19, మే 2020, మంగళవారం

హైట్ (పొడవు ) పెరగాలి అంటే డైట్ ప్లాన్


 హైట్ పెరగాలంటే ఇవి తినండి చాలు అవగాహనా కోసం నవీన్ నడిమింటి సలహాలు 

ప్రతి ఒక్కరూ హైట్ గా ఉండాలని కోరుకుంటారు. కానీ ఆ ఎత్తు కొంత మందినే వరిస్తుంది. హైట్ పెరగడం కోసం ఎన్నో కసరత్తులు చేస్తారు. కానీ టీనేజీ దాటాక హైట్ పెరగడం ఆగిపోతుంది. అయితే వయసు దాటిపోయినప్పటికీ కొందరు హైట్ పెరగాలని అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. ఇది అన్నిసార్లూ సరైన ఫలితాన్నివ్వకపోవచ్చు. అందుకే ఎదుగుతున్న వయసులోనే తగిన జాగ్రత్తలు పాటించడం వల్ల సరైన ఎత్తు పెరగవచ్చు. ఆహారంలో కొన్ని మార్పులు చేయడం ద్వారా ఎత్తు పెరిగే అవకాశం ఉంది. ఎత్తు పెరగడానికి ఉపయోగపడే కొన్ని ఆహార పదార్థాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం..
బఠాని:
బఠానిలు రోజు తీసుకోనడం వల్ల ఎత్తు పెరిగే అవకాశం ఉంటుంది. ఫైబర్, ప్రోటీన్స్, మినరల్స్ దీంట్లో అధికంగా ఉంటాయి.

సోయాబీన్:
         ఎత్తు పెరగడానికి సోయాబీన్ చాలా ఉపయోగపడుతుంది. రోజు 50 గ్రాముల తీసుకోవడం వల్ల త్వరగా ఎత్తు పెరుగవచ్చు. దీంట్లో ఫైబర్, కార్భోహైడ్రేట్స్ అధిక స్థాయిలో ఉంటాయి.

పాలు:
       రోజు ఒక గ్లాస్ పాలు తాగడం వల్ల ఎత్తు పెరుగవచ్చు. దీంట్లో విటమిన్ బీ12, డీ తో పాటు కాల్షియం ఉంటుంది.

ఎర్ర ముల్లంగి:

ఎర్రముల్లంగిని తరుచూ తీసుకోవడం వలన ఎత్తు పెరుగవచ్చు. దీంట్లో ఎత్తు పెరగడానికి ఉపయోగపడే హార్మోన్‌లు అధికంగా ఉంటాయి.

బెండకాయ:

ఎత్తు పెరగడానికి ఉపయోగపడే మరో కురగాయ బెండకాయ. దీంట్లో విటమిన్లు, ఫైబర్, పిండిపదర్థాలు, నీరు, ఖనిజాలు అధికంగా ఉంటాయి. అంతే కాదు బెండకాయ తింటే తెలివితేటలు కూడా పెరుగుతాయి.

అరటిపండు:

బరువు పెరుగకుండా ఉండాలనుకుంటున్నవాళ్లు అరటిపళ్లకు చాలా దూరంగా ఉంటారు. నిజానికి అరటిలో చాలా సుగుణాలు ఉన్నాయి. దీన్ని రోజు తీసుకోవడం వలన ఎత్తు పెరగడంతో పాటు హెయిర్ లాస్ కూడా తగ్గుతుంది.


బచ్చలికూర:

ఎత్తు పెరగడానికి ఉపయోగపడే అద్భుతమైన ఆకుకూర బచ్చలి. ఇది ఎక్కువ దక్షణ ఆసియాలో లబిస్తుంది. అంతే కాదు అక్కడే దీనిని ఎక్కువగా తింటారు. బచ్చలిలో ఐరన్, కాల్షియం, ఫైబర్ అధికంగా ఉంటాయి.

గ్రీన్ బీన్స్:

ఫైబర్, ప్రోటిన్లు, విటమిన్లు, పిండి పదార్థాలు బీన్స్‌లో పుష్కలంగా ఉంటాయి. బీన్స్‌ను ఎక్కువగా తీసుకోవడం వలన ఎత్తు పెరుగవచ్చు.

How to Increase Height (హైట్ పెరగడం ఎలా?)

Height (ఎత్తు) పెరగడం అనేది ముఖ్యంగా మన జీన్స్ పై అంటే జన్యువులపై ఆధారపడి ఉంటుంది. సుమారుగా 60 నుండి 80 శాతం మనుషుల యొక్క ఎత్తు జీన్స్ ని బట్టే ఉంటుంది. అయితే 20 నుండి 40 శాతం ఎత్తు మనం తీసుకునే పోషకాహారం పై ఆధారపడి ఉంటుంది.

మీరు శరీరానికి కావలసిన పోషక ఆహారం పట్ల జాగ్రత్త తీసుకోవడం వల్ల అవి మీరు ఎత్తు ఎదగడానికి సహాయపడవచ్చు. ఒక్కసారి మీ గ్రోత్ ప్లేట్స్ కలిసిపోయినట్లయితే ఇంక మీరు ఎత్తు ఎదగడం ఆగిపోతారు. ఇది సాధారణంగా 14 మరియు 18 సంవత్సరాల మధ్య జరుగుతుంది. ఒకవేళ మీరు ఆ తర్వాత కూడా పెరుగుతున్నట్లు అయితే మీరు పాటించిన ఆహారపోషణ మరియు ఆరోగ్యకరమైన జీవనశైలి మీకు సహాయపడి ఉండవచ్చు.

ఎత్తు పెరగడం కోసం పాటించవలిసిన కొన్ని చిట్కాలు.

1. మీ శరీరం ఎదగడానికి ఆరోగ్యకరమైన మరియు పోషకాలతో కూడిన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం మంచి పోషకాహారం మీ శరీరం యొక్క ఎదుగుదల సామర్ధ్యాన్ని నిర్ణయిస్తుంది. మీరు రోజూ తినే ఆహారంలో తాజా కూరగాయలు, పండ్లు, లీన్ ప్రోటీన్లు మరియు కార్బోహైడ్రేట్లు ఉండేలా చూసుకోండి. మీ ప్లేట్ లో సగభాగం తాజా కూరగాయలు, పావు వంతు లీన్ ప్రోటీన్లు మరియు మరో పావు వంతు కార్బోహైడ్రేట్లు ఉండాలి.

ప్రొటీన్ల ఉన్న ఆహార పదార్థాలకు ఉదాహరణలు: మాంసం, చేపలు, బీన్స్ మరియు తక్కువ కొవ్వు శాతం ఉన్న పాలు.

కార్బో హైడ్రేట్ ఉన్న పదార్థాలకు ఉదాహరణకు: తృణధాన్యాలు మరియు పిండి పదార్థం ఎక్కువగా కలిగి ఉన్న కూరగాయలు – బంగాళాదుంపలు.

2. మీ ఆహారంలో ఎక్కువ ప్రోటీన్లు ఉండేలా చూసుకోండి. కండరాలు మరియు శరీర బరువును పెంచడానికి ఈ ప్రోటీన్లు మీకు సహాయపడతాయి.
ఉదాహరణకి పెరుగు, చేపలు, చికెన్ మరియు వెన్న తినడం మంచిది.

3. మీకు గుడ్డు అంటే ఎలర్జీ లేకపోతే ప్రతి రోజూ ఒక గుడ్డు తినండి. ప్రతిరోజు ఒక గుడ్డు తినే పిల్లలు తినని పిల్లలకంటే ఎక్కువ ఎత్తు పెరుగుతారు. గుడ్లు పెరుగుదలకు తోడ్పడే ప్రొటీన్లు మరియు విటమిన్లు కలిగి ఉంటాయి.

4. ప్రతిరోజు పాల పదార్థాలు తినడం మంచిది. మీ శరీరానికి తగిన పోషణ ఇవ్వడానికి పాలలో ప్రొటీన్లు, కాల్షియం మరియు విటమిన్లు ఉంటాయి. అలాగే క్యాల్షియం మరియు విటమిన్లు కలిగి ఉండే ఇతర ఆహార పదార్థాలు తినడం మంచిది.

5. బలమైన ఎముకలు మరియు కండరాల కోసం రోజూ 30 నిమిషాలు వ్యాయామం చేయండి. ప్రతిరోజు వ్యాయామం చేయడం వలన మీరు ఆరోగ్యంగా ఉండటమే కాకుండా ఎత్తు కూడా పెరుగుతారు.
ప్రతిరోజు మీరు చేయగలిగే మరియు ఇష్టమైన వ్యాయామాన్ని ఎంచుకోండి. ఉదాహరణకు ఏదైనా అవుట్ డోర్ గేమ్ ఆడడం, డాన్స్, ఎక్కువ దూరం నడవడం, రన్నింగ్ చేయడం వంటివి.

6. పెరుగుదలను ఆపే పదార్థాలు తీసుకోవడం మానేయండి. డ్రగ్స్ మరియు ఆల్కహాల్ మీ శరీరం ఎదుగుదల ఆగిపోవడానికి కారణం అవుతాయి. మరియు ఎక్కువగా కెఫైన్ పదార్థాలు తీసుకోవడం మరియు ధూమపానం ఆపేయండి. ఎందుకంటే ఇవన్నీ శరీర పెరుగుదల మీద ప్రభావం చూపిస్తాయి.

7 తగినంత నిద్ర పోవడం మంచిది. తగినంత నిద్ర మరియు విశ్రాంతి శరీరం యొక్క మొత్తం పెరుగుదల మరియు అభివృద్ధికి సహాయపడుతాయి. నిద్రలో మీ శరీరంలోని పిట్యూటరీ గ్రంధి గ్రోత్ హార్మోన్ ని ఉత్పత్తి చేస్తుంది. ఇది మీ శరీరం యొక్క పెరుగుదల మరియు అభివృద్ధికి సహాయపడుతుంది.

నిద్ర సమయం:

2 మరియు అంత కంటే తక్కువ వయసున్న పిల్లలు 13-22 గంటలు పడుకోవడం మంచిది.
3-5 సంవత్సరాల పిల్లలు 11-13 గంటల నిద్ర అవసరం.
6-7 సంవత్సరాల వయసున్న పిల్లలకు 9 నుండి 10 గంటలు,
8-14 సంవత్సరాలు గల వారికి 8-9 గంటలు మరియు
15 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ వయసు గలవారికి 7- 9 గంటల నిద్ర అవసరం.

8. వంగి ఉండకుండా నిటారుగా నిలబడడం నిటారుగా నడవడం ప్రాక్టీస్ చెయ్యండి. ఇది మీరు ఎదగడానికి ఏమి సహాయపడదు కానీ మీరు కొంచెం పొడవుగా కనిపించడానికి సహాయపడుతుంది. మీరు కూర్చున్నప్పుడు మీ వీపును నిటారుగా ఉంచడం నడుస్తున్నప్పుడు స్ట్రైట్ గా నిల్చొని, భుజాలు వెనక్కి పెట్టి గడ్డం పైకెత్తి నడవడం ప్రాక్టీస్ చేయండి.

పిల్లలు హైటు పెరగాలంటే ఏంచేయాలి

పిల్లలు ఎత్తుపెరగటానికి ఇలా చేస్తే చాలు
తమ పిల్లలు ఇతర పిల్లల కంటే బాగా ఎత్తుగా పెరగాలని ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటుంటారు. ఇందులో ఎలాంటి తప్పుకూడా లేదు...పిల్లలు ఎత్తుపెరగాలని కోరుకునే తల్లిదండ్రులు అందుకు అవసరమైన పోషకాహారాలను వారికి అందించటంలోకూడా దృష్టిసారించాల్సిన అవసరం ఉంది. దేశంలో సరాసరి ఎత్తు ఐదు అడుగులు. అయితే ఇంతకంటే హైట్ పెరగాలనుకుంటుంటారు చాలామంది. 

అయితే ఎత్తు పెరగడం ఒక్కరోజులో సాధ్యమయ్యే పని కాదు. అతి కృత్రిమంగా వచ్చేదీ కాదు. ఆపరేషన్ చేయించుకుంటే ఎత్తు పెరగడం అసాధ్యం. అందుకే ఎత్తు పెరగాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. శారీరక అభివృద్ధి జరిగే సమయంలో ఈ జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఎత్తు పెరిగేందుకు అవకాశం ఉంటుంది. ఇందుకోసం మనం చేయాల్సిన పని మంచి ఆహారం తినడం.

సాధారణంగా టీనేజీ దాటాక ఎత్తు పెరగడం ఆగిపోతుంది. వయసు దాటిపోయినప్పటికీ కొందరు ఎత్తు పెరిగేందుకు అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. ఇది అన్నిసార్లూ సరైన ఫలితాన్ని ఇవ్వకపోవచ్చు. అందుకే ఎదుగుతున్న వయసులోనే తగిన జాగ్రత్తలు పాటించడం వల్ల సరైన ఎత్తు పెరగవచ్చు. ఆహారంలో కొన్ని మార్పులు చేయడం ద్వారా ఎత్తు పెరిగే అవకాశం ఉంది.

పోషకాహార పదార్థాలను రోజూ ఎదిగే వయసులో తీసుకోవడం ద్వారా మంచి ఫలితముంటుంది.

క్యారెట్ : క్యారెట్ ను తరుచూ తీసుకోవడం వల్ల ఎత్తు పెరుగవచ్చు. దీంట్లో ఎత్తు పెరగడానికి ఉపయోగపడే హార్మోన్‌లు అధికంగా ఉంటాయి.

బీన్స్ : ఫైబర్, ప్రోటిన్లు, విటమిన్లు, పిండిపదార్థాలు బీన్స్‌ లో పుష్కలంగా ఉంటాయి. బీన్స్‌ ను ఎక్కువగా తీసుకోవడం వలన ఎత్తు పెరుగవచ్చు.

బెండకాయ : ఎత్తు పెరగడానికి ఉపయోగపడే మరో కురగాయ బెండకాయ. దీంట్లో విటమిన్లు, ఫైబర్, పిండిపదర్థాలు, నీరు, ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి.

బచ్చలికూర : ఎత్తు పెరగడానికి ఉపయోగపడే అద్భుతమైన ఆకుకూర బచ్చలి. ఐరన్, కాల్షియం, ఫైబర్ బచ్చలిలో అధికంగా ఉంటాయి.

బఠాని : బఠానీలు రోజు తీసుకోవడం వల్ల ఎత్తు పెరిగే అవకాశం ఉంటుంది. ఫైబర్, ప్రోటీన్స్, మినరల్స్ దీంట్లో సమృద్ధిగా ఉంటాయి.

అరటిపండు : బరువు పెరుగకుండా ఉండాలనుకుంటున్నవాళ్లు అరటిపళ్లకు చాలా దూరంగా ఉంటారు. నిజానికి అరటిలో చాలా సుగుణాలు ఉన్నాయి. దీన్ని రోజు తీసుకోవడం వలన ఎత్తు పెరగుతారు.

సోయాబీన్ : ఎత్తు పెరగడానికి సోయాబీన్ చాలా ఉపయోగపడుతుంది. రోజు 50 గ్రాములు తీసుకోవడం వల్ల త్వరగా ఎత్తు పెరగవచ్చు. దీంట్లో ఫైబర్, కార్బోహైడ్రేట్స్ అధిక స్థాయిలో ఉంటాయి.

పాలు : రోజు ఒక గ్లాస్ పాలు తాగడం వల్ల ఎత్తు పెరుగవచ్చు. దీంట్లో విటమిన్ బీ12, డీ తో పాటు కాల్షియం ఉంటుంది.
వీటిని తూచాతప్పకుండా పాటిస్తే మీపిల్లలు  ఎత్తుపెరగటంతోపాటు మంచి ఆరోగ్యంగా కూడా ఉండటం ఖాయం.

ఈ  గ్రూపులో పెడుతున్న మెసేజ్ లన్నీ సభ్యులలో ఆరోగ్యం పట్ల ప్రాధమిక అవగాహన కోసమే అని గమనించాలి. వివిధ  నివారణలు సూచనలు కూడా సభ్యులలో అవగాహన పెంచడానికి మాత్రమే ..మీ డాక్టరు కి ఇది ప్రత్యామ్నాయము కాదు. సభ్యులు గమనించాలి.h

ttps://www.facebook.com/Naveen-Nadiminti-1536735689924644


రొమ్ము ప్రాంతంలో కలిగే సమస్య నొప్పులను తగ్గించే నవీన్ నడిమింటి గారి నివారణల గురించి ఈ లింక్ లో తెలుపబడింది

వక్షోజాల సైజు సహజంగా పెరగాలంటే చేయాల్సిన 3 మసాజస్అవగాహనా కోసం నవీన్ నడిమింటి సలహాలు 

వక్షోజాలు స్త్రీ శరీరంలో చాలా ముఖ్యమైన భాగం. అవి పోషించే పాత్ర కూడా పెద్దదే. బిడ్డకు పాలు ఇవ్వడానికి, మీ అందంగా కనపడడానికి,  అంతే కాకుండా శృంగార సమయంలో వక్షోజాలు భవప్రాప్తి కలిగించడంలో, కూడా కొంత తోడ్పడుతాయి. అయితే మీ వక్షోజాలు  అందంగా ఆరోగ్యంగా ఉండడానికి కొన్ని మెసేజులు అవసరం అవేంటో, వాటి ఉపయోగాలేంటో, ఎలా చేయాలో చూడండి…

బ్రెస్ట్ మసాజ్ యొక్క ఉపయోగాలు

1. బ్రెస్ట్ మసాజ్ చేయడం వలన, మీ వక్షోజాల నాళ వ్యవస్థ లోని టాక్సిన్స్ ను తొలిగించి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాన్ని  తగ్గిస్తుంది. 

2. మీ వక్షోజాలకు సరైన రూపాన్ని ఇచ్చి బిగువుగా చేస్తాయి.

3. మీ బ్రెస్ట్ కణజాలం ఆరోగ్యంగా ఉండడానికి, మీ రక్త ప్రవాహాన్ని ప్రేరేపిస్తుంది.

4. వక్షోజాల పై మచ్చలను తగ్గిస్తుంది.

బెస్ట్ మసాజ్ చేయాల్సిన విధానాలు:

R breast - కుడి రొమ్ము

L breast - ఎడమ రొమ్ము

RH(Right Hand) - కుడి చెయ్యి

LH(Left Hand) - ఎడమ చెయ్యి

1. లిఫ్ట్ అండ్ షేప్ మోషన్ (lift and shape motion)

మీ కుడివైపు రొమ్ము నిప్పుల్ మీద మీ ఎడమ చేయిని ఉంచి, కుడి చేతితో రొమ్మును చుట్టూ మెల్లగా ఒత్తుతూ మసాజ్ చేయండి. ఇలాగే ఎడమ వైపు రొమ్ము నిప్పుల్ మీద కుడి చేయిని ఉంచి, ఎడమ చేతితో రొమ్మును మస్సాజ్ చేసుకోండి.

2. స్విర్లింగ్ మోషన్ (Swirling motion)

కుడి వైపు రొమ్ముమీద కుడి చేతి రెండు వేళ్ళను ఉంచి, వేళ్ళను తిప్పుతూ రొమ్ము చుట్టూ మసాజ్ చేయండి. అలాగే ఎడమ వైపు రొమ్ము కూడా చేయండి.

3. రోలింగ్ మోషన్ (Rolling motion)

కుడి వైపు రొమ్ము పై భాగంలో కుడి చేతిని ఉంచి, కింద భాగంలో ఎడమ చేతిని ఉంచి, ముందుకు వెనక్కు తిప్పుతూ మసాజ్ చేయండి. అలాగే ఎడమ రొమ్ము కు కూడా అలానే చేయండి.

4. పంపింగ్ మోషన్ (Pumping motion)

కుడి రొమ్ము కింద భాగంలో కుడి చేయిని ఉంచి వత్తాలి, వెంటనే ఎడమ చేయిని ఉంచి వత్తాలి. అలాగే ఎడమ రొమ్ము కింద భాగంలో ఎడమ చేయిని ఉంచి వత్తుతు, వెంటనే కుడి చేతితో కూడా చేయండి.

ఈ బ్రెస్ట్ మసాజ్ లు మీరు తరుచు చేయడం వలన మీ రొమ్ము సైజు పెరగడమే కాకుండా, సరైన ఆకృతిలో అందంగా,  ఆరోగ్యంగా ఉంటాయి.

స్థనాలు సమస్య కు ఆయుర్వేదం లో నవీన్ నడిమింటి సలహాలు                       స్థనాలలో సమస్యల నివారణ                                     చనుకుదురు (రొమ్ముల్లో గడ్డలు)   గర్భాశయము,స్థనాలు తల్లి భాగానికి చెందినవి.బహిష్టు లో తేడాలోస్తే మలినాలు గర్భాశయము నుండి స్థ నాలకు చేరతాయి.దీని వలన గడ్డలు ఏర్పడతాయి.


నివారణా మార్గాలు --కలబంద ప్రయోగం :--

కలబంద గుజ్జు     ------ 25 gr
పసుపు              ------ 25 gr
 
 రెండింటిని కలిపి నూరి  ముద్దను పెనం మీద వేడి చెయ్యాలి.దానిని గోరు వెచ్చగా ఉన్నపుడు
 గడ్డ పై వేసి దూది తో కప్పి కట్టు కట్టాలి.ఉఅదయం కట్టును తీసేయ్యాలి.
 
కడుపులోకి :--

కలబంద గుజ్జును 7 సార్లు నీటిలో బాగా కడగాలి.

  3 చిటికెల జిలకర ,
 3 చిటికెల పటికబెల్లం

 కలిపి నూరాలి         
 .దానిని  విధంగా కడుపులోకి 40 రోజులు వాడాలి.
నల్ల ఉమ్మెత్త వేర్లను పసుపు కలిపి నూరి రొమ్ము మీద గడ్డలున్న చోట వేసి కట్టు కడితే 10 రోజులలో  నివారింప బడుతుంది.
 
               రొమ్ముల్లో పుండ్లు
 
      రెండు పిడికెళ్ళ వేపాకు తీసుకొని బాగా నలగగొట్టి రెండు చెంచాల పసుపు కలిపి నీళ్ళలో వేసి మరిగించాలి .మూడు వంతులకు నీళ్ళు తగ్గిన తరువాత  కషాయాన్ని పుండ్లపై  పూయాలి.తరువాత 2,3 దోసిళ్ళ వేపాకు తీసుకొని బాణలిలో వేసి బాగా మాడ్చి బూడిదలాగా చెయ్యాలి. బూడిదను పుండ్లపై అద్దాలి.                                         స్థన సౌందర్యము కొరకు
 
అశ్వగంధ దుంపలు              ------- 100 gr
సుగంధ పాల వేళ్ళు               ------ 100 gr
మెంతులు                          ------- 100 gr
కలకండ                                ----- 300 gr

      అశ్వగంధ దుంపలను చిన్న ముక్కలుగా చేసి ఆవు పాలు పోసి పాలు ఇగిరిపోయ్యే వరకు
కాచి బాగా ఎండబెట్టాలి.వాటిని దంచి పొడి చెయ్యాలిసుగంధ పాల వేర్లను దంచి వాని మధ్యలో ఉన్న పుల్లను తీసేయ్యాలి. బెరడును దంచి పొడి చెయ్యాలి.మెంతులను వేయించి పొడి చెయ్యాలి.కలకండను కూడా పొడి చేసుకోవాలి.
 
అన్ని పొడులను సీసాలో భద్రపరచాలి.
  ప్రతి రోజు ఉదయం ఒక స్పూను పొడిని ఒక గ్లాసు పాలల్లో కలిపి దానికి ఒక స్పూను నెయ్యి
కలిపి తాగాలిసాయంత్రం పూట కూడా తాగవచ్చుదీని వలన స్థాన సౌందర్యము పెరుఅగుతుంది.
 
                జారిన చాతీ పెరుగుటకు                        
1. కుర్చీలో కూర్చొని రెండు చేతులను బార చాపి మళ్లీ వెనక్కు తెచ్చి గొంతు కింద పెట్టాలి.
 
కుర్చీ కూర్చొని చేతులను పూర్తిగా ముందుకు చాపాలిపైకేత్తాలి.దీనిని గాలి పీలుస్తూ చెయ్యాలి.నెమ్మదిగా పీల్చి నెమ్మదిగా వదలాలి.రెండు చేతులను విదిలించాలి.

1,2,3,4,5 పలికేటపుడు నెమ్మదిగా ఓంకారంలాగా పలకాలి ఒక్కొక్క అంకె పలకాలి.
 
3. కుడి చేతిని పైకి చాపి ఎడమ వైపు కు తల మీదుగా వంచాలిఅదే విధంగా రెండవ వైపు చె                  స్థనాలు చిన్నవి కాకుండా ఉండాలంటే               
 
1. తవుడు వున్న బియ్యపు కడుగు ముక్కులో రెండు చుక్కల చొప్పున వేసుకోవాలి.
 
2. దానిమ్మ చెక్క ఎండబెట్టి పొడి చేసి ఆవ నూనె కలిపి పేస్టు లాగా కలిపి స్థనాలపై పూయాలి ,మధ్యలో బుడిపెకు ఏమాత్రం తగలకూడదు. (లేదా)

దానిమ్మ బెరడు పొడి     --- 100 gr
ఆవాల నూనె                --- 200 gr
నీళ్ళు                          ----200 gr
    
    అన్నింటిని కలిపి స్టవ్ మీద పెట్టి తైలం మాత్రమే మిగిలి వరకు కాచి వడకట్టి సీసాలో నిల్వ చేసుకోవాలిదీనిని స్థనాలపై రుద్దుతూ వుంటే పెద్దవవుతాయి.
 
                 వక్షోజ సౌందర్యము                           
 
తామర పూల గింజల పొడి        ----- 100 gr
అశ్వగంధ పొడి                       ----- 100 gr
దోవేమెంతుల పొడి              ----- 100 gr
తెల్ల సుగంధ పాల వేర్ల పొడి       ----- 100 gr
ఎర్ర  సుగంధ పాల వేర్ల పొడి       ----- 100 gr
కలకండ                                 ----- 150 gr
తేనె                                      ------150 gr
 
      అన్ని పొడులను కలిపి వస్త్రగాయం పట్టి తేనె కలిపి ముద్దగా చేసి నిల్వ చేసుకోవాలి.ప్రతి రోజు ఉదయంసాయంత్రం 10 గ్రాముల చొప్పున తిని పాలు తాగుతూ వుంటే స్థాన సౌందర్య్హం పెరుగుతుంది.

             మగ పిల్లలలో చాతీ  పెరుగుదల  -- నివారణ                       

          నిటారుగా నిలబడి చేతులను చాచి పైకేత్తాలిచేతులను గుండ్రంగా తిప్పాలిముందుగా తైల మర్దన చెయ్యాలి.

అర్ధ ధనురాసనం ;-- బోర్లా పడుకొని తలపైకెత్తి కుడి చేతితో కుడికాలును పైకెత్తాలిఅలాగే ఎడమ వైపు మరియు రెండు కాళ్ళను రెండు చేతులతో పట్టుకొని ఊగాలి.

సూర్య నమస్కారాలు:-- 12 భంగిమలలో 6 + 6 పై వ్యాయామాలను ప్రతి రోజు తప్పని సరిగా వేగంగా చెయ్యాలిదీని వలన శరీరం లోని క్రొవ్వు పదార్ధాలు కరుగుతాయి.

పాలుపెరుగుమాంసం వాడకూడదుకూరగాయల సూప్గంజినిమ్మకాయ నీళ్ళురాగిజావగోధుమ జావ బియ్యపు జావ వాడాలి.
                                   
త్రిఫలాలు          100 + 100 + 100 gr
త్రికటుకాలు        100 + 100 + 100 gr  (శొంటి,పిప్పళ్ళుమిరియాలు)
సైంధవ లవణం                     ---100 gr
    
     అన్నింటిని విడివిడిగా దోరగా వేయించి దంచి జల్లించి కలిపి , సైంధవ లవణం కూడా కలిపి భద్రపరచు కోవాలిఉదయంసాయంత్రం 3 చిటికెల పొడిలో తేనె కలిపి సేవిస్తే అదనపు కొవ్వు కరుగుతుంది.
                                           
                            చాతీ ఎదుగుదల (వక్షోజ సౌన్దార్యము)               

దానిమ్మ పండ్ల పై తోలు యొక్క రసం --- 100 gr
నువ్వుల నూనె                               --- 200 gr
     
               దానిమ్మ పండ్ల పై తోలులో కండను పెంచే శక్తి వున్నది.
     
         రెండింటిని కలిపి స్టవ్ మీద పెట్టి సన్న సెగ మీద రసం ఇంకి పోయి నూనె మాత్రమే మిగిలే
వరకు కాచాలి . చల్లార్చి వడ పోసుకొని తడి లేని గాజు సీసాలో భద్రపరచు కోవాలి.
     
     రాత్రి నిద్రించే ముందు ఛాతీకి రాయాలికుడి వైపు రుద్దేటపుడు Clockwise గాఎడమ వైపు రుద్దేటపుడు Anti Clockwise గా రుద్దాలిలోపలికి ఇంకిపోవునట్లు సున్నితంగా మర్దన చెయ్యాలి.

      ముఖ్యంగా అజీర్ణం తగ్గించడానికి అల్లంరసంనిమ్మరసంతేనె కలిపి కడుపులోకి ఇవ్వాలితరివాతఆహారానికి గంట ముందు తైలంతో మర్దన చెయ్యాలిఅజీర్ణం తగ్గకపోతే చాతీ పెరగదుతీపి పదార్ధాలను ఎక్కువగా తినిపించాలి.

       రొమ్ముల్లోచంకల్లో గడ్డలు --- నివారణ                            

               బహిష్టు సక్రమముగా రాకపోవడం వలన  సమస్య ఏర్పడుతుందిస్త్రీలు నువ్వులు,  పాతబెల్లం బియ్యపు జావాకొబ్బరి వంటివి తింటూ వుండాలివీటి వలన ఇలాంటి సమలస్యలను
 నివారించ గలవు. .

ఆవనూనె            ---100 gr
కలబంద రసం     --- 100 gr
మంచి పసుపు     ---- 10 gr
గసాలు               ---- 10 gr

         కలబందపసుపుగసాలను కల్వంలో వేసి తగినంత నీరు కలిపి మెత్తగా నూరాలిదానిని
ఆవాల నూనెలో వేసి కాచాలి నూనెను మామూలు గడ్డలపై మర్దన చెయ్యాలి.
                                   
                   ఇనుము లాగా గట్టిగా వున్న గడ్డలు కరగాలంటే

    కలబంద గుజ్జుఉప్పుపసుపు మెత్తగా నూరి మందంగా పట్టు వెయ్యాలి. Nipple మీద ఎంత మాత్రం తగల కూడదురాత్రి పూట పట్టు వేసి ఉదయం కడగాలిదీంతోపాటు త్రిఫలం తీసుకోవాలి.

వ్యాయామం:-- చేతులను బార్లా చాపడంపైకి లేపడంబాగా తిప్పడంకదిలించడం చెయ్యాలి.

                      చను కుదురు---రొమ్ముల్లో వచ్చే గడ్డలు --నివారణ          .

        బహిష్టు కు ముందు రొమ్ముల్లో నొప్పి వస్తుందిదృష్టి దోషాల వలన కూడా నొప్పి వస్తుంది.

పురుషులలో కూడా వాపు కనిపిస్తుందిరొమ్ముల్లో నీరు చేరి వాపువస్తుందిఆముదపు ఆకులను తొడిమలు తీసి కొద్దిగా నీటితో నూరి ముద్దగా చేసి వాపు మీద పట్టించాలిదూది అంటించి ప్లాస్టర్ వెయ్యాలిమధ్యలో తగల కూడదుస్నానం చేసే ముందు గోరువెచ్చని నీటితో కడగాలిదీని వలన పై సమస్యలన్నీ నివారింప బడతాయి.
       
గడ్డలు మరీ గట్టిగా వుంటే ఆముదపు ఆకుతోబాటు కలబంద గుజ్జును కూడా కలిపి నూరి లేపనం చెయ్యాలి
 
                                      వక్షోజ సౌందర్యాన్ని పెంచడానికి -                     
 
దానిమ్మ పండు తొక్కలు
ఆవ నూనె
నీళ్ళు

దానిమ్మ పండు తొక్కలను నీటితో నూరి ముద్దగా చెయ్యాలిదీనికి నాలుగు రెట్లు ఆవనూనె నుపది రెట్లు నీ ళ్ళను కలిపి స్టవ్ మీద పెట్టి నూనె మాత్రమే మిగిలేట్లు కాచాలి.
ప్రతి రోజు స్నానానికి ముందు  నూనెతో వక్షోజాలపై మర్దన చెయ్యాలి.
 
2. కలబంద గుజ్జును స్నానానికి ముందు రుద్దాలి.
 
3. సొర ( అనప కాయ ) గింజలను ఎండబెట్టి పొడి చేసి గోధుమ గంజిలో కలిపి పేస్ట్ లాగా చేసి స్నానానికి ముందు రుద్దాలి
 
4. అత్తపత్తి సమూల చూర్ణం
    అశ్వగంధ చూర్ణం
 
     రెండింటిని కలిపి ముద్దగా నూరి మర్దన చెయ్యాలి.
 
వ్యాయామాలు :--
 
1. లాన్ కటింగ్ పద్ధతిలో చేతులను కదిలించాలి.
2. స్విమ్మింగ్ చేసినట్లుగా బెంచీ మీద పడుకుని చేతులను కదిలించాలి.

                         స్థనాలలో చిన్న చిన్న గడ్డలు ఏర్పడడం                       
   ఇవి ఎక్కువగా 20 -- 30 సంవత్సరాల మధ్య వున్నా స్త్త్రీలలో ఏర్పడుతుంటాయి సమస్యను
సాధారణంగా క్యాన్సర్ అని భయపడుతుంటారుకాని ఇది హానికారకం కాదునొప్పి వుండదు,

       హార్మోన్ల లోతేడాల వలన  సమస్య ఏర్పడుతుందిపీరియడ్స్ ప్రారంభమైన తరువాత సగం అర్ధభాగం నుండి కనపడడం ప్రారంభమై పూర్తయ్యే లోపల కరిగిపోతాయిఇవి రొమ్ముల్లో కదులుతూ వుంటాయి.       స్వయంగా పరీక్ష చేసుకుని తేసుకుకోవచ్చు.
           ఆముదాన్ని గోరువెచ్చగా చేసి స్థనం మీద ఫైబ్రాయిడ్స్ వున్నచోట చిన్నగా మర్దన చేసి
వేడి నీటిలో ముంచిన గుడ్డను కప్పి ఉంచాలి.
కాంచనార గుగ్గులు పై సమస్యను నివారించడానికి  ఔషధం బాగా పనిచేస్తుంది.
ఒకటిన్నర గ్రాముల కాంచనార గుగ్గుల చూర్ణాన్ని 750 ml త్రిఫల కషాయం లో కలుపుకుని తాగాలి.
 విధంగా సమస్యని బట్టి ఒక నెల నుండి మూడు నెలల 
     రొమ్ములలో నొప్పి  --- నివారణ                      

కారణాలు :--- పీరియడ్స్ సమయంలో కొంతమందికి నొప్పి వుంటుంది . రొమ్ములలో నీరు చేరడం , దెబ్బ తగలడం ,
పాలిచ్చే తల్లుల్లో పాలు గడ్డ కట్టడం , బరువులెత్తడం , క్యాన్సర్  మొదలైన కారణాల వలన నొప్పి ఏర్పడే అవకాశం కలదు .

శొంటి కొమ్ముల గంధం             --- ఒక టీ స్పూను
వస   కొమ్ముల గంధం              ---   "      "
సున్నం                                 ---   "      "
బెల్లం                                    ---   "      "

        అన్నింటిని పేస్ట్ లాగా బాగా కలిపి గుడ్డమీద పరచాలి .దీనిని రొమ్ముల మీద నొప్పి వున్నచోట పరచాలి  . ప్రక్కన
తగలకుండా జాగ్రత్త పడాలి . సున్నం వలన ఎర్రగా కందిపోవచ్చు .

ఆవాల పొడి                          ---ఒక టీ స్పూను
గసాల పొడి                           ---  "       "
కర్పూరం పొడి                       ---  "       "
పెరుగు                                --- తగినంత

        అన్నింటిని బాగా కలిపి ఆయింట్మెంట్ లాగా కలిపి అరచెయ్యంత బ్యాండేజి గుడ్డ మీద పరచాలి . దాని మీద
వేరే గుడ్డను పరిచి దీనిని రొమ్ముల మీద  నొప్పి వున్నచోట పరచాలి

సూచనలు:--- కాఫీ మానెయ్యాలి .  దీనివలన శరీరంలో నీరు చేరుతుంది . ఉప్పు తగ్గించాలి ఒరిపిడి (జాగింగ్ ,స్కిప్పింగ్ ని తగ్గించాలి . మూత్రాన్ని సాఫీగా జారీ చేసే ఆహారాన్ని తీసుకోవాలి . బార్లీ , పల్చటి టీ , పచ్చని రంగులో వున్న  ధనియాల
రెఅ .  కొబ్బరి నీళ్ళు వాదాల్లి
నల్లద్రాక్షల రసం రొమ్ము క్యాన్సర్ నివారణకు ఉపయోగపడుతుందని ఇటీవలి అధ్యయనాలు తెలుపుతున్నాయి. ద్రాక్షల్లోని రిస్ చూపించే యాంటి ఇన్‌ఫ్లమేటరీ ప్రభావం అంతా ఇంతా కాదు. పెద్దపేగు క్యాన్సర్‌తో పాటు ఇతర జీర్ణవ్యవస్థ సంబంధిత క్యాన్సర్లు, రొమ్ము క్యాన్సర్ల నివారణలో రిస్ బాగా పనిచేస్తుంది. ఆంథ్రోసయనిన్లు, ప్రోఆంవూథోసయనిన్లు యాంటి ప్రొలిఫరేటివ్ లక్షణాలను కలిగివున్నాయి. అంటే క్యాన్సర్ కారక పదార్థాల పెరుగుదలను ఇవి నిరోధిస్తాయి. అందుకే ద్రాక్షరసం క్యాన్సర్‌ను అణిచివేయడమేకాదు.. క్యాన్సర్ కణాల వ్యాప్తిని కూడా అరికడుతుంది. ద్రాక్షలోని ఈ పదార్థాలు మొత్తం శరీర వ్యాధి నిరోధక వ్యవస్థనే బలోపేతం చేస్తాయి.

వక్షోజాల నొప్పి

1. రొమ్మునొప్పి ప్రతి నెలా బహిష్టుకు కొన్ని రోజుల ముందు నుంచి ప్రారంభ మావుతుందా?

స్తవశోథ (మాస్టైటిస్)

2. గర్భం ధరించారా? లేక పాపాయికి పాలిస్తున్నారా?

గర్భధారణ / చనుబాలిచ్చే కాలం

3. గర్భ నిరోధక మాత్రలనుగాని, హార్మోన్ రిఫేస్ మెంట్ థెరపీనిగాని తీసుకుంటున్నారా?

హార్మోన్ చికిత్సల దుష్ఫలితాలు

4. ఇతర రకాలైన మందులను వాడుతున్నారా?

మగవారిలో స్తనాల వృద్ధి (గైనకోమాస్టియా)

5. జాగింగ్ చేసే అలవాటు ఉందా?

జాగర్స్ నిపుల్

రొమ్మునొప్పిని ప్రతి మహిళ తన జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు అనుభవించే అవకాశం ఉంది. కొంతమందిలో ఇది నెల నెలా బహిష్టుకు ముందు వస్తూ ఉంటుంది. సాధారణంగా ఈ తరహా నొప్పి హార్మోన్స్ ప్రభావం చేత వచ్చేదే తప్పితే దానిలో కంగారు పదాల్సినంత ప్రమాదభరితమైన అంశమేదీ లేదు. రొమ్ము నొప్పి అనడంతోనే చాలా మంది ఆలోచన రొమ్ము క్యాన్సర్ వైపు పోతుంది. కాని, రొమ్ము క్యాన్సర్ అనేది నొప్పితోను, అసౌకర్యంతోను మొదలవ్వదు. రొమ్ములో నొప్పితో కూడిన గడ్డ కనిపించినప్పుడు అదో క్యాన్సర్ పెరుగుదల కంటే చీము గడ్డ అవ్వటానికే అవకాశాలు ఎక్కువ.

 

రొమ్ము క్యాన్సర్ లక్షణాలు మరో విధంగా ఉంటాయి: వ్యాధి ప్రారంభంలో నొప్పి ఉండదు. అలాగే స్పర్శకు గట్టిగా తగులుతుంది. కదిలించినప్పుడు కదలకుండా లోపల కణజాలాలతో సంబంధం కలిగి ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యంగా పెరుగుదల పైన చర్మం కమలాఫలం తొక్కను పోలి ఉంటుంది. ఇటువంటి పెరుగుదల కనిపించినప్పుడు ఏ మాత్రం అశ్రద్ధ చేయకూడదు.

రొమ్ములో నొప్పి అనిపిస్తున్నప్పుడు అది ప్రమాదకారమా, కాదా, అనేది నిర్ణయించడానికి కొన్ని అంశాలను పరిగణలోనికి తీసుకోవాల్సి ఉంటుంది. అవేమిటో చూద్దాం.

 

1. స్తనశోథ (మాస్త్రెటిస్):

రొమ్మునొప్పి బహిష్టుకు ముందు రోజుల్లో వస్తే దానిని వైద్య పరిభాషలో 'ప్రీ మెన్ స్ట్రువల్ మ్యాస్ట్రెటిస్' గా చెబుతారు. దీనిలో రొమ్ములో కణజాలం గట్టిగా, కదుముల మాదిరిగా తగులుతుంది. కొంతమంది మహిళలలో రజస్వల (పెద్దమనిషి) అయినది మొదలు రజోనివృత్తి (మోనోపాజ్) వరకూ ప్రతినెలా ఈ నొప్పి వస్తూనే ఉంటుంది. కొన్ని రోజులు అవస్థలు పది చివరికి వారు దీనికి అలవాటు పడిపోతారు. రొమ్ము నొప్పి బహిష్టుకు వారం ముందు నుంచి రోజు రొమ్ముల్లోనూ మొదలవుతుంది.

స్త్రీ - సెక్స్ హార్మోన్ల పెరుగుదల కారణంగా శరీరంలో నీరు అధికంగా సంచితమై రొమ్ము కణజాలాల మీద ఒత్తిడిని కలిగించి నొప్పికి, గట్టిదనానికి కారణం అవుతుంది. దీని వల్ల ఒక్కొక్కసారి రొమ్ములో గడ్డలు ,కూడా తయారయ్యే అవకాశం ఉంది. సూచనలు: ఈ స్థితి పదేపదే తిరగబెడుతున్నప్పుడు ఆహారంలో కెఫిన్ కలిగిన పదార్థాలను (కాపీ, టీ, చాక్లెట్స్, కోలా డ్రింకులు) తగ్గించడంకాని, పూర్తిగా మానేయడం కాని చేయాలి, అలాగే 'ఈవినింగ్ ప్రైమ్ రోజ్ ఆయిల్' ను వాడటం వల్ల కూడా ఉపయోగం ఉంటుంది. ఇది మెడికల్ షాపుల్లో క్యాప్సుల్స్ రూపంలో దొరుకుతుంది. ఆహారంలో పిండి పదార్థాలను ఎక్కువగా తీసుకుంటే ఈ తారగా నొప్పుల్లో మంచిది.

ఔషధాలు: కాంచనార గుగ్గులు, శోథజగ్న వటి, చంద్రప్రభావటి.

బాహ్యప్రయోగం: దశాంగలేపం.

2. గర్భధారణ / చనుబాలిచ్చే కాలం:

మహిళల్లో గర్భం ధరించిన తొలినాళ్లలో కనిపించే మొట్టమొదటి లక్షణం రొమ్ములో తిమ్మిర్లు పట్టినట్లు వుండటం, సద్యోగృహీత గర్భచిహ్నంగా... హృదయే వ్యథా... అంటూ శాస్త్రకారుడు ఈ లక్షణం గురించి చెబుతాడు. హృదయ ప్రదేశమంటే ఛాతి ప్రదేశమని అంతరార్థం. గర్భధారణ కొనసాగే కొద్దీ రొమ్ముల్లో స్థన్యవాహక గ్రంథులు అభివృద్ధి చెంది, చుట్టూ ప్రక్కల కణజాలాల మీద ఒత్తిడిని కలుగజేసి రొమ్ములో అసౌకర్యాన్నీ, కొద్దిపాటి నొప్పినీ కలుగజేస్తాయి. ఇదే విధంగా ప్రసవానంతరం పిల్లలకు పాలిచ్చే తల్లులలో ఒకవేళ ఏ కారణం చేతనైనా పాపాయికి పాలివ్వలేకపోతే కూడా రొమ్ములో స్థన్యం ఎక్కువగా తయారై నొప్పిగా, అసౌకర్యంగా అనిపిస్తుంది.

సూచనలు: వక్షోజాలకు సపోర్టు ఉండే విధంగా సరైన బ్రాసరీలను ధరించడం, సుఖోష్టంగా ఉండే కాపడాన్ని పెట్టుకోవటం, ఒకవేళ అబాలింతలైతే రొమ్ముల్లో అధికంగా సంచితమైన పాలను పిండేయడం, ఇన్ఫెక్షన్లు రాకుండా చూసుకోవడం వంటి పద్ధతులతో ఈ రకమైన అసౌకర్యాన్ని అధిగమించవచ్చు.

3. హార్మోన్ చికిత్సల దుష్ఫలితాలు:

గర్భనిరోధక మాత్రలనుగాని, హార్మోన్ రిప్లేస్ మెంట్ థెరపిగాని తీసుకునే వారిలో అదనపు ఫిమేల్ సెక్స్ హార్మోన్ల కారణంగా వక్షోజాల కణజాలాల్లో మార్పులు సంభవించి అసౌకర్యం, నొప్పి మొదలైనవి అనిపించే అవకాశం ఉంది. ఈ విధంగా సాధారణంగా మందులను వాడే మొదటి నెలలో సంభవిస్తూ ఉంటుంది. మోనోపాజ్ లక్షణాలను అదుపుచేయటానికి నేటి వరకు ప్రపంచ వ్యాప్తంగా హార్మోన్ రిప్లేస్ మెంట్ థెరపి (హెచ్.ఆర్.టి) ని వైద్యులు సూచిస్తూ వస్తున్నారు. అయితే, ఇటీవల కాలంలో నిర్వహించిన అధ్యయనాలలో హెచ్.ఆర్.టి కారణంగా క్యాన్సర్ తో సహా పలు అవాంఛనీయ సమస్యలు ఏర్పడటంతో ఈ చికిత్సపై జరుపుతున్న అధ్యయనాలను అర్థాంతరంగా ఆపుచేయాల్సి వచ్చింది.

ఈ విషయాన్ని గూర్చి దాదాపు అన్ని పత్రికలు ప్రముఖంగా ప్రచురించాయి కూడా. ప్రపంచం మొత్తం, ప్రస్తుతం హెచ్.ఆర్.టి. కి ప్రత్యామ్నాయాల గురించి చూస్తోంది. సూచనలు: సోయా చిక్కుడు, ఇతర చిక్కుళ్లు, టమాట, పుచ్చకాయ, రేగు, కంది, పెసర, యష్టి మధుకం, దానిమ్మ వీటిని బాగా తీసుకోవాలి. వీటిల్లో ఎక్కువగా 'ఫైటో ఈస్ట్రోజన్స్' ఉంటాయి. శరీరంలో ఈస్ట్రోజన్ తగ్గినప్పుడు సానుకూలంగాను, ఈస్ట్రోజన్స్ పెరిగినప్పుడు ప్రతికూలంగాను పనిచేసే సహజమైన స్టీరాయిడ్ ఎంజైమ్ మాడ్యులేటర్స్ ను ఫైట్స్ ఈస్ట్రోజన్స్ అంటారు.

ఔషధాలు: అశోకారిష్టం, అశోక ఘృతం, అశోకాది వటి, కళ్యాణక క్షీరబలా తైలం (101 ఆవర్తాలు), నష్టపుష్పాంతక రసం, పుష్యానుగ చూర్ణం, ఫలసర్పి, ప్రదరాంతక రసం, సుకుమార ఘృతం, సుకుమార రసాయనం, శతావరి లేహ్యం.

4. మందులు దుష్ఫలితాలు:

కొన్ని రకాల అల్లోపతి మందులకు రొమ్ముల్లో అసౌకర్యాన్ని, నొప్పిని కలిగించే నైజం ఉంటుంది. గుండె లయను క్రమబద్ధం చేయడానికి వాడే 'డిజిటాలిస్' అనే మందుకు, హార్ట్ ఫెయిల్యూరును, హైబిపిని కంట్రోల్ చేయడానికి వాడే మందులకు, మత్తును కలిగించటానికి వాడే ట్రాన్ క్విలైజర్స్ కు వక్షోజాలలో అసౌకర్యాన్ని కలిగించే తత్వం ఉంటుంది. ఈ మందులను వాడుతూ అసౌకర్యాన్ని కనుక అనుభవిస్తున్నట్లయితే, వైద్య సలహాతో మందులను ఆపేయటంకాని, మోతాదును తగ్గించటం కాని చేయాలి.

5. మగవారిలో స్తనాలవృద్ధి (గైనకోమాస్టియా):

ఆల్కహాల్ అధికంగా తీసుకునే మగవారిలో కాలేయం దెబ్బతిని ఈస్ట్రోజన్ ను (స్త్రీ సెక్స్ హార్మోన్) బహిర్గత పరచలేదు. దీనితో స్థనాలలో అసౌకర్యము, నొప్పి కలిగే అవకాశం వుంది. దీనిని వైద్య పరిభాషలో; గైనకోమాస్టియా; అంటారు. దీనికి పరిష్కారంగా ఆల్కహాల్ ను మానేయటమే కాకుండా శోథహర ఔషధాలు వాడాలి.

ఔషధాలు: కాంచనార గుగ్గులు, పునర్నవాది గుగ్గులు, చంద్రప్రభావటి.

6. జాగర్స్ నిపుల్:

కొంతమందిలో దుస్తులు స్థవ చూచుకాలకు ఒరుసుకొని అసౌకర్యం, నొప్పి కలిగే అవకాశం వుంది. ఇది ఎక్కువగా జాగింగ్ చేసేవారిలో కనిపిస్తుంది. దీనికి పై పూతగా 'జాత్యాదిఘృతం' అనే ఆయుర్వేద మందును రాస్తే సరిపోతుంది. అలాగే సరైన లోదుస్తులను ధరించాల్సి ఉంటుంది.

     ధన్యవాదములు 
మీ నవీన్ నడిమింటి 
     విశాఖపట్నం