17, మే 2020, ఆదివారం

కంటి చూపు ని మెరుగు పరిచే ఆరోగ్య సలహాలు కోసం మా పేజి ని లింక్స్ చుడండి.

కంటి చూపును మెరుగుపరచుకోవడం ఎలా: ఆహారాలు, వ్యాయామాలు, అవగాహనా కోసం నవీన్ నడిమింటి సలహాలు  - How to improve eyesight: foods, exercises, home remedies 

వయస్సు, జన్యులు మరియు ఆధునిక ఎలక్ట్రానిక్ పరికరాలు వంటి వివిధ అంశాలు కంటి చూపును ప్రభావితం చేస్తాయి, అయితే జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవడం వలన రెటీనా మరియు కార్నియాను ఆరోగ్యంగా ఉంచడంతో పాటు ఫోటోడ్యామేజ్‌ను నివారించడంలో అవి సహాయపడతాయి. కంటి లోపాలకు ఒత్తిడి ఒక ప్రధాన కారణమని ఇటీవలి పరిశోధనలు చెబుతున్నాయి. ఈ వ్యాసం కంటి చూపును మెరుగుపరిచేందుకు పాటించవలసిన అన్ని ఆహార చిట్కాలు మరియు వ్యాయామాలను గురించి చర్చిస్తుంది

విటమిన్లు మరియు ఖనిజాలు అధికంగా ఉండే కొన్ని ఆహారాలను మీ రోజువారీ ఆహారంలో చేర్చుకుంటే అవి కంటి చూపును మెరుగుపరచడంలో సహాయం చేస్తాయి. కంటి చూపును కాపాడే కణాల పెరుగుదల మరియు మరమ్మత్తు (రిపేర్) కు ఈ ఆహారాలు ఉపయోగపడతాయి. కంటి చూపు సహజంగా మెరుగుపడంలో సహాయపడే అటువంటి కొన్నిఆహారాల జాబితా ఈ క్రింద వివరంగా చర్చించ

కంటి చూపు కోసం క్యారెట్లు - Carrots for eyesight 

కంటి చూపును మెరుగుపర్చడానికి పోషకాహార నిపుణులు సూచించే ఒక సాధారణ ఆహార పదార్థం క్యారెట్. వీటిలో బీటా కెరోటిన్ అధికంగా ఉంటుంది, బీటా కెరోటిన్ ఒక యాంటీఆక్సిడెంట్ మరియు విటమిన్ ఎ యొక్క పూర్వగామి (ప్రికసర్). ఆహారంలో  క్యారెట్లను తీసుకోవడం వలన అవి రాత్రి సమయంలో చూపుని మెరుగుపరుస్తాయని మరియు కంటి చూపు క్షీణించడాన్ని నివారించగలవని అధ్యయనాలు కనుగొన్నాయి.

ఈ విటమిన్ కళ్ళ యొక్క రాడ్ (rods) మరియు కోన్ (cone) కణాలకు అవసరమైన రోడాప్సిన్ అనే పిగ్మెంట్ను పెంచడంలో సహాయపడుతుంది. ఈ కణాల యొక్క ఆక్సీకరణ నష్టం మరియు వాపు కళ్ళ సమస్యలకు రెండు ప్రధాన కారణాలు, వీటిని నివారించడానికి కూడా క్యారెట్లు సహాయపడతాయి.

పచ్చి క్యారెట్లు గరిష్ట పోషణను అందిస్తాయి ఎందుకంటే వాటిని వండటం వల్ల వాటిలో ఉన్న పోషక విలువ కొద్దిగా తగ్గుతుంది. వాటిని సలాడ్ల రూపంలో పచ్చిగా తినవచ్చు లేదా వాటిని సూప్‌లకు జోడించవచ్చు. అయితే, విటమిన్ ఎ అధిక మోతాదు కూడా విషపూరితమైనది కాబట్టి క్యారెట్లను అతిగా తినడం కూడా హానికరం.

ఆరోగ్యకరమైన కళ్ళకు గుడ్లు - Eggs for healthy eyes 

కంటి ఆరోగ్యాన్ని మెరుగుపర్చడంలో గుడ్లును ఉత్తమమైన  ఆహారంగా భావిస్తారు. గుడ్డు సొనలలో విటమిన్ ఎ, జియాక్సంతిన్ (zeaxanthin), ల్యూటిన్ మరియు జింక్ అధికంగా ఉంటాయి, ఇవి కంటి ఆరోగ్యానికి కీలకమైనవి. విటమిన్ ఎ కంటి ఉపరితలాన్ని, అంటే కార్నియాను రక్షిస్తుంది. లుటిన్ మరియు జియాక్సంతిన్ మాక్యులర్ డిజనెరేషన్ మరియు కంటిశుక్లం వంటివి వయస్సు-సంబంధిత కంటి సమస్యల యొక్క సంభావ్యతను  తగ్గిస్తాయి. కంటి చూపు మెరుగుపరచడానికి అవసరమైన రెటీనాను కాపాడడంలో  జింక్ సహాయపడుతుంది.

మీ కళ్ళు ఆరోగ్యంగా ఉండటానికి, రోజూ ఒకటి లేదా రెండు గుడ్లు ఉడకబెట్టి తినవచ్చు.

కంటి చూపును మెరుగుపరచడానికి ఆకుకూరలు - Green leafy vegetables for increasing eyesight 

మెరుగైన దృష్టి కోసం ఆరోగ్య నిపుణులు బ్రోకలీ, కాలే మరియు బచ్చలికూర వంటి ఆకుకూరలను సిఫార్సు చేస్తారు. బ్రోకలీ అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూరగాయ. దీనిలో ఉండే విటమిన్లు ఎ, ఇ, సి మరియు ల్యూటిన్ బ్రోకలీని కళ్ళ కోసం ఒక అద్భుతమైన ఆహారంగా చేస్తాయి. ఫోటోడామేజ్ మరియు ఆక్సీకరణ నష్టాన్ని నివారించడం ద్వారా బ్రోకలీ కంటి ఆరోగ్యాన్ని కాపాడుతుంది. వేడి నీటిలో ఉడకబెట్టి లేదా వేపి తీసుకున్నపుడు బ్రోకలీ యొక్క ప్రయోజనాలు చాలా ప్రభావవంతంగా ఉంటాయి.

బచ్చలికూర మరియు కాలే రెండింటిలో కంటి చూపును మెరుగుపర్చడంలో అద్భుతాలు చేయగల విటమిన్లు మరియు ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ల్యూటిన్ మరియు జింక్ యొక్క గొప్ప వనరులు, ఇవి రెండూ ఆరోగ్యకరమైన కళ్ళకు అవసరం. కళ్ళు ఆరోగ్యంగా ఉంచడానికి  బచ్చలికూర మరియు కాలేని స్మూతీలు మరియు సూప్‌లలో చేర్చవచ్చు.

కంటి చూపు మెరుగుపరచడానికి చేప - Fish to improve eyesight 

చేపలు, ముఖ్యంగా కొవ్వు అధికంగా ఉండే చేపలు కంటి చూపును మెరుగుపరచే పోషకాహారం యొక్క గొప్ప మూలాలు. కొవ్వు అధికంగా ఉండే చేపలు ఒమేగా -3-ఫ్యాటీ ఆసిడ్ల యొక్క గొప్ప వనరులు. ఈ కొవ్వు ఆమ్లాలు (ఫ్యాటీ ఆసిడ్లు) కణాలలో ఒమేగా -3 మరియు ఒమేగా -6 ఫ్యాటీ ఆసిడ్ల నిష్పత్తిని సమతుల్యం చేయడం ద్వారా వాపును తగ్గిస్తాయి. రెటీనాకు సమీపంలోని ప్రాంతంలో డిహెచ్ఏ (DHA) అనే ఒక రకమైన ఒమేగా -3 కొవ్వు ఆమ్లం పుష్కలంగా ఉంటుంది. అందువల్ల, సాల్మన్, ట్యూనా వంటి కొవ్వు అధికంగా ఉండే చేపలను తీసుకోవడం అవి కంటి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. నత్త గుల్లలు వంటి సీఫుడ్స్ లో కూడా జింక్ పుష్కలంగా ఉన్నందున అవి కూడా కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.

ఒకవేళ మీరు శాఖాహారులైతే మరియు చేపలు తినకపోతే, మీ వైద్యుడిని సంప్రదించిన తరువాత మీరు చేప నూనెల (ఫిష్ ఆయిల్) సప్లిమెంట్లను తీసుకోవచ్చు. చేపలను వేపితే వాటిలో ఉండే పోషకాలు తగ్గవచ్చు కాబట్టి వాటిని గ్రిల్ చేసి తినవచ్చు.

కంటి చూపు మెరుగుపరచడం కోసం తృణధాన్యాలు - Whole grains for increasing eyesight 

తృణధాన్యాలు కూడా కంటి చూపు మెరుగుపరచడంలో ప్రయోజనకరంగా ఉంటాయని తెలిసింది. ఇవి ఫైబర్, విటమిన్లు, ఫైటోన్యూట్రియెంట్స్ మరియు ఖనిజాల యొక్క గొప్ప వనరులు. విటిలో విటమిన్ ఇ మరియు జింక్ వంటి ముఖ్యమైన పోషకాలు కూడా ఉంటాయి. కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు క్వినోవా, వోట్స్, తృణధాన్యాలు మరియు బ్రౌన్ రైస్ వంటి తృణధాన్యాలను  మీ ఆహారంలో చేర్చండి.

కంటి చూపు మెరుగుపరచడం కోసం నిమ్మజాతి పండ్లు - Citrus fruits to improve eyesight 

కళ్ళలో మెటబోలిక్ (జీవక్రియ) చర్యలు చాలా ఎక్కువగా ఉంటాయి మరియు ఈ జీవక్రియ ప్రతిచర్యల ఫలితంగా ఉత్పత్తి అయ్యే టాక్సిన్లను తొలగించడానికి యాంటీఆక్సిడెంట్లు నిరంతరంగా అవసరమవుతాయి. సిట్రిక్ యాసిడ్ అధికంగా ఉండే ఆహారాలు కంటి వ్యాధులను నివారించడంలో సహాయపడతాయని అధ్యయనాలు కనుగొన్నాయి. బెర్రీలు, కమలాలు మరియు కివీలు  వంటి సిట్రస్ పండ్లలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది ఒక యాంటీఆక్సిడెంట్, ఇది హానికరమైన ఆక్సిజన్ రాడికల్స్ ను నైట్రలైజ్ చేయడంలో సహాయపడుతుంది, తద్వారా కంటి కండరాలు దెబ్బతినకుండా కాపాడుతుంది. విటమిన్ సి కళ్ళలో ఉండే రక్త నాళాలను మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుంది.

మెరుగైన కంటి చూపు కోసం చిలగడదుంప - Sweet potato for improved eyesight 

చిలగడదుంప మరియు ఊదా రంగు చిలగడదుంప రెండూ చూపును మెరుగుపరచడంలో ప్రభావవంతంగా ఉంటాయి. వీటిలో ఉండే గొప్ప రంగు జియాక్సంతిన్, లుటిన్ వంటి పిగ్మెంట్లు ఉండటం వల్ల వస్తుంది. చిలగడదుంపలలో ఈ యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి, అవి వాపును తగ్గించడానికి మరియు టాక్సిన్స్ ను బయటకు తొలగించడానికి సహాయపడతాయి. చిలగడదుంపలను తినడానికి ఉత్తమ మార్గం వాటిని కాల్చి లేదా ఉడకబెట్టి తినడం, అలా చేయడం వలన వాటిలో పోషకాలు తొలగిపోవు.

కాయధాన్యాలు మరియు బీన్స్ వలన కంటి చూపు పెరుగుతుంది - Legumes and beans for increased eyesight i

బీన్స్ మరియు కాయధాన్యాలను తినడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది. ఇవి జింక్ మరియు బయోఫ్లేవినోయిడ్ల (bioflavonoids) యొక్క గొప్ప వనరులు, ఇవి రెటీనాను రక్షిస్తాయి మరియు కంటిశుక్లం వచ్చే ప్రమాదాన్ని కూడా నివారిస్తాయి. మీ కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు మీ ఆహారంలో రాజ్మా గింజలు, పెసలు, అలసందలు, ఉలవలు, పచ్చి బఠానీలు, శనగలు మరియు మొలకలు తగినంత మొత్తంలో ఉండాలి.

కంటి ఆరోగ్యం మెరుగుపడడానికి నట్స్ (గింజలు) - Nuts for improved eye health 

కంటి ఆరోగ్యానికి బాదం వంటి గింజలు (గింజలు) చాలా మంచివి. బాదంపప్పులో విటమిన్ ఇ ఉంటుంది, ఇది ఆరోగ్యకరమైన కణజాలాలను ప్రభావితం చేస్తే  అన్ స్టేబుల్ మొలిక్యూల్స్ నుండి కళ్ళను రక్షించడంలో సహాయపడుతుంది. విటమిన్ ఇ ఉండే ఆహారాలను తినడం వలన చాలా కంటి వ్యాధులను నివారించడంలో ఇవి సహాయపడతాయి. అత్యంత ప్రభావివంతమైన ఫలితాలను పొందడానికి బాదంపప్పులను రాత్రిపూట నీటిలో నానబెట్టి, ఉదయం తినడం మంచిది.

మంచి కంటి చూపుకు పాల ఉత్పత్తులు - Dairy products for better eyesight 

పాలు, పెరుగు వంటి పాల ఉత్పత్తులు కళ్ళకు చాలా మేలు చేస్తాయి. వాటిలో విటమిన్ ఎ మరియు జింక్ ఖనిజం కూడా ఉంటుంది. విటమిన్ ఎ కార్నియాను రక్షిస్తుంది మరియు జింక్ విటమిన్ కాలేయం నుండి కళ్ళకు సరఫరా కావడంలో సహాయపడుతుంది. జింక్ కంటిలో, ముఖ్యంగా రెటీనా మరియు కోరాయిడ్ (choroid),(రెటీనాకు అంతర్లీనంగా ఉండే ఒక వాస్కులర్ కణజాలం) లో పుష్కలంగా ఉంటుంది. ఈ ముఖ్యమైన ఖనిజం రాత్రి సమయంలో దృష్టిని మెరుగుపరచడంతో పాటు కంటిశుక్లం నివారణకు కూడా సహాయపడుతుంది. రోజుకు కనీసం ఒక గ్లాసు పాలు తీసుకోవడం మంచిది. రోజులో ఎప్పుడైనా భోజనంతో పాటుగా పెరుగు తినవచ్చు.

ఆహారాన్ని మెరుగుపరచడం అనేది కళ్ళ ఆరోగ్యాన్ని మెరుగుపర్చడానికి ఒక మార్గం. ఇది కాకుండా, కళ్ళ ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు మీరు కొన్ని శిక్షణా వ్యాయామాలు చేయవచ్చు. ఈ వ్యాయామాలు కంటి కణాలను పునర్నిర్మించడానికి మరియు అరిగిపోకుండా ఉండడానికి  సహాయపడతాయి తద్వారా కంటి చూపు మరియు కళ్ళ యొక్క పూర్తి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. అటువంటి కొన్ని వ్యాయామాలు ఈ క్రింద వివరంగా వివరించబడ్డాయి.

మెరుగైన కంటి చూపు కోసం స్వింగింగ్ వ్యాయామం - Swinging exercise for better eyesight 

ఈ వ్యాయామం మొత్తం శరీరం కోసం ఇది  అలసట మరియు ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది, దృష్టిని మెరుగుపరుస్తుంది మరియు కళ్ళ యొక్క చైతన్యాన్ని పెంచుతుంది. ఈ వ్యాయామం చేయడానికి, నిటారుగా నుంచుని మీ పాదాలను ఒకదానికొకటి 12 అంగుళాల దూరంలో ఉండేలా పెట్టండి. ఇప్పుడు, మీ శరీరాన్ని కొద్దిగా ఎడమ వైపుకు తిప్పండి, మీ బరువును మీ ఎడమ పాదం మీద మోపండి, అదే సమయంలో మీ కుడి మడమను నేల  మీద నుండి పైకి లేపండి. మీ భుజాలు మరియు మెడను నిటారుగా ఉంచండి. అప్పుడు వేరే పక్కకు తిరిగి, మీ బరువును ఇతర పాదం మీదకు మార్చండి. ఏదైనా ఒకే వస్తువుపై మీ దృష్టిని కేంద్రీకరించకుండా ఉండడానికి ప్రయత్నించండి. రిలాక్స్‌గా ఉండండి మరియు పక్క నుండి మరొక ప్రక్కకు ఈ స్వింగ్ ను దాదాపు 100 సార్లు పునరావృతం చేయడానికి ప్రయత్నించండి. మీరు రోజుకు రెండుసార్లు ఈ వ్యాయామం చేయవచ్చు. నిద్రవేళకు ముందు దీనిని చేయడం వలన నిద్రలో కళ్ళు  ఒత్తిడికి గురికాకుండా ఉంటాయి.

ఈ ఆకు తింటే కళ్ళజోడు పక్కన పడేస్తారు.. కంటి చూపు 99% పెరుగుతుంది!!

కంటిచూపు తగ్గుతోందన్న విషయం మన ఇంట్లోని బామ్మలు, అమ్మమ్మల చెవినబడితే వెంటనే వాళ్లు రోజూ పొన్నగంటి కూర తినమని సలహా ఇస్తారు. నిజానికి చూపు పోయినవాళ్లకీ చూపు తెప్పించగలదనే అర్థంలో దీన్ని ‘పోయిన కంటి కూర’ అని పిలిచేవారు. అదే వాడుకలో పొన్నగంటి అయింది. ఈ ఆకునే సంస్కృతంలో మత్స్యక్షి అనీ, ఇంగ్లిషులో డ్వార్ఫ్‌ కాపర్‌లీఫ్‌, సెసైల్‌ జాయ్‌వీడ్‌ అనీ పిలుస్తారు. సామాన్యుడి బంగారు భస్మంగానూ దీన్ని పిలుస్తారు. పూర్వం తిరిగి శక్తిని పుంజుకునేందుకు కాయకల్పచికిత్స చేయించుకునేవారు. అందులో వాడే బంగారు భస్మానికి బదులు దీన్ని వాడేవారట. మనకన్నా ఉత్తరాదిన దీని వాడకం మరింత ఎక్కువ. ఇందులో పోషకాలూ ఎక్కువే. వంద గ్రాముల ఆకులో 60 క్యాలరీల, 12గ్రా. పిండిపదార్థాలూ, 4.7గ్రా. ప్రొటీన్లూ, 2.1గ్రా. పీచూ, 146మి.గ్రా. కాల్షియం, 45 మి.గ్రా. పొటాషియంలతోబాటు ఎ, సి- విటమిన్లూ పుష్కలంగా లభ్యమవుతాయి.

* ఈ ఆకు జీవక్రియాలోపాలనూ వీర్యకణాల్లోని లోపాలనూ సరిచేస్తుందట. టేబుల్‌స్పూను తాజా ఆకులరసంలో వెల్లుల్లి కలిపి తీసుకుంటే దీర్ఘకాలిక దగ్గు, ఆస్తమా వ్యాధులు తగ్గుతాయట.

* మధుమేహుల్లో కూడా ఇది కణజాలం దెబ్బతినకుండా చూడటంతోబాటు ఆ వ్యాధి కారణంగా కంటిచూపు తగ్గకుండా చేస్తుంది. అందుకే ఇతర మందులతోబాటుగా ఆహారంలో దీన్ని క్రమం తప్పకుండా తీసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది.

* మొలల వ్యాధినీ ఇది నివారిస్తుంది. అయితే ఈ వ్యాధి బాధితులు దీన్ని ఇతర నూనెలతో కాకుండా ఆవునెయ్యితో వండుకుని తింటే మంచిదట. లేదా రెండు టేబుల్‌స్పూన్ల ఆకు రసాన్ని ముల్లంగి ఆకు రసంతో కలిపి రోజుకి రెండుమూడుసార్లు నెలరోజులపాటు తీసుకుంటే ఫలితం ఉంటుంది.

* వైరల్‌, బ్యాక్టీరియాల కారణంగా తలెత్తే జ్వరాలనూ ఇది నివారిస్తుంది. అందుకే పూర్వం క్షయరోగులకు దీన్ని తప్పక పెట్టేవారు. హెచ్‌ఐవీ వైరస్‌ సోకినవాళ్లకీ ఇది మంచిదేనట.

* కంటికలకలూ కురుపులతో బాధపడేవాళ్లు తాజా ఆకుల్ని కళ్లమీద కాసేపు పెట్టుకుంటే నొప్పి తగ్గుతుంది. నరాల్లో నొప్పికి ముఖ్యంగా, వెన్నునొప్పికి ఇది అద్భుతంగా పనిచేస్తుందట. జబ్బుల సంగతెలా ఉన్నా ఆనందాన్ని పెంచే రుచికరమైన ఆకుకూర.

మెరుగైన కంటి చూపు కోసం పామింగ్ వ్యాయామం - Palming exercise for improved eyesight

ఈ వ్యాయామం చేయడానికి, పేరు సూచించినట్లు, మీరు మీ అరచేతులను (పామ్స్) ఉపయోగించుకుంటారు. మీ కళ్ళు మూసుకుని, వాటి మీద మీ అరచేతులను పెట్టండి, మీ నుదిటిపై రెండు చేతుల వేళ్లు ఉండాలి. అయితే, మీ అరచేతులతో కనురెప్పలపై ఎలాంటి ఒత్తిడి కలిగించవద్దు. సాధారణంగా ఈ స్థితిలో, మీకు తీవ్రమైన చీకటి/నలుపుదనం కనిపిస్తుంది, ఇది సంపూర్ణ విశ్రాంతి స్థితిని సూచిస్తుంది. కాంతి, ఏవైనా ప్రకాశవంతమైన రంగు లేదా బూడిద రంగు మచ్చల యొక్క భ్రమలు ఉంటే మీరు కొంతవరకు ఆందోళన/ఒత్తిడిలో ఉన్నారని సూచిస్తాయి. అలాగే, నల్లదనాన్ని చూడటం కోసం దృష్టి కేంద్రీకరించకుండా ఉండటానికి ప్రయత్నించండి, ఎందుకంటే ఈ ప్రయత్నం కూడా ఒత్తిడిని కలిగిస్తుంది. బదులుగా, మీ మెడ మరియు భుజాలను విశ్రాంతిగా ఉంచి మీ మనస్సును తేలికపరిచే ఆహ్లాదకరమైన విషయాలని గుర్తుచేసుకోవడానికి ప్రయత్నించండి. పామింగ్ యొక్క గడువు మరియు తరచుదనాన్నిపెంచడం ద్వారా, మీ కళ్ళు చుట్టూ ఉండే కండరాల యొక్క ఒత్తిడిని తగ్గించడానికి శిక్షణ పొందుతాయి, తదుపరి ఇది మీ దృష్టికి ప్రయోజకరంగా ఉంటుంది.

కంటి చూపు మెరుగుపరచడానికి కంటి మసాజ్ - Eye massage to improve eyesight 

కంటి కండరాలు కూడా ఒత్తిడికి గురవుతాయి మరియు మసాజ్ (మర్దన) దీనిని తగ్గించడంలో సహాయపడుతుంది అలాగే కంటి చూపును మెరుగుపరుస్తుంది. మీ కణతలపై మీ బొటనవేళ్లను చిన్నగా తిప్పుతూ, ఒక దిశలో 20 సార్లు, మరొక దిశలో 20 సార్లు మసాజ్ చేయండి. నుదిటి వద్ద కనుబొమ్మల మధ్య, ముక్కు యొక్క రెండు వైపులా, కళ్ళ క్రింద అదే విధానాన్ని పునరావృతం చేయండి.

ఆరోగ్యకరమైన కళ్ళ కోసం మిటకరించడం (బ్లింకింగ్) - Blinking for healthy eyes

తరచుగా మరియు అప్రయత్నంగా కళ్ళు మిటకరించే (రెప్పపాటులు) అలవాటును పాటించాలి. బ్లింక్ చేయడం (రెప్పపాటు) రెండు ముఖ్యమైన విధులను నిర్వహిస్తుంది: ఇది కళ్ళను ల్యూబ్రికేట్ చేస్తుంది మరియు కన్నీళ్లతో వాటిని శుభ్రపరుస్తుంది మరియు ఇది కంటి కండరాలకు విశ్రాంతి కలిగించడంలో కూడా సహాయపడుతుంది.

కంటి చూపును మెరుగుపరచడంలో సహాయపడే అన్ని సరైన ఆహార పదార్థాలు మరియు వ్యాయామాల గురించి ఇప్పుడు మీకు తెలుసు, ఆరోగ్యకరమైన కళ్ళును పొందడానికి  మీరు తగిన ఆహారాన్ని ఎంచుకోవాలి మరియు మీ జీవనశైలిలో కొన్ని శిక్షణా వ్యాయామాలను కూడా చే

ధన్యవాదములు 

మీ నవీన్ నడిమింటి 

విశాఖపట్నం 

అస్వీకార ప్రకటన: ఈ సైటుపై లభ్యమవుతున్న మొత్తం సమాచారము మరియు లేఖనము కేవలం అవగాహనా ఆవశ్యకతల కొరకు మాత్రమే. ఇక్కడ ఇవ్వబడిన సమాచారమును ఏదైనా ఆరోగ్య సంబంధిత సమస్య లేదా అస్వస్థత నుండి కోలుకోవడానికి లేదా స్వస్థత కొరకు నిపుణుల సలహా లేనిదే ఉపయోగించుకోకూడదు. చికిత్స పరీక్షలు మరియు సేవల కొరకు ఎల్లప్పుడూ ఒక అర్హత పొందిన వైద్యుల సలహా తీసుకోవాలి.


కామెంట్‌లు లేవు: