25, జూన్ 2020, గురువారం

డాపత్యం జీవితంలో ఒత్తిడి సమస్య నుండి ఎలా బయట పడాలి ఈ లింక్స్ లో చూడాలి


దాంపత్యంలో....ఒత్తిడి సమస్య పై నవీన్ నడిమింటి సలహాలు 


సెక్స్‌పై ఒత్తిడి ప్రభావం 
మానసిక ఒత్తిడి వల్ల కోరిక తగ్గుతుంది. భారభర్తలసుఖసంసారానికి ఇది అవరోధం. స్త్రీలలో కూడా శృంగారజీవితంలో సంతృప్తి ఉండకపోవచ్చు. ప్రీమెన్‌స్ట్రువల్‌ సిండ్రోమ్‌ కల స్త్రీలలో ఒత్తిడి లక్షణాలు అధికంగా ఉంటాయి. అధిక మానసిక ఒత్తిడి వల్ల స్త్రీలలో సంతాన సాఫల్యతపైకూడా ప్రభావాన్ని చూపుతుందని పరిశోధనలుచెబుతున్నాయి.

మహిళల్లో మానసిక ఒత్తిడి ప్రభావం
ఒత్తిడికి ఆడామగా తేడాలుండవు. సాధారణ గృహిణి కంటేఉద్యోగాలు చేసేవారిలో ఎక్కువ ఒత్తిడి ఉంటుంది. ఇంటిపనులు చక్కబెట్టుకుంటూనే సరైన టైంకి ఉద్యోగానికివెళ్లాలి. దారిలో ట్రాఫిక్‌ జామ్‌, ఈవ్‌ టీజింగ్‌.... పనిచేసేచోట లింగవివక్ష, వేధింపులు, పనిభారం వీరిలో మానసికఒత్తిడి పెరగడానికి కారణమవుతూ ఉంటుంది. దీనివల్లతరచుగా అనారోగ్యం బారిన పడుతూ ఉంటారు. పిల్లలతోనూ, భర్తతోనూ దగ్గరితనం లేకుండా పోతుంది. చాలామంది స్త్రీలలో కోపం పెరుగుతూ ఉంటుంది.ఎప్పుడూ టెన్షన్‌, నిద్రపట్టకపోవడం, పిల్లల పెంపకంగురించి ఆదుర్దా చెందడం వంటివి జరుగుతాయి.


గర్భిణీ స్త్రీలపై మానసిక ఒత్తిడి ప్రభావం 
 గర్భవతులు ఎప్పుడూ మనసును ప్రశాంతంగాఉంచుకోవాలి. ఏవిధమైన ఆందోళనలకు గురికాకూడదనిమన పెద్దలు చెబుతుండేవారు. ఆధునిక శాస్త్రీయపరిశోధనలు కూడా అదే చెబుతున్నాయి. మానసిక ఒత్తిడివల్ల గర్భస్రావం అయ్యేందుకు 50% వరకూ అవకాశంఉంది. లోపలి బిడ్డ ఎదుగుదలపై కూడా ఒత్తిడి ప్రభావంఉంటుందని శాస్త్రజ్ఞులు అంటున్నారు. తల్లి మానసికంగాతరచుగా ఆందోళనకు గురవుతూ ఉంటే, ఒత్తిడికి లోనైనాపుట్టబోయే బిడ్డ బ్రెయిన్‌ ఎదుగుదలపై కూడా ప్రభవాన్నిచూపుతుందని పరిశోధకులు పేర్కొంటున్నారు.


32. లైంగిక సమస్యల ద్వారా ఏర్పడే ఒత్తిడిని ఎలా అధిగమించాలి?
వివాహానికి ముందు : వివాహానికి ముందు అమ్మాయిలలోనుఅబ్బాయిలలోను లైంగిక సమస్యలను గురించి అవగాహన ఉండదు. కొంతమంది అబ్బాయిలకు హస్తప్రయోగం అలవాటు వల్ల వారు తాము తప్పు చేస్తున్నామేమోవీర్యం పోవడం వల్ల నరాల బలహీనత ఏర్పడుతుందేమో అనే ఆందోళన ఉంటుంది. పెళ్లి తర్వాత భార్యను సుఖపెట్టలేనేమో అనే అనుమానం లాంటి సమస్యలతో తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురి అవుతుంటారు. అలాగే పురుషాంగం చాలా చిన్నదిగా ఉందనే అపోహతో భయపడేవారుంటారు. అమ్మాయిలలో కూడా తమ వక్షోజాలు సరైన సైజ్‌లో లేవనితాను సన్నగా బలహీనంగా ఉన్నాననితన ముక్కుమొహంగొంతు సరిగా లేదేమోననే ఆందోళనతో తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురి అవుతుంటారు.
ఇలాంటి వారు సరైన సెక్స్‌ విజ్ఞానాన్ని తెలుసుకోవాలి. వారి ఫ్యామిలీ డాక్టర్‌ను కలవడం ద్వారా టీవీలలో సెక్స్‌ ఎడ్యుకేషన్‌ పుస్తకాల ద్వారా తెలుసుకోవడం ద్వారా,తల్లిదండ్రుల నుంచి వివరణ తెలుసుకోవడం ద్వారా ఆడపిల్లలు కానిమగపిల్లలలు కాని తమ అనుమానాలు నివృత్తి చేసుకోవడం ద్వారా తమలో ఉన్న టెన్షన్‌ నుంచి రిలాక్స్‌ కాగలరు. అలాగే సైకలాజికల్‌ కౌన్సిలింగ్‌ ద్వారా కూడా తమ అనుమానాలను పరిష్కరించుకోవచ్చు. అలా చేయడం ద్వారా వారు ఒత్తిడి నుంచి రిలాక్స్‌ కావచ్చు.

పెళ్లైన తర్వాత : పెళ్లి అయిన తర్వాత చాలామంది దంపతులు లైంగిక సమస్యలు ఏర్పడ్డప్పుడు ఇంట్లో వారికి కానిడాక్టరుకు కాని చెప్పరు. వారిలో వారే సతమతమవుతూ ఇద్దరి మధ్యా ఘర్షణలు ఏర్పడుతూ ఒత్తిడికి లోనవుతారు. కొంతమంది స్త్రీలలో ఫ్రిజిడిటీ’ ఉంటుంది. అటువంటివారు భర్తతో సెక్స్‌ రిలేషన్స్‌ కొనసాగించలేరు. రాత్రి అవుతుందంటే విపరీతమైన స్ట్రెస్‌కు లోనవుతారు.
అలాగే మగవారు కూడా అంగస్తంభనా సమస్యతో కానిప్రిమెచ్యూర్‌ ఎజాక్యులేషన్‌ సమస్య కానిఇగోటెండెన్సీ కానిరకరకాల మానసిక సమస్యలతో సతమతమవుతూ ఒత్తిడితో సంసార జీవితానికి దూరంగా ఉంటారు.
ఇలాంటి సందర్భాలలో కూడా తీవ్రమైన మానసిక ఒత్తిడి వేధిస్తూ ఉంటుంది. మంచి డాక్టరుకు చూపించి తగిన సలహాలుసూచనలు వైద్యం చేయించుకోవడం ద్వారా సమస్య నుంచి అధిగమించి ఒత్తిడి లేకుండా హాయిగా సంతోషంగా ఉంటారు.

33. కలర్‌ కాన్సెప్ట్‌... ఇన్‌ఫీరియారిటీ కాంప్లెక్స్‌... స్ట్రెస్‌
కొంతమంది అమ్మాయిలు నేను నల్లగా ఉన్నాను. నన్ను ఎవ్వరూ ఇష్టపడరు. ఒకవేళ పెళ్లి చేసుకున్నా భర్త నాపట్ల ఆకర్షణ కలిగి ఉండలేడు. నేను ఇతరుల కన్నా చాలా అందవిహీనంగా ఉన్నాను అనే కలర్‌ కాన్సెప్ట్‌ ద్వారా ఇన్‌ఫీరియారిటీ కాంప్లెక్స్‌తో సతమతమవుతూ ఉంటారు. ఇలాంటివారు అబ్బాయిలతో చాలా దూరంగా ఉంటారు. పెళ్లి చూపులకు కూడా ఇష్టపడరు. తద్వారా వీరు ఎప్పుడూ మానసిక ఆందోళనకు గురి అవుతూ ఒత్తిడికి లోనవుతారు.
ఇలాంటి అమ్మాయి సైకలాజికల్‌ కౌన్సిలింగ్‌ అవసరం. దీనివల్ల వారి ఆలోచనా ధోరణి మారుతుంది. అబ్బాయిల్ని ఆకర్షించేది అందం ఒక్కటే కాదు. అందం వేరుసెక్స్‌ అప్పీల్‌ వేరు అని తెలుసుకుంటారు. అందాన్ని ఎలా తీర్చిదిద్దుకోవాలో బ్యూటీషియన్‌ కౌన్సిలర్‌ ద్వారా తెలుసుకునేటట్లు చేయడం ద్వారా ఇన్‌ఫీరియారిటీ కాంప్లెక్స్‌ తొలగిపోతుంది. తద్వారా రిలాక్స్‌ అవుతారు.

34. నాకు ప్రెగ్నెన్సీ రావడం లేదు. అందరూ నన్ను గొడ్రాలు అంటున్నారు..... ఒత్తిడి ప్రారంభం
కొంతమంది ప్రెగ్నెన్సీ రావడం లేదని విపరీతమైన మానసిక ఒత్తిడికి లోనవుతూ ఉంటారు. ఫలానా రోజుల్లో కలిస్తే మీకు ప్రెగ్నెన్సీ వస్తుందని డాక్టర్లు చెబుతుంటారు. అయితే ఆయా రోజుల్లో ప్రత్యేకమైన యాంగ్జైటీ ఏర్పడడం వల్ల వారిలో ప్రెగ్నెన్సీ వస్తుందో రాదో అనే ఫీలింగ్స్‌ ఎక్కువ అవడం వల్ల పెర్‌ఫార్మెన్స్‌ యాంగ్జైటీ డెవలప్‌ అవుతుంది. దాంతో సెమిన్‌ ఎజాక్యులేట్‌ అవదు. దీంతో ప్రెగ్నెన్సీ సమస్య ఇంకా జటిలంగా తయారవుతుంది. దీంతో వారు ఇంకా అధికంగా స్ట్రెస్‌కు గురి అవుతుంటారు. ఒక్కోసారి సెక్సువల్‌గా సంతృప్తికరంగా కూడా ఉండలేరు.
కొంతమందికి సెమిన్‌ కౌంట్‌ తక్కువ ఉండడం వల్ల కూడా ప్రెగ్నెన్సీ రాకపోవచ్చు. అలాగే ఆడవారిలో అండం విడుదలట్యూబ్స్‌ బ్లాక్‌ అవడం ఇతర కారణాల వల్ల కూడా ప్రెగ్నెన్సీ రాకపోవచ్చు. దీంతో వారిలో యాంగ్జైటీ ఇంకా పెరిగి అది మానసిక ఒత్తిడికి దారితీస్తుంది. ఇలాంటి సందర్భాల్లో గైనకాలజిస్టునుసెక్స్‌ కౌన్సిలర్స్‌నిసంబంధిత వైద్య నిపుణులను కలిసి తమ సమస్యను తెలుసుకుని తగిన పరిష్కార మార్గాలు కనుగొనడం ద్వారా వారిలో మానసిక ఒత్తిడి తగ్గిపోతుంది.

35. అమ్మో ప్రెగ్నెన్సీ వస్తుందేమో అనే టెన్షన్‌
కొంతమంది అమ్మాయిలకు పెళ్లి అవగానే ప్రెగ్నెన్సీ వస్తుందేమో అనే టెన్షన్‌ వేధిస్తుంది. వాళ్లకు ప్రెగ్నెన్సీ అంటే భయం. అంతకుముందు వాళ్ల ఇంట్లో మెంబర్స్‌ ప్రెగ్నెన్సీతో బాధపడడంలేదా చనిపోవడం లాంటి విషయాలు తెలిసి వుండడంతో వీరికి ప్రెగ్నెన్సీ వస్తుందేమో అనే భయంతో స్ట్రెస్‌కు లోనవుతారు. అలాగే ప్రెగ్నెన్సీ రాకుండా జాగ్రత్తలు తీసుకోవడంలోనూ ఇష్టత చూపరు. దీంతో సెక్స్‌ విషయాలలో సహకరించరు. భర్త దగ్గరకు వెళ్లాలంటేనే భయం. వీళ్లని నిత్యం ఈ టెన్షన్‌ వెంటాడుతుంది.
ఇలాంటి వారికి సెక్స్‌ ఎడ్యుకేషన్‌కాగ్నెటివ్‌ బిహేవియర్‌ థెరపీ ద్వారారిలాక్సేషన్‌ టెక్నిక్స్‌ ద్వారా సైకలాజికల్‌ కౌన్సిలింగ్‌ ద్వారా ప్రెగ్నెన్సీ అనే భయాన్ని తొలగించవచ్చు. ప్రెగ్నెన్సీని కొన్నిరోజులు వాయిదా వేయాలనుకుంటే వారికి ప్రెగ్నెన్సీ రాకుండా ఉండే జాగ్రత్తలు తెలియచేయడం ద్వారా భయం తగ్గించి శృంగారం పట్ల ఆసక్తిని పెంపొందించవచ్చు.

36. రాత్రి అవుతుంటే భయం.... ఒకటే టెన్షన్‌
కొంతమంది అమ్మాయిలలో రాత్రి అవుతుందంటే బెడ్‌రూం భయం పట్టుకుంటుంది. భర్త శాడిస్ట్‌. తనను శరీరమంతా కొరకడంజననాంగాలను కొరకడంతీవ్రంగా గాయపరచడంతీవ్రమైన బాధకు గురిచేయడంసిగరెట్లతో కాల్చడం లాంటి ప్రవర్తన ఉంటుంది. ఇలాంటి వారితో తప్పనిసరి పరిస్థితుల్లో కలిసివున్నా రాత్రి అవుతోందనే సరికి తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురి అవుతారు.
ఇలాంటివారు ధైర్యం చేసి తమ పెద్దవారికి విషయం చెప్పడం ద్వారా భర్తకు సైకోథెరపీ ట్రీట్‌మెంట్‌ ఇప్పించడం ద్వారా సమస్య పరిష్కారం అవుతుంది. మానసికంగా పడుతున్న ఆవేదనకంగారుఒత్తిడినుంచి విముక్తి పొందవచ్చు.

37. ఇష్టంలేని భర్తతో కాపరం.... మానసిక ఒత్తిడితో సతమతం
కొంతమంది ఇష్టంకాని భర్తతో కాపరం చేయాల్సి వస్తే ఆ పరిస్థితి నుంచి బయటపడలేక సతమతమవుతూ ఉంటారు. ఇంట్లోవారికి చెప్పలేకపెళ్లి కాదనలేక భర్తతో ఆలాగే కాపరం చేస్తుంటారు. ఇలాంటి సందర్భాల్లో కూడా మానసిక ఒత్తిడి ఏర్పడుతుంది. భార్యాభర్తల మధ్య రిలేషన్స్‌ సక్రమంగా ఉండవు. తరచూ గొడవలుకొట్టుకోవడం లాంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. ఇలాగే జీవితం కొనసాగుతుంటే భార్యాభర్తలు ఇద్దరూ స్ట్రెస్‌కు లోనవుతారు.
ఇలాంటి సందర్భాల్లో ధైర్యంగా పెద్దలకు చెప్పాలి. సెక్స్‌ కౌన్సిలర్స్‌ఫ్యామిలీ కౌన్సిలర్స్‌ని కలవాలి. దీనిద్వారా తమలో అంతర్గతంగా అనేక విషయాలుఅపోహలుఅనుమానాలు బయట పడతాయి. వాటిని పరిష్కరించుకునే మార్గాలు తెలుస్తాయి. తద్వారా అన్యోన్య దాంపత్యం ఏర్పడుతుంది. దీంతో ఒత్తిడికి దూరమవుతారు.

38. ఒకే పనిని నిరంతరాయంగా చేయకండి....... మధ్యలో విరామాలు ఇవ్వండి.
ఎగ్జిక్యూటివ్‌లుటాప్‌ మేనేజర్లుమిడిల్‌ మేనేజర్లు సాఫ్ట్‌వేర్‌ రంగాల్లో ఒకే జాబ్‌పై ఎక్కువసేపు పనిగంటలు గడపడం మంచిది కాదు. వరసగా మీటింగులువాటికి సంబంధించిన మెటీరియల్‌ను సిద్ధం చేయడంకస్టమర్‌ రిలేషన్‌షిప్‌ మేనేజ్‌మెంట్‌ఆర్గనైజేషనల్‌ ఎమర్జెన్సీస్‌ ఇలాంటివాటితో సతమతమవుతూ ఎల్లకాలం ఉండిపోకూడదు. ఇదే లైఫ్‌ స్టైల్‌ ఎక్కువ కాలం కొనసాగడం వల్ల స్ట్రెస్‌ డెవలప్‌ అవుతుంది. ముఖ్యంగా ఈవిధంగా లాంగ్‌టర్మ్‌ స్ట్రెస్‌ కొనసాగితే అది శారీరకమానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది.
ముఖ్యంగా పనిసామర్ధ్యం తగ్గిపోతుంది. నిద్రా సమస్యలు ఏర్పడతాయి. త్వరగా అలిసిపోవడంజీర్ణక్రియ సమస్యలతో పాటు యువతీయువకులకు శృంగారం పట్ల అనాసక్తి ఏర్పడుతుంది. ఈవిధంగా మానసికంగాశారీరకంగా సమస్యలతో సతమతమవుతూ ఉంటారు.
ఇలాంటి సందర్భాల్లో పనిచేస్తున్నప్పుడు ప్రతిగంటకు 10నిమిషాలు రెస్ట్‌ ఇవ్వడంటీ బ్రేక్స్‌ లంచ్‌ బ్రేక్‌ తగినంత సమయాన్ని కేటయించుకోవడం చేస్తే రిలాక్స్‌గా ఉంటారు.

కామెంట్‌లు లేవు: