ఒత్తిడి వల్ల ఏం జరుగుతుంది?
నవీన్ నడిమింటి తో ఇంటర్వ్యూ
ప్రశ్న : ఆధునిక ప్రపంచంలో మానసిక ఒత్తిడికిగురికాకుండా ఉండడం సాధ్యమేనా?
జవాబు : నిజానికి మానసిక ఒత్తిడి అందరికీ ఉంటుంది. విద్యార్ధిపరీక్షల్లో విజయం సాధించాలన్నా, క్రీడాకారుడు తన రంగంలో విజయంసాధించాలన్నా... అంతెందుకు మనం నిత్య జీవితంలో ఏపనిచేయాలన్నా ఒత్తిడి కలుగుతుంది. ఆయా పనులు పూర్తిచేయాలంటే ఎంతోకొంత స్థాయిలో ఒత్తిడి ఉండడం కూడా అవసరమే.ఇప్పుడు మన శరీరంలో ఉష్ణోగ్రత, బిపి అందరికీ ఉంటాయి కదా! అవిమనల్ని మనం రక్షించుకోవడం అవసరం. అలాంటిదే ఒత్తిడి కూడా.అయితే, ఈ ఒత్తిడి సాధారణ స్థాయి కన్నా అధికమైతే... అది క్రానిక్‌గామారితే మన జీవనం అస్తవ్యస్తమవుతుంది. అందుకే మనలో అధికంగాఏర్పడే ఒత్తిడిని సమర్ధవంతంగా మనం ఎదుర్కోగలగాలి.ప్రతివ్యక్తిలోనూ ఏదో ఒక సందర్భంలో తరచుగా ఒత్తిడిఎదుర్కోవడమనేది సాధారణ విషయమే.
ప్రశ్న : ఒత్తిడికి గురైన వ్యక్తులలో శారీరక లక్షణాలుఎలా ఉంటాయి?
జవాబు : ముఖ్యంగా ఊపిరి వేగంగా తీసుకోవడం, ఒకక్రమపద్ధతిలో శ్వాస తీసుకోలేక అసహనంగా కనిపించడం, దవడ కండరాలు బిగుసుకు పోవడం, మెడ కండరాలుబిగుసుకోవడం, మైగ్రేన్, టెన్షన్‌కు తరచుగా లోను కావడం, తల దిమ్ముగా ఉండడం, గుండె వేగంగా కొట్టుకోవడం, చెమటలు పట్టడం, కడుపులో గందరగోళ పరిస్థితులుఏర్పడడం, కండరాలు బిగుసుకుపోవడం, జీర్ణశక్తిమందగించడం, కనుపాపలు పెద్దవి కావడం, పళ్లుబిగపట్టడం ఇలాంటి లక్షణాలను శారీరకంగాగుర్తుపట్టవచ్చు.
ప్రశ్న : ఒత్తిడికి గురైన వ్యక్తిలో మానసికంగా ఎలాంటిపరిణామాలు సంభవిస్తాయి?
జవాబు : ఎక్కువకాలం స్ట్రెస్‌కు లోనయ్యే వ్యక్తుల్లోముఖ్యంగా ఏకాగ్రతా శక్తి సన్నగిల్లుతుంది. తద్వారా ఏపనిపట్లా శ్రద్ధ పెట్టలేరు. నిశితంగా పరిశీలించే శక్తి, సావధానంగా ఆలోచించే శక్తి తగ్గిపోతుంది. అలాగేజ్ఞాపకశక్తి కూడా చాలా తక్కువ స్థాయిలో పనిచేస్తుంది. విశ్లేషణా శక్తి సన్నగిల్లుతుంది. తద్వారా తమలోని మానసికశక్తిని తక్కువగా వినియోగించుకునే స్థాయికిచేరుకుంటారు. అలాగే వ్యక్తి యొక్క ప్రతిస్పందన వేగంఅనూహ్యంగా పతనమవుతుంది. ఒక సమస్యపరిష్కరించుకునే సందర్భంలో తగిన ప్రతిస్పందనపొందడం తక్కువ స్థాయిలో జరుగుతుంది. తద్వారామానసిక వ్యవస్థ అస్తవ్యస్తంగా మారి, తమకు తామేసమస్యలు సృష్టించుకునే పరిస్థితికి వస్తారు. తరచుగాతప్పులు చేయడం, సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం,విమర్శనాశక్తి లోపించడం, ఆలోచనల్లో గందరగోళంఏర్పడడం, వాస్తవ పరిస్థితులు అర్ధం చేసుకోలేకపోవడం, తరచుగా కోపగించుకోవడం జరుగుతుంది. మానసికంగాఅలిసిపోవడం, ఇతరులను సరిగ్గా అంచనావేయలేకపోవడం, తరచుగా ఇతరులను నిందించడం, ఒక్కోసారి తనను తాను నిందించుకోవడం, మానసికంగాస్థిరంగా లేకపోవడం, సమయపాలన లోపించడం లాంటిలక్షణాలను గమనించవచ్చు.
ప్రశ్న : ఉద్వేగానికి సంబంధించిన మార్పులు ఎలాఉంటాయి?
జవాబు : స్ట్రెస్‌కు లోనైనప్పుడు మానసికంగా, శారీరకంగాతన భద్రతను కాపాడుకునే సందర్భంలో శరీరంలోనికండరాలు బిగుసుకుపోతాయి. బాగా టెన్షన్ ఫీల్‌అవుతారు. సహజంగా భయాందోళనలు తగ్గిపోగానే శరీరంమామూలుగా రిలాక్స్ అయిపోతుంది. కానీ దీర్ఘకాలంస్ట్రెస్‌కు గురవుతూ ఉంటే రిలాక్స్ అయ్యే సామర్ధ్యంతగ్గిపోతుంది. ఉద్వేగపరంగా అదుపు తప్పి కోపం, ద్వేషంలాంటి సమస్యలు ఏర్పడతాయి. తమకు ఏర్పడేపరిస్థితులను ప్రభావితం చేయగలగడం, వివిధ సందర్భాల్లోవాటిని నియంత్రించే సామర్ధ్యం తగ్గిపోతుంది. తరచుగాయాంగ్జైటీకి, భయాందోళనలకు లోనవుతుంటారు. అభద్రతా భావన, నిస్సహాయత, చనిపోతానేమోననేభయం, చికాకు, కోపం, డిప్రెషన్ లక్షణాలు గమనించవచ్చు.
ప్రశ్న : వ్యక్తి ప్రవర్తనలో ఎలాంటి మార్పులువస్తాయి?
జవాబు : స్ట్రెస్ క్రానిక్‌గా మారడం వల్ల ప్రవర్తనలో చాలామార్పు కనిపిస్తుంది. మాట్లాడేటప్పుడు తడబాటు నత్తిఅధికమవుతుంది. ఉద్యోగాలకు ఆలస్యంగా వెళ్లడం, ఎక్కువగా సెలవులు పెట్టడం, బాధ్యతలు సరిగ్గానిర్వర్తించలేకపోవడం, స్మోకింగ్, డ్రగ్స్, ఆల్కహాల్‌కుఅలవాటు పడడం, నిద్రకు సంబంధించిన సమస్యలతోబాధపడడం, తీవ్రమైన సంఘర్షణను అనుభవించిఆత్మహత్యలకు పాల్పడడం వంటివి జరిగే అవకాశం ఉంది.కొంతమంది మేనరిజమ్స్‌లో విపరీతంగా ఏర్పడుతుంది.
ప్రశ్న : బాల్యంపై ఒత్తిడి చూపే ప్రభావం ఏమిటి?
జవాబు : తల్లిదండ్రులలో ఉండే ఉద్వేగాలు, కోపతాపాలుపిల్లలపై ప్రభావాన్ని చూపిస్తాయి. పిల్లల్ని తిట్టడం, కొట్టడం, సరిగా పట్టించుకోకపోవడం, తద్వారా పిల్లలు మానసికంగాఒత్తిడికి లోనవుతూ ఉంటారు. ఒక్కోసారి విపరీతపరిణామాల వల్ల డిప్రెషన్‌కు కూడా లోనవుతారు. అలాగేబీదరికం, అధిక జనాభా వల్ల కూడా పిల్లల్లో ఒత్తిడిఏర్పడుతుంది. సాధారణంగా బాలికల్లో మానసిక ఒత్తిడిఎక్కువగా ఉంటుంది. పరీక్షల సమయంలో, స్కూలుమారినప్పుడు, ఇంట్లో పరిస్థితులు మారినప్పుడు పిల్లలుఅధికంగా ఒత్తిడికి లోనవుతూ ఉంటారు. అది వారిభవిష్యత్తుపై చెడు ప్రభావాన్ని కలిగిస్తుంది.
ప్రశ్న : పెద్దల్లో ఒత్తిడి ప్రభావం గురించి చెప్పండి.
జవాబు : భార్య భర్తల మధ్య వివాదాలుచోటుచేసుకోవడం, ఒకరినుంచి ఒకరు దూరమై పోవడం,ఒకరు చనిపోవడం, దీర్ఘకాలిక అస్వస్థతకు లోనుకావడం, ఆర్ధిక ఇబ్బందులు, పిల్లల పెంపకంలో వచ్చే సమస్యలువీరిలో ఎక్కువగా స్ట్రెస్‌కు సంబంధించిన సమస్యల్లోముఖ్యంగా ఆందోళన, గుండెజబ్బులు, మైగ్రేన్, తలనొప్పులు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, నిద్రపట్టకపోవడం లాంటిసమస్యలు అధికంగా ఉంటాయి.
ప్రశ్న: పనిచేసే ప్రదేశాలలో ఒత్తిడి ఎలా ఉంటుంది?
జవాబు : పనిచేసే ప్రదేశాలలో వ్యవస్థలోని లోపాల వల్లవ్యక్తి కార్యనిర్వహణా సామర్ధ్యం, నిర్ణయాలు తీసుకోవడం, ప్రణాళికలు రూపొందించడంలో ఒత్తిడి అధికమవుతూఉంటుంది. అలాగెే పనిచేసేచోట తగిన సిబ్బందిలేకపోవడం, క్రింది ఉద్యోగులు చేయాల్సిన పనులు కూడామనమీదే పడడం లేదా పై అధికారులు చేయాల్సిననిర్ణయాలు మనమీద పడ్డప్పుడు తీవ్ర ఒత్తిడికిలోనవుతారు. సిబ్బంది సహకారం లేకపోవడం, ఓవర్‌టైమ్‌లు ఎక్కువగా చేయడం, నిద్ర, విశ్రాంతి సరిగాలేకపోవడం.
హోదా, జీతం, ప్రమోషన్లు కూడా మనసుపై ఒత్తిడికికారణమవుతూ ఉంటాయి. వ్యక్తిగత సామర్ధ్యం ఎంతగాఉన్నప్పటికీ, తగిన హోదాను కల్పించకపోవడం, సీనియారిటీ ఉన్నా అవకాశం కల్పించకపోవడం, రివార్డులు, అవార్డులు కల్పించకపోవడం కొంతమంది ఉద్యోగస్తులలోఅభద్రతా భావం ఉంటుంది. ఉద్యోగాలు ఎప్పుడుఊడిపోతాయో తెలియని భయంతో ఉంటారు. అలాగేపనిలో ఎదురయ్యే సవాళ్లు కూడా ఒత్తిడిని కలగచేస్తాయి.కొంతమంది ఉద్యోగులు తమ సంస్థల్లో కీలకమైన పాత్రలునిర్వహించలేకపోతున్నామనే మనోవ్యధకు తరచూలోనవుతూ ఉంటారు. సంస్థ చెందిన అత్యంత కీలకమైననిర్ణయాలు తీసుకునే ఉద్యోగస్తులు, అధికారులు తమపదవులు నిర్వ హించడం స్ట్రెస్‌తో కూడుకున్నదే. ఇలాంటిపరిస్థితుల్లో వారికి పూర్తి అధికార హోదాలు లేకపోతేవిపరీతమైన ఒత్తిడికి గురవుతారు. కమ్యూనికేషన్ స్కిల్స్, తగిన నాయకత్వం లేకపోయినా, తగిన శిక్షణ లేకపోయినాసహోద్యోగులతో ఘర్షణ ఉన్నా మానసిక ఒత్తిడిఏర్పడుతుంది.
ప్రశ్న : మానసిక ఒత్తిడి క్రానిక్‌గా మారడం వల్లఎలాంటి జబ్బులు వస్తాయి?
జవాబు : ఒత్తిడికి సంబంధించిన జబ్బులను గురించిచెప్పుకోవాలంటే... కడుపులో మంట ఎక్కువకావడం, అల్సర్లు, ఇరిటబుల్ బవుల్ సిండ్రోమ్ వంటివికలుగుతాయి. ఒక్కోసారి ఆకలి వెయ్యదు. మ్యారలాజికల్‌డిస్టర్బెన్స్, ఆందోళన, కంగారు, భయం, చెమటలు పట్టడం,నిద్రపట్టకపోవడం, భయంకరమైన కలలు రావడం, గుండెజబ్బులు, ఊపిరి తిత్తులకు సంబంధించినసమస్యలు వస్తాయి. కొన్ని రకాలైన చర్మవ్యాధులురావడానికి కూడా ఒత్తిడి కారణమవుతూ ఉంటుంది. అలాగే రోగనిరోధక శక్తిపై కూడా ఒత్తిడి ప్రభావం ఉంటుంది. వ్యాధి నిరోధక శక్తి తక్కువ కావడం వల్ల తరచుగాఇన్‌ఫెక్షన్లకు గురవుతూ ఉంటారు. బరువు తగ్గడం, బరువుపెరగడం, తిండి అలవాట్లు మారతాయి. ఎక్కువగా ఒత్తిడికిలోనైతే కండరాల నొప్పులు, కీళ్లనొప్పులు ఎక్కువఅవుతాయి. డయాబెటిక్స్‌లో సుగర్ శాతం ఎక్కువఅవుతుంది. ఇలా అనేక రకాల రుగ్మతలు మానసిక ఒత్తిడిఅధికంగా ఉండడం వల్ల ఏర్పడుతుంటాయి.
ప్రశ్న : సెక్స్‌పై ఒత్తిడి ప్రభావం ఎలాంటిది?
జవాబు : మానసిక ఒత్తిడి వల్ల కోరిక తగ్గుతుంది.భారభర్తల సుఖసంసారానికి ఇది అవరోధం. స్త్రీలలో కూడాశృంగార జీవితంలో సంతృప్తి ఉండకపోవచ్చు. ప్రీమెన్‌స్ట్రువల్ సిండ్రోమ్ కల స్త్రీలలో ఒత్తిడి లక్షణాలుఅధికంగా ఉంటాయి. అధిక మానసిక ఒత్తిడి వల్ల స్త్రీలలోసంతాన సాఫల్యతపై కూడా ప్రభావాన్ని చూపుతుందనిపరిశోధనలు చెబుతున్నాయి.
ప్రశ్న : మహిళల్లో మానసిక ఒత్తిడి ప్రభవాన్నిగురించి వివరంగా చెప్పండి.
జవాబు : ఒత్తిడికి ఆడామగా తేడాలుండవు. సాధారణగృహిణి కంటే ఉద్యోగాలు చేసేవారిలో ఎక్కువ ఒత్తిడిఉంటుంది. ఇంటి పనులు చక్కబెట్టుకుంటూనే సరైన టైంకిఉద్యోగానికి వెళ్లాలి. దారిలో ట్రాఫిక్ జామ్, ఈవ్ టీజింగ్.... పనిచేసే చోట లింగవివక్ష, వేధింపులు, పనిభారం వీరిలోమానసిక ఒత్తిడి పెరగడానికి కారణమవుతూ ఉంటుంది. దీనివల్ల తరచుగా అనారోగ్యం బారిన పడుతూ ఉంటారు.పిల్లలతోనూ, భర్తతోనూ దగ్గరితనం లేకుండా పోతుంది. చాలామంది స్త్రీలలో కోపం పెరుగుతూ ఉంటుంది.ఎప్పుడూ టెన్షన్, నిద్రపట్టకపోవడం, పిల్లల పెంపకంగురించి ఆదుర్దా చెందడం వంటివి జరుగుతాయి.
ప్రశ్న : జ్ఞాపకశక్తిపై ఒత్తిడి ప్రభావం ఎంత?
జవాబు : జ్ఞాపకశక్తి, ఏకాగ్రత, అధ్యయనం... అన్నింటిమీదాఒత్తిడి ప్రభావం చాలాఎక్కువగానే ఉంటుంది. చేసేపనిమీద శ్రద్ధ తగ్గుతుంది. ఏకాగ్రత లోపం వల్లయాక్సిడెంట్లు జరుగుతాయి. లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్, వర్కింగ్ మెమరీ.... ఇలా అన్నింటిలోనూ స్థాయి తగ్గిపోతూఉండడం గమనించవచ్చు. ఒత్తిడి వల్ల విద్యార్ధులు పరీక్షల్లోరాణించలేరు.
ప్రశ్న : గర్భిణీ స్త్రీలపై మానసిక ఒత్తిడి ప్రభావం ఎలాఉంటుంది?
జవాబు : గర్భవతులు ఎప్పుడూ మనసును ప్రశాంతంగాఉంచుకోవాలి. ఏవిధమైన ఆందోళనలకు గురికాకూడదనిమన పెద్దలు చెబుతుండేవారు. ఆధునిక శాస్త్రీయపరిశోధనలు కూడా అదే చెబుతున్నాయి. మానసిక ఒత్తిడివల్ల గర్భస్రావం అయ్యేందుకు 50% వరకూ అవకాశంఉంది. లోపలి బిడ్డ ఎదుగుదలపై కూడా ఒత్తిడి ప్రభావంఉంటుందని శాస్త్రజ్ఞులు అంటున్నారు. తల్లి మానసికంగాతరచుగా ఆందోళనకు గురవుతూ ఉంటే, ఒత్తిడికి లోనైనాపుట్టబోయే బిడ్డ బ్రెయిన్ ఎదుగుదలపై కూడా ప్రభవాన్నిచూపుతుందని పరిశోధకులు పేర్కొంటున్నారు.
ప్రశ్న : అందరూ స్ట్రెస్‌కు లోనవుతారా?
జవాబు : తప్పకుండా. ఏదో ఒక సందర్భంలో ప్రతివ్యక్తిస్రెస్‌కు లోనవుతూనే ఉంటారు. అయితే కొంతమంది వారిమానసిక శక్తి వల్ల ఒత్తిడిని తట్టుకోగలుగుతారు. కొంతమంది చిన్న ఒత్తిడికే అప్‌సెట్ అయిపోతూ ఉంటారు.స్ట్రెస్‌ను ఎదుర్కోవడంలో వ్యక్తుల మధ్య తేడా ఉంటుంది.
మానసిక ఒత్తిళ్లకు, గుండెజబ్బులకు ఉన్న సంబంధంపైఫ్రీడ్‌మెన్, రోస్‌మెన్ అనే ఇద్దరు అమెరికన్ కార్డియాలజిస్టులు విస్తృతంగా పరిశోధనలు చేశారు. వీరువ్యక్తులను టైప్-ఎ, టైప్-బిలుగా వర్గీకరించారు. టైప్`ఎపర్సనాలిటీ కలిగిన వ్యక్తులు జీవితంలో విశ్రమించరు. ఎప్పుడూ వారికి తొందరే. అనేక విషయాలను గురించిఆలోచిస్తూ ఉంటారు. వారు జీవితంలో చాలా పెద్ద పనులునెత్తిన పెట్టుకుంటారు. అపజయాన్ని అంగీకరించరు. కోపంఎక్కువ. ఎప్పుడూ మానసిక ఒత్తిళ్లతో సతమతమవుతూఉంటారు. ఇలాంటి మనస్తత్వం గల వారికి గుండెజబ్బులువచ్చే అవకాశం ఉందని వారి పరిశోధనలో వెల్లడైంది.
టైప్ - బి పర్సనాలిటీ గల వ్యక్తులు ఎప్పుడూ ఉల్లాసంగాఉంటారు. విశ్రాంతికి ఎక్కువ విలువ ఇస్తారు. నిదానంగాఆలోచిస్తారు. జరిగేది జరగక మానదు. నిదానంగాకారణాలు పరిశీలించాలంటారు. ఓటమిని అంగీకరిస్తారు. ఓర్పు, సహనంతో ఉంటారు. ఇలాంటి వ్యక్తుల్లోగుండెజబ్బులు వచ్చే శాతం చాలా తక్కువ అని తేలింది.
ప్రశ్న : మానసిక ఒత్తిడిని ఎలా అదుపులోఉంచుకోవాలి... రిలాక్సేషన్ పద్ధతులు ఏమిటి?
జవాబు : స్ట్రెస్‌ను అదుపులో ఉంచుకోవడానికి పళ్లు, పచ్చికూరగాయలు తీసుకోవాలి. ధూమపానం, మద్యపానం వదిలేయాలి. బాగా వ్యాయామం చేయాలి.యాక్టివ్ లైఫ్ స్టైల్ అలవాటు చేసుకోవాలి. ఎక్కువసేపుకూర్చుని పనిచేసే అలవాటు మార్చుకోవాలి. ఫిజికల్‌గాయాక్టివ్‌గా ఉన్నవారిపై స్ట్రెస్ ఎక్కువ ప్రభావం చూపించదు. అయితే అతి వ్యాయామం పనికిరాదు. ఉదయం, సాయంత్రం నడక చాలా మంచి రిలాక్సేషన్ ఇస్తుంది.జిమ్‌కు వెళ్లడం, స్విమ్మింగ్ చేయడం కూడా మంచిరిలాక్సేషన్ ఇస్తుంది. యోగా, మెడిటేషన్ ప్రాక్టీస్ చేయడంకూడా మంచిదే. ప్రోగ్రెసివ్ మజిల్ రిలాక్సేషన్, సెల్ఫ్ హిప్నాసిస్, జాకబేసన్ రిలాక్సేషన్, ఆటోజెనిక్స్ ద్వారామంచి రిలాక్సేషన్ పొందవచ్చు.
అలాగే టైమ్ మేనేజ్‌మెంట్, స్కిల్స్ ట్రయినింగ్, ఎసెర్టివ్ బిహేవియర్, ప్లానింగ్, డెసిషన్ మేకింగ్, నెగెటివ్ ఎమోషన్స్‌ను కంట్రోల్ చేయడం ద్వారా ప్రశాంత జీవనాన్నిఅలవాటు చేసుకోవచ్చు.
సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనడం, మీకున్న హాబీలనుఅభివృద్ధి చేసుకోవడం, కుటుంబ సభ్యులతో, స్నేహితులతోసరదాగా గడపడం, పిల్లలతో సరదాగా గడపడం, సంగీతం, సాహిత్యం, నృత్యం, పెయింటింగ్, కుట్లు, అల్లికలు, ప్రకృతిఆరాధన ఇలంటివి అన్నీ రిలాక్స్ అయ్యేందుకు దోహదపడతాయి.
మంచి గృహవాతావరణం, కమ్యూనికేషన్ స్కిల్స్ కోపాన్నిఅదుపులో ఉంచుకోవడం, హ్యూమన్ రిలేషన్స్‌నుపెంపొందించుకోవడం, సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం వల్లమంచి విశ్రాంతి, ఆనందం కలుగుతాయి.
ఇంకా తీవ్రంగా ఉండే సమస్యలకు సైకాలజిస్ట్ ద్వారాకౌన్సిలింగ్ తీసుకోవడం, సైకియాట్రిస్ట్ ద్వారా మందులువాడడం వల్ల స్ట్రెస్‌కి సంబంధించిన సమస్యలనుఅధిగమించి రిలాక్స్ అవ్వచ్చు.
ధన్యవాదములు
మీ నవీన్ నడిమింటి
విశాఖపట్నం
9703706660
*సభ్యులకు సూచన*
*************
సమయాభావం వలన వ్యక్తిగతంగా సమాధానాలు ఎవరికీ ఇవ్వడం సాధ్యపడదు. మీ సమస్యకు సరిపడా పరిష్కారాలకొరకు, మీ అవగాహనకొరకు మేము పెడుతున్న సంబంధిత సమాచారంతో కూడిన సవివరమైన పోస్టులు చదవవలసినదిగా ప్రార్థన..
.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి