24, మే 2020, ఆదివారం

హైపోస్పేడిస్ నివారణకు పరిష్కారం మార్గం


హైపోస్పేడియాస్‌ మూత్ర విసర్జన రంధ్రం. పురుషాంగం చివ్వర కాకుండా కింది భాగంలో 

  

హైపోస్పేడియాస్‌,Hypospadias


హైపోస్పేడియాస్‌,Hypospadias– గురించి తెలుసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం !. క్రింద నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి …

కలల పంటగా బిడ్డ పుట్టినప్పుడు అన్నీ సజావుగా ఉంటే తల్లిదండ్రుల ఆనందానికి అవధులు ఉండవు. కానీ అదే బిడ్డ ఏదైనా చిన్న లోపంతో పుడితే ఆ క్షణంలో తల్లిదండ్రులు అనుభవించే మానసిక వ్యథకూ అంతుండదు. ముఖ్యంగా పసిబిడ్డ అంతా చక్కగా ఉండి జననాంగాల దగ్గర సమస్యల వంటివి కనబడితే.. ఆ పిల్లవాడి భవిష్యత్తు గురించి ఇంటిల్లిపాదీ ఎంతో భయాందోళనలకు లోనవుతారు. మగపిల్లల్లో ఇలా పుట్టుకతో వచ్చే జననాంగ సమస్యల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది… హైపోస్పేడియాస్‌! అంటే మూత్ర రంధ్రం ఉండాల్సిన చోట కాకుండా.. పురుషాంగం మీద మరోచోట ఎక్కడో ఉండటం.. దానివల్ల పురుషాంగం స్వరూపమే తేడాగా ఉండటం ఈ సమస్యకు మూలం. మన సమాజంలో దీని గురించి బయట పెద్దగా చెప్పుకోకపోయినా… ఇది మరీ అంత అరుదైన సమస్యేం కాదు. దీన్ని చిన్నతనంలోనే చక్కదిద్దేందుకు చక్కటి సర్జరీ విధానాలూ ఉన్నాయి. అయినా దీనిపై అవగాహనా లేమి కారణంగా ఎంతోమంది… పెద్ద వయసులో కూడా దీనితో ఇబ్బందులు పడుతుండటం బాధాకరం.

బిడ్డ పండల్లే చక్కగా ఉంటాడు. ఎటువంటి సమస్యా ఉండదు. కానీ పురుషాంగం వైపు చూస్తే… దాని రంధ్రం ఉండాల్సిన చోట ఉండదు. అంగం మీదే మరెక్కడో కిందగా.. లేదంటే వృషణాల తిత్తి దగ్గర… ఇలా వేర్వేరు ప్రాంతాల్లో ఉంటుంది. బిడ్డ మూత్ర విసర్జన చేస్తుంటే.. మూత్రం అక్కడి నుంచే.. ఆ రంధ్రం నుంచే బయటకు వస్తుంటుంది. పూర్వచర్మం అంతా పైనే ఉండి శిశ్నం చిక్కుడు గింజలా కూడా కనిపించొచ్చు. దీన్ని చూస్తూనే తల్లిదండ్రులు ఆందోళనకు లోనవుతుంటారు. ఇదేదో వింత సమస్య అనో.. పురుషాంగం సరిగా తయారవ్వలేదనో.. ఎక్కడా లేని ఈ సమస్య తమ బిడ్డకే ఎందుకు వచ్చిందనో.. రకరకాలుగా చింతిస్తుంటారు. కానీ వాస్తవానికి ఇది మరీ అరుదైన సమస్యేం కాదు. దీన్నే వైద్యపరిభాషలో ‘హైపోస్పేడియాస్‌’ అంటారు.

ప్రతి 250లో ఒకరు!–సాధారణంగా మూత్ర విసర్జన రంధ్రం… పూర్వచర్మంతో పూర్తిగా కప్పి ఉన్న గుండ్రటి శిశ్నం చివ్వర ఉంటుంది. కానీ ఈ హైపోస్పేడియాస్‌ సమస్యతో పుట్టిన పిల్లల్లో.. ఈ మూత్రం పోయే మార్గం పురుషాంగం చివ్వర కాకుండా.. శిశ్నం మధ్యలో కాకుండా.. దాని కింది భాగంలో మొదలుకొని వృషణాల తిత్తి వరకూ.. రకరకాల ప్రదేశాల్లో ఉండొచ్చు. మగపిల్లల్లో ప్రతి 250 మందిలో కనీసం ఒకరు ఈ తరహా సమస్యతో పుడుతున్నట్టు అంచనా. మన దేశంలో ప్రసవాల సంఖ్యను బట్టి చూస్తే ఇదెంత తరచుగా ఎదురయ్యే సమస్యో తేలికగానే అర్థం చేసుకోవచ్చు. ఈ సమస్యతో పుట్టే కొందరికి పూర్వచర్మం మొత్తం గూడులా పైవైపునే ఉండి.. కింద ఏమీ ఉండకపోవచ్చు. మూత్ర రంధ్రం కొందరికి బీర్జాల దగ్గరే కాదు.. అరుదుగా ఏకంగా మలద్వారం సమీపంలో కూడా ఉండొచ్చు. అయితే ఎక్కువ మందిలో ఈ రంధ్రం శిశ్నానికి కింది భాగంలోనే.. పురుషాంగం చివర్లోనే ఉంటుంది, దీన్ని సర్జరీతో సరిచేయటం కూడా కొంత తేలిక. రంధ్రం మరీ కిందగా ఉన్నప్పుడు కొంత క్లిష్టమైన సర్జరీలు, కొన్నిసార్లు దశలవారీగా కూడా చెయ్యాల్సి వస్తుంది.

ఏమిటి దీనితో సమస్య?
బిడ్డ హైపోస్పేడియాస్‌ తరహా సమస్యతో పుట్టినట్టు గమనించగానే.. తల్లిదండ్రుల్లో ఎన్నో అనుమానాలు ముసురుకుంటాయి. ముఖ్యంగా పిల్లవాడు సహజంగా ఎదిగి.. సాధారణ జీవితం గడపగలుగుతాడా? లేదా? అన్నది పెద్ద అనుమానం. తెరుచుకున్నట్లుగా ఉన్న మూత్రనాళాన్ని ఎలా సరిచేస్తారు? ఆపరేషన్‌ చేయించినా తర్వాత ఏమైనా సమస్యలు వస్తాయా? అంగం మామూలుగానే కనబడుతుందా? పెద్దయ్యాక స్తంభన, సంతాన సామర్థ్యం ఎలా ఉంటాయి? ఇంత చిన్నబిడ్డకు సర్జరీ చేస్తే ఏమవుతుందో? అసలు ఆపరేషన్‌ చేయించకపోతే ఏమవుతుంది? ఇలా ఎన్నో సందేహాలు మనసులో తొలుస్తుంటాయి. సమస్యపై అవగాహన పెంచుకోవటం ఒక్కటే వీటన్నింటికీ సరైన సమాధానం.

తెలియక ముందే దిద్దుబాటు
వయసు పెరుగుతున్న కొద్దీ పసిపిల్లలకు తమ జననాంగాల గురించి అవగాహన పెరుగుతుంటుంది. వారికి ఈ విషయాలేవీ సరిగా తెలియక ముందే ఆపరేషన్‌ చేయటం మంచిది. ఎందుకంటే ఊహ తెలిసిన తర్వాత చేస్తే.. వయసు పెరుగుతున్నకొద్దీ తమ జననాంగాలపై ఏదో చేశారని పిల్లలు జీవితాంతం మానసిక క్షోభ పడే అవకాశం ఉంది. వీరిలో కొందరికి రెండు, మూడు సార్లు కూడా ఆపరేషన్‌ చేయాల్సి వస్తుంది కాబట్టి దీన్ని ఏడాది లోపే చేయటం వల్ల వారికి ఊహ తెలిసేసరికి అంతా సజావుగా ఉంటుంది. రెండోది- సాధారణంగా రెండేళ్ల వయసు వరకూ పిల్లలకు మూత్ర విసర్జనపై పట్టు, నియంత్రణ ఉండవు. వచ్చినప్పుడు పోసేస్తుంటారు. రెండేళ్ల తర్వాత నియంత్రణ, పట్టు వస్తాయి. కాబట్టి ఆ తర్వాత సర్జరీ చేస్తే.. భయంతో వాళ్లు మూత్ర విసర్జనకు వెళ్లకుండా బిగబట్టేసుకుంటారు. ఇది కొత్త సమస్యలు తెచ్చిపెడుతుంది. మూత్రం బయటకు రావటానికి లోపలికి గొట్టాల వంటివి వెయ్యాల్సి వస్తుంది, దీంతో సర్జరీ ఫలితాలు ప్రభావితమయ్యే అవకాశమూ ఉంటుంది. స్కూలుకు వెళ్లే వయసులో.. మూత్రవిసర్జన మిగతా పిల్లలందరిలా లేకపోవటంతో పిల్లవాడు మానసిక వేదన, నగుబాటుకు గురయ్యే అవకాశాలూ ఉంటాయి. ముఖ్యంగా 3-8 ఏళ్ల వయసులో పిల్లలకు జననాంగాల మీద ఆసక్తి, కుతూహలం ఎక్కువగా ఉంటాయి. ఆ వయసు వరకూ ఈ సమస్యను సరిచేయించకపోతే బిడ్డ మానసికంగా కుంగిపోయే అవకాశం ఉంటుంది. దీనికి తోడు అంగం వంకర (కార్డీ) కూడా ఉంటే సెక్స్‌లో సమస్యలు, స్ఖలనంలో ఇబ్బంది, రతిలో వీర్యం సరిగా బయటకు రాకపోవటం వంటి ఇబ్బందులు రావచ్చు. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని- రెండేళ్ల లోపే ఆపరేషన్‌ చేస్తే ఈ తరహా సమస్యలు లేకుండా చూసుకోవచ్చు. ఆపరేషన్‌ తర్వాత ఎదురయ్యే సమస్యలను తప్పించుకోవచ్చు.

ఎలా సరి చేస్తారు?
ఒకరకంగా హైపోస్పేడియాస్‌ను చేసే సర్జరీ.. ఉన్న లోపాన్ని చక్కదిద్దుతూ మూత్రమార్గాన్ని పునర్నిర్మించటం లాంటిది! దీనికోసం ఇప్పుడు ఎన్నో ఆధునిక విధానాలు ఉన్నాయి. లోపం తీరును బట్టి సర్జరీ ఎలా చేయాలన్నది వైద్యులు నిర్ణయిస్తారు. మూత్ర రంధ్రం సరిచేయటం, అంగం వంగినట్లుంటే దాన్నీ సరిచేయటం.. రెండూ సర్జరీలో ముఖ్యాంశాలే. సాధారణంగా మూత్ర రంధ్రం శిశ్నం కిందే ఉండి.. చివరి వరకూ గాడిలా ఉంటే.. సర్జరీ సమయంలో దాన్నే గుండ్రటి మూత్ర మార్గంగా మలుస్తారు. దీంతో మూత్ర రంధ్రం… అంగం మధ్యకు, చివరకు వచ్చేస్తుంది. అంతా సహజంగా కనబడుతుంది. కొందరిలో ఇలా చెయ్యటానికి అనువుగా లేకుండా.. మూత్ర రంధ్రం మరీ కిందగా ఉంటే.. పురుషాంగం పైన గూడులా ఉన్న పూర్వచర్మం లోపలి పొరను.. ఇంకా అవసరమైతే పూర్వచర్మం పైపొరను కూడా మూత్రనాళంలా తయారు చేయటానికి ఉపయోగిస్తారు. కొందరిలో పూర్వచర్మం కూడా తగినంత లేకపోతే లోపలి బీర్జాల దగ్గరి సున్నిత చర్మం నుంచి, లేదంటే దవడ లోపలి మృదువైన చర్మాన్ని, కింది పెదవి లోపలి చర్మాన్ని తీసుకుని మూత్రమార్గంగా తయారు చేసే విధానాలు కూడా ఇప్పుడు ఉన్నాయి. వీటితో ఫలితాలు కూడా చాలా బాగుంటున్నాయని అధ్యయనాల్లో గుర్తించారు.

ఫలితాలు తృప్తికరం
ఒకప్పుడు అనుసరించిన సర్జరీ విధానాలతో ఫలితాలు కొంత వరకే సంతృప్తికరంగా ఉండేవి. కానీ గత దశాబ్ద కాలంగా అంతర్జాతీయంగా అందుబాటులోకి వచ్చిన విధానాలతో ఫలితాలు చాలా బాగుంటున్నాయని గుర్తించారు. నిపుణులైన సర్జన్లు చేసినప్పుడు వీటితో బిడ్డ పెరిగి పెద్దయినా ఎటువంటి ఇబ్బందులూ ఉండవని చెప్పచ్చు. పురుషాంగం కూడా చాలా వరకూ సహజంగా కనబడుతుంది. లైంగిక సామర్థ్యం, సంతానం వంటి వాటికేమీ ఇబ్బంది ఉండదు.

నివారించగలమా?
హైపోస్పేడియస్‌ రావటానికి కచ్చితమైన కారణమేంటో తెలియదు. ఇటువంటి లోపాలతో పిల్లలు అన్ని సమాజాల్లో, జాతుల్లో, వర్గాల్లో పుడుతున్నారు. కొన్ని కుటుంబాల్లో తండ్రికి ఈ సమస్య ఉంటే కొడుకుకూ వచ్చిన సందర్భాలున్నాయి. ప్రధానంగా దీనికి జన్యుపరమైన అంశాలకు తోడు.. తల్లి గర్భంలో పిండం పెరుగుతున్న సమయంలో పర్యావరణ పరమైన ప్రభావాలు కూడా దోహదం చేస్తున్నాయని భావిస్తున్నారు. ఆడపిల్త్లెనా, మగపిల్లాడైనా తల్లి గర్భంలో పెరిగేటప్పుడు 9 వారాల వరకూ జననాంగం ఒకే తీరులా ఉంటుంది. ఆ తర్వాత స్త్రీ, పురుష అంగాలుగా మారి, హార్మోన్ల ప్రభావంతో ఎదగటం మొదలుపెడుతుంది. ఈ సమయంలో పురుష హార్మోన్‌లో తేడాల వల్ల పురుషాంగం సరిగా ఎదగక.. హైపోస్పేడియాస్‌ వంటి లోపాలు వచ్చే అవకాశం ఉందని పరిశోధకులు భావిస్తున్నారు. కాబట్టి గర్భం తొలివారాల్లో గర్భిణులు పురుగుల మందులు, రసాయనాల వంటివాటికి దూరంగా ఉండటం.. శుభ్రమైన, సహజమైన ఆహారం తీసుకోవటం, కృత్రిమ రంగులు కలిపిన పదార్థాలకు, పారిశ్రామిక ప్రాంతాలకు దూరంగా ఉండటం.. ఇలాంటి జాగ్రత్తలు కొంత వరకూ ఉపకరించొచ్చని పరిశోధకులు భావిస్తున్నారు.

నైపుణ్యం కీలకం!
పసిపిల్లలే సున్నితమనుకుంటే.. వాళ్ల పురుషాంగం మరింత సున్నితం. దీనిపై ఆపరేషన్‌ చేయటం.. ముఖ్యంగా పుట్టుకతో వచ్చిన లోపాన్ని చక్కదిద్ది బిడ్డ పూర్తి సహజంగా ఎదిగేలా చెయ్యటం మరింత సంక్లిష్టమైన అంశం. అందుకే ఇలాంటి సమస్యలు ఎదురైనప్పుడు దీనిలో ప్రత్యేక నైపుణ్యం ఉన్నవారిని ఎంచుకోవటం అవసరమని నొక్కిచెబుతున్నారు పిల్లల యూరాలజీ సమస్యల్లో అంతర్జాతీయ ఖ్యాతి గడించిన డా. రమా జయంతి. మన విశాఖపట్టణానికి చెందిన ఈయన ఓహియో (అమెరికా) రాష్ట్రంలోని ప్రఖ్యాత నేషన్‌వైడ్‌ చిల్డ్రెన్స్‌ ఆసుపత్రిలో సేవలందిస్తున్నారు.

*హైపోస్పేడియాస్‌ సమస్యను చక్కదిద్దే సర్జరీ క్లిష్టమైనది దీనిలో ఉన్న ఇబ్బంది, ప్రత్యేకత ఏమిటి?
ఇది చాలా సున్నితమైనది, మిగతా వాటికన్నా చాలా భిన్నమైన సర్జరీ. ఉదాహరణకు కిడ్నీకి క్యాన్సర్‌ వచ్చిందనుకోండి. కిడ్నీని పూర్తిగా తొలగించేస్తారు. తీసేస్తే అయిపోతుంది. కానీ ఇందులో లోపాన్ని చక్కదిద్దుతూ మూత్రమార్గాన్ని మనం కొత్తగా ఏర్పాటు చెయ్యాలి. అలా చేసినది ఏ ఇబ్బందీ లేకుండా జీవితాంతం సంతృప్తికరంగా పని చెయ్యాలి. అందుకోసం సర్జరీలో కణజాలం ఎక్కడా దెబ్బతినకుండా అడుగడుగునా సున్నితంగా మరమ్మతు చెయ్యాల్సి ఉంటుంది. దీనికి చాలా నేర్పు, ఓర్పు కావాలి. ఇది హడావుడిగా చేసేసేది కాదు. సర్జరీ తర్వాత పురుషాగం సాధ్యమైనంత సహజంగా కనబడాలి, సహజంగా పని చేయాలి. అది ముఖ్యం.

* ఇది సున్నితమైన ఆపరేషన్‌ , మరి సర్జరీ తర్వాత ఫలితాలు ఎలా ఉంటాయి?
హైపోస్పేడియాస్‌ విషయంలో మొట్టమొదట చేసే ఆపరేషన్‌ కీలకమైనది. దానిలోనే సమస్య సరి అయిపోవటం ఉత్తమం. మళ్లీ మళ్లీ సర్జరీలు చెయ్యాల్సి వచ్చిన కొద్దీ సమస్యలు కూడా పెరుగుతాయి. కాబట్టి ఈ సర్జరీ కోసం దీనిలో పూర్తిగా ప్రత్యేక నైపుణ్యం ఉన్న, నిపుణులనే ఎంచుకోవాలి. అప్పుడే ఫలితాలు బాగుంటాయి. ఈ విషయం ప్రత్యేకంగా చెప్పాలనుకుంటున్నాను. చాలామంది ‘పిల్లలకు ఆపరేషన్లు చేయటమంటే ఏముంది, పెద్దవాళ్లకు చేసినట్టే.. కాస్త చిన్నపిల్లల మీద చేస్తారు.. అంతే కదా!’ అనుకుంటుంటారు. కానీ అది సరికాదు. మామూలు సర్జన్‌ ఎవరైనా చేసేసేది కాదిది. పిల్లల సర్జరీల్లో ప్రత్యేక నైపుణ్యం, తరచూ పిల్లల ఆపరేషన్లలో అనుభవం ఉన్నవారే దీన్ని చెయ్యాలి. మొదటిసారే వాళ్లు చేస్తే.. తర్వాత్తర్వాత సమస్యలు తలెత్తే అవకాశాలు తక్కువ!

* చిన్నపిల్లలకు, అదీ పురుషాంగం మీద చేసే సర్జరీ కదా.. తల్లిదండ్రుల్లో సహజంగానే ఆందోళన ఉంటుంది. దీన్ని సరిదిద్దితే పిల్లలు పెరిగి పెద్దయిన తర్వాత పూర్తి సాధారణ జీవితం గడపగలుగుతారా?
హైపోస్పేడియాస్‌.. సర్జరీతో పూర్తిగా చక్కదిద్దటానికి వీలైన సమస్యే. సర్జరీ చేయించుకున్న పిల్లలు పెరిగి పెద్దయ్యాక అందరిలా మామూలుగానే ఉంటారు. అందరిలా పెళ్లి చేసుకోవచ్చు. పిల్లలను కనొచ్చు. ఎలాంటి సమస్యలూ ఉండవు.

* సర్జరీ వల్ల ఒకవేళ సమస్యలు తలెత్తితే.. ఎలాంటి దుష్ప్రభావాలు ఎదురవ్వచ్చు?
దీనిలో ప్రత్యేక అనుభవం ఉన్నవాళ్లు చేస్తే సమస్యలు తలెత్తే అవకాశాలు తక్కువనేగానీ.. అస్సలు ఉండవని చెప్పలేం! ముందే చెప్పుకొన్నట్టు ఇది క్లిష్టమైన సర్జరీ. ఎంత అనుభవం ఉన్నవాళ్లు చేసినా కొన్ని సమస్యలుండొచ్చు. ఆపరేషన్‌ తర్వాత తలెత్తే అవకాశం ఉన్న సమస్యల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది- మనం మరమ్మతు చేసిన ప్రాంతం సరిగా మానకపోతే మరోచోట రంధ్రం పడి, అక్కడి నుంచి మూత్రం బయటకు వస్తుండవచ్చు. మరో కీలకమైన సమస్య- మనం మరమ్మతు చేసిన చోట పుండు మానటంలో మందపాటి కణజాలం (స్కార్‌) ఏర్పడి.. మూత్రమార్గం అక్కడ మూసుకుపోయినట్లవ్వచ్చు (స్ట్రిక్చర్‌). ఇన్ఫెక్షన్లు వచ్చినా ఈ దుష్ప్రభావాలు తలెత్తచ్చు. అపరిశుభ్రత వల్ల ఇన్ఫెక్షన్లు రావచ్చు. దీనిలో ప్రత్యేక నైపుణ్యం ఉన్నవాళ్లయితే సాధ్యమైనంత వరకూ ఇలాంటివి తలెత్తకుండా చూడటం, ఒకవేళ వస్తే వీటిని సమర్థంగా ఎదుర్కొనటం వీలవుతుంది. పీడియాట్రిక్‌ యూరాలజిస్ట్‌గా మన లక్ష్యం- ఒకసారి ఆపరేషన్‌ చేసి, అది మానిపోయిన తర్వాత పిల్లవాడికి ఎటువంటి తేడా ఉండకూడదు. మళ్లీ మళ్లీ డాక్టర్ల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండకూడదు.

* అవగాహనా లేమితో చిన్నతనంలో సర్జరీ చేయించకుండా వదిలేయటం వల్ల.. పెరిగి పెద్త్దె ఇబ్బందులు పడుతున్న వాళ్లు చాలామంది ఉంటున్నారు. దీన్ని ఏ వయసులో సరిచేయటం ఉత్తమం?
పెద్దయ్యాక ఆపరేషన్‌తో చక్కదిద్దటం కష్టం. ఇతరత్రా సమస్యలూ ఉంటాయి. కాబట్టి ఏడాదిలోపే ఆపరేషన్‌ చేయించటం ఉత్తమం. అయితే అంత చిన్నపిల్లల మీద సర్జరీ చేసే నైపుణ్యం గల పీడియాట్రిక్‌ సర్జన్లు, పిల్లల మత్తు డాక్టర్లు కూడా ఇందుకు అవసరం. చిన్నప్పుడే ఆపరేషన్‌ చేయటం వల్ల పిల్లలు యవ్వనంలో మానసిక క్షోభకు, నగుబాటుకు గురికాకుండా ఉంటారు.

* హైపోస్పేడియాస్‌ను చక్కదిద్దితే ఈ పిల్లలు పెద్త్దె పూర్తి సాధారణ లైంగిక జీవితం గడపగలుగుతారా?
హైపోస్పేడియస్‌ అనేది మూత్ర మార్గం, ఇంకా చెప్పాలంటే.. మూత్రం బయటకు వచ్చే గొట్టానికి సంబంధించిన సమస్యేగానీ స్తంభన వంటి వాటికేం ఇబ్బంది ఉండదు. ఇదొక రకంగా మన ఇళ్లలో ఉండే నీళ్ల పైపులు సరిచేయటం (ప్లంబింగ్‌) లాంటిది! ఈ సమస్య ఉన్నా చాలామందిలో అంగ స్తంభన, వీర్య స్ఖలనం వంటివన్నీ మామూలుగానే ఉంటాయి. కొద్దిమందిలో మాత్రం పురుషాంగం వంకర తిరగటం (కార్డీ) వంటి ఇబ్బందులుంటాయి. వాటినీ సరిచేస్తారు. ఆపరేషన్‌ సరిగా చేస్తే పురుషాంగం మీద మచ్చల్లాంటివీ ఉండవు.

* ఈ సమస్యను చిన్నతనంలో సరిచేయకుండా ఉండిపోయి.. దీనితోనే పెరిగి పెద్దయినవాళ్లు ఏం చేస్తే మంచిది?
హైపోస్పేడియాస్‌ రకాల్లో అన్నింటికన్నా ఎక్కువగా కనబడేది- మూత్ర రంధ్రం అంగం చివరిలో కాకుండా.. దాని కన్నా కొద్దిగా కింద ఉండే రకం. నిజానికి విసర్జన సమయంలో మూత్రం కిందికి పడుతుండటం తప్పించి.. దీంతో మరీ అంత పెద్ద సమస్యేం ఉండదు. ఆపరేషన్‌ చేయకపోయినా వీళ్లు మామూలుగానే ఉంటారు. పెద్దయ్యాక శృంగారపరంగానూ ఇబ్బందులేమీ ఉండవు. వీర్యం మామూలుగానే బయటకు వస్తుండటం వల్ల పిల్లలను కనటంలోనూ సమస్యలు ఉండవు. అయితే ఈ రంధ్రం ఇంకా కింద.. అంటే పురుషాంగం మధ్యలోగానీ.. వృషణాల వద్దగానీ అంతకన్నా కిందికి గానీ ఉంటే సమస్యలు ఎక్కువ. ఇతరత్రా సమస్యలతో పాటు వీరికి వీర్యం స్ఖలించినప్పుడు అది చేరాల్సిన చోటికి చేరదు కాబట్టి వీరికి సంతానావకాశాలూ కష్టం. కాబట్టి వీటికి ఆపరేషన్‌ తప్పనిసరి. వీరికి ఆపరేషన్‌ సరిగా చేయకపోతే మళ్లీమళ్లీ ఆపరేషన్లు చెయ్యాల్సి కూడా రావొచ్చు. కాబట్టి పెద్దవయసులో ఆపరేషన్‌ చేయించుకోవాలనుకున్నా.. వీళ్లు చిన్నపిల్లల మూత్ర సంబంధ వ్యాధులపై అవగాహన కలిగిన పీడియాట్రిక్‌ సర్జన్‌ను గానీ నిపుణులైన యూరాలజిస్టును గానీ సంప్రదించాలి. ఎందుకంటే ఇది పెద్దవయసు వరకూ అలాగే ఉండిపోయిన చిన్నపిల్లల సమస్య! కాబట్టి దీనిలో నైపుణ్యం ఉన్నవారినే ఎంచుకోవటం మంచిది.

ధన్యవాదములు 

మీ నవీన్ నడిమింటి 

విశాఖపట్నం 

శోభి తెల్ల మచ్చలు నివారణకు

శోభి మచ్చలు-చర్మం పైన తెల్ల మచ్చలు (vitiligo) నివారణకు నవీన్ నడిమింటి సలహాలు 


కావాల్సిన వస్తువులు:
1.తులసి ఆకులు -20
2.మంచి పసుపు -1 స్పూన్

తయారు చేయు విధానం:
తులసి ఆకులు, మంచి పసుపును-కొంచం నీరు తీసుకొని మెత్తగా నూరండి.

ఉపయోగించాల్సిన విధానం:
స్నానానికి గంట ముందు ఆయా మచ్చల పై రుద్దండి. అది ఎండి పోయే వరకు ఉంచి స్నానం చేయండి . అలా 21 రోజులు చేయండి. ఫలితం మీకే తెలుస్తుంది.

                 శోభి మచ్చలు --- నివారణ                        
 
       శరీరం మీద తెల్లటి మచ్చలు వుండడం దీని లక్షణం
 
                                   తులసి ఆకులు            
                                        దంచిన పసుపు పొడి     ----  ఒక టీ స్పూను.
 
      రెండింటిని కలిపి అవసరమైతే నీరు కలిపి మెత్తగా నూరాలి. స్నానానికి గంట ముందు శోభి మచ్చల మీద  సున్నితంగా మర్దన చెయ్యాలి. ఎండిపోయిన తరువాత సున్ని పిండి తో స్నానం చెయ్యాలి.
 
కడుపులోకి:--                 పసుపు             ----- 50 gr
                                  పాత బెల్లం        ----- 100 gr
 
       రెండింటిని బాగా కలిసి పోయేట్లు దంచి గాజు సీసాలో భద్ర పరచుకోవాలి. ప్రతి రోజు 5 గ్రాముల ముద్దను బుగ్గలో పెట్టుకొని చప్పరించి తిని ఒక గ్లాసు మజ్జిగ తాగాలి.
 
       దీని వలన రక్త శుద్ధి జరుగుతుంది.
 
       శోభి (తెల్ల మచ్చలు లేక సిబ్బెం )          
 
కారణాలు :-- పదార్ధాలు కలుషితం కావడం, సున్ని పిండి వాడక పోవడం, తైలం రాయక పోవడం, సబ్బుల   వాడమ ఎక్కువకావడం,  మొదలైనవి.
 
      ఈ మచ్చలు ముఖం మీద శరీరం మీద చాతీ మీద మెడ మీద వస్తాయి.
 
      తైల మర్దన వలన మచ్చలు రాకపోవడమే కాక రక్త ప్రసరణ పెరుగుతుంది. జ్ఞాన ధారణ పెరుగుతుంది.
 
ఉత్సాహం  పెరిగి  ఉల్లాసంగా వుంటారు. అందు వలన చిన్నప్పటి నుండి తైల మర్దన చెయ్యాలి.
  
       "పత్తి గింజలు " కొన్ని ఒక గిన్నెలో వేసి రాత్రంతా నాన బెట్టాలి. ఉదయం వాటిని నూరి మచ్చలపై  రుద్దాలి. మచ్చలు చాలా త్వరగా మాయమవుతాయి.
 
                          శోభి మచ్చల నివారణ                               
         100  గ్రాముల రేల చెట్టు యొక్క పచ్చి ఆకులను తెచ్చి కల్వంలో వేసి నిమ్మ రసం వేసి మెత్తగా నూరి  మచ్చలపై పట్టిస్తే శోభి తగ్గుతుంది.  తగ్గే వరకు వాడాలి.
 
                                               19-11-10

        వ్యాధి నిరోధక శక్తి తగ్గడం, పోషకాహార లోపం, మత్తు పదార్ధాలు ఎక్కువగా వాడడం, మధుమేహ వ్యాధి   వెంట్రుకల కుదుళ్ళకు చీము పట్టడం, చుండ్రు మొదలగు కారణాల వలన శోభి మచ్చలు ఏర్పడతాయి.
 
గంధకం  (మామూలు గంధకం)
ముల్లంగి రసం
అల్లం రసం
 
        గంధకాన్ని రెండు రసాలతో నూరి శోభి మచ్చలపై పూయాలి. క్రమంగా తగ్గుతాయి.
 
2. ముల్లంగి గింజలు
    ఉత్తరేణి మొక్క రసం
 
       రెండింటిని కలిపి నూరి పూయాలి.
 
3. తగరిస గింజల పొడి
    పుల్లటి గంజి
 
         కలిపి నూరి పూయాలి
 
4. నల్ల ముళ్ళ గోరింటాకు రసం మచ్చలపై పూస్తే తగ్గుతాయి.
 
5. ముల్లంగి రసం, మజ్జిగ కలిపి పూయాలి.
 
6. ఉత్తరేణి  బూడిద  ఆముదం కలిపి పూయాలి,
 
7. నిమ్మ రసం, కొబ్బరినూనె కలిపి పూయాలి.
 
8. మంచి గంధం, హారతి కర్పూరం  కలిపి పూయాలి.        

ధన్యవాదములు 
మీ నవీన్ నడిమింటి 
విశాఖపట్నం   
https://www.facebook.com/Naveen-Nadiminti-1536735689924644/

రక్తహీనత సమస్య పరిష్కారం మార్గం క్రింద లింక్స్ చుడండి


ఎర్ర రక్త కణాల సంఖ్య (RBC) లేదా హేమోగ్లోబిన్ సాంద్రత తగ్గడం వలన రక్తహీనత ఏర్పడుతుంది. ఇనుము లోపం వలన కలిగే రక్త హీనత, మెగాలోబ్లాస్టిక్ అనీమియా, అప్లాస్టిక్ అనీమియా మరియు మరిన్ని అనేక రకాలైన రక్తహీనతలు ఉన్నాయి. పరాన్నజీవి సంక్రమణ వలన భారీ రక్త నష్టం, భారీ రుతుస్రావo, గర్భం మరియు అసమతుల్య పోషణ వంటివి ఈ పరిస్థితికి కారణాలు కావచ్చు. రక్త హీనత అనేది అలసట, బలహీనత, పాలి పోయిన లేత చర్మం మరియు శ్వాసలో ఇబ్బందులు వంటి లక్షణాలకు దారితీస్తుంది. హేమోగ్లోబిన్ మరియు ఎర్ర రక్త కణాలు లెక్కింపు, పరాన్నజీవి సంక్రమణను తొలగించడానికి మల పరీక్ష, మరియు అప్లాస్టిక్ రక్తహీనత విషయంలో ఎముక మజ్జ యొక్క పరీక్షతో సహా పూర్తి రక్త కణాల లెక్కింపు వంటి విశ్లేషణ పరీక్షల ద్వారా దీనిని పరిశోధించవచ్చు. రక్తహీనత యొక్క చికిత్స దాని సంబంధిత కారణం మీద ఆధారపడి ఉంటుంది మరియు పోషకాహార లోపం అనీమియా విషయంలో సరైన పోషకాహారం మరియు ఐరన్ కలిగిన మందులు వాడవచ్చు. తీవ్రమైన రక్తహీనత అయినచో మొత్తం రక్త మార్పిడి చేయుట ద్వారా నయం చేయబడుతుంది. అప్లాస్టిక్ రక్తహీనత లేదా నిరంతర రక్తహీనత విషయంలో, ఎముక మజ్జ మార్పిడి సాధారణంగా చివరి ప్రయత్నం అవుతుంది. రక్తహీనత యొక్క ఫలితం సంబంధిత స్థితిపై ఆధారపడి ఉంటుంది మరియు చాలా వరకు దీని కారణాలపై చికిత్స చేయవచ్చు, ఇది మంచి ఫలితాన్ని కూడా ఇస్తుంది. పరిస్థితి సరిగా లేనట్లయితే, రక్తహీనత వలన అకాల డెలివరీ, నవజాత శిశువులో రక్తహీనత, తక్కువ బరువు కలిగి ఉండడం, మూర్ఛలు మరియు ఇతరులలో అవయవ నష్టం వంటి సమస్యలకు దారి తీస్తుంది

రక్తహీనత (అనీమియా) యొక్క లక్షణాలు

పైన చెప్పినట్లుగా, రక్తహీనతలో, రక్తం యొక్క ఆక్సిజన్-వాహక సామర్థ్యం తగ్గిపోతుంది. అందువలన, ఈ మార్పుకు సంబంధించిన లక్షణాలు కూడా ఇలా ఉంటాయి:

  • బలహీనత
    బలహీనత భావన అనేది రక్తహీనత యొక్క అత్యంత సాధారణ లక్షణం మరియు ఏదైనా ముఖ్యమైన భారీ పని చేయకుండానే అలసట కలిగి ఉండటాన్ని గుర్తించవచ్చు.
  • శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉండడం
    రక్తహీనత యొక్క అత్యంత గుర్తించదగ్గ లక్షణాలలో ఒకటి శ్వాస తీసుకోవడంలో లేదా శ్వాసను కోసం ప్రయత్నాలు చేపట్టడంలో కష్టoగా ఉంటుంది.
  • అసౌకర్య భావన
    రక్తహీనత కారణంగా కొన్నిసార్లు మీకు ఆరోగ్యంగా ఉన్న భావన కలుగకపోవచ్చు లేడా ఇది చెప్పలేని విధంగా అసౌకర్య భావన కలిగి ఉంటుంది.
  • మైకము
    ఒక్కోసారి పడిపోవడం కారణంగా కూడా గాయం వంటి సమస్యలకు దారి తీయవచ్చు కాబట్టి మైకమును విస్మరించరాదు. ఇది మీ మెదడుకు తగిన ప్రాణవాయువు సరఫరా లేని కారణంగా ఇలా జరుగుతుంది.
  • పనితీరులో తగ్గుదల
    మీరు ఇంతకు ముందు సులభంగా చేయగలిగిన వాటిని ఇప్పుడు చేయలేరు అలాగే మీరు ఎలాంటి వ్యాయామం కూడా చేయలేరు. ఇది ఏకాగ్రత చేయలేకపోవడం లేదా పనిలో దృష్టి పెట్టలేకపోవడం వంటివి ఉండవచ్చు
  • తలనొప్పి
    ఒక తలనొప్పి అనేది అనారోగ్యం యొక్క ఒక అరుదైన లక్షణం, ఇది తేలికపాటి నుండి మధ్యస్థ నొప్పికి కారణమవుతుంది.
  • పికా
    సున్నం, ఐస్ మరియు బంకమట్టి వంటి సామాన్యంగా తినదగని వస్తువులను తినడం లేదా తినాలి అనిపించడం. ఇది రక్తహీనతతో ఎక్కువగా సంబంధం కలిగి ఉంటుంది కాని తరచూ చూస్తుంటాము

రక్తహీనత (అనీమియా) యొక్క చికిత్స 

రక్తహీనత చికిత్స అనేది సాధారణంగా సంబంధిత కారణం, రక్తహీనత యొక్క గ్రేడ్ మరియు వ్యక్తి యొక్క మొత్తం ఆరోగ్యంపై ఆధారపడి ఉంటుంది.

రక్తహీనత చికిత్స కోసం సాధారణ సూచనలు:

  • మీ డాక్టర్ సూచన ప్రకారం ఐరన్, విటమిన్ B12 మరియు ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్లను తీసుకోవడం ద్వారా సరైన పోషణను నిర్వహించడం.
  • ఆకుపచ్చ ఆకు కూరలు, తాజా పండ్లు, గుడ్డు, మాంసం, చేప వంటి ఐరన్ కలిగిన ఆహారం తీసుకోవాలి.
  • నిమ్మకాయలునారింజమామిడి, మరియు మరిన్ని సహా సిట్రస్ పండ్లు వంటి విటమిన్-రిచ్ ఆహారాలు తగినంత మొత్తంలో తీసుకోవడం. అంతేకాకుండా, విటమిన్ C సప్లిమెంట్స్ కూడా కౌంటర్­లో అందుబాటులో లభిస్తాయి. అయితే, మీ వయస్సు మరియు శరీర బరువు వంటి సరైన మోతాదును తెలుసుకోవడానికి మీ వైద్యుడిని సంప్రదించాలి.
  • పిల్లల కడుపులోని పురుగుల నిర్మూలన కోసం అల్పెండజోల్ టాబ్లెట్ ప్రతి ఆరునెలలకొకసారి ఇవ్వడం
  • యుక్తవయసులో గల బాలురు మరియు బాలికలు మరియు గర్భిణీ స్త్రీలలో వారి రక్తహీనత స్థితితో సంబంధం లేకుండా ఒక నిర్బంధ ఐరన్ మరియు ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్ ఇవ్వడం.

రక్తహీనత యొక్క స్థాయి ఆధారంగా చికిత్స:

  • తేలికపాటి రక్తహీనత కోసం, మీ డాక్టర్ ఐరన్ మరియు ఫోలిక్ యాసిడ్ అధికంగాలభించే ఆహారం తీసుకోవాలని మీకు సలహా ఇస్తారు.
  • రక్తపోటు యొక్క ఒక మోస్తరు స్థాయిలో, ఐరన్ మరియు ఫోలిక్ యాసిడ్ మందులను మీ డాక్టర్ సిఫార్సు చేయవచ్చు. ప్రత్యేకంగా మీరు ఏ లక్షణం కన్పించని విధంగా ఉంటే మరియు ముఖ్యంగా గ్యాస్ట్రిక్ అసహనత వంటి ఎలాంటి దుష్ప్రభావాలు లేకుండా నోటి ఐరన్ థెరపీని తట్టుకోగలిగితే, ఇది అతిసారం ఏర్పడుతుంది. నోటి ద్వారా ఐరన్ తీసుకోవడంలో అసహనంగా ఉంటే, మీ వైద్యుడు సూది చికిత్సను ప్రారంభించవచ్చు, సాధారణంగా ఆసుపత్రిలో చేరవలసిన అవసరం లేదు, మరియు తగిన మోతాదు తీసుకున్న తరువాత మీరు ఇంటికి వెళ్ళవచ్చు.
  • తీవ్రమైన రక్తహీనత సందర్భంలో, మీ మొత్తం ఆరోగ్యo బట్టి, మీ డాక్టర్ సూది ద్వారా వేయు ఐరన్ ఎంచుకోవచ్చు లేదా నాడి, రక్తపోటు, శ్వాస వంటి మీ కీలకమైన వాటిని ఆసుపత్రిలో తనిఖీ చేయిన్చికోవలసినడిగా సలహా ఇవ్వవచ్చు. అలాగే, కొన్నిసార్లు కృత్రిమ ఆక్సిజన్ కూడా అవసరం కావచ్చు
  • రక్త మార్పిడి
    తీవ్రమైన రక్తహీనత మరియు సికిల్ సెల్ రక్తహీనత మరియు థాలస్సేమియా వంటి పరిస్థితులలో, రక్తమార్పిడి ఎంపికయే సరియైన చికిత్స.
  • ఎముక మజ్జ మార్పిడి
    ఎముక మజ్జ అనేది పొడవైన ఎముకలలో గల రక్త కణాల ఉత్పత్తి కణజాలం. అప్లాస్టిక్ అనీమియా వంటి పరిస్థితులలో, ఎముక మజ్జలో ఒక నాశనం లేదా వైఫల్యం, మరియు ఇది రక్త కణాలను ఉత్పత్తి చేయదు. అందువలన, ఆరోగ్యకరమైన దాత నుండి ఎముక మజ్జను ఒక వ్యక్తికి సర్జరీ ద్వారా మార్చవచ్చు.
  • ఎరిథ్రోపోయిటిన్
    ఇది మూత్రపిండంలో ఉండే ఒక హార్మోన్, ఇది రక్త కణాల ఉత్పత్తికి అవసరం. ఇది మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్న ప్రజలలో రక్తహీనతకు చికిత్స చేయటానికి ఉపయోగించవచ్చు, ఇవి మూత్రపిండాల నష్టం కారణంగా ఎరిత్రోపోయిటేన్­ను ఉత్పత్తి చేయలేకపోతాయి.
  • స్ప్లెనెక్టమీ
    ప్లీహము అనేది కడుపునకు సమీపంలో ఉన్న చిన్న అవయవము, కొత్త ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి ఇది ముఖ్యమైనది అలాగే పాత రక్త కణాలను నాశనం చేస్తుంది. ఎర్ర రక్త కణాలు 120 రోజులు వరకు జీవిస్తాయి. రక్తహీనత ఉన్నవారిలో, కొన్నిసార్లు ప్లీహములోని ఎర్ర రక్త కణాల అధిక పతనానికి కారణం అవుతాయి. ఇటువంటి సందర్భాల్లో, శస్త్రచికిత్స ద్వారా ప్లీహము యొక్క తొలగింపు అనేది చికిత్స యొక్క సరైన ఎంపిక (స్ప్లెనెక్టమీ).

గర్భంతో ఉన్న వారిలో రక్తహీనత యొక్క చికిత్స:

  • 9-11 g/dL యొక్క హిమోగ్లోబిన్ స్థాయిలలో తేలికపాటి రక్తహీనత కోసం, మీ డాక్టర్ రోజువారీ నోటి ద్వారా తీసుకొనే ఐరన్ మరియు ఫోలిక్ యాసిడ్ మాత్రలు తీసుకోవలసినదిగా సలహా ఇవ్వవచ్చు మరియు దాని ప్రభావాన్ని తనిఖీ చేసుకోవటానికి ఒక నెల తర్వాత ప్రయోగశాలలో పరీక్షలు చేయించుకోవలసినదిగా చెప్పవచ్చు.
  • 7-9 g / dL యొక్క హేమోగ్లోబిన్ స్థాయిలతో ఒక మోస్తరు రక్తహీనత కోసం, మీ వైద్యుడు మొదట కారణాన్ని తెలుసుకోవటానికి ప్రయత్నిస్తారు మరియు తర్వాత నోటి ద్వారా తీసుకొనే ఐరన్ మరియు ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్ ఇవ్వడం ద్వారా చికిత్సను ప్రారంభించవచ్చు. హెమోగ్లోబిన్ స్థాయిలు 8-9 g / dL మధ్య చేరుకున్నాయా అనేదానిని పరిశీలించడానికి నెలవారీ తిరిగి అంచనా వేయుట జరుగుతుంది. మీ వైద్యుడు మీ హేమోగ్లోబిన్ స్థాయిలను 9 g/dL చేరుకొనేలా చేయడానికి ఇంజెక్షన్ చేయగల ఐరన్ సప్లిమెంట్లను కూడా మొదలుపెడతారు, తరువాత మళ్లీ మీ నోటి ద్వారా తీసుకొనే మందులను కొనసాగిస్తారు.
  • 7 g / dL కంటే తక్కువ హేమోగ్లోబిన్ స్థాయిలతో కలిగే తీవ్రమైన రక్తహీనతకు, మీ డాక్టర్ అలాంటి తక్కువ స్థాయిలకు కారణం తెలుసుకొని మరియు సూది ద్వారా వేసే ఐరన్ సప్లిమెంట్లను వెంటనే ప్రారంభించవచ్చు. డెలివరీ సమయం దగ్గరవుతున్నట్లయితే లేదా హేమోగ్లోబిన్ స్థాయి చాలా తక్కువగా ఉన్నట్లయితే కూడా డాక్టర్ రక్త మార్పిడి కోసం ఆసుపత్రిలో చేరవలసినదిగా చెప్పవచ్చు.

జీవనశైలి నిర్వహణ

రక్తహీనతను కొన్ని సాధారణ జీవనశైలి మార్పులు ద్వారా సమర్థవంతంగా నిర్వహించవచ్చు.

వీటితొ పాటు

  • పొగాకు వినియోగాన్ని నివారించుట
    పొగాకు వినియోగం ఐరన్ శోషణ మరియు జీవక్రియను ప్రభావితం చేస్తుంది, ఇది శరీరంలో ఐరన్ స్థాయిని తగ్గిస్తుంది. అందువలన, పొగాకు వాడకాన్ని నివారించడం రక్తహీనతను నివారించడానికి సహాయపడుతుంది.
  • ఆహారంతో టీ తీసుకోవటాన్ని నివారించడం
    టీ అనేది ఐరన్ శోషణకు హాని కలిగిస్తుంది, అందువలన భోజనాలతో టీ తీసుకోవడాన్ని నివారిస్తే ఐరన్ యొక్క శోషణను మెరుగుపర్చడానికి సహాయపడుతుంది.
  • ఐరన్­ కూడిన ఆహారాన్ని తీసుకోవడం
    శరీరంలో తగినంత ఐరన్ నిల్వలను నిర్వహించడానికి, పచ్చని ఆకు కూరలు, తాజా పండ్లు, బీన్స్, గుడ్లు, చేపలు మరియు మాంసంలో అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి.

రక్త హీనత నివారణకు ఆయుర్వేదం లో 

                   రక్త క్షీణత --పాండురోగం                                
               పాండు రోగాలు 7 రకాలు.
 
      అశ్వగంధ దుంపల పొడి  -------- 210 gr
   దో. వే. మిరియాలపొడి  ---------    60 gr
          శొంటి పొడి        ------------    50 gr
      పిప్పళ్ళ పొడి    ------------    40 gr
      చిన్న ఏలకుల పొడి   ------------    30 gr
       నాగ కేసరాల పొడి     ------------    20 gr  వేయించిన లవంగాల పొడి------------     10 gr
       కలకండ పొడి    ------------   420 gr
 
              ఒక పాత్రలో అన్ని పదార్ధాలను ఒక్కొక్కటిగా వేస్తూ బాగా కలిపి సీసాలో భద్రపరచుకోవాలి.
ఉపయోగించే విధానం :--  ప్రతి రోజు ఉదయం,సాయంత్రం పావు టీ స్పూను పొడిని నీళ్ళలో గాని పాలల్లో గానికలుపుకొని తాగాలి లేదా పొడి నోట్లో వేసుకొని నీళ్ళు తాగవచ్చు.
 
      ఇది కాలేయానికి, ప్లీహానికి శక్తి నిస్తుంది. రక్త శుద్ధి జరిగి రక్త వృద్ధి కలుగుతుంది.

         బహిష్టు సమస్యల వలన వచ్చే ఉబ్బు రోగము లేదా రక్త హీనత --నివారణ          

      శరీరంలో మలినమైన నీరు చేరడం వలన శరీరం వాచిపోయి కదులుతూ వుంటుంది, మరియు రక్త హీనత  వుంటుంది.

      శరీరమంతా నువ్వుల నూనెతో మర్దన చెయ్యాలి. కాళ్ళను తన్నిపెట్టి, చేతులను లాగిపెట్టి మర్దన చెయ్యాలి.

నీరు కిందికి దిగేవిధంగా మర్దన చెయ్యాలి.

       వజ్రాసనం లో కూర్చొని పొట్టను కదిలించి మూల చక్రాన్ని బంధించాలి.

ఆహారం:--

     నాటు ఆవు మూత్రాన్ని తెచ్చి (మొదటి, చివరి మూత్రాన్ని వదిలేసి పట్టాలి) ఏడు సార్లు వదపోయాలి.
    అర కప్పు ఆవు మూత్రంలో అర కప్పు తేనె, కొద్దిగా గోరువెచ్చని నీరు కలిపి తాగాలి.
    అవి  మజ్జిగలో కలుపుకొని తాగితే చాలా త్వరగా ఉబ్బురోగం నివారింప బడుతుంది. ఏరోజుకారోజు దొరికితే వడ పోయాల్సిన అవసరం లేదు.

                 నీరు తగ్గడానికి

     ఆవాల నూనె          --- ఒక కిలో
     ముద్దకర్పూరం        --- 50 gr

         ఆవ నూనెను గోరువెచ్చగా వేడి చేసి దానిలో ముద్దకర్పూరం వేసి కరిగిన తరువాత సీసాలో భద్రపరచు కోవాలి.
         పైన చెప్పబడిన వ్యాయామం ప్రకారం ఈ నూనెతో మర్దన చేసి శరీరాన్ని సాగదీయాలి.
        కపాలబంధం, ఉడ్యానబంధము,  ఉదరచాలనము, మూలబంధం  చేయాలి.

                రక్తాల్పత-- నివారణ                                           
                 శరీరంలో రక్తం  తగ్గితే చాలా సమస్యలు వస్తాయి.

లక్షణాలు :--  నిస్సత్తువ;  వెంట్రుకలు బిరుసుగా వుండడం, ఎర్రగా మారడం, రాలడం ;  గోళ్ళు పగలడం;   బ్లీడింగ్  సమస్యలు  వుంటాయి.

కారణాలు :--  ఆపరేషన్ వలన, బహిష్టు సమయాల్లో ఎక్కువగా రక్తం పోవడం  వలన, కొన్ని ఎనీమియా  జబ్బుల వలన,  క్యాన్సర్ వలన, ఆక్సిడెంట్ల  వలన రక్త హీనత ఏర్పడే అవకాశాలు ఎక్కువ.

నివారణ చర్యలు :--  ఆకు కూరలు ముఖ్యంగా తోటకూర వారానికి మూడు సార్లు లేక ప్రతి రోజు వంద గ్రాములు  తినాలి. పొన్నగంటి కూర, మునగాకు, మెంతి కూర, మునగాకు కషాయం, కొత్తిమీర, పుదీనా లలో కూడా వుంటుంది.

      వ్యాయామం చెయ్యకూడదు.

      ప్రతి రోజు అర టీ స్పూను వేయించిన జిలకర పొడిలో తగినంత  కలకండ కలుపుకొని తీసుకుంటే జీర్ణ శక్తిపెరుగుతుంది, దీనిలో కూడా ఐరన్ వుంటుంది

     వీటితోబాటు  మండూరం  లేదా పునర్నవ మండూరం లేదా లోహ భస్మం వాడాలి.

దాల్చిన చెక్క పొడి               ---- అర టీ స్పూను
దానిమ్మ రసం                     ---- అర కప్పు
తేనె                                   ---- అర టీ స్పూను

      కలిపి ప్రతి రోజు తాగుతూ వుంటే రక్త హీనత నివారింపబడుతుంది.

         రక్త హీనత  ---ఎనీమియా --నివారణ                                    
లక్షణాలు :-- నిస్త్రాణ,  నీరసం,   కళ్ళు తిరగడం, ఆయాసం,  ఊపిరాడక పోవడం,  మాటిమాటికి జలుబు చేయడం,ఇన్ఫెక్షన్ చేరడం మొదలైన లక్షణాలు వుంటాయి.    ఇది రక్తంలో ఇనుము లోపం వలన వస్తుంది.
 
         పుల్లని పదార్ధాలను తీసుకుంటే  ఐరన్ పెరుగుతుంది.  ఆహారంతోబాటు కమలా పండ్ల రసం, ద్రాక్ష , ఉసిరిరసం తీసుకోవాలి. ఒక నెల రోజులలోనే హీమోగ్లోబిన్  శాతం పెరుగుతుంది.
 
         శాకాహారులు  గోంగూర, తవుడున్న బియ్యం ఆహారంగా తీసుకోవాలి.
 
          అర టీ స్పూను   కరక్కాయ  చూర్ణం గాని, శొంటి చూర్ణం గాని  కొద్దిగా బెల్లంతో కలిపి తీసుకుంటే బాగా రక్తంలో ఇనుము శాతం పెరుగుతుంది.   చెరకు రసం  రక్తాన్ని బాగా పెంచుతుంది.  ఆకుకూరలు,  కాయగూరల  వలన కూడా రక్త వృద్ధి జరుగుతుంది.

            రక్త హీనత -- కాళ్ళు చేతులలో మంటలు --దానిమ్మ పానకం                         1-1-2011.
 
         రక్త హీనత వలన ఇతర వ్యాధులు కూడా ఏర్పడతాయి.  ఆకలి తగ్గుతుంది. వాంతులు,  వికారం వుంటాయి.
 
కాళ్ళు, చేతులలో మంటలు   కారం పూసినట్లు గా వుండడం  వుంటుంది. శరీరంలో సెగలు వుంటాయి. ఈ లక్షణాలు   మెనోపాజ్ దశలో ఎక్కువగా వుంటాయి.   గర్భధారణకు ముందు, వెనుక   ఆపరేషన్ కు ముందు వెనుక  రక్త  హీనత లక్షణాలు కనిపిస్తాయి.

దానిమ్మ రసం                 ---100 gr
గులాబి జలం                  ---100 gr   
పటికబెల్లం                      ---100 gr
తేనె                                ---తగినంత
 
         గులాబి జలానికి  దానిమ్మ రసం కలిపి స్టవ్ మీద పెట్టి . పటికబెల్లాన్ని  కొద్దికొద్దిగా వేస్తూ పూర్తిగా కలపాలి.
 
పాకం తయారైన తరువాత దించి చల్లార్చి తేనె కలపాలి.
 
         ముఖ్యంగా గర్భ ధారణ  సమయంలో ఐరన్ మాత్రలు మింగలేని పరిస్థితులలో ఇది చాలా బాగా  ఉపయోగ పడుతుంది.
 
         సీసాలో నిల్వ చేసేటపుడు  సీసాలో కొంత ఖాళీ ఉండేట్లుగా చూసుకోవాలి.
 
         రెండు, మూడు  టీ స్పూన్ల సిరప్ ను గ్లాసులో వేసుకుని దానికి నీళ్ళు కలిపి తాగాలి.
 
         దీనిని సేవించడం వలన రక్త హీనత వలన ఏర్పడే సమస్యలన్నీ తొలగి పోతాయి.  రక్త వృద్ధి జరుగుతుంది.
 
                    హీమోగ్లోబిన్ శాతం అమోఘంగా పెరుగుతుంది.

                      ఆకు కూరల ద్వారా రక్తహీనతను  నివారించడం                    

    1.  గర్భాదారణలో  రక్తహీనత,  బలహీనత,  పిల్లలలో రక్త హీనత,  బలహీనత ను నివారించుటకు

                తోటకూర రసం       --- ఒక కప్పు        
                    తేనె            --- ఒక  టీ స్పూను 
            యాలకుల పొడి         ---  చిటికెడు

        అన్నింటిని కలిపి ప్రతి రోజు తాగుతూ వుంటే ఎంతో మంచి ఫలితం వుంటుంది. రక్తవృద్ధి
    జరుగుతుంది.  శారీరక ఆరోగ్యం బాగుంటుంది. మాటిమాటికి  రోగాలు రావు.

     2.   ముక్కు నుండి రక్తం కారడం --నివారణ "---

                తోటకూర  రసం      --- ఒక కప్పు
               నిమ్మ రసం     --- ఒక టీ స్పూను 

            . ఈ విధంగా ప్రతి రోజు రాత్రి తాగాలి. దీని వలన  ముక్కు నుండి రక్తం కారడాన్ని
      నివారించడమే కాక అన్ని రకాల రక్త స్రావాలను  నిరోధించబడుతుంది.

                     రక్త హీనత ---నివారణ                                       
               చెడిపోయిన రక్తాన్ని బాగు పరచి  రక్తాన్ని వృద్ధి పరచడంలో ఉత్తరేణి వేర్లు చాలా
    శ్రేష్టమైనవి.

      1. ఉత్తరేణి వేర్లను కొద్దిగా నీటి చుక్కలు వేసి మెత్తగా నూరాలి, దీనిని  5 గ్రాముల మోతాదుగా
 తీసుకుని నీటిలో కలుపుకుని తాగాలి.

      2.  ఉత్తరేణి వేర్లను ఎండబెట్టి దంచి,  జల్లించి పొడిని సీసాలో నిల్వ చేసుకోవాలి.

           5 గ్రాముల పొడిని అర గ్లాసు మజ్జిగలో కలుపుకుని తాగాలి. దీని వలన బాగా రక్త వృద్ధి
  జరుగుతుంది.

           ఇది విషపు గాట్ల నుండి కాపాడుతుంది. సమస్త అవయవాలకు శక్తిని ఇస్తుంది.  ఈ
   విషయం శాస్త్రీయంగా  నిరూపించ బడినది.

            రక్తహీనత నివారణకు చిట్కా                                           
           ఉదయం,  సాయంత్రం  ఎండుద్రాక్షను   తింటూ క్యారట్,  బీట్ రూట్, టమాటా జ్యూస్ లలో
  ఎదో ఒకటి తాగుతూ వుంటే రక్త హీనత తగ్గి,  రక్తం బాగా వృద్ధి చెందుతుంది.

            రక్త హీనత ---నివారణ                            
లక్షణాలు :-- కళ్ళ కింద గుంటలు  ఏర్పడడం, జుట్టు ఊడిపోవడం మొదలైనవి.

అల్లనేరేడు బెరడు చూర్ణం   ( ఏ నేరేడు అయినా పరవాలేదు.

       3 గ్రాముల చూర్ణాన్ని ఒక కప్పు మజ్జిగలో కలుపుకొని తాగాలి.  ఈ విధంగా 100 రోజులు
వాడితే బాగా రక్తవృద్ధి జరుగుతుంది.

     రక్తం చెడిపోయి శరీరమంతా రక్తనాళాలు ఉబ్బి వున్నపుడు  ---నివారణకు

తాంబూలంలో వేసుకునే కాచు            --- 3 gr  రెండింటిని సమాన
                నీళ్ళు      --- రెండు కప్పులు

     నీటిలో చూర్ణాన్ని వేసి కాచి ఒక కప్పుకు రానివ్వాలి. దించి దానిలో పంచదార గాని లేదా గోరు
వెచ్చగా చేసి తేనె గాని కలిపి తాగవచ్చు.

    ఈ విధంగా కొంతకాలం చేస్తే బాగా రక్తవృద్ధి జరిగి ముఖం కాంతివంతంగా తయారవుతుంది.

           రక్తహీనత    ---   నివారణ                             
            రక్తహీనత వలన శరీరం ఎండిపోతుంది ,  జుట్టు రాలి పోతుంది ,  రక్తం  ఎండి పోతుంది .

ఎండుద్రాక్ష
అతిమధురం

             రెండింటిని సమాన భాగాలుగా తీసుకోవాలి . బాగా మెత్తగా ,  ముద్దగా నూరి నిల్వ చేసుకోవాలి . ప్రతి రోజు
10 గ్రాముల ముద్దను తింటూ వుంటే రక్తం చాలా బాగా వృద్ధి చెందుతుంది . జుట్టు రాలడం ఆగిపోతుంది . కళ్ళు కాంతివంతంగా తయారవుతాయి . బలం సమకూరుతుంది .

           రక్తహీనత  --- నివారణ                        

సుగంధపాల వేర్ల చూర్ణం          --- 10 gr
నేలవేము చూర్ణం                   --- 10 gr
నెల ఉసిరి చూర్ణం                  --- 10 gr  

       రాత్రి ఒక  కప్పు నీటిలో అన్ని చూర్ణాలను  వేసి నానబెట్టాలి . ఉదయం దానిని  గిన్నెలో వేసి స్టవ్ మీద పెట్టి సన్న
మంట మీద కాచి అరకప్పు కు రానివ్వాలి . గోరువెచ్చగా అయిన తరువాత వడకట్టి ఒక టీ స్పూను తేనె గాని లేదా
ఒక టీ స్పూను కలకండ గాని కలుపుకొని తాగాలి .

          ధనియాల కషాయం

      రక్తహీనత వలన శరీరంలో అధిక ఉష్ణోగ్రత ఏర్పడుతుంది . దీనిని తగ్గించుకుంటే రక్తం పడుతుంది .  రాత్రి రెండు
టీ స్పూన్ల ధనియాలను నలగ గొట్టి  రెండు కప్పుల నీటిలో నానబెట్టాలి . ఉదయం  దానిని కాచి, ఒక కప్పుకు రానిచ్చి  వడకట్టి ఆ కషాయాన్ని తాగాలి .
             రక్తహీనత  ---నివారణ                              

గుంటగలగర సమూల చూర్ణం           
నల్ల నువ్వుల చూర్ణం

       రెండింటిని సమాన భాగాలుగా తీసుకోవాలి . దీనికి తగినంత పాతబెల్లం గాని , కలకండ ( పటికబెల్లం ) గాని కలిపి
నిల్వ చేసుకోవాలి .

      దీనిని ప్రతిరోజు అర టీ స్పూను పొడిని తింటూ వుంటే రక్త హీనత నివారింపబడుతుంది 

రక్తహీనత (అనీమియా) కొరకు మందులు

Medicine NamePack Size
G NeuroG Neuro Capsule
Zifol XtZifol Xt Suspension
Deca Durabolin InjectionDeca Durabolin 50 Mg Injection
Haem Up FastHaem Up Fast Tablet
Pregeb MPREGEB M 150MG TABLET
RicharRichar CR 100 Tablet
MethycobalMETHYCOBAL 500MCG
CrespCRESP 100MG INJECTION
Orofer SOrofer S 100 Injection
Pregalin MPregalin M SR 1500 Mcg/150 Mg Tablet
Milcy ForteMilcy Forte Tablet
NeuroxetinNeuroxetin Capsule
AlfagabaALFAGABA 100MG TABLET 10S
Deca AnabolinDeca Anabolin 25 Mg Injection
Mecobion PMecobion P 750 Mcg/150 Mg Tabl
Rejunuron DlRejunuron DL Capsule
Decabolin (Medinova)Decabolin 25 Mg Injection
Pentanerv MPentanerv M Tablet
Mecoblend PMecoblend P Tablet
Dulane MDulane M 20 Capsule
Folvite MbFOLVITE MB CAPSULE
DecadurakopDecadurakop 25 Mg Injection
Neurodin GNeurodin G 300 Mg/1500 Mcg Tablet
Mecofort PgMECOFORT PG SR TABLET
Dumore MDumore M Capsule
 

ధన్యవాదములు 

మీ నవీన్ నడిమింటి 

విశాఖపట్నం 

అస్వీకార ప్రకటన: ఈ సైటుపై లభ్యమవుతున్న మొత్తం సమాచారము మరియు లేఖనము కేవలం అవగాహనా ఆవశ్యకతల కొరకు మాత్రమే. ఇక్కడ ఇవ్వబడిన సమాచారమును ఏదైనా ఆరోగ్య సంబంధిత సమస్య లేదా అస్వస్థత నుండి కోలుకోవడానికి లేదా స్వస్థత కొరకు నిపుణుల సలహా లేనిదే ఉపయోగించుకోకూడదు. చికిత్స పరీక్షలు మరియు సేవల కొరకు ఎల్లప్పుడూ ఒక అర్హత పొందిన వైద్యుల సలహా తీసుకోవాలి.


23, మే 2020, శనివారం

పరాలిసిస్ వచ్చినప్పుడు తీసుకోవాలిస్ జాగ్రత్తలు వివరాలు లింక్స్ లో చుడండి



పక్షవాతం అంటే ఏమిటి?

పక్షవాతం అంటే శరీరంలో కొన్ని లేదా అన్ని భాగాల కదలికలలో పాక్షిక లేదా పూర్తి నష్టం కలుగడం. ఇది శరీరంలో మెదడు మరియు కండరములు మధ్య సంకేతాల యొక్క అసమతుల్యత ఫలితంగా సంభవిస్తుంది. ఇది పోలియో, నరాల రుగ్మతలు లేదా ఇతర రుగ్మతలు వంటి కారణాల వల్ల కూడా కావచ్చు.

దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

ప్రధాన లక్షణం శరీరంలో కొన్ని లేదా అన్ని భాగాలను కదల్చడంలో అసమర్థత. లక్షణాల ప్రారంభం ఆకస్మికంగా లేదా చాలా నెమ్మదిగా ఉంటుంది. లక్షణాలు అప్పుడప్పుడూ మాత్రమే/కూడా కనిపించవచ్చు. ప్రధానంగా ప్రభావితమయ్యే భాగాలు:

  • ముఖ భాగం.
  • చేతులు.
  • ఒక చెయ్యి లేదా కాలు (మోనోప్లిజియా).
  • శరీరం యొక్క ఒక వైపు భాగం (హెమిప్లిజియా).
  • రెండు కాళ్ళు (పారాప్లిజియా).
  • నాలుగు కళ్ళు,చేతులు (క్వాడ్రిప్లిజియా).

ప్రభావిత భాగాలు గట్టిగా లేదా వాలిపోయినట్టు కనిపిస్తాయి, సంచలనాన్ని/అనుభూతిని కోల్పోతాయి లేదా కొన్నిసార్లు నొప్పిగా కూడా ఉండవచ్చు.

దీని ప్రధాన కారణాలు ఏమిటి?

పక్షవాతానికి గల అంతర్లీన కారణాలు చాలా ఉంటాయి  మరియు అవి తాత్కాలికమైనవిగా ఉండవచ్చు లేదా జీవితకాలం పాటు ఉండవచ్చు. ప్రధాన కారణాలు వీటిని కలిగి ఉంటాయి:

  • శరీరంలో ఒక వైపున ఆకస్మిక బలహీనత (స్ట్రోక్ లేదా తాత్కాలిక ఇస్చెమిక్ దాడి).
  • నిద్ర నుంచి మేల్కొన్న తర్వాత లేదా నిద్రపోయే ముందు కొంచెం సమయం పాటు పక్షవాతం (నిద్ర పక్షవాతం).
  • ఒక ప్రమాదం కారణంగా, నరాల నష్టం లేదా మెదడుకు గాయం.
  • మెదడులోని గాయాలు కారణంగా ముఖ పక్షవాతం (బెల్స్ పాల్సీ).

పక్షవాతానికి సంబంధించిన కొన్ని సాధారణ కారణాలు:

దీనిని ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?

పక్షవాతం ప్రాధమికంగా లక్షణాల ద్వారా నిర్ధారణ చేయబడుతుంది. భౌతిక పరీక్ష ఆధారంగా, వైద్యులు పక్షవాతం యొక్క రకాన్ని కూడా నిర్ధారించవచ్చు. ఎంఆర్ఐ (MRI) మరియు సిటి (CT) స్కాన్ వంటి ఇమేజింగ్ పరీక్షలు, మెదడు మరియు వెన్నెముక యొక్క వివరణాత్మక చిత్రాలను పొందటానికి ఉపయోగించబడతాయి మరియు నరాల ప్రసరణ (nerve conduction) ను విశ్లేషించడానికి కూడా పరీక్షలను నిర్వహించవచ్చు.

నిర్దిష్ట మందులు లేవు. సాధారణంగా పక్షవాతం యొక్క నిర్వహణ అంతర్లీన కారణం మీద ఆధారపడి ఉంటుంది. నాన్-డ్రగ్ (మందులు లేని) పద్ధతులు:

  • ఫిజియోథెరపీ: బలాన్ని మరియు కండర ద్రవ్యరాశి (muscular mass)ని పెంచుతుంది
  • కదలడానికి ఉపయోగించే సహాయకాలు (Moving aids): చక్రాల కుర్చీలు మరియు బ్రెసెస్ (సహాయకాలు) రోగి సులభంగా కదలడానికి సహాయం చేయగలవు
  • వృత్తి చికిత్స (Occupational therapy): రోజువారీ పనులకు సహాయం చేస్తుంది

పక్షవాతం అనేది జీవన నాణ్యతను మరియు వ్యక్తి యొక్క స్వీయ-గౌరవాన్ని తగ్గించే వ్యాధి. అందువల్ల దీనికి సరైన సంరక్షణ మరియు సహకారం అవసరం.

పక్షవాతం కారణాలు - ఆయుర్వేదం చికిత్స

పక్షవాతం అనేది నాడీ వ్యవస్థకు చెందిన వ్యాధిశరీరంలోని అవయవాలు ప్రయత్న పూర్వక చలనాలను కోల్పోయే రుగ్మతను పక్షవాతము అంటారుపక్షవాతానికి ముఖ్యమైన కారణాలు అధిక రక్తపోటుమెదడులో రక్త సరఫరాలో అంతరాయంపోలియో వంటి వైరస్ సంబంధిత రోగాలులేదా ఇతరత్రా ప్రమాదాలు.

పక్షవాతం వచ్చిన రోగి ఆరోగ్యం ఈ క్రింది విధంగా క్షీణిస్తుంది.

  • పక్షవాతం వచ్చినప్పుడు ప్రతి సెకనుకు 32 వేల నాడీ కణాలు చనిపోతాయిఆ లెక్కన నిమిషానికి 19 లక్షల నాడీ కణాలు చనిపోతాయి.

  • నాడీకణాలున్యూరాన్ల మధ్య జరిగే 14 వందల భావ ప్రసారాలు నిలిచిపోతాయిఫలితంగా మైలినేటెడ్ ఫైబర్స్ ద్వారా 7.5 మైళ్ల దూరం ప్రయాణించాల్సిన ఆలోచనలను మెదడు నష్టపోతుంది.

  • మెదడుకు రక్తాన్ని చేరవేసే ధమనుల్లో రక్తపు గడ్డలు అడ్డుపడిమెదడుకు రక్త ప్రసారం ఆగిపోతుంది.

నాడీకణాలు మరణించే సంఖ్యపైనే పక్షవాతంతో బాధపడే రోగి జీవితకాలం ఆధారపడి ఉంటుందిఅందుకే ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలి.

శరీరంలోకి ఒక వైపు భాగాలు పని చేయకపోవడంమూతి వంకర అవ్వడంసరిగా మాట రాకపోవడంస్పృహ తప్పడంవిపరీతమైన తలనొప్పిచూపు తగ్గడం పక్షవాతానికి దారి తీస్తున్న పరిస్థితులుగా పరిగణించాలిపక్షవాతం సోకిన వారికి ఇప్పటి వరకు మెడికల్‌ లైన్‌ ట్రీట్‌మెంట్‌ ద్వారా చికిత్స చేస్తున్నారుఈ విధానంలో శరీరంలో రక్తం గడ్డ కట్టకుండా రక్త ప్రసరణ సక్రమంగా జరిగేలా మందులతో చికిత్సచేస్తారుఅయితే ఇటీవల ఫిజియోథెరఫి అనే పద్దతి విస్త్రృతంగా వాడుకలోకి వచ్చింది.

పక్షవాతం సోకిన వారికి ఫిజియోథెరపీ ఒక వరం.

ఫిజియోథెరపీలో రోగికి మందులు అందిస్తూనే శారీరకంగామనసికంగా చికిత్స అందిస్తారుపక్షవాతంతో బలహీనపడ్డ శరీర కండరాలను నయం చేస్తూ రోగిని పూర్వస్థితికి తెస్తారు.

  • రోగి కూర్చునే పడుకునేనిలబడేనడిచేవిధానాలుమెట్లు ఎక్కడందిగడం క్రమ పద్దతిలో చేయించడంతో శరీరాన్ని బలపరుస్తారు. 0-1 గ్రేడ్‌ కోసం బలహీనమైన కండరాలకు విద్యుత్తుతో మజిల్‌ స్టిమ్‌లేటర్‌ చికిత్స చేస్తారు.

  • ఆపై 1-5వరకు సస్పెన్షన్‌ థెరఫీఇన్‌క్లెయిన్‌బోర్డువేయిట్‌ బేరింగ్‌క్వార్టర్‌ సైడ్‌ చేయిల్‌ఫోల్డర్‌పుల్లీవాల్‌ ల్యాపర్‌స్టెఫ్‌ ఆఫ్‌ స్టెఫ్‌డౌన్‌కాడ్‌మాన్‌సైక్టింగ్‌ ఎక్సైర్‌సైజ్‌లతో కండరాన్నిబలపరుస్తారుఅనంతరం సరైన నడకను నేర్పించడానికి ప్యారలాల్‌ ఎక్సర్‌సైజ్‌ చేయిస్తారు.తో

  •  పక్షవాతం సోకిన రోగి త్వరగా కోలుకునే అంశాలుంటాయిమందులుఫిజియోథెరపీ తో పాటు పక్షవాతం సోకిన రోగికి మానసికంగా ఎటువంటి ఒత్తిడి లేకుండాచూస్తుండాలిచాలాసేపటి వరకు ఒంటరిగా ఉండనివ్వకుండా ఎవరో ఒకరు రోగితో మాట్లాడుతూ ఉండాలిమీ ఫ్యామిలీ లో జరగబోయే శుభకార్యాల గురించి మాట్లాడాలివారి అభిప్రాయాన్ని అడుగుతుండాలివారి ఎదురుగా కూర్చుని న్యూస్ పేపర్ చదవడంకలిసి టి.విచూడటం లాంటివి చేస్తుండాలిదీంతో పేషెంట్ కి మనశ్శాంతి కలిగి మానసిక ఒత్తిడి నుండి బయటపడగలడు.

ఎప్పటికప్పుడు తన శరీరంలో వచ్చే మార్పుల్నికుదుటపడుతున్న తన ఆరోగ్య పరిస్థితిని గురించి అతనికి తెలియజేస్తూ ఉండాలిత్వరలో కోలుకుంటారన్న విశ్వాసాన్ని కలిగిం

పక్షవాతం కొరకు మందులు

Medicine NamePack Size
ADEL 31 Upelva DropADEL 31 Upelva Drop
Mama Natura NisikindSchwabe Nisikind Globules
Dr. Reckeweg Gelsemium DilutionDr. Reckeweg Gelsemium Dilution 1000 CH
ADEL Gelsemium Mother Tincture QADEL Gelsemium Mother Tincture Q
Bjain Sarsaparilla DilutionBjain Sarsaparilla Dilution 1000 CH
Schwabe Aconitum napellus LMSchwabe Aconitum napellus 0/1 LM
ADEL 40 And ADEL 86 KitAdel 40 And Adel 86 Kit
Bjain Carboneum oxygenisatum DilutionBjain Carboneum oxygenisatum Dilution 1000 CH
Schwabe Crotalus cascavella CHSchwabe Crotalus cascavella 1000 CH
Bjain Scopolaminum hydrobromicum DilutionBjain Scopolaminum hydrobromicum Dilution 1000 CH
ADEL 43 Cardinorma DropADEL 43 Cardinorma Drop
SBL Sarsaparilla Mother Tincture QSBL Sarsaparilla Mother Tincture Q
Bjain Thyroidinum LMBjain Thyroidinum 0/1 LM
Schwabe Oleander MTSchwabe Oleander MT
SBL Ferrum lacticum DilutionSBL Ferrum lacticum Dilution 1000 CH
ADEL Sarsaparilla Mother Tincture QADEL Sarsaparilla Mother Tincture Q
ADEL 7 Apo-Tuss DropADEL 7 Apo-Tuss Drop
SBL Barium aceticum DilutionSBL Barium aceticum Dilution 1000 CH
ADEL 86 Verintex N External DropADEL 86 Verintex N External Drop
ADEL 9 Co-Hypert DropADEL 9 Cri-Regen Drop
SBL B Trim DropsSBL B Trim Drops
Bjain Lyssinum DilutionBjain Lyssinum Dilution 1000 CH
ADEL Xanthoxylum Frax Mother Tincture QADEL Xanthoxylum Frax Mother Tincture Q
Mama Natura AnekindSchwabe Anekind Globules 

ధన్యవాదములు 

మీ నవీన్ నడిమింటి 

విశాఖపట్నం 

అస్వీకార ప్రకటన: ఈ సైటుపై లభ్యమవుతున్న మొత్తం సమాచారము మరియు లేఖనము కేవలం అవగాహనా ఆవశ్యకతల కొరకు మాత్రమే. ఇక్కడ ఇవ్వబడిన సమాచారమును ఏదైనా ఆరోగ్య సంబంధిత సమస్య లేదా అస్వస్థత నుండి కోలుకోవడానికి లేదా స్వస్థత కొరకు నిపుణుల సలహా లేనిదే ఉపయోగించుకోకూడదు. చికిత్స పరీక్షలు మరియు సేవల కొరకు ఎల్లప్పుడూ ఒక అర్హత పొందిన వైద్యుల సలహా తీసుకోవాలి.

ముఖం పై పెరాల్సిస్ సమస్య పరిష్కారం మార్గం లింక్స్ చుడండి



ముఖ పక్షవాతం అంటే ఏమిటి?

ముఖ పక్షవాతం అనేది ముఖ నరములకు నష్టం/ హాని కలిగే ఒక రకమైన  ఆరోగ్య సమస్య, తద్వారా రోగిని ముఖ కదలికలను వ్యక్తం చెయ్యడం, తినడం లేదా మాట్లాడడం వంటివి చేయలేడు.

దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

ముఖ పక్షవాతం యొక్క సాధారణ సంకేతాలు మరియు లక్షణాలు;

  • కనురెప్పలను మూసివేయడం లేదా రెప్పలు కొట్టుకోవడం సాధ్యపడదు
  • ముఖం కదిలించడంలో అసమర్థత
  • నోరు వాలిపోవడం
  • ముఖ ఆకృతులను సమతుల్యం (balance)  చెయ్యడంలో అసమర్థత
  • ముఖ పక్షవాతంలో, వ్యక్తి కనుబొమ్మలను ఎగరవేయలేడు
  • మాట్లాడటం మరియు తినడం లో ఇబ్బంది (మరింత సమాచారం: మాట్లాడటంలో ఇబ్బంది యొక్క కారణాలు)
  • సమగ్ర ముఖ కదలికలలో కష్టము

ముఖం ఉపయోగించి చేసే ప్రాథమిక విధులలో అసమర్థత కారణంగా, ఇది సాధారణంగా రోగిని వేరుచేస్తుంది (ఒక్కడిగా చేస్తుంది). అందువల్ల, ప్రభావవంతమైన ఫలితాల కోసం చికిత్సను వెంటనే మొదలుపెట్టడం చాలా ముఖ్యం.

దీని ప్రధాన కారణాలు ఏమిటి?

ముఖ పక్షవాతం అకస్మాత్తుగా సంభవించవచ్చు లేదా క్రమంగా సంభవించవచ్చు. ముఖ పక్షవాతం యొక్క కొన్ని సాధారణ కారణాలు:

ఇది ఇతర కారణాలవల్ల కూడా సంభవించవచ్చు;

  • ముఖానికి  గాయం కావడం
  • లైమ్ వ్యాధి (పేలు ద్వారా మానవులకు వ్యాప్తి చెందే ఒక బ్యాక్టీరియా వ్యాధి) యొక్క సంక్రమణ
  • వైరస్ యొక్క  సంక్రమణ
  • వాస్కులైటిస్ వంటి ఆటో ఇమ్యూన్ వ్యాధులు
  • సరిగ్గా నిర్వహించని దంత చికిత్సా విధానాల వలన కొన్ని ముఖ నరాలకు నష్టం కలగడం
  • అరుదైన సందర్భాలలో, శిశువులు పుట్టుకతోనే ముఖ పక్షవాతంతో ప్రభావితం అవుతారు (ఇది తరువాత తగ్గిపోతుంది)

ఎలా నిర్ధారించాలి  మరియు చికిత్స?

పైన చెప్పబడిన సంకేతాలు మరియు లక్షణాలను వ్యక్తి  అనుభవించడం జరిగితే, తక్షణమే వైద్యుడిని సంప్రదించాలి. ముఖంలో తిమ్మిరి మరియు బలహీనత ఉంటే  అవి ముఖ పక్షవాతం యొక్క ముఖ్యమైన ప్రారంభదశ లక్షణాలుగా పరిగణించవచ్చు.

వైద్యులు రోగి ముఖాన్ని రెండు వైపులా పరిశీలిస్తారు. రోగి ఇటీవలి ఆరోగ్య సమస్యలు మరియు గాయాలు గురించి  అడిగి తెలుసుకుంటారు. అప్పుడు వారు ఏమైనా ముఖ్యమైన పరీక్షలు మరియు రోగనిర్దారణ పరీక్షలు జరపవలసి ఉంటుందా అని నిర్ణయించి రోగికి తెలియజేస్తారు. వాటిలో ఇవి ఉంటాయి:

  • రక్త పరీక్షలు (రక్తంలోని చక్కెర స్థాయిలను పరిశీలించడానికి)
  • లైమ్ పరీక్ష
  • నరాల మరియు కండరాల పరిస్థితి యొక్క అధ్యయనం కోసం ఎలెక్ట్రోమయోగ్రఫీ (EMG)
  • తల యొక్క సిటి (CT) స్కాన్ / ఎంఆర్ఐ (MRI)

ఖచ్చితమైన వ్యాధి నిర్ధారణ తర్వాత  వైద్యుడు, వివిధ ప్రమాణాల (రోగి వయస్సు, కారణం, మరియు వ్యాధి తీవ్రత వంటివి) ను పరిగణనలోకి తీసుకోని రోగికి సరిపోయే చికిత్సా పద్ధతులను ఎంపిక చేస్తారు, అవి ఈ క్రింది వాటిని కలిగి ఉంటాయి:

  • భౌతిక/ వాక్ చికిత్స (Physical/ speech therapy)
  • ముఖ కండరాల శిక్షణా చికిత్స (Facial muscle training therapy)
  • ముఖ కండరాల నియంత్రణ మెరుగుపరచడానికి బయోఫీడ్ బ్యాక్ శిక్షణ (Biofeedback training)
  • ముఖానికి భౌతికమైన హాని కలిగినప్పుడు మరియు కళ్ళు మూయడంలో సమస్యలు ఉన్నపుడు ప్లాస్టిక్ సర్జరీ చేస్తారు
  • అధిక రక్తపోటు వంటి అంతర్లీన కారణాలకు ప్రత్యేకమైన మందులు అవసరం కా

పక్షవాతానికి  ఉచిత వైద్యం 

~~~~~~~~~~|||~~~~~~~~

ఇటీవలికాలంలో అత్యధిక మంది ఎదుర్కొంటున్న అనారోగ్య సమస్యల్లో పక్షవాతం టాప్ ప్లేస్ కు చేరుకుంది. టెన్షన్లు, మానసిక ఒత్తిళ్లతో యంగ్ ఏజ్ లో ఉన్నవాళ్లను సైతం ఇప్పుడు ఈ మాయరోగం కబళిస్తోంది. కాళ్లు చేతుల్లో చలనం లేకుండా పోవడం, శరీరం కుంచించుకుపోవడం, ముఖం, మూతి వంకర్లు తిరగడం వంటివి ఈ వ్యాధి ప్రధాన లక్షణాలు. అప్పటివరకు సాధారణంగా తిరిగేవారు కాస్త పక్షవాతం రాగానే శారీరక వికలాంగులుగా మారిపోయి ఎంతో క్షోభ పడే పరిస్థితి. ఇక ఈ వ్యాధి ఒక్కోసారి ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంటుంది. అత్యాధునిక లేజర్ టెక్నలాజి అందుబాటులో ఉన్నప్పటికీ పూర్తిగా నయం చేస్తామన్న గ్యారెంటీ ఇవ్వలేని స్థితి. మన కర్నూలు జిల్లాలో తన తండ్రి నుండి సంప్రదాయ వైద్యం నేర్చుకున్న హరిబాబు పసరు వైద్యంతో మూడు నెలల్లోనే పక్షవాతాన్ని పూర్తిగా నయం చేస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ లో కర్నూలు దగ్గర నంద్యాల నుండి కోవెల కుంట్లకు వెళ్లే మార్గంలో ఉన్న ఉమాపతి నగర్ నిత్యం పక్షవాతం రోగులతో కిక్కిరిసి పోతోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు, కర్ణాటక, తమిళనాడు, మాహారాష్ట్ర నుండి ఎందరో పసరు వైద్యం కోసం వస్తూ ఉంటారు. ఉదయం 5 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు చికిత్స అందిస్తారు. కేవలం పసరు మందుతో ఎందరికో పక్షవాతం నుండి విముక్తి కలిగిస్తున్నారు. పసరు మందు తీసుకునే వారిని మూడు రోజుల పాటు ఇక్కడే ఉంచుతారు. ముందుకు ఎలాంటి ఫీజు తీసుకోరు.

ఇక చికిత్స సంగతికి వస్తే.. మొదటి రోజు వెల్లుల్లి ని రల్లో దంచి రసం తీస్తారు. అందులో బెల్లం కలిపి తీసుకుంటారు. ఇక రెండో రోజు తాను తయారు చేసిన రసాన్ని రోగి చెవిలో పోస్తారు. వ్యాధి తీవ్రతని బట్టి పసరు తయారు చేస్తారు. చివరి రోజు కంట్లో మందు వేస్తారు. పసరు తీసుకున్న వాళ్ళు మూడు నెలల దాకా పత్యం పాటించాల్సి ఉంటుంది. ఆ రోజుల్లో వెల్లుల్లి కారం, ఆవు నెయ్యితో మాత్రమే అన్నం తినాలి. వైద్యంలో భాగంగా ఇచ్చిన తైలంతో చచ్చుబడిన కాళ్ళు, చేతులు, ముఖానికి మర్దన చేసుకోవాలి. కార్పొరేట్ ఆసుపత్రి లో లక్షలకు లక్షలు పోసినా తగ్గని పక్షవాతం ఇక్కడ నయమైపోతోందని చికిత్స పొందినవారు ఆనందంగా చెబుతున్నారు. 

8790003141, 

9337461720

9573674144 వైద్యానికి సంబంధించి ఈ నెంబర్లలో సంప్రదిస్తే మరింత సమాచారం లభించే అవకాశం ఉంది. ఈ మంచి విషయం అందరికీ తెలిసేలా షేర్ చేయండి.

ముఖ పక్షవాతం కొరకు మందులు

Medicine NamePack Size
WysoloneWYSOLONE 20MG TABLET
SBL Physalis Alkekengi Mother Tincture QSBL Physalis Alkekengi Mother Tincture Q
Schwabe Salix alba CHSchwabe Salix alba 1000 CH
Loxcip PDLOXCIP PD EYE DROPS 5ML
Gatiquin PGATIQUIN P EYE DROP 5ML
PredzyPredzy 3 Mg/10 Mg Eye Drops
Gatsun PGatsun P 0.3%/1% Drops
Siogat PSiogat P Eye Drop
Zengat PZengat P Eye Drops
Z PredZ Pred Eye Drop
Gate PDGate PD Eye Drops
Gate P PGate P P 3 Mg/10 Mg Eye Drops
Schwabe Salix alba MTSchwabe Salix alba MT
4 Quin Pd4 Quin Pd 0.5% W/V/1% W/V Eye Drop
Apdrops PDAPDROPS PD EYE DROPS 5ML
CombaceCombace Eye Drop
EmsoloneEmsolone 10 Mg Tablet
Mo 4 PdMO 4 PD EYE DROPS 10ML
KidpredKidpred Syrup
MethpredMethpred 125 Mg Injection
MoxipredMoxipred Eye Drops
OmnacortilOMNACORTIL 10MG TABLET DT

ధన్యవాదములు 

మీ నవీన్ నడిమింటి 

విశాఖపట్నం 

అస్వీకార ప్రకటన: ఈ సైటుపై లభ్యమవుతున్న మొత్తం సమాచారము మరియు లేఖనము కేవలం అవగాహనా ఆవశ్యకతల కొరకు మాత్రమే. ఇక్కడ ఇవ్వబడిన సమాచారమును ఏదైనా ఆరోగ్య సంబంధిత సమస్య లేదా అస్వస్థత నుండి కోలుకోవడానికి లేదా స్వస్థత కొరకు నిపుణుల సలహా లేనిదే ఉపయోగించుకోకూడదు. చికిత్స పరీక్షలు మరియు సేవల కొరకు ఎల్లప్పుడూ ఒక అర్హత పొందిన వైద్యుల సలహా తీసుకోవాలి.