19, మే 2020, మంగళవారం

హైట్ (పొడవు ) పెరగాలి అంటే డైట్ ప్లాన్


 హైట్ పెరగాలంటే ఇవి తినండి చాలు అవగాహనా కోసం నవీన్ నడిమింటి సలహాలు 

ప్రతి ఒక్కరూ హైట్ గా ఉండాలని కోరుకుంటారు. కానీ ఆ ఎత్తు కొంత మందినే వరిస్తుంది. హైట్ పెరగడం కోసం ఎన్నో కసరత్తులు చేస్తారు. కానీ టీనేజీ దాటాక హైట్ పెరగడం ఆగిపోతుంది. అయితే వయసు దాటిపోయినప్పటికీ కొందరు హైట్ పెరగాలని అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. ఇది అన్నిసార్లూ సరైన ఫలితాన్నివ్వకపోవచ్చు. అందుకే ఎదుగుతున్న వయసులోనే తగిన జాగ్రత్తలు పాటించడం వల్ల సరైన ఎత్తు పెరగవచ్చు. ఆహారంలో కొన్ని మార్పులు చేయడం ద్వారా ఎత్తు పెరిగే అవకాశం ఉంది. ఎత్తు పెరగడానికి ఉపయోగపడే కొన్ని ఆహార పదార్థాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం..
బఠాని:
బఠానిలు రోజు తీసుకోనడం వల్ల ఎత్తు పెరిగే అవకాశం ఉంటుంది. ఫైబర్, ప్రోటీన్స్, మినరల్స్ దీంట్లో అధికంగా ఉంటాయి.

సోయాబీన్:
         ఎత్తు పెరగడానికి సోయాబీన్ చాలా ఉపయోగపడుతుంది. రోజు 50 గ్రాముల తీసుకోవడం వల్ల త్వరగా ఎత్తు పెరుగవచ్చు. దీంట్లో ఫైబర్, కార్భోహైడ్రేట్స్ అధిక స్థాయిలో ఉంటాయి.

పాలు:
       రోజు ఒక గ్లాస్ పాలు తాగడం వల్ల ఎత్తు పెరుగవచ్చు. దీంట్లో విటమిన్ బీ12, డీ తో పాటు కాల్షియం ఉంటుంది.

ఎర్ర ముల్లంగి:

ఎర్రముల్లంగిని తరుచూ తీసుకోవడం వలన ఎత్తు పెరుగవచ్చు. దీంట్లో ఎత్తు పెరగడానికి ఉపయోగపడే హార్మోన్‌లు అధికంగా ఉంటాయి.

బెండకాయ:

ఎత్తు పెరగడానికి ఉపయోగపడే మరో కురగాయ బెండకాయ. దీంట్లో విటమిన్లు, ఫైబర్, పిండిపదర్థాలు, నీరు, ఖనిజాలు అధికంగా ఉంటాయి. అంతే కాదు బెండకాయ తింటే తెలివితేటలు కూడా పెరుగుతాయి.

అరటిపండు:

బరువు పెరుగకుండా ఉండాలనుకుంటున్నవాళ్లు అరటిపళ్లకు చాలా దూరంగా ఉంటారు. నిజానికి అరటిలో చాలా సుగుణాలు ఉన్నాయి. దీన్ని రోజు తీసుకోవడం వలన ఎత్తు పెరగడంతో పాటు హెయిర్ లాస్ కూడా తగ్గుతుంది.


బచ్చలికూర:

ఎత్తు పెరగడానికి ఉపయోగపడే అద్భుతమైన ఆకుకూర బచ్చలి. ఇది ఎక్కువ దక్షణ ఆసియాలో లబిస్తుంది. అంతే కాదు అక్కడే దీనిని ఎక్కువగా తింటారు. బచ్చలిలో ఐరన్, కాల్షియం, ఫైబర్ అధికంగా ఉంటాయి.

గ్రీన్ బీన్స్:

ఫైబర్, ప్రోటిన్లు, విటమిన్లు, పిండి పదార్థాలు బీన్స్‌లో పుష్కలంగా ఉంటాయి. బీన్స్‌ను ఎక్కువగా తీసుకోవడం వలన ఎత్తు పెరుగవచ్చు.

How to Increase Height (హైట్ పెరగడం ఎలా?)

Height (ఎత్తు) పెరగడం అనేది ముఖ్యంగా మన జీన్స్ పై అంటే జన్యువులపై ఆధారపడి ఉంటుంది. సుమారుగా 60 నుండి 80 శాతం మనుషుల యొక్క ఎత్తు జీన్స్ ని బట్టే ఉంటుంది. అయితే 20 నుండి 40 శాతం ఎత్తు మనం తీసుకునే పోషకాహారం పై ఆధారపడి ఉంటుంది.

మీరు శరీరానికి కావలసిన పోషక ఆహారం పట్ల జాగ్రత్త తీసుకోవడం వల్ల అవి మీరు ఎత్తు ఎదగడానికి సహాయపడవచ్చు. ఒక్కసారి మీ గ్రోత్ ప్లేట్స్ కలిసిపోయినట్లయితే ఇంక మీరు ఎత్తు ఎదగడం ఆగిపోతారు. ఇది సాధారణంగా 14 మరియు 18 సంవత్సరాల మధ్య జరుగుతుంది. ఒకవేళ మీరు ఆ తర్వాత కూడా పెరుగుతున్నట్లు అయితే మీరు పాటించిన ఆహారపోషణ మరియు ఆరోగ్యకరమైన జీవనశైలి మీకు సహాయపడి ఉండవచ్చు.

ఎత్తు పెరగడం కోసం పాటించవలిసిన కొన్ని చిట్కాలు.

1. మీ శరీరం ఎదగడానికి ఆరోగ్యకరమైన మరియు పోషకాలతో కూడిన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం మంచి పోషకాహారం మీ శరీరం యొక్క ఎదుగుదల సామర్ధ్యాన్ని నిర్ణయిస్తుంది. మీరు రోజూ తినే ఆహారంలో తాజా కూరగాయలు, పండ్లు, లీన్ ప్రోటీన్లు మరియు కార్బోహైడ్రేట్లు ఉండేలా చూసుకోండి. మీ ప్లేట్ లో సగభాగం తాజా కూరగాయలు, పావు వంతు లీన్ ప్రోటీన్లు మరియు మరో పావు వంతు కార్బోహైడ్రేట్లు ఉండాలి.

ప్రొటీన్ల ఉన్న ఆహార పదార్థాలకు ఉదాహరణలు: మాంసం, చేపలు, బీన్స్ మరియు తక్కువ కొవ్వు శాతం ఉన్న పాలు.

కార్బో హైడ్రేట్ ఉన్న పదార్థాలకు ఉదాహరణకు: తృణధాన్యాలు మరియు పిండి పదార్థం ఎక్కువగా కలిగి ఉన్న కూరగాయలు – బంగాళాదుంపలు.

2. మీ ఆహారంలో ఎక్కువ ప్రోటీన్లు ఉండేలా చూసుకోండి. కండరాలు మరియు శరీర బరువును పెంచడానికి ఈ ప్రోటీన్లు మీకు సహాయపడతాయి.
ఉదాహరణకి పెరుగు, చేపలు, చికెన్ మరియు వెన్న తినడం మంచిది.

3. మీకు గుడ్డు అంటే ఎలర్జీ లేకపోతే ప్రతి రోజూ ఒక గుడ్డు తినండి. ప్రతిరోజు ఒక గుడ్డు తినే పిల్లలు తినని పిల్లలకంటే ఎక్కువ ఎత్తు పెరుగుతారు. గుడ్లు పెరుగుదలకు తోడ్పడే ప్రొటీన్లు మరియు విటమిన్లు కలిగి ఉంటాయి.

4. ప్రతిరోజు పాల పదార్థాలు తినడం మంచిది. మీ శరీరానికి తగిన పోషణ ఇవ్వడానికి పాలలో ప్రొటీన్లు, కాల్షియం మరియు విటమిన్లు ఉంటాయి. అలాగే క్యాల్షియం మరియు విటమిన్లు కలిగి ఉండే ఇతర ఆహార పదార్థాలు తినడం మంచిది.

5. బలమైన ఎముకలు మరియు కండరాల కోసం రోజూ 30 నిమిషాలు వ్యాయామం చేయండి. ప్రతిరోజు వ్యాయామం చేయడం వలన మీరు ఆరోగ్యంగా ఉండటమే కాకుండా ఎత్తు కూడా పెరుగుతారు.
ప్రతిరోజు మీరు చేయగలిగే మరియు ఇష్టమైన వ్యాయామాన్ని ఎంచుకోండి. ఉదాహరణకు ఏదైనా అవుట్ డోర్ గేమ్ ఆడడం, డాన్స్, ఎక్కువ దూరం నడవడం, రన్నింగ్ చేయడం వంటివి.

6. పెరుగుదలను ఆపే పదార్థాలు తీసుకోవడం మానేయండి. డ్రగ్స్ మరియు ఆల్కహాల్ మీ శరీరం ఎదుగుదల ఆగిపోవడానికి కారణం అవుతాయి. మరియు ఎక్కువగా కెఫైన్ పదార్థాలు తీసుకోవడం మరియు ధూమపానం ఆపేయండి. ఎందుకంటే ఇవన్నీ శరీర పెరుగుదల మీద ప్రభావం చూపిస్తాయి.

7 తగినంత నిద్ర పోవడం మంచిది. తగినంత నిద్ర మరియు విశ్రాంతి శరీరం యొక్క మొత్తం పెరుగుదల మరియు అభివృద్ధికి సహాయపడుతాయి. నిద్రలో మీ శరీరంలోని పిట్యూటరీ గ్రంధి గ్రోత్ హార్మోన్ ని ఉత్పత్తి చేస్తుంది. ఇది మీ శరీరం యొక్క పెరుగుదల మరియు అభివృద్ధికి సహాయపడుతుంది.

నిద్ర సమయం:

2 మరియు అంత కంటే తక్కువ వయసున్న పిల్లలు 13-22 గంటలు పడుకోవడం మంచిది.
3-5 సంవత్సరాల పిల్లలు 11-13 గంటల నిద్ర అవసరం.
6-7 సంవత్సరాల వయసున్న పిల్లలకు 9 నుండి 10 గంటలు,
8-14 సంవత్సరాలు గల వారికి 8-9 గంటలు మరియు
15 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ వయసు గలవారికి 7- 9 గంటల నిద్ర అవసరం.

8. వంగి ఉండకుండా నిటారుగా నిలబడడం నిటారుగా నడవడం ప్రాక్టీస్ చెయ్యండి. ఇది మీరు ఎదగడానికి ఏమి సహాయపడదు కానీ మీరు కొంచెం పొడవుగా కనిపించడానికి సహాయపడుతుంది. మీరు కూర్చున్నప్పుడు మీ వీపును నిటారుగా ఉంచడం నడుస్తున్నప్పుడు స్ట్రైట్ గా నిల్చొని, భుజాలు వెనక్కి పెట్టి గడ్డం పైకెత్తి నడవడం ప్రాక్టీస్ చేయండి.

పిల్లలు హైటు పెరగాలంటే ఏంచేయాలి

పిల్లలు ఎత్తుపెరగటానికి ఇలా చేస్తే చాలు
తమ పిల్లలు ఇతర పిల్లల కంటే బాగా ఎత్తుగా పెరగాలని ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటుంటారు. ఇందులో ఎలాంటి తప్పుకూడా లేదు...పిల్లలు ఎత్తుపెరగాలని కోరుకునే తల్లిదండ్రులు అందుకు అవసరమైన పోషకాహారాలను వారికి అందించటంలోకూడా దృష్టిసారించాల్సిన అవసరం ఉంది. దేశంలో సరాసరి ఎత్తు ఐదు అడుగులు. అయితే ఇంతకంటే హైట్ పెరగాలనుకుంటుంటారు చాలామంది. 

అయితే ఎత్తు పెరగడం ఒక్కరోజులో సాధ్యమయ్యే పని కాదు. అతి కృత్రిమంగా వచ్చేదీ కాదు. ఆపరేషన్ చేయించుకుంటే ఎత్తు పెరగడం అసాధ్యం. అందుకే ఎత్తు పెరగాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. శారీరక అభివృద్ధి జరిగే సమయంలో ఈ జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఎత్తు పెరిగేందుకు అవకాశం ఉంటుంది. ఇందుకోసం మనం చేయాల్సిన పని మంచి ఆహారం తినడం.

సాధారణంగా టీనేజీ దాటాక ఎత్తు పెరగడం ఆగిపోతుంది. వయసు దాటిపోయినప్పటికీ కొందరు ఎత్తు పెరిగేందుకు అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. ఇది అన్నిసార్లూ సరైన ఫలితాన్ని ఇవ్వకపోవచ్చు. అందుకే ఎదుగుతున్న వయసులోనే తగిన జాగ్రత్తలు పాటించడం వల్ల సరైన ఎత్తు పెరగవచ్చు. ఆహారంలో కొన్ని మార్పులు చేయడం ద్వారా ఎత్తు పెరిగే అవకాశం ఉంది.

పోషకాహార పదార్థాలను రోజూ ఎదిగే వయసులో తీసుకోవడం ద్వారా మంచి ఫలితముంటుంది.

క్యారెట్ : క్యారెట్ ను తరుచూ తీసుకోవడం వల్ల ఎత్తు పెరుగవచ్చు. దీంట్లో ఎత్తు పెరగడానికి ఉపయోగపడే హార్మోన్‌లు అధికంగా ఉంటాయి.

బీన్స్ : ఫైబర్, ప్రోటిన్లు, విటమిన్లు, పిండిపదార్థాలు బీన్స్‌ లో పుష్కలంగా ఉంటాయి. బీన్స్‌ ను ఎక్కువగా తీసుకోవడం వలన ఎత్తు పెరుగవచ్చు.

బెండకాయ : ఎత్తు పెరగడానికి ఉపయోగపడే మరో కురగాయ బెండకాయ. దీంట్లో విటమిన్లు, ఫైబర్, పిండిపదర్థాలు, నీరు, ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి.

బచ్చలికూర : ఎత్తు పెరగడానికి ఉపయోగపడే అద్భుతమైన ఆకుకూర బచ్చలి. ఐరన్, కాల్షియం, ఫైబర్ బచ్చలిలో అధికంగా ఉంటాయి.

బఠాని : బఠానీలు రోజు తీసుకోవడం వల్ల ఎత్తు పెరిగే అవకాశం ఉంటుంది. ఫైబర్, ప్రోటీన్స్, మినరల్స్ దీంట్లో సమృద్ధిగా ఉంటాయి.

అరటిపండు : బరువు పెరుగకుండా ఉండాలనుకుంటున్నవాళ్లు అరటిపళ్లకు చాలా దూరంగా ఉంటారు. నిజానికి అరటిలో చాలా సుగుణాలు ఉన్నాయి. దీన్ని రోజు తీసుకోవడం వలన ఎత్తు పెరగుతారు.

సోయాబీన్ : ఎత్తు పెరగడానికి సోయాబీన్ చాలా ఉపయోగపడుతుంది. రోజు 50 గ్రాములు తీసుకోవడం వల్ల త్వరగా ఎత్తు పెరగవచ్చు. దీంట్లో ఫైబర్, కార్బోహైడ్రేట్స్ అధిక స్థాయిలో ఉంటాయి.

పాలు : రోజు ఒక గ్లాస్ పాలు తాగడం వల్ల ఎత్తు పెరుగవచ్చు. దీంట్లో విటమిన్ బీ12, డీ తో పాటు కాల్షియం ఉంటుంది.
వీటిని తూచాతప్పకుండా పాటిస్తే మీపిల్లలు  ఎత్తుపెరగటంతోపాటు మంచి ఆరోగ్యంగా కూడా ఉండటం ఖాయం.

ఈ  గ్రూపులో పెడుతున్న మెసేజ్ లన్నీ సభ్యులలో ఆరోగ్యం పట్ల ప్రాధమిక అవగాహన కోసమే అని గమనించాలి. వివిధ  నివారణలు సూచనలు కూడా సభ్యులలో అవగాహన పెంచడానికి మాత్రమే ..మీ డాక్టరు కి ఇది ప్రత్యామ్నాయము కాదు. సభ్యులు గమనించాలి.h

ttps://www.facebook.com/Naveen-Nadiminti-1536735689924644


కామెంట్‌లు లేవు: