అదే సమయంలో మీ కుడి మడమను నేల  మీద నుండి పైకి లేపండి. మీ భుజాలు మరియు మెడను నిటారుగా ఉంచండి. అప్పుడు వేరే పక్కకు తిరిగి, మీ బరువును ఇతర పాదం మీదకు మార్చండి. ఏదైనా ఒకే వస్తువుపై మీ దృష్టిని కేంద్రీకరించకుండా ఉండడానికి ప్రయత్నించండి. రిలాక్స్‌గా ఉండండి మరియు పక్క నుండి మరొక ప్రక్కకు ఈ స్వింగ్ ను దాదాపు 100 సార్లు పునరావృతం చేయడానికి ప్రయత్నించండి. మీరు రోజుకు రెండుసార్లు ఈ వ్యాయామం చేయవచ్చు. నిద్రవేళకు ముందు దీనిని చేయడం వలన నిద్రలో కళ్ళు  ఒత్తిడికి గురికాకుండా ఉంటాయి.

ఈ ఆకు తింటే కళ్ళజోడు పక్కన పడేస్తారు.. కంటి చూపు 99% పెరుగుతుంది!!

కంటిచూపు తగ్గుతోందన్న విషయం మన ఇంట్లోని బామ్మలు, అమ్మమ్మల చెవినబడితే వెంటనే వాళ్లు రోజూ పొన్నగంటి కూర తినమని సలహా ఇస్తారు. నిజానికి చూపు పోయినవాళ్లకీ చూపు తెప్పించగలదనే అర్థంలో దీన్ని ‘పోయిన కంటి కూర’ అని పిలిచేవారు. అదే వాడుకలో పొన్నగంటి అయింది. ఈ ఆకునే సంస్కృతంలో మత్స్యక్షి అనీ, ఇంగ్లిషులో డ్వార్ఫ్‌ కాపర్‌లీఫ్‌, సెసైల్‌ జాయ్‌వీడ్‌ అనీ పిలుస్తారు. సామాన్యుడి బంగారు భస్మంగానూ దీన్ని పిలుస్తారు. పూర్వం తిరిగి శక్తిని పుంజుకునేందుకు కాయకల్పచికిత్స చేయించుకునేవారు. అందులో వాడే బంగారు భస్మానికి బదులు దీన్ని వాడేవారట. మనకన్నా ఉత్తరాదిన దీని వాడకం మరింత ఎక్కువ. ఇందులో పోషకాలూ ఎక్కువే. వంద గ్రాముల ఆకులో 60 క్యాలరీల, 12గ్రా. పిండిపదార్థాలూ, 4.7గ్రా. ప్రొటీన్లూ, 2.1గ్రా. పీచూ, 146మి.గ్రా. కాల్షియం, 45 మి.గ్రా. పొటాషియంలతోబాటు ఎ, సి- విటమిన్లూ పుష్కలంగా లభ్యమవుతాయి.

* ఈ ఆకు జీవక్రియాలోపాలనూ వీర్యకణాల్లోని లోపాలనూ సరిచేస్తుందట. టేబుల్‌స్పూను తాజా ఆకులరసంలో వెల్లుల్లి కలిపి తీసుకుంటే దీర్ఘకాలిక దగ్గు, ఆస్తమా వ్యాధులు తగ్గుతాయట.

* మధుమేహుల్లో కూడా ఇది కణజాలం దెబ్బతినకుండా చూడటంతోబాటు ఆ వ్యాధి కారణంగా కంటిచూపు తగ్గకుండా చేస్తుంది. అందుకే ఇతర మందులతోబాటుగా ఆహారంలో దీన్ని క్రమం తప్పకుండా తీసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది.

* మొలల వ్యాధినీ ఇది నివారిస్తుంది. అయితే ఈ వ్యాధి బాధితులు దీన్ని ఇతర నూనెలతో కాకుండా ఆవునెయ్యితో వండుకుని తింటే మంచిదట. లేదా రెండు టేబుల్‌స్పూన్ల ఆకు రసాన్ని ముల్లంగి ఆకు రసంతో కలిపి రోజుకి రెండుమూడుసార్లు నెలరోజులపాటు తీసుకుంటే ఫలితం ఉంటుంది.

* వైరల్‌, బ్యాక్టీరియాల కారణంగా తలెత్తే జ్వరాలనూ ఇది నివారిస్తుంది. అందుకే పూర్వం క్షయరోగులకు దీన్ని తప్పక పెట్టేవారు. హెచ్‌ఐవీ వైరస్‌ సోకినవాళ్లకీ ఇది మంచిదేనట.

* కంటికలకలూ కురుపులతో బాధపడేవాళ్లు తాజా ఆకుల్ని కళ్లమీద కాసేపు పెట్టుకుంటే నొప్పి తగ్గుతుంది. నరాల్లో నొప్పికి ముఖ్యంగా, వెన్నునొప్పికి ఇది అద్భుతంగా పనిచేస్తుందట. జబ్బుల సంగతెలా ఉన్నా ఆనందాన్ని పెంచే రుచికరమైన ఆకుకూర.

మెరుగైన కంటి చూపు కోసం పామింగ్ వ్యాయామం - Palming exercise for improved eyesight

ఈ వ్యాయామం చేయడానికి, పేరు సూచించినట్లు, మీరు మీ అరచేతులను (పామ్స్) ఉపయోగించుకుంటారు. మీ కళ్ళు మూసుకుని, వాటి మీద మీ అరచేతులను పెట్టండి, మీ నుదిటిపై రెండు చేతుల వేళ్లు ఉండాలి. అయితే, మీ అరచేతులతో కనురెప్పలపై ఎలాంటి ఒత్తిడి కలిగించవద్దు. సాధారణంగా ఈ స్థితిలో, మీకు తీవ్రమైన చీకటి/నలుపుదనం కనిపిస్తుంది, ఇది సంపూర్ణ విశ్రాంతి స్థితిని సూచిస్తుంది. కాంతి, ఏవైనా ప్రకాశవంతమైన రంగు లేదా బూడిద రంగు మచ్చల యొక్క భ్రమలు ఉంటే మీరు కొంతవరకు ఆందోళన/ఒత్తిడిలో ఉన్నారని సూచిస్తాయి. అలాగే, నల్లదనాన్ని చూడటం కోసం దృష్టి కేంద్రీకరించకుండా ఉండటానికి ప్రయత్నించండి, ఎందుకంటే ఈ ప్రయత్నం కూడా ఒత్తిడిని కలిగిస్తుంది. బదులుగా, మీ మెడ మరియు భుజాలను విశ్రాంతిగా ఉంచి మీ మనస్సును తేలికపరిచే ఆహ్లాదకరమైన విషయాలని గుర్తుచేసుకోవడానికి ప్రయత్నించండి. పామింగ్ యొక్క గడువు మరియు తరచుదనాన్నిపెంచడం ద్వారా, మీ కళ్ళు చుట్టూ ఉండే కండరాల యొక్క ఒత్తిడిని తగ్గించడానికి శిక్షణ పొందుతాయి, తదుపరి ఇది మీ దృష్టికి ప్రయోజకరంగా ఉంటుంది.

కంటి చూపు మెరుగుపరచడానికి కంటి మసాజ్ - Eye massage to improve eyesight 

కంటి కండరాలు కూడా ఒత్తిడికి గురవుతాయి మరియు మసాజ్ (మర్దన) దీనిని తగ్గించడంలో సహాయపడుతుంది అలాగే కంటి చూపును మెరుగుపరుస్తుంది. మీ కణతలపై మీ బొటనవేళ్లను చిన్నగా తిప్పుతూ, ఒక దిశలో 20 సార్లు, మరొక దిశలో 20 సార్లు మసాజ్ చేయండి. నుదిటి వద్ద కనుబొమ్మల మధ్య, ముక్కు యొక్క రెండు వైపులా, కళ్ళ క్రింద అదే విధానాన్ని పునరావృతం చేయండి.

ఆరోగ్యకరమైన కళ్ళ కోసం మిటకరించడం (బ్లింకింగ్) - Blinking for healthy eyes

తరచుగా మరియు అప్రయత్నంగా కళ్ళు మిటకరించే (రెప్పపాటులు) అలవాటును పాటించాలి. బ్లింక్ చేయడం (రెప్పపాటు) రెండు ముఖ్యమైన విధులను నిర్వహిస్తుంది: ఇది కళ్ళను ల్యూబ్రికేట్ చేస్తుంది మరియు కన్నీళ్లతో వాటిని శుభ్రపరుస్తుంది మరియు ఇది కంటి కండరాలకు విశ్రాంతి కలిగించడంలో కూడా సహాయపడుతుంది.

కంటి చూపును మెరుగుపరచడంలో సహాయపడే అన్ని సరైన ఆహార పదార్థాలు మరియు వ్యాయామాల గురించి ఇప్పుడు మీకు తెలుసు, ఆరోగ్యకరమైన కళ్ళును పొందడానికి  మీరు తగిన ఆహారాన్ని ఎంచుకోవాలి మరియు మీ జీవనశైలిలో కొన్ని శిక్షణా వ్యాయామాలను కూడా చే

ధన్యవాదములు 

మీ నవీన్ నడిమింటి 

విశాఖపట్నం 

అస్వీకార ప్రకటన: ఈ సైటుపై లభ్యమవుతున్న మొత్తం సమాచారము మరియు లేఖనము కేవలం అవగాహనా ఆవశ్యకతల కొరకు మాత్రమే. ఇక్కడ ఇవ్వబడిన సమాచారమును ఏదైనా ఆరోగ్య సంబంధిత సమస్య లేదా అస్వస్థత నుండి కోలుకోవడానికి లేదా స్వస్థత కొరకు నిపుణుల సలహా లేనిదే ఉపయోగించుకోకూడదు. చికిత్స పరీక్షలు మరియు సేవల కొరకు ఎల్లప్పుడూ ఒక అర్హత పొందిన వైద్యుల సలహా తీసుకోవాలి.


16, మే 2020, శనివారం

మగవాళ్ళు లో అంగస్తంభన సమస్య నడి వయస్సులో కలిగినప్పుడు నవీన్ నడిమింటి పవర్ ని ఇంప్రూవ్ చేసే ఆహారం నియమాలు డైట్ ప్లాన్

పురుషులు ఎదుర్కొంటున్న ప్రధానమైన లైంగిక సమస్యలలో శీఘ్ర స్ఖలనం ఒకటి. ఇది హెచ్చు శాతం మందిని  మానసికంగా కృంగదీస్తున్నది. పురుషుడు సంభోగం సందర్భంగా అంగస్తంభనను నిలుపకోలేకపోవడం ఈ సమస్యకు కారణం. ఉద్వేగం  పొందడానికి మునుపే స్ఖలనం జరగడం శీఘ్రస్ఖలనంగా చెప్పబడుతుంది. రతి ప్రారంభించిన నిమిషం లోపుగా వీర్య  స్ఖలనం జరిగితే దానిని శీఘ్ర స్కలనం లేదా  ప్రి-మెచ్యూర్ ఎజాక్యులేషన్ – ( పి ఐ) అంటారు. ఈ దుస్థితి పురుషునికి మానసికంగా ఇబ్బంది కలిగించి  తన లైంగిక భాగస్వామితో సంబంధాలను త్రుంచివేస్తుంది శీఘ్ర స్ఖలనం ప్రాథమిక (యావజ్జీవ ప్రాతిపదిక ) స్థాయిలో లేదా సెకండరీ స్థాయిలో ( తెచ్చుకొన్నది)  ఉంటుంది. ఈ దుస్థితికి కారణం  శారీరక , మానసిక లేదా జన్యుపమైనది కావచ్చు.  మానసిక ఒత్తిడి నిర్వహణ, ఔషధాల వాడకం, మానసిక వైద్య నిపుణుని సలహాలు మరియు సముచిత వ్యాయామం తో కూడిన  విభిన్న చికిత్సలు పరిస్థితిని చక్కదిద్దుతాయి. శీఘ్రస్ఖలనం సమస్య హెచ్చు  మోతాదులో ఉన్నప్పుడు, చికిత్స లోపం మానసిక ఒత్తిడిని మరింత తీవ్రం చేస్తుంది.. కొన్ని సందర్భాలలో , ఇది పుంస్త్వం/ పుంసకత్వం సమస్యకు దారితీస్తుంది. ఎందుకంటే వీర్యం యోనిలో ప్రవేశించడంలో విఫలమవుతుంది. ఎక్కువ మంది పురుషులలో శీఘ్ర స్ఖలనం సమస్యను వైద్య సహాయంతో నయం చేయవచ్చు

శీఘ్ర స్కలనం యొక్క లక్షణాలు - Symptoms of Premature Ejaculation 

డి ఎస్ ఎం  - 5  ప్రకారం  ఇక వ్యక్తి శీఘ్ర స్ఖలనం సమస్యను ఎదుర్కోవడానికి క్రిందివాటిలో ఏదయినా కారణం కావచ్చు :

  • సంభోగం ప్రారంభించిన నిమిషంలోపుగా స్ఖలనం జరగడం
  • ఆరు నెలల పాటు అంతకంటే హెచ్చు కాలం శీఘ్రస్ఖలనం జరగడం
  • 75% నుండి  100 %  సంభోగం సందర్భాలలో  శీఘ్రస్ఖలనం జరగడం
  • లైంగిక భాగస్వాములలో లైంగికంపరమైన అసంతృప్తి, విసుగు, మానసిక ఒత్తిడి
  • మానసిక దుస్థితి కలగడం, లేదా వైద్య చికిత్స పర్యవసానం అట్టి పరిస్థితికి దారి తీయడం
  • లోగడ మాదక ద్రవ్యాలకు బానిస కావడం, శీఘ్ర స్ఖలనానికి దారితీసే కొన్ని మందులను సేవించడం

శీఘ్ర స్కలనం యొక్క చికిత్స - Treatment of Premature Ejaculation 

చికిత్సకు పెక్కు ఐచ్చికాలు లభిస్తున్నాయి. వాటిలో సలహాలు తీసుకోవడం, ఔషధాల సేవన, లైంగిక ప్రవర్తనలో కొత్త విధానాలు, సమయోచితంగా మత్తు పొందడం వంటివి.

  • సలహాల కల్పన మరియు సెక్స్ థెరపీ.
    సలహాల ప్రక్రియ మీ సలహాదారునితో (కౌన్సెలర్) మీ లైంగిక సమస్యలపై ముఖాముఖిగా మనసు విప్పి చర్చించడం.  మీ సలహాదారు లేక డాక్టరు పరిస్థితిని సరిదిద్దుకోవడానికి ఎదురవుతున్న దుస్థితిని అధిగమించడానికి విధానాలను వివరిస్తారు. ఆందోళనకు, మానసిక ఒత్తిడికి మార్గం సూచిస్తారు.. సెక్స్ థెరపీ మరియి సంబంధాల సలహా ప్రక్రియ భాగస్వాముల మధ్య సత్సంబంధాన్ని పునరుద్ధరిస్తుంది. 
  • ఔషధాలు
    స్ఖలనం ఆలస్యం కావడంలో సహకరించడానికి వివిధ రకాల మందులు సూచింప బడతాయి. వీటిలో ఆంటీడిప్రెషంట్స్, అనాల్జెసిక్స్ మరియు ఫాస్ఫోడైయ్స్టరేస్- 5 నిరోధకాలు చేరి ఉంటాయి. ఇవి స్ఖలనాన్ని నిదానం చేసే గుణం కలిగి ఉంటాయి ( అయితే ఇవి ఎఫ్ డి ఏ ఆమోదం పొందలేదు). మీ ఆరోగ్య స్థాయిని అనుసరించి మీ డాక్టరు ఈ మందులను విడిగా గాని, లేదా ఇతర కొన్న మందులతోపాటుగా గానీ సూచించవచ్చు. స్వయంగా మందులను తీసుకోవడం వల్ల తీవ్రమైన వైద్యపరమైన సమస్యలు ఎదురుకావచ్చు. దీనితో ఈ జబ్బు ఎదుర్కొంటున్న వ్యక్తి వైద్యుని సలహా లేకుండా స్వయంగా మందులను తీసుకొనకూడదు
  • నడచుకోవడంలో విధానాలు
    కొందరిలో శీఘ్రస్కలనాన్ని కేవలం నడవడిక విధానంలో మార్పులతో సరిదిద్దవచ్చు. యోనిలో సంభోగంతో  కాకుండా లైంగికంగా ఇతర విధాలతో సాన్నిహిత్యం పెంపొందించుకోవడంపై దృష్టి నిలపడం ఒక ప్రక్రియ. ఇది పరిస్థితిని చక్కదిద్దుతుందని వెల్లడయింది. మీ డాక్టరు  శీఘ్రస్ఖలనాన్ని అధిగమించడానికి అదుపుచేయడానికి వీటిలో కొన్ని మార్గాలను సూచించవచ్చు.
  • సమయోచితమైన అనీస్థిటిక్స్
    మీ డాక్టరు అనీస్థిటిక్ క్రీములు, స్ప్రేలు సూచించవచ్చు. ఇవి జననాంగంపై వాడినప్పుడు అవి స్పర్శజ్ఞానాన్ని తొలగించి స్ఖలనాన్ని నివరిస్తాయి. వీటిని లైంగిక క్రియకు 10-15 నిమిషాల ముందు ఉపయోగించాలి.  వీటిలో కొన్ని స్ప్రేలు మందుల దుకాణంలో మందుల సూచిక లేకుండా లభిస్తాయి. కొన్నిటికి సూచిక అవసరం.  వీటిలో పెక్కు ఔషధాలు శీఘ్రస్ఖలనాన్ని అదుపు చేసినప్పటికీ, కొన్ని సందర్భాలలో అవి స్పర్శజ్ఞానం కోల్పోవడానికి, స్త్రీలు, పురుషులలో  లైంగిక కోరిక తగ్గడానికి దారి తీస్తాయని కొన్నినివేదికలు పేర్కొంటున్నాయి.
  • వ్యాయామాలు
    కటి కండరాలను ఒత్తిడి చేయడం వల్ల ఒక వ్యక్తి స్ఖలనాన్ని నిదానం చేయవచ్చు. బలహీనమైన కటి కండరాలు శీఘ్ర స్ఖలనానికి వీలు కల్పిస్తాయి.
    • సరియైన కండరాలను గుర్తించండి
      ఈ ప్రక్రియలో చోటుచేసుకొన్న కండరాలను గుర్తించడానికి సంభోగానికి ముందుగా మూత్ర విసర్జనను నిలిపివేయండి. ఈ కండరం స్ఖలనాన్ని నిలుపుతుంది. వాయువును సమయానుసారం బయటకు వదలడాన్ని  నిలపడం వల్ల కూడా స్ఖలనం అదుపుచేయబడుతుంది.
    • కండరాలను  మీ దారికి మలచుకొనండి
      మీ కటి కండరాలను 3 – 4 సెకన్లపాటు సంకోచం చేయండి తర్వాత సడలించందడి. ఈ వ్యాయామాన్ని 4-5 మార్లు కొనసాగించండి.. మీ కండరాలు గట్టి పడటంతో  వ్యాయామాన్ని ప్రతి సమయంలో  10 మార్లు వంతున రోజుకు మూడు మార్లు జరపండి.
  • పాస్- స్వీజ్ ప్రక్రియ
    ఈ ప్రక్రియ శీఘ్ర స్ఖలనం అదుపునకు సహకరిస్తుంది.. సంభోగానికి మునుపు తొలి ప్రక్రియలు యధావిధిగా జరపండి మీరు అంగస్తంభనను అదుపులో ఉంచుకొనలేక , స్ఖలనం జరిగితే, మీ భాగస్వామిని  మీ జననాంగాన్ని ఒత్తిపట్టుకొనాలని చెప్పండి. స్ఖలనం జరపాలనే కోరిక తీరేవరకు కొన్ని సెకన్లు  అలాగే ఉంచుకోవాలి.  ఈ ప్రక్రియను వీలయినన్ని మార్లు కొనసాగించండి. స్ఖలనం జరపకుండా మీ లైంగిక భాగస్వామిలోనికి చొచ్చుకువెళ్లండి. తద్వారా మీరు మీ స్ఖలనాన్ని  అదుపు చేసుకొనగలరు. తర్వాత మీరు స్ఖలనం నియంత్రణకు ఈ ప్రక్రియ అనుసరించే అవసరం ఉండదు. ఈ విధానాన్ని స్ఖలనం జరపకుండా మీ భాగస్వామి శరీరంలోకి చొచ్చుకు వెళ్ళేవరకు కొనసాగించండి. దీనిద్వారా మీరు స్ఖలనాన్ని అదుపులో ఉంచుకొనగలరు
  • తొడుగుల వాదకం
    మందమైన పదార్థం చేయబడిన రబ్బరు తొడుగులు ( కాండోంలు ) జననాంగంలో స్పర్శజ్ఞానాన్ని  జాప్యంచేసి స్ఖలనాన్ని అదుపు/ నిదానం చేస్తాయి  కొన్ని దేశాలలో కాండోములలో ‘క్లైమాక్స్ కాండోము’ లు లభిస్తున్నాయి. ఇవి స్పర్శజ్ఞానాన్ని తగ్గిస్తాయి.

స్వయంగా శ్రద్ధ తీసుకోవడం :

శీఘ్రస్ఖలనం లైంగిక జీవితంపై , భార్యాభర్తల సాన్నిహిత్యంపై చెడుప్రభావం కలిగిస్తుంది.  ఇది దంపతులలో మానసిక ఒత్తిడి కలిగించి వారి మధ్య దూరాన్ని పెంచుతుంది. ప్రతి ముగ్గురిలో ఒకరు తమ జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు  శీఘ్రస్కలనాన్ని ఎదుర్కొంటున్నారని పరిశీలనలు  వెల్లడిస్తున్నాయి. రెండు మూడు అనుభవాలతో దంపతులువారికివారే సరిపడుతున్నారు.

లైంగిక క్రియలో ఆందోళన సమస్యను మరింత జటిలం చేస్తుంది. మీ మనసును, శరీరాన్ని  ప్రశాంతంగా ఉంచుకోండి. సుఖ సాంసారిక జీవితం అనుభవించడానికి ప్రయత్నించండి.  శీఘ్రస్ఖలనం సమస్య ఉన్నప్పటికీ మానసిక ఒత్తిడికి గురికాకుండా ప్రశాంతంగా ఉండండి. ఒక విషయం జ్ఞప్తిలో ఉంచుకోండి.మీ లైంగిక భాగస్వామిని సంతృప్తి పరచడానికి పెక్కు మార్గాలు ఉన్నాయి.  మీలో దానికి అవసరమైన జ్వాల రగులుతూ ఉంటుంది. మీ సాన్నిహిత్యం దెబ్బతినకుండా ఉంటుంది. మీకు సహాయం కావాలనుకొంటే, మీ డాక్టరును సంప్రతించడానికి సందేహించకండి.

జీవన సరళి/ విధానం నిర్వహణ

శీఘ్రస్ఖలనానికి పెక్కు కారకాలు ఉంటాయి. అవి మానసికమైనవి మరియు శరీరకమైనవి కూడా. మానసిక ఒత్తిడి మరియు లైంగిక క్రియ సందర్భంగా ఆందోళన శీఘ్రస్ఖలనంలో కీలకమైన పాత్ర వహిస్తాయి. ఒత్తిడి స్థాయిని అదుపు చేసుకోవడం, మీ లైంగిక భాగస్వామితో నిజాయతీగా దేనినీ దాచిపెట్టకుండా చర్చించడం వల్ల ఈ దుస్థితి నుండి బయటపడవచ్చు. ఒత్తిడిని తొలగించుకొంటే పరిస్థితి చక్కబడుతుంది. కొన్ని జీవనసరళి జబ్బులైన మధుమేహం, హెచ్చు బి పి, థైరాయిడ్ సమస్యలు, ప్రొస్టేట్ సమస్యలు పరిష్కారమైతే  శశీఘ్రస్ఖలనం సమస్యకు పరిష్కారం లభిస్తుంది..

శీఘ్ర స్కలనం కొరకు మందులు


Medicine NamePack Size
XyloXylo 2% Infusion
Xylocaine InjectionXylocaine Viscous Solution
Xylocaine HeavyXylocaine Heavy 5% Injection
XylocardXylocard Injection
CorectilCORECTIL CAPSULE 15S
XyloxXylox 0.2% Gel
ADEL Titanium Metallicum DilutionADEL Titanium Metallicum Dilution 1000 CH
AlocaineAlocaine Injection
Dr. Reckeweg Titanium Metallicum DilutionDr. Reckeweg Titanium Metallicum Dilution 1000 CH
LcaineLcaine Injection
PenetalPENETAL 30MG TABLET 4S
NircaineNircaine Injection
UnicainUnicain 2% Injection
Wocaine AWocaine A Injection
XylonumbXylonumb 2% Injection
XynovaXynova 2% Gel
ZelcaineZelcaine Injection
Smuth CreamSmuth Cream
Quik KoolQuik Kool Gel
Ora FastOra Fast Cream
Orex LoOREX GEL 10GM
TricozolTricozol Ear Drop
      పై మందులు అన్ని డాక్టర్ సలహాలు మేరకు మాత్రమే వాడాలి లేదు సైడ్  ఎఫెక్ట్ ఫాస్ట్ గా వత్తయి జాగ్రత్త మందులు వాడాలి 

"లైంగిక సామర్థ్యం"ను పెంచే ఆహారాలు


 ప్రస్తుత కాలంలో చాలా మంది లైంగిక సమస్యలతో బాధపడుతున్నారు.పని ఒత్తిడి మనసు ఎక్కడా కాసేపు నిలకడగా ఉండనీయడంలేదు. ప్రతిక్షణం ఉద్యోగ వ్యాపారాల ధ్యాసే. వేగవంతమైన జీవితం, కలుషిత వాతావరణం, సమయపాలనా లేని ఆహారం. దీంతో ఆరోగ్యం పట్ల శ్రద్ధ కరువై ఇతర అనారోగ్య సమస్యలతోపాటు ‘లైంగికపరమైన' సమస్యలను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా నేడు ‘డయాబెటిస్' వ్యాధిగ్రస్తులు 50 నుండి 60 శాతం మంది సెక్స్ సమస్యలతో బాధపడుతున్నారు.
 నేడు కనిపిస్తున్న లైంగిక సమస్యల్లో అత్యధిక శాతం మానసిక దుర్భలత్వం, భయం , డయాబెటిస్‌వలన వచ్చినవే. మధుమేహ వ్యాధిగ్రస్తులలో వచ్చే నాడీ సంబంధ వ్యాధుల లోపాలవలన, అంగస్తంభన, శీఘ్రస్కలన సమస్య, సెక్స్ కోరికలు తగ్గడం వంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. దీనికి గల కారణం హార్మోన్ల లోపాలు, డయాబెటిక్ న్యూరోపతి, నిత్య జీవితంలో మానసిక ఒత్తిళ్లు ఎక్కువగా ఉండటం. లైంగిక సామర్థ్యం మానసిక శక్తిమీద ఆధారపడి ఉంటుంది. భయం, ఆందోళన, అనుమనాలు, శీఘ్రస్కలనాలు, స్తంభన లోపాలు వంటి సమస్యలు మనిషిని మానసికంగా బలహీనపరిచి లైంగిక సామర్థ్యాన్ని తగ్గిస్తున్నాయి. 
 సామర్థ్యం తగ్గకుండా ఉండాలంటే: కొన్ని ముఖ్యమైన ఇండియన్ ఆహారాలు సెక్స్ డ్రైవ్ ను నేచురల్ గా పెంపొందించుకోవచ్చు. మంచి ఆహారపు అలవాట్లు అలవరచుకోవాలి. సెక్స్ హార్మోన్లను పెంపొంధించుకోవడానికి పాలు, తేనెను పురాతన కాలం నుండినే ఉపయోగిస్తున్నారు. ఇవే కాక బాదం, ఖర్జూరం, మొలకెత్తిన విత్తనాలు, గ్రుడ్లు, తాజా ఆకుకూరలు తీసుకోవాలి. కీర దోసకాయ, క్యారెట్, బీట్‌రూట్‌తో తయారుచేసిన జ్యూస్‌ను రోజు ఉదయం ఒక గ్లాసు తీసుకోవాలి. యాపిల్, జామ, దానిమ్మ, ద్రాక్ష, నేరేడు వంటి తాజా పండ్లు తీసుకోవాలి. మద్యపానం సేవించుట, స్మోకింగ్, గుట్కాలు, 
పాన్‌పరాగ్, నార్కోటిక్స్ తీసుకోవటంవంటి వ్యసనాలను వదిలివేయాలి. తక్షణ లైంగిక సామర్థ్యం కోసం ‘స్టిరాయిడ్స్' నిత్యం వాడటంవలన లైంగిక పటుత్వం క్రమేపి తగ్గిపోవును. లిబిడో సమస్యలను అధిగమించడానికి పురాతన కాలం నుండి అశ్వగంధని మనకు ప్రసాధించింది. సెక్స్ డ్రైవ్ ను పెంచే ఇండియన్ ఆహారాలు, నేచురల్ లిబిడో బూస్టర్స్ గా సహాయపడుతాయి. అవే మీ సంతోకర జీవితానికి, కొన్ని మసాలాలు ఉన్నాయి. వాటిని పరిశీలించి మీ లిబిడో సమస్యలను నివారించుకోండి...
యాలకులు:
 ఇండియన్ మసాలా దినుసుల్లో ఒకటిగా చెప్పుకొనే యాలకులు మానసిక స్థితి పెంచడం ద్వారా లిబిడో పునరుద్ధరించవచ్చు. ఏలకుల ఆయిల్ మసాజ్ చాలా రొమాంటిక్ మరియు నపుంసకత్వంను తగ్గించి, లైంగిక స్పందన పెంచే cineole కలిగి ఉంది.

సెలరీ(Celery):
 ఈ గ్రీన్ లీఫీ వెజిటేబుల్, ఆడ్రోస్టెనోన్ ను విడుదల చేయడం వల్ల ఇది అంత ఘాటైన వాసన కలిగి ఉంటుంది. ఈ సుగంధ వాసన, భాగస్వామిని ఇట్టే ఆకర్షిస్తుంది.

అరటి పండు: 
అరటి పండులో ఉండే బ్రొమెలైన్(bromelain)అనే ఎంజైమ్ లిబిడోను పెంపొందిస్తుంది మరియు పురుషుల్లో లైంగిక సమస్యలను తగ్గిస్తుంది. అంటిపండులో ఉండే పొటాషియం మరియు విటమిన్ బి శరీరానికి కావల్సినంత శక్తిని అంధిస్తుంది.

 గుడ్లు: 
గుడ్లలో విటమిన్ బి6 మరియు విటమిన్ బి5 పుష్కలంగా ఉంటాయి. ఇవి హార్మోనుల లెవల్స్ ను బ్యాలెన్స్ చేస్తాయి. ఒత్తిడితో పోరాడుతాయి. అధిక లైంగిక వాంఛను కలిగిస్తాయి. ముఖ్యంగా గుడ్లను ఫెర్టిలిటికి సంకేతంగా సూచిస్తారు.

 వెల్లుల్లి: 
వెల్లుల్లిలో ఆశ్చర్యకరమైన ఎల్లిసిన్ ఉండి సెక్స్యువల్ ఆర్గాన్స్ కు రక్త ప్రసరణ అంధించడానికి బాగా సహాయపడుతాయి. ఇవి రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల లిబిడో సమస్యలను దూరంగా ఉంచి లైంగికజీవితంలో అలసట లేకుండా సహాయపడుతుంది

అశ్వగంధ:
 సెక్స్ డ్రైవ్ పెంచడానికి అద్భుతంగా సహాయడే ఔషధం అశ్వగంధ. ఎల్లప్పుడూ సెక్స్ లైఫ్ ను పెంచడానికి భారతీయ ఆయుర్వేద వైద్యంలో దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. ఒక చిటికెడు పల్లేరుకాయల చూర్ణాన్ని, ఒక టీస్పూన్ అశ్వగంధ చూర్ణాన్ని ఒక కప్పు పాలకు కలిపి మరిగించి, వడపోసుకొని పడుకునే సమయంలో తాగితే మగవాళ్లలో లైంగిక బలహీనత తగ్గుతుంది. ఇలాగ కనీసం పది పదిహేను రోజులు వాడాల్సి ఉంటుంది.

Ginseng(ఒక విధమైన మూలిక): ఈ జిన్సెంగ్ మూలిక యొక్క వేరును లిబిడో సమస్యలను నివారించడంలో విస్తృతంగా ఉపయోగించారు. దీన్ని ఇంకా లోయర్ బ్లడ్ ప్రెజర్ మరియు రోగనిరోధక వ్యవస్థను పెంచడానికి ఉపయోగిస్తారు.

డార్క్ చాక్లెట్: 
డార్క్ చాక్లెట్ లిబిడో బూస్టర్ గా బాగా ప్రసిద్ధి చెందింది. చాక్లెట్ లో మీకు సెక్స్ లైఫ్ అనుభూతిని కలిగించి ఒక రసాయనం phenylethylamine ఇందులో ఉంటుంది. డార్క్ చాక్లెట్ తినడానికి మాత్రమే కాదు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి. డార్క్ చాక్లెట్ లో ఉండే ఫోనోఫినాయిల్స్ మెదడులోని ఎండోర్ఫిన్ ఉత్పత్తికి బాగా సహాయపడుతుంది. అంతే కాదు లైంగిక జీవితానికి కూడా బాగా సహాయ పడుతుంది.

ఫిగ్: 
ఇది పురాతనకాలం నుండి వినియోగిస్తున్నారు. ఇది ఆరోగ్యాన్ని మెరుగుపరచడం మాత్రమే కాదు..సెక్స్ లైఫ్ కు సహాయపడటంతో పాటు పురుషుల్లో సంతానోత్పత్తిని పెంపొందిస్తుంది. వీర్యకణాల పెరుగుదలకు సహాయపడుతుంది. డ్రై ఫ్రూట్ ఫిగ్ లిబిడోను సహజంగా పెంపొంధిస్తుంది. సెక్స్ లైఫ్ ను సహజగా పెంచడంలో ఇదొక ఇండియన్ ఫుడ్ గా సూచిస్తారు.


స్ట్రాబెర్రీ:
 కలర్ ఫుల్ స్ట్రాబెర్రీస్ లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది చూడటానికి మాత్రమే కాదు, రుచి, వాసన కూడా అద్భుతంగా ఉంటుంది. ఆరోగ్యానికి కూడా అంతే మేలు చేస్తుంది. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్స్ సెక్స్ లైఫ్ కు అద్భుతంగా సహాయపడుతాయి.

ఆస్పరాగస్:
  దీన్ని ఆహారంగా పురాతన కాలం నుండే తీసుకుంటున్నారు. ఇందులో పొటాషియం, థైమిన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ ఎ, విటమిన్ సి మరియు విటమిన్ ఇలు పుష్కలంగా ఉన్నాయి. ఇది కండారాలకు బూస్ట్ వంటిది. తగినంత శక్తిని అందిస్తుంది.

అవొకాడో: 
ఇది బట్టర్ ఫ్రూట్. అవొకాడోలో మోనో సాచురేటెడ్ ఫ్యాట్స్ పుష్కలంగా ఉంటాయి. ఈ ఫ్యాట్స్ మగవారిలో టెస్టోస్టిరాన్ ఉత్పత్తికి బాగా సహాయడుతాయి. మరియు ఇవి లైంగిక జీవితానికి కావల్సిన ఎనర్జీలెవల్స్ ను పుష్కలంగా అంధిస్తాయి.

గ్రీన్ వెజిటేబుల్స్:
 గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్ లో అధికంగా జింక్ మరియు ఐరన్ మరియు కావల్సినన్ని విటమిన్లు ఉండి శారీరక ఆరోగ్యానికి మరియు లైంగికజీవితానికి బాగా సహాయపడుతాయి.

రెడ్ వైన్: 
ఒక గ్లాస్ రెడ్ వైన్ లో కావల్సినన్ని పోషకాంశాలు ఉంటాయి. ఇవి ఒత్తిడిని తగ్గించడంతో పాటు హార్ట్ రేట్ ను తగ్గిస్తాయి. అంతే కాదు హార్మోనులను నిలకడగా ఉంచుతాయి. ఒక గ్లాస్ రెడ్ వైన్ త్రాగడం వల్ల సెక్స్ సామర్థ్యం పెరుగుతుంది.

ధన్యవాదములు 

మీ నవీన్ నడిమింటి

విశాఖపట్నం 

9703706660

అస్వీకార ప్రకటన: ఈ సైటుపై లభ్యమవుతున్న మొత్తం సమాచారము మరియు లేఖనము కేవలం అవగాహనా ఆవశ్యకతల కొరకు మాత్రమే. ఇక్కడ ఇవ్వబడిన సమాచారమును ఏదైనా ఆరోగ్య సంబంధిత సమస్య లేదా అస్వస్థత నుండి కోలుకోవడానికి లేదా స్వస్థత కొరకు నిపుణుల సలహా లేనిదే ఉపయోగించుకోకూడదు. చికిత్స పరీక్షలు మరియు సేవల కొరకు ఎల్లప్పుడూ ఒక అర్హత పొందిన వైద్యుల సలహా తీసుకోవాలి.