27, జూన్ 2020, శనివారం

గర్భిణీ కు నిద్ర సమస్యలు పరిష్కారం మార్గం




గర్భిణీ స్త్రీలలో నిద్రలేమి సమస్యకి నవీన్ నడిమింటి అవగాహనా కోసం సలహాలు  –  tips for pregnant women


గర్భిణీగా ఉన్నప్పుడు హార్మోన్ల మార్పు, శారీరక అసమానతలు వల్ల గర్భిణీ స్త్రీలలో నిద్ర లేమి సమస్య మొదలవుతుంది. ప్రెగ్నెన్సీలో ప్రతీ త్రైమాసికానికీ నిద్ర లేమి సవాళ్ళను గర్భిణుల ముందు నిలుస్తాయి. నేషనల్ స్లీప్ ఫౌండేషన్ ప్రకారం ప్రతీ త్రైమాసికానికి కొన్ని నిద్రలేమి మార్పులు వస్తాయని చెప్పటం జరిగింది. అంతేకాక 78 శాతం గర్భిణీ స్త్రీలు ఈ సమస్యతో బాధపడుతున్నారని వెల్లడించింది. వాటిని ప్రత్యేకంగా గర్భిణీ స్త్రీల కోసం మీ తెలుగు టిప్స్ అందిస్తోంది. అవేంటో చూద్దామా..!
గర్భిణీ స్త్రీలలో నిద్రలేమి అనేది సహజమైన సమస్య. గర్భము దాల్చాక ఎంతో కొంత నీరసము అతినిద్ర ఉండడము సహజమే కాని ఎక్కువ అలసట , మరీ నిద్రపోవడము మంచిది కాదు. ఉదయం నిద్ర లేవటం అనేది మీకు తరచూ ఎదురయ్యే సవాలు. ఉల్లాసంగా విశ్రాంతిగా మరునాడు మేల్కోవాలంటే మీరు ఒక దినచర్య అలవాటు చేసుకోవాలి.

మొదటి త్రైమాసికంలో నిద్ర లేమి సమస్య

1. తరచుగా నడుస్తుండటం వల్ల ఎక్కువగా బాత్ రూం కి వెళ్ళాల్సివస్తుంది.
2. ప్రెగ్నెన్సీలో నిద్రించే సమయంలో అంతరాయాలు ఏర్పడటం వల్ల శారీరకంగా, మానసికంగా స్ట్రెస్ ఏర్పడటం జరుగుతుంది.
3. పగటి పూట ఎక్కువగా నిద్రించటం.

రెండవ త్రైమాసికంలో నిద్ర లేమి సమస్య

1.రెండవ త్రైమాసికంలో నిద్ర లేమి సమస్య దాదాపూ చాలా మంది గర్భిణీ స్త్రీలలో ఒకటేలా ఉంటుంది. రాత్రి సమయాల్లో మూత్రం ఎక్కువ రాకపోవటం దీనికి కారణం పిండం రోజు రోజుకీ వృధ్ధి చెందటం. పిండం పెరగటం వల్ల ఇది బ్లాడెర్ పై ఎక్కువ ఒత్తిడి ని కలిగించనివ్వకపోవటం వల్ల ఈ సమస్య తలెత్తుతుంది. ఈ పరిస్తితిలో మానసిక ఒత్తిడి ఎక్కువై నిద్రలేమి సమస్యను పెంచుతుంది.

మూడవ త్రైమాసికంలో నిద్రలేమి సమస్య

ఈ త్రైమాసికంలో గర్భిణీ స్త్రీలు చాలా నిద్రలేమి సమస్యల్ని ఎదుర్కొంటారు.
1. క్రమక్రమంగా బొడ్డు పెరుగుదల వల్ల అసౌకర్యంగా ఉండటం.
2. గుండెల్లో మంట, కాళ్ళ తిమ్మిర్లు, సైనుస్ రద్దీ.
3. రాత్రిళ్ళు మూత్రం ఎక్కువగా రావటం ఎందుకంటే బిడ్డ కదలికల వల్ల ఆ ఒత్తిడి బ్లాడెర్ పై పడి తరచుగా మూత్రం వస్తుంది.

ప్రెగ్నెన్సీ సమయంలో నిద్ర పట్టేందుకు కొన్ని టిప్స్

కొన్ని టిప్స్ వల్ల మీ ప్రెగ్నెన్సీలో చక్కని నిద్ర మీ సొంతం అవుతుంది. కాని మరీ మీ నిద్రలేమి సమస్య ఎక్కువ ఉంటే మీ డాక్టరుని సంప్రదించటం మంచిది.

అదనంగా పిల్లోస్ వాడటం

ప్రెగ్నెన్సి సమయంలో మీరు వాడే పిల్లోస్ అంటే తలగడ దిండ్లు అదనంగా వాడటం మంచిది. పడుకునేటప్పుడు మీ కడుపుకీ, వెనుక భాగంలో అంటే పిరుదుల దగ్గర పిల్లోస్ వేస్కోవాలి. దీని వల్ల మీ కడుపుకీ ఎంతో సపోర్ట్ దొరుకుతుంది. అంతేకాక మీ రెండు కాళ్ళ మధ్య ఒక పిల్లో వేసుకోవాలి. దీనివల్ల మీ కింది భాగంలో సపోర్ట్ దొరుకుతుంది. కొన్ని పిల్లోలు ఆకారంలో ఇరుకుగా ఉండేవి, అలాగే పూర్తిగా బోడీ కి సరిపడే పిల్లోలని వాడటం మంచిది.

పొష్టికాహారం

ఒక గ్లాస్ పాలు త్రాగటం వల్ల మీకు మంచి నిద్ర వస్తుంది. కార్బోహైడ్రేడ్లు ఉన్న పదార్ధాలను తీసుకోవటం మంచిది. బ్రెడ్, క్రాకర్లు మీ నిద్రను పెంచుతాయి. అంతేకాక కొన్ని ఎక్కువ ప్రోటీన్లు ఉన్న స్నాక్స్ తీసుకోవటం వల్ల మీ బ్లడ్ షుగర్ ను పెంచటమే కాక మీకు చెడు కలలు రాకుండా, తలనొప్పులు రాకుండా చేస్తాయి.

ఆయాసం

కొంతమంది గర్భిణీ స్త్రీలు ఆస్త్మ లేదా హైపెర్థైరాయిడిజం సమస్యతో సతమతమవుతుంటారు.

గురక పెట్టడం

గర్భిణీ స్తీలకు సహజంగా ముక్కులోని రంద్రాలు ఉబ్బటం వల్ల ఎక్కువగా బిగ్గరగా గురక తీస్తుంటారు. నేషనల్ స్లీప్ ఫౌండేషన్ లెక్కల ప్రకారం 30 శాతం ఈ సమస్యకు గురి అవుతున్నారు.

విశ్రాంతి పొందే మార్గాలు

విశ్రాంతి తీసుకోవటం వల్ల మీ మనస్సు కి, కండరాలకూ విశ్రాంతి పొందుతాయి. ఈ మార్గాల్లేమిటంటే యోగ, మస్సాజ్, స్ట్రెచింగ్ లాంటివి. ఎక్కువగా శ్వాస తీసుకోవటం, వేడి నీళ్ళతో స్నానం, పడుకునే ముందు ఖచ్చితంగా స్నానం చేయాలి.

వ్యాయామం

ప్రెగ్నెన్సీ తో ఉన్నప్పుడు వ్యాయామం చేయటం ఎంతో మంచిది. వ్యాయామం చేయటం వల్ల మీ శరీరానికి, మనస్సుకి ఉల్లసం, ఉత్తేజం వస్తాయి. అంతేకాక ఒత్తిడి తొలగుతుంది. ఆరోగ్యకరంగ మాత్రమే వ్యాయామం చేయాలి. అధిక వ్యాయామం చెయకూడదు. డాక్టరు సలహా మేరకే ఈ వ్యాయమం చేయటం మంచిది. ముఖ్యంగా రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు అంటే 4 గంటల ముందు మాత్రం వ్యాయామం అసలు చేయరాదు.

నిద్ర

మొత్తానికి గర్భిణి స్త్రీలకు, నిద్రలేమి తప్పదు. నిద్రకు ఉపక్రమించే ముందు వేడిపాలు త్రాగాలి. పగలు కొంచెం వ్యాయామం చేస్తే రాత్రి బాగా నిద్ర పడుతుంది. రాత్రులు 8-10 గంటలు, పగలు 1 గంట నిద్ర లేదా విశ్రాంతి తీసుకోవాలి. నిద్రించే సమయంలో ఒక ప్రక్కకు (వీలైతే ఎడమ వైపు ) తిరిగి పడుకోవాలి.

వేరే మందుల వాడకం

ప్రెగ్నెన్సీ సమయంలో వేరే మందులు వాడటం మంచిది కాదు. ఇవి మీ బిడ్డ పెరుగుదలపై ప్రభావం చూపుతాయి. అంతేకాక కొన్ని మందులు అంటే యాంటీ బయాటిక్స్, హెర్బల్ ప్రాడక్ట్లు వాడటం అంత మంచిది కాదు. మీరు ఏ మందులు వేసుకోవాలన్నా మీ డాక్టరుని సంప్రదించి మాత్రమే వేసుకోవాలి.
ధన్యవాదములు 
మీ నవీన్ నడిమింటి 
విశాఖపట్నం 
*సభ్యులకు సూచన*
*************
సమయాభావం వలన వ్యక్తిగతంగా సమాధానాలు ఎవరికీ ఇవ్వడం సాధ్యపడదు. మీ సమస్యకు సరిపడా పరిష్కారాలకొరకు, మీ అవగాహనకొరకు మేము పెడుతున్న సంబంధిత సమాచారంతో కూడిన సవివరమైన పోస్టులు చదవవలసినదిగా ప్రార్థన..

.

గురక కారణాలపై విశ్లేషణ: #SleepApnea వల్ల వచ్చే సున్నితమైన, ముఖ్యమైన సమస్య గురక. గురక పెట్టి నిద్రపోతున్నారంటే గాఢనిద్రలో ఉన్నారని అనుకుంటారు చాలామంది. నిజానికి గాఢనిద్ర కాదు కదా.. మామూలుగా కూడా వాళ్లు నిద్ర సుఖాన్ని అనుభవించలేరు.మూలం


గురక అంటే ఏమిటి?

నిద్రిస్తున్న సమయంలో గాలి (ఊపిరి) యొక్క అనుకూల కదలికలకు అడ్డంకి ఏర్పడినప్పుడు గురక సంభవిస్తుంది. తరచుగా గురక పెట్టేవారికి వారి యొక్క గొంతు/కంఠం మరియు నాసికా కణజాలం పెద్దగా/అధికంగా ఉంటుంది, అది కంపించి (vibrate) ప్రత్యేకమైన గురక శబ్దానికి దారితీస్తుంది.

దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

గురక వలన నిద్ర లేమి లేదా తగ్గడం, పగటి వేళా మత్తుగా అనిపించడం, ఏకాగ్రత లేకపోవడం మరియు లైంగిక కోరిక తగ్గిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇది మానసిక సమస్యల మరియు గుండెపోటు ప్రమాదాన్ని కూడా పెంచుతుంది.

దీని ప్రధాన కారణాలు ఏమిటి?

గురక అనేది చాలా సాధారణం మరియు సాధారణంగా అది ఏవిధమైన ఆందోళనకరమైన పరిస్థితులను కలిగించదు. మనం నిద్రిస్తున్నపుడు, మన నాలుక, గొంతు, నోరు, శ్వాస మార్గాలు మరియు ఊపిరితిత్తులు సేదతీరుతాయి మరియు కొంచెం సన్నగా/ఇరుకుగా మారుతాయి. శ్వాసించేటప్పుడు ఈ భాగాలు వైబ్రేట్ (కంపిస్తే) ఐతే, అది గురకకు దారితీస్తుంది. గురక యొక్క కొన్ని సాధారణ కారణాలు:

  • అలెర్జీ లేదా సైనస్ ఇన్ఫెక్షన్.
  • ముక్కు దూలం (nasal septum) పక్కకు ఒరిగిపోవడం లేదా నేసల్ పోలీప్ కారణంగా అవరోధం/అడ్డంకి ఏర్పడడం వంటి ముక్కు వైకల్యాలు.
  • ఊబకాయం.
  • మందమైన నాలుక.
  • గర్భం.
  • జన్యు కారకాలు.
  • మద్యపానం మరియు ధూమపానం.
  • టాన్సిల్స్ మరియు అడినాయిడ్లు విస్తరించడం .
  • కొన్ని రకాల మందులు.

దీనిని ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?

ఏవైనా గురక యొక్క కారణాలను తనిఖీ చెయ్యడానికి వైద్యులు ముక్కు మరియు నోటిని పరిశీలిస్తారు. వ్యక్తి యొక్క గురక విధానాన్ని గురించి వైద్యులకు తెలియజేయడానికి వ్యక్తి భాగస్వామి ఉత్తమమైన వారు. కారణం స్పష్టంగా తెలియనట్లయితే వైద్యులు నిపుణుడిని సూచించవచ్చు. వైద్యులు ఇంటిలో నిద్ర పరీక్షను (in-home sleep test) లేదా తీవ్ర కేసులలో లాబ్ లో నిద్ర పరీక్ష (in-lab sleep test) ను ఆదేశించవచ్చు.

నిద్ర అధ్యయనం (sleep study) లో, సెన్సార్లు శరీరంలోని వివిధ భాగాలలో పెడతారు అవి మెదడు, హృదయ స్పందన మరియు వ్యక్తి యొక్క శ్వాస నమూనా నుండి సంకేతాలను రికార్డు చేస్తాయి. సాధారణంగా పాలీసోమ్నోగ్రఫీ (polysomnography) అని పిలువబడే ఇంటిలో నిద్ర పరీక్ష సహాయంతో అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా గుర్తించబడుతుంది. అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా కాకుండా ఇతర నిద్ర రుగ్మతలు (స్లీప్ డిజార్డర్స్) స్టడీ సెంటర్లో (అధ్యయన కేంద్రంలో) ఇన్-లాబ్ నిద్ర అధ్యయనం ద్వారా నిర్దారించబడతాయి.

నిద్ర అధ్యయనాలు కారణాన్ని నిర్దారించలేకపొతే, గురక యొక్క ఖచ్చితమైన కారణాన్ని గుర్తించడానికి చెస్ట్ ఎక్స్-రే, సిటి (CT) మరియు ఎంఆర్ఐ (MRI) స్కాన్ వంటి ఇతర పరీక్షలు నిర్వహించవచ్చు.

ఒకే నిర్దిష్టమైన చికిత్స ద్వారా గురకను పూర్తిగా తాగించలేరు కాని కొన్ని చికిత్సలు అడ్డంకులని తొలగించటం ద్వారా శ్వాసలోని అసౌకర్యాన్ని తగ్గిస్తాయి.

నిద్రపోయే ముందు సెడేటివ్ మందుల ఉపయోగాన్ని నివారించడం, ధూమపానం మరియు మద్యపానం విడిచిపెట్టడం వంటి జీవనశైలి మార్పులు. నేసల్ స్ప్రేలు, స్ట్రిప్లు (strips)  లేదా క్లిప్లు (clips), ఓరల్ ఉపకరణాలు (oral appliances), యాంటీ- స్నోర్ (anti-snore) దిండ్లు మరియు వస్త్రాల వంటి వాటి వినియోగం అనేది గురకని తగ్గిస్తుంది.

వైద్యులు ఈ కింది సవరణలను సలహా ఇస్తారు:

  • కొంటిన్యూస్ పాజిటివ్ ఎయిర్వే ప్రెషర్ (CPAP) [నిరంతర సానుకూల వాయు పీడనం]
  • లేజర్-అసిస్టెడ్ యువలోపలటోప్లాస్టీ (LAUP, Laser-assisted uvulopalatoplasty)
  • పలెటల్ ఇంప్లాంట్లు (Palatal implants)
  • సోమ్నోప్లాస్టీ (Somnoplasty) - అధిక కణజాలాలను తీసివేసేందుకు రేడియో తరంగాలను (radiofrequency) తక్కువ స్థాయిలో ఉపయోగిస్తారు
  • కస్టమ్-ఫిట్టేడ్ డెంటల్ పరికరాలు (Custom-fitted dental devices) లేదా కింది దవడ-పొజిషనర్లు (lower jaw-positioners)
  • యువాలోపలటోఫారింగోప్లాస్టీ (UPPP, uvulopalatopharyngoplasty), థర్మల్ అబ్లేషన్ పాలటోప్లాస్టీ (TAP, thermal ablation palatoplasty), టాన్సిలెక్టోమీ (tonsillectomy) మరియు అడెనోయిడైక్టోమీ (adenoidectomy) వంటి శస్త్రచికిత్సా విధానాలు

వెల్లకిలా పడుకోవడం కాకుండా ఒక పక్కకి పడుకోవడం వలన గురకకు తగ్గించవచ్చు మరియు ఒక యాంటీ స్నోరింగ్ నోటి వస్తువును (anti-snoring mouth appliance) ఉపయోగించవచ్చు

.

గురక సమస్య—ఆయుర్వేద చికిత్స….

1.-గ్లాసు నీటిలో 1—2 పిప్పర్ మెంట్ ఆయిల్ చుక్కలు వేసి రాత్రి నిద్రపోయే ముందు బాగా పుక్కిలించాలి.

2.-కొద్దిగా పిప్పర్ మెంట్ ఆయిల్ ను చేతివేళ్ళకు రాసుకుని వాసన చూస్తుంటే గురక తగ్గిపోతుంది.

3.-1/2 టీ స్పూను ఆలివ్ ఆయిల్ 1/2 టీ స్పూను తేనె కలిపి రాత్రి నిదురపోయేముందు తాగాలి.

4.-మరిగే నీటిలో 4లేదా5 చుక్కలు యూకలిప్టస్ ఆయిల్ వేసి తలకు ముసుగు పెట్టి రాత్రి నిదురపోయే ముందు 10ని” పాటు ముక్కుద్వారా ఆవిరి పీల్చాలి.

5.-ఆవు నెయ్యిని రోజూ కొద్దిగా వేడిచేసి కరిగించి రెండు చుక్కల చొప్పున రెండు ముక్కురంధ్రాలలో పోసి పీల్చుతుంటే గురక తగ్గుతుంది.

6.-1/2టీ స్పూను యాలకుల చూర్ణంను ఒక గ్లాసు వేడీనీటిలో కలిపి రాత్రి నిదురపోయే ముందు తాగాలి.

7.-రెండు టీ స్పూనుల పసుపుపొడిని కప్పు వేడి పాలల్లో కలిపి రాత్రి నిద్ర పోయే ముందు త్రాగండి

గురక కొరకు మందులు

Medicine NamePack Size
ArmodArmod 150 Tablet
WaklertWaklert 100 Mg Tablet
WakactiveWAKACTIVE 100MG TABLET
ModafilModafil 100 Tablet MD
ModalertModalert 100 Tablet
ModatecModatec 100 Tablet
ProvakeProvake 100 Mg Tablet
WellmodWellmod 100 Mg Tablet

ధన్యవాదములు 

మీ నవీన్ నడిమింటి 

విశాఖపట్నం 

9703706660

*సభ్యులకు సూచన*

*************

సమయాభావం వలన వ్యక్తిగతంగా సమాధానాలు ఎవరికీ ఇవ్వడం సాధ్యపడదు. మీ సమస్యకు సరిపడా పరిష్కారాలకొరకు, మీ అవగాహనకొరకు మేము పెడుతున్న సంబంధిత సమాచారంతో కూడిన సవివరమైన పోస్టులు చదవవలసినదిగా ప్రార్థన..



.

నిద్ర సమస్యలు అవగాహనా కోసం


నిద్ర సమస్యలు అవగాహనా కోసం నవీన్ నడిమింటి సలహాలు అవగాహనా కోసం  , Sleep

నిద్ర లేదా నిదుర (Sleep) ఒక శరీరానికి సంబంధించిన విశ్రాంతి స్థితి. ఇది జంతువులలోనే కాకుండా పక్షులు, సరీసృపాలు, ఉభయచరాలు మరియు చేపలలో కూడా కనిపిస్తుంది. మనుషులు, ఇతర జంతువులలో దైనందిక నిద్ర బ్రతకడానికి అవసరం. 8 గంటల కంటే తక్కువ నిద్రపోయిన వారిలో శరీర సామర్ధ్యం తగ్గినట్లుగా గుర్తించారు. అయితే నిద్ర యొక్క ప్రాముఖ్యత గురించి ఇంకా పూర్తిగా అర్ధం కాలేదు. విస్తృతమైన పరిశోధనలు జరుగుతున్నాయి. గాలి ,నీరు , ఆహారము లాగే నిద్ర కూడా ఒక సహజ శారీరక అవసరము . ఎవరెన్ని గంటలు నిద్రపోవాలన్న అంశం పైన భిన్నాబిప్రాయాలు ఉన్నా వేళకు తిని , వేళకు పడుకుంటే ఆరోగ్యాము నిక్షిప్తం గా ఉంటుంది . అలసిన మనసుకు , తనువుకు నిద్ర ఒక వరము . నిద్రలో శరీరానికి తగినంత విశ్రాంతి కలుగు తుంది . . . కలతపడ్డ మనసు కుదుట పడుతుంది . చాలినంత నిద్రలేక పోతే అది చాలా రుగ్మతల్కు దారి తీస్తుంది . మనసు మీద ప్రభావము చూపుతుంది . శారీరక జీవక్రియలు దెబ్బతింటాయి.


ఆరోగ్యమునకు  " నిద్ర "

అందమె ఆనందం,   ఆనందమె జీవిత  మకరందం  అని ఓ మహాకవి వర్ణిం చారు.
.అందరు అందంగా ఉండాలని, ఆరోగ్యముగ ఉండాలని కోరుకుంటారు .కానీ మన
ముఖం ప్రశాంతంగా అందంగా కనిపించాలంటే మంచి నిద్ర కావాలి లేదంటే
మన ముఖంలో తేడా కనిపించి పోతుంది 
రెండు రోజులు అన్నం లేకపోయినా పర్వాలేదు కాని , నిద్ర లేకపోతే ఎంత  మాత్రం  బ్రతకలేము.
 ప్రతి జీవికి  నిద్ర అంత  ముఖ్యమైనది  .
నిద్రలోనే  metabolism అంతా జరుగుతుంది. నిద్ర లోనే  anti oxidents  పని చేసి  టాక్సిన్  క్లిఎర్  చేసిఆరోగ్యముగా  ఉంచుతుంది .
రాత్రి  పదకొండు  గంటలనుండి  ఉదయం  నాలుగు  గంటలవరకు  anti oxidents work చేస్తాయని  చెపుతారు.అందువలన రాత్రి ఏ రెండు గంటలకో  పడుకొంటే  అవి కేవలం  రెండు గంటలు మాత్రమే పనిచేసి  , toxins clear అవడము  లేటు  అవుతుంది. అందువలన కొన్ని  సమస్యలు ఏర్పడతాయి
అని చెపుతారు.
నిద్ర లేమి వలన  కళ్ళు  లాగడము  ,చేసే పని మీద  శ్రద్ద తగ్గడము  మొదలైన  లక్షణాలు  కనిపిస్తాయి  .
ఒక గంట మనము పోగొట్టుకున్న  నిద్ర ని cover  చ్రేయడానికి  కనీసము  మూడు గంటలు పడుకోవాలి.అందువలనమనముపధ్ధతిప్రకారమునిద్రనిఅలవాటుచేసుకుంటే ,అందము,ఆరోగ్యాము, ఉత్సాహము ఎక్కువ అవుతాయి . ఎన్ని పనులు ఉన్నా నిద్ర  సమయాన్ని. , నిద్రకి  కేటాయిస్తే  ,ఆ పనులన్నీ  సక్రమము గా  ,సమయానికి  సమర్థ వంతముగా చేయగలము. 
తగినంత  నిద్ర లేకపోతె  మధు మేహము  ముప్పు  పెరిగే  అవకాశము ఉంది  అని తాజా. అధ్యనయనాలు  చెపుతున్నాయి .insulin. తత్వము  లో  మార్పులు  ,glucose నియంత్రణ లోసామర్థ్యము  తగ్గి పోయే  అవకాశములు  ఉన్నాయ్ అని colorado belter university పరోసోధకులు పేర్కొన్నారు . 9 గంటల నిద్ర  తప్పనిసరి అని  దాని వలన సామర్థ్యము పెరుగుతుంది  అని పేర్కొన్నారు.
మంచి నిద్ర కొరకు కొన్ని చిట్కాలు :

 1.పడుకునే ముందు. మనసులోకి ఏ  ఆలోచనలు రానీయకూడదు 
 2.తెల్లవారు ఘామున , లేదా సాయంత్రం   jagging కానీ walking కానీ  చేయడం వలన         రాత్రి  నిద్ర బాగా పడుతుంది
 3.  మంచినీరు  సమృద్దిగా  తీసుకోవాలి
4. రాత్రి  భోజనం తగ్గించాలి (అంటే పరిమిత భోజనం )
 5. పడుకోవడానికి  ముందు మూడుగంటల ముందే  భోజనంపూర్తి  చేయాలి .
6. సాధ్యమైనంత వరకూ  సాత్వికాహారము తీసుకుంటే మంచిది .
.     masaalafood తినడం వలన acidity,indigestion  లాంటి సమస్యలు 
    అవకాశాలు ఉన్నాయ్ .
7. కొంచెం సేపు  అటు ఇటు  నడిస్తే నిద్ర  వస్తుంది
 8. నిద్ర వచ్చే వరకూ T.V., చూడడము వలన  కళ్ళకు  స్ట్రైన్  పెరుగుతుంది.
     మైండ్ రిలాక్స్  అవదు.
9. ఏదైనా పుస్తకము చదవడము వలన నిద్ర  వస్తుంది  .
10. పడుకునే  ముందు గోరు వెచ్చని పాలు  శ్రేష్టము. అందులో  ఉండే. enzyme  మనకు నిద్ర వచ్చేలా చేస్తుంది.
 11. మంచి సంగీతము వినడము వలన నిద్ర  వస్తుంది  .
12. మనము పడుకునే  పరుపు ,దిండు సరిగా ఉన్నాయో లేవో చూడాలి 
 13. పడక గది వస్తువులతో  చిందర వందర గా ఉండకుండా సర్దుకోవాలి
14. గోడలకు ముదురు రంగులు కాకుండా, లేత  రంగులు  ఉండేలా చూసుకోవాలి 
15. గాలి వచ్చేలా కిటికీలు  ఉండాలి. oxygen  ఎక్కువగా వుంటుంది
16. ఎక్కువ  లైట్  ఉండకుండా  చూసుకోవాలి.వెలుగు కళ్ళ మిద  పడితే నిద్ర పట్టదు
17. అన్నింటి కన్నా ముఖ్యము  ఐయినది  శారీరక శ్రమ .ప్రస్తుత కాలమాన పరిస్థితులలో  అది కష్టమే  కానీ  మందులు అవసరము లేకుండా మంచి నిద్ర కావాలనుకుంటే శారీరక  శ్రమ తప్పని సరి.
 చిన్న చిన్న చిట్కాలు పాటిద్దాము , సుఖ  నిద్ర, శాశ్వత  ఆరోగ్యము  పొందుదాము.

ఎన్ని గంటలు నిద్రపోవాలి

సామాన్యంగా పిల్లలకు పెద్దలకంటే ఎక్కువగా నిద్ర అవసరం. ఇది వారి శారీరక పెరుగుదలకు మానసిక అభివృద్ధికి చాలా అవసరం. అప్పుడే పుట్టిన పిల్లలైతే సుమారు 18 గంటల నిద్ర అవసరం, వారు పెరుగుతున్న కొద్దీ ఇది తగ్గిపోతుంది.


వయసు ---------రోజుకు కావలసిన సగటు నిద్ర
పురిటిబిడ్డ -------సుమారు 18 గంటలు
1–12 నెలలు--------------14–18 గంటలు
1–3 సంవత్సరాలు---------12–15 గంటలు
3–5 సంవత్సరాలు ---------11–13 గంటలు
5–12 సంవత్సరాలు ---------9–11 గంటలు
యువకులు -----------------9-10 గంటలు
పెద్దవారు --------------------7–8 గంటలు
గర్భణీ స్త్రీలు -----------------8 (+) 

ప్రయోజనం

నిద్ర వలన మెదడుకు విశ్రాంతి దొరుకుతుంది. దానితో జ్ఞాపకశక్తి పెరుగుతుంది.
శరీరంలో రోగ నిరోధక శక్తిని అభివృద్ధి చేస్తుంది.
నాడీ వ్యవస్థ సరిగా పనిచేసేందుకు దోహదం చేస్తుంది.
హార్మోన్ల ఉత్పత్తి, నియంత్రణ నిద్ర వలన సక్రమంగా జరుగుతుంది.
నిద్రలో దశలు :
రాత్రి నిద్రపోయే సమయాన్ని రెండు రకాలుగా గుర్తిస్తారు. " రెమ్‌ " , "నాన్‌ రెమ్‌"  అని .
రెమ్‌ అంటే " రాపిడ్ ఐ మూవ్ మెంట్ " అనేదానికి సంక్షిప్త నామము . ఇందులో నాలుగు దశలుంటాయి. 
1. తొలి దశ 5 నిముషాలే . ఇది నిద్రలోకి వెళ్ళేదశ . కనురెప్పలు కింద కళ్ళు కదులుతూ ఉంటాయి. ఈ దశలో చిన్న శభ్దానికైనా వెంటనే మెలకువ వస్తుంది .
 
నిద్ర లేమి :
ఏ కారణము చేతనైనా నిద్ర పట్టకపోవడం , సరిగా నిద్రపట్టకపోవడం ను నిద్రలేమి అంటాము . దీనివలన ఆరోగ్యము చెడిపోతుంది .
నిర్వచనము : నిద్ర రావడం లేదని చెప్పే వారిలో కనిపించే ప్రధాన సమస్య నిద్రలేమి (ఇన్‌సోమ్నియా). దాదాపు 15 నుంచి 30 శాతం మందిలో ఈ సమస్య ఉంటుంది. 'వారానికి కనీసం మూడు రోజులు, కనీసం ఒక నెలపాటు నిద్రపట్టడానికి ఎక్కువ సమయం తీసుకోవడం, మధ్యలో మెలకువ రావడం, రోజూ నిద్రలేవడానికంటే ముందుగా మెలకువరావడం' జరిగితే వాళ్లు నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నట్లు. పడుకున్న తర్వాత 20 నిమిషాల్లో నిద్రపోవడం సాధారణం. కానీ 30 నిమిషాలు గడిచినా నిద్ర రాకుంటే సమస్య ఉన్నట్లు గమనించాలి.
కారణాలు :
దైనందిన జీవితం లో పని వత్తిడి ,
మానషిక వత్తిడి ,
టీవీ చూడడం ,
కంప్యుటర్ పై పనిచేయడం ,
కుటుంబ సమస్యలు ,
ఆర్ధిక సమస్యలు ,
ఆహార నియమాలు ,
చెడ్డ అలవాట్లు ,

నిద్రలేమి నుండి బయటపడడానికి కొన్ని చిట్కాలు :
రాత్రి 9 గంటలు దాటిన తరువాత ఆల్కహాలు తీసుకోడదు . ఆల్కహాలు మధ్యలో నిద్రను చెడగొడుతుంది .
రాత్రి 7 గంటలు తరువాత తీ , కాఫీ , కెఫీన్ ఉన్న పానీయాలు తీసుకోకూడదు ,
రాత్రి చాలా పొద్దుపోయిన తర్వాత ఆహారం కూడదు.
రాత్రులు ఎక్కువగా ఆహారము (full meal) తినకూడదు ,డిన్నర్‌లో తేలిగ్గా జీర్ణమయ్యే ఆహార పదార్థాలను మాత్రమే తీసుకోవాలి.
పడుకునే ముందు వ్యాయామము చేయకూడదు ,
పడక గదిని ... పనిచేసే ఆఫీస్ గది గా మార్చకూడదు ,
పడుకునే ముందు వేడిపాలు తాగితే మంచి నిద్ర వస్తుంది .
నిద్ర రానపుడు ఏదైనా మంచి పుస్తమును చదవాలి ,
నిద్రపోయేముందు వేడినీళ్ళ స్నానము చేస్తే మంచి నిద్ర పడుతుంది ,
సుఖ నిద్ర పోవటానికి ఆహారం, పానీయాలు తోడ్పడతాయి . మంచి ఆహారం, సుఖనిద్ర ఆరోగ్యానికి చాలా అవసరం.

* శరీరంలో షుగర్‌ సమస్థితిలో ఉండేలా చూసుకోవాలి. బ్లడ్‌షుగర్‌ తక్కువగా ఉన్నట్లయితే నిద్రపట్టదు. కలత నిద్ర కలుగుతుంది.
* ఆహారం తీసుకున్న వెంటనే మత్తుగా అనిపించి కునుకు పట్టొచ్చు. ఆహారం తీసుకున్న వెంటనే నిద్రపోవటం ఆరోగ్యకరం కాదు కొంతసేపటికి నిద్రా భంగం కలిగి, తర్వాత నిద్ర పట్టకపోవచ్చు. ఆహారం తీసుకున్నాక కొంత సమయం తర్వాతనే పడకచేరాలి.

* పడక చేరబోయేముందు ఎక్కువ నీరు తాగకూడదు.

* మూత్ర విసర్జన చేసి పడకచేరాలి.

ట్రీట్మెంట్ :
అవసరమైతే డాక్టర్ సలహాపై నిద్రమాత్రలు తీసుకోవాలి .
నిద్రలేమి ... కంటికింద నల్లటి వలయాలు -- ముఖసౌన్దర్యం :


నిద్రలేమి, దిగులు, ఆందోళన... ఇలా కారణమేదైనా కావొచ్చు, దీర్ఘకాలంలో అవి కంటికింద నల్లటి వలయాలను ఏర్పరచడం ద్వారా ముఖసౌందర్యం మీద ప్రభావం చూపిస్తాయి. వాటిని తొలగించుకోవడానికి బోలెడన్ని చిట్కాలు ఉన్నాయి. ఉదాహరణకు బంగాళా దుంపలిో చర్మాన్ని తేటపరిచే(స్కిన్‌ లైటెనింగ్‌) తత్వం ఉంది. అది ఈ సమస్యకు చక్కటి విరుగుడు. బంగాళాదుంప రసాన్ని కంటి కింద రాసి పదినిమిషాల తర్వాత చల్లటి నీటితో కడగాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తుంటే నలుపు క్రమంగా విరుగుతుంది. ఇలాంటి సౌందర్య చిట్కాలతోనే కాదు, ఆహారంలో మార్పులతోనూ ఇదే ఫలితాన్ని పొందొచ్చు. ఉదాహరణకు విటమిన్లలో కె విటమిన్‌కు కూడా ఇదే తత్వం(స్కిన్‌ లైటెనింగ్‌) ఉంది. కంటికింద మచ్చలతో బాధపడేవారు సౌందర్య చిట్కాలను పాటించడంతో పాటు కె విటమిన్‌ అధికంగా లభ్యమయ్యే ఆహారం తీసుకుంటే మెరుగైన ఫలితాలు త్వరగా కనిపిస్తాయి. ఇంతకీ కె విటమిన్‌ి పుష్కలంగా దొరికే ఆహారం ఏంటంటారా, ఇదుగో ఆ జాబితా... క్యాలీఫ్లవర్‌, క్యాబేజీ, బ్రాకోలి, క్యారెట్‌, బీన్స్‌, దోసకాయ, సోయాబీన్స్‌, పచ్చిబఠాణీలు, కాలేయం(బీఫ్‌, పోర్క్‌), చేపనూనె, పెరుగు, పాలు, అన్నిరకాల ఆకుకూరలు(పాలకూరలో అత్యధికం).

నిద్ర వయస్సు ను తెలియనివ్వదు :

వయసుకు తగినట్టుగా శరీరము మారుతుంది . అది సహజము . ఐతే కొందరి ముఖాలు వయసును తెలియనివ్వవు . వారి అసలు వయసుకన్నా ఐదారేళ్ళు చిన్నగా కనిపిస్తారు . వారి యవ్వన రహస్యము వారు క్రమము తప్పక తీసే నిద్రలో ఉంటుంది. నిద్ర వల్ల వచ్చే లాభాలు ఒకటి రెండు కాదు . సుఖనిద్రపోవడం ఒక వరము .
నిద్రలో శరీర లోపాలు సరిదిద్దబడాతాఇ. ఆరోగ్యము కుదుటపడుతుంది . తగినంత నిద్ర , విశ్రాంతి కలవారిలో రక్తపోటు , మధుమేహము అదుపులో ఉంటుంది . రక్తపోటుతో పాటే మిగిలిన అంతర్గత అవయవాల పనితీరు సక్రమముగా ఉంటుంది . సరిగా నిద్రలేనివారి కళ్ళలో వెలుగు ఉండదు . . చర్మము ఆరోగ్యముగా కనిపించదు . ముఖము మీద ముడతలు వస్తాయి. అసలు వయసు కన్నా పదేళ్ళు అదనపు వయసు కనిపిస్తుంది . నిద్ర ఉన్నప్పుడే వయసు ముదిరు నట్లు కనపడకుండా ఉంటుందన్నది తాజా నిర్ధారణ అయిన విషయము .

నిద్ర పట్టేదెట్లా?
పురుషుల కన్నా స్త్రీలకు సగటున 20 నిమిషాల నిద్ర ఎక్కువ అవసరమని బ్రిటన్‌ పరిశోధకుల అధ్యయనంలో తేలింది. మరీ ముఖ్యంగా... తెలివితేటలు, భాషా నైపుణ్యం, జ్ఞాపకశక్తి వంటి కీలకమైన విధులను నిర్వర్తించే సెరిబ్రల్‌ కార్టెక్స్‌ బాగా పనిచేయాలంటే తగినంత నిద్ర తప్పనిసరి అని వారు చెబుతున్నారు. అలా చక్కగా నిద్రపట్టడానికి కొన్ని చిట్కాలు కూడా చెబుతున్నారు వారు...

* రోజూ ఒకే సమయానికి పడుకోవడానికి ప్రయత్నించండి. కొన్నాళ్లకు అది అలవాటైపోయి ఆ సమయానికి నిద్ర వస్తుంది.
* పడుకోవడానికి అరగంట ముందు... పుస్తకం చదువుకోవడం, మంద్రమైన సంగీతం వినడం, గోరువెచ్చటి పాలు తాగడం లాంటి ఏదో ఒక అలవాటు చేసుకోండి. ఆ పని చేయగానే నిద్రపోవాలని మెదడు సంకేతాలు పంపుతుంది.
* పడుకునేటప్పుడు బిగుతు దుస్తులు కాకుండా శరీరానికి సౌకర్యంగా వదులుగా ఉండే కాటన్‌ దుస్తుల్ని ధరిస్తే మంచిది.
* కాఫీ, టీలలో ఉండే కొన్ని పదార్థాలు మెదడును ఉత్తేజితం చేసి నిద్రపట్టనివ్వవు. అంచేత రాత్రి ఎనిమిది దాటాక వాటి జోలికి పోవద్దు.

రాత్రిపూట గాఢనిద్ర తగ్గితే--పురుషులకు గుండె జబ్బులే!

లండన్‌: మహిళలతో పోలిస్తే పురుషులు రాత్రివేళ గాఢ నిద్ర తక్కువగా ఉంటుంది. దీనివల్ల వారిలో అధిక రక్తపోటు, గుండెపోటు వంటి సమస్యలు వస్తాయని హార్వర్డ్‌ విశ్వవిద్యాలయం నిర్వహించిన తాజా అధ్యయనంలో తేలింది. రాత్రి సమయంలో మధ్యమధ్యలో నిద్ర లేవడం పురుషుల్లోనే అధికమని పరిశోధకులు పేర్కొన్నారు. కొన్నిసార్లు తమ సొంత గురకవల్లే నిద్ర లేస్తారని చెప్పారు. ఫలితంగా నిరంతరాయ నిద్ర సమయం తగ్గిపోతుందని వివరించారు. అంతరాయాలులేని నిద్ర తక్కువగా ఉండేవారిలో అధిక రక్తపోటు తలెత్తే ప్రమాదం ఉందని చెప్పారు. ఇదిగుండెపోటు, పక్షవాతానికి దారితీస్తుందని వివరించారు. అధ్యయనంలో భాగంగా 65ఏళ్లు పైబడ్డ 784మంది పురుషుల నిద్ర అలవాట్లను పరిశీలించారు. రాత్రిళ్లు చాలా తక్కువగా గాఢనిద్ర పోయేవారిలో అధిక రక్తపోటు వచ్చే ప్రమాదం 80% ఎక్కువగా ఉన్నట్లు ఇందులో తేలింది.

ఏడు గంటల నిద్ర చాలు : 
ఆరు , ఏడు , ఎనిమిది ... ఎన్ని గంటల నిద్ర అవసరము ? ... అని ప్రశ్నించుకుంటే ఏడు గంటల గాడనిద్ర అని చెప్పుకోవాలి. 7 గంటలకంటే తక్కువ  లేదా ఎక్కువ నిద్ర పోతే గుండే జబ్బులు వచ్చే ఆస్కారము ఎక్కువ అని పరిశోధనలలో గుర్తించారు . ఈ నియమము 20 సంవత్సరాలు దాటినవారికే.

Extra sleep is good,అదనపు నిద్ర మంచిదే!

అతిగా నిద్రపోవటమనేది మంచి అలవాటేమీ కాదు. కానీ తక్కువ సమయం నిద్రపోయేవారు అదనంగా రెండు గంటల సేపు ఎక్కువగా నిద్రపోవటం మంచిదేనని పరిశోధకులు చెబుతున్నారు. దీంతో చురుకుదనం మాత్రమే కాదు.. నొప్పిని తట్టుకునే సామర్థ్యమూ పెరుగుతున్నట్టు తాజా అధ్యయనంలో బయటపడింది. తగినంత నిద్రపోనివారు మరింత ఎక్కువసేపు నిద్రపోతే నొప్పి తీవ్రత తగ్గటానికి దోహదం చేస్తోందని అమెరికాలోని హెన్రీఫోర్డ్‌ ఆసుపత్రికి చెందిన థామస్‌ రోథ్‌ పేర్కొంటున్నారు. దీర్ఘకాల వెన్నునొప్పి వంటి అన్నిరకాల నొప్పులపైనా దీని ప్రభావం కనబడుతుండటం గమనార్హం. ఒకవేళ ఇప్పటికే 8 గంటల సేపు నిద్రపోతుంటే మాత్రం మరింత నిద్ర అవసరం లేదని గుర్తించాలని వివరిస్తున్నారు. ఇంతకీ నొప్పికి, నిద్రలేమికి సంబంధం ఏంటి? ఈ రెండూ శరీరంలో వాపు సంకేతాల స్థాయులను పెంచుతాయని.. అందువల్ల మరింత ఎక్కువ నిద్రపోవటం వాపు తగ్గేందుకు దోహదం చేస్తుండొచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. ------ source : Medicine update (magazine).

జ్ఞాపకశక్తికి నిద్రే మందు!
ఎంత చదివినా గుర్తుండటం లేదా? అయితే రాత్రిపూట కంటినిండా నిద్రపోండి. ఎందుకంటే రోజంతా మనం నేర్చుకున్న విషయాలను, ఎదురైన సంఘటనలను బలమైన జ్ఞాపకాలుగా పదిల పరచుకోవటానికి నిద్ర ఎంతగానో తోడ్పడుతుంది. గత జ్ఞాపకాలతో కొత్తవాటిని కలపటానికీ, సృజనాత్మక ఆలోచనలు పుట్టుకురావటానికీ దోహదం చేస్తుంది. ఇంతకీ నిద్రపోతున్నప్పుడు మన మెదడులోని జ్ఞాపకాలు ఎలా స్థిరపడతాయి? నిద్ర సరిగా లేకపోతే నేర్చుకునే, గుర్తుంచుకునే సామర్థ్యం ఎందుకు తగ్గుతుంది? వీటిని పసిగట్టేందుకే నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్స్‌ ఆఫ్‌ హెల్త్‌ ఆధ్వర్యంలో శాస్త్రవేత్తలు ఇటీవల అధ్యయనం చేశారు. విద్యార్థుల్లో జ్ఞాపకశక్తి సామర్థ్యాన్ని పెంచటానికి, వృద్ధుల్లో మతిమరుపును తగ్గించటానికి కొత్త పద్ధతులను రూపొందించటంలో ఈ అధ్యయన ఫలితాలు ఉపయోగపడగలవని భావిస్తున్నారు.

మనం నిద్రపోతున్నప్పుడు తేలికైన నిద్ర, గాఢనిద్ర, కంటి కదలికలు వేగంగా ఉండే (రెమ్‌) నిద్ర వంటి దశలుంటాయి. సాధారణంగా రెమ్‌ దశలోనే కలలు వస్తుంటాయి. ఈ దశలన్నీ క్రమంగా ప్రతి 90 నిమిషాలకు ఒకసారి తిరిగి ఏర్పడుతుంటాయి. విషయాలను నేర్చుకోవటంలో రెమ్‌ దశ చాలా కీలకపాత్ర పోసిస్తుంది. ఒకవేళ నిద్ర సరిగా పట్టకపోతే నేర్చుకునే సామర్థ్యమూ 40% వరకు పడిపోతుంది. కొత్త జ్ఞాపకాలు స్థిరపడేందుకు తోడ్పడే మెదడులోని హిప్పోక్యాంపస్‌ భాగంపై నిద్రలేమి తీవ్ర ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. మనం మెలకువగా ఉన్నప్పుడు ఆయా సంఘటనల వారీగా మెదడులో కొత్త జ్ఞాపకాలు పోగుపడుతుంటాయి. వీటిలో చాలావరకు మరచిపోతుంటాం కూడా. జ్ఞాపకాలు తొలిసారి ఏర్పడినప్పుడు అంత బలంగా ఉండవు. చాలా అపక్వంగా, సున్నితంగా ఉంటాయి. కానీ నిద్ర పోయినప్పుడు వాటిని నెమరువేసుకోవటానికి మెదడుకు తగినంత సమయం దొరుకుతుంది. ఏయే సంఘటనలను గుర్తుంచుకోవాలో, వేటిని వదిలించుకోవాలో కూడా నిర్ణయించుకుంటుంది. రాత్రిపూట నిద్రపోయినప్పుడు జ్ఞాపకాలు బలోపేతమవుతాయని హార్వర్డ్‌ మెడికల్‌ స్కూల్‌కు చెందిన డాక్టర్‌ రాబర్ట్‌ స్టిక్‌గోల్డ్‌ చెబుతున్నారు. పియానోపై మంచి గేయాన్ని వాయించటం వంటి కొన్ని పనులకు సంబంధించిన జ్ఞాపకాలు నిద్రపోతున్నప్పుడు మెరుగుపడుతున్నట్టు పరిశోధనలో తేలింది. గాఢనిద్ర దశలో జ్ఞాపకాలు మరింత స్థిరంగా కొనసాగుతాయి. రెమ్‌ దశలోనేమో ఈ జ్ఞాపకాల్లో ఒకదాంతో మరోదానికి సంబంధం గల వాటి మధ్య బంధాలు ఏర్పడతాయి. భావోద్వేగ జ్ఞాపకాల విశ్లేషణకూ రెమ్‌ దశ తోడ్పడుతుంది. దీంతో భావోద్వేగాల తీవ్రతా తగ్గుతుంది.

నిజానికి వయసు మీద పడుతున్నకొద్దీ నిద్రా పద్ధతులు కూడా మారుతుంటాయి. దురదృష్టవశాత్తు 30 ల చివర్లో బలమైన జ్ఞాపకాలకు తోడ్పడే నిద్ర తగ్గిపోవటం మొదలవుతుంది. 18-25 ఏళ్ల వారితో పోలిస్తే 60 ఏళ్లు పైబడినవారిలో గాఢనిద్ర 70% వరకు తగ్గిపోతున్నట్టు తాజా అధ్యయనంలో బయటపడింది. ముందురోజు జరిగిన సంఘటనలను గుర్తుకు తెచ్చుకోవటంలో వృద్ధులు చాలా ఇబ్బంది పడుతుంటారని, ఇందుకు గాఢ నిద్ర తగ్గిపోవటంతో సంబంధం ఉంటోందని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్‌ మాథ్యూ వాకర్‌ పేర్కొంటున్నారు. అందువల్ల వృద్ధుల్లో గాఢనిద్రను పెంచటానికి తోడ్పడే పద్ధతుల మీద పరిశోధకులు ఇప్పుడు దృష్టి సారించారు. వృద్ధాప్యంలో జ్ఞాపకశక్తిని పెంపొందించే చికిత్సలు అంతగా అందుబాటులో లేవు. ఈ నేపథ్యంలో నిద్ర సరిగా పట్టే చికిత్సలు రూపొందిస్తే గణనీయమైన ఫలితాలు కనబడతాయని వాకర్‌ చెబుతున్నారు. యువకులు కూడా ముఖ్యంగా విద్యార్థులు.. చదువుకున్న తర్వాత రాత్రిపూట నిద్రపోతే మంచి ఫలితాలు ఉంటాయని, ఆయా విషయాలు బాగా గుర్తుండటానికిది తోడ్పడుతుందని స్టిక్‌గోల్డ్‌ సూచిస్తున్నారు.

చక్కటి నిద్ర సప్త మార్గాలు!

సంపూర్ణ ఆరోగ్యానికి నిద్ర చాలా కీలకం. నిద్రలో శరీరం తిరిగి శక్తిని కూడగట్టుకుంటుంది. దీంతో కొత్త ఉత్సాహం వస్తుంది. నిద్ర సరిగా పట్టకపోతే అలసట, నిస్సత్తువే కాదు.. ఏకాగ్రత కూడా లోపిస్తుంది. ఫలితంగా పని మీద శ్రద్ధ తగ్గిపోతుంది. కానీ ప్రస్తుతం చాలామందికి నిద్ర బంగారమైపోతోంది. పడక మీదికి చేరుకుని గంటలు గడిచినా నిద్రపట్టక సతమతమయ్యేవారు ఎందరో. పని ఒత్తిడి, కుటుంబ బాధ్యతలు, సంబంధ బాంధవ్యాలు, జబ్బులు.. ఇలా చాలా అంశాలు నిద్రను దెబ్బతీయొచ్చు. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే నిద్ర సరిగా పట్టేలా చూసుకోవచ్చు.

* వేళకు పడక: రోజూ ఒకే సమయానికి పడుకోవటం, నిద్రపోవటం అలవాటు చేసుకోవాలి. సెలవురోజుల్లోనూ దీన్ని మానరాదు. దీంతో శరీరంలోని నిద్ర, మెలకువ చక్రం సర్దుకుని రాత్రిపూట నిద్ర బాగా పట్టేలా చేస్తుంది. పడక మీదికి చేరుకున్నాక 15 నిమిషాలైనా నిద్రపట్టకపోతే వెంటనే లేచి, పుస్తకం చదవటం వంటివి చేయాలి. అలసట అనిపించినపుడు పడక మీదికి చేరుకోవాలి.

* తిండిపై కన్ను: కడుపు నిండుగా తిన్నవెంటనే గానీ ఆకలిగా ఉన్నప్పుడు గానీ మంచం ఎక్కొద్దు. ఇవి నిద్రను దెబ్బతీస్తాయి. ఇక ద్రవాలను ఎక్కువగా తీసుకుంటే మధ్యలో లేవాల్సి రావొచ్చు. అలాగే నిద్రపోవటానికి ముందు సిగరెట్లు, కాఫీల జోలికి అసలే వెళ్లరాదు. వీటిల్లోని నికొటిన్‌, కెఫీన్‌ చాలాసేపు మెలకువ ఉండేలా చేస్తాయి. మద్యం తాగితే మొదట్లో నిద్రమత్తు ముంచుకొస్తుంది గానీ మధ్యలో చాలాసార్లు మెలకువ వచ్చేలా చేస్తుంది.

* సన్నద్ధ అలవాట్లు: రోజూ పడక మీదికి చేరటానికి ముందు ఒకేకరకమైన పనులు.. అంటే స్నానం చేయటం, పుస్తకం చదవటం, సంగీతం వినటం వంటివి.. చేస్తే శరీరం నిద్రకు సన్నద్ధమయ్యేలా తయారవుతుంది. కానీ టీవీ, కంప్యూటర్ల వంటి వాటికి దూరంగా ఉండటం మేలు.

* మంచి గది: పడకగది చల్లగా, ప్రశాంతంగా ఉండేలా చూసుకోవాలి. ఎక్కువ వెలుగునిచ్చే లైట్లు ఆర్పేయాలి. అలాగే మంచం, పరుపు వంటివి సౌకర్యవంతంగా ఉండేవి ఎంచుకోవాలి. పిల్లలు, పెంపుడు జంతువులు నిద్ర మధ్యలో లేపకుండా చూసుకోవాలి.

* పగటినిద్ర వద్దు: పగటిపూట ఎక్కువసేపు నిద్రపోతే రాత్రుళ్లు నిద్రపట్టటం కష్టం. ఒకవేళ పగటిపూట కునుకుతీయాలనుకుంటే 10-30 నిమిషాల కన్నా ఎక్కువసేపు పడుకోకూడదు. అయితే రాత్రి షిఫ్టుల్లో పనిచేసేవారు పగటిపూట తగినంత సేపు నిద్రపోయేలా చూసుకోవాలి. ఇలాంటివారు బయటి నుంచి ఎండ లోపలికి పడకుండా కిటికీలకు పరదాలు వేసుకోవాలి.

* వ్యాయామం: రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే త్వరగా నిద్రపట్టటానికే కాదు.. గాఢ నిద్రకూ దోహదం చేస్తుంది. అయితే కాసేపట్లో నిద్రపోతామనగా వ్యాయామం చేయరాదు. ఉదయం పూట వ్యాయామం చేయటం ఉత్తమం.

* ఒత్తిడికి దూరం: పని ఒత్తిడితో పాటు మానసిక ఒత్తిడీ నిద్రకు భంగం కలిగిస్తుంది. అందువల్ల ఒత్తిడిని తగ్గించుకునే మార్గాలపై దృష్టి సారించటం మంచిది. చేయాల్సిన పనులను వర్గీకరించుకోవటం, ప్రాధామ్యాలను గుర్తించటం, లక్ష్యాలను నిర్దేశించుకోవటం వంటివి ప్రశాంతతకు బీజం వేస్తాయి. అవసరమైనప్పుడు తమకు తాముగానే పని నుంచి విశ్రాంతి తీసుకోవటం, స్నేహితులతో సరదాగా గడపటం వంటివి మేలు చేస్తాయి.

స్త్రీ-పురుషుల నిద్ర వేరువేరుగా ఉంటుందా?
నిద్ర.. స్త్రీ పురుషులకి సమానమేనా? ఇంత వరకూ అలాగే భావిస్తూ వచ్చారు శాస్త్రవేత్తలు! అయితే నిద్ర పద్ధతీ, మోతాదూ, గాఢత వంటివన్నీ స్త్రీ పురుషులకి వేర్వేరని చెబుతోంది తాజా అధ్యయనం ఒకటి. అమెరికాకి చెందిన ప్రవాసాంధ్ర శాస్త్రవేత్త మోనికా మల్లంపల్లి నేతృత్వంలోని సొసైటీ ఫర్‌ విమెన్‌ హెల్త్‌ రీసెర్చ్‌ (ఎస్‌డబ్ల్యూహెచ్‌ఆర్‌) ఈ పరిశోధన నిర్వహించింది. మగవారికంటే మహిళల్లో నిద్రలేమి సమస్య ఎక్కువగా ఉందని ఇందులో తేల్చారు. పురుషుల కంటే స్త్రీలు నిద్రలోకి జారుకోవడానికీ ఎక్కువ సమయం పడుతోందని కనిపెట్టారు. పగటివేళ మగతగా ఉందనే ఫిర్యాదూ ఎక్కువగా మన నుంచే ఎదురవుతోందట. వీటన్నింటికీ మహిళల్లోని ప్రత్యేక హార్మోన్ల ప్రభావమే కారణమని చెబుతున్నారు. నెలసరికి ముందూ, నెలసరప్పుడూ స్త్రీలు ఎక్కువగా నిద్రలేమి సమస్య ఎదుర్కొంటున్నారట. పెళ్లయ్యాక గర్భం, కాన్పు తర్వాత శరీరంలో ఏర్పడే పరిణామాలూ, వీటికి తోడు ఇల్లూ, ఉద్యోగ బాధ్యతలూ... ఇవన్నీ స్త్రీల గాఢమైన నిద్ర వేళల్ని హరిస్తున్నాయని పరిశోధన తేల్చింది. పురుషులకు ఇటువంటి సమస్యలు ఎప్పుడో కానీ ఉండవనీ అంటోంది. 'నిద్ర విషయంలో స్త్రీలకు ఇన్ని సమస్యలున్నా, ఇంతవరకూ దానిపై ప్రత్యేకంగా ఆశించినంతగా ఎవరూ దృష్టిపెట్టడంలేదు. నిద్రలేమి పరీక్షలన్నీ కూడా పురుషుల నిద్ర తీరుల్ని దృష్టిలో పెట్టుకునే రూపొందించారు' అంటున్నారు 
ధన్యవాదములు 
మీ నవీన్ నడిమింటి 
విశాఖపట్నం 
9703706660
*సభ్యులకు సూచన*
*************
సమయాభావం వలన వ్యక్తిగతంగా సమాధానాలు ఎవరికీ ఇవ్వడం సాధ్యపడదు. మీ సమస్యకు సరిపడా పరిష్కారాలకొరకు, మీ అవగాహనకొరకు మేము పెడుతున్న సంబంధిత సమాచారంతో కూడిన సవివరమైన పోస్టులు చదవవలసినదిగా ప్రార్థన..

.














25, జూన్ 2020, గురువారం

మానసిక ఒత్తిడి ఎక్కువ అయితే ఏమి జరుగుతుంది


ఒత్తిడి వల్ల ఏం జరుగుతుంది?


నవీన్ నడిమింటి తో ఇంటర్వ్యూ

 ప్రశ్న : ఆధునిక ప్రపంచంలో మానసిక ఒత్తిడికిగురికాకుండా ఉండడం సాధ్యమేనా?
జవాబు : నిజానికి మానసిక ఒత్తిడి అందరికీ ఉంటుంది. విద్యార్ధిపరీక్షల్లో విజయం సాధించాలన్నా, క్రీడాకారుడు తన రంగంలో విజయంసాధించాలన్నా... అంతెందుకు మనం నిత్య జీవితంలో ఏపనిచేయాలన్నా ఒత్తిడి కలుగుతుంది. ఆయా పనులు పూర్తిచేయాలంటే ఎంతోకొంత స్థాయిలో ఒత్తిడి ఉండడం కూడా అవసరమే.ఇప్పుడు మన శరీరంలో ఉష్ణోగ్రత, బిపి అందరికీ ఉంటాయి కదా! అవిమనల్ని మనం రక్షించుకోవడం అవసరం. అలాంటిదే ఒత్తిడి కూడా.అయితే, ఈ ఒత్తిడి సాధారణ స్థాయి కన్నా అధికమైతే... అది క్రానిక్‌గామారితే మన జీవనం అస్తవ్యస్తమవుతుంది. అందుకే మనలో అధికంగాఏర్పడే ఒత్తిడిని సమర్ధవంతంగా మనం ఎదుర్కోగలగాలి.ప్రతివ్యక్తిలోనూ ఏదో ఒక సందర్భంలో తరచుగా ఒత్తిడిఎదుర్కోవడమనేది సాధారణ విషయమే.


ప్రశ్న : ఒత్తిడికి గురైన వ్యక్తులలో శారీరక లక్షణాలుఎలా ఉంటాయి?
జవాబు :  ముఖ్యంగా ఊపిరి వేగంగా తీసుకోవడం, ఒకక్రమపద్ధతిలో శ్వాస తీసుకోలేక అసహనంగా కనిపించడం, దవడ కండరాలు బిగుసుకు పోవడం, మెడ కండరాలుబిగుసుకోవడం, మైగ్రేన్‌, టెన్షన్‌కు తరచుగా లోను కావడం, తల దిమ్ముగా ఉండడం, గుండె వేగంగా కొట్టుకోవడం, చెమటలు పట్టడం, కడుపులో గందరగోళ పరిస్థితులుఏర్పడడం, కండరాలు బిగుసుకుపోవడం, జీర్ణశక్తిమందగించడం, కనుపాపలు పెద్దవి కావడం, పళ్లుబిగపట్టడం ఇలాంటి లక్షణాలను శారీరకంగాగుర్తుపట్టవచ్చు.   

ప్రశ్న : ఒత్తిడికి గురైన వ్యక్తిలో మానసికంగా ఎలాంటిపరిణామాలు సంభవిస్తాయి?
జవాబు : ఎక్కువకాలం స్ట్రెస్‌కు లోనయ్యే వ్యక్తుల్లోముఖ్యంగా ఏకాగ్రతా శక్తి సన్నగిల్లుతుంది. తద్వారా ఏపనిపట్లా శ్రద్ధ పెట్టలేరు. నిశితంగా పరిశీలించే శక్తి, సావధానంగా ఆలోచించే శక్తి తగ్గిపోతుంది. అలాగేజ్ఞాపకశక్తి కూడా చాలా తక్కువ స్థాయిలో పనిచేస్తుంది. విశ్లేషణా శక్తి సన్నగిల్లుతుంది. తద్వారా తమలోని మానసికశక్తిని తక్కువగా వినియోగించుకునే స్థాయికిచేరుకుంటారు. అలాగే వ్యక్తి యొక్క ప్రతిస్పందన వేగంఅనూహ్యంగా పతనమవుతుంది. ఒక సమస్యపరిష్కరించుకునే సందర్భంలో తగిన ప్రతిస్పందనపొందడం తక్కువ స్థాయిలో జరుగుతుంది. తద్వారామానసిక వ్యవస్థ అస్తవ్యస్తంగా మారి, తమకు తామేసమస్యలు సృష్టించుకునే పరిస్థితికి వస్తారు. తరచుగాతప్పులు చేయడం, సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం,విమర్శనాశక్తి లోపించడం, ఆలోచనల్లో గందరగోళంఏర్పడడం, వాస్తవ పరిస్థితులు అర్ధం చేసుకోలేకపోవడం, తరచుగా కోపగించుకోవడం జరుగుతుంది. మానసికంగాఅలిసిపోవడం, ఇతరులను సరిగ్గా అంచనావేయలేకపోవడం, తరచుగా ఇతరులను నిందించడం, ఒక్కోసారి తనను తాను నిందించుకోవడం, మానసికంగాస్థిరంగా లేకపోవడం, సమయపాలన లోపించడం లాంటిలక్షణాలను గమనించవచ్చు.

ప్రశ్న : ఉద్వేగానికి సంబంధించిన మార్పులు ఎలాఉంటాయి?
జవాబు : స్ట్రెస్‌కు లోనైనప్పుడు మానసికంగా, శారీరకంగాతన భద్రతను కాపాడుకునే సందర్భంలో శరీరంలోనికండరాలు బిగుసుకుపోతాయి. బాగా టెన్షన్‌ ఫీల్‌అవుతారు. సహజంగా భయాందోళనలు తగ్గిపోగానే శరీరంమామూలుగా రిలాక్స్‌ అయిపోతుంది. కానీ దీర్ఘకాలంస్ట్రెస్‌కు గురవుతూ ఉంటే రిలాక్స్‌ అయ్యే సామర్ధ్యంతగ్గిపోతుంది. ఉద్వేగపరంగా అదుపు తప్పి కోపం, ద్వేషంలాంటి సమస్యలు ఏర్పడతాయి. తమకు ఏర్పడేపరిస్థితులను ప్రభావితం చేయగలగడం, వివిధ సందర్భాల్లోవాటిని నియంత్రించే సామర్ధ్యం తగ్గిపోతుంది. తరచుగాయాంగ్జైటీకి, భయాందోళనలకు లోనవుతుంటారు. అభద్రతా భావన, నిస్సహాయత, చనిపోతానేమోననేభయం, చికాకు, కోపం, డిప్రెషన్‌ లక్షణాలు గమనించవచ్చు.

ప్రశ్న : వ్యక్తి ప్రవర్తనలో ఎలాంటి మార్పులువస్తాయి?
జవాబు : స్ట్రెస్‌ క్రానిక్‌గా మారడం వల్ల ప్రవర్తనలో చాలామార్పు కనిపిస్తుంది. మాట్లాడేటప్పుడు తడబాటు నత్తిఅధికమవుతుంది. ఉద్యోగాలకు ఆలస్యంగా వెళ్లడం, ఎక్కువగా సెలవులు పెట్టడం, బాధ్యతలు సరిగ్గానిర్వర్తించలేకపోవడం, స్మోకింగ్‌, డ్రగ్స్‌, ఆల్కహాల్‌కుఅలవాటు పడడం, నిద్రకు సంబంధించిన సమస్యలతోబాధపడడం, తీవ్రమైన సంఘర్షణను అనుభవించిఆత్మహత్యలకు పాల్పడడం వంటివి జరిగే అవకాశం ఉంది.కొంతమంది మేనరిజమ్స్‌లో విపరీతంగా ఏర్పడుతుంది.

ప్రశ్న : బాల్యంపై ఒత్తిడి చూపే ప్రభావం ఏమిటి?
జవాబు : తల్లిదండ్రులలో ఉండే ఉద్వేగాలు, కోపతాపాలుపిల్లలపై ప్రభావాన్ని చూపిస్తాయి. పిల్లల్ని తిట్టడం, కొట్టడం, సరిగా పట్టించుకోకపోవడం, తద్వారా పిల్లలు మానసికంగాఒత్తిడికి లోనవుతూ ఉంటారు. ఒక్కోసారి విపరీతపరిణామాల వల్ల డిప్రెషన్‌కు కూడా లోనవుతారు. అలాగేబీదరికం, అధిక జనాభా వల్ల కూడా పిల్లల్లో ఒత్తిడిఏర్పడుతుంది. సాధారణంగా బాలికల్లో మానసిక ఒత్తిడిఎక్కువగా ఉంటుంది. పరీక్షల సమయంలో, స్కూలుమారినప్పుడు, ఇంట్లో పరిస్థితులు మారినప్పుడు పిల్లలుఅధికంగా ఒత్తిడికి లోనవుతూ ఉంటారు. అది వారిభవిష్యత్తుపై చెడు ప్రభావాన్ని కలిగిస్తుంది.

ప్రశ్న : పెద్దల్లో ఒత్తిడి ప్రభావం గురించి చెప్పండి.
జవాబు : భార్య భర్తల మధ్య వివాదాలుచోటుచేసుకోవడం, ఒకరినుంచి ఒకరు దూరమై పోవడం,ఒకరు చనిపోవడం, దీర్ఘకాలిక అస్వస్థతకు లోనుకావడం, ఆర్ధిక ఇబ్బందులు, పిల్లల పెంపకంలో వచ్చే సమస్యలువీరిలో ఎక్కువగా స్ట్రెస్‌కు సంబంధించిన సమస్యల్లోముఖ్యంగా ఆందోళన, గుండెజబ్బులు, మైగ్రేన్‌, తలనొప్పులు, గ్యాస్ట్రిక్‌ ప్రాబ్లమ్స్‌, నిద్రపట్టకపోవడం లాంటిసమస్యలు అధికంగా ఉంటాయి.

ప్రశ్న: పనిచేసే ప్రదేశాలలో ఒత్తిడి ఎలా ఉంటుంది?
జవాబు : పనిచేసే ప్రదేశాలలో వ్యవస్థలోని లోపాల వల్లవ్యక్తి కార్యనిర్వహణా సామర్ధ్యం, నిర్ణయాలు తీసుకోవడం, ప్రణాళికలు రూపొందించడంలో ఒత్తిడి అధికమవుతూఉంటుంది. అలాగెే పనిచేసేచోట తగిన సిబ్బందిలేకపోవడం, క్రింది ఉద్యోగులు చేయాల్సిన పనులు కూడామనమీదే పడడం లేదా పై అధికారులు చేయాల్సిననిర్ణయాలు మనమీద పడ్డప్పుడు తీవ్ర ఒత్తిడికిలోనవుతారు. సిబ్బంది సహకారం లేకపోవడం, ఓవర్‌టైమ్‌లు ఎక్కువగా చేయడం, నిద్ర, విశ్రాంతి సరిగాలేకపోవడం.
హోదా, జీతం, ప్రమోషన్లు కూడా మనసుపై ఒత్తిడికికారణమవుతూ ఉంటాయి. వ్యక్తిగత సామర్ధ్యం ఎంతగాఉన్నప్పటికీ, తగిన హోదాను కల్పించకపోవడం, సీనియారిటీ ఉన్నా అవకాశం కల్పించకపోవడం, రివార్డులు, అవార్డులు కల్పించకపోవడం కొంతమంది ఉద్యోగస్తులలోఅభద్రతా భావం ఉంటుంది. ఉద్యోగాలు ఎప్పుడుఊడిపోతాయో తెలియని భయంతో ఉంటారు. అలాగేపనిలో ఎదురయ్యే సవాళ్లు కూడా ఒత్తిడిని కలగచేస్తాయి.కొంతమంది ఉద్యోగులు తమ సంస్థల్లో కీలకమైన పాత్రలునిర్వహించలేకపోతున్నామనే మనోవ్యధకు తరచూలోనవుతూ ఉంటారు. సంస్థ చెందిన అత్యంత కీలకమైననిర్ణయాలు తీసుకునే ఉద్యోగస్తులు, అధికారులు తమపదవులు నిర్వ హించడం స్ట్రెస్‌తో కూడుకున్నదే. ఇలాంటిపరిస్థితుల్లో వారికి పూర్తి అధికార హోదాలు లేకపోతేవిపరీతమైన ఒత్తిడికి గురవుతారు. కమ్యూనికేషన్‌ స్కిల్స్‌, తగిన నాయకత్వం లేకపోయినా, తగిన శిక్షణ లేకపోయినాసహోద్యోగులతో ఘర్షణ ఉన్నా మానసిక ఒత్తిడిఏర్పడుతుంది.

ప్రశ్న : మానసిక ఒత్తిడి క్రానిక్‌గా మారడం వల్లఎలాంటి జబ్బులు వస్తాయి?
జవాబు : ఒత్తిడికి సంబంధించిన జబ్బులను గురించిచెప్పుకోవాలంటే... కడుపులో మంట ఎక్కువకావడం, అల్సర్లు, ఇరిటబుల్‌ బవుల్‌ సిండ్రోమ్‌ వంటివికలుగుతాయి. ఒక్కోసారి ఆకలి వెయ్యదు. మ్యారలాజికల్‌డిస్టర్బెన్స్‌, ఆందోళన, కంగారు, భయం, చెమటలు పట్టడం,నిద్రపట్టకపోవడం, భయంకరమైన కలలు రావడం, గుండెజబ్బులు, ఊపిరి తిత్తులకు సంబంధించినసమస్యలు వస్తాయి. కొన్ని రకాలైన చర్మవ్యాధులురావడానికి కూడా ఒత్తిడి కారణమవుతూ ఉంటుంది. అలాగే రోగనిరోధక శక్తిపై కూడా ఒత్తిడి ప్రభావం ఉంటుంది. వ్యాధి నిరోధక శక్తి తక్కువ కావడం వల్ల తరచుగాఇన్‌ఫెక్షన్లకు గురవుతూ ఉంటారు. బరువు తగ్గడం, బరువుపెరగడం, తిండి అలవాట్లు మారతాయి. ఎక్కువగా ఒత్తిడికిలోనైతే కండరాల నొప్పులు, కీళ్లనొప్పులు ఎక్కువఅవుతాయి. డయాబెటిక్స్‌లో సుగర్‌ శాతం ఎక్కువఅవుతుంది. ఇలా అనేక రకాల రుగ్మతలు మానసిక ఒత్తిడిఅధికంగా ఉండడం వల్ల ఏర్పడుతుంటాయి.

ప్రశ్న : సెక్స్‌పై ఒత్తిడి ప్రభావం ఎలాంటిది?
జవాబు : మానసిక ఒత్తిడి వల్ల కోరిక తగ్గుతుంది.భారభర్తల సుఖసంసారానికి ఇది అవరోధం. స్త్రీలలో కూడాశృంగార జీవితంలో సంతృప్తి ఉండకపోవచ్చు. ప్రీమెన్‌స్ట్రువల్‌ సిండ్రోమ్‌ కల స్త్రీలలో ఒత్తిడి లక్షణాలుఅధికంగా ఉంటాయి. అధిక మానసిక ఒత్తిడి వల్ల స్త్రీలలోసంతాన సాఫల్యతపై కూడా ప్రభావాన్ని చూపుతుందనిపరిశోధనలు చెబుతున్నాయి.

ప్రశ్న : మహిళల్లో మానసిక ఒత్తిడి ప్రభవాన్నిగురించి వివరంగా చెప్పండి.
జవాబు : ఒత్తిడికి ఆడామగా తేడాలుండవు. సాధారణగృహిణి కంటే ఉద్యోగాలు చేసేవారిలో ఎక్కువ ఒత్తిడిఉంటుంది. ఇంటి పనులు చక్కబెట్టుకుంటూనే సరైన టైంకిఉద్యోగానికి వెళ్లాలి. దారిలో ట్రాఫిక్‌ జామ్‌, ఈవ్‌ టీజింగ్‌.... పనిచేసే చోట లింగవివక్ష, వేధింపులు, పనిభారం వీరిలోమానసిక ఒత్తిడి పెరగడానికి కారణమవుతూ ఉంటుంది. దీనివల్ల తరచుగా అనారోగ్యం బారిన పడుతూ ఉంటారు.పిల్లలతోనూ, భర్తతోనూ దగ్గరితనం లేకుండా పోతుంది. చాలామంది స్త్రీలలో కోపం పెరుగుతూ ఉంటుంది.ఎప్పుడూ టెన్షన్‌, నిద్రపట్టకపోవడం, పిల్లల పెంపకంగురించి ఆదుర్దా చెందడం వంటివి జరుగుతాయి.

ప్రశ్న : జ్ఞాపకశక్తిపై ఒత్తిడి ప్రభావం ఎంత?
జవాబు : జ్ఞాపకశక్తి, ఏకాగ్రత, అధ్యయనం... అన్నింటిమీదాఒత్తిడి ప్రభావం చాలాఎక్కువగానే ఉంటుంది. చేసేపనిమీద శ్రద్ధ తగ్గుతుంది. ఏకాగ్రత లోపం వల్లయాక్సిడెంట్లు జరుగుతాయి. లాంగ్‌ టర్మ్‌, షార్ట్‌ టర్మ్‌, వర్కింగ్‌ మెమరీ.... ఇలా అన్నింటిలోనూ స్థాయి తగ్గిపోతూఉండడం గమనించవచ్చు. ఒత్తిడి వల్ల విద్యార్ధులు పరీక్షల్లోరాణించలేరు.

ప్రశ్న : గర్భిణీ స్త్రీలపై మానసిక ఒత్తిడి ప్రభావం ఎలాఉంటుంది?
జవాబు : గర్భవతులు ఎప్పుడూ మనసును ప్రశాంతంగాఉంచుకోవాలి. ఏవిధమైన ఆందోళనలకు గురికాకూడదనిమన పెద్దలు చెబుతుండేవారు. ఆధునిక శాస్త్రీయపరిశోధనలు కూడా అదే చెబుతున్నాయి. మానసిక ఒత్తిడివల్ల గర్భస్రావం అయ్యేందుకు 50% వరకూ అవకాశంఉంది. లోపలి బిడ్డ ఎదుగుదలపై కూడా ఒత్తిడి ప్రభావంఉంటుందని శాస్త్రజ్ఞులు అంటున్నారు. తల్లి మానసికంగాతరచుగా ఆందోళనకు గురవుతూ ఉంటే, ఒత్తిడికి లోనైనాపుట్టబోయే బిడ్డ బ్రెయిన్‌ ఎదుగుదలపై కూడా ప్రభవాన్నిచూపుతుందని పరిశోధకులు పేర్కొంటున్నారు.

ప్రశ్న : అందరూ స్ట్రెస్‌కు లోనవుతారా?
జవాబు : తప్పకుండా. ఏదో ఒక సందర్భంలో ప్రతివ్యక్తిస్రెస్‌కు లోనవుతూనే ఉంటారు. అయితే కొంతమంది వారిమానసిక శక్తి వల్ల ఒత్తిడిని తట్టుకోగలుగుతారు. కొంతమంది చిన్న ఒత్తిడికే అప్‌సెట్‌ అయిపోతూ ఉంటారు.స్ట్రెస్‌ను ఎదుర్కోవడంలో వ్యక్తుల మధ్య తేడా ఉంటుంది.
మానసిక ఒత్తిళ్లకు, గుండెజబ్బులకు ఉన్న సంబంధంపైఫ్రీడ్‌మెన్‌, రోస్‌మెన్‌ అనే ఇద్దరు అమెరికన్‌ కార్డియాలజిస్టులు విస్తృతంగా పరిశోధనలు చేశారు. వీరువ్యక్తులను టైప్-ఎ, టైప్‌-బిలుగా వర్గీకరించారు. టైప్‌`ఎపర్సనాలిటీ కలిగిన వ్యక్తులు జీవితంలో విశ్రమించరు. ఎప్పుడూ వారికి తొందరే. అనేక విషయాలను గురించిఆలోచిస్తూ ఉంటారు. వారు జీవితంలో చాలా పెద్ద పనులునెత్తిన పెట్టుకుంటారు. అపజయాన్ని అంగీకరించరు. కోపంఎక్కువ. ఎప్పుడూ మానసిక ఒత్తి‌ళ్లతో సతమతమవుతూఉంటారు. ఇలాంటి మనస్తత్వం గల వారికి గుండెజబ్బులువచ్చే అవకాశం ఉందని వారి పరిశోధనలో వెల్లడైంది.
టైప్‌ - బి పర్సనాలిటీ గల వ్యక్తులు ఎప్పుడూ ఉల్లాసంగాఉంటారు. విశ్రాంతికి ఎక్కువ విలువ ఇస్తారు. నిదానంగాఆలోచిస్తారు. జరిగేది జరగక మానదు. నిదానంగాకారణాలు పరిశీలించాలంటారు. ఓటమిని అంగీకరిస్తారు. ఓర్పు, సహనంతో ఉంటారు. ఇలాంటి వ్యక్తుల్లోగుండెజబ్బులు వచ్చే శాతం చాలా తక్కువ అని తేలింది.

ప్రశ్న : మానసిక ఒత్తిడిని ఎలా అదుపులోఉంచుకోవాలి... రిలాక్సేషన్‌ పద్ధతులు ఏమిటి?
జవాబు : స్ట్రెస్‌ను అదుపులో ఉంచుకోవడానికి పళ్లు, పచ్చికూరగాయలు తీసుకోవాలి. ధూమపానం, మద్యపానం వదిలేయాలి. బాగా వ్యాయామం చేయాలి.యాక్టివ్‌ లైఫ్‌ స్టైల్‌ అలవాటు చేసుకోవాలి. ఎక్కువసేపుకూర్చుని పనిచేసే అలవాటు మార్చుకోవాలి. ఫిజికల్‌గాయాక్టివ్‌గా ఉన్నవారిపై స్ట్రెస్‌ ఎక్కువ ప్రభావం చూపించదు. అయితే అతి వ్యాయామం పనికిరాదు. ఉదయం, సాయంత్రం నడక చాలా మంచి రిలాక్సేషన్‌ ఇస్తుంది.జిమ్‌కు వెళ్లడం, స్విమ్మింగ్‌ చేయడం కూడా మంచిరిలాక్సేషన్‌ ఇస్తుంది. యోగా, మెడిటేషన్‌ ప్రాక్టీస్‌ చేయడంకూడా మంచిదే. ప్రోగ్రెసివ్‌ మజిల్‌ రిలాక్సేషన్‌, సెల్ఫ్‌ హిప్నాసిస్‌, జాకబేసన్‌ రిలాక్సేషన్‌, ఆటోజెనిక్స్‌ ద్వారామంచి రిలాక్సేషన్‌ పొందవచ్చు.
అలాగే టైమ్‌ మేనేజ్‌మెంట్‌, స్కిల్స్‌ ట్రయినింగ్‌, ఎసెర్టివ్‌ బిహేవియర్‌, ప్లానింగ్‌, డెసిషన్‌ మేకింగ్‌, నెగెటివ్‌ ఎమోషన్స్‌ను కంట్రోల్‌ చేయడం ద్వారా ప్రశాంత జీవనాన్నిఅలవాటు చేసుకోవచ్చు.
సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనడం, మీకున్న హాబీలనుఅభివృద్ధి చేసుకోవడం, కుటుంబ సభ్యులతో, స్నేహితులతోసరదాగా గడపడం, పిల్లలతో సరదాగా గడపడం, సంగీతం, సాహిత్యం, నృత్యం, పెయింటింగ్‌, కుట్లు, అల్లికలు, ప్రకృతిఆరాధన ఇలంటివి అన్నీ రిలాక్స్‌ అయ్యేందుకు దోహదపడతాయి.
మంచి గృహవాతావరణం, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ కోపాన్నిఅదుపులో ఉంచుకోవడం, హ్యూమన్‌ రిలేషన్స్‌నుపెంపొందించుకోవడం, సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం వల్లమంచి విశ్రాంతి, ఆనందం కలుగుతాయి.
ఇంకా తీవ్రంగా ఉండే సమస్యలకు సైకాలజిస్ట్‌ ద్వారాకౌన్సిలింగ్‌ తీసుకోవడం, సైకియాట్రిస్ట్‌ ద్వారా మందులువాడడం వల్ల స్ట్రెస్‌కి సంబంధించిన సమస్యలనుఅధిగమించి రిలాక్స్‌ అవ్వచ్చు.
ధన్యవాదములు 
మీ నవీన్ నడిమింటి 
విశాఖపట్నం 
9703706660
*సభ్యులకు సూచన*
*************
సమయాభావం వలన వ్యక్తిగతంగా సమాధానాలు ఎవరికీ ఇవ్వడం సాధ్యపడదు. మీ సమస్యకు సరిపడా పరిష్కారాలకొరకు, మీ అవగాహనకొరకు మేము పెడుతున్న సంబంధిత సమాచారంతో కూడిన సవివరమైన పోస్టులు చదవవలసినదిగా ప్రార్థన..

.

ఈ బిజీ జీవితంలో రిలేకేషన్ అవ్వడం ఎలా నవీన్ సలహాలు


రిలాక్సేషన్‌ టెక్నిక్స్‌ అవగాహనా కోసం నవీన్ నడిమింటి సలహాలు 

ప్రోగ్రెసివ్‌ మస్క్యులర్‌ రిలాక్సేషన్‌ 
దైనందిన జీవితంలో రిలాక్సేషన్‌ భాగం కావాలి.  దానిమూలంగా మీలో వున్న అన్ని రకాల టెన్షన్లు తగ్గుముఖం పడతాయి. రిలాక్సేషన్‌ కోసం అనేక టెక్నిక్స్‌ ఉన్నాయి. ప్రోగ్రెసివ్‌ మస్క్యులర్‌ రిలాక్సేషన్‌ టెక్నిక్‌ను కనిపెట్టినవాడు ఎడ్మెండ్‌ జాకబ్‌సన్‌. అతని ప్రతిపాదించిన సిద్ధాంతానికి    మరికొంత మెరుగులు దిద్దిన రూపం ఇది. చదవండి.  ట్రైనింగ్‌ తీసుకోండి.  సాధన చేయండి. 
మీరు రిలాక్స్‌ కాబోయే రూం విశ్రాంతికి తగినదిగా ఉండాలి. మంచిగాలి, సరిపడేలా వెలుతురు ఉండాలి. ధ్వనికాలుష్యం ఉండకూడదు. వాలుకుర్చీ మీద, లేకపోతే చాపమీద కూర్చోవచ్చు. లేదా అనుకూలమైన నిటారుగా ఉండే కుర్చీమీద కూర్చోపెట్టి తలకింద దిండు వుంచాలి. దిండుకు తల ఆనించి రిలాక్స్‌ కావడానికి వీలుండాలి. లూజుగా ఉండే దుస్తులు ధరించండి. కాళ్లకు చెప్పులు వద్దు. కండరాలు రిలాక్సేషన్‌ చేసే సమయంలో కొన్ని కండరాలు గ్రూపుల మీద కేంద్రీకరించాల్సి ఉంటుంది. ఇందులో అయిదు భాగాలున్నాయి.
1. ఫోకస్‌ అంటే మనసును కండరాల సముదాయం మీద ఫోకస్‌ చేయడం.
2. కండరాల సముదాయాన్ని బిగపెట్టగలగాలి.
3. బిగపెట్టిన కండరాలను 5 నుంచి 7 సెకన్ల వరకూ ఒత్తిడిని అదే స్థితిలో ఉంచగలగాలి.
4. రిలీజ్‌ ` కండరాల సముదాయం మీద ఉంచిన ఒత్తిడిని రిలీజ్‌ చేయడం.
5. రిలాక్స్‌ ` టెన్షన్‌ను క్రమేపీ విడుదల చేయడం. 
ఈ అయిదు భాగాలు ఒక సైకిల్‌ లాంటివి. ప్రతిసారీ ఇవి అమలు జరగాలి.



స్టెప్‌ ` 1
భుజాలను, చేతులను రిలాక్స్‌ చేయడం (6 నిమిషాలు)

మొదటిగా ఎడమ పిడికిలిని బిగించండి.
గట్టిగా బిగించండి. ఎడమ చేతి కండరాలు ఎంత బిగిగా ఉన్నాయో గమనించండి.
సడలించండి కండరాలని.
మీ ఎడమ చేతి కండరాలు ఎంత రిలాక్స్‌డ్‌గా ఉన్నాయో గమనించండి.
ఇప్పుడు కుడి పిడికిలిని బిగించండి. గట్టిగా బిగించండి.
కుడి చేతిలోని కండరాలను, గమనించండి. అవి ఎంత గట్టిగా వున్నాయో గమనించండి. 
ఇప్పుడు వాటిని సడలించండి.
మీ కుడిచేతి కండరాలు ఎంత రిలాక్స్‌డ్‌గా ఉన్నాయో గమనించండి.
ఇప్పుడు మీరు రెండు చేతి పిడికిళ్లను గట్టిగా బిగించండి.
రెండు చేతుల్లోని కండరాల బిగిని గమనించండి.
ఇప్పుడు కండరాల బిగిని సడలించండి.
రెండు చేతుల్లోని కండరాల్లోని రిలాక్సేషన్‌ గమనించండి.
ఎడమ చేతిని మోచేతి వరకూ వంచండి.
ఎడమచేతి కండరాల బిగిని గమనించండి.
సడలించండి కండరాల బిగిని.
ఇప్పుడు గమనించండి మీ ఎడమచేతి కండరాలలోని రిలాక్సేషన్‌ను.
ఇప్పుడు కుడిచేతిని మోచేతివరకూ వంచండి.
కుడిచేతి కండరాల బిగిని గమనించండి.
మీ కుడిచేతి కండరాలలోని రిలాక్సేషన్‌ను గమనించండి.
ఇప్పుడు మీరు రెండు చేతులను మోచేతి వరకూ వంచండి.
మీ రెండు చేతులలోని కండరాల బిగిని గమనించండి.
ఇప్పుడు కండరాల బిగిని సడలించండి.
మీ రెండు చేతుల కండరాలలోని రిలాక్సేషన్‌ను గమనించండి.

స్టెప్‌ 2
కాళ్ల రిలాక్సేషన్‌ (7 నిమిషాలు)
ఎడమ పాదాన్ని నిలువుగా పైకి లేపండి.
ఎడమ కాలిలోని కండరాల బిగిని గమనించండి.
బిగిని సడలించండి.
మీ ఎడమ పాదంలోని కండరాలలో రిలాక్సేషన్‌ను గమనించండి.
ఇప్పుడు మీ ఎడమ పాదాన్ని కిందకు వంచండి.
మీ ఎడమ పాదంలోని కండరాల బిగిని గమనించండి.
బిగిని సడలించండి.
మీ ఎడమ పాదంలోని కండరాలలోని రిలాక్సేషన్‌ను గమనించండి.
మీరిప్పుడు కుడిపాదాన్ని నిలువుగా పైకి లేపండి. 
కుడి పాదంలోని కండరాలలోని రిలాక్సేషన్‌ గమనించండి.
మీరు మీ కుడి పాదాన్ని కిందకు వంచండి.
కుడిపాదంలోని కండరాల బిగిని గమనించండి.
కండరాల బిగిని సడలించండి.
మీ కుడిపాదంలోని కండరాలలోని రిలాక్సేషన్‌ను గమనించండి.
మీరు మీ ఎడమ కాలుని మోకాలు వరకు వంచండి. కండరాలను బిగించండి. కాలు, తొడల కండరాల బిగిని గమనించండి.
కండరాల బిగిని సడలించండి.
ఇప్పుడు మీ ఎడమకాలు, తొడలలోని కండరాలలోని రిలాక్సేషన్‌ను గమనించండి. ఇప్పుడు మీరు కుడికాలుని మోకాలు వరకూ వంచండి. కండరాలను గట్టిగా బిగించండి.
కుడికాలు, తొడలలోని కండరాల బిగిని గమనించండి.
కండరాల బిగిని సడలించండి. 
ఇప్పుడు మీ కుడికాలు, తొడలలోని కండరాలలోని రిలాక్సేషన్‌ను గమనించండి.
మీరు రెండు కాళ్లు, మోకాళ్ల వరకు వంచండి. కండరాలను బిగించండి.
మీరు మీ రెండు కాళ్లు, రెండు తొడలలోని కండరాల బిగిని గమనించండి. బిగిని సడలించండి.
ఇప్పుడు మీ రెండు కాళ్లు, రెండు తొడలలోని కండరాలలోని రిలాక్సేషన్‌ను గమనించండి.

స్టెప్‌ 3. (5 నిమిషాలు)
ముఖములోని నుదురు భాగాన్ని, కళ్ల రెప్పలను పైకెత్తి అక్కడి కండరాలను బిగించండి. అక్కడి ముడతలను గమనించండి.
ఫాల భాగంలోని కండరాల బిగిని గమనించండి.
కండరాల బిగిని సడలించండి.
ఫాలభాగంలోని కండరాల రిలాక్సేషన్‌ను గమనించండి.
కళ్లరెప్పలను వాల్చండి. ముఖంలోని జుగుప్సను గమనించండి.
ఫాలభాగంలోని కళ్ల పక్కని వున్న కండరాల బిగిని గమనించండి.
బిగిని సడలించండి.
ఫాలభాగంలోని కండరాలలోని రిలాక్సేషన్‌ను గమనించండి.
మీరు మీ రెండు కళ్లను గట్టిగా మూసుకోండి.
ఫాలభాగంలోని కళ్ల చుట్టూగల కండరాల బిగిని గమనించండి.
సడలించండి కండరాల బిగిని.
ఫాలభాగంలోని కళ్ల చుట్టూవున్న కండరాలలోని రిలాక్సేషన్‌ను గమనించండి.
మీరు మీ దవడను గట్టిగా బిగించండి.
దవడ చుట్టూవున్న కండరాలలోని రిలాక్సేషన్‌ను గమనించండి. 
మీరు మీ పెదాలను గట్టిగా అదిమి వుంచండి.
మీ పెదిమల చుట్టూవున్న కండరాల బిగిని గమనించండి.
బిగిని సడలించండి.
మీ పెదాల చుట్టూ గల కండరాలలోని రిలాక్సేషన్‌ను గమనించండి.

స్టెప్‌ 4 : మెడ, భుజాలు (6 నిమిషాలు)
మీరు నెమ్మదిగా మీ మెడను ముందుకు వంచండి.
మెడ కండరాల బిగిని గమనించండి.
బిగిని సడలించండి.
మెడ కండరాలలోని రిలాక్సేషన్‌ను గమనించండి.
మెడను మెల్లిగా వెనుకకు వంచండి.
మెడలోని కండరాల బిగిని గమనించండి.
మెడ కండరాలను సడలించండి.
మెడ కండరాలలోని రిలాక్సేషన్‌ను గమనించండి.
మెడను నెమ్మదిగా కుడి పక్కకు వంచండి.
మెడ కండరాల బిగిని గమనించండి.
మెడ కండరాలను సడలించండి.
మెడ కండరాలలోని రిలాక్సేషన్‌ను గమనించండి.
మీ మెడను నెమ్మదిగా ఎడమ పక్కకు వంచండి.
మెడ కండరాల బిగిని గమనించండి.
మెడ కండరాల బిగిని సడలించండి.
మెడ కండరాలలోని రిలాక్సేషన్‌ను గమనించండి.
మీరు మీ ఎడమ భుజాన్ని పైకి లేపండి. మీ చెవి వరకు.
మీ ఎడమ భుజాల కండరాల బిగిని గమనించండి.
బిగిని సడలించండి.
మీ ఎడమ భుజ కండరాలలోని రిలాక్సేషన్‌ను గమనించండి.
మీరు మీ కుడి భుజాన్ని పైకి, చెవి వరకు లేపండి.
మీ కుడిభుజం కండరాల బిగిని గమనించండి.
కండరాల బిగిని సడలించండి.
ఇప్పుడు మీ కుడి భుజ కండరాలలోని రిలాక్సేషన్‌ను గమనించండి.

స్టెప్‌ 5 : నడుం రిలాక్సేషన్‌ (2 నిమిషాలు)
మీరు బాగా గాలిని లోనికి పీల్చుకుని గుండెను దృఢ పరుచుకోండి. అంటే గుండెలోని కండరాలను బిగించండి.
గుండెలోని కండరాలు బిగించండి.
ఇప్పుడు సడలించండి.
గుండెలోని కండరాలలోని రిలాక్సేషన్‌ను గమనించండి.
పొట్టలోని కండరాలు బిగిసేలాగా బాగా గాలిని వదలండి.
పొట్టలోని కండరాల బిగువును గమనించండి.
బిగువును సడలించండి.
పొట్టలోని కండరాలలో రిలాక్సేషన్‌ను గమనించండి.

స్టెప్‌ 6 : శరీరం మొత్తంగా రిలాక్స్‌ కావాలి (4 నిమిషాలు)
మనం మనకి ఈ కింది విధంగా ఆటో సజెషన్స్‌ ఇచ్చుకుందాం.
నా పాదాలు రిలాక్స్‌డ్‌గా, ఆరోగ్యవంతంగా వున్నాయి.
నా మోచేతులు రిలాక్స్‌గా ఆరోగ్యంగా ఉన్నాయి.
నా కాళ్లు రిలాక్స్‌డ్‌గా ఆరోగ్యంగా ఉన్నాయి.
నా మోకాళ్లు రిలాక్స్‌డ్‌గా ఆరోగ్యంగా ఉన్నాయి. 
నా తొడలు రిలాక్స్‌డ్‌గా ఆరోగ్యవంతంగా ఉన్నాయి.
నా పిరుదులు, ఆసనం రిలాక్స్‌డ్‌గా ఆరోగ్యంగా ఉన్నాయి. 
నా పొత్తికడుపు అందలి భాగాలు రిలాక్స్‌డ్‌గా ఆరోగ్యంగా ఉన్నాయి. 
నా గుండె అందలి భాగాలు రిలాక్స్‌డ్‌గా ఆరోగ్యంగా ఉన్నాయి. 
నా భుజాలు రిలాక్స్‌డ్‌గా ఆరోగ్యంగా ఉన్నాయి. 
నా చేతులు రిలాక్స్‌డ్‌గా ఆరోగ్యంగా ఉన్నాయి. 
నా మోచేతులు రిలాక్స్‌డ్‌గా ఆరోగ్యంగా ఉన్నాయి. 
నా ముంజేతులు రిలాక్స్‌డ్‌గా ఆరోగ్యంగా ఉన్నాయి. 
నా మణికట్లు రిలాక్స్‌డ్‌గా ఆరోగ్యంగా ఉన్నాయి. 
నా చేతులు రిలాక్స్‌డ్‌గా ఆరోగ్యంగా ఉన్నాయి. 
నా మెడ రిలాక్స్‌డ్‌గా ఆరోగ్యంగా ఉంది. 
నా ముఖం రిలాక్స్‌డ్‌గా ఆరోగ్యంగా ఉన్నాయి. 
నా మైండ్‌ రిలాక్స్‌డ్‌గా ఆరోగ్యంగా ఉంది.
ధన్యవాదములు 
మీ నవీన్ నడిమింటి 
విశాఖపట్నం 
9703706660
*సభ్యులకు సూచన*
*************
సమయాభావం వలన వ్యక్తిగతంగా సమాధానాలు ఎవరికీ ఇవ్వడం సాధ్యపడదు. మీ సమస్యకు సరిపడా పరిష్కారాలకొరకు, మీ అవగాహనకొరకు మేము పెడుతున్న సంబంధిత సమాచారంతో కూడిన సవివరమైన పోస్టులు చదవవలసినదిగా ప్రార్థన..

.

డాపత్యం జీవితంలో ఒత్తిడి సమస్య నుండి ఎలా బయట పడాలి ఈ లింక్స్ లో చూడాలి


దాంపత్యంలో....ఒత్తిడి సమస్య పై నవీన్ నడిమింటి సలహాలు 


సెక్స్‌పై ఒత్తిడి ప్రభావం 
మానసిక ఒత్తిడి వల్ల కోరిక తగ్గుతుంది. భారభర్తలసుఖసంసారానికి ఇది అవరోధం. స్త్రీలలో కూడా శృంగారజీవితంలో సంతృప్తి ఉండకపోవచ్చు. ప్రీమెన్‌స్ట్రువల్‌ సిండ్రోమ్‌ కల స్త్రీలలో ఒత్తిడి లక్షణాలు అధికంగా ఉంటాయి. అధిక మానసిక ఒత్తిడి వల్ల స్త్రీలలో సంతాన సాఫల్యతపైకూడా ప్రభావాన్ని చూపుతుందని పరిశోధనలుచెబుతున్నాయి.

మహిళల్లో మానసిక ఒత్తిడి ప్రభావం
ఒత్తిడికి ఆడామగా తేడాలుండవు. సాధారణ గృహిణి కంటేఉద్యోగాలు చేసేవారిలో ఎక్కువ ఒత్తిడి ఉంటుంది. ఇంటిపనులు చక్కబెట్టుకుంటూనే సరైన టైంకి ఉద్యోగానికివెళ్లాలి. దారిలో ట్రాఫిక్‌ జామ్‌, ఈవ్‌ టీజింగ్‌.... పనిచేసేచోట లింగవివక్ష, వేధింపులు, పనిభారం వీరిలో మానసికఒత్తిడి పెరగడానికి కారణమవుతూ ఉంటుంది. దీనివల్లతరచుగా అనారోగ్యం బారిన పడుతూ ఉంటారు. పిల్లలతోనూ, భర్తతోనూ దగ్గరితనం లేకుండా పోతుంది. చాలామంది స్త్రీలలో కోపం పెరుగుతూ ఉంటుంది.ఎప్పుడూ టెన్షన్‌, నిద్రపట్టకపోవడం, పిల్లల పెంపకంగురించి ఆదుర్దా చెందడం వంటివి జరుగుతాయి.


గర్భిణీ స్త్రీలపై మానసిక ఒత్తిడి ప్రభావం 
 గర్భవతులు ఎప్పుడూ మనసును ప్రశాంతంగాఉంచుకోవాలి. ఏవిధమైన ఆందోళనలకు గురికాకూడదనిమన పెద్దలు చెబుతుండేవారు. ఆధునిక శాస్త్రీయపరిశోధనలు కూడా అదే చెబుతున్నాయి. మానసిక ఒత్తిడివల్ల గర్భస్రావం అయ్యేందుకు 50% వరకూ అవకాశంఉంది. లోపలి బిడ్డ ఎదుగుదలపై కూడా ఒత్తిడి ప్రభావంఉంటుందని శాస్త్రజ్ఞులు అంటున్నారు. తల్లి మానసికంగాతరచుగా ఆందోళనకు గురవుతూ ఉంటే, ఒత్తిడికి లోనైనాపుట్టబోయే బిడ్డ బ్రెయిన్‌ ఎదుగుదలపై కూడా ప్రభవాన్నిచూపుతుందని పరిశోధకులు పేర్కొంటున్నారు.


32. లైంగిక సమస్యల ద్వారా ఏర్పడే ఒత్తిడిని ఎలా అధిగమించాలి?
వివాహానికి ముందు : వివాహానికి ముందు అమ్మాయిలలోనుఅబ్బాయిలలోను లైంగిక సమస్యలను గురించి అవగాహన ఉండదు. కొంతమంది అబ్బాయిలకు హస్తప్రయోగం అలవాటు వల్ల వారు తాము తప్పు చేస్తున్నామేమోవీర్యం పోవడం వల్ల నరాల బలహీనత ఏర్పడుతుందేమో అనే ఆందోళన ఉంటుంది. పెళ్లి తర్వాత భార్యను సుఖపెట్టలేనేమో అనే అనుమానం లాంటి సమస్యలతో తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురి అవుతుంటారు. అలాగే పురుషాంగం చాలా చిన్నదిగా ఉందనే అపోహతో భయపడేవారుంటారు. అమ్మాయిలలో కూడా తమ వక్షోజాలు సరైన సైజ్‌లో లేవనితాను సన్నగా బలహీనంగా ఉన్నాననితన ముక్కుమొహంగొంతు సరిగా లేదేమోననే ఆందోళనతో తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురి అవుతుంటారు.
ఇలాంటి వారు సరైన సెక్స్‌ విజ్ఞానాన్ని తెలుసుకోవాలి. వారి ఫ్యామిలీ డాక్టర్‌ను కలవడం ద్వారా టీవీలలో సెక్స్‌ ఎడ్యుకేషన్‌ పుస్తకాల ద్వారా తెలుసుకోవడం ద్వారా,తల్లిదండ్రుల నుంచి వివరణ తెలుసుకోవడం ద్వారా ఆడపిల్లలు కానిమగపిల్లలలు కాని తమ అనుమానాలు నివృత్తి చేసుకోవడం ద్వారా తమలో ఉన్న టెన్షన్‌ నుంచి రిలాక్స్‌ కాగలరు. అలాగే సైకలాజికల్‌ కౌన్సిలింగ్‌ ద్వారా కూడా తమ అనుమానాలను పరిష్కరించుకోవచ్చు. అలా చేయడం ద్వారా వారు ఒత్తిడి నుంచి రిలాక్స్‌ కావచ్చు.

పెళ్లైన తర్వాత : పెళ్లి అయిన తర్వాత చాలామంది దంపతులు లైంగిక సమస్యలు ఏర్పడ్డప్పుడు ఇంట్లో వారికి కానిడాక్టరుకు కాని చెప్పరు. వారిలో వారే సతమతమవుతూ ఇద్దరి మధ్యా ఘర్షణలు ఏర్పడుతూ ఒత్తిడికి లోనవుతారు. కొంతమంది స్త్రీలలో ఫ్రిజిడిటీ’ ఉంటుంది. అటువంటివారు భర్తతో సెక్స్‌ రిలేషన్స్‌ కొనసాగించలేరు. రాత్రి అవుతుందంటే విపరీతమైన స్ట్రెస్‌కు లోనవుతారు.
అలాగే మగవారు కూడా అంగస్తంభనా సమస్యతో కానిప్రిమెచ్యూర్‌ ఎజాక్యులేషన్‌ సమస్య కానిఇగోటెండెన్సీ కానిరకరకాల మానసిక సమస్యలతో సతమతమవుతూ ఒత్తిడితో సంసార జీవితానికి దూరంగా ఉంటారు.
ఇలాంటి సందర్భాలలో కూడా తీవ్రమైన మానసిక ఒత్తిడి వేధిస్తూ ఉంటుంది. మంచి డాక్టరుకు చూపించి తగిన సలహాలుసూచనలు వైద్యం చేయించుకోవడం ద్వారా సమస్య నుంచి అధిగమించి ఒత్తిడి లేకుండా హాయిగా సంతోషంగా ఉంటారు.

33. కలర్‌ కాన్సెప్ట్‌... ఇన్‌ఫీరియారిటీ కాంప్లెక్స్‌... స్ట్రెస్‌
కొంతమంది అమ్మాయిలు నేను నల్లగా ఉన్నాను. నన్ను ఎవ్వరూ ఇష్టపడరు. ఒకవేళ పెళ్లి చేసుకున్నా భర్త నాపట్ల ఆకర్షణ కలిగి ఉండలేడు. నేను ఇతరుల కన్నా చాలా అందవిహీనంగా ఉన్నాను అనే కలర్‌ కాన్సెప్ట్‌ ద్వారా ఇన్‌ఫీరియారిటీ కాంప్లెక్స్‌తో సతమతమవుతూ ఉంటారు. ఇలాంటివారు అబ్బాయిలతో చాలా దూరంగా ఉంటారు. పెళ్లి చూపులకు కూడా ఇష్టపడరు. తద్వారా వీరు ఎప్పుడూ మానసిక ఆందోళనకు గురి అవుతూ ఒత్తిడికి లోనవుతారు.
ఇలాంటి అమ్మాయి సైకలాజికల్‌ కౌన్సిలింగ్‌ అవసరం. దీనివల్ల వారి ఆలోచనా ధోరణి మారుతుంది. అబ్బాయిల్ని ఆకర్షించేది అందం ఒక్కటే కాదు. అందం వేరుసెక్స్‌ అప్పీల్‌ వేరు అని తెలుసుకుంటారు. అందాన్ని ఎలా తీర్చిదిద్దుకోవాలో బ్యూటీషియన్‌ కౌన్సిలర్‌ ద్వారా తెలుసుకునేటట్లు చేయడం ద్వారా ఇన్‌ఫీరియారిటీ కాంప్లెక్స్‌ తొలగిపోతుంది. తద్వారా రిలాక్స్‌ అవుతారు.

34. నాకు ప్రెగ్నెన్సీ రావడం లేదు. అందరూ నన్ను గొడ్రాలు అంటున్నారు..... ఒత్తిడి ప్రారంభం
కొంతమంది ప్రెగ్నెన్సీ రావడం లేదని విపరీతమైన మానసిక ఒత్తిడికి లోనవుతూ ఉంటారు. ఫలానా రోజుల్లో కలిస్తే మీకు ప్రెగ్నెన్సీ వస్తుందని డాక్టర్లు చెబుతుంటారు. అయితే ఆయా రోజుల్లో ప్రత్యేకమైన యాంగ్జైటీ ఏర్పడడం వల్ల వారిలో ప్రెగ్నెన్సీ వస్తుందో రాదో అనే ఫీలింగ్స్‌ ఎక్కువ అవడం వల్ల పెర్‌ఫార్మెన్స్‌ యాంగ్జైటీ డెవలప్‌ అవుతుంది. దాంతో సెమిన్‌ ఎజాక్యులేట్‌ అవదు. దీంతో ప్రెగ్నెన్సీ సమస్య ఇంకా జటిలంగా తయారవుతుంది. దీంతో వారు ఇంకా అధికంగా స్ట్రెస్‌కు గురి అవుతుంటారు. ఒక్కోసారి సెక్సువల్‌గా సంతృప్తికరంగా కూడా ఉండలేరు.
కొంతమందికి సెమిన్‌ కౌంట్‌ తక్కువ ఉండడం వల్ల కూడా ప్రెగ్నెన్సీ రాకపోవచ్చు. అలాగే ఆడవారిలో అండం విడుదలట్యూబ్స్‌ బ్లాక్‌ అవడం ఇతర కారణాల వల్ల కూడా ప్రెగ్నెన్సీ రాకపోవచ్చు. దీంతో వారిలో యాంగ్జైటీ ఇంకా పెరిగి అది మానసిక ఒత్తిడికి దారితీస్తుంది. ఇలాంటి సందర్భాల్లో గైనకాలజిస్టునుసెక్స్‌ కౌన్సిలర్స్‌నిసంబంధిత వైద్య నిపుణులను కలిసి తమ సమస్యను తెలుసుకుని తగిన పరిష్కార మార్గాలు కనుగొనడం ద్వారా వారిలో మానసిక ఒత్తిడి తగ్గిపోతుంది.

35. అమ్మో ప్రెగ్నెన్సీ వస్తుందేమో అనే టెన్షన్‌
కొంతమంది అమ్మాయిలకు పెళ్లి అవగానే ప్రెగ్నెన్సీ వస్తుందేమో అనే టెన్షన్‌ వేధిస్తుంది. వాళ్లకు ప్రెగ్నెన్సీ అంటే భయం. అంతకుముందు వాళ్ల ఇంట్లో మెంబర్స్‌ ప్రెగ్నెన్సీతో బాధపడడంలేదా చనిపోవడం లాంటి విషయాలు తెలిసి వుండడంతో వీరికి ప్రెగ్నెన్సీ వస్తుందేమో అనే భయంతో స్ట్రెస్‌కు లోనవుతారు. అలాగే ప్రెగ్నెన్సీ రాకుండా జాగ్రత్తలు తీసుకోవడంలోనూ ఇష్టత చూపరు. దీంతో సెక్స్‌ విషయాలలో సహకరించరు. భర్త దగ్గరకు వెళ్లాలంటేనే భయం. వీళ్లని నిత్యం ఈ టెన్షన్‌ వెంటాడుతుంది.
ఇలాంటి వారికి సెక్స్‌ ఎడ్యుకేషన్‌కాగ్నెటివ్‌ బిహేవియర్‌ థెరపీ ద్వారారిలాక్సేషన్‌ టెక్నిక్స్‌ ద్వారా సైకలాజికల్‌ కౌన్సిలింగ్‌ ద్వారా ప్రెగ్నెన్సీ అనే భయాన్ని తొలగించవచ్చు. ప్రెగ్నెన్సీని కొన్నిరోజులు వాయిదా వేయాలనుకుంటే వారికి ప్రెగ్నెన్సీ రాకుండా ఉండే జాగ్రత్తలు తెలియచేయడం ద్వారా భయం తగ్గించి శృంగారం పట్ల ఆసక్తిని పెంపొందించవచ్చు.

36. రాత్రి అవుతుంటే భయం.... ఒకటే టెన్షన్‌
కొంతమంది అమ్మాయిలలో రాత్రి అవుతుందంటే బెడ్‌రూం భయం పట్టుకుంటుంది. భర్త శాడిస్ట్‌. తనను శరీరమంతా కొరకడంజననాంగాలను కొరకడంతీవ్రంగా గాయపరచడంతీవ్రమైన బాధకు గురిచేయడంసిగరెట్లతో కాల్చడం లాంటి ప్రవర్తన ఉంటుంది. ఇలాంటి వారితో తప్పనిసరి పరిస్థితుల్లో కలిసివున్నా రాత్రి అవుతోందనే సరికి తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురి అవుతారు.
ఇలాంటివారు ధైర్యం చేసి తమ పెద్దవారికి విషయం చెప్పడం ద్వారా భర్తకు సైకోథెరపీ ట్రీట్‌మెంట్‌ ఇప్పించడం ద్వారా సమస్య పరిష్కారం అవుతుంది. మానసికంగా పడుతున్న ఆవేదనకంగారుఒత్తిడినుంచి విముక్తి పొందవచ్చు.

37. ఇష్టంలేని భర్తతో కాపరం.... మానసిక ఒత్తిడితో సతమతం
కొంతమంది ఇష్టంకాని భర్తతో కాపరం చేయాల్సి వస్తే ఆ పరిస్థితి నుంచి బయటపడలేక సతమతమవుతూ ఉంటారు. ఇంట్లోవారికి చెప్పలేకపెళ్లి కాదనలేక భర్తతో ఆలాగే కాపరం చేస్తుంటారు. ఇలాంటి సందర్భాల్లో కూడా మానసిక ఒత్తిడి ఏర్పడుతుంది. భార్యాభర్తల మధ్య రిలేషన్స్‌ సక్రమంగా ఉండవు. తరచూ గొడవలుకొట్టుకోవడం లాంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. ఇలాగే జీవితం కొనసాగుతుంటే భార్యాభర్తలు ఇద్దరూ స్ట్రెస్‌కు లోనవుతారు.
ఇలాంటి సందర్భాల్లో ధైర్యంగా పెద్దలకు చెప్పాలి. సెక్స్‌ కౌన్సిలర్స్‌ఫ్యామిలీ కౌన్సిలర్స్‌ని కలవాలి. దీనిద్వారా తమలో అంతర్గతంగా అనేక విషయాలుఅపోహలుఅనుమానాలు బయట పడతాయి. వాటిని పరిష్కరించుకునే మార్గాలు తెలుస్తాయి. తద్వారా అన్యోన్య దాంపత్యం ఏర్పడుతుంది. దీంతో ఒత్తిడికి దూరమవుతారు.

38. ఒకే పనిని నిరంతరాయంగా చేయకండి....... మధ్యలో విరామాలు ఇవ్వండి.
ఎగ్జిక్యూటివ్‌లుటాప్‌ మేనేజర్లుమిడిల్‌ మేనేజర్లు సాఫ్ట్‌వేర్‌ రంగాల్లో ఒకే జాబ్‌పై ఎక్కువసేపు పనిగంటలు గడపడం మంచిది కాదు. వరసగా మీటింగులువాటికి సంబంధించిన మెటీరియల్‌ను సిద్ధం చేయడంకస్టమర్‌ రిలేషన్‌షిప్‌ మేనేజ్‌మెంట్‌ఆర్గనైజేషనల్‌ ఎమర్జెన్సీస్‌ ఇలాంటివాటితో సతమతమవుతూ ఎల్లకాలం ఉండిపోకూడదు. ఇదే లైఫ్‌ స్టైల్‌ ఎక్కువ కాలం కొనసాగడం వల్ల స్ట్రెస్‌ డెవలప్‌ అవుతుంది. ముఖ్యంగా ఈవిధంగా లాంగ్‌టర్మ్‌ స్ట్రెస్‌ కొనసాగితే అది శారీరకమానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది.
ముఖ్యంగా పనిసామర్ధ్యం తగ్గిపోతుంది. నిద్రా సమస్యలు ఏర్పడతాయి. త్వరగా అలిసిపోవడంజీర్ణక్రియ సమస్యలతో పాటు యువతీయువకులకు శృంగారం పట్ల అనాసక్తి ఏర్పడుతుంది. ఈవిధంగా మానసికంగాశారీరకంగా సమస్యలతో సతమతమవుతూ ఉంటారు.
ఇలాంటి సందర్భాల్లో పనిచేస్తున్నప్పుడు ప్రతిగంటకు 10నిమిషాలు రెస్ట్‌ ఇవ్వడంటీ బ్రేక్స్‌ లంచ్‌ బ్రేక్‌ తగినంత సమయాన్ని కేటయించుకోవడం చేస్తే రిలాక్స్‌గా ఉంటారు.