23, మే 2020, శనివారం

పరాలిసిస్ వచ్చినప్పుడు తీసుకోవాలిస్ జాగ్రత్తలు వివరాలు లింక్స్ లో చుడండి



పక్షవాతం అంటే ఏమిటి?

పక్షవాతం అంటే శరీరంలో కొన్ని లేదా అన్ని భాగాల కదలికలలో పాక్షిక లేదా పూర్తి నష్టం కలుగడం. ఇది శరీరంలో మెదడు మరియు కండరములు మధ్య సంకేతాల యొక్క అసమతుల్యత ఫలితంగా సంభవిస్తుంది. ఇది పోలియో, నరాల రుగ్మతలు లేదా ఇతర రుగ్మతలు వంటి కారణాల వల్ల కూడా కావచ్చు.

దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

ప్రధాన లక్షణం శరీరంలో కొన్ని లేదా అన్ని భాగాలను కదల్చడంలో అసమర్థత. లక్షణాల ప్రారంభం ఆకస్మికంగా లేదా చాలా నెమ్మదిగా ఉంటుంది. లక్షణాలు అప్పుడప్పుడూ మాత్రమే/కూడా కనిపించవచ్చు. ప్రధానంగా ప్రభావితమయ్యే భాగాలు:

  • ముఖ భాగం.
  • చేతులు.
  • ఒక చెయ్యి లేదా కాలు (మోనోప్లిజియా).
  • శరీరం యొక్క ఒక వైపు భాగం (హెమిప్లిజియా).
  • రెండు కాళ్ళు (పారాప్లిజియా).
  • నాలుగు కళ్ళు,చేతులు (క్వాడ్రిప్లిజియా).

ప్రభావిత భాగాలు గట్టిగా లేదా వాలిపోయినట్టు కనిపిస్తాయి, సంచలనాన్ని/అనుభూతిని కోల్పోతాయి లేదా కొన్నిసార్లు నొప్పిగా కూడా ఉండవచ్చు.

దీని ప్రధాన కారణాలు ఏమిటి?

పక్షవాతానికి గల అంతర్లీన కారణాలు చాలా ఉంటాయి  మరియు అవి తాత్కాలికమైనవిగా ఉండవచ్చు లేదా జీవితకాలం పాటు ఉండవచ్చు. ప్రధాన కారణాలు వీటిని కలిగి ఉంటాయి:

  • శరీరంలో ఒక వైపున ఆకస్మిక బలహీనత (స్ట్రోక్ లేదా తాత్కాలిక ఇస్చెమిక్ దాడి).
  • నిద్ర నుంచి మేల్కొన్న తర్వాత లేదా నిద్రపోయే ముందు కొంచెం సమయం పాటు పక్షవాతం (నిద్ర పక్షవాతం).
  • ఒక ప్రమాదం కారణంగా, నరాల నష్టం లేదా మెదడుకు గాయం.
  • మెదడులోని గాయాలు కారణంగా ముఖ పక్షవాతం (బెల్స్ పాల్సీ).

పక్షవాతానికి సంబంధించిన కొన్ని సాధారణ కారణాలు:

దీనిని ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?

పక్షవాతం ప్రాధమికంగా లక్షణాల ద్వారా నిర్ధారణ చేయబడుతుంది. భౌతిక పరీక్ష ఆధారంగా, వైద్యులు పక్షవాతం యొక్క రకాన్ని కూడా నిర్ధారించవచ్చు. ఎంఆర్ఐ (MRI) మరియు సిటి (CT) స్కాన్ వంటి ఇమేజింగ్ పరీక్షలు, మెదడు మరియు వెన్నెముక యొక్క వివరణాత్మక చిత్రాలను పొందటానికి ఉపయోగించబడతాయి మరియు నరాల ప్రసరణ (nerve conduction) ను విశ్లేషించడానికి కూడా పరీక్షలను నిర్వహించవచ్చు.

నిర్దిష్ట మందులు లేవు. సాధారణంగా పక్షవాతం యొక్క నిర్వహణ అంతర్లీన కారణం మీద ఆధారపడి ఉంటుంది. నాన్-డ్రగ్ (మందులు లేని) పద్ధతులు:

  • ఫిజియోథెరపీ: బలాన్ని మరియు కండర ద్రవ్యరాశి (muscular mass)ని పెంచుతుంది
  • కదలడానికి ఉపయోగించే సహాయకాలు (Moving aids): చక్రాల కుర్చీలు మరియు బ్రెసెస్ (సహాయకాలు) రోగి సులభంగా కదలడానికి సహాయం చేయగలవు
  • వృత్తి చికిత్స (Occupational therapy): రోజువారీ పనులకు సహాయం చేస్తుంది

పక్షవాతం అనేది జీవన నాణ్యతను మరియు వ్యక్తి యొక్క స్వీయ-గౌరవాన్ని తగ్గించే వ్యాధి. అందువల్ల దీనికి సరైన సంరక్షణ మరియు సహకారం అవసరం.

పక్షవాతం కారణాలు - ఆయుర్వేదం చికిత్స

పక్షవాతం అనేది నాడీ వ్యవస్థకు చెందిన వ్యాధిశరీరంలోని అవయవాలు ప్రయత్న పూర్వక చలనాలను కోల్పోయే రుగ్మతను పక్షవాతము అంటారుపక్షవాతానికి ముఖ్యమైన కారణాలు అధిక రక్తపోటుమెదడులో రక్త సరఫరాలో అంతరాయంపోలియో వంటి వైరస్ సంబంధిత రోగాలులేదా ఇతరత్రా ప్రమాదాలు.

పక్షవాతం వచ్చిన రోగి ఆరోగ్యం ఈ క్రింది విధంగా క్షీణిస్తుంది.

  • పక్షవాతం వచ్చినప్పుడు ప్రతి సెకనుకు 32 వేల నాడీ కణాలు చనిపోతాయిఆ లెక్కన నిమిషానికి 19 లక్షల నాడీ కణాలు చనిపోతాయి.

  • నాడీకణాలున్యూరాన్ల మధ్య జరిగే 14 వందల భావ ప్రసారాలు నిలిచిపోతాయిఫలితంగా మైలినేటెడ్ ఫైబర్స్ ద్వారా 7.5 మైళ్ల దూరం ప్రయాణించాల్సిన ఆలోచనలను మెదడు నష్టపోతుంది.

  • మెదడుకు రక్తాన్ని చేరవేసే ధమనుల్లో రక్తపు గడ్డలు అడ్డుపడిమెదడుకు రక్త ప్రసారం ఆగిపోతుంది.

నాడీకణాలు మరణించే సంఖ్యపైనే పక్షవాతంతో బాధపడే రోగి జీవితకాలం ఆధారపడి ఉంటుందిఅందుకే ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలి.

శరీరంలోకి ఒక వైపు భాగాలు పని చేయకపోవడంమూతి వంకర అవ్వడంసరిగా మాట రాకపోవడంస్పృహ తప్పడంవిపరీతమైన తలనొప్పిచూపు తగ్గడం పక్షవాతానికి దారి తీస్తున్న పరిస్థితులుగా పరిగణించాలిపక్షవాతం సోకిన వారికి ఇప్పటి వరకు మెడికల్‌ లైన్‌ ట్రీట్‌మెంట్‌ ద్వారా చికిత్స చేస్తున్నారుఈ విధానంలో శరీరంలో రక్తం గడ్డ కట్టకుండా రక్త ప్రసరణ సక్రమంగా జరిగేలా మందులతో చికిత్సచేస్తారుఅయితే ఇటీవల ఫిజియోథెరఫి అనే పద్దతి విస్త్రృతంగా వాడుకలోకి వచ్చింది.

పక్షవాతం సోకిన వారికి ఫిజియోథెరపీ ఒక వరం.

ఫిజియోథెరపీలో రోగికి మందులు అందిస్తూనే శారీరకంగామనసికంగా చికిత్స అందిస్తారుపక్షవాతంతో బలహీనపడ్డ శరీర కండరాలను నయం చేస్తూ రోగిని పూర్వస్థితికి తెస్తారు.

  • రోగి కూర్చునే పడుకునేనిలబడేనడిచేవిధానాలుమెట్లు ఎక్కడందిగడం క్రమ పద్దతిలో చేయించడంతో శరీరాన్ని బలపరుస్తారు. 0-1 గ్రేడ్‌ కోసం బలహీనమైన కండరాలకు విద్యుత్తుతో మజిల్‌ స్టిమ్‌లేటర్‌ చికిత్స చేస్తారు.

  • ఆపై 1-5వరకు సస్పెన్షన్‌ థెరఫీఇన్‌క్లెయిన్‌బోర్డువేయిట్‌ బేరింగ్‌క్వార్టర్‌ సైడ్‌ చేయిల్‌ఫోల్డర్‌పుల్లీవాల్‌ ల్యాపర్‌స్టెఫ్‌ ఆఫ్‌ స్టెఫ్‌డౌన్‌కాడ్‌మాన్‌సైక్టింగ్‌ ఎక్సైర్‌సైజ్‌లతో కండరాన్నిబలపరుస్తారుఅనంతరం సరైన నడకను నేర్పించడానికి ప్యారలాల్‌ ఎక్సర్‌సైజ్‌ చేయిస్తారు.తో

  •  పక్షవాతం సోకిన రోగి త్వరగా కోలుకునే అంశాలుంటాయిమందులుఫిజియోథెరపీ తో పాటు పక్షవాతం సోకిన రోగికి మానసికంగా ఎటువంటి ఒత్తిడి లేకుండాచూస్తుండాలిచాలాసేపటి వరకు ఒంటరిగా ఉండనివ్వకుండా ఎవరో ఒకరు రోగితో మాట్లాడుతూ ఉండాలిమీ ఫ్యామిలీ లో జరగబోయే శుభకార్యాల గురించి మాట్లాడాలివారి అభిప్రాయాన్ని అడుగుతుండాలివారి ఎదురుగా కూర్చుని న్యూస్ పేపర్ చదవడంకలిసి టి.విచూడటం లాంటివి చేస్తుండాలిదీంతో పేషెంట్ కి మనశ్శాంతి కలిగి మానసిక ఒత్తిడి నుండి బయటపడగలడు.

ఎప్పటికప్పుడు తన శరీరంలో వచ్చే మార్పుల్నికుదుటపడుతున్న తన ఆరోగ్య పరిస్థితిని గురించి అతనికి తెలియజేస్తూ ఉండాలిత్వరలో కోలుకుంటారన్న విశ్వాసాన్ని కలిగిం

పక్షవాతం కొరకు మందులు

Medicine NamePack Size
ADEL 31 Upelva DropADEL 31 Upelva Drop
Mama Natura NisikindSchwabe Nisikind Globules
Dr. Reckeweg Gelsemium DilutionDr. Reckeweg Gelsemium Dilution 1000 CH
ADEL Gelsemium Mother Tincture QADEL Gelsemium Mother Tincture Q
Bjain Sarsaparilla DilutionBjain Sarsaparilla Dilution 1000 CH
Schwabe Aconitum napellus LMSchwabe Aconitum napellus 0/1 LM
ADEL 40 And ADEL 86 KitAdel 40 And Adel 86 Kit
Bjain Carboneum oxygenisatum DilutionBjain Carboneum oxygenisatum Dilution 1000 CH
Schwabe Crotalus cascavella CHSchwabe Crotalus cascavella 1000 CH
Bjain Scopolaminum hydrobromicum DilutionBjain Scopolaminum hydrobromicum Dilution 1000 CH
ADEL 43 Cardinorma DropADEL 43 Cardinorma Drop
SBL Sarsaparilla Mother Tincture QSBL Sarsaparilla Mother Tincture Q
Bjain Thyroidinum LMBjain Thyroidinum 0/1 LM
Schwabe Oleander MTSchwabe Oleander MT
SBL Ferrum lacticum DilutionSBL Ferrum lacticum Dilution 1000 CH
ADEL Sarsaparilla Mother Tincture QADEL Sarsaparilla Mother Tincture Q
ADEL 7 Apo-Tuss DropADEL 7 Apo-Tuss Drop
SBL Barium aceticum DilutionSBL Barium aceticum Dilution 1000 CH
ADEL 86 Verintex N External DropADEL 86 Verintex N External Drop
ADEL 9 Co-Hypert DropADEL 9 Cri-Regen Drop
SBL B Trim DropsSBL B Trim Drops
Bjain Lyssinum DilutionBjain Lyssinum Dilution 1000 CH
ADEL Xanthoxylum Frax Mother Tincture QADEL Xanthoxylum Frax Mother Tincture Q
Mama Natura AnekindSchwabe Anekind Globules 

ధన్యవాదములు 

మీ నవీన్ నడిమింటి 

విశాఖపట్నం 

అస్వీకార ప్రకటన: ఈ సైటుపై లభ్యమవుతున్న మొత్తం సమాచారము మరియు లేఖనము కేవలం అవగాహనా ఆవశ్యకతల కొరకు మాత్రమే. ఇక్కడ ఇవ్వబడిన సమాచారమును ఏదైనా ఆరోగ్య సంబంధిత సమస్య లేదా అస్వస్థత నుండి కోలుకోవడానికి లేదా స్వస్థత కొరకు నిపుణుల సలహా లేనిదే ఉపయోగించుకోకూడదు. చికిత్స పరీక్షలు మరియు సేవల కొరకు ఎల్లప్పుడూ ఒక అర్హత పొందిన వైద్యుల సలహా తీసుకోవాలి.

కామెంట్‌లు లేవు: